Thread Rating:
  • 8 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బేవర్స్ ల సంఘం వర్ధిల్లాలి
#1
నేను ఇంటి నుండి బయటకి వచ్చి బైక్ స్టార్ట్ చేసి అమ్మా వెళ్ళొస్తా అని చెప్పాను...లోపల నుంచి అమ్మ వెళ్ళరా ఏదో ఆఫీస్ కి వెళ్తున్నట్లు ఎందుకు అల అరుస్తావ్ బెవర్స్ గా తిరగటానికే గా అని అంది...నేను అమ్మని తిట్టుకుని నీకు చెప్పటం కూడా వేస్ట్ అని బైక్ వేసుకుని ఊరి మీద కి పడ్డాను......


అలా బైక్ మీద జాలిగా వెళ్తూ...  " ఓహ్ మధు ఓహ్ మధు నా మనసు నాది కాదు"...అని పాట పడుకుంటు ఉంటే కుమార్ గాడు కాల్ చేశాడు...

నేను : రేయ్ ఎక్కడ రా...

కుమార్ : మన ఊరి పాత బస్టాండు లో రా...

నేను : అక్కడ ఎందుకు రా....బస్ లు రావటం ఎప్పుడో మానేశాయి గా...కొత్త బస్ స్టాండు లో కూర్చో కొంచెం కలరింగ్ అయినా ఉంటాది...

కుమార్ : ఇప్పుడు కలరింగ్ ఎందుకు గాని...ఇలా వస్తె రా నువ్వు కూడా...

నేను : ఇప్పుడే వస్తున్నా...

*******************

అలా కుమార్ గాడు దగ్గరకి వెళ్ళాను నేను కూడా...

నేను : ఏరా బావ ఎమ్ చేస్తున్నావ్ ఇక్కడ...

కుమార్ : పని ఉండే వాడు ఎదైనా చేస్తాడు...మన లా బేవర్స్ గా ఉండే వాళ్ళు ఎమ్ చేస్తారు రా... కూర్చొని ఎదైనా సొల్లు చెప్పుకోవడమే 

నాకు రెండో సారీ మళ్ళా బెవార్స్ అన్న మాట వినేసరికి చిర్రు ఎత్తుకొచింది...అది కూడా కుమార్ గాడి నోటి వెంట

నేను : రేయ్ ఏమైనా అను కాని బేవార్స్ అని మాత్రం అనకు ..అర్థం అవుతుందా...

కుమార్ గాడు కాస్త వింత గా చూసి ఎమ్ అయింది రా అని అడిగాడు...

నేను : లేకుంటే ఎంట్ర ప్రతి ఒకడు బెవర్స్ బెవర్స్ అంటారు... బెవర్స్ గాల్లు అంటే అంత చులకనా...

కుమార్ గాడు ఎప్పటి లాగానే ఆలోచన లో పడ్డాడు...వాడి ఆలోచన ని తీవ్రం చేయటానికి నేను కొన్ని బెవర్స్ ల ఆత్మాభిమానం దెబ్బ తినే లా రెండు డైలాగులు చెప్పాను...సాటి బెవర్స్ గాడు కాబట్టి వాడికి కూడా కోపం వచ్చింది...

కుమార్: దీనమ్మ ఇన్ని రోజులు పట్టించు కోలేదు కాని అసలు బెవర్స్ అంటే ఎం లాంగ్వేజ్ రా.... గ్రీక లాటినా అరబికా....పేసిఫికా...

నేను : స్పెసిఫిక్ గా తెలీదు కాని పెసిఫికే అయి ఉంటాది...

కుమార్ : భాష ది ఎమ్ ఉంది లే బాధ ఒకటే అయినపుడు....

నేను : మాట ఒక్కటే అయినపుడు మనసు కూడా ఒకటే... పలుకుల లో కేసరి...

కుమార్ : ఏంట్రా నీ యబ్బ అర్థం పర్థం లేకుండా వాగుతావ్...

నేను : పలుకుల లో కేసరి యాడ్ చూడలేదా....అక్షయ్ కుమార్ షారుక్ సల్మాన్...

కుమార్ : పాన్ మసాలా...

నేను : హా అందులో డైలాగ్ చెప్తున్నా ...మాట ఒకటే అయితే మనసు కూడా ఒకటే అంట....అల బాధ ఒకటే అయినపుడు కూడా మనసు ఒకటే అవ్వాలి కదా...

కుమార్ : అవును ఇప్పుడు నీ బాధ నా బాధ ఒకటే గా...

నేను : నువు నేనే కాదు బా...మనలాంటి వాళ్ళు ఈ లోకం లో చాలా మంది ఉన్నారు... వాళ్ళ బాధ కూడా మన బాధే...

కుమార్ గాడు సీరియస్ గా అవును బా... సాటి బెవర్స్ ల బాధ....

నేను : ఎంత మంది మనలా మాటలు పడుతూ బాధ పడుతూ ఉంటారు బా

కుమార్ : నిజమే రా తలచుకుంటే రక్తం మరిగి పోతుంది... బెవర్స్ అంటే తిట్టు కాదు అది ఒక బ్రాండ్ అనే విధంగా తయారు చెయ్యాలనే కసి వస్తుంది...(కుమార్ గాడి లో అవేశం టన్నులు టన్నులు గా తన్నుకు వస్తుంది)...

వాడి తో పాటు నాకు కూడా అవేశం వచ్చింది...

కుమార్ : ఏదో ఒకటి చెయ్యాలి బా...

నేను : నువు తలచుకుంటే ఎదైనా చెయ్య గలవ్ బావ....(వాడి ఆవేశానికి వత్తాసు పలిక)..

కుమార్ : చేద్దాం ...ఇప్పుడే చేద్దాం ...(అని ఉన్న పలంగా లేచి నిలబడ్డాడు)...

నేను షాక్ తిన్నా....ఏదో మాట వరసకి మాట్లాడుకుంటే వీడు ఏంటి ఏదో పీకేసే వాడి లా పైకి లేచాడు అని చూస్తున్నా...

కుమార్ : బావ నాకు అర్జెంట్ గా బెవర్స్ గాళ్లు కావాలి రా...

నేను : రేయ్ వాళ్ళు ఏమైనా ఆటో వాళ్ళ రిక్షా వాళ్ళ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకటానికి...ఎక్కడని వెతకాలి ఇప్పటికి ఇప్పుడు అంటే...

కుమార్ : దొరుకుతారు బావ... ఆలోచించు...

నేను : ఎలా రా...

కుమార్ : ఫోన్ ఉందా

నేను : ఉంది

కుమార్ : అయితే సోషల్ మీడియా ఓపెన్ చేసి ఎక్స్పోజింగ్ చేసే అమ్మయిల అకౌంట్ ల లోకి వెళ్లి కింద కామెంట్స్ లో బెవర్స్ రాజాల మహాసభ కి ఇదే మా ఆహ్వానం అని...స్పాట్ మన ఊరి పాత బస్టాండు అని యివ్వి...(ఒక ఫ్లో లో అవేశం గా చెప్పాడు).

నేను : కామెంట్ ల లో  ఎందుకు రా...

కుమార్ : ఇంకా అర్థం కాలేదా...మన బెవర్స్ బ్రదర్స్ అందరూ కామన్ గా ఉండే ప్లేస్ అదే... ఎక్కువ అడగ కుండా చెప్పింది చెయ్....

నేను కుమార్ గాడు చెప్పింది చేశాను.... మంచి గా ఎక్స్పోజింగ్..చేసే ఒక ఆంటీ అకౌంట్ లోకి వెళ్లి... కామెంట్ పెట్టాను...అంతే పెట్టిన పది నిమిషాల కే పది మంది రిప్లై ఇచ్చారు...

నేను : రేయ్ నిజమే రా....వీళ్ళు వస్తారు అంట టైమ్ కూడా అడుగుతున్నారు...

కుమార్ : హహహ అని వికటాట్టహాసం చేసి ఇప్పుడే అని చెప్పు...

నేను అలాగే రిప్లై ఇచ్చాను...

కుమార్ : ఎమ్ అంటున్నారు ..

నేను : రేయ్ పక్క ఊరి బెవర్స్ లు వాళ్ళ ఊరి లో కూడా పెట్ట మంటున్నారు...రేయ్ ఏంట్రా ఇన్ని కామెంట్లు లైక్స్  వస్తున్నాయి.....(అంటూ ఆశ్చర్య పోతు చెప్పాను)

కుమార్ :..చూసావా మన వాళ్ళు ఎంత మంది ఉన్నారో.... కాసేపు ఉంటే పక్క దేశం బెవర్స్ లు కూడా రిప్లై లు ఇస్తారు.. మన వల్ల కాదు కాని...మన ఊరి వాళ్ళకే రిప్లై ఇవ్వు...( చాలా కూల్ గా చెప్పాడు)...

నేను  ఫోన్ లో ఇలా పెట్టానో లేదో...దూరంగ ఒకరొకరు వస్తూ ఉన్నారు..

నేను : రేయ్ కుమారు వాళ్ళు వస్తున్నారు రా....ఎమ్ చేస్తావ్ రా...నాకు టెన్సన్ గా ఉంది

కుమార్ : బావా నువు చూస్తూ ఉండు అల....అని హామి ఇచ్చాడు ...

మా చుట్టూ ఒక పది మంది అప్పటికి అప్పుడు చేరారు...

కుమార్ : మీరు అందరూ బెవర్స్ లా 

వాళ్ళు : అవును అవును...

కుమార్ : అయితే వెల్కమ్ టూ బెవర్స్ మహా సభ...రండి విరిగి పోయిన కుర్చీల మీద ఇలా వచ్చి కూర్చోండి....

కుమార్ గాడు అల చెప్పగానే వాళ్ళు వెళ్లి కుర్చీల మీద కూర్చున్నారు ...

నేను కుమార్ పక్కన నిలబడి చూస్తున్న... వాడి లో ఒక గొప్ప లీడర్ ని చూస్తున్నా....

కుమార్ : ఏంట్రా అల చూస్తున్నావ్...

నేను : బావ నువు ఎమ్ చేస్తావో ఎమో కాని నీలో బెవర్స్ సంఘానికి లీడర్ ని చూస్తున్నా రా అని వెళ్లి వాడిని హగ్ చేసుకున్న....

కుమార్ గాడు నన్ను ఊరుకోమని....వెల్లి కూర్చొమన్నాడు...

నేను వెళ్లి వాళ్ళ మధ్యలో కూర్చున్న...కుమార్ గాడు స్పీచ్ స్టార్ట్ చేసాడు...

కుమార్ : మై డియర్ బెవర్స్ బ్రదర్స్.... మన మీటింగ్ ఈ బస్ స్టాండ్ లో పెట్టడానికి కారణం ఏంటో తెలుసా...

బివర్స్: తెలీదు తెలీదు

కుమార్ : మన బతుకు బస్టాండ్ కాబట్టి... ఇక్కడే మీటింగ్ పెట్టాను...

బెవర్స్ అందరూ చప్పట్లు కొట్టారు....నేను కూడా ఎమ్ చెప్పాడు అనుకుని చప్పట్లు కొట్టాను...

కుమార్ :ఒకే ఒకే

బెవర్స్ ల లో ఒకడు....అన్న ఇప్పుడు ఎమ్ చేస్తావ్ అన్న...

కుమార్ : చెప్తా చెప్తా...మీరు కూడా మాలాగే కష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు....ఎమ్ బెవర్స్ లు మాత్రం మనుషులు కారా బెవర్స్ ల కి మాత్రం మనసు ఉండద...

బెవర్స్ ల నీ ఎమోషనల్ గా టచ్ చేశాడు...

బెవర్స్ గాడు ఏడుస్తూ నిజమే అన్నా అని అన్నాడు...

కుమార్ : ఏ దేశం లో అయినా వివిధ జాతులు మతాలు కులాలు తెగలు ప్రాంతాలు ఉంటాయి...కాని అన్నిట్లో కామన్ గా వుండేది మన బెవర్స్ లే ..

బెవర్స్ లు విజిల్స్ వేశారు ఆ మాటకి... కుమార్ గాడు పిచ్చి ఎక్కిస్తున్నాడు స్పీచ్ అనిపించింది నాకు...

కుమార్ : చరిత్ర లో అన్ని జాతులు ని ఉద్దరించటానికి ఎవడో ఒకడు ఎప్పుడో
కప్పుడు పుట్టాడు కాని మన బెవర్స్ జాతి ని మాత్రం ఉద్ధరించటానికి ఏ ఒక్కడు ముందు అడుగు వెయ్యలేదు....ఎమ్ మనమంటే అంత చిన్న చూపా...

బెవర్స్ ల లో అవేశం నింపాడు ఆ మాట తో అంతే...అందరూ బెవర్స్ ల సంఘం నాయకుడు కుమార్ వర్ధిల్లాలి అని గట్టిగా అరిచారు.... వారి తో పాటు నేను కూడా అరిచా...

బెవర్స్ లు : అన్న మరి ఎమ్ చేద్దాం అన్న....అవేశం గా..లేచి నిలబడి అడిగాడు 

కుమార్ : ఎదైనా చేస్తే మనం బెవర్స్ లు ఎందుకు అవుతాం రా...ఎమ్ బెవర్స్ వి రా నువు కూర్చో అని తిట్టాడు...

వాడు అవును నిజమే అని తల గోక్కుంటూ కూర్చున్నాడు...

కుమార్ : నేను చెప్పేది వినండి జాగ్రత్తగా....

బెవర్స్ లు : చెప్పు అన్న...

కుమార్ : మీరు అనాథ ల ఆశ్రమం చూశారా...

బెవర్స్ లు : చూశాం చూశాం

కుమార్ : వృద్ధ ఆశ్రమం చూశారా..

బెవర్స్ లు : చూశాం చూశాం

కుమార్ : మరి బెవర్స్ ఆశ్రమాలు ఎక్కడైనా చూశారా...

అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు...

కుమార్ : చూసి ఉండరు...ఎందుకు అంటే అలాంటి ఒక ఆశ్రమం పెట్టాలి అని ఎవడికి ఆలోచన వచ్చి ఉండదు...ఎందుకు అని అడగండి...

అందరూ : ఎందుకు అన్న ... (ముక్త కంఠంతో అడిగారు).

కుమార్ : చిన్న చూపు....మనం అంటే చిన్న చూపు...అయ్యో వీడు బెవర్స్ గాడు...టైమ్ కి తిండి పెట్టాలి బయటకి తిరగటానికి డబ్బులు ఇవ్వాలి అని ఏ ఒక్కడు అయినా ఎప్పుడు అయిన ఆలోచించి ఉంటాడా మన గురించి... ఇన్ని స్వచంద సంస్థ లు ఉన్నాయి ఏ ఒక్కటి అయిన మన గురించి పని చేస్తుందా....

అందరూ : లేదు లేదు...అని అరిచారు...

కుమార్ : అందుకే...మనల్ని మనమే ఉద్దరించుకుందాం.... బెవర్స్ ల ఆశ్రమం నెల కొల్పుదాం...అందరం ఓకే చోట ఏ పని పాట్లు లేకుండా  హాయిగా ఉందాం

వాడు అల చెప్పగానే అందరూ ఈలలు వేసి కుమార్ ని చుట్టూ ముట్టి పైకి ఎత్తారు .... కుమార్ గాడి మైండ్ బ్లోయింగ్ ఐడియా కి మైండ్ నిజంగా పోయింది... నాకు...

కుమార్ గాడు దింపండి దింపండి... అపుడే అయిపోలేదు ఇప్పుడే అసలు విషయం చెప్తా వినండి అని అన్నాడు...

అందరూ సీరియస్ గా వాడిని దింపి వాడు చెప్ప బోయేది వింటున్నారు...

కుమార్ : ఆశ్రమం పెడతాం ఒకే...మరి మన తాగడానికి ఎంజాయ్ చెయ్యటానికి డబ్బులు ఎవరు ఇస్తారు...

అందరూ : అవును నిజమే ఎవరు ఇస్తారు ..అసలే బెవర్స్లం కదా...

కుమార్ గాడు మరోసారి వికటాట్టహాసం చేసి....అందుకే మీ పది మంది లో రోజుకి ఇద్దరు చొప్పున పని చేస్తారు...ఆ డబ్బుల తో..మిగతా వాళ్ళు తాగి తందనాలు ఆడుతారు...

కుమార్ గాడి ముందు చూపుకి దార్శనికత కి ఔన్నత్యానికి...మా అందరికీ ఒక మహానుభావుడు లా కనిపించాడు...

కుమార్: సరే సరే అందరూ నా నెంబర్ తీసుకుని ఈరోజు కి వెళ్ళండి...రేపు ఎక్కడికి రావాలో నేను చెప్తా...రేపటి నుంచి మనం మన ఆశ్రమాన్ని స్టార్ట్ చెద్దాం....

అందరూ సరే అన్నా అని కుమార్ చేతిని ముద్దాడి వెళ్లారు....

నేను కుమార్ ని ఇంకా అదే షాక్లో చూస్తూ నిలబడి పోయాను...ఒక గంట లో ఎంత ఎదిగి పోయావ్ రా అన్నట్లు...

కుమార్ : బావ బిత్తర చూపులు చూసిందీ చాలు....ఇక పద చాలా పనులు ఉన్నాయి...

నేను సరే బావ అని బైక్ తీసాను....

కుమార్ గాడు నేరు గా వాళ్ళ ఇంటికి పొమ్మన్నాడు...

ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం...

కుమార్ బావ ఈరోజు నుంచి ఇదే మన ఆశ్రమం...

నేను : బావ ఇది మీ ఇల్లు కాద రా... మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఉతికి ఆరేసి వదులుతారు 

కుమార్ : వాళ్ళు ఉండాలిగా... కాశీకి వెళ్లారు...నెల రోజులు రారు..

నేను : ఓహ్ అయితే సూపర్ బా...

కుమార్ : నేను చెప్పేది విను... రేపటి నుంచి మన బెవర్స్ బ్రదర్స్ అందరూ ఇక్కడికి వస్తారు.. ఇక్కడే ఉంటారు....ఈ ఆశ్రమానికి నేనే మేనేజింగ్ డైరెక్టర్...

నేను : డైరెక్టర్ ఆ...మరి నేను

కుమార్ : నువు నా అసిస్టెంట్ డైరెక్టర్ బావ...

నేను కుష్ అయ్యి హా అల అయితే ఓకే...

నేను : నీకు బెవర్స్ వాళ్ళు అంటే ఎంత మమకారం బావ....వాళ్ళ కోసం నీ ఇంటిని త్యాగం చేస్తున్నావ్...

కుమార్ : అంత లేదు రా బాబు...అక్కడే ఉండి బిజినెస్ అంతా...

నేను : బిజినెసా...బిజినెస్ ఏంటి... కుమార్ గాడు ఇచ్చిన ట్విస్ట్ కి షాక్ అయిపోయా...

కుమార్ : బిజినెస్ కాకపోతే మనం ఏమైనా సత్రం నడుపుతున్నామ్ అనుకున్నావా రా పిచ్చి బావ..

నేను : బావ నాకు ఎమ్ అర్థం కావట్లేదు రా...అర్థం అయ్యేలా చెప్పు...

కుమార్ గాడు ఇంట్లొపలకి తీసుకువెళ్ళి వాడి ప్లాన్ మొత్తం చెప్పటం స్టార్ట్ చేసాడు ..

కుమార్ : బావ వాళ్ళు పది మంది....మనం రోజుకి ఇద్దరిని చప్పున... ఉపయోగించి A to z సర్వీసెస్ స్టార్ట్ చెద్దాం...

నేను : A to Z సర్వీసెస్ ఆ అదేంటి...

కుమార్ : చెప్తా విను...ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ పప్పు వండుతుంది... సడన్ గా ఉప్పు అయిపోయింది...అల అని పప్పు ఉప్పు లేకుండా వండుతుందా...

నేను : లేదుగా నన్ను షాప్ కి పంపించి మరి ఉప్పు కొనిపించి వండుతుంది....

కుమార్: హా మీ ఇంట్లో నువ్వు బెవర్స్ గా ఉన్నావు కాబట్టి వెళ్తావ్...కాని అందరి ఇళ్ళల్లో మన లాంటి బెవర్స్ లు ఉండరు గా...

నేను : అవును బావ

కుమార్ : అప్పుడు మన బెవర్స్ ల కి పని పడుతుంది...

నేను : నువ్వు సూపర్ బావ...

కుమార్ : హా అల ప్రతి ఇంట్లో కి ఏదోఒక చిన్న పని కావాల్సిన వాళ్ళు ఉంటారు...వాళ్ళకి మనం సర్వీస్ అందిస్తాం....ఊరికే కాదు...దానికి ఛార్జ్ చేస్తాం...ఒక్కో పనికి ఒక్కో రేట్...మళ్ళా దాని మీద B S T కూడా ఉంటుంది

నేను : BST అంటే...

కుమార్ : బెవర్స్ సర్వీస్ టాక్స్...

నేను : సూపర్ బా....

కుమార్: ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ చెప్పనా...

నేను : ఏంటి

కుమార్ : మనకి డబ్బులు మిగులుతాయి ఎమ్ పని చెయ్యకుండా...

నేను : అది ఎలా ..

కుమార్ : మేనేజింగ్ డైరెక్టర్ నేనే గా......(గట్టిగా నవ్వుతూ చెప్పాడు)...

నేను : బావ నువ్వు సామాన్యుడి వి కాదు రా....నేను అల అనేసరికి బాగా పోంగు వచ్చేసింది కుమార్ కి...

ఆ రోజుకి వాడి ఇంటి లో కొన్ని మార్పులు చేసి సిద్ధం చేశాం ఆశ్రమానికి...

తర్వాత రోజు రానే వచ్చింది... బెవర్స్ లు అందరికీ కుమార్ ఫోన్ లు చేసి మరి చెప్పాడు...వాళ్ళు బెవర్స్ గా చేతులు ఊపుకుంటూ వచ్చేశారు....వెంటనే...

నేను : రేయ్ బావ ఏంట్రా వీళ్ళు... ప్రతి సారి ఇంత ఫాస్ట్ గా ఉంటారు...

కుమార్ : బెవర్స్ గాల్ల్లు కద బా...ఎమ్ పని ఉంటాది చెప్పు పాపం....

అందరికీ వెల్కమ్ చెప్పాం...కాని ఎవడు ఎమ్ పట్టించుకోలేదు ....వచ్చి నచ్చిన చోట కూర్చుని ఒకడు పడుకుని ఒకడు అల పది మంది ఇష్టం వచ్చినట్లు దొర్లుతున్నారు....

నేను : బావ నీ కల నెరవేరింది రా...

కుమార్ : అవును బావ చూడు ఎంత చూడ ముచ్చట గా ఉన్నారో... పద మనం మిగతా పనులు చూద్దాం అని... స్టోర్ రూం ని ఆఫీస్ గది గా మార్చుకుని అందులో కి వెళ్ళాం...

కుమార్ : బావ మన పనులు రేపటి నుంచి మొదలు పెడదాం....ఈరోజే ఎందుకు లే...అని నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు...

నేను : బావ అప్పుడే సాలరీ నా... హాపీగా వాడిని చూస్తూ అడిగా

కుమార్ : అంత వద్దు రా వెళ్లి బీర్లు బిర్యానీ తే పో...మన వాళ్లకు...

నేను : అసిస్టెంట్ డైరెక్టర్ ని  అని డెలివరీ బాయ్ ని చేశావ్ కదరా ...అని తిట్టుకుని వెళ్లాను....

కుమార్ గాడు ఇంత లోగా..సోషల్ మీడియా ఉపయోగించి...A to Z సర్వీసెస్ ని పబ్లిసిటీ చేయటం స్టార్ట్ చేశాడు....

ఆ రోజుకి పార్టీ చేసుకుని...ఎంజాయ్ చేశాం....

నేను ఇంటికి వెళ్లి మరునాడు వచ్చాను.....

సరిగ్గా మంచి ముహూర్తం చూసి ఫోన్ ఆన్ చేసాడు....

ఫస్ట్ సర్వీస్ ఏమి ఉంటుందా అని ఇద్దరం ఎదురు చూస్తూ ఉన్నాం... అంత లో కాల్ వచ్చింది... కుమార్ గాడు లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టి...హలో మీకు ఏ విధంగా సహాయపడ గలము అని అడిగాడు

అవతల : హలో శవాన్ని మోయ్యాలి అర్జెంట్... ఇద్దరు తక్కువ అయ్యారు...

మేం ఇద్దరం షాక్ అయ్యాం...ఫస్ట్ ఫస్ట్ ఇలాంటి సర్వీస్ వచ్చింది ఏంటి బావ అని అడిగా...

కుమార్ గాడు నవ్వుతూ: రేయ్ శవం ఎదురు పడితే మంచిదే బావ...అలాంటిది ఫస్ట్ సర్వీస్ మనకి ఇది తగలటం మన అదృష్టం...

నేను : అవునా

కుమార్ గాడు అడ్రస్ కనుక్కుని ఫోన్ పెట్టేసాడు....

ఇద్దరం ఆశ్రమం లోకి వెళ్ళాం...ఆశ్రమం లో బెవర్స్ లు అందరూ నిద్ర పోతున్నారు...

కుమార్ : మై డియర్ బెవర్స్ బ్రదర్స్... మీలో ఇద్దరు సర్వీస్ కి వెళ్ళాలి....

అందరు ఒకరి మొహం ఒకరు చూసుకొని... మీరూ ఇద్దరే గా  అని అన్నారు....

నేను కుమార్ గాడు ఒకరి మొహం ఒకరం చూస్కున్నం...

కుమార్: పోనీలే బా ..ఫస్ట్ మనతోనే మొదలు పెడదాం...

నేను : రేయ్ ఎమ్ అంటున్నావ్ రా...అంటే నేను శవాన్ని మోయాల...

కుమార్ : మోయాటానికి మనుషులు లేరు అంటే అర్ధం కావట్లేదా...ఎవడో మన జాతి వాడే అయి ఉంటాడు... పోదాం పద బావ..( అని బలవంతం చేసి తీసుకు వెళ్ళాడు)...

వెళ్ళిన పని పూర్తి అయ్యింది.. యిద్దరికీ తలో 500 చేతి లో పెట్టారు... మాకు చాలా హ్యాపీగా అనిపించింది...

అంత లో ఆశ్రమం నుంచి బెవర్స్ గాళ్ళు ఫోన్ చేసి బీర్లు బిర్యాని తెమ్మన్నరు...నాకు కోపం వచ్చింది... రేయ్ ఏంట్రా ఇది అని అడిగా...కుమార్ గాడు నన్ను చల్ల బరిచి...వాళ్ళే మన కి పెట్టుబడి బావ...వాళ్ళని మనం ప్రేమ గా చూసుకోవాలి...వాళ్ళే దారికి వస్తారు అని చెప్పాడు.....

నేను : ఎమో రా వాళ్ల ని చూస్తుంటే అల లేరు అనిపిస్తుంది నాకు...

కుమార్ : రేయ్ ఎక్కువ ఆలోచించకుండా...వెళ్లి ఈ పైసల తో బీర్లు బిరియాని పట్టుకు రారా డెలివరీ బాయ్ అని నవ్వాడు ..

నాకు ఇన్సల్ట్ గా అనిపించినా కుమార్ గాడి మీద నమ్మకం తో వాడు చెప్పిన మాట వింటున్న...

అలా రెండు రోజులు గడిచాయి....మాకు చిల్లర సర్వీస్ లు వస్తున్నాయి...ఎవడో పెళ్ళాం డ్యూటీ కి పోతు వడియాలు ఎండ బెట్ట మంది అంట...వాడు చెయ్యలేక మాకు ఆ పని చెప్పాడు... సీనియర్ బెవర్స్ లే అని గౌరవం తో ఆ పని చేశాం...దానికి కూడా నేను కుమార్ గాడే వెళ్ళాం.....ఏదో అల గడుస్తున్నాయి రోజులు కాని ఆశ్రమం లో బెవర్స్ లు ఎవరు పనికి పోవటానికి ఇష్టపడట్లేదు....కుమార్ గాడికి వాళ్ళు బిస్కెట్ లు వేస్తూ బ్రతికేస్తున్నారు అనిపిస్తుంది.... పైగా నన్ను డెలివరీ బాయ్ అని పిలవటం మొదలు పెట్టారు...కుమార్ గాడి మొహం చూసి ఎమ్ అనకుండా ఊరుకుంటున్నా... బట్టలు ఆరవెయ్యటం... నుంచి గిన్నెలు తోమటం వరకు అన్ని పనులు వస్తున్నాయి...కుమార్ గాడికి నాకు తీరిక ఉండట్లేదు...వస్తున్న పైసలు బీర్లుకి బిర్యాని కి అయిపోతున్నాయి... అది కూడా మాకు ఎమ్ మిగలట్లేదు....అల పది రోజుకు గడిచాయి రేపు వెళ్తాం ఎల్లుండి వెళ్తాం అని ఇప్పటి వరకు వాళ్ళు వెళ్లింది లేదు....నేను కుమార్ గాడి ని కడిగేసా...ఈరోజు ఎలా అయినా వాళ్ళని పంపించు లేదంటే నేను పోతాను అని...

కుమార్ గాడు హామి ఇచ్చాడు....ఈ రోజు వచ్చే కాల్ కి మనం వెళ్ళాట్లేదు సరే నా అని...

అంత లో ఒక కాల్ వచ్చింది.... ఎవరో లేడి వాయిస్...కుమార్ గాడు చెప్పండీ యే విధంగా సాయపడగలము అని అడిగాడు...

లేడి : మా ఆయన ఊర్లో లేడు... సర్వీస్ కావాలి (హస్కీ గా చెప్పింది...).

కుమార్ : అయితే మా A to Z సర్వీసెస్ నుండి ఇద్దరు కుర్రాళ్ళు ని పంపిస్తాం.... సర్వీస్ ఏంటో చెప్పండీ...

లేడి హస్కిగా నవ్వుతూ...అది ఇద్దరు కాదు ఒక్కరు చేసే పనే అని చెప్పింది....

అంతే కుమార్ గాడి లైట్ లు వెలిగాయి....నేను షాక్ అయ్యాను ..వాడు అడ్రస్ కనుక్కుని కాల్ కట్ చేశాడు

నేను : రేయ్ రేయ్ ఏంట్రా ఇది...

కుమార్ : చూసావా బావ పని చేయటానికి ఏడుస్తున్నావు కాని ఎంత మంచి పని దొరికిందో...

నేను : రేయ్ రేయ్ నేను వెళ్తా రా ప్లీజ్...

కుమార్ : ఇప్పుడే కదరా నేను ఎమ్ పని చెయ్యను అని కూర్చున్నవు....

నేను : ప్లీజ్ రా ఒకసారి నా మాట విను...

కుమార్ : బావ నీకు ఎక్స్పీరియన్స్ లేదు చిన్న పిల్లాడివి అవతల పని సరిగ్గా చెయ్యక పోతే...మనకి రేటింగ్ తగ్గిపొద్ది...నేను చెప్పేది విను...అంటూ నేను ఎంత రిక్వేస్ట్ చేసినా వినకుండా నన్ను బీర్యానీ కి పంపి వాడు... సర్వీస్ కి వెళ్ళాడు...

నేను బాధ పడుతూ ఛా అనవసరం గా ఛాన్స్ మిస్ చేసుకున్న... కుమార్ గాడి కే నయం హాపీగా ఆంటీ తో ఎంజాయ్ చేస్తాడు అని కుల్లుకుంటు... వెళ్లి మెల్లగ పార్సెల్ పట్టుకుని చాలా సేపటికి ఆశ్రమం కి చేరుకున్న....

ఇలా బైక్ స్టాండ్ వేసి చూస్తే ఆశ్రమం ఎదురుగా సెక్యూరిటీ అధికారి జీప్ ఉంది...

లాస్ట్ కి సెక్యూరిటీ అధికారి లు కూడా సర్వీస్ పిక్ చేసుకుంటున్నారా అనుకుని లోపలకి వెళ్లాను... అంతే లోపల S I ముగ్గురు కానిస్టేబుల్ లు ఉన్నారు...

పక్కన కుమార్ గాడు ఏడుపు మొహం పెట్టుకుని నిలబడ్డాడు...వాడి పక్కనే బెవర్స్ లు అందరూ వరసగా నిలబడి ఉన్నారు...

నేను వెళ్లి కుమార్ గాడిని రేయ్ బావ ఎమ్ అయ్యింది రా వెళ్ళిన పని సక్సెస్ ఆ అని అడిగా...

వాడు గుస గుస గా.... నీ యబ్బ అది సెక్యూరిటీ అధికారి వాడి పెళ్ళాం అంటరా....నేను వెళ్లి డోర్ కొట్టినా తియ్యలేదు సరిగ్గా అదే సమయానకి ఈ S I గాడు ఎంట్రీ ఇచ్చాడు...అది ఎమో ఎవడో తెలీదు అని ప్లేట్ తిరగేసింది...వీడు నన్ను ఆరాలు తీసి ఇక్కడికి పట్టుకొచాడు...(జరిగింది అంతా ఏడ్చుకుంటూ మెల్లగా చెప్పాడు)...అంతా విని గుండెల్లో రాయి పడింది నాకు....

సెక్యూరిటీ అధికారి గాడు బెవర్స్ గాల్లని ఆర తీయటం మొదలు పెట్టాడు...

స్ ఐ: కానిస్టేబుల్ వీడిని ఎక్కడో చూసినట్లు ఉందే...మొదటి బెవర్స్ ని చూసి అన్నాడు..

కానిస్టేబుల్: సార్ వీడు పిక్ పాకేటర్...

అది విని కుమార్ గాడు నేను భయపడ్డాము..

ఎస్ ఐ రెండో వాడి దగరకి పోయి వీడు అని అడిగాడు...

కానిస్టేబుల్ : సార్ వీడు చెయిన్ స్నాచేర్...అని చెప్పాడు...

అలా వెళ్తూ ఉంటే కానిస్టేబుల్ ప్రతి వాడి మీదా ఏదో కేస్ చెప్తూనే ఉన్నాడు...సార్ వీడు ముసలావిడ ని ముగ్గులో దింపి పరారి లో ఉన్నాడు....సారు వీడు చిన్న పిల్లల పిలకలు కత్తిరించే సైకో....సార్ వీడు మగవాళ్ళు స్నానం చేస్తుంటే దొంగ చాటుగా చూస్తాడు అని వాళ్ళ మీద కేస్ లు ఒకటి ఒకటిగా చెప్తుంటే....కుమార్ గాడు బోరు న ఎడ్చేసాడు...

ఎస్ ఐ వెనక్కి తిరిగి నన్ను చూసాడు కుమార్ గాడి ఏడుపు కి...రేయ్ ఏవడ్రా నువ్వు... అని అడిగాడు...నాకు నోట్లో నుండి మాట రాలేదు... బెవర్స్ గాళ్ళు అందరూ...వాడు డెలివరీ బాయ్ సార్ అని చెప్పారు...

ఎస్ ఐ: నీకు ఇక్కడేం పని రా... పార్సెల్ ఇచ్చేసి పో అని గద్దించాడు...

అంతే నేను కుమార్ గాడి కి రేటింగ్ ఇవ్వటం మర్చిపోకండి సార్ అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను.....

అలా మా కుమార్ గాడి ఐడియా తో పాటు వాడు కూడా క్లోజ్ అయిపోయాడు 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Super bro
[+] 1 user Likes vardan's post
Like Reply
#3
Schedule పెట్టుకొని చదువుతూ ఉంటే బుర్ర heat ఎక్కిపోయింది అన్న. మంచి చిన్న కథ అందించావు. నేను అనుకున్న వాళ్ళందరూ పోతారు వీళ్లిద్దరికీ పగులుద్ధి అని, కానీ పాపం కుమార్ మాత్రమే. 

చిన్న కథలు రాస్తే అదో కిక్కు తెలుసా. 
[+] 2 users Like Haran000's post
Like Reply
#4
Nice story bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#5
Story bagundi bro
Like Reply
#6
                        ఆంటీ డిటెక్టివ్స్ 


సినిమా ఐపోయింది..... కుమార్ గాడు నేను హాల్ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాం....

నేను : ఏమైనా డిటెక్టివ్ సినిమా లు భలే ఉంటాయి రా మామ

కుమార్ గాడు ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నాడు....

నేను మళ్ళీ అన్నాను సినిమా చాలా బాగుంది రా మావ అని

కుమార్ గాడు లైట్ గా బుర్ర ఊపి అలా సూరి గాడి టీ కొట్టు లోకి దూరాడు....

నేను వాడి వెంటే కొట్టు లోకి దూరాను....

సూరి గాడు : దేశం లో పనికి మాలిన వాళ్లు ఎక్కువ అయ్యారు అంట (అని మమ్మల్ని చూసి గొనుగు తున్నాడు).....

దానికి కూడా కుమార్ గాడు పెద్దగా స్పందించ కుండా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.....

నేను : రేయ్ ఏంట్రా సూరి గాడు అల అంటుంటే ఎం పట్టనట్లు ఏదో ఆలోచిస్తున్నావు....

కుమార్ : మావ హీరో ల ని మొదట్లో అందరూ అలాగే ఆంటారు రా.... అలా అనకపోతే.... హీరో లు ఎప్పటికీ అవరు.... సినిమా చూశాక కూడా నీలో మార్పు రాలేదు రా..... మొదట్లో చూడు అందరు హీరో ని ఎలా గేలి చేశారు..... తర్వాత వాడు పెద్ద డిటెక్టివ్ అయ్యి కేస్ ని సాల్వ్ చేసాడు....

నేను : అంటే ఈరోజు ఛీ కొట్టినోల్లే ...రేపు జై కొడతారు అంటావా మావ...

కుమార్ : అంతే రా మావ

సూరి గాడు: ముందు నా బాకీ కొట్టండి రా లేదంటే నేను కొడతాను....

కుమార్ : ఒరేయ్ సూరి.. మాది సొంతూరు అని తెలుసు మేం వాడేది సంతూరు అని తెలుసు....మా గురించి అన్నీ తెలిసిన నువ్వే ఇలా బాకీ రాఖీ అంటే ఎలా రా...

నేను : సంతూర్ ఏంట్రా....

కుమార్ : మొన్న వాడిదే సబ్బు సగం ఉంటే సైడ్ చేశాలే..

నేను : చీ నియబ్బ

సూరి గాడు : నాకు అది అంత తెలవదు రా.....నా 300 రూ బాకి ముందు తీర్చండి తర్వాత టీ అడగండి......

సూరి గాడు మొహం మీద చెప్పేశాడు ....

కుమార్ : బావా ఫోన్ ఉందా....

నేను : లేదు రా ఛార్జింగ్ పెట్టీ ఇంట్లో వదిలేసా

కుమార్ : ఓహ్ సమయానికి ఫోన్ కూడా లేదే.

నేను : ఎందుకు రా....


కుమార్ : ఎవడో  ఒకడికి ఫోన్ చేసి అప్పు అడిగి అయినా సరే వీడి బాకీ తీర్చేయలి రా....

నేను : ఒరేయ్ నీ దగ్గరా ఫోన్ ఉందా రా సూరి

సూరిగాడు : ఎందుకు రా ఫోన్ పే చేస్తారా....నా పెళ్ళం నంబర్ చెప్పనా....

కుమార్ : ఫోన్ లేదు రా అంటే ఫోన్ పే అంట ఎవడ్రా ఈడు.....

సూరి గాడు : నా దగ్గర ఫోన్ లేదు రా....నా పెళ్ళం దగ్గర ఉంది

కుమార్ : సర్లే అయ్యింది ఏదో అయ్యింది.... ఈరోజుకి టీ లు ఇచ్చేసి రేపు మొత్తం బాకీ తీస్కో.....

సూరి గాడు మొత్తుకుంటు మాకు టీ లు ఇచ్చాడు....

మేం టీ లు తాగి ఇంటికి వెళ్తున్నాం బండి మీద....

నేను మిర్రర్ లోంచి చూస్తున్న కుమార్ గాడు గమనిస్తున్న... సీరియస్ గా ఆలోచిస్తున్నాడు

నేను : ఒరే సూరి గాడి బాకీ గురించే నా.... ఎలాగోలా ఇచేద్దం లే రా....కావాలంటే వాడి కౌంటర్ లో కోటేసి వాడికే ఇచెద్దం.... దాని గురించి ఎక్కువ ఆలోచించకు..

కుమార్ : వాడి బాకీ అయితే అలా చేయొచ్చు మావ ఊరందరి బాకీలు ఎం చేద్దాం...

నేను : అవును రా.... మనకి చాలా బాకీలు ఉన్నాయ్...

కుమార్ : అవి అన్నీ తీర్చే మార్గం ఒకటి తట్టింది రా మావ నాకు....

నేను : ఏంట్రా అది

కుమార్ : మనం కూడా డిటెక్టివ్ అవుదాం.... ఎదో ఒక కేస్ సాల్వ్ చేసి డబ్బులు తీసుకుందాం....ఎం అంటావ్...

నేను : డిటెక్టివ్ ఆ.....అంటే ఎం చేద్దాం రా.

కుమార్ : సింపుల్ రా సినిమా చూసావు గా అలాగె హీరో లా మనం కూడా చేద్దాం....

నేను : రేయ్ మనకి పెద్ద పెద్ద దోంగలు ఎక్కడ దొరుకుతారు రా ఇప్పుడు....

కుమార్ : అయ్యో మావ.... డేటెక్టీవ్ అంటే దొంగలనే పట్టుకోరు రా..

నేను : మరి...

కుమార్ : ఇప్పుడు మొగుడు పెళ్ళాలు మధ్య ఒకరి మీద ఒకరికి అనుమానం ఉంది అనుకో.....వాళ్ళు ఎం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు..అలాంటివి కూడా వీళ్ళే కనిపెడతారు...రా

నేను : అవునా

కుమార్ : హా

నేను : వర్కవుట్ అవుతాది అంటావా రా....

కుమార్ : పక్కాగా రా....

నేను : ఎలా చెప్పగలవ్ రా....

కుమార్ : రేయ్ మనుషులు అన్నం తింటారు రా...కాని అనుమానం మనుషుల్ని తింటాది.... అన్నం కి కూడా కర్చుపెట్టని వాడు అనుమానాని కి ఖర్చు పెడతాడు.....

నేను : అనుమానం అంటే గుర్తు వచ్చింది మావ మన సూరి గాడికి వాడి పెళ్ళం మీద అనుమానం అంటారు... నిజమే నా....

కుమార్ : మంచి ఐడియా ఇచ్చావ్ రా మావ... మన మొదటి క్లయింట్ సూరి గాడే.... వాడి బాకీ తో పాటు అనుమానం కూడా తీర్చుదం...

నేను : ఎలా రా...

కుమార్ : చెప్తా పద

****************************

కుమార్ గాడి ఇంట్లో మేడ మీద గది

సమయం సాయంత్రం 6:30

కుమార్ : మావ కొన్ని వైట్ పేపర్ లు తీసుకుని నేను చెప్పింది రాయు రా....

నేను సరే అని సిద్ధం అయ్యాను...

కుమార్ : మీకు మీ పెళ్లాల మీద అనుమానం ఉందా....వారు ఎవరితో  తిరుగుతున్నారో తెలుసు కోవాలని ఉందా..... అయితే కాల్ చెయ్యండి డేటెక్టీవ్ రముక్...ఫోన్ నెం : 98480.....

నేను : ఈ రముక్ ఎవరు రా....

కుమార్ : నా పేరే రా.... తిరగేస్తే రముక్...

నేను : నువు సూపర్ రా మావ

కుమార్ : హా అలా అన్నీ పేపర్ల మీద రాసి...

నేను రాసేశాను....

ఆ రాత్రికే ఆ పేపర్ల కట్ట సూరి గాడి టీ కొట్టు కట్టేసి పోయాక లోపలకి చిన్న కన్నం ద్వారా వేసేసి వచ్చేసాం.......

********************

మేం పొద్దున్నే వాడు కొట్టు తెరిచే టైమ్ కి వెళ్లి ఎం తెలినట్లు కూర్చున్నాం.....

వాడు కొట్టు తెరవగానే వాడి కాళ్ళ ముందు కొన్ని పేపర్లు పడి ఉండటం చూసి ఆశ్చర్య పోయి చూసాడు.... మేం అక్కడే కూర్చున్నాం... అప్పుడే అక్కడికి ఒక రిటైర్డ్ మాస్టర్ వచ్చి ఏమయ్యా సూరి టీ ఇంకా కాలేదా అని అడిగాడు....

సూరి గాడు : పది నిమిషాలు మాస్టారు (అని వాడు పేపర్లు పక్కన పెట్టి టీ పెట్టడం ప్రారంభించాడు)....

కుమార్ : మావ వాడు చదివాడు అంటావా...

నేను : వాడి మొహం అలా లేదు రా....

కుమార్ : ఇంతకీ చదువు వచ్చు అంటావా....

మాలో మేం మాట్లాడుకుంటున్నాం.... సూరి గాడు మాస్టారు దగ్గరకి వెళ్ళి మాస్టారు ఈ పేపర్ల లో ఎం ఉంది కాస్త చదివి పెట్టండి అని అడిగాడు....

మాస్టారు గారు జోబి లోంచి కళ్ళజోడు తీసి ముక్కు మీదకి ఎక్కించి పేపర్ని పరిశీలించి చదవటం మొదలు పెట్టారు...సూరి గాడు వింటున్నాడు

మాస్టర్ : మీ పెళ్ళం మెడ అన్నమనం ఉందా....

కుమార్ గాడు ఒక్కసారిగా నా వైపు చూసి అనుమానం అని చెప్పా కద రా....ఈ అన్నమనం...తమ్ముడు మనం ఏంటి....

నేను : సరిగ్గా నే రాసా మావ..

మాస్టారు ఇంకా చదువుతున్నారు

మాస్టారు : వాళ్ళు ఎవరి తో ఏరుగుతారో......

కుమార్ : ఛీ ఛీ చి... మాస్టారు ....ఆ అరిగిపోయిన కాళ్ళ జోళ్ళ విరిగిపోయిన కళ్ళజోళ్లు....మార్చమని ఎన్ని సార్లు చెప్పాను.... ఇటు ఇవ్వండి నేను చదువుతా (అని లాగుకున్నాడు).....

పేపర్ లాగుకొని కుమార్ గాడు గడ గడ చదివేశాడు.... ఎందుకు అంటే వాడు చెప్పిందే కదా అది అంత...మాస్టారు పాపం కళ్ళ జోడు సర్దుకుని చూస్తున్నాడు.....

సూరి గాడు : ఒరేయ్ కుమారు ఈ డిటెక్టివ్ ఏంట్రా....

కుమార్ : ఇదిగో రా అక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా ....ఎవరికి అయినా ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళకి కాల్ చెయ్యాలి అంట....

సూరి గాడు పేపర్ ని భద్రంగా మడిచి జోబి లో పెటేసి సైలెంట్ గా ఎదో ఆలోచిస్తూ....మాకు ఫ్రీ గా టీ లు ఇచ్చేసాడు.... మేం తాగేసి వచ్చేసాం.....


******************
నేను : ఏంటి మావ సూరి గాడు ఫోన్ చేస్తాడు అంటావా..

కుమార్ : వాడికి అన్నమనం ఉంటే తప్పకుండా చేస్తాడు రా...

నేను సీరియస్ గా చూసి.... నువ్వే అనాలి రా... నా తెలుగు పేపర్ లొనే కాపీ కొట్టి పాస్ అయ్యావ్....ఆ విషయం మరచిపోకు రా...నియబ్బ...

అంత లో కుమార్ గాడి కొత్త సిమ్ నెంబర్ కి కాల్ వచ్చింది....నాకు అది చూపించి.... మనం ఇప్పుడు పార్టనర్స్ రా....మన క్లయింట్ కాల్ చేస్తున్నాడు చూడు అని అన్నాడు....నేను మా ప్లాన్ సక్సెస్ అవుతుంది అని హాపీ గా ఫీల్ అయ్యా....

కుమార్ గాడు కాల్ లిఫ్ట్ చేసి టోన్ మార్చి హలో అన్నాడు....

సూరిగాడు : హలొ రుమక్ సారా...

కుమార్ : హా అవును చెప్పండి....

సూరిగాడు : మా కొట్లో పేపర్ ఉంది అండి (కాస్త తడబడుతూ మాట్లాడుతున్నాడు).

కుమార్ గాడు sprite తాగిన వాడిలా..... అయితే నీ పెళ్ళం మీద అనుమానంగా ఉందా అని అడిగాడు....

సూరి గాడు : అవును సారు....నాకు చాలా రోజుల నుంచి అనుమానం ఉంది సారు....ఎలా అయినా కనిపెట్టాలి అనుకుంటా కాని నాకు భయం సారు....దాన్ని ఎలా అయినా మీరే పట్టుకోవాలి సారు...

కుమార్ : అర్ధం అయింది...అడ్వాన్స్ డబ్బు కొట్టి నీ పెళ్ళం డీటెయిల్స్ చెప్పు...

( కుమార్ గాడు ఇరవై వేలు అడిగాడు.... సూరిగాడు.... అయిదు వేలు అన్నాడు)....

కుమార్ : రేయ్ ఇది డిటెక్షన్ అనుకున్నవా నీ టీ లో డికాషన్  అనుకున్నవా.... అడిగిన రేట్ ఇయ్యకపోతే ఇప్పుడు నువు మాట్లాడింది రికార్డ్ చేసాం పోయి నీ పెళ్ళానికి వినిపిస్తాం....

సూరిగాడు : బాబ్బాబు అంత పని చేయకండి.... పదిహేను కి ఫైనల్ చేసుకోండి.... (బేరానికి వచ్చాడు)....

నేను : సర్లే రా మన సూరిగాడే గా....

కుమార్ : హ సరే సరే... అడ్వాన్స్ కొట్టి  ఒక వారం టైమ్ ఇవ్వు.... సాక్షాల తో నీ ముందు ఉంటాం......

సూరిగాడు సరే అని ఫోన్ పెటేశాడు

అలా మా ప్లాన్ లో ఒక ముందు అడుగు వేశాం

**********************

సూరి గాడు కుమార్ గాడికి రెండు వేలు అడ్వాన్సు కూడా ఇచ్చాడు..... ఆ దెబ్బ తో మేం నిజంగా డిటెక్టివ్స్ అనే ఫీలింగ్ వచేసింది మాకు....

కుమార్ గాడు రెండు వేలు నోట్ చూపించి..... డిటెక్టివ్ రముక్ ఆన్ డ్యూటీ అని కళ్ళు ఎగరేస్తూ అన్నాడు....నేను సూపర్ రా మావ అన్నాను.

***************
Day-1

ఆ తర్వాత రోజు నుంచి కుమార్ గాడు నేను రంగం లోకి దిగాం.... కుమార్ గాడు సూరిగాడి పెళ్ళం గురించి చెప్పటం మొదలు పెట్టాడు నాకు....

కుమార్ : మావ అదిగో అక్కడ నిలబడి బొండాలు వేస్తుందే అదే సూరి గాడి పెళ్ళం కాంతం....

నేను : అబ్బా ఎం ఉంది రా మావ

కుమార్ : మన సూరి గాడి డౌబ్ట్ అదే ...అది బొండాలు అమ్ముతుందో అందాలు అమ్ముతుందో కనిపెట్టాలి మనం.

నేను : సరే రా మావ....ఎం చేద్దాం చెప్పు.

కుమార్ : ముందుగా మనం చేయాల్సింది.. టార్గెట్ నే చూస్తూ ఇక్కడే తిరుగుతూ ఉండాలి....కాని టార్గెట్ కి అనుమానం రాకూడదు

నేను : రేయ్ ఈ టార్గెట్ కి అనుమానం వస్తే మనం టార్గెట్ ఐపోతాం రా...

కుమార్ : అది నిజమే రా..... సరే అయితే ఈ పైసలు తీసుకెళ్లి బజ్జిలు కొనుక్కు రా పో....నేను గమనిస్తూ ఉంటా....

నేను కాంతం దగ్గర కి పోయి బజ్జిలు బొండాలు అన్ని కొనుక్కొచ్చాను....

నేను : అబ్బా చాలా హాట్ గా ఉంది రా....

కుమార్ : లేదు చల్లగా నే ఉన్నాయి రా

నేను : హాట్ గా ఉన్నది ఆంటీ రా

కుమార్ : ఆంటీ కాదు రా టార్గెట్ ...మన కోడ్ word ...

నేను : హా అదే అదే మన టార్గెట్ చాలా హాట్ గురు....

కుమార్ : ఏమైనా సూరిగాడు చాలా లక్కీ మావ...

నేను : అందుకే అనుమానం తో చస్తున్నాడు.... వెధవ....

కుమార్ : నిజమే రా మావ.... అందమైన పెళ్ళం ఉంటే మనశాంతి...ఉండదు....

నేను : హ్మ్ ... బొండాలు బాగున్నాయి మావ...

కుమార్ : బజ్జిలు కొన్చమ్ కారం తక్కువ అయ్యింది కదా...

నేను : అవును రా....

కుమార్ : ఈ స్టఫ్ కి రెండు బీర్ లు వేస్తే భలే ఉంటాది మావ....

నేను : నిజమే రా వేసేద్దాం... పైసలు ఉన్నాయి కదా

కుమార్ : రేయ్ వృత్తి ధర్మం తెలీదా....ఆన్ డ్యూటీ మందు కొట్ట కూడదు....

నేను : ఓహ్ అది ఒకటి ఉందా.....

(అంత లో పానకలరావు గాడు ఇటు వస్తున్నాడు........)

కుమార్ : ఈడు ఏంట్రా ఇటు వస్తున్నాడు....

పానకలరావు : ఎం బాబు ఎం చేస్తున్నారు....ఎప్పుడు అలా కాలిగా ఉండకపోతే... మా బాబు లా ఏమైనా మంచి ఉద్యోగం తెచుకోవచ్చు కదా....(క్లాస్ పీకి...ఎల్లి బజ్జిలు కొనుకున్నాడు)....

కుమార్ గాడు సైలెంట్ ఐపోయాడు.... చుట్టు పక్కల అందరూ మమ్మల్నే చూస్తున్నారు......

నేను : రేయ్ డిటెక్టివ్స్ అని చూడకుండా మరీ అలా తిట్టాడు ఏంట్రా....

కుమార్ గాడు బాధ పడుతు....మా నాన్న వాడి దగ్గర పని చేస్తాడు అని ఉరుకున్న మావ లేదంటే అని... బాధ ని దిగమింగాడు....

నేను : రేయ్ ఈ బాధ ని మరిచి పోవాలి అంటే మందెయ్యాలి రా....

కుమార్ : పద రా మావ

ఇద్దరం కలిపి ఆ రోజు కి సిట్టింగ్ వేసి మా బాధ ని మరచిపోయాం

******************

Day -2

తర్వాత రోజు కూడా కాంతం ని కనిపెడుతూ కూర్చున్నాం.... కాని మాకు ఎలాంటి క్లూస్ దొరకట్లేదు.... అంత లో  మళ్ళీ పానకలరావు వచ్చాడు.... మమ్మల్ని చూసాడు....

పానకలరావు : ఎం బాబు నిన్న చెప్పాను... ఇంటికి వెళ్లి ఏమైనా ఆలోచించార.... ఇలా అయితే...మీ తల్లితండ్రులు వీధి లో తల ఎత్తుకుని ఎలా తిరుగుతారు....(అని తిట్టేసి వెళ్లి బజ్జిలు కొనుకున్నాడు)....

నేను : మావ

కుమార్ : బాధగా ఉంది రా

నేను : పోదాం రా లేట్ ఎందుకు....

ఆ రోజు కూడా సిట్టింగ్ వేశాం.....

********************

Day - 3

మూడో రోజు పానకలరావు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసాం...

వాడు నోరు తెరిచి... ఎం బాబు  అని మొదలు పెట్టాడో లేదో....కుమార్ గాడు ఆపండి అంకుల్ అని....నా వైపు చూసి.... బండి తీయు మావ అన్నాడు.... ఇద్దరం కలిసి బార్ కి పోయాం...

కుమార్ : పైసలు ఐపోతున్నాయి మావ

నేను : కేస్ ఫినిష్ చేస్తే సూరిగాడు మిగతా డబ్బులు ఇస్తాడు కదరా....

కుమార్ : ఏదొకటి చేసి కాంతం ని పట్టుకోవాలి రా....ఈ సూరిగాడు రోజు ఫోన్ చేస్తున్నాడు.... నా పెళ్ళాం దొరికింద దొరికింద అని

నేను : ఎలా రా.....ఆవిడ ఎం చేసింది అని మనం పట్టుకుంటాం.... తన పని తాను చేసుకుంటుంది... చూస్తే మంచి దాని లా నే ఉంది.... ఈ సూరి గాడికే నమ్మకం లేదు....

కుమార్ : రేయ్ కాంతం మంచిది అయితే మనకే బొక్క..... అది గుర్తు పెట్టుకో....

నేను : అయితే ఎం చేద్దాం రా....

కుమార్ గాడు చూస్తూ ఉండు ఎం జరుగుతుందో అని బాటిల్ మొత్తం లేపి డిటెక్టివ్ లా చిన్న కళ్ళు చేసి ఆలోచించాడు.....

****************

Day -4

మేం ఎప్పటి లాగే కాంతం కొట్టు దగ్గర నిలబడి ఉన్నాం.....నాకేమో పానకలరావు అంకుల్ ఎప్పుడు వస్తాడా మమ్మల్ని ఎప్పుడు తిడతాడా అని ఉంది.....

పానకలరావు వచ్చాడు.... మమ్మల్ని చూసి తిట్టకుండా వెళ్లిపోతున్నాడు కాంతం కొట్టు వైపు.... నేను రేయ్ తిట్టకుండా పోతున్నాడు రా అని కుమార్ గాడితో అన్నాను.... కానీ వాడి ప్లాన్ వేరే ఉంది ....

కుమార్ గాడు : మావ.. నువు ఇక్కడే ఉండి....కాతం మీద పానకలరావు గాడు పడగానే ఫోటో తీసేయాలి సరే నా (అని అన్నాడు)

నేను : వాడు ఎందుకు పడతాడు రా...

కుమార్ చూస్తూ ఉండు అని అంకుల్ గాడి వెనకే వెళ్లి ఎదో తన్నుకుని పడినట్లు గా వాడిని తోసేశాడు.... పానకలరావు పక్కనే ఉన్న కాంతం మీద పడ్డాడు.... ఆవిడ నడుం పట్టుకున్నాడు..... నేను క్లిక్ మనిపించ....అంతే మాకు ఎదో రకంగా సాక్ష్యం దొరికేసింది...

*************************

ఆ రాత్రికి కుమార్ గాడు సూరి గాని ఫోన్ కి ఫోటో లు పంపించాడు..... కాని రిప్లై రాలేదు....

నేను : ఏంటి మావ సూరిగాడు ఎం అన్నాడు...

కుమార్ : ఫోటో లు చూడగానే సూరిగాడు....సూర్యుడు లా మండి పోయి కాంతాన్ని కుక్కని కొట్టినట్లు కొడతా ఉంటాడు మావ...(అని అక్కడ జరిగేది ఊహించి చెప్తున్నాడు)......

కాసేపటికి కూడా సూరిగాడు నుంచి ఫోన్ రాకపోతే కుమార్ గాడే చేసాడు....

కుమార్ : ఫోటో లు చూసుకున్నావా నీ పెళ్ళం మీద అనుమానం తీరిందా.... మా పైసలు ఎప్పుడు ఇస్తావ్...

అటు నుంచి స్పందన లేదు....కాల్ కట్ చేసాడు సూరిగాడు.

కుమార్ గాడు నాతో రేయ్ వాడు హాండ్ ఇచ్చే లా ఉన్నడ్రా....

నేను : అమ్మానాకొడుకు

కుమార్ : ఈడీకి రివర్స్ లో వార్నింగ్ ఇద్దాం ఉండు....

కుమార్ గాడు మళ్ళీ కాల్ చేసాడు....

కుమార్ : రేయ్ సూరి మర్యాదగా మా మిగతా పైసలు ఇయ్యలేదు అంటే ఈరోజు నువు చూసిన ఫోటో లు రేపు ఊరు మొత్తం చూస్తాది.... ఎం అంటావ్.

కుమార్ గాడు సూపర్ గా బెదిరించాడు

చాలా సేపటికి సూరిగాడు మాట్లాడాడు.....ఎక్కడ కి రావాలి సార్ అని.

కుమార్ : ఫోన్ లో పంపు

సూరిగాడు : లేదు సార్ డబ్బులు పట్టుకుని వస్తా ....ఎక్కడికి రావాలి చెప్పండి

కుమార్ : అయితే  రేపు పొద్దున్న పది గంటలకు పొలం గట్టు దగ్గర పంప్ హౌస్ లో డబ్బులు పెట్టి నీ దారిన నువు వెళ్లిపో...(అని కాల్ కట్ చేసాడు)..

****************

తర్వాత రోజు పొద్దున్నే మేం చాలా దూరంగా ఎవరు చూడ కుండ పొలం గట్టు దగ్గర నక్కి ఉన్నాం.... కాసేపటికి సూరిగాడు దూరం నుంచి సైకిల్ మీద ఒక తెల్లటి మూట తో వస్తున్నాడు....

నేను : రేయ్ మావ మూట ఏంట్రా అంత ఉంది....వాడు ఆస్తి అమ్మి ఇచేయట్లేదు కదా...

కుమార్ : అంత లేదు రా ఈ చిల్లర నా కొడుకు టీ కొట్టు లో చిల్లర అంత మూట కట్టి తెస్తున్నాడు....సర్లే ఏదొకటి డబ్బే గా...

నేను : హా

సూరిగాడు మూట ని పంప్ హౌస్ లో పెట్టి మాకు కాల్ చేసి చెప్పాడు....

కుమార్ : హా సరే నువు వెనక్కి చూడకుండా వెళ్లిపో....

సూరిగాడు పోయాడు.....

కాసేపటికి కుమార్ గాడు సరే మావ నేను వెల్లి మూట తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు....

నేను : రేయ్ నేను వస్తాను రా....

కుమార్ : అంత డబ్బు చూస్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావ్.... ఇక్కడే ఉండు... నేను తెస్తాను...తెచ్చాక పంచుకుందాం.

నేను : రేయ్ మోసం ఎం లేదు కదా....అక్కడికి వెళ్లి చిల్లర నొక్కేయ్ వు కదా....

కుమార్ : చి చి చి చిల్లర నా కొడుకు ని అనుకున్నా వా మావ....మొత్తం ప్లాన్ అంత నాది.... వాస్తవం గా చెప్పాలి అంటే ఆ మూట మొత్తం నాది అయినా కూడా నీకు ఎంతో కొంత వాటా ఇస్తా అని మనసు లో అనుకున్న....

నేను ఫీల్ అయ్యాను.... నిజమే ప్లాన్ మొత్తం వాడిదే.... ఇందులో నేను చేసింది ఎం లేదు.... సర్లే ఎంతో కొంత మిగుల్తాయి లే అనుకుని దణ్ణం పెట్టి వెళ్ళు రా బాబు అన్నాను.....

కుమార్ గాడు ప్రొఫెషనల్ డేటెక్టీవ్ లా స్టైల్ గా వెళ్ళాడు మూట దగ్గరకి....

నేను దూరం నుంచి చూస్తూ ఉన్నాను.... వాడు మూట దగ్గర కి వెళ్ళాడో లేదో... మూట లోంచి కాంతం లేచి కుమార్ గాడి జుట్టు పట్టేసుకుంది.... అంతే నేను అక్కడ నుంచి జంప్

******************

తర్వాత తెలిసింది సూరిగాడికి ఫోన్ లేదు అని కాంతం నెంబర్ నుంచే చేస్తున్నాడు మాకు...కుమార్ గాడికి అది తెలీక కాంతం కే ఫోటో లు పెట్టి ఆవిడకే ఫోన్ చేసి మొత్తం చెప్పాడు....
[+] 9 users Like Veeeruoriginals's post
Like Reply
#7
Nice story
Like Reply
#8
Welcome back veeranna konchem time chandrakala update ivvu ivvakapoina I will wait
Like Reply
#9
Nice story
Like Reply




Users browsing this thread: