12-08-2024, 11:04 PM
Update baagundi
Thriller SURYA (Updated on 2nd DEC)
|
12-08-2024, 11:04 PM
Update baagundi
12-08-2024, 11:10 PM
అప్డేట్ చాల బాగుంది
15-08-2024, 03:34 PM
waiting.....
15-08-2024, 11:34 PM
చాలా లెంగ్త్ వచ్చింది ఈ అప్డేట్.. కొంచెం ఓపిక తెచ్చుకుని చదవండి
సో 3 పార్ట్స్ గా డైలీ పోస్ట్ చేస్తాను..
15-08-2024, 11:36 PM
బ్రిజేష్: Dr ప్రసాద్..ముందుగా నేను నాగాలాండ్ ఫారెస్ట్ ఎపిసోడ్ చెప్తాను.. ఆ తర్వాత మీ ఎనాలిసిస్ గురించి చెప్పండి.
ఆ నైట్ ఫారెస్ట్ గార్డ్ గెస్ట్ హౌస్ లో చుసిన కెమెరా ఫుటేజ్ తో మాకు కాళ్ళు చేతులు ఆడలేదు..అప్పటికి సుమారు 6 గంటల క్రితం రికార్డు అయిన ఫుటేజ్ అది.. వెంటనే ఫార్వర్డ్ చేసి చుస్తే.. మా కళ్ళని మేము నమ్మలేకపోయాము.. కొండచిలువ సూర్యని చుట్టేసి అతన్ని పిండేస్తోంది.. కాని అతనిలో చలనం కనపడలేదు.. గార్డ్ సలహా మేరకు ఫారెస్ట్ సెక్యూరిటీ అధికారి కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.సూర్య ని కాపాడడానికి టైం వేస్ట్ చేయకూడదు అని క్యాంపు లోని జవాన్లను పిలిచాను.. " సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్.. మీలో ఎవరికైన ఇబ్బంది ఉంటే నిరభ్యన్తరంగా మీ రూమ్స్ కి వెళ్లిపోవచ్చు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు.. మనతో పాటు వచ్చిన ఒక క్యాడట్ ప్రాణాపాయ పరిస్థితి లో ఉన్నాడు.. అతను బ్రతికే ఉండాలని నేను ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను.. మీలో ఎవరైనా మాతో పాటు రెస్క్యూ కోసం వాలంటీర్స్ గా రావాలి అనుకుంటే రండి.. రాని వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబడదు.. వచ్చినవారికి ఎటువంటి మేడల్స్ ఇవ్వబడవు.. మీతోటి ఒక సైనికుడికి అవసరం అయినప్పుడు సహాయం చేయడం మాత్రమే అనుకోండి " గ్రూప్ లీడర్స్ ఇద్దరు ముందుకు వచ్చి మేము రెడీ సార్ అని చెప్పారు.. వారితో పాటు మరో 20 మంది కూడా సహాయానికి ముందుకు రావడం సంతోషం కలిగించింది.. అజయ్ సింగ్ అండ్ బ్యాచ్ మాత్రం ఏమి తెలియని వారిలా ఉన్నారు.. మొత్తం 22 మందితో కలిసి సుమారు 1:10AM కి అడవిలోకి బయలుదేరాం.. వారిలో ఒక పారామెడిక్ కూడా ఉన్నారు. ఆ కటిక చీకటిలో దాట్టమైన అడవిలో కొండలు.. రాళ్లు రప్పలు దాటుకుంటూ నడవడం చాలా ఇబ్బంది అయ్యింది.. కాని సూర్య ని కాపాడడానికి ఎవరు ఒక్క సారికూడా అభ్యన్తరం చెప్పలేదు.. గార్డ్ నేను అందరికంటే ముందు నడుస్తూ దాదాపు సగం దూరం వచ్చేసినాక రేడియో లో స్టాటిక్ బీప్ వినిపించింది.. హెడ్ క్వార్టర్స్: రోమియో వన్ టు త్రి కమ్ ఇన్.. రోమియో వన్ టు త్రి కమ్ ఇన్.. బ్రిజేష్: ఎస్ టైగర్ 75.. రోమియో ఆన్ కోల్డ్ పర్సుట్. ఓవర్ ( cold pursuit) HQ: రోమియో వన్ టు త్రి.. హెలి ఇస్ ఆన్ స్టాండ్ బై. ( HELI IS ON STAND BY) బ్రిజేష్: టైగర్ 75.. ఎకో(E) టాంగో(T) ఆల్ఫా (A) 90 మినిట్స్.. ఓవర్ అండ్ అవుట్. HQ: మెసేజ్ రిసీవ్డ్ ఈ. టీ. ఏ 90 మినిట్స్.. ఓవర్ అండ్ అవుట్.. (ETA: Expected Time of Arrival ) గార్డ్: బ్రిజేష్ గారు..రేడియో సెట్ లో ఆల్రెడీ రెజిమెంట్ హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము.. హెలికాప్టర్ సిద్ధంగా ఉంచారు.. ఈ దట్టమైన అడవిలో లాండింగ్ ఎలా చేస్తారు.. బ్రిజేష్ : పారా స్పెషల్ ఫోర్సస్ ఆఫీసర్స్ కిందకి దూకి సూర్య బాడీని హెలికాప్టర్ లోనికి ఎక్కిస్తారు.. కార్గో హుక్ ఉంటుంది దానితో తేలికగా సూర్య ని హెలికాప్టర్ లోనికి ఎక్కిస్తారు..ఇది చాలా మామూలు విషయం.. గార్డ్ : సార్.. అతను.. బ్రిజేష్: ఎస్.. చుసిన నీకు కూడా తెలుసు.. అతను చనిపోయాడు అని.. నా కమాండ్ లో ఉండగా నేను ఒక్క సైనికుడిని కూడా పోగొట్టుకోలేదు.. ఒక వేళ అదే జరిగితే మరుక్షణం నేను రిజైన్ చేసేస్తాను అని నాకు నేను ప్రమాణం చేసుకున్నాను.. ఈరోజే నా లాస్ట్ వర్కింగ్ డే.. గార్డ్: అలా అంటారు ఏంటి సార్.. మీరు ఆర్మీ లో పెద్ద ఆఫీసర్ కదా.. బ్రిజేష్: ఎంత పెద్ద ఆఫీసర్ అయిన కూడా.. తన సోదర జవాన్ పార్దివ దేహాన్ని మోయడం అనేది అన్నిటికన్నా కష్టమైన పని.. గుండెలు అవిసేలా ఏడ్చే ఆ తల్లిని, భార్యని, పిల్లల్ని ఓదార్చటం.. అతను తిరిగి రాడు అని చెప్పడం నరకం.. అందుకే నేను ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నాను.. గార్డ్: సార్.. నాకో డౌట్.. అడగమంటారా బ్రిజేష్: పర్లేదు అడుగు.. గార్డ్: సార్.. బయలుదేరేముందు మీరు అందరితో మాట్లాడారు కదా.. అప్పుడు సూర్య గురించి అతను ఉన్న పరిస్థితి గురించి క్లియర్ గా ఎందుకు చెప్పలేదు.. బ్రిజేష్: అంటే.. కొండచిలువ గురించా.. సూర్య గురించా.. అతను చనిపోయాడు అని చెప్పాలంటావా? గార్డ్: కొండచిలువ గురించే సార్.. ఎటాక్ చేసింది అని చెప్తే వాళ్ళు లొకేషన్ కి వెళ్ళాక భయపడకుండా ఉంటారు కదా.. బ్రిజేష్: నేను చెప్పకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అతను చనిపోయాడు అని చెప్తే.. కొంతమంది ఏడుస్తారు బాధపడతారు.. కాని రెస్క్యూ కోసం ఎవరు పెద్దగా ఆలోచించరు.. వాళ్ళు చేసిన పెద్ద తప్పు వాళ్ళకి అర్ధం కావాలి.. ఇదే పని రేపు వాళ్ళు రిపీట్ చేయకుండా ఉండేందుకు వారికీ ఇది ఒక గుణపాఠం అవుతుంది.. వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూస్తేనే అర్ధం అవుతుంది.. జవాన్లు ఎప్పుడు తన తోటి జవాన్లను యుద్ధంలో వదిలేసి రాడు.. చనిపోయిన తన సోదర జవాన్ పార్దివ దేహాన్ని మోసుకుని వస్తాడేమో కాని అలా వదిలేసి రావడం మన భారత ఆర్మీ చరిత్రలో లేదు.. అది మన సంస్కృతి మన సాంప్రదాయం.. గార్డ్: సార్.. ప్రతివాడికి వాడి ప్రాణం అంటే తీపి ఉంటుంది కదా సార్.. బ్రిజేష్: నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కాని ఈ ప్రమాదకరమైన ఉద్యోగమే ఎందుకు చేయాలి.. ప్రాణం మీద తీపి ఉంటుంది.. కాని ఏ మనిషికూడా తన శరీరాన్ని కాకులు కుక్కలు తినాలి అని అనుకోడుకదా.. జవాన్లను ఒంటరిగా పంపడం అనేది జరగదు.. ట్రైనింగ్ నుంచి కూడా కొన్ని స్పెషల్ సందర్భాలలో తప్పితే ఎప్పుడు తనతో తన 'బడ్డీ' జవాన్ ఉంటాడు.. అంటే వారిద్దరూ ఒక జంట అన్నమాట.. అలా ట్రైనింగ్, డెప్లాయిమెంట్, గస్తీ, కౌంటర్ టెర్రరిసం ఆపరేషన్ అన్నింట్లో ఎవరో ఒకరు ప్రతి జవానుకి తోడు ఉంటారు.. జవాన్ కి ఇంకో జవాన్ తోడు అన్నమాట.. ఇది చనిపోయిన కూడా ఉంటుంది.. అందుకే ఢిల్లీలో ఇండియా గేట్ ఉంది కదా.. అది మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన భారత సైనికుల ప్రాణ త్యాగం కోసం స్మారకంగా నిర్మించారు.. అక్కడ 24 గంటలు.. 365 రోజులు.. ఒక స్మారక జ్యోతి.. "వీర్ జవాన్ జ్యోతి " వెలుగుతూ ఉంటుంది.. ఆ స్మృతి వద్ద ఎల్లప్పుడూ ఒక జవాన్ అటెన్షన్ లో నిలుచొని ఉంటాడు.. దానర్థం బ్రతికి ఉన్నా..చావులో అయిన ఒక జవాన్ కోసం ఇంకో జవాన్ ఉంటాడు అని .. చనిపోయిన ఆ జవాన్ ఒంటరివాడు కాదని.. గార్డ్: ఇప్పుడు అర్ధం అయ్యింది సార్ వాళ్ళు చేసిన తప్పు.. నెవెర్ లీవ్ అ మాన్ బిహైండ్ ( NEVER LEAVE A MAN BEHIND) బ్రిజేష్: ఎస్.. అదే వాళ్ళు చేసిన తప్పు.. సూర్య ఎంత పెద్ద తప్పు చేసినా.. అతన్ని వదిలి రాకుండా అతన్ని వెతికి పట్టుకోవడమో.. లేదా నాలుగు తన్ని క్యాంపుకి తీసుకురావాలి కాని వదిలి రాకుండా ఉండాల్సింది.. గార్డ్: ఇప్పుడు అర్ధం అవుతుంది సార్.. కొన్ని గంటల తర్వాత.. ఫారెస్ట్ గార్డ్ చాకచక్యం గా మమ్మల్ని తెల్లవారుజామున 5:20 am గంటలకు సూర్య ఉన్నా ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఇంకా తెల్లవారడానికి ఇంకో గంట పడుతుంది.. చుట్టు చీకటి.. కొలనుకి దగ్గర్లో యేవో జంతువులు అరుస్తూ ఉన్నాయి.. ఒకటి అర నక్కలు, ఎలుగుబంట్లు అరుపులు వినిపించాయి.. కెమెరా ఉన్న చెట్టుని గుర్తుపట్టడం వల్ల అనుకుంట..సూర్య ని కట్టేసిన చెట్టు ని ముందుగా గార్డ్ గుర్తించాడు. సూర్య ఉన్న చెట్టు వైపు లైట్ వేయడానికి కూడా భయం వేసింది.. గుండె వేగంగా కొట్టుకుంటోంది అసలు అడుగు ముందుకు వేయాలంటే వణుకు మొదలయ్యింది.. గార్డ్ కూడా అప్పటిదాకా ధైర్యంగా ఉన్నవాడు.. ఎందుకో.. అడుగు ముందుకు పడట్లేదు.. వెనక ఉన్న జవాన్లకు ఏమి అర్ధం కావట్లేదు.. ఇప్పటిదాకా వేగంగా ఉత్సాహంగా నడిచిన బ్రిజేష్ అండ్ గార్డ్ ఒక్కసారిగా డీలా పడిపోవడం వాళ్లకు టెన్షన్ పెట్టేస్తోంది.. ఇంత కష్టపడి వచ్చి సూర్యకి జరగరానిది జరిగితే అనే ఆలోచనే వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు.. బ్రిజేష్ సార్.. ఏమైంది సార్ అని వెనకనుంచి అరిచారు.. బ్రిజేష్ ధైర్యం చేసి.. సూర్య ని ఒక కొండచిలువ ఎటాక్ చేసి చంపేసింది.. ఇక్కడ నుంచి 50 అడుగుల దూరంలో అతని మీద ఎటాక్ జరిగింది, సుమారు 11 గంటల క్రితం ఇది జరిగింది.. ఆ పాముని ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నాను.. అసలు ఆ పాము అక్కడ ఉందొ లేదో కూడా తెలీదు.. సూర్య బాడీ అక్కడే ఉండే అవకాశం ఉంది.. అతని బాడీ ని రికవర్ చేయడానికే వచ్చాము.. ఈ సమాచారం విన్న అందరు స్టన్ అయ్యారు.. కాసేపటికి తేరుకొని.. సూర్య ఉన్న వైపు అడుగులు వేశారు.. గార్డ్: మిలో ఒకరు నాతో రండి.. నేను సూర్య బాడీ ఉన్న పరిస్థితి చూసి చేపుతాను.. ఆ పాము అక్కడే ఉంటే మీలో ఇంకొంతమంది వస్తే ఆ పాముని తరిమెయొచ్చు.. బ్రిజేష్: గార్డ్.. ఇంకో అరగంటలో తెల్లవారి పోతుంది.. అప్పుడు క్లియర్ గా కనపడుతుంది కదా.. గార్డ్: సార్.. కొండచిలువ వేటలో చంపిన తర్వాత.. నిదానంగా ఒక ఐదు నుంచి ఆరుగంటల సేపు మింగడానికి తీసుకుంటుంది.. ఆ తర్వాత ఒక చెట్టుకు చుట్టుకుంటుంది. ఇంకో 2 నుంచి 3 గంటల తర్వాత ఎత్తాయినా చెట్టును చూసుకోని ఆ చెట్టు పైకి పాకుతుంది.. ఆ తర్వాత మనం పట్టుకోవాలన్న పట్టుకోలేము.. అది కాకుండా తెల్లవారే వరకు మనలాగా వెయిట్ చేయదు సార్.. ఇంకా లేట్ చేస్తే మనకి బాడీ దొరికే అవకాశమే లేదు బ్రిజేష్: సరే.. ఒక పని చెయ్.. నువ్వు ఇక్కడ వీళ్ళతో ఉండు.. నాకేమైనా పర్లేదు.. వాళ్ళని జాగ్రత్తగా క్యాంపు కి తీస్కువేళ్లు.. సూర్య ఉన్న చెట్టు వైపు లైట్ వేయగానే.. కొన్ని కొండ చిలువ పిల్ల పాములు కనపడ్డాయి.. కొన్ని చెట్టుకు చుట్టుకొని.. కొన్ని చెట్టుకు వేలాడుతూ.. అన్ని చూడడానికి ఒకే పాము పిల్లలా ఉన్నాయి.. జిగురు వాటి నోట్లో నుంచి కారుతు.. జూగుప్స్ కలిగించేలా ఉన్నాయి.. చెట్టు మొదట్లో ఒక పెద్ద కొండచిలువ చుట్లు చుట్టుకుని ఉంది.. మధ్యలో సూర్య తల పక్కకి వాలిపోయి నోటిలో నుంచి రక్తం కారుతోంది. అగర్వాల్: ఆగండీ ఆగండి.. ఏంటి బ్రిజేష్ గారు.. సూర్య చనిపోయాడు అని చెబుతున్నారు.. అతను బ్రతికే ఉన్నాడు కదా. బ్రిజేష్: ఎస్.. కాని ఆ వీడియో చుసిన నాకు అతను బ్రతికె అవకాశమే కనపడలేదు. అందుకే చనిపోయాడు అని అనుకున్నాను.. వీడియో లోకూడా.. కొండచిలువ ఎటాక్ చేయడం చూసాక ఆ నిర్ణయానికి వచ్చాను.. కాని పూర్తి వీడియో చూడలేదు లెండి. నా వైపు నుంచి నేను ఆ రోజు ఎలా ఫిల్ అయ్యానో చెప్తాను.. సూర్య దగ్గరకు వెళ్ళడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు.. ఆ కొండచిలువ తల సూర్య ఎడమ భుజం మీద ఉంది.. ఆ పాము కదలడం లేదు.. దాని కోరలు సూర్య ఎడమ భుజంలోకి దిగిపోయాయి.. చూస్తేనే భయానకం గా ఉంది ఆ దృశ్యం.. గార్డ్ ముందుకు వచ్చి.. ఆ కొండచిలువ తలవెనుకగా దాని పీకని పట్టుకొని.. మెల్లగా వదిలించాడు.. పాము చుస్తే చచ్చిపోయినట్టు అనిపిస్తోంది.. ఇంకో నలుగురు తలో చేయి వేసి త్వరత్వరగా ఆ చుట్లు విడిపించేసాము.. ఆ పాముని పట్టుకుంటే వళ్ళు జలదరించింది.. దగ్గర దగ్గర 20 అడుగులు ఉంది.. సూర్య ని చుట్టుకుని ఉన్నా ఆ కొండచిలువను వేరు చేయడానికి మాకు తలప్రాణం తోకలోకి వచ్చేసింది.. సూర్య ఒంటి నిండా రక్తం.. నోటిలోనుండి రక్తం.. భుజానికి కొండచిలువ పెట్టిన గాట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అతను బ్రతికే అవకాశమే లేదు.. లాక్ పిక్కర్ తో అతని సంకెళ్లు తప్పించి అతన్ని పడుకోపెట్టాము.. పారామెడిక్ అతని ముఖాన్ని క్లీన్ చేసి.. పల్స్ చెక్ చేయగా చాలా వీక్ గా ఉంది అని తెలిసింది.. ఇమ్మీడియేట్ గా హాస్పిటల్ కి తీసుకువెళితే బ్రతికే ఛాన్స్ ఉంది అని చెప్పడం తో అందరిలో ఆశ్చర్యం ఆనందం ఒకే సారి వచ్చాయి..మళ్ళీ అడవి మార్గం లో అతన్ని తీసుకువెళ్తే లేట్ అయిపోయి ప్రాణానికి ప్రమాదం ఉండడం వల్ల రెజిమెంటల్ సెంటర్ కి రేడియో చేసి హెల్ప్ కోసం రిక్వెస్ట్ చేసాం.. MI-17 హెలికాప్టర్ పంపారు.. మా జీపీస్ కోఆర్డినేట్స్ పంపడం వల్ల కేవలం 75 KM దూరన్ని 15 నిమిషాల్లో కవర్ చేసాడు ఆ పైలట్.. ఆ తర్వాత సూర్య ని అతనితో పారామెడిక్, నేను, వెళ్ళాం.. వెళ్లే ముందు గార్డ్ ని ఆ గెస్ట్ హౌస్ లో ఉన్న వీడియో జాగ్రత్తగా ఉంచమని చెప్పి బయలుదేరాము..గార్డ్ మట్టుకు వాలంటీర్స్ గా వచ్చిన ట్రైనీస్ ని క్యాంపు కి తీసుకెళ్లాడు. ఆ స్పాట్ నుంచి డైరెక్ట్ గా గౌహతి లోని మల్టీస్పెషలిటీ హాస్పిటల్ కి వెళ్ళాము. సూర్య ని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే నేను క్యాంపు కి రిటర్న్ అయ్యాను.
15-08-2024, 11:48 PM
superb sir
no words
16-08-2024, 12:03 AM
Superb sir excellent update
Noo words
16-08-2024, 01:01 AM
Kummesaru update
16-08-2024, 01:13 AM
Next update inko 24 hrs lopu release chestanu..
Inka asalu PREY-PREDATOR part modalu avvaledu
16-08-2024, 05:34 AM
Nice update sir
16-08-2024, 06:41 AM
Excellent update bro
16-08-2024, 10:22 AM
Super update
16-08-2024, 11:59 AM
అప్డేట్ చాల బాగుంది
16-08-2024, 02:45 PM
అన్ని కథలను చదువుతూనే వున్నా ఈ కథను మాత్రం హాస్పిటల్ అటాక్ తరువాతనుంచి ఎలాగో మిస్ అయ్యాను. ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ వరకు చదివా. సూర్యా ఎలివేషన్ ఇప్పటివరకు ఒకెత్తు అయితే, ఇక రాబోయేది వేరే లెవల్లో వుంటుందనుకుంటున్నా. అంజలిని రేప్ సెక్స్ డ్రగ్ నుంచి కాపాడి తను తేరుకున్న తరువాత సూర్య చెప్పిన తన కోరికలు (అవే నలుగుపెట్టి స్నానం చేయించడం, ఏడు నేలల కడుపుతో తను తిరగడం) వింటుంటే వీరి కథలో/కలయికలో ఏదో విషాదాన్ని పెట్టేటట్లు అనిపించింది. మొత్తానికి మీ క్రైం త్రిల్లర్ చాలా బావుంది...ఒక వెబ్ సీరియల్లో ఎలా ఫ్రేములు (జరిగిపోయింది, జరుగుతున్నది) మార్చి మార్చి చూపిస్తారో అలా వుంది మీ కథా గమనం...కొనసాగించు
: :ఉదయ్
16-08-2024, 05:22 PM
(16-08-2024, 02:45 PM)Uday Wrote: అన్ని కథలను చదువుతూనే వున్నా ఈ కథను మాత్రం హాస్పిటల్ అటాక్ తరువాతనుంచి ఎలాగో మిస్ అయ్యాను. ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ వరకు చదివా. సూర్యా ఎలివేషన్ ఇప్పటివరకు ఒకెత్తు అయితే, ఇక రాబోయేది వేరే లెవల్లో వుంటుందనుకుంటున్నా. అంజలిని రేప్ సెక్స్ డ్రగ్ నుంచి కాపాడి తను తేరుకున్న తరువాత సూర్య చెప్పిన తన కోరికలు (అవే నలుగుపెట్టి స్నానం చేయించడం, ఏడు నేలల కడుపుతో తను తిరగడం) వింటుంటే వీరి కథలో/కలయికలో ఏదో విషాదాన్ని పెట్టేటట్లు అనిపించింది. మొత్తానికి మీ క్రైం త్రిల్లర్ చాలా బావుంది...ఒక వెబ్ సీరియల్లో ఎలా ఫ్రేములు (జరిగిపోయింది, జరుగుతున్నది) మార్చి మార్చి చూపిస్తారో అలా వుంది మీ కథా గమనం...కొనసాగించు మీరు గెస్ చేసింది కొంతవరకు కరెక్ట్ అవ్వొచ్చు అండి..నెక్స్ట్ two అప్డేట్స్ లో సూర్య క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది.. ఆ తర్వాత స్టోరీ అండ్ plot లోకి వెళ్తాము |
« Next Oldest | Next Newest »
|