27-05-2024, 08:33 AM
ఇంకో కథ. లైన్ తట్టింది, రాస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో, మీకు ఎలా అనిపిస్తుందో.
ఈ కథని, మధ్యలో ఉన్న కథలని కూడా పూర్తి చేస్తాను.
ఈ కథని, మధ్యలో ఉన్న కథలని కూడా పూర్తి చేస్తాను.
"మ్యూచువల్ ఫండ్"
|
27-05-2024, 08:33 AM
ఇంకో కథ. లైన్ తట్టింది, రాస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో, మీకు ఎలా అనిపిస్తుందో.
ఈ కథని, మధ్యలో ఉన్న కథలని కూడా పూర్తి చేస్తాను.
27-05-2024, 08:40 AM
తలుపు చప్పుడైంది. అప్పుడే బయటకి వెళ్లబోతున్న కుర్రాడొకడు తలుపు తీసాడు.
ఎదురుగా ఉన్న మనిషిని చూసి, "అక్కా"... అంటూ పెద్దగా పిలిచాడు. లోపల గిన్నెలు కడుగుతున్న ఇరవై ఏళ్ళ అమ్మాయి బయటి గదిలోకి వచ్చింది. విషయం అర్ధమైంది అమ్మాయికి. "నేను కాలేజికెళ్తున్నా"... అంటూ బయటకెళ్ళిపోయాడు కుర్రాడు. "కూర్చోండి"... అంది అమ్మాయి. "మీ అమ్మెక్కడ?" "బయటకెళ్ళిందండి, వచ్చేస్తుంది. కాఫీ తెస్తాను"... అంటూ లోపలికెళ్లబోయింది. "ఈ మర్యాదలకేం తక్కువ లేదు. కాఫీ కాదు, అద్దె కావాలి నాకు, మీ అమ్మెక్కడ"... కోపంగా అన్నాడు ఓనర్. "వచ్చేస్తుందండి"... నెమ్మదిగా చెప్పింది అమ్మాయి. "నా అద్దె సంగతి చూడకుండా పొద్దున్నే ఈ పెత్తనాలేంటి?" ఆ మాటకి కోపం వచ్చినా, ఎందుకు అన్నాడో తెలిసిన అమ్మాయి ఏమీ అనకుండా అలానే ఉంది. "నెల దాటి ఎన్ని రోజులయింది, నా అద్దె ఎప్పుడిస్తారు?" తల దించుకుంది అమ్మాయి. "ఇప్పటికే రెండు నెలల అద్దె ఇవ్వాలి, ఇది మూడో నెల. ఇంకెన్ని నెలలు అద్దె ఇవ్వకుండా నా ఇంట్లో ఉంటారు?"... కోపంగా అన్నాడు ఓనర్. తల దించుకునే ఉంది అమ్మాయి. "గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ మీది, అయినా సరే మగదిక్కు లేని కుటుంబం అని అద్దె తక్కువ ఇస్తానన్నా ఇల్లు ఇచ్చాను, అవునా?" తలూపింది అమ్మాయి. "ఎంతమంది నన్ను అడుగుతూ ఉంటారో తెలుసా, గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ మాకిస్తారా అని, ఎక్కువ అద్దె వస్తుందని తెలిసినా మిమ్మల్ని ఎప్పుడన్నా ఖాళీ చెయ్యమన్నానా?" తలూపింది అమ్మాయి. "ఆ అద్దె కూడా కట్టట్లేదు మీరు" "ఈ నెల ఇబ్బందిగా ఉందండి, అమ్మ వాళ్ల ఆఫీసులో ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఆ పని మీద తిరుగుతోంది అమ్మ, అందుకే అద్దె ఆలస్యం అయింది" "ఇలాంటి కష్టాలు ఎన్నో విన్నాను నేను. నేను కూడా ఇలాంటి కష్టాలు పడ్డవాడినే. అవన్నీ గుర్తుండబట్టే మీ అద్దె ఆలస్యం అవుతున్నా ఏమీ అనకుండా ఉంటున్నా" "నా డిగ్రీ అయిపోయిందండి, నేను కూడా జాబ్స్ వెతుక్కుంటున్నాను, వచ్చే నెల మూడు నెలల అద్దె ఒకేసారి ఇచ్చేస్తాము. ఈ ఒక్కసారికి ఏమీ అనుకోకండి" "సరే కానీ. కష్టపడే పిల్లవి నువ్వు, నువ్వు చెప్పావని ఆగుతున్నా"... తలూపుతూ అన్నాడు ఓనర్. "చాలా థాంక్స్ అండి. జాబ్ రాగానే, అడ్వాన్స్ ఇస్తారేమో అడిగి అద్దె ఇచ్చేస్తాను"... చెప్పింది అమ్మాయి. తలూపుతూ వెళ్ళిపోయాడు ఓనర్. వయసు చిన్నదైనా, కుటుంబాన్ని పట్టించుకోవడంలో పెద్దదైన అమ్మాయి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ, తల పట్టుకుంది, కళ్ళల్లో నీళ్ళు. ఇంతలో మొబైల్లో అలారం మోగింది. వెళ్ళాలని లేకపోయినా, వెళ్లకపోతే కష్టాలు పెరుగుతాయే కాని తగ్గవని తెలిసిన అమ్మాయి, రెడీ అవ్వడానికి వెళ్ళింది. రెడీ అయ్యి తల్లి ఇంకా రాకపోవడంతో ఫోన్ చేసింది తల్లికి. "అమ్మా ఎక్కడున్నావు?" "వచ్చేస్తున్నా, వీధి మలుపు తిరుగుతున్నా" ఫోన్ పెట్టేసి, పగిలిన మొబైల్ స్క్రీన్ మీద ముక్కలుగా కనిపిస్తున్న తన ముఖాన్ని చూసుకుని దిగులుగా, తల్లి కోసం ఎదురుచూడసాగింది అమ్మాయి. ఈ అమ్మాయి కథేంటో వచ్చే భాగంలో చూద్దాం.
27-05-2024, 11:08 AM
Good starting
27-05-2024, 11:31 AM
Nice start
27-05-2024, 05:32 PM
NICE UPDATE
29-05-2024, 06:35 AM
Nice start
30-05-2024, 08:49 AM
తల్లి కోసం ఎదురుచూస్తూ కూర్చున్న అమ్మాయికి, బయట చెప్పుల శబ్దం వినిపించడంతో, తల్లి వచ్చిందని అర్ధమై వెంటనే తలుపు తీసింది.
లోపలికొచ్చి అక్కడున్న స్టూల్ మీద కూర్చుంటూ, కొంగుతో చెమట తుడుచుకుంటున్న తల్లిని చూసి ఫ్యాన్ వెయ్యబోయింది అమ్మాయి. "వద్దే. చెమట అదే ఆరిపోతుంది. కరెంట్ బిల్ ఎక్కువ చెయ్యద్దు"... అంటున్న తల్లి వైపు చూస్తూ, తల్లి ప్రయత్నం ఫలించలేదనేది అర్ధమై అక్కడే కూర్చుండిపోయింది అమ్మాయి. దిగులుగా ఉన్న తన కూతురి మొహం చూస్తూ... "అంత దిగులెందుకే, నీ చదువు అయిపోయింది, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. నీ తమ్ముడి చదువు అయ్యేదాకా ఫీజు కడదాం, వాడు కూడా పార్ట్ టైం ఏదన్నా చేస్తాడు. షాపు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కొన్ని రోజులు వస్తాయి. ప్రతి రూపాయిని లెక్కబెట్టి ఖర్చుపెడదాం"... అంటూ భూత, భవిష్యత్, వర్తమానాలని ఒకే వాక్యంలో చెప్పేసింది తల్లి. "పదిహేనేళ్ళ నించి చేస్తున్నావు, ఎందుకు తీసేస్తున్నారు. బిజినెస్ క్లోజ్ చేస్తున్నారా ఏంటి?" "లాభాలు రావడం లేదట, ఆరు షాపులని ఎవరికో అమ్మేస్తారట, వాళ్ళు నాలుగు ఉంచి, రెండు మూసేస్తారంట, ఆ నాలుగిటికి స్టాఫ్ ఇంతమంది ఎక్కువ అని తీసేస్తున్నారు. మన దురదృష్టం, నేను పని చేసే షాపు మూసేస్తున్నారు" "ఆ నాలుగులో నీకు పని ఇవ్వచ్చు కదా?" "ఇస్తానన్నారే, కానీ ఆ షాపు ఊరికి ఆ చివరన. పైగా మా ఓనర్ గారు దయగల మనిషి కాబట్టి ఇన్నాళ్ళు మంచి జీతం ఇచ్చాడు, ఈ కొత్త ఓనర్ అంత ఇవ్వడు. అ జీతానికి ఇక్కడ నించి రోజు వెళ్ళి రాలేనే. అక్కడ అద్దెకుండాలంటే, నువ్వు రోజూ ఎక్కువ తిరగాలి, నీ తమ్ముడి చదువు తేడా వస్తుంది. ఇన్న్నాళ్ళూ మీ ఇద్దరూ ఒకే కాలేజి, ఇంటి పక్కన కాలేజి అయితేనే వాడు నీకు తెలీకుండా క్లాసులు ఎగ్గొటాడు, అలాంటిది ఇప్పుదు మనం అంత దూరంలో ఉంటే, వాడి చదువు సర్వనాశనం అవుతుందే. ఒక పైసా మిగలడం సంగతి దేవుడికెరుక, మన అందరం ఇబ్బందులు పడతాం. దాని కన్నా ఇక్కడే ఏదన్నా దొరుకుతుందేమో చూస్తాను" గుక్క తిప్పుకోకుండా మొత్తం చెప్పి.. మంచినీళ్ళు కావాలన్నట్టు వేళ్ళు చూపించింది. నీళ్ళు తెచ్చింది అమ్మాయి. నీళ్ళు తాగుతూ... "ఇన్నేళ్ళూ చేసిన షాపులో పని చెయ్యగలిగినంత ఉండేది, మంచి జీతం ఇచ్చేవాడు మా యజమాని, ఎండాకాలం ఏసీ ఉండేది. అప్పు పుట్టేది. సుఖపడ్డానే. ఇప్పుడు వయసు పెరిగాక, ఇంకోటి వెతుక్కోవాల్సి వస్తోంది. ఇన్నేళ్ళూ చేసిన లాంటిది ఇప్పుడు అవసరం, అలాంటిది దొరకదు. ఇన్నేళ్ళూ సుఖపడ్డట్టు, వయసు పెరిగాక, శక్తి తగ్గాక, ఇప్పుడు కష్టపడాల్సి వస్తోంది. కట్టుకున్నవాడు ఏనాడు కూడు పెట్టాడు కనుక, ఎప్పుడు తోడుకున్నాడు కనుక, వాడి సుఖం వాడు చూసుకున్నాడు. ఆడవాళ్లమైనా మనమే ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాం. నీ తమ్ముడికి మీ నాన్న పోలిక రాకుండా ఉంటే చాలు" అంటూ నిట్టూరుస్తూ అక్కడే ఉన్న చాప మీద పడుకుని కళ్ళు మూసుకుంది అమ్మాయి తల్లి. తల్లి ఇచ్చిన సమధానంతో అమ్మాయికి విషయం మొత్తం అర్ధమైంది. తన ఉద్యోగ అవసరం తన కుటుంబానికి అవసరం, ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంది. "ఇందాక ఇంటి ఓనర్ అంకుల్ వచ్చాడు"... అంటూ తల్లికి విషయం చెప్పింది అమ్మాయి. "అద్దె ఇవ్వలేదనే విషయం గుర్తులేదే అమ్మాయ్, షాపువాళ్ళిచ్చిన డబ్బులు రెండు నెలలు వస్తాయి కదా అనుకుంటున్నా, ఆ మొత్తం అద్దెకే పోతాయా"... అంటూ దిగులుగా నిట్టూర్చింది తల్లి. ఇంతలో ఫోన్ మోగింది. "అక్కా మనీ ట్రాన్స్ఫర్ చెయ్యాలి, మూడొందలు కావలక్కా, అర్జెంట్ అక్కా"... టకటకా అన్నాడు అమ్మాయి తమ్ముడు. "ఎందుకురా?" "చెప్పా కదక్కా మనీ ట్రాన్స్ఫర్ చెయ్యాలి" "అదే ఎందుకు మనీ ట్రాన్స్ఫర్?" "ఫ్రెండ్ ఒకడికి ఇవ్వాలక్కా, మొన్న నోట్ బుక్స్ వాడి డబ్బులతో కొన్నాను, ఇప్పుడు అడిగాడు, వాడికి ఇవ్వలక్కా" "అతని నంబర్ చెప్పు, నేను ఫోన్ చేసి కనుక్కుని డబ్బులు పంపిస్తాను" డబ్బులు అన్న మాట వినగానే లేచి కూర్చుంది తల్లి. "ఏంటే నీ తమ్ముడేనా. ఎంత కావాలిట. రూపాయి లేక చస్తుంటే వీడి తిరుగుళ్ళకి డబ్బులు కావాలా, ఏదీ మొబైల్ ఇవ్వు" అంటూ మొబైల్ తీసుకుని... "ఒరేయ్ నా ఉద్యోగం పోయింది, చాలా అప్పులు ఉన్నాయి, నీ తిరుగుళ్లు ఆపేసి, చక్కగా చదువుకుంటూ, నువ్వు ఏదన్నా పార్ట్ టైం చేస్తూ, మాకు ఏదన్నా తేవాలిరా. మగపుట్టక పుట్టి, ఆడపిల్ల కష్టపడి చదువుకుంటూ, సంపాదించిన డబ్బులు అడుగుతున్నావా, డబ్బులు లేవు, ఏమీ లేవు, పెట్టేయ్"... పెద్దగా కేకలేస్తూ మొబైల్ అమ్మాయికిచ్చింది తల్లి. "డబ్బులు లేవుగా, నేను మధ్యహ్నం ఇంటికొచ్చె అన్నం తినను, ఇక్కడే నీళ్ళు తాగుతా".. కోపంగా అంటూ కాల్ కట్ చేసాడు కుర్రాడు. అటు తల్లి, ఇటు తమ్ముడు, తను ఉద్యోగం తెచ్చుకోవాలి అని గట్టిగా అనుకుంటూ... "అమ్మా తలుపేసుకో, నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది అని సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ తీసుకుని బయటకి నడిచింది అమ్మాయి.
30-05-2024, 11:02 AM
Nice update broo
30-05-2024, 12:49 PM
అప్డేట్ చాల బాగుంది
30-05-2024, 02:23 PM
Good start
30-05-2024, 08:44 PM
Narration interesting ga undi. Hope e katha normal ga untadi ani anukuntunna. More often sexual ga kakunda. Sexual konam takkuva untadi anipisthundi. Unna oka rendu Leda mudu episodes lo untadi emo anipisthundi. Nice going. Plot bagundi.
Be a happy Reader and Don't forget to appreciate the writer.
31-05-2024, 06:49 AM
Good Start
31-05-2024, 08:10 AM
Update sir
06-06-2024, 01:17 PM
(30-05-2024, 08:44 PM)Bellakaya Wrote: Narration interesting ga undi. Hope e katha normal ga untadi ani anukuntunna. More often sexual ga kakunda. Sexual konam takkuva untadi anipisthundi. Unna oka rendu Leda mudu episodes lo untadi emo anipisthundi. Nice going. Plot bagundi. Thank you. మిగతా భాగాలు కూడా చదివి అవి ఎలా అనిపిస్తాయో చెప్పు.
06-06-2024, 01:20 PM
తల్లితో ఇంటర్వ్యుకి వెళ్తున్నానని చెప్పి బయటకి వచ్చింది అమ్మాయి. బయట చిన్నగా తుప్పర.
"అమ్మాయ్, ఈ వానలో వెళ్ళాలా, ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ చెయ్యరా?"... అడిగింది తల్లి. "ఇంటర్వ్యూ ఉండి, ఒక్కళ్ళే వచ్చారనుకో, వాళ్ళు నా కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళైనా, వాళ్ళనే తీసుకుంటారు. నేను రేపు వెళ్తే, జాబ్ లేదు వెళ్ళిపో అంటారు. ఇంటర్వ్యూ ఉన్నా లేకపోయినా, వెళ్ళి రావడం మంచిది. ఇలాంటి జాబ్ వస్తే బాగుంటుంది. రాకపోతే షాపింగ్ మాల్ ఏదైనా పని ఇస్తుందేమో చూసుకోవాలి." "ఇందుకేనే మీ నాన్నని క్షమిస్తున్నా, బంగారం లాంటి నిన్ను ఇచ్చినందుకు. అయితే వెళ్ళవే. వెళ్ళి ఉద్యోగం ఇచ్చారు అన్న శుభవార్తతో ఇంటికి రా"... కూతురిని ముద్దు పెట్టుకుంటూ మురిసిపోయింది తల్లి. తల్లి అన్నట్టే జరిగితే బాగుంటుంది అనుకుంటూ, గొడుగు తీసుకుని బయటకి వెళ్ళింది అమ్మాయి. ఇంటి దగ్గర నించి నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీదకి వచ్చింది. టైం చూసుకుంది. బస్ ఎక్కితే లేట్ అవుతుంది, ఆటోలో వెళ్తే టైంకి ఉండచ్చు, ముందే వెళ్తే అక్కడే ఉండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటూ ఆటో కోసం చూడసాగింది. వచ్చేవన్ని టూ వీలర్స్, కార్స్ అవుతూ ఆటోలు రాకపోవడంతో, నెమ్మదిగా నడుస్తూ, మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ ముందుకి నడవసాగింది. ముందుకి నడుస్తూ, ఇంకోసారి వెనక్కి చూసింది, మొహంలో నవ్వు. దూరంగా ఒక ఆటో. చెయ్యెత్తి ఆటో వైపు చూస్తూ ఆగమన్నట్టు సైగ చేసింది. ఆగిన ఆటోలో కూర్చుంటూ, వెళ్లాల్సిన అడ్రస్ చెప్పింది. "మూడొందలు"... అన్నాడు ఆటో డ్రైవర్. పర్సులో నాలుగొందలు ఉండాలి అనుకుంటూ చూసుకుంది, ఉన్నాయి. తల ఊపింది. ఆటో సర్రుమని ముందుకు పోయింది. దిగాల్సిన అడ్రస్ వచ్చింది. డబ్బులిచ్చి దిగింది. ఎదురుగా చిన్న బిల్డింగ్. లోపలికెళ్ళింది. బయటకి చిన్నదిగా ఉన్నా, లోపల పెద్దదిగా ఉన్న ఆ ఆఫీసుని చూస్తూ, ఎదురుగా కంప్యూటర్ ముందున్న ఒక కుర్రాడికి ఇంటర్వ్యూ విషయం చెప్పింది. సర్టిఫికెట్స్ అడిగి, కూర్చోమని, లోపలికెళ్లాడు. గొడుగు మూస్తూ, చుట్టూ చూస్తూ కూర్చుంది. పక్కనే ఇద్దరమ్మాయిలు ఉన్నారు, చుక్క తడి లేదు వాళ్ల మీద, అంటే తన కన్నా ముందే వచ్చారు అనుకుంటుండగా, ఇంకో అమ్మాయి వచ్చింది. వాళ్ళ డ్రసెస్ వైపు చూసింది. మంచి క్వాలిటి డ్రసెస్. తన లాగా ఉద్యోగం అవసరం ఉన్నట్టు కనిపించలేదు వాళ్ళు. తన కన్నా బాగున్నట్టు అనిపించారు. ఆఫీస్ మొత్తం చూడసాగింది. ముగ్గురు అమ్మాయిలు కంప్యూటర్స్ ముందు కూర్చుని ఏదో చేస్తున్నారు. ఇంతలో వెనక నించి టక్ చేసుకుని ఉన్న ఒకతను వేగంగా నడుస్తూ లోపలికెళ్లాడు. అతను లోపలికెళ్ళగానే బయట ఉన్న కుర్రాడు ఫ్లాస్క్ తీసుకుని లోపలికెళ్ళాడు. "ఎంత మంది వచ్చారు?"...కూర్చుంటూ అడిగాడు అతను. "నలుగురు సార్"...బదులిచ్చాడు కుర్రాడు. "అప్లై చేసింది?"...కింద సొరుగులో ఉన్నా పెద్ద కాఫీ కప్ తీసి టేబుల్ మీద పెడుతూ అడిగాడు అతను. "తొమ్మిది మంది"... ఫ్లాస్కులో కాఫీ కప్పులో పోస్తూ చెప్పాడు కుర్రాడు. సరే టెన్ మినిట్స్ ఆగి, ఫస్ట్ వచ్చిన అమ్మాయిని ఫస్ట్, తర్వాత వచ్చిన వాళ్లని తర్వాత, వచ్చిన ఆర్డర్లో లోపలికి పంపు" కుర్రాడు తలూపి వెళ్ళబోయాడు. "అక్కడున్న గొడుగు ఎవరిది?" "మూడో అమ్మాయిది, వానలో వచ్చింది ఆ అమ్మాయే" "ఓకే" వెళ్ళిపోయాడు కుర్రాడు. పది నిముషాలు గడిచాయి. ముందు వచ్చిన అమ్మాయిని లోపలికి వెళ్ళమన్నాడు కుర్రాడు. లోపలికెళ్ళింది. పావు గంట గడిచింది. లోపల ఏం అడుగుతున్నారో. కామర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారో, మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారో, క్యాలుక్యులేషన్స్ అడుగుతున్నారో, ఏం అడుగుతున్నారో అనుకోసాగింది 'మన' అమ్మాయి. మొదటి అమ్మాయి బయటికొచ్చింది. ఆఫీసు బయటకి వెళ్ళిపోయింది. వెంటనే రెండో అమ్మాయిని లోపలికెళ్లమన్నాడు కుర్రాడు. లోపలికెళ్ళింది. ఇంకో పావు గంట గడిచింది. మళ్ళీ ఆలోచనల్లో పడింది 'మన' అమ్మాయి. లోపల ఆఫీస్ చూస్తే చాలా బాగుంది, అన్నీ కంప్యూటర్స్. సాఫ్ట్ వేర్ కంపెనీ లాగా ఉంది. ఈ ఉద్యోగం వస్తే కొన్నాళ్లు హాయిగా పని చేసుకోవచ్చు అనిపించసాగింది. రెండో అమ్మాయి బయటికొచ్చింది. ఆఫీసు బయటకి వెళ్ళిపోయింది. "హారికా" పిలిచాడు కుర్రాడు. లేచి నుంచుంది. "లోపలికెళ్ళండి" తలుపుతూ... కొంచెం భయపడుతూ లోపలికెళ్ళింది హారిక.
06-06-2024, 02:20 PM
GOOD UPDATE
06-06-2024, 05:44 PM
Nice update
|
« Next Oldest | Next Newest »
|