04-10-2024, 01:55 PM
(04-10-2024, 08:57 AM)opendoor Wrote: బ్రో .. కృష్ణ నగర్ లో వేల కొద్దీ స్క్రిప్ట్స్ , స్టోరీస్ పట్టుకుని ఎంతో మంది తిరుగుతుంటారు .. సినిమా తీసేదానికి స్టోరీ ఒక్కటే ముఖ్యం కాదు .. అసలు స్టోరీ కూడా లేకుండా సినిమాలు వెబ్ సిరీస్ లు తీయొచ్చు ..
మనం రాసింది కేవలం మన బుర్రలోంచే వచ్చిన ఆలోచన , ప్రపంచంలో ఇంకెవ్వడికి ఇలాంటి ఐడియా రాలేదు అని అనుకోవడం మూర్ఖత్వం ..
మనకి నచ్చింది .. మనకి తోచింది .. రాసుకు పోవడమే .. నచ్చితే చదువుతారు .. లేదంటే లేదు ..
సినిమాలకి ఇది సరిపోదు, ఆ template తెలుసు నాకు. కాని కొన్ని ఎపిసోడ్స్ తీయగలిగే కథలు ఫోరంలో చాలా ఉన్నాయి. నావే ఉన్నాయి. నా కథలనే ఎలా పెంచాలో, ఎలా కుదించాలో నాకు తెలుసు. ఎవరికి వాళ్లకి తెలుసు.
రోజు టీవీల్లో వచ్చే కొన్ని సీరియల్స్ కొన్ని క్షణాలు కంటికి కనిపిస్తేనే, అవి ఎంతటి భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నాయో అర్ధమవుతోంది. ఇది బహుశా ఇక్కడి రచయితలకి కూడా అనిపించే ఉంటుంది.
అలానే మనకి మాత్రమే ఒక ఆలోచన వచ్చింది, ఇంకెవరికీ ఈ ఆలోచన రాదు అన్నది సైన్స్ కి నప్పదు. Great minds think alike.
ఇది ఆర్ట్స్ కి నప్పుతుంది. ఎందుకంటే ఆర్ట్ అంటే సృజనాత్మకత. ఎవరి ఊహ వారిది, ఎవరి సృష్టి వారిది. Each mind is unique. నేనే ఒకే కధని రెండు మూడు రకాలుగా రాయగలను, మొదలుపెట్టింది ఏ రూపం తీసుకుంటుందో నాకే తెలీదు. అలానే art is subjective, science is universal.
జరిగే అవకాశం ఉంది కాబట్టే అడిగాను. జరిగితే నేను అడిగాను అని గుర్తొస్తుంది, చూద్దాం.