Thread Rating:
  • 8 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పారిజాతాపహరణం
#21
అప్డేట్ చాల బాగుంది yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
కట్ చేస్తే.. గురవయ్య ఇల్లు..

బాలు - ఎరా పిల్లలకి జీళ్ళు బుడగలు అప్పుడే అయిపోయాయ..

రాజు - ఎవరికీ

బాలు  - అదే పెద్దారెడ్డి మనవలకి..

రాజు - మనవలు కాదు మనవరాళ్లు - సుధా 21 F B 36, సుజా 19 F B 37

బాలు - పక్కన ఆ B లెంటి...

రాజు  - బెర్త్ నంబర్లు రా..

బాలు - మరి అప్పుడే వచ్చేసావే..

రాజు - మళ్ళీ వెళ్ళాలి.. వాళ్ళు ఫోన్ చేస్తారు..

బాలు - అన్నయ్యా నేను వస్తారా..

రాజు - ఎంత మర్యాదరా నేనంటే..

బాలు - రేయ్ ప్లీజ్ రా..

రాజు - వద్దురా..మళ్ళీ వాళ్ళ పెద్ద వాళ్ళకి తెలిస్తే బాగోదు..

ఈలోపు ఫోన్ వస్తుంది.. రాజు కీస్ తీసుకు వెళ్తుంటే బాలు అరుస్తాడు.. ద్రోహి..

రాజు బయలుదేరగానే లోపలి కి హడావిడిగా పరిగెడతాడు డ్రెస్ మార్చుకోవడానికి..

గురవయ్య - ఏందిరా ఆ హడావిడి ఆంబోతు తరుముతున్నట్టు..

బాలు – ఆ.. కోటలో స్వయంవరం అంటా.. రాకుమారి దగ్గరకి..

గురవయ్య - మెల్లిగా వెళ్ళు.. కాలో చెయ్యో ఇరిగితే అవిటోన్ని చేసుకుంటుదో లేదో..

కారులో రాజు డ్రైవ్ చేస్తుంటే సుధా ముందు కూర్చుంటుంది..సుజా వెనకాల హెడ్ ఫోన్స్ పెట్టుకుని.."మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా" పాట వింటోంది..

సుధా- Mr నీ పేరేంటి..

రాజు - రాజు..

సుధా - నా పేరు సుధ.. చెల్లి సుజా..
ఏమి మాట్లాడకుండా నవ్వుతాడు..

ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం..

రాజు - అంతర్వేది..

సుధ - ఏముందక్కడ..

రాజు - లక్ష్మి నరసింహ స్వామి గుడి, గోదారి సముద్రం కలిసే చోటు.. చాల బావుంటుంది..

సుజా - ఓహ్..బీచ్ కా సూపర్..

ఈలోపు సుధ,  రాజూ అని పిలుస్తుంది.. ఎంటన్నట్టు తన వైపు చూస్తే..

సుధ - ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు..

రాజు – (నవ్వుకుంటూ కార్ ఆపి) వాడు నా తమ్ముడండి..

బాలు - ఎరా కార్ ఎక్కడిది.. వీళ్ళెవరూ

రాజు - రెడ్డి గారి మనవరాళ్లు లే..

బాలు - సర్లే ఎవరైతే నాకేంటి కానీ నువ్వెక్కడికి..

రాజు - నువ్వెక్కడికో చెప్పు.. నేనెటు వెళ్తే నీకెందుకు..

సుధ - మేం అంతర్వేది వెళ్తున్నాం..

బాలు - అంతర్వేది కా.. అయ్యో అక్కడ నాకు మొక్కు ఉండిపోయిందే.. నేను వస్తా..

రాజు - ఎదో సీరియస్ పని మీద బయటకి వెళ్తున్నట్టు ఉన్నావ్ కదరా..

బాలు - ఎహ్ మొక్కు ముఖ్యం .. లేకపోతె దేవుడు ఫీల్ అవుతాడు..

రాజు - నేను చెప్తాలే దేవుడికి నిన్నేం శపించొద్దని..

సుజా అసహనం గా చూస్తూ ఉంటె, సుధ పాటల CD లు వెతుక్కుంటూ ఉంటుంది..

బాలు - నన్ను వదిలేసి పొయ్యవని తెలిస్తే తాత ఫీల్ అవుతాడురా..

రాజు - నిజమేరా..అయితే తాటకి చెప్పకు నిన్ను తీసుకెళ్లలేదని

సుధ - పోనే రానీలే రాజు

బాలు - ఎక్కడ ఖాళీ ఉంది... అని వెతుకుతూ వెనక డోర్ ఓపెన్ చేసి  … ఓయ్ పిల్ల కొంచెం పక్కకి జరుగు.. అంటాడు

సుజా - ఓయ్ నీకు కొంచెం కూడా మానెర్స్ లేదా..

బాలు - ఉండేది.. మీ దగ్గరకి వస్తున్నాడని మా అన్నకిచ్చి పంపించా.. మీకివ్వడం మర్చిపోయినట్టున్నాడు..

సుజా కి వొళ్ళు మంటెక్కి.. అక్క నువ్వు వెనక్కి వచ్చేయ్... ఇతను ముందుకి వెళ్తాడు..

సుధ - అబ్బా కూర్చోవే ఇప్పటికి ఎండ పెరుగుతోంది.. ఎన్ని సార్లు ఆగుతాం..

సుజా - మళ్ళీ హెడ్ ఫోన్ పెట్టుకుని.. తన లోకం లోకి..

సుధ  ఏమో  రోడ్ వైపు కొబ్బరి చెట్లని కాలువ గట్లని పాము పుట్లని చూసుకుంటూ.. తన లోకం లోకి తాను.. వెళ్ళిపోతారు..

కట్ చేస్తే.. కోటయ్య ఇంట్లో..

కోటయ్య - ఎరా, రోడ్లు కొలిచే వాళ్ళలాగా అలా ఊరంతా తిరక్కపోతే ఏదైనా పనికొచ్చే పని చెయ్యొచ్చు కదా..

రాంబాబు - నేను ఆ పనిలోనే ఉన్నా.. నువ్వు 15 ఏళ్లుగా వెతుకుతున్న దాన్ని నేను 15 రోజుల్లో తెస్తా చూడు..

కోటయ్య - నీ మొకంరా యదవా.. అసలా వజ్రం ఎలా ఉంటుందో తెలుసెంట్ర నీకు..

రాంబాబు - లోపల కెళ్ళి పడక గదిలో మంచం పక్కన ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్న పారిజాతం ఫోటో తెచ్చి.. ఇదే కదా.. పుట్టినప్పటి నుంచి రోజూ చూస్తూనే ఉన్నా

కోటయ్య - నువ్వు గాని ఆ వజ్రం సంపాదిస్తే నా జీవిత ఆశయం నిరవేరినట్టే..

రాంబాబు - ఎందుకు నాన్నా నీకు ఆ వజ్రం అంటే అంత ఇష్టం..

కోటయ్య - అదో పెద్ద కధరా..

రాంబాబు - కధా.. నిజం కాదా..

కోటయ్య - నువ్వు నమ్మనంటే చెప్పనురోయ్..

రాంబాబు - లేదులే నమ్ముత కానీ చెప్పు..

కోటయ్య - అసలుకి ఆ వజ్రం వజ్రం కాదట.. పారిజాత అనే దేవకన్య ట.. ఓసారి ఆవిడ భూలోకానికి వచ్చినప్పుడు ..

రాంబాబు - నాన్నోయ్ నేను ఈ సినిమా చూసా.. ఆగాగు.. ఆ.. జగదేకవీరుడు అతిలోక సుందరి..

కోటయ్య - కదా.. ఈ ఉంగరం గురించి విన్నాకే ఆ సినిమా తీశారు..

రాంబాబు - నాన్నా పైకి మొరటుగా కనిపిస్తావు కానీ నువ్వు చాలా అమాయకుడివి నాన్న

కోటయ్య - అదేంట్రా..

రాంబాబు - లేకపోతె ఏంటి ఈ కాకమ్మ కధలన్నీ ఎలా నమ్మేశావ్ నాన్న..

కోటయ్య - ఆ వజ్రం దొంగతనం అయినా తర్వాత మన రాజు గారు ఎలా పతనం అయ్యారో గుర్తుందా.. ఆ వజ్రం ఎవరి చేతిలో ఉంటె వాడే రాజు.. ఓటమి లేని విజయాల్ని ఇస్తుందిరా.. ఇప్పటికి ఆ వజ్రం గురించి జనాలు కధలు కధలుగా చెప్పుకుంటారు..

రాంబాబు - సరే నాన్నా.. నీకోసం ఐన..ఆ వజ్రం తెచ్చి నీకిస్తా..


To be continued..
[+] 12 users Like nareN 2's post
Like Reply
#23
Nice Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#24
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#25
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#26
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#27
Superb update
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#28
(14-05-2024, 08:40 PM)sri7869 Wrote: Nice Good update

(14-05-2024, 09:47 PM)appalapradeep Wrote: Nice update

(15-05-2024, 04:02 AM)Iron man 0206 Wrote: Nice update

(15-05-2024, 02:21 PM)utkrusta Wrote: GOOD UPDATE

(15-05-2024, 04:56 PM)Sushma2000 Wrote: Superb update

Ilanti Kadhani kooda aadaristunna meekandariki Dhanyavaadaalu...
[+] 2 users Like nareN 2's post
Like Reply
#29
ఒక వైపు జీడీ మామిడి తోటలు, ఒక వైపు కాలువ గట్లు, ముందుకు వెళ్తే పచ్చటి పొలాలు అవి దాటితే కొబ్బరి తోటలు..

పచ్చని పొలాలలో పని చేసుకునే ఆడంగులు, నీళ్ల కాలువలో ఈత కొట్టే పిల్లలు, తాటి కల్లు దింపే మగవాళ్ళు..

ఎవరి లోకం లో వాళ్ళు ఉండగా కార్ అంతర్వేది గుడి దగ్గర ఆగింది..

సుధ - గుడి ముందు షెడ్ ని చూస్తూ ఇదేంటి ఇంత ఎత్తుగా ఉంది..

రాజు - అది స్వామి వారి రధం, కళ్యాణం అప్పుడు ఉత్సవాలకు తీసుకు వెళతారు,

సుధ - ఓహ్ వావ్ అనుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది..

తర్వాత ఇద్దరూ గుడి లోపలికి వెళుతూ ఉంటె వాళ్ళ వెనుక సుజ, తన వెనుక బాలు..

అక్కడా సుధ ఫొటోస్ తీస్తూ ఉంటె

పూజారి - అమ్మ గుడిలో ఫోటోలు తియ్యకూడదు అంటారు..

సుధ - ఓహ్ సారీ.. అని ఫోన్ హ్యాండ్ బాగ్ లో పెట్టేస్తుంది..

లోపల స్వామి వారి దర్శనం అయ్యాక..అందరూ తీర్థం తీసుకుని బయటకు వస్తు ఉంటె బాలు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని బయటకు వస్తాడు..

సుజ వాడి వాటం చూసి ఒక నన్ను నవ్వి మొహం తిప్పుకుంటుంది..

సుధ - రాజు ఇది చాల పాత కాలం గుడిలా ఉంది కదా...

రాజు - అవును ఇక్కడ శాసనాల్లో కృతయుగం నాటి గుడి అని ఉంది.. చాల మహిమ గల దేవుడు..

అలా అనగానే సుధ మళ్లి బయట నుంచే ఇంకోసారి దణ్ణం పెట్టుకుంటుంది..

బాలు - అవునవును.. మా అమ్మ నాన్నల్ని ఇలా మాయం చేసేసాడు అని చిటిక వేసి చూపిస్తాడు..

రాజు - రేయ్.. అనగానే వాడు నోటి మీద వేలు వేసుకొని గుడి గోపురం చూసుకుంటూ అలా వెళ్ళిపోతాడు..సుధ రాజు గుడి మీద శిల్పాలు చూస్తూ ఉంటారు... ఈలోపు సుజ కి బోర్ కొట్టి బాలు వైపు వెళ్లి

సుజ - ఓయ్.. ఇక్కడ బీచ్ ఎక్కడ ఉంది..

బాలు - ఓయ్.. నాకో పేరుంది.. బాలు..

సుజ - అవునా.. మంచిది..

బాలు - పేరు చెప్పాక తిరిగి పేరు చెప్పడం మర్యాద..

సుజ - అవునా.. కార్ లో దౌర్జన్యం గా ఎక్కడం ఎక్కడ మర్యాదో మరి..

బాలు - మా అన్న గాడు ఇచ్చాడు లిఫ్ట్ మీరు కాదు..

ఈలోపు సుధ అరుస్తుంది.. సుజా ఎక్కడ అంటూ..

బాలు - సుజ నా సుజ ఏంటి కూజా లాగ.. సగం పేరు పెట్టి వదిలేశారా..

సుజ - షట్ అప్ నా పేరు నా ఇష్టం..  

అంటూ కోపం గా సుధ రాజు ల దగ్గరకి వస్తుంది.. కోపం గా.. బాలు నవ్వుకుంటూ వెనక ఫాలో అవుతాడు..

సుధ - గుడి బావుంది కదా..

సుజ - హ యాదగిరి గుట్ట స్వామి గుర్తొచ్చారు..

బాలు - అదెక్కడా..

సుధ - హైదరాబాద్ దగ్గర.. అంటూ రాజు వైపు తిరిగి.. ఇప్పడు ఎక్కడికి..

రాజు - మీరెప్పుడైనా లైట్ హౌస్ ఎక్కారా..

సుజ - లైట్ హౌస్ ఆ బన్నీ మూవీ లో చూడడమే.. ఎప్పుడు ఎక్కలేదు.. వెళదాం అక్కా..

సరే అంటూ కార్ తీసి ఆ ఇసక నేలలో మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే మెల్లిగా సముద్రం హోరు స్టార్ట్ అవుతుంది..

సుజ - ఓహ్ బీచ్...వావ్..

రాజు - అదిగో లోట్ హౌస్..

సుధ - ఏది అంటూ కిటికీ లోంచి తల బయటకు పెట్టి దూరంగా ధగ ధగ మెరుస్తున్న లైట్ హౌస్ ని చూస్తుంది..

కార్ ఆపగానే సుజ ఫాస్ట్ గా పరుగెత్తుకుంటూ హే నేనే 1st  అంటూ గబగబా లైట్ హౌస్ మెట్లు ఎక్కుతూ ఆయాసం గా ఆగుతుంది..

ఈలోపు మెల్లిగా రాజు, సుధ, బాలు కబుర్లు చెప్పుకుంటూ తన దగ్గరకు రాగానే మళ్లి పరిగెడుతుంది..

పైకి వెళ్లి చూస్తే అనంతమైన సముద్రం.. సుదూరమైన ఆకాశం తో కలిసిపోతూ..

రాజు - అదిగో గోదావరి సముద్రం లో కలిసే చోటు అని చెప్పనే అదే..

సుజ - అది నరసాపురం లో కదా..

రాజు - అది గోదావరి అటు వైపు.. వెస్ట్ గోదావరి.. మనం ఇటు వైపు ఉన్నాం.. ఈస్ట్ గోదావరి..

సుధ - నైస్... చాల బావుంది.. మనం వెళ్ళొచ్చా అక్కడకి..

రాజు - వెళ్లొచ్చు.. వెళ్దామా..

సుజ - బాబోయ్ కాళ్ళు లాగుతున్నాయి.. కాసేపాగి వెళ్దాం..

బాలు మాత్రం ఎం మాట్లాడకుండా సైలెంట్ గా సముద్రాన్ని చూస్తూ ఉంటాడు...

రాజు - ఏంట్రా అలా ఉన్నావ్.. వచ్చేటప్పుడు బానే ఉన్నావ్ గా..

బాలు - ఎం లేదురా అంటూ పేస్ రియాక్షన్ మార్చేసి.. నా హీరోయిన్ తోటి ఇక్కడ డ్యూయెట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా...

సుధ - ఏంటి బాలు, లవ్ స్టోరీ నా..

బాలు - లేదండి జస్ట్ ప్లానింగ్..

సుజ కోపం గా మొహం తిప్పుకుంటూ.. అక్కా బీచ్ కి వెళ్దాం.. అని మళ్ళీ ఫాస్ట్ గా మెట్లు దిగడం మొదలు పెడుతుంది..

నలుగురూ సముద్రం దగ్గరకు రాగానే సుజ అలల వైపు పరిగెడుతూ సముద్రం తో కబడ్డీ అట ఆడుతూ ఉంటుంది..

సుధ సుజ ని చూస్తూ వొడ్డున కూర్చుని కళ్లు మూసుకుని సముద్రం హోరు వింటూ ఉంటుంది..

రాజు కూడా కొంచెం పక్కగా కూలబడతాడు.. బాలు నుంచుని సుజ ని సముద్రాన్ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు..

కాసేపటికి సుజ వచ్చి అదేంటి అందరూ కూర్చుండిపోయారు గోదావరి సముద్రం కలిసే చోటుకు వెళదాం.. పదండి..

సుధ - ఒసేయ్ అన్నిటికి హడావిడేనా.. ఇంకాసేపు ఉంటాం కదా.. వెళ్దాం లే మెల్లిగా.. ఇక్కడ ఎంత ప్లెసెంట్ గా ఉంది.. కాసేపు నువ్వు కూడా కూర్చో ఇక్కడ..

సుజ - ఒసేయ్ ఎదో ప్రపంచం ఆగిపోయినట్టు అలా కూర్చోవడం నా వల్ల కాదె.. వెళదాం పద..

సుధ - పోనీ రాజు తో పాటు నువ్వు వెళ్ళు నేను కాసేపాగి వస్తా..

ఈలోపు బాలు రావద్దురా అన్నట్టు సైగ చేస్తాడు రాజుకి..

రాజు - నాకూ కాసేపు ఇక్కడ ఉండాలని ఉంది.. బాలు నువ్వు తీసుకెళ్ళరా అంటాడు..

బాలు - అన్నయ్య, నువ్వు చెప్పావు కాబట్టి.. నీకోసం.. అంటూ సుజ వైపు తిరిగి.. మిస్.. ఫాలో మీ.. అంటాడు..

సుజ వాణ్ణి తిట్టుకుంటూ..  సముద్రం వైపు చూస్తూ మొహం తిప్పుకుని నడుస్తూ ఉంటుంది..

బాలు - ఏంటి సుజ చూస్తుంటే ఎదో మూడాఫ్ లో ఉన్నట్టున్నావ్..

సుజ - మూడ్ ఆఫ్ కాదు మర్డర్ చేసేంత కోపం లో ఉన్నాను..

బాలు - ఎందుకండీ అంత కోపం.. ఎదో సరదాగా అన్న దానికి..

సుజ - షట్ అప్ నాతొ మాట్లాడితే చంపేస్తాను.. అని కోపం గా అరిచి వాణ్ణి దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది..

కొంత దూరం నడిచాక విసుగు పుట్టి ఇంకా ఎంత దూరం అంటుంది..

బాలు రెండూ చేతులూ బార్ల చాపి చాలా దూరం అని సైగ చేస్తాడు..

సుజ - బాబోయ్ కాళ్ళు నొప్పెడుతున్నాయ్..

బాలు - ఎత్తుకు తీసుకువెళ్ళానా.. పోనీ భుజం ఎక్కుతావా అని సైగ చేసి అడుగుతాడు..

సుజ - చి అందుకే నీతో మాట్లాడొద్దు అనుకున్నాను.. నువ్వెలాంటి వాడివో నీ మొహం మీద రాసుంది..

బాలు - వాడి మొహం వాడు చదువుకోడానికి అన్నట్టు ఆక్ట్ చేస్తాడు

సుజ - నిన్ను అంటూ కొట్టడానికి పరిగెడుతుంది..

వాడు దొరక్కుండా పరిగెడితే ఇక ఆయాసం వచ్చి అక్కడ బీచ్ లో కూర్చుండిపోతుంది..బాలు వచ్చి నవ్వుతూ చెయ్యి ఇస్తాడు లేవడానికి..

సుజ - ఇంకా దూరం ఉంటె వెనక్కి వెళ్ళిపోదాం.. అక్క కంగారు పడుతుంది లేట్ ఐతే..

బాలు - లేదు దగ్గరకి వచ్చేసాం.. రెండు నిముషాలు అని మళ్ళీ సైగ చేస్తాడు..

సుజ - ఏంటి నాతొ మాట్లాడవా..

బాలు - మాట్లాడితే చంపేస్తా అన్నావ్ గా..

సుజ - ఇప్పుడు మాట్లాడావుగా చంపెయ్యనా.. అని వాడి పీక పిసికినట్టు నొక్కి వదిలిపెడుతుంది..

బాలు - హే నిజం గా సారీ..

సుజ - సర్లే క్షమించేసాను పో.. అని మళ్ళీ నడక స్టార్ట్ చేస్తుంది..

బాలు సైలెంట్ గా ఎస్.. అనుకుంటూ నవ్వుతూ ఫాలో అవుతాడు..

కట్ చేస్తే..

సముద్రాన్ని జూమ్ అవుట్ చేసుకుంటూ సుధ రాజు మధ్యలోంచి వెనక్కి వస్తే..

వచ్చే అలలు వీళ్ళ దాకా వచ్చి వెన్నకి వెళ్లిపోతున్నాయి..

సుధ మోకాళ్ళ మీద గెడ్డం ఆనించి ఇసుకలో ఏవేవో రాసుకుంటూ ఉంటుంది..

కాసేపటికి ఈ లోకం లోకి వచ్చి రాజుతో..

సుధ - రాజు నువ్వు ఎం చేస్తూ ఉంటావ్..

రాజు - ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ ఐంది.. అధికారి ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను.. హైదరాబాద్ లో ఏదైనా కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాలని ప్లాన్..

సుధ - ఓహ్ నైస్.. మరి బాలు..

రాజు - చిన్నగా నవ్వి.. వాడు వస్తాడు హైదరాబాద్ హీరో అవ్వడానికి..

సుధ - హహహ్ అందుకేనా హీరోయిన్ తో డ్యూయెట్ అంటున్నాడు.. బావుంది.. మరి హైదరాబాద్ వచ్చి ఛాన్స్ లు వెతుకుతాడో హీరోయిన్ ని వెతుకుతాడో..

రాజు - నువ్వేం చేస్తున్నావ్..

సుధ - నాది డిగ్రీ కంప్లీటెడ్.. నెక్స్ట్ ఎంబిఏ చేసి పాలిటిక్స్ లోకి వెళదాం అనుకుంటున్నా..

రాజు కళ్లు పెద్దవి చేసి చూస్తుంటాడు..

సుధ - ఏమైంది.. అలా నవ్వుతున్నావ్.. నేను పాలిటిక్స్ లోకి ఏంటి నా..

రాజు -  లేదు లేదు మీకు రాజకీయం బ్లడ్ లోనే ఉంది కదా.. వర్కౌట్ అవుతుందిలే..

సుధ - ఓహ్ అదా.. సరే లేట్ అవుతోందిగా మనమూ వెళ్దామా..

రాజు - హ కార్ లో వెళ్ళిపోదాం.. ఫోన్ చేసి చెప్పేయ్.. అటే వస్తాం వెయిట్ చెయ్యమని..

సుధ - గుడ్ ఐడియా అని సుజ కి డయల్ చేస్తూ కార్ వైపు వెళతారు..

సుజ సరే అక్క అంటూ ఫోన్ కట్ చేసి.. ఎదురుగ చూస్తే ప్రశాంతమైన గోదారి ఉగ్రమైన సముద్రం లోకి వడివడిగా పరిగెడుతోంది..

సుజ వావ్ అనుకుంటూ ఫొటోస్ క్లిక్ మనిపిస్తుంటే..

బాలు - ఏంటి ఫోన్

సుజ - అక్క వాళ్లు డైరెక్ట్ కార్ లో వస్తున్నారట.. రిటర్న్ రావద్దు వెయిట్ చెయ్యమని..

బాలు అక్కడ చిన్న పడవ లంగర్ వేసి ఉంటె దాన్లో కూర్చుంటాడు..

సుజ - అన్ని ఫొటోస్ తీసుకుంటూ ఏమైనా పల్లెటూరి అందం పల్లెటూరుదే అంటూ

అక్కడ చిన్న చిన్న నీటి కుంటలు ఉంటె వాటిలో తనని తాను చూసుకొని ఐ లవ్ యు డార్లింగ్ అంటుంది..

బాలు షాక్ తిని వెనక్కి తిరిగి చూస్తాడు.. సుజ నీళ్లలో చూస్తూ సముద్ర గాలికి ఎగురుతున్న జుట్టు సరిచేసుకుంటూ ఉంటుంది..

బాలు - సుజ నువ్వు ఎం చదువుతున్నావ్..

సుజ - బి టెక్ 3rd  ఇయర్.. ఏమి..

బాలు - ఎం లేదు.. చిన్న పిల్ల లాగా నిన్ను చూసి నువ్వే ఐ లవ్ యు చెప్పుకుంటున్నావ్.. ఇప్పటి దాక నీకు ఎవరూ చెప్పలేదా పాపం..

సుజ - కొంచెం స్టైల్ గా కాలు టాప్ చేస్తూ ఆ సంగతి నీకెందుకోయ్..

బాలు - నీకో మంచి సంగతి చెపుదాం అనుకున్న.. వద్దంటే వదిలేయ్..

సుజ - ముందు మన సెల్ఫ్ ని లవ్ చేసుకోకుండా ఎవర్ని లవ్ చేసిన వేస్ట్..

బాలు - కరెక్టే.. ఇంతకీ నీకు లవ్ అటు 1st  సైట్ మీద నమ్మకం ఉందా..

సుజ - హా అంటూ అలోచించి.. ఉంది.. నా కాలేజీ సీనియర్ ఒకడున్నాడు ఉన్నాడు.. మహేష్ బాబు ల పొడుగ్గా హ్యాండ్సమ్ గా.. ఐ లవ్ హిం..

బాలు - కొంచెం ఏడుపు మొహంతో .. ఓహ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఆ..

సుజ - ఇంకా లేదు.. కాలేజీ ఓపెన్ అయ్యాక ప్రొపోజ్ చెయ్యాలి.. ఎలా చెప్తే బావుంటుందో నువ్వు ఐడియా ఇవ్వకూడదూ.. అని సైడ్ కి తిరిగి చిన్నగా నవ్వుకుంటుంది..

బాలు - నేనేం ఐడియా ఇస్తా

సుజ - అదే ఎలా అప్రోచ్ ఐతే బావుంటుందో..

బాలు - ఇక్కడ నాకే దిక్కు దివాణం లేదు..

సుజ - అంటే..

బాలు - అన్ని తెలివి తేటలే నాకుంటే ఈ పాటికి నా హీరోయిన్ తో బీచ్ లో పాటలు పాడుకుంటూ ఉండేవాణ్ణి.. ఇలా నీతో పాటు ఎందుకు వస్తా చెప్పు..

సుజ - హే ఇందాక కూడా సేమ్ అన్నావ్.. హీరోయిన్ అని.. ఎవరైనా డ్రీం గర్ల్ ఆ..

బాలు - అదా.. నేను రేపు హీరో అవుదాం అనుకుంటున్నా.. సో ఆ హీరోయిన్ అన్నమాట..

సుజ - ఐతే సార్ సూపర్ స్టార్ అయిపోతారన్నమాట.. మరి అప్పుడు మాకు ఆటోగ్రాఫ్ లు ఫొటోగ్రాఫ్ లు కావాలంటే రావచ్చా...

బాలు - అంత కష్టం ఎందుకు నువ్వే హీరోయిన్ గా చెయ్యొచ్చు కదా నా పక్కన..

సుజ - అబ్బా చా..

బాలు - లేదు నిజం గా అడుగుతున్నా నా హీరోయిన్ అవుతావా.. అంటూ చిలిపిగా కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు..

సుజ - కొంచెం ఆలోచించినట్టు మొహం పెట్టి.. ఇప్పుడే హీరోయిన్ ఐతే చదువు అటక ఎక్కేస్తుంది.. అందుకని చదువు అయ్యాక చూద్దాం లే..

బాలు - ఐతే 2  ఇయర్స్ తర్వాత నా హీరోయిన్ అవుతా అంటున్నవ్..

సుజా - చూద్దాం అంటున్నా.. ముందు నువ్వు హీరో అవ్వు బాబు.. అంటూ నవ్వుతూ మళ్ళీ సముద్రం వైపు అడుగులు వేస్తుంది..

బాలు - అవును ఇందాక నేనెలాంటివెన్నో మొహం మీద రాసి ఉంది అన్నావ్.. అప్పుడు నా మీద నీ ఒపీనియన్ ఏంటి..

సుజ – బాబా.. గతం గతః.. అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు చెప్పు..

బాలు - అది కాదు.. చెప్పొచ్చు కదా సరదాగా.. ప్లీజ్..

సుజ - నువ్వు ఇలా అందర్నీ బ్రతిమాలుతూనే ఉంటావా..

బాలు - లేదు నాకు నచ్చిన వాళ్ళని మాత్రమే..

సుజ కొంచెం కోపం గా చూస్తుంది...

బాలు - అంటే.. నచ్చినప్పుడు మాత్రమే అని దాని అర్ధం.. ఎందుకు అలా అడిగావు..

సుజ - ఇందాక కార్ లో అంతర్వేది రావడానికి రాజు ని కూడా ఇలాగె బ్రతిమాలావ్ కదా..

బాలు - కార్ లో వద్దామని కాదు నీతో వద్దామని..

సుజ - నాతోనా? ఎందుకు..

బాలు - సుజ 21st సెంచరీ లో కూడా 1800 పెళ్ళికూతురిలా.. ఎందుకు ఏమిటి అంటే ఎలా చెప్పు..

సుజ - అర్ధం అయ్యింది కానీ.. మరి నా హీరో కి ఉండాల్సిన లక్షణాలు నీలో లేవే..

బాలు – అంటే ఎం ఉండాలి..

సుజ -  అవి నీలో ఉన్నట్టు నేను ఫీల్ అవ్వాలి.. అంతే కానీ నీకు చెప్పి చేయించుకుంటే రీల్ హీరో అవుతావు తప్ప రియల్ హీరో ఎలా అవుతావు చెప్పు..

బాలు - మొహం కిందకి వేసుకొని.. కరెక్టే..

సుజ - ఏంటి కరెక్ట్..

బాలు - నువ్వు చెప్పిందే..

సుజ - అదే.. నీకేం అర్ధం అయ్యింది అని అడుగుతున్నా..

బాలు - చెప్పా కదా నువ్వేం చెప్పావో అదే అర్ధం అయ్యింది.. అండ్ అదే కరెక్ట్..

ఈలోపు సుజ దూరం గా చెట్ల వైపు ఎదో కదలిక కనపడితే అటు చూస్తూ ఉంటుంది...

సుజ - బాలు.. నీ హీరోయిజం చూపెట్టే టైం వచ్చినట్టుంది..

To be continued..
[+] 10 users Like nareN 2's post
Like Reply
#30
అప్డేట్ చాల బాగుంది yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#31
Romance heroisms thrilling elements..inka emana migilaya sir
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#32
(03-06-2024, 11:07 PM)Sushma2000 Wrote: Romance heroisms thrilling elements..inka emana migilaya sir

Smile
  Edo ala Kudurutunnay Andi.. 
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#33
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#34
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#35
సుజ - బాలు.. నీ హీరోయిజం చూపెట్టే టైం వచ్చినట్టుంది..

బాలు - అంటే?

సుజ - అటు చూడు...అని సరివి చెట్ల వైపు చూపెడుతుంది..

అక్కడ ముగ్గురు పోకిరీలు ఒక అమ్మాయిని తరుముతున్నారు.. వెంటనే బాలు అటు పరిగెడుతూ నువ్వు కూడా రా అని సుజ కి చెప్పి..

హలో ఇటు వైపు పరిగెత్తు.. అని ఆ అమ్మాయికి అరిచి చెప్తాడు..

ఈలోపు దారిలో కనపడ్డ వెదురు గెడ తీసుకొని సుజ చేతికి ఇచ్చి..మీ దగ్గరకి వచ్చిన వాడిని దీంతో చితగ్గొట్టేయ్.. అని ఆ అమ్మాయి ని క్రాస్ చేసుకుంటూ వెళ్లి

ముందుగా వచ్చిన వాడి ముక్కు మీద గుద్దుతాడు.. ఆ దెబ్బకి వాడి ముక్కుతో పాటు వీడి చెయ్యి కూడా తిమ్మిరెక్కిపోతుంది.. వాడికి ముక్కులోంచి రక్తం ఒక్కో బొట్టు పడుతూ ఉండేసరికి మిగిలిన ఇద్దరూ బాలూ ని అటాక్ చేస్తారు..

బాలూ తిమ్మిరెక్కిన చేతిని విదిలించుకుంటూ ఉండగా ఒకడు బాలు రెండూ చెంకల్లోంచి చేతులు పోనిచ్చి వెనక్కి చేతులు విరిచి పట్టుకుంటే ఇంకొకడు ముందు నుంచి బాలు మొహం మీద పంచ్ లు ఇస్తూ ఉంటాడు..

బాలు ఆ పంచ్ లని తప్పించుకోకడానికి తల కదుపుతూ వెనకవాడి ముక్కు మీద కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు.. ఈలోపు సుజ వెదురు కర్రతో ముందు నుంచి కొడుతున్న వాడి వీపు మీద నాలుగు దెబ్బలు వేసే సరికి వాడు వెనక్కి తిరగ్గానే.. ఆ గ్యాప్ చూసుకొని బాలు ఒక్కసారిగా కాలు లేపి తంతాడు..

ఈల్పోయూ సుజ వెదురు కర్ర సూది గా ఉండే వైపు వెనక నుంచి పట్టుకున్న వాడి మొహం మీద గుచ్చుతుంది.. అది వాడి బుగ్గల్లోంచి దూసుకొని అంగుళం మేర దిగిపోతే వాడి అల్లల్లాడిపోతూ వెనక్కి పడిపోతాడు..

ఈలోపు ముందు నుంచి గుద్దిన వాడు మళ్ళీ లేచి నుంచోగానే ముగ్గురూ కలిసి అన్ని వైపులా నుంచి కర్రతో కాళ్లతో వాణ్ణి తంతూ ఉండగా

మొదటి వాడు ఆ అమ్మాయి జడలో వేళ్ళు పెట్టి గట్టిగా పట్టుకొని వెనక్కి గుంజుతూ ఉండగా..

హార్న్ కొడుతూ రాజు సుధా ఎంటర్ అవుతారు..

సిట్యుయేషన్ అర్ధం అవ్వగానే.. కార్ ని వాళ్ళ మీదకి పోనిస్తూ ఒకడి మీదకి ఎక్కించేస్తాడు..

ఇంక వాళ్ళకి సీన్ అర్ధం అయ్యి సారీ లు చెప్పుకుంటూ మోకాళ్ళ మీద కూర్చుంటారు..

వాళ్ళని అక్కడ వదిలేసి.. ఆ అమ్మాయిని కార్ ఎక్కించుకొని ఫాస్ట్ గా ఊరు వైపు డ్రైవ్ చేస్తాడు..

వెనక కూర్చున్న బాలు సుజ ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటారు..

థాంక్స్ అన్నా అంటుంది ఆ అమ్మాయి..

ఒక్కదానివే వచ్చావా మీ వాళ్ళు ఎవరు లేరా అంటుంది సుధ..

లేదక్కా ఫ్రెండ్స్ తో పాటు వచ్చా.. వాళ్ళు లైట్ హౌస్ ఎక్కుదాం అంటే నేను ఎక్కలేను అని ఒక్కదాన్నే కింద వెయిట్ చేస్తుంటే వీళ్ళు నన్ను ఏడిపించడం మొదలు పెట్టారు..

తప్పించుకుని వచ్చేసరికి ఇదిగో వీళ్ళు హెల్ప్ చేసారు అంది బాలూకేసి చూస్తూ..

తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి ఊరికి రిటర్న్ అవుతారు.. రాజు డ్రైవ్ చేస్తూ ఉంటె మిగతా ముగ్గురూ ఎవరి కిటికీల వైపు వాళ్ళు తల వాల్చి పడుకున్నారు..

రాజు సాయంకాలం చల్ల గాలిని ఎంజాయ్ చేస్తూ ఊళ్లోకి ఎంటర్ అవుతున్నాం అనగా అప్పుడే లేచిన సుధ..

సుధ - థాంక్స్ రాజు ఈరోజు బాగా టైం స్పెండ్ చేసాం.. బట్ కొన్ని డేస్ పల్లెటూళ్ళు అండ్ ఇష్యూస్ మీద రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నా.. రాగలవా..

రాజు - రోజూ అంటే కష్టం కానీ నువ్ ప్లాన్ చేసుకొని చెప్తే నేను వీలు చేసుకుంటా..

సుధ - ఓకే అని మిగతా విషయాలు మాట్లాడుకుంటూ పెద్దారెడ్డి ఇంటి దగ్గరకి చేరతారు..

బాలు - ఒరేయ్ నేనిక్కడ దిగిపోతారా..

సుధ - అవును మర్చిపోయా నీ మొక్కు తీర్చుకున్నావా...

బాలు - ఎం మొక్కులో ఏంటో పాతవి పోయి కొత్తవి వచ్చాయి..

సుజ - అక్క అవి మొక్కులు కాదే.. మేకులు.. విన్నావంటే కర్ణభేరి కి చిల్లులే..

బాలు కార్ దిగి.. ఒకానొక రోజు వస్తుంది.. ఆ రోజు...

రాజు - రేయ్ నేనొచ్చి వింటారా.. ఇక్కడే ఉండు..

బాలు - దుర్మార్గుడా..

సుధ - బాయ్ బాలు..

బాలు - బాయ్..

సుజ - బాయ్ హీరో..

రాజు సుధ ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు..

బాలు - (నవ్వుకుంటూ) బాయ్ బాయ్ గుడ్ నైట్ అంటూ విసిల్ వేసుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తాడు..

రాజు అక్క చెల్లెళ్లని దింపేసి కార్ అక్కడ పెట్టేసి.. వెనక్కి వచ్చి బాలు భుజం మీద చెయ్యి వేస్తూ

రాజు - ఎంట్రోయ్. కధ చాల దూరం వెళ్లినట్టుంది..

బాలు - అల అనిపిస్తుందిరా. అంతే.. ఇంచ్ కూడా కదల్లేదు...

రాజు - హెల్ప్ కావాలంటే చెప్పారా.. కొంచెం ముందుకు తోస్తా..

బాలు - హీరో లు ఎవరి హెల్ప్ లు తీసుకోరు.. సింహం సింగిల్ గా వస్తుంది.. శివాజీ ది బాస్.. నెక్స్ట్ మంత్ రిలీజ్..

రాజు - సినిమాలు చూస్తే హీరోలు అవ్వరురా...

అలా మాట్లాడుకుంటూ ఇంటిదాకా వచ్చేసరికి గురవయ్య బయట నులక మంచం వేసుకొని బీడీ కాలుస్తూ ఉంటాడు..

గురవయ్య - ఇంత పొద్దు పోయింది ఏడకి పోయార్రా..

బాలు - పొద్దున్న చెప్పానా.. స్వయంవరానికి అని..

గురవయ్య - నీకు పిల్లనిచ్చే సన్నాసి ఎవడ్రా..

రాజు - అలా అనకు తాతోయ్.. వాడు ఆల్రెడీ నీకు మనవరాలిని చూసేసాడు..

గురవయ్య - ఎవర్రా ఆ అమాయకురాలు..

బాలు - గంభీరంగా నుంచుని.. తాతా అన్నిటికి టైం రావాలి.. అప్పుడు నేనే చెప్తా..ఆలోగా ఈ బీడీ అవ్వకొట్టి బువ్వెట్టు..

రాజు - తాతా వింటూవుంటే వాడు ఎన్నైనా చెప్తాడు కానీ నే చెప్తా దా..

బాలు - రేయ్.. నా కధకి నేనే స్క్రీన్ ప్లే  నేనే  డైరెక్షన్.. నువ్వు కంపు చెయ్యకు..

రాజు - సర్లే.. తాతా ఇంతకీ ఎం వండావ్..

గురవయ్య - టమాటో పప్పేశారా..

బాలు - హే ఎప్పుడు టమాటో పప్పు బెండకాయ పులుసు.. నీకు ఇంకేం వండడం రావా..

రాజు - రేపటినుంచి నువ్వు వండరా..

అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి మళ్ళీ ఆరుబయట మంచం మీదకి చేరి ఆకాశం చూసుకుంటూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగి.. కాసేపటికి నిద్రలోకి జారుకున్నారు..

కట్ చేస్తే..

వేసవికాలం కాబట్టి సూర్యుడు తొందరగా వచ్చేసాడు..

కోటయ్య పొద్దున్నే లేచి ఆ ఫోటో చూసుకుంటుంటే.. రాంబాబు ఎలాగైనా దాన్ని కనిపెట్టి వాళ్ళ నాన్న ఆఖరి కోరిక తీర్చాలని డిసైడ్ అయ్యి పొద్దున్నే బండేసుకొని రోడ్ మీద పడతాడు..

ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చుని ఎవరూ లేని సమయం చూసి పోస్ట్ మాస్టర్ తో..

రాంబాబు - మాస్టర్ గారు మన గురవయ్యకి ఎప్పుడైనా ఉత్తరాలు వస్తూ ఉంటాయా..

పోస్ట్ మాస్టర్ - లేదు రాంబాబు.. ఏమైంది గురవయ్య అడగమన్నాడా..

రాంబాబు - లేదు లేదు ఎదో ధ్యాస లో అడిగా..

అని కాసేపాగి అక్కణ్ణుంచి జారుకుని STD బూత్ కి వెళ్ళాడు..

రాంబాబు - ఒరేయ్ సత్తిగా మన గురవయ్య ఎప్పుడైనా ఇక్కడికొచ్చి ఎవరికైనా ఫోన్ లు చేస్తూ ఉంటాడేంట్రా..

STD - లేదురా.. ఆ ముసలోడి కి మనవళ్ళు తప్ప ఎవరూ లేరనుకుంటా..

సర్లే మళ్ళీ కలుస్తా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి బైక్ స్టార్ట్ చేస్తాడు..

xxx బ్యాంకులో మేనేజర్ కేబిన్ లోకి వెళ్లి..

రాంబాబు - మేనేజర్ గారు మన ఊళ్ళో గురవయ్య అని ఉన్నాడు కదా..అతనికి మన బ్యాంకు లో అకౌంట్ ఏమైనా ఉందా..

మేనేజర్ - లేదయ్యా..చదువు రాని వాడు కదా.. వాళ్ళకి ఇలాంటివి అన్ని ఎం తెలుస్తాయి.. నువ్వు చెప్పి ఓపెన్ చేయించ కూడదూ..

రాంబాబు లేచి నుంచొని - అలాగేనండి రేపే దగ్గరుండి ఓపెన్ చేయిస్తా.. అన్నాడు పళ్ళు కొరుక్కుంటూ

రెగ్యులర్ గా పోయే గోదారొడ్డున మర్రి చెట్టు వైపు బండి పోనిస్తే.

అక్కడే కూర్చుని బాతాఖానీ కొట్టుకుంటున్న అన్నదమ్ములు కనపడ్డారు

రాంబాబు - ఎరా నిన్నంతా కనపడలేదు ఏమైపోయారు..

రాజు - అదా.. అని చెప్తూ ఉండగా..

బాలు - రేయ్ చెప్పకు చెప్పకు అని లాగుతాడు.. సీన్ అర్ధం అయ్యిన రాజు సైలెంట్ అయిపోతాడు..

రాంబాబు - ఎరా నాకు చెప్పకూడనంత రహస్యమా..

బాలు - రహస్యం అని కాదురా.. నిజం.. భయంకరమైన నిజం.. చెప్తే నువ్వు భయపడతావేమో అని..

రాంబాబు - నేనేమైన చిన్న పిల్లన్నెరా భయపడ్డానికి.. చెప్పేహే..

బాలు - సరే ఐతే విను..అని లేచి నుంచొని.. రాంబాబు బైక్ మీద ఒక కాలు వేసి.. చేతులతో సైగలు చేస్తూ..

మొన్న రాత్రి నేను రాజు గాడు బండేసుకొని పక్క వూరు సినిమా కెళ్ళాం.. తిరిగి వచ్చేటప్పుడు మన ఊరి స్మశానం మలుపు దగ్గర ఒకడు అరుచుకుంటూ బైటకి రావడం కనపడింది..

రాజు గాడు వద్దని చెప్తున్నా.. నేను వాడి వెనకాల బండి పోనిచ్చా.. వాడు మన ఊరి శివాలయం వరకు వచ్చి మాయం అయిపోయాడు..

రాంబాబు కళ్ళు పెద్దవి చేసుకొని ఇంటరెస్టింగ్ గా వింటూ ఉంటాడు.. రాజు నవ్వుకుంటూ సిగరెట్ వెలిగిస్తాడు..

బాలు - ఈలోపు మళ్ళీ ఇంకొకడు అలాగే అరుచుకుంటూ మళ్ళీ స్మశానం వైపు పరిగెత్తడం చూసి వాణ్ణి ఫాలో అయ్యాం.. వాడు స్మశానం లోపలికి అడుగుపెట్టగానే పొగలా మారిపోయాడు.. అక్కడో పెద్ద కొరివి దయ్యం.. అది కూడా వాళ్లలాగే  అరుచుకుంటూ మర్రి చెట్టు మీదకి ఎక్కి అక్కడ మాయం అయిపొయింది..              

రాంబాబు - మీరు కొరివి దెయ్యాన్ని చూసారా..

బాలు - హా చూసాం.. రాజు గాడు కూడా చూసాడు..

రాంబాబు - ఈరోజుల్లో దెయ్యాలేమిట్రా..

బాలు - నోర్ముయ్.. మొన్న ఒకడు నీలాగే నమ్మకుండా టెస్ట్ చేద్దాం అని వెళ్లి రక్తం కక్కుకొని చచ్చిపోయాట్ట.. తర్వాత నీ ఇష్టం మరి.

రాంబాబు - సర్లే ఆ దెయ్యం కబుర్లు మానేసి ఇంకేమైనా చెప్పు..

బాలు - అది కనుక్కుందామనే నిన్న ఏజెన్సీ కి వెళ్లి తాంత్రికుల్ని కలిసి వచ్చాం..

రాంబాబు - రేయ్ పాస్..పాస్.. వేరే ఏదైనా..

బాలు - మా దగ్గర ఏముంటాయి రా.. నీ దగ్గర ఏమైనా ఉన్నాయేమిటి..

రాంబాబు - మన అచ్చిరెడ్డి కూతుర్లు ఊళ్ళో దిగారంట.. చూసారా..

బాలు - ఏంటి మన అచ్చిరెడ్డే... అని రాజు వైపు చూస్తూ తల ఎగరేసాడు.. ఇంతకీ నువ్వు చూసావా..

రాంబాబు - ఎహె.. నేనడిగిన ప్రతీది నన్నే అడుగుతావేంట్రా....

బాలు - పోనీ నువ్వెళ్ళిపోరా.. వాణ్ణి అడుగుతాను....

రాజు - ఒరేయ్ రాంబాబు.. నీకున్న సామజిక జ్ఞానం ఆడికి లేదురా... ఆడు అలాగే వాగుతాడు కానీ నువ్వేం పట్టించుకోకు..

రాంబాబు - అవుననుకో..

రాజు - మరి చెప్పు ఆళ్ళకి మొహం చూపించావా..

రాంబాబు - లేదురా.. అమ్మాయిలు కత్తిలా ఉన్నారంట.. క్రాఫ్ చేయించుకుని వెళ్తా..

రాజు - ఎవడు చెప్పాడురోయ్.. అమ్మాయిలు కత్తిలా ఉన్నారని..

రాంబాబు - పాలేరు వెంకన్న గాడు..

బాలు - సరిపోయింది.. ఆ అర గుండు గాడికి నచ్చారంటే ఎలా ఉంటారో ఈజీ గా అర్ధం చేసుకోవచ్చు..

రాంబాబు - వాళ్ళు వెళ్లి పొయ్యేలోగా ఒక్కదాన్ని ఐన పడెయ్యాలిరా..

బాలు - పనిలో పని ఇద్దర్ని పడేయ్.. వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వరా.. జీవితం ఇవ్వరా..

రాజు - ఐన వాళ్ళు సిటీ నుంచి వచ్చార్రా..అక్కడే చూసుకుంటారు.. అక్కడే చేసుకుంటారు.. వాళ్ళు మనకన్నా ఫాస్ట్ ఉంటారు.. అంటూ ఇండైరెక్ట్ గా బాలు  గాన్ని వార్న్ చేస్తాడు.. నీకు కూడా కష్టమే అన్నట్టు    

బాలు - అవునురా ఏ పుట్టలో ఎం పాము ఉందొ తెలీకుండా చెయ్యి పెట్టడం ఎందుకు చెప్పు.. రిస్కు...

రాంబాబు - వాళ్ళు పాములైతే నేను పాములు పట్టేవాణ్ణి.. వాళ్ళు ఫాస్ట్ ఐతే నేను సూపర్ ఫాస్ట్..

రాజు - అది కాదురా..

రాంబాబు - రేయ్.. నా దగ్గర ఒక్క రోజులో అమ్మాయిని ప్రేమించడం ఎలా అనే పుస్తకం ఉంది.. అది చాలు వాళ్ళని నా చుట్టూ తిప్పుకోవడానికి..

బాలు - ఒరేయ్, నీకున్న విజ్ఞానానికి ఆ పుస్తకంలో ఉన్న అజ్ఞానికి మ్యాచ్ అవ్వదేమోరా... సరే ఏదైతే అదే అయ్యింది.. అల్ ది బెస్ట్..

రాంబాబు - రేయ్ నువ్వు నాకు అల్  ది బెస్ట్ చెప్పకురా..నువ్వు చెప్తుంటే నాకు ఏ పని అవ్వట్లేదు.. మొన్న ఎగ్జామ్స్ కి నువ్వు చెప్పక పొయ్యుంటే నేను పాస్ అయ్యేవాణ్ణి..

బాలు - ఓరి నీ ఆలోచన తగలెయ్య..సరే నా అల్ ది బెస్ట్ నే తీసేసుకుంటాలే కానీ వాళ్లతో కొంచెం జాగ్రత్త.. అని రాజుతో పదరా అంటాడు..

రాంబాబు కూడా బైక్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాక.. బాలు వాణ్ని పిలిచి అల్ ది బెస్ట్ రోయ్ అని అరుస్తాడు..

రాజు పగలబడి నవ్వుతూ పొట్ట పట్టుకుంటాడు..

To be continued..
[+] 9 users Like nareN 2's post
Like Reply
#36
Update baagundi
[+] 1 user Likes ramd420's post
Like Reply
#37
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#38
Nice update...but main point ki eppudu veltunda storyy ani waitingg
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#39
సరదాగా వుందండి కథనం ఇప్పటిదాకా. పారిజాతాన్ని తీసుకెళ్ళిపోయిన సాంబయ్య ఎలా వున్నాడో, ఎప్పుడెంట్రీ ఇస్తాడో. కొద్దిగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' ఇంకా 'అ ఆ'నితిన్-సమంతా ల మూవీ మాటలు, సీన్లు కనిపిస్తున్నాయి....కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#40
Nice update  thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)