Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పరోపకారం
#1
010 9A1D0 209A 1.0607b2-6. 161023-6.
???????????

                   *పరోపకారం!*
                  ➖➖➖✍️

అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం ‘పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం’ ... 
```
‘పరోపకారం పుణ్యం కలిగిస్తుంది.. పరపీడనం- అంటే పరులకు అపకారం చేస్తే పాపం చుట్టుకుంటుంది’ అని పద్దెనిమిది పురాణాల పరమార్థాన్ని పురాణకర్త వ్యాసుడు ఎంతో సరళంగా, సారభూతంగా చెప్పాడు...

మానవునికి పరమధర్మం పరోపకారం! ‘ధర్మ’ శబ్దానికి ఇంతకు మించి కల్యాణాత్మకం, సంపన్నం, సమగ్రమైన మరొక నిర్వచనం కుదరదేమో.

పరహితమే ధర్మానికి గీటురాయి. స్వార్థంతో కేవలం తన సుఖమే చూసుకునేవాడు ధర్మహీనుడు, పాపాత్ముడు.```

‘భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్‌’ ```
తమ శరీర పోషణ కొరకే ఆహారం వండుకునే పాపులు పాపాన్నే భుజిస్తారని గీతావాక్యం.

ఈ విశ్వ వ్యవస్థ- సృష్టి చక్రం సక్రమంగా నడవటానికి సజావుగా తిరగడానికి కూడా ‘పరోపకారం’ అవసరం.
ఎందుకంటే లోకంలో ప్రాణుల జీవితాలన్నీ పరస్పర సహాయ సహకారాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రకృతి మరియు పశుపక్ష్యాదుల వల్ల కూడా మనం ఎంతో ఉపకారం పొందుతున్నాం. కనుక వాటి బాగోగులు చూడటం కూడా మన బాధ్యత.

ఎవరి బతుకు వారు బతకడంలో విశేషమేముంది గనక? పరుల కొరకు బతికేవాని జీవితమే సార్థకం.```

 ‘పరం పరోపకారార్థం యో జీవతి స జీవతి’.                  
```కాకి కూడా తన పొట్టను తాను నింపుకోవడం లేదా?
 
ప్రకృతి అంతా పరోపకారమయం. సూర్యచంద్రులు, మేఘాలు, వృక్షాలు, నదీనదాలు, గోవులు ఇవన్నీ పరుల కోసం సృష్టింపబడినవే కదా. నదులు తమ నీరు తామే తాగవు. చెట్లు తమ పండ్లు తామే తినవు. మేఘాలు తమ వర్షం వల్ల పండిన పంటలను తాము అనుభవింపవు.```

‘పరోపకారార్థమిదం శరీరం’... ```సత్పురుషుల శరీరాలు, సంపదలు సమాజ హితానికేగానీ స్వార్థానికి కావు గదా!

తాను శ్రీధరుడైనా వామనావతారంలో ఉపేంద్రుడు ఇంద్రుని కోసం బలిని యాచించలేదా?```

’పరహిత రతిమతియుతులకు దొరలకు నడుగుటయు నొడలి తొడవగు బుడమిన్‌’ ```
పరోపకారానికై బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు అని చమత్కరించారు పోతనగారు.

కాశీ హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకై ‘మహామనా’ మదనమోహన మాలవ్యా,భారతదేశ స్వాతంత్య్ర సముపార్జనకై మహాత్మాగాంధీ భిక్షాటనకు బిడియపడ్డారా?

మరి అదే స్వార్థానికైతే? ```‘యాచనాంతం హి గౌరవం’.. ```ఆ గడియోలనే గౌరవమంతా గోదారిలో కలిసిపోతుంది.

భారతీయ సనాతన ధర్మంలో పరోపకార రహిత మానవ జీవితం ధిక్కారపాత్రం. కారణం.. మరణించిన తర్వాత కూడా పశువుల చర్మాలు మనకెంతగానో ఉపయోగపడుతున్నవి కదా! అనగా పరహిత రహిత మనుష్య జీవనం పశువు కంటే నీచనికృష్టమేగా!

పరోపకారం వల్ల కలిగే పుణ్యం వంద యజ్ఞాల వల్ల కూడా కలగదట.

పరోపకారం వల్ల పుణ్యప్రాప్తి, తద్వారా ఇబ్బడి ముబ్బడిగా సుఖప్రాప్తి.
 
అలాగే ఇతర ప్రాణులను ఏ రకంగా బాధపెట్టినా దాని ఫలం దుఃఖం అనుభవింపక తప్పదు.

ఏ ప్రాణికైనా ఏదోవిధంగా సంతోషం కలిగించడమే ఈశ్వరపూజ.

పరోపకారికి ఆపదలు తొలగి పదేపదే సంపదలు కలుగుతాయి. సాక్షాత్తూ పరమేశ్వరుడు కూడా పరోపకార మోక్షాలను రెంటినీ తూచి పరోపకారాన్నే ఎంచుకొని మత్స్యకూర్మాది దశావతారాలు ఎత్తి లోకకల్యాణం గావించాడట. దయార్ద్రహృదయులకు జ్ఞాన, మోక్ష, జటా, భస్మ లేపనాలతో పనేముంది?

పూజాపునస్కారాలు, జపతపాలు, వ్రతాభిషేకాలు-ఇవన్నీ గౌణం. ప్రధానం పరోపకార బుద్ధి. ఇది లేకనే రావణబ్రహ్మ లోకాలను ఏడిపించే అసురుడయ్యాడు.
 
పరోపకార నిర్వహణలో ప్రతిబంధకాలుగా తరచూ రెండు సాకులు వినిపిస్తుంటాయి. ఒకటి ధనాభావం, రెండు సమయాభావం. నిజానికి ఈ రెండూ కుంటిసాకులే. పసలేనివే. మనసుంటే మార్గం ఉండకపోదు. అర్థం లేదనడం అర్థరహితం. ధనప్రసక్తి లేకుండా కూడా ఎన్నో సేవా కార్యాలు సాగించవచ్చు. కష్టాల్లో ఉన్నవారికి సానుభూతి ప్రకటించి సాంత్వన కలిగించవచ్చు.```

‘వచనే కా దరిద్రతా?’ ```మాటలకు దారిద్య్రమేముంది?``` ‘సర్వజనులు సుఖీభవ’ ```అని మనసులో భావించడం కూడా లోకోపకారమే!```✍️
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)