Thread Rating:
  • 44 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
Good update... glad you started writing again..
[+] 1 user Likes nenoka420's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
3.1


విక్కీ వెళ్ళేటప్పటికి ఇంటి ముందు హడావిడి జరుగుతుంది. మగదిక్కులేని ఇల్లు అయిపోయేసరికి ఎవరికి వారు పెద్దమనుషుల్లా పెత్తనాలు తీసుకునేవారేకానీ పనిచేసేవాళ్ళు లేరక్కడా

విక్కీ తన స్నేహితులకి ఫోన్ చేసి రమ్మన్నాడు. లోపలికి వెళ్ళబోతుంటే ఎవరో ఎదురు వచ్చేసరికి చెంప మీద చెళ్ళుమని చరిచాడు. అప్పటివరకు ముచ్చట్లు పెట్టుకుంటున్న వారంతా ఎక్కడివాళ్ళు అక్కడ ఆగిపోయారు. సంగీత మొగుడు కూడా చూసి విక్కీ దెగ్గరికి వచ్చాడు.

ఎవ్వరు మాట వినట్లేదండి. ఇప్పుడు వింటారు. నేను సంగీత హస్బెండ్ మీరు..?

విక్కీ : ఆయన మేనల్లుడిని

నేను టెంట్ వాళ్లకి ఫోన్ చేస్తాను, మీరు లోపలికి వెళ్లండి అని చెపుతూ వెనకే వచ్చిన విశాల్ ని చూసి ఇతను అన్నాడు. విక్కీ మా అన్నయ్య అనేసరికి వెళ్ళండి అని బైటికి వెళ్ళిపోయాడు.

అన్నదమ్ములిద్దరు లోపలికి వెళ్లి తమ మావయ్యని చూసి కంటతడి పెట్టుకున్నారు. విశాల్ ని చూడగానే సంగీత లోపలికి వెళ్ళిపోయింది. సంగీత అమ్మ మాత్రం మౌనంగా కూర్చుంది. టెంటు సామాను, కుర్చీలు. బాక్స్ అన్ని వచ్చేసాయి. విశాల్ చుట్టాలందరికి ఫోన్ చేసి చెపుతుంటే విక్కీ స్నేహితులు పనులు ఏమైనా ఉంటే చెయ్యడానికి రెడీగా ఓ పక్కన నిలబడ్డారు. స్వప్నికకి ఫోన్ చేస్తే కలవలేదు, ఫ్లైట్లో ఉందేమో అనుకున్నాడు. సాయంత్రం వరకూ ఒక్కొక్కరు వచ్చి చూసి వెళ్లిపోయారు. రాత్రికి దెగ్గరి చుట్టాలు మాత్రమే ఉన్నారు. చీకటి పడ్డాక ఇద్దరు కొంచెం తినేసి కూర్చుని మాట్లాడుకున్నారు. మాటల సందర్భంలో విశాల్ సాధన గురించి ఎత్తాడ, కానీ విక్కీ దాని గురించి తరువాత మాట్లాడుకుందాం అని చెప్పగా విశాల్ సైలెంట్ అయిపోయాడు. తరువాతి రోజు మిట్ట మధ్యానానికి వచ్చేసింది స్వప్నిక. వస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లి తన తండ్రి కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఎవ్వరు ఆపలేకపోయారు. చివరిగా విక్కీ వెళ్లి స్వప్నిక భుజం మీద చెయ్యేసి తన వైపు తిప్పుకోగానే బావని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఇదంతా సింధు, తన అమ్మ గమనిస్తూనే ఉన్నారు. అదే రోజు సాయంత్రానికి కార్యక్రమం పూర్తి చేశారు.

అందరూ చావు ఇంటికి వెళ్లి అక్కడినుంచి చెప్పి వెళుతుంటే విశాల్ కూడా వెళ్ళిపోదాం అని విక్కీ వంక చూసాడు. విక్కీ స్వప్నికని కలిసి వెళదాం అనేసరికి ఆగిపోయాడు. స్వప్నిక బైటికి వచ్చి ఇద్దరికీ టవల్ ఇచ్చింది కాళ్లు చేతులు కడుక్కోమని, విక్కీ తీసుకోగా విశాల్ కూడా తప్పక తీసుకున్నాడు. కొంచెంసేపు కూర్చున్నాక టీ ఇచ్చింది. ఎవరికో డబ్బులు ఇవ్వాలంటే మాట్లాడటానికి వెళ్ళాడు విక్కీ. స్వప్నిక వెళ్లి టెంటు కింద కూర్చున్న విశాల్ కుర్చీ పక్కన కూర్చుని ఉద్యోగం గురించి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి అడుగుతుంటే స్వప్నికకి అన్ని తెలుసని అర్ధమయ్యి సమాధానాలు చెప్పాడు. ముందు పొడిపొడిగా మాట్లాడినా స్వప్నిక చిన్నప్పుడు ఎలా తనని గౌరవిస్తూ ప్రేమగా మాట్లాడేదో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతుంటే తనతో దూరంగా ఉండలేకపోయాడు. దెగ్గరికి తీసుకుని ఓదార్చాడు. నేనున్నాంటూ భరోసా ఇచ్చాడు. దానికి స్వప్నిక ఏడుస్తూ అలానే విశాల్ ఒడిలో నిద్రపోయింది. విక్కీ వచ్చేసరికి స్వప్నిక తన అన్న భుజం మీద నిద్రపోతుంటే వెళ్లి పక్కన కూర్చున్నాడు.

విక్కీ : ఏడ్చిందా మళ్ళీ

విశాల్ : హ్మ్మ్.. మావయ్యతో ఈ ఇంటికి మనకి సంబంధం తెగిపోయింది, ఇక వీళ్ళ మొహాలు చూడొద్దని అనుకున్నాను

విక్కీ : మరి

విశాల్ : చాలా మంచిది, దీనికి మనం తోడుగా ఉండాలి అని స్వప్నిక భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు. స్వప్నికకి కూడా మెలుకువ వచ్చి లేచింది, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండటం చూసి తను కూడా మాటలు కలిపింది.

స్వప్నిక : బావా.. ఏదో జరిగింది బావ.. అక్క వచ్చిన రాత్రే నాన్న చనిపోయాడు. వీళ్లందరూ కలిసి ఆయన్ని ఎమన్నారో.. ఆయన నిద్రలోనే అని కన్నీళ్లు పెట్టుకుంది.

విక్కీ : మీ బావకి..

స్వప్నిక : లేదు ఆయనకేమి తెలీదు, ఆయన వచ్చింది అంతా జరిగిపోయాక.

విశాల్ : ఇప్పుడవన్నీ ఎందుకు లేరా.. కళ్ళు తుడుచుకో అని కర్చీఫ్ ఇచ్చాడు. థాంక్స్ అంటూ పెద్ద బావ భుజం మీద తల ఆనించి మళ్ళీ సర్దుకుని కళ్ళు తుడుచుకుంది. మాట్లాడుతుంటే సంగీత మొగుడు కూడా కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాడు. స్వప్నికకి మంచి మాటలు చెప్పి ఓదార్పునిచ్చాడు. ఆయనకి విశాల్ గురించి తెలియదు.

విశాల్ : ఎప్పుడు వెళదాం అనుకుంటున్నావ్

స్వప్నిక చిన్న బావ వంక చూసింది. విశాల్ సంగీత మొగుడుతో ఇష్టంలేకపోయినా మాట్లాడుతుంటే,  విక్కీ మరియు స్వప్నిక ఇద్దరు లేచి పక్కకి వెళ్లారు. ఇద్దరు పక్కపక్కనే నడుస్తుంటే స్వప్నిక విక్కీ చెయ్యి పట్టుకోవడం, తల భుజం మీద పెట్టుకుని నడవటం ఇవన్నీ విశాల్ మాట్లాడుతూనే గమనించాడు.


విక్కీ : రేపు వెళ్ళిపో.. ఇక్కడ నువ్వు చేసేది ఏమి లేదు, అక్కడికి వెళ్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళు.

స్వప్నిక ఊ కొట్టింది. తనని ఇంట్లోకి పంపించేసి స్వప్నికని వదిలి ఒకసారి పాత ఇల్లుని చూసుకుని అన్నదమ్ములిద్దరు విక్కీ ఫ్రెండ్ రూముకి వెళ్లి పడుకున్నారు. పొద్దున్నే ఫ్రెష్ అయ్యి కూర్చున్నాక విశాల్ మళ్ళీ సాధన గురించి ఎత్తగానే తరవాత మాట్లాడదాం అన్నాడు విక్కీ. ఓపిక పట్టాడు విశాల్.

x  x  x

రూములో ఒంటరిగా కూర్చున్న స్వప్నిక దెగ్గరికి వచ్చి కూర్చున్నారు సంగీత మరియు తన అమ్మ. స్వప్నిక ఏం మాట్లాడలేదు.

సంగీత : ఏం చేస్తున్నావ్

స్వప్నిక : చెప్పక్కా

సంగీత : లేదు, మళ్ళీ వెళుతున్నావా

స్వప్నిక : రేపు వెళతాను

సంగీత : నీకు ఆ విక్కీకి ఏంటి

స్వప్నిక : ఏంటో సూటిగా అడుగక్కా

సంగీత : నువ్వు విక్కీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు

స్వప్నిక : నా ఇష్టాఇష్టాలు నువ్వెప్పటి నుంచి పట్టించుకుంటున్నావ్, అయినా విక్కీ అని పేరు పెట్టి పిలుస్తున్నావ్.

సంగీత : వాళ్ళ దెగ్గర డబ్బులు లేవు, అప్పుల్లో మునిగిపోయి ఉన్న సొంత ఇంటిని కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళతో నీకేంటి పని.

స్వప్నిక : నువ్వు నీ కాపురం సరిగ్గా చేసుకో అక్కా.. ఒక్కదాన్నే ఎక్సమ్ రాసాను, మీరు ఎవ్వరు వద్దంటున్నా చదువుకోవడానికి వెళ్లాను, ఒక్కదాన్నే అన్ని సమకూర్చుకున్నాను, అక్కడ ఫ్రెండ్సుని చేసుకున్నాను. ఒక్కదాన్నే ఇన్ని చేసిన నేను.. నాకు ఏది కావాలో చూసుకోగలను. నా బెంగ అంతా నీ గురించే

సంగీత : ఆ విక్కీ మంచివాడు కాదు, నన్ను కాదని వెళితే ఇబ్బందుల్లో పడతావ్ జాగ్రత్త

స్వప్నిక : అంటే

సంగీత : మేము ఇంత చెపుతున్నా నువ్వు మమ్మల్ని కాదన్నావంటే మా నుంచి నీకు ఏ విధంగా కూడా సపోర్ట్ దొరకదు, ఆ తరవాత నీ ఇష్టం.

స్వప్నిక : ఏదేదో ఊహించుకుంటున్నావ్, నీకంత సీన్ లేదు. అయినా ఎందుకు నీకు బావ వాళ్లంటే అంత కోపం. మోసం చేసింది నువ్వు, ఇంత చేసినా వాళ్ళు నీ గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడలేదు.

సంగీత : ఇంక చాలు ఆపేయి. అని లేచి కోపంగా వెళ్ళిపోయింది.

ఏమనుకుందో ఏమో కానీ తెల్లారే స్వప్నిక ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. వెళ్ళాక తెలిసింది, సంగీత నాన్న పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తన మీద రాయించుకుందని, ఇదేంటని స్వప్నిక తన అమ్మని నిలదీసి అడిగితే,  ఇందులో ఏముంది, నీకు అవసరం వచ్చినప్పుడు ఇవ్వదా.. ఇప్పుడు ఇంటికి అదే పెద్దది దాని దెగ్గరుంటే తప్పేంటి అని తాపీగా సమాధానం చెప్పి పక్కకి తప్పుకుంది. నెల రోజులు గడిచాయి. స్వప్నికకి విక్కీ విశాల్ ఫోన్ చేసి మాట్లాడారు తప్పితే తన అమ్మ నుంచి కానీ అక్క నుంచి కానీ ఒక్క ఫోన్ కూడా రాలేదు. చివరికి అవసరం పడి తానే ఫోన్ చేసింది.

స్వప్నిక : హలో

సంగీత : చెప్పవే

స్వప్నిక : ఎలా ఉన్నావ్

సంగీత : సూపర్.. నువ్వు

స్వప్నిక : అదీ కొంచెం డబ్బులు కావాలి, నాన్న డబ్బులు నీ దెగ్గరే ఉన్నాయంట. అమ్మ చెప్పింది.

సంగీత : ఆ ఉన్నాయి అయితే

స్వప్నిక : పంపించు

సంగీత : దేనికి..

స్వప్నిక : నీకెందుకు.. అవి నాన్న డబ్బులు నీవి కాదు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.

సంగీత : చెప్పాలి, ఇప్పుడు ఆ బాధ్యత నాది

స్వప్నిక : నీకెవరు ఇచ్చారు బాధ్యత.. మధ్యలో నీ పెత్తనం ఏంటి నా మీద. ఎక్కువ చెయ్యకుండా డబ్బులు పంపించు. ముందు అమ్మకి ఫోన్ ఇవ్వు.

సంగీత : అమ్మ సిటీ చూడటానికి వెళ్ళింది.

స్వప్నిక : సిటీనా

సంగీత : అవును.. నీకు చెప్పలేదు కదా.. ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసాను. హైదరాబాద్లో ఇల్లు కొన్నాను.

స్వప్నిక : నాకు చెప్పకుండా ఇల్లు ఎలా అమ్ముతావ్. నువ్వు ముందు అమ్మతో మాట్లాడించు.

సంగీత : నేను చాలా బిజీగా ఉన్నాను. మళ్ళీ చేస్తా అని పెట్టేసింది.

స్వప్నికకి ఏమి అర్ధంకాలేదు, వెంటనే విక్కీ బావకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది. నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు చేస్తానన్నాడు, కేసు వేసి నీకు రావాల్సింది తీసుకుంటానంటే కేసు ఫైల్ చేద్దాం అన్నాడు, కానీ స్వప్నిక ఇప్పుడే వద్దంది. ఫోన్ పెట్టేసి చాలాసేపు ఆలోచించింది.

ఎంత కావాలంటే అంత నాన్న పంపిస్తున్నా, పార్ట్ టైం చెయ్యడం ఎంతమంచిది అయ్యిందో ఇప్పుడు అర్ధమైంది స్వప్నికకి. ముందు దాచుకున్న డిపాజిట్ అమౌంట్ వితడ్రా చేసి ఫీజు కట్టేసింది. పదిహేను రోజుల్లో ఎక్జామ్స్ ఉన్నాయి. అవి అయిపోయేంతవరకు ఏ ఆలోచన పెట్టుకోకుండా శ్రద్ధగా చదివి ఎక్జామ్స్ ముగించి ఆ తరువాత ఊరికి వెళ్ళింది.

x  x  x



స్వప్నిక ఊరికి వెళ్లి చూస్తే ఎవ్వరూ లేరక్కడ ముందు తన విక్కీ బావని కలుసుకుంది. ఇంటి దెగ్గరికి వెళ్లి చూస్తే ఇల్లు కొనుక్కున్న వాళ్ళు రెనోవేషన్ చేయించుకుంటున్నారు, కళ్ళలో నీళ్లు తిరిగాయి స్వప్నికకి. విక్కీ అడగగా సెలవలే, రెండు నెలలు ఆగి వెళతానంది.

అక్కడినుంచి ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్లారు. అడ్రస్ కనుక్కుని తన అక్క ఇంటికి వెళ్ళింది. విక్కీ బైట్ ఉంటాను ఏమైనా కావాలంటే ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్లిన స్వప్నిక  సంగీతని చూసి షాక్ అయిపోయింది. మేకప్ వేసుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని కూర్చుంది. కనీసం ఇంట్లోకి ఎవరు వచ్చారు అన్న పట్టింపు కూడా లేదు, అమ్మ కోసం వెతికితే కిచెన్లో పని చేస్తూ కనిపించింది.

కూతురిని చూడగానే పలకరించడం మానేసి.. చూసావా మీ అక్క, మీ నాన్న ఊర్లో ఉంది చేసిందేంలేదు. అక్కని చూడు బావతో ఉద్యోగం మానిపించి బిజినెస్ పెట్టించింది. మొగుడ్ని కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలో మీ అక్కని చూసాక తెలిసింది, కానీ మొగుడే లేడు అని కన్నీళ్లు పెట్టుకుంటే స్వప్నికకి ఏమనాలో తెలీక బైటికి వచ్చి హాల్లో కూర్చుంది. సంగీతతో మాట్లాడాక తను చాలా మారిపోయింది అనిపించిందు. అక్కడే మూడు నాలుగు గంటలు కూర్చుని బైటికి వచ్చేసింది. సంగీత వాళ్ళ ఆయనతో మాట్లాడగా ఆయన మాటల్లో సంగీత అంటే చిరాకు కనిపించింది. అందరూ ఉండమని బలవంతం చేసినా ఫ్రెండ్స్ ఉన్నారంటూ బైటికి వచ్చేసి విక్కీతో కలిసి మళ్ళీ ఊరికి వచ్చేసింది. ఇంతక ముందు సాధన అద్దెకి ఉన్న ఇంటికి తీసుకెళ్లి అక్కడే పార్సెల్ తెచ్చుకుని తిని పడుకున్నారు ఇద్దరు. సాధన నిద్ర పోయాక లేచి బాల్కనీలోకి వచ్చాడు. చల్ల గాలి వీస్తుంటే అన్నయ్యకి ఫోన్ చేశాడు.

విక్కీ : హలో అన్నయ్యా.. ఊరికి రా

విశాల్ : ఏమైంది

విక్కీ : సప్పుగాడు వచ్చాడు, దాన్ని తీసుకెళుదువు.. అలానే వదిన గురించి నీకు ఒకటి చెప్పాలి

విశాల్ : వదిన గురించా.. అని ఆశ్చర్యపోయాడు.. నువ్వసలు చూడలేదు కదరా

విక్కీ : నువ్వు రా మాట్లాడదాం అని పెట్టేసాడు.

వెనక నుంచి వాటేసుకుంది స్వప్నిక. భుజం మీద చెయ్యేసి పక్కన నిలబెట్టుకున్నాడు.

స్వప్నిక : అమ్మ కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు బావా, అక్కకి డబ్బు పిచ్చి పట్టింది, నా వాటా నాకు ఇవ్వమని అడిగితే గొడవేసుకుంది, దానికి మళ్ళీ అమ్మ సపోర్ట్. ఆస్తి పంపకాలు చేస్తే నేనెక్కడ నిన్ను పెళ్లిచేసుకుంటానో.. నన్ను మీరు ట్రాప్ చేసారని చెత్త వాగుడు అంతా వాగింది అక్క.

విక్కీ : దానికి నోరు బాగానే లేచింది, ఇప్పుడు భయం చెప్పేవాళ్ళు లేరుగా.. మరి వాళ్ళ ఆయన

స్వప్నిక : ఆయన భరిస్తున్నాడు అంతే, ఆయన మాటల్లోనే తెలుస్తుంది చాలా బాధపడుతున్నాడు ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని.

విక్కీ : మీ అమ్మ సంగతి ?

స్వప్నిక : ఆమె ఏం ఆలోచిస్తుందో నాకు అర్ధం కావట్లేదు, అక్కని గుడ్డిగా నమ్ముతుంది. లేకపోతే ఊళ్ళో ఇల్లు అమ్ముకుంటారా ఎవరైనా.. అస్సలు ఇవన్నీ కాదు బావా.. వాళ్ళు ఎవరున్నా లేకపోయినా నాకు నువ్వుంటావ్ అది చాలు, నీ ప్రాజెక్ట్ అయిపోయిందిగా తరవాత జరగాల్సినవి చూద్దాం. నేను పాస్ అయిపోతాను, జాబ్ కూడా అక్కడే.. ఈ లోగా నాన్న సంవత్సరికం అయిపోతుంది. ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నేనూ నీతోనే అని కౌగిలించుకుంది. విక్కీ ఏం మాట్లాడలేకపోయాడు. విక్కీ ఏం మాట్లాడకపోయేసరికి స్వప్నిక చెప్పేసింది. నువ్వు కూడా కాదంటే నేను ఒంటరిదాన్ని అయిపోతాను అని గట్టిగా వాటేసుకునేసరికి విక్కీ షర్ట్ మీద తడి తగిలింది. ఇంకేం ఆలోచించకుండా స్వప్నిక నుదిటి మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకున్నాడు. ఆకాశంలోకి చూస్తే తన మావయ్య స్వప్నిక గురించి మాట్లాడినప్పుడల్లా నా బంగారు బొమ్మరా అది అని అంటుండేవాడు.. ఆకాశంలో చుక్కల వంక చూస్తూ మావయ్యా నీ బంగారు బొమ్మకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అనుకున్నాడు మనసులో.. ఆకాశంలో పెద్దగా వెలుగుతున్న నక్షత్రం ఒకటి మాయం అయ్యింది.
Like Reply
Super brother nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Emotional
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
Kummesaru update
[+] 1 user Likes Rajeshreddy1986's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Good update buddy.. your writing is heart touching..
[+] 2 users Like nenoka420's post
Like Reply
Emotional update

Eagerly waiting for your next updates
[+] 1 user Likes raj558's post
Like Reply
clps Nice emotional update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
super super super super
[+] 1 user Likes Gangstar's post
Like Reply
nice update
[+] 1 user Likes vikas123's post
Like Reply
Superb update
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Superb update
[+] 1 user Likes murali1978's post
Like Reply
Super
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
AWESOME UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Thankyou All

❤️
[+] 3 users Like Pallaki's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)