20-08-2024, 10:44 PM
Bro please give update
Thriller SURYA (Updated on 2nd DEC)
|
20-08-2024, 10:44 PM
Bro please give update
22-08-2024, 10:36 PM
మిడ్నైట్ అప్డేట్ ఇస్తాను.. వెయిట్ అండ్ సి
23-08-2024, 12:11 AM
ప్రసాద్ దగ్గర నుంచి రిమోట్ తీసుకుని సత్యరాజ్ కొంచెం రివైన్డ్ చేసి మళ్ళీ ప్లే చేసాడు..
కొండచిలువ సూర్యని చుట్టుకొని బిగించడం.. సూర్య కదలకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఇంకో 15 సెకండ్లు గడిచిన తర్వాత సూర్య తల ఒక్కసారిగా కుడివైపుకు తిప్పాడు .. కెమెరా యాంగిల్ వల్ల ఏమి జరుగుతుందో తెలియట్లేదు కాని.. అతని ముఖం ఇప్పుడు కొండచిలువ తల పక్కనే ఉంది.. నిత్య, సుజాత, సుచరితలకు నుదిటిమీద చెమటలు పట్టేశాయి.. గుండె నిబ్బరం తో చూస్తున్నది మాత్రం సత్యారాజ్ ఒక్కడే.. కాసేపటికి సూర్య నోటిలోనుంచి రక్తం కారుతు అతగాని మెడ, కంఠం మీదుగా ఎడమ భుజం, షర్ట్ తడిచింది.. అతని ముఖం మాత్రం ఇంకా అలానే కొండచిలువ పైనే ఉంది.. నిత్య ఒకసారి స్టాప్ స్టాప్ అనడం తో పౌస్ చేసారు.. సత్యారాజ్ గారు ఒకసారి వీడియో మొదటినుంచి పెట్టండి.. ఏదో మిస్ అయ్యాము అనిపిస్తోంది.. ఒక్కసారి రీప్లే చేయండి.. తప్పకుండ చేస్తాను.. ఒకసారి పూర్తిగా చూసాక అలానే చేస్తాను.. లెట్ అస్ ఫినిష్ దిస్ ఫస్ట్.. వీడియో మళ్ళీ ప్లే అయిన మూడు నిమిషాలకి పూర్తి అయిపోయింది.. మళ్ళీ వీడియో ప్లే అయినప్పుడు ఇద్దరు వ్యక్తులు సూర్య దగ్గరకు వచ్చి అతన్ని కాపాడుతూ కనపడ్డారు.. ఇది సార్ వీడియో.. కెమెరా వచ్చి మోషన్ అండ్ సౌండ్ ఆక్టివేటెడ్.. ఎప్పుడైతే కెమెరా దగ్గర్లో పెద్దగా చడి చప్పుడు లేకుండా పోయిందో అప్పుడే రికార్డింగ్ ఆగిపోయింది.. కెమెరా లో ఉన్న సెన్సర్ కి చిన్న చిన్న కొండచిలువ పిల్లలు చేసే కదలికలు గుర్తించలేక పోవడం వల్ల అవి సూర్య ని చుట్టుకోవడం రికార్డు అవ్వలేదు.. దీని బట్టి అతర్వాత పెద్దగా జరిగింది ఏమిలేదు అనిపిస్తోంది.. సూపర్ నేచరల్ ఫేనోమెనన్ ఏమైనా జరిగిందా.. దెయ్యమో భూతమో పోనీ దేవుడో సాయం చేశాడా.. ఏమి అర్ధం కాలేదు నాకు.. అతని మెడికల్ రిపోర్ట్స్ ఇవి అంటూ ఒక ఫైల్ టేబుల్ మీద పెట్టాడు.. సత్యారాజ్ గారు మీరు ప్రముఖ బయాలజీస్ట్, వైల్డ్ లైఫ్ మీద ఎంతో రీసెర్చ్ చేసారు.. నిత్య వచ్చి రెప్టైల్స్ ని స్టడీ చేసింది.. Dr జెర్రీ మార్టిన్ గారి శిష్యురాలు.. సుచరిత గారు మీకు తోచిన సాయం చేయండి.. మీ పాప సుజాత కైనా ఏమైన తెలిస్తే చెప్పమనండి.. అసలు ఇది ఎలా సాధ్యమో అర్ధం కావట్లేదు.. ఇంకో అరగంటలో నారాయణ హాస్పిటల్ నుంచి ఒక సీనియర్ డాక్టర్ రాజేష్ వస్తున్నారు ఇక్కడికి.. ఆయన వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్స్ కేసెస్ డీల్ చేసారు.. మీ పర్మిషన్ లేకుండా ఆయన్ని ఇక్కడికి పిలిచాను.. మీకు అభ్యన్తరం ఉండదు అనుకుంటున్నాను సార్.. దయచేసి నాకు ఈ హెల్ప్ చేయండి.. నేను ఒక అరగంట లో Dr రాజేష్ గారిని తీసుకోని వస్తాను.. ఈలోగా మీరు ఆలోచించండి.. రిపోర్ట్ చూడండి మీకే ఏమైనా అర్ధం అయితే నాకు చెప్పండి మేడమ్ అంటూ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు Dr ప్రసాద్. ఇంటిలోపల కాసేపు నిశ్శబ్దం అలుముకుంది.. నిత్య కి ఎందుకో మరొకసారి చుస్తే అర్ధం అవుతుంది అనే ఆశ తో మళ్ళీ వీడియో ప్లే చేసింది.. నోట్ పాడ్ తీసుకుని.. పాయింట్స్ నోట్ చేసుకోవడం చూసి సుజాత ఆశ్చర్య పోయింది.. సత్యారాజ్ సుచరిత మాత్రం సైలెంట్ గా వీడియో చూస్తున్నారు.. సత్యారాజ్: వీడెవడో కాని కారణజన్ముడులా లేడు.. ఇది నిజంగా సైన్స్ కి అందని వండర్ అనిపిస్తోంది.. సుచరిత: అతని మానసిక పరిస్థితి ఆలోచించు సత్య..నాకు తెలిసి అతను చావుకి సిద్దపడిపోయినట్టు ఉన్నాడు చూస్తుంటే.. చలనం లేదు, భయం లేదు, కొండచిలువ ని అంత దగ్గరగా చూస్తున్నపుడు జూగుప్స కూడా లేదు.. ఎవరో కాపాడారు అతన్ని.. ఆ కొండచిలువ ముసలిది అయిపోయిందా పోనీ.. శక్తి లేక చచ్చిపోయిందా పోనీ సత్యారాజ్ : నూటికి 95 మంది పాములు అంటే భయమో జూగుప్స కచ్చితంగా ఉండి తీరుతుంది.. అలాంటిది వీడెంటి ఏదో గోడ మీద పిల్లిని చూసినట్టు అంత కామ్ గా ఉన్నాడు.. సుచరిత: ఎస్.. హి లుక్స్ లైక్ హి డోంట్ కేర్.. సుజాత: అమ్మ ఒకసారి.. వెనక్కి వెళ్ళండి.. ఐ మీన్ రివైన్డ్ చేయండి జస్ట్ కొండచిలువ వచ్చే ముందు వరకు.. నిత్య మాత్రం తన నోట్ పాడ్ పైన నోట్స్ రాసుకుంటోంది.. రివైన్డ్ చేసి చూస్తున్నపుడు.. సుజాత పౌస్ చేసి స్క్రీన్ ని జూమ్ చేసింది.. కరెక్ట్ గా సూర్య కట్టేసిన చెట్టు కింద చిన్న ఎర్ర చుక్క లాగా వెలుగుతోంది.. ముప్పై అడుగుల దూరం కావడం వల్ల అదేంటో అర్ధం కావట్లేదు.. సుచరిత మాత్రం ఒకసారి సూర్యని కలవాలండి.. అతనికి PTSD వచ్చే అవకాశం ఉంది.. సత్యారాజ్: నాకు మాత్రం వాంతులు అయ్యేలా ఉంది.. నిత్య ముఖంలో ఏదో తెలియని సంతోషం.. ఏదో కనుగొన్నను అనే గర్వం కనపడుతోంది.. నిత్య: అంకుల్ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేశాను వీడియో నుంచి.. ఇవి కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కచ్చితంగా మనం సూర్య కి ఏమైందో ఇట్టే తెలిసిపోతుంది.. సత్యారాజ్: గుడ్ గర్ల్.. నీకు ఏట్ లీస్ట్ ఆలోచన అయిన వచ్చింది.. నాకైతే ఇలాంటి కేస్ చూడడం ఇదే ఫస్ట్ టైం.. గుడ్ లక్ అమ్మ.. నిత్య: అంకుల్, ఆంటీ.. నేను Dr జెర్రీ మార్టిన్ గారితో మాట్లాడాలి.. అతర్వాత మనం డిస్కషన్ చేద్దాం.. ఓకే నా.. నా డౌట్స్ ఆయన మాత్రమే తీరుస్తారు.. సుచరిత: ఓకే నిత్య. గో ఆ హెడ్.. ప్రసాద్ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది.. నిత్య జెర్రీ మార్టిన్ తో మాట్లాడుతుండగా Dr రాజేష్ అండ్ Dr ప్రసాద్ లోపలికి వచ్చారు. కుశల ప్రశ్నలు వేసుకున్న తరువాత.. సుజాత Dr ప్రసాద్ ని పక్కకు తీసుకువెళ్లి రెడ్ చుక్క గురించి చెప్పింది.. అది చుసిన ప్రసాద్ కి అదేంటో అర్ధం అయ్యింది.. ఎందుకైనా మంచిది అని.. బ్రిజేష్ కి కాల్ చేసాడు.. బ్రిజేష్: హలో ప్రసాద్: హలో బ్రిజేష్ బ్రిజేష్: చెప్పు.. ఏమైనా తెలిసిందా.. ప్రసాద్: లేదు ఇంకా.. నీ హెల్ప్ కావాలి.. ఎవరైనా బెంగళూరు కంటోన్మెంట్ లో నీకు తెలిసిన సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టెక్ గయ్ (TECH GUY) ఉన్నాడా.. బ్రిజేష్: నవ్వుతు.. నువ్వు ఉన్నది ఇండియన్ సిలికాన్ వాలీ లో.. మన వాళ్లే చాలా మంది సైబర్ సెక్యూరిటీ లో ఉన్నారు.. నీ ఇష్యూ ఏంటో చెప్పు.. నేను ఆరెంజ్ చేస్తా.. ప్రసాద్: సూర్య స్మార్ట్ వాచ్ డేటా రికవరీ చేయాలి.. బ్రిజేష్: ఓకే ఓకే.. వాట్సాప్ లో నాకు నీ లొకేషన్ పంపించు.. నేను అప్డేట్ ఇస్తాను 10 నిమిషాల్లో.. ప్రసాద్: థాంక్స్ బ్రిజేష్.. బ్రిజేష్: ఇట్స్ ఓకే.. బాయ్.. లోపలికి వచ్చిన ప్రసాద్ Dr రాజేష్, సుచరిత, సత్యారాజ్ సీరియస్ డిస్కషన్ చేస్తుండడం చూసి ఆనందించాడు.. చుస్తే సుజాత నిత్య కనపడలేదు.. ప్రసాద్: నిత్య, సుజాత ఎక్కడ సార్.. సత్య: ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్లారు.. గంటలో వస్తాము అన్నారు.. ప్రసాద్: అయ్యో.. అయితే డిస్కషన్ గంట లేట్ అవుతుందా.. డోంట్ వర్రీ ప్రసాద్.. ఈరోజు ఈ కేస్ పనిపడదాం.. ఈలోగా బ్రిజేష్ పంపిన టెక్ జీనియస్ లొకేషన్ కి వచ్చి కాల్ చేసాడు ప్రసాద్ కి.. ప్రసాద్ బయటికి వెళ్లి అతనికి స్మార్ట్ వాచ్ అప్పచెప్పాడు.. టెక్ గై : గుడ్. ఒక గంటలోపు మీకు డేటా మొత్తం రేట్రివ్ చేసి ఇస్తాను సార్.. ప్రసాద్: ఓకే. ప్రింట్స్ 5 కాపీస్ కావాలి. ఓకే నా.. డేటా జాగ్రత్త టెక్ గై: ఓకే సార్.. లోపలికి వచ్చాక ప్రసాద్ Dr రాజేష్ తో మాట్లాడి.. చెప్పండి సార్.. మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయం మీద.. Dr రాజేష్: ఇది పెక్యూలియార్ కేస్.. నువ్వు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ చూసాను.. ఆశ్చర్యం వేసింది.. కేవలం మూడు పక్కటేముకలు విరగడం.. భుజం మీద గాయం.. ఇట్స్ అవుట్ అఫ్ థిస్ వరల్డ్. నేను చుసిన పైథోన్ ఎటాక్ కేస్ లో మనిషి ఎముకలు ముఖ్యంగా పక్కటేముకలు విరిగి ఊపిరి తిత్తుల్లోకి గుచ్చుకున్నాయి.. కొన్ని అతని గుండెలోకి గుచ్చుకున్నాయి.. అతని మరణం ఊహించడానికే భయం వేస్తోంది.. ఆ కేస్ లో పైథోన్ వచ్చి 11 అడుగులు ఉంది.. జూ లోపల జరిగిన సంఘటన ఇది. ఇక్కడ వీడియో లో చుస్తే కనీసం 15 టు 20 అడుగులు ఉండే పైథోన్ ఎటాక్ ని తట్టుకొని కేవలం 3 ఎముకలు విరగడం అంటే ఆశ్చర్యం గానే ఉంది.. రిపోర్ట్స్ లో అతని బోన్ డేన్సిటీ టెస్ట్ చూసాను.. బహుశా అక్కడ డాక్టర్లకు కూడా ఇదే అనుమానం వచ్చి ఆ టెస్ట్ చేయించారు అనుకుంట.. అతని బోన్ డేన్సిటీ మాములు మనిషి కన్నా 40% అధికంగా ఉంది.. అందుకే ఎముకలు విరగలేదు అనే కంక్లూషన్ కి రావచ్చు ఈ విషయం లో.. ప్రసాద్: కాని అతను ఎలా సర్వైవ్ అయ్యాడు అంటారు సార్.. Dr రాజేష్: ప్యూర్ లక్ అనడం తప్ప నాకు ఎటువంటి ఆలోచన తట్టడం లేదు.. ఓకే సార్.. వీడియో చూసారు కాదా.. కాసేపట్లో ఇంకొంత డేటా వస్తుందని ఆశిస్తున్నాను.. అతర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.. సుచరిత వంటగదిలో అందరికి ఉల్లిపాయ పకోడీ, మిర్చి బజ్జి వేసి అందరికి ప్లేటిలో సర్వ్ చేసే టైం కి నిత్య అండ్ సుజాత కార్లో ఇంటికి వచ్చారు.. Dr ప్రసాద్: నిత్య ఎక్కడికి వెళ్ళావ్.. నిత్య: ల్యాబ్ లో పని ఉంటే సుజాత ని తీసుకుని వెళ్ళాను సార్.. కాసేపట్లో మీ కేస్ సాల్వ్ అవుతుంది చూడండి. ప్రసాద్: ఓహ్.. థాట్స్ గుడ్ టు హియర్.. థాంక్ యు నిత్య ఫర్ యువర్ టైం. నిత్య: ది ప్లెషర్ ఇస్ మైన్ Dr ప్రసాద్.. ఇలాంటి కేస్ చాలా అరుదుగా వస్తాయి.. నాకు ఇంకో హెల్ప్ కావాలి.. ప్రసాద్: చెప్పు నిత్య.. ఎనీథింగ్ ఫర్ యు. నిత్య : నేను ఫారెస్ట్ గార్డ్ తో మాట్లాడాలి.. అదే పాముని పూడ్చి పెట్టరు కదా.. వారితో నన్ను మాట్లాడించండి.. ప్రసాద్: ఓకే.. ఐ విల్ సి నిత్య: ఇప్పుడే సార్. నా థియరీ కరెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను.. అందుకే ప్లీజ్ ఇప్పుడే మాట్లాడితే తేలిపోతుంది. ప్రసాద్: ఓకే.. నేను బ్రిజేష్ తో మాట్లాడి ఇప్పుడే నీతో మాట్లాడించడానికి ప్రయత్నిస్తాను.. Dr ప్రసాద్: హలో బ్రిజేష్ బ్రిజేష్: హ ఇంకా ఏమి హెల్ప్ కావాలి ప్రసాద్: నీకు ఎలా తెలుసు.. నేను హెల్ప్ కోసమే కాల్ చేసానని బ్రిజేష్: అదంతా ఇప్పుడు ఎందుకు కాని.. ఎంటో చెప్పు ప్రసాద్: ఫారెస్ట్ గార్డ్ గురించి అడిగాడు బ్రిజేష్: అతను ఇప్పుడు గెస్ట్ హౌస్ లో ఉంటాడు.. కాల్ చేసి నీతో మాట్లాడమని చెప్తాను.. ప్రసాద్: ఇప్పుడే చేయమను.. అర్జెంటు బ్రిజేష్: ఓకే.. డన్ అందరు డ్రాయింగ్ రూమ్ సోఫాలో కూర్చున్నారు.. పెద్ద సోఫాలో.. సుజాత, సత్యారాజ్, సుచరిత.. పెద్ద సోఫా కి కుడివైపు Dr రాజేష్.. ఎడమ వైపు నిత్య కూర్చున్నారు.. అందరికి అభిముఖం గా Dr ప్రసాద్ ఒక కుర్చీలో కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేసాడు.. ఇంతలో టెక్ గై నుంచి కాల్ వచ్చింది.. షిట్ అనుకుంటూ బయటికి వెళ్ళాడు Dr ప్రసాద్.. సార్.. ఇదిగోండి డేటా.. వాచ్ ఓనర్ డేటా చుస్తే అతను చనిపోయాడు అనిపించింది.. కాని అతను బ్రతికే ఉన్నాడు అని బ్రిజేష్ గారు చెప్పారు.. ఇదిగోండి రిఫరెన్స్ పాయింట్స్.. మాక్సిమం ఎర్రర్ వచ్చి 10%. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి. డేటా ప్యాకెట్ తీసుకోని వచ్చి.. Dr రాజేష్, సత్యారాజ్, నిత్య కి తలో ప్యాకెట్ ఇచ్చి.. ఇది సూర్య స్మార్ట్ వాచ్ డేటా.. మీకు ఏమైనా ఉపయోగ పడొచ్చు అని తీసుకోచ్చాను.. నిత్య ఓపెన్ చేసి చూసి.. వెంటనే dr జెర్రీ మార్టిన్ కి కాల్ చేసింది.. Dr రాజేష్: వావ్.. అస్సలు ఎక్సపెక్ట్ చేయలేదు.. హార్ట్ బీట్ చూడు Dr ప్రసాద్.. ప్రసాద్: వావ్.. సుచరిత కి కళ్ళు తిరిగాయి.. సత్యరాజ్ కి వాంతులు అయ్యాయి.. సుజాత మాత్రం స్థానువులా కూర్చుంది. లోపలికి వచ్చిన నిత్య కి Dr ప్రసాద్ సెల్ ఫోన్ ఇచ్చాడు.. గార్డ్: హలో నిత్య మేడమ్.. మీ గురించి ప్రసాద్ గారు చెప్పారు.. చెప్పండి మీకు ఏమి కావాలి.. నిత్య: మీరు ఫారెస్ట్ లో కొండచిలువని పాతి పెట్టరు అంట కదా.. గార్డ్: అవును మేడమ్.. నిత్య: అదేనండి.. కొండచిలువకి పోస్ట్ మోర్టెమ్ లేక ఆటోప్సీ ( AUTOPSY) చేసారా.. ప్రతి పెద్ద జంతువుకి చేస్తారు కదా.. గార్డ్: చేసారు మేడమ్ నిత్య: గుడ్.. రిపోర్ట్ ఎవరి దగ్గర ఉంది.. గార్డ్: నా దగ్గరే ఉంది.. ఫైల్ చేశాను.. కావాలంటే మీకు ఫోటో తీసి వాట్సాప్ చేస్తాను. నిత్య: థాంక్ యు.. ఇంకో విషయం.. శవ పరీక్ష చేసేప్పుడు మీరు దగ్గరే ఉన్నారా.. గార్డ్: హ.. ఉన్నాను అండి.. డాక్టర్ గారు చెప్తుంటే నేనే రాసాను.. ఫొటోస్ కూడా తీసాము నిత్య: ఓకే.. మీరు వాట్సాప్ లో పంపండి.. ఫొటోస్ కూడా.. గార్డ్: ఓకే.. XxxxxxxxxxxPREDATORxxxxxxxxxxxxxX Show Starts కమింగ్ ఆన్ సాటర్డే నైట్ ఏట్ 11 pm
23-08-2024, 12:14 AM
Nice update
23-08-2024, 12:27 AM
Nice update
23-08-2024, 12:32 AM
Nice update sir
23-08-2024, 05:27 AM
Super brother eagerly waiting for your next update
23-08-2024, 11:58 AM
భలే సస్పెన్స్ లో పెట్టి ఆపేసారు. కేసుని ఎలా సాల్వ్ చేయబోతున్నారో, ఆ మధ్యలో వచ్చి హెల్ప్ చేసిన ఇద్దరు వ్యక్తులెవ్వరో, వాళ్ళని అయిడెంటిఫై చేయోచ్చుగా..అప్డేట్ బావుంది బ్రో...కొనసాగించండి
: :ఉదయ్
23-08-2024, 12:38 PM
అప్డేట్ చాల బాగుంది
23-08-2024, 02:00 PM
(23-08-2024, 11:58 AM)Uday Wrote: భలే సస్పెన్స్ లో పెట్టి ఆపేసారు. కేసుని ఎలా సాల్వ్ చేయబోతున్నారో, ఆ మధ్యలో వచ్చి హెల్ప్ చేసిన ఇద్దరు వ్యక్తులెవ్వరో, వాళ్ళని అయిడెంటిఫై చేయోచ్చుగా..అప్డేట్ బావుంది బ్రో...కొనసాగించండి కథ సరిగ్గా చదవండి.. ఆ ఇద్దరు వ్యక్తులు బ్రిజేష్ రెస్క్యూ టీం లో వారు.. తెల్లవారు జామున రికార్డు అయిన visual అవి.. మోషన్ అండ్ సౌండ్ ఆక్టివేటెడ్ కెమెరా కదా
23-08-2024, 02:22 PM
సూపర్...
Bro ఇలా కొంచెం కొంచెం ఇచ్చి మమ్మల్ని టెన్సన్ పెట్టకుండా ఒకేసారి పెద్ద అప్డేట్ ఇవ్వండి
23-08-2024, 02:49 PM
23-08-2024, 02:53 PM
Viking45, నీకు గుర్తుందా ఈ thread former updates feedback ఉంటే ఇవ్వండి అంటే నేను description పెంచు అన్నాను.
రాస్తున్నా కొద్ది మన writing improve అవుతుంది, అది ఇప్పుడు clear గా కనిపిస్తుంది. Get going.
23-08-2024, 03:25 PM
Excellent update bro mimd blowing
23-08-2024, 05:25 PM
ఈరోజే అప్డేట్ కావాలి అని చాలా మందికి అనిపిస్తే చెప్పండి..
ఈరోజే పోస్ట్ చేస్తాను
23-08-2024, 05:28 PM
(23-08-2024, 05:25 PM)Viking45 Wrote: ఈరోజే అప్డేట్ కావాలి అని చాలా మందికి అనిపిస్తే చెప్పండి.. మీ దయ మా ప్రాప్తం...పోస్ట్ చేయి బ్రో
: :ఉదయ్
23-08-2024, 06:11 PM
23-08-2024, 06:59 PM
Bro suspance Medea suspence endi bro. Mari serial la sagadhestunnaru. Twaraga update evvandi bro
|
« Next Oldest | Next Newest »
|