19-03-2024, 03:39 PM
(This post was last modified: 19-03-2024, 03:40 PM by Tinku143. Edited 1 time in total. Edited 1 time in total.)
Superb ........
REVENGE - I : రసాయన శాస్త్రం
|
19-03-2024, 03:39 PM
(This post was last modified: 19-03-2024, 03:40 PM by Tinku143. Edited 1 time in total. Edited 1 time in total.)
Superb ........
22-03-2024, 11:45 AM
22-03-2024, 11:48 AM
R8
రోజు అలారం మోగనిదే లేవని రోహిత్ ఇవ్వాళ పొద్దున్నే లేచి టీషర్ట్ విప్పేసి అద్దంలొ చూసుకున్నాడు. లైటుగా పొట్ట కనిపించింది. వెంటనే వ్యాయామం మొదలుపెట్టాడు. టైమర్ అయిపోగానే త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి మంచి షర్ట్ దాని మీద మాచింగ్ ప్యాంటు వేసుకుని యూనివర్సిటీకి బైలుదేరాడు. దారిలో బొకే కొంటూ దానిలో ప్రత్యేకంగా ఎర్ర గులాబీలు ఉండేలా చేయించి తీసుకెళ్లాడు. యూనివర్సిటీలొ కారు పార్క్ చేసి శశికళకి ఫోను చేశాడు. "శశికళ, వచ్చావా" "హా రోహిత్, మొదటిసారి కదా ఫ్రెండుతో పాటు వస్తున్నా. దెగ్గరికి వచ్చేసాం అంటుంది." "ఓకే, నేను పార్కింగ్ లోనే ఉంటాను, ఇద్దరం కలిసి వెళదాం." "థాంక్స్ రోహిత్" "ముందైతే రా" అని ఫోను పెట్టేసి శశి కోసం ఎదురు చూస్తూ మధ్యమధ్యలో టైం చూస్తూ నిలుచున్నాడు. చూస్తుండగానే ఒక కారు లోపలికి వచ్చింది, అందులో నుంచి శశి దిగింది. తన కారులో ఉన్న బొకే తీసి ఎదురు వెళుతూ శశిని చూడగానే ఒక్క నిమిషం ఆగిపోయాడు, చాలా మారిపోయింది శశి అనుకున్నాడు మనుసులోనే వెంటనే అమ్మాయిల ముందు ఎర్రిపప్ప అవ్వకురా అనుకుంటూనే వెళ్లి శశిని చూసి నవ్వుతూ "ఎలా ఉన్నావ్" అని తనకి బొకే అందించాడు. శశికళ గమనించకపోయినా శ్రావ్య గమనించింది, వెంటనే "ఓహ్.. రెడ్ రోసెస్. హౌ స్వీట్" అంది. రోహిత్ అది వినగానే నవ్వుతూ తల గోక్కుని శశి వైపు చూసాడు. తను కూడా చిన్నగా నవ్వింది, రోహిత్ ని చూసి "థాంక్యూ" అనగానే సంబరపడిపోయాడు. శ్రావ్య : నేను వెళ్ళనా మరి ? రోహిత్ వెంటనే "ప్లీజ్, మీరు వెళ్ళండి. నేను చూసుకుంటాను" అనగానే శ్రావ్య నవ్వుతూ శశి వైపు చూసి "ఓకే బాయి, ఈవెనింగ్ పికప్ చేసుకుంటాను, ఫోన్ చేయి" అని కారు ఎక్కుతుంటే రోహిత్ వెంటనే "మీకెందుకు శ్రమ, నేను డ్రాప్ చేస్తాను" అని శశి వంక చూసాడు. శ్రావ్య కూడా శశి వంకే చూసింది. శశి ఓకే వెళ్ళమని శ్రావ్యని సైగ చేసేసరికి రోహిత్ కి అడ్రస్ చెప్పి "ఓకే బై" అని వెళ్ళిపోయింది. శ్రావ్య వెళ్ళిపోయాక రోహిత్ కొంచెం మామూలు అయ్యాడు. రోహిత్ : "ఇంకా అందరూ ఎలా ఉన్నారు, అమ్మా, నాన్నా, నీ సైంటిస్ట్ కల ఎక్కడికి వరకు రీచ్ అయ్యావు", వరస పెట్టి మరి అన్ని గుర్తుపెట్టుకుని అడుగుతుంటే ఏడుపు వచ్చేసి ఆపుకోలేక బోరున ఏడ్చేసింది. రోహిత్ కంగారుపడి శశికళని ముట్టుకుందామని దెగ్గరికి వెళ్లినా చెయ్యి వెయ్యలేక ఆగిపోయాడు. "శశి..!" అని పిలవగానే కంట్రోల్ చేసుకుని కళ్ళు తుడుచుకుంది. వెంటనే సారీ చెపుతూ చున్నీతో కళ్ళు తుడుచుకుని వెళదామా అన్నట్టు చూస్తే రోహిత్ ముందు నడిచాడు వెనకే నడిచింది శశి. ముందు కేఫ్ కి తీసుకెళ్లి కాఫీ ఆర్డర్ చేసి టిష్యూస్ తెచ్చిచ్చాడు. థాంక్స్ చెపుతూ తీసుకుంది. సెల్ఫ్ సర్వీస్ అవ్వడం వల్ల వెంటనే వెళ్లి కాఫీ కూడా తెచ్చి టేబుల్ మీద పెట్టి ఎదురుగా కూర్చున్నాడు. చాలాసేపటి మౌనం తరువాత "శశి, నాకేమైనా చెపుతావా" అని నెమ్మదిగా అడిగితే జరిగింది మొత్తం చెప్పింది. ఆఖరికి ప్రెగ్నెన్సీ తీయించుకున్న సంగతి కూడా దాచకుండా చెప్పింది. అన్నీ చెప్పినా తనని కాపాడిన శివ అనే వ్యక్తి గురించి మాత్రం చెప్పలేదు. అంతా విన్న రోహిత్ నిశచేష్టగా అయిపోయాడు, జాలి పడాలో, బాధ పడాలో అర్ధం కాలేదు. ఈ రెండిటికి బదులు మూడోది.. కోపం వచ్చింది. లేచి తిడదాం అనుకున్నాడు. అదే నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఇవేవి జరిగేవి కాదు కదా అని అడగాలనుకున్నాడు. కానీ ఈలోపే శశి : నీ లాంటి వాడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే కాదని వెధవని ప్రేమించి చివరికి నేను కూడా వెధవని అయ్యాను రోహిత్. నిన్ను బాధపెట్టినందుకు నాకు తాగిన శాస్తే జరిగింది. ఇప్పుడు నాతో చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, అమ్మా నాన్నా లేరు, ఎవరూ లేరు. ఒంటరిగా మిగిలిపోయాను. చివరికి అందరినీ కాదన్న నా కల ఒక్కటే నా చేతుల్లో మిగిలింది. ఇది కూడా జరగకపోతే ఇక నా బ్రతుక్కి అర్ధంలేదు. రోహిత్ ఏం మాట్లాడలేకపోయాడు. "నేను నిన్ను వదిలేసి రాలేదు శశి, ఆ రోజు నేను నీకు ప్రొపోజ్ చేసినప్పుడు నేనంటే ఇష్టం లేదని నువ్వు చెప్పలేదు, నేను ఐ లవ్ యు చెప్పినప్పుడు కూడా నువ్వు ఇబ్బంది పడలేదు, నాకింకా గుర్తున్నాయి కేవలం నీ కల కోసమే నన్ను కాదన్నావని నాకు అర్ధమైంది. నీ కల నిజమయ్యేవరకు నువ్వు ఎవ్వరినీ పట్టించుకోవని అర్ధమయ్యి నీకు దూరంగా వచ్చేసాను. నువ్వు కాదన్నాక చాలా బాధ పడ్డాను, నా ఎదుగుదల ఆగిపోతే రేపు నువ్వు సైంటిస్ట్ అయ్యాక నేను నీకు సరిపోను అనిపిస్తుందేమో అన్న ఆలోచనలో ఇదిగో ఇలా కెరీర్ వెతుక్కుంటూ చివరికి ఇక్కడ చేరాను." శశి కళ్లెమ్మటి నీళ్లు కారిపోయాయి, "సారీ రోహిత్" అని మాత్రమే అనగలిగింది. ఇన్నేళ్లు కన్న కలలు, శశికళ మీద పెంచుకున్న ఆశలు పది నిమిషాల్లోనే ఒక్కసారిగా ఆవిరి అవ్వడంతో రోహిత్ ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. వెంటనే లేచి "సరే ముందు నిన్ను జాయిన్ చేస్తాను పదా, నీ కోర్ సబ్జెక్ట్ ఏంటి ?" అని అడిగితే శశి లేచి నిలబడి "నానో టెక్నాలజీ" అంటూ తన ఫైల్ అందించింది. చూస్తూనే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటుకి తీసుకెళ్లి అక్కడ ఉన్న వాళ్లకి పరిచయం చేసి చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు పనులన్నీ పూర్తి చేసుకుని రోహిత్ కి ఫోన్ చేద్దాం అనుకుంటుండగా రోహిత్ నుంచే ఫోన్ రావడంతో పోనీలే ఆనుకుని ఎత్తింది. రోహిత్ : ఎక్కడున్నావ్, నేను పార్కింగ్ దెగ్గరె ఉన్నాను. నీ పని అయిపోతే నిన్ను డ్రాప్ చేస్తాను. "వస్తున్నాను" అని పెట్టేసి పార్కింగ్ దెగ్గరికి వెళ్లి మౌనంగా రోహిత్ కారు ఎక్కి కూర్చుంది. ఇద్దరు చాలాసేపు ఏం మాట్లాడుకోలేదు. శశి రోహిత్ వంక చూస్తూ "నీ గురించి ఏం చెప్పలేదు" అంది. రోహిత్ ఏం మాట్లాడలేదు, ఇవ్వాళ తనని ఎటైనా తీసుకెళ్లాలి ఏవేవో చెప్పాలి అనుకున్నాడు కానీ.. రోహిత్ : నా దెగ్గర చెప్పుకోవడానికేంలేదు. రొటీన్ లైఫ్, అలవాటు పడిపోయాను. అంతే ఇంకేం మాట్లాడుకోలేదు. ఆల్రెడీ పెళ్లి కాలేదని చెప్పకనే చెప్పేసాడు. శశిని తన ఇంటి దెగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. తెల్లారి నుంచి శశికళ సైంటిస్ట్ ప్రయాణం మొదలయింది. రోజుకి నాలుగు గంటలు మాత్రమే పడుకుంటూ నాలుగేళ్లలో మూడు పీజీలు చేసింది. నానో టెక్నాలజీ, నానో పార్టికల్స్, చిప్స్ గురించి చాలా లోతైన అవగాహన సంపాదించింది. ఇంకో రెండేళ్లు ఆస్ట్రేలియాలొ ప్రముఖ పేరు గాంచిన సైంటిస్ట్ దెగ్గర అసిస్టెంటుగా పనిచేసింది. వీటన్నిటితోపాటు ముఖ్యంగా మనిషి మెదడులొ ఉండే స్థితి, తెలివిని ఒక చిప్పులొ పొందుపరిచే జ్ఞానాన్ని సంపాదించింది, కాదు ఆవిష్కరించింది. దీన్ని పరీక్షించి నోబెల్ ప్రైజ్ బహుమతి అందుకోవాలని ఇంకో రెండేళ్లు వృధా చేసింది. చివరికి ఈ ఆలోచన మానవాళికి మంచి కంటే చెడె ఎక్కువ జరుగుతుందని, దీని వల్ల తన ప్రాణానికి కూడా ముప్పు పొంచొచ్చని ముందే పసిగట్టి ఆ ప్రయత్నం మానుకుని ఎవ్వరికి తెలీకుండా సంబంధించిన రికార్డ్స్ మొత్తం చేరిపేసి, తిరిగి స్పెయిన్ వచ్చేసింది. ఈ ఆరేళ్ళలొ తనకి తోడుగా ఉంటూ మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సాహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ మాత్రమే.. శశితో స్నేహం చేసి తను కూడా ఒంటరిగానే మిగిలిపోయాడు. రోహిత్ తో కలిసి చిన్న ప్రయోగాలు చేసే కంపెనీ ఒకటి పెట్టింది. ప్రయోగాలు చేసే వాళ్ళు డబ్బు కట్టి రిజిస్టర్ చేసుకుంటే కావాల్సినవన్నీ కంపెనీనే సమాకూర్చి పెడుతుంది, అంతే కాకుండా ఆ ప్రయోగం సఫలం అవ్వడానికి తమ వంతు కృషి చేస్తారు. ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుంది కంపెనీకి. రోజూ రాత్రి స్నానం చేసి పడుకునేముందు రోహిత్ తో మాట్లాడడం ఒక అలవాటు అయిపోయింది. ఈరోజు రోహిత్ ఇంకా ఫోన్ చెయ్యలేదు. అనేకానేక ప్రాజెక్టుల్లో తనదైనా ముద్ర వేసి, సొంత ఇల్లు, సొంత కారు. పేరు, పలుకుబడి, జీవితానికి సరిపడా బ్యాంకు బాలన్స్ అన్ని సంపాదించుకుంది, అయినా ఒంటరిగానే బ్రతుకుతుంది. తనని పెళ్లి చేసుకుంటానని రోహిత్ అడగను లేదు, తనని పెళ్లి చేసుకోమని అడిగే ధైర్యం శశికి లేదు. తన జీవితంలొ ఎంత మార్పు తెచ్చుకున్నా గతాన్ని చెరపలేదు కదా, ఏవేవో ఆలోచిస్తుంటే రోహిత్ నుంచి ఫోను చూసి అన్ని మర్చిపోయి నవ్వుతూ ఎత్తింది శశి : ఏంట్రా ఇవ్వాళ లేట్ అయ్యింది రోహిత్ : శశి.. నీకోటి పంపిస్తున్నాను చూడు అంటుండగానే శశి ఫోనుకి ఒక ఫోటో వచ్చింది. అదో తెలుగు న్యూస్ పేపర్ కటింగ్. "నాసాకి సంబంధించిన ఎలక్ట్రానిక్ రాకెట్ ప్రయోగంలొ తగు సూచనలు చేసిన తెలుగు మహిళా సైంటిస్ట్ శశికళ" అని పక్కన చిన్న ఫోటో కూడా వేసారు. కింద మ్యాటర్ ఉంది. రోహిత్ : చదివావా శశి : హ్మ్మ్ రోహిత్ : ప్రపంచం నిన్ను సైంటిస్ట్ గా గుర్తిస్తుంది శశి : తెలుసురా రోహిత్ : అదీ.. మరీ.. శశి : చెప్పరా రోహిత్ : అదే.. ఇప్పుడు నీ పేరు ముందు సైంటిస్ట్ వచ్చేసింది కదా నన్ను పెళ్లి చేసుకుంటావా, నొ అయితే ఫోను కట్ చేసేయి నేనేమి అనుకోను గడగడా వాగేసి మౌనం వహించాడు. ఎంతకీ ఫోను కట్ అవ్వలేదు. శశి.. గొంతులో కొంచెం ఆనందం. శశి : హా.. రోహిత్ : నిజమేనా శశి : ఇంటికి రా మాట్లాడదాం అని ఫోను పెట్టేసింది. మగతగా ఆలోచిస్తూ లోపలికి వెళ్లి అమ్మ నాన్నల ఫోటో ముందు కూర్చుంటే పక్కనే మొలకి వేలాడుతున్న రుద్రాక్షలు చూసింది, వెంటనే తనని కాపాడిన వ్యక్తి గుర్తొచ్చాడు. లేచేళ్లి రుద్రాక్ష దండ ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. "దేవుడా.. నిన్ను మర్చిపోయాను. అందుకు క్షమించు. సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను అయ్యాను. అంతా నీవల్ల. నీ డబ్బులు నీకు వడ్డీతో సహా కావాలన్నావ్ కనీసం నీపేరు కూడా నాకు తెలియనివ్వలేదు, ఎలా నీకు తిరిగిచ్చేది. ఎక్కడుంటావో తెలీదు, ఏం చేస్తుంటావో తెలీదు ఎలా నిన్ను చేరేది. మొదటి అంకం పూర్తి కావడానికి ఆరున్నర ఏళ్ళు పట్టింది. రెండో అంకం పగ అది తీరాగానే మూడవది నీ దెగ్గరికి చేరుకోవడమే.. నువ్వు నా జీవితం ఎలా సరిదిద్దావో ఇక్కడ నేను కూడా ఒకరి జీవితాన్ని సరిదిద్దాల్సి ఉంది, రోహిత్ నాకోసం చాలా త్యాగాలు చేశాడు వాడి కోసం నేనేమి చెయ్యలేదు. త్వరలోనే నిన్ను చేరుకుంటాను" అని కళ్ళు మూసుకుంది. చాలాసేపు చేతిలో ఉన్న రుద్రాక్షలని పట్టుకుని కూర్చుంది. ఇంటి బయట కారు చప్పుడుకి లేచి బాల్కనీలోకి వచ్చింది. రోహిత్ కింద నుంచే నవ్వుతూ పరిగెడుతూ వస్తుంటే తనలో తానే నవ్వుకుంది. రోహిత్ చాలా వేగంగా వచ్చేసాడు. శశి : ఒరేయి.. చిన్నగరా రోహిత్ ఏమి మాట్లాడలేదు, ఆనందంతో పిచ్చోడు అయిపోయేలా ఉంటే శశి కుర్చీలో కూర్చుంది. రోహిత్ తన ముందే కింద కూర్చుని "ఇదంతా నిజమేనా" అంటుంటే రోహిత్ తల మీద చెయ్యేసి ప్రేమగా దెగ్గరికి తీసుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఇన్నేళ్ల సావాసం, స్నేహం. ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు. అప్పుడప్పుడు నాన్ వెజ్ జోక్స్ వేసేవాడు కానీ ఇబ్బంది పడేలా ఎప్పుడు మాట్లాడలేదు. ఆరోజు యూనివర్సిటీలొ మొదటసారి కలిసి మాట్లాడాక మళ్ళీ ఇప్పుడే అడిగాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని, నా కోసం ఇంత చేసినవాడిని కాదనగలనా కానీ.. నెమ్మదిగా రోహిత్ ని లేపి నుదిటి మీద ముద్దు పెడుతూ "పెళ్లి చేసుకుందాం, కానీ నాదొక విన్నపం" రోహిత్ : విన్నపం ఏంటే భూకంపం అయినా ఓకే శశి : చెప్పేది వినరా.. నేను పిల్లల్ని వద్దనుకుంటున్నాను. రోహిత్ : ఎందుకూ శశి : ఈ ఒక్కటి ఒప్పుకో ప్లీజ్ రోహిత్ : సరే ముందు పెళ్లి చేసుకో నిన్ను ఎలా ఒప్పించాలో నాకు తెలీదా ఏంటి. అమ్మా నాన్నా మన పెళ్లి గురించి ఎంత బెంగ పెట్టుకున్నారో నీకు తెలీదు. నీకెప్పుడు చెప్పలేదు. వాళ్ళని నీతో మాట్లాడకుండా ఆపేసాను. శశి : అయ్యో.. నాతో ఎంత బాగా ఉంటారు, ముందే నువ్వు మాట్లాడానిచ్చుంటే ఈ పాటికి మన పెళ్లి అయిపోయి ఉండేది కదా, ఉండు ఆంటీ అంకుల్ తో నేనే మాట్లాడతాను. అని వెంటనే ఫోన్ చేసింది రోహిత్ : అంటే ముందే అడిగినా నువ్వు ఒప్పుకునేదానివా అని ఆశ్చర్యంగా చూస్తుంటే శశి సమాధానం చెప్పలేదు. ఓహ్ ఛ, ఇన్నేళ్లు వేస్ట్ చేసానా అని బాధపడుతుంటే, శశి నవ్వుతూ "సారీరా, కెరీర్లొ పడి నేనింకేవి పట్టించుకోలేదు" అంది, మనసులో మాత్రం "కాపాడిన దేవుడినే మర్చిపోయానంటే నేనెంత మునిగిపోయానో అర్ధం అవుతుంది" అని అనుకుంది. అవతల రోహిత్ తల్లి ఫోను ఎత్తగానే వాళ్ళతో సరదాగా మాట్లాడి చివరికి పెళ్లి నిర్ణయం చెప్పింది. వాళ్ళు చాలా సంతోషించారు. ఫోను పెట్టేసి రోహిత్ వంక చూసి "ఓకే నా, హ్యాపీ" అని బుగ్గ మీద కొడితే ముద్దు పెట్టుకోవాలనిపించి ముందుకు వచ్చాడు. శశి ఆపలేదు. బుగ్గ మీద ముద్దు పెడితే "మొద్దు" అని తిడుతూ కాలర్ పట్టుకుని సిగ్గు పడుతూనే ధైర్యంగా లోపలికి లాక్కెళ్ళింది.
22-03-2024, 11:49 AM
Thanks for the comments మిత్రులారా
నచ్చితే Like Rate & comment also
❤️
22-03-2024, 12:47 PM
ఓకే... ఆ తర్వాత...
|
« Next Oldest | Next Newest »
|