Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
Thanks for the update
[+] 1 user Likes Nani198's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
300 పేజీకి స్వాగతం రైటర్ గారు  congrats congrats congrats
[+] 1 user Likes నోకియా x70ప్రొ's post
Like Reply
clps Congrats for completing 300 Pages  congrats
[+] 1 user Likes sri7869's post
Like Reply
సూపర్, సూపర్,, సూపర్,,,
చాలా బాగుంది
[+] 2 users Like Gova@123's post
Like Reply
Meeru story chala baaga raasthaaru(endukante meemu prathi roju chusthamu meru update ichara ledha Ani) maa eduru choopulu nijam ayyai
Maroka 2years konasaginchandi ee storyni without horm ful emotions
[+] 2 users Like TRIDEV's post
Like Reply
Congrats on reaching 300 pages
[+] 1 user Likes Hydguy's post
Like Reply
Heartfully thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Star 
There is no words to tell about your writing
Only one word
Marvelous 
#బ్రహ్మ రాక్షసుడు 
Like Reply
Excellent update
Like Reply
When are we getting update here?
Like Reply
300 పేజీకి స్వాగతం రైటర్ గారు  party2.gif party2.gif party2.gif party2.gif party2.gif
[+] 1 user Likes నోకియా x70ప్రొ's post
Like Reply
Hi ji we are waiting ekkada kuda yemaina update evagalru anne assisthunnam
Like Reply
లవ్ యు .......
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Sir please complete janam mecchina raju story .I think only climax is left as king Mahesh and maheswari met each other after 5 years .only defeating 3 princess and consulting guru is left
Like Reply
Guruvugaru next update ikkada ivvandi please
Like Reply
 కళ్ళ ముందు బామ్మ కన్నీళ్లు - అక్కయ్య గుర్తుకురావడంతో ఆగిపోయాను , వీరి అంతం కంటే వారి సంతోషం ముఖ్యం , ఎలా ఉన్నారో ఏమిటో ..... అప్పులవాళ్ళు ఈరోజే వస్తారని అన్నారు .
అంతలో ఆ రాక్షసులిద్దరూ లోపలికివెళ్లిపోవడంతో కూల్ అయ్యాను , ఇల్లు ఖాళీ చేయాలి అన్నారు అక్కడి పరిస్థితి ఏమిటో , వెళితే కదా తెలిసేది అంటూ లిఫ్ట్ దగ్గరికి పరుగులుతీసి బటన్ ప్రెస్ చేసాను .
పరిష్కారం డబ్బు ...... , అంతడబ్బు నేనేమి చేసుకుంటాను అనుకుని ఫ్లాట్ లో ఏముందో కూడా పట్టించుకోకుండా అసలు ఆ విషయమే గుర్తులేనట్లు లోపలికివెళ్ళాను - ధడేల్ మంటూ డోర్ క్లోజ్ అయినా డోంట్ కేర్ అన్నట్లు బెడ్రూంలోకి వెళ్లి , మేడమ్ గారు లాకర్లో ఉంచిన నాకొచ్చిన డబ్బు 10 లక్షలూ తీసుకుని బయటకు పరుగులుతీసాను , ఫ్లాట్ కు లాక్ వెయ్యడం కూడా పట్టించుకోలేదు , లిఫ్ట్ తెరుచుకోవడంతో వెళ్లి డౌన్ ఫ్లోర్ బటన్ నొక్కాను , కిందకు వెళ్లి తెరుచుకోవడంతో పరుగపెట్టాను బయటకు ......
మళ్లీ అవే గుసగుసలు .......
తమ్ముడూ తమ్ముడూ అంటూ సెక్యూరిటీ అన్న పరుగునవచ్చి , అంతా ok కదా ఏంటి పరుగున వచ్చారు అంటూ కంగారుగా అడిగారు .
అర్జెంట్ గా వెళ్ళాలి , అయినా ఎందుకలా అడిగారు - కంగారు కూడా పడుతున్నారు .
సెక్యురిటి : ఫ్లాట్ లో అంతా ok కదా తమ్ముడూ ......
అంఏ ఫ్లాట్ లో something అన్నమాట , అవేమీ పట్టించుకోకుండా ఆటో అంటూ పిలిచాను , అప్పుడు గుర్తొచ్చింది బామ్మ ఇంటి అడ్రెస్ తెలియదు అని .....

విశ్వ సర్ ఏమైనా హెల్ప్ ...... , ఆశ్చర్యం షాకింగ్ అనే చెప్పాలి - తమ్ముడూ ఎక్కడికి వెళ్ళాలి అంటూ మధ్యాహ్నం బామ్మను - లాయర్ గారిని తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ .......
అంటే జరగాల్సినదే జరుగుతోందన్నమాట , చెల్లి కీర్తి చెప్పినట్లు బామ్మ కోసం దేవుడు పంపించిన దూతను ......
అలాంటిదేమీ లేదులే , బామ్మకు సహాయం చేస్తే చెల్లి హ్యాపీ - దాని ద్వారా చెల్లికి మంచి జరిగితే అంతకంటే సంతోషం మరొకటి లేదు అనుకుని ఆటో ఎక్కాను .
డ్రైవర్ : తమ్ముడూ ఎక్కడికి ? .
అన్నా ...... మధ్యాహ్నం కోర్టు దగ్గర ఒక బామ్మను - లాయర్ గారిని ......
డ్రైవర్ : ఎక్కించుకున్నాను .
గుర్తుందన్నమాట అయితే వారిని ఎక్కడ దించావో కూడా ......
డ్రైవర్ : గుర్తుంది .
థాంక్యూ అన్నా , అక్కడికే పోనివ్వండి . 
డ్రైవర్ : సరే అంటూ మీటర్ వేసి పోనిచ్చాడు .
అంతా విధి అన్నమాట - ఆ దేవుడి ఆట అనుకున్నాను , కానీ ఒకటే బాధ బామ్మ ప్రాణమైన ఇద్దరిలో ఒకరు లేకపోవడం అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను , అన్నా ఏమీ అనుకోకుండా ఫాస్ట్ గా పోనివ్వండి ప్లీజ్ ......
వేగం పెంచాడు - దగ్గరలోనే అనుకుంటాను 15 నిమిషాలలో తీసుకెళ్లాడు , చూస్తే మంచి costly ఏరియా లానే ఉంది .
డ్రైవర్ : ఇక్కడే దిగారు , ఈ వీధిలో లోపలికివెళ్లారు .
థాంక్స్ అన్నా అంటూ మీటర్ డబ్బులు ఇచ్చేసి లోపలికి పరుగుపెట్టాను .

ఏడెనిమిది ఇళ్ల తరువాత ఒక ఇంటి ముందు జనాలు గుమికూడి ఉండటం చూసి ,  దేవుడా ఏమీకాకుండాలే చూడు అని కంగారుపడుతూ జనాల మధ్యలో లోపలికివెళ్ళాను .
పెద్ద ఇంటి మెయిన్ గేట్ ప్రక్కనే బామ్మ - బామ్మ గుండెలపై అక్కయ్య అనుకుంటాను , హమ్మయ్యా అనుకున్నాను .
ఇంటిలోనుండి వస్తువులన్నీ తీసుకొచ్చి బయటకు విసిరేస్తున్నారు కొంతమంది .
బామ్మ .... అక్కయ్యను ఓదారుస్తూ , బ్రతిమిలాడి బ్రతిమిలాడి అలసిపోయినట్లు వద్దు వద్దు కాస్త సమయం ఇవ్వండి అంటూ ఏడుస్తున్నారు .
జనాలు చూస్తూ గుసగుసలాడుకుంటున్నారే తప్ప ఇంతకాలం తమతోపాటు ఇరుగుపొరుగుగా జీవించారని ఓదార్చడానికి కూడా ముందుకు వెళ్లడం లేదు .
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .

సంవత్సరం సమయం ఇచ్చాము - ఇక ఒక్క క్షణం కూడా ఉపేక్షించేది లేదు - రేయ్ త్వరత్వరగా అన్నీ బయటకు చేర్చి తాళం వేసేయ్యండి అంటూ ఖద్దరు బట్టలు వేసుకున్న పెద్దాయన ఆజ్ఞలు వేస్తున్నాడు , ఏదో ఫోన్ రావడంతో జనంలోనుండి అలా ముందుకువెళ్లాడు .
కన్నీళ్లతోనే పెద్దాయన దగ్గరికి వెళ్ళాను , కాల్ మాట్లాడేంతవరకూ వేచిచూసాను , అన్నా ..... పాపం కాస్త కనికరించి సమయం ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ .
పెద్దాయన : ఇంతలేవు నీకెందుకురా , అయినా ఆడిగావు కాబట్టి చెబుతున్నాను ఇంతా అంతా కాదు పాతిక లక్షలు ఇచ్చాను , బాధలో ఉన్నారని తెలిసి సంవత్సరం పాటు వడ్డీ కూడా తీసుకోకుండా వేచి చూసాను , అంత డబ్బును వారు తీసుకురాలేరు అందుకే తప్పడం లేదు ప్రక్కకు తప్పుకో ......
మీగురించి బామ్మ చెప్పారు - సంవత్సరం పాటు ఎవ్వరూ ఉండరు - మీరు చాలా మంచివారు - ఇంతమంది మీకింద పనిచేస్తున్నారు అంటే ఆదాయం బాగానే ఉంటుంది - అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను కాస్త సమయం ఇవ్వండి .
పెద్దాయన : ఇంతకాలం ఆ మంచితనంతోనే ఆగాను ఇక ఆగలేను , వారికి ఎంత సమయం ఇచ్చినా ఇవ్వలేరు .
నేనిస్తాను అన్నా ......
పెద్దాయన : తమ్ముడూ చెప్పానుకదా వేలు కాదు పాతిక లక్షలు , నిన్ను నమ్మి సమయం ఇవ్వాలా ? ప్రక్కకు తప్పుకో ఇప్పటికే చీకటి పడిపోయింది ఇంటికి వెళ్ళాలి . 
నాపై నమ్మకం లేదు సరే గౌరవనీయులైన సెక్యూరిటీ అధికారి సర్ చెబితే ok నా ? .
పెద్దాయన : న్యాయంగా ఖాళీ చేయిస్తున్నాను , సెక్యూరిటీ ఆఫీసర్ల నుండి - కోర్టు నుండి అనుమతి కూడా తీసుకున్నాను , ఉదయమే బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్ గారిని కూడా వేరే విషయమై కలిశాను , నీకు నీ వయసుకు కానిస్టేబుల్ - SI తెలుసేమో ..... వెళ్లు వెళ్లు .
ఓ కమిషనర్ విశ్వ గారు తెలుసా ? , విశ్వ సర్ చెబితే ok నా ? లేక ఇంతకుముందు విక్రమ్ సర్ తో కూడా చెప్పించాలా ? .
పెద్దాయన : పో తమ్ముడూ నాకు నవ్వు వస్తోంది అంటూ ప్రక్కకు తోసేసి వెళుతున్నాడు .

వెంటనే మొబైల్ తీసి విశ్వ సర్ కు కాల్ చేసి స్పీకర్లో ఉంచాను .
మేడమ్ లిఫ్ట్ చేసినట్లు , మహేష్ ..... మీ కమిషనర్ సర్ ఫ్రెష్ అవుతున్నారు .
" మీ కమిషనర్ సర్ " మాట వినగానే ఆగిపోయి వెనక్కు తిరిగారు పెద్దాయన .
మేడమ్ : మహేష్ ..... ఆకలి వేస్తోంది కదూ - భోజనం పంపిస్తాము అంటే వద్దు అన్నావు , ఉండు మీ కమిషనర్ సర్ తో ఇప్పుడే పంపిస్తాను .
పెద్దాయన : వద్దు వద్దు మేడమ్ , ఆకలి లేదు అని చెప్పానుకదా ఫ్రూట్స్ కూడా తిన్నాను , మీరు - కమిషనర్ సర్ భోజనం చేశారో లేదోనని కాల్ చేసాను , కాల్ చెయ్యొచ్చు కదా మేడమ్ ? .
మేడమ్ : ఎప్పుడైనా కాల్ చెయ్యొచ్చు మహేష్ , అంతకంటే సంతోషమా చెప్పు , మీ సర్ రాగానే కాల్ చేయిస్తాను .
పెద్దాయన : వద్దు వద్దు వద్దు అంటూ బ్రతిమాలుకుంటున్నాడు .
సర్ ను డిస్టర్బ్ చేయకండి , విక్రమ్ సర్ - చెల్లి నుండి కాల్ వచ్చినప్పుడు నేనే మళ్లీ కాల్ చేస్తాను .
మేడమ్ : సరే అయితే .....
బై మేడమ్ అంటూ కట్ చేసాను .

పెద్దాయన : Sorry sorry బాబూ ..... , ఇంతలేవు అన్నాను క్షమించు , కొంత సమయం ఏమిటి ఎన్ని సంవత్సరాలైనా తీసుకో , విక్రమ్ సర్ అంటే మాకు చాలా గౌరవం - మాకు చాలా సహాయం చేసారు - ఎంతోమంది బడావేత్తలు వడ్డీకి తీసుకుని డబ్బు ఎగ్గొడితే సర్ హెల్ప్ చేశారు , నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే వారి వల్లనే , సర్ చాలా నిజాయితీ సెక్యూరిటీ అధికారి , ఆ సర్ కు మరియు కొత్త సర్ కు తెలిసిన నీకు ఏమైనా చేస్తాను , రేయ్ రేయ్ ఆపండ్రా ..... ఎక్కడి వస్తువులను అక్కడే జాగ్రత్తగా ఇంట్లోకి చేర్చండి , ఏంట్రా చూస్తున్నారు త్వరగా లోపలికి చేర్చండి , ముందు ఎలా ఉందో అలా ఉండాలి .
బయటకు విసిరేసిన వస్తువులను మళ్లీ లోపలికి చేరుస్తున్నారు .
జనమంతా ఆశ్చర్యపోతున్నారు .
అన్నా ..... తీసుకోండి ఇందులో 10 లక్షలు ఉన్నాయి - వడ్డీకి జమ చేసుకోండి - ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి , ఐదారేళ్ళల్లో నా చదువు పూర్తయిపోతుంది , అప్పటికి వడ్డీతో సహా మొత్తం తీర్చేబాధ్యత నేను తీసుకుంటాను .
పెద్దాయన : తమ్ముడూ అవసరమే లేదు - నువ్వు సర్ తాలూకా ......
ఒకరికి బాకీపడటం నాకు ఇష్టం లేదు అన్నా , ఇవ్వకూడదు అనుకుని ఉంటే నేరుగా సర్ తోనే మాట్లాడించేవాడిని , మీరు మంచివారని తెలిసే నేనుగా వచ్చాను , మీరూ కష్టపడిన డబ్బే కదా ఇచ్చేస్తాను .
పెద్దాయన : చిన్న పిల్లాడివి అయినా పెద్ద మనసు బాబూ నీది , సర్ దగ్గర నా గౌరవం కాపాడావు - నిన్ను నమ్ముతున్నాను - నీకు కావాల్సినంత సమయం తీసుకో , ఎక్కడా ఏ పత్రాలపై సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు - ఈ డబ్బును కూడా .......
ఇచ్చినది వెనక్కు తీసుకోలేను అన్నా , నన్ను నమ్మారు అది చాలు , సంవత్సరానికి రెండు రూపాయల వడ్డీ చొప్పున 6 లక్షలు , నేను మళ్ళీ ఇచ్చేన్తవరకూ వడ్డీ జమా వేసుకోండి .
పెద్దాయన : వడ్డీ వ్యాపారంలో నిజాయితీగా ఉంటాను బాబూ ..... , 6 లక్షలు మాత్రమే తీసుకుంటాను అంటూ 4 లక్షలు వెనుకకు ఇచ్చేసారు .
థాంక్యూ అన్నా అంటూ బ్యాగులో ఉంచుకున్నాను , ముఖానికి కర్చీఫ్ కట్టుకుని వెళ్లి కిందపడిన వస్తువులను శుభ్రన్గా తుడిచి లోపలికి చేర్చడంలో సహాయం చేస్తున్నాను .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply
Ji what happened chinna update tho apesaru y ji pls
Like Reply
Good update sir  thanks
Like Reply
అప్డేట్ బాగుంది మహేష్ మిత్రమా.
Like Reply
(15-12-2023, 07:44 PM)Mahesh.thehero Wrote:  కళ్ళ ముందు బామ్మ కన్నీళ్లు - అక్కయ్య గుర్తుకురావడంతో ఆగిపోయాను , వీరి అంతం కంటే వారి సంతోషం ముఖ్యం , ఎలా ఉన్నారో ఏమిటో ..... అప్పులవాళ్ళు ఈరోజే వస్తారని అన్నారు .
అంతలో ఆ రాక్షసులిద్దరూ లోపలికివెళ్లిపోవడంతో కూల్ అయ్యాను , ఇల్లు ఖాళీ చేయాలి అన్నారు అక్కడి పరిస్థితి ఏమిటో , వెళితే కదా తెలిసేది అంటూ లిఫ్ట్ దగ్గరికి పరుగులుతీసి బటన్ ప్రెస్ చేసాను .
పరిష్కారం డబ్బు ...... , 


ఈ story ప్రారంభం ఏమిటో మరిచి పోయాను కనుక
ఎవరైనా ఈ కథ ప్రారంభ పేజీ యొక్క లింక్ ఇవ్వగలరా
Like Reply




Users browsing this thread: [email protected], 369 Guest(s)