Thread Rating:
  • 8 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పారిజాతాపహరణం
#1
Video 
పారిజాతాపహరణం..


1992 ..

అప్పటికింకా కేబుల్ రాని చిన్న పల్లెటూరు.. ఊరి చివర చిన్న పాకలో..

ఒక్కగానొక్క గదిలో ఓ మూలగా నులక మంచం.. కిటికీలో చిన్న రేడియో.. పక్కనే చిన్న అర.. పై అరలో 2  మందు సీసాలు.. కింద అరలో బీడీ కట్ట.. అగ్గి పెట్టె..

కిటికీకి ఇంకో పక్క గోడకి మేకులు కొట్టి 2 మాసిపోయిన చొక్కాలు..ఒక లుంగీ..

గుమ్మం పక్కన దేవుడి ఫోటో.. బయటకు వెళ్తుంటే.. దేవుడి ఫోటో కనపడాలి.. లోపలి వస్తుంటే మందు సీసా కనపడాలి.. అదీ లెక్క..

గురవయ్య, సాంబయ్య వాళ్ళకిచ్చిన డ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నారు.. ఫోటో చూస్తూ..

సాంబయ్య - అన్నా, నిజంగా ఈ ఉంగరం అంట అదృష్టం తెస్తుందంటావా..

గురవయ్య - అయ్యన్నీ మనకెందుకురా.. దొంగతనానికి బేరం వచ్చింది.. అది ఆళ్ళకి ఇచ్చెత్తే మన ఎయ్యి రూపాయలు మనకొత్తాయ్.. మన పని మనది.. అది అదృట్టమే తెస్తా[b]దో .. ఆపదలే తెస్తదో మనకెందుకు.[/b]

సాంబయ్య - అవున్లే అన్న, అదృష్టం తలుపు తట్టాలన్న అదృష్టం ఉండాలి..

గురవయ్య - నవ్వుతూ.. అంతోటి అదృట్టమే మన కాడ ఉంటె ఈ దొంగ బతుకులు ఎందుకు బతుకుతాం రా.. సోది ఆపి పద..

హరికేన్ లాంతరు పట్టుకొని గుడిసె బయటకి వచ్చి తలుపు దగ్గర పెట్టి వదిలేసి.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు..
అమావాస్య చీకటి.. కీచురాళ్ళ చప్పుడు తప్ప.. వీళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు..

దూరంగా గుడ్లగూబ అరుపులు.. రోడ్డుపక్కన కుక్క వీళ్ళకేసి అనుమానంగా చూస్తుంటే.. 

సాంబయ్య - అన్నా, దొంగతనానికి ఈ అమావాస్య అర్ధరాత్రి ముహుర్తలేమిటి చెప్పు.. ఏ పౌర్ణమి నాడో పెడితే బావుంటుంది కదా..

గురవయ్య - ఏంట్రా బావుండేది.. దొంగతనానికి ఎళ్ళినప్పడు అక్కడ మనకి ఎవడూ కనపడక పోయిన పర్లేదు కానీ మనం ఎవడికి కనపడకూడదు..అందుకే చీకటి రోజుల్లో ఐతే ఎవడికి చిక్కకుండా పని అయిపోద్ది..

సాంబయ్య - అది కాదన్న అక్కడ చీకట్లో మనకి మాత్రం ఏం కనపడుద్ది చెప్పు..

గురవయ్య - తల తింటున్నావ్ కదరా.. ఎనకటికి నీలాంటోడే.. దొంగతనం చేసే ఇంట్లో ఓనర్ నే సాయం రమ్మన్నాడంట. ఆడికి ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుత్తాయని.. ఆలా ఉంది నీ కద..

సాంబయ్య - మరి తర్వాత ఏమైంది..

గురవయ్య - చెప్తారా.. ఇంటికెళ్ళాక తీరిగ్గా చెప్తా.. ముందు వచ్చిన పని చూద్దామా..
[+] 13 users Like nareN 2's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఇద్దరూ దొంగతనం చేయాల్సిన బంగాళా దగ్గరకి చేరుకున్నారు... అది పూర్వకాలం నాటి రాజుగారి బంగాళా.. అర్ధరాత్రి ఐన ఇంకా కొన్ని దీపాలు వెలుగుతున్నాయి.

అరుగుమీద కాపలావాడు పండుకుని ఉన్నాడు.. ఇద్దరూ గోడ దూకి పెరటి వైపు వెళతారు.. అటునుంచి మండువాలోకి దూకి పారిజాతం అనబడే ఉంగరాన్ని కొట్టెయ్యాలి..

గురవయ్య  సాంబయ్య చేతిలోని ఫోటో మల్లి ఒక్కసారి చూసి మొదలు పెడదామా అన్నట్టు తలా ఆడిస్తాడు..

ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు పైకి గెంటుతూ అలికిడి కాకుండా లోపలికి చేరుకుంటారు..

చల్ల గాలి కోసం ఇంటి లోపల అన్ని తలుపులు కిటికీలు తెరిచే ఉన్నాయ్.. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ దేవుడి గది వైపు చూసేసరికి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద.. మిల మిలా మెరిసిపోతూ "పారిజాతం" కనపడుతుంది..

గురవయ్య - రేయ్.. ఇక్కడ ఉంది ఇలా రా అని పిలుస్తాడు..

సాంబయ్య ఆ హడావిడిలో మండువా పక్కనున్న రాగి బిందెని తన్నేసాడు.. ఆ శబ్దానికి ఇల్లంతా థియేటర్ లో లైట్ లు వెలిగినట్టు వెలిగాయి..

గురవయ్య  - రేయ్ వాళ్ళని నే చూసుకుంటా.. నువ్వెళ్ళి "పారిజాతాన్ని" తీసుకువచ్చేయ్..

ఈలోపు  రాజుగారు.. పని వాళ్ళు అంతా వచ్చి వీళ్ళని చూసేస్తారు.. సాంబయ్య దేవుడి గదిలోకి వెళ్లి ఉంగరం తీసుకుని పారిపోతూ ఉండగా పనివాడు వెంట పడతాడు.. గురవయ్య పని వాణ్ని వెనక నుంచి ఒడిసి పట్టుకుంటాడు..

సాంబయ్య తప్పించుకుంటాడు.. గురవయ్య దొరికిపోతాడు.. రాజు గారు కోపం గా చూస్తూ ఉంటాడు..



తరువాతి రోజు ఉదయం 10  గంటలు..

సెక్యూరిటీ ఆఫీస్.. ఇద్దరు యూనిఫామ్ లో నుంచుని  ఉండగా .. గురవయ్య కింద కూర్చుని ఉన్నాడు.. పై అధికారి రాగానే..

రాజు గారు జరిగిన విషయం చెప్తాడు..

అధికారి - ఎక్కడరా నీ సావాసగాడు.. ఉంగరం ఎక్కడ అమ్మాలనుకున్నారు..

గురవయ్య - వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్..

అధికారి - వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసు కదా.. అన్నాడు ఊసలు చూపిస్తూ..

గురవయ్య ఎం మాట్లాడాలో తెలియని వాడిలా తలా దించుకు కూర్చున్నాడు..

ఇంతలో మన పార్టీ యువజన నాయకుడు అచ్చిరెడ్డి ఎదో పని మీద పై అధికారిని కలవడానికి వస్తాడు..

అచ్చిరెడ్డి కి కుర్చీ చూపించి తనూ కూర్చుంటాడు అధికారి..

అధికారి - చెప్పండి అచ్చిరెడ్డి గారు.. ఏంటి విషయం..

అచ్చిరెడ్డి - అదేనండి రేపు మా పార్టీ వాళ్ళు బంద్ ప్రకటించారు కదా, ఆ విషయం మాట్లాడదామని వచ్చా..

అధికారి - మీ రాజకీయాలు భలే విచిత్రం గా ఉంటాయండి..ప్రజల కోసం పని చేస్తున్నామంటూ.. వాళ్ళని పని చేసుకోనివ్వకుండా..బంద్ లు చేస్తారు.. చూద్దాం ఒక్కరోజు బంద్ వల్ల ప్రపంచం ఏం మారిపోతుందో..

అచ్చిరెడ్డి - హహ్హహా.. ప్రపంచంలో  ప్రతీ జీవికి ఉనికి కోసం పోరాటం తప్పదు సార్..అదే మేం కూడా చేసేది.. సరే వెళ్ళొస్తాను..

అని లేచి పక్కకి తిరగగానే కింద కూర్చున్న గురవయ్యని చూస్తాడు..

అచ్చిరెడ్డి - గురవయ్య ఇక్కడున్నావేంటి..

అధికారి - రాజు గారి ఇంట్లో దొంగతనం కేసు..

అచ్చిరెడ్డి - నేనొక్కసారి గురవయ్యతో మాట్లాడతాను..

గురవయ్య జరిగిన విషయం చెప్తాడు.. ఈలోపు అచ్చిరెడ్డి మనిషి ముందుకు వచ్చి అన్నా.. సాంబయ్య పొద్దున్న రైల్వే స్టేషన్ దగ్గర కనపడ్డాడు..అని చెప్తాడు..

అధికారికి అచ్చిరెడ్డి కి విషయం అర్ధం అయ్యింది..

అచ్చిరెడ్డి - సార్, సాంబయ్యని వెతికే ప్రయత్నం చెయ్యండి.. గురవయ్య కి నేను బెయిల్ ఇస్తాను..

అధికారి - ఎందుకు సార్ దొంగల్ని మళ్ళీ ఊరి మీదకి వదులుతున్నారు..

అచ్చిరెడ్డి - అది కూడా ఉనికి (తిండి కోసం అన్నట్టు చెయ్యి చూపెడుతూ) కోసం పోరాటమే సార్.. పద గురవయ్య అని బయటకి వస్తాడు...


సాయంత్రం.. 4 .. 

సారా కొట్టు దగ్గర..గురవయ్య బాధగా కూర్చొని శూన్యం లోకి చూస్తూ ఉన్నాడు.. క్లీనర్ వచ్చి ఏం ఇవ్వమంటావ్ బాబాయ్.. అనగానే.. 10 రూపాయల నోటు ముందు పెట్టగానే... వాడు రెగ్యులర్ సీసా తెచ్చి గురవయ్య ముందు పెడతాడు..

 

ఒక్కో చుక్కా గొంతులోకి దిగుతుంటే..అది కళ్ళలోంచి ఆవిరి లా బయటకు వస్తోంది.. ఇంత మోసం.. ఇచ్చిన మాట.. రేపటి రోజుని ఏంటి అనే ఆలోచనలలో ఉండిపోయాడు..

 

తనకి బాగా అలవాటైన చీకటి ముసురుకోగానే మనసు కొంచెం నెమ్మదించింది.. భారంగా ఒక్కో అడుగు వేస్తూ  తన ఇంటి వైపు వెళ్తుంటే.. రచ్చ బండ దగ్గర ఇద్దరు పిల్లలు బన్ను ముక్క చెరో సగం పంచుకుని తింటున్నారు..



వయసు నీరసమో.. మనసు నీరసమో తెలీదు కానీ కొంచెం అలిసినట్టు అనిపించి రచ్చ బండ దగ్గరకి వచ్చి వీళ్ళ పక్కాగా కూర్చుంటాడు..


పిల్లల్లో పెద్దాడు..తన తమ్ముణ్ణి లేపి వేరే వైపు కూర్చోపెట్టుకుంటాడు.. వాడి చేతిలో ఉన్న బట్టల మూట ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటాడు..


గురవయ్య - ఎవర్రా మీరు.. ఇంతరాత్రప్పుడు ఇక్కడేం చేస్తున్నారు..


పెద్దాడు - మేమా.. నేను అన్నయ్య - వీడు తమ్మడు.. నువ్వెవరు..


గురవయ్య - (హహ్హహా) నేనా..తాత ని.. ఎక్కడి కైనా వెళ్తున్నారా..ఎక్కడ నుంచైనా వస్తున్నారా..


పెద్దాడు -  రాజమండ్రి నుంచి వస్తున్నాం..
 

గురవయ్య - అవునా... మన ఊరి వాళ్ల్లు రాజమండ్రి లో ఎవరూ లేరే.. అక్కడ ఎవరి తాలూకా..
 

పెద్దాడు  - అక్కడకి విజయవాడ నుంచి వచ్చాం..


గురవయ్య - అలాగా.. అది ముందు చెప్పొద్దురా.. విజయవాడ లో ఎక్కడ..


చిన్నాడు - అక్కడకి గుంటూరు నుంచి వచ్చాం..


గురవయ్య - ఎహె.. అసలు మీ ఊరేంటంటే ఆటలాడతారేందిరా..


పెద్దాడు - మాది ఈ వూరే..


గురవయ్య - చంపారు కదరా.. ఆ మాట ముందే చెప్పొద్దూ.. ఈ వూళ్ళో ఎవరింటికి..


పెద్దాడు - మీ ఇంటికే..


 గురవయ్య - ఎంట్రోయ్.. ఏలుడంత లేరు.. నాతోనే ఎకసెక్కాలా.. మా ఇంటికి తీసుకుపోతానంటే వత్తారా..


చిన్నాడు - నిజం గా తీసుకెళ్తావా..


వాడి అమాయకత్వానికి ముచ్చటేసి దగ్గరకి తీసుకుని ముద్దు పెడతాడు.. వాడు సారా కంపు కి ముక్కు మూసుకుంటాడు.. చిన్నగా నవ్వి..


గురవయ్య - మరి నిజం గా మీకెవరూ లేరా..


పెద్దాడు - ఎందుకు లేము వాడికి నేను నాకు వాడు ఉన్నాం కదా..


గురవయ్య - శభాష్.. ఆలా కలిసుండాలి ఎప్పుడూ.. పదండి మన ఇంటికి పోదాం అని చిన్నాన్నీ చంకన వేసుకుని బయలుదేరతాడు..


ఇంతకీ మీ అసలు పేర్లేంట్రా..


పెద్దాడు - నేను రాజు.. వాడు బాలు..
 
ఆలా కబుర్లు చెపుతూ పాక దగ్గరకి వచ్చి.. ఇదేరా మన ఇల్లు.. మీకు నచ్చిన చోట పడుకోండి..


అన్నాతమ్ములిద్దరూ ఒకరి మొకం ఒకళ్ళు చూసుకుని.. నులక మంచానికి చెరో వైపు ఎక్కి పడుకుంటారు..
 
గురవయ్య అర లో ఉన్న మందు సీసాలు బయట పడేసి.. ఇల్లంతా శుభ్రం చేసి పిల్లల్ని చూసి తృప్తిగా నిట్టూర్చి కింద చాప పరుచుకొని దేవుడి ఫోటో వైపు చూస్తూ నిద్ర లోకి జారుకుంటాడు..

To be continued..
Like Reply
#3
Good starting bro yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#4
Nice start
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#5
కథ బాగా మొదలుపెట్టారు
[+] 1 user Likes ramd420's post
Like Reply
#6
Nice start
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#7
Thank You all for your Love and Support..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#8
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#9
Nice start bagundi
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#10
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#11
ఉదయం.. 7 దాటింది..

 
గురవయ్య ఇంకా నిద్ర లేవలేదు..
 
రేడియో లో బంగారు కోడిపెట్ట పాటకి.. బాలు   డాన్స్ చేస్తుంటే.. రాజు  చప్పట్లు కొడుతున్నాడు.. అప్పుడే లేచిన గురవయ్య..
 
భలే చేస్తున్నావురా డాన్స్
 
బాలు   - మరి చిరంజీవి అవ్వాలంటే డాన్సులు వెయ్యాలి కదా..

గురవయ్య - చిరంజీవి అవ్వడం ఏంట్రా.
 
రాజు  - అదే తాతా.. తమ్ముడు హీరో అవుతాడు పెద్దయ్యాక..

గురవయ్య - ఓరిని.. పెద్ద గురే చూసాడురోయ్.. మరి నువ్వేం అవుతావు..
 
రాజు  - నేను సెక్యూరిటీ అధికారి అవుతా...

గురవయ్య - అవుదువుగానిరా.. మరి దానికి బాగా చదువుకోవాలి కదా.. బళ్ళో చేర్పిత్తా.. ఎరా బాలు   బడికెళ్తావా..
 
అన్నదమ్ములిద్దరూ మళ్ళీ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని గురవయ్య ఒళ్ళోకి చేరిపోతారు..
 
ఈలోపు.. ఇద్దరు వస్తాదులు వచ్చి కోటయ్య గారు కబురంపారని.. ఉన్నపళాన్నే రావాలని గురవయ్య వచ్చేదాకా వాళ్ళని రావద్దన్నాడని చెప్పారు..
 
గురవయ్య పిల్లలతో.. మీరు ఈడే ఉండండిరా.. నేనిప్పుడే వత్తా.. అని చెప్పి చెప్పులేసుకొని వచ్చిన వాళ్ళతో బాటు వెళ్ళాడు..
 
రాజు  బాలు   తలో తలుపు చెక్క మీద జారబడి గురవయ్య కనపడ్డంత సేపు చూసి లోపలి వచ్చేస్తారు..
 
బాలు   - అన్న.. ఆకలేస్తోందిరా..

రాజు  - ఉండు అని బట్టల మూటలో ఉన్న వేరు శనక్కాయల పొట్లం విప్పి తమ్ముడి ముందు పెట్టాడు..
 
కోటయ్య ఇల్లు..
 
అరుగు మీద పడక కుర్చీ లో కూర్చుని పద్దు చూసుకుంటూ ఉంటాడు.. కొడుకు రాంబాబు.. వాకిట్లో సైకిల్ నేర్చుకుంటూ ఉంటాడు..
 
గురవయ్య.. లోపలికి రాగానే..

కోటయ్య - ఏరోయ్ నిన్నంతా పత్తా లేవు.. ఎక్కడికి పొయ్యావ్..
 
గురవయ్య - (అరుగు మీద తుండు గుడ్డతో తుడుచుకొని..కూర్చుంటూ ) లేదు కోటయ్య.. నే ఎంట పెట్టుకెళ్లిన ఆ సాంబయ్య గాడు నన్ను మోసం చేసాడు.. నేను దొరికిపోయా.. నిన్నంతా సెక్యూరిటీ ఆఫీస్ లోనే  ఉన్నా.. సాంబయ్య ఊరు దాటేశాడు..
 
కోటయ్య - కొంపతీసి నా పేరు గానీ..
 
గురవయ్య - ఛ ఛ ఎంత మాట.. గొంతైనా కోసుకుంటా గానీ ఆలా పేర్లు బైటేట్టే అలవాటు నాకు లేదు.. అచ్చిరెడ్డి విడిపిస్తే బయటకొచ్చా...
 
కోటయ్య అనుమానంగా ఆలోచిస్తూ  సరే వెళ్లి రా.. అని పడక కుర్చీ లోంచి లేచి నిలబడతాడు..
 
గురవయ్య తుండు దులుపుకొని.. భుజాన వేసుకొని.. గేట్ దాటగానే.. కోటయ్య మనుషులతో.. రేయ్.. ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి అని చెప్పి చుట్ట వెలిగిస్తాడు..
 
రాంబాబు.. అందరిని ఓసారి చూసి మల్లి సైకిల్ రౌండ్ లు వేసుకుంటూ ఉంటాడు..
 
గురవయ్య ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు..

గురవయ్య మౌనంగా మంచానికి ఆనుకుని కింద కూర్చుని తన ఆలోచనల్లో తాను ఉండగా.. పిల్లలు పరిగెడుతూ వచ్చి తాతా ఆకలేస్తోంది అంటారు..
 
అరెరె.. ఆ సంగతే మర్చిపోయానురా..ఉండండి.. అంటూ పొయ్యి వెలిగించి..వంట పూర్తి చేసి పిల్లలకి తినిపించి... తానూ తిని..
 
పిల్లలిద్దరినీ తీసుకొని.. అచ్చిరెడ్డి ఇంటికి వెళ్తాడు..
 
అక్కడ అచ్చిరెడ్డి కూతుర్లు ఇద్దరూ తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఉంటె.. రాజు .. బాలు  .. వాళ్లతో పాటూ గెంతుతూ ఉంటారు..
 
అచ్చిరెడ్డి ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి గుమ్మం కాడే ఎదురు చూస్తుంటాడు..

ఫోన్ అయ్యాక.. ఏమైంది గురవయ్య ఇలా వచ్చావు అంటే..
 
గురవయ్య - ఏదైనా పని ఇప్పిస్తావేమో అని.. ఈళ్ళు నా మనవలు.. బళ్ళో ఎయ్యాలి..
 
అచ్చిరెడ్డి - ఇప్పుడు నే పట్నం పోతున్నా గురవయ్య..పిల్లల చదువులకి.. నాక్కూడా రాజకీయంగా ఎదుగుదల ఉంటుందని..
 
గురవయ్య - ఐతే మా అచ్చిరెడ్డి నెక్స్ట్ ఎలేచ్షన్స్ లో మెంబెర్ అయిపోయినట్టే..
 
అచ్చిరెడ్డి - దానికింకా టైం ఉందిలే కానీ.. నేను హెడ్ మాస్టర్ గారితో మాట్లాడతా.. కాలేజ్ లో చేర్పించెయ్.. నీకు పంచాయితీ లో ఏదైనా పని చూసి పెడతాలే..
 
గురవయ్య - ఆ నమ్మకం తోనే నీ కాడకొచ్చా.. నీ మేలు ఈ జన్మ లో మరచిపోను..
 
అచ్చిరెడ్డి - అంత పెద్ద మాటలెందుకులే.. మల్లి ఎప్పుడు కలుస్తామో.. ఇదిగో ఈ వంద పిల్లలకి బట్టలు తీసుకో అని చేతిలో పెడతాడు..
 
సరే వెళ్లొస్తాం.. అని..పిల్లల్ని పిలిచేసరికి.. వాళ్లిద్దరూ ఆడపిల్లలిద్దరికి టాటా లు చెప్పి.. ఇంటికొచ్చి ముగ్గురూ ప్రశాంతం గా నిద్రపోతారు..
 
మరుసటి రోజు.. పిల్లల్ని కాలేజ్ లో చేర్పించి.. తానూ పంచాయితీ కి వెళ్తాడు పని కోసం..
 
15 సంవత్సరాల తర్వాత..
 
2007
 
రాజు  అండ్ బాలు  .. డిగ్రీ కంప్లీట్ చేసి..
 
బాలు   - రేయ్ అన్నయ్య... రేపు  మున్నా మూవీ రిలీజ్.. టికెట్స్ కి డబ్బులున్నాయా..

రాజు  -  రేపటికి డబ్బులు రేపు వస్తాయ్ గానీ.. డిగ్రీ అయిపొయింది కదా.. ఇంకెంత కాలం ఖాళీ గా ఉంటావ్..

బాలు   - ప్రతీ హీరో కి హీరోయిజం చూపించే టైం వస్తుందిరా.. వెయిట్ చెయ్యాలి అప్పటి దాకా..
 
ఈలోపు గురవయ్య ఇంటికి వస్తాడు..
 
రాజు  - తాత.. ఇంకెంత కాలం పని చేస్తావ్.. మా చదువులు అయిపోయాయి.. మేం ఉద్యోగాలు చేస్తాం.. నువ్ రిటైర్ అయిపో..
 
గురవయ్య - ఇంట్లో ఉండి నేను మాత్రం ఎం చేస్తా రా.. మీ పెళ్లిళ్లు అయ్యి ముని మనవలు వచ్చారనుకో.. అప్పుడు వాళ్లతో ఆడుకుంటూ..
 
రాజు  - బాబూ నీకో దణ్ణం.. నువ్ చేతులు దులుపుకోడానికి మా దుంప తెంపొద్దు కానీ..మమ్మల్ని ఇలా ఉండనీ..
 
గురవయ్య - అదేందిరా.. పెళ్లిళ్లు చేసుకోరా..
 
బాలు   - తాత వాడు అలానే అంటాడు కానీ నువ్వు  అమ్మాయిల్ని చూడు.. ఎంత మందిని తీసుకొస్తే అంత మందికి తాళి కట్టడానికి నెను రెడీ..
 
రాజు  - కడతావ్ రా.. కడతావ్.. పెళ్లంటే తాళి కట్టడమే కాదు... కడుపు నింపాలి..(భోజనం అన్నట్టు చూపెడుతూ)
 
బాలు   - కడుపేగా నింపేద్దాం అంటాడు.. (కడుపు చేస్తా అన్నట్టు)..
 
రాజు  - రేయ్..
 
బాలు   - తాత కడుపంటే గుర్తొచ్చింది.. ఆకలేస్తోంది..
 
రాజు  - రేయ్ అది కడుపా కంబాల చెరువా..
 
గురవయ్య - సరే పదండ్రా తింటూ మాట్లాడుకుందాం..
 
బాలు   - తాతా వాడితో తింటూ మాట్లాడుకుందాం కాదు తింటూ పోట్లాడుకుందాం అని చెప్పాలి..
 
గురవయ్య - మిమ్మల్ని కలిసుండండిరా అంటే అస్తమాను కలబడతారేందిరా..
 
బాలు   - నేను కాదు తాతా.. వాడే..
 
రాజు -  అవును తాతా..నేనే.. ఎరా హ్యాపీ నా..  
 
 
హైదరాబాద్..
 
హోమ్ మినిస్టర్ అచ్చిరెడ్డి బంగళా..
 
ఇంటికొచ్చిన జనాల్ని పలకరిస్తూ భోజనం టైం కి పనులు PA కి చూసుకోమని చెప్పి.. లోపలికి వచ్చి పెళ్ళాన్ని పిలుస్తాడు..
 
సీతా.. ఆ వస్తున్నానండి.. ఈరోజు పెద్దదాని రిజల్ట్స్ కదా ఎక్కడుంది ఇలా పిలు..

సీత పని మనిషితో భోజనాలు పెట్టమని చెప్పి డైనింగ్ టేబుల్ మీద మొగుడి పక్కన కూర్చుంటూ..
 
సీత - అక్క చెల్లెళ్ళిద్దరూ ఇంకా ఇంటికి రాలేదండి..

అచ్చిరెడ్డి - పెత్తనాలెక్కువయ్యాయి ఇద్దరికి...
 
ఇంతలో కార్ హార్న్ కొడితే వాచ్మాన్ గేట్ ఓపెన్ చేస్తాడు..

సుధా, సుజా నేను  చెప్తా అంటే నేను చెప్తా అంటూ  పరిగెత్తుకుంటూ లోపలి వచ్చి
 
సుధా-  మమ్మీ డాడీ నే కాలేజీ 1st వచ్చా...అని గట్టిగా అరుస్తుంది..

సీత- నా బంగారమే.. నీ సంగతేంటి అని చిన్న దాన్ని అడిగితె..
 
సుజా - నేనింకా 1st  ఇయర్ ఏ కదా.. ఫైనల్ ఇయర్ లో 1st వస్తాలే.. ఇప్పటి నుంచే కష్టపడడం ఎందుకు.. అంటూ డాడీ భుజం మీద వాలిపోతుంది..
 
సీత - బావుంది చదవడం కూడా కష్టపడడమేనా.. విడ్డూరం కాకపొతే..
 
సుజా - అమ్మ వద్దమ్మా.. మొదలు పెట్టకు.. కనీసం హాలిడేస్ ని ఐన ఎంజాయ్ చెయ్యనీ.. కాలేజీ మొదలయ్యాక అక్కడ వాళ్ళ క్లాస్ లు ఇక్కడ నీ క్లాస్ లు ఎలాగు తప్పవు..
 
సుధా,  అచ్చిరెడ్డి నవ్వుకుంటూ ఉంటారు..
 
సీత - నీ ఇష్టం వచ్చినట్టు ఏడూ..
 
ఇంతలో సుధా - సర్లే అమ్మ.. సెలవులు ఇంకా ఉన్నాయి కదా.. మేము తాతగారి ఊరు వెళ్లొస్తాం.. వెళ్లి చాలా కాలం అయింది కదా..
 
సీత - మీ డాడీ ని అడగండి.. నాదేముంది..

అచ్చిరెడ్డి - వాళ్ళు కరెక్ట్ గానే అడిగారు - బయట మంత్రి నేనైనా ఇంట్లో రాణి నువ్వే కదా..
 
సీత - అలాగే.. ఐతే ముందు అందరు నోరు మూసుకొని భోజనాలు చెయ్యండి..
 
సుజా - ప్లీజ్ డాడీ..

సుధా - అవును ఒక్క వారం ఇలా వెళ్లి ఆలా వచ్చేస్తాం..
 
అచ్చిరెడ్డి - సరే టికెట్స్ బుక్ చేయిస్తా.. వెల్దురు గానీ..
 
సుజా సుధా ఇద్దరూ ఒకేసారి థాంక్స్ డాడీ..అంటూ అచ్చిరెడ్డి కి ముద్దులు పెడితే.. సీత.. కోపం పోగొట్టడానికి.. ఈసారి తన చుట్టూ చేరతారు కూతుర్లిద్దరూ..
 

To be continued..
[+] 15 users Like nareN 2's post
Like Reply
#12
Nee update edo old movie chusthunatlu undi bro, super  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
#13
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#14
ఇద్దరికిద్దరు. Nice starting. Let’s see bro
[+] 2 users Like Haran000's post
Like Reply
#15
Nice update
[+] 2 users Like appalapradeep's post
Like Reply
#16
Nice update bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#17
(11-05-2024, 04:19 PM)sri7869 Wrote: Nee update edo old movie chusthunatlu undi bro, super  clps

(11-05-2024, 08:21 PM)Iron man 0206 Wrote: Nice update

(12-05-2024, 01:03 AM)Haran000 Wrote: ఇద్దరికిద్దరు. Nice starting. Let’s see bro

(12-05-2024, 03:17 AM)appalapradeep Wrote: Nice update

(12-05-2024, 10:09 AM)K.rahul Wrote: Nice update bro

Thanq All for your Love and Support
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#18
ఓపెన్ చేస్తే..
గురవయ్య ఇల్లు.. భోజనాలు అయ్యాక.. రాజు బాలు చెప్పులేసుకుంటుంటే..

గురవయ్య - ఎండలో ఎక్కడకిరా.. ఇప్పుడే కదా భోజనం ఐయ్యింది.. కాసేపు కూకుని పొండి..

బాలు - బయటకెళ్ళేది కూడా కూకోడానికే.. నువ్ పడుకో..

గురవయ్య నోరు పుక్కిలించి ఊసి తొందరగా వచ్చెయ్యండి.. అంటూ లోపలికెళ్ళి తలుపేసుకుని నడుం వాలుస్తాడు..

అప్పటి వరకు కిటికీ పక్క నుంచి వాళ్ళని అబ్సర్వ్ చేస్తున్న మనిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..


కట్ చేస్తే..   కోటయ్య ఇల్లు...

ఇంటి లోపల కోటయ్య కూర్చుని చుట్ట చుట్టూ కుంటూ (Cigarette smoking is injurious to Health)  ఉంటాడు.. వెనక గోడ మీద భార్య ఫోటో.. రాంబాబు మండువా లోగిలి స్థంభానికి అనుకుని విసుగ్గా చూస్తూ ఉంటాడు..

కోటయ్య - ఎరా ఈ రోజుల్లో అమ్మాయిలే పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు..నువ్ కనీసం ఆ డిగ్రీ కూడా పాస్ అవ్వలేకపోయావ్.. నీది బుర్రా బూడిది గుమ్మడి కాయా..

రాంబాబు - అది కాదు నాన్నా..

ఇంతలో గురవయ్య ఇంటి నుంచి కోటయ్య మనిషి వస్తాడు..

కోటయ్య - ఎరా ఏమైనా తెలిసిందా..

మనిషి - లేదయ్యా ఎప్పుడూ ఆ విషయమే ఎత్తట్లేదు..

కోటయ్య - సరే ప్రయత్నిస్తూనే ఉండండి.. ఇక నువ్వెళ్లు..

రాంబాబు వైపు తిరిగి..

కోటయ్య - హ చెప్పు ఆ డిగ్రీ కూడా పాస్ అవ్వలేదంటే అది తలకాయా తాటికాయా..

రాంబాబు - ఇందాక బూడిద గుమ్మడి కాయా అన్నావ్..

కోటయ్య - నా ఖర్మ రా..

రాంబాబు - చూడు నాన్నా నువ్ ఆ తొక్కలో వజ్రం కోసం 15  ఏళ్లుగా వెతికిస్తున్నావ్..  దాని విషయం లో ఉన్న ఓపిక నా మీద ఎందుకు లేదు.. ఈరోజే కాకపోతే రేపు పాస్ అవుతా.. కంగారెందుకు..

కోటయ్య - కంగారు కాదురా. కడుపు తీపి.. నేపోతే ఆస్తులన్నీ అమ్ముకుని అడుక్కు తింటావేమో అని భయం.. ఆ గురవయ్య మనవలు నీ ఫ్రెండ్స్ ఏ కదా.. వాళ్ళ మీద ఓ కన్నేసి ఉంచు.. ఆ ఉంగరం దొరికితే ఐన నీ దశ తిరుగుతుందేమో చూద్దాం..

రాంబాబు - నాన్నా నీది అత్యాశ కాకపోతే వజ్రాల వల్ల ఉంగరాల వల్ల అదృష్టం ఏంటి చెప్పు..

కోటయ్య - రేయ్, ఆ ఉంగరం గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి.. నా చిన్నప్పుడు మా తాత ఆ వజ్రపు ఉంగరం గురించి కధలు కధలుగా చెప్పేవాడు తెలుసా.. అది అదృష్ట దేవతారా..

రాంబాబు - సరే నాన్న నీ కోసమైనా ఆ ఉంగరం సంపాదించి నీకిస్తా.. ఇదే నా ప్రతిజ్ఞ..

కోటయ్య - రేయ్.. మాట మార్చొద్దు.. ముందు శ్రద్హగా చదువు..

రాంబాబు సరే అంటూ బయటకు వెళ్తుంటే..

కోటయ్య - అటెక్కడికి..

రాంబాబు - చదవాలంటే పుస్తకాలు కావలి కదా కొనుక్కోడానికి..

కోటయ్య - మరి నీ పుస్తకాలేం చేసావ్..

రాంబాబు - పాస్ అవుతా అనుకోని అమ్మేశా...

కోటయ్య - నిన్ను ఆ దేవుడు కూడా బాగుచెయ్యలేడురా.. అంటా నా ఖర్మ.. అనుకుంటూ చుట్ట కాల్చుకుంటూ (Cigarette smoking is injurious to Health) లోపలికి పోతాడు..


కట్ చేస్తే..
గోదావరి పక్కన మర్రి చెట్టు.. చెట్టు పక్కనే చిన్న పాన్ బడ్డీ..

అన్నదమ్ములిద్దరూ సిగరెట్ కాలుస్తూ ఉండగా (Cigarette smoking is injurious to Health) రాంబాబు బండి వాళ్ళ దగ్గర దాకా తీసుకొచ్చి ఆపుతాడు..

బాలు - ఎరా రాంబాబు డిగ్రీ డింకీ కొట్టిందంట గా..

రాంబాబు - ఈ చదువులన్ని మన వాళ్ళ కాదేహే..

రాజు - మరి ఎం చేద్దామని రా..

రాంబాబు - ఈ ఉద్యోగాలు మనకి పడవు కానీ ఏదైనా బిజినెస్ చేస్తా..

రాజు - ఐతే మన బాలు గాన్ని హీరో గా పెట్టి  ఓ సినిమా తియ్యరా..

రాంబాబు - అంత తడి మన దగ్గర లేదురోయ్..

బాలు - ఉన్నా వాడేందుకు చెప్తడులే కానీ... పోదాం పద.. అంటూ వాణ్ణి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు..


కట్ చేస్తే.. వూళ్ళో అచ్చిరెడ్డి ఇల్లు..

పెద్దిరెడ్డి (అచ్చిరెడ్డి నాన్న) - ఏవోయ్ కామేశ్వరి (అచ్చిరెడ్డి అమ్మ), రేపు నీ మనవరాళ్లు వస్తున్నారట..

కామేశ్వరి - పోనీలెండి వాళ్ళకి కుదరకపోయినా ఇంతకాలానికి పిల్లల్ని పంపిస్తున్నారు.. అదే సంతోషం..

పెద్దిరెడ్డి - స్టేషన్ కి కార్ పంపాలట..

పాలేరు ని పిలిచి ఆ గురవయ్య మనవళ్ళకి  కబురు పెట్టు.. పొద్దున్నే కార్ తీసుకొని స్టేషన్ కి వెళ్లాలని..

రాజు బాలు ఇద్దరూ వస్తారు పెద్ది రెడ్డి ఇంటికి..

పెద్దిరెడ్డి - రేయ్ రేపు మా మనవలు వస్తున్నారు హైదరాబాద్ నుంచి.. పొద్దున్నే స్టేషన్ కెళ్ళి తీసుకు రావాలి.. తర్వాత మన చుట్టుపక్కల గుళ్ళు గోపురాలకు తీసుకెళ్లాలి..

బాలు - మనకిదేం ఖర్మ రా..

రాజు - రేయ్.. వినపడుతుంది..

బాలు - తొక్కలే నేనేం రాను.. నువ్వెళ్ళి బుడగలు జీళ్ళు కొనిపెట్టు.. ఆయన మనవలకి..

పెద్దిరెడ్డి - ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు..

బాలు - అంటే నాకంత తెలీదు తాతగారు రాజు తీసుకెళ్తాడు..

పెద్దిరెడ్డి - అదేంట్రోయ్, మీ తాత నువ్వే భలే హుషారు గాడివి అని చెప్తూ ఉంటాడు..

బాలు - అంటే నిన్నటి నుంచి ఒకటే కడుపు నొప్పి ఎక్కడ పడితే అక్కడ ఆపితే కష్టం కదా..

కామేశ్వరి - అయ్యో కడుపునొప్పా కాషాయం చేసివ్వనా..

బాలు - వద్దులెండి టాబ్లెట్స్ వేసుకుంటున్న..

రాజు - పర్లేదు నేను తీసుకెళ్తా లెండి.. అని కార్ కీస్ తీసుకొని.. ఇంటికెళ్లి రేపటి గురించి ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకుంటారు..


మరుసటి రోజు...సూర్యోదయానికి పావు గంట ముందు..

పాలకొల్లు రైల్వే స్టేషన్ లో.. రాజు..

హైదరాబాద్ నుంచి వచ్చిన సుధా సుజా దగ్గర లగేజీ తీసుకొని.. కార్ లో సద్ది ఊరి వైపు పోనిస్తాడు..

సుజా - డ్రైవర్, విండోస్ డౌన్ చెయ్..

రాజు -  నవ్వుకుంటూ విండోస్ దించి.. తను కూడా ఆ చల్ల గాలిని ఎంజాయ్ చేస్తూ 20 నిముషాల్లో ఇంటి దగ్గర దింపేస్తాడు..

కామేశ్వరి హారతి పళ్లెం తో ఎదురొచ్చి మనవరాళ్ళకి దిష్టి తీసి పాలేరుకి ఇచ్చి పడేసి రమ్మంటుంది..

సుజా - డ్రైవర్, లగేజ్ లోపలి తీసుకురా..  అంటూ లోపలి వెళ్ళిపోతుంది..

కామేశ్వరి - ఆ కుర్రాడు డ్రైవర్ కాదే.. మన డ్రైవర్ సెలవు పెడితే సాయం వచ్చాడు..

సుధా - ఓ సారీ, ఇందాకటి నుంచి డ్రైవర్ అనుకుంటున్నాం..

రాజు - పర్లేదులెండి డ్రైవింగ్ చేసేవాణ్ణి డ్రైవర్ అనే కదా అనుకుంటారు.. ఇట్స్ ఏ జాబ్.. చేసే పనిలో తక్కువ ఎక్కువ ఏముంది..


To be continued..
[+] 11 users Like nareN 2's post
Like Reply
#19
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#20
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)