Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*అయ్యరు గారి. IQ
#1
Shocked 
➖➖➖✍️


*భారత దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు.*

*ఆ  రోజుల్లో   ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు. తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది. ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో కడుపు నింపుకున్నాడు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని  రెండు ఇడ్లీలు తీసి  తినడం,      ఆ ఆంగ్లేయుడు గమనించాడు.* 

*తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనలో మొదలయింది.  అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.*

*మధ్యాన్నానికల్లా   రైలు   వాల్తేరు చేరుకుంది.* 

*రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు. అయ్యరు గారు   రైల్వే  భోజనాన్ని మృదువుగా తిరస్కరించి,    తన క్యారియర్ తెరిచి రెండో గిన్నెలో వున్న మరో రెండు ఇడ్లీలు కమ్మగా తినడం,     ఆ బ్రిటిష్ వ్యక్తి గమనిస్తూనే వున్నాడు.*

*యెంత   ఆలోచించినా        తోటి ప్రయాణీకుడు తింటున్నవేమిటి అనేది ఆయనకు అర్ధం కాలేదు. దాంతో ఆయన ఉత్కంఠ మరింత పెరిగింది.*

*రైలు  బెర్హంపూరులో ఆగింది.  మళ్ళీ అదే సీను.*

*బ్రిటిషర్   ఇక తట్టుకోలేక   నేరుగా అడిగేశాడు…  “అయ్యా!  ఇలా అడగడం మర్యాద కాదని తెలిసీ అడుగుతున్నాను. మీరు తింటున్న          ఆ తెల్లటి పదార్ధాలను నేను ఎప్పుడూ చూడలేదు. అవేమిటో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా వుంది”*

*అయ్యరు  ఇలా  జవాబిచ్చారు… “ఇవి  ఐ.క్యు.  టాబిలెట్స్.    అర్ధం మీకు తెలుసుగా.   మేధస్సు పెంచడానికి వీలైన పోషకాలు వీటిలో వున్నాయి. వీటిని తిని,  భోజనం గట్రా     ఏమీ లేకుండా   మేము రోజులతరబడి వుండగలం!”*

*“వీటిని ఎలా తయారు చేస్తారు?” బ్రిటిషర్ ఆరా.*

*అయ్యరు గారు   ఇడ్లీలు   తయారు చేయడానికి కావాల్సిన  సంభారాలు గురించీ,  తయారు చేసే  విధానం గురించీ  వివరంగా  చెప్పారు.*

*“మంచి సంగతులు    మీ నుంచి తెలుసుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకూ ఓ రెండు టాబ్ లెట్లు ఇవ్వగలరా! వూరికే కాదు, మీరు చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించుకుంటాను!”  అని ఆంగ్లేయుడు అభ్యర్ధించాడు.*

*అయ్యరు ఒక క్షణం ఆలోచించి చెప్పాడు…  “నా దగ్గర ఇంకా మూడే మిగిలాయి.  కలకత్తాలో నేను  మా చుట్టాల ఇంటికి వెడుతున్నాను, కనుక నాకు ఇబ్బంది లేదు.  మీరే చెప్పారు కాబట్టి   ఇడ్లీకి   ఓ ఇరవై రూపాయల చొప్పున  ఇవ్వండి చాలు!”*
(అంటే ఈరోజుల్లో 20వేల రూపాయలు)

*బ్రిటిషర్   యెగిరి   గంతేసినంత పనిచేసి   అరవై రూపాయలు అయ్యరుకు ఇచ్చి మూడు ఇడ్లీలు తీసుకుని  తిన్నాడు.*

*మర్నాడు  ఉదయానికల్లా  హౌరా స్టేషన్ వచ్చింది.*

*రైలు దిగి   ఎవరి దారిన  వారు విడిపోయే సమయంలో బ్రిటిషర్ అడిగాడు… “ఈ టాబ్ లెట్లు తయారు చేసే విధానం చెప్పారు. అంతా చెప్పారా!  ఏమైనా మరచిపోయారా!”*

*“చెప్పేందుకు ఏమీ లేదు, అంతా వివరంగా చెప్పాను”*

*“మరి  ఈ టాబ్ లెట్ల ఖరీదు  అంత వుండకూడదే!”*

*“చెప్పాను కదా  ఇవి మేధస్సును వికసింప చేసే ఐ.క్యు. ట్యాబ్ లెట్లని. మీరు మూడే తిన్నారు.  రాత్రికి ఇప్పటికీ మీలో యెంత తేడా వచ్చిందో చూడండి.  అంటే అవి పనిచేయడం మొదలయిందన్న మాట” అని అంటూ అయ్యరు తన హోల్డాలు, టిఫిన్ క్యారియర్ చేతబుచ్చుకుని చక్కాపోయాడు.*✍️
(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)