24-11-2023, 10:11 PM
Nice starting
Thriller ది వారియర్
|
30-11-2023, 06:57 AM
సారీ ఫ్రెండ్స్ నేను update ఇన్ని రోజులు ఇవ్వకపోవడానికి కారణం నేను పని చేస్తున్న కాలేజ్ లో చిన్న సమస్య వచ్చింది దాని వల్ల నాకూ చాలా పెద్ద damage జరిగింది అది సద్దుమణిగింది అనుకునే లోపు పిల్లలకు exams మొదలు అయ్యాయి అందుకే update ఇవ్వలేక పోతున్నా కాబట్టి దయచేసి క్షమించండి ఇంక నుంచి రెగ్యులర్ updates ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.
03-12-2023, 08:09 PM
నీలోఫర్ తనకు పెళ్లి కుదిరింది అని చెప్పిన వెంటనే రాజ్ కీ fuse ఎగిరి పోయింది ఏమీ జరిగిందో అర్థం కాలేదు తను విన్నది నిజమేనా కాదా అని ఆలోచనలో అలాగే అక్కడే ఉండి పోయాడు రాజ్, ఇది ఏమీ పట్టించుకోకుండా నీలోఫర్ మాత్రం అక్కడి నుంచి కల్చరల్ ఈవెంట్స్ గురించి చూసుకోవాలి అని తిరిగి ఆడిటోరియంలోకి వెళ్లింది, అప్పుడే తన కాబోయే భర్త అయినా సిరాజుద్దీన్ నుంచి వచ్చింది దాంతో నీలోఫర్ గట్టిగా ఊపిరి పీల్చుకున్ని "హలో" అని ప్రేమగా ఫోన్ మాట్లాడం మొదలు పెట్టింది అప్పుడు పక్కనే ఉన్న కల్చరల్ ప్రోగ్రాం పిల్లలు రాజ్ కోసం ఒక bgm నీ పెట్టాలి అని ప్లే చేశారు అది మాస్టర్ సినిమా లోని bgm అది విన్న నీలోఫర్ కీ అదే ఆడిటోరియంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన పదవ తరగతి విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీ రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
(2 సంవత్సరాల క్రితం) రాజ్ ఆ కాలేజ్ లో కొత్తగా ఉద్యోగంలో చేరాడు నీలోఫర్ అదే కాలేజ్ లో మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న తనకు ఏమీ గుర్తింపు లేదు, కానీ రాజ్ కాలేజ్ లో దసరా పండుగ ముందు చేరాడు వచ్చిన ఆరు నెలల లోనే తను కాలేజ్ లో ఉన్న హై కాలేజ్ పిల్లలను తన వైపు తిప్పుకొని వాళ్లందరి దృష్టి లో హీరో అయ్యాడు రాజ్, ఇది కొంచెం management వాళ్లకు నచ్చేది కాదు దాంతో రాజ్ ఏదైనా చిన్న తప్పు చేసినా దొరుకుతాడు ఉద్యోగం నుంచి తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు, కానీ రాజ్ తెలివిగా తప్పించుకుని తిరుగుతున్నాడు అలా తన స్టూడెంట్స్ అందరూ పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన తర్వాత ఫేర్ వెల్ పార్టీ పెట్టారు, దాంతో రాజ్ ఆ రోజు స్టేజ్ ఎక్కి పిల్లలకు ఒక స్పీచ్ ఇచ్చాడు ఏమని అంటే "పిల్లలు బయట మీ కోసం ఒక రేస్ ట్రాక్ రెడీగా ఉంది మీకు ఇష్టం ఉన్న లేకున్నా అందులో పరిగెత్తుతూ ఉండాలి, కాబట్టి నేను మీకు ఇంకో టిప్ ఇస్తాను మీరు ఏమి గుర్రం కాదు ఎలుక కాదు పరిగెత్తుతూ బ్రతకడానికి మనుషులు మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి, ఈ రేస్ లో పరిగెత్తితే మీకు అలసిపోయిన నీళ్లు ఇవ్వడానికి కూడా ఎవరూ ఉండరు ఒక్కసారి ఆగి ముందు వాడితో పోటీ పడడం మానేసి వాడు అలిసిపోతే మీ భుజం నీ ఇచ్చి వాళ్లతో కలిసి నడవండి ఎందుకంటే మీకు దొరికే స్వచ్ఛమైన స్నేహం ఈ కాలేజ్ గేట్ లోపలే బయట మీకు అది దొరకదు, కాబట్టి ఇక్కడ దొరికిన స్నేహితులను జీవితాంతం గుర్తు ఉంచుకోండి లేదా ఈ బంధాన్ని మీ చివరి శ్వాస వరకు తీసుకోని వెళ్ళండి, మీరు ఓడిపోవచ్చు కానీ గెలిచిన వాడి కథలో ఆవేశం ఉంటుంది, ఓడిన వాడి కథ లో ఎక్కడ తప్పు జరిగింది అని తెలుసుకొనే అవకాశం ఉంటుంది సరిదిద్దుకున్నే అవకాశం ఉంటుంది" అని చెప్పాడు, దానికి స్టూడెంట్స్ లో ఒకడు లేచి చప్పట్లు కొడుతూ ఉన్నాడు ఆ చప్పట్లు శబ్దం తో పాటు మాస్టర్ సినిమా లోని bgm పెట్టి రాజ్ నీ హీరో నీ చేశారు ఆ స్టూడెంట్స్. (ప్రస్తుతం) సిరాజ్ అవతలి నుండి "హలో ఉన్నావా నీలోఫర్ " అని అరిచిన అరుపుకు తేరుకొనీ తిరిగి మాట్లాడాలని చూస్తే ఫోన్ లోని సిగ్నల్స్ పోయాయి, దాంతో నీలోఫర్ ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లింది అప్పుడు రాజ్ చిరాకుగా కాలేజ్ టాప్ ఫ్లోర్ లో గోడ ఎక్కి నిలబడి ఉన్నాడు, అది చూసిన రాజ్ ఫ్రెండ్స్ నలుగురు కలిసి పైకి వెళ్లారు, అప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాన్వాయ్ కాలేజ్ క్యాంపస్ లోకి రాగానే కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్ టీచర్ అయిన షేక్ అహ్మద్ తన ఫోన్ తీసి "భాయ్ jammers On లో ఉన్నాయి మీరు రావచ్చు" అని అన్నాడు, దాంతో మినిస్టర్ కార్ నుంచి దిగిన వెంటనే ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద ఉన్న ఒక వ్యక్తి "హ్యాపీ దివాలీ కాఫీరో" అని తన ముందు ఉన్న ఒక బాక్స్ లో బటన్ క్లిక్ చేస్తే కాలేజ్ లో ఉన్న బస్ లు అని బ్లాస్ట్ అయ్యాయి అవి ఎగిరిన వెంటనే టాప్ ఫ్లోర్ లో ఉన్న రాజ్ అతని ఫ్రెండ్స్ ఐదు మంది బిల్డింగ్ మీద నుంచి ఎగిరి కిందకు పడ్డారు, అప్పుడే ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తి కాలేజ్ బిల్డింగ్ మీదకు తాడు తో దూకి ఒక మైక్ తో "you are hijacked" అని అన్నాడు.
04-12-2023, 04:26 AM
04-12-2023, 04:27 AM
04-12-2023, 04:27 AM
04-12-2023, 04:27 AM
04-12-2023, 07:29 AM
04-12-2023, 07:29 AM
04-12-2023, 06:46 PM
కాలేజ్ మొత్తం తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు ఆ ఉగ్రవాద నాయకుడు మినిస్టర్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ మీద బాంబులు వేసి గన్ తో ఎటాక్ చేశాడు, దాంతో సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ఆ బాంబుల మోత వల్ల చెల్లాచెదురు అయ్యారు మిగిలిన వాళ్ళు అతని బుల్లెట్స్ కీ బలి అయ్యారు, ఆ తర్వాత అతను మినిస్టర్ దగ్గరికి వెళ్లి "సలాం మినిస్టర్ గారు నా పేరు అజీజ్ పాషా మీ గవర్నమెంట్ వాళ్లు మొన్న అరెస్ట్ చేసిన నసిరుద్దీన్ పాషా తమ్ముడి నీ" అని చెప్పి "మస్తాన్" అని అరిచాడు అప్పుడే ఒక ఆరు అడుగుల ఎత్తు కండలు తిరిగిన శరీరం తో ఏకంగా ఒక పర్వతం నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఒకడు ముందుకు వచ్చి "భాయ్" అని అన్నాడు, దాంతో అజీజ్ "మినిస్టర్ గారిని నీ అండర్ లో ఉంచుకో పిల్లల్ని లేడీస్ నీ ఒక చోట, మగవాళ్లను వేరు ఒక బ్లాక్ లో ఉంచమని చెప్పు మొత్తం అన్ని బ్లాక్స్ నీ వెతకండి ఎవరిని వదలద్దు ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే చంపోద్దు కాలు చేతులు విరిచి పెట్టండి ఆ తర్వాత ఏమీ చేయాలో నేను చెబుతా" అని అన్నాడు, దాంతో మస్తాన్ చేసిన సైగ తో అందరూ కాలేజ్ లోని అన్ని బ్లాక్స్ నీ జల్లెడ పడుతున్నారు మగవాళ్లను ఒక బ్లాక్ లోని స్టోర్ రూమ్ లో పడేశారు, అమ్మాయిలను, ఆడవాళ్లను కాన్ఫరెన్స్ రూమ్ లో పెట్టి వాళ్లకు సెక్యూరిటీ గా అజీజ్ తమ్ముడూ అయిన హర్షద్ నీ పెట్టారు వాడు అసలే కామాంధుడు, అక్కడ ఉన్న చిన్న పిల్లల పైన తన కామ వాంచతో చూస్తూ ఉన్నాడు.
ఇక్కడ ఫోన్ లో సిగ్నల్ రాలేదు అని బయటకు వచ్చిన నీలోఫర్ కాలేజ్ లో జరిగిన బ్లాస్ట్ చూసి భయపడి పరుగులు తీసింది అప్పుడు అన్ని బ్లాక్స్ వెతుకుతూ వస్తున్న ఉగ్రవాదులు నీలోఫర్ ఉన్న చోటికి కూడా వచ్చారు, దాంతో నీలోఫర్ ఏమీ చేయాలో తెలియక తన కాళ్లకు చెప్పులు లేకుండా అడుగులో అడుగు వేస్తూ వెళ్లి చూస్తే అక్కడ centralised AC పైప్ ఫిట్టింగ్స్ ఉంటే అందులోకి దూరింది, దాంతో ఆ ఇనుప పైప్ లు కదిలిన అలికిడి కీ వాళ్లు అక్కడికి వచ్చి ఆ పైప్ ల పైన గన్ తో కాల్చారు అదృష్టం కొద్దీ నీలోఫర్ కీ ఒక బుల్లెట్ కూడా తగలలేదు, అప్పుడే అట్టు వైపు ఒక చిన్న పక్షి వచ్చింది దాంతో వాళ్లు ఆ పక్షి వల్ల వచ్చిన చప్పుడు అనుకోని వెళ్లిపోయారు, వాళ్ళు వెళ్లిన తర్వాత నీలోఫర్ మెల్లగా బయటికి వచ్చి తన నోరు కీ చెయ్యి అడ్డుపెట్టుకోని ఒక్కసారిగా తన భయం వల్ల కలిగిన ఏడుపు తన కళ్ల ద్వారా బయటికి వదిలింది. అప్పుడే నీలోఫర్ ఫోన్ సడన్ గా cut అవ్వడం తో కంగారు పడిన సిరాజుద్దీన్ తన స్టేషన్ లోని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పాలని చూశాడు, కానీ ఆ ఇన్స్పెక్టర్ మాత్రం నిద్రపోతున్నాడు. సిరాజ్ ఒక సెక్యూరిటీ అధికారి కానిస్టేబుల్ ఎప్పటికైనా ఒక పెద్ద కేసు solve చేసి ఇన్స్పెక్టర్ అవ్వాలి అని కలలు కంటు ఉన్నాడు, కాకపోతే అతనికి స్టేషన్ లో టీ తెచ్చే పని లేదా ఇన్స్పెక్టర్ ఇంటికి సరుకులు సరఫరా చేసే డెలివరీ బాయ్ పనులు చెబుతూ ఉన్నారు, ఆ స్టేషన్ లో సిరాజ్ కీ కొద్దోగొప్పో సహాయం గా ఉండేది రైటర్ రమణమూర్తి, ఆయన దిగులుగా ఉన్న సిరాజ్ నీ చూసి "ఏమీ కొత్త పెళ్లి కొడకా ఏంటి దిగులుగా ఉన్నావ్" అని అడిగాడు, దాంతో సిరాజుద్దీన్ జరిగింది చెప్పి "ఎందుకో చూడాలని ఉంది" అని అన్నాడు, దానికి రమణమూర్తి "రేయ్ పిచ్చోడా ఈ మాత్రం దానికి దిగులు పడుతున్నావా ఈ రోజు పిల్లల పండుగ ఆ హడావిడి లో ఉండి ఉంటుంది సరే లే కానీ ఈ కాబోయే భార్య తో ఈ రోజు అంత గడపడానికి నా దగ్గర ఒక దారి ఉంది" అని తన జేబులో నుంచి ఒక id తీసి దాని సిరాజ్ కీ వేసి "మన స్టేషన్ లో ఉన్న కిరణ్ ఈ రోజు ఆ కాలేజ్ కీ మినిస్టర్ కీ సెక్యూరిటీ కీ వెళ్లాలి కానీ ఇప్పుడు ఆరోగ్యం భాలేదు అని ఇంట్లో ఉన్నాడు వాడి ప్లేస్ లో నువ్వు వెళ్ళు" అని చెప్పాడు, దాంతో సిరాజ్ ఉత్సాహం గా కాలేజ్ వైపు తన బైక్ మీద జోరుగా హుషారుగా వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కాలేజ్ లో నుంచి గన్ కాల్పులు వినిపించడం తో అందరూ భయం తో పరుగులు తీశారు, అప్పుడు సిరాజ్ తన ఫోన్ తీసి కమిషనర్ ఆఫీసు కీ ఫోన్ చేసి జరిగింది చెప్పాడు, దాంతో కమిషనర్ అక్కడే ఉన్న సిబిఐ అసిస్టెంట్ కమిషనర్ అయిన అరుణ్ వైపు చూసి "we have a emergency can you handle it" అని అడిగాడు, దానికి అరుణ్ "దీనికి నాకన్న better option ఉంది" అని చెప్పి RAW జాయింట్ సెక్రటరీ అయిన రవీంద్ర సింగ్ కీ ఫోన్ చేశాడు అరుణ్ "హలో హీరో ఏంటి చాలా రోజులకు ఫోన్ చేశావు" అని అడిగాడు, దానికి అరుణ్ "ఈ హీరో కీ మీ సూపర్ హీరో తో పని పడింది" అని అన్నాడు, అది విన్న రవీంద్ర "సూపర్ హీరో దుబాయ్ లో వేరే మిషన్ కీ వెళుతున్నాడు" అని చెప్పాడు, అది విన్న అరుణ్ "సార్ its an emergency please తనని ఆపండి" అని అడిగాడు, దాంతో రవీంద్ర "వాడు రెండు గంటల్లో హైదరాబాద్ లో ఉంటాడు" అని చెప్పాడు, దాంతో అరుణ్ గవర్నమెంట్ తరుపున నెగోషియబుల్ ఆఫీసర్ గా వెళ్లాడు. |
« Next Oldest | Next Newest »
|