Thread Rating:
  • 41 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఆట - వేట (అయిపోయింది)
#21
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Nice update
Like Reply
#23
Nice super update శివరాం గారూ మీరు కథ చెప్పటంలో అదేనండీ కథ రాయటం లో చాలా బాగా నచ్చింది చాలా వివరంగా అర్దం అయ్యేలా రాయటం. ఎపిసోడ్ ఎపిసోడ్ కీ పైన టైలిల్ పెట్టడం సూపర్ శివరాం గారూ
[+] 1 user Likes hijames's post
Like Reply
#24
ఆన్లైన్లో హ్యాకింగ్ నుంచి ఒక్కసారిగా పరకాయ ప్రవేశానికి తీసుకెళ్ళి మీరు రాస్తున్న కథ, మీ క్రియేటివిటీ సూపర్బ్....కొనసాగించండి శివరాం బ్రో
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#25
సూపర్ బ్రో
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#26
స్టోరీ లైన్ బాగుంది, అపరాధ పరిశోధన లాగా.
[+] 1 user Likes Fantassy Master's post
Like Reply
#27
(01-10-2024, 12:03 PM)Uday Wrote: ఆన్లైన్లో హ్యాకింగ్ నుంచి ఒక్కసారిగా పరకాయ ప్రవేశానికి తీసుకెళ్ళి మీరు రాస్తున్న కథ, మీ క్రియేటివిటీ సూపర్బ్....కొనసాగించండి శివరాం బ్రో

Iex  Iex  Iex
[+] 4 users Like 3sivaram's post
Like Reply
#28
Etla vastay andi intha manchi ideas..hatsofff
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#29
5. బంటి







నా కొత్త రూమ్ లో ఉన్న కొత్తగా కొన్న మంచం పై పడుకొని డిజైనర్ చేత చేయించబడ్డ రూమ్ ని చూస్తూ కూడా నా ఆలోచనలలో నేను ఉన్నాను.

సుజాత మేడం చెప్పిన మాటలు కూడా నన్ను ఆకట్టుకోలేకపోతున్నాయి.

నాకు వస్తున్నా ఆలోచన అల్లా ఒక్కటే.... ఎవరు?

బహుశా మర్చిపోయిన నా మెమరీలో ఆ పేరు ఉందా...

ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా కనిపిస్తున్న లాప్ టాప్ ని చూసి ఓపెన్ చేశాను.

ఎక్కడ ఏం వెతకాలో కూడా నాకు అర్ధం కావడం లేదు. హిస్టరీ కూడా క్లియర్ గా ఉంది. కొత్త లాప్ టాప్ లా ఉంది అసలు...

షట్ డౌన్ చేసి పక్కన పెట్టాను. ఫోన్ ఓపెన్ చేసి చూసినా సేం.... అంతా క్లియర్ చేసి ఉంది. బహుశా ఇవి కూడా గతం మర్చిపోయాయా.....

నా సోషల్ మీడియా హ్యాండిల్స్ సంగతి ఏంటి? మెయిల్ ఓపెన్ చేసినా నాకు గుర్తు రావడం లేదు. ఆఫీస్ సిస్టం ముందు కూర్చుంటే అన్ని ఆటోమేటిక్ గా వచ్చేశాయి.

నా చేతులు నా మాట వినకుండానే పాస్వర్డ్ నోక్కేసాయి. దీని అంతటికి ఒకటే సమాధానం, ఇవి నావి కావు.....

ఆలోచించ డానికి ప్రయత్నించి తల నొప్పి తెచ్చుకొని అలానే పడుకొని నిద్ర పోయాను.

పొద్దున్నే నిద్ర లేచాక ఆఫీస్ కి బయలు దేరే సమయంలో బంటి అనే వ్యక్తీ కారు డ్రైవర్ తో పాటు వచ్చాడు.

అతన్ని చూస్తూ ఉంటే ఎదో గుర్తుకు వస్తుంది. కాని నా వల్ల కావడం లేదు.

బంటి "నా పేరు బంటి మేడం... ఇక నుండి నేను మీ అసిస్టెంట్ ని...." అని నవ్వాడు.

నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు, నేను ముందే తెలుసా... నాకు ఈ ఫ్యామిలీ కాక ఫ్రెండ్స్ ఎవరూ లేరా! వాళ్ళు ఎవరు? ఎక్కడ ఉన్నారు? ఎలా కలవాలి?

బంటి నన్నే చూస్తూ నోటికి చేతిని అడ్డం పెట్టుకొని నవ్వుతున్నాడు.

వాణి "ఎందుకు నవ్వుతున్నావ్?"

బంటి "ఏం లేదు మేడం"

వాణి "ఆఫీస్ కి వెళ్దాం పదా...."

బంటి "ఇవి ఏంటి? మేడం...."

వాణి "అంత ఆత్రం ఎందుకు చెబుతాను కదా.... దారిలో చెబుతాను పదా..."





కారులో

వాణి "బంటి.... ఈ ఫోన్, ఈ లాప్ టాప్..... డాటా అంతా ఫార్మాట్ అయింది... రికవర్ చేయించగలవా...."

బంటి "నేను చేస్తా మేడం..."

వాణి "ఎవరైనా ప్రొఫెషనల్ చేత చేయించు...."

బంటి "నేను ప్రొఫెషనల్ నే మేడం...."

వాణి, అతన్ని పైకి కిందకు చూస్తూ... "అచ్చా.... నువ్వు ప్రొఫెషనల్ వా...."

బంటి "అవునూ మేడం... కావాలంటే మీ ఇంట్లో ఉండే cc కెమెరాలు హ్యాక్ చేసి మీరు ఎప్పుడూ కావాలంటే అప్పుడు మీ ఫోన్ లో చూసుకునేలా ఏర్పాటు చేయనా...."

వాణికి ఒక్క సారి మైండ్ బ్లాక్ అయింది...

వాణి "వాట్...."

బంటి ఎదో చెప్పుకుంటూ పోతున్నాడు.

వాణి "ఏయ్... ఆపూ.... వీటిని చేయించి..... ఆఫీస్ లో కనపడు...."

బంటి నవ్వేసి "అలాగే భయ్యా.... ఛీ అలాగే మేడం" అంటాడు.

వాణి ఇబ్బందిగా చూస్తూ కారు దిగి ఆఫీస్ లోకి వెళ్తుంది.




సుజాత "మీ వదినలో ఉన్న మీ అన్న ఏం చెప్పాడు.... సిగ్గు పడుతున్నాడా!" అంటూ నవ్వుతుంది.

బంటి నవ్వేసి "అసలు ఆ నడక చూడు ఎదో పొడిచేసినట్టు నడుస్తాడు... వీడియో తీసి రేపు వదినకు చూపిస్తే చీల్చి చండాడుద్ది"

సుజాత నవ్వేసింది.

బంటి "ఇదిగో ఈ ఫోన్ మరియు లాప్ టాప్ యిచ్చి రికవర్ చేయమన్నాడు"

సుజాత "చేస్తున్నావా!"

బంటి "లేదు... వేరే వాళ్లకు ఇచ్చాను.... వాళ్ళ ఇంట్లో cc కెమెరా హ్యాక్ చేయబోతున్నా..."

సుజాత "అవునా...."

బంటి "హుమ్మ్"

సుజాత "ఏది? నన్ను కూడా చూడనివ్వు.."

బంటి "అప్పుడే కాదు..... ఇంకా టైం పడుతుంది"




వాణి, బంటి రికవర్ చేయించి పంపించిన లాప్ టాప్ ని ఓపెన్ చేసి చూస్తూ ఆన్ లైన్ డైరీ చదువుతూ ఆశ్చర్య పోయింది.

వాణి "వాట్... నేను దత్తత బిడ్డని కానా! సొంత బిడ్డనా..." అంటూ ఆశ్చర్య పోతూ DNA రిపోర్ట్ చూసింది.

బంటి నుండి వచ్చిన లింక్ ఓపెన్ చేసి ఇంటి యొక్క cc కెమెరా చూస్తూ ఉంది.



మరో వైపు బంటితో కూర్చొని సుజాత కూడా చూస్తూ ఉంది.




ఇంట్లో.........

సందీప్ "అలా అనకండి..... ఎవరం అనుకోలేదు..... అమ్మ కూడా సంతకం పెట్టడానికి సిద్ద పడింది..... సడన్ గా దెయ్యం లేచినట్టు లేచింది."

సందీప్ "హా!!" 

సందీప్ "హా!!" 

సందీప్ "ఈ సారి పక్కా...  చంపేసి ఆమె గుండె నాకు... మిగిలిన బాడీ పార్ట్స్ నువ్వు అమ్ముకో..." 

సందీప్ "హా!!" 

సందీప్ "హా!!" 


సందీప్ "ఇవ్వాళే....  ఇవ్వాళే....  ప్లాన్..."  








సుజాత మరియు వాణి ఇద్దరూ వేర్వేరు చోట కూర్చొని ఉన్నా ఒకేలా షాక్ అయ్యారు.

బంటి "ఈ సాక్ష్యం సరిపోతుంది కదా...."

సుజాత "మీ అన్నని అడిగి చూడు... అలాగే ఆ ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడాడో డీటెయిల్స్ కనుక్కో..."

బంటి "అయిపొయింది..... పేరు సరళ.... కిడ్నీ పేషెంట్...."

సుజాత "వాట్...."

బంటి "నువ్వు ఊహించిందే..."

సుజాత "ఏంటి? నేను ఊహించింది"

బంటి "కిడ్నీ టచింగ్ లవ్ స్టొరీ"



వాణి గొంతు పెద్దగా "ఇప్పుడు వాళ్ళ లవ్ స్టొరీ ఎవరు అడిగారు...." అని వినపడింది.

బంటి మరియు సుజాత ఇద్దరూ షాక్ గా వెనక్కి తిరిగి చూశారు.

వాణి "ఏంటి? అమ్మా కొడుకులు ఇద్దరూ నన్నే చూస్తున్నారు"

బంటి "నీ... నీ... నీకు ఎలా తెలుసు..."

వాణి అతని మొహం మీద చేయి పెట్టి చూపిస్తూ.... "నీ మోహంలో మీ అన్న కనిపిస్తున్నాడు... నీ గొంతులో మీ అమ్మ వినిపిస్తుంది" అంది.

బంటి, సుజాత వైపు తిరిగి "మెమరీ దొబ్బింది కాని బ్రెయిన్ దొబ్బలేదు" అన్నాడు.

సుజాత నవ్వేసింది.

వాణి ఇబ్బందిగా చూసి బంటి కూర్చున్నా కంప్యూటర్ ని చూస్తూ ఉంటే..... ఎదో గుర్తుకు వస్తుంది.

వాణి "ఒక్క సారి పైకి లే...." అని అతన్ని లేపి తను కూర్చొని కంప్యూటర్ ని కంట్రోల్ లోకి తీసుకుంది.

బంటి "ఇదంతా హ్యాకింగ్ స్టఫ్.... అవన్నీ అలా క్లోజ్ చేయకు..."

వాణి వాటిని చూస్తూ ఉంటే... నీళ్ళలోకి ఎంటర్ అయిన చేపలా ఫీల్ అయింది.

వాణి చకా చకా ఆడిస్తూ రెండూ కెమెరాలు ఓపెన్ చేసి చూశాడు.

ఎదురుగా కనపడుతున్న దృశ్యం చూసి అక్కడున్న ముగ్గురు షాక్ అయ్యారు.

సందీప్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అతని మాటలు వింటూ చిన్నగా నవ్వుకుంటున్న అతని తండ్రి సుధాకర్ కాఫీ తాగుతూ కనిపించాడు.

విడి విడిగా చూస్తూ ఉంటే, మములుగా కనిపిస్తున్నాడు. కాని రెండూ పక్క పక్కన ఉంటే అర్ధం అవుతుంది.

సందీప్ మాటలు సుధాకర్ కి ఏ ఇబ్బంది కలిగించ లేదు. పైగా కన్వర్సేషన్ తర్వాత వచ్చి సందీప్ భుజం తట్టాడు.



బంటి "అంటే...."

సుజాత "అంత స్పష్టంగా కనిపిస్తుంటే... ఇంకా ఏంటి?"

వాణి "నో...."

సుజాత "ఏమయింది?"

వాణి "అమ్మ సుహాసినికి యాక్సిడెంట్ అయింది"

సుజాత "అయ్యో..... ఇప్పుడు ఎక్కడ ఉన్నారు"

వాణి "నా తర్వాత, సూటబుల్ హార్ట్ తనదే..." అంటూ ఎదురుగా ఇంటి లైవ్ cc కెమెరా ఫుటేజ్ చూస్తుంది.




స్క్రీన్ పై హాస్పిటల్ నుండి వచ్చిన ఫోన్ మాట్లాడి ఇద్దరూ సందీప్ మరియు సుధాకర్ ఇద్దరూ హై ఫై ఇచ్చుకోవడం కనిపించింది.



వాణి "అమ్మ.... మా అమ్మ" అంటూ కన్నీళ్ళు పెట్టుకొని బయటకు పరిగెత్తింది.

సుజాత, అమ్మ అని వినపడి వాణి వైపు చూసినా.... తను బయటకు పరిగెత్తడం చూసి ఎమోషనల్ అయింది కాని కవర్ చేసుకొంది.






Like Reply
#30
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#31
Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#32
అంటే అమ్మ గుండెనా, సుధాకర్ గుండె ఇంకా బాగా మ్యాచ్ అయ్యేదేమో చూడాల్సింది...అంత చేసాక కూడా వాణి అమ్మా అంటూ పరుగెత్తడం...చూడాలి మీరేమనుకుంటున్నారో....
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#33
Nice update
[+] 2 users Like BR0304's post
Like Reply
#34
Endayya e suspense...twaraga update iyyi...
Like Reply
#35
6. వేక్ అప్ 






వాణి హాస్పిటల్ గదిలోకి "అమ్మా...." అనుకుంటూ వెళ్లి సుహాసిని చేయి పట్టుకుంది.

అప్పుడే అక్కడకు వచ్చిన డాక్టర్ వాణిని చూస్తూ జరిగింది చెబుతాడు.

కారులో వెళ్తూ ఉండగా ఒక టిప్పర్ లారీ వచ్చేసింది, ఆఖరి నిముషంలో గమనించిన సుహాసిని కారు తప్పించింది కాని అది పక్కకి వెళ్ళిపోయి ఒక చిన్న గుంతలో పడిపోయి యాక్సిడెంట్ అయింది.

సమయానికి చుట్టూ పక్కల వాళ్ళు చూసి అంబులెన్స్ లో తీసుకొని రావడం వల్ల ప్రాణనష్టం జరగలేదు.

ఈ మెడికల్ టెస్టులు చేశాం, అలాగే ఈ మెడిసెన్ ఖర్చు పెట్టాం.

వాణి "ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను పెడతాను.... మా అమ్మ ఇంతకు ముందులా తిరగాలి"

అప్పుడే స్పృహలోకి వచ్చిన సుహాసిని తన పక్కనే తన చేయి పట్టుకొని ఏడుస్తూ కూర్చున్న కూతురుని చూస్తూ "వాణి" అని పిలిచింది.

వాణి పట్టించుకోకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ రిపోర్ట్ అన్ని ఫోటో తీసి బంటి ద్వారా వేరే డాక్టర్ కి పంపించి మరో ఒపీనియన్ తీసుకుంటుంది.

ఇంతలో తన చేతిలో ఉన్న తల్లి చేయి కదలడంతో అప్పటి వరకు చేస్తున్న పని పక్కన పెట్టేసి సుహాసినిని "అమ్మా..." అంటూ ఏడుస్తూ చూసింది.

ఎన్ని కన్నీళ్లు స్టాక్ ఉన్నాయో... ఎన్ని సార్లు తుడిచినా ఆగిపోవడం లేదు, వస్తూనే ఉన్నాయి.

సుహాసిని, కూతురు మొహాన్ని దగ్గర నుండి చూస్తూ "భోజనం చేశావా! రా....." అని అడిగింది. ఆ మాటకు వాణి మరింతగా ఏడుస్తూ సుహాసిని చేతిని ముద్దు పెట్టుకుంటూ ఉంది.

సుహాసిని మరో సారి కూడా అడగడంతో వాణి తల ఊపి, తింటాను అని చెప్పి వెళ్లి భోజనం చేసి వచ్చింది.

సుహాసిని నిద్ర పోతూ ఉండడంతో తానూ కూడా పక్కనే ఉన్న గెస్ట్ బెడ్ పై తల వాల్చింది అలా నిద్ర పట్టేసింది.

నిద్ర లేచే సరికి తనను స్త్రేచర్ మీద తీసుకుని వెళ్తున్నట్టు అనిపించడంతో అలానే పడుకుంది. 





వాణి కళ్ళు తెరిచే సరికి బెడ్ పై పడుకొని ఉంది. ఎవరో వ్యక్తీ డాక్టర్ వేషం వేసుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఆమె నుండి బాడీ పార్ట్స్ తీసేయడం కోసం సిద్దం చేసుకుంటున్నాడు. అలాగే ఫోన్ లో మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు.

వాణికి కళ్ళు తెరిచి ఆపరేషన్ టేబుల్ పై దిగి నిలబడింది.

ఆ డాక్టర్ వెనక్కి తిరిగే సరికి తన వైపే చూస్తున్న వాణిని చూసి షాక్ అయ్యాడు, వెంటనే తన చేతిలో ఉన్న వాటితో దాడి చేశాడు. అది వాణి అయితే భయపడేదే కాని అక్కడ ఉంది కరణ్ ఆత్మ కావడంతో డాక్టర్ మొహం పగిలి ఆపరేషన్ టేబుల్ మీద నగ్నంగా పడుకొని ఉన్నాడు.

మరో వైపు వాణి డోర్ ఓపెన్ చేసుకొని ఆ డాక్టర్ వేషం వేసుకొని బయటకు వచ్చి వెళ్లిపోవాలి అనుకుంది. చూస్తూ ఉంటే చుట్టూ పక్కల సుమారు నలుగురు రౌడీలు ఉన్నారు. వాణి ఎవరితో గొడవ పెట్టుకోకుండా... బయటకు వెళ్తూ ఉంటే, ఆఖరి నిముషంలో ఆమెకు డబుల్ ఉన్న ఒక గుండు గాడు ఆమె భుజం మీద చేయి వేసి "హేయ్ డాక్టర్.... ఒక వంద యివ్వు" అన్నాడు.

వాణి గుటకలు మింగి పాకెట్ లు చూసుకొని లేవు అన్నట్టు చేయి ఊపింది. 

గుండు గాడు "నువ్వు ఎప్పుడూ ఇంతే.... పిసిని గొట్టోడివి... అవునూ ఆ ఇద్దరివి ఆపరేషన్ లు అయిపోతే... డబ్బులు యిచ్చి పంపించు మేం వెళ్లిపోవాలి."

వాణి ఆలోచిస్తూ "ఇద్దరా..." అని ఆలోచిస్తూ ఉంది.

ఇంతలో ఆ గుండు గాడు వెళ్ళిపోతూ ఉంటే.... వాణి చప్పట్లు కొట్టడంతో వెనక్కి తిరిగాడు. వెంటనే వాణి ఆ డాక్టర్ కారు ఓపెన్ చేసింది.

ఆ గుండు గాడు వచ్చి డ్రైవర్ సీట్ లో కూర్చొని "ఎక్కడకు?" అని అడిగాడు.

వాణి మాట్లాడ కుండా వెనక సీట్ లో కూర్చొని అతని సీట్ మీద చిన్నగా కాలుతో కొట్టింది.

గుండు "నీ యమ్మా నీకు ఇవ్వాళ ఎదో అయింది" అంటూ కారు ముందుకు పోనిచ్చాడు.

మాస్క్ లో నుండి వాణి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మొత్తం తలతో సహా కవర్ అయ్యేలా డ్రెస్ వేసుకొని ఉంది.

గుండు "ఈ డ్రెస్ వేసుకొని బయటకు రావు కదా.... ఇవ్వాళా ఏంటి?" అని అంటూ ఉండగా... ఒక చోట చూసి ఆపమని సైగ చేసింది.

ఆ గుండు ఆపాడు. ఆ గుండు అద్దంలో నుండి వాణి కళ్ళు చూస్తూ అనుమానం వచ్చి వెనక్కి తిరగబోయెంతలో వాణి ఒక వైర్ తీసుకొని ఆ గుండు మెడ చుట్టూ వేసి బంధించేసింది.

కొద్ది సేపు తిరగబడడంకోసం ప్రయత్నించి కుదరక పోవడంతో మెడకు బిగుసుకుంటున్న వైర్ ని లాగడం కోసం ప్రయత్నించాడు. కాని వాణి మరింత బలంగా బిగిస్తూ ఉండడంతో మెల్లగా స్పృహ తప్పేసాడు.

వాణి కిందకు దిగి ఒక తాడు తీసుకొని ఆ గుండుని అక్కడ ఉన్న ఒక చెట్టుకు కట్టేసి మొహాన నీళ్ళు కొట్టి నిద్ర లేపి "చెప్పూ ఎవరూ ఆ రెండో మనిషి..."

గుండు "ఒసేయ్, నిన్నూ" అంటూ ముందుకు దూకి ఆమెను కొట్టబోయాడు. కాని అతని చేతులు కట్టేసి ఉండడం చూసి కోపంతో విప్పమని కోపంగా అడిగాడు.

వాణి చుట్టూ చూసి పెద్ద బండ తీసుకొని ఆ గుండు గాడి గుండు మీద వేసింది. పెద్ద ఎత్తున రక్తం అతని మొహం మీదకు కారింది. ఆ గుండు గాడు భయపడిపోయాడు.

కొద్ది సేపు ఏడుస్తూ ఉన్న తర్వాత బ్రతిమలాడడం మొదలు పెట్టాడు. వాణి అప్పటి వరకు పక్కకు వెళ్లి అప్పుడే వచ్చి "ఆ రెండో మనిషి ఎవరూ" అని అడిగింది.

ఎవరో మగతను అని చెప్పడంతో తన తల్లి కాదు అని దైర్యం వచ్చి కారు తీసుకొని అక్కడ నుండి వెళ్లి పోయింది. చుట్టూ పక్కల కొండల గుండా కారుని పోనిస్తూ తన తల్లి ఉన్న హాస్పిటల్ కి వెళ్ళింది.

అప్పటికే అక్కడ స్పృహలో లేని సుహాసినిని స్ట్రెచర్ పై సుధాకర్ మరియు సందీప్ లు తీసుకొని వెళ్తున్నారు.

వాణి వాళ్ళకు అడ్డు పడితే మాట్లాడుతూ ఉన్నారు. వాణి చిన్నగా నవ్వి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరినీ స్పృహ తప్పేలా కొట్టి తల్లిని తీసుకొని కారులో వెళ్ళిపోయింది.






నెల రోజులు గడిచింది.... ఇప్పటికే సుహాసినిని సుమారు ఇరవై ప్లేస్ లు మార్చింది. సందీప్ మరియు సుధాకర్ లు ఎదురు పడుతూ ఉన్నారు. సుహాసిని మొదట గొడవ పడ్డా సుహాసిని మరియు సుధాకర్ లు కత్తులు తీసుకొని తనని పొడవడం కోసం రావడం, వాణి వాళ్లకి అడ్డు నిలబడి తనని కాపాడడం చూస్తూ ఉంది. ఏం చేయాలో అర్ధం కాక కూతురుకి సపోర్ట్ గా ఉండిపోయింది.


ఒక రోజు పొద్దున్నే బంటి నుండి ఫోన్ వచ్చింది. వాణి ఇదంతా చేస్తున్నా చాలా వరకు కష్ట పడింది మాత్రం బంటి.... ప్రతి సారి ప్రతి చోట సాయం చేస్తూనే ఉన్నాడు. కాని ఈ సారి ఫోన్ చేసింది మాత్రం వేరే కారణం కోసం... కరణ్ నిద్ర లేచాడు.

వాణి, బంటిని తల్లి దగ్గర ఉంచి కరణ్ ని కలవడం కోసం వెళ్ళిపోయింది.

బంటి అక్కడ ఒక సెక్రెట్ కెమెరా పెట్టి పక్కకు వెళ్లి తన పని తను చూసుకుంటూ ఉన్నాడు.

సుధాకర్ మరియు సందీప్ ఇద్దరూ ఒకరు ఇంజెక్షన్ మరియు మరొకరు కత్తి తీసుకొని అక్కడకు వస్తున్నారు.

బంటి కారులో నిద్ర పోతూ ఉన్నాడు. అతను తన ఫోన్ లో సుధాకర్ మరియు సందీప్ లు సుహాసిని ఉన్న గదిలోకి వెళ్ళడం గమనించలేదు.












ఇందులో సెక్స్ ఉంటుంది అండి... వెయిట్ చేయండి....
[+] 16 users Like 3sivaram's post
Like Reply
#36
అప్డేట్ చాల బాగుంది clps
Like Reply
#37
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#38
సెక్స్ కోసం వేరే కథలు చాలానే వున్నాయి బ్రో, కధనం రక్తి కట్టడానికి అవసరమైతే రాయండి కాని ఎవరో అడుగుతున్నారని మాత్రం గాడి తప్పకండి. అయినా సందీప్, సుధాకర్లని కట్టి పడేస్తే ఓ పనైపోయేదిగా...కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#39
7. తెలిసిపోయిందా!











సుధాకర్ మరియు సందీప్ లు సుహాసిని ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటే, బంటి కారులో పడుకొని నిద్రపోతున్నాడు. అతని ఎదురుగా ఉన్న ఫోన్ లో అక్కడ జరుగుతుంది అంతా రికార్ట్ అవుతూ ఉంది.

వెంటనే ఫోన్ రావడం, బంటి కంగారుగా అటూ ఇటూ కదలడంతో ఫోన్ కింద పడింది. పైకి లేచి ఫోన్ ని కదిలిస్తూ ఉండగా... స్క్రీన్ మారిపోయి (అన్న ఇన్ వదిన) కాలింగ్ అని పడింది.

సుజాత పిలవడంతో బంటి స్పీడ్ గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

బంటి లోపలకు వస్తూనే సోఫాలో మాములుగా కూర్చొని ఉన్న అన్న(కరణ్)ని చూస్తూ పక్కనే మరో సోఫాలో కూర్చున్న వాణి, ఆమె పక్కనే కూర్చున్న సుజాతని చూస్తూ ఆలోచించుకుంటూ "ఇప్పుడు వదినలో అన్న ఉంటే, అన్నలో వదిన ఉంటుంది... అంటే ఇప్పుడు మనోడు ఆడపిల్లలా నడుస్తాడా!" అనుకున్నాడు.

బంటి "అన్నా.... అన్నా.... నన్ను గుర్తు పట్టావా!... నేను నీ ఒక్కగానొక్క తమ్ముడిని... నువ్వు ఎప్పుడూ దొంగ తనం చేసి నా మీద వేసుకోమంటే వేసుకునే వాడిని.... నీకు హోం వర్క్ ఇస్తే నా చేత చేయించే వాడివి... గుర్తు రాలేదా.... చిన్నపుడు నన్ను కొట్టి నా చాక్లెట్ లు తినేవాడివి.... ఇంకా గుర్తు రాలేదా!"

కరణ్ నుదురు పట్టుకొని ఎదో ఆలోచిస్తూ ఉన్నట్టు మొహం పెట్టాడు.

బంటి "ఏం పర్లేదు?... నువ్వు నన్ను ఎన్ని కొట్టినా తిట్టినా.... ఎంత దుర్మార్గుడివి అయినా.... ఎంత వెధవవి అయినా....  నీచ్ కమీన్ కుత్తే గాడివి అయినా నా అన్నవి.... కాబట్టి నీ కోసం నేను కస్టపడి నీ గతం గుర్తొచ్చేలా చేస్తా...." అన్నాడు.

అక్కడే ఉన్న ఇద్దరూ సుజాత మరియు వాణి ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు.

కరణ్ పైకి లేచి బంటి చెవి మెలిక వేసి "ఏరా... నేను నిన్ను కొట్టానా.... నా మైండ్ దొబ్బిండా.... హా!!" అంటూ చేయి పైకి లేపి కొట్టబోతూ ఉన్నట్టు నటిస్తూ ఉండగానే... బంటి "అమ్మా.... కాపాడు..." అంటూ కేకలు పెడుతున్నాడు.

సుజాత మరియు వాణి ఇంకా పెద్దగా నవ్వుతున్నారు. సుజాత ఆపమని చెప్పడంతో ఇద్దరూ ఆగిపోయారు.

బంటి, కరణ్ ని వాణి ని ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ ఎప్పుడూ...  ఎప్పుడూ...  ఎప్పుడు మారిపోయారు అని అడిగాడు.

వాణి మరియు కరణ్ ఇద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకోగానే ఆ రాగి కంకణాలు పాములులాగా మారిపోయి ఒకరి చేతి నుండి మరొకరి ఎక్సచెంజ్ అయిపోయాయి. అలాగే ఇద్దరి ఆత్మలు కూడా తిరిగి యదాస్థానానికి వచ్చేశాయి.



సుజాత "అయింది లే.... కాని పదా భోజనం చేయండి" అంటూ తీసుకొని వెళ్ళింది. నలుగురు హోటల్ లో లోకి వెళ్తున్నారు.

కరణ్ తిరిగి హాల్ లోకి వస్తూనే వాణి చేయి పట్టుకున్నాడు. వాణి వెనకే వస్తున్న సుజాతని గమనించి వాణి అతని చేయి నెట్టేసింది. వాణి నిజానికి సుజాత అసిస్టెంట్...

కరణ్ ఇక ఉండబట్టలేక, సుజాతకి కళ్ళతోనే చెప్పి... వాణిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు.

బంటి పరిగెడుతూ ఉంటే, సుజాత అక్కడితో ఆపేసింది.

బంటి "కాని అమ్మా.... వదిన తనని ఇష్టపడడం లేదు.... ఆ డైరీ చదివాడు కదా...."

సుజాత "ఎవరూ చెప్పారు ఇష్టపడడం లేదు అని.."

బంటి "కాని డైరీ లో రాయలేదు కదా...."

సుజాత చిన్నగా నవ్వి ఊరుకుంది.

బంటి, సుజాత ఇద్దరూ చూస్తూ ఉండగా కొద్ది దూరంలో వాణి మరియు కరణ్ ఇద్దరూ నిలబడి ఉన్నారు.

వాళ్ళు ఉన్న చోట చిన్న వర్షం పడుతుంది. సిల్క్ సారీలో సన్నగా అందంగా తెల్లగా కనిపిస్తూ ఉంటే, కరణ్ చెప్పాలా వద్దా అని ఆదుర్దాలో చూస్తూ కనిపించాడు.

కరణ్ అటూ ఇటూ తిరిగి మొత్తానికి కళ్ళు మూసుకొని తన మనసులో ఉన్న మాట బయట పెట్టాడు.

కరణ్ "వాణి..... పెళ్లి చేసుకుందాం...."

వాణి నోరు తెరిచి మాట్లాడకుండా దూరంగా నిలబడి ఉన్న సుజాత వైపు చూసింది.

సుజాత నవ్వుతూ థమ్స్ అప్ సింబల్ చూపించింది. వాణి కూడా సంతోషంగా నవ్వేసింది.

కరణ్ ఇబ్బంది పడుతూ "వాణి పెళ్లి చేసుకుందాం... నేను నిన్ను బాగా చూసుకుంటాను"

వాణి ముందుకు వచ్చి తన చేతులు జాపి కరణ్ ని హాగ్ చేసుకుంది. ఆమె మెత్తటి శరీరం తనకు తాకుతూ ఉంటే కరణ్ కి గూస్ బంప్స్ వచ్చేశాయి.

వాణి అతని చాతి మీద తల ఉంచి, పెరుగుతున్న అతని గుండె వేగం వింటూ నవ్వుకుంటూ ఉంది.



బంటి చిన్న సైజ్ డాన్స్ చేస్తూ "మా అన్న గాడి పొలంలో మొలకలోచ్చాయ్" అంటూ నవ్వుతున్నాడు.

కరణ్ మరియు వాణి ఇద్దరూ కొద్దిసేపు అలానే ఉండి, తిరిగి నవ్వుకుంటూ ఒకరి చేయి మరొకరు పట్టుకొని తిరిగి సుజాత మరియు బంటి దగ్గరకు వచ్చారు.

నలుగురు కూర్చొని భోజనం చేస్తున్నా... కరణ్ మరియు వాణి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు.

బంటి మాత్రం వాళ్ళ అన్నని ఆట పట్టిస్తూ... ఉన్నాడు.

బంటి "వదినా.... మా వోడికి సెక్స్ ప్యాక్ ఉంది, తెలుసా..."

వాణి "లేదు... అయినా హేల్తిగా ఉంటే చాలు.... ఏ ప్యాక్ లు అవసరం లేదు" అంటూ కరణ్ ని చూసింది.

బంటి "ఇప్పుడు చెప్పూ.... నీకు ఎలా తెలుసు.... లేదని... ఓహో తన బాడీలో ఉన్నప్పుడు మొత్తం చూసుకున్నావా!" అన్నాడు.

కరణ్ కోపంగా "రేయ్..." అని అరవడంతో బంటి ఆగిపోయాడు.

బంటి తల వంచుకుని నవ్వుకుంటూ ఉన్నాడు.

కరణ్ "ఏమయింది?" అని రెండూ మూడు సార్లు అడిగాడు.

బంటి "వదినా.... మా వాడికి... ఎక్సర్సైజు అంటే చాలా ఇష్టం... నువ్వు నిద్ర లేవలేదనుకో నే బాడీలోకి తను వచ్చి నీ ఎక్సర్సైజు చేస్తాడు. నువ్వు నిద్రపోతూ కూడా ఫిట్ నెస్ మైంటైన్ చేసుకోవచ్చు" అంటూ నవ్వాడు.

సుజాత "బంటీ..." అని అనడంతో ఆగి పోయి తల దించుకున్నాడు.

కరణ్ మరియు వాణి ఇద్దరూ ఒకరినొకరు దొంగతనంగా చూసుకుంటూ భోజనం చేస్తూ ఉన్నారు.




బంటి "అమ్మా, నీకు ఎలా తెలుసు.... వదిన ఒప్పుకుంటుంది అని..."

సుజాత "మీ అమ్మని కదా.... నాకు తెలుస్తుంది లే... " అంది.

బంటి "అంటే ఎలా...."

సుజాత "ఎక్సపీరియన్స్ రా....." అంది.

బంటి "అవునూ.... వదిన..... నీ వెనక మా వాడు హచ్ కుక్కలా తిరిగాడు కదా... నీకు లవ్ చేయాలని అనిపించలేదా.... పోనీ ఎక్కడేక్కడే బురదలో తిరిగి ఎండలో ఎండిన పిచ్చి కుక్క అనుకున్నావా...."

కరణ్ కోపంగా "ఒరేయ్...." అన్నాడు.

వాణి "నువ్వు అలా మాట్లాడకు బంటి... తను మీ అన్నయ్య...."

కరణ్ "నన్ను లవ్ చేయాలని ఎందుకు అనిపించలేదు"

వాణి తల దించుకొని ఉంది.

బంటి "కుక్కలా నువ్వు వెంట పడుతున్నావు అని నచ్చలేదేమో...."

వాణితో పాటు కరణ్ ఇద్దరూ "బంటి..." అని పిలిచారు.

బంటి సైలెంట్ అయ్యాడు.

సుజాత కూడా "అయిందా!" అనడంతో బంటి తల దించేసుకున్నాడు.



వాణి "నాకు నువ్వంటే ఇష్టం..." అంది, బంటి మరియు కరణ్ ఇద్దరూ తననే చూస్తూ ఉంటే, వాణి "ఏమయింది?"

బంటి "అబద్దం చెప్పకు వదినా.... మా వొడికి అందరూ ఆడపిల్లలు పుట్టారనుకో... ఆస్తి మొత్తం నా కొడుకులకు ఇవ్వాల్సి వస్తుంది"

కరణ్ కూడా అబద్దం అన్నట్టు నవ్వుతున్నాడు.

వాణి "ఏమయింది మీకు.... నాకు కరణ్ అంటే మొదటి నుండి ఇష్టమే...."

కరణ్ "ఓకే.... ఓకే.... "

బంటి "నమ్మాము లే వదిన...."

వాణి కోపంగా కూర్చుంది.



బంటి "వదినా.. అన్న హ్యాకర్ అని తెలుసు కదా..... మనోడు నీ ఆన్లైన్ డైరీ చదివాడు.... అందులో మా వాడి గురించి ఒక్క సారి కూడా రాయలేదు" అన్నాడు.

వాణి "వాట్.... నా డైరీ హ్యాక్ చేశావా..." అని కరణ్ వైపు చూసింది.

కరణ్ ఇబ్బందిగా చూడడంతో వాణి వెంటనే కూల్ అయి "సర్లే..... అయినా నేను డైరీలో మీ అన్న గురించి ఎప్పుడూ రాయలేదు" అంది.

బంటి "అయితే ఒప్పుకున్నట్టే కదా.... నువ్వు లవ్ చేయలేదు అని...."

వాణి "లేదు..."

బంటి "అదేంటి?"

కరణ్ "హా.... అదేంటి?"

వాణి "నా ల్యాప్ టాప్ తీసుకొని రండి..."

వాణి ల్యాప్ టాప్ ఓపెన్ చేసి ఆన్ లైన్ డైరీలో id పాస్వర్డ్ కరణ్ చూస్తూ ఉండగా ఎంటర్ చేసింది.

కరణ్ అది చూసి షాక్ అయ్యాడు.

పాస్వర్డ్ "కరణ్ I L U"


కరణ్, వాణిని హాగ్ చేసుకున్నాడు. వాణి నవ్వేస్తుంది.





బంటి వాళ్ళను చూసి నవ్వుకుంటూ బయటకు వచ్చి వాణి వాళ్ళ అమ్మని ఉంచిన చోట ఉన్న సీక్రెట్ కెమెరా ఓపెన్ చేసి చూశాడు.

సుధాకర్ "ఎక్కడకు వెళ్ళింది"

సుహాసిని "తెలీదు"

సందీప్ "గట్టిగా పట్టుకొని ఉండొచ్చు కదా అమ్మా..."

సుహాసిని "నాకు అదే అర్ధం కావడం లేదు రా.... ఎంత ప్లాన్ చేసి మీకు ఎక్కడ ఉన్నానో పంపిస్తున్న.... మీరు వచ్చే లోపే ప్లేస్ మార్చేస్తుంది"

సందీప్ "మనం త్వరగా వాణి అక్కని ఆ హాంకాగ్ బ్యాచ్ కి అప్పగించేస్తే... నాకు హార్ట్, నాన్నకి లివర్... ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ కి కిడ్నీ ఇస్తారు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు..."

సుధాకర్ "అవునూ... అసలు మనం చిన్నప్పటి నుండి అందుకే కదా పెంచాం...."

సుహాసిని అటూ ఇటూ తిరిగి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న బొమ్మని చూస్తూ అందులో ఉన్న సిక్రెట్ కెమెరా చూసింది. 

దాన్ని దగ్గర నుండి చూస్తూ వికృతంగా నవ్వుతూ "అయితే..... తెలిసిపోయిందా!" 

సందీప్ "అయ్యో ఇప్పుడెలా..."

సుహాసిని "తెలిస్తే.... తెలియనివ్వు... అడ్డం వచ్చిన అందరిని చంపేద్దాం..."

బంటి కి చల్లగా చమటలు పట్టేశాయి. సుహాసిని ఆ కెమెరాని తీస్కోని వచ్చి వాటర్ సింక్ లో వేసేసింది.




బంటి తిరిగి రూమ్ లోకి వస్తూ ఉంటే..... 

వాణి మాటలు వినపడ్డాయి.. త్వరలో మా అమ్మకి ఈ విషయం చెప్పాలి. చాలా సంతోషిస్తుంది....

బంటి రూమ్ లోకి వెళ్ళగా అందరూ నవ్వుకుంటూ ఉన్నారు.

బంటి మోహంలో బాధని చూసి వాణి "సారీ....  బంటి ఏమయినా అంటే... ఫీల్ అవ్వకు.... ప్లీజ్" అంది.

కరణ్ "అవునూ.... ఫైవ్ స్టార్ కొనిపెడతాను"

బంటి "రెండూ కావాలి" అన్నాడు.

అందరూ నవ్వేశారు.























ఇంకా నాలుగు లేదా అయిదు ఎపిసోడ్స్ మాత్రమే....
[+] 12 users Like 3sivaram's post
Like Reply
#40
యస్, మెయిన్ విలన్ ...... సుహాసిని
[+] 1 user Likes 3sivaram's post
Like Reply




Users browsing this thread: