Thread Rating:
  • 20 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా గతం.... గమనం
శ్రీజతో మళ్ళీ మాట్లాడటానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఛాన్స్ వస్తే రెండే సమయాల్లో వస్తుంది: ఒకటి స్టడీ అవర్స్, రెండు కాలేజీ అయిపోయాక. తనతో చివరిసారి మాట్లాడాక తను మా బెంచిల వైపు రాలేదు దాంతో స్టడీ అవర్స్ లో మాట్లాడటం కుదర్లేదు. సాయంత్రం మాట్లాడదాం అంటే కాలేజీ అయ్యిన వెంటనే మాయమయ్యేది. నేను సైకిల్ తీసి వచ్చేలోపు వెళ్లిపోయేది అనుకుంట. సరే వస్తుందిలే ఛాన్స్ అని యధావిధిగా నా గోలలో నేను ఉండేవాడిని. నాగరాజు తో కలిసి పెన్ గేమ్ మాత్రం వదల్లేదు, వాడు అలా పక్క బెంచి అమ్మాయి దగ్గరకి కొట్టడం, నేను అడగడం, ఆ అమ్మాయి పెన్నులు ఇవ్వడం షరా మాములు అయిపోయింది మాకు. తను కూడా ఎప్పుడు ఎం అనేది కాదు, నవ్వుతూనే ఇచ్చేది పెన్నులు. తనకి ఎంత అలవాటు ఐపోయిందంటే, నేను అడగకముందే పెన్ను తీసి నా బెంచి పైన పెట్టేది. 

ఒక రోజు కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్తుంటే, మెయిన్ రోడ్ మీద శ్రీజ కనపడింది. ఎవరికోసమో ఎదురు చూస్తూ నిల్చొని ఉంది. ఇంతకంటే మంచి అవకాశం రాదు అని వెంటనే తన దగ్గరకి వెళ్లి ఆగాను. 

"హాయ్, ఏంటి వెయిట్ చేస్తున్నావ్?"

"హే, అవును మా అమ్మ కోసం. కలిసి వెళ్దాం అంటే వెయిట్ చేస్తున్న"

"ఓహ్! రోజు మీ అమ్మ నువ్వు కలిసే వెళ్తారా ఇంటికి?"

"లేదు, నేను వెళ్ళిపోతా. అమ్మ ముందే వెళ్ళిపోతుంది ఇంటికి. ఇవాళ ఎదో పని ఉండి కాలేజ్ లో లేట్ అయిందంట ఎలాగూ ఇటుగానే వస్తాను కలిసి వెళ్దాంలే అంది. ఐన నువ్వెంటి ఇంకా ఇంటికి వెళ్లలేదా?"

"స్టార్ట్ అయ్యాను, నిన్ను చూసి వచ్చా. మీ అమ్మ వచ్చేవరకు ఉంటాలే, ఒక్కదానివే ఎం ఉంటావ్ రోడ్ మీద!!"

"హే, పర్లేదు. నాకు అలవాటే. అమ్మ ఒక్కోసారి ఇలానే కలిసి వెళ్దాం అంటుంది, వెయిట్ చేస్తా. నీకు టైం వేస్ట్ ఎందుకు, వేళ్ళులే. రోడ్ మీద వచ్చేపోయేవాళ్ళని చూస్తూ ఉంటా, టైంపాస్ అవుతుంది"

"నాకు టైం వేస్ట్ ఏముంది, ఇంటికి వెళ్లినా పెద్ద చేసేది ఎం లేదు తిని పడుకోడం తప్ప. ఉంటాలే నీకు కంపెనీ. ఇబ్బంది అంటే చెప్పు, వెళ్లిపోతా"

"నాకేం ఇబ్బంది లేదు బాబు. సరే ఉండు, కానీ ముందే చెప్తున్నా వెళ్తానంటే వెళ్ళిపో, ఏం పర్లేదు"

"సరేలే కానీ. ఏంటి సంగతులు. ఎలా ఉంది కాలేజీ, క్లాసులు, ఎగ్జామ్స్..."

"హహ, నువ్వు నేను ఒకే క్లాస్ బాబు. నీకు చెప్పే క్లాసులే నాకు చెప్తారు, నీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ ఏ నాకు ఇస్తారు. నీకు ఎలా ఉంటె నాకు అలానే ఉంటుంది కదా!!"

"ఒకేలా ఎందుకు ఉంటుంది. చెప్పేది ఒకటే అయినా, పాఠం వినేవాడ్ని బట్టి ఉంటుంది. అడిగేది ఒక్కటే ప్రశ్న అయినా, రాసే సమాధానం మారుతుంది కదా"

"అబ్బో తెలివైన వాడివే. బాగానే మాట్లాడుతున్నావ్ !!"

"ఎదో మీ దయ"

"అంతొద్దు. ఇంతకీ సల్మా ఏమంటోంది?"

"సల్మా ఎవరు?"

"వామ్మో. అప్పుడే మర్చిపోయావా? రోజు ఎన్ని సార్లు ఇస్తోంది కిందపడ్డ పెన్నులు పాపం. అంతేలే ఎం అనకుండా ఇస్తుంది కదా, తక్కువ అయిపోయింది. చెప్తా ఆగు దానికి"

"ఓహ్ తన పేరు సల్మా నా. నాకు తెలీదు ఇప్పటివరకు"

"ఓరి దుర్మార్గుడా, పేరు కూడా తెలీకుండా ఇన్ని రోజులు పెన్నులు ఎత్తించావా? దానికి కచ్చితంగా చెప్పాల్సిందే"

"ఇది మరి బాగుంది, అసలే పెన్ను పడ్డప్పుడల్లా పాపం తీయిస్తున్నా అని గిల్టీగా ఉంటే, పేరు అడిగి మాటలు కలిపి ఇంకా ఇబ్బంది పెట్టమంటావా?"

"అయినా సరే, ఇది టూ మచ్"

"సరే ఈసారి హెల్ప్ అడిగిన ప్రతివాళ్ళని పేరు, గోత్రం, రాసి, నక్షత్రం అన్ని కనుక్కుంటాలే"

"హహ, అసల మాములు షో లేదుగా నీ దగ్గర"

"ఆ మాత్రం లేకపోతే బ్రతకలేంలే ఈ పాడు సమాజంలో"

"హహ, ఇంకా చాలు ఆపేయ్. నేను నవ్వలేను"

"అయినా పెన్ను కొట్టేది నేను, ఇచ్చేది సల్మా... నువ్వెందుకు అన్ని సార్లు అడుగుతున్నావు? పైగా మొన్న కూడా ఎదో అన్నావ్ దీని గురించి, గుర్తురావట్లా సరిగ్గా"

"ఎదో, కుతూహలం కొద్దీ అడుగుతున్నాలే, నచ్చకపోతే అడగను"

"నచ్చకపోవడం ఏం లేదులే"

"ఏంటి మా అమ్మ ఇంకా రాలేదు!! కాల్ చేస్తా ఉండు"

అమ్మాయిల టాలెంట్ ఏంటంటే, ఫోన్ లో మాట్లాడితే పక్కన వాళ్ళకి కూడా వినబడదు. నేను కూడా కొంచెం పక్కకి జరిగాను వింటాను అనుకుంటదేమో అని. కాల్ కట్ చేసాక నా దగ్గరకి వచ్చి 

"ఇంకా టైం పడుతుందట అమ్మకి. నేను వెళ్ళిపోతాను అని చెప్పా. నువ్వు కూడా బయల్దేరులే, ఇప్పటికే చాల టైం అయినట్టుంది"

"అయ్యో అవునా! పాపం ఆంటీకి చాలా పని అనుకుంటాగా"

"హా, ప్రిన్సిపాల్ అయినప్పటినుండి పాపం ఎక్కువైంది వర్క్. ఏం చేస్తాం పోసిషన్ పెరిగితే పని పెరుగుతుంది"

"అవును నిజమే. సరే ఎలా వెళ్తావ్ ఇంటికి?"

"నడుచుకుంటూ వెళ్ళిపోతా, రోజులానే"

"దగ్గరేనా?"

"నడవడానికి దూరం, ఆటోకి దగ్గర"

"మరి ఏం నడుస్తావ్, ఆటో ఎక్కేయరాదు"

"లేదులే, రోజంతా కూర్చొనే ఉంటాం కదా. కాస్త నడిస్తే బాగుంటుంది, నాకు ఎలాగూ వాకింగ్ ఇష్టం"

"సరే నేను కూడా వస్తా పద, కంపెనీ ఇస్తా నీ వాకింగ్ లో. మీ ఇంటిదగ్గర దిగబెట్టి నేను వెళ్ళిపోతా"

"ఎందుకు అంత శ్రమ నీకు. నేను వెళ్తా కదా"

"శ్రమేముంది, అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లొచ్చు. చెప్పాకదా ఇంటికి వెళ్లినా పెద్ద పీకేదేమ్ లేదని"

"సరిపోయింది, వదిలేస్తే ఈ రాత్రంతా నాతోనే గడిపేసేలా ఉన్నావ్"

తెలిసి ఆందో తేలిక ఆందో కానీ, ఆ ఊహ ఎంత బాగుందో. ఒక్కసారి ఆ ఊహలోకి వెళ్ళిపోయాను నేను. రాత్రంతా నేను తనతో గడపడం అంటే నరాలు ఎక్కడో జివ్వుమన్నాయి. మోహంలో వచ్చిన కామాన్ని కవర్ చేస్కుంటూ నవ్వేసాను. 

"హహ, నీకు ఇష్టంలేదంటే చెప్పు వెళ్లిపోతా"

"నువ్వు టైం వేస్ట్ చేస్కుంటా అంటే నాదేముంది, దా మరి కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం" అని ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. 

దాని నవ్వుకే పడిపోవచ్చు సగం. కింద పెదవి దగ్గర ఒక చిన్న పుట్టుమచ్చ ఉంటుంది, నవ్వినప్పుడు తెల్లటి పళ్ళని కప్పేస్తూ ఎర్రటి పెదాలు వాటికింద చందమామకి చుక్కలాగా ఆ చక్కటి పుట్టుమచ్చ. పెద్ద పెద్ద కళ్ళు ఓరగా చూస్తాయి, పట్టుకుంటే కందిపోతుందేమో అనిపించే నాజూకైన చేతులు. కలర్ ఒక్కటే తక్కువగాని, మిగతా అన్నిట్లో శ్రీజాది మతి పోగొట్టే అందం. గొప్ప విషయం ఏంటంటే ఆ అందం ఒకేసారి కనపడదు, చూడగా చూడగా కనిపిస్తుంది ఇంచ్ బై ఇంచ్. అలా ప్రతిసారి చూడాలి అనిపించడం వల్లనేమో రోజు రోజుకి అందంగా కనిపిస్తుంది. లక్ష్మీపురం వీధుల్లో పక్కన అమ్మాయితో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కిక్ వేరేలా ఉండేది అప్పట్లో. తనకి నాకు మధ్య సైకిల్ నడిపిస్తూ వెళ్తున్నాం. ఒక 2 నిముషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. దాన్ని ఛేదిస్తూ నేను 

"నీకు బోలెడు ఫ్రెండ్స్ అంట కదా, నాగరాజు చెప్పాడు. అందరితో మంచిగా మాట్లాడతావంట"

"హిహి, ఎదో వాడి పిచ్చి. అందరితో మంచిగా మాట్లాడటం అనేది నాకు ముందు నుండి అలవాటు. ఒకరితో ఎక్కువగా ఒకరితో తక్కువగా మాట్లాడటం రాదు నాకు, చెప్పాలంటే వాగుడుకాయని మాట్లాడుతూనే ఉంటా. కొంతమందికి అది నచ్చుతుంది కొంతమందికి నచ్చదు. దాన్ని బట్టి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, అంతేకానీ నాకు మరి అంత మంది ఫ్రెండ్స్ ఏం లేరు. నేను బాగా మాట్లాడేది అంటే ఒక 10 మందితో"

"ఆ 10 మందిలో ఇప్పుడు నేను కూడా ఉన్నానా మరి?"

"లేదు. నువ్వు పదకొండోవాడివి"

"హహ, టీచర్ కూతురివి అనిపించావు. అంటే నేను కూడా ఫ్రెండ్ అనేగా?"

"చూదాం, ఇప్పుడేగా పరిచయం ఐంది. ముందు ముందు తెలుస్తుందిలే తొందర ఎందుకు"

"అలాగే మేడం"

"నాకేమోగాని నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండుంటారుగా, వాళ్ళందర్నీ వదిలేసి నాతో వస్తున్నావే?"

"కొత్త ఫ్రెండ్స్ చేసుకుందామని"

"ఉన్న ఫ్రెండ్స్ నచ్చలేదా?"

"కొత్త ఫ్రెండ్స్ ఇంకా బాగా నచ్చారు"

"బాగానే ఫ్లర్ట్ చేస్తున్నావ్, అలవాటు అనుకుంటా!!"

"అది మనిషిని బట్టి వచేస్తుందిలే, అందరి దగ్గర రాదు"

"అచ్చ, ఇంకెవరి దగ్గర వచ్చిందేంటి!"

"బాగానే ఆరాలు తీస్తున్నావ్"

"తీయాలి బాబు మరి, మీ అబ్బాయిల్ని నమ్మడానికి లేదు అసలే"

"ఛి ఛీ!! నమ్మకం లేని చోట ఉండడు ఈ కార్తీక్. అయినా నేను ఎవరితో ఫ్లర్ట్ చేస్తా చెప్పు"

"ఏమో నాకేం తెలుసు, నా జాగ్రత్తలో నేనుండాలి కదా. నువ్వు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావ్ అని నీ ఫాన్స్ కి తెలిస్తే ఫీల్ అవ్వరూ!! లేదంటే నన్ను తప్పుగా అర్థంచేసుకుంటారు మళ్ళీ!!"

"ఫాన్స్ ఆ, ఏంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మేడం"

"ఇప్పుడు అలానే ఉంటుందిలే"

"ఏమోనమ్మా, నువ్వు ఒక్కోసారి అర్ధంకాకుండా మాట్లాడతావ్"

"హ్మ్మ్. ఇందాక అడిగిందానికి మాత్రం ఆన్సర్ లేదు ఇంకా?"

"ఏం అడిగావు?"

"అదే, ఫ్లర్ట్ చెయ్యడం బాగా నేర్చావ్, గర్ల్ఫ్రెండ్ ఉందా అని?"

"ఇప్పటికైతే లేదు, ముందు ముందు ఉండొచ్చు"

"అబ్బో, కాంఫిడెన్స్ ఆ!! ఎవరా అమ్మాయి?"

"ముందు ముందు నీకే తెలుస్తుందిలే తొందర ఎందుకు"

"నా డైలాగ్ నాకే కొడుతున్నావ్ గా, మాములోడివి కాదు నువ్వు"

"ఏదో మీ అభిమానం"

"అన్తోద్దమ్మా!"

"మరి నీకు?"

"నాకేంటి?"

"అదే, ఫ్లర్ట్ చేస్తున్న అని పట్టేసావ్ కదా, బొయ్ఫ్రెండ్ ఉన్నాడా?"

"తెలివైనోడివే, ఉంటే ఏం చేస్తావ్?"

"నీ బొయ్ఫ్రెండ్ ని నేనేమన్నా చేస్తే బాగోదేమో"

"హహహ, ఛీ సిగ్గు లేదు అసలు"

"ఉంది కాబట్టే ఏం చెయ్యను అంటోంది"

"హహహహ, బాబోయ్ ఆపు ఇంక నవ్వలేను"

అలా నవ్వుకుంటూ ఉండగా వాళ్ళ ఇల్లు ఉన్న వీధి వచ్చేసింది. చుట్టూ ఎవరు లేకపోయినా వెలుతురు బాగానే ఉండటంతో కొంచెం నిర్మానుష్యంగా ఉన్నా బాగానే ఉంది. 

"ఇక్కడే మా ఇల్లు" అంటూ ఆ వీధి లోకి చెయ్యి చూపించింది శ్రీజ. 

"బాగుంది, తెలీకుండా చాలా ఫాస్ట్ గా వచ్చేసాం కదా"

"అవును, నిజం చెప్పాలంటే నీతో ఉంటే టైం ఏ తెలీలేదు. ఇంతలా నవ్వి కూడా చాలా రోజులైంది"

"నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ"

"సరే, నేను వెళ్తాను ఇంక. నువ్వు కూడా బయల్దేరు ఇప్పటికే చాలా లేట్ ఐంది"

"హా నేను వెళ్తాలే, నువ్వు ఇంట్లోకి వెళ్ళు నేను స్టార్ట్ అవుతా"

శ్రీజ మెల్లిగా ఒక నాలుగు అడుగులు ముందుకి వేసి వెనక్కి తిరిగి 

"రోజు ఇలా లేట్ గా వెళ్తే ఇంట్లో ప్రాబ్లెమ్ ఆ?" అని గోముగా చిన్న గొంతుతో అడిగింది. నాకు అర్థమైంది, రోజు తనతో ఇలా ఇంటిదాకా రమ్మని అడుగుతోంది అని. నువ్వు అడగాలేకానీ అసలు ఇంటికి కూడా వెళ్లకుండా నీతోనే ఉంటా అందామనుకున్న కానీ మరీ ఓవర్ అవుతుంది అని 

"నీకు ఇబ్బంది లేకపోతే రోజు ఇలానే ఇంటిదాకా తోడు రావడం నాకు ఇష్టమే"

"నీకు ఓకే అయితే నాకు ఓకేనే" అని ముసిముసిగా నవ్వుకుంటూ అంది. 

"జి హుకుం, రేపు కలుద్దాం మరీ, బాయ్" 

శ్రీజ మెల్లిగా నడుచుకుంటూ వాళ్ళ ఇంటిదగ్గరకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళబోయేముందు ఒక్కసారి వెనక్కి తిరిగి బాయ్ అన్నట్టు చెయ్యి ఊపి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. పిట్ట పడిపోయిందిరో అనిపించింది ఒక్కసారిగా. నా ఇంటర్ కాలేజీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంటికి వెళ్లేప్పుడు అంత ఉత్సాహంగా వెళ్ళలేదు. అప్పటినుండి రోజు ఏదో విధంగా శ్రీజ తో మాటలు కలుపుతూనే ఉండేవాడిని. కుదిరితే బ్రేక్ టైంలో లేదంటే ఇలా సాయంత్రాలు.  తనతో వాకింగ్లు ఇంటి దాగా డ్రాప్పింగ్లు భలే సరదాగా ఉండేవి. మాట్లాడగా మాట్లాడగా నాకు అర్థమైంది ఏంటంటే, శ్రీజకి మాటలతో కట్టిపడెయ్యడం బాగా వచ్చు. మాట్లాడేటప్పుడు తన మాటలు, అందం, బాడీ లాంగ్వేజ్ ని ఒకేసారి వాడుతుంది. దాంతో తను నచ్చకపోవడం అనేది ఉండడు, మొదటిసారి మాట్లాడినవాళ్ళకి కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మెల్లిమెల్లిగా మా ఇద్దరిమధ్య స్నేహం పెరిగింది. ఖాళీగా ఉంటే స్టడీ అవర్స్ లో నా వైపు వచ్చి కూర్చునేది, ఎవరు పెద్దగా గమనించని టైం లో ఏదోకటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. లేదంటే కావాలని పెన్నులు పడేసేవాడ్ని, నవ్వుకుంటూ తీసి ఇచ్చేది. ఒకరోజు యధావిధిగా నడుచుకుంటూ వెళ్తున్నాం సాయంత్రం కాలేజీ అయిపోయాక. 

"నీకో సంగతి చెప్పనా!!" అని కళ్ళు పెద్దవి చేసి అంది శ్రీజ. 

"వద్దు అన్నా వదలవుగా, చెప్పు"

"సల్మా గుర్తుంది కదా నీకు"

"హా అవును ఏమైపోయింది పాపం, ఈ మధ్య కనపడట్లా"

"ఉంది మన క్లాస్ లోనే. అటు లాస్ట్ లో కూర్చుంటోంది ఈమధ్య"

"పాపం ఎన్ని సార్లు పడేసిన ఏం అనకుండా ఇచ్చేది పెన్నులు. తనెందుకు గుర్తొచ్చింది సడన్ గా"

"పాపకి నువ్వంటే ఇష్టం!" అని ఒక చిన్న బాంబు పేల్చింది. నాకు నమ్మబుద్ధి కాలేదు, ఏదో సరదాకి చెప్తుందిలే అనుకున్న 

"హహ, ఏంటి జోకా!! తనకి నేనంటే ఇష్టమేంటి అసలు నేనెప్పుడూ మాట్లాడింది లేదు"

"ఆ విషయం నాకు తెలుసు, చెప్పేది పూర్తిగా విను ముందు"

"సరే చెప్పు"

"నేను నీతో మొదటిసారి మాట్లాడాను గుర్తుందా, అప్పుడు చెప్తూ ఉండేది పక్కన ఉండే అబ్బాయి ఎప్పుడూ పెన్నులు పడేస్తాడే నా వైపు అని. మేము ఊరికే ఏడిపించేవాళ్ళం, సైట్ కొడుతున్నాడేమో నచ్చితే నువ్వు కూడా కొట్టు అని. అప్పుడు ముసిముసిగా నవ్వుకునేది, తర్వాత ఒకరోజు ఎందుకో నీ గురించి టాపిక్ వచ్చి 

'ఏమే! ఇంక కొడుతున్నాడా పెన్నులు' అంటే 

'ఏదోలేవే పాపం వదిలెయ్యండి' అని నిన్ను వెనకేసుకొచ్చింది. ఓసిని నువ్వు సిగ్గుపడుతున్నావేంటే అని కూర్చోబెట్టి అడిగితే 

'ఏమోనే, బాగుంటాడు అనిపిస్తుంది. కానీ మాట్లాడదాం అంటే భయం వేస్తోంది' అని మనసులోది కక్కేసింది. 

'నీకు నచ్చితే మాట్లాడవే, ఏం కాదు' అని ఎంత చెప్పినా వినేది కాదు. అదేమంటే భయం అనేది. కానీ నువ్వు పడేసిన పెన్నులు తీసివ్వడం మాత్రం ఇష్టంగా చేసేది, బహుశా అది చేయడం వల్ల నీతో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చేదేమో దానికి. నేను ఎన్ని సార్లు మాట్లాడమని చెప్పినా

'తను ఏం మాట్లాడట్లేదు కదే, నేనేం మాట్లాడేది' అనేదే తప్ప ట్రై చేసేది కాదు. ఇలా కాదు నేనే మాట్లాడదాం అనుకున్నా నీతో. కానీ ఎందుకో మనం మాట్లాడుకున్న ప్రతిసారి సల్మా టాపిక్ తీసుకురాలేకపోయాను ఇప్పటిదాకా" 

నాకు ఇదంతా విన్నాక ఏం చెప్పాలో అర్థంకాలేదు. విన్నదంతా బుర్రలోకి ఎక్కడానికి ఎక్కువ సమయమే పట్టింది, ఇంతలో శ్రీజ నా భుజంతట్టి 

"హలో! మాస్టారు, ఏంటి ఏం మాట్లాడావ్?"

"ఏం మాట్లాడమంటావ్, నా వెనక ఇంత జరిగిందా ఇన్ని రోజులు?"

"వెనకేం కాదు, ముందే జరిగింది. నీకే కనపడేలా" 

"మీరేం మాట్లాడుకుంటారో నాకెలా తెలుస్తుంది?"

"అదీ నిజమేలే, అయినా తనతో ఒక్కసారి కూడా మాట్లాడాలి అనిపించలేదా?"

"ఏమో, అలా ఎప్పుడూ ఆలోచించలేదు అనిపించనూ లేదు. తన మనసులో ఇంత మ్యూజిక్ ఉంది అనైతే అస్సలు తెలీదు. నిజం చెప్పాలంటే నీతో మాట్లాడాలని మాత్రం ఉండేది. ఆరోజు నువ్వు వచ్చి మాట్లాడావ్ కదా, అప్పటినుండి ఇంకొంచెం బలంగా ఉండేది మాట్లాడాలి అని. అదీ కాస్త ఇప్పుడు మనం ఇలా కలిసి వెళ్తూ మాట్లాడుకునేదాకా వచ్చింది"

"తనతో మాట్లాడాలి అనిపించలేదు సరే. నాతో మాట్లాడాలి అని ఎందుకు అనిపించింది, దానికి నీ మీద మ్యూజిక్ స్టార్ట్ అయినట్టు నీకు నా మీద కాలేదు కదా?"

అడిగేసింది. ఏదైతే నేను ప్లాన్ చేసి చెపుదాం అనుకున్నానో, ఆ టాపిక్ తెచ్చేసింది. ఇప్పుడు నేనేం చెప్తే ఎలా తీసుకుంటుందో తెలీదు. అవును, నువ్వంటే నాకిష్టం అని చెప్పేస్తే రేపేటినుండి ఈ మాత్రం కలవడం కూడా పోటుదేమో అని భయం. అలా అని లేదు అంటే ఎప్పటికి ఒక ఫ్రెండ్ గానే ఉండిపోతానేమో అని టెన్షన్. సరే ఏదైతే అదీ ఐంది అని 

"అవును! నేను నిన్ను క్లాస్ లో మొదటిసారి చూసినప్పుడే నచ్చేసావ్. ప్రతిరోజూ నీకోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని, నిన్ను చూసాక బాగుండేది రోజంతా. నువ్వు మొదటిసారి మాట్లాడినప్పుడు ఇంకొంచెం ఎక్కువ నచ్చావ్. తర్వాత నీ గురించి కొంచెం కొంచెం తెలిసేకొద్దీ ఇంకా నచ్చేసావ్. రోజు నీతో ఉండాలి మాట్లాడాలి అనిపిస్తుంది, నీతో గడిపే టైం ఎందుకో బాగుంటుంది హ్యాపీ గా అలా పోతూ. దాని మ్యూజిక్ అనాలో ఇంకేమన్నా అనాలో అయితే తెలీదు, బట్ ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి"

తను కొంతసేపు ఏం మాట్లాడలేదు. మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంతలో వాళ్ళ ఇల్లు వచ్చేసింది. ఏం చెప్పకుండా వెళిపోతుందేమో అని 

"ఒకటి అడగనా!! ఇందాక సల్మా గురించి ఎన్ని సార్లు చెప్దామనుకున్న కుదర్లేదు అన్నావ్ కదా, ఎందుకు?"

"ఏమో, నాక్కూడా తెలీదు. నీతో ఎప్పుడైనా మాట్లాడే ఛాన్స్ వస్తే సల్మా గురించే అడుగుదాం అనుకున్నా. కానీ ఎప్పుడూ గుర్తొచ్చిన అది నోటిదగ్గర ఆగిపోయేది"

"ఎందుకు అంటావ్?"

"అదైతే నాకు తెలీదు. కానీ నీకు నా మీద ఇంత ఇష్టం ఉంది అని ఇప్పుడు తెలిసింది. ఇన్ని రోజులు మంచి ఫ్రెండ్ లానే ఉంటున్నావ్ అనుకున్నా"

"చెప్పాలి అనిపించింది చెప్పాను. అది ఎలాగూ ఎక్కువ రోజులు దాచుకోలేను, ఎప్పుడైనా చెప్పాలి"

"హ్మ్మ్. నేను వెళ్ళనా ఇంటికి మరీ?"

"హా, వెళ్ళు. బాయ్" అని తను ఇంట్లోకి వెళ్ళాక వెళ్దాం అని అక్కడే నిల్చున్నా. తను కొంచెం ముందుకి వెళ్లి, మళ్ళీ వెనక్కి వచ్చి 

"మనం మొదటిసారి ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు నువ్వు ఒకటి అడిగావు గుర్తుందా?"

"ఏంటది?"

"నాకు బొయ్ఫ్రెండ్ ఉన్నాడా అని?"

"హ్మ్మ్"

"ఇప్పటివరకైతే లేడు, కానీ రేపటినుండి ఉంటాడేమో అనిపిస్తుంది"

"అదేంటి, అర్ధంకాలేదు. ఎవరు?"

"తెలివైన వాడివే కదా. ఆలోచించు అర్ధమౌతుంది" అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి నవ్వింది. అప్పుడు వెలిగింది నాకు తను నన్నే అంటోంది అని. అబ్బా ఇదేదో తను వెళ్ళకముందు వెలగొచ్చు కదా ఇప్పడు రేపు వరకు వెయిట్ చేయాలి పాప ఎక్స్ప్రెషన్ చూడాలంటే. ఎగిరి గంతేసినంత పని చేశాను. వినడానికి నిబ్బా నిబ్బి కబుర్లు లా ఉన్నా, మొదటిసారి ప్రేమలో పడ్డప్పుడు ఉండే ఫీలింగ్ చాలా కొత్తగా ఆనందంగా ఉంటుంది. రేపటినుండి నాకు ఒక gf ఉంది అనే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. పైగా శ్రీజ నా మొదటి గర్ల్ఫ్రెండ్, సహన లాగ కాకుండా. నేను మాట్లాడి పడేసిన పిల్ల, విధి అనుకూలించి ఇచ్చిన అవకాశం కాదు. అందుకేనేమో ఇంకా మత్తుగా ఉత్సాహంగా అనిపించింది. వెంటనే సైకిల్ ముందు చక్రం లేపి మరీ గాల్లో విహరిస్తూ ఇంటికి వచ్చి స్నానం చేసి, తన గురించే ఆలోచిస్తూ పడుకున్నాను. 

ఆ తర్వాత నుండి మా మాటలు ఇంకా పెరిగాయి, భౌతిక హద్దులు చెరిగాయి, మా మధ్య దూరం పోయి మేము దగ్గరవ్వడం మొదలెట్టాం. ఒకప్పుడు మా ఇద్దరి మధ్య సైకిల్ నడిచేది కానీ ఇప్పుడు తన చేయి నా చేయిని పెనవేసి నడవడం మొదలుపెట్టాం. Big C లో ఒక చిన్న ఫోన్ కొనుక్కొని దానికి సిం కార్డు వేసి ఆ కార్డు కి మెసేజ్ బాలన్స్ వేసి ఇంట్లో ఉన్నప్పుడు టిక్కు టిక్కు అని మెసేజిల్లో మాట్లాడుకునేవాళ్ళం. గుడ్ మార్నింగ్ దగ్గర్నుండి గుడ్ నైట్ వరకు అన్ని ఉండేవి. ఒకోరోజు అలా మెసేజిల్లో మాట్లాడుతూ ఉండగా అడిగాను 

"నిజం చెప్పు, సల్మా గురించి మాట్లాడదాం అని వచ్చి, నన్ను ఇష్టపడ్డావ్ కదా నువ్వు?"

"మొదటిసారి అయితే కాదు, కానీ నీతో మాటలు పెరిగేకొద్దీ ఇష్టపడ్డాను. అందుకే సల్మా టాపిక్ తీసుకురాలేకపోయేదాన్ని"

"మరి తనకి తెలుసా మన గురించి?"

"తెలీదు, తెలిస్తే బాధపడుతుంది అని నేనే చెప్పలేదు"

"పాపం కదా సల్మా!! ముందే మాట్లాడి ఉండాల్సింది నేను"

"ఓయ్, గుద్దుతా! ఆ రోజులు అయిపోయాయి. ఇప్పుడు నువ్వు నావాడివి, అది బాధపడుతుంది అని జాలిచూపించావో నేను బాధపడాల్సివస్తుంది"

"అలా అనట్లేదే. తను ఇష్టముండి కూడా చెప్పలేకపోయింది అంటున్న"

"నేను చెప్పా దానికి, మాట్లాడవే ఏం కాదు అని. అది ఏం చేయకపోవడం దాని తప్పు"

"అదేలే..." అని అని వదిలేసా కానీ, అమ్మాయికి అమ్మాయే శత్రువు అని ఊరికే అనలేదు. సల్మా ని పక్కకి నెట్టేసి నన్ను తనవాడ్ని అనుకోవడం ముచ్చటేసింది, కానీ సల్మా ని తల్చుకుంటే బాధేసింది. ఎంతైనా అమ్మాయిలు సెల్ఫిష్ ఉంటారు అని నవ్వుకున్నాను. 

శ్రీజతో ఈ ప్రేమాయణం చాలా బాగుంది కానీ ఒక్కటే వెలితి. ముద్దులు ముచ్చట్లు హుగ్గులు టచింగ్లు చాలా అంటే చాలా తక్కువ, ఉన్నా మహా అయితే చేతులు పట్టుకోవడం వరకే. పోనీ నేనే చొరవ తీస్కొని ఎప్పుడైనా కెలుకుదామా అంటే మాకు అంత ఏకాంతం దొరకదు. లేదా ఎక్కడైనా ఎవరూలేని పార్కుకి తీసుకెళదామా అంటే పాప వచ్చే రకం కాదు, వచ్చినా ఎంతవరకు కో-ఆపరేట్ చేస్తుందో తెలీదు. ఇలా ఎదురు చూస్తూ ఉండగా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb update
[+] 2 users Like Sachin@10's post
Like Reply
EXECELLENT UPDATE
Like Reply
Nice update
Like Reply
Excellent update bro
Like Reply
Wonderful update.. very good narration
Like Reply
Excellent update
Like Reply
Devudu miku avakaham ichhadu.....maku oka update speed ga (avakasam) ivvandi.
Like Reply
Nice superb update  clps
Like Reply
clps Nice fantastic update happy
Like Reply
Lovely update
Like Reply
Update please
Like Reply
Nice update
Like Reply
Wooow inter love chaaala sweet feeling
Like Reply
excellent update.........................................love lo munchesaru ga mammalni
Like Reply
Nice updates

Waiting for the next updates
Like Reply
(24-12-2023, 10:33 AM)kartik777 Wrote: శ్రీజతో మళ్ళీ మాట్లాడటానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఛాన్స్ వస్తే రెండే సమయాల్లో వస్తుంది:
[size]

Good story, kartik777 garu!!![/size]
Like Reply
Waiting for update
Like Reply
Karthik garu.. waiting for an update..
Mee narration bagundi
Like Reply




Users browsing this thread: 2 Guest(s)