Posts: 355
Threads: 43
Likes Received: 1,994 in 293 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
ఏవో ఆలోచనలు, ఏవో భావనలు, ఊరికే రూపం ఇస్తున్నాను.
ఇది కథ అయితే కాదు, లోపలి ఆలోచనల, భావోద్వేగాల కలబోత.
బాగుంటే ఆస్వాదించండి. అనుభవమే ఉండుంటే అప్పటి అనుభూతిని గుర్తుతెచ్చుకోండి.
Posts: 355
Threads: 43
Likes Received: 1,994 in 293 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
03-06-2023, 07:23 AM
(This post was last modified: 03-06-2023, 07:47 AM by earthman. Edited 2 times in total. Edited 2 times in total.)
నువ్వెవరో తెలీదు, ఎక్కడున్నావో తెలీదు, ఎప్పుడొస్తావో తెలీదు, వచ్చాక నా ఇంట్లో దీపం వెలిగిస్తావని, నా జీవితంలోకి ఆనందం తీసుకొస్తావని మాత్రం నమ్ముతున్నాను. ఆ నమ్మకమే పునాదిగా నీ కోసం చూస్తున్నాను.
తెలీదు ఇలా నీ కోసం వెతకాలని, ఇలాంటి ఆనందం పొందాలని. జీవితం గమనం తప్పడంతో, మార్గం మారడంతో నువ్వు కావాలనే విషయం మర్చిపోయాను. అందరూ వెతుకుతుంటే, వాళ్ల గురించి ఏమనుకున్నానో మరి, నేను కూడా వెతకాలని, ఎదురుచూడాలని మాత్రం అనుకున్నట్టు గుర్తులేదు.
ఇప్పటికి నాకా అవకాశం వచ్చింది. నాకు నేనే ఆ అవకాశం ఇచ్చుకున్నాను.
ఆలస్యమైంది నిజమే, కానీ జీవితం ముగిసిపోలేదు కదా. నేను ఒడిసిపట్టుకోగలిగిన నీటిచుక్కలే నాకు దక్కేది అనుకుంటాను. కొందరికి వాన దక్కుండచ్చు, కొందరి కుండలు నిండుడచ్చు, నాకు కూడా అలానే జరిగేది, పర్లేదు, ఈ చుక్కలన్నా ఉన్నాయి, నాకు బానే ఉంది.
గతం అనవసరం, మన భవిష్యత్తే నాకు ముఖ్యం, నీతో పంచుకునేవే ముఖ్యం, ఇలా అన్నీ పంచుకోగలిగితే నా జన్మ ధన్యమైనట్టే, నా జీవితం సార్థకమైనట్టే, జరుగుతుందనే నా నమ్మకం.
నమ్మకాల పట్ల పెద్దగా నమ్మకం లేని మనిషిని నేను, నిజానికి దగ్గరగా బతుకుతూ చేదుగా ఉన్నా స్వచ్ఛత ఉందని ఆ చేదుని అమృతంగా స్వీకరిస్తూ గడుపుతున్నవాడిని నేను.
కానీ నీ విషయంలో నమ్మకమే పునాదిగా అడుగు ముందుకు వేస్తున్నాను, నిన్ను నమ్ముతున్నందుకు నన్ను మోసం చెయ్యవు కదా.
ఇప్పటిదాకా ఎన్నయినా జరగనీ, అవి నాకొద్దు. మన కలిసాక మాత్రం నువ్వు గతాన్ని తవ్వద్దు, నాకా బాధ కలిగించద్దు. నేను చెయ్యను, నువ్వు కూడా చెయ్యద్దు.
వెలవెలబోతున్న జీవితాన్ని తిరిగి రంగుల్లో నింపుతావని, మిణుకుమిణుకుమంటున్న దీపాన్ని నిండుగా వెలిగిస్తావని, అర్థం కోల్పోయిన జీవితానికి పరమార్థం నువ్వే అని తెలియజేస్తావని, స్వరాలు మరచిన కోయిల చేత మళ్ళీ రాగాలు పలికిస్తావని, నా హార్డ్ డిస్క్ నిండుగా నువ్వే నిండిపోతావని, ఇలా ఎన్నో, ఎన్నెన్నో కలలు, కథలు, అన్నీ నీ గురించే, అన్నీ నీ కోసమే.
నేననుకున్నట్టుగానే ఉంటావని, నా నిర్ణయం తప్పలేదు అని నేననుకునేలా చేస్తావని, నువ్వు పైకి ఎలా ఉన్నావో, లోపల కూడా అలానే ఉంటావని, నా ఊహ, నా ఆలోచన, నా నమ్మకం వమ్ము కావని అనుకుంటున్నాను, నిజమే కదా.
నీకు ఎండ తగలనివ్వనని చెప్పను, నీకు నీడనిస్తానని మాత్రం చెప్పగలను. నిన్ను పూల మీద నడిపిస్తానని చెప్పను, నీ మనసుకి ముల్లు గుచ్చనని మాత్రం చెప్పగలను. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పను, నీ కళ్ళలోంచి నీరు రప్పించనని మాత్రం చెప్పగలను.
నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ హోటల్ డిన్నర్ రెడీ అని చెప్పను, తినడానికి ఒక బిస్కెట్ ఉన్నా, సగం కన్నా ఎక్కువ నీకు పెడతానని మాత్రం చెప్పగలను. వేలు ఖర్చు పెట్టి క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం అని చెప్పను, వెన్నెల్లో కూర్చుని మరమరాలు తిందాం అని మాత్రం చెప్పగలను. ప్రతి మూడేళ్ళకి కార్ మారుస్తాను అని చెప్పను, నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నీ పక్కన నేనుంటానని చెప్పగలను. అబ్బో నాకు ఎన్నిస్తున్నాడో అని నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పేలా చేస్తానని చెప్పను, ఏదిచ్చినా అందులో దాపరికం ఉండదని, ఇచ్చేది ఏదైనా అది మనసుతో, ప్రేమతో ఇస్తాడు అని నువ్వు అనుకునేలా చెయ్యగలను అని చెప్పగలను.
ఇతన్ని చేసుకున్నందుకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అని నువ్వు అనుకునేలా చేస్తాను అని చెప్పను, ఇతన్ని ఎంచుకుని తప్పు చెయ్యలేదు అని అనిపించేలా ఉంటానని మాత్రం చెప్పగలను.
అన్నిటికీ మించి, నువ్వు వచ్చాక, స్వర్వలోక సుందరీమణులే ఎదురుగా ఉండనీ, వాళ్లని కన్నెత్తి కూడా చూడనని చెప్పగలను. ఈ జన్మకి నువ్వే, ఇది నిజం.
నువ్విచ్చేవి నువ్విస్తావు, నేనిచ్చేవి నేనిస్తాను, అలా నీకు ఇవ్వడానికే నా శక్తి మొత్తం ధారబోస్తాను.
విడిగా కుక్కని కూడా తరమలేని వాడిని, నీ కోసం సప్తసముద్రాలు ఈది వస్తానని చెప్పగలను. చిన్న దెబ్బకే భయపడే నేను, నీ కోసం చివరి రక్తపు బొట్టు కూడా ఇస్తానని చెప్పగలను.
ఒక్కడినే జీవితం కష్టంగా ఉంది, నువ్వుంటే ఇంకా కష్టపడతాను, ఆ కష్టం ఒక్కడినే పడలేను, నాకా శక్తి ఇప్పుడు లేదు, ఆ శక్తి నీతో వస్తుంది, ఆ శక్తి నువ్వే.
పూల మీద నువ్వు నడిచి రావడానికి నేను నిప్పుల మీద నడవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నీకు సరిపోతాను అని నువ్వు అనుకునేలా చేస్తాను. నన్ను చేరితే నీ ఆనందం పెరుగుతుందే కానీ తగ్గదని నీకు అనిపించేలా చేస్తాను.
వయసు కరిగిపోతోంది, జీవితం మనకబారుతోంది, అడుగులు భారమవుతున్నాయి, రా, చెయ్యివ్వు, కలిసి నడుద్దాం, మన నందనవనం చేరుకుందాం.
ఎక్కడున్నా తొందరగా రా, కొన్ని రోజుల ఎదురుచూపుకే నాకు యుగాలలా ఉంది, కాలం ఇంకా ముందుకు వెళ్తుంటే భారం ఇంకా పెరుగుతుంది, అందుకే తొందరగా వచ్చెయ్.
Waiting for you, with all my heart.
Posts: 1,689
Threads: 4
Likes Received: 2,402 in 1,208 posts
Likes Given: 3,225
Joined: Nov 2018
Reputation:
48
మీలోని ఇంకో కోణం బావుంది earthman గారు.
కొన్ని కొన్ని వాక్యాలైతే కంట నీరు తెప్పించి, గుండె గొంతుకలో కొట్టుకునేటట్లున్నాయి. మీ ఇష్టాన్ని చెప్తూ, మీరేమివ్వగలరో బేషజం లేకుండా ఒప్పుకుంటూ మీరు రాసిన అప్లికేషన్ చాలా బావుంది మనసుకు హత్తుకునేలా.
వొకటే అనుమానం ఈ కాలం లో ఇటువంటి సున్నితభావాలు పనిచేస్తాయంటారా?
ఏమో 'వెతుకుడీ దొరకబడును, అడుగుడీ ఇవ్వబడునూ' అన్నట్లు వెతికితే తప్పకుండా దొరకుతారు, అప్పటి వరకు వేచుండడమే...ఆల్ ద బెస్ట్
: :ఉదయ్
•
Posts: 3
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 2
Joined: May 2023
Reputation:
0
ee atram peeliki mundu vuntundi kani pelli tarvata vundadani naa abhiprayam.
•
Posts: 82
Threads: 2
Likes Received: 223 in 65 posts
Likes Given: 38
Joined: Jun 2021
Reputation:
7
03-06-2023, 03:54 PM
(This post was last modified: 03-06-2023, 03:56 PM by ANUMAY1206. Edited 1 time in total. Edited 1 time in total.)
హాయ్ బ్రదర్..... మీరు చాలా కథలు రాస్తున్నారు
బాగుంది....
కానీ
అది ఒక అప్డేట్ లో అయిపోతుందా లేక రేండు మూడు
అప్డేట్ లో అయిపోతాయా అన్నది మీ ఇష్టం.....
చాలా పెద్ద కథ రాస్తే చాలా సంతోషం.....
చిన్న కథలు రాసిన ఓకే గాని....
ఒక అప్డేట్ లో అయిపోయే కథలు ఉంటే ....
Earthman కథలు అని ఒక thread ఓపెన్ చేసి అందులో సింగల్ అప్డేట్ కథలు అందులో రాస్తే బాగుంటది....
మీరు రాసే ఒక అప్డేట్ కథ కీ సపరేట్ గా ఒక thread ఓపెన్ చేయడం వాళ్ళ సైట్ భారమే గాని ఎలాంటి ఉపయోగం ఎం లేదు......
అలాగే మీరు చాలా కథలు కంప్లీట్ కూడ చేయలేదు అవ్వి కూడ కంప్లీట్ చేయాలనీ కోరుకుంటున్నాను
ఇక్కడ నేను ఎదో కథ రాసే రచయితలకు
అందరికి నీతులు చెప్పడానికి రాలేదు అది నాకు కూడ తెలుసు....
అందరం కొంత బాధ్యతగా నడుచుకుంటే
సైట్కీ కొంచం భారం తగ్గించానవాళ్ళం అవుతాం అని అంతే గాని.....
ఎవరిని ఉద్దేశించి కాదు....
ఆల్రెడీ కొన్ని కారణాల వాళ్ళ ఒక గొప్ప
సైట్ ని పోగుట్టుకున్నాం....
ఇప్పటికి ఇది ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా
నడుస్తుంది అంటే కారణం "" Sarit "'' గారు మరి కొంత మంది....
ఆ మరి కొత్త మంది ఎవరో కూడ తెలియదు...
Sarit గారు ఒక్కరే తెలుసు....
మిగతా వారు క్షమించాలి.....
కథ రాయడం ఎంత కష్టమో నాకు తెలుసు ఎందుకంటే
నేను కూడ ఒక కథ రాద్దాం అని స్టార్ట్ చేసి ఒక మూడు అప్డేట్స్ ఇచ్చాను అంతే...
అది నా సొంత కథ కాదు అని చెప్పను ఆ కథ ఎక్కడో మిస్ అయింది చాలా సార్లు వెతికాను కానీ ఉపయోగం లేదు...
అందుకే ఆ కథ కంప్లీట్ చేయలేకపోయాను... క్షమించండి....
ఆమని గారి విరాభిమాని .... ......
Posts: 42
Threads: 0
Likes Received: 24 in 20 posts
Likes Given: 5
Joined: Dec 2018
Reputation:
0
ఈ సైట్ లో అడ్వర్టైజ్మెంట్ లు ఎక్కువయ్యాయి
•
Posts: 12,397
Threads: 0
Likes Received: 6,826 in 5,185 posts
Likes Given: 70,335
Joined: Feb 2022
Reputation:
87
•
Posts: 355
Threads: 43
Likes Received: 1,994 in 293 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
(03-06-2023, 01:58 PM)Foreplayerr Wrote: ee atram peeliki mundu vuntundi kani pelli tarvata vundadani naa abhiprayam.
ఇది ఆత్రం కాదు foreplay player, ఇది వేరే, ఏ మూడ్లో ఉండి చదివావో, you missed it.
•
Posts: 355
Threads: 43
Likes Received: 1,994 in 293 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
(03-06-2023, 12:54 PM)Uday Wrote: మీలోని ఇంకో కోణం బావుంది earthman గారు.
కొన్ని కొన్ని వాక్యాలైతే కంట నీరు తెప్పించి, గుండె గొంతుకలో కొట్టుకునేటట్లున్నాయి. మీ ఇష్టాన్ని చెప్తూ, మీరేమివ్వగలరో బేషజం లేకుండా ఒప్పుకుంటూ మీరు రాసిన అప్లికేషన్ చాలా బావుంది మనసుకు హత్తుకునేలా.
వొకటే అనుమానం ఈ కాలం లో ఇటువంటి సున్నితభావాలు పనిచేస్తాయంటారా?
ఏమో 'వెతుకుడీ దొరకబడును, అడుగుడీ ఇవ్వబడునూ' అన్నట్లు వెతికితే తప్పకుండా దొరకుతారు, అప్పటి వరకు వేచుండడమే...ఆల్ ద బెస్ట్
చక్కగా రిప్లైస్ ఇస్తావు నువ్వు. Thank you.
కాలానికి, సున్నిత భావాలకి సంబంధం ఏమిటి. ఆదిమానవుడికి కూడా ఫీలింగ్స్ ఉండేవి, రోబోట్స్ మధ్య కూడా మనకి ఫీలింగ్స్ ఉండబోతున్నాయి. These are what differ us from machines.
•
Posts: 355
Threads: 43
Likes Received: 1,994 in 293 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
04-06-2023, 12:04 PM
(This post was last modified: 04-06-2023, 12:31 PM by earthman. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-06-2023, 03:54 PM)ANUMAY1206 Wrote: హాయ్ బ్రదర్..... మీరు చాలా కథలు రాస్తున్నారు
బాగుంది....
కానీ
అది ఒక అప్డేట్ లో అయిపోతుందా లేక రేండు మూడు
అప్డేట్ లో అయిపోతాయా అన్నది మీ ఇష్టం.....
చాలా పెద్ద కథ రాస్తే చాలా సంతోషం.....
చిన్న కథలు రాసిన ఓకే గాని....
ఒక అప్డేట్ లో అయిపోయే కథలు ఉంటే ....
Earthman కథలు అని ఒక thread ఓపెన్ చేసి అందులో సింగల్ అప్డేట్ కథలు అందులో రాస్తే బాగుంటది....
మీరు రాసే ఒక అప్డేట్ కథ కీ సపరేట్ గా ఒక thread ఓపెన్ చేయడం వాళ్ళ సైట్ భారమే గాని ఎలాంటి ఉపయోగం ఎం లేదు......
అలాగే మీరు చాలా కథలు కంప్లీట్ కూడ చేయలేదు అవ్వి కూడ కంప్లీట్ చేయాలనీ కోరుకుంటున్నాను
ఇక్కడ నేను ఎదో కథ రాసే రచయితలకు
అందరికి నీతులు చెప్పడానికి రాలేదు అది నాకు కూడ తెలుసు....
అందరం కొంత బాధ్యతగా నడుచుకుంటే
సైట్కీ కొంచం భారం తగ్గించానవాళ్ళం అవుతాం అని అంతే గాని.....
ఎవరిని ఉద్దేశించి కాదు....
ఆల్రెడీ కొన్ని కారణాల వాళ్ళ ఒక గొప్ప
సైట్ ని పోగుట్టుకున్నాం....
ఇప్పటికి ఇది ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా
నడుస్తుంది అంటే కారణం "" Sarit "'' గారు మరి కొంత మంది....
ఆ మరి కొత్త మంది ఎవరో కూడ తెలియదు...
Sarit గారు ఒక్కరే తెలుసు....
మిగతా వారు క్షమించాలి.....
కథ రాయడం ఎంత కష్టమో నాకు తెలుసు ఎందుకంటే
నేను కూడ ఒక కథ రాద్దాం అని స్టార్ట్ చేసి ఒక మూడు అప్డేట్స్ ఇచ్చాను అంతే...
అది నా సొంత కథ కాదు అని చెప్పను ఆ కథ ఎక్కడో మిస్ అయింది చాలా సార్లు వెతికాను కానీ ఉపయోగం లేదు...
అందుకే ఆ కథ కంప్లీట్ చేయలేకపోయాను... క్షమించండి....
ఒక భాగంలో అయ్యేది నేను అక్కడే చెప్పేస్తాను. ఒకటి కన్నా ఎక్కువ రాద్దాం అనుకున్నవాటికి చెప్పను. ఒక్కోసారి రెండు, మూడు భాగాలు అనుకున్నది ఎక్కువ భాగాలు అవుతూ ఉంటుంది. నా కథలు ఒక్కోసారి నేను అనుకున్నట్టు రావు, వాటి రూపం అవి తీసుకుంటాయి.
నాకు తెలిసినంత వరకూ ఒకటే భాగం కథలు విడిగా ఉన్నా, ఒకే థ్రెడ్ అయినా, ఒకే లాగా స్టోర్ అవుతాయి, పైగా ఇది ప్లెయిన్ టెక్స్ట్, ఎక్కువ స్పేస్ అక్కరలేదు.
ఇక ఎందుకు ఒక కథని ఆపి, ఇంకోటి మొదలుపెడాతను అంటే, ఒక ఆలోచనో, ఊపో వస్తుంది నాకు. లోపల నించీ వచ్చే ఆ అక్షర ప్రవాహం రాసేలా చేస్తుంది. నువ్వు గమనించావో లేదో, ఇలా రాయడం వల్లే నేను కొత్త కథలు రాసాను, ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు. I write many different stories.
Posts: 1,689
Threads: 4
Likes Received: 2,402 in 1,208 posts
Likes Given: 3,225
Joined: Nov 2018
Reputation:
48
(04-06-2023, 12:04 PM)earthman Wrote: ఒక భాగంలో అయ్యేది నేను అక్కడే చెప్పేస్తాను. ఒకటి కన్నా ఎక్కువ రాద్దాం అనుకున్నవాటికి చెప్పను. ఒక్కోసారి రెండు, మూడు భాగాలు అనుకున్నది ఎక్కువ భాగాలు అవుతూ ఉంటుంది. నా కథలు ఒక్కోసారి నేను అనుకున్నట్టు రావు, వాటి రూపం అవి తీసుకుంటాయి.
నాకు తెలిసినంత వరకూ ఒకటే భాగం కథలు విడిగా ఉన్నా, ఒకే థ్రెడ్ అయినా, ఒకే లాగా స్టోర్ అవుతాయి, పైగా ఇది ప్లెయిన్ టెక్స్ట్, ఎక్కువ స్పేస్ అక్కరలేదు.
ఇక ఎందుకు ఒక కథని ఆపి, ఇంకోటి మొదలుపెడాతను అంటే, ఒక ఆలోచనో, ఊపో వస్తుంది నాకు. లోపల నించీ వచ్చే ఆ అక్షర ప్రవాహం రాసేలా చేస్తుంది. నువ్వు గమనించావో లేదో, ఇలా రాయడం వల్లే నేను కొత్త కథలు రాసాను, ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు. I write many different stories.
ఇది కరక్టే, ముందు రాస్తున్నది పూర్తిచేసి ఇంకోటి మొదలెడదాం అనుకుంటే రాస్తున్నదీ పూర్తి కాదు, అనుకున్నది మొదలవదు. అందుకే ఎప్పుడేం వస్తే తోస్తే రాసేయడమే.
: :ఉదయ్
•
Posts: 7,055
Threads: 1
Likes Received: 4,612 in 3,595 posts
Likes Given: 45,119
Joined: Nov 2018
Reputation:
78
•
|