Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy ఎలకలు కొరికిన కథలు - కుమాత నభవతి
#1
తనికెళ్ళ భరణి గారి కొన్ని హాస్య రచనలు ఇక్కడ పొందు పరుస్తాను.

వీలైతే ఆదివారం నుండి
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
We are waiting ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#3
ఎలకలు కొరికిన కథలు
- Tanikella Bharani

30 ఏళ్ల క్రితం.. నాకు చదువా పెద్దగా అబ్బలేదు. బీకాం థర్డ్ క్లాస్. స్పోర్ట్సా నిల్. లోక జ్ఞానం అంతంత మాత్రం. ఉద్యోగం లేదు. గుర్తింపు లేదు. గౌరవం లేదు. బుర్ర పిశాచాల ఖార్ఖానాల ఉండేది. అప్పుడు అడపా దడపా రాసిన కథలు..రాసి చింపేసి..చింపేసి రాసి ..రాసి రంపాన పెట్టి మొత్తానికి కొన్ని కథలు పోటీకి పంపాను. ఇంచుమించు పంపిన ప్రతికథకి ఏదో ఒక బహుమతి . ఆశ్చర్యం వేసి మరికొన్ని కథలు రాశాను. ఎంచేతనో నాకు కథ పట్టుబడలేదు. ఇక చాలనుకుని మానేసి కవితలు నాటకాలు మొదలెట్టాను. కథల్ని అటకెక్కించాను.రెండేళ్ల క్రితం కవి, కథకులు ఎమ్మెస్. సూర్యనారాయణ పాత కథలన్నీ ఇచ్చి "ఒకసారి చెక్ చేయి.. ఎప్పుడో అజ్ఞాన దశలో రాసా.. చాలా అమెచ్చూర్డ్ గా ఉంటాయి" అన్నారు. అంటే వాడు వాటిని పారేశాడు. కొన్నాళ్లకి దొరికాయి. కానీ చివరకి "ఎలకలు కొట్టి పారేశాయి క్షమించు అన్నాయ్యా" అన్నాడు. కొడితే కొట్టాయి కానీ అద్భుతమైన టైటిల్ చేతిలో పెట్టాయి రా అనుకున్నాను.అవే “ఎలకలు కొరికిన కథలు” ఏమీ చేతకాని రోజుల్లో రాసినవి. చదివి అవతల పారేయండి
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#4
జూలీ లేచిపోయింది
 
 “ఎక్కడినుంచి వస్తున్నావ్?” గుర్రుమంది టామీ.
నిర్లక్ష్యంగా పోయి పక్క మీద పడుకుంది జూలీ.
“నిన్నే!” రెట్టించింది టామీ.
“ఎందుకలా ఊరికే మొరుగుతావు... ఊరకుక్కలాగా”
"నీ వ్యవహారం నాకేం నచ్చట్లేదు”
“నాకూ నచ్చట్లేదు నీ వ్యవహారం....అయినా నేనెప్పుడూ పల్లెత్తు మాట అన్లేదు నిన్ను” తోక నాక్కుంటూ జవాబిచ్చింది జూలీ.
“అదికాదు జూలీ...నా బాధ అర్థం చేసుకో” లాలనగా దగ్గరకొచ్చింది టామీ.
“నాకు విసుగ్గా ఉంది... దగ్గరకు రాకు"
“అదే నాకు ఒళ్లుమంట... ఊర్లో ప్రతీ మగ కుక్కా  నీ వెనక్కాలే...నాకు బాధనిపించదూ?”
“మగబుద్ధే అంత” అందులో కొంత అసహ్యంతో కూడిన గర్వం ఉంది.
“నువ్వలా ఇష్టమొచ్చినట్టు తిరగడానికి వీల్లేదు” గట్టిగానే అరిచింది టామీ.
“పోయేదేదో నాదే పోతోందిగానీ నీదేం పోయింది”
“సిగ్గు లేకపోతే సరి”
“మరీ మనుషులంత మీన్ గా మాట్లాడకు”
“మొన్న సినిమా హాలు దగ్గర నువ్వూ, ఆ బ్రౌనీ...చీ...చీ....అసహ్యంగా ఎంతమంది చుట్టూ మూగి రాళ్ళేసారు....సిగ్గనించలేదూ!"
“వాళ్ళు పబ్లిగ్గా పొందలేని సుఖాన్ని మనం పొందేస్తున్నామన్న కుళ్లు...ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఫెలోసొచ్చి కార్లాపి కళ్లప్పగించి మరీ చూసారో తెలుసా...నాకు ఎంత థ్రిల్ గా అనిపించిందో!”
“నువ్వు చేసింది తప్పనించకపోగా సమర్థించుకుంటున్నావ్”
“యస్...నీది ఇండియన్ మెంటాలిటీ.. నీ నరనరాల్లో నీతి సాంప్రదాయ భయం ఇంకా ఎంతో మురికి ప్రవహిస్తోంది...నిజంలో బ్రతకడం మీకు చేతకాదు”
“నువ్విప్పుడే ఇంగ్లాండ్ నించొచ్చినదాన్లాగా మాట్లాడకు"
“అక్కర్లేదు! నా తండ్రి ఆస్ట్రేలియన్..తల్లి ఇండియన్. అయినా మా తండ్రి పోలికలే ఎక్కువొచ్చాయ్. మా ఫాదరెప్పుడూ నా తల్లిమీద నీలా విసుక్కోలేదు. పగలల్లా ఎక్కడ తిరిగినా రాత్రికి తనే వొచ్చేది నా ఫాదర్ దగ్గరికి. అంత మగతనం నీ దగ్గరా ఉంటే నాకు ఈ ఖర్మేవిటి?”
“అంటే నేను చేతకాని వాడిననా...”
“ఆ తెలుస్తూనే ఉంది. పుట్టిన బిడ్డల్లో ఒక్కదానికి నీ రంగుందా... బుద్దులు మాత్రం వచ్చాయి.... ఛండాలంగా”
“అంత ఇష్టం లేని దానివి ఎందుకు కాపురం చేస్తున్నావ్...”
“ఏమన్నావ్? 'కాపురమా?' అంటే ఏమిటీ...నీకు కొవ్వెక్కినప్పుడల్లా నీ ముందు కదలకుండా నిలబడ్డవేనా...అంతకన్నా ఏమైనా చేసావా? యజమాని తిండెడుతున్నాడు. అదీ ఊరికే గాదు... రాత్రల్లా ఇల్లు కాస్తున్నాను గనుక...పని మనిషి స్నానం చేయిస్తోంది... ఇక నువ్వు చేస్తున్న దేవిటో?.. నువ్వున్న గుంజకే మరో చైన్ తో కట్టిపడేయడమేనా నీ దృష్టిలో కాపురం అంటే...ఆ చైను కూడా రోజూ ఆ జయమ్మ కడ్తుంది. అదేం నువ్వు కట్టిన మంగళసూత్రం కాదు...”
“ఏమో మనుషులకు మల్లే నువ్వూ నీతి లేకుండా ప్రవర్తిస్తావనుకోలేదు”
“ఏమిటి నీతి? మొగుడెక్కడొస్తాడే అని భయంతో బిక్క చచ్చిపోయి బలవంతంగా అదేదో డ్యూటీలాగా కోరికలు తీర్చుకుని... మొగుడొచ్చే వేళకి కాళ్లకు చెంబు నీళ్ళు అందిస్తూ జయమ్మలాగా...అది నీ దృష్టిలో నీతి ఔనా? చెప్పు?
“నీతో వాదించలేను”
“వాదించడం నీకు రాక్కాదు...నీ దగ్గర పాయింట్ లేదు”
“ఏమిటి పాయింట్ లేదు....నీకూ నాకూ జత....అలాంటప్పుడు నువ్వు వేరే కుక్కలతో...”
“ఔను నేను పిల్లల్ని కని ఎటూ వెళ్ళలేని స్థితిలో నాకోసం గోడదూకి నువ్వెక్కడ చూస్తావో అని... భయంకాదు మళ్ళీ నీతో పోట్లాడాలని నీకు ఏం అపకారం జరిగినా నేను బాధపడతాననీ... రెండు ఎముకలు ఎంత ప్రేమగా తెచ్చి పెట్టాడు.....నీ జీవితంలో ఎన్నడైనా ఇచ్చావా?”
“నేనివ్వడం ఏ ఖర్మ...రోజూ వంట మనిషి కడుపు నిండుగా పెడ్తోందిగా!"
“అదే మరి... అలా అయినప్పుడు నేను నా యజమానికి కృతజ్ఞతగా ఉండాలి గానీ...నీకెందుకూ?"
“అంటే నాకు నీ మీద ప్రేమ లేదంటావ్!”
“ఉంది...నీకవసరం అయినప్పుడు మాత్రం ”
“ఆ బ్రౌనీగాడు తెచ్చే ఎంగిలి ఎముకలు నీకిష్టం"
“అవును..ఆ ఎంగిలి ఎంతో మాధుర్యంగా ఉంటుంది. అసలలా నా చుట్టూ తిరిగి నన్ను కోరుకునే వారంటే నాకిష్టం....బయటికెళ్తే చాలు నీడలా వస్తాడు. కానీ వాడికీ నీ రోగమే..మరో కుక్కని నావెంట పడనీయడు...మొన్నోరోజు ఎంతమందితో పోట్లాడాడు హీరోలా..నాకోసం... కేవలం నాకోసం...ఎన్ని గాయాలు...ఎంత రక్తం చిందించాడు. వాడికోసం నా వెధవ శరీరం ఎంతిస్తే రుణం తీరుతుంది...?"
********
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#5
కుమాత నభవతి
వేప చెట్టు మీద కాకులరుస్తున్నాయ్...తెల్లారుతోందని.
“గణపతి....ఒరే లేవరా నాయనా...ఇవాలెక్కడికో వెళ్ళాలన్నావ్ పెందరాళే...” తను లేచి బిందె తీసుకుని పెరట్లోకి వెళ్తూ అరిచింది కావమ్మ. .
గణపతి ముడిచి పెట్టుకుని పడుకున్నాడు.
లెమ్మంటోంది నీక్కాదూ...మళ్ళీ లేపలేదని నన్నంటావ్...” కప్పుకున్న బొంత లాగేసింది.
“ఊఁ..తెల్లారిందే అప్పుడే.” అంటూ లేచి కూర్చుని, కళ్ళు తెరిచి అరచేతుల్ని చూసుకున్నాడు.
బొంత మడిచేసి చాప చుట్టి ట్రంకు పెట్టె మీద పెట్టి పెరట్లోకి వెళ్ళొచ్చాడు.
బావి పక్కనే చింతపండెట్టి రాగి బిందెని తోవుతోంది కావమ్మ.
'పళ్ళ పొడుందా?”
“అయిపోయిందిరా నాయనా. చెప్పడం మర్చిపోయా... రేకు డబ్బాలో బొగ్గు ముక్కుండాలి తీస్కో”
“కాఫీ నీళ్ళేవైనా ఉన్నాయా” బొగ్గు నవిలి పళ్ళు తోముకుంటూ ఆనప పాదు మొదట్లో కూర్చుని అడిగాడు గణపతి.
“కుంపటి మీద నీళ్ళడేసా...ఇదిగో బింది తోవి కలిపి ఇస్తానుండి..”
“తొందర్లేదు నేను దొడ్లోకెళ్ళిరానీ” గబగబా పళ్ళు తోమేసి..పాత విసనకర్రలోంచి ఓ తాటాకు తెంపి నాలిగోసుకుని....పుక్కిలించి ఉమ్మేసి...చెంబుతో నీళ్ళట్టుకుని జంధ్యాన్ని చెవికి మెలేసి దొడ్డివే పెళ్ళాడు గణపతి.
కుంపటి మీద మరుగుతోన్న నీళ్ళలో డబ్బా దులిపి కాఫీ పొడేసేసరికి పొంగి కుంపట్లో పడింది డికాక్షన్...చెంగుతో గిన్నె దింపి చిన్న ఇత్తడి గిన్నెతో కుంపటి మీద పాలడేసి...డికాక్షన్ మీద ఇన్ని నీళ్ళు జల్లింది...ఏవిటో వెధవ కాఫీలాని...చక్కగా ఇంత చద్దన్నం తినే కుర్రాళ్ళక్కూడా కాఫీ అలవాటు...చద్దన్నం తిండం నామోషీ.కుక్కలకీ నక్కలకీ పారెయ్యాలి...
“అయిందా...ఇచ్చేస్తే స్నానం చేస్తాను...” కాళ్ళు కడుక్కుంటూ అడిగాడు గణపతి.
“ఆఁ..అయింది” గిన్నిలో కాఫీ కలిపి ఇత్తడి గ్లాసులో నిండా పోసిచ్చింది గణపతికి.
“జాగర్త చెయ్యి కాల్తుంది”
“పంచదార తక్కువయింది” ఓ గుక్క తాగి అన్నాడు.
“తేవాలి నాయనా...బైట బోర్డు ప్రియం" అంది కాఫీ ఊదుకుంటూ తాగుతో.
“అదేవిటీ కార్డు మీద రెండు కిలోలు రాదూ మనకి”
“సీత కూతురు సవత్డాత్తేనూ...వాళ్ళకి కావాలన్నారు....అంచేత ఇచ్చా”
“బావుంది" గ్లాసు కింద పెట్టి బావి దగ్గరకెళ్ళి చకచకా తోడి నాలుగైదు బాల్చీలు తలమీంచి పోసేసుకుంటూ కొబ్బరి పీచెట్టి రుద్దుకున్నాడు.
“అవునూ...అన్నవొండమంటావా...లేక చద్దన్నం తినిపోతావా?”
“ఇప్పుడేవీ అక్కర్లేదు ఉన్నదేదో తింటా! పంచపాత్ర, ఉద్దరిణీ బైటడెయ్”
“చూసావా మర్చేపోయను” హరివాణమూ....పంచపాత్ర పీచెట్టి చకచకా తోమి బోర్లించింది కావమ్మ.
గణపతి విబూది తీసుకుని కేశవా, నారాయణా అంటూ ఆచమనం చేసి సంధ్యావందనం మొదలెట్టాడు.
“మార్గశిర మాసే.... శుక్లపక్షే....అమ్మా...ఇవాళ తిథేవిటే....”
“చతుర్ధశి....అదేవిట్రా నిన్న సంధ్యవార్చుకోలేదూ..”
“ఎక్కడా బస్సులో వార్చుకోమంటావా..చతుర్థశ్యాం ... సౌమ్యవాసరే...శుభ నక్షత్ర....శుభకరణ ఏవంగుణ విశిష్టాయాం ...శుభతిధౌ శ్రీమాన్ భారద్వాజస గోత్రస్య...గణపతి రావుాం...”
“నా మతిమండా నిన్న ఇంట్లో లేవన్న సంగతి మర్చిపోయాను. సరేగానీ మామయ్య వస్తానని చెప్పాడన్నావ్ ఎప్పుడూ...”
గణపతి ఓ మాటు వంటింటికేసి చూసి తన పని తను చేసుకుపోతున్నాడు.
సంధ్యావందనం పూర్తి చేసుకుని గబగబా లోపలికొచ్చి లుంగీ కట్టుకుని...
"పెట్టెయ్ ఎనిమిదైపోయింది...తొమ్మిదింటికల్లా రమ్మన్నాడు...”
“పెట్టుకు తిందూ... ఈ పాచిగుడ్డతోటి ఏం బెట్టమంటావ్...”
గణపతి అన్నం పెట్టుకుని అందులో మజ్జిగోసుకున్నాడు. "అయ్యో అదేం తిండి వెధవ తిండాని... కాస్త ఆవకాయ కలుపుకో...”
“అక్కర్లేదే ఉప్పేది...”
“రాచ్చిప్పలో ఉంది. ఎడం చేత్తో వేసుకో" తొందరగా తిండంలో కంచం కదిలిపోతుంటే ఇంకో చేత్తో కంచం పట్టుకున్నాడు.
“అదిగో అవే అంట మంగళం పన్లంటే...ఏదీ చెయ్యి పట్టు” అంటూ ఎడం చేతిమీద నీళ్ళోసింది.
'ఈవిడకి ఈ చాదస్తం పోదు' అని మనసులో అనుకుని గబగబా రెండు ముద్దలు తిని కంచంలో చెయ్యి కడిగేసుకున్నాడు.
“నాయన్నాయనా ఆ చేత్తో కాస్త ఎంగిలెత్తి పెరట్లో పడేద్దూ నీకు పుణ్యముంటుంది”
మెతుకులెత్తి తీసుకెళ్ళి పెరట్లో పారేసి.... “ఊ ఇంక ఇది గూడా ఎందుకూ నీళ్ళోయ్ అలికేస్తాను”
కావమ్మ కాస్త పసుపు గణపతి చేతిలో వేసి కొంచెం నీళ్ళోసింది.
గణపతి తిన్నంత మేరా శుబ్బరంగా అలికేసి పీట ఎత్తి పెరట్లోకెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు.
“మధ్యాన్నానికి బోయనానికొస్తావా?” స్నానానికి నీళ్ళు తోడుకుంటూ అడిగింది.
“ఏమో మరి అక్కడెంత సేపౌతుందో ఏమో....అయినా వచ్చేస్తాన్లే...” ప్యాంటూ, చొక్కా వేసుకుని...వెళ్ళబోతుంటే....
“దేవుడికి దణ్ణం పెట్టుకునెళ్ళు...వీధి తలుపు దగ్గరేసి వెళ్ళు నాయనా” తలుపు దగ్గరేసి బైటపడ్డ గణపతి జేబు చూసుకుని మళ్ళీ లోపలికొచ్చాడు.
'ఏమయిందిరా... శకునమా...”
“శకునం లేదు ఏం లేదు....నిన్న రాత్రి నీకిచ్చానే రెండు రూపాయలు అవియ్యి బస్సుకు డబ్బుల్లేవు” నీళ్ళు తోడి బింది నింపి... లోపలికొచ్చింది కావమ్మ
“ఇదిగో- ఆ భగవద్గీతలో పెట్టాను చూడు”
భగవద్గీత నిండా ఏవో మందు రసీదులూ, నెమలి ఈకలూ ఉన్నాయిగానీ రెండు రూపాయల నోటు కనిపించలేదు.
“నా మతిమరపు మండా...ఎక్కడ పెట్టానూ... ఇదిగో ఆవాల డబ్బాలో ఉందేమో చూడు” గణపతి డబ్బా అందుకున్నాడు మూత రాలేదు.
“ఇంత గట్టిగా పెట్టావేమే ఏదో బంగారం దాచినట్టు...ఇది రావట్లేదు” కావమ్మ చెంచా తిప్పి తీసింది. దాంట్లో ఆవాలు లేవు, పసుపుంది. నోటంతా పసుపయింది.
గణపతి నోటు తీసి దులిపి “బాగుంది జాగర్త చైడం...ఇప్పుడిది చెల్లదంటే చావాలి” అంటూ చొక్కా జేబులో పెట్టుకుని బైటికి పరుగు తీసాడు.
“జాగర్త ప్యాంటు జేబులో పెట్టుకో. ఎక్కడైనా పడిపోతుంది” కంగారుగా పోతున్న గణపతి కనుమరుగయ్యేదాకా చూసి... ఈ మాటన్నా ఉద్యోగం వచ్చేలా చూడు తండ్రీ' అంటూ దేవుడికి మనసులో నమస్కరించుకుని తలుపేసింది.
*****
కావమ్మగారిది మధ్యతరగతి కుటుంబమే అయినా ఎన్నడూ అన్నపానాలకి లోటుండేది కాదు. రామజోగయ్యగారు ఓ ప్రైవేటు కంపెనీలో పద్దులు రాసేవారు. ఆయనకి విపరీతమైన బంధుప్రీతి. ఎప్పుడూ వచ్చేపోయే వాళ్ళతోటి ఇల్లు సత్రంలా ఉండేది. కొంతమంది నెలల తరబడి ఉండి ఉద్యోగాలు వెతుక్కుని మరీ వెళ్ళేవారు. అందరికీ కావమ్మగారే వండి వార్చేవారు. పెద్దమ్మాయి గాయత్రికి పెళ్ళి చేసేసరికి ఉన్న కాస్త డబ్బూ అయిపోయింది. గణపతిని ఎలాగో డిగ్రీ పూర్తి చేయించి రామజోగయ్యగారు తనువు చాలించారు. అంతే బంధువుల తాకిడి తగ్గిపోయింది. పెన్షన్ కింద నెలకి వంద రూపాయలు మాత్రం వస్తాయి. అదే ఆదాయం .
అద్దె భరించుకోలేక చిన్న రేకుల కొంపలో దిగారు గణపతీ, కావమ్మగారూ....ఎంత పొదుపుగా చేసుకున్నా ఈ రోజుల్లో వంద రూపాయలు ఇద్దరికి ఏ మూలకీ. కూతురు గాయత్రికి తల్లీ, తమ్ముడు అంటే ఆపేక్షేగానీ అల్లుడు కర్కోటకుడు. రామజోగయ్యగారు బతికుండగానే తనకి అది చెయ్యలేదని, ఇది చెయ్యలేదని కాల్చుకు తినేవాడు.
ఆయన పోనే పోయాడు కావమ్మగారికి మొదట్లో ఉత్తరాలు రాసేది గాయత్రి తనను నరకయాతన పెడున్నాడనీ, ఏమీ చెయ్యలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దనీ, రాత్రిళ్ళు కంటనీరెట్టుకుని పడుకునేది కావమ్మ. గణపతి ఆర్నెళ్లనించీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఉద్యోగం కోసం. రెణ్ణెల్లు ఊరవతల ఉన్న ఓ ఇంజనీరింగ్ కంపెనీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా చేసాడు గానీ, తెల్లారకముందే వెళ్ళడం, రాత్రి పదయ్యాక రావడం. ఆ జీతం రాళ్ళు నాలుగూ బస్సులకీ....వాటికీ సరిపోవడం. ఆరోగ్యం చెడిపోవడంతో కావమ్మ వెధవ ఉద్యోగం మానేసి నాలుగు ప్రైవేటయినా చెప్పుకోమంది. వెంటనే మానేసి మూర్తిగారమ్మాయికి ట్యూషన్ మొదలెట్టాడు. అలా నెలకో ముఫ్పై రూపాయలు వస్తాయి.
ప్రస్తుతం కావమ్మగారు దుర్భర దారిద్ర్యం అనుభవిస్తోంది. ఒంటి మీదకి మంచి గుడ్డ లేదు. తిందామంటే తిండి లేదు. అప్పులిచ్చే వాళ్ళు లేరు. పోనీ ఎవరన్నా అప్పిచ్చినా తీర్చుకునే స్తోమతాలేదు. దేవుడి దయవల్ల గణపతికి ఏదన్నా ఉద్యోగం దొరికితే వాడికి పెళ్ళి చేసి తను కృష్ణారామా అనుకోవాలని ఆవిడ తాపత్రయం . 'గణపతి స్వతహాగా మొహమాటస్తుడు. నోరు తెరిచి ఇది కావాలని ఎన్నడూ అడగడు. వెధవ ప్రపంచికంలో ఎలా బ్రతుకుతాడో పిచ్చి సన్నాసి' అనుకుంటూ ఉంటుంది కావమ్మగారు. మంచి కోడలు పిల్లన్నా వస్తే అదే వాణ్ణి దార్లో పెట్టుకుంటుంది అని తనకు తానే సమాధానం పడ్తూ ఉంటుంది.
గణపతికెప్పుడూ తల్లి గురించి బెంగ. తనకి ఊహ తెలిసినప్పటి నుండీ చాకిరీ చేస్తోంది. ఓ మంచి చీరకట్టుకోడంగాని ఓ సినిమాకెళ్ళడంగానీ ఎన్నడూ చెయ్యలేదు అమ్మ. కనీసం మంచి ఉద్యోగం వస్తే తను పెళ్ళి చేసుకుని అమ్మను కూర్చున్న చోటునుంచి లేవకుండా సేవ జేయాలన్న కోరికా....మళ్ళీ ఎలాటి  పెళ్ళామొస్తుందో అన్న బెంగ...
రాత్రి పదయింది...
అప్పటికి కావమ్మ పొయ్యి వెలిగించి రెండు రోజులయింది. ఇంట్లో నూకలు కూడా అయిపోయాయి. మొన్న ఇంటివాడు వచ్చి అద్దెకోసం గోల చేస్తే తను కాపారానికొచ్చేటప్పుడు తల్లిగారు ఇచ్చిన రాగిబిందెని గణపతి చేత తాకట్టు పెట్టించి ఇంటద్దె కట్టింది.
సీత వాళ్ళకి ఇప్పటికే నాలుక్కిలోల బియ్యం, కప్పుడు మంచినూనె బాకీ. అవి తీర్చకుండా మళ్ళీ అడిగితే ఏం బావుంటుంది. గణపతి మోకాళ్ల మీద తల పెట్టుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అలా గణపతిని చూసేసరికి ఒక్కసారి కడుపులో బాధ కలిగింది. కన్నీళ్ళు వచ్చాయ్ కావమ్మకి. కొడుకు చూడకుండా చెంగుతో తుడుచుకుంది.
“రేపు సీత వాళ్ళింట్లో వాళ్లత్తగారి తద్దినంట. నిన్ను భోక్తగా రమ్మంది. వెళతావా?” అనుమానిస్తూనే అడిగింది.
"తద్దినానికా...?” ప్రశ్నార్ధకంగా మొహం పెట్టాడు.
“తప్పేవుంది”
“తప్పని కాదు... ఇలాటి పరిస్థితిలో వెళ్తే భోయనానికనుకోరూ..” నేలచూపులు చూస్తూ అన్నాడు.
'ఏం పర్లేదు, తిండి తిని రెండ్రోజులయింది. కళ్ళు చూడు ఎలాగుంటలడ్డాయో”
“నువ్వు మాత్రం....” గణపతికి కళ్ళమ్మట ధారగా నీళ్ళు కారి కింద మట్టిలో ఇంకిపోతున్నాయి... తన పరిస్థితికి అసహ్యమేసింది. కన్నతల్లికి పస్తులు పడుకోబెట్టి చంపుతున్న వెధవ తను.
“ఏం వెళతావా?”
“మరి నువ్వు..."
“నాకలవాటేరా..ఈ ఉపవాసాలూ అవీనూ...అందులో రేపు శనివారం...తద్దినం వంట నేనెలా తింటానూ...ఏం?” “నేనెళ్ళనే....నువ్వు పడుకో...రేపు ఎక్కణ్ణుంచన్నా అప్పు తెస్తాలే”
“ఎవడిస్తాడూ...?"
“ఎవడో ఒకడు..నువ్వు పడుకో” వెళ్ళి ఓ గ్లాసుడు మంచి నీళ్ళు తాగి బొంత కప్పుకుని పడుకున్నాడు. కడుపులో ఏదో మంటగా ఉంది..నిద్దురట్టలేదు. అప్పుడప్పుడూ తల్లి దగ్గు వినిపిస్తోంది. ఆవిడా ఊరికే ముసగెట్టుకుందన్న మాటేగాని నిద్ర పోవట్లేదు గణపతి గురించే ఆవిడాలోచన.
ఎలాగో ఇద్దరూ నిద్ర పోయారు.
తెల్లారగట్టలేచి వీధిలో పడ్డాడు గణపతి.
ఏడు గంటలవేళ సీతొచ్చి అడిగింది.
“గణపతీ, మీరూ భోయనానికొస్తారా..?"
“నాకు శనివారం...వాడు ఏదో పనుందని వెళ్ళాడు”
అయ్యో...కనీసం పళ్ళో..పాలైనా తీసుకుందురుగాని..”
“ఎందుకే శ్రమ..”
“అది కాదు. మా అక్కయ్యవాళ్ళంతా వచ్చారు. మీరు కాసిని గారిముక్క వేసి పెడ్తారేమో మడిగా అనుకున్నాను” అంది సీత.
“అయ్యో! దానికే భాగ్యం... మడి పంచోటి తడపండి వస్తున్నా...” తలుపు తాళం వేసి సీత వాళ్ళింటికెళ్ళి తడి పంచి కట్టుకుని పిండి రుబ్బడం మొదలెట్టింది. పక్క పొయ్యి మీద సావిత్రమ్మ అరిసెలేస్తోంది.
కందకూరలో ఆవవాసన ముక్కు పుటాలు అదరగొడ్తోంది.
రామజోగయ్యగారికి ఆవెట్టి కంద కూరంటే మహా ఇష్టం. 'నా తద్దినానికి ఏమీ వద్దురా...కందకూర మాత్రం వండించు' అనేవారు గణపతితో.
'నట్టింట్లో ఏమిటా అమంగళం మాటలూ' అంటూ కసిరేది తను.
లోపల పిండప్రదానం జరుగుతోంది. పది వాయలదాకా గారిలొండింది కావమ్మ. ఘుమఘుమలాడుతున్నాయ్ గారెలు. నోరూరింది కావమ్మకి. రెండు గారి ముక్కలు తింటే... అమ్మ ఇంకేమైనా ఉందా...అయినా ఎన్నడూలేని వెధవాలోచన ఇవాళొస్తోందేవిటీ...
బూర్లె మూకుడు పొయ్యి మీదనుంచి దింపేసి చెయ్యి కడుక్కుని సీతని పిల్చింది.
“మరి నే వెళ్తానే”
“అప్పుడే? మరి గణపతి రాలేదు..పోనీ గారి ముక్కలూ, పరమాన్నం ఇస్తాను తీసుకెళ్తారా...”
“ఇప్పుడే ఎందుకూ తర్వాత పంపుదూ...వస్తా”
“అలాగే ఈ హడావుడి తగ్గాక దుర్గతో పంపుతా..పాపం మీరు చాలా శ్రమపడ్డారు”
“ఆఁ శ్రమా నా బొందా! ఏదో అవసరమొచ్చినప్పుడు మనలో మనం చేసుకోకపోతే ఎల్లాగే. వస్తాను మరి” ఇంటికొచ్చి అనుకుంది పిచ్చి ముండని ఇస్తానన్నప్పుడు పట్టుకొచ్చినా బావుండేది. మళ్ళీ మధ్యాన్నం గణపతొస్తే... అప్పటికి దుర్గచేత పంపించేస్తుందేమో...' కాస్సేపు ఆలోచన మార్చుకునేందుకు భగవద్గీత పుచ్చుకుని చదవడం మొదలెట్టి... కాస్సేపటికి నిద్రలోకి జారిపోయింది.
సాయంత్రం ఆరవుతోంటే దురొచ్చి తలుపు కొట్టింది. “మామ్మగారూ! మా అమ్మ పంపించింది” గిన్ని మీద అరిటాకు మూతేసి ఉంది.
“ఇల్లా పెట్టు”
పక్కన పెట్టి “వస్తానండీ!” అంది దుర్గ.
“ఉండు చేతుల మీద నీళ్ళోస్తాను” అని చెంబులో నీళ్ళు చిలకరించింది దుర్గ చేతులమీద.
దుర్గ నవ్వుకుంటూ పరికిణీకి తుడుచుకుని వెళ్ళిపోయింది.
వెంటనే తలుపేసి అరిటాకు మూత తీసింది. మూడు గారి ముక్కలూ, ఇంత కందకూర ఉన్నాయి అందులో. “దీనిల్లు బంగారంగానూ... ఇదా పంపింది” అంటూ మళ్ళీ మూత పెట్టేసింది.
'ఎవరి ముక్కలో పెట్టనూ...వాడేదో డబ్బు తెస్తానన్నాడు. గమ్ముని తెస్తే కాసిని బియ్యం తెచ్చుకుని ఇంత ఉడకేస్తే తనూ ఏ అరటిపండు ముక్కో నోట్లో వేసుకోవచ్చు'
కావమ్మని ఆకలి దంచేస్తోంది.
ఎదురుగుండా గిన్నెలో గారిలు.
ఏవీ తోచట్లేదు. ఓమాటు పెరట్లోకి వెళ్ళి అలుగుడ్డని నీళ్ళలో జాడించి దండెంమీద వేసొచ్చింది. ఏ పనీ చేద్దామనిపించట్లేదు. అసలు పనే వుందనీ..?
సూదీ దారం తీసుకుని బొంత కుడుతూ కూర్చుంది. కాస్సేపయ్యాక లేచింది. ఓ గ్లాసుడు నీళ్ళు తాగింది. పొద్దున్నించీ ఎన్ని గ్లాసులు తాగిందో...కడుపు దేవుతున్నట్టుంది. దొడ్డివేపు కెళ్ళి వేళ్ళు నోట్లకి పోనిచ్చి డోకింది. నీళ్ళు వచ్చేసాయ్...నొప్పితో కళ్ళలో నీళ్ళు తిరిగాయ్.
గొంతు నొప్పిజేసింది. ముఖం తుడుచుకుని అలాగే ఉదయిస్తోన్న చంద్రుణ్ణి చూసింది. మనస్సేమీ బాగాలేదు. ఆకలేస్తోంది...ఆకలి దహించేస్తోంది.
ఒక గంట అలాగే మధనపడింది. బాగా చీకటి పడింది. 'ఇంక వాడు రాగు గామోసు....వచ్చినా ఏదైనా తినే వస్తాడు'
గారెలు తను తినేస్తే.....కానీ శనివారం పూటా...తద్దినం కూరా గారెలూనా...ఆకలి...ఆకలి... కడుపులోపల కొలిమిలా ఉంది. భరించలేకపోయింది.
గబగబా..చిరిగిన పట్టుపంచి చుట్టుకుంది. అరిటాకు మీద మూత తీసి గారెలు తీసి గబగబా కొరికి తింది. కమ్మగా ఉన్నాయ్... కాస్త కందకూర నంజుకుంది.
తలుపు చప్పుడైంది. గుండాగినంత పనైంది..ఎవరన్నా చూస్తే గబుక్కున గిన్ని పెట్టి పక్కకి తోసి తలుపు దగ్గరి కొచ్చింది.
ఎవరూ లేరు ఊరికే గాలికి తలుపు కొట్టుకుంటోంది. గుండ్రాయిని తలుపు కడ్డం పెట్టి గబగబా మూడు గారెలూ కందకూరా తిని గుక్కెడు నీళ్ళు తాగింది.
'అమ్మయ్య..... ప్రాణం కుదుట పడింది.
ఇంకా గణపతి రాలేదూ!
గిన్ని తొల్చేసి బొంత పరుచుకుని పడుకుని ఆలోచిస్తోంది.
ఎన్నడూ ఇంత దరిద్రం అనుభవించలేదు. ఆఖరికి శనివారం పూట చద్దికూర తినాల్సిన ఖర్మ పట్టింది. లక్షవత్తుల నోము కూడా చేద్దావనుకున్నాను. పాపిష్టిదాన్ని ఇంక ఆయన తద్దినం పెట్టడానికి పనికొస్తానా..ఇంత వెధవ పని చేసిన తర్వాత'
గోడమీద రామజోగయ్యగారి ఫోటో నుదుటన ఇంత కుంకుమ బొట్టుతో.
కావమ్మగార్నే చూస్తోన్నట్టు... ఒక్కసారి భయం వేసింది కావమ్మకి. ఫోటోకి దణ్ణం పెట్టుకుంది.
'క్షమించండి...ఆకలికి తట్టుకోలేకా...' నడుం వాల్చింది మెల్లిగా. నిద్ర పట్టడం లేదు.
తను చేసిన పని తప్పా.... పుట్టగతులుంటాయా..?
అలా ఏవేవో ఆలోచన్లు.
తలుపు చప్పుడైంది. “ఆఁ ఎవరూ?”
“నేనే” గణపతి గొంతు.
తలుపు తీసింది. వాడిన మొహంతో ఉసూరుమంటూ వచ్చి చొక్కా విప్పుతున్నాడు...
“పొద్దున్నించీ ఏవన్నా తిన్నావురా?” '
“ఏమీ తిన్లేదు..” నీరసంగా గోడకి జార్లపడి
"నువ్వు..?” అడిగాడు తల్లిని.
“ఆఁ...నేనూ ఏవీ తిట్లేదు..”
పడుకుని మొహం మీదకి దుప్పటి లాక్కుని వినబడకుండా ఏడుస్తోంది కావమ్మ. చెంపలమీద నుంచి కన్నీటిధార బొంతలోకి ఇంకిపోతోంది.
********
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#6
Superb
[+] 2 users Like Aarjun319's post
Like Reply
#7
Nice stories  clps yourock thanks
[+] 2 users Like sri7869's post
Like Reply
#8
కొనసాగించండి, కథలు బావున్నాయి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#9
Please continue with more stories
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)