05-06-2024, 06:39 PM
వరల్డ్ ఫేమస్ రైటర్ - పార్ట్ 1
'వరల్డ్ ఫేమస్ రైటర్ - పార్ట్ 1/2' తెలుగు పెద్ద కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమండీ! మీ సన్మానం ఏమైంది? క్రిందటి నెలలో అన్నారుగా.. ?" అడిగింది సావిత్రి
"ఏమో.. సావిత్రి! ఈ సారి ఆలస్యం అయ్యేలా ఉంది.. "
"మీరు అందరూ మెచ్చుకునేలాగ చాలా గొప్ప రచనలు చేస్తారుగా.. ! మరి ఎందుకు ఇంకా డిలే.. ?"
"అవుననుకో.. కానీ, ఎందుకో ఇంకా ఆలోచిస్తున్నారు ఆ 'మీ' పత్రిక వాళ్ళు. ఒకటి మటుకు నిజం.. ఆ 'మీ' పత్రిక వారు సన్మానిస్తే, నా దశ తిరిగినట్టే సావిత్రీ.. !"
******
ఆనందరావుకు చిన్నప్పటినుంచే సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. చిన్నతనం నుంచే కాలేజ్ లో చురుకుగా ఉండడం, ఫంక్షన్ల లో స్పీచ్ ఇవ్వడం చేసేవాడు. అలా పెద్దయ్యాక కాలేజీ లో కవితలు, కథలు, జోక్స్ అన్నీ రాసేవాడు. అమ్మాయిలు అతని కవితలు చాలా ఇష్టపడేవారు. కొంత మందైతే, అడిగి మరీ వారి మీద అందమైన కవితలు రాయించుకునే వారు. కాలేజీ లో జరిగే వివిధ కార్యక్రమాలకు పాటలు, గేయాలు రాయడం చేత అప్పట్లో మంచి పాపులర్ అయ్యాడు ఆనందరావు. ఇతని ప్రతిభ చూసి, చాలా మంది అమ్మాయిలు మనసు పారేసుకుని, 'ఐ లవ్ యు' కూడా చెప్పేశారు. కానీ, జీవితం లో సాధించాల్సినవి చాలా ఉన్నాయని.. ప్రేమలు వద్దని అమ్మాయిలకు దూరంగా ఉన్నాడు ఆనందరావు.
ఆ తర్వాత, చదువులో బిజీ అయిపోయి.. తన రచనా టాలెంట్ ని పక్కకు పెట్టాడు. ఆనందరావు నాన్నగారు చాలా స్ట్రిక్ట్. చదువు మీద తప్పితే, వేరే వాటి మీద దృష్టి వద్దని ఎప్పుడూ అనేవారు. అయినా సరే, ఆనందరావు తనకి ఇష్టమైన కామిక్స్ పుస్తకం కోసం జోక్స్, కథలు రాసి పంపేవాడు. అలా పంపగా, ఒకరోజు ఒక అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆనందరావు రచనలకు అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఉందని మళ్ళీ బయటపడింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది..
నా పేరు దామిని. మీ రచనలు అన్నీ తప్పకుండా చదువుతాను. మీ రచనలు అంటే నాకు చాలా ఇష్టం.. ఇష్టం అనేదానికన్నా పిచ్చి అంటే ఇంకా బాగుంటుంది. మార్కెట్ లోకి పుస్తకం వచ్చిన వెంటనే, మీ రచన కోసం చూసి వెంటనే చదివేస్తాను. మీరు రాసిన కథలు అన్నీ నాకు చాలా ఇష్టం. మా నాన్నగారికి మీ ఊరుకే ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను కాలేజీ లో జాయిన్ అవడానికి అక్కడికే వస్తున్నాను. అక్కడ మంచి కాలేజీ లు చూసి నాకు చెప్పగలరా.. ?. మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను..
ఉత్తరం చదివిన తర్వాత.. ఆ అమ్మాయికి రిప్లై తర్వాత ఇవ్వొచ్చని ఆ ఉత్తరాన్ని అక్కడే వదిలేసాడు ఆనందరావు. ఈ లోపు అమ్మ అక్కడికి వచ్చి ఆ ఉత్తరం చదివింది. అబ్బాయి ఎక్కడ అమ్మాయి ధ్యాసలో పడి.. చదువు పాడుచేసుకుంటాడో అని.. ఆ ఉత్తరాన్ని చించి పారేసింది. ఆ తర్వాత ఆనందరావు ఆ ఉత్తరం కోసం ఎన్ని చోట్ల వెతికినా అది దొరకలేదు. తల్లిని అడిగినా.. సమాధానం చెప్పలేదు. ఇల్లు కూడా మారిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఉత్తరం గురించి మర్చిపోయాడు ఆనందరావు.
ఆ తర్వాత.. లైఫ్ లో కొంచం సెటిల్ అయిన తర్వాత.. మళ్ళీ ఆ పాత రోజులు గుర్తు చేసుకుని.. రచనలు మళ్ళీ మొదలుపెట్టాలని డిసైడ్ చేసుకున్నాడు ఆనందరావు. ఇప్పట్లో అన్నీ ఆన్లైన్ పత్రికలే.. అని ఒక పేరున్న పత్రికకు మొదటి కథను పంపించాడు. ఆ మొదటి కథ ఆమోదం పొంది ఆ పత్రికలో అచ్చు వేసారు. ఆనందరావు చాలా ఆనందపడ్డాడు. అప్పటినుంచి ఇంక అడపా తడపా రచనలు చేస్తూనే ఉన్నాడు. అన్నీ ప్రచురణ అయ్యాయి. ఇప్పటికి ఒక వందకు పైగా రచనలు పంపాడు ఆనందరావు.
ఆనందరావు శ్రీమతి సావిత్రి మంచి అమ్మాయి. ఇద్దరికీ పెళ్ళయి దాదాపు సంవత్సరం అయ్యింది. రచనలు చేయడం లో ఆనందరావు కు సలహాలు, సూచనలు ఇచ్చేది సావిత్రి. వారి పెళ్ళిచూపులలో కూడా కవి చమత్కారం చూపించాడు ఆనందరావు.
*******
"ఒరేయ్ ఆనందు.. ! నువ్వు ఇలా కథలు, కవితలు రాస్తున్నావని చెబితే నీకు పిల్లని ఎవరు ఇవ్వరు. చేస్తున్న ఆ చిన్న ఉద్యోగమైనా సరే.. అదే చెప్పు. కథలు, కవితలు గురించి చెప్పకు.. " అంది తల్లి జానకి
"నేను చూసుకుంటాను అమ్మా.. !"
పెళ్ళిచూపుల రోజు..
"అమ్మాయి.. ! నీ పేరు ఏమిటి.. ?" అడిగింది జానకి
"సావిత్రి.. "
"వంటా.. వార్పూ ఎంతవరకు వచ్చు.. ?"
"మా అమ్మాయి గురించి గొప్పగా చెప్పకూడదు వదినగారు.. ! మా అమ్మాయికి అన్ని వంటలు చెయ్యడము వచ్చు. ఇప్పుడు మీరు తింటున్న స్వీట్స్ కూడా మా అమ్మాయి చేసినవే.. "
అమ్మాయిని, అబ్బాయిని అలా వొంటరిగా వరండా లో మాట్లడుకోమని పంపించారు..
"నేను నచ్చానా.. ?" అడిగింది సావిత్రి
"మీకేమండి.. చందమామ వలే చక్కగా ఉన్నారు.. " అన్నాడు ఆనందరావు
"నిజమా.. ?"
"మీ మాట కూడా మీరు చేసిన స్వీట్స్ వలే మధురముగా ఉన్నాయి.. "
"మీరు రచయితలా.. ? నా మీద కవిత్వం చెబుతున్నారు.. ?"
"ఎలా కనిపెట్టారు.. ?"
"నాకూ సాహిత్య మంటే మక్కువే.. నేనూ కథలు, కవిత్వాలు అన్నీ చదువుతాను.. " అంది సావిత్రి
"ఇంతకీ.. ఎన్ని రచనలు చేసారేమిటి తమరు.. ?"
"ఏవో కొన్ని చేసాను లెండి.. పెద్ద పేరు ఏమీ లేదు లెండి ఇంకా.. " అన్నాడు ఆనందరావు
"మీరు గొప్పవారు అవుతారు లెండి.. "
"ఆ మాట.. నా చేయి పట్టుకుని.. చెప్పరాదు.. " అన్నాడు ఆనందరావు నవ్వుతూ
"చమత్కారులే.. నా కాబోయే శ్రీవారు.. "
"చెప్పకనే చెప్పారు నా కాబోయే శ్రీమతి గారు.. " అని ఇద్దరు నవ్వుకున్నారు..
ఆ తర్వాత ఇద్దరి పెళ్ళి గ్రాండ్ గా జరిగింది..

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ