Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*యూరినరీ_ఇన్‌కాంటినెన్స్_సమస్య* Urinary Incontinence
#1
0608.R1.1203m3-8.
081023-8.
???????????55.
*మన ఆరోగ్యం…!


  *యూరినరీ_ఇన్‌కాంటినెన్స్_సమస్య*
             Urinary Incontinence
                        ➖➖➖✍️

మూత్రాన్ని విసర్జించకుండా ఆపు కోవడాన్ని 'కాంటినెన్స్‌' అంటారు. 

మన నియంత్రణ లేకుండా, తెలియకుండా మూత్రం పడిపోవ డాన్ని లేదా వచ్చిందానిని  విసర్జనకు వెళ్లకుండానే పడిపోవడాన్ని 'యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌' అంటారు. 

ఇది జబ్బు కాదు. జబ్బుకు సంబంధించిన లక్షణం. ఇది చాలా సార్లు పలు రకాలుగా, పలు జబ్బుల్లో, వివిధ వయస్సుల్లో చూస్తుంటాం. 

మహిళల్లో వచ్చినా, పురుషుల్లో వచ్చినా ఒకటే కారణం అని అనుకోకూడదు. ఆ పరిస్థితిని, వయసును బట్టి, నిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స చేస్తారు. అంతేకానీ మందులతో చికిత్స చేయలేం. కారణం తెలుసుకున్న తర్వాతనే చికిత్స చేస్తారు.

*అసలు_ఏం_జరుగుతుంది?

మన మూత్రాశయంలో మూత్రం కొంతసేపు ఆగి ఉండే అవకాశం ఉంటుంది. మూత్రాశయం రిలాక్స్‌ అవుతుంది. ఇది నిల్వ ఉండే దశ. మూత్రాన్ని ఆపిపెట్టే దాన్ని స్ప్రింటర్‌ మెకానిజం అంటారు. ఇక్కడ స్ప్రింటర్‌ బిగుతుగా ఉండటంవల్ల మూత్రం లీక్‌ కాదు. ఎంత బిగుతుగా ఉంటుందంటే, మనం దగ్గినా, తుమ్మినా, నవ్వినా, మూత్రాశయంపై ఒత్తిడి పడినా మూత్రం రాకుండా చేస్తుంది. అంటే కొళాయి/ నల్లా/ ట్యాప్‌కు వాల్వ్‌ ఎలాగో మనకు స్ప్రింటర్‌ కూడా అలాగే. 

మూత్రం పోయాలనుకున్న ప్పుడు స్ప్రింటర్‌ రిలాక్స్‌ అవుతుంది. మూత్రాశయం ముడుచు కుంటుంది. అప్పుడు మూత్రం వస్తుంది. ఇది సాధారణంగా జరుగుతుంది. 

స్ప్రింటర్‌ బిగుతుగా మూసుకోలేక పోయినప్పుడు, మూత్రం నిండగానే మూత్రాశయంపై ఒత్తిడి పెరిగినప్పుడు, తుమ్మినా, దిగ్గినా మూత్రాశయం ముందున్న స్ప్రింటర్‌ మూసుకోకపోవడం వల్ల మూత్రం లీకవుతుంది.

‘వర్షం పడుతోంది కదా.. ఇది సాధారణమే..’ పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలా అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మాత్రం దీన్ని సమస్యగా పరిగణించాల్సి వస్తుంది. కంట్రోల్ తప్పి లీక్ అవుతుంటే దాని వెనుక ఏదో సమస్య ఉందని అనుమానించాల్సిందే. మహిళల్లో ఇది సర్వసాధారణం. బయటకు చెప్పడానికి సిగ్గుపడి చాలామంది ఈ సమస్యతో లోలోపలే కుమిలిపోతుంటారు. కనీసం డాక్టర్‌ని సంప్రదించడానికి కూడా వెనుకాడుతుంటారు. కానీ ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి.

*కారణాలు..
మహిళల్లో యురెత్రా పొడవు కేవలం 4 సెంటీమీటర్లు మాత్రమే ఉండడం ఒక కారణమైతే కటి భాగంలోని కండరాలు, కణజాలాలు బలంగా లేకపోవడం మరో కారణం. నార్మల్ డెలివరీ అయినవాళ్లలో ప్రసవం తరువాత ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. పుట్టేటప్పుడు ఏవైనా గాయాలైనా, యాక్సిడెంట్‌కు గురయి దెబ్బలు తగిలినా కూడా పెల్విక్ కండరాలు బలహీనపడి ఈ సమస్య తలెత్తుతుంది. 

పురుషుల్లో యురెత్రా 25 సెంటీమీటర్లు ఉంటుంది. కాబట్టి సమస్య తక్కువే. నరాల సమస్యలు, ప్రొస్టేట్ సమస్యలున్నవాళ్లలో ఈ సమస్య మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మగవార్తో పోల్చినప్పుడు ఆడడవారరలలో ఇన్‌కాంటినెన్స్ సమస్య రెండింతలు ఎక్కువ . 

ఈసమస్య కొన్ని ప్రత్యేక  పరిస్థితులలో ఎక్కువవుతుంది. అవి ---

*మెనోపాజ్ లో ఈస్ట్రోజన్‌ తగ్గడమువలన యురెత్రాలోని టిష్యూకు హాని జరుగుతుంది

 *గర్భం దాల్చడము, పిల్లలు పుట్టడము జరిగినప్పుడుపెల్విక్ ఫ్లోర్ కండరాలు డ్యామేజీ అయి యూరినరీ ఇన్‌కాంటినెన్స్ కు దారితీస్తుంది.

*మలబద్దకము కొన్ని రకాల మందులు వాడడము, హార్మోన్‌ రిప్లేస్ మెంట్ ట్రీట్మెంట్, యూరినరీ ట్రాక్ట్ .. బ్లాడర్ ఇన్‌ఫెక్షన్‌ , స్థూలకాయము , శారీక చురుకు దనము లేకపోవడము , నరాలలోపాలు , వయసు రీత్యా శరీరములో వచ్చేటటువంటి మార్పులు ... తాత్కాలిక లేదా దీర్ఘకాలిక  యూరినరీ ఇన్‌కాంటినెన్స్ కారణాలు .

#లక్షణాలు:
నవ్వినా, దగ్గినా, తుమ్మినా, బరువు ఎత్తినా, వ్యాయామం చేసినా మూత్రం పడుతుంది. న్యూరోజెనిక్ స్పైనల్‌కార్డ్ ఇంజురీస్ అంటే వెన్నెముకకు దెబ్బలు తగలడం వల్ల నరాలు ప్రభావితమై ఇటువంటి సమస్య తలెత్తవచ్చు. దీన్నే స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటారు.

- బాత్రూమ్‌లోకి వెళ్లేలోపే మూత్రం పడిపోతుంది.
- రాత్రి పక్క తడుపుతారు.
- తరచుగా పదే పదే బాత్రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది.

ఆపరేషన్ తరువాత......కటి భాగంలోని అవయవాలకు ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఆపరేషన్ తరువాత ఇలాంటి సమస్య రావచ్చు. సర్జరీ సమయంలో ఏవైనా గాయాలు కావడం, కొన్నిసార్లు యురెత్రా దగ్గర్లోని కణజాలాలను తొలగించాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు కూడా ఆ భాగం బలహీనమై సమస్య వస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి పెద్దది కావడం వల్ల బ్లాడర్‌పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా విసర్జన కాదు. దాదాపు లీటర్ దాకా మూత్రం బ్లాడర్‌లోనే ఆగిపోయి లీక్ అవుతూ ఉంటుంది. దీన్ని ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్ అంటారు. ప్రొస్టేట్ సమస్య ఉన్నప్పుడు కండరాలకు పనివుండదు కాబట్టి ప్రొస్టేట్ ఆపరేషన్ తరువాత కూడా అవి అంత సమర్థవంతంగా పనిచేయవు. మూత్ర విసర్జనలో రెండు కవాటాల్లాంటి నిర్మాణాలు పనిచేస్తాయి. కండరాలు సంకోచించినప్పుడు ఈ కవాటాలు తెరుచుకుంటాయి. మూత్రం విసర్జన అవుతుంది. తర్వాత అవి మూసుకుంటాయి. ప్రొస్టేట్ సమస్య వల్ల ప్రొస్టేట్ గ్రంథిని తొలగించాల్సి వచ్చినప్పుడు గ్రంథితో పాటు అంతర్గత కవాటాన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. ఇకపోతే బాహ్య కవాటం అప్పటివరకు ఎక్కువ పనిలేకుండా ఉండడం వల్ల దాని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అందువల్ల ప్రొస్టేట్ ఆపరేషన్ అయినవాళ్లలో సైతం ఈ సమస్య కనిపిస్తుంది. సాధారణంగా ఇటువంటి సమస్యను మందులతోనే తగ్గించవచ్చు. తీవ్రంగా మారితే మాత్రం సర్జరీ అవసరం అవుతుంది.

*ఏ_రకము ? :
ఏ రకము ఇన్‌కాంటినెన్స్ ఉందో ఖచ్చితముగా చెప్తే సరైన సూచనలు , చికిత్స సిఫార్సు చేయడానికి వైద్యులకు వీలుగా ఉంటుంది.

#స్ట్రెస్ _ఇన్‌కాంటినెన్స్ : 
మహిళల్లో ఇది అత్యంత సాధారణ రకము . నవ్వినా , తుమ్మినా , దగ్గినా మూత్రము లీకేజీ ఉంటుంది . వ్యాయామాలు చేస్తున్నా , ఏధైనా బరువులు ఎత్తినా నీరుడు అయిపోతూ ఉంటుంది. పూర్వపు వెజినల్ ప్రసవాలు (డెలివరీ) ,మెనోపాజ్ , బరువు పెరగడము  ఇందుకు కారణము కావచ్చు.

#ఓవర్_ఫ్లో_ఇన్‌కాంటినెన్స్ : 
ఇక్కడ యూరినరీ బ్లాడర్ లో మూత్రము పూర్తిగా ఖాలీ అవదు . సుమారు 1.లీటరు వరకూ ఉండిపోవడము వలన మూత్రము లీకు అవుతుంది. మగవారిలో పోస్ట్రేట్ గ్రంధి సమస్యలు వలన ఇది ఎక్కువగా కలుగుతుంది. మహిళలో ఓవర్ ఫ్లో ఇన్‌కాంటినెన్స్ చాలా తక్కువ .

*మిక్షిడ్ ఇన్‌కాంటినెన్స్ : ఇది మహిళలో ఎక్కువ . అటు స్ట్రెస్ , ఇటు అర్జ్  ఇన్‌కాంటినెన్స్ కలిసి ఉంటాయి. వీల్ చైర్ వాడడమో , ఆల్జిమర్ ఉండడమో , పార్కిన్‌సోనిజం  వంటివి కారణమవుతాయి. వీరిలో బాత్ రూం అవసరమన్న విషయమే గుర్తుండడము కష్టమవుతుంది.

#ఏవి_చేయాలి ? :

తక్కువ పానీయాలు త్రాగడము : పూర్తిగా త్రాగడం మానేయకూడదు .

#కెజెల్ల్_వ్యాయామము : స్క్వీజింగ్ , పల్విక్ కండరాల రిలాక్షింగ్ ల పై ఫోకస్ చేస్తూ వ్యాయామము చేయాలి .

#బ్లాడర్_ఇర్రిటెంట్స్ : కెఫైన్‌(caffine), ఆల్కహాల్ , స్పైసీ పదార్ధాలు , టొమాటోలు , టొమాటో ఆదారిత ఉత్పత్తులు , కృత్రిమ స్వీట్నర్స్ వంటివి మూత్రాశయాన్ని ఇర్రిటేట్ చేస్తాయి . తినవద్దు .వీటిని తినకపోవడము వలన అర్జ్ ఇన్‌కాంటినెన్స్ గలవారికి సౌకర్యముగా ఉంటుంది.

#బ్లాడర్_ట్రైనింగ్ : కొంత వ్యవధిని నిర్దేశితముగా పెట్టుకుంటూ , బాత్ రూం ట్రిప్స్ కు సరైన ఇంటర్వెల్స్ పాటిస్తున్నట్లైతే అర్జ్ ఇన్‌కాంటినెన్స్ చాలా వరకు కంట్రోల చేయవచ్చును . దీనిని "టైమ్‌డ్ వాయిడింగ్" అని అంటారు. 

#మూత్రాశము_ఖాళీ : బాత్ రూమ్‌ కి వెళ్ళిన ప్రతిసారి "డబ్ల్ వాయిడింగ్" పూర్తిగా చేస్తుండాలి. పూర్తిగా రిలీఫ్ అయిన తర్వాత నిల్చోవాలి లేదా యదాస్థానానికి రావాలి. ఓ నిముషము పాటు ఆగి మరోసారి యూరిన్‌ పాస్ చేయాలి. దీనివల్ల మూత్రాశము పూర్తిగా ఖాళీ అయిపోతుంది.

#బెల్లీ_వెయిట్ :  
అదనపు ఉదరపు బరువుని తగ్గించు కోవడము వల్ల స్ట్రెస్ లేదా అర్జ్ ఇన్‌కాంటినెన్స్ తగ్గుతుంది. బరువు తగ్గడము వల్ల మూత్రాశయం కండరాల ఒత్తిడి తగ్గుతుంది . వ్యాయామాలు , డైట్ కార్యక్రమాలను వైద్యులు చెప్పిన ప్రకారము ప్లాన్‌ చేసుకోవాలి . మధుమేహము నియంత్రణలో ఉంచుకోవాలి.

#నరాల_స్టిములేషన్‌ :
నరాలు లేదా ఎలక్ట్రానిక్ స్టిమ్యులేషన్‌ అనేది పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడములో సహకరించే నొప్పిలేని ఎలక్ట్రికల్ కరెంట్ అప్లికేషన్‌.

స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ వదలకుండా , ఏ చికిత్సలకూ లొంగకుండా ఉన్నప్పుడు చివరి పరిష్కార మార్గము సర్జరీ . విభిన్న ప్రక్రియల్ని , లీకేజీ కారణాన్ని బట్టి సర్జరీ ప్లాన్‌ చేస్తారు .✍️

*దీనిలో వచ్చే ఆర్టికల్స్ అన్నీ మీకు అవగాహనకోసం మాత్రమే!
డాక్టర్స్ కి ప్రత్యామ్నాయము కాదు. 
మీ సమస్యలన్నీ డాక్టర్స్ పర్యవేక్షణలోనే క్లియర్ చేసుకోవలెను.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 2 Guest(s)