Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*చిన్న సందేశాత్మక కధ.* ???????
#1
*చిన్న సందేశాత్మక కధ.*
???????

ఇది ఒక మధ్య తరగతి కుటుంబములో జరిగిన కథ.

    ?ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అతని తండ్రి ఆతనిని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్  ఆఫ్ చేసి వేళ్ళు , T .V .స్విచ్ ఆఫ్ చేసి వేళ్ళు, టేబుల్,ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తు ఉండేవాడు .ఆ మాటలు ఆ కొడుకుకి నచ్చేవి కావు.ఇంట్లో ఉండటానికి ఇష్టం ఉండేది కాదు.

   ? నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేక పోయిన వినేవాడు కానీ ఈ రోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది . ఉద్యోగం రాగానే వేరే చోటుకి వెళ్లిపోవాలి అని మనసులో అనుకున్నాడు.

  ?ఇంటర్వ్యూకి బయలుదేరాడు తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న  కొడుకుకి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి  దైర్యంగా సమాధానం చెప్పు ఒక వేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలని కూడా నువ్వు ధైర్యంగా ఎదురుకో అని చెప్పి ఖర్చులకు కొంచం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపాడు.

   ?ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్ళాడు. అంత పెద్ద బిల్డింగ్ కి సెక్యూరిటీ లేదు.గేట్ యొక్క గడి కొంచం వెళ్తున్న వాళ్ళ చేతికి తగిలేటట్లు ఉంది దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు .లోపల గేట్ కి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి .ఆ మొక్కలకు నీళ్లు పట్టి టూబ్ ని నడిచే దోవలో పడేసి ఆ తోట వాడు మోటార్ ఆఫ్ చేయటానికి వెళిపోయాడు .ఆ టూబ్ ని చేతిలోకి తీసుకోని ఒక మొక్క యొక్క మొదళ్ళ మీద నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు.

  ?రిసెప్షన్ లో ఎవ్వరు లేరు. ఇంటర్వ్యూ కి 1 ST ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టి ఉంది .మెల్లగా మెట్లు ఎక్కాడు దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎవ్వరు ఆఫ్ చేయకుండా ఉన్నాయి .లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా సడన్ గా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్లి లైట్స్ స్విచ్లను ఆఫ్ చేసి పైకి వెళిపోయాడు.

 ?1ST ఫ్లోర్ లో ఒక పెద్ద హాలు లో చాలా మంది కూర్చొని ఉన్నారు. అంత మందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగు వేసాడు, అక్కడ ఫ్లోరుపై ఉన్న MAT పై WELCOME తల క్రిందులుగా ఉంది దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు.ఆ హాల్ లో ముందు వరుసలో  చాలా మంది కూర్చొని ఉన్నారు ,వెనుక వరుస కాళిగా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది . గది లో ఎవ్వరు లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూ కి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు.

  ?ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలోనుండి బయటకి పంపిస్తున్నారు ,దానివల్ల లోపల ఎటువంటి ప్రెశ్నలు అడుగుతున్నారో అనే విషయం తెలుసుకోలేక పోయాడు.లోపల ఏమి ప్రశ్నలు అడుగుతారో అనే భయంతోనే లోపలికి వెళ్లి నిలబడ్డాడు.అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి తెరచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరతారు అని ఆ అధికారి అతన్ని అడిగాడు .ఇది కూడా ఒక ప్రశ్న లేక ఉద్యోగం లో చేరతారా అని అడిగారో అర్ధం కాకుండా ఆలోచిస్తూ నిలబడాడ్డు .

?అధికారి ఏంటి ఆలోచిస్తున్నావు ఇక్కడ మేము ఎవ్వరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు వచ్చే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో , ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడా కెమెరాలు పెట్టాము .ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ ని కానీ, టూబ్ లైట్స్ ని కానీ, ఫ్యాన్ ని కానీ ఆఫ్ చేయలేదు కానీ మీరు ఒకరే అనింటిని సరిచేస్తూ లోపలికి వచ్చారు.మేము మిమల్ని ఉద్యోగం లోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు.
  
 ?నాన్న చెప్పే మాటలు అన్ని నాకు విసుకు తెప్పించేవి,కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయి అని సంతోష పడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది . ఉద్యోగం లో చేరేటప్పుడు నాన్న ని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనస్సులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు 
 
 ?తండ్రి మన కోసం ఎం చెప్పినా ,ఎం చేసినా మన భవిష్యత్తు కి మంచి జరగాలనే చేస్తాడు.

  ?ఉలి దెబ్బలకి శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు . ఆ బాధని తట్టుకున్నపుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది .

 ?తండ్రి మనలో ఉన్న చెడుని ఉలి పెట్టి కొట్టినట్లు పోగొడతాడు.తల్లి బిడ్డని పాలిచ్చి,లాలించి,కథ చెప్పి పడుకోపెట్టి పెంచుతుంది ,కానీ తండ్రి అలా కాదు తాను చూడని లోకాన్నితన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చోపెట్టి లోకాన్నిచూపిస్తాడు.

?తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర!
?తల్లి కష్టపడేదాన్నికనిపెట్టచ్చు కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెప్తే కానీ కనిపెట్టలేరు.
?మనకి తండ్రి 5 సంIIల వరకు గురువు లాగా 25 సంIIలకు శత్రువు లాగా కనిపించే తండ్రి గురించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుస్తుంది .
?తల్లి వృధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లోనో ఉండి తన జీవితాన్ని గడుపుతుంది . ?తండ్రి అలా ఉండలేడు చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు .
?*అందువల్ల తల్లితండ్రుల్ని ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోకుండా ప్రాణంతో లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు....*

గమనిక:- చనిపోయినతరువాత గొప్పలు చూపించుకోవటానికి పంచభక్ష్యాలతో   వేలమందికి ఆర్భాటంగా భోజనాలుపెట్టే సంతానం ఆలోచించండి. బ్రతికుండగా తల్లితండ్రులకు కడుపునిండా ప్రేమగా నాలుగు ముద్దలు పెట్టండి సంతోషంగా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించండి ?

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: