17-08-2024, 10:42 AM
సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్లు ఉంది
Thriller SURYA (Updated on 2nd DEC)
|
17-08-2024, 10:42 AM
సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్లు ఉంది
17-08-2024, 01:19 PM
ఇంకా స్టోరీ లోకి వెళ్ళలేదు సార్..
ఇంకో 10 టు 15 ఎపిసోడ్స్ తర్వాత plot paris కి షిఫ్ట్ అవుతుంది.. అప్పటినుంచి థ్రిల్ బాగుంటుంది.. థిస్ is జస్ట్ ది బేగినింగ్
17-08-2024, 02:38 PM
GOOD UPDATE
19-08-2024, 12:03 AM
ఇది అగర్వాల్ గారు ఆరోజు అడివిలో జరిగింది..
నా కెరీర్ లో అదే చివరి రోజు అనుకున్నాను.. కాని సూర్య బ్రతకడంవల్ల నేను ఇంకా సర్వీస్ లో కంటిన్యూ అవుతున్నాను అగర్వాల్ : కళ్ళకు కట్టినట్టు చెప్పారు.. కాని నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి బ్రిజేష్ గారు.. అసలు ఆ కొండచిలువని ఎవరు చంపారు.. ఒక వేళ వేరే వాళ్లే చంపితే అతన్ని ఎవరు ఎందుకు కాపాడారు? బ్రిజేష్: ఎస్ గుడ్ క్వశ్చన్.. వీడియో ఉంటే మీకే అర్ధం అయ్యేది.. కాని ఆ వీడియో ఇప్పుడు కాన్ఫిడెంటషియల్ రికార్డ్స్ లో ఉంది.. (confidential records) Dr ప్రసాద్: నా దగ్గర కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి.. ఆ కెమెరా రికార్డింగ్ లోని కొన్ని స్నాప్స్ నా దగ్గర ఉన్నాయి.. కావాలంటే నా ఆఫీస్ కి రండి.. చూపిస్తాను.. అగర్వాల్: ఓకే.. Dr ప్రసాద్ మీరు చెప్పండి.. అ తర్వాత ఏమి జరిగింది.. నాగాలాండ్ దుర్గటన జరిగిన మారసటి రోజు నాకు బ్రిజేష్ కాల్ చేసి విషయం చెప్పాడు.. సూర్య కేస్ అంతకుముందు హేండిల్ చేసి ఉండడం వల్ల.. అతని మానసిక పరిస్థితి పై పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా అది నా బాధ్యత అనిపించింది. వెంటనే జబల్పూర్ లోని ఆఫీస్ లో రిపోర్ట్ చేసి.. సూర్య విషయం క్లుప్తంగా చెప్పి గౌహతికి బయలుదేరాను. సూర్యకి ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్ అస్సాం లోనే అతి పెద్ద మల్టీస్పెషలిటీ హాస్పిటల్.. సూర్య ని ఐసీయూ లోనే ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు.. రిపోర్ట్స్ లో అతనికి 3 పక్కటేముకలు విరిగాయి , భుజం మీద గాయం, మెడ మీద గాయం, తల వెనక గాయం తప్ప పెద్దగా దెబ్బలు కనపడలేదు.. కాని సూర్యకి మత్తు ఇచ్చి ఉంచారు.. స్పృహలోనికి తీసుకువస్తే పక్కటేముకుల వల్ల చాలా ఇబ్బంది పడతాడు అని మత్తులో ఉంచారు.. కాసేపటికి ఆఫీసర్ బ్రిజేష్ వచ్చి కలిసాడు.. అసలు ఎందుకు ఎలా అని తెలిసాక నేను షాక్ అయ్యాను మీలాగా..... బ్రిజేష్: Dr ప్రసాద్.. ఎలా ఉన్నారు.. చాలా రోజులతర్వాత కలిసాము.. ఫ్యామిలీ ఎలా ఉంది. Dr ప్రసాద్: ఎస్ ఆఫీసర్.. ఫైన్.. బాగున్నాను.. సూర్య రిపోర్ట్స్ చూసాను.. మీరు చెప్పిన ప్రకారం అతనికి చాలా సాధారణమైన దెబ్బలు తగిలాయి.. ఏదో పెద్ద పైథోన్ అతనిమీద పడినట్టు లేదు సార్.. బ్రిజేష్: ఎస్ Dr ప్రసాద్.. మీరు చెప్పింది నిజమే అయ్యుండచ్చు.. కాని నేను చెప్పింది కూడా నిజమే.. మీరు ఎవరితో చెప్పాను అంటే.." సూర్య మీద ఎటాక్ జరిగినపుడు ఆ సమీపంలో ఒక చెట్టుకి ఉన్న కెమెరా లో ఆ సన్నివేశాలు రికార్డు అయ్యాయి.." Dr ప్రసాద్: హోలీ ఫక్.. బ్రిజేష్: ఎస్.. రియల్లీ.. నా బ్యాగ్ లో కాపీ మీకోసమే తెచ్చాను.. ప్లే చేసి చూడండి.. అంటూ ఒక USB డ్రైవ్ ఇచ్చాడు.. Dr ప్రసాద్: థాంక్ యు బ్రిజేష్. ఇ విల్ సి.. వీడియో చుసిన ప్రసాద్ కి కాళ్ళు చేతులు ఆడలేదు.. ఇది అసాధ్యం అనిపిస్తోంది కాని కళ్ళ ముందు సాక్ష్యం ఉంది.. ఈ టెన్షన్ తట్టుకోలేక.. నింహాన్స్ బెంగళూరు (NIMHANS) కి కాల్స్ చేసి జరిగిన విషయం చెప్పి సొల్యూషన్ అడిగాడు.. నింహాన్స్ బెంగళూరు Dr సుచరిత స్పీకింగ్.. Dr ప్రసాద్: గుడ్ ఈవెనింగ్ మిస్.. నేను మీ ఫేవరెట్ స్టూడెంట్ ప్రసాద్ ని.. సుచరిత: హాయ్ ప్రసాద్.. ఎలా ఉన్నావ్.. ఆర్మీ లో లైఫ్ ఎలా ఉంది.. Dr ప్రసాద్: ఎస్ ఫైన్ మేడమ్.. నాకో సమస్య వచ్చింది.. మీ సహాయం కావాలి.. సుచరిత: ఓహ్.. ఎనీథింగ్ సీరియస్? నా దగ్గరకు రా మాట్లాడుకుందాం.. Dr ప్రసాద్: డెఫనిట్ గా మేడమ్.. ఇప్పుడే బయలుదేరుతున్న.. ఇంకో 24 hrs లోపు మీ ముందు ఉంటా మేడమ్ సుచరిత: డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేయి ప్రసాద్ .. నా హస్బెండ్ ఉంటారు.. తెలుసుగా నీకు.. Dr ప్రసాద్: ఆయనతో కూడా పని ఉండొచ్చు.. డైరెక్ట్ ఇంటికే వస్తాను.. బాయ్ మేడమ్.. 65 సంవత్సరాల సుచరితకి ప్రసాద్ అంటే ఇష్టం గౌరవం.. ప్రతి సంవత్సరం కాల్స్ చేసి పండుగలకి విష్ చేయడం వాడికి ఆనవాయితీ.. ఈ సారి ఏమి కబుర్లు పట్టుకొస్తున్నాడో అంటూ భర్తకి విషయం చెప్పింది.. సుచరిత భర్త సత్యారాజ్ ఒక పెద్ద బయాలజీస్ట్.. టైగర్ కన్సర్వేషన్ లో ఈయనది పెద్ద పాత్ర. వీరికి ఒక్కతే కూతురు పేరు సుజాత తను వెటరెనరీ డాక్టర్. పెళ్లి అయ్యి డివోర్స్ కూడా అయ్యింది.. బెంగళూరు లో ప్రాక్టీస్ చేస్తూ తల్లి తండ్రులకు దగ్గర్లో ఒక ఫ్లాట్ తీసుకోని ఉంటుంది. ప్రసాద్ కి గౌహతి నుంచి బెంగళూరు కి డైరెక్ట్ ఫ్లైట్ లేదని తెలిసి కోల్కతా మీదుగా వెళ్ళడానికి మరుసటి రోజుకి టికెట్ తీసుకున్నాడు.. వెళ్లే ముందు ఆరోజు సూర్యని ఫస్ట్ చూసి ట్రీట్మెంట్ ఇచ్చిన పారామెడిక్ తో మాట్లాడడానికి బ్రిజేష్ ని కాంటాక్ట్ చేసాడు.. Dr ప్రసాద్: బ్రిజేష్.. నాకు మీ టీం లో సూర్యకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన పారామెడిక్ తో మాట్లాడాలి.. కుదిరితే అతన్ని నెక్స్ట్ ఫ్లైట్ కి గౌహతి రమ్మని చెప్పగలవా.. బ్రిజేష్: అవసరం లేదు అతను ఆల్రెడీ బయలుదేరాడు.. హెడ్ క్వార్టర్స్ లో జరిగిన సంఘటనల మీద ఎంక్వయిరీ లో కూర్చున్నాడు.. ఇంకో 2 hrs లోపు అతన్ని ని దగ్గరకి పంపుతాను.. ప్రసాద్: థాంక్స్ బ్రిజేష్.. ఇంకా.. సూర్య ఒంటిమిద బట్టలు.. బ్లడ్ స్టైన్స్ ఉన్న పర్లేదు.. వాటిని చూసి ఒక అంచనా వేయగలము.. కుదిరితే అవి కూడా నాకు కావాలి.. బ్రిజేష్: హెలికాప్టర్ లో కి ఎక్కగానే.. అతని ఒంటిమిద బట్టలు మెడిక్ కత్తెరతో కట్ చేసారు.. ఈసీజీ, బీపీ చూసాడు.. అతర్వాత వాటిని ఒక బ్యాగ్ లో ఉంచారు.. హాస్పిటల్ లోపలే ఉన్నాయి.. నీకు వాటిని కూడా అప్పచెబుతాను.. కాని వాటిని జాగ్రత్తగా వెనక్కి ఇచ్చేయాలి.. ప్రసాద్: ఖచ్చితంగా బ్రిజేష్.. థాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ బ్రిజేష్: ఎనీథింగ్ ఫర్ థాట్ వండర్ బాయ్ సూర్య. కొన్ని గంటల తరువాత మెడిక్ తో మాట్లాడి సూర్య యూనిఫామ్, అతని స్మార్ట్ వాచ్, చేతికి ఉన్న కడియం, రెండు చెవి పోగులు, మెడలో ఉన్న తాడు దానికి ఉన్న నర్సింహ యంత్రం.. ఫారం మీద సంతకం చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసి బెంగళూరు కి బయలుదేరాడు. మరుసటి రోజు ఆదివారం కావడం తో సుచరిత ఆవిడ భర్త సత్యారాజ్, కూతురు సుజాత ఇందిరా నగర్ లోని వారి 3 బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో భోజనం చేస్తూ ఉన్నారు.. Dr ప్రసాద్ గురించి ప్రస్తావిస్తూ అతని సమస్య ఏమై ఉంటుందో అని ముగ్గురు డిస్కషన్ చేస్తూ ఉంటుండగా బెల్ మోగింది.. డోర్ ఓపెన్ చేసిన సుజాత ప్రసాద్ తో పాటు ఇంకో మనిషిని ఎక్సపెక్ట్ చేయలేదు.. ఆవిడ ఎవరో తనకు తెలీదు.. లోపలికి వచ్చిన ప్రసాద్ ని కూర్చోపెట్టి జ్యూస్ ఇచ్చి భోజనం చేయమని అడిగింది సుచరిత.. ప్రసాద్: లేదు మేడమ్.. ఈవిడ వరల్డ్ ఫేమస్ Dr జెర్రీ మార్టిన్ కి అసిస్టెంట్.. పేరు నిత్య రెప్టైల్ స్పెషలిస్ట్ ( Reptile స్పెషలిస్ట్). భోజనం ఆల్రెడీ చేశాను.. థాంక్స్ మేడమ్ సత్యారాజ్: ఓహ్.. నైస్ మీటింగ్ యు లేడీ.. కుశల ప్రశ్నలు అయిన తర్వాత డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని పాయింట్ కి వచ్చాడు Dr ప్రసాద్. మేడమ్ మీకు నేను చెప్పబోయే విషయాలు బయట ఎవరికి తెలియకూడదు.. అందుకే ఈ నాన్ డిస్క్లాషర్ అగ్రిమెంట్ ( NON-DISCLOSURE AGREEMENT ) మీద సంతకం చేయండి.. దీని వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.. ప్లీజ్ అర్ధం చేసుకుంటారు అని అనుకుంటున్నా మేడమ్. సుచరిత సత్యారాజ్ వెంటనే సంతకం చేసి ఇచ్చారు.. ని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది రా.. ఏంటి విషయం?? సూర్య గురించి మిలిటరీలో అతను ఎదురకున్న పరిస్థితులు చెప్పి చివరకు నాగాలాండ్ విషయం చెప్పాడు Dr ప్రసాద్. సుచరిత: మనిషిని చూసి మాట్లాడి ఆ తర్వాత ఒక అంచనా కి రావాలి.. సూర్య ని కలవకుండా నేనయితే ఏమి చెప్పలేను.. Dr ప్రసాద్: ఎస్ మేడమ్.. అతనికి కేస్ ఫస్ట్ నుంచి నేనే హేండిల్ చేశాను.. అందుకే ఇప్పుడు మీకు అన్ని వివరించి చెప్పాను.. ఇప్పుడు మీకో వీడియో చూపెడతాను.. అది చూసి మీరు మీ అస్సేస్మెంట్ ఇవ్వండి.. ఇది నాగాలాండ్ అడవిలో జరిగిన సంఘటనకు చెందింది. సుజాత కూడా ఇంటరెస్ట్ చూపించడం తో తను కూడా ఫారం మీద సంతకం చేసి 65" ఇంచ్ ఎల్ఈడి టీవీ ముందు కూర్చున్నారు. వీడియో ప్లే అవ్వడం స్టార్ట్ అవ్వగానే ప్రసాద్ సిట్యుయేషన్ ఎక్సప్లయిన్ చేస్తూ ఉన్నాడు.. ...... PREY.... కెమెరాకు సుమారు ముప్పై అడుగుల దూరంలో ఒక మనిషి చెట్టుకు కట్టివేయబడి ఉన్నాడు.. అతని చేతులు వెనక్కి సంకెళ్లు వేయబడి ఉన్నాయి. చుట్టు పక్షుల అరుపులు వినపడుతున్నాయి.. కోతులు కీచు కీచు అంటూ అరస్తూ ఉన్నాయి.. సత్యారాజ్ వీడియో పౌస్ చేసి.. 'ఏదో అడవిలో పెద్ద మృగం వచ్చే ముందు ఇలా పక్షులు కోతులు అల్లరిచేసి తోటి జంతువులకు ప్రమాదం పొంచి ఉందని చెప్తాయి. ప్రసాద్ ఈ వీడియోలో భయంకరమయినా దృశ్యాలు ఉంటె ముందే చెప్పు.. ప్రసాద్: అవును సార్.. ఉన్నాయి.. అందుకే మీ దగ్గరకి తీసుకోచ్చాను.. ఇబ్బంది అనిపిస్తే ఎవరైనా పక్క రూంలోకి వెళ్ళండి.. లేదంటే ఇది ఇక్కడితో ఆపేద్దాం. సుచరిత మాట్లాడుతూ నాకు ఇబ్బంది అనిపిస్తే నేను వెళ్ళిపోతాను.. నువ్వు ఆలోచించకు.. కంటిన్యూ అంటూ మళ్ళీ ప్లే చేసారు.. పిట్టలు కోతుల అరుపుల తర్వాత అడవి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సుమారు 6 గంటల అవుతోంది.. సూర్యుడు ఇంకో అరగంటలో అస్తమిస్తాడు అనగా.. సూర్య కూర్చున్న ముందు వైపు చెట్టు దగ్గర అలికిడి మొదలయ్యింది.. కెమెరా అంగిల్ కు సూర్య ఐములగా (diagonal) ఉన్నాడు.. సూర్య ఎడమ చెయ్యి,ఎడమ భుజం సైడ్ బాడీ, ఒక కాలు మాత్రమే కెమెరా అంగెల్ లో కనపడుతోంది. సూర్య తల పైకెత్తి చూసి.. ఊపిరి బలంగా తీసుకోవడం చూసారు.. అతర్వాత అతను తల పక్కకు వాల్చి నేల వైపు చూస్తూ ఉన్నాడు.. అతని పరిస్థితి చుస్తే దాహం తో సోమ్మాసిల్లీ పోయినట్టు ఉంది.. 5 నిముషాలు గాడిచాయి.. సూర్య ఎదురుగా ఉన్న చెట్టు మీద నుంచి ఉడతలు కిందకు దూకి పారిపోతున్నాయి.. అప్పుడే ముదురు బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ మచ్చలతో ఒక కొండచిలువ తల టీవీ స్క్రీన్ పై కనపడింది.. టీవీ చూస్తున్న అందరు స్టన్ అయ్యారు ఒక్క ప్రసాద్ తప్ప.. ఆ పాము నిదానంగా చెట్టు మీద నుంచి కిందకి దిగుతు తన నాలుకను బయట ఆడిస్తుంది పరిసరాలను పరిశీలిస్తోంది.. నిత్య, సుజాతలకు ఏసీ రూమ్ లో చెమటలు పట్టేసాయి.. సుచరిత సత్యారాజ్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది.. ఆ కొండచిలువ సూర్య దగ్గరగా వచ్చి అతని కాలి దగ్గర గా వచ్చి నాలుక ఆడిస్తుంది పైకి లేచింది.. అప్పటికి దాని మొత్తం శరీరం నేల పై ఉంది.. నిత్య రిమోట్ తీసుకోని పౌస్ చేసి.. ఇది రిటై్క్యూలేటెడ్ పైథోన్.. చాలా ప్రమాదకరం మైన జాతి పాము ఇది.. సైజు చుస్తే కనీసం 15 అడుగులు పైమాటే ఉంటుంది.. నాలుక బయట పెట్టి ఆడిస్తోంది అంటే దాని చుట్టు ఉన్న వాసన వేడి ఉష్నోగ్రతా పసి గట్టడానికి చేస్తోంది.. కోల్డ్ బ్లడ్ అనిమల్స్ ఇలా చేస్తాయి ముఖ్యంగా.. హాట్ బ్లడ్ అనిమల్స్ అంటే మనుషులు ఇలా చేయరు.. ప్రసాద్ కలగ చేసుకొని 20 అడుగులు అని చెప్పాడు.. నిత్య : మీరు ఆ పాముని పట్టుకున్నారా? ప్రసాద్: ఎస్.. ఆర్మీ వాళ్ళు పట్టుకున్నారు.. నిత్య: ఇప్పుడు ఆ పాము ఎ జూలో ఉంచారు.. నేను వెళ్లి చూస్తాను.. నా రీసెర్చ్ కి చాలా ఉపయోగ పడుతుంది సార్.. ప్రసాద్: అది అసాధ్యం.. నిత్య: అదేంటి సార్.. ఎందుకు అలా? ప్రసాద్: పాముని పూడ్చి పెట్టేసారు.. నిత్య: అయ్యో.. చంపి పూడ్చి పెట్టారా.. ప్రసాద్: కాదు చచ్చిన పాముని పూడ్చి పెట్టారు.. ఇప్పుడు వీడియో చూడండి.. వీడియో మళ్ళీ ప్లే అయ్యింది పైకి లేచిన పాము ఒక ఐదు సెకండ్ల పాటు సూర్య తల పైన నాలుకతో వాసన చూసినట్టు చూస్తోంది.. అందరు ఊపిరి బిగపెట్టి చూస్తూ ఉండగా పాము పెద్దగా నోరు తెరచి ఒక్కసారి గా సూర్య కుడి భుజాన్ని పట్టుకొని కొరికింది.. కెవ్వు మంటూ అందరు ఆడవాళ్లు కేక పెట్టరు.. వీడియో చూస్తున్న నిత్య షాక్ అయ్యింది.. సుచరిత తన భర్త సత్య రాజ్ ని గట్టిగ కౌగిలించుకొని కళ్ళు మూసుకుంది.. సుజాత మాత్రం ఆశ్చర్య పోతూ చూస్తూ ఉంది.. సూర్య లో చలనం లేదు.. కనీసం తల కూడా కదపలేదు సరికదా.. ఒక శవము లా పడి ఉన్నాడు.. పాము తల విదిలిస్తూ వేగంగా తన శరీరం తో సూర్యని చుట్టేయడం ప్రారంభించింది.. మొదటి చుట్టు సూర్య ఛాతిని రెండో చుట్టు సూర్య ఉదర బాగాన్ని.. మూడో చుట్టు నడుము బాగాన్ని చుట్టుకుంది.. సూర్యలో మాత్రం చలనం లేదు.. తోక భాగం సూర్య తొడని చుట్టుకున్న తరువాత.. తల పైకెత్తి సూర్య తలను పక్కనుంచి చూసింది..మెల్లగా సూర్య శరీరాన్ని బిగించి పిండేయడం మొదలుపెట్టింది.. సత్యారాజ్ పౌస్ చేసి.. ఇది టూమచ్ ప్రసాద్.. ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకున్నావా.. లేదంటే నన్ను ఒక వెధవ అనుకున్నావా..ఇది ఫేక్ వీడియో.. మా టైం వేస్ట్ చేయడానికి మీకు సిగ్గు లేదు.. గ్రాఫిక్స్ చేసి చూపించి.. ఛీ ఛీ.. ఇలాంటి పనులు మానుకోండి.. మీకు నేను జోకర్ లా కనపడుతున్నానా... గెట్ అవుట్ అఫ్ మై హౌస్.. ప్రసాద్: ఓకే సార్.. వెళ్ళిపోతాను.. కాని నేను మీకు అడివిలో రికార్డు అయిన ఫుటేజ్ చూపిస్తున్నాను.. ఇది నిజం.. ఫస్ట్ చుసిన నేను నమ్మలేదు..అందుకే మిమ్మల్ని.. ఇంత మంది డాక్టర్లని ఇక్కడికి పిలిచింది.. ఇది సీరియస్ విషయం.. అతను బ్రతికే ఉన్నాడు.. వీడియో మొత్తం చుస్తే అర్ధం అవుతుంది మీకు.. సత్యారాజ్ : ఇంపొస్సిబల్.. Dr ప్రసాద్ ప్లే బటన్ నొక్కాడు.. టు బి కంటిన్యూడ్..
19-08-2024, 12:06 AM
అప్డేట్ చాల బాగుంది
19-08-2024, 01:00 AM
Ila madyalo suspense lo aapeste ela andii
19-08-2024, 01:44 AM
bhayya chimpesav po
19-08-2024, 01:54 AM
Nice update sir
19-08-2024, 06:09 AM
Nice update bro suspense medha suspense carry chesthunavu each update lo
19-08-2024, 06:33 AM
Super update bhayya okesari motham ivvochu kada
19-08-2024, 12:42 PM
Super update
19-08-2024, 12:46 PM
19-08-2024, 01:03 PM
19-08-2024, 07:35 PM
(19-08-2024, 01:03 PM)Viking45 Wrote: సూర్య నా దృష్టిలో.. ఇది రాయల్ బెంగాల్ టైగర్ (పెద్ద పులి) కదా, సాధారణంగా ఇవి చాలా తెలివైనవని, ఏరని ఎంచుకుని చాలా ఓపికతో వేచియుండి వేటాడుతాయంట కదా, మరి సూర్యా కూడా అలానేనా....
: :ఉదయ్
20-08-2024, 03:03 PM
Super update. Awaiting update
|
« Next Oldest | Next Newest »
|