13-07-2024, 11:19 AM
అందరికి నమఃస్కారం... ఇది నా మొదటి కథ...
Romance నా లవ్ స్టోరీస్
|
18-07-2024, 02:32 AM
Welcome sir
Please start the story
18-07-2024, 10:19 PM
Right
Inka start cheyandi Oka manci roju chusi
21-07-2024, 12:56 AM
Update 1
నా పేరు రవి. నేను కొంచెం ఫెయిర్ గా ఉండి 5.6 హైట్ ఉంటాను. నేను Btech సెకండ్ ఇయర్ చదివే టైం లో జరిగిన స్టోరీ ఇది. మా కాలేజీ లో సీనియర్స్ లో నాకు ఫ్రెండ్స్ ఉండేవారు. 1st ఇయర్ హాస్టల్ లో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు వాళ్లు. హైదరాబాద్ లో ఒక పేరు మోసిన కాలేజీ మాది. గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ ల 7 కాలేజెస్ కలిసి ఒకే దగ్గర ఉంటాయి. అందువల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ కనిపిస్తారు. నేను నాన్ లోకల్ కావడం వల్ల కాలేజీ దగ్గర లో రూమ్ తీసుకొని ఫ్రెండ్స్ తో పాటు ఉండేవాడిని. ఇంకా నాకు బండి కూడా లేదు ఆ టైం లో. డైలీ rtc bus కి వెళ్లి వచ్చేవాడిని. అంతా బాగుంది అనుకున్న టైం లో ఒక అమ్మాయి నా లైఫ్ ని మొత్తం చేంజ్ చేసింది. ఒక రోజు కాలేజీ నుండి బస్టాప్ కి వస్తున్న టైం లో సీనియర్స్ గ్యాంగ్ ర్యాగింగ్ చేద్దామని నన్ను పిలిచారు. నేను వాళ్లు పిలిచేది పట్టించుకోకుండా వాళ్ళ పక్కనే గ్రీన్ చుడిధార్ లోఉన్న అమ్మాయిని చూస్తూ వెళ్తున్నా. First టైం నా లైఫ్ లో అంత అందమయిన అమ్మాయిని చూడటం. చూపు తిప్పుకోకుండా చూస్తున్న. తన కళ్ళు, తన ఫేస్, తన పెదవులు, తన జుట్టు ఇలా అన్నీ అబ్సర్వ్ చేస్తున్న. నాకు కొద్దిసేపు ఏమి అర్ధం కాలేదు. అప్పుడే నా భుజం మీద ఒక చెయ్యి పడింది. ఏంటి తమ్ముడు ఫ్లాట్ అయ్యావా పాప ని చూసి అని అన్నాడు నా భుజం మీద చెయ్యి వేసిన అతను. నేను అదేం లేదు అన్న just వూరికినే చూస్తున్న అని చెప్పా. సరేగాని అటు పదా అని తీసుకెళ్లాడు. వెళ్ళాను అనే గాని నా ఫోకస్ మొత్తం ఆ అమ్మాయి మీదనే వుంది. అప్పుడే ఆ అమ్మాయి నా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చింది. నాకు first టైం వణుకు పుట్టింది. ఎందుకంటే నేను అమ్మాయిని ఎప్పుడు అంతా ఇష్టం గా చూడలేదు. అప్పుడు పక్కనే ఉన్న ఒకడు బయో డేటా చెప్పు అన్నాడు. ఆ టెన్షన్ లో నేను సెకండ్ ఇయర్ అని కూడా మర్చిపోయి చెప్పడం స్టార్ట్ చేసా. అలా వాళ్లు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఆమె వైపు చూస్తున్న. అప్పుడు అక్కడే ఉన్న సీనియర్ ఫ్రెండ్ ఒకడు నన్ను చూసి ఏంట్రా సెకండ్ ఇయర్ వాడిని ర్యాగింగ్ చేస్తున్నారు అని వాళ్ళతో అన్నాడు. వాళ్లు అంతా షాక్ అయ్యారు. ఏంటి వీడు సెకండ్ ఇయరా మరి ఏంటి చెప్తే సరిపోయేది గా రా అని అన్నాడు ఆ గ్యాంగ్ లో ఒకడు. పక్కన ఇంకోడు వీడి బాడీ ప్రెసెంట్ మైండ్ obsent రా, వీడి మనసు మొత్తం వేరే దగ్గర ఉంది అని నేను చూస్తున్న అమ్మాయి వైపు చూసి అన్నాడు. అప్పుడు నేను కవర్ చేద్దాం అని 1st ఇయర్ లో నన్ను ఎవరు ర్యాగింగ్ చెయ్యలే అందుకే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పలే అన్న అని చెప్పా. అప్పుడు ఆ అమ్మాయి అబ్బో అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. వాళ్లు కూడా ఇది నమ్మేలా లేదు అన్నట్లు చూసారు. సరే పద రా అని ఆ అన్న అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయితో చెవి లో ఏదో చెప్తుంది. ఆ వెంటనే పక్కనే ఉన్న అమ్మాయి ఉండనీ వీడ్ని కొద్దిసేపు ర్యాగింగ్ చేస్తాం మేము కూడా, ఎప్పుడు ఎవరిని ర్యాగింగ్ చెయ్యలే అస్సలే అని అన్నది. వెంటనే అందరు ఒకేసారి గట్టిగ నవ్వారు. ఆ అమ్మాయి కూడా సూపర్ గా నవ్వింది. తను నవ్వితే అలానే చూస్తూ ఉండొచ్చు. నేను కూడా చిన్న స్మైల్ ఇచ్చా. అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ బ్యాచ్ లో అబ్బాయిలని సైలెంట్ గా ఉండమని చెప్పింది. Adhe first తన గొంతు వినడం. సూపర్ ఉంది తను మాట్లాడే విధానం. ఇక నేను కూడా వెయిట్ చేస్తున్న ఎం అడుగుతారో అని. పక్కన ఉన్న అన్న జాగ్రత్త మా వాడు కొంచెం అమాయకుడు అని ఆ అమ్మాయిలకి చెప్పి వెళ్ళాడు. అమ్మాయిలు మొత్తం నలుగురు ఉన్నారు అబ్బాయిలు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి కూడా first టైం ఏమో టెన్షన్ పడుతున్నారు. But అందులో మోడరన్ గా ఉన్న ఒక అమ్మాయి మాత్రమే కొంచెం ఇబ్బంది పెట్టింది నన్ను. అది ర్యాగింగ్ ల లేదు ఏదో క్వశ్చన్ ఎండ్ ఆన్సర్స్ ప్రోగ్రాం ల ఉంది. అప్పుడప్పుడు వచ్చే నవ్వుని అపుకుంటున్న. వాళ్ళకి కూడా అర్ధం అయ్యింది. ఇక పక్కన ఉన్న బాయ్స్ తమ్ముడు ఈ ర్యాగింగ్ బోర్ గా ఉంది నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు ఒక 1st ఇయర్ వాడ్ని ర్యాగింగ్ చేద్దాం అని అన్నారు. నేను సరే అని అన్నానో లేదో గర్ల్స్ అందరు గోల చేసారు. ఏంటి మా రాగ్గింగ్ అంటే లెక్క లేదా అని గొడవ చేసారు. అందులో ఒకడు మీరు చేసేది ర్యాగింగ్ అని ఎవడు అనడు. వీడు నవ్వు ఆపుకోలేక చస్తున్నాడు అని నన్ను చూసి అన్నాడు. ఇక లాభం లేదు అని నేను సరే అన్న మేడం వాళ్ళకి ఇంకా ర్యాగింగ్ చెయ్యాలని ఉందేమో వాళ్ళది అయిపోయాక మనం రేపు చేద్దాంలే అని అన్నాను. సరే మేము వెళ్తాము చేసుకొండే బాబు అని ఒకడు నా నెంబర్ అడిగి తీసుకొని వెళ్ళాడు. మిగతా వాళ్లు కూడా వెళ్లిపోయారు. ఇక గర్ల్స్ లో ఒకరు వెళ్లారు. కానీ నా పిల్ల మాత్రం ఉంది. ఇక వాళ్లు వెళ్ళాక నాకు కొంచెం దైర్యం వచ్చింది. వాళ్ళ ముగ్గురులోతను మిడిల్ లో ఉంది. నేను మెల్లగా మీ పేరు మేడం అని ఆమెని అడిగాను. వాళ్లు షాక్ అయినట్లు నా వైపు చూసి మిగతా వాళ్ళు ఏ మా పేర్లు వద్దా అని కొంచెం జలసీ గా చూసారు ఆమె వైపు. అప్పుడు నేను అలా ఎం లేదు మేడం మీ పేరు కూడా చెప్పండి అని అన్నాను. సరే అని ఆ ఇద్దరు వాళ్ళ పేర్లు చెప్పారు. ఒకరి పేరు సంధ్య ఇంకొకరి పేరు ఇందు. ఇంకా మీ పేరు అన్నట్లు ఆమె వైపు చూసా. వాళ్లు ముగ్గురు వస్తున్న నవ్వు ను ఆపుకుంటూ ఉన్నారు. అంతలోనే సంధ్య అది చెప్పదు లే గాని నేను చెప్తా అని అన్నది. చెప్పకు అని ఒక సీరియస్ లుక్ ఇచ్చింది. పాపమే అర్ధగంట నుండి నీ కోసం మనం ఎన్ని చేసిన భరించాడే అని ఇందు అన్నది. అంత సీన్ లేదు అని ఏదో అంటుండగానే సంధ్య తన పేరు చెప్తుంటే తన నోరు మూసింది. అప్పుడే నేను వద్దులే మేడం నేనే తెలుసుకుంటా అని అన్నాను. అప్పుడు వెంటనే నా ఏంజెల్ అవన్నీ సరే గాని మమ్మల్ని మేడం అని వాళ్ళని అన్నా అంటున్నవ్ ఏంటి అని అడిగింది. అది అది.. మేడం.. అని నసుగుతుంటే పక్కన ఉన్న ఇందు తెలిసి కూడా ఎందుకు అడుగుతావ్. రోజు కాలేజీ లో ఎవడో ఒకడు నీకు ఫ్లాట్ అవ్వడం నువ్వు లైట్ తీసుకోవడం అలవాటే గా అని అయిన వీడు నీతో పాటు మమ్మల్ని కూడా మేడం అన్నాడులే లేడీస్ అంటే రెస్పెక్ట్ ఏమో అని కవర్ చేసింది. సర్లే లేట్ అవుతుంది నేను కూడా వెళ్తా అని లేచి నిలబడి తన bag తీసుకుంది. అప్పుడు చూసా తన ఫుల్ స్ట్రక్చర్ అబ్బో సూపర్. నాకయితే మైండ్ దొబ్బింది. అస్సలు కళ్ళు రెప్ప కూడా వేయకుండా తన బ్యాక్ చూస్తున్న. అది గమనించి దగ్గరికి వచ్చి హలో మిస్టర్ ఏంటి నీ ప్రాబ్లెమ్ అని అన్నది. అప్పుడు గమనించ తను నా కంటే కొంచెం ఎత్తు ఎక్కువ ఉంది 5.8 లేదా 5.9 ఉండొచ్చు. నాకు కొంచెం బాధ వేసింది తను అలా అన్నందుకు, నా కంటే ఎత్తు ఉన్నందుకు. తల కిందికి వేసి సారీ మేడం అని చెప్పా. అప్పుడు ఇందు వచ్చి ఎందుకే అలా అంటావ్, అయినా నువ్వేంటి ఎప్పుడు ఎవర్ని ఏమి అనేదానివి కాదు ఎందుకు సీరియస్ అవుతున్నావ్ అని అన్నది. అప్పుడు తను సర్లే లైట్ తీస్కో అని నా పేరు అంజలి అని చెప్పింది నన్ను కూల్ చేయడానికి. నా మొఖం వెయ్యి వోల్ట్స్ బల్బ్ ల వెలిగిపోయింది ఒక్కసారి. అప్పుడు సంధ్య అమ్మయ్య వీడు నవ్వాడు అది చాలు అని సరే రవి మేము వెళ్తాము అని చెప్పింది. నాకు ఒక్కసారి నా బాడీ పార్ట్ ఏదో నన్ను విడిచి వెళ్తున్నట్లు అనిపించింది. కొంచెం బాధగా చూసాను. అప్పుడు ఇందు వచ్చి నెంబర్ కావాలా అని అడిగింది. నేను ఏమి చెప్పకుండా అలానే అంజలి ని చూస్తున్నాను. అప్పుడు ఇందు వాళ్లిద్దర్ని వెళ్ళమని చెప్పి వాళ్లు కొంచెం దూరం వెళ్ళాక ఏంటి సంగతి లవ్ ఎట్ first సైట్ ఆ అని అడిగింది. Just అలా లవ్ ఎట్ first సైట్ అని నా ఫీలింగ్ ని తక్కువ చెయ్యకండి మేడం అని అన్నాను. Ohh సూపర్ అయితే all the best for your love అని చెప్పింది. So నువ్వు try చేస్కో. But దాన్ని పడేయ్యడం చాలా కష్టం, సరే గాని మేడం అని పిలవకు అక్క అని లేదా ఇందు అని పిలువు అని చెప్పింది. ఇదంతా వినే పోసిషన్ లో నేను లేను. ఒకసారి అంజలి వెళ్తున్న వైపు చూసా తను మా వైపే చూస్తూ ఉంది. ఎందుకో నాకు కొంచెం హోప్ వచ్చి వెంటనే అంజలి వాళ్లు ఉన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళ. ఇందు కూడా నా వెనకాలే వచ్చింది. తను చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. అలా వెహికల్స్ చూస్కోకుండా రోడ్ క్రాస్ చేసినందుకు. నేను వెంటనే అంజలి I am in love with you, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పా. పక్కన ఉన్న సంధ్య ఇందు ఇద్దరు షాక్ అయ్యారు. తను కూడా షాక్ లో అలానే చూస్తుంది. నేనేదో టైం పాస్ కు చెప్పట్లేదు మేడం సీరియస్ గా చెప్తున్నా అని అన్నాను. Two మినిట్స్ చూసి చెప్పావు గా ఇక వెళ్ళు అని అన్నది. నాకు ఎం చెయ్యాలో అర్ధం కాలేదు. నాకు ఉన్న ఫీలింగ్ ఆ అమ్మాయి కి ఉండాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు అని అనిపించింది. సరే అని ఇందు ని అడిగి కాలేజీ డీటెయిల్స్ కనుక్కున్నాను. వాళ్ళది పక్క కాలేజీ ఫైనల్ ఇయర్ అని చెప్పింది. ఇంకా ఒక ఇయర్ ఏ వుంటారు కాలేజీ లో అని బాధపడ్డ. అప్పటికే రెండు నెలలు అయిపోయ్యాయి. చాలా తక్కువ టైం ఉంది. కొంచెం దూరం వెళ్లి మళ్ళీ వచ్చి ఇందు వైపు చూసి ఫోన్ నెంబర్ అడిగాను. అంజలి కోపం గా చూసే సరికి నెంబర్ చెప్పకుండా నీ నెంబర్ ఇవ్వు అని తీసుకొని Anjali Bf jr. అని ఫీట్ చేసుకుంది anjali కి కనపడకుండా. సంధ్య అది చూసి నవ్వుతుంది. నేను వెంటనే సంధ్య ని మీ నెంబర్ అయిన ఇవ్వండి అని అడిగా. తను వెంటనే నెంబర్ ఇచ్చింది. నేను my GF friend అని ఫీట్ చేసుకున్న. అది చూసి సంధ్య నవ్వుకుంది. అంజలి దగ్గరికి వెళ్లి మేడం మీ నెంబర్ ఇస్తారా అని అడిగా, ఒక సీరియస్ లుక్ ఇచ్చి నువ్వే కనుక్కో చూద్దాం అని bus ఎక్కడానికి వెళ్ళింది. సంధ్య కూడా all the best చెప్పి వెళ్ళింది. ఇందు వచ్చి మంచి ఛాన్స్ రా నీకు అది ప్రొపోజ్ చేసిన ఏమి అనకుండా వెళ్లడం ఇదే first టైం నీ మీద మంచి ఒపీనియన్ వచ్చిందేమో అని చెప్పి వెళ్ళింది. నేను హ్యాపీ గా ఫీల్ అవుతూ అటు వైపు వెళ్ళాను bus ఎక్కడానికి.
21-07-2024, 12:59 AM
ఈ స్టోరీ నేను కల్పించి రాసినది మాత్రమే ఇందులో ఉన్న సంఘటనలు పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇది నా first స్టోరీ. అప్పుడెప్పుడో 2015 లో ఒక స్టోరీ rasi సగం లోనే ఆపేసా.. ఇప్పుడు కంప్లీట్ గా రాయడానికి try chesta
21-07-2024, 03:45 AM
Nice update
21-07-2024, 08:05 AM
Nice update
21-07-2024, 09:24 AM
Good start
26-07-2024, 12:51 AM
Update 2
నేను అలా అటు వైపు వెళ్ళగానే మా రూమ్ మేట్స్ ఏంటి సంగతి అన్నట్లు నా వైపు చూస్తున్నారు. ఎం లేదు రా వాళ్ళకి నేను తెలిసిన వాడిలా కనిపిస్తే పిలిచారు. సీనియర్స్ కదా అని వెళ్ళాను అంతే అని అన్నాను. వాళ్ళు ఎంతసేపు ఒబ్సెర్వ్ చేసారో ఏంటో మరి but అబద్దం అయితే చెప్పా. ఈ ర్యాగింగ్ ఇవన్నీ చేసేటప్పుడు వాళ్లు లేరు. మేము డైలీ బస్టాప్ దగ్గరే కలుస్తాం. ఒక ఇద్దరు సేమ్ కాలేజ్ , నేను ఒక కాలేజ్ ఇంకో ఫ్రెండ్ వేరే కాలేజ్. మొత్తం నలుగురం ఉంటాం రూమ్ లో. మేము అందరం first ఇయర్ లో ఉన్నప్పుడు హాస్టల్ ఫ్రెండ్స్. అందుకే డిఫరెంట్ కాలేజ్ అయిన క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది మా మధ్య. వాళ్లు కూడా ఇంకా ఏమి అడగకుండా సరే వెళదాం లే అని అన్నారు. అయినా గాని వాళ్లలో నా బెస్ట్ ఫ్రెండ్ గాడికి డౌట్ వచ్చింది. సర్లే అడిగితే అప్పుడు చూద్దాం లే అని bus కోసం వెయిట్ చేసాం. Bus రాగానే వెళ్ళాం. కానీ నా మనసు మొత్తం అక్కడే ఉంది. అస్సలు ఆ ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంది. నేను దిగాల్సిన స్టాప్ వచ్చినా అలానే తన గురించి ఆలోచిస్తున్న. నా ఫ్రెండ్స్ ఇది గమనించినా అప్పుడు ఏమి అడగలేదు. ఇక రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి టెర్రస్ మీదకి వెళ్ళాను. ఫోన్ ఓపెన్ చేసి సంధ్య కి కాల్ చేద్దాం అనుకున్నా మళ్ళీ ఎందుకులే వాళ్లు ఇంటికి అయినా వెళ్లారో లేదో అని ఆగిపోయా. ఎం చెయ్యాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్ధం అవ్వట్లే. సరే వెయిట్ చేద్దాం, ఇంకా కొంచెం టైం తీసుకొని ప్రొసీడ్ అవుదాం అని అనుకున్నాను కిందికి వెళ్ళగానే నా బెస్ట్ ఫ్రెండ్ రాజేష్ డౌట్ గా చూసి చాయ్ తాగుదాం రా అని బయటికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక ఏంటి సంగతి ఎవరు ఆ అమ్మాయిలు? లవ్ చేస్తున్నావా? ఆ ముగ్గురి లో ఎవరిని అని టక టక అడిగేసాడు. నేను కూడా ఏమి దాచుకోకుండా నాకు కూడా ఏమి అర్ధం అవ్వట్లేదు రా, ఒక అమ్మాయి నచ్చింది బట్ సీనియర్ రా ఆ అమ్మాయి అని చెప్పా. ఏంట్రా ఎప్పుడు లేనిదీ కొత్తగా లవ్ ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాగా చదవాలి, ఐఏఎస్ అవ్వాలి అని ఏమో చెప్పావు ఇప్పుడేంటి ఇలా అని అడిగాడు. అది అదే ఇది ఇదేరా అని అన్నా. అంతే అంటావా అని ఒక నవ్వు నవ్వి సరే మామ నీకు ఎమన్నా help కావాలంటే అడుగు అని చెప్పాడు. సరే అని ఎవరికీ చెప్పకు అప్పుడే అని చెప్పా. అలా కొద్దిసేపు బయట తిరిగి రూమ్ కి వెళ్ళాం. వెళ్ళగానే ఇందు నుండి కాల్, ఎత్తగానే ఏంటి hero ఎం చేస్తున్నావ్ అని అన్నది. ఎం లేదు ఇందు, అంజలి గురించే ఆలోచిస్తున్న అన్నా. అనుకున్నా రా బాబు నీ చూపులు చూస్తేనే అర్ధం అయ్యింది దీన్ని వదిలేలా లేవు అని అన్నది. మంచిగా ట్రై చెయ్ first టైం అది పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం అని అన్నది. ఇంకా తన నెంబర్ ఫీట్ చేసుకోమని చెప్పి ఫోన్ కట్ చేసింది. నేను కూడా కొద్దిసేపు ఆ ఆలోచనలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ కి వంట లో help చేసి తిని పడుకున్నాను. కానీ ఎంత సేపటికి నిద్ర అస్సలు రావట్లేదు. అంజలినే గుర్తు వస్తుంది. ఏదో 3 AM కి అలా నిద్ర పట్టేసింది. ఇక మార్నింగ్ లేచి తొందరగా కాలేజ్ కి వెళ్లి వాళ్ళ కాలేజ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న. 9 కి అలా ఇందు n అంజలి వస్తూ కనిపించారు. ఇందు చూసి హాయ్ చెప్పింది, అంజలి చూసి చూడనట్లు వెళ్తుంది. నేను వాళ్ళతో పాటే వెళ్ళాను. హాయ్ అని అంజలి ని పలకరించాను. తను కూడా హాయ్ అని ఏంటి ఎం కావాలి అని అడిగింది. ఎం లేదు కొద్దిసేపు మీతో వుంటా అన్నా. క్లాస్సేస్ లేవా నీకు అని అడిగింది. ఉన్నాయి బట్ 9.30 వరకు వెళ్తా అని చెప్పా. సరే మేము వెళ్ళాలి గా అని అంది. మీరు ఫైనల్ ఇయర్ కదా క్లాస్సేస్ కి వెళ్తారా అని అడిగా. అప్పటి దాకా సైలెంట్ గా ఉన్న ఇందు తను బంక్ కొట్టె బ్యాచ్ కాదు బాబు కాలేజ్ టాపర్ n సిన్సియర్ స్టూడెంట్. ఓహ్ సూపర్ అన్నాను. నాకు కూడా అలాంటి వాళ్లు అంటే బాగా ఇష్టం అని చెప్పాను. సరే రవి ఇక మేము క్లాస్ కి వెళ్తాము అని వెళ్లారు. నేను కూడా ఇక చేసేది ఏమి లేక క్లాస్ కి వెళ్ళాను. ఈవెనింగ్ మళ్ళీ వెయిట్ చేశాను. ఇందు కనిపించింది. ఇందు దగ్గరికి వెళ్లి హాయ్ చెప్పినా రెస్పాండ్ అవ్వలేదు. ఏంటి మేడం పట్టించుకోట్లేదు అని అడిగా. అబ్బో మళ్ళీ మేడం కి వచ్చావే అని, నువ్ మాతో ఎక్కడ మాట్లాడతావ్ అని అన్నది. ఏమైంది ఇపుడు అని అడిగాను. మార్నింగ్ నేను హాయ్ చెప్పిన పట్టించుకోలేదు, అంజలి ఉంటే మేము కనపడం కావచ్చు అని అన్నది. నేను వామ్మో ఇదేదో తేడా కొట్టేలా ఉంది అని sorry చెప్పి గుంజీలు తీసినట్లు యాక్ట్ చేసా. తను నవ్వి సర్లే ఏడవకు పద బస్టాపు కి పోదాం అని అన్నది. అవును సంధ్య మేడం ఎక్కడ మార్నింగ్ కూడా కనిపించలేదు అని అడిగాను. తను వేరే కాలేజ్,ఈవెనింగ్ బస్టాప్ లోనే కలుస్తుంది. ఓహో సరే మరి అంజలి ఎక్కడుంది అని అడిగా. లైబ్రరీ కి వెళ్ళింది. కానీ ఒక్క విషయం అంజలి కి నువ్వు నచ్చావ్ అని నా గట్టి ఫీలింగ్ అని అన్నది. ఎందుకు అలా అనిపించింది అని అడిగాను. తనకు ప్రొపోజ్ చేసిన వాళ్లలో నువ్వే చాలా క్యూట్ గా ఉన్నావ్ n అందులో ఏజ్ లో చిన్నవాడు ప్రొపోజ్ చేస్తే అమ్మాయిలకి థ్రిల్ గా ఉంటుంది. నాకు కూడా ఎవడన్నా జూనియర్ ప్రొపోజ్ చేస్తే వెంటనే okay చెప్పేస్తా అన్నది. సరే మా ఫ్రెండ్ గాడికి చెప్తాలే అని అన్నా. వామ్మో వద్దులే వాడు ఎలాంటివాడో ఏంటో నువ్వయితే నాకు okay అన్నది కొంచెం సిగ్గుపడుతూ. నేను కూడా తనతో ప్లే అలాంగ్ ఆడాలి అని అంతా అదృష్టమా అన్నాను. మళ్ళీ అంజలి కి okay అయితే నాకు okay అన్నాను. తను వెంటనే నేనేదో జోక్ గా అన్నాను బాబు లైట్ తీస్కో అన్నది. అంటే నేను ante ఇష్టం లేదా అని అడిగాను. నువ్వు నాకే డైరెక్ట్ గా ప్రొపోజ్ చేస్తే నేను okay చేసేదాన్ని బట్ ఇప్పుడు నో ఛాన్స్ అన్నది. అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయ్యా అని కన్నుకొట్టా. తనకి నేను అటపట్టిస్తున్న అని అర్ధం అయ్యి తగుల్తాయ్ నీకు అన్నది. లేదు నిజంగానే చెప్తున్నా నువ్వు కూడా సూపర్ ఉంటావ్, ఇంకా హైట్ కూడా match అవుతుంది, అంజలి na కంటే హైట్ ఉంది అని కొంచెం భయం ఉంది నీ విషయం లో అయితే ఆ టెన్షన్ కూడా ఉండేది కాదు అని అన్నాను. అప్పుడు ఇందు ఒరేయ్ మొద్దు నువ్వు అలా ఉండటం వల్లే అంజలి నిన్ను ఏమి అనలేదు అనుకుంటా అని అన్నది. ఏమో చూద్దాం అని సర్లే గాని ఒకసారి అంజలి కి phone చెయ్ అని అడిగాను. ఫోన్ చేసి మాట్లాడి ఇంకో 20 మినిట్స్ లో రావచ్చు అని చెప్పింది. ఇంతలో సంధ్య తో ఇంకొక ఆమె కూడా వచ్చింది. వాళ్లు ఏదో మాట్లాడుతూ ఉంటే సంధ్య ఏమి సంగతి ఏమంటుంది నీ gf అని అడిగింది. నేను నవ్వి ఊరుకున్నాను. కొద్దిసేపు అలా వెయిట్ చేశాను. దూరంగా అంజలి వస్తున్నట్లు అనిపిస్తే అటు వెళ్ళాను. తన దగ్గరికి వేగంగా వెళ్లి తనతో కూడా నడుస్తూ హాయ్ అంజలి మేడం అని అన్నాను. తను కూడా హాయ్ రవి అని ముసి ముసిగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు అని అడిగా. నా కోసం నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నవ్వు వస్తుంది అని అన్నది. నేను అలిగినట్లు మొహం పెట్టాను, తను ఏమనుకుందో ఏమో అలా చూడకు రా బాబు నాకే మంచిగా అనిపిస్తలేదు అని అన్నది, ఈరోజు మొత్తం ఆలోచించా నాకు కూడా నీతో ఫ్రెండ్షిప్ వరకు అయితే okay, నేను ఫ్రెండ్ గా ఒప్పుకున్న విషయం నువ్వు అప్పుడే నా ఫ్రెండ్స్ కి చెప్పకు అని చెప్పింది . నేను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక నాకు నమ్మకం కలిగితే అప్పుడు ఆలోచిస్తా నీ ప్రపోసల్ గురించి అని అన్నది. నేను నమ్మలేక ఒక్కసారి గిచ్చు అని అన్నాను. సరే అని బుగ్గ మీద మెల్లగా గిచ్చింది. నేను షాక్ అయ్యి alane చూస్తున్న. మళ్ళీ గిచ్చనా అని నవ్వింది. నేను నమ్మలేక చేతిని నోటికి అడ్డం గా పెట్టుకొని షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టాను. తను బాగా నవ్వుతుంది నన్ను చూసి. నాకు కూడా ఫుల్ హ్యాపీ అయ్యి మేడం మిమ్మల్ని అంజలి అని పిలవచ్చా అని అడిగాను. తను ఒకసారి కోపంగా చూసినట్లు చూసి మళ్ళీ నవ్వుతూ సరే పిలువు రా అన్నది. వెంటనే నేను నిన్ను రా అని పిలవచ్చుగా అని అన్నది. నేను తప్పకుండా అంజలి అని అన్నాను. నేను వెంటనే కొద్దిసేపు ఎక్కడన్నా కూర్చుందామా అని అడిగాను. కాలేజ్ గ్రౌండ్స్ చాలా పెద్దవి, లవ్ బర్డ్స్ ఎక్కడ పడితే అక్కడే ఉండి ముచ్చట్లు పెడతారు. మేము కూడా ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాం. కొద్దిసేపు నా ఫ్యామిలీ గురించి తెలుసుకుంది. నేను కూడా తన డీటెయిల్స్ అడిగా. ఇక వెళ్లేముందు తను నన్ను నువ్వు చాలా క్యూట్ గా ఉంటావ్ మిల్క్ బాయ్ లా అని అన్నది. నీకు అలా ఉంటే ఇష్టమా అన్నాను. హా అని అన్నది. అమ్మాయిలకి మాన్లీ గా ఉండేవారే నచ్చుతారు గా అన్నాను. హా అవును బట్ క్యూట్ గా ఉండి అప్పుడప్పుడు మాన్లీ గా ఉంటే సూపర్ కదా అన్నది. అయినా నువ్వు కూడా గెడ్డం పెంచితే సూపర్ గా ఉంటావ్ అన్నది. నేను థాంక్స్ చెప్పాను. ఇక అలా మాట్లాడుతూ బస్టాప్ కి వచ్చాము. వాళ్ళందరూ వెళ్లిపోయారు, ఫోన్ చూసుకుంటే సంధ్య, ఇందు నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంజలి కి కూడా కాల్ చేసారు. లేట్ అయ్యింది అని తను వెళ్తుంటే అంజలి ని పిలిచి ఒకసారి నీ చెయ్యి పట్టుకోవచ్చా అని అడిగాను. తను ఏమి మాట్లాడకుండా చెయ్యి ఇచ్చి నా కళ్ళలోకి చూస్తూ కొద్దిసేపు అలానే ఉండి ఐ లైక్ యు అన్నది. తర్వాత ఇంప్రెస్సెడ్ అని బాయ్ చెప్పి నవ్వుకుంటూ వెళ్ళింది. వెళ్ళేటప్పుడు నా చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళింది. చూస్తే ఆ చీటీ లో తన ఫోన్ నెంబర్ ఉంది. ఫుల్లు హ్యాపీ అనిపించి నేను నా గుండె మీద చెయ్యి వేసుకుని అలా ఫీల్ అవుతూ ఉన్నాను. తను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ bus ఎక్కింది.
26-07-2024, 12:55 AM
ఎమన్నా అక్షర దొషాలు ఉన్నా, స్టోరీ బోర్ కొట్టించినా కొంచెం ఓపిక పట్టండి. దీనిలో ఎక్కువ రొమాన్స్ eh ఉంటుంది సెక్స్ తక్కువ so మన్నించగలరు. ఈ స్టోరీ successful గా పూర్తి చేస్తే అడల్ట్రీ n ఇన్సెస్ట్ స్టోరీ రాయడానికి ట్రై చేస్తా.
26-07-2024, 06:38 AM
కథ బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయండి
26-07-2024, 08:07 AM
Chala bagundhi bro
26-07-2024, 09:14 AM
Excellent story
26-07-2024, 11:58 AM
Nice update
27-07-2024, 02:58 PM
(This post was last modified: 27-07-2024, 03:05 PM by Thewarrior100. Edited 2 times in total. Edited 2 times in total.)
Update 3
ఇక అలా రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి తన నెంబర్ ఫీట్ చేసుకొని హాయ్, రవి హియర్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టాను. తన దగ్గర నుండి వెంటనే రిప్లై వచ్చింది హాయ్ అని. రవి : వెళ్ళావా ఇంటికి అంజలి: ఇంకా లేదు ఇంకో 15 మినిట్స్ పడుతుంది. రవి : రేపు శనివారం కదా ప్లాన్స్ ఏంటి అంజలి : ఏముంది కాలేజ్ కి వెళ్లడమే రవి : బంక్ కొడదాం అనుకుంటున్నా, సినిమా కి వెళదాం నువ్వు వస్తావా అంజలి : ఏంటి బంక్ కొత్తగా, నువ్వు క్లాస్సేస్ కి రెగ్యులర్ గా వెళ్తావ్ అంటగా, నాకంటే చాలా సిన్సియర్ అంటగా చదువు పట్ల రవి : నీకు ఎవరు చెప్పారు అంజలి : సీనియర్ ని బాబు ఆ మాత్రం తెలుసుకుంటాం, ఏమి తెలుసుకోకుండానే నెంబర్ ఇస్తానా నీకు రవి : అమ్మనీ ఇది మాములు షాక్ కాదు అంజలి : హా హా హా రవి : మీరు ఏమో అనుకున్నా అస్సలు, సూపర్ అంతే అంజలి : అంత లేదు లే రవి : ఇంకా ఏమేమి తెలుసు అంజలి : ఇంకా నువ్వు Btech అయిపోయాక సివిల్స్ కోచింగ్ కి వెళ్తావ్ అంటగా రవి : ఇది కూడా చెప్పారా? అంజలి : హా చెప్పారు ? రవి : అబ్బో బాగానే తెలుసుకున్నావ్ గాని నీకు నా గురించి చాలా ఎక్కువ చెప్పారు, మనకు అంత సీన్ లేదు, ఏదో మంచిగా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని అంతే అంజలి : అవును మరి మంచిగా చదువుకోకుండా ఈ లవ్ ఏంటి బాబు రవి : లవ్ చేస్తూ బాగా చదువుకోకూడదా అని నిన్ను చూసాకే అనిపించింది. అంజలి : అబ్బా అవునా… మరి బంక్ ఏంటి… అంతగా కావాలి అంటే సండే కలుద్దాం లే. రవి : ఇంట్లో ఏమి అనరా అంజలి : నేను హాస్టల్ లో ఉంటా, అమ్మ వాళ్ళు సిటీ లో నే ఉంటారు బట్ చాలా దూరం కాలేజ్ కి అని నేను హాస్టల్ లో ఉంటున్న. రవి : మరి ఇందు సంధ్య కూడా హాస్టలే నా అంజలి : ఇందు ఇంటి దగ్గర నుండే వస్తది, సంధ్య నా హాస్టలే, కానీ నేను సండే రావాలి అంటే వీళ్ళలో ఎవరో ఒకరు నాతో పాటు రావాలి so నువ్వే ఇందు కి ఫోన్ చేసి నన్ను తీసుకురమ్మని చెప్పు రవి : సరే అయితే సంధ్య ని కూడా రమ్మను అందరం లంచ్ కి వెళదాం అంజలి : సరే రేపు కలుద్దాం అని బాయ్ చెప్పింది. రవి : నైట్ ఫోన్ చెయ్యనా అంజలి : సరే చెయ్యి కానీ నేను ఫ్రీగా ఉంటేనే మాట్లాడుతా రవి : సరే బాయ్, లవ్ యు ❤️? అంజలి : ? ఇక నేను 9 కి అలా కాల్ చేసా, తను ఎత్తలేదు. ఇంకో 10 మినిట్స్ లో ఇందు నుండి కాల్. లిఫ్ట్ చేసా ఇందు : ఏంటి లవర్ బాయ్ ఏమి చేస్తున్నావ్ తిన్నావా? రవి : ఏమి లేదు ఇందు ఖాళీగానే ఉన్నా ఇప్పుడే తిన్న నువ్వు తిన్నావా? నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా ఇందు : ఎందుకు రవి : రేపు బంక్ కొట్టి మూవీ కి వెళ్దామా, నీకు ఓకే అయితే అంజలి సంధ్య కి కూడా చెప్పు. ఇందు : అంజలి రాదు లే నేను సంధ్య వస్తే నీకు ఓకే నా. రవి : ప్లీజ్ అబ్బా ఇందు : సరే అడుగుతా ఒకవేళ రాకపోతే మనం వెళదాం రవి : హా సరే కాని సండే మాత్రం అంజలి ని ఏదో ఒకటి చేసి తీసుకురా లంచ్ కి వెళదాం ఇందు : ఓకే, సండే అయితే ఎలా అయినా తీసుకొస్తాలే, అయినా అంజలి వస్తే మాతో మాట్లాడతావా అస్సలు. రవి : అప్పుడేదో అలా చేసా లే ఇప్పుడు చెయ్యను. ఇందు : సరే నేను వాళ్ళకి కాల్ చేసి అడుగుతా, కాన్ఫరెన్స్ లో పెట్టాలా? రవి : పెట్టు, నేను ఉన్నా అని చెప్పకు ఇందు : వెయిట్ చెయ్ కాల్ లో ఇందు : హలో అంజు ఏమి చేస్తున్నావ్ అంజలి : ఏమి లేదు వే కాళీ నే ఇప్పుడే తిన్న నువ్వు తిన్నావా ఇందు : తిన్నా గాని నువ్ రేపు మూవీ కి వస్తావా అంజలి : రేపు కాలేజ్ ఉంది గా ఇందు : బంక్ కొడదాం అంజలి : నేను రాను అని తెలుసు కదే ఇందు : నా కోసం రా రా ప్లీజ్ అంజలి : ఏమే సంధ్య రేపు మూవీ కి వెళ్తావా ఇందు : ఏంటి నువ్వు రావా అంజలి : అబ్బా నేను రేపు మార్నింగ్ చెపుతా సంధ్య : నేను రెడీనే ఏమి మూవీ కి వెళదాం ఇందు : అక్కడ ఏమి మూవీ ఉంటే అదే అంజలి : అస్సలు ఎప్పుడు లేనిది కొత్తగా ఈ ప్లాన్స్ ఏంటి మేడం ఇందు : ఊరికినే మనం వెళ్ళక చాలా డేస్ అవుతుంది అని అంజలి : అంతేనా ఇంకా ఏమయినా నాకు తెలియకుండా ప్లాన్ చేస్తున్నావా ఇందు : అంతే బాబు ఇంకా ఏమి లేదు అంజలి : సరే నేను రేపు కాల్ చేస్తా బై ఇందు : రవి ఇప్పుడు హ్యాపీయేన రవి : ఏంటి హ్యాపీ నేను వస్తే తను ఏమనుకుంటుందో, నేను వస్తున్న అని చెప్పలే గా ఇందు : అది నేను మేనేజ్ చేస్తా లే లైట్ తీస్కో అప్పుడే అంజలి దగ్గర నుండి కాల్ వస్తుంది, ఇప్పుడు ఏమంటుందో అని టెన్షన్ స్టార్ట్ అయ్యింది. వేరే ఇంపార్టెంట్ కాల్ ఒకటి వస్తుంది సరే నేను మళ్ళీ చేస్తా అని చెప్పి అంజలి కాల్ లిఫ్ట్ చేసా అంజలి : ఏంటి రవి ఇదంతా నీ ప్లానేనా రవి : ఏంటి ప్లాన్? అంజలి : ఇందు ఫోన్ చేసి అడిగింది రేపు మూవీ కి వెళ్దామా అని రవి : నువ్ రానని తనకి చెప్తే సరిపోతుంది గా మధ్యలో నేను ఎందుకు గుర్తుకు వచ్చా , అయినా తన నెంబర్ నా దగ్గర లేదు. అంజలి : సరే కోప్పడకు, మేము వెళ్తున్నాం రేపు. నువ్వు వస్తే అప్పుడు ఉంటది నీకు. రవి : అబ్బా అదేంటి నేను కూడా వస్తా ప్లీజ్, ఆల్రెడీ నువ్ బంక్ కొడదాం అని ఫిక్స్ అయ్యావ్ గా నేను వస్తే ఏమి ప్రాబ్లెమ్ అంజలి : వద్దు, సండే కలుద్దాం అన్నా గా రవి : సండే కూడా కలుద్దాం అంజలి : ఇంకేమన్నా కాదు, నేను రాలేను బాబు రవి : సరే అయితే రేపు ఒక్కరోజు కలుద్దాం లే అంజలి : మళ్ళీ మొదటికే వస్తున్నావ్ వద్దని చెప్పానా రవి : సరే నీ ఇష్టం మూవీ కి రాను లే మూవీ అయిపోయాక బయట కలుస్తా, సండే వద్దులే. అంజలి : ఓకే బై రవి : బై గుడ్ నైట్ కొద్దిసేపు అయిన తర్వాత అంజలి మెసేజ్ చేసింది ఫీల్ అయ్యావా అని రవి : అలా ఏమి లేదు నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నాకు అంజలి : సరే నువ్వు కూడా రా మరి, ఏమో రా నన్ను అన్నిటికి కన్వీన్స్ చేస్తున్నావ్ నువ్వు, ఏమి మాయ చేసావో ఏంటో రవి : థాంక్ యు అంజలి, థాంక్ యు వెరీ మచ్ ❤️ అంజలి : బై గుడ్ నైట్ ? రేపు ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయా.
27-07-2024, 06:55 PM
Good update
27-07-2024, 07:53 PM
Superb
27-07-2024, 08:33 PM
Excellent update
28-07-2024, 12:26 PM
అప్డేట్ చాల బాగుంది
28-07-2024, 02:12 PM
Excellent update
|
« Next Oldest | Next Newest »
|