Thread Rating:
  • 13 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Veera
#1
 
    జీవితంలో అందరూ ఉన్న ఒంటరిగా ఉండే ఒకరి కోసం... ఎవరు ఉన్న లేకున్నా అనే స్వార్థ తీరాల నుంచి మన అనే సూర్య కిరణాలు వరకు చేరేనా ఈ అనుకొని పయనం..! Sad
[+] 4 users Like Avengers35's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Please start the story
Like Reply
#3
emotional story na enti nuvu rasina okka linelo tho edo gattiga plan chesinatuu anipistundii..... sex site lo sex stories common ee kani oka ardavantamina story lo srungaram unte adi marichipoleni kathaga migilipotundi ... ne story alane undali untundi ankuntuna.....
devil2 
[+] 1 user Likes dombull7's post
Like Reply
#4
మీ కథ కీ టైటిల్ చూస్తుంటేనే అర్దం అవుతుంది
యాక్షన్ ఫాంటసీతో శృంగారం ఉంటుంది అనీ.దేనికీ ఆలస్యం మెదలు పెట్టండి bro
Like Reply
#5
సిటీలోనే ముఖ్యమైన బిజినెస్ మ్యాన్ " సుదీప్ వర్మ "

    స్థాయికి తగ్గట్టుగానే విలసవంతమైన విల్లా..

  క్రమశిక్షణకు మారుపేరు..

తప్పు చేయడు(ఆయన ఫీలింగ్),ఎవరు తప్పు చేసిన సహించడు ఈ టైగర్ బాబు..

ఆయన భార్య గౌతమి
వాళ్లకు ఇద్దరు కూతుళ్లు..

పెద్దమ్మాయి " స్వప్న "
ఎంబీఏ చదువుతుంది..యమా తెలివైనది..తండ్రి స్ట్రిక్ట్ కావడంతో తల్లి చాటు పిల్ల..కొంచెం  భయస్తురాలు..ఇక అందం విషయానికి వస్తె...ఫస్ట్ అప్డేట్ లోనే అంత చెప్పాలా ఎంటి..హా హా హా

రెండో అమ్మాయి " శ్రుతి "
టామ్ బాయ్ లా...డేరింగ్ & డాషింగ్..
అప్పుడప్పుడు టైగర్ బాబుని ఏదురిస్తుంది..

ఇంట్లో సుదీప్ అమ్మానాన్న కూడా ఉంటారు

సుదీప్ బయటకు వెళ్ళగానే టీచర్ లేని స్టూడెంట్స్ లా ఆటలు,పాటలు, డాన్సులు అబ్బో ఇల్లు పికి పందిరి ఎస్తారు..

స్వయంకృషి లో చిరంజీవిలా సొంతంగా  ఇంట్లో పనులు మేమే చేసుకుంటాం అని ఇంట్లో పని వాళ్ళని కూడా పని మానిపించేశారు...లేకపోతే వీళ్ళ వేషాలు టైగర్ బాబు ఎక్కడ చేరేవెస్తారో అని....గేట్ దగ్గర వాచ్మెన్ నీ కూడా అలారంలా సెట్ చేసుకున్నారు..

కాలేజ్ నుంచి  అప్పుడే ఇంట్లోకి వచ్చింది స్వప్న..రావడమే అమ్మ అంటూ గౌతమినీ చుట్టేసుకుంది..

గౌతమి 'అబ్బో ముఖం ఎంటి..పుష్ప2 అప్డేట్ వచ్చిన భాయ్ ఫ్యాన్ లా  వెలిగిపోతుంది..ఎంటి సంగతి!?

స్వప్న'కాలేజ్ ఫ్రెండ్స్ అంత ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం.

గౌతమి 'ఓహో

స్వప్న 'నేను కూడా వెళ్తాను మా..

గౌతమి 'మీ టైగర్ బాబు ఒప్పుకోరు కానీ..ఫ్రెండ్స్ కి నో చెప్పెయ్

స్వప్న ' కనీసం ఎక్కడికి అని కూడా అడగవా?

గౌతమి ' నేను అడిగినంత మాత్రాన మీ నాన్న పంపుతాడా?

స్వప్న ' నాన్నని ఒప్పించుమా..!ప్లీజ్

గౌతమి 'ఆయన నా మాట వినరు..సారీ రా

స్వప్న అలిగి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంది..
ఆలిగినప్పుడు చూడాలి స్వప్న మోము..
కలువరేకులు లాంటి కళ్ళలో చిరుకోపం..
గులాబి రేకులు లాంటి పెదవులను పంటితో నలుపుతూ..
చేతి వేళ్ళని ఒకదనితోకటి పెనవేసి..ఆలోచిస్తుంది..

ఇదంతా మెట్ల దగ్గర నిలబడి చూస్తున్న బామ్మ-తాతయ్య ఇద్దరు వచ్చి
చెరో పక్కన కూర్చున్నారు.

గౌతమి ' మీరు ఐనా చెప్పండి మావయ్య..నేను చెప్తే అలిగి కూర్చుంది...

తాతయ్య ' నిజామెర...మా గన్నాయిగాడు ఒప్పుకోడు..

స్వప్న ' నాకో డౌట్..!నేను,చెల్లి,అమ్మ భయపడతాం అంటే అర్ధం ఉంది..నువ్వు బామ్మ కూడా భయపడతారు ఎంటి.!?మీరా పేరెంట్స్ ?? ఆయన?? అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడిగింది..

తాతయ్య ' మేము కని,పెంచేవరకు బాగానే ఉన్నాడు..చదువుకునే సమయంలోనే ఇలా తయ్యారు అయ్యాడు..

బామ్మ ' అవునే..మీ ' అత్త ' నీ కూడా ఇంతే ఎక్కడికి వెళ్లనించే వాడే కాదు

స్వప్న ' అబ్బా.!అత్త ఎన్నో సార్లు చెప్పింది కానీ..విషయానికి రండి..నాన్నని ఎవరు అడుగుతారు??

గౌతమి ' పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అని..ఎలుకల సభలో
అనుకున్నట్లు.. మాకు అంత ధైర్యం లేదమ్మా.....!

అప్పుడు పిల్లికి పాలు పోసేటప్పుడు కడితే సరి..అని వినిపించింది

నలుగురు చూడగానే ....శ్రుతి

శ్రుతి వచ్చి స్వప్న ఒళ్ళో కూర్చొని..మై హునా..మై స్వీట్ సిస్.

స్వప్న ' మా శృతిని చూసి నేర్చుకోవాలి..అని బుగ్గ మీద ముద్దు పెట్టింది.

గౌతమి ' ఈజీగా హామీ ఇచేస్తున్నావ్ !!అవతల మీ నాన్న..

శ్రుతి ' అమ్మ నాకు వదిలేయ్..నేను చూసుకుంటా...

స్వప్న ' పద రా.! నీకు హార్లిక్స్  ఇస్తా..అని తీసుకెళ్ళింది.

గౌతమి ' స్వప్న అన్నట్టు నేను ,పిల్లలు భయపడి,

పెద్ద వాళ్ళు ఐనా మీరు భయపడి..

ఇంకెవరు ఎదురు వస్తారు..

బామ్మ ' ఏమో చూడాలి..దేనికైనా టైం రావాలి..

తాతయ్య ' నువ్వే కాదు నేను చూడాలి...లేకపోతే వీడు వీడి ఓవరాక్షన్..ఒక వయసు వచ్చాక..మీరు ఇలాగే ఉండాలి అని రెస్త్రిక్షన్స్

బామ్మ ' సరే కానీ.. మష్రూమ్ బిర్యాని కదా ఈరోజు స్పెషల్ ఐటెం..తొందరగా వండితే కానిచ్చేద్దాం..

తాతయ్య ' లేకపోతే 2 పుల్క,ఒక గ్లాస్ మజ్జిగ..ఏ మూలకి.?

గౌతమి ' సరే నేను పిల్లలు ఆ పనిలో వుంటాం అంటూ కిచెన్ లోకి వెళ్ళింది..

టైగర్ బాబు రూల్స్..

ఇవేనా..ఇంకా చాలా ఉన్నాయి..

చూద్దాం చూద్దాం ముందు ముందు..

Sleepy
[+] 14 users Like Avengers35's post
Like Reply
#6
Next update  horseride entry
[+] 1 user Likes Avengers35's post
Like Reply
#7
వామ్మో హీట్లర్ నా ఏంటి హహహ
చాలా బాగుంది అప్డేట్
Like Reply
#8
టైం:రాత్రి రెండు గంటల పది నిమిషాలు
హైదరాబాద్ విజయవాడ హైవే కి కొంచెం దూరంగా..ఉన్న ఒక ఏరియా..

స్ట్రీట్ లైట్ ఆగి ఆగి వెలుగుతోంది...

బైక్ మీద దిగాడు ఒకడు చిన్న బ్యాగ్ తో..

అతని వెనకే కారులో నుంచి ఓ అరడజను రౌడిబాబులు దిగారు..

ఒక పావుగంట తర్వాత దూరం నుంచి ఏదో వెహికల్ రావడం కనపడింది....

బైక్ వాలా ' మీరంతా దూరంగా వెళ్ళండి...
నేను చెప్పినప్పుడు రండి... అనగానే వాళ్ళు వెళ్లి చీకట్లో దూరారు...

పోర్షే-911 కార్ వచ్చి ఆగింది...

కార్ లో నుండి ఒక వ్యక్తి దిగాడు...

బైక్ వాలా అతని దగ్గరకు వచ్చి 'మాల్ రెడీ....క్యాష్ ఎక్కడ??అన్నాడు...

అతను ఏం మాట్లాడలేదు....

సిగరెట్ తీసి వెలిగించి...పొగ బైక్ వాలా మీద వుదాడు...

బైక్ వాలా కోపంగా ' ఏంటి ఇది????

ముందు క్యాష్ ఇస్తే నేను వెళ్తా....అంటూ మాల్ అతనికి ఇచ్చాడు.

అతను క్యాష్ వున్న బ్యాగ్ ఇచ్చి...మాల్ తీసుకున్నాడు..

అతను కారు దగ్గరికి వెళ్తుంటే..

బైక్ వాలా చిన్న విజిల్ వేసాడు..

అంతే ఆ రౌడీలు వచ్చి అతని దగ్గర వున్న మాల్ బ్యాగ్ లాకున్నారు...

అతను కోపంగా చూస్తుంటే...

బైక్ వాలా నవ్వి '' పోయిన సారి...నేను  లేటుగా వస్తె...ఏం చేశావ్??
క్యాష్ లో పదివేలు కట్ చేశావ్!!

మరి ఇవాళ నువ్వు లేట్ కదా..అందుకు నీకు ఏదో ఒకటి కట్ చేయాలి కదా..అంటూ రౌడీలతో..

ఏంటిరా చూస్తున్నారు!? కాలు చెయ్యి ఏదో ఒకటి తీసేయండి...

వాళ్ళు అతన్ని కొట్టబోతుంటే

అతను ఒక్కోక్కడి చేతిని మెలి పెట్టి తన చేత్తో కడుపులో గుద్దుతూ..అందరినీ అయిదు నిమిషాల్లో ....మడిచి కూర్చోపెట్టాడు..

వాళ్ళ దగ్గరున్న మాల్ తీసుకొని బైక్ వాలా నీ పైకి లేపి...

'ఏరా!!! వీర కే....టెండర్ పెట్టావా??అంటూ అంతక ముందు ఇచ్చిన బ్యాగ్ తీసుకొని అందులో కొంచెం డబ్బుని వాడి మొహం మీద విసిరేసి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు...

                  ||||||||||||||||||||||||||||||||||||


తెల్లవారు జామున ఆ కారు ఫాస్ట్ గా వచ్చి ఒక ఫాం హౌస్ లోకి వెళ్ళింది....

' వీర ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి రాగానే అక్కడ ఉన్న ఒక అంకుల్ ముందు పడేశాడు..

ఆ అంకుల్ వయసు సుమారు యాబై పైనే వుంటాయి..పేరు త్రినాథ్..

త్రినాథ్ ఆ బ్యాగ్ తీసుకొని అందులో నుండి పౌచ్ తీశాడు..వాటిలో నుంచి ' డైమండ్స్ ' ...చేతిలోని తీసుకొని కౌంట్ చేశాడు.

'వీర ! ఈ డైమండ్స్ వాల్యూ ఎంతో తెలుసా??అన్నాడు..ఒక్కో దాన్ని పరిశీలిస్తూ..

వీర సిగరెట్ తీసి వెలిగించి ' తెలీదు... అన్నట్టు తల ఊపాడు..

త్రినాథ్ ' పది కోట్ల పైనే..ఇంకా నువ్వు తీసుకువెళ్లిన నా కారు రేట్ అని చెప్పేలోపు

వీర చిరాగ్గా ఫేస్ పెట్టి 'ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నవ్??అన్నాడు..

త్రినాథ్ ' ఎందుకు అంటే నువ్వు నా దగ్గర పని చేయడం కోసం..అప్పుడు నీకు ఎంత ఇస్తానో లెక్కేలేదు..ఇంకా లగ్జరీ లైఫ్ ...అన్నాడు.

ఇదంతా గమనిస్తున్న త్రినాథ్ పి.ఏ ' వీర ఏం చెప్తాడా అని చూస్తున్నాడు..

వీర ' నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే నేను పోతా..అన్నాడు

త్రినాథ్ ' నువ్వు మారవు రా!అనగానే

వీర ' రా ' అనకు నాకు నచ్చదు..అన్నాడు చిరాగ్గా..

ఆయన ఇంకేం మాట్లాడకుండా పి.ఏ కి సైగ చేయడంతో అతను ' కొంత ' ఎమౌంట్ ఇచ్చాడు..

వీర అది తీసుకొని వెళ్తుంటే ఆయన ' వీర ఈసారైనా నీ ఫోన్ నంబర్ ఇస్తావా!?

వీర ' నీకు అవసరం ఐతే తెలుసుగా..ఎలా కాంటాక్ట్ చేయాలో....అని బయటికి వచ్చి తన రాయల్ ఎన్.ఫీల్డ్ తీసి ముందు పోనిచ్చాడు..

వీర వెళ్ళాక పి.ఏ లోపల వాళ్ళ సార్ తో 'అంత పొగరు ఎంటి సార్ వాడికి!?అయిన మిమ్మల్ని ' నువ్వు ' అంటాడు...ఎంటి??

త్రినాథ్ ' ఎందుకు అంటే వాడు వీర కనుక...వాడు అందరి లాంటి వాడు కాదు..అందరిలో ఒకడు కాదు..వాడికి పొగరు ఎక్కువ ఎందుకు అంటే ఎవరికీ తలవంచడు కాబట్టి... వాడికి అంత పెద్ద ఆఫర్ ఇచ్చిన తీసుకోలేదు..తిస్కొడు  అని తెలుసు..
"""వాడు ఎవడి పెత్తనాన్ని సహించడు"""

పి.ఏ' కేజీ ఎఫ్ రేంజ్ లో ఎలవేషన్లు ఇస్తున్నారు మీరు వాడికి..! ఒక దొంగ...ఒక స్మగ్లర్...

త్రినాథ్ ' దొంగే కాదనను.. బట్ దొంగతనం చేయడం వాడికి చీర్స్ కొట్టిన అంత ఈజీగా చేస్తాడు...ఇక స్మగ్లింగ్ అంటావా... డైమండ్స్ తప్పితే ఏమి చేయడు... సెటిల్ మెంట్ లు చేస్తాడు అనుకో...

లైఫ్ లో ఒక్కసారైనా ' నా దగ్గర కాదు నా కింద పని చేయలయ్య...

పి.ఏ ' వాడి వాలకం చూస్తుంటే చేసే వాడిలా లేడు సార్..

త్రినాథ్ ' టైం రావాలి...

చూద్దాం చూద్దాం.....
[+] 12 users Like Avengers35's post
Like Reply
#9
చాలా చాలా బాగుంది యాక్షన్ సీన్, వీరా ఏలా ఉండాడు ఎలాంటి వాడు అనేది చాలా బాగా రాశారు.సూపర్ అప్డేట్ bro
Like Reply
#10
హైదరాబాద్... సిటి నుంచి దూరంగా..

70 కిమీ దూరంగా వున్న ఒక ఏరియా లోకి ఎంటర్ అయ్యాడు వీర...

అదంతా ఇప్పుడిప్పుడే డెవెలప్ అవుతోంది.. దారంతా చెట్లూ..

ఇళ్ళు కూడా తక్కువే..

అక్కడక్కడా కన్స్టక్షన్ అవుతున్నాయి....

ఏకాంతపురం...అని పేరు అయితే సరిపోతుందేమో... ఆ ఏరియాకు

అది ఒక డూప్లెక్స్ హోమ్....

వీర తన బైక్ ని తన ఇంటి ముందు ఆపి లోపలికి వెళ్తుంటే..లోపల నుండి...

'వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డూ... వాడి చూపుల్లో వుంది చెగువేరా ట్రెండూ. అనే సాంగ్ వస్తోంది..

(ఈ వీర ఎప్పుడు చూసినా మొహం చిరాగ్గా,విసుగ్గా పెట్టుకుంటాడు.... వీర లోపలి కి వెళ్ళగానే కాళి '' (వీర రైట్ హ్యాండ్) ఎదురొచ్చాడు.. వీర క్యాష్ ఇవ్వగానే....

కాళి కౌంట్ చేసి..

'అదేంటి??? ఎమౌంట్ బరువుగా వుంది??

వీర 'ఆ మాల్ ఇచ్చిన వాడి ఒళ్ళు బరువు తగ్గింది...

కాళి 'ఓ!!! నీ సంగతి తెలిసి.. నీతో పెట్టుకున్నాడా????

వీర ఏం మాట్లాడలేదు..

కాళి 'వీరా! మీ నాన్న వచ్చి వెళ్ళాడు నీ కోసం!!! అంటూ నసిగాడు...

వీర సీరియస్ గా చూసేసరికి..

కాళి ఏం మాట్లాడలేదు... (ఏంటో!!! వీడు.. ఒక్కోసారి అర్థం కాడు...... ఎందుకు వచ్చాడనా??? వస్తే నాతో ఎందుకు చెప్తున్నావనా???? ఆ చూపెంటో..... వాడు ఎంటో...)

వీర 'సుబ్బు గాడు ఫోన్ చేశాడా????

కాళి 'లేదు....ఇంకా...

వీర ఏం మాట్లాడలేదు

కాళి అక్కడ కూర్చుని.... నిన్న.... ఏం జరిగిందో... గుర్తు చేసుకున్నాడు...

సుబ్బు,సింహా.... వీర కింద పని చేస్తారు...

వీర అంటే చచ్చేంత భయం...

వీర వీళ్ళతో... రేయ్! కింగ్ కోఠి లో హీరాలాల్ సేట్ ఇల్లు తెలుసుగా??

సుబ్బు 'తెలుసు... మనం వజ్రాలు అమ్మేది ఆయనకేగా???

వీర 'ఆ.. ఆ ఇల్లు నాకు అమ్మయ్యేమని వెళ్ళి వాడికి చెప్పండి... అంటూ వెళ్లిపోయాడు...

సింహా 'కాళి' తో 'ఇదేంటిరా!! వీడేమైనా డాన్ అనుకుంటున్నాడా??? వెళ్ళి చెప్పగానే.. ఆయన భయపడి అమ్మటానికి.

"అయినా... ఆ ఇల్లే ఎందుకు ???

కాళి 'అది నాకు తెలియదు... వీడు ఎప్పుడో ఆ ఇల్లు
చూశాడు..

నాకు కారణాలు ఏమి చెప్పలేదు.. మీరెళ్ళి ఆయనకు ఓ మాట పడేయండి.. నాకు తెలిసి ఎటూ వినడు.. వీడి పేరు చెప్పండి.. తరువాత చూద్దాం.. అనగానే వీళ్ళిద్దరూ ఆ సేఠ్ ఇంటికి వెళ్ళారు..

కాళి ఇప్పుడు వాళ్ళ కోసమే వెయిటింగ్...

అప్పుడే ఇద్దరూ గేట్ తీసుకుని లోపలికి వచ్చారు.. కాళి 'ఏంటిరా???వెళ్ళిన పని ఏమైంది??? అంతా ఓకే కదా???

సింహా 'ఏంటి ఓకే...... అంటూ తల కొట్టుకున్నాడు...

కాళి 'రే! సుబ్బు. ఏమైంది రా!!! ఎందుకు వీడు తల కొట్టుకుంటున్నాడు???

సుబ్బు 'అసలు ముందు ఇది చెప్పు??? వీర ఏ మూడ్ లో వున్నాడు.... అనగానే

సింహా 'భలే. అడిగావ్ లే... వాడు ఎప్పుడూ చిరాగ్గా నో, విసుగ్గా నో లేకపోతే కోపం గా నో వుంటాడు...

కాబట్టి ఏ మూడు లో వున్నా.. మన మాడు పగలకొడతాడు.. పదా అనగానే..

కాళి 'ఎహే!..ఏమైంది???.....ఆ సేర్ ఏమన్నాడు??? అని అడిగాడు....

సుబ్బు చెప్పటం స్టార్ట్ చేసాడు...

అదో పెద్ద ప్యాలెస్...చూడటానికి వాళ్ళ ఆరు కళ్ళు సరిపోలా... (సుబ్బు కి కళ్ళజోడు)

సింహా 'అందుకేరా వీర ఈ ఇంటి మీద వేశాడు..

వీళ్ళు లోపలికి వెళ్ళి సేఠ్ కి 'వీర' చెప్పిన విషయం చెప్పారు..

'వాడేమైనా?? దిగి వచ్చాడా??? లేకపోతే.. ఏమైనా విఐపి నా??

ఆస్ట్రాల్ ఒక స్మగ్లర్... రౌడీ వెధవ.... వాడు చెప్పటం... మీరు రావడం.

వెళ్ళండి ముందు ఇక్కడి నుండి.. అని అరిచాడు..

సుబ్బు 'మీకు ఇంకా వీర సంగతి పూర్తిగా తెలియదు. తను ఒకసారి ఏదైనా కావాలి అనుకుంటే. దక్కేవరకు వదిలి పెట్టడు..

సేఠ్ 'ఆహా!!! అంత వుందా??? వాడికి... దమ్ముంటే రమ్మనండి... చూద్దాం

నాకు అటు సెక్యూరిటీ ఆఫీసర్లు ఇటు పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ తెలుసు.. మర్యాదగా వెళ్ళండి... అని అన్నాడు...

సుబ్బు అదిరా రా జరిగింది.. జరిగింది.

అది విని కాళి.. "అనుకున్నా... మీరు రేపు మళ్ళీ వెళ్ళండి.. రెండోసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి..

నాకు తెలిసి... వాడు అంత తేలిగ్గా ఒప్పుకోడు..

సింహా 'నీకు ఇలాంటివి బాగానే తెలుస్తాయి.. ఆయన ఒప్పుకోడు అంటావ్..

వీర వినడు.. అంటావ్..

మిమల్ని ఏం చేయమంటావ్?? అది నువ్వే చెప్పు... అన్నాడు వెటకారంగా...

కాళి 'సింపుల్... రేపు వెళ్ళి అక్కడ నుంచి వీర కి కాల్ కలపండి..

వీడు చూసుకుంటాడు.. అనేసి వెళ్ళిపోయాడు..

సుబ్బు 'ముందు చూస్తే నుయ్యి... వెనుక చూస్తే... అన్నట్లు వుంది....

సింహా 'అప్పుడు సైడ్ నుంచి నుంచి వెళ్ళిపోతే సరి....

సుబ్బు అర్థం కాలా.. నువ్వు నీ అర్థం పర్థం లేని.... మాటలు

సింహా 'రేపు నువ్వేమి మాట్లాడకు... ఆ సేఠ్ ని నేను హ్యాండిల్ చేస్తా అన్నాడు..

.. నెక్స్ట్ డే ....అలా వెళ్లి ఇలా వచ్చారు.. ఇద్దరూ..

కాళి 'ఏంటిరా??? ఏమైంది??

సుబ్బు నవ్వు ఆపుకుంటూ..

'సింహా భలే హ్యాండిల్ చేశాడులే... అనగానే.

సింహా 'అంత నవ్వు ఎందుకు వస్తోంది రా!!! నీకు...

కాళి 'మీ వాలకం చూస్తుంటే... నాకేదో కొడుతోంది.. పదండి... వీర దగ్గర కు... అని తీసుకెళ్ళాడు.

వీళ్ళు వెళ్ళేసరికి వీర సోఫా లో కూర్చోని టీపాయ్ మీద కాళ్ళు జాపుకుని టివి లో రవితేజ వెంకీ మూవీ చూస్తున్నాడు...

అది కూడా ట్రైన్ సీన్..

దాన్ని సీరియస్ గా చూస్తున్నాడు..

సింహా వాళ్ళతో 'రేయ్ నాకు తెలిసి కామెడీ సీన్  ఇంత సీరియస్ ఎవడు చూడడు రా.!

కాళి " ష్ " అంటూ '!!! ...

వీరా! అని పిలిచాడు...

మ్.... అన్నాడు టివి మీద నుంచి చూపు తిప్పకుండా... సింహా, సుబ్బు నీకెదో చెప్తారంటా.... అనగానే

సుబ్బు ' అది ..... అది మరి... ఆ ఇల్లు వాళ్ళు సేల్ చేయరంటా.. వీర చూపు తిప్పలేదు.. టివి వైపే చూస్తున్నాడు... సుబ్బు 'సింహా' కి సైగ చేశాడు..

సింహా 'నీ పేరు చెప్తే... నిన్న ఆ సేఠ్ కొంచెం కూడా భయపడలేదు...

వీర 'వాడు భయపడ్డాడు...

కాళి 'అంటే!!! వీర పైకి లేచి..

'వీళ్ళు నిన్న వెళ్ళి వచ్చాక...ఆ సేఠ్ భయపడి ..

ఆ 'రోని' గాడికి ఫోన్. చేశాడు.

కాళి 'రోని కా!!! అన్నాడు కంగారుగా...

వీర 'ఆ... వీళ్ళిద్దరూ ఆ ప్యాలెస్ దగ్గరకు వెళ్ళేసరికి ఆ రోని వాడి గ్యాంగ్ ని చూసి తడిపేసుకొని వచ్చేశారు..

ఏరా?? అంతేనా??? అని అడిగాడు కోపం గా..

సింహా 'అంటే.. వీరా!! అది ఆ రోని పోయిన సారి.. మనతో గొడవ పడ్డాడు కదా!!! అందుకని అని ఆగాడు..

వీర 'ఆ... అందుకని??? అందుకని??? వాడు రోని అయితే..

నేను ' వీర '

వీర గాడు ఇక్కడ...ఒక్కసారి అనుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..!

అని ఫాస్ట్ గా కిందకి వెళ్ళాడు..

ముగ్గురు తన వెనుకే ఫాలో అయ్యారు..

వీర తన రాయల్ ఎన్ ఫీల్డ్... స్టార్ట్ చేయగానే... కాళి తన వెనుక ఎక్కాడు..

సుబ్బు,సింహా వాళ్ళ బైక్ మీద ఫాలో అయ్యారు..

                   |||||||||||||||||||||||||||||||||||||||||||||||

వీర ముందు బైక్ ఫాస్ట్ గా వెళ్తుంటే.. వెనుక బైక్ మీద సింహా 'సుబ్బు' తో..

'రేయ్!! నాకో డౌట్..

సుబ్బు డ్రైవ్ చేస్తూ.. ' అడుగు

సింహా 'ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నామో... అంత కన్నా ఫాస్ట్ గా వెనక్కి వచ్చేస్తామో... అని తేడా కొడుతోంది..

సుబ్బు ఫాస్ట్ గా వెళ్ళి... వీర తో.

'వీరా!!! అని పిలిచాడు..

వీర 'ఏంటి?? అన్నట్లు ఓ చూపు చూశాడు.

సింహా 'సుబ్బు' చెవి లో ఎందుకురా!! వాడిని పిలుస్తున్నావ్??

సుబ్బు 'వీరా! సింహా కి ఏదో డౌట్ వచ్చింది... అందుకే నిన్ను పిలిచా..

వీర 'సింహా' వైపు 'ఏం డౌట్??? అని అడిగాడు సీరియస్ గా .

సింహా 'అదేం లేదు వీరా!!! రోని గాడు పెద్ద గ్యాంగ్ తో వచ్చాడు...

మనం నలుగురమే వున్నాము... కదా!!!

వీర ఏం మాట్లాడలేదు .. ఫాస్ట్ పెంచాడు..

సుబ్బు నవ్వుతుంటే..

సింహా 'ఏంటి బే..వాడి దగ్గర అలా ఇరికించావ్!??

సుబ్బు 'లేకపోతే... నేను హ్యాండిల్ చేస్తా... అని తీసుకెళ్ళి.. నువ్వు ఏం పీకావ్??

సింహా"సరే.. నేను జఫ్ఫా... వీర గాడంటే భయం.. ఇదేగా నీకు కావాల్సింది..

సుబ్బు నవ్వుతూ 'ఎందుకురా?? నీకు వీర అంటే భయం??

సింహా 'అక్కడికి నీకు ఏదో లేనట్లు.. అన్నాడు..

సుబ్బు 'నాకా ఏం మాట్లాడుతున్నావ్???

నాకు నాకు...నీకన్నా ఎక్కువ భయం.... అంటూ బైక్ స్పీడ్ పెంచాడు... వీళ్ళు బైక్స్ ఆ సేఠ్ అంకుల్ ఇంటి ముందు ఆపారు.. వీర దిగి సిగరెట్ వెలిగించాడు..

పొగ వదులుతూ ఆ బిల్డింగ్ ని పై నుంచి కింద వరకు ఓ చూపు చూశాడు..

కాళి వైపు చూడగానే...కాళి లోపలికి వెళ్ళాడు..

సుబ్బు, సింహా ఇద్దరూ వచ్చి వీర పక్కన నిల్చున్నారు ..

వీర 'మీకు సపరేట్ గా చెప్పాలా??? అనేసరికి.. వాళ్ళు కాళి వెనుకే వెళ్ళారు..

లోపల సేఠ్ అంకుల్ ఈ స్టోరిలో విలన్ అయినటువంటి సదరు 'రోని' తో టాకింగ్ చేస్తా వున్నాడు..

కాళి 'నమస్తే... సేఠూ... అని సింగిల్ హ్యాండ్ తో నమస్తే చెప్పాడు..

సేఠ్ కాళీని చూసి ఏంట్రా?? ఇలా వచ్చినావు ఏంటి కధ?? అని ఎగతాళిగా నవ్వాడు.

కాళి 'నేను ఎందుకు వచ్చినాను నీకు తెలియదా... మా వాళ్ళని పంపితే... ఈ ఇల్లు అమ్మను అని చెప్పావంటాగా???

సేఠ్ 'అవునురా! చెప్పాను.. నాకు ఈ ఇల్లు అమ్మే ఉద్దేశ్యమే లేదు... అయితే ఏంటి ఇప్పుడు???

కాళి 'సరే... పదా. ఆ మాట బయట వీర వున్నాడు.. వచ్చి చెప్పు...

సేర్ ' వస్తా నాకేంటి??? నాకేమైన భయమా???? అన్నాడు వెటకారంగా.

కాళి 'తప్పు సేఠూ... మనం ఎప్పటి నుంచో కలిసి బిజినెస్ చేస్తున్నాం...వీడిని నమ్ముకుని అంటూ రోని వైపు సీరియస్ గా చూసి..

'వీరా కి ఎదురు వెళ్ళకు.. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.. అని అంటుంటే..

రోని లేచి కాళి కడుపులో ఓ గుద్దు గుద్దాడు..

సుబ్బు అది చూసి కోపంగా వస్తుంటే..

రోని గాడిలు వీళ్ళ ముగ్గురిని బాగా కొట్టి బయటకు విసిరేశారు..

కాళి కి మాత్రం రెండు ఎక్కువే వడ్డించారు..

వీళ్ళ ముగ్గురు అలా బయట పడటం చూసి.. వీర. కోపంగా లోపలికి వెళ్ళాడు..

రోని వీర ని చూసి వచ్చావా?? భలే దొరికావ్ రా!!! -ఒంటరిగా... అని నవ్వాడు.

“వీర సేఠ్ వైపు చూసి

పేపర్స్ ఇచ్చి... 'వీటి మీద సంతకం పెడితే..నేను నిన్ను ఏమి చేయను... కామ్ గా వెళ్ళిపోతా... అన్నాడు.. సేఠ్ చేతిలో నుంచి రోని ఆ పేపర్స్ లాక్కున్నాడు.

అందరూ నవ్వారు..

వీర కోపం గా...

'రేయ్! మర్యాదగా ఆ పేపర్స్ ఇటు ఇవ్వు... అనగానే..

వాడు ఆ పేపర్స్ చింపబోయాడు..

వీర వాడి చేతి మీద కాలితో ఒక తన్ను తన్నగానే పేపర్స్ గాల్లో ఫ్లై అవ్వగానే..

వీర వాటిని పట్టుకున్నాడు.

వెనకే వచ్చిన కాళి చేతికి ఇచ్చాడు..

వీర ముందు రోని గాడి గుండెల రోని గాడి గుండెల మీద ఒక తన్ను తన్నాడు..

...వాడు ఎగిరి అవతల పడ్డాడు..

అంతే వాడి మనుషులు అందరూ వీర మీదకు వచ్చారు...
వీర ముందు ఎవరు నిలువలేక పోయారు.... పది నిమిషాలలో చావకొట్ట చింతకాయ పచ్చడి చేశాడు.. రోని పైకి లేచి 'వీర ని ఒకతన్ను తన్నాడు.. వీర కింద పడగానే... రోని తన మెడ మీద కాలు వేసి.. 'ఎరా!! ఎన్నిసార్లు చెప్పాలిరా!!! నీకు??? నా దారికి అడ్డం రావొద్దని.. సెటిల్మెంట్ ఫీల్డ్ లో పది సంవత్సరాలుగా కింగ్ లాగా....బతికా. నువ్వు వచ్చి సంవత్సరం అయ్యింది.. ప్రతి డీలింగ్స్ లో అడ్డు తగులుతున్నావ్... అంటూ వీర మెడ మీద కాలుతో గట్టిగా ప్రెస్ చేశాడు..

వీర గట్టిగా వాడిని తోసేశాడు.

అలా పడటం పడటం వెళ్ళి అక్కడున్న డోర్ కి తగిలి
స్పృహ కోల్పోయాడు.. వీర పైకి లేచి..

సేఠ్ అంకుల్ ని ఉతికి ఆరేశాడు..

ఈ ప్రొసెస్ లో రెండు ' ఒక వ్యక్తి ' కళ్ళు వీర ని కోపం గా చూస్తున్నాయి .

ముఖ్యంగా సేఠ్ అంకుల్ ని ఉతుకుతుంటె..

వీర ఆయన్ని సోఫా లోకి తోసి.

'ఏమ్! సేఠ్.. ఈ గొట్టం గాడిని చూసుకొనా ... తెగ చించేసుకుంటున్నావ్!!!

ఇలాంటి వాళ్ళని యాభై మంది వచ్చినా..

వీర ముందు అంటూ ... కాళి వైపు చూశాడు..

కాళి 'పేపర్స్' ఇచ్చాడు

సేఠ్ అంకుల్ 'నేను... పెట్టను...వీర.. నువ్వు ఏం చేసినా నేను పెట్టను అంతే... అంటూ.. లేచాడు..

ఒకపక్క ఇలా జరుగుతుంటే కాళి ఇంకోపక్క ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసాడు
' హాల్లో...మంజు..

అవతల ఫోన్ లో మంజు ' హా ...ఎంటి మా కాళి బావకు ఇప్పుడు గుర్తువచ్చనా...!?

కాళి ' నీతో వీర మాట్లాడతా అన్నాడు... లైన్ లో వుండు

మంజు ' కల..నిజమా..

కాళి ' నువ్వు అనుకునే దానికి కాదులే..చిన్న సెటిల్మెంట్...

మంజు ' హైప్ లో ఉన్న మూవీ నీ postpone చేసినట్టు...వీర మాట్లాడతాడు అనుకుంటే...సెటిల్మెంట్ అంట.. పేహ్..

వీర ఆయన్ని అక్కడున్న ఫ్లవర్ వాజ్ తో ఒకట్టిచ్చాడు.. పాపం ఆ అంకుల్ పెద్ద గా అరిచాడు.. ఆ వ్యక్తి కళ్ళు... కోపంతో వీర ని తినేశాలా చూశాయి.. వీర సేఠ్ అంకుల్ ని కింద కూర్చోబెట్టి... జేబులో నుంచి పెన్ తీసి.. చేతికిచ్చాడు.. ఆయన కోపం తో పెన్ను విసిరేశాడు..

వీర 'సరే... సైన్ పెట్టను అంటావ్!!! అంతేనా?? ఆయన పెట్టను అనగానే..
వీర ' కాళి అని అరిచాడు...

కాళి ' హా..ఇదిగో అని ఫోన్ ఇచ్చాడు..

వీర ' మంజు..హిరాలాల్ సేఠ్ అని నీకు ఎవరైనా తెల్సా..?

మంజు ' (సిట్యుయేషన్ ఎంటో అంత అర్థం అయ్యింది)..ఎందుకు తెలీదు..నిన్న రాత్రి అంతా నా దగ్గరే ఉన్నాడు గా...

సేఠ్ ' ఏ ఎవరు నువ్వు!?

మంజు ' అప్పుడే మర్చిపోయావా...సరే గానీ వీర ఏం చెప్తే అది చేసెయ్ లేకపోతే ...రేపు నీ ఇంటి ముందు నువ్వు మోసం చేశావ్ అని ధర్నా చేస్తా...చూస్కో మల్ల...

సేఠ్ ' ఆయన టెన్షన్ గా గుట్టుగా బతుకుతున్న.. గబ్బు చేయమకు...సంతకం పెడతా గా...

ఆయన చేసేది ఏం లేక సైన్ పెట్టేశాడు..

వీర ఆ పేపర్స్ తీసుకొని వెళ్ళి పోయాడు..

(అదండి. వీర రుబాబ్... తను అనుకున్నది సాధించటానికి ఎంత దూరం అయినా వెళతాడు... ఇలా బెదిరిస్తాడు కూడా..

బట్ ఎల్లకాలం తను అనుకునేవే జరగవు... ఈయన గారి స్పీడ్ కి బ్రేక్ వేయడానికి... ఒకళ్ళు వస్తారు..)

వీర వెళ్ళాక ఆ మనిషి .. పైనుంచి కిందకి దిగి .

సేఠ్ వైపు అసహ్యంగా చూసి..

రోని గాడి మొహాన నీళ్ళు పోశారు...

రోని నెమ్మదిగా కళ్ళు తెరిచి..

రేయ్! వీరా... నిన్ను... అంటూ పైకి లేచాడు..

ఆ వ్యక్తి 'ఆ వున్నాడు.. నీతో కొట్టించుకోవడానికి. సిగ్గు లేదు... నీకు..

ఐదు లక్షలు తీసుకున్నావ్...చించేస్తా... పొడిచేస్తా... అని...వాడిని చూడు...

""కళ్ళలో పొగరు"""

''ఎవరిని లెక్క చేయని అహంకారం"

రోని 'నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి .. వాడిని కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి...

ఆ వ్యక్తి 'అవును... మరి.. నువ్వు కట్టేసి తీసుకురావడానికి.. వాడేమైన చిన్న పిల్లాడు అనుకుంటున్నావా???

ఈసారి వెళ్ళావే అనుకో...

నిన్ను చంపినా చంపుతాడు..

అవును.. వీడి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్???

రోని 'ఒక తాగుబోతు తండ్రి... ఆయనంటే వీడికి గిట్టదు.

ఆ వ్యక్తి ' పెళ్ళి.. పెళ్ళాం... పిల్లలు???-

రోని 'పెళ్ళా?? వీడికా??? ఆడవాళ్ళకి చాలా దూరం... ఇంట్లో పని కూడా మగవాళ్ళు చేస్తారు....

ఆ వ్యక్తి ' అచ్ఛ చూద్దాం...ఇక నుండి నా ఫోకస్ అంత వీడి మీదే...

........................................................................


ఆ వ్యక్తి అనే క్యారెక్టర్ ని ఇక ముందు ' x ' గా సంభోదిస్తాను...
[+] 12 users Like Avengers35's post
Like Reply
#11
Superb updates bro movie story la undi chala bagundi
Like Reply
#12
Super update
Like Reply
#13
Nice update
Like Reply
#14
Fantastic update bro
Like Reply
#15
స్వప్న వాళ్ళ ఇల్లు...ఆరోజు సండే...సుదీప్ ఇంట్లోనే వున్నాడు .

అందరూ కామ్ గా ఎవరి రూమ్స్ లో వాళ్ళు వున్నారు.. శ్రుతి,స్వప్న డోర్ లాక్ చేసి మరి లాపి లో సినిమాలు చూసుకుంటూ..పడిపడి నవ్వుతున్నారు..

స్వప్న 'అమ్మా! నా వల్ల కాదు శ్రుతి... సౌండ్ చేయకుండా నవ్వటం....

శ్రుతి 'నేను మాత్రం హ.హ.హ. అంటూ నవ్వుతున్నానా???

డాడీ ఇంట్లో వున్నారు కదా!!! అందుకే...

స్వప్న 'ప్స్! ఎంటోనే... పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాము..

నాన్న పెద్దగా నవ్వరు... మరి అవసరం అయితే... హా హా..అంతే

శ్రుతి 'నాకు తెలిసి డాడ్ ఒక్కరే.... వుంటారేమో... ఇలా!!!

స్వప్న 'ఏమో! మనకెలా తెలుస్తుంది... నేనైతే మన నాన్న కాబట్టి ఏమి అనలేను..

అదే ఇంకెవెరైనా ఇలా నవ్వకుండా మొహం పెట్టుకుంటే.. చెవిలో పెద్దగా అరిచి... మరి అడుగుతా??

శ్రుతి 'ఏమని???

స్వప్న 'ఏమయ్యా!!! నీకు దేవుడు.. కళ్ళు ఎందుకు ఇచ్చాడు?? అందాలని, ఆనందాలని, సంతోషాలని చూడటానికి.....నోరు ఎందుకు ఇచ్చాడు??
ఆ కళ్ళకి సమాధానం ఇవ్వటానికి...మనస్సు ఎందుకు ఇచ్చాడు???
అటు కళ్ళని... ఇటు నోటికి... స్పందించమని చెప్పటానికి..

శ్రుతి 'అక్కోయ్! నువ్వు ఒకటి మర్చిపోయావ్??? అట్లా వున్నారు అంటే వాళ్ళకి మనసే లేదని.. స్వప్న కళ్ళు గుండ్రంగా తిప్పుతూ.. 'ఓహో!!!.

శ్రుతి 'అయినా డాడ్ కొంచెం బెటర్... ఈ మీటింగ్స్ లో... పార్టీ లలో నవ్వుతారు... స్వప్న 'మరి మనతో ఎందుకు అలా వుంటారు???

శ్రుతి 'అదేమో... గాని... నీ టూర్ సంగతి అడగవా?? ....ఇంకో వన్ వీకె టైం వుంది...

స్వప్న 'ఎంటో శ్రుతి.. అడగాలంటే ధైర్యం చాలటం లేదు...

శ్రుతి 'హ.హ. డాడ్ ని టూర్ సంగతే అడగలేని దానివి....ఎవరో గన్నాయి ని పట్టుకొని.. కళ్ళు, ముక్కు...అంటూ క్లాస్ ఏం పీకుతావ్??? అంటూ నవ్వింది.

ఈలోపు ఎవరో డోర్ కొట్టారు..

అంతే లాప్ టాప్ లో ఏదో వర్క్ ఓపెన్ చేసి... స్వప్న సైలెంట్ గా కూర్చుంది .

శ్రుతి డోర్ తీసింది..

వాళ్ళ బామ్మ.. లోపలకి వచ్చి...

'మీ ఇద్దరికీ ఒక గుడ్ న్యూస్.... అన్నది.

ఇద్దరూ 'డాడ్ బయటకు వెళ్ళారా??? అని అడిగారు ఒక్కసారిగా..

బామ్మ 'వాడు వెళితే... తలుపు దబదబా బాదేయను..ఇంత చిన్నగా కొడతానా???

స్వప్న 'అయితే గుడ్ న్యూస్ ఏంటి???

బామ్మ 'సాయంత్రం... మీ అత్త ఇంకా మీ మరదలు వస్తున్నారు అనగానే...

స్వప్న బెడ్ మీదనే ఎగిరి....

'అత్త... వస్తోందా... వావ్ అంటూ డాన్స్ చేసింది.. శ్రుతి 'అత్తతో పాటు మీ మరదలు కూడా వస్తుంది అన ఈ డాన్స్???

స్వప్న 'అదేం లేదు... నేను మా అత్త కోసమే... ఈ డాన్స్... అంటూ బెడ్ మీద నుంచి దూకి వాళ్ళ బామ్మని హగ్ చేసుకుంది ..

బామ్మ 'నాకు తెలుసు స్వప్న... నీకు మీ అత్తా... దానికి నువ్వు అంటే లవ్వు ...

శ్రుతి 'అంతేనా చూడటానికి అక్క అచ్చు "అత్త" కి జిరాక్స్ కాపి

బామ్మ 'అంతేకాదు.. మీ మరదలు తన బిజినెస్ మీటింగ్ పని మీద వస్తుంది...

పనిలో పనిగా స్వప్నకి వాళ్ళకి తెలిసిన అబ్బాయి అంట ఎవరో అతని పెళ్ళి గురించి... కూడా మాట్లాడుకుంటున్నారు

అప్పటి దాకా ఆనందంగా వున్న స్వప్న మొహంలో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి..

అది చూసి శ్రుతి 'వాట్ హ్యపెండ్??? ఎందుకు ఫేస్ డల్ గా పెట్టావ్???

స్వప్న 'పెళ్ళి... అంటేను... భయం వేస్తోంది..

బామ్మ 'చూడు... స్వప్న.. ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్ళి చేసుకోని వెళ్ళాల్సిందే...

కాకపోతే.. కేవలం నీకు మాత్రమే దొరికిన ఛాన్స్..

పుట్టింటి నుంచి మళ్ళీ పుట్టింటి లాంటి మి అత్త ఇంటి దగ్గరలో ఉండబోతున్నావ్..

అక్కడ నువ్వు ఏది చెప్తే అది...మీ అత్త,మామ,మరదలు.... ... అందరూ నీ ఫ్యాన్స్.

స్వప్న 'అవునక్కా... యు ఆర్ సో లక్కి....

గౌతమి వచ్చి 'అత్తా! లంచ్ రెడి... పదండి తిందాం.. అందరూ సైలెంట్ గా వెళ్ళారు.. డైనింగ్ హాల్ దగ్గరకి... సుదీప్ కూర్చోని వున్నాడు.. తాతగారు వచ్చి కూర్చున్నాడు. ఇక మన ఆడలేడిఔరత్ లు కూడా వచ్చారు.. గౌతమి అందరికీ వడ్డిస్తోంది... శ్రుతి స్వప్న' కి సైగ చేసింది... అడుగు... అని!!! స్వప్న 'నాన్న! మీతో ఒకమాట.... అది.. మరి..

సుదీప్ ' స్వప్న ! నువ్వు అడగాలనుకుంటున్నావా??? లేక ఎదైనా చెప్పాలి అనుకుంటున్నావా??? అని అడిగాడు యమా సీరియస్ గా..

స్వప్న 'అడగాలి.

తాతగారు, శ్రుతి నవ్వు ఆపుకుంటున్నారు..

స్వప్న వాళ్ళ వైపు చూసి....(నాగార్జున హుమ్మ్)

'మా కాలేజీ లో టూర్ ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. నేను... అది.. నన్ను.. అంటూ ఆగిపోయింది.

అందరూ తినడం ఆపి సుదీప్ వైపు చూశారు ..

టైగర్ బాబు ఏం చెప్తాడా??? అని .

సుదీప్ ఎవరి వైపు చూడటం లేదు... కామ్ గా తింటున్నాడు....

రెండు నిమిషాల తర్వాత..

బామ్మ  ' దీపు..స్వప్న చిన్నప్పటి నుంచి..ఇది కావాలి అని అడగలేదు.. ఫస్ట్ టైం... అడిగింది రా!!! అన్నది...

సుదీప్ వాటర్ తాగుతూ...'అమ్మా! నా సిద్ధాంతాలు మీ అందరికీ తెలుసు..ఆడపిల్లలు పెళ్ళి అయ్యేవరకు... చాలా జాగ్రత్తగా ఉండాలి..

తాతయ్య 'ఓరుకోరా!!! అది వెళ్తా అంటోంది... ఫ్రెండ్స్ తో... కాదు.. కాలేజీ తో.. అందరూ తోడు వుంటారు .

సుదీప్ 'అదే ప్రాబ్లం... అబ్బాయిలు కూడా వున్నారు..

బామ్మ 'అబ్బాయిలు వుంటే ఇంకా సెక్యూర్డ్ గా వుంటుంది ..

సుదీప్ 'అవునవును.. బయట అబ్బాయిల నుంచి వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు.. కానీ వాళ్ళలో వాళ్ళు పోటీ మాత్రం పడతారు..

గౌతమి నోరు మెదపటం లేదు..అలా సెట్ చేశాడు.. దీపు అంకుల్...

ఇంక లాభం లేదని శ్రుతి 'డాడ్!! అక్క కి అన్నీ తెలుసు.. టూర్ కి వెళ్ళినంత మాత్రాన తన లైఫ్ లో మార్పులు ఏమి జరగవు...

సుదీప్ ' శ్రుతి.. విల్ యు.. అంటూ కోపం గా చూశాడు..

శ్రుతి 'ఏమో! డాడ్... మీ రూల్స్... ఒక్కొక్కసారి నాకు మెంటల్ ఎక్కిస్తాయి.

స్వప్న 'ష్!! శ్రుతి అలాగేనా??? మాట్లాడేది అంటూ కోపం గా చూసింది ..

తను కామ్ అయ్యింది..

సుదీప్ 'చూడు స్వప్న!! వీళ్ళ అందరి సపోర్ట్ వున్నంత మాత్రాన నేను ఒప్పుకోను...అది నీకు తెలుసు...
ఇంకో విషయం ..

అత్త వాళ్ళకి తెలిసిన అబ్బాయితో నీ పెళ్ళి ఫిక్స్ చేశా....

ఈవెనింగ్ ఫ్లైట్ కి అత్త,లాస్య ఇద్దరూ వస్తున్నారు..

అండ్ శ్రుతి... నువ్వు కొంచెం పద్ధతిగా వుండటం నేర్చుకో.. అని చెప్పేసి కామ్ గా వెళ్లి పోయాడు...
ఈ దీపు అంకుల్... వున్నాడే... చెప్పాల్సినది స్ట్రైట్ గా మొహం మీద ... చెప్పేస్తాడు..

ఎవరు ఏమనుకుంటున్నారో అని కూడా ఫీల్ అవ్వడు ?

శ్రుతి ఏమో కోపంగా
స్వప్న ఏమో సాడ్ గా

బామ్మ 'ఛిల్! గార్ల్స్... డోంట్ గివ్ అప్.. ఐ హావ్ ఎ ప్లాన్... అంటూ చిన్నగా ఏదో చెప్పింది..

తాతయ్య 'వర్క్ అవుట్ అవుతుంది అంటావా??? అన్నారు అనుమానం గా

గౌతమి అవుతుంది... మావయ్యా... నాకు నమ్మకముంది..

స్వప్న బామ్మ ని హగ్ చేసుకొని.... 'థాంక్యూ... బామ్మా... అన్నది సంతోషంగా..

ఆ రోజు ఈవెనింగ్ సుదీప్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు.. స్వప్న లోపల వాళ్ళ అత్త కోసం వంట చేసే పనిలో పడింది..

ఇంటి ముందు కారు వచ్చి ఆగింది..

ఒక ఆరు అడుగుల కటౌట్... దిగింది.. వాళ్ళ అమ్మతో పాటు గా...

వాళ్ళని గౌతమి రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకొచ్చింది.. శ్రుతి 'అత్తా... అంటూ హగ్ చేసుకుంది.. బామ్మ 'ఎలా వున్నావే సుచి... (సుచిత్ర)... అంటూ దగ్గరికి తీసుకుంది.. తాత 'ఏ లాస్య !!.. టవర్ లా ఇంత ఏదిగవ్ అంటూ లాస్యని పలకరించాడు.

సుచిత్ర 'ఊరుకోండి... నాన్న... మీరు మీ పెటైర్స్... అంటూ చుట్టూ చూసింది..

గౌతమి 'కూర్చో... వదినా నీ కోడలు తనే స్వయంగా వంట చేస్తోంది... నీ కోసం ...

సుచిత్ర 'అయ్యో! నా బంగారాన్ని వంట చేయిస్తున్నారా!! అంటూ కిచెన్ లోకి వెళ్ళింది..

సదరు లాస్య 'హాయ్! శ్రుతి... హౌ ఆర్ యూ.. అని
అని అడిగింది .

శ్రుతి 'ఏ తల్లి నాలుక రాదా??? అని అడిగింది .

లాస్య 'వ్వాట్ .. వ్వాట్... కమ్ ఎగైన్????..

వైషూ 'అదిగో మళ్ళీ... అంటూ నవ్వింది..

లాస్య తాతగారితో 'వాట్.. గ్రాండ్ పా... వై షీ ఈజ్ లాఫింగ్.. అండ్ సేయింగ్.... సమ్ సమ్ అంటూ నాన్చుతుంటే..

తాతయ్య ' లాస్య ... తల్లి అంటే ..

లాస్య 'మదర్...

తాతయ్య 'నాలుక.. అంటే నాలుక చూపించింది..

లాస్య 'టంగ్... ఓ.. మదర్ టంగ్...

శ్రుతి 'హా.. అదే నీ మాతృభాష తెలుగు... అది నీకు వచ్చు.. బట్ ఎందుకో. తెగ కటింగ్ కొడుతున్నావ్...

లాస్య 'నో యార్!! యాక్చువల్లీ... వాట్ ఐ యామ్ సేయింగ్ ఈజ్.... అంటూ ఏదో చెప్తుంది.

లోపల సుచిత్ర అటు తిరిగి వున్న స్వప్న ని వెనుక నుంచి హగ్ చేసుకుంది..

స్వప్న 'అత్తా! అంటూ ఆనందంగా వాటేసుకుంది..

సుచి 'వ్వాట్! మై డియర్ క్యూట్ పై... నా కోసం దిగులు పెట్టుకున్నావా??? ఇలా చిక్కిపోయావ్!!!

గౌతమి 'మరే... నువ్వేమో... వీడియో కాల్ లో తప్ప... రావటం కూడా తగ్గించేశావ్!!!!

స్వప్న అందరికి బాదం మిల్క్ రెడి చేసింది..

అందరూ హాల్ లో కి వెళ్ళారు..

స్వప్న ' హేయ్ లాస్య ఎలా...ఉన్నావ్..

లాస్య గుండె రాగం తప్పింది... (లయ అంటే... రెగ్యులర్ వర్డ్.. ) లాస్య గ్లాసు అందుకుంటూ..

'ఐయామ్... గుడ్ ... స్వప్న... వాట్ ఎబౌట్ యు..

స్వప్న 'అయ్యో! మరదలు లాంటి బావ... చక్కగా తెలుగు నేర్చుకుంటున్నావని చెప్పింది అత్త...

శ్రుతి 'అదేం లేదు అక్కా... ఎన్ ఆరై కదా...తెలుగులో మాట్లాడితే మనం ఫీల్ అవుతాం అనుకుంటుంది..

లాస్య 'నో... యార్... నాకు తెలుగు... క్లారిటీ గా రాదు.. మోర్ ఓవర్ ఐయామ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్..

శ్రుతి (ఐనా  ఇది ఏంటి ....అక్కని చూసి ఇంత బ్లష్  అవుతూ.. ఓవర్ చేస్తుంది... చెప్తా చెప్తా..)

బామ్మ ' లాస్య ' పక్కనే చేరి..

'ఓకే.. మై డియర్ లాస్య.. లెట్ దెమ్ గో... ఐయామ్ విత్ యు...

లాస్య ' థాంక్స్ గ్రాని...అంటూ హగ్ చేసుకుంది...

సుచిత్ర 'అవును...మా టైగర్ బ్రదర్ ఏడి???

గౌతమి 'అర్జెంట్ పని వుందని బయటకు వెళ్ళారు .

సుచిత్ర 'అమ్మా! అన్నయ్య ఇంకా మరడా???

బామ్మ 'వాడు మారడని ఫిక్స్ అయ్యే మేమే మారాం... లాస్య కన్ను ఆర్పకుండా ' స్వప్న నే చూస్తుంది. స్వప్న  అందరు తాగేశాక... కిచెన్ లోకి వెళ్ళిపోయింది.. సుచిత్ర 'అంటే... అన్నయ్య లేనప్పుడు...

తాతయ్య 'భేషుగ్గా... కావాల్సినవి వండుకోవడం.... తినేయడం...

బామ్మ 'వాడు లేనపుడు టివిలో సీరియల్స్, కామెడి షోలు.. వాడు వచ్చే టైం కి భ భక్తి ఛానల్..

గౌతమి 'నాకు అయితే ఆయన్ని చీట్ చేయడం నచ్చేది కాదు.

సుచిత్ర 'ఇవన్నీ నాకు తెలుసు... అంతా ఈ చిన్న దాని ప్లాన్ కదూ...అంటూ శ్రుతి బుగ్గలు లాగింది...

శ్రుతి 'లేకపోతే... ఏంటి అత్తా!!! ఆయన కాలేజీ డేస్ లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని.. జాగ్రత్త పడాలి... కరెక్టే...బట్ ఇలా ఏమి సరదాలు వద్దు..అంటే ఎలా???

అందుకే... నేనే వీళ్ళందరిని చెడ గొట్టేశా... అంటూ కాలర్ ఎగరేసింది..

సుచిత్ర 'మ్... అర్థం అయ్యింది... బట్ మా అన్నయ్య... కాలేజీ రోజుల్లో చాలా సరదాగా వుండేవాడు..

నన్ను నెలకి ఓసారి సినిమాకి తీసుకెళ్ళే వాడు.. నాకు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చి సర్ఫైజ్ లు ఇచ్చేవాడు...

అలాంటిది... సడెన్ గా మారిపోయాడు..

సినిమా కి కాదు కదా... పక్కింటికి కూడా పర్మిషన్ ఇచ్చే వాడు కాదు..


లాస్య 'మామ్! ఐ వాంట్ టు టాక్ విత్ స్వప్న అనింది...

సుచిత్ర ఏం పట్టించుకోలేదు..

గౌతమి ' తను కిచెన్ లో ఉంది వెళ్ళు.. లాస్య..అనగానే లాస్య లేచి హుషారుగా వెళ్ళింది .

శ్రుతి దగ్గు వచ్చినట్లు దగ్గుతూ... 'వాటర్ తాగి వస్తా అంటూ లాస్య వెనకే వెళ్ళింది..

గౌతమి 'నువ్వు పద వదినా రెస్ట్ తీసుకుందువు గాని... అంటూ పైకి తీసుకెళ్లింది.

కిచెన్ లో స్వప్న వంట కంప్లీట్ చేసి..తిరిగి చూసేసరికి లాస్య తననే చూస్తోంది.

లాస్య వెనుక శ్రుతి 'ష్!! అంటూ స్వప్న కి సైగ చేసింది..
స్వప్న 'ఏంటి లాస్య??? అని అడిగింది..

లాస్య ' యక్చ్ వలి... ఐ వాంట్ టు సే సమ్ థింగ్.... అంటూ.. స్వప్న దగ్గరకు వచ్చింది..

స్వప్న వెనక్కి వెళ్ళింది..

లాస్య ' ఈరోజు నువ్వు.. అంటుడగానే.... శ్రుతి లాస్య చేతిని గట్టిగా గిచ్చింది...

స్వప్న,శ్రుతి ఇద్దరూ హై ఫై ఇచ్చుకున్నారు.. లాస్య కోపం గా చూసేసరికి..

శ్రుతి తన నడుముతో లాస్య ని ఒక్కతోపు తోసి..

'ఏం బావా ఐనా మరదలా!!! తెలుగు తన్నుకుంటూ వచ్చింది . అంటూ నవ్వే సరికి..లాస్య కోపం గా....చూసి వెళ్ళిపోయింది..

స్వప్న 'అయ్యో! శ్రుతి లాస్యకి కోపం వచ్చింది. ఇప్పుడెలా??? అన్నది కంగారుగా,

శ్రుతి 'ఏం పర్లేదు... లేకపోతే.. తెలుగు వచ్చి కూడా కటింగ్ కొడుతుంది..ఇంకోసారి ఇంగ్లీష్ లో మాట్లాడని చెప్తా...అంటూ వెళ్లిపోయింది..

               ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||

ఆరోజు నైట్....

కాళి 'వీర' తో...'వీరా!!! సేఠ్ ఇల్లు నీ చేతికి వచ్చేసింది. తరువాత??? ఏం చేయాలని... వీరా 'ఎదో చెప్పాడు .. అది విని కాళి.. 'అవునా??? అన్నాడు ఆశ్చర్యంగా.. 'కాళి' తప్పకుండా.... నువ్వు చెప్పటం నేను చేయకపోవడం... వీర 'సుబ్బు, సింహా ఇద్దరికి కాస్తా గట్టిగా చెప్పు...

వీర 'కాబట్టి.. నువ్వు ఆ పనిలో వుండు...

అవతల వున్న వాడు ఎంత పెద్ద తోపు అయినా... ప్రయత్నించకుండా వెనక్కి రావొద్దని..

కాళి ' ఆ... నేను చెప్తాను.

ఈలోపు బయట గేటు చప్పుడు అయ్యింది.. కాళి లేచి వెళ్ళాడు..ఫుల్ మందు కొట్టేసి..వీర నాన్న

'రేయ్! వీరా... రా! రా! బయటికి. నా.. కొడకా... నేను కంటేనే... నువ్వు పుట్టావ్.. రా!!! ఏం చూసుకొని రా... నీకు అంత బలుపు.. రారా రేరేయి... అంటూ తూలుతూ నిల్చున్నాడు.

కాళి 'ఏంటి? బాబాయ్...ఇది... వాడు ఇంట్లోనే వున్నాడు..

ఆయన 'నాకేమైనా ??? భయమా??? పిలు వాడిని పిలు..

వీర కోపంగా బయటకి వచ్చి "దీని కోసమేగా వచ్చావ్"   అని 'డబ్బుల కట్ట' విసిరి మొహన కొట్టాడు..

ఇంక దొబ్బేయ్... అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.

ఆయన కట్ట అటు ఇటు తిప్పి 'నా కొడుకు... దేవుడు...నాన్నా! వీర... నా బంగారు తండ్రి....
నువ్వు పుట్టడం నా అదృష్టం రా... అంటూ వెళ్లిపోయాడు..

కాళి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.....
[+] 9 users Like Avengers35's post
Like Reply
#16
సినిమా తల తనేలా చాలా అద్భుతంగా ఉంది కథ సూపర్ అప్డేట్ bro
Like Reply
#17
అప్డేట్ చాల బాగుంది
Like Reply
#18
Katha baagundi
Like Reply
#19
స్వప్న వాళ్ళ రూమ్ లో... అందరూ టివి లో సాంగ్స్ చూస్తున్నారు.. లాస్య మాత్రం... స్వప్న' నే చూస్తుంది... ఈలోపు సాంగ్.. గుంటూరు కారం లోది.. ' కుర్చీ మడతపెట్టి అంటూ మొదలైంది.. అంతే శృతి పాప కి ఉత్సాహం తన్నుకొచ్చింది.. లేచి డాన్స్ మొదలు పెట్టింది.

సోకులాడి స్వప్న సుందరి..
నీ మడత చూపు మాపటేల మల్లె పందిరి..
రచ్చరాజుకుందె ఊపిరి..
నీ వంకచూస్తే.. గుండెలోన డీరి డిరి,డిరి..
తూనీగ నడుములోన తూటాలెట్టీ..
తుపాకీ పేల్చినావే తింగరి చిట్టీ..
మగజాతి నట్ట మడతపెట్టి..

ఆ కుర్చీని మడత పెట్టి…


విజిల్ వేసుకుంటూ డాన్స్ ఓ రేంజ్ లో .. వేస్తోంది... సుచిత్ర కూడా లేచి వేయడం మొదలు పెట్టింది.. ఇద్దరూ కలిసి స్వప్న ని ... తరువాత గౌతమిని లాగారు. ఈ ఆడలేడిఔరత్ లు చేస్తుంటే. బామ్మ కూడా లేచింది.. లాస్య కి తెలుసు... బట్ చూడటం ఇదే మొదటి సారి .

నోరు తెరుచుకుని... చూస్తుంది... వాళ్ళ డాన్స్ అలా వుంది మరి.........

వాళ్ళంతా తీన్ మార్ స్టెప్పులు వేయడం స్టార్ట్ చేశారు.. తాతయ్య విజిల్స్..... ఫుల్ గా... లాస్య వాళ్ళ అమ్మని చూసి మరీ షాక్... ఆ సాంగ్ అయిపోవచ్చింది అనగా.. స్వప్న రూమ్ లో. ఇంటర్ కమ్ రింగ్ అయ్యింది... అంతే ఛానెల్ చేంజ్... 'భక్తి ఛానెల్.... కీర్తనలు వస్తున్నాయి.. అందరూ కామ్... సుదీప్ లోపలికి వచ్చాడు.....

లాస్య కి తెలిసినా కామ్ గా చూస్తుంది..

సుదీప్ 'సుచీ ఎలా వున్నావ్??? అని అడిగాడు. సుచిత్ర 'ఆ... అన్నయ్యా... నేను బాగున్నాను.. నువ్వు???

సుదీప్ 'మ్... ఓకె... అంటూ లాస్య వైపు చూశాడు....

సుదీప్ "గుడ్..... అంటూ లాస్య ఒకసారి రా నీతో మాట్లాడాలి...

లాస్య ' హా మామయ్య....అని ఇద్దరు వెళ్ళిపోయారు...

'అందరూ కళ్ళతో 'అబ్బో... అంటూ సైగ చేసుకున్నారు..

శృతి వీళ్ళ వెనకే వచ్చింది.. వీళ్ళు ఏం టాకింగ్ చేసుకుంటున్నారా??? అని

బయటే ఆగి ఓ చేవి వేసింది....
               
సుదీప్ ' అహ్ అబ్బాయి ఏం అంటున్నాడు..??

లాస్య ' తనకు మన ఫ్యామిలీ,మీ పెంపకం,క్రమశిక్షణ అన్ని బాగా నచ్చాయి అంట...ఇంకా చెప్పాలి అంటే మీరు ఒప్పుకుంటే తన ఆఫీస్ ని కూడా ఇండియాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు...

సుదీప్ ' ఆఫీస్ గురుంచి తరవాత...ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంత రి-చెక్ చేశావ్ కాదా??

లాస్య ' హా మామయ్య..

సుదీప్ ' నీ మీద,మీ అమ్మనాన్న ఉన్నారన్న నమ్మకంతో అంత దూరం పంపుతున్న...

లాస్య ' స్వప్న కి ఏ ఇబ్బందీ రాకుండా చూసుకునే బాధ్యత నాది..!

శృతి (అమ్మా.. నా డాడియో లాస్య టవర్ మీద అంత నమ్మకమా !! బట్ అక్కని మాత్రం అడగలేదు.. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ )

చెప్తా... చెప్తా.. ఈ యన్.ఆర్.ఐ సంగతి.. అంటూ వెళ్ళిపోయింది..


                 |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||

రాత్రి టైం:12.30...

ఒక ఫారెస్ట్ ఏరియాకి 5 కిలో మీటర్ల దూరంలో..

వీర, కాళి డైమండ్స్ కోసం వేయిటింగ్.

కాళి 'ఆ రోని గాడి గ్యాంగ్ మన మీద కోపం పెంచుకుంది.. మన మీద గట్టి నిఘా వేశారంట... వీరా.. అనగానే

వీర సీరియస్ గా.. "మ్...".

కాళి 'ఆ సేఠ్ కూడా భయపడి.. సైన్ చేశాడు....కానీ... తను కూడా గట్టిగానే పగ పట్టాడేమో... అనిపిస్తోంది.

వీర ' హ్మ్మ్....

కాళి 'మనక్తి ఆదాయంతో పాటు శత్రువులు పెరిగిపోతున్నారు... వీరా...

వీర 'ఓహో.

కాళి 'ఏంటి వీరా!!! ఏం చెప్పినా మ్.... మ్.... అంటావే గాని. ఒక్కదానికే సమాధానం చెప్పవే... అన్నాడు కొద్దిగా చిరాగ్గా..

వీర 'ఇప్పుడు ఏం అంటావ్??? అన్నాడు అంతకన్నా చిరాగ్గా..

కాళి 'ఏమంటాను??? ఎంతసేపు నువ్వు చెప్పిందే మేము వినాలంటే కాదు....అప్పుడప్పుడు మేము చెప్పేది నువ్వు కూడా వినాలి... అంటాను.

వీర 'చూడు కాళీ!!! నువ్వు ఏం చెప్పాలన్నా తరువాత.. ఇప్పుడు నా దృష్టి అంతా ... అంటూ ఆపాడు..

కాళికి అర్థం అయ్యింది.

(ఇక్కడ వీర దృష్టి కేవలం తను వచ్చిన పని మీదనే వుంది . ఇది గుర్తు పెట్టుకోండి...)

కాసేపు తరవాత...

దూరం నుంచి సెల్ఫోన్ లో టార్చ్ వెలుగు కనపడి ఆగిపోయింది. (సిగ్నల్ అన్నమాట Smile

వీర 'వాళ్ళు వచ్చారు... ఆ బ్యాగ్ ఇటివ్వు... అంటూ క్యాష్ బ్యాగ్ తీసుకొని... వాళ్ళ వైపు వెళ్ళాడు..

దాదాపు దగ్గరకు వెళ్ళేసరికి.. అనుకోకుండా ఒక సుమో వచ్చింది...పదిమంది దిగారు...

అంతే వీర వెంటనే అలెర్ట్ అయ్యి.. పక్కనే ఉన్న చెట్లలోకి జంప్ చేశాడు...

అవతల పార్టీ కూడా... కామ్ గా... చెట్లలో దూరారు..

కాళి 'ఇదేంటి?? ఎవరు వీళ్ళు?? ఏం సౌండ్ లేకుండా సైలెంట్ గా వచ్చారు...

వీర గన్ తీసి కొంచెం పైకి లేచాడు...

వచ్చిన వాళ్ళలో ఒకడు చుట్టూ చూస్తూ.

ఆ వీర ఇక్కడికే రావాలే... మనకి షేర్ చేసిన లొకేషన్ కూడా ఇదేనే.... అనగానే.

వీర కోపంగా రాబోతుంటే...సెల్ఫోన్ వైబ్రెట్ అయ్యింది...

వీర లిఫ్ట్ చేయగానే..

కాళి 'వీరా!! వచ్చిన వాళ్ళు ఎవరో అనుకొని ఎటాక్ చేయబోతున్నావ్!???

జాగ్రత్త....వాళ్ళు డిపార్ట్మెంట్ ఏమో అని నాకు డౌట్ వస్తోంది.. అని కాల్ కట్ చేశాడు.

వీరా కామ్ అయ్యి అక్కడే ఆగాడు..

వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు..

ఇప్పుడే కదిల్లేటుగా అనిపించలేదు.

వీరా కి అసహనం పెరిగిపోతోంది..ధైర్యం చేసి వాళ్ళ ముందుకి వెళ్ళగలడు.

ఒకవేళ కాళి చెప్పినట్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే.కొంచెం కష్టం...
ప్చ్...అనుకుంటూ చేసేది లేక వెనక్కి వచ్చాడు...

అలాగే చెట్ల మధ్యలో నుండి దూరి....నెమ్మదిగా కాళి దగ్గరకు వెళ్ళాడు.

కాళి 'వీళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.. వీరా!! లేకపోతే కరెక్ట్ గా ఇదే స్పాట్ కి ఎలా వస్తారు??

వీర ' హ్మ్....

అవతల పార్టీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా లేదు.. వీర ఫోన్ కన్నా తన మైండ్ ని నమ్ముతాడు..

వీర 'ఒకపని చేయి... అంటూ ఎదో చెప్పాడు.. అది విని కాళి 'సరే' నంటు వెళ్ళి పోయాడు.. ఒక పావుగంట తర్వాత...

ఒకవ్యక్తి ఆ సుమో లో వచ్చిన వాళ్ళకి దగ్గరగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు...

వాళ్ళు చూశారు.. ‘అందులో ఒకతను 'రేయ్!! అనగానే....అతను ఆగాడు...

అతను వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు..

'ఎవడ్రా! నువ్వు!? ఈ టైం లో ఎక్కడికి??? అని అడిగాడు కోపం గా..

అతను 'మాది పక్క వూరే.. నేను అవతల రామచంద్రపురం లో వున్న కెమికల్ ఫ్యాక్టరీ లో పని చేస్తూ వుంటానండి..

అతను 'నీ పేరు?? అని అడిగాడు అనుమానంగా..

" సుదర్శన్...

' నీ ఐడి ఎది???

'నేను ఈ మధ్యనే చేరానండి... ఇంకా ఇవ్వలేదు.

నిజమేనా??

నిజమేనండి... కావాలంటే మీరు రేపు రండి... నేను కనపడతాను.

సరే కానీ... నువ్వు రోజూ ఇటే వెళ్తావా???

అవునండి..

ఇక్కడ ఎప్పుడైనా ఇల్లీగల్ పనులు జరగడం చూశావా??

అంటే?? ఏంటండి...

' అంటే స్మగ్లింగ్...

లేదండి.... ఇక్కడ అలాంటివి ఎప్పుడు జరగలేదు..

ఖచ్చితంగా తెలుసా???

తెలుసండి... మీరు అడుగుతుంటే గుర్తొచ్చిందండి.. ఇక్కడ నుంచి 5 కిమీ దూరంగా ఫారెస్ట్ ఏరియా... వస్తుంది బహుశా అక్కడ జరగొచ్చు అని విన్నానండి.

అంతే అందరూ అలెర్ట్ అయ్యి... సుమో ఎక్కారు..

స్టార్ట్ చేయగానే....ఒకతను 'రేయ్! ఎందుకైనా మంచిది నువ్వు మాతో రా!!

అతను కంగారుగా 'మా ఆడోళ్ళు ప్రెగ్నెంట్ అండి... నేను తొందరగా  వెళ్ళాలి...అనగానే

అతను 'సరే పోరా!!! అన్నాడు....

సుమో వెళ్ళి పోయాక.

వీర ఫాస్ట్ గా వెళ్లి వాళ్ళని కలిసి డైమండ్స్ తీసుకున్నాడు..

నెక్స్ట్ డే మార్నింగ్..

త్రినాధ్ దగ్గరకు వెళ్ళాడు.

తను వెళ్ళేసరికి రోని 'త్రినాధ్' కి ఏదో చెప్తున్నాడు.

వీర కోపం గా వచ్చి రోని గుండెల మీద బలంగా ఒక తన్ను తన్నగానే.. వాడు సోఫాతో సహా కింద పడ్డాడు.

పాపం త్రినాధ్ అంకుల్ కూడా పడ్డాడు సోఫాలో కూర్చున్నాడు గా మరి...

………….. ఇద్దరూ నెమ్మదిగా పైకి లేచారు..………

(బాబు వీరా!! కొట్టమన్నా కదా అని.. అంత గట్టిగా కొడతావా • _ • )

రోనీ కోపంగా వచ్చి వీర షర్ట్ పట్టుకున్నాడు..

వీర కోపంగా... చేతిని పట్టుకున్నాడు .. త్రినాధ్ అంకుల్ నడుము సాఫ్ చేసుకుంటూ వచ్చి...

'ఇద్దరిని విడదీయాలని చూశాడు....పాపం అవ్వలేదు..

ఆయన 'ఏమైంది??? ఎందుకు కొట్టుకుంటున్నారు?? అని అడిగాడు.. కోపం గా..

రోని 'నువ్వు చూశావ్ గా!!! ముందు వీడే... నన్ను కొట్టాడు... అంటూ వీర చేతులని గట్టిగా విదిలించాడు..

వీర 'రాత్రి నువ్వే కదరా... డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్....

రోని 'నేనా?? అంటూ కోపం గా మీదకు రాబోతుంటే...

వీర 'త్రినాధ్' తో... అయినా ఈ ముండ తో నాకు మాటలు అనవసరం...

నీకు వాడో, నేనో ఒక్కడే ... ఎవరో తెల్చుకో... అన్నాడు కోపంగా..

రోని 'చూశావా!! నీ ముందే... నన్ను ఎన్ని మాటలు అంటున్నాడో... అయినా నువ్వు వాడికే సపోర్ట్ చేస్తావ్... అంటూ త్రినాధ్ కేసి సీరియస్ గా చూశాడు..

ఆయన 'మీ ఇద్దరూ ఏమైనా అనుకోండి...

నాకు మీ ఇద్దరూ సమానమే.. వీర నువ్వు ...' డైమండ్స్ ' లో నెంబర్ వన్.. రోని నువ్వు 'డ్రగ్స్' సప్లై లో నెంబర్ వన్.. మీ ఇద్దరూ ఎంతో తెలివితో..

చాలా కష్టపడి... సమర్థవంతంగా... పని చేస్తారు.. కానీ మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు... నాకు అదే అర్థం కావటం లేదు..

మీ ఇద్దరూ చేతులు కలిపితే మనకు చాలా లాభం. అని ఇద్దరి-వైపు చూశాడు.

వీర  ......

రొని ' ......

వీర 'చూడు... నేనేమి నీ కింద పని చేయడం లేదు.. నువ్వు చెప్పినట్లే చేయడానికి... అంటూ తను తెచ్చిన డైమండ్స్ తీసి ఇచ్చాడు..

త్రినాధ్ కౌంట్ చేసి..

'మ్... గుడ్... అవును ఏంటి??? అన్నావ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారా??? నిన్ను చూశారా? ఎలా తప్పించుకున్నావ్??? అని అడిగాడు ఆత్రం గా..

వీర 'అదంతా నీకు అనవసరం... వీర మాట ఇచ్చాడంటే.. అంతే... నా ఎమౌంట్ ఇస్తే నేను వెళ్తా... అనగానే..

త్రినాధ్ 'అది కాదు వీరా.. చెప్పేది విను.. రోని కూడా నీలాగా తెలివైనవాడు....ఇద్దరు కలిసి నా కింద పని... అంటుండగానే..

వీర 'ఓయ్! నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా??? నన్ను ఎవరితో పోల్చకు...నాకు నేనే... అంటూ రోనికి వేలు చూపించి వెళ్ళిపోయాడు....

వీర వెళ్ళగానే... రోని

"చూశావా!! దాదా వాడి పొగరు... అయినా ఏముందని వాడు అంటే అంతలా పొంగిపోతావ్!!!

నాకు వాడు నచ్చడు...కావాలనే నా దారికి అడ్డు వస్తున్నాడు...నీ మొహం చూసి వదిలేశా!!!! అనగానే..

త్రినాధ్ 'భయం అని చెప్పారాదు... అంటూ పక్కకి చూశాడు..

రోని 'ఏంటి భయం!!! వాడా!? నాకా!?... అంటూ పైకి లేచి.. వెళ్తా అనగానే..

త్రినాధ్ 'అసలు విషయం చెప్పకుండా ఎక్కడికి వెళ్తావ్?

రోని 'ఏంటది! అని అడిగాడు నొసలు చిట్లిస్తూ..

'త్రినాధ్ 'సెక్యూరిటీ ఆఫీసర్లకి ఇన్ఫామ్ చేశావా??? అని అడిగాడు సీరియస్ గా........

రోని 'ఏం మాట్లాడుతున్నావ్ దాదా... వాడు ఏదో వాగేస్తే.. నువ్వు ఎలా నమ్మావ్???

నేను ఎందుకు ఇస్తాను???

వాడు దొరికితే.... నువ్వు దొరికినట్లేగా!!!!

నువ్వు దొరికితే... నేను కూడా... అన్నాడు ఉక్రోషంగా..

త్రినాధ్ 'చూడు రోని... చెప్పింది వీరా కాబట్టి నమ్మాను... అది అబద్దం అయితే... మాత్రం ....నా చేతిలో నువ్వు చావడం ఖాయం... అనగానే.

రోని కోపం గా గొణుక్కుంటూ వెళ్ళి పోయాడు...
[+] 12 users Like Avengers35's post
Like Reply
#20
Superb updates interesting
Like Reply




Users browsing this thread: 1 Guest(s)