Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Nov 20)
#1
1. చెడ్డ వాళ్ళు








ఇషా (34 సం||) తన కూతురు దామినిని బెడ్ పై పడుకోబట్టి జో కొడుతూ కధ చెబుతుంది. చివరిలో "అలా చెడ్డ వాళ్ళు అందరూ చనిపోయారు, మంచి వాళ్ళు గెలిచారు" అని చెప్పింది.

దామిని "అమ్మా... ఎప్పుడూ మంచి వాళ్ళే గెలిచి చెడ్డ వాళ్ళే చనిపోతారా!" అని అడిగింది.

ఇషా నవ్వుతూ "అవునూ.... చెడ్డ వాళ్ళు చనిపోయి మంచి వాళ్ళు మిగులుతారు..... అందుకే మనం మంచి వాళ్ళు లా ఉండాలి" అని చెప్పింది.

దామిని "కాని అమ్మా.... ఆఖరికి అందరూ చనిపోవాల్సిన వాళ్ళే కదా.... మంచిగా ఉంటే ఏంటి....? చెడ్డగా ఉంటే ఏంటి....?  నేను చెడ్డగా ఉంటా... అప్పుడు అందరూ నన్ను చూసి భయపడతారు" అని చెప్పింది.

ఇషా ఒక్క సారిగా దామిని చెప్పిన మాటలు విని షాక్ అయింది.

దామిని "నేను ఇక నుండి చెడ్డగా ఉండేదా.... అమ్మా..." అని అడిగింది.

ఇషా "రేపు.... మీ నాన్న వస్తాడు తనని అడుగు తను చెబుతాడు..." అని చెప్పి దుప్పటి కప్పింది.

దామిని కళ్ళు మూసుకొని ఇషా చేతి పై హాయిగా పడుకుంది.

ఇషా ఎంత ప్రయత్నించినా..... నిద్ర పట్టలేదు. 

సమయం అప్పటికే రెండూ గంటలు గడిచింది.

అదే గదిలో వారిద్దరితో పాటు ఉన్న అలారం క్లాక్ మాత్రమే టిక్ టిక్ మణి సౌండ్ చేస్తుంది.

ఇషా పైకి లేచి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకొని ఎదురుగా అద్దంలో చూడగా అద్దంలో తన రూపం నవ్వుతూ కనపడింది. ఆ నవ్వు ఎప్పుడూ నవ్వే తన అందమైన చిరునవ్వు కాదు, రాత్రిళ్ళు కూడా ఎవరికీ నిద్ర పట్టకుండా చేసే భయంకరమైన నవ్వు. అది ఒక శాడిస్టిక్ నవ్వు.

ఇషా అద్దం పై ఉన్న వేడి ఆవిరి లేయర్ ని చెరిపి తన మొహం తానూ చూసుకొని టవల్ తో తుడుచుకొని బయటకు వచ్చి కిటికీ ద్వారా కిందకు చూసింది. రెండో అంతస్తు నుండి కిందకు చూస్తూ ఉంటే తారు రోడ్ అంతా నల్లగా... అప్పటికే వర్షం పడడంతో మరింత నల్లగా కనిపిస్తుంది. కరెంట్ పోయిందేమో.... చిమ్మ చీకట్లు కమ్మేశాయి. లక్కీగా ఇంట్లో ఇన్వర్టర్ ఉండడంతో AC ఆగిపోయినా.... బెడ్ లైట్లు, ఫ్యాన్ తిరుగుతుంది.

ఆ నల్లని రోడ్ చూస్తూ ఉంటేనే ఇషా గతంలోకి వెళ్ళిపోయింది.





పద్నాలుగు సంవత్సరాల క్రితం.... 

ఒక చీకటి రాత్రి....

హైవే.... పై ఇషా కారు వెళ్తూ ఉండగా.... వెనక కారులో ఒక వ్యక్తీ పదే పదే హార్న్ కొడుతూ ఉన్నాడు. ఇషా నిజానికి ఎదో ఆలోచిస్తూ నడుపుతున్న మాట నిజమే... అందుకే చిన్నగా వెళ్తుంది. వెనక ఉన్న కారు డ్రైవర్ కి దారి ఇవ్వక పోయే సరికి హార్న్ కొడుతున్నాడు. ఇషా తన ఆలోచనల నుండి బలవంతంగా బయటకు వచ్చి వెనక హార్న్ కొడుతున్న వాడి మీద పిచ్చి కోపం వచ్చింది. తన బ్యాగ్ లో ఉన్న గన్ తీసుకొని కారు దిగి సరాసరి వెనక ఉన్న కారు దగ్గరకు వచ్చి అద్దం డోర్ పై కొట్టింది. కారు అద్దం  కిందకు జరుగుతూ ఉండగా... అతను తన తల బయట పెట్టి ఎదో అడగబోయాడు. కాని ఇషా తన గన్ తీసి అతని నుదుటి మీద పెట్టింది. 

అతను నోరు అమాంతం మూసేసుకుంది. ఇషా చిన్నగా నవ్వి ఒకటి..... రెండూ..... అని పలుకుతూ ఉండగా.... అతను సారీ... సారీ... అని చెబుతూనే ఉన్నాడు. అయినా ఇషా మూడు అని ట్రిగ్గర్ నొక్కేసింది.

అతను పెద్దగా "ఆ!" అని అరిచాడు.

ఇషా పెద్దగా నవ్వుతూ ఆ బొమ్మ తుపాకిని అతని ఒళ్లోకి విసిరి... "ఉచ్చ బోసుకున్నట్టు ఉన్నావ్.... వెళ్లి ప్యాంట్ మార్చుకో...." అని నవ్వుకుంటూనే... తన కారు దగ్గరకు తిరిగి వెళ్ళబోతూ తిరిగింది.

కాని ఇంతలో తన కారు పెద్ద యెత్తున బాంబ్ లా పేలిపోయింది. ఆ బాంబ్ ఫోర్స్ కి..... ఇషా కింద పడి అయిదు అడుగుల వరకు వెనక్కి జారుతూ వెళ్ళింది. 

ఈ సారి ఆమె ప్యాంట్ తడిచి పాస్ వచ్చేసింది.



...ప్రస్తుతం...

ఫోన్

ఇషా "ఏం చేస్తున్నావ్? ఎంత సేపటిలో వస్తావ్?"

విష్ణు "నేనే ఆఫీస్ లో లేనే.... బెంగుళూరులో ఉన్నాను...."

ఇషా ఏం మాట్లాడలేదు.

విష్ణు "రేపు పొద్దున్నే నీ కౌగిలిలో ఉంటాను... సరేనా...."

ఇషా మోహంలో చిన్నగా నవ్వు విరిసింది.

విష్ణు గుర్తు రాగానే మనసు ప్రశాంతంగా అనిపించింది, ఆవలింతలు వచ్చేస్తున్నాయి.

సరాసరి వెళ్లి దామిని పక్కనే పడుకొని తనపై ఒక చేయి వేసి మత్తు నిద్రలోకి వెళ్ళిపోయింది.

తెల్లారి తన నుదిటి మీద విష్ణు ముద్దు పెడితేనే కాని మెళుకువ రాలేదు.

కళ్ళు తెరిచి ఎదురుగా కనపడుతున్న విష్ణుని చూసి చిన్నగా నవ్వి అతని పెదవులపై ముద్దు పెట్టింది.

ఇంతలోనే.... దామిని "మమ్మీ..." అని కేక వేయడంతో "వస్తున్నా..." అని పైకి లేచింది.

విష్ణు ఆమెని తన కౌగిలి నుండి విడిపించకుండ పట్టుకున్నాడు. ఇంతలో దామిని "మమ్మీ..." అని మళ్ళి కేక వేసింది.

ఇషా "అబ్బా.... వదులు విష్ణు" అంటూ గింజుకుంటుంది.

విష్ణు "ఒక ముద్దు పెట్టు... వదిలేస్తా...."

ఇషా, ముందుకు వచ్చి విష్ణు పెదవులపై ముద్దు పెట్టింది.

విష్ణు తన పెదవులు తడుపుకొని రుచి చూస్తున్నట్టు మొహం పెట్టి "సరిపోలేదు.... ఇంకో ముద్దు పెట్టు" అని అడిగాడు.

ఇషా, విష్ణుని నవ్వుతూ చూస్తూ రెండో ముద్దు పెట్టింది.

విష్ణు ఇంకొకటి...  ఇంకొకటి...  అని అడుగుతూనే ఉన్నాడు. ఇషా ముద్దు పెడుతూనే ఉంది.

దామిని "మమ్మీ..." అని కేకేయడంతో బలవంతంగా విష్ణు కౌగిలి నుండి విడిపించుకొని అతన్ని మురిపంగా చూస్తూ "రానూ....  రానూ....  చెడ్డవాడివి అయిపోతున్నావు.... వదల మంటే వదలడం లేదు...." అని తిట్టి దామిని దగ్గరకు వెళ్ళింది.

విష్ణువర్ధన్ నవ్వుకుంటూ తల్లి కూతుళ్ళు ఇద్దరి దగ్గరకు నడిచాడు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good start
Like Reply
#3
ఇంటరిస్టింగ్. ఆ బాంబ్ బ్లాస్ట్ లో తన మొహానికేమైనా దెబ్బ తగిలిందా ఎప్పుడూ నవ్వుతున్నట్లు కనిపించేలా. దామిని లాజికల్గా జవాబిచ్చింది కదా, ఎప్పుడైనా చనిపోయేటప్పుడు అది మంచైతే ఏం, చెడైతే ఏం banana ..కుచ్ ఫర్క్ నహీ పడ్తా Big Grin ....కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#4
Meeru manisha leka kadhala master aaa...meeru super
Like Reply
#5
wonderful start
Like Reply
#6
2.  తల్లి ప్రేమ








గతం:

ఇషా కళ్ళు తెరిచి బలవంతంగా పైకి లేచి నిలబడింది. ఆమె మొహం అంతా దుమ్ముతో నిండిపోయింది తన చుట్టుపక్కల బాంబ్ వల్ల పేలిపోయిన కారు భాగాలు కాలుతూ కనిపిస్తున్నాయి. పైకి లేచి నిలబడగానే తన ముక్కు నుండి చెవుల నుండి వస్తున్నా రక్తం చూసుకుంది.

ఇషా వెనకే ఫాలో అయి వచ్చి హారన్ కొట్టిన కారు ముందు భాగాన్ని కూడా ఇషా కారు బంపర్ వచ్చి కొట్టింది. అంత పెద్ద దెబ్బ కాకపోవడంతో అందరూ ఆ కారులో నుండి మెల్లగా కిందకు దిగారు. డ్రైవర్ సీట్ లో నుండి చొక్కా ప్యాంట్ లో గడ్డం మీసాలు లేని ఒక మగతను, పక్క సీట్ నుండి ఒక అమ్మాయి, వెనక సీట్ నుండి నలుగురు అమ్మాయిలు కిందకు దిగారు అందరూ కాలేజ్ పిల్లలు లాగా ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఇషా దుమ్ముతో నడుచుకుంటూ వస్తుంది.

అమ్మాయిలలో వాళ్లకు వాళ్ళు

'సో'నియా  "ఒసేయ్..... ఎంటే జాంబీలా ఉంది"

'మం'జరి  "అలా చిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అలానే అనిపించింది నాకు కూడా...."

'భు'వన  "నాకు కూడా అలానే ఉంది"

'గు'డియా  "హేయ్ ఆపండి... ఆమె దగ్గరకు వస్తుంది... విన్నదంటే..."

'సు'హానా  "కారులో బాంబ్ పెట్టి చంపాలి అనుకున్నారు అంటే....  ఈ అమ్మాయి ఏమయినా మాఫియానా...."

'స'నా  "ఆపండి.... దగ్గరకు వచ్చేసింది... ఆరాధ్య నువ్వు వేళ్ళు అందరూ నిన్ను మగాడు అనుకుంటారు" అంది.

అందరూ నవ్వేశారు. మగాడిలా కనిపిస్తున్న అబ్బాయి కూడా నిజానికి అమ్మాయే.

'ఆ'రాధ్య నవ్వుతున్న అందరి వైపు కోపంగా చూసి ముందుకు ఇషాకి ఎదురు నడిచి  "మేడం" అంది.



ఇషా ఆరాధ్య దగ్గరకు వచ్చి ముందుకు జాచిన ఆమె చేతిని చిన్నగా పక్కకు నెట్టేసింది. సరాసరి నడుచుకుంటూ వచ్చి వాళ్ళ కారుకి ఉన్న అద్దంలో తన మొహం చూసుకొని "ఆహ్....  మెక్ అప్ అంతా పోయింది" అంటూ వెనక్కి తిరిగి ఏడుగురు వైపు చూసింది. అందరూ ఇషాని పిచ్చి దాన్ని చూసినట్టు చూస్తున్నారు.

ఇషా చిన్నగా నవ్వుతూ "ఇంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత కూడా నేనే మీ అందరి కంటే అందంగా ఉన్నాను కదా..." అని వేలు చూపిస్తూ పెద్దగా నవ్వేసింది.

అందరూ కోపంగా చూస్తూ ఉన్నారు. అందరిని చూస్తూ ఇషా పక్కకు కళ్ళు తిరిగి పడిపోయింది.




ప్రస్తుతం:

దామిని ఏడుస్తూ "నేను వెళ్ళను..... డాడీ... నువ్వు అయినా చెప్పూ" 

విష్ణు కూతురిని చూసి కరిగిపోయాడు అలానే తల తిప్పి ఇషా వైపు చూశాడు కాని ఇషా దామినిని రెడీ చేస్తూ ఉన్న సీరియస్ ఫేస్ ని చూస్తూ దామిని వైపు ఏం చేయలేనట్టు చూశాడు.

దామిని ఎంత ఏడుస్తున్నా ఇషా కూతురిని రెడీ చేసి చేతులు పట్టుకొని తీసుకొని వెళ్లి బస్ ఎక్కించి క్యారేజ్ చేతికిచ్చింది. అది తీసుకొని వెళ్తున్నట్టు కంటే లాక్కొని వెళ్తున్నట్టు ఉంది.

దామిని ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇషా "ఫుడ్ వేస్ట్ చేయకుండా తిను..." అంది. దామిని ఏడుపు ఆపింది కాని, ఇషా వైపు కోపంగా చూసింది. ఇషా "ఎంటే చూపు... సమాధానం చెప్పూ..." అంది.

దామిని "తింటాను లే అమ్మా..." అని కళ్ళు తుడుచుకొని డ్రైవర్ వైపు చూసి "పోనివ్వండి అంకుల్..." అంది ఇషా వైపు చూడకుండా.... అందరూ నవ్వు మొహం పెట్టినా.... ఇషా మాత్రం ఇంకా కోపంగానే ఉంది.

విష్ణు "తనకు నువ్వంటే చాలా ఇష్టం" అన్నాడు.

ఇషా ఏమి మాట్లాడలేదు, వెళ్ళిన బస్ వైపే చూస్తూ ఉంది.

విష్ణు, ఇషా మోహంలో బాధని చూస్తూ మనసులో "దామినిని కొట్టినా ఆ తర్వాత దామిని పడ్డ బాధ కంటే ఇషానే ఎక్కువ బాధ పడుతుంది" అని అనుకోని "తల్లి ప్రేమ" అన్నాడు.

ఇషా సీరియస్ గా విష్ణుని చూస్తూ "తల్లి ప్రేమ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి...   నీ కూతురుకి ఆ విషయం తెలియడం లేదు..." అంది.

విష్ణు నవ్వు మొహంతోనే ఇషా భుజం మీద చేయి వేసి ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు.








....గతం....


ఇషా కళ్ళు తెరిచి చూడగానే ఎదో కొత్త ప్లేస్ లా ఉంది. స్మెల్ చూస్తే ఎదో లేడీస్ ఉండే హాస్టల్ లేదా రెంట్ కి తీసుకున్న రూమ్ లా అనిపించింది. తన తలకు కట్టిన గాజు గ్లాస్ ని ఫీల్ అవుతూ ఉంటే, తనకు ఎమర్జన్సీ ట్రీట్ మెంట్ ఇప్పించారని అర్ధం అయింది. తను ఇంకా ఇక్కడే ఉండడం చూస్తూ ఉంటే, తన గురించి ఇంకా బయటకి తెలియలేదని అర్ధం అయింది. కొద్దిగా పైకి లేచి ఒంటి మీద బట్టలు చూసుకుంటే తన బట్టలు మార్చారని అర్ధం అవుతుంది.

తల పక్కకి తిప్పి ఎదురుగా చొక్కా ప్యాంట్ వేసుకొని అబ్బాయిలా కనిపించే అమ్మాయి ఆరాధ్యని చూసి, ఇషా "నువ్వు కానీ నాకు ముద్దు పెట్టావా!" అని అడిగింది.

ఆరాధ్య అదేదో పాపపు పని అన్నట్టు చూసి చెంపదెబ్బలు వేసుకొని "లేదు....  లేదు...." అంది.

ఇషా, ఆరాధ్య వైపు చూసి "అర్ధం అయింది" అని అదోలా చూసి పైకి లేచింది.

ఆమె వంటి మీద ఉన్న నైటీ ఆమె మోకాళ్ళ వరకు మాత్రమే వచ్చింది. స్పష్టంగా అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరూ తన హైట్ లేరు, ఒక్క ఆరాధ్య తప్పించి తను మాత్రం అబ్బాయిల బట్టలు వేసుకుంటుంది.

ఆరాధ్య అద్దంలో చూసుకొని తనని ఇప్పటి వరకు అబ్బాయి అనుకోని మాట్లాడింది అని అర్ధం అయి ఇషా ముందుకు వచ్చి, "నేను అబ్బాయిని కాను" అంది.

ఇషా ఆరాధ్య వైపు పైకి కిందకు చూసి "సరే" అని ముందుకు నడిచింది.

ఆరాధ్య ఇషా భుజం పై చేయి వేసి లాగింది, కింద పడ్డప్పుడు తన భుజం పై దెబ్బ తగలడం తో ఇషా నొప్పితో "ఆహ్" అని అరిచింది.

ఆరాధ్య కంగారుగా ఇషా నొప్పి ఉన్న ప్లేస్ ని చూసి "సారీ...  సారీ...  నేను కావాలని చేయలేదు" అంది.

ఇషా సరే అని చెప్పడంతో ఆరాధ్య కూల్ అయింది కాని తను అమ్మాయి అని ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

ఇంతలో బయట నుండి ముగ్గురు అమ్మాయిలు సోనియా, మంజరి, భువన వచ్చారు.

వాళ్ళను చూస్తూ ఇషా "నన్ను కాపాడినందుకు థాంక్స్..." అని చెప్పింది.

ముందు రోజు తమతో అంత పొగరుగా ఉండి ఈ రోజు మాములుగా ఉండడం చూసి షాక్ అయ్యారు.

ఇషా "ఏంటి నిన్నటిలా కాకుండా ఇవాళ ఇలా ఉంది అనుకుంటున్నారా!" అంది.

సోనియా, మంజరి తల అడ్డంగా ఊపగా, భువన నిలువుగా ఊపింది. భువనని చూసి మిగిలిన ఇద్దరూ కూడా నిలువుగా ఊపారు.

ఇషా చిన్నగా నవ్వేసి "అదేం లేదు..... ఒక వేళా నేను చనిపోతే పేపర్ లో నా ఫోటో వేస్తారు కదా.... " అంది.

గదిలో ఉన్న నలుగురు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇషా మాత్రం ఇది సాధారణ మైన విషయం అన్నట్టు అద్దంలో చూసుకొని తల దువ్వుకుంటుంది.

గుడియా అప్పుడే అక్కడకు వచ్చి తన ఫోన్ ని తన వెనక దాచుకుంది. 

సుహానా మరియు సనా ఇద్దరూ కూడా అలాగే ఫోన్ వెనక్కి పెట్టుకున్నారు.

కానీ గదిలో ఉన్న అందరూ ఆ ఫోన్ లో న్యూస్ చూస్తూ ఉన్నారు.

ఇషా "నేను చనిపోయిన ఫోటో చూసి అబ్బాయిలు అందరూ 'అబ్బా.... ఇంత అందమైన అమ్మాయి చనిపోయిందే అని బాధ పడాలి' " అని అంది.

అందరూ ఇబ్బందిగా నవ్వారు.

ఆరాధ్య "కాని, ఈ ఫోటో అస్సలు బాలేదు కదా" అని తను చనిపోయినట్టు వచ్చిన ఫోటో చూపించింది.

ఇషా కోపంగా పైకి లేచి ఆ ఫోటో చూస్తూ "బ్లడీ ఇడియట్స్.... మంచి ఫోటోనే కనపడలేదా వీళ్ళకి.... కనీసం.. స్నాప్ షాట్ లో టచింగ్ అన్నా చేయాల్సింది... ఛీ.... ఛీ...." అనుకోని పైకి లేచి ఒకరి ఫోన్ నుండి ఒక కాల్ చేసింది.

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా... ఒక కారు వచ్చింది. అందులో ఇషా ఎక్కింది, వెనకే వచ్చిన మరో పెద్ద కారులో ఏడుగురు ఎక్కారు.

కారు ఒక లగ్జరీ VIP బ్యూటీ సెలూన్ ముందు ఆగింది. ఇషా కట్లు తోనే లోపలకు వెళ్లి తనను తానూ అందంగా రెడీ అయింది.

ఆ ఏడుగురు కూడా ఇషా ఆర్డర్ మీద అందంగా తయారు అయ్యారు. ఆరాధ్యని కూడా కొంచెం అమ్మాయిలా రెడీ చేసినా కూడా... మగాళ్ళ సూటు బూటులోనే బయటకు వచ్చింది.

అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు.

ఇషా ఆరాధ్యని చూస్తూ "ఇప్పుడు చూడు.... నిన్ను చూసిన ప్రతి మగాడు ఇష్టపడతాడు" అంది. ఆరాధ్య సిగ్గు పడింది. కాని ఇషా ఏ ఉద్దేశ్యంలో అందో ఆమె ఊహించలేక పోయింది.

మరో వైపు ఇషా హాస్పిటల్ నుండి వచ్చిన పేషెంట్ లా కాకుండా ఫ్లాషీ ఫ్లాషీ గా ఉండే డ్రెస్ వేసుకొని కాళ్ళకు ఎనిమిది అంగుల హై హీల్స్ వేసుకొని వచ్చింది. అసలే కొద్దిగా హైట్ ఉండే మనిషి అలాంటిది ఇంకా హై హీల్స్ వేయడంతో ప్రపంచాన్ని చూడాలి అంటే కిందకు మాత్రమే చూడాలి అన్నట్టు ఉంది తన విధానం.

ఇషా వేసుకున్న డ్రెస్, తను పట్టుకున్న బ్యాగ్, తన చేతికున్న పాష్ ఫ్యాషన్ బ్యాంగిల్ మరియు వెలికి ఉన్న ఉంగరం, తను పెట్టుకున్న గాగుల్స్, ఆఖరికి తన దెబ్బలకు వేసిన కట్టు కూడా స్టైల్ గా తను రిచ్ కాదు సూపర్ ఇచ్ అన్నట్టు ఉంది.

బయటకు ఎండలోకి వచ్చిన కొద్ది సేపటికే BMW వచ్చి ఇషాని మరియు దాని వెనకే వచ్చిన మరో లగ్జరీ కారులో మిగిలిన ఏడుగురు భయంగా భయంగా ఎక్కారు.




కారు సరాసరి ఒక విల్లా ముందు ఆగింది, దారి పొడవున కార్లు, జనం అంతా ఇంట్లోకి వెళ్లి ఇషా ఫోటో కింద పూలు వేసి అక్కడే ఏడుస్తున్న ఇషా తండ్రి మిస్టర్ పురుషోత్తంని మరియు అతని భార్య కల్పనని ఒదారుస్తున్నారు. మరో వైపు కల్పన కూతురు ఇషా చెల్లెలు సంజన దిగులుగా కూర్చొని ఉంది, ఆమె పక్కనే ఇషాకి కాబోయే భర్త ఆకాష్ ఉన్నాడు. 

ఇషా, ఆకాష్ మరియు ఇషా ముగ్గురు ఒకే క్లాస్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు.

చుట్టూ నిలబడ్డ కొందరు కల్పనని చూసి "సవితి కూతురుని, సొంత కూతురు కంటే ఎక్కువగా చూసేది అంట.... ఇప్పుడు పాపం ఈ అమ్మాయియాక్సిడెంట్ లో ఇలా అయిపొయింది"

మరి కొందరు కల్పన తల్లి ప్రేమ, మరియు సంజనలు ఇషా పై చూపించే ఎనలేని ప్రేమ గురించి చెప్పుకుంటూ ఉన్నారు. మరో వైపు ఇషా వాళ్ళను తక్కువ చేసి చూడడం వాళ్ళను ఏడిపించడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అది చూసి ఇషా వల్ల లాభ పడ్డ కొందరు ఇషా ఫోటో చూస్తూ "మనుషులు ఇలా కూడా ఉంటారా..... చనిపోయిన తర్వాతా కూడా అంటున్నారు" అనుకుంటున్నారు.





కొద్ది సేపటిలో అక్కడకు బాడీ గార్డ్స్ తో ఫ్లాషీ డ్రెస్ లతో అక్కడకు వచ్చిన కొంత అమ్మాయిలు, అందులో మధ్యలో ఎత్తుగా ఉన్న ఒక అమ్మాయి సరాసరి అక్కడకు వచ్చి ఇషా ఫోటో తీసుకొని కింద వేసి కొట్టింది. ఆ అమ్మాయి డ్రెస్ ని వింతగా చూస్తూ ఉంటే ఈ అమ్మాయి ఏకంగా ఫోటో కింద వేసి కొట్టడం చూసి ఆశ్చర్య పోయారు.

ఇషా పెద్దగా "సెక్రటరీ" అని పిలిచింది. ఆమె గొంతు విని అక్కడున్న కొందరు అది ఇషా అని గుర్తు పట్టి ఆమె దగ్గరకు వచ్చి మరీ చూస్తున్నారు.

ఇషా మళ్ళి "సెక్రటరీ.....  ఎక్కడ చచ్చావ్" అని పిలవడంతో... "ఇక్కడున్న మేడం" అంటూ ఏడుపును తుడుచుకుంటూ నవ్వుతూ వచ్చిన మధ్య వయస్సులో ఉన్న రమాదేవిని చూస్తూ "ఏం చేస్తున్నావ్? అసలు నీకు జీతం ఎందుకు ఇస్తున్నాను..... ఇలాగేనా పని చేసేది...." అంటూ అరుస్తుంది. రమాదేవి తల దించుకొని ఇషా తిడుతున్నా తిట్లు సంతోషంగా పడుతూ ఉంది. ఇషా బ్రతికి రావడంతో ఆమె జాబ్ ఆమెకు ఉంది అలాగే ఆమె తన సాలారీ తనకు వస్తుంది పైగా EMIలు కూడా హాయిగా కట్టుకోవచ్చు.

ఇషా "అసలు ఎందుకు తిడుతున్ననో నీకు అర్ధం అవుతుందా!" అని అరిచింది.

రమాదేవి "తెలుసు మేడం.....  మీరు బ్రతికి ఉన్నా చనిపోయారని.....  "

ఇషా "దానికి నీ తప్పు ఏముంది? డాక్టర్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ తప్పు చేశారు.....  నీ తప్పు ఏంటో చెప్పూ" అంటూ నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తుంది.

రమాదేవి ఇబ్బందిగా చూస్తూ ఉంది, ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు.

ఇషా, ముందుకు నడిచి తన కళ్ళజోడుని ఒక చేత్తో పట్టుకొని మరో చేతిని రమాదేవి భుజం చుట్టూ వేసి "ఆ ఫోటో చూశావా.... ఎంత ఓల్డ్ గా అగ్లీగా ఉందొ.... నేను అసలు అలా ఉంటానో..... ఎంత అందంగా ఉంటాను.... చూడు చూడు" అంటూ తన గడ్డం కింద రెండూ చేతులు పెట్టుకొని కళ్ళు రెప్పలు వేస్తూ చిన్న పిల్లలా చూపించింది.

చుట్టూ చూస్తున్న జనలాని అసలు పట్టించుకోవడం లేదు.

రమాదేవి ఇషాని చూసి "సారీ మేడం" అంటూ ఆమెను హత్తుకోబోయింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇషా తనని ఎవరూ పట్టుకోడానికి ఒప్పుకోదు కాని ఇషా చనిపోయి బ్రతికి వచ్చింది అంటే ఆమెను హత్తుకోవాలి అని అనిపించింది, కాని ఇషా ఏమంటుందో అని ఆగిపోయింది. కాని ఇషా చేతులు జాపి రమాదేవిని హత్తుకుంది, రమాదేవి ఏడుస్తూ ఇషాని హత్తుకుంది. 

ఇషా చిన్నగా రమాదేవితో చిన్నగా "బాంబ్ బ్లాస్ట్ వెనక ఎవరు ఉన్నారు" అని సీరియస్ గా అడిగింది.

రమాదేవి ఇషా కౌగిలి నుండి బయటకు వచ్చి ఆమె చేతులను పట్టుకొని దెబ్బలను చూస్తూ "మీ కోసం మీ నాన్న పురుషోత్తం గారు చాలా బాధ పడ్డారు మేడం.... అంత కంటే ఎక్కువ మీ పిన్ని కల్పన గారు అంత కంటే ఎక్కువ మీ సవితి చెల్లెలు సంజన గారు అందరిని కూడా మీకు కాబోయే భర్త ఆకాష్ గారు ఒడారుస్తున్నారు మేడం" అని చెప్పింది.

ఇషా కళ్ళు ఒక్క సారిగా బాధగా భయంగా అనిపించింది, వెంటనే తట్టుకొని నిలబడి అందరిని వెళ్లి పలకరించింది. అందరూ నవ్వుతూ బదులిచ్చారు. ముందుగా రమాదేవితో మాట్లాడడంతో వాళ్లకు కోలుకోవడం కోసం సమయం వచ్చినట్టు అయింది లేక పోతే వాళ్ళ కళ్ళలో ద్వేషం వెంటనే బయట పడిపోయేది. ఇషా అందరితో నవ్వుతూ పలకరించింది. అది నటన అందరికి అర్ధం కాదు.



ఇషా మధ్యలోకి వచ్చి అందరిని చూస్తూ ఒక మైక్ తీసుకుంది.

అందరూ ఆమెను చూస్తూ ఉన్నారు.

ఆమె వెనకే వచ్చిన ఏడుగురు ఆమె చేతిలో ఉన్న మైక్ ని చూస్తూ "ప్రిన్సెస్..... ప్యూర్ ప్రిన్సెస్..... ఆ చేతిలో ఉన్న మైక్ కూడా లక్షల్లో ఉంటుంది" అని అపురూపంగా చూస్తూ ఉన్నారు.

ఇషా ఒక బల్ల మీదకు బాడీ గార్డ్స్ సాయంతో ఎక్కి అందరిని చూస్తూ "మీ అందరికి ఒక గుడ్ న్యూస్..... ఒక బ్యాడ్ న్యూస్....." అని అరిచింది.

అందరూ ఆమెను చూస్తూ ఉన్నారు.

ఇషా "నేను బ్రతికి వచ్చాను....." అని అరిచింది.

అందరూ ఆమెను చూస్తూ ఉన్నారు.

ఇషా "నన్ను ఇష్టపడే వాళ్లకు ఇదే గుడ్ న్యూస్..... నన్ను ద్వేషించే వాళ్లకు ఇదే బ్యాడ్ న్యూస్....." అని అరిచింది.



అప్పుడే అక్కడకు వచ్చిన ఆకాష్ యొక్క అన్నయ్య మిస్టర్ విష్ణువర్ధన్..... ఇషాని చూస్తూ ఉన్నాడు.

విష్ణు "నేను రెండూ కాదు.... కానీ.... నా టైం వెస్ట్ చేశావ్...." అన్నాడు.

ఇద్దరూ ఒకరిని ఒకరు పొగరు బోతుగిత్తలు లాగా చూసుకుంటున్నారు.





ఆరాధ్య ఇషాని చూస్తూ "నిజంగా ప్రిన్సెస్ లాగానే ఉంది" అంటూ అపురూపంగా చూస్తుంది.

"ఇది కాదె అటూ చూడు.... ప్రిన్స్ వచ్చాడు" అంటూ విష్ణువర్ధన్ ని చూపిస్తున్నారు.



















[+] 14 users Like 3sivaram's post
Like Reply
#7
Nice update
Like Reply
#8
Nice update
Like Reply
#9
Nice update
Like Reply
#10
Superb updates
Like Reply
#11
ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ ఇషా, ముందు ముందు ఏం చేయబోతోందో...
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#12
Intresting nice story
Like Reply
#13
Quote:ఇషా
.. ఇషా ..  
.. ఇలా ఉండొచ్చు ..

[Image: 2223854bf121a962d9eca9a70cb35752.jpg]
[+] 4 users Like 3sivaram's post
Like Reply
#14
Nice starting. clps
Like Reply
#15
super bro
Like Reply
#16
3. పిల్ల చేష్టలు





..ప్రస్తుతం..

దామిని ఇంట్లోకి వస్తూనే గబా గబా తన బట్టలను విప్పేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది.

దామిని కాళ్ళకున్న గజ్జలు సౌండ్ వింటూ దామిని వచ్చిన విషయం అర్ధం అయి. ఇషా "దామిని" అని అరిచింది.

దామిని టెన్షన్ టెన్షన్ గా "బాత్రూంలో ఉన్నాను" అని కేకేసింది.

అంట్లు తోముతున్న ఇషా, దామి గొంతులో ఉన్న తేడా గమనించింది. ఆమె నుదురు ముడుచుకుంది.

దామిని బాత్రూంలో తన బట్టలు నీటిలో తడిపి ఉతకడం కోసం ప్రయత్నిస్తుంది, కొద్ది సేపటికి ఒక సారి వాళ్ళ అమ్మ ఇషా గమనిస్తుంది ఏమో అని భయం భయం గా ఉంది.

ఇషా సైలెంట్ గా సౌండ్ రాకుండా బాత్రూం దగ్గరకు వచ్చి ఒక్క సారిగా తలుపు తెరిచింది.

పెద్దగా దామిని "ఆ...!!" అని కేకేయడంతో అప్పుడే బయట నుండి ఇంటికి వస్తూ, డోర్ దగ్గర ఉన్న విష్ణుకి ఆ సౌండ్ వినపడి చమటలు పట్టేశాయి. 

స్పీడ్ గా ఇంట్లోకి వచ్చాడు, బాత్రూం డోర్ దగ్గర ఉన్న ఇషాని చూసి "ఏమయింది?" అనుకుంటూ వచ్చి బాత్రూంలో ముడుచుకొని ఉన్న దామినిని చూశాడు.

దామిని వాళ్ళ నాన్నని చూడగానే పరిగెత్తుకొని వచ్చి అతన్ని హత్తుకుంది. విష్ణు అమాంతం ఎత్తుకున్నాడు, ఓదారుస్తున్నాడు. కాని దామిని ఏడుస్తూనే ఉంది.

ఏం జరిగింది అంటే చెప్పడం లేదు, ఇషాని చూడడానికి కూడా భయ పడుతుంది. విష్ణు దామినిని ఎత్తుకొని అటూ ఇటూ తిప్పాడు. కొద్ది సేపటికి ఆమె ఒళ్ళు వేడిగా ఉండడంతో డాక్టర్ ని పిలిపించాడు.

డాక్టర్ వచ్చి జ్వరం తగ్గేలా దామిని ట్రీట్ చేసి వెళ్ళాడు. దామిని నిద్ర పోతూ ఇషా చేతిని గట్టిగా పట్టుకొని నిద్ర పోయింది.

విష్ణు s.chool కి ఫోన్ చేసి విషయం ఏంటి అని అడిగాడు, కనుక్కొని చెబుతాం అన్నారు. విష్ణు కోపంగా వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. s.chool లో ఏం జరిగిందో కనుక్కొని చెప్పమని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

కొద్ది సేపటి తర్వాత దామిని గది దగ్గరకు వచ్చాడు. ఇషా తమ కూతురు పక్కనే కూర్చొని దామిని భుజం మీద చేయి వేసి జో కొడుతూ ఉంది.

విష్ణు "s.chool లో ఎదో అయింది" అని అంటూ ఉండగా, ఇషా నోటి మీద వేలు వేసి ఇక్కడ కాదు బయట మాట్లాడుకుందాం అన్నట్టు సైగ చేసింది.

విష్ణు మరియు ఇషా ఇద్దరూ హాల్ లో ఉన్నారు. విష్ణు "s.chool లో " అని ఎదో అంటూ ఉండగా ఇషా చేయి చూపించి ఆపి.... బాత్రూం లోకి వెళ్లి దామిని బట్టలు తీసుకొని వచ్చింది.

వాటి పై మట్టి, ఎదో రంగు ఉంది. విష్ణు "ఎవరైనా తనని తిట్టడం కాని కొట్టడం కాని చేసారా!" అంటూ మళ్ళి ఫోన్ ని అందుకో బోయాడు.

ఇషా విష్ణు చేతిని పట్టుకొని పైకి లేచి "దామిని గొడవ పడింది..." విష్ణు ఎదో అనడంతో చేయి చూపించి ఆపి... దామిని పిడికిలికి ఉన్న చర్మం పోవడం గుర్తు చేసుకొని "దామిని కూడా కొట్టింది" అని చెప్పింది.

రెండూ నిముషాల తర్వాత..... విష్ణు "దామిని గొడవ పడితే.... తనకు ఎందుకు జ్వరం వచ్చింది" అని అడిగాడు.

దామిని నిద్రలో "సారీ అమ్మా.....  సారీ అమ్మా.....  ఇంకెప్పుడు గొడవ పడను అమ్మా.....  సారీ అమ్మా.....  " అంటూ కలవరిస్తుంది.






...గతం...

విష్ణువర్ధన్ "నా టైం వెస్ట్ చేశావ్" అని చెప్పడంతో అందరూ తనని చూస్తూ ఉన్నారు.

ఒక టేబుల్ మీదకి ఎక్కినా ఇషా ఆ టేబుల్ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ఒక పక్కగా ఉన్న తన ఫ్యామిలీ మరో పక్క ఉన్న ఏడుగురు అమ్మాయిలను అందరూ చూస్తూ ఉన్నారు.

విష్ణువర్ధన్ హ్యాండ్ సమ్ అప్పీరేన్స్ గురించి అమ్మాయిలు మాట్లాడుకోవడం వింటున్నారు.

ఇషా సడన్ గా అమ్మాయిల వైపు చూడగా, భువన తన పక్కనే ఉన్న గుడియా కి విష్ణువర్ధన్ గురించి చెబుతుంది.

సుహానా ఇషాని తడబడింది. కాని ఇషా ఫ్రెండ్లీగా నవ్వి కన్ను కొట్టింది. సుహానా కూడా నవ్వేసింది.

ఇషా మైక్ లోనే "అయ్యో....   అయ్యో....   భువనా....   ఏమయింది? నీకు...." అంటూ ఆ టేబుల్ మీద నుండి జంప్ చేసి భువన ముందుకు వచ్చి "ఎమర్జన్సీ....   ఎమర్జన్సీ....   తప్పుకోండి....   తప్పుకోండి....   మా భువన కళ్ళకు ఎదో అయింది....   " అంటూ భువనని బయటకు తీసుకొని వెళ్ళబోయింది.

అందరూ ఇషా చేస్తున్న హడావిడి చూసి నిజంగానే భువనకు నిజంగానే ఎదో అయింది అని భయపడ్డారు.

భువన "నాకేం కాలేదు....   నాకేం కాలేదు....   " అని అంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇషా ఏం మాట్లాడాలన్నా మైక్ లోనే చెబుతుంది.

ఇషా మాత్రం కంగారు పడుతూనే ముందుకు వెళ్తున్నారు, దారిలో ఇషా కావాలని విష్ణువర్ధన్ ని తోసుకొని వెళ్ళిపోయింది.

విష్ణువర్ధన్ తడబడి కోపంగా ఇషాని చూసి "తను బాగానే ఉందని చెబుతుంది కదా....   " అన్నాడు.

ఇషా వెనక్కి తిరిగి విష్ణువర్ధన్ ని కాకుండా భువనని చూసి "ఇవి ఎన్ని వేళ్ళు" అంటూ తన చేతితో రెండూ వేళ్ళు చూపించింది.

భువన చుట్టూ అందరిని చూసి భయం భయంగా "రెండూ" అని చెప్పింది. ఇషా ఊపిరి పీల్చి తల ఊపింది.

ఇషా నాలుగు వేళ్ళు చూపించింది. ఈ సారి భువన దైర్యంగా "నాలుగు" అని చెప్పింది.

ఇషా తల ఊపుతూ... ఇతను హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడా! అని విష్ణువర్ధన్ ని చూపించింది.

భువన సిగ్గు పడాలి అనుకున్నా తేడా చెబితే హాస్పిటల్ అంటారు అని భయపడి తల నిలువుగా ఊపింది.

ఇషా మైక్ లో "వాట్....   విష్ణువర్ధన్ నీకు హ్యాండ్ సమ్ గా కనిపించాడా....   " అని షాక్ గా చూస్తూ "ఇది చాలా సీరియస్ విషయం....   నీ కళ్ళకు ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు....   లేక పోతే....    విష్ణువర్ధన్ హ్యాండ్ సమ్ గా కనిపించడం ఏంటి....?  డెఫినెట్ గా నిన్ను మంచి కంటి హాస్పిటల్ లో చూపించాలి" అని పెద్దగా అరిచింది.

చుట్టూ జనాలు అందరికి ఇషా కావాలని విష్ణువర్ధన్ ని ఏడిపించాలని ప్రాంక్ చేస్తుంది అని పక్కకు తిరిగి విష్ణువర్ధన్ కి కనపడకుండా నవ్వుకున్నారు.

ఇషా సూటిగా విష్ణువర్ధన్ కళ్ళలోకి చూస్తూ నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ ఉంది.

విష్ణువర్ధన్ చిన్నగా నవ్వి "పిల్ల చేష్టలు...." అన్నాడు.

ఇషా నవ్వు మొహాన్ని కిందకు దించేసి సీరియస్ గా చూస్తూ మైక్ అందుకొని మూతి దగ్గర పెట్టుకొని "పోరా....   పిల్ల పుల్కా....   " అని అక్కడ ఉన్న ఎవరిని పట్టించుకోకుండా బాడీ గార్డ్స్ తో అక్కడ నుండి వెళ్లిపోయింది.




...ప్రస్తుతం...

s.chool నుండి కాల్ వచ్చింది.

ఒక సారి మోగింది, రెండో సారి మోగుతుంది.

విష్ణు ఫోన్ ని ఇషాని మార్చి మార్చి చూస్తున్నాడు.

ఇషా ఫోన్ ని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఆన్ చేసి రికార్డ్ బటన్ మరియు లౌడ్ స్పీకర్ వెంట వెంటనే నొక్కింది.

ఫోన్ ఎదురుగా ఇషా మరియు విష్ణు ఇద్దరూ కూర్చొని ఉన్నారు.

ఫోన్ "మీరు దామిని పేరెంట్స్ యేనా...." అని అడిగారు.

ఇషా "నేను దామిని మదర్ ని మాట్లాడుతున్నాను"

ఫోన్ "మేడం.....  ఒక స్టూడెంట్ పేరెంట్స్ కాల్ చేశారు.....  అతన్ని మీ అమ్మాయి కొట్టింది.....  "

ఇషా "సీరియస్ విషయమా.....  "

ఫోన్ "చిన్న పిల్లలు కదా మేడం.....  ఎదో పిల్ల చేష్టలు.....  కొంచెం భయ పెడితే వాళ్ళే సరి అవుతారు"

ఇషా "ఆ అబ్బాయికి ఎలా ఉంది"

ఇషా "ఆ అబ్బాయి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.....  ప్రిన్సిపల్ గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రేపు మీరు రావాల్సి ఉంటుంది.....  అలాగే ఆ అబ్బాయి పేరెంట్స్ కి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది.....  వాళ్లకు పొలిటికల్ గా ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు"

ఇషా "రేపు పొద్దున్నే వస్తాను" అని చెప్పి ఫోన్ కట్టేసింది.

ఇషా పిడికిలి బిగించడం చూశాడు.

విష్ణు "రేపు నేను కూడా వస్తాను.....  "

ఇషా వద్దు"
విష్ణు "రేపు నేను సెలవ పెడతాను.....  వస్తాను.....  ఇషా తను నా కూతురు.....  మన కూతురు.....  "

ఇషా "వద్దు"

ఇషా పైకి లేచి దామిని రూమ్ దగ్గరకు నడిచింది.

విష్ణు "ఇషా..... తను చిన్న పిల్ల.....  నువ్వు ఏమయినా అంటావని భయ పడి జ్వరం తెచ్చుకుంది"

ఇషా నుదురు ముడిచి సీరియస్ గా విష్ణుని చూసి దామిని దగ్గరకు వెళ్లి దుప్పటి కప్పి 'జో' కొడుతుంది.




...గతం...

ఇషా "ఆహ్.....  వీడి మొహం చూసి చూసి నాకు నీరసం వచ్చేసింది.....  పదండి.....   పదండి.....  షాపింగ్ కి వెళ్లి ఎనర్జీ పెంచుకుందాం" అని ఆ ఏడుగురు కొత్త ఫ్రెండ్స్ తో కలిసి అదే కారులో కలిసి వెళ్ళింది.

గతంలో చిన్న కారులో ముడుచుకొని ఏడుగురు కూర్చుంటే, ఇప్పుడు పెద్ద కారులో విశాలంగా కూర్చున్నారు.

షాపింగ్ హాల్ లో సాయంత్రం వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నారు. ఎంత బిల్ అయినా ఏం అయినా ఇషా చిన్నగా నవ్వేసి తన కార్డ్ ఇస్తుంది. మొదట భయ పడ్డా ఇషా చూపిస్తున్న ఇష్టం స్వచ్చంగా ఉండడంతో ఆమెతో ఈజీగా కలిసిపోయారు. పైగా కొన్ని షాప్స్ ని తనవే అని చెప్పడం పైగా తనవి కాని షాపుల్లో వాళ్ళు కూడా ఇషాని గౌరవంగా చూడడంతో మెల్ల మెల్లగా వాళ్ళలో ఉన్న భయం వదిలించుకొని ఇషాతో కలిసి పోయారు.

ఇషా అందరిని తీసుకొని తన కొత్త విల్లాకి తీసుకొని వెళ్ళింది. అందులో చాలా బెడ్ రూమ్స్ ఉండడం చూసి ఆశ్చర్య పోయారు. గతంలో చిన్న ఇంట్లో రెండు గదుల్లో ఏడుగురు ఇరుక్కుని ఇరుక్కుని ఉండే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు వాళ్ళ అందరికి నచ్చేసింది. పైగా జిమ్, స్విమ్మింగ్ పూల్, మ్యూజిక్ ఐటమ్స్ ఉన్న రూమ్ మరియు పెద్ద సినిమా హాల్ లాంటి రూమ్... అన్ని చూసి ఆశ్చర్య పోయారు.

ఒక రూమ్ లో ఇషా కూర్చొని రమాదేవి ఇచ్చిన ఫైల్స్ అన్ని చూస్తూ ఉంది. ఆరాధ్యతో కలిసి అందరూ ఇషా ఉన్న దగ్గరకు వచ్చారు. ఇషా చిన్నగా నవ్వింది, ఆరాధ్య వెనకే అందరూ రూమ్ లోకి వచ్చారు. రమాదేవి వాళ్ళను వద్దు అని చెప్పాలని అనుకుంది, కాని వెంటనే ఇషా సీరియస్ గా చూడడంతో ఆగిపోయింది.

అందరూ వచ్చి ఇషా వెనకే నిలబడి ఉన్నారు. ఇషా, రమాదేవి మాటలు అయిపోయాక మాట్లాడాలని అనుకున్నారు.

ఇషా "ఫైనల్ గా బాంబ్ బ్లాస్ట్ వెనక ఉంది, నాకు కాబోయే వాడు మిస్టర్ ఆకాష్... అంతే కదా..."

రమాదేవి వెనకే ఉన్న వాళ్ళను చూసి ఇక రహస్యం ఆపలేను అని అర్ధం అయి, "అవునూ మేడం.....  అలాగే తనకు సపోర్ట్ చేసింది.....  మీ పిన్ని కల్పన.....  "

ఇషా "ఆకాష్ ఎందుకు?"

రమాదేవి కొన్ని ఫోటోస్ చూపించింది, అందులో ఇషా యొక్క సవితి చెల్లెలు మరియు ఆకాష్ ఇద్దరూ కిస్ చేసుకున్నట్టు, రోమాన్స్ లో మునిగి తేలినట్టు ఉన్న ఫోటోస్ చూస్తూ ఉంది.

ఇషా "ఈ కుక్క నా వెనక నా చెల్లితో రోమాన్స్ చేస్తున్నాడు.....  ఈ చెల్లి నా లంజ.....  నా ఫియాన్సి అంటేనే ఇష్టం.....  " అని పైకి లేచింది.

రమాదేవి "ఈ ఫోటోస్ చూపించి మీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించవచ్చు మేడం.....  "

ఇషా "వద్దు.....  వద్దు.....  టైం అపుడే సెట్ అవ్వదు.....  " అని పైకి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంది.

సనా "ఎందుకు మీ నాన్నకి చెప్పకూడదు.....  తండ్రికి కూతుళ్ళు అంటే ఇష్టం కదా.....  " అంది.

చుట్టూ ఉన్న ఆడపిల్లలు సనాని మాట్లాడవద్దు అని సైగ చేశారు.

రమాదేవి వాళ్ళ వైపు కోపంగా చూసి తిరిగి ఇషా వైపు చూసింది.

ఇషా "చెప్పూ.....  " అంది.

రమాదేవి తల ఊపి "మీ నాన్నకి మీ కార్ బాంబ్ గురించి ముందే తెలుసు మేడం.....  " అని వాళ్ళ వైపు చూసింది.

అందరూ ఇబ్బందిగా చూసారు. వాళ్ళలో వాళ్ళు "తండ్రి కూతురుని చంపుతాడా!" అని అనుకున్నారు.

ఇషా చిన్నగా వాళ్ళను చూసి నవ్వి "మా నాన్న నన్ను చంపడు.....  కాని ఎవరైనా చంపుతుంటే మాత్రం ఏం చేయడు.....  "

సనా "వాట్" అని నోరు తెరిచి నమ్మలేనట్టు చూసింది. పైగా ఇషా మీద తనకు జాలి వచ్చేసింది. 

సనా సెంటి మెంట్ అవ్వడం చూసి ఇషా చిన్నగా నవ్వేసి సనా దగ్గరకు వెళ్లి హత్తుకుంది. సనా కూడా కొద్ది సేపు ఇషాతో మాట్లాడింది.

కొద్ది సేపటి తర్వాత ఇషా, తనని చూస్తున్న రమాదేవితో "ఆకాష్ వెనక ఎవరు ఉన్నారు?" అని అడిగింది.

రమాదేవి డౌట్ గా చూస్తూ ఉంది.

ఇషా "ఇంతకు ముందు ఫుడ్ లో విషం కలిపారు, కారు బ్రేక్ లు తీశారు, మెట్ల మీద నుండి తోయడం, పై నుండి కుండీ వేయడం చేశారు.....  అవన్నీ చీప్ పనులు.....  కార్ బాంబ్ పెట్టి.....  దొరికితే అది జస్ట్ యాక్సిడెంట్ అని చూపించారు అంటే అది వేరే లెవల్.....  ఆ ముండకి అన్ని తెలివి తేటలు లేవు.....  వెనక ఎవరూ ఉన్నారో కనుక్కో"

రమాదేవి "సరే మేడం" అని వెళ్లి పోయింది.

ఆ ఏడుగురు నిజానికి ఇషా దగ్గర ఉండము అని చెప్పడం కోసం వచ్చారు కాని ఇషా వాళ్ళను అందరిలా కాకుండా ఫ్రెండ్ లా చూడడంతో వాళ్ళు ఆ మాట చెప్పలేక పోయారు.




ఆ రోజు సాయంత్రం రమాదేవి కంగారుగా వచ్చి ఇషాని కలిసింది. ఎనిమిది మంది అందగత్తెలు కలిసి స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారు. 

ఇషా ఒక పక్కకు తన నల్లని జుట్టుని వేసుకొని ఒక తెల్లని టవల్ తో తుడుచుకుంటూ ఉంటే, రమాదేవి వచ్చి ఒక ఫైల్ ఇచ్చింది.

సనా ఆశ్చర్యంగా వాళ్ళను చూసి దగ్గరకు వెళ్ళాలా వద్దా అన్నట్టు ఉంది. ఇషా సనాని చూసి కన్ను కొట్టి తల అడ్డంగా ఊపింది.

రమాదేవి ఇచ్చిన ఫైల్ లోని ఫోటో చూసి పక్కన పడేసి పైకి లేచింది.

ఇషా "గర్ల్స్" అని కేకేయడంతో అందరూ ఇషా ముందుకు వచ్చారు.

ఇషా వాళ్ళను చూస్తూ అందరూ తనని చూసే వరకు ఆగి "మిస్టర్ విష్ణువర్ధన్ హ్యాండ్ సమ్ గా కనిపించాడా!" అని అడిగింది.

అందరూ ఏం మాట్లాడాలో అర్ధం కాక చూస్తూ ఉన్నారు.

ఇషా, రమాదేవితో "హ్యాండ్ సమ్ గానే ఉండి ఉంటాడు, అందుకే ఎవరూ ఏం చెప్పడం లేదు" అంది.

రమాదేవి ఇబ్బందిగా నవ్వింది.

ఇషా "ఒక సారి వెళ్లి మీ విష్ణువర్ధన్ ఎంత అందంగా ఉన్నాడో చూద్దాం పదండి" అని ఇంట్లోకి నడిచింది.

వెనకే అందరూ వెళ్ళారు, ఇషా వెనక్కి తిరిగి "గుర్తు పెట్టుకోండి.... అందరూ అందంగా రెడీ అవ్వాలి" అని చెప్పి రమాదేవి వైపు చూసి "బ్యూటిషియన్స్ ని పిలిపించండి" అని ఆర్డర్ వేసింది.




ఒక రోడ్ మీద కారులో విష్ణువర్ధన్ కారుని నడిపిస్తూ వెళ్తున్నాడు, ఇంతలోనే అతని ఫోన్ మోగింది. ఫోన్ పై ఇషా ఫోటో ఉండి, పేరు మాత్రం అగ్లీ గర్ల్ అని రాసి ఉంది.

ఫోన్ లిఫ్ట్ చేశాడు. 

విష్ణువర్ధన్ కారు దిగి పరిగెత్తాడు.

కొద్ది సేపటికి కారు బాంబ్ పేలినట్టు పేలింది. అప్పటికే విష్ణువర్ధన్ చాలా దూరం పరిగెత్తినా, కారు బంపర్ వచ్చి అతని వీపుకు తగిలి కింద పడిపోయాడు. అలాగే స్పృహ తప్పాడు.

ఆ పక్కగా కొద్ది దూరంలో పార్క్ చేసిన పెద్ద కారు అన్ని వైపుల డోర్స్ ఓపెన్ అయి అందరూ కిందకు దిగారు.

ఇషా బ్లాక్ కళ్ళ జోడు పెట్టుకొని భుజాల మీదకు నల్ల జాకెట్ వేసుకొని ఉంది.


[Image: casual-black-leather-jacket-800x980.jpg][Image: 71haia-Gqx-OS-AC-SY445.jpg]


నడుచుకుంటూ, కింద పడ్డ విష్ణువర్ధన్ దగ్గరకు వచ్చింది. అప్పటికే మిగిలిన వాళ్ళు అందరూ వెళ్లి విష్ణువర్ధన్ ని కంగారుగా అతను బ్రతికి ఉన్నాడా లేదా అని చూస్తూ ఉన్నారు. రమాదేవి అంబులెన్స్ కి కాల్ చేస్తుంది.

ఇషా చిన్నగా నడుచుకుంటూ వచ్చి విష్ణువర్ధన్ గడ్డం కింద చేయి వేసి మొహాన్ని అటూ ఇటూ తిప్పి చూసి "ఏ యాంగిల్ లో చూసిన వీడు నాకు హ్యాండ్ సమ్ గా కనిపించడం లేదు.....   అనవసరంగా కాపాడాము.....   ప్చ్.....  వెస్ట్.....  " అని చెప్పి విసుగ్గా చూసింది.

రమాదేవి మరియు ఆ ఏడుగురు అమ్మాయిలు ఇషాని ఆమె మాటలను షాక్ గా చూశారు.

ఇషా క్యాజువల్ గా "సర్లెండి.....  తీసుకొచ్చి ఆ కార్ లో పడేసి తీసుకొని వెళ్దాం.....  దేనికో ఒక దానికి పనికి వస్తాడు" అంది.

కొన్ని గంటల తర్వాత.....  

విష్ణు వర్ధన్ కళ్ళు తెరిచి చూడాగా ఎదో కొత్త ప్లేస్ లా.....  లేడీస్ రూమ్ ఉండే ప్లేస్ లా అనిపించింది. తల మెల్లగా దిమ్ముగా అనిపిస్తూ తల తిరుగుతున్నట్టు అనిపించింది. చుట్టూ చూడగా ఇషా ఎదురుగా ఉన్న బల్ల మీద కాళ్ళు పెట్టి ఊపుతూ సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉంది. 

ఆమె తల మీద ఉన్న దెబ్బ చూసి కొన్ని రోజుల క్రితం తనకు కూడా యాక్సిడెంట్ అయినపుడు తనకు కూడా దెబ్బలు తగిలాయి అని గుర్తుకు వచ్చింది.






















[+] 12 users Like 3sivaram's post
Like Reply
#17
Quote:
ట్రైలర్



..గతం..

విష్ణువర్ధన్ "నన్ను ఎందుకు కాపాడావు"

ఇషా "నువ్వు హ్యాండ్ సమ్ అవునా కదా అని చూడడం కోసం వచ్చాను"

విష్ణువర్ధన్ "ఇంతకు ముందు కూడా చూశావ్ కదా"

ఇషా "నేను నీ గడ్డం పట్టుకొని దగ్గర నుండి చూస్తా అంటే ఒప్పుకుంటావా..... అందుకే నువ్వు స్పృహ తప్పే వరకు వెయిట్ చేశాను"

విష్ణువర్ధన్ కి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. కోపం తెచ్చుకోవాలని అయితే లేదు. ఎందుకంటే తనను కాపాడింది.



విష్ణువర్ధన్ "ఇంతకి ఎందుకు కాపాడావు.... అదే.... నేను హ్యాండ్ సమ్ ....  అయితే ఏంటి? లేక పోతే ఏంటి?"

ఇషా "నువ్వు నాకు హ్యాండ్ సమ్....  గా కనిపిస్తే....  "

విష్ణువర్ధన్ "హుమ్మ్ కనిపిస్తే....  " అంటూ ఆశగా చూశాడు.

ఇషా "హ్యాండ్ సమ్....  అని అనిపిస్తే పిల్లలను కందాం అనుకుంటున్నా....  ఓన్లీ పిల్లలు....  ఇంకేం లేదు....  " అంది.

నోరు తెరుచుకున్న విష్ణువర్ధన్, ఇషాని పైకి కిందకు చూసి ఆ గది బాల్కానీ లోకి వచ్చి పెద్దగా "ఆ!" అని అరిచాడు.

ఇంకా తన ఫ్రస్ట్రేషన్ పోక జుట్టు పీక్కుంటున్నాడు.

ఇషా డోర్ దగ్గర నిలబడి చేతులు కట్టుకొని ఉంది, "జుట్టు పీక్కుంటే.....  హ్యాండ్ సమ్....  గా ఉండవు" అని చెప్పింది.
[+] 5 users Like 3sivaram's post
Like Reply
#18
Ushuuu..endi e writings...ela vastunay meku thoughts..superr
Like Reply
#19
Nice update
Like Reply
#20
4. బోర్ కొట్టేశావ్













... గతం ...

విష్ణువర్ధన్ పైకి లేచి ఇషాని చూస్తూ ఉన్నాడు. ఇషా అతన్ని చూడకుండా ఎదో పేపర్ తిరగేస్తూ కాళ్ళు రెండూ ఒక బల్ల మీద పెట్టి ఊపుతూ టీ తాగుతూ ఉంది. విష్ణువర్ధన్ తల దిమ్ముగా ఉండడంతో సరిగా కనిపించడం లేదు. కానీ మెల్లగా అన్ని స్పష్టంగా కనిపించడం మొదలయ్యాయి. సుమారుగా అయిదు నిముషాలుగా ఇషాని చూస్తూ ఉన్నాడు. బన్నీ క్లాత్ తో స్కిన్ టైట్ గా ఉన్న ప్యాంట్ వేసుకున్న ఇషా తొడల నుండి పాదాల వరకు చూస్తూ ఉన్నాడు. స్కిన్ అంతా కవర్ చేస్తూ క్లాత్ కవర్ చేసి ఉన్నా, ఎందుకో ఇషా అందం చూస్తూ చూపు తిప్పుకోబుద్ది కావడం లేదు.






...పాత జ్ఞాపకాలు...

విష్ణువర్ధన్ "ఇషా....  ఎందుకు ఇలా చేస్తున్నావ్....  "

ఇషా "ఏం చేశాను....  "

విష్ణువర్ధన్ "ఇంతకు ముందు బాగుండేదానివి....  ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావ్....  "

ఇషా "మిస్టర్ విష్ణువర్ధన్....  మనిద్దరం ఒకరికిఒకరం ఏమవుతాం....  "

విష్ణువర్ధన్ గుటకలు మింగాడు, స్పష్టంగా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. కాని సడన్ గా ఒక్క రాత్రిలో ఇషా మారిపోయింది.

మాట్లాడడం మానేసింది, అందరితో సరదాగా ఉండడం మానేసింది. తన ఫ్రెండ్స్ కూడా తనతో ఉండలేకపోయారు.

సుమారుగా ప్రతి ఆరు నెలలకు పాత ఫ్రెండ్స్ ని మార్చేసి కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకుంటుంది. 

నవ్వుతుంది, నవ్విస్తుంది, కాని విష్ణువర్ధన్ కి మాత్రం గతంలో తను చూసిన ఇషా కనిపించలేదు.

సడన్ గా మిస్టర్ ఆకాష్ తో పెళ్ళికి ఒప్పుకుంది.

ఒక రోజు భరించలేక ఇషాని పక్కకి తీసుకొని వెళ్లి విషయం ఏంటి? అని అడిగాడు.

తను చెప్పిన సమాధానం విని మైండ్ బ్లాక్ అయింది. 

ఇషా "బోర్ కొట్టేశావ్....  "






విష్ణువర్ధన్, ఇషాని అలానే చూస్తూ ఉన్నా..... ఎందుకో తెలియదు, గతం మర్చిపోయి ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోయాడు.

బహుశా ఆ రోజు నుండి ఈ రోజు వరకు..... ఎప్పుడూ ఇషా గుర్తు వచ్చినా అదే రోజు అదే క్షణం గుర్తు వచ్చి పిచ్చి కోపం వచ్చేది. ఎలా అయినా తను బాధ పడేలా చేయాలని తన ఫ్యామిలీ బిజినెస్ ని చేతుల్లోకి తీసుకొని రెండింతలు చేశాడు. గొడ్డులా కష్టపడి ఇషా వైపు చూస్తే, ఇషా తన కొత్త ఫ్రెండ్స్ తో పబ్ లో నుండి బయటకు వచ్చేది.

తనని ఎవరైనా అటాక్ చేస్తే, అప్పుడైనా తన వైపు చూసి "హెల్ప్ మీ..... " అంటుందని ఎదురు చూస్తే, నలుగురు మగాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి "నువ్వు కానీ వీళ్ళతో రాలేదు కదా..... " అని చూసేది.

విష్ణువర్ధన్ తనని అనుమానించినందుకు ఇంకా కోపం తెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు విష్ణువర్ధన్ ఇషాని ద్వేషిస్తూ ఉన్నాడని అనుకున్నాడు.

ఇషాకి యాక్సిడెంట్ అయింది అనగానే తన ప్రాణం పోయినట్టు అనిపించింది. తన కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయని తనకే తెలియలేదు.

సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి విషయం కనుక్కున్నాడు, కాని అందరూ యాక్సిడెంట్ అని చెప్పారు. తనకు అది అబద్దం అని అనిపించింది, ఇషా వాళ్ళ ఫ్యామిలీ మీద, ఆకాష్ మీద పిచ్చి కోపం వచ్చింది. తన యాక్సిడెంట్ వెనక వాళ్ళే ఉన్నాడని నమ్మి వాళ్ళను నాశనం చేయడం కోసం వచ్చాడు.

కాని ఎదురుగా ఇషా తన కొత్త ఫెండ్స్ తో కనిపించగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది.

తన అటెన్షన్ కోసమే అలా మాట్లాడాడు, తను అందరిలో తన మీద ప్రాంక్ చేసినా ఇంటికి వెళ్లి మనస్పూర్తిగా నవ్వుకున్నాడు. 

కొన్ని రోజులుగా ఇషా పోస్ట్ లు చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. 

కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, ఇషా కాలింగ్ చూసి అగ్లీ గర్ల్ అని కనిపించగానే, ఇషా అది చూస్తే మొహం ఎలా పెడుతుందో అని ఊహించుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు.

ఫోన్ ఎత్తగానే, రొమాంటిక్ లైఫ్ కాస్తా యాక్షన్ ఎంటరటైనర్ గా మారిపోయింది.






ఇప్పుడు ఎదురుగా ఉన్న ఇషాని చూస్తూ ఉంటే, కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. తనని ఇష్ట పడుతుందా..... లేదా..... తనకి అర్ధం కావడం లేదు.

సుమారుగా పది నిముషాలు గడిచాయి, విష్ణువర్ధన్ ఇషాని చూస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెలో చూసిన సిగ్గు - తనని చూడగానే పరిగెత్తడం, అల్లరి తనం - తన మీద చిన్న చిన్న ప్రాంక్ లు చేయడం, కొంటె తనం - తనని ఆశగా చూస్తూ అతను చూడగానే తల తిప్పెసుకొని దొరికేసి నందుకు అబ్బా అనుకోని పక్కకు తిరగడం.

ఇప్పుడు ఇషా అస్సలు అలా లేదు, నలుగురు మగాళ్ళు తనని కొట్టడానికి వచ్చినా, చావు ఎదురుగా ఉన్నా, తనని చంపాలని అనుకునే వాళ్ళు తన పక్కనే ఉన్నా ఏమి లేదు అన్నట్టు నవ్వుతూ మెక్ అప్ వేసుకుంటూ ఉంటే కోపం వచ్చేస్తుంది.

ఆమెను బాగా చూసుకోవాలని, కాపాడాలని, ఆమె శత్రువులను తన శత్రువులుగా అనుకోని వాళ్ళను నాశనం చేయాలని అనిపిస్తుంది. కాని ఇషా మాత్రం ప్రతి రోజు చావుతో చెలగాటం ఆడుతూ బ్యుటిఫుల్ అనుకుంటూ తిరుగుతుంది.




విష్ణువర్ధన్ ఆలోచనలలో పడిపోయి ఇషా కూడా తన వైపు చూస్తున్న విషయం కూడా గుర్తు పట్టలేకపోయాడు. 

గుటకలు వేస్తూ ఇషా ని చూసి నవ్వాడు. ఇషా మాత్రం విష్ణువర్ధన్ ని చూస్తూనే ఉంది కాని నవ్వలేదు.

విష్ణువర్ధన్ "నన్ను ఎందుకు కాపాడావు" అని అడిగాడు.

ఇషా "నువ్వు హ్యాండ్ సమ్ అవునా కదా అని చూడడం కోసం వచ్చాను"

విష్ణువర్ధన్ "ఇంతకు ముందు కూడా చూశావ్ కదా"

ఇషా "నేను నీ గడ్డం పట్టుకొని దగ్గర నుండి చూస్తా అంటే ఒప్పుకుంటావా..... అందుకే నువ్వు స్పృహ తప్పే వరకు వెయిట్ చేశాను"

విష్ణువర్ధన్ కి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. కోపం తెచ్చుకోవాలని అయితే లేదు. ఎందుకంటే తనను కాపాడింది.






విష్ణువర్ధన్ "ఇంతకి ఎందుకు కాపాడావు.... అదే.... నేను హ్యాండ్ సమ్ ....  అయితే ఏంటి? లేక పోతే ఏంటి?"

ఇషా "నువ్వు నాకు హ్యాండ్ సమ్....  గా కనిపిస్తే....  "

విష్ణువర్ధన్ "హుమ్మ్ కనిపిస్తే....  " అంటూ ఆశగా చూశాడు.

ఇషా "హ్యాండ్ సమ్....  అని అనిపిస్తే పిల్లలను కందాం అనుకుంటున్నా....  ఓన్లీ పిల్లలు....  ఇంకేం లేదు....  " అంది.

నోరు తెరుచుకున్న విష్ణువర్ధన్, ఇషాని పైకి కిందకు చూసి ఆ గది బాల్కానీ లోకి వచ్చి పెద్దగా "ఆ!" అని అరిచాడు.

ఇంకా తన ఫ్రస్ట్రేషన్ పోక జుట్టు పీక్కుంటున్నాడు.

ఇషా డోర్ దగ్గర నిలబడి చేతులు కట్టుకొని ఉంది, "జుట్టు పీక్కుంటే.....  హ్యాండ్ సమ్....  గా ఉండవు" అని చెప్పింది.






... ప్రస్తుతం ...

దామిని "అమ్మా....  అమ్మా....  " అంటూ ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంది.

ఇషా పట్టించుకోకుండా, దామినిని చేయి పట్టుకొని s.chool ఆఫీస్ రూమ్ లోకి తీసుకొని వెళ్తుంది.

దామిని అయిదోవ తరగతి చదువుతుంది, ఇది పూర్తీ అవ్వగానే హై s.chool కోసం వాళ్ళ నాన్న విష్ణు వేరే మంచి s.chool లో జాయిన్ చేస్తా అన్నాడు.

అప్పటి వరకు ఈ s.chool లో ఏ గొడవ పడొద్దు, లేదంటే ఆ s.chool లో అడ్మిషన్ రాదు అని పదే పదే తన తల్లి ఇషా వార్నింగ్ ఇచ్చింది.

ఒక సారి గొడవ పడితే, తననే కొట్టింది. ఇప్పుడు ఆ అబ్బాయిని హాస్పిటల్ లో జాయిన్ అయ్యేలా కొట్టడంతో ఇషాని తలుచుకొని భయపడుతుంది.

ఆఫీస్ రూమ్ లో 35+ వయస్సు ఉన్న ఇద్దరు భార్యాభర్తలను చూసింది, బంగారం ముంచి తీశారా అన్నట్టు నగలు దిగేసుకొని వచ్చింది.

అతను కూడా అయిదు వేళ్ళకు అయిదు ఉంగరాలు పెట్టుకొని వచ్చి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని నుదురు ముడిచి దామినిని సీరియస్ గా చూస్తూ ఉన్నాడు.

మరో వైపు ఇషా నార్మల్ ఫాన్సీ సారీ కట్టుకుని లైట్ గా కనిపిస్తూ ఉంది. ఆమె పక్కనే దామిని కాసేపటికి, కాసేపటికి కళ్ళు తుడుచుకుంటూ ఉంది.

ప్రిన్సిపల్ వచ్చి రాగానే ఆ భార్యాభర్తలు ఇద్దరూ రేస్ లో బ్రేక్ వదిలిన కారులా అరుస్తూనే ఉన్నారు. ప్రిన్సిపల్ కూడా సాధ్యమైనంత వరకు దామిని ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అర్ధం చేసుకోమని చెప్పుకుంటూ పోతున్నాడు.

పదిహేను నిముషాల పోట్లాట తర్వాత, ప్రిన్సిపల్ చాలా కష్ట పడి బలవంతంగా వాళ్ళను దామిని మరియు ఇషాల చేత క్షమాపణ చెప్పిస్తా అని ఒప్పించాడు.

గదిలో అందరూ మాట్లాడుతూ ఉండగా ఇషా ఒక్క సారిగా ఆవలించింది.

ఆ ఇద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ కోపంలో ఇషా మీదకు కొట్టడం కోసం అన్నట్టు వచ్చారు. ప్రిన్సిపల్ గదిలో ఉన్న మరో టీచర్ వైపు చూసి వాళ్ళను ఆపమని అడిగాడు. కాని అప్పటికే అతను ఇషా మీద మీదకు వచ్చేశాడు. 





... గతం ...

ఆరాధ్య మరియు మిగిలిన ఆరుగురు అమ్మాయిలు కంప్యుటర్ లో గేమ్స్ ఆడుతూ ఉండగా పెద్ద పెద్దగా సౌండ్స్ వినపడడంతో స్పీడ్ స్పీడ్ గా ఇషా రూమ్ దగ్గరకు వచ్చారు. అది అబ్బాయిల గొంతు, ఆ ఇంట్లో ఉంది అందరూ అమ్మాయిలే కావడంతో ఆ అబ్బాయి గొంతు విష్ణువర్ధన్ అని అది ఇషా రూమ్ నుండి వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గది బయట ఏడుగురు అమ్మాయిలు ఒక వైపు, ఇషా అసిస్టెంట్ మరో వైపు నిలబడి ఉన్నారు. విష్ణువర్ధన్ పెద్ద పెద్దగా అరవడంతో రమాదేవి మరియు ఏడుగురు అమ్మాయిలు వచ్చి విష్ణువర్ధన్ ని ఓదారుస్తున్నారు.  విష్ణువర్ధన్ తన మాటల్లో ఆమెను ప్రేమిస్తున్నా అని కాని ఆమె ఇలా దూరం దూరంగా ఉంటూ తనని ఇబ్బంది పెడుతూ ఆ ఆకాష్ తో పెళ్లి ఫిక్స్ చేసుకుంది అని అరుస్తూ చెబుతూ ఉన్నాడు.

పదిహేను నిముషాల వరకు అరిచి అరిచి విష్ణువర్ధన్ రొప్పు తీసుకోవడం కోసం కూర్చున్నాడు.

ఇంతలోనే ఇషా ఆవలించింది. విష్ణువర్ధన్ మళ్ళి కోపం వచ్చింది, కోపంగా పైకి లేచి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.

ఇషా మాత్రం ప్రశాంతంగా పైకి లేచి మ్యూజిక్ రూమ్ లోకి నడిచింది, అందరూ ఆమెను ఫాలో అవుతూ ఉన్నారు. 

పియానో ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ కీబోర్డ్ ని నొక్కుతుంది.

చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అబ్బురంగా ఇషాని చూస్తూ ఉన్నారు. బయట ఉన్న విష్ణువర్ధన్ కి పిచ్చి కోపం వచ్చింది. 

ఇషాకి ఆ మ్యూజిక్ బిట్ విష్ణువర్దన్ నేర్పించాడు. ఇద్దరూ కలిసి పియానో ముందు కూర్చొని నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉండడం గుర్తు వచ్చింది.

ఆ రూమ్ దగ్గరకు వచ్చి ఆ పక్కనే ఉన్న కుండీ తీసుకొని ఇషా ఆడిస్తున్న పియానో ముందు నేలకేసి కొట్టాడు. 

ఇషా తల దించుకొని ఆ కుండీని చూస్తూ ఉంది. గది మొత్తం సైలెన్స్ తో నిండిపోయి ఉంది. 

ఎవరూ ఏ సౌండ్ చేయడం లేదు. కొద్ది సేపటి తర్వాత ఇషా తల పైకెత్తింది, ఆమె కళ్ళలో క్షణ కాలం పాటు వచ్చిన నీరు ఆమెను మోసం చేసి నీటిబొట్టుగా మారి ఆమె చెంపల మీదుగా జారీ కింద పడింది. అది చూడగానే విష్ణువర్దన్ కోపం అంతా పోయింది. 

ఇషా తిరిగి తన యాక్టింగ్ లోకి వచ్చి "ఆహ్.... రోజు..... మూడు సార్లు స్నానం చేసి నా వంటికి ఉన్న మట్టిని వదిలించుకుంటేనే అందంగా కనిపించగలం" అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది.

విష్ణువర్ధన్ మరో వైపు వెళ్లి పోయాడు, ఇషా మరో వైపు వెళ్ళిపోయింది.

అందరూ కింద పడ్డ ఆమె కన్నీటి చుక్క చుట్టూ చేరారు. అప్పటికే అది నేల మీద పడి ఎప్పుడో ఒక చిన్న మచ్చలా మారిపోయింది.

మంజరి "వావ్.... అయితే తను కూడా ఏడుస్తుందా!"

సోనియా "ఎందుకు అలా అనిపించింది"

మంజరి "అంత పెద్ద బాంబ్ చూసినా కూడా భయపడలేదు, ఏడవలేదు కదా.....  " అంది.

అందరూ "మ్మ్" అని అన్నారు.

ఆరాధ్య మాత్రం ఇషా వెళ్ళిన వైపు చూస్తూ ఉంది.





... ప్రస్తుతం ...

ఇషా "నిన్న ఏం జరిగింది.....  " అని అడిగింది.

అప్పటికే టీచర్ చెప్పడంతో కూర్చున్న ఆ భార్యాభర్తలలో భర్త మళ్ళి కోపంగా పైకి లేచి మాట్లాడబోయాడు.

ఇషా పైకి లేచి సీరియస్ గా "నా కూతురు తప్పు చేయదు.....  నేను సిసి కెమెరా ఫుటేజ్ చూడాలని అనుకుంటున్నాను. తను నిజంగా తప్పు చేసి ఉంటే, క్షమాపణ చెప్పడమే కాదు, ఈ s.chool మాత్రమే కాదు, ఈ ఊరు వదిలి వెళ్లిపోతాము.....  " అంది.

అప్పటి వరకు రణగోణ ధ్వనులతో నిండిపోయిన ప్రిన్సిపల్ ఆఫీస్ ఇషా కంగు లాంటి గొంతుతో రీ సౌండ్ వచ్చింది. పైగా ఆమె కళ్ళు పెద్దవి చేసినపుడు ఆమె నుండి వచ్చిన ఆరా.....  తను అందరిలా డీల్ చేసే వ్యక్తీ కాదు అన్నట్టుగా ఉంది.

కొద్ది సేపటికి సిసి కెమెరా లో ఆ అబ్బాయి s.chool లో వేరే పిల్లలను ఏడిపిస్తూ ఉంటే, దామిని అందరి ముందు అతన్ని టీచర్ కి పట్టించింది. ఆ అబ్బాయి అప్పుడు వదిలేసినా.....   దామిని వెళ్తూ ఉంటే కింద పడేసి మీద మట్టి మరియు రంగు వేశాడు, చుట్టూ అందరూ నవ్వుతూ ఉన్నారు. దామిని పైకి లేచి ఆ అబ్బాయిని పిచ్చి కొట్టుడు కొట్టడంతో ఆ అబ్బాయి భయం భయంగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు.....  

అది చూసిన తర్వాత అందరూ కోపంగా ఆ అబ్బాయి పేరెంట్స్ ని చూస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి తల్లి మాత్రం కోపంగా దామినిని అరిచే ప్రయత్నం చేసింది అలాగా ఆమె భర్తని కూడా రెచ్చకొట్టడంతో అతను కూడా పైకి లేచి దామినిని s.chool  నుండి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశాడు.

ఇషాని కూడా ఊరు నుండి పంపించాలని డిమాండ్ చేశాడు. ప్రిన్సిపల్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఇషా పైకి లేచి తన చీర సర్దుకొని "ఇక అయిపొయింది కాబట్టి నేను వెళ్తున్నాను" అని చెప్పింది. ప్రిన్సిపల్ అటూ ఆ పేరెంట్స్ ని ఇటూ ఇషా గంబీరత్వాన్ని చూసి సరే అన్నటు తల ఊపాడు.

ఇషా, దామిని తల నిమిరి చేయి పట్టుకొని ఆఫీస్ రూమ్ నుండి బయటకు వచ్చింది. లోపల పెద్ద పెద్దగా సౌండ్ వినపడుతుంది. ప్రిన్సిపల్ వాళ్ళ ఇద్దరినీ సర్దిపుచ్చడం కోసం చాలా ప్రయత్నించాడు.

దామిని ఇషాని చూసి "అమ్మా.....  " అని మాత్రమే అనగలిగింది. తన మనసులో ఎన్నో మాటలు ఉన్నా అవి బయటకు రావాడం లేదు.

ఇషా, దామిని ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన చీర పవిట కొంగుతో దామిని నుదిటి మీద ఉన్న చెమట మొత్తం తుడిచి "చూడు.....  నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు.....  అలాగే గుర్తు పెట్టుకో.....  నువ్వు తప్పు చేస్తే.....  నిన్ను అరుస్తాను కాని.....  నీకు ఎవరైనా ఏదైనా అంటే.....  అందరికంటే ముందుగా నీ కోసం అమ్మని, నేనే వస్తాను.....  ఈ అమ్మ నీకు ఎప్పుడూ ఉంటుంది.....   "

దామిని గట్టిగా ఇషా మెడ చుట్టూ తన చిన్న చేతులను ముడి వేసి కొద్ది సేపు అలానే ఉండి, ఇషా బుగ్గ మీద ముద్దు పెట్టింది.

ఇషా దామిని తిరిగి తనని తన క్లాస్ ముందు వదిలిపెడుతూ ఉంటే, దామిని వెనక్కి తిరిగి జాలిగా మొహం పెట్టింది. కాని ఇషా కరగక పోవడంతో చేసేది లేక క్లాస్ రూమ్ లోకి నడిచింది.





....గతం....

విష్ణువర్దన్ చుట్టూ ఏడుగురు అమ్మాయిలు మరియు రమాదేవి నిలబడి ఇషా గురించి చెబుతూ ఉన్నారు. విష్ణువర్దన్ మాత్రం అందరిని సీరియస్ గా చూసి "నన్ను కాపాడినందుకు థాంక్స్....  కాని ఇషా నేను కలవడం జరగదు" అని చెప్పాడు.

చేసేది లేక అందరూ వెళ్లి పోయారు.

ఆరాధ్య మాత్రం అక్కడే నిలబడి ఉంది. అబ్బాయి డ్రెస్ లో ఉన్నా తను అమ్మాయే అని విష్ణువర్దన్ గుర్తు పట్టాడు. నిజానికి ఇషా పక్కన ఉండే వాళ్ళను అతను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు.

విష్ణువర్దన్ వెనక్కి తిరగకుండానే "మీకు ఏం కావాలి.....  " అని అడిగాడు.

ఆరాధ్య "నాకు ఒక డౌట్ గురించి చెబుతారా!"

విష్ణువర్దన్ సీరియస్ గా నుదురు ముడి వేసి చూస్తున్నాడు.

ఆరాధ్య "విషం కలిపినా పాలు తాగినపుడు,   మెట్ల మీద నుండి అయిన వాళ్ళే తనని కిందకు తోసేసినపుడు,   ఇంకా చాలా కష్టమైన సందర్బాలలో ఇషా ఇలానే ఉందా.....  ఎప్పుడూ బాధ పడలేదా.....  " అని అడిగింది.

విష్ణువర్దన్ "హుమ్మ్" అన్నాడు.

ఆరాధ్య "ఎందుకు?"

విష్ణువర్దన్ "ఎందుకంటే తనకు అదొక పిచ్చి.....  మెంటల్ మొహంది.....  శత్రువులను పక్కనే పెట్టుకొని చావుతో చెలగాటం ఆడుతూ ఉంటుంది.....  అన్నింటి కంటే ముఖ్యమైనది సేఫ్టీ కాదు.....  తన బ్యూటి.....  మెంటల్.....  మెంటల్.....  " అని అరిచాడు.

ఆరాధ్య "కానీ సర్.....  మీకు నాకు ఇద్దరికీ తెలుసు.....  తనకి ఎటువంటి మెంటల్ లేదు కదా"

విష్ణువర్దన్ నుదురు ముడి వేసి వెనక్కి తిరిగి ఆరాధ్య వైపు చూశాడు. 

ఆరాధ్య చిన్నగా నవ్వి "మెంటల్ కానప్పుడు, మరి ఎందుకు ఇలా ఉంది"

విష్ణువర్దన్ ఏమో అన్నట్టు చూస్తున్నాడు.

ఆరాధ్య "చాలా సింపుల్.....  తను నటిస్తుంది.....  "

విష్ణువర్దన్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

ఆరాధ్య "తన నిజమైన ఫీలింగ్స్ బయట పెట్టకుండా లోపల లోపల సమాధి చేసుకొని ఒక రకమైన క్యారక్టర్ ని బయట ప్రపంచానికి చూపిస్తూ నటిస్తుంది.....  " అంది.

విష్ణువర్ధన్ తల పైకెత్తి చూడగా ఇషా రూమ్ నుండి కిటికీ దగ్గర నుండి ఇషా తనని చూస్తూ కనపడింది. వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది.

ఆరాధ్య "తల్లి లేని పిల్ల సర్.....  చుట్టూ అందరూ ఎప్పుడూ అవకాశం దొరుకుతుందా చంపి తినేద్దాం అన్నట్టు ఉండే మోసలి లాంటి మనుషులు.....  అందరి ముందు భయం భయంగా తన భయం దాచుకొని తిరుగుతుంది.....  ఎవరిని నమ్మాలో తెలియక.....  " అని చెప్పి అక్కడ నుండి వెళ్లి పోయింది.

విష్ణువర్ధన్ ఆలోచనలలో పడిపోయాడు.






















[+] 12 users Like 3sivaram's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)