Thread Rating:
  • 7 Vote(s) - 1.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica నేను.. నాలోని భావాలు...
#1
ఎంత మార్చిపోదాం అనుకున్నా గుర్తుకు వస్తునే
ఉంది తనూ... ఉదయం అంతా బానే ఉంటుంది.. సాయంత్రం అవగానే ఎక్కడ లేని నీరసం భాధ కోపం అంత వస్తుంది.
 కానీ ఎవరీ మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ....
చిన్నపాటి నుండి ఒంటరిగా ఉండటం  ఇష్టం. .అదే ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది.. నా జీవితంలో నేను అనుకోని,ఊహించని సంఘటనలు రెండు జరిగాయి. అందులో ఒకటి నేను ప్రేమించిన.. నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి నన్ను వదిలేసిన రోజు...
ఇంకోటి నా హీరో మా నాన్న మరణం ....
మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం.. ఇష్టం కన్నా పిచ్చి అనొచ్చు...దాదాపుగా అబ్బాయిలా అందరికి వాళ్ల నాన్ననే హీరో కదా..
ముందుగా తన గురించి..


ఇప్పటికి తనకి పెళ్లి అయ్యి సరిగ్గా ఈ మార్చి 25 కి 5 సంవత్సరాలు... 
తనని చూసి దాదాపుగా  2 సంవత్సరాలు అవుతుంది.. రోజులు చాలా వేగంగా గడిపిపోతున్నాయి...
ఓ తన పేరు చెప్పలేదు కదా హాసిని ... 
నేను  చిన్నప్పటి నుండీ ఒకటే అనుకుంటూ ఉండేవాడిని . పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్ తప్పా ఎరేంజ్ మ్యారేజ్ వద్దు అని. దానికి బలమైన కారణం కూడా  ఉంది . 
అదే మా అమ్మా నాన్న... వాళ్ళది కూడా ప్రేమ వివాహమే ....  కానీ ఇప్పుడు  నాకు పెళ్లి అంటేనే బయం చిరాకు కలుగుతుంది..
 నేను నా లైఫ్ లో ఇంత వరకు ఏ అమ్మాయిని కూడా ఇష్టపడలేదు .. ఒక్క తనని తప్ప చిన్నప్పటి నుండి కూడా .. 
ఇప్పటికీ నా ఫ్రెండ్స్ లో చాల  మందికి పెళ్ళీలు అయ్యాయి అందరు హ్యాపీగా ఉన్నారు ... నేను ఒక్కడినే పిచ్చోడి లాగా ఉన్నా... 
నాలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేక పోతున్న .. 
అమ్మ కి చెల్లి కి చెప్పలెను.. నాకు ఉన్న  ఒకే ఒక్క ఫ్రెండ్ కి  కూడా మొన్న చెప్పా తాగుతూ  ఇలా ఇలా అని అర్థం చేసుకుంటాడు అనుకుంటే వాడే ఇప్పుడు నన్ను  పిచ్చోడి లా చూస్తున్నాడు...
అందుకే సెక్స్ కి అలవాటు అయిపోయా.... కానీ ఎంత అలవాటు అయిన ఒక మనిషి తో ఉండే అనుబంధం ముందు ఇవన్నీ ఎంత అండి..
అంత మర్చిపోయి ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడుల్లా తను ఏదో ఒక విధం గా కనిపిస్తుంది ..
రోడ్డు మీద, బోర్డు మీద , షాప్ కి వెళ్దాం అని చూస్తే ఆ షాప్ పేరు కూడా తనదే అయి ఉంటది ... ఆ పేరు చూడగానే మొఖం లో ఒక చిన్న నవ్వు..
నాకు అర్ధం అవుతుంది.. నా జీవితం లో ఏం జరుగుతుందో ఇలానే ఉంటే ఏం అవుదో అని కానీ ఏం చేయలేని పరిస్థితి ...
మీరూ  '96' మూవీ చూసే ఉంటారు ... ఆ మూవీ  కొంచెం అటు ఇటు గా జీవితం లానే ఉంటుంది ... అందునా నాది కూడా కాలేజ్ లవ్ కదా.. అందులో హీరో హీరోయిన్ ఒక రూం లో ఉండి అన్ని మాట్లాడుకుంటారు కదా..
 అలా నా జీవితం లో ఒక్క రోజు అయిన  జరిగితే బాగుండు అని అనుకొని రోజు లేదు ...
తన  పెళ్లి జరిగినప్పుడు 19 ఇయర్స్ నాకు జాబ్ లేదు .. 
చదువూ లేదు అప్పుడే ఇంటర్  చదువుతున్న అంతే ...
జాబ్ అంటే డెకరేషన్ చేసేవాడిని కొంచెం కొంచెం ఏదో పాకెట్  మనీ కోసం  అంతే..
తనకి పెళ్లి అని తెలియగానే చాలా బయం కోపం.. సరిగ్గా తినే వాడిని కాదు ... ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు ... 
డెకరేషన్ చేసుకుంటూ అక్కడే ఉంటూ ఏదో ఒకటి తింటూ ఉండేవాడిని ..  ఈ గ్యాప్ లో తనకి పెళ్లి జరిగిపోయింది ...
అప్పటినుంచే తాగడం కూడా అలవాటు అయ్యింది ... రోజు తాగడం పని ఉంటే వెళ్ళడం .. లేకపోతే పడుకోవడం ... ఇదే పని ...
అలా ఒక 3 ఇయర్స్ గడిచాయి ...తన జ్ఞాపకాలతో బతికేస్తు ఏ రోజు కూడా ఒక్క అమ్మాయి ని కూడా సరిగ్గా చూసేవాడిని కాదు .. 
అందునా నేను ఇంట్రోవర్ట్  అవడం వల్ల ఎవరికి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు .. నేను నా లోకం అంతే .. ఈ 3 ఇయర్స్ లో తనని ఒక్కసారి కూడా చూడలేదు ..
 చూడలేదు అనడం కన్న తను కనిపించలేదు ... ప్రతి దసరా కి తన ఇంటి దగ్గర గుడి కి వెళ్లి చూసే వాడిని .. తను కనిపిస్తుంది ఏమో ఈరోజు అయ్యిన అని  ..   ఈ ఒక్క పండగ కోసం ఇయర్ మొత్తం ఎదురు చూసే వాడిని..అలా ఆరోజు ఒక్కసారి  అయినా తనని తనివి తీరా చూసీ వద్దాం అనుకున్న ప్రతిసారి నాకు నిరాశ ఎదురైంది...
  కానీ వల్ల అమ్మ చెల్లెలు అందరు కనిపించే వాళ్ళు ... 
అలా తన కోసం  చూస్తూ చూస్తూ రాత్రి 11 గంటల దాకా అక్కడే  ఉండేవాడిని .. ఇక రాలేదు అని మళ్ళీ ఒక బాటిల్ మందు తీసుకొని చెరువు దగ్గర కూర్చొని తాగుతూ ఉండేవాడిని ..
అలా రోజులు గడుస్తున్నాయి...
ఒక రోజు సడెన్ గా ప్రోగ్రామ్ వచ్చింది .. సంక్రాంతి  పండగ అని లైటింగ్ , డెకరేషన్ కావాలి అని .. మామూలుగా అయితే నేను వెళ్ళే వాడిని కాదు.. కానీ ఆరోజు ఇద్దరు పనికి వచ్చే వాళ్ళు రాలేదు ... 
ఇక సరే అని నేను వెళ్లి సామాన్లు దించి పని చేస్తూ ఉన్నాం అందరం ...
నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు 2022 జనవరి 13 తారీఖు ...
నేను  స్టూల్ ఎక్కి పనిచేస్తున్న మొబైల్ అదే పనిగా మొగుతూ ఉంది .. నేను కంపెనీ కావచ్చు అని లిఫ్ట్ చేయకుండా అలానే పని చేస్తున్న.. 
ఒక రెండు సార్లు ఫోన్ వచ్చింది .. నేను పట్టించుకోకుండా అలానే పని చేసి ఒక అరగంట కిందికి దిగి టైం ఎంత అయ్యిందో చూసుకుందాం అని ఫోన్ ఓపెన్ చేస్తే రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి.. 
ఏదో కొత్త నెంబర్ సరే అని కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది .. సరే అని వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే ఇంతక ముందు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నెంబర్ నుండే మెసేజ్ వచ్చింది.. అందులో నేను ఇంకా గుర్తు ఉన్నానా నాని .....
మీ  ఇంటికి వెళ్తే మీ అమ్మ నెంబర్ ఇచ్చింది. . ఈ నెంబర్ కి కాల్ చేయకు నేనే  వీలు చూసుకొని మెసేజ్ చేస్తా అని ఉంది ...
ఆ మెసేజ్ చూడగానే అక్కడే కిందపడిపోయి కూర్చున్న ....



ఇది సెక్స్ స్టోరీ కాదు.. ఇది నా  నిజ జీవితం లో జరిగిన కొన్ని మధుర జ్ఞాపకాలు ... అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్న ... రేటింగ్ కోసం రివ్యూ కోసం ఈ కథ రాయట్లేదు...  మీ అందరికీ చెప్పాలి అని రాస్తున్న ...తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి... Namaskar
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good start
Like Reply
#3
Nijame bro......life lo chala ante chala problems, situations vastai..mana tho close ga vunna vaala tho ina share chesukolem....
Mana gurunchi ami telini oka stranger tho cheppu kunte konchem ina badha anedhi taggutundhi...
Like Reply
#4
Nice start
Like Reply
#5
I can feel you bro ?????
Like Reply
#6
అలా మెసేజ్ వచ్చిన తరువాత నాకు అసలు ఏం అర్ధం అవలేదు ఒక గంట పాటు ఆ మెసేజ్ చూస్తూ అలానే కూర్చుని ఉండిపోయా .ఇలా కూర్చుంటే పని అవధు అని లేచి పని మొత్తం అవగొట్టేసా. మధ్యానం నుంచి చూస్తూనే ఉన్న మొబైల్ వైపు తను మెసేజ్ ఏమైనా చేసింది ఏమో అని .. కానీ ఒక్కసారి కూడా లేదు అలా చూస్తూ చూస్తూ నైట్ అయిపోయింది ... ఇంటికి వచ్చి పడుకున్న తినాలి అనిపించలేదు ... మళ్ళీ మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకొని ఈరోజు ప్రోగ్రామ్స్ ఏం లేవు అని ఇంట్లోనే పాడుకొని ఉన్న... ఎప్పుడు మెసేజ్ వస్తుందా అని ... సరిగ్గా అప్పుడే మధ్యానం 2:25 కి మెసేజ్ వచ్చింది ... టింగ్ అంటూ టక్కున ఫోన్ తీసుకొని చూసా ...
చూస్తే తనే .. హెల్లో అంటూ మెసేజ్ చేసింది ..
తను: ఎలా ఉన్నావ్.. రా ..

నేను: ఉన్నాను అంతే... నువ్వు ఎలా ఉన్నావ్ ..

తను: బానే ఉన్నాను.. తిన్నావా..

నేను: హ ఇప్పుడే తిన్నాను..

తను: హ్మ్ సరే .. ఈ మెసేజ్లు అన్ని తరువాత నాకు నీతో మాట్లాడాలి అని ఉంది.. కాల్ చేస్తున్న మాట్లాడు ...

నేను: అది కాదే ఇప్పుడే కదా మెసేజ్ చేసింది అప్పుడే కాల్ ఎందుకు మెల్లిగా మాట్లాడొచ్చు గా ....

తను: ఎరా ఆటలు గా ఉందా .. మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నీ నెంబర్ అడిగి తీసుకొంది.. నితో చాట్ లు చేస్తూ కూర్చోడానికి కాదు..

నేను : అవునే కానీ ..

తను: కానీ లేదు గీని లేదు.. అప్పటికే చాలా భయం అయింది ఎక్కడ మీ అమ్మ మా వాడి నెంబర్ నీకు ఎందుకు నికే ఏం అవసరం అని అటుంది అని ... నన్ను అదోలా చూస్తు ఇచ్చింది ..

నేను: (నవ్వుతూ) ఆవునా..

తను: ఎందుకు నవ్వుతున్నావ్..

నేను : నవ్వు ఆపుకుంటూ లేదే నవ్వలేదు .. నిజం గా ..

తను : సరే కాల్ చేస్తున్న లిఫ్ట్ చేయ్..

నేను: కాల్ వస్తుంది .. మొబైల్ సైలెంట్ లో ఉంది ...వైబ్రేట్ అయ్యి అయి ఆగిపోయింది ....

తను : మళ్ళీ మెసేజ్ చేసింది .. రేయ్ ఏమైంది... కాల్ లిఫ్ట్ చేయ్ అన్నాను గా ...

నేను: అరె ఉండవే ... ఇంట్లో ఉన్న అందరు ఉన్నారు ..

తను : ఉంటే ఉండనివ్వు ... కాల్ మాట్లాడాలి అంటే కూడా భయమా..

నేను: మరి కాద... అయినా ఇంత ధైర్యం ఎక్కడిది నీకు... ఈరోజు ఇలా చేస్తున్నావ్ ...

తను : ఇన్ని రోజులు ఇలా ధైర్యం గా లేకనే ఇలా అయిపోయింది నా జీవితం ...

నేను : ఏ ఇప్పుడు ఏమైంది అని చెప్పు...

తను : నీకు తెలీదా ఏమైందో.. నా జీవితంలో ..

నేను : తను ఏడుస్తుంది అని అర్థం అయ్యింది ... నాకు కానీ ఏం చేయలేని పరిస్థతి.

తను : ఏమైంది మాట్లాడు .. అలా బెల్లం కొట్టిన రాయి లా ఉంటావే...

నేను: ఆ ఆ చెప్పు.. ఏం చేస్తున్నావ్ ...

తను : ఏం లేదు ఇప్పుడే పని అంతా పూర్తి అయ్యింది ... ఇక నీతో చాట్ చేస్తున్న ...

నేను : నీతో అంటే నేను ఎవరిని ... ?

తను : ఏ నీకు తెలీదా...

నేను: తెల్సు కానీ నీ నోటితో అంటే ఇంకా బాగుంటుంది అని....

తను : ఆ ఆశ దోష అప్పడం వడ...

నేను: అప్పడం వడ లేదు కానీ దోష అయితే ఉంది తింటావా ... పల్లి చట్నీ కూడా ఉంది ...

తను: ఏంటి జోక్ ఆ ... అసలు నవ్వు రాలేదు ...

నేను : సరేలే ఇంకా ... అవును మర్చిపోయావా.. మాట్లాడతా అన్నావ్ ...

తను : అవును కదా నీతో మాటల్లో పడి మర్చిపోయా ..
చేస్తున్న చూడు....

నేను : నాకు ఏమో ఫుల్ భయం గా ఉంది .. గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకోoటుంది... చాలా రోజుల తరువాత తన తో మాట్లాడుతున్న ....

అంతలో వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చింది .. ఎవరా అని లిఫ్ట్ చేశా ...
ఆ బాబు లైన్ లో ఉండు తనకి కాల్ చేస్తున్న ..
అని హోల్డ్ లో పెట్టింది ...

నాకు ఏం అర్ధం అవట్లె అసలు ఈమె ఎవరూ ఎవరికీ కాల్ చేస్తుంది ... అది ఏమైనా ప్లాన్ చేసిందా నా మేధా.. అని ఒక్కసారి గుండె జల్లు మంది..
అంతలోనే హెల్లొ రేయ్ ఉన్నావా అని పిలుపు....

నేను : ఆ ఉన్న అసలు ఏం జరుగుతుంది నాకు ఏం అర్ధం కావట్లేదే..

తను : ఏం లేదు రా నేను నీతో ఫోన్ మాట్లాడడం ఇంట్లో చూసి ఆయన కి చెప్తే గొడవ అవుతుంది ... అందుకే ఇలా సెట్ చేశా .. ఇప్పుడు చెక్ చేసినా పిన్ని తో మాట్లాడుతున్న కాబట్టి ఏం కాదు ...
ఏలా ఉంది నా ప్లాన్ ..

నేను : నీకు ఇంత తెలివి ఎక్కడ నుంచి వచ్చిందే తల్లి ... లవ్ లో ఉన్నప్పుడు ఈ తెలివి చూపించి ఉంటే ఇప్పటికీ మనకి ఒక పాపో బాబో ఉండేవాళ్ళు ...

తను నవ్వుతుంది.. చిన్నగా..

నేను: అవును మనం మాట్లాడేది మీ పిన్ని వింటుందా ..

తను: చి .. లేదు ఫోన్ పక్కన పెట్టేస్తుంది. ..

నేను : అవునా.. ఒకే ఒకే..

తను: ఇంకా మరి ... నీతో మాట్లాడాలి అని ఎప్పటినుంచో ట్రీ చేస్తున్న.. చాలా సార్లు మీ ఇంటికి వద్దాం అని ట్రై చేశా ... కానీ కుదరలేదు ... ఆ రవళి మౌనిక అనుష కవాళ్ళకి కూడా చెప్పా .. మీ ఇంటికి వెళ్లి నీ నెంబర్ తీసుకోమని ...
కానీ వాళ్ళు ఎవరు రాలేదు మీ ఇంటికి. ..

ఇకా నేనే ఉండలేక ఏమైనా జరగని అని ఇంటికి వెళ్ళ...
నువ్వు ఉంటావ్.. నిన్ను చూద్దాం అని వస్తే నువు ఏమో పనికి వెళ్లవ్.. ఇక కాసేపు ఉండి మీ అమ్మ నీ నెంబర్ అడిగా.
.. కాల్ చేద్దాం అనుకున్న కానీ టైం లేదు అందుకే మెసేజ్ చేసి మొబైల్ ఆఫ్ చేసి మళ్ళీ బస్ ఎక్కి ఇక్కడికి వచ్చాను...

నేను: హమ్ సరే సరే నేను నిన్ను అడిగాన చెప్పు... లేదు కదా ..

తను : నువు అడగవ్ కానీ నాకు చెప్పాలి అనిపించింది ...

నేను : .........

తను : ఏంటి సైలెంట్ గా ఉన్నావ్.

నేను: I love you.. ఇది నాకు చెప్పాలి అనిపించింది..

తను: నవ్వుతూ చెప్పు నేను వద్దు అనలేదు గా ...
[+] 4 users Like Rishithejabsj's post
Like Reply
#7
Nice update  thanks
Like Reply
#8
Nice update
Like Reply
#9
Update baagundi
Like Reply




Users browsing this thread: