Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"మ్యూచువల్ ఫండ్"
#21
Em cheppav bro, Harika inti nundi bataraku vachi varsham lo auto lo interview ki vellindi Ani. Super ???
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Nice story
Like Reply
#23
అప్డేట్ చాల బాగుంది thanks
Like Reply
#24
(06-06-2024, 06:16 PM)meetsriram Wrote: Em cheppav bro, Harika inti nundi bataraku vachi varsham lo auto lo interview ki vellindi Ani. Super ???

పొగిడావా, ఒక్క వాక్యంలో చెప్పగలిగింది ఇలా 30 వాక్యాలలో చెప్పాను అంటున్నావా? Dodgy
[+] 1 user Likes earthman's post
Like Reply
#25
స్పందనకి ధన్యవాదాలు. తరువాతి భాగం ఇస్తున్నాను. కథ కొనసాగుతోంది.
[+] 1 user Likes earthman's post
Like Reply
#26
లోపలికి వెళ్ళి ఎదురుగా నిలబడింది.

"కూర్చో"... సర్టిఫికెట్స్ చూస్తూ తల ఎత్తకుండానే అన్నాడు అతను.

కూర్చుంది.

సర్టిఫికెట్స్లో అమ్మాయి ఎలా చదివిందో అర్ధమయ్యి, ఇక డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం కోసం తలెత్తాడు.

ఎదురుగా పలకరింపుగా నవ్వుతున్న అమ్మాయి.

'బాగుంది'... మనసులో అనుకుంటూ... తలూపాడు.

"పేరు?"

"హారిక సర్"

"బి. కాం, 70 %?

"అవును సర్"

"ఫర్థర్ స్టడీస్ ఎందుకు చెయ్యట్లేదు?"

"ఇంట్లో ఇబ్బందులున్నాయి సర్"

"ఇబ్బందులు ఇప్పుడు పెద్దవిగా ఉండచ్చు, కానీ చదువుకి బ్రేక్ వస్తే మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తే ఇంట్రస్ట్ తగ్గితే కష్టం"

"జాబ్ అవసరం ఉంది సర్. కొన్నాళ్ళు జాబ్ చెయ్యాలి. ఇంట్లో పనులు కూడా ఉంటాయి. ఇంకా టైం ఉందనిపిస్తే ఓపెన్ యూనివర్సిటి కోర్స్ చేస్తాను సర్"... స్పష్టంగా జవాబిచ్చింది.

"గుడ్".. మెచ్చుకోలుగా తలూపాడు.

చిన్నగా నవ్వింది.

"నీ పేరు...."

"హారిక సర్"

"యస్, హారిక, రైట్. సో... నీకు ఈ జాబ్ ఎందుకివ్వాలో ఒక్క రీజన్ చెప్పు. నీ కన్నా ముందు ఇద్దరిని ఇంటర్వ్యూ చేసాను, వాళ్లకి ఎబొవ్ 70 %. సో నీకు ఎందుకివ్వాలి?"

"నేను కష్టపడతాను సర్"

"ఇది మినిమం. నేను కూడా కష్టపడతాను. కష్టపడిఉండకపోతే ఈ ఆఫీస్ మేనేజర్ అయ్యిండేవాడినా? మేనేజర్ అయ్యాక కూడా కష్టపడుతున్నాను, ఎందుకు? ప్రమోషన్ కోసం. పెద్ద బ్రాంచ్ మేనేజర్ అవ్వాలని. సో కష్టపడటం మినిమం. ప్రైవేట్ జాబ్స్ దగ్గర కష్టపడకపోతే వారం కూడా ఉంచుకోరు"

తలూపింది.

"చెప్పు, నీకే ఎందుకివ్వాలి"... పక్కనున్న కాఫీ తాగుతూ అన్నాడు.

"నేను నిజాయితీగా ఉంటాను సర్"

"ఇది కూడా ఒక రిక్వైర్మెంట్. నిజాయితీ లేకపోతే ఓనర్స్ మనల్ని నమ్మరు. ఇంత ఆఫీస్ నాకు వదిలేసారు అంటే నన్ను నమ్మారు కాబట్టే. ఆ నమ్మకం ఉన్నంత కాలమే నన్ను ఉంచుతారు, ఆ నమ్మకం పోతే తీసిపడేస్తారు. అందుకే ఆ నమ్మకానికి ఏ మాత్ర్ం తగ్గకుండా చూసుకుంటూ ఉంటాను. నో నమ్మకం నో జాబ్"

"పనులు టైంకి చేస్తాను సర్"

"ఇది కూడా మినిమం. ఈ ఆఫీస్ చేసే బిజినెస్ దగ్గర వీలైతే చెయ్యాల్సిన టైం కన్నా ముందు చెయ్యాలి. వర్క్ లోడ్ ఉంటుంది. టెక్నాలజి హెల్ప్ అవుతుంది, కానీ టైం ప్రెజర్ ఉంటుంది. సో టైంకి చెయ్యడం కాదు, టైం కన్నా ముందు చెయ్యాలి. టైంకి చెయ్యడం మామూలు విషయం."

ఇంకేం చెప్పాలో తెలియనట్టు చూసింది.

ఆ అమ్మాయి ఉన్న స్థితి అర్ధమయింది అతనికి.

'అన్ని విధాలుగా బాగుంది. తీసుకోవచ్చు. ఇంకొన్ని అడిగి తేల్చేద్దాం'... అనుకున్నాడు.

"సో..."

ఇంకేం తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది.

"జాబ్ మార్కెట్ బాలేదు... నీ పేరు..."

"హారిక సర్"

"రైట్, హారిక. జాబ్ మార్కెట్ బాలేదు హారికా. ఎకానమీ బాలేదు. జాబ్స్ తగ్గిస్తున్నారు. కొత్తవి ఎక్కువ లేవు, ఉన్నవాటికి పోటీ ఉంది. ఈ జాబ్ కోసం కూడా తొమ్మిది మంది వచ్చారు. అందరూ అటుఇటుగా సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ మార్క్స్, అన్ని సేమ్ టు సేమ్. ఎవరినో ఒకరినే కదా తీసుకోగలం. అందుకే నీకు మాత్రమే ఉన్నది ఏదన్నా చెప్పు. నీకు ఈ జాబ్ ఎందుకివ్వాలో చెప్పు."

అర్ధమైనట్టు తలూపింది. మొహంలో కాస్త దిగులు.

"కష్టపడతాను. కావాలంటే ఓవర్ టైం చేస్తాను. పని టైంకి చేస్తాను. ఒక్క మాట కూడా అనిపించుకోను. మీరు చెప్పినట్టు చేస్తాను. ఇంట్లో కష్టంగా ఉంది. నాకు జాబ్ అవసరం ఉంది సర్"... స్పష్టంగా చెప్పింది.

వింటూ తల ఊపాడు.

"బయట గొడుగు..."

"నాదే సర్. ఇంట్లో నించి వచ్చేటప్పుడు వాన పడింది"

తలూపాడు.

"బాయ్ ఫ్రెండ్, క్లాస్ మేట్, చుట్టాలబ్బాయి, ఎవరితోనైనా రిలేషన్...?"

ఊహించని ప్రశ్న అడిగేసరికి ఆశ్చర్యపోయి అలానే చూడసాగింది.
Like Reply
#27
అప్డేట్ చాల బాగుంది clps
Like Reply
#28
Super update
Like Reply
#29
Nice update
Like Reply
#30
GOOD UPDATE
Like Reply
#31
Good and super story bro
ఆ మేనేజర్ భలే కతర్నాక్ లా సూపర్ గా ఇంటర్వ్యూ చెసునాడు
ఈ కథ ఇపుడు ఉన్న మధ్య తరగతి ప్రతి ఇంట్లో ఉండేలా సహజంగా ఉంది bro super
Like Reply
#32
Update bro
Like Reply
#33
Nice update
Like Reply
#34
బాసు కథ మొదలెట్టేటప్పుడు మిగిలినవి కూడా పూర్తి చేస్తానన్నావ్, ఈ కథ అప్డేట్ ఇచ్చి నెలౌతోంది, కంటిన్యూటి దెబ్బ తినేస్తాది...కాస్త చూడు బ్రో
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#35
Nice storyy...complete cheyandi..madyalo aapakandi
Like Reply
#36
Update bro
Like Reply
#37
Rainbow 
సహజత్వాన్ని బాగా అనుసరించారు అనిపిస్తుంది ముందుకు ఎలా సాగుతారో చూడాలి. ఆల్ ది బెస్ట్,,, దన్యవాదములు. thanks
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like Reply
#38
స్పందనికి ధన్యవాదాలు పాఠకులారా, తరువాతి భాగం ఇస్తున్నాను.

(10-06-2024, 11:03 PM)hijames Wrote: Good and super story bro
ఆ మేనేజర్ భలే కతర్నాక్ లా సూపర్ గా ఇంటర్వ్యూ చెసునాడు
ఈ కథ ఇపుడు ఉన్న మధ్య తరగతి ప్రతి ఇంట్లో ఉండేలా సహజంగా ఉంది bro super

కథ వేరేలా వచ్చేలా ఉంది, చూద్దాం.

(06-07-2024, 11:12 PM)Uday Wrote: బాసు కథ మొదలెట్టేటప్పుడు మిగిలినవి కూడా పూర్తి చేస్తానన్నావ్, ఈ కథ అప్డేట్ ఇచ్చి నెలౌతోంది, కంటిన్యూటి దెబ్బ తినేస్తాది...కాస్త చూడు బ్రో

ఎక్కడ, నువ్వు లేవు మరి. వచ్చావు, రిప్లై ఇచ్చావు. అప్డేట్స్ ఇస్తాను. Big Grin

(07-07-2024, 01:20 PM)Sushma2000 Wrote: Nice storyy...complete cheyandi..madyalo aapakandi

Sure. Continue చేస్తాను.

(08-07-2024, 02:13 PM)pvsraju Wrote: సహజత్వాన్ని బాగా అనుసరించారు అనిపిస్తుంది ముందుకు ఎలా సాగుతారో చూడాలి. ఆల్ ది బెస్ట్,,, దన్యవాదములు. thanks

నచ్చినందుకు సంతోషం.
[+] 1 user Likes earthman's post
Like Reply
#39
"నిన్నే. ఎవరితోనయినా ఏదన్నా ఉందా?"

అలాంటి ప్రశ్న అడుగుతాడని ఊహించని హారిక ఏం చెప్పాలో తెలీక అలానే ఉండిపోయింది.

"ఏదన్నా ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు"

తల అడ్డంగా ఊపింది.

"అయితే ఏమీ లేదు?"... మళ్ళీ అడిగాడు.

"లేదు సర్. నాకు అలాంటివి లేవు"... కాస్త కోపంగా బదులిచ్చింది.

"కోపం వచ్చిందా?"

"కోపం కాదు సర్. కానీ మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం బాగోలేదు. ఇంటర్వ్యూలో ఇలాంటివి అడుగుతారని నాకు ఎవరూ చెప్పలేదు"

నవ్వాడు.

అర్ధం కానట్టు చూసింది.

"నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం. కాకపోతే"... ఫ్లాస్కులో ఉన్న కాఫీ పోసుకుంటూ ఆగాడు.

"కాకపోతే మా పనికి దానికి సంబంధం ఉంది కాబట్టే అడిగాను"

"అంటే సర్?"

"నువ్వు వచ్చిన ఈ జాబ్ వేకెన్సీ ఎందుకు వచ్చిందో గెస్ చేస్తావా?"

"ఇది రిక్వైర్మెంట్ కాదా సర్, వేకెన్సీనా?"

"యస్"... కాఫీ తాగుతూ... 'అమ్మాయి బుర్ర ఉన్నదే, ఇక తీసుకోవచ్చు'... అన్నాడు.

"గెస్ చెయ్యి"

"ఏమో సర్"

"థింక్"

"ఎవరన్నా రిజైన్ చేసారా?"

"రిజైన్ కాదు రిమూవ్డ్"

"అంటే సర్"

"తీసేసాను"

"ఎందుకు సర్"

"అమ్మాయి. నీ లానే. బి.కాం. బుర్ర బానే ఉంది, బుద్ధే సరిగా లేదు. మూడు వారాలు కూడా పని చెయ్యలేదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుట. ఏదో తేడా వచ్చింది, విడిపోయారు. జాబ్ అవసరం ఉంది అని చెప్పింది, మాకు సరిపోతుంది అని తీసుకున్నాం. పని బానే చేసింది. కొత్త నెల స్టార్ట్ అయింది. మాకు అప్పుడు పని ఎక్కువ ఉంటుంది. రెండు రోజులు వచ్చింది, మూడో రోజు రాలేదు. కాల్స్ చేస్తే ఎత్తలేదు, మెసేజెస్కి రిప్లై లేదు, చివరికి ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఇల్లెక్కడో నేను వెళ్ళి కనుక్కుని కలిసాను. బాయ్ ఫ్రెండ్ మళ్ళీ వచ్చాడుట, జాబ్ వద్దుట, బాయ్ బాయ్ అంది. రెండు రోజులు ఇంటికి వెళ్ళకుండా ఆఫీసులో ఉండి మొత్తం చేసుకున్నాను.

జాబ్ కావల్సినప్పుడు ఉన్నవి, లేనివి కల్పించి చెప్పి, కష్టాల్లో ఉన్నామని, కన్నీళ్ళు వస్తున్నాయని, అవని, ఇవని, ఏవేవో చెప్పి, తీరా పని ఇచ్చాక, ఆ ఫంక్షన్ అని, ఈ ఫంక్షన్ అని, ఇదుగో ఇలా బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడని బాయ్ చెప్పి, మా పని మధ్యలో వదిలేసి, పై వాళ్ళ నించి నాకు తిట్లు పడేలా చేసి. ఇదంతా మళ్ళీ జరగకుండా ఉండటం కోసం, ఏదన్నా ఉంటే ముందే తెలుసుకుంటే దానికి తగ్గట్టు నేను డెసిషన్ తీసుకోవడం కోసం అడిగాను.

ఊహించిన దాని కన్నా ఎక్కువ మందే వచ్చారు, ఐ కెన్ చూజ్ వన్, ఐ హ్యావ్ ఛాయిస్."

తల ఊపుతూ, తల దించుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది.

అలా ఉన్న హారికని చూస్తూ... 'నైస్. బాగుంది. పర్ఫెక్ట్'... అనుకున్నాడు.

తల ఎత్తింది.

"నాకు అలాంటివి లేవు సర్. హెల్థ్ సరిగా లేకపోతే తప్ప నేను లీవ్ పెట్టను సర్. పని దగ్గర కూడా అంతా నేర్చుకుంటాను. మీరు అన్నట్టు టైం కన్నా ముందే చెయ్యడానికే చూస్తాను. ఓవర్ టైం కూడా చేస్తాను. నన్ను నమ్మచ్చు మీరు. మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఈ జాబ్ కావాలి సర్"

"రైట్. సీనియర్ మేనేజర్ గారికి ఒక మాట చెప్పాలి. రేపు చెప్తాను నీకు. బయట డెస్క్ దగ్గర ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళు"

"అలగే సర్. థ్యాంక్ యూ"... తలూపుతూ లేచింది.

"ఒకే"... తలూపుతూ మానిటర్ వైపు చూడసాగాడు.

తలుపు దాకా వెళ్ళి, ఆగి, వెనక్కి తిరిగింది.

ఏంటన్నట్టు చూసాడు.

"నా కోసం మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి మీకు కలగదు సర్. మీ రిక్వైర్మెంట్కి నేను సరిపోతాను అనుకుంటే జాబ్ ఇవ్వండి సర్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను"... చెప్పి తల దించుకుని వెళ్ళిపోయింది.

హారిక వెళ్ళిన వైపే చూస్తూ... 'ఇంత కన్నా ఏం కావాలి. పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. వెల్కం హారికా'... అనుకుంటూ మానిటర్ చూడసాగాడు.

డెస్క్ దగ్గర ఫోన్ నంబర్ ఇచ్చి, బయట ఇంకా సన్నగా చినుకులు పడుతుంటే గొడుగు తెరిచి, జీవితంలో జరిగిన మొదటి ఇంటర్వ్యూ అనుభూతిలోనే ఉండి, కాసేపు నడుద్దాం అనుకుంటూ నడవసాగింది హారిక.
Like Reply
#40
Cute update
[+] 1 user Likes Sushma2000's post
Like Reply




Users browsing this thread: 9 Guest(s)