Thread Rating:
  • 4 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Think scientifically, follow science.
#1
Think scientifically, follow science.

ఒకప్పుడు మూఢనమ్మకము, శాస్త్రీయం కాదు అనే అనేక 
అంశాలు తరువాతి కాలములో  అమెరికా వాడు చెప్పాడు, బ్రిటీష్ వాడు చెప్పాడు అది అలా చేస్తే మంచిదిట...అనే అంశాలు మీకు తెలిసినవి  ఇక్కడ చెప్పగలరా..... 
.
ఉదాః  దక్షిణము వైపు చూస్తూ పడుకోరాదు. అది యమ స్థానమ్..
ఈ మధ్య పేపరులో చదివాను..అమెరికా వాడు రీసెర్చ్ చేసి మరీ కనుక్కున్నాడుట...అలా పడుకోరాదని, భూమ్యాకర్షణ శక్తి వల్ల జరిగే మాగ్నెటిక్ ఫీల్డ్స్ కారణముగా బుర్రలో చెడు పరిణామాల గూర్చి. 
మరి మన వాళ్ళు యముడు అన్నది అందుకే కదా... ఇలాంటివన్నమాట

మన వాళ్ళు బ్రహ్మముహూర్తం లో ధ్యానము జపాదులు చెయ్యడం ఉత్తమం అని సూచించారు. OBE(out of body experience) సమాధి స్థితిలో మొదటి దశ గురించి పాశ్చాత్యులు కనుగొన్న విషయం ఏంటంటే ఎక్కువ శాతం obe లు పొద్దున 4 నుంచి 6.30 మధ్యలో జరుగుతాయని కనుగొన్నారు. వారు obe లో చెప్పిన అంశాలు ఒక సాధకుడికి మూలాధారం జాగృతం అయినప్పుడు కలుగుతాయి

రాత్రిళ్ళు చెట్టుకింద పడుకుంటే దెయ్యాలు వచ్చి గుండెల మీద కూర్చుంటాయి అని చెప్పేవారు. ఇప్పుడు co2 వల్ల ఊపిరి ఆడదు అంటున్నాము

మన పూర్వీకులు ఆచారాలుగా చెప్పిన విషయాలను మన ప్రస్తుత సమాజం logic గా ఆలోచించి ఇవి అశాస్త్రీయ మైనవాని అంటారు. కానీ అదే విదేశీయులు వాటిని నమ్మి పరిశోదనలు చేసి అవి నిజము అని నిరూ పించు చున్నారు. అప్పుడు మనవాళ్ళు ఆ ఆచారాన్ని నమ్మరు.
Ex: ఏకాదశి నాడు ఉపవాస లేదా నిరాహార దీక్ష ఆరోగ్యానికి మంచిది అని మన పూర్వీకులు చెపితే చాదస్తం అన్నారు చాలా మంది. కానీ అదే ఒక జపాన్ శాస్త్రవేత్త క్యాన్సర్ వ్యాధి కి విరుగుడుగా సంవత్సరములో 28 రోజులు, ఒక రోజు లో 10 గంటలు కడుపు ఖాళీ గా ఉంచితే క్యాన్సర్ వ్యాధి రాదు అని నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందాడు.
కనుక సనాతన ధర్మాలు, ఆచారాలు అన్నికూడ TESTED, పామరులు కూడా సులభంగా ఆచరించే విధంగా ఆచార వ్యవహారాలను మన పూర్వీకులు నియమించారు. ఇది నా వ్యక్తిగత అభప్రాయము.

సూర్యోదయాత్పూర్వమే స్నానం చేసి, సూర్యునికెదురుగా నిల్చిని సూర్యనమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి ఢోకా ఉండదని చెప్పారు పెద్దలు. హుష్.. సెకండ్ షో సినిమా/ లేదా టివీ/ లేట్ నైట్ పార్టీ.. ఆ పైని కబుర్లు, పడుక్కునే సరికి దాదాపు రెండు దాటుతుందా.. మరి సూర్యుడు రాకుండా లేవాలిట..  అది చాదస్తం. కానీ ఇప్పుడు, అలా చేస్తే ఏమవుతోంది? వైటమిన్ డి లోపం, ఎండలో కూర్చోండి.. అదీ పొద్దుటి పూటైతే డి విటమిన్ బాగా శరీరంలో ఏర్పడి, కాల్షియం బాగా ఎముకల్లోకి వెళ్తుంది. పొద్దున్నే యోగా చెయ్యండి.. అంటూ డప్పు తీసుకుని మరీ చెప్తే వింటామండీ.

ఎక్కడైనా ఎప్పుడైనా ఎత్తున కూర్చుని ున్నప్పుడు కాళ్ళు ఊపరాదు....
ఇలా చేస్తే దరిద్రదేవతకు ఆహ్వానం అని పెద్దల హెచ్చరిక
ఇప్పుడు... అలా ూపడం వలన నరాలు దెబ్బతినడమో, బలహీనపడడమో ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నట్లు దశాబ్దాలకిందటే చదివాను.

గాయాలపై తులసి పసరు రాస్తే చాదస్తమనేవారు. 
నేడు .... తులసి ఆయింట్మెంట్ చాలా మంచిదంటారు కదా..

ఉదయం పరగడుపున రాగి చెంబులో నీరు త్రాగమన్నారు మనపెద్దలు. అది చాదస్తంగా తలచి మానివేశారు. ఇప్పుడు రాగి పాత్రలో రాత్రంతా నిలవ వున్న నీరు తాగితే మీఆరోగ్యం ఆయుష్షు పెరుగుతాయని డాక్టర్లు చెపుతున్నారు. అందుకని ఇప్పుడుచాలామంది రాగి వాటర్ బాటిల్ లోనీరు తాగుతున్నారు. ఏదైనా శంఖంలో పోస్తేనేగానీ తీర్థంకాదు.

పని మనుషులు అన్నీ ముట్టుకోకూడదు అని పెద్దలు చెప్పారు . ఇప్పుడు అన్నీ ఇతరుల చేత చేయించుకుంటుంన్నందు వలననే శరీరం విశాలంగా పెరిగిపోతోందని తేల్చారు

పైవిషయాలన్నీ ఆచారాలు మనం పాటించాము. పాటిస్తున్నామా??... ఆంగ్లేయ సంస్కృతీ సంప్రదాయానుసారణులు వ్యామోహులు వెక్కిరించారు.
ఇంకా కొంతమంది వీరులు ప్రచారమాధ్యమాలలో వెక్కరింతలూ. పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు . సూర్యోదయం కాకముందే లేవాలి
అనే నియమం ఒకటుంది. మనకు దీనికి కారణం ఏమంటే పగలు రాత్రి అనేక తిండిపదార్థాలు తింటాము రాత్రిపడుకునే ముందు చెంబెడు నీరు త్రాగిపడుకోమన్నారు మనం నిద్రించిన తరువాత జఠరం బాగా పనిచేసి వ్యర్థాలను బయటకు నెడుతుంది. మలముమూత్రముల ద్వారా కొంత చెమట ద్వారా కొన్ని వ్యర్థాలు మరియు ఇంకా కొంత మలినము ఫాలభాగాన పేరుకుంటుంది. ఇది సూర్యోదయమైతే మరలలోపలి కెళ్ళిపోతుంది. అందుచే బద్ధకం తలనొప్పి మొదలగునవి ఏర్పడుతాయి కావున సూర్యోదయాత్పూర్వమే కాలకృత్యాలు తీర్చుకొని ముఖప్రక్షాళనంచేసుకుంటే ఆ రోజల్లా ఉత్సాహంగా ఉంటుందారోగ్యం. అందుకే సూర్యోదయానికిముందులేవమన్నది .కాని  వింటున్నారా మనవాళ్ళు?
బయట ఆహారం తినద్దు..
పొద్దున్నే లేవండి..
నీళ్ళు చక్కగా తాగండి...
ఉతికిన వస్త్రాలనే ధరించండి...
చాతీ, పొట్ట భాగాలను నొక్కి వుంచే బట్టలను వేసుకొనివ్వకండి...పిల్లలని, మగవాళ్ళని,
6 కల్లా శరీర మలినాలు విసర్జించే వ్యవస్థ ని అలవాటు చేసుకోండి. 
వెంటనే స్నానం చేయండి.
జుట్టుని ఎక్కువ సేపు దువ్వండి...
ఇంట్లో వెంట్రుకలు లేకుండ... తల్లో పేలు లేకుండా చూసుకోండి...
వీలైనంత...మౌనం గా వుండటానికి ప్రయత్నం చేయండి... 
కొద్ది ఆచారాలు పాటించండి. శరీరానికి పని చెప్పండి... పాత అలవాట్లు మళ్ళీ జీవితం లోకి తెచ్చుకుందాం.. లేదంటే... ఇంకో పదేళ్ళకి మన పిల్లల పిల్లలు మనకి మా టీచర్ ఇలా చెప్పింది అని... మన అలవాట్లనే కొత్తగా పరిచయం చేసే సమయం వస్తుంది. జాగ్రత్త.  Think scientifically, follow scientifically.

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: