Thread Rating:
  • 10 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జ్ఞాపకాలు
#21
కథ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(18-10-2024, 08:33 PM)రతి ప్రియ Wrote: ఈ కథలో విచ్చలవిడి శృంగారము, ఇన్సెస్ట్, బిడిఎస్ఎమ్, కగోల్డ్ మొదలైన రకాలవి రాయటం లేదు.

ఇది ఒక ఆడదాని కదా.
వయస్సు మళ్ళిన స్త్రీ కథ.
చనిపోయిన తన భర్తని గుర్తు చేసుకుంటూ వారు జ్ఞాపకాల కథ

జ్ఞాపకాల కథ

ఇదేంటి ముసలోళ్ళు అంటుంది, జ్ఞాపకాలు అంటుంది,  స్టఫ్ మాత్రం రాయడం లేదు అనుకోకండి. మొదటి కథ అసలు ఎలా రాస్తాను చూద్దాం అని ఈ సబ్జెక్ట్ ని ఎంపిక చేసుకున్నాను.

నా రాతలు తేలిక పార్టీ శృంగారం తోనే ఉండాలి అని నేను అనుకుంటున్నాను.


Not a new concept but not touched that often either.
Hope will do a good job in that.
Sultan Dr Love.da 
Shehensha Nanga-stan
fight
[+] 1 user Likes Dr Loveda's post
Like Reply
#23


జ్ఞాపకాలు 
Chapter 2 .1

Chapter title   :    శ్రావణంలో శిశిరం - 1


మొదటి శుక్రవారం

ఇలా కొన్ని రోజులు గడిచాయి....

శ్రావణమాసం మొదలైంది, మరో రెండు రోజుల్లో మొదటి శుక్రవారం.  అది కాక మధుకి స్వీటీకి పెళ్లయిన తర్వాత మా ఇంట్లో జరుపుకోబోతున్న మొదటి శ్రావణమాసం. ఈసారి కాస్త ఆర్భాటంగానే చేయాలి అని నిశ్చయించుకున్నాను. 

డైనింగ్ టేబుల్ మీద మధు అప్పటికే స్నానం చేసి ఆఫీస్ కి తయారై కూర్చుని ఫ్రిడ్జ్ లో నుండి ఏదో డబ్బా తీసుకొని గబగబా తింటున్నాడు. తలదువ్వుకోలేదు, గడ్డం మాసిపోయి, కళ్ళ కింద నల్లగాడార్క్ సర్కిల్స్,  కళ్ళు మొత్తం ఎర్రగా ఉన్నాయి. 'ఏంట్రా ఇది? ఆ గడ్డం గీసుకో. బట్టలు కనీసం ఇస్త్రీ చేసుకోకుండానే ఆఫీస్ కి వెళ్తావా? చూడు కళ్ళ కింద నల్లగా వస్తున్నాయి నిద్రపోవడం లేదా?" అని అడిగా.

"అదేమీ లేదమ్మా కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువైంది అంతే అన్నాడు"

ఇంత పొద్దున్నే స్వీటీ ఏమి వండిందా అని చూస్తే డబ్బాలో ఉన్నది పెరుగన్నం. 

"ఒరేయ్ నీకు చెప్పా కదా, ఈ శ్రావణమాసం స్వీటీ మన ఇంట్లోనే వ్రతం చేస్తుంది. ఎల్లుండి మొదటి శుక్రవారం ఆ పై శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. రెండింటికి నువ్వు ఇంట్లో ఉండాలి. వర్క్ అది ఇది అంటున్నావ్ ఈ వారం లేకపోయినా ఆ పై వారం నువ్వు కచ్చితంగా ఇంట్లో ఉండాలి. కావాలంటే సెలవు పెట్టు. అలాగే స్వీటీకి ఒక పది వేలు ఇచ్చి వెళ్ళు, అవసరానికి పనికొస్తాయి."

"సరే చూద్దాంలే అమ్మ, నువ్వు కండిషన్లు ఏమి పెట్టబాకు. స్వీటీకి ఆల్రెడీ మొన్న డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి" అని గబగబా వెళ్ళిపోయాడు. 

టైం చూస్తే 7:30, ఇంత పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటి అనుకొని. అసలు ఈ అమ్మాయి నిద్ర లేచిందా అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి చూశాను.  

ఎవర లేరు,  బాత్రూంలో కూడా లేదు. హాల్లో, వంట గదిలో, వరండాలో లేదు... పొద్దు పొద్దున్నే ఈ పిల్ల ఎక్కడికి వెళ్లిందా అని పెరట్లోకి వెళ్లి చూస్తే అక్కడ కూడా లేదు. పెరట్లో ఉన్న టాయిలెట్ నుండి సౌండ్ లు వినబడుతున్నాయి. ఏమిటా దగ్గరికి వెళ్తే సినిమా పాటలు...

"ఓ పిల్లగా, ఓ పిల్లగా, ఓ పిల్లగా వెంకటేశు, సూడక పోతుంటివో కానక పోతుంటివో... నా పిల్లగా వెంకటేశు..." అనే పాట. ఆ పాట అరా నిమిషం కూడా లేదు వేరే పాట, తర్వాత ఇంకేదో వచ్చింది. 

టాయిలెట్ లోకి ఫోన్ తీసుకెళ్లొద్దు అని వీళ్ళిద్దరినీ ఎప్పుడూ తిడతా, ఇది చూసేసరికి చిరాకు వచ్చి తలుపు మీద దబదబా బాది "నీకు టాయిలెట్ లోకి ఫోన్ తీసుకెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలి స్వీటీ, దొడ్లోకి వెళ్ళేటప్పుడు ఫోన్ చూడటం ఏంటే చండాలంగా" అని అరిచా. ఫోన్ ఆపేసి "వస్తున్న అత్త" అని అరిచింది. "సరే త్వరగా రా నీతో మాట్లాడాలి"అని చెప్పి వెళ్ళిపోయా. 

కాసేపటికి స్వీటీ మొహం కడుక్కొని జుట్టు ముడి వేసుకొని వంటగదికి వచ్చింది. నైట్ డ్రెస్ వేసుకుంది, మంచిగా నిద్రపోయినట్టుంది మొహం చాలా ఫ్రెష్ గా ఉంది. 

"ఇంద కాఫీ తాగు" అని కప్ చేతికిచ్చి "టాయిలెట్ లకి ఫోన్ తీసుకెళ్లాలని ఎలా అనిపిస్తుంది నీకు వాడికి? దొడ్డికెలుకుతుంటే ఆ వాసనలో ఎలా కూర్చుంటారు? ఆ ఫోను పావుగంట చూస్తారు ఈ లోపల ముడ్డి ఎండిపోతే? వీడెటూ మల విసర్జన చేయడం లేదు అనుక్ని మలం పొట్టలోకి లాగేసుకుంటుంది, కొన్నాళ్ళకి మలబద్ధకం వచ్చుద్ది. తప్పమ్మా అలా చేయకూడదు అనారోగ్యం" అని గడ్డి పెట్టాను

"ఛీ అత్తయ్య ఇంకా ఆపండి నేను తీసుకెళ్లానులే" "ఛీ ఏంటమ్మా? నువ్వు చేస్తే ఛి కాదు నేను చెప్తే ఛీ నా"

అని అనేసరికి "అత్తయ్య ప్లీజ్ ఆపండి" అని కప్పు పక్కనపెట్టి వచ్చిన కౌగిలించుకుంది.

తనను విడిపించుకుని దాని బుగ్గలు నొక్కి "పద హాల్లోకి" అని ఇద్దరం హాల్లో కూర్చుని అది కాపీ నేను టీ తాగడం మొదలుపెట్టాం. 

"అమ్మాయి మీ అమ్మ వాళ్లకి ఫోన్ చేయమని చెప్పాను చేశావ? వ్రతానికి రెండు రోజులు ముందే రమ్మని చెప్పమన్నాను చెప్పావా?" అని అడిగితే... 

"అత్తయ్య ఈ సంవత్సరం మన సింపుల్ గా చేసుకుందాం కదా" మధు కూడా కొంచెం వర్క్ టెన్షన్లో హడావిడిగా ఉన్నాడు అని అంది. 

"అదేంటే ఇప్పుడు ఇలా చెప్తున్నారు మొన్న అడిగితే సరే అన్నారు కదా?
మీకు పెళ్లి ఐ దాదాపు మూడున్నర ఏళ్లయింది. ఒక్క దఫా కూడా మన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేయలేదు. 
మొదటి సంవత్సరం మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఆషాడ మాసం వెళ్లి వ్రతం కూడా అక్కడే చేసుకోవచ్చావు. పద్ధతి ప్రకారం అది తప్పైనా, పెళ్లయిన కొత్త కదా అలవాటు అవ్వాలి లే అని నేను ఏమీ అనలేదు. 
రెండో సంవత్సరం మైలు వచ్చింది. మూడో సంవత్సరం మళ్లీ ఏదో పనిమీద మీ పుట్టింటికి వెళ్లావు. 
నాలుగు యేడు నడుస్తుంది ఎప్పుడన్నా చేయకపోతే ఎలా?"

"సరే అత్తయ్య నేను మధు తో చెప్పి ఒప్పిస్తాను"

"అంతగా ఇబ్బందిగా ఉంటే వరలక్ష్మీ వ్రతం ఒక్కటే కాస్త ఘనంగా చేసుకుందాము మంగళ గౌరీ వ్రతం ఈసారి ఎప్పుడన్నా పెట్టుకుందాం లే" అంటే సరే అంది. 

ఆ తరువాత రెండు రోజులు బూజు దులపటం ఇల్లు తుడవడ
 ఇత్తడి పాత్రలు కడగటం సామాన్లు తేవటం వీటితోనే సరిపోయాయి. 


మొదటి  శుక్రవారం రానే వచ్చింది. 

నేను పొద్దున్నే లెగిచి వీళ్ళిద్దరినీ లేపుదామని వాళ్ళ గదికి వెళ్లేసరికి వాళ్ళిద్దరూ నిద్రలేచి ఫ్రెష్ అప్ అవుతున్నారు. పనిమనిషి వచ్చి అంట్లు కడిగి వెళ్ళింది. పనులన్నీ టకటక ఐపొయయి. ఇవాళ కూడా మధు కి తీరలేదు అంట అందుకే మధు వెళ్లే లోపల సింపుల్గా పూజ పూర్తి చేద్దామని.  అమ్మాయిని స్నానం చేసి పట్టుచీర కొత్తది కట్టుకుని రమ్మని చెప్పి నేను స్నానం చేసి రెడీ అయి వచ్చాను.

నేను వచ్చేసరికి అమ్మాయి అందంగా రెడీ అయి ఉంది. మేకప్ ఏమి వేయలేదు కానీ ముఖంలో కళ బాగుంది. 

ఆకుపచ్చ రంగు పట్టు చీరవంగ పువ్వు రంగు బోర్డరు, చీర మొత్తం జరి చాలా బాగుంది. జాకెట్ మాత్రం స్లీవ్ లెస్ వేసింది. స్లీవ్ లెస్ అంటే స్లీవ్ లె స్ కూడా కాదు. భుజం మీదకి వచ్చేసరికి ఆ జాకెట్ వెడల్పు మహా అయితే ఒక సెంటీమీటర్ ఉంటుంది. షూ లేస్ లాగా. 

అది కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది కానీ... పూజకి వేయాల్సిన ఛీ బట్టలు లాగా లేవు. 

"స్వీటీ నువ్వు మీ ఆయనతో బయటికి వెళ్లడం లేదు, అమ్మవారికి పూజ చేస్తున్నావు. కాస్త సాంప్రదాయ బద్ధంగా కట్టుకో" అని అనేసరికి నా వైపు క్వస్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని చూసింది. 

పద్ధతిగా చీర కట్టుకుంటే ఇంకా సాంప్రదాయం అంటుంది ఏంటి అనుకుందో ఏమో... "పూజకి ఇలాంటి జాకెట్లు వేస్తే ఎలా అమ్మ అని తనకు అర్థం అయ్యేలా చెప్పాను"

"అత్త ఇది మధు కొన్నాడు, ఈ మోడల్ లో జాకెట్ కూడా తనే సెలెక్ట్ చేశాడు. కొంచెం సెక్సీ ్్్్్్. అని నాలుక కరుచుకొని స్టైల్ గా ఉంటుందని. వరలక్ష్మీ వ్రతానికి అని పక్కన పెట్టిన చీర తప్పితే ఇప్పుడు నా దగ్గర కొత్త పట్టు చీర ఏమీ లేదు". అని చెప్పింది. 

"సరేలే అమ్మాయి. ఈ దఫా ఇలాంటి పరిస్థితి వస్తే వేరే జాకెట్ వేసుకొని రాప్రస్తుతం ఎటు కట్టేసావు కాబట్టి పైట చెంగుతో భుజాలను కప్పుకో.

అని చెప్పి 7:30AM అయ్యే లోపే పూజ ముగించాం. అంతా అయ్యాక నా కాళ్ళకి దండం పెట్టుకో పోతుంటే, వద్దమ్మాయ్ ఆగు ముందు వెళ్లి మధు కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. తర్వాత గుడికి వెళ్లి రా ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పి పంపించాను. 

తను అలాగే చేసి గుడికి వెళ్ళటానికి జాకెట్ మార్చుకుంటుంది.

మధు గాడు ఏదో తతంగం పూర్తి చేసినట్టు తన మీద నాలుగు అక్షింతలు వేసి ఆ పెరుగన్నం తినేసి ఆఫీస్ కి రెడీ అవుతున్నాడు. 

బయలుదేరి పోతుంటే పిలిచి "అమ్మాయి పొద్దున్నే లేచి పూజ చేసి నీకోసం అంత అందంగా రెడీ అయింది. నాకే ముద్దొస్తుంది. దాని దగ్గరికి వెళ్లి నీ చీర బాగుందని అని ఒక్క మాట కూడా చెప్పలనిపించలేదా? ఇలాంతివి ఎవ్వరూ చెప్పరు రా! నువ్వే అర్థం చేసుకోవాలి." అంటే వాడికి ఏమనిపించిందో ఏమో స్వీటీ ఉన్న గదిలోకి వెళ్లి ఒక పది నిమిషాలు ఆగి తిరిగి వెళ్ళాడు. 

ఏం చేసి ఉంటాడబ్బా అని ఆలోచన వచ్చి, చి చి పండగ రోజు ఏంటి పాడు ఆలోచనలు అని నాలో నేనే అనుకుని లెంపలు వేసుకున్నను. 


చీరలో ఫొటో 


గుడి నుండి వచ్చిన తర్వాత తన చీర మార్చుకోబోతుంటే "అమ్మాయి ఒక్క నిమిషం ఆగు , ఈ లోపల పొద్దున వేసుకున్నావు కదా ఆ జాకెట్ వేసుకో. కుదిరితే ఒకసారి మొహం కడుక్కొని మళ్లీ బొట్టు పెట్టుకో. జాకెట్ మీద చీర మీద నీళ్లు పడతాయేమో టవల్ కప్పుకొని కడుక్కో" అని చెప్పి చిన్ను గాడి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 

చిన్ను గాడు మా వీధిలో పిల్లోడు. రెండిళ్ళ పక్కన ఉంటాడు, చాలా ఫాస్ట్. ఈ ఫోన్లో అందులో గేములు, యూట్యూబ్లు ఇవన్నీ వాడికి కొట్టిన పిండి అంట" వాడిని పట్టుకుని వచ్చాను. 

నేను వచ్చేసరికి అమ్మాయి రెడీగా కూర్చుంది. 

"ఒరేయ్ చిన్ను, అక్క నీ ఫోటో తీయరా ఒకటి. ఇదిగో ఈ ఫోన్లో అని చెప్పి స్వీటీ ఐఫోన్ ఇచ్చాను".

"అత్త మీ దగ్గర ఐఫోన్ ఉందా అత్త" అని అడిగితే నాది కాదు అక్కది అని చెప్పాను. వాడు ఫోన్ అంత అటు ఇటు తిప్పి చూసి లోపల కూడా ఏవేవో చూసి "మా డాడీ నేను టెన్త్ పాస్ అయితే ఐఫోన్ కొనిపెడతా అని చెప్పారు తెలుసా" అని సంతోషం గా అన్నాడు. 

"నువ్వు చదివేది ఇంకా ఎయిత్ క్లాస్ ఏ కదరా" అని నవ్వింది స్వీటీ

అక్క లైటింగ్ సరిగ్గా పడతలేదు, ఇంటి ముందుకు రా అని చెప్పి ఇంటి ముందు మంచి లైటింగ్ లో ఫోటో తీశాడు. 
కొంచెం నవ్వక అని చెప్పి అమ్మాయి ముఖం నుండి నడుము వరకు కనపడేలాగా ఒక ఫోటో తీశాడు. "అక్క నువ్వు సూపర్ ఉన్నావ్ అక్క, అచ్చం నేహా రావుల ఉన్నావ్" అన్నాడు. 

"నేహా రావుానా? తను మన సినిమాల్లో కూడా యాక్ట్ చేయదు కదరా. నీకెలా తెలుసు? ఎప్పుడో నా చిన్నప్పుడు చిరుత సినిమాలో వచ్చింది." అని స్వీటీ అడిగితే వాడు నవ్వి ఫోన్ చేతిలో పెట్టి బాయ్ అత్త అని చెప్పి వెళ్తున్నాడు. 

వాడు వెళ్ళాక నేహా రావు ఎవరమ్మాయ్ అంటే ఫోన్ ఓపెన్ చేసి చూపించింది. నాకు అప్పుడు అర్థం అయింది తెల్లగా బుగ్గలు మెత్తగా ఉన్నాయి కదా అందుకని అలా అనిపించినట్టుంది. పైగా స్లీవ్ లెస్ లో కొంచెం గ్లామర్ గా ఉంది కదా వాడికి అలా అనిపించినట్టు ఉంది అని అనుకున్నా. 



బాత్రూం లో గంటలు గంటలు


సాయంత్రం భోజనం పెడుతుందేమో అడుగుదామని వెళ్లాను తను బాత్రూంలో ఉంది, సరే తనని అడగటం ఎందుకులే అని నేనే పెట్టుకుని తినేసాను. మళ్లీ వెళ్లి చూస్తే ఇంకా రాలేదు. ఒక పది నిమిషాలకి బాత్రూంలో నుండి బెడ్ రూమ్లోకి వచ్చింది. 

స్నానం ఐతే చేయలేదు, టాయిలెట్ కి వెళ్లి ఉంటుందేమో అనుకున్నా. ఇంతలోకి తను హాల్లోకి వచ్చి phone చార్జింగ్ పెడుతుంది.  అంటే ఈ అమ్మాయి బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్ళది. మరి సౌండ్ ఎందుకు రాలేదు? నాకు అర్థం కాలేదు. 

మరుసటి రోజు పొద్దున కూడా ఇలాగే జరిగింది. ఈసారి కనీసం టాయిలెట్ లో నుండి నీళ్ల శబ్దం కూడా రాదా రాలేదు. పైగా మనిషి మొత్తం చమట్లతో నిండిపోయింది. 

నాకు విషయం అర్థమైంది. 

అప్పుడు గుర్తొచ్చింది....   మధుగాఊ స్వీటీ, ఇద్దరూ  దాదాపు ఒక పది రోజులుగా ఇలాగే బాత్రూంలోకి వెళ్లి వస్తూ ఉన్నారు. అయినా మొగుడు పెళ్ళాలు పక్కపక్కనే ఉంటే బాత్రూంలోకి వెళ్లి ఎవరికి వాళ్లు హస్త ప్రయోగం చేసుకోవాల్సిన కర్మ ఏంటి? కొంపదీసి వెళ్లు గొడవపడ్డారా? అని అనుమానం వచ్చింది. 

ఉండపట్టలేక స్వీటీని అదిగేశ నువ్వు మధు ఏమన్న గొడవ పడ్డారా అని. . ఎందుకు అలా అడుగుతున్నారు అత్త అని అడిగితే. ఏం లేదు ఎందుకో అనుమానం వచ్చి అడిగాను అన్నాను. 

అలాంటిదేమీ లేదని చెప్పి వెళ్ళింది. గమనిస్తే వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు. 

మధు ఇబ్బంది

శని ఆదివారాలు కూడా వాడు లాప్టాప్ పట్టుకొని కదల్లేదు. 
ఫోనులో మాట్లాడుతున్నాడు తెగ కంగారు పడుతున్నాడు. 
ఒకరోజు వాళ్ళిద్దరూ తలపేసుకొని రెండు గంటల దాకా బయటికి రాలేదు. ఏదో సీరియస్ మాట్లాడుతున్నాడు. 

మరునాడు ఏంటి విషయం అంటే, వాళ్ల ఆఫీసులో ఉద్యోగస్తుల సంఖ్య తగ్గించాలని మేనేజ్మెంట్ అనుకుంటుందంట గత నెలలో 50 మందిని తీసేసారంట. పోయిన వారం వీళ్ళ మేనేజర్ ని కూడా తీసేసారంట. ఇప్పుడొచ్చిన కొత్త మేనేజర్ మరి స్ట్రిక్ట్ గా ఉన్నాడంట. ప్రతిరోజు వీడిని ఏదో ఒకటి అంటున్నాడంట. వీడి ఉద్యోగం కూడా ఎక్కడ పోతుందో అని భయపడుతున్నాడు. 

నాకు చాలా దిగులు వేసింది. కొడుకు ఎంత టెన్షన్లో ఉంటే నేనేమో వ్రతము వల్లకాడు అని ఇబ్బంది పెడుతున్నాను. 
బహుశా ఇందుకేనేమో వాడిని వాళ్ళకి మూడ్ లేక బాత్రూం లో చేసుకుంటున్నది. 
అమ్మాయిని పిలిచి వాడిని ఏమి టెన్షన్ పడొద్దు అని చెప్పమ్మా. వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయిలే వాడికి ధైర్యం చెప్పు అని అమ్మాయికి ధైర్యం చెప్పి పంపించాను. 

ఆయన కూడా ఇంతే చిన్న చిన్న విషయాలకి చాలా టెన్షన్ పడుతారు. అయినా ఆ ఉద్యోగం చేసే వాళ్లకు తెలుస్తుంది ఆ టెన్షన్ ఏంటో. ఇంట్లో కూర్చొని వంట వండుకునే వాళ్ళం మనకు అర్థం కాదులే అనుకొని సరిపెట్టుకున్నాను. 

బుధవారం బాధ

అప్పుడే బుధవారం వచ్చేసింది. రేపు కాక ఎల్లుండే శుక్రవారం.. నాకు కళ్ళు చేతులు ఆడటం లేదు, 
ఇంటి నిండా పని. బంధువులందరికీ రెండు రోజులు ముందే రమ్మని చెప్పాను. 
వీడేమో అందుబాటులో ఉండటం లేదు పైగా దేవదాసు లాగా గడ్డాలు మీసాలు పెంచి చాలా అధ్వానంగా ఉన్నాడు.

పొద్దున్నే వాడు నాకన్నా ముందు లేచాడు. లేచి బయట నుండి వస్తున్నాడు. లేచు పాలు తెచ్చి, ఇల్లు ఊడ్చి, టిఫిన్ వండీ, తిని స్నానం చేసి మళ్లీ లాప్టాప్ ముందు పడ్డాడు. వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను మాట్లాడలేదు ఒక గంట ఆగి చూస్తే మంచం మీద పడుకుని కనబడ్డాడు.

మూడు గంటలు ఆ ప్రాంతంలో లేచి టైం చూసుకుని కంగారుగా ఆఫీస్ కి బయలుదేరాడు. ఖాళీ కడుపుతో ఎండన పడిపోతున్నావు ఏమన్నా తినరా అంటే టైం లేదని పరిగెత్తాడు. వాడిని అలా చూస్తుంటే నా దిగులు పెరిగిపోతుంది.

ఇంతలో నా ఫోన్ మోగింది... చూస్తే మా ఆడపడుచు. "వదిన, మేము ఇవాళ రాలేము వదిన ఆ విషయమై చెప్పడానికి ఫోన్ చేశాను. సడన్గా ఇవాళ పొద్దున బయలుదేరే టైం కి రైల్వే స్టేషన్ రోడ్డులో మన పొలం ఉంది కదా అక్కడ పాలేరు వచ్చి మన పక్క పొలం వాళ్ళు కొలతలు వేస్తున్నారు రాళ్లు పీకుతారేమో అని వచ్చాడు. ఆ విషయం తెలియటంతోనే ఈయన గబగబా బయలుదేరాడు. ఇదిగో ఇంకా రాలేదు. పని అయిపోతే రేపు పొద్దున్నే బయలుదేరి సాయంత్రం కల్లా వచ్చేస్తాను. ఏ విషయం రేపు చెప్తాను వదిన ఏమనుకోబాక" అని చెప్పింది.

నేను కూడా ఇది కూడా ఒకందుకు మంచిదేలే, ఈ టైంలో వాళ్లు రావడం మా పరిస్థితి చూడటం నాకు పెద్దగా ఇష్టం లేదు. వీడి బాధ కన్నా వాళ్ళు వచ్చి పెట్టే బాధ ఎక్కువ.

స్వీటీ వచ్చి"ఎవరు అత్త? ఫోన్లో మాట్లాడింది" అని అడిగింది. "కారుణ్య పిన్ని వాళ్ళే..  ఇవాళ రారంట రేపు పొద్దున బయలుదేరుతారు అంట."

"అసలు రాకపోతే బాగుండత్తా, మూడ్ ఆఫ్ చేసి వెళ్తారు"  అని అనింది.   ఆళ్ళు ఎంత పనికిమాలినోళ్లు కాకపోతే, నిన్న కాక మొన్న వచ్చిన స్వీటీ కి కూడా ఇంత లోకువైపోతారు. అది , అది మా ఆడపడుచు గారి ట్రాక్ రికార్డ్.

"అన్నట్టు అత్తయ్య చెప్పటం మర్చిపోయాను మా బావ అక్క పూజ రోజు పొద్దున ఎక్కడ ఉంటారంట. తమ్ముడు అమ్మ నాన్న రేపు పొద్దున్నే వస్తారంట" అని చెప్పింది స్వీటీ.

సరే అని ఊరుకున్నాను. మధ్యాహ్నం పరిగెత్తుకుంటూ వెళ్లిన మధు, సాయంత్రం ఐదు ఇంటికి వెనక్కి వచ్చాడు. వచ్చి ఎవరితో మాట్లాడకుండా తలుపు వేసుకొని లోపలకి వెళ్లిపోయాడు. తలుపు కొట్టి ఏంట్రా అంటే ఏమీ లేదు అన్నాడూ.

స్వీటీ అడిగి చూసింది నేను అడిగాను ఎవరు ఏమి అడిగినా ఏమీ లేదు అంటున్నాడు. కాస్త పడుకుంటే స్తిమిత పడతావు పడుకో నాన్న అని చెప్పాను.
టైం 11:30 PM అవుతుంది రాత్రి మళ్లీ తలుపు కొడితే ఈసారి తీశాడు, దుఃఖం పొంగుకొస్తుంది, స్వీటీ మాట్లాడం అంటే దాన్ని చూసి ఏమీ లేదే, ఏమీ లేదు, అని అంటూ పట్టుకొని వీపు మీద రెండు సార్లు సవరించి లేచి వస్తుంటే...

 నేను వెళ్లి అడిగాను. మళ్లీ ఏమీలేదు, ఏమీలేదు అని నేను కూర్చోబెట్టి బుజ్జగించి అడిగితే ఇంకా ఆపుకోలేక నన్ను పట్టుకుని ఏడ్చేసాడు.

"ఏంటి నాన్న ఏమైంది చెప్పు.   కొత్తగా వచ్చిన మేనేజర్ వీడీ ఆత వర్ఖ్స్ అన్ని మల్లీ చెక్ చేయిస్తున్నడూ అంట, సంవత్సరం పాత వర్క్స్ ని కూడ పరిశీలిస్తున్నరు అంట. తప్పులన్ని చిట్టా రాసి చివరికి ఇవాల ఉద్యోగం నుండీ పీకేశారంట

"నా తప్పేమీ లేదమ్మా, నాకు ఎలా చెప్పారో అలాగే చేశాను మా మేనేజర్ ఎలా చెప్పాడో అలాగే చేశాను. వాడెల్లిపోయి నేను ఇరుక్కుపోయాను అమ్మ. నా తప్పేమీ లేదమ్మా మా పాత మేనేజర్ నీకు కూడా తీసుకువచ్చారు ఆయన కూడా చెప్పాడు వీడు ఎప్పుడు బాగానే చేస్తాడని. అయినా పట్టించుకోలేదమ్మా"

అని బాధతో గంటసేపు వాడి గోడు చెప్పుకున్నాడు. స్వీటీ కూడా వీడీ ఏడుపు చూసి తట్టుకోలేక తను బాధపడి కన్నీరు కార్చింది. ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకుంటూ ఒక గంట సేపు వాళ్ళని సముదాయించిన తర్వాత ఏడుపాపారు.

"మధు నువ్వు ఇంత బేల వాడివి అనుకోలేదు రా. ఉద్యోగం పోయిందని ఏడుస్తున్నావా?"

"20  25 ఏళ్ల కుర్రాడినయితే ఉద్యోగం వెతకడం తేలికమ్మ. 35 ఏళ్ల టైములో ఇంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ తో ఉద్యోగం ఎక్కడ వస్తుందమ్మా.
ఇంక నేనెందుకు పనికిరానమ్మ.      నా నాకు మంచి ఉద్యోగం ఇంకా రాదు.     కనీసం గుమస్తూ ఉద్యోగం కూడా ఎవరు ఇవ్వరు. "
అని బాధపడుతుంటే

"ఛీ ఆపరా, అక్కడ కష్టం నీకొక్కడీకే వచ్చినట్టు ఫీలవుతున్నావ్ మిగిలిన వాళ్ళందరినీ పీకేసారు కదా?
ఉద్యోగానికి వెళ్తే అడిగినప్పుడు ఇదే చెప్పు. 
దేశంలో వీడొక్కడే ఉన్నాడా ఏంటి ఉద్యోగ ఇవడానికి 
పిరికి మాటలు మాట్లాడకురా. వింటానికే చాలా చిరాకుగా ఉంది తెలుసా"

"ఆడు ఉద్యోగం పీకేస్తే ఆడి కాళ్లు పట్టుకోవాల్సిన పని ఏంట్రా? 
మనకేం తక్కువ నాన్న? 
అమ్మవారి దయ వల్ల మనకి మనం ఇబ్బంది పడటానికి ఏమీ లేదు. 
ఇంకా ఉద్యోగం మళ్ళీ రాదు అనే భయం వద్దు ఒకవేళ రాకపోయినా వ్యాపారం చేసుకోని బతకచ్చు"
వ్యాపారం కాకపోతే వ్యవసాయం అదే కాకపోతే ఇంకోటి. 
అసలు ఇన్ని మాటలు ఎందుకు నాలుగు నెలలు ఆగితే నీకే ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చింది ధైర్యం కోల్పోకు" అని కాస్త ధైర్యం చెప్తే కాస్త కోరుకున్నాడు.

ఇక నా దృష్టి స్వీటీ వైపుకు మళ్ళించి దాన్ని చివాట్లు పెట్టి వదిలిపెట్ట. 

"నువ్వేంటే ఏడుస్తూ వాడి పక్కన కూర్చున్నావ్ ? 
వాడికి ధైర్యం చెప్పమని పంపిస్తే నువ్వు చేసిన నిర్వాకం ఇదా? 
నీ ఏడిపు  చూడటంతో వాడికి ఉన్న ధైర్యం కూడా చచ్చిపోయినట్టుంది. 
ఇంకోసారి వాడు బాధపడుతున్నప్పుడు నువ్వు ఏడ్చావో కాళ్లు విరగ్గొడతా. 
సిగ్గు లేదు? 
పెళ్ళాం అయ్యుండి ధైర్యం ఇవ్వాల్సింది బదులు ఏడుస్తావా?  
తెలివితేటలన్నీమామూలప్పుడేనా?? "


స్వీటీకి ధైర్యం వచ్చింది కానీ ఏం చెప్పాలో అర్థం కాక గుడ్లు మిటకరించుకొని చూస్తుంది.

సరే మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం కానీ, ఏదైనా తిను. 
ఇద్దరూ హాయిగా తినండి, 
ఒక వారం రోజుల సెలవు తీసుకుని ఎక్కడికన్నా వెళ్లి రండి. 
బాగా ఎంజాయ్ చేయండి. 
ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నాకు ఒక మనవడినో మనవరాలునో కానిచ్చే పనిలో ఉండండి.

ఈ మాటనేసరికి స్వీటీ ముఖంలో సిగ్గు దొంతర్లు చుట్టింది. 
వీడు కూడా సిగ్గుపడి లోపలికి వెళ్లారు...




ఇకా ఉంది
Like Reply
#24
(20-10-2024, 02:06 AM)రతి ప్రియ Wrote:

జ్ఞాపకాలు 
Chapter 2 .1

Chapter title   :    శ్రావణంలో శిశిరం - 1



ఈ మాటనేసరికి స్వీటీ ముఖంలో సిగ్గు దొంతర్లు చుట్టింది. 
వీడు కూడా సిగ్గుపడి లోపలికి వెళ్లారు...




ఇకా ఉంది

Story is nice, Ratipriya garu!!!

clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#25
(20-10-2024, 04:22 AM)TheCaptain1983 Wrote: Story is nice, Ratipriya garu!!!

clps clps
Smile Smile ఓపికగా చదివి చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ అండి Smile Smile
[+] 1 user Likes రతి ప్రియ's post
Like Reply
#26
అంతేలేండి.. జీవితం అంటే సరదాలూ, సరసాలేనా.. ఇబ్బందులూ, బాధలు కూడా ఉంటాయ్.. పెద్దావిడ మాత్రం సూపర్ అండీ..  Heart  thanks

( బాత్రూమ్ లో ఏం చేసొస్తున్నారో చెప్పొచ్చుగా..  Smile )
[+] 1 user Likes DasuLucky's post
Like Reply
#27
(20-10-2024, 01:22 PM)DasuLucky Wrote: అంతేలేండి.. జీవితం అంటే సరదాలూ, సరసాలేనా.. ఇబ్బందులూ, బాధలు కూడా ఉంటాయ్.. పెద్దావిడ మాత్రం సూపర్ అండీ..  Heart  thanks

( బాత్రూమ్ లో ఏం చేసొస్తున్నారో చెప్పొచ్చుగా..  Smile )
అంటే ఇది పెద్దవిడ దృష్టి కోణం నుండి రాసింది...
తన కంటికి కనిపించింది తను చేసింది మాత్రమే చెప్పొద్దు. 


పైగా బాగా ట్రెడిషనల్ సిగ్గు చెప్పేటందుకు ఆవిడకి రాసేందుకు నేను  Tongue
[+] 2 users Like రతి ప్రియ's post
Like Reply
#28
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#29
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
#30
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#31
(20-10-2024, 02:27 PM)BR0304 Wrote: Nice update

(20-10-2024, 02:37 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది

(20-10-2024, 02:39 PM)Iron man 0206 Wrote: Nice update

Thank you all
[+] 1 user Likes రతి ప్రియ's post
Like Reply
#32
Sweety in her spaghetti blouse and green saree.
      Priya   Heart 
 (Rathi Priya)
[+] 2 users Like Rathi Priya's post
Like Reply
#33
చాలా బాగా అంటే మనసుకు హాయినిచ్చే విధంగా కొనసాగుతోంది మీ కధనం. 
అందుకే అంటారు ఇంట్లో పెద్ద వాళ్ళు కూడా వుండాలని, ఇటువంటి ఎన్ని ఆటుపోట్లు చూసుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి తొందరే. 
అన్నట్లు మా ఇంట్లో నేను కూడా చివాట్లు తినితిని (అదేనండి ఫోన్ తో బాత్రూం కెళ్తున్నానని) ఇప్పుడు మన ఇండియన్ స్టైల్ బాత్రూం కి మారిపోయా, దీంట్లో ఫోన్ పట్టుకుని కూర్చోవడానికి ఇబ్బందొకటి, చేయి జారితే ఇక అంటే ఆ అలవాటు మానుకున్నా. 

పోతే అత్త వైపునుంచేనా కథ అంతా, స్వీటీ తరపున ఏం లేదా?...కొనసాగించండి. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
#34
(21-10-2024, 01:24 PM)Uday Wrote: చాలా బాగా అంటే మనసుకు హాయినిచ్చే విధంగా కొనసాగుతోంది మీ కధనం. 
అందుకే అంటారు ఇంట్లో పెద్ద వాళ్ళు కూడా వుండాలని, ఇటువంటి ఎన్ని ఆటుపోట్లు చూసుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి తొందరే. 
అన్నట్లు మా ఇంట్లో నేను కూడా చివాట్లు తినితిని (అదేనండి ఫోన్ తో బాత్రూం కెళ్తున్నానని) ఇప్పుడు మన ఇండియన్ స్టైల్ బాత్రూం కి మారిపోయా, దీంట్లో ఫోన్ పట్టుకుని కూర్చోవడానికి ఇబ్బందొకటి, చేయి జారితే ఇక అంటే ఆ అలవాటు మానుకున్నా. 

పోతే అత్త వైపునుంచేనా కథ అంతా, స్వీటీ తరపున ఏం లేదా?...కొనసాగించండి. 

నా మనసులో ఉన్న భావాన్ని కరెక్ట్ గా పట్టుకున్నారు మీరు. 
ముసలి వాళ్ళ అంటే పండిపోయిన వాళ్ళు. 
వాళ్లకి మన సమస్యలు తెలియకపోవచ్చు కానీ పరిస్థితిలో అర్థం చేసుకోగలరు. 

ఇండియన్ బాత్రూంలో కూడా వాడతారండి . ఫోను వాడాలి అనే సంకల్పం ఉండాలి కానీ, ఏ పరిస్థితిలో అయినా వాడగలరు  Smile

అవునండి ఈ కథ పూర్తిగా అత్త దే. అత్త చెప్తున్నా కదా 
ఇంకా చెప్పాలంటే అత్త జీవిస్తున్న కదా. 

దీని తర్వాత ఎపిసోడ్ క చాలా పెద్ద అప్డేట్ ప్రిపేర్ చేశాను. అందులో పాఠకులు కోరుకుంటున్న శృంగారం మోతాదు సరిపోవటం లేదు. భావోద్వేగాలు ఇంటి వర్ణనలు చదువుతారో లేదో అని ఆలోచిస్తున్నా.

నిజానికి ఇది నా మొదటి కథ. ట్రయల్ వేద్దాము అని ఇలా రాశాను. ఇది జీవితం లాంటిది ఒక ముగింపు ఉండదు. కాబట్టి ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు ఆపవచ్చు. 
అసలైన కదా బేస్ స్టోరీ రెడీ చేసుకుంటున్నాను. కాబట్టి ఏమి రాయాలి ఎలా రాయాలి అనే సందిగ్ధంలో ఉన్న 

మీరన్నట్టు స్వీటీ దృక్కోణం నుండి రాస్తే బాగుంటుంది కానీ, అది వేరే కదా అయిపోతుంది. కుదిరితే వేరే థ్రెడ్ లో స్వీటీ దృక్కోణం నుంచి మొదలు పెడతాను.
[+] 4 users Like రతి ప్రియ's post
Like Reply
#35
Testing
      Priya   Heart 
 (Rathi Priya)
[+] 2 users Like Rathi Priya's post
Like Reply
#36
నేను కథకి సంబంధించిన ఫోటోలు పెడదామని ప్రయత్నిస్తుంది నా అకౌంట్ బ్యాన్ అవుతుంది.

దయచేసి ఎవరైనా ఫోటోలు పెట్టటానికి సరైన పద్ధతి తెలియజేయండి.
      Priya   Heart 
 (Rathi Priya)
[+] 2 users Like Rathi Priya's post
Like Reply
#37
Sweety green saree

[Image: IMG-20241021-212240.jpg]
screenshot link
      Priya   Heart 
 (Rathi Priya)
[+] 3 users Like Rathi Priya's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)