Thread Rating:
  • 41 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఆట - వేట (అయిపోయింది)
#1
1.  ఆన్ లైన్ డైరీ

2.  Welcome to my darkside

3.  గతం గుర్తు తెచ్చుకోవాలని కూడా లేదు

4.  రాగి కంకణం

5.  బంటి

6.  వేక్ అప్

7.  తెలిసిపోయిందా!

8.  పెళ్లి వారమండి

9.  గోరంత... కొండంత...

10. అపర్ణ

11. సూర్యోదయం

12. ఆట!

13. మూడు నెలల తర్వాత

14. చెక్ మేట్!
[+] 3 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
1. ఆన్ లైన్ డైరీ






అమ్మ :  సుజాత

కొడుకు : కరణ్

ప్రేమించిన అమ్మాయి : వాణి






కరణ్ "నేను నీతో మాట్లాడాలి"

సుజాత "చెప్పూ కన్నా"

కరణ్ "సీరియస్ విషయం...."

సుజాత అప్పటి వరకు చదువుతున్న కంపనీ యాన్యువల్ రిపోర్ట్ పక్కన పెట్టేసి "చెప్పూ" అంటూ తననే తత్తరపడుతూ చూస్తున్న కొడుకు చేతిని ఆప్యాయంగా పట్టుకుంది.

కరణ్ తల దించుకొని కొద్ది సేపు ఉండి మళ్ళి పైకి లేపి దీర్గంగా శ్వాస తీసుకొని వదులుతున్నాడు. ఎదో మాట్లాడడం కోసం అతని పెదవులు కదులుతున్నాయి కాని ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు.

సుజాత, కొడుకు తల మీద చేయి "ఏ విషయం అయినా చెప్పూ పర్లేదు" అని అభయం ఇచ్చింది.

కరణ్ "వాణి..."

సుజాత, ఇలాంటిది ఎదో ఉంటుంది అని తెలుసు అన్నట్టుగా మొహం పెట్టి "మ్మ్" అంది. 

కరణ్ తల పైకెత్తి, తల్లి వైపు చూశాడు, ఆమె చెప్పూ నాకు వినాలని ఉంది అన్నట్టు మొహం పెట్టింది.

కరణ్ "వాణి అంటే నాకు ఇష్టం..."

సుజాత "గుడ్..." అంటూ అతని రెండో చేతిని కూడా పట్టుకుంది.

కరణ్ "వాణి గతంలో నా క్లాస్ మేట్, గెట్ టూ గెదర్ లో కలిశాను. మన కంపనీలో పని చేస్తుంది"

సుజాత "5 సంవత్సరాలుగా చేస్తుంది, హుమ్మ్....  తర్వాత..." అంటూ చిన్నగా నవ్వు మొహం పెట్టింది.

కరణ్ "తన గురించి తెలుసుకోవాలని అనుకున్నాను."

సుజాత "వెరీ గుడ్"

కరణ్ "తనకు ఆన్లైన్ డైరీ రాసే అలవాటు ఉంది"

సుజాత "ఓహ్... మంచి అలవాటు.. నిజానికి అది మంచి ప్రొఫెషనల్ అలవాటు... తనకు నేనే నేర్పాను"

కరణ్ "నన్ను కొంచెం మట్లాడ నిస్తావా!"

సుజాత "ష్.... చెప్పూ"

కరణ్ "నేను....  నేను...."

సుజాత "నువ్వు....  నువ్వు...."

కరణ్ "..." తల దించుకొని ఎలా చెప్పాలో అర్ధం కాక ఆలోచిస్తూ ఉన్నాడు.

సుజాత "అరె.... చెప్పూ.... నేనేమి అనను..... ఆ అమ్మాయి నాకు కూడా నచ్చింది. "

కరణ్ "నన్ను కొంచెం మట్లాడ నిస్తావా!"

సుజాత "ష్.... చెప్పూ"

కరణ్ "నేను తన ఆన్లైన్ డైరీని హ్యాక్ చేశాను. నా గురించి ఏం రాసిందో తెలుసుకోవాలని అనుకున్నాను. తను నా గురించి అసలు ఏం రాయలేదు. అలా అని వేరే లవ్ కూడా ఏం లేదు."

సుజాత "ఫస్ట్ అఫ్ ఆల్..... హ్యాక్ చేయడం తప్పు.... ఆమెతో నేను మాట్లాడతాను.... తను వేరే ఎవరిని ప్రేమించలేదు కదా.... సమస్య ఏముంది? దేవ్ ఫ్యామిలీ పెద్ద కూతురు తను... నేను సంబంధం మాట్లాడుతాను... నువ్వు అసలు బాధ పడాల్సిన పని లేదు"  

కరణ్ సీరియస్ గా పైకి లేచి "అసలు నేను చెప్పేది వింటావా.... లేక నీకు తోచింది చెప్పూ కుంటూ పోతావా!" అని అన్నాడు.

సుజాతకి కొడుకు మీద కోపం వచ్చినా కూల్ అయి, కరణ్ కి కూడా వాటర్ ఇచ్చింది.

కరణ్ కూల్ అయి తల్లి పక్కనే కూర్చున్నాడు.

సుజాత "మ్మ్ చెప్పూ..."

కరణ్ "దేవ్ ఫ్యామిలీ, దంపతులకు చాలా కాలం వరకు పిల్లలు పుట్టకపోవడంతో వాణిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకు సందీప్ అనే కొడుకు హార్డ్ డిసీజ్ తో పుట్టాడు."

సుజాత "వాణి నాకు నచ్చింది. మంచి అమ్మాయి.... దేవ్ ఫ్యామిలీ తన మీద ఎక్కువ కేర్ చూపించడం లేదు అని నాకు కూడా తెలుసు..... ఆ సందీప్ హార్ట్ పేషెంట్ కావడంతో తనపై ఎక్కువ కేర్ చూపిస్తున్నారు. పుట్టడానికి ధనవంతుల కుటుంబం అయినా ఆ అమ్మాయి చాలా కష్టాలు పడింది.... అయినా మన ఇంటికి వస్తే ఆ కష్టాలు తీరి పోతాయి"

కరణ్, సుజాత ని హాగ్ చేసుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది.

సుజాత "ఎందుకు రా..... ఏమయింది అని అలా ఉన్నావ్.... కరణ్ అంటే ఏంటి? నీ వెనక, ముందు ఇంత మంది జనాన్ని పెట్టుకొని సొంతంగా రెండూ కంపనీలను మైంటైన్ చేస్తూ నా కంపనీలో కూడా తోడూ ఉంటున్నావ్... ఎందుకు భయపడుతున్నావ్...."

కరణ్ "అమ్మా.... ఇది చాలా పెద్ద విషయం...." అంటూ హాగ్ చేసుకునే చెప్పాడు

సుజాత "అరేయ్.... నీకు ఆ అమ్మాయి ఇష్టమని నేను ఎప్పుడో పసిగాట్టాను.... నేను తన గురించి తెలుసుకుంటునే ఉన్నాను.... మంచి సమర్డురాలు... నిన్ను కంట్రోల్ పెడుతుంది అలాగే బాగా చూసుకుంటుంది" అంటూ అతని మూడ్ ని కూల్ చేయడం కోసం నవ్వించాలని చూసింది.

కరణ్ "నేను తన డైరీ చదవగా నాకు ఒక విషయం అర్ధం అయింది"

సుజాత "ఏం అర్ధం అయింది?"

కరణ్ "వాణిని ఎప్పుడో వాళ్ళు... ఆ దేవ్ దంపతులు.... వాణిని ఎప్పుడూ... కూతురులా చూడక పోవడానికి కారణం.... సందీప్..."

సుజాత "వాట్..."

కరణ్ "అవునూ..... వాణిని  వాళ్ళు చంపాలని అనుకుంటున్నారు"

సుజాత "వాట్... పిచ్చి పట్టిందా.... ఏం మాట్లాడుతున్నావ్..."

కరణ్ " వాణిని వాళ్ళు కూతురులా కాదు... సందీప్ కి హార్ట్ రిప్లేస్ చేయడం కోసం పెంచుతున్నారు... సందీప్ కి సమస్య వచ్చాక, అతని కోసం వాణిని ఆమె హార్ట్ కోసం చంపుతారు"

సుజాత "ఏం మాట్లాడుతున్నావ్ కన్నా...."

కరణ్ "ఆమె డైరీ చదివాక మొత్తం ఎంక్వయిరీ చేస్తే నాకు అర్ధం అయిన లెక్క ప్రకారం విషయం అదే..."

సుజాత "నువ్వు ఎదో పొరపాటు పడుతున్నావ్...  నీ లెక్క తప్పు అవ్వొచ్చు కదా...."

కరణ్ "లేదు అమ్మ..."

ఇంతలో ఫోన్ మోగింది.....


సుజాత "హలో" అని ఫోన్ మాట్లాడుతుంది. మధ్య మధ్యలో కొడుకు వైపు చూస్తుంది.



ఇంతలో కరణ్ ఫోన్ కి కూడా మెసేజ్ వచ్చింది.

వాణికి యాక్సిడెంట్ అయి తలకు దెబ్బ తగిలింది. అందువల్ల కోమాలోకి వెళ్లిపోయింది.

దేవ్ ఫ్యామిలీ కొడకు సందీప్, తన చెల్లికి జరిగిన విషయం తెలుసుకొని, తట్టుకోలేకపోయాడు. అందువల్ల అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది.

అక్కా-తమ్ముడు ఇద్దరూ ఒకే హాస్పిటల్ లో జేరారు.



సుజాత టెన్షన్ నిండిన కళ్ళతో కరణ్ వైపు చూసింది.

కరణ్ సీరియస్ గా ఎదో నిర్ణయం తీసుకున్నట్టు చూశాడు.

సుజాత "కన్నా..... వద్దు...." అంటూ కొడుకు చేతిని పట్టుకుంది

కరణ్ ఆమె చేతిని నెట్టేసి వెళ్ళబోయాడు.

సుజాత "అరె.... ఆ అమ్మాయి నిన్ను ప్రేమించను కూడా లేదు రా..... నువ్వు ఎందుకు?"

కరణ్ "కానీ... నేను ప్రేమించాను కద అమ్మా...."



....నెల రోజుల తర్వాత....

సుజాత తన కంపనీలో పని చేసే అమ్మాయి కావడంతో వాణికి స్పెషల్ డాక్టర్ లను పిలిపించి... చూపిస్తుంది.

డాక్టర్ పేషెంట్ దగ్గరకు వచ్చే ముందే... నర్సు ఎదురు వచ్చి "కోమాలో ఉన్న పేషెంట్ వాణి లేచింది..."

దేవ్ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ రూమ్ ముందు... ఎదురు చూస్తున్నారు.

దేవ్ ఫ్యామిలీ ని చూసినా ఎవరిని చూసినా వాణి ఒకటే మాట "అసలు ఎవరూ మీరు అంతా... నేను ఎవరిని?" అంటుంది.

డాక్టర్... "ఆమె మెదడులో బ్లడ్ లైట్ క్లాత్ అయింది కాబట్టి టెంపరరీ అమ్నేషియా వచ్చింది" అని చెబుతాడు.

అందరూ బయటకు వెళ్ళాక వాణి మొహం చిన్న నవ్వు విరిసింది "ఆట మొదలయింది?"













మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.... 

ఇది సుమారు 10 ఎపిసోడ్స్ కధ...

సెక్స్ ఉన్నా విడమరిచి ఉండదు... కాని స్టొరీ బాగుటుంది, మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

ఇది థ్రిల్లర్ కధ.....
Like Reply
#3
(28-09-2024, 06:04 PM)3sivaram Wrote: 1. ఆన్ లైన్ డైరీ




అందరూ బయటకు వెళ్ళాక వాణి మొహం చిన్న నవ్వు విరిసింది "ఆట మొదలయింది?"













మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.... 

ఇది సుమారు 10 ఎపిసోడ్స్ కధ...

సెక్స్ ఉన్నా విడమరిచి ఉండదు... కాని స్టొరీ బాగుటుంది, మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

ఇది థ్రిల్లర్ కధ.....

Nice Start.. Sivaram garu!!!

clps clps
Like Reply
#4
Superb start
[+] 2 users Like maheshvijay's post
Like Reply
#5
Nice ?. Keep it up ?.
Like Reply
#6
Super
Like Reply
#7
2. Welcome to my darkside











సుజాత "ఏమయింది?"

కరణ్ "వాణి చిన్నప్పటి నుండి, బేసిక్ నీడ్స్ తోనే పెరిగింది. సందీప్ మరో వైపు రిచ్ గా వాళ్ళ అమ్మా, నాన్నల డబ్బుతో పెరిగాడు...."

సుజాత "వాణి వాళ్ళ సొంత కూతురు కాదు"

కరణ్ "వాణికి ఆన్లైన్ డైరీలో ప్రతి విషయం రాసే అలవాటు ఉంది. అదే అలవాటుగా తను రాస్తున్న గతంలో రాసిన డైరీ చూస్తూ ఉన్నాను"

సుజాత "అయితే...."

కరణ్ "వాణి వాళ్ళ సొంత కూతురు...."

సుజాత "వాట్... అంటే..."

కరణ్ "అవునూ.... వాళ్లకు పెళ్లి కాక ముందు పుట్టింది.... పెంచలేక ఆమెను కొన్ని సంవత్సరాల క్రితం అనాధ శరణాలయంలో వదిలేశారు. మూడు సంవత్సరాలు తర్వాత పెళ్లి అయ్యాక కూడా వాళ్లకు పిల్లలు పుట్టకపోవడంతో చాలా కస్టపడి వాణిని వెతికి తెచ్చుకున్నారు"

సుజాత "ఇదంతా ఎలా తెలుసు..."

కరణ్ "DNA టెస్ట్ చేసింది.... తనను అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ నిజానికి సొంత పేరెంట్స్.... "

సుజాత గుటకలు మింగుతూ "సరే" అంది.

కరణ్ "వాణి పేరెంట్స్ ఆమెను ద్వేషిస్తున్నారు"

సుజాత "ఎందుకు?"

కరణ్ "తెలియదు"

సుజాత "..."

కరణ్ "వాణి, ఎవరితో గొడవ పడ్డా, ఏం చేసినా పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎప్పుడూ పట్టించుకోలేదు... కొన్నాళ్ళ తర్వాత తనకు వంటి మీద ఏమయినా దెబ్బలు తగిలితే... గొడవ చేసేవాళ్ళు"

సుజాత "అంటే..."

కరణ్ "సందీప్ చిన్నప్పటి నుండి హార్ట్ డిసీజ్ తో ఉండడంతో, వాణి అతనికి అక్క కావడంతో అతన్ని ఎప్పుడూ బాగా చూసుకునేది కాని, ఆమె పక్కకు వెళ్ళాక తన గురించి బ్యాడ్ గా మాట్లాడుకునే వాడు"

సుజాత "అతనికి సొంత అక్క అని తెలియదు"

కరణ్ "ఆరు నెలల క్రితం సందీప్ కి హార్ట్ ఎటాక్ వచ్చింది"

సుజాత "వాణి, తనని టైం హాస్పిటల్ లో జాయిన్ చేసింది.... విన్నాను"

కరణ్ "అప్పటి నుండి ఆమె మీద అటాక్స్ జరుగుతున్నాయి... ఫైనల్ గా ఇప్పుడు... వాణికి యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో కోమాలో ఉంది. బ్రెయిన్ డేడ్ గా ప్రకటిస్తే.... ఆమె గుండెని సందీప్ కి పెడతారు"

సుజాత "వాట్..."

కరణ్ "..."

సుజాత "నో... నువ్విలా చేయడానికి నేను ఒప్పుకోను"

కరణ్ ఏం మాట్లాడకుండా నవ్వుతూ బయటకు వెళ్ళాడు.

తన బాడీ గార్డ్స్ ని రావద్దని చెప్పి, ఒక కొండ మీద ఉండే ఒక ఆశ్రమంలోకి వెళ్ళాడు

స్వామిజి దగ్గరకు వెళ్లి ఒక పూజ చేయించాడు.





పాప్ మ్యూజిక్ వింటూ పని చేసుకుంటూ ఉన్న నర్సు, వాణి గదిలో అన్ని రికార్డింగ్స్ నోట్ చేసుకుంటూ ఉంది.

సడన్ గా వాణి కళ్ళు తెరిచి తననే చూడడంతో "ఆ!" పెద్దగా అరిచి గదిలో నుండి బయటకు పరిగెత్తింది. ఆమె చేతిలో ఉన్న ఫోన్ కి పెట్టిన ఇయర్ ఫోన్స్ కింద పడడంతో పెద్దగా మ్యూజిక్ వినపడుతుంది. 

"Welcome to my darkside" అనే పాట వినపడుతుంది.

గదిలోకి వచ్చిన పేరెంట్స్ ని చూసి వాణి బిత్తర మొహం వేసి "ఎవరు మీరు?" అని అంది.

వాళ్ళు ఇద్దరూ కంగారు పడి "డాక్టర్... డాక్టర్... " అంటూ కేకలు వేశారు.

డాక్టర్ వచ్చి CT స్కాన్ తీసి రిపోర్ట్ చూస్తూ ఈమ బ్రెయిన్ లో చిన్న బ్లడ్ క్లాట్ అయింది. దాని అంతటా అదే క్యూర్ అవుతుంది. అది అయినపుడు ఆమెకు మొత్తం తిరిగి గుర్తుకు వస్తుంది.

తనను చూడడానికి వచ్చిన సందీప్ ని మరియు తల్లి దండ్రులను చూస్తూ ఉంది. వాళ్ళ అమ్మ తల నిమరడం కోసం చేయి జాపితే, వాణి తల పక్కకు తిప్పుకుంది. ఆమె బాధ పడి భర్త గుండెలపై వాలిపోయి ఏడుస్తుంది.

సందీప్ "అక్కా.... ఏమయినా గుర్తు ఉందా..." అని అడిగాడు.

వాణి "నువ్వు నాకు తమ్ముడువా..." అంది.

సందీప్ "అవునూ..... నువ్వంటే నాకు చాలా ఇష్టం... నీకు కూడా నేనంటే చాలా ఇష్టం...."

వాణి వాళ్ళను అయోమయంగా చూస్తూ "నాకు మీ మీద నమ్మకం లేదు.... ఫోటో ఏమయినా ఉందా..." అని అడిగింది.

ముగ్గురు ఫోన్ లు ఇంట్లో అన్ని చోట్లా వెతికినా ఎక్కడా నలుగురు కలిసి దిగిన ఫోటో కనిపించలేదు.

వాణి వాళ్ళ నాన్న "మన చుట్టాలు చాలా మంది ఉన్నారు.... వాళ్ళు సాక్ష్యం చెబుతారు"

వాణి "వాళ్ళను ఎలా నమ్మను.... వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కదా.."

ఇంతలో సుజాత "వాణి" అనుకుంటూ అక్కడకు వచ్చింది. 

సుజాతని అయోమయంగా చూస్తూ "నేను కోమాలో ఉన్నప్పుడు నాకు మీ గొంతు వినపడింది... నాకు గుర్తు ఉంది..." అంది.

వెంటనే ముగ్గురు సుజాతతో పేరెంట్స్ అని చెప్పమని అడుగుతారు.

వాణి "నేను కోమాలో ఉన్నప్పుడు మీరు నా పక్కన లేరా!" అని అడుగుతుంది.

ముగ్గురు ఏం చెప్పాలో అర్ధం కాక అటూ ఇటూ చూస్తూ ఉంటే... సందీప్ "అంటే అక్క నాకు... హార్ట్ ఎటాక్ రావడంతో అమ్మ వాళ్ళు నా దగ్గరే ఉన్నారు"

వాణి "అంటే వాళ్ళు నీకు పేరెంట్స్... నాకు పేరెంట్స్ లా అనిపించడం లేదు"

సుజాత "నిన్ను అడాప్ట్ చేసుకున్నారు"

వాణి "అందుకే నా మీద ప్రేమ లేదా... పర్లేదు... నేను కూడా ఎక్సపర్ట్ చేయను"

వాణి వాళ్ళ అమ్మ "అదేం లేదు....  అదేం లేదు....  మాకు నువ్వంటే చాలా ఇష్టం"

వాణి "నాకు మీరెందుకో అబద్దం చెబుతున్నట్టు అనిపిస్తుంది" అంది.

వాణి వాళ్ళ అమ్మ బిత్తరపోయి ఏడుస్తూనే ఉంది.

వాణి "నాకు తల నొప్పిగా ఉంది"

నర్సు అందరిని బయటకు పంపింది.

వాణి పడుకొని, నర్సుని చూస్తూ "ఆ పాట మళ్ళి పెట్టు...." అని అడిగింది.

నర్సు ఫోన్ లో పాట ప్లే చేయడంతో వాణి అందంగా నవ్వుకుంటూ ఉంది.

"Welcome to my darkside" అనే పాట వినపడుతుంది.

అక్కడ కింద పడ్డ నీటి మడుగులో వాణి నవ్వు దెయ్యం నవ్వులా భయంకరంగా కనిపిస్తుంది. 




వాణి డిశ్చార్జ్ అయి తన ఇంటికి వెళ్తుంది.

తన ఫోన్ లో "Welcome to my darkside" పాట ప్లే అవుతూ ఉండగా... ఒక్కతే నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది.












Like Reply
#8
Nice update
Like Reply
#9
aaata bagundi inka veta kosam chudali
[+] 1 user Likes krish1973's post
Like Reply
#10
Nice start
Like Reply
#11
Nice ?. But please don't confuse us from the very beginning ?. I know it's a suspense but clarity is Missing. Thank you ?.
[+] 1 user Likes Sindhu Ram Singh's post
Like Reply
#12
Super interesting
Like Reply
#13
అప్డేట్ చాల బాగుంది
Like Reply
#14
3. గతం గుర్తు తెచ్చుకోవాలని కూడా లేదు







వాణి "నా పేరు వాణి...."

సుజాత కాల్ చిన్నవి చేసుకొని విసుగ్గా చూస్తూ "అవునూ" అంది.

వాణి "ఇది నా ఫ్యామిలీ గురించి డీటెయిల్స్... కరక్టే కదా..."

సుజాత కోపం తగ్గించుకోవడం కోసం పిడికిలి బిగించి వదులుతూ కొద్ది సేపటి తర్వాత వాణి వైపు చూసి తల ఊపింది.

వాణి "మీ ఫ్యామిలీ గురించి చెప్పండి"

సుజాత "నేను కాక నాకు ఒక పనికిమాలిన కొడుకు ఉన్నాడు... " అని ఒత్తి పలుకుతూ "పారిపోయాడు... దొరికితే, పిచ్చి కొట్టుడు కొడతాను" 

వాణి "నా వైపు ఎందుకు కోపంగా చూస్తున్నారు... ఏమయినా చెప్పాలా..."

సుజాత తల అటూ ఇటూ ఊపుతూ "మీ ఇద్దరూ లవర్స్..... మీ పేరెంట్స్ కి తెలియదు... నాకు మాత్రమే తెలుసు..."

వాణి "తను ఎక్కడ ఉన్నాడు, నాకు బాగోలేదు అంటే ఇక్కడకు రావాలి కదా.... లవర్ అంటే అదే కదా... తనకు ఏమయినా....."

సుజాత ఎమోషనల్ అయి అటూ ఇటూ చూస్తూ కన్నీళ్లు బయటకు రాకుండా కవర్ చేసుకుంటుంది.

వాణి ముందుకు వచ్చి సుజాతని హాగ్ చేసుకుంది. సుజాత తట్టుకోలేక ఏడ్చేసింది. 


రెండూ నిముషాల తర్వాత...

కొద్ది సేపటి తర్వాత ఆమె చేతులు, వాణి చేతికి ఉన్న రాగి కంకణం పట్టుకొని "తనకు కూడా యాక్సిడెంట్ అయింది.... ప్రస్తుతం కోమాలో ఉన్నాడు... ఎవరికీ తెలియదు, నువ్వు కూడా ఎవరికీ చెప్పకు...."

వాణి సరే అన్నట్టు తల ఊపింది.



సుజాత, వాణి కళ్ళలోకి చూస్తూ "నువ్వు కోమాలోకి వెళ్లిపోబోయే ముందు నిన్ను ఎవరో నీ ఫ్యామిలీ మనుషులే చంపాలని అనుకుంటున్నారు అని చెప్పావ్ అంట.... ఎవరూ అని అడిగితే చెప్పలేదు.... జాగ్రత్త... ఏదైనా సమస్య అయితే నాకు ఫోన్ చెయ్...." అని ఆప్యాయంగా చెప్పింది

వాణి, సుజాత కళ్ళలోకి చూస్తూ తల ఊపుతూ చిన్నగా నవ్వి "మేడం...  నాతో పెట్టుకుంటే... అది వాళ్ళ సమస్య అవుతుంది కాని నాకు సమస్య కాదు, అయినా నాకు మీరు ఉన్నారు కదా" అంటూ నమ్మకంగా చెప్పింది

సుజాత నవ్వి వాణి బుగ్గ గిల్లి వాణి కూడా నవ్వడంతో కొద్ది సేపు ఉండి అక్కడ నుండి వెళ్లి పోయింది.





ఫోన్ లో సాంగ్ ఎక్కించుకొని ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్లాను.

డోర్ దాటి ఇంట్లోకి అడుగుబెట్టగానే పనిమనిషి వచ్చి నా మొహం మీదే శానిటైజర్ కొట్టింది.

పనిమనిషి "బయట ఎక్కడెక్కడ నుండో తిరిగి వస్తున్నావ్.... అసలే ఇంట్లో సందీప్ అయ్యగారు హార్ట్ పేషెంట్.... సర్లే ఎటూ వచ్చావ్ కదా..... వెళ్లి అంట్లు తోము..." అని లోపలకు వెళ్తుంది.

ఈ మెయిడ్ పేరు సాజిద... ఈ ఇంట్లో తనే పెద్ద మెయిడ్.....

నేను ఇంటికి వచ్చిన కొత్తల్లో నాతొ ప్రేమగా ఉండేది "అమ్మగారు" అంటూ ఉండేది, వద్దు అని చెప్పినా ఊరుకునేది కాదు.

కాని ఎప్పుడైతే మా పేరెంట్స్ నన్ను పట్టించుకోవడం లేదు అని గుర్తు పట్టిందో... నన్ను కూడా పనిమనిషిని చూసినట్టు చూస్తుంది.

ఆమె కళ్ళలో మొదట కనపడ్డ ప్రేమ మళ్ళి కనపడలేదు. నాకు అప్పుడే అర్ధం అయింది. ఈ ప్రేమ డబ్బుతో కొనవచ్చు అనిపించగానే నవ్వొచ్చింది.

సాజిద మొహం పై అసహ్యం స్పష్టంగా కనపడుతుంది.

వాణి "ఓయ్.... ఇటూ రా..." అని పిలవడంతో ఆ సాజిద ర్యాష్ గా నా ముందుకు వచ్చింది.

నా చేతిని సమాంతరంగా జాపి తప్ మని....  సాజిద చెంప మీద కొట్టాను.

సాజిద "ఏయ్..." అని అరుస్తూ ఉండగానే రెండో చెంప పగలడం మాత్రమే కాదు దిమ్మ తిరిగి కింద పడింది. ఇంట్లో ఉండే మిగిలిన పని వాళ్ళు అందరూ వచ్చి చూస్తున్నారు.

సాజిద "నన్నే కొడతావా! నిన్నూ" అంటూ పైకి లేచి నన్ను కొట్టబోయింది... తన చేతిని గాల్లోనే ఆపి తన పొట్టలో కాలుతో కొట్టాను.

కాసేపు కింద పడి మెలికలు తిరిగి మళ్ళి పైకి లేచి నా వైపు కోపంగా చూస్తుంది.

వాణి "నీ కళ్ళు నాకు అసలు నచ్చలేదు" అంటూ ఆమె జుట్టు పట్టుకొని లాక్కొని కిచెన్ లోకి వెళ్లాను.

డోర్ బయట అందరూ నిలబడి ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు అందరూ సాజిద సౌండ్స్ వింటున్నారు. ఒక్కొక్కళ్ళకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.

డోర్ ఓపెన్ చేసుకొని నా ముందరి చేతికి ఉన్న రక్తం కడుక్కుంటూ వాళ్ళ వైపు చూశాను. సాజిద మొహం అంత రక్తం రంగులో అయిపొయింది.

మళ్ళి వాళ్ళ వైపు చూస్తూ "ఏం చూస్తున్నారు.... ఆ చెత్తని బయటకు ఈడ్చేయండి" అన్నాను.

గుటకలు మింగుతూ ఆ పనిమనిషిని బయటకు తీసుకొని వచ్చారు. 

సాజిద "అమ్మ గారికి, అయ్యగారికి చెబితే...." అంటూ నా వైపు చూసింది.

అప్పుడే ఇంట్లోకి అమ్మ నాన్న ఇద్దరూ వచ్చారు.

వాణి "వాళ్ళు అంటే నాకు భయం.... వాళ్ళు నన్ను వదిలేస్తారేమో అని..... ఇప్పుడు ఆ భయం లేదు.... ఎందుకంటే" అని వాళ్ళ వైపు చూస్తూ "నేనే వాళ్ళను వదిలేశాను" అన్నాను.

అమ్మ, నాన్న ఇద్దరూ స్టన్ అయి నన్నే చూస్తున్నారు

సందీప్ ముందుకు వచ్చి నా చేతిని పట్టుకొని "అక్కా..." అన్నాడు.

నేను తన చేతిని నా చేతి నుండి లాగేస్తూ "నా రూమ్ ఎక్కడ?" అని అడిగాను.

పనిమనిషి ఒకరు చెప్పడంతో... పై అంతస్తు 

మా అమ్మ నా ముందుకు వచ్చి "ఏం.... ఏం... మాట్లాడుతున్నావ్... నీకు అమ్మ వద్దా...." అంటూ తత్తర పడుతూ మాట్లాడుతుంది.

నేను విసురుగా మెట్ల మీద పైకి నడుస్తూ ఉంటే, నా వెనకే ముగ్గురు ఫాలో అవుతూ వస్తున్నారు. నా వేగం అందుకోవడంలో తత్తర పడుతున్నారు.

అమ్మ నా చేయి పట్టుకొని ఏడుపుమొహం పెట్టి "వాణి" అంటూ నా వైపు చూస్తుంది.

వాణి "చూడండి.... నా పేరు వాణి... నాకు మీరు మీ పేరు నాకు అసలు తెలియదు.... " అంటూ ముగ్గురు వైపు చూశాను.

అమ్మ  "నా... నా... పేరు సుహాసిని, మీ నాన్న పేరు సుధాకర్... ఇదిగో నీ తమ్ముడు సందీప్.... మా ముగ్గురుకు నువ్వంటే చాలా ఇష్టం.... మన నలుగురం ఫ్యామిలీ" అంది.

పైన నడుస్తూ ఉంటే అన్ని రూమ్స్ ఓపెన్ చేసి కనపడుతున్నాయి, లగ్జరీగా కనిపిస్తున్నాయి.

నాన్న "నువ్వు గతం మర్చిపోయావ్..... గుర్తు వస్తే..... ఇలా అనే దానివి కాదు"

అన్నింటికంటే చివర నా రూమ్ లోకి వెళ్లాను. నా వెనకే వచ్చిన ముగ్గురు నాలాగే రూమ్ లోకి చూసి ఆశ్చర్య పోయారు.

ఆ రూమ్ ఎవరూ నేను క్లీన్ చేయలేదు. మట్టి మట్టిగా ఉంది. గదిలో ఒక చిన్న చాప... అల్మారా ఒపెన్ చేస్తే.... సుమారు ఒక పది జతల బట్టలు.... అందులో కొన్ని చిరిగి తిరిగి కుట్టినవి ఉన్నాయి. నా చేతి మీద సూది గుచ్చుకున్న గాట్లు ఎందుకు వచ్చాయో నాకు ఇప్పుడు అర్ధం అయింది.

గదిలో సూది కింద పడ్డా వినపడేంత నిశ్శబ్దం.....


వాణి "ఇక్కడ ఏమి తీస్కోని వెళ్ళేవి లేవు...."

అమ్మ "వద్దు..... వద్దు..... నువ్వు ఎక్కడకు వెళ్లొద్దు"

వాణి "అంటే ఇక్కడే ఈ ఇంట్లో, ఇదే దరిద్రంలో బ్రతకమంటావా...."

అమ్మ "అద్... అద్... అదీ....."

సందీప్ "గతం...."

వాణి "నాకు గతం గుర్తు తెచ్చుకోవాలని కూడా లేదు"
















Like Reply
#15
Chala chala బాగుంది శివరాం గారూ
Like Reply
#16
Please please update ఇవ్వండి శీవరాం గారూ
[+] 1 user Likes hijames's post
Like Reply
#17
Excellent update
Like Reply
#18
సూపర్
Like Reply
#19
4. రాగి కంకణం






చుట్టూ ఎవరు మాట్లాడుతున్నా వినకుండా వేగంగా మెట్లు దిగి వెళ్ళిపోతున్నాను. నాన్న, అమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయాను. వాళ్ళు కూడా నా వెనక వస్తూనే ఉన్నారు. డోర్ వరకు వస్తూనే అమ్మ బిపి అనిపించి సోఫాలో కూలబడిపోయింది. వెనక్కి తిరిగి వెళ్లాను.

ఆమె నావైపు చూస్తూ "వాణి..." అంటూ ఎదో చెప్పబోయి ఆగిపోతుంది. ఆమె పెదవులు ఎన్నో సార్లు తెరుచుకొని ఏం చెప్పాలో అర్ధం కాక ఆగిపోయాయి.

వాణి "మిస్సెస్ సుహాసిని..... మీరు నన్ను దత్తత తీసుకొని పెంచారు. మీరు మీ కొడుకుతో సమానంగా నన్ను పెంచాల్సిన అవసరం కూడా లేదు, నేను అర్ధం చేసుకున్నాను. నాకు మీ మీద ఏ విధమైనా ద్వేషం లేదు, కాని మీరు ఎందుకు ఇంతలా నా గురించి ఆలోచిస్తున్నారు"

సందీప్ "అలా మాట్లాడకు అక్కా... నిజానికి నువ్వే మా నుండి దూరంగా ఉండే దానివి..... నువ్వే ఎప్పుడూ నన్ను, మా అందరిని ఇబ్బంది పెడుతూ ఉండేదానివి... అందుకే అమ్మ వాళ్ళు నిన్ను కొంచెం తక్కువగా చూశారు అంతే కాని.... నువ్వంటే మా అందరికి చాలా ఇష్టం..."

వాణి "వెరీ గుడ్.... ఇక నుండి మీకు ఏ ఇబ్బంది లేదు.... నేను వెళ్లి పోతాను... నా బ్రతుకు నేను బ్రతుకుతాను... ప్లీజ్.... నన్ను వదిలిపెట్టండి" అంటూ తన చేతిని పట్టుకొని ఉన్న సుహాసిని చేతులవైపు చూసింది.

సుహాసిని మళ్ళి టెన్షన్ గా వాణిని వదిలిపెట్టకుండా పట్టుకొని ఉంది.

ఆ పూట అంతా అలానే ఉన్న, సుధాకర్ మరియు సందీప్ వచ్చి వెళ్తూ ఉన్నారు. డాక్టర్ వచ్చి సుహాసినికి ఇంజెక్షన్ ఇవ్వడమో ఆమె నిద్రలోకి జారుకుంది.

వాణి ఆ పూట అలానే ఉండి తెల్లారి ఫ్రెష్ అప్ అయి తన గదిలో ఉన్న ఒక జత బట్టలలోకి మారిపోయి ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా బయటకు అడుగుపెట్టింది.

అదే రోజు పొద్దున్నే కొట్టిన మెయిడ్ సాజిద తన భర్త మరియు అతని మనుషులతో వచ్చి ఆమెను ఫాలో అవుతూ ఉంటారు.

అయితే సందు తిరగగానే వాణి కనపడదు. సాజిద భర్త మరియు అతనితో వచ్చిన ఇద్దరూ స్టన్ అయి చుట్టూ చూసి తల గోక్కొని వెళ్ళిపోతారు.


మరుసటి రోజు పొద్దున్నే వాణి కనపడక పోవడం సుహాసిని లేచి "వాణి...." అని పెద్దగా అరుస్తూ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటే, వాణి కిచెన్ లో నుండి వచ్చి "అమ్మా... అమ్మా... అమ్మా... ఆగూ.... ఆవేశ పడకు... నేను ఎక్కడకు పోలేదు... రిలాక్స్ అవ్వు" అని కూర్చోబెడుతుంది. అలాగే తిరిగి కిచెన్ లోకి వెళ్లి వంట చేయబోతూ ఉంటే, సుహాసిని కూడా తనతో పాటే ఫాలో అయి వెళ్లి కూతురు వంట చేయడం చూస్తూ ఉంటుంది. మొత్తం అయిపోయాక అక్కడే కిచెన్ లోనే ఇద్దరూ తినేస్తారు. 

సుహాసిని "నీకు వంట చేయడం గుర్తు ఉందా...."

వాణి "నేను గతం మర్చిపోయాను.... అంతే... పిచ్చి దాన్ని అయిపోలేదు"

సుహాసిని ఇబ్బందిగా చూస్తే, వాణి నవ్వేస్తుంది అలా ఇద్దరూ నవ్వేస్తారు.

సుహాసినిని చూడడం కోసం వచ్చిన డాక్టర్ ఆమెను టెస్ట్ చేసి అంతా నార్మల్ అని చెబుతాడు అలాగే వాణిని, ఆమె తలకు ఉన్న కట్టు చూస్తూ కోలుకుంటుంన్నావ్.... వేరే ఏ గొడవలు పెట్టుకోవద్దు అని చెబుతాడు. అతని మాటల్లో ఉన్న చిన్నచూపు వాణి గుర్తు పట్టేస్తుంది.

ఆఫీస్ కి వెళ్తున్నా అని చెప్పి రెడీ అయి ఆఫీస్ కి వెళ్తుంది. కాని అక్కడ ఏ వర్క్ చేయాలో తెలియదు కానీ... సుజాత మాత్రం వాణిని జాగ్రత్తగా ఉండమని బాగా తినమని చెబుతుంది. అలాగే వాణిని పదే... పదే... ఎలా ఉన్నావ్.. ఏదైనా ఉంటే అడుగు అని చెబుతూ ఉంది. వాణి "నాకు ఏమవుతుంది" అని అనుకుని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది.

అయితే అప్పుడే వాణి తల మీద ఒకరు దాడి చేస్తారు. వాణి ఒక్క సారిగా కింద పడుతుంది. ఆమె మొహం అంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. సుజాత ఫోన్ లో అలార్మ్ సౌండ్ రావడంతో కంగారుగా ఇంటికి వెళ్తుంది.

వాణి చుట్టూ ముగ్గురు నిలబడి ఆమెను మళ్ళి కొట్టబోతారు. అయితే వాణి గబా గబా పక్కకు జరిగి పోయింది. 

ఆ ముగ్గురు వాణి మీదకు వస్తూ ఉంటే, వాణి తప్పించుకోక పోగా.... వాళ్ళ మీద ఎగబడి యటాక్ చేసి ముగ్గురుని పిచ్చి పిచ్చిగా కొడుతుంది. దూరం నుండి కూతురుని ఇంటికి తీసుకొని వెళ్ళడం కోసం వచ్చిన సుహాసిని , తల్లికి డ్రైవర్ గా వచ్చిన సందీప్, వాణి ఆ ముగ్గురుని కొట్టడం చూసి షాక్ అవుతారు.

వాణి ఏ మాత్రం ఒక అమ్మాయిలా కాకుండా ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ లా కొడుతుంది.

ఆ రోజు ఎప్పటిలా వాణి తన తల్లి సుహాసినితో పాటు ఇంటికి వెళ్ళినా మరుసటి రోజు సుజాత చెప్పిన అడ్రెస్ కి వెళ్తుంది.




వాణి ఇంట్లోకి వెళ్తూనే బెడ్ పై పడుకుని ఉన్న కరణ్ కనిపించాడు. కాని అతని చేతికి కూడా తన చేతికి ఉన్నట్టుగానే రాగి కంకణం చూసి ఆశ్చర్య పోతుంది.

ఇంతలో సుజాత అక్కడకు ఒక నర్సుని తీసుకొని వచ్చి తన వంటి మీద ఉన్న అన్ని గాయాలు పాతవి, కొత్తవి అన్నింటిని పరిశీలించి మందు ఇస్తారు.




వాణి అనుమానంగా బెడ్ పై కోమాలో ఉన్న కరణ్ ని చూస్తూ ఉంది. అతని వంటి మీద ఏ దెబ్బ లేదు కాని అతను కోమాలో ఉన్నాడు. యాక్సిడెంట్ అబద్దమా అని ఆలోచిస్తూ ఉంది.

సుజాత "బ్రెయిన్ డేడ్ అయి కోమాలో ఉండిపోవాల్సిన నువ్వు బ్రతికి వచ్చావు... బాగుండాల్సిన నా కొడుకు కోమాలో ఉన్నాడు..."

వాణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.

సుజాత "మీ చేతికి ఉన్న కంకణాలు మీ జీవితాలు.... నువ్వు గాయపడితే నా కొడుకు కూడా ఆ నొప్పి అనుభవిస్తాడు" అంటూ ముందు రోజు అతని హెల్త్ రీడింగ్ లు చూపిస్తుంది.

తనకు దెబ్బ తగిలిన సమయంలో కరణ్ ఆ నొప్పిని అనుభవించాడు.


సుజాత "నీకు ముప్పై రోజుల సమయం ఉంది... ఆ సమయం తర్వాత నువ్వు నీకు నచ్చినా నచ్చక పోయినా తిరిగి కోమాలోకి వెళ్లిపోతావ్..."

సుజాత "నువ్వు నాకు మూడు విషయాలలో మాట ఇవ్వాలి"

సుజాత "మొదటిది..... నువ్వు గాయ పడకూడదు, చావకూడదు"

సుజాత "రెండూ..... నీ ఫ్యామిలీలోనే ఒకరు నిన్ను చంపాలని చూస్తున్నారు, అది నువ్వు కనిపెట్టాలి"

సుజాత "మూడు.... నువ్వు నీ హేల్తిగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ టైం కి తీసుకోవాలి... అలాగే అన్ హేల్తి ఫుడ్ తిన కూడదు... "

సుజాత "డీల్..."


వాణి "నేను ఒప్పుకోకపోతే..."

సుజాత వెనక్కి నడుచుకుంటూ వెళ్లి కొడుకు చేతి మీద ఎదో చేసింది.

వాణి నొప్పితో విలవిలలాడి పోయింది.

అప్పుడే గుర్తు వచ్చింది ముందు రోజు తల మీద దెబ్బ తగిలినా కూడా నొప్పి కలగలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా నొప్పిగా అనిపించింది.

సుజాత "నువ్వు బయట అందరికి రాక్షసివి కావచ్చు కాని నా ముందు కాదు నీ వేషాలు..... రేపు పొద్దున్నే నీ ఇంటి ముందు నా కారు వస్తుంది ఆఫీస్ కి టైం రా..." అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.

వాణి అక్కడే నిలబడి కొద్ది సేపూ కరణ్ ని చూసింది.

కరణ్ ని చూస్తూ ఉంటే ఎదో గుర్తు వస్తుంది కానీ అర్ధం కావడం లేదు.

వాణి తల అడ్డంగా ఊపేసి వెనక్కి వెళ్లిపోయింది.





Like Reply
#20
Nice update
[+] 2 users Like Iron man 0206's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)