Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
?శక్తిపీఠాలలో శక్తి అపూర్వ రూపాలు?
#1
?శక్తిపీఠాలలో శక్తి అపూర్వ రూపాలు?
          ??

శక్తి పీఠాలలో కొలువైయున్న   అమ్మవార్ల  రూపాల గురించి తెలుసుకుందాము.

నైనిటాల్ జిల్లాలో తనక్పూర్ పూర్ణగిరి ఆలయం.
ఇక్కడ పర్వత శిఖరాన ఒక చతురస్రాకార   వేదికపై ఉన్న
లింగ రూపాన్నే అమ్మవారి స్వరూపంగా
భావిస్తారు.

ఆ లింగం మీద దట్టంగా సింధూరం పూయబడి స్త్రీగా  దర్శనమిస్తుంది. 
ఆకాశమే కప్పు , లోకమే గర్భగుడి. 
అమ్మవారి పేరు భగవతి అని, పీడేశ్వరి అని అంటారు. 

అస్సామ్ రాష్ట్రంలో   ప్రసిధ్ధి చెందిన ఆలయం కామాఖ్యా ఆలయం. ఇక్కడ ఆకాశాన్నంటే
ఆలయశిఖరా‌లు లేవు. విస్మయపరిచే శిల్పాలు లేవు.బంగారు రధాలు లేవు.వెండి తలుపులు లేవు.  అమూల్య వస్త్రాలంకారాలు లేవు. అసలు అమ్మవారి శిల్ప మూర్తియే లేదు. ఒక
చిన్న నీటి తొట్టిలో వున్న శిలనే అమ్మవారిగా భావించి
పూజిస్తారు.

ఖాట్మాండు నగరంలో బసంతపూర్ ప్రాంతంలో ' తలేజా అమ్మవారు ' ఆలయం.
ఇది చాలా పవిత్రమైన ఆలయంగా భావిస్తారు నేపాలీవారు.  ఈ ఆలయంలో కూడా అమ్మవారి మూర్తి వుండదు.
సజీవంగా వున్న  స్త్రీ దేవిగా దర్శనమిస్తుంది.
దేవికుమారి అనే బాలికను  దైవాంశసంభూతురాలిగా కొలుస్తారు. దర్శిస్తాము. .  ఈ  బాలికను  బౌధ్ధమత
శాక్యులు  అనేక పరీక్షలు చేసి, ఉత్సవాల సమయంలో యీ బాలికను  రధం లో గాని పల్లకీలో గాని
ఊరేగిస్తారు.

బంగ్లాదేశ్ లో లాల్మనీర్ఘట్ అనే ప్రాంతంలో
భవానీపూర్ గ్రామం.  కరదోయా అనే
యీ పీఠ  ఆలయంలో  అపర్ణా దేవి అనుగ్రహిస్తున్నది. ఈ ఆలయంలో అమ్మవారికి రూపం లేదు. లింగం వంటి శిలని భద్రకాళిగా భావించి పూజిస్తున్నారు.

కరాచీ సమీపమున వున్నది హింగ్లాజీ మహా శక్తి పీఠంగా పిలువబడుతున్నది.
ఇక్కడ వున్న అమ్మవారి పేరు కోడారి అమ్మవారు. ఈ అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాలంటే
సన్నని గుహా  మార్గంగుండా ప్రాకుతూ వెళ్ళాలి.  సాకారం గా కానీ , నిరాకారంగా కానీ ఆరాధించరాదు. 
మరి ఎలా పూజిస్తారు.  మహా యాగాలు చేసి యాగం చివర యిచ్చే పూర్ణాహుతులలో ప్రకాశించే జ్వాలలను
దేవిగా భావించి పూజిస్తారు. అపురూపమైన
పూజలు.

పశ్చిమ బంగ్లా దేశంలో లాప్పూర్ ప్రాంతంలో   పుల్లారదేవి  ఆలయం
నెలకొల్పబడి ఉన్నది. ఈ ఆలయంలోని తాబేలు రూపమే  పుల్లార అమ్మవారిగా పూజింపబడుతున్నది. 
ఈ దేవిని  ఖషియేశ్వరీ అని పిలుస్తారు.

బంగ్లాదేశ్ చిట్టాగాంగ్ ప్రాంతంలో వున్న భవానీదేవి  ఆలయ గర్భగుడిలో
దేవి దక్షిణ కాళి రూపంలో దివ్యదర్శనం
యిస్తున్నది. అమ్మవారి కాళ్ళక్రింద పరమేశ్వరుడు నిర్జీవంగా
నేలమీదపడి వుండగా శివుని మీద
కాళ్ళు పెట్టుకున్న కాళికాదేవిని దర్శిస్తాము.

రాజస్థాన్ రాష్ట్రం జయపూర్ 
సమీపమున పైరట్ అనే ప్రాంతంలో   వున్నది అంబికాదేవి ఆలయం. ఈ పీఠంలో అమ్మవారిని ఉదయాన పసిపాపగా, మధ్యాహ్న సమయాన , కన్యగా  సాయంకాలం వృధ్ధురాలిగా అలంకరించడం ఒక విశిష్టత.

శ్రీ మాత్రే నమః????????
హరే కృష్ణ గోవిందా???
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)