Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
#1
060923b2134.    080923-2.
???????????196

            *గురువు - ఆత్మోద్ధరణ*
                 ➖➖➖✍️
```
సద్గురువు లభించడం అంత సులువు కాదు, జన్మ జన్మల తపః ఫలానికి చిహ్నం అది. ఎవరు భగవoతుని చేరుకొనే మార్గాన్ని సుగమం చేయగలరో అతనే నిజమైన గురువు.

ఒక్కో ఇంట తండ్రే పిల్లాడికి సద్గురువు, ఒక్కో ఇంట, ఆ ఇంటి ఆడపిల్లను కన్యాదానం చేయడానికి తండ్రిగారు వెతికి మరీ, వేదం నేర్చిన సద్బ్రాహ్మణునికి ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. అలాంటి వ్యక్తి దొరికిన పక్షాన వివాహానంతరం భర్తే ఆమెకు గురువు, అది చాలు ఆ పిల్ల గృహస్థాశ్రమoలోనే తరిoచిపోవడానికి!

గురువు గారిపై గల అచంచల నమ్మకమే ఆత్మోద్ధరణకు హేతువు, కలిసొచ్చినంత కాలం నమ్మటం ఒకరకం, కలిసివచ్చినా రాకపోయినా గురువు గారిపై గల విశ్వాసo సడలకపోవడమే నిజమైన శిశ్యులకు ఉండాల్సిన లక్షణం. 

అందుకే భగవంతుడి దగ్గరా గురువు దగ్గరా ఒక పరీక్ష వుంటుంది, వీడు వూంచుకున్న వాడెనా? అని చూడటానికి గురువు గారు రకరకాల పరీక్షలు పెడుతుoటారు, ఒక్కోసారి శిశ్యుని పట్ల చాలా నిర్లక్ష్యభావనతో వ్యవహరిస్తుoటారు. అలా ఉoడటంలో అంతరార్ధo ఏదో వుoడే ఉoటుoది, గురువుగారికి నాపట్ల చాలా ప్రేమ ఉoది, అది ఎప్పటికీ చెక్కుచెదరినిది అని ఎవరైతే నిలబడ గలరో వారే అంతిమంగా గురువుగారి జ్ఞాన సంపదకు, ప్రేమకూ పాత్రులు కాగలరు.

అంతే గాని అస్తమానం శిశ్యుడు ఏది అడిగితే అది ఇచ్చిన గురువుగారు మంచివారు, శిష్యుడు ఏదో ప్రతిపాదన చేస్తే వద్దన్న గురువు పనికిమాలినవాడు అని అనుకున్న వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? 
వాడు త్రిశంకుడు వలే అవుతాడు!

ఒక్కోసారి గురువుల పరీక్ష చాలా చమత్కారంగా ఉంటుంది. ఒకప్పుడు పరమాచార్య దగ్గరకు ఆయన శిష్యులలో ఒక వ్యక్తి, చాలా బాధపడుతూ వెళ్లాడు, వారి అన్నగారు చనిపోతారని, ఇక ఎక్కువ కాలంఉండరు, కొద్ది సమయo మాత్రమే వుందని డాక్టర్లు చెప్పారని వాపోయాడు. 

మహాస్వామి వారు అలా నిలబడ్డారు, చూడలేదు, కనీసo పలకరించలేదు, మామూలుగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒకటి కట్టుదిట్టoగా ఉంటుంది. గురువు గారు ‘చాలు!’ అనేదాక సాష్టాంగ నమస్కారాలు చేయాలి. (మామూలుగా ఐతే గురువుకి నాలుగు సార్లు సాష్టాంగ ప్రణామం చేయాలి.)

ఆ వచ్చిన శిశ్యుడు నాలుగు మార్లు నమస్కారం చేసి నించున్నాడు. 

పరమాచార్య వారు "చేస్తూ వుండు అలానే నమస్కారాలు!" అని అన్నారు. 

శిశ్యుడు తెల్లబోయాడు, అలా చేస్తూనే వున్నాడు ఒళ్ళంతా చెమటలు పట్టేసి, ఎముకల సంధి బంధాలలో నొప్పి వచ్చి ఇక నమస్కారాలు చేయలేక గోడ దగ్గర చతికిల పడిపోయాడు.

పరమాచార్య వచ్చి అన్నారు, “ఇక మీ అన్నయ దగ్గరకు పో!” అని. (మీ అన్నయ్య కష్టాన్ని నువ్వు నాకు చేసిన నమస్కారంతో తీసివేశాను, మీ అన్నయ్య బ్రతికిపోయాడు పో అని పరామాచార్య నోటితో చెప్పలేదు, శిశ్యుడది విననూలేదు)

హాస్పిటల్ కి వెళ్లగానే డాక్టర్లు అన్నారు, “ఏమి ఆశ్చర్యం జరిగిందో మాకుతెలీదు మీ అన్నగారు బ్రతికారు.” అని!✍️```

--- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రావు గారి “గోవింద వైభవం” ప్రవచనం నుండి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥

https://.,./D93w1xBd3ny5hyjMzeNE4W

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)