Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కలలు కన్న భారతం
#1
ఈ కథ పూర్తిగా నా ఊహ మాత్రమే . ఈ కథలో జరిగినవి మొత్తం కూడా సాధ్యం కాకపోవచ్చు . మనదేశ జనాభా ఈ కథలో జనాలు ఆలోచించినట్టు ఆలోచించలేరు . ఈ కథ యొక్క ముఖ్య సారాంశం విద్య వైద్యం పని హక్కులు ప్రాథమిక హక్కులుగా చేసుకొని ఎదిగిన భారతం నా ఈ కలలు కన్న భారతం .
 మీ kp

జైహింద్
[+] 3 users Like kp162118's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
హేయ్ ఆటో ఆగు అంటూ పరుగులు తీస్తూ వస్తున్నాడు కిరణ్ . ఆటో వాడు ముగ్గురు ఆడపిల్లలు ఎక్కించుకొని కనీసం మాట ఐన వినిపించుకోకుండా ముందుకు దూసుకు వెళ్ళాడు . శకునమే బావున్నట్టు లేదు 10 గంటలకు ఇంటర్వ్యూ  9 గంటల నుండి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కిరణ్ 2 బస్సులు వెళ్లి పోయాయి బస్సులో ఎక్కడానికి ఖాళీనేలేదు టైం ఏమో 10 గంటలకి దగ్గర అవుతుంటే ఆటో లో ఐన వెళ్దాం వచ్చేప్పుడు నడిచి అయిన రావచ్చు అని ఆటో కోసం పరుగులేడితే వెళ్ళిపోయాడు ఏం ప్రయోజనం ఆ ఆటో వాడే 9 గంటల నుండి తనని ఆటో ఎక్కమని సతయించి తీరా బస్సు దొరక్కపోయేసరికి తన దురదృష్టవశాత్తు వచ్చిన అమ్మాయిలను ఎక్కించుకొని వెళ్ళాడు . ఎం చేస్తాం కర్మ అనుకుంటూ ఉండగానే ఒక బస్సు వచ్చింది ఊహించని విధంగా చాలా సీట్ లు ఖాళీ గా ఉన్నాయి . బస్సు ఎక్కి తాను దిగవలిసిన స్టాప్ లో దిగిపోయాడు కిరణ్ . ఇంటర్వ్యూకోసం వెళ్ళవలసిన ఆఫిస్ కి 10 నిముషాలు ముందుగానే చేరుకున్నాడు . అన్నింటికి సమాదానాలు సరిగ్గానే చెప్పాడు కానీ ఎవరో మంత్రి ఇచ్చిన సిఫారసు వల్ల తనకి కాకుండా పోయింది ఉద్యోగం . సరేలే రాసి పెట్టి ఉంటే వచ్చేది ఆ భాగ్యం నాకు లేదనుకుంటూ నడుస్తుంటే ఒక పన్నెండేళ్ల పాప రోడ్డు దాటుతుంటే ఒక కార్ గుద్దేసి వెళ్ళిపోయింది అందరు గుమికూడరే తప్ప ఆ పాపని హస్పటల్ కి తీసుకెళ్దాం అని ఒక్క నాధునికి అనిపించలేదు గుంపు మధ్యలోకి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న ఆ పాపని రెండు చేతుల్లో ఎత్తుకొని కార్ లు ఆటోలు అపుతుంటే ఎవరు ఆపకుండా వెళ్లిపోతుంటే అలానే దగ్గర లో ఉన్న ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయమంటే 2లక్షలు అడుగుతుంటే ఏమి చేయలేక తన మెడలో చిన్నప్పుడు మెడలో నానమ్మ వేసిన బంగారు గోలుసుని తెరిపరా ఒకసారి చూసాడు ఎప్పుడూ నా గుర్తుగా ఇది నీ మెడలో ఉండాలి రా మనవడా అని చెప్పిన నానమ్మ మాటలు చేవిలో మారుమోగుతుండగా ఇప్పుడే వస్తాను అని చెప్పి పాపని అక్కడే ఉన్న నర్స్ కి అప్పగించి గొలుసు ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఆ పాప కి ఆపరేషన్ చేపించాడు కిరణ్ . కొంత సమయనికి పాప తల్లి తండ్రులు వస్తే ఆ పాపని జాగ్రత్తగా చూసుకోమని హాస్పటల్ నుండి బయటకు వచ్చి రూమ్ కి  బయలుదేరాడు .
[+] 3 users Like kp162118's post
Like Reply
#3
హేయ్ కిరణ్ ఈరోజు అయిన వెళ్లిన పని అయ్యిందా అన్నాడు ప్రకాష్ . రోజు ఎలా అవుతుందో ఈరోజు పరిస్థితి కూడా అంతే అన్నాడు కిరణ్ . ఈరోజు కూడా పస్తులేనా మనకి అన్నాడు ప్రకాష్ . కుండలో ఉన్న చల్లని నీళ్లే ఈరోజు కి పాయసం అనుకోని తాగి పడుకో అన్నాడు కిరణ్ . కిరణ్ భోజనం చేసి రెండు రోజులు అవుతుంది రా అన్నాడు ప్రకాష్ . జేబులు తడుముకుంటే మొత్తం చిల్లర కలిపి 15 రూపాయలు ఉన్నాయి సరే రా ఉండు బ్రెడ్ ఐన తీసుకొని వస్తాను అని వెళ్లి బ్రెడ్ తీసుకొచ్చి ప్రకాష్ కి ఇచ్చాడు కిరణ్ .నువ్వు తిను రా అని ఇవ్వబోతుంటే నాకు ఆకలిగా లేదని పడుకొని నిద్రపోయాడు కిరణ్ . ప్రకాష్ కిరణ్ చంద్ర ఉంటారు అదే రూమ్ లో . ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబుల వేటలో పడ్డారు . చంద్ర కి ఎవరో దూరపు చుట్టం సినిమాలో తెలిస్తే అక్కడ ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోయాడు డబ్బులు ఇవ్వకపోయినా కనీసం కడుపు ఐన నిండుతుందని . ప్రకాష్ బ్యాంక్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాడు . ముగ్గురు కలిసినప్పటి నుండి ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కాలం గడిపేస్తూన్నారు . రాత్రి పది గంటలకు రూమ్ కి చేరుకున్నాడు చంద్ర . ప్రకాష్ ని కిరణ్ లేపి ఈరోజు మా డైరెక్టర్ గారి కూతురు పుట్టిన రోజు అందుకే లెట్ అయ్యింది మీ కోసం ఏం తెచ్చానో చూడండి అంటూ బిర్యానీ ప్యాకెట్స్ బయటకు తీసి తినండి అంటూ ఎదురు పెట్టాడు చంద్ర . ఏరా నువ్వు తిన్నావా అన్నాడు కిరణ్ .మీరు తినకుండా నెనుఎప్పుడైన తిన్నాన అన్నాడు చంద్ర . బిర్యానీ కలిపి ఇద్దరికి తినిపిస్తూ తాను తిన్నాడు కిరణ్ . హమ్మయ్య ఇంకో రెండు రోజులు వరకు ఆకలి ఉండదు అన్నాడు ప్రకాష్ . ఏంటి రా చంద్ర అలా ఉన్నావ్ అన్నాడు కిరణ్ .  ఏమి లేదురా రోడ్లమీద చిన్న చిన్న పిల్లలతో పనిచేయిస్తున్నారు ఇదేనా మన భారతం ఇదేనా చదువుకున్న వాడికి ఉద్యోగం ఉండదు తినడానికి తిండి ఉండదు పడుకోవడానికి ఇల్లు సరైన మౌలిక సదుపాయాలు లేకుండా మన దేశంలో ఎంత మంది ఉన్నారో ప్రపంచంలో పేదలు ఎక్కువ ఉన్నదేశం ఆకలి సూచిలో అట్టడుగున ఉన్నాం కానీ మనదేశంలో కుబేరులు ఉన్నారని విదేశీ పత్రికలు చెబుతుంటాయి అందరికి విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారో ఈ రాజకీయ నాయకులు మన పొరుగున ఉన్న చైనా అగ్రదేశలతో పోటీ పడి ఎదుగుతుంటే మనం మనదేశ సంపాదలైన యువకులను విదేశాలకు పంపి మా వాడు అది అయ్యాడు మా వాడు ఇది అయ్యాడు అని గొప్పలు చెప్పుకుంటాం . బ్రిటీష్ వాళ్ళు అడుగుపెట్టకముందు ప్రపంచంలో ధనిక దేశం భారతదేశం . వాళ్ళు మన సంపదని కొల్లగొట్టారు మొత్తం దోచుకొని వెళ్లారు నిజమే వాళ్ళు దేశం విడిచి 65 సంవత్సరాలు అయిన ఈ స్వతంత్ర భారతంలో ఆర్థికద్వందత్వం కనిపిస్తుంది ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుంటే పేదవాడు ఇంకా పేదరికంలో కురుకొని పోతున్నాడు . ఈ పరిస్థితులు మారాలి అంటే యువత రంగం లోకి దిగాలి మన రాష్ట్రంలో 294 స్థానాల్లో విద్యావంతులైన వారు రావాలి అన్నాడు చంద్ర . ఏమిరా చంద్ర ఇంత ఆవేశం ఎందుకు రా మనకి దొరికిందా తిన్నమా లేదా పస్తు పడుకున్నమా అన్నట్టు ఉండాలి రా అన్నాడు ప్రకాష్ . అందరూ నీలాగే ఆలోచిస్తే ఈ దేశం ఎప్పటికి బాగుపడదు రా అని పడుకున్నాడు చంద్ర .
[+] 3 users Like kp162118's post
Like Reply
#4
చంద్ర మాటలు బాగా మనసుకు గుచ్చుకుంటున్నాయి ఎంత ప్రయత్నించినా నిద్రరావడం లేదు .    తాను ఇక్కడికి వచ్చింది ఎందుకు ఒక ఐఏఎస్ ఆపిసర్ అవుదామని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏదొక ఉద్యోగం చేసుకుంటూ చదుకోవలని తాపత్రయం . మొన్న జరిగిన ప్రిలిమినరి పరీక్ష లో అర్హత సాధించి కూడా తన ఆలోచనలు ఎందుకు ఇలా సాగుతున్నాయి . చిన్నప్పుడు తాతయ్య దేశానికి ఉపయోగపడేలా బతకాలి రా అని చెప్పిన మాటలు తన మనసులో పాతుకొని పోయాయి ప్రజలకు ఏమైనా చేయాలి చేయాలి అని మనసు మదనపడుతుంటే నువ్వు
 ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన సేవచేయొచ్చు కదా అని ఇంకో వైపు మనసు పోరాటం చేస్తుంది . ఎట్టకేలకు రాజకీయాల్లోకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది మనసులో ఎక్కువ భాగం  . అసలు రాజకీయాల్లో అనుభవం పలుకుబడి డబ్బు లేకుండా ఎలా నెగ్గుకు రాగలవు ఈ ప్రజలకు మంచి మాటలు ఎన్ని చెప్పిన వింటారు ఓటు మాత్రం డబ్బు ఇచ్చినవాడికే వేస్తారు ఎప్పుడైతే మంచి ఓటర్లు పోయారో అప్పుడే మంచి రాజకీయ నాయకులు పోయారు నా మాట విని రాజకీయాలు అనే ఆలోచన విరమించుకో నువ్వు ఈ సారి కాకపోయినా వచ్చే సంవత్సరం అయిన ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవుతావు రాజకీయాల్లో ఓటమి తట్టుకోలేవు అని మిగిలిన భాగం ఘోషించింది . చివరకు రాజకీయాల్లోకి వెళ్ళడానికి నిర్ణయించాడు కిరణ్ . ఉదయాన్నే భానుడి కిరణాలు స్పర్శ కి కళ్ళు తెరచి అద్దం లో తన మొహం చూసుకున్నాడు కిరణ్ . ఎప్పుడు లేని ఎదో శక్తి తనలో ఉన్నట్టు అనిపించింది కిరణ్ కి . ఉదయాన్నే రెడీ అయ్యి షూటింగ్ కి వెళ్తున్న చంద్ర ని అపి రాత్రంతా ఆలోచించాను రా నేను పోటీచేస్తాను ఎన్నికల్లో అన్నాడు కిరణ్ . అప్పటి వరకు నిద్రపోతున్న ప్రకాష్ లేచి ఆలోచించావా ఎన్నికల్లో పోటీచేస్తావా ఎవరు ఇస్తారు రా నీకు నువ్వు వస్తున్నావ్ అని నీకు సీట్ ఇచ్చి గెలిపిస్తారు వెళ్లు దండలు రెడీ చేయిరా చంద్ర అన్నాడు ప్రకాష్ నవ్వుతూ . రేయ్ నువ్వు అపరా నువ్వు చెప్పు బంగారం బాగా ఆలోచించే కదా  మళ్ళీ వెనకడుగు వేయవుగా అన్నాడు చంద్ర . వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఈరోజు నుండి రాష్ట్రం మొత్తం చుట్టి వద్దాం పదండి అన్నాడు కిరణ్ . మరి డబ్బు అన్నాడు ప్రకాష్ . మా ఇంటికి వెళ్లి పొలం అమ్మి వచ్చిన డబ్బుతో వెళదాం రా అన్నాడు కిరణ్ . సరే అని పొద్దున్నే రైలు ఎక్కి సాయంత్రం కు కిరణ్ ఇంటికి చేరుకున్నారు మిత్రులు . కిరణ్ ని చూసిన ఆనందం లో కిరణ్ అమ్మ ఎన్ని వంటలు చేసిపెట్టిందో అన్ని తిన్న ప్రకాష్ గాడికే తెలియాలి . రాత్రి మేడ మీద పడక వేసి తనివి తీరా నిద్రపోయారు ముగ్గురు .
[+] 3 users Like kp162118's post
Like Reply
#5
ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో తన నిర్ణయాన్ని చెప్పాడు కిరణ్ . ఇక్కడ కిరణ్ ఫ్యామిలీ గురించి కొంచం చెప్పుకుందాం . కిరణ్ వాళ్ళ తాతయ్య రాఘవయ్య అపరిమితమైన దేశభక్తి ప్రజలకు ఎదో చేయాలని కోరిక ఆ కోరిక తో అవసరం అన్నవాళ్ళకి కాదనకుండా ఇచ్చాడు . ఆస్తిలో సగం అరగదీసి వెళ్ళాడు . రాజరామ్మోహన్ రాయ్ మీద ఉన్న అభిమానం తో రామ్మోహన్ అని పేరు పెట్టాడు . పేకాట మద్యం అన్ని రకాల వ్యసనాలతో మొత్తం ఆస్తి అంత అవ్వచేసి చివరికి 5 ఎకరాల పొలం మిగిల్చి కన్నుమూశాడు . కిరణ్ కి పేరు పెట్టింది రాఘవయ్య నే తన కిరణాలతో దేశాన్ని ప్రసరింప చేస్తాడని ఆ పేరు పెట్టాడు . ఏరా మీ నాన్న తాత కాజేసిన ఆస్తులు సరిపోలేదా మళ్ళీ ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకుంటే రోడ్డు మీద పడతాము రా ఒక్కసారి ఆలోచించు కన్నా అంది కిరణ్ తల్లి . అమ్మ నేను నిర్ణయం తీసేసుకున్నాను అన్నాడు కిరణ్ . నిజమా నా ముద్దుల మనవడా నువ్వు దేశ సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్తున్నవా ఐతే నా పేరు మీద ఉన్న 3 ఎకరాలు అమ్ముకొని తీసుకొని వెళ్లు అంది జానకమ్మ . నా పేరు మీద ఉన్న పొలం కూడా అమ్ముకొని తీసుకెళ్లు అంది పద్మ . వద్దులే అమ్మ కనీసం 2 ఎకరాలు అన్న మిగలనివ్వు కనీసం తిండికి జరిగిపోతుంది అని   బజారుకు వెళ్లి ఇలా తన పొలం అమ్ముతున్నాను అని చెప్పగానే చాలా మందే వచ్చారు . 3 ఎకరాలకు కలిపి 14 లక్షలు వచ్చింది . అసలు తాను పొలం ఎందుకు అమ్మతున్నాడో కనుక్కున్న వాళ్ళు రాఘవయ్య గారి మనవడు రాజకీయాల్లోకి వెళ్తున్నాడు అంట  వాడు చదువుకున్నోడు తెలివైనోడు ఇలాంటి వాడు ఒకడు ఉండాలి రా అని చందాలు పొగుచేసి మొత్తం 14+1=15 లక్షలు కిరణ్ చేతిలో పెట్టారు . వాళ్ళ అభిమానానికి కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా మీ రుణం నేను ఎప్పటికి తీర్చుకోలేను  అని అందరికి నమస్కారం చేసి ఇంటికి వెళ్లి బట్టలు సర్దుకొని ప్రయాణం అయ్యారు మిత్రులు . ఇప్పుడు మన పని ఏంటి రా అన్నాడు చంద్ర . ఏమి లేదు రా ముగ్గురం కలిసి ఉండడం కంటే విడివిడిగా ఉంటేనే పనులు త్వరగా అవుతాయి ముగ్గురం తలో వేరు వేరు జిల్లాల్లో తిరిగి చదుకున్న యువత దేశానికి సేవ చేసే వాడు ఏ నేర చరిత్ర లేని వాళ్ళను వడకట్టడం మొదలు పెడదాం అన్ని ఒక లిస్ట్ తయారు చేసుకొని మన రూమ్ దగ్గర మీట్ అవుదాం అంటూ ఇద్దరికి చెరొక 5 లక్షలు ఇచ్చాడు . రెండు నెలలుకు పైగా పట్టింది లిస్ట్ తయారు చేయడానికి . మొత్తానికి ముగ్గురు రూమ్ లో కలుసుకున్నారు . లిస్ట్ లు అన్ని ప్రింట్ తీసి వారి చరిత్రలు తెలిసినంత వరకు తెలుసుకొని అసెంబ్లీ కి294 మందిని , పార్లమెంట్ కి 42మంది యువకుల్ని సెలెక్ట్ చేసారు మిత్రులు . ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు ప్రకాష్ .  చేయడానికి ఏముంది అసలు మనం మన రాష్ట్రం లో ఎవరికి తెలుసు మనల్ని మనం పరిచయం చేసుకుందాం పదండి . ప్రజల అవసరాలు బాధలు కన్నీళ్లు సుఖాలు అన్ని తెలుసుకొని మీ కష్టాలు తీర్చి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము వస్తున్నాం అని తెలుపుదాం పదండి అన్నాడు కిరణ్ . ఎన్నికల కమిషనర్ ని కలిసి కొత్త పార్టీ కి గుర్తు జండా ఆమోదం పొందారు .  పాదయాత్ర ని మొదలు పెట్టాడు కిరణ్ . తన మ్యానిఫెస్టోలో పెద్దగా ఏమి లేదు ఒకటే మాట అదేశిక సూత్రాలను అమలు చేస్తాను అన్న పదం తప్ప . ప్రతి ఊరు తిరుగుతూ తన వాక్చాతుర్యంతో అందరిని నవ్విస్తూ ఒక్కసారి విద్యావంతులైన సేవతత్పరతా భావం ఉన్న 294 మంది ని గెలిపించండి అలాగే పార్లమెంట్ 42 స్థానాల్ని గెలిపించండి ఈ దేశం ఎందుకు మారదో మీకు చూపిస్తాను ఓటు కి డబ్బు ఇచ్చి మళ్ళీ వసూలు చేసుకోవడం కాదు రాజకీయం అంటే మీ ఓటు తో మమ్మల్ని గెలిపిస్తే ప్రగతి ఏంటో చూపిస్తాను ఒకవేళ చూపించలేకుంటే రాజకీయ సన్యాసం చేస్తాను అని గట్టి గట్టిగా చెప్తుంటే ప్రతి ఒక్కరిని తాకాయి ఆ మాటలు . టీవీల్లో చర్చ మొదలైంది అసలు ఏ అనుభవం లేని వాళ్ళు రాజకీయాలు లోకి వచ్చి ఏమి చేస్తారు అని . విద్యావంతులు త్వరగానే అర్థం చేసుకుంటారు అని పాజిటివ్ టాక్ నే వచ్చింది రాష్ట్రం అంతట . ఎన్నికలు మొదలు అయ్యాయి . అంత ప్రశాంతంగా సాగిపోయింది . ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి . దేశ చరిత్రలోనే ఇదొక ఆమోఘ ఘట్టం విద్యావంతులైన యువత కె పట్టం కట్టారు రాష్ట్రప్రజలు 294 సీట్లకి గాను 275 , 42 కి గాను 38 సీట్లు సాధించింది అంటూ చెప్పుకుపోతున్నారు టీవీల్లో . ఇంకో విషయం ఏంటి అంటే కిరణ్ ఏ పార్టీకి మద్దుతూ ఇస్తే వారే పీఎం . తన మద్దతు తో పీఎం ప్రమాణ స్వీకారం చేసాడు . రాష్ట్ర అభివృద్ధి కి సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు . అట్టహాసలకు దూరంగా కిరణ్ రాజ్ భవన్ లో తోటి మంత్రులతో ప్రమాణం చేసాడు . తన తొలి ఫైల్ సంతకాన్ని ఆరోగ్యం కోసం ఇక నుండి హాస్పిటల్ కి డబ్బులు చెల్లించనక్కరలేదు అందరికి ఉచిత వైద్య సేవలు అందుతాయి ఇక నుండి డాక్టర్స్ కి నెల జీతం ఇవ్వబడుతుంది అలానే విద్య కూడా ఈ పాఠశాలకు అయిన ఏ కాలేజ్ కైనా వెళ్లి చదువుకోండి ఉచితంగా  ఫీస్ లు కట్టాల్సిన అవసరం లేదు . విద్యని ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కులు గా మార్చబోతున్నాను .
[+] 3 users Like kp162118's post
Like Reply
#6
ఇవి రెండూ సక్రమంగా ఉంటే దాని అంతటా అదే బాగుపడుతుంది దేశం . రైతు కు పంటకు ముందే డబ్బు అందించడం జరుగుతుంది . అలానే ప్రతి ఇల్లు ఒక కర్మగారమై వస్తువులను తయారు చేసి మన అవసరాలకు వాడుకొని పక్క దేశాలకు పంపడం జరుగుతుంది . ఎప్పుడో ప్రవేశపెట్టిన విద్యావిధనానికి సమాధి కట్టి కొత్త విద్య విధానం ప్రవేశ పెడతాను . ఇవ్వని మీరు ఇచ్చిన 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను అని మాట ఇస్తున్నాను అంటూ ముగించాడు కిరణ్ . చప్పట్లతో దద్దరిల్లింది రాజ్ భవన్ . విద్య వైద్యాలు ప్రభుత్వ పరం అనగానే గజగజ వణికి పోయింది కార్పొరేట్  ప్రపంచము . ముందుగానే చర్యలు తీసుకోవడం వల్ల త్వరలోనే తెరదింపారు . అసెంబ్లీ లో మెజారిటీ ఉండడం వల్ల ప్రతి బిల్ పాస్ అయ్యింది . విద్య ఆరోగ్యం ప్రాథమిక హక్కులుగా మార్చడానికి ఎంపీ లు ససేమిరా అన్నారు . తన మద్దతు ను ఉపసంహరిస్తానని చెప్పగానే ప్రభుత్వం పడిపోతుందని ఆమోదించారు . స్వతంత భారతంలో ఆరోగ్యం చదువు ప్రాథమిక హక్కులు అయ్యాయి . కార్మిక యాజమాన్యం కూలీలకు భాగస్వామ్యం కల్పించింది . వృత్తి విద్యా విధానాలు నైపుణ్యాలను ప్రతి గ్రామానికి చెర వేసి గ్రామమే పరిపాలన కి మొదటి మెట్టు అన్నట్టు చేసాడు కిరణ్ .వృత్తి విద్యా నైపుణ్యం వల్ల ప్రతి ఇల్లు ఒక కర్కాణగా అయ్యింది . ఎవరు పింఛన్ లా కోసం ఎదురు చూసేది లేదు . ఎగుమతులు పెరిగి ఆంద్రప్రదేశ్ దేశం లోనే మొదటి స్థానానికి చేరుకుని అన్ని రాష్ట్రాలూ ఆంద్రప్రదేశ్ వైపు చూసాయి . తరువాత ఎన్నికల్లో జనాన్ని ఎవరు ఓట్లు అడగలేదు . ఈ ఐదు సంవత్సరాల్లో దేశం లోని విద్యావంతులు నేర చరిత్ర లేని వాళ్ళు సేవ తత్పరత ఉన్నవాళ్లను సెలెక్ట్ చేసాడు . తరువాత ఎన్నికల్లో తాను సెలెక్ట్ చేసిన వారిని పోటీలో నిలబెట్టాడు . ఈ ఎలక్షన్స్ లో కూడా మ్యానిఫెస్టో ఏమి లేకుండా అదేశిక సూత్రాలు అమలు చేస్తాను అని చెప్పాడు . అసాధ్యం సుసాధ్యం అయ్యింది 545 సీట్లకి గాను 400 సీట్లు గెలుచుకుంది కిరణ్ పార్టీ . ఎదురు అనేది ఏమి లేకపోవడం తో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి . దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగి నిలువలు పెరిగాయి .  అలాగే మన దేశ అతి పెద్ద దిగుమతి అయిన పెట్రోలియం ను తగ్గించాలంటే వాహనాల వినియోగం తగ్గించాలని దానికి తగ్గట్టు గానే అనుఇందనాలు మీద పరీక్షలు జరపాలి అని చెప్తూ  ఎక్కువ ప్రబుత్వం రవాణ సౌకర్యాలు వాడుకోవాలని ప్రబుత్వ ఉద్యోగులు అందరూ వీలైతే సైకిల్ మీద అఫిస్ కి వస్తే ఆరోగ్యం అని మీరు సైకిల్ వాడుతూ అందరికి ప్రచారం చేయాలి అని ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర్వులు జారిచేసాడు . దేశం మొత్తం ప్రతి ఇల్లు ఒక కర్కాణగా మారి ప్రపంచదేశాలు చూస్తుండగానే డాలర్ రేటు రూపాయి రేటు సమానం అయ్యి అన్ని దేశాల వ్యవహారాలు ₹ సింబల్ తో జరుగుతూ భారతదేశం అగ్రదేశంగా రూపుదిద్దుకుంది .  జైహింద్ .
[+] 5 users Like kp162118's post
Like Reply
#7
ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా బాగుంది బ్రదర్
[+] 1 user Likes Chiranjeevi's post
Like Reply
#8
చదువుకున్న వాడు ఏమైనా చేయగలడు అనేది నిజమే kp భయ్యా,కానీ అది జరగాలంటే మార్పు చాలా అవసరం..

ఆదేశిక సూత్రాలు అమలు చేస్తాను అనే పాయింట్ సూపర్,సరిగ్గా అవి అమలు అయితే దేశం ఒక్క సంవత్సరం లో పూర్తిగా మారిపోతుంది..

విద్య,ఆరోగ్యం ప్రాథమిక హక్కులు,వీటి కోసం చాలా మంది ప్రయత్నించారు..కానీ మన ఇండియా లో పొరపాటున కూడా వీటిని ప్రాథమిక హక్కులుగా చేయరు రాజకీయ నాయకులు. దేశంలో జరిగే లాభసాటి వ్యాపారం ఆ రెండింటి పైనే జరిగేది...

మీ ఆలోచన బాగుంది,కానీ ఇలాంటి సమాజం కోసం కొందరైనా తపిస్తూ ఉండటం సర్వసాధారణం.. అలాంటివాళ్ళల్లో నేనూ ఒకడిని...చదువుతున్నంతసేపూ చాలా హ్యాపీగా అనిపించింది.. మనమేమీ చేయలేకపోయినా కనీసం ఇలాంటివి చదువుతూ ఆనందం పొందడమే Smile

మన భారతం ఎప్పుడూ మారదు,ఒకవేళ మారితే ప్రపంచ వింతే..
థాంక్యూ kp మిత్రమా.
@ సంజయ సంతోషం @
[+] 4 users Like మన్మథుడు's post
Like Reply
#9
Katha cahadavataniki baagundi....nijam avvalante bhoomi tiragabadi....kotta manushulu puttali.....may be appudu jaragavachemo.....merannavi
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#10
Good story  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)