29-04-2023, 01:52 PM
EXECELLENT UPDATE
Thriller పున్నమి 3
|
29-04-2023, 02:18 PM
29-04-2023, 02:18 PM
30-04-2023, 05:40 AM
30-04-2023, 05:40 AM
30-04-2023, 05:40 AM
01-05-2023, 10:20 AM
కథని సస్పెన్స్ తో చాల అద్భుతంగా రాస్తున్నారు,
Excellent writing skills Thanks bro
01-05-2023, 03:18 PM
04-05-2023, 06:00 AM
రోహిణి Fayes నీ బయటకు వదలడం చూసిన ఆదిత్య, రజిత ఇద్దరు షాక్ లో ఉన్నారు.
(అదే సమయంలో జపాన్ లో) జపాన్ లోని టోక్యో లో దిగిన తర్వాత రోహిణి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తూ ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకు ఒక గొంతు వినిపించింది "టాక్సీ తీసుకోని సైబర్ సెల్స్ హోటల్ కీ వెళ్లు" అని చెప్పింది, దాంతో రోహిణి ఆ గొంతు చెప్పిన అడ్రస్ కీ వెళ్లింది అక్కడికి వెళ్లి చూస్తే అది ఒక రోబో రెస్టారెంట్ లోపల అన్ని రోబో లు ఉన్నాయి వాటిని చూస్తే చాలా గమ్మత్తు గా అనిపించింది రోహిణి కీ అక్కడ ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుని ఉంది, అప్పుడు ఒక రోబో వెయిటర్ రోహిణి దగ్గరికి వచ్చి ఒక డ్రింక్ ఇచ్చి పక్కనే tissue మీద ఒక రూమ్ నెంబర్ రాసి ఉంది, దాని చూసిన రోహిణి ఆ రూమ్ దగ్గరికి వెళ్లింది అక్కడ ఇద్దరు బాడి గార్డ్స్ నిలబడి ఉన్నారు వాళ్ళని చూసిన రోహిణి కొద్దిగా భయం తో వెళ్లి లోపలికి వెళ్లాలి అని చెప్పేలోపు, అక్కడికి లోపలి నుంచి ఒక బౌద్ధ సాధువు బయటికి వచ్చి రోహిణి నీ లోపలికి రమ్మని సైగ చేశాడు, దాంతో రోహిణి లోపలికి వెళ్లి తన మోకాలి పైన నిలబడి ఆ బౌద్ధ సాధువు కీ నమస్కారం చేసింది అతను అది ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు, ఆ రూమ్ లో ధ్యానం చేస్తూ ఉన్న ఒక ఆరు సంవత్సరాల చిన్న కుర్రాడు, రోహిణి తప్ప ఇంక ఎవరూ లేరు అప్పుడు రోహిణి కూడా ఆ పిల్లాడి లాగా ధ్యానం చెయ్యాలి అనుకోని కూర్చుని కళ్లు మూసుకుంది అంతే ఆ మరుక్షణం తనకు "రోహిణి" అని పిలుపు వినిపించింది, దాంతో రోహిణి కళ్లు తెరిచి చూడ్డానికి ప్రయత్నం చేసింది కానీ తను కళ్లు తెరవలేక పోయింది, అప్పుడు తన ధ్యానం లో తనకు ఆ రూమ్ లో ఉన్న పిల్లాడు కనిపించాడు "ఇది కల ప్రపంచం నువ్వు ఇక్కడ నీ మెదడు నీ తప్ప వేరే దేని వాడలేవు నీకు నేను చెప్పింది మాత్రమే తెలుస్తుంది" అని ఆ పిల్లాడు చెప్పాడు. ఇంతలో రోహిణి కీ మూడు దారులు కనిపించాయి ఒకదాని చివర తన చిన్నతనం లోని జ్ఞాపకాలు ఉన్నాయి, ఇంకో దారి చివర తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి మూడో దాని చివర ఏదో ప్రళయం వచ్చినట్టు తెలుస్తోంది, దాంతో రోహిణి తన చిన్నప్పటి జ్ఞాపకాల వైపు నడిచింది కానీ తను అడుగు ముందుకు వేసిన మరుక్షణం తన దారి మారి తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. (1856 ఇండియా) తమ పెళ్లి తరువాత సంజన, ఆది ఇద్దరు మొదటి రాత్రి కోసం గదిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు అప్పుడు ఆది సంజన మీద చెయ్యి వేయబోతే, అతని చేతిని విసిరి కొట్టింది సంజన దాంతో ఏమీ జరిగిందో అర్థం కాక చూస్తూ ఉన్నాడు ఆది తరువాత సంజన వైపు చూస్తూ "ఏమీ జరిగింది సంజు" అని అడిగాడు ఆది, దానికి సంజన "ఏమీ జరిగింది ఏంటి ఇన్ని రోజులు ఆ నవాబు కోటలో వంటోడిగా బాగానే ఉన్నావు ఇప్పుడు ఏమో తుపాకీ పట్టుకొని ఆ తెల్లోల కాడా పనిలోకి దిగావు నీకు ఏమైన అయితే చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టుకున్న దాని నేను అన్యాయం అయిపోనా" అని దిగులుగా మొహం పెట్టి అడిగింది సంజన, దాంతో ఆది నవ్వుతూ "పిచ్చి దానా నాకూ ఏమీ కాదే మాకు ఆ తుపాకీ పేల్చడం రాదు అయినా ఆ నవాబు కోటలో పని చేస్తే ఎంత వస్తుందే మహా అయితే ఐదు ఆనాలు, అదే ఈ తెల్లోల కాడా ఇరవై రూపాయలు అది చూసే కదా మీ నాన్న నా దగ్గరికి చెంగు చెంగున వచ్చి నీతో పెళ్లి చేసింది, ఇప్పుడు మనోలలో ఎక్కువ డబ్బులు వచ్చేది మనకేనే వెర్రి దానా ఐదు రూపాయలు ఇంటి ఖర్చు కు పోయిన మిగిలిన డబ్బు దాచి పెట్టి ఈ గుడిసె పీకి నీకు బంగళా కట్టిస్తా" అని చెప్పాడు ఆది, దానికి సంజన ఆది మీసం తిప్పి అతని గుండెల పైన వాలి "నాకూ నీ కౌగిలిలోనే బంగళా బావ నువ్వు ఉంటే చాలు ఈ జన్మకు వచ్చే ప్రతి జన్మకు నీకు నాకూ నువ్వు ఎప్పటికీ ఇలాగే కలిసి బ్రతుకుదాం" అని చెప్పింది సంజన, ఆ తర్వాత ఆది ఇన్ని సంవత్సరాలు గడుపుతున్న అతని ఒంటరి జీవితం దృశ్యాలను చూసి తన కోసం అతను పడిన తాపత్రయం మొత్తం చూసి రోహిణి గుండె కరిగి గత జన్మ తాలూకు జ్ఞాపకాలు అన్ని ఒక్కసారిగా తన మెదడులో రావడం మొదలు అయ్యాయి, దాంతో గత జన్మలో ఆది నీ తను ఎంత ఇష్టపడింది వాళ్ల ప్రేమ మొత్తం గుర్తుకు రావడం తో రోహిణి కళ్ల నుంచి నీరు కారింది. ఆ తర్వాత ఆ పిల్లాడు రోహిణి తో "నీ భావోద్వేగాలు నీ అదుపు చేసుకో నువ్వు ఇంకా చూడాల్సింది చాలా ఉంది" అని చెప్పి రోహిణి నీ ఇంకో జ్ఞాపకాల వైపు పంపాడు, దాంతో రోహిణి తిరిగి తన చిన్నతనం నాటి జ్ఞాపకాల వైపు వెళ్లింది అక్కడ రోహిణి తన తల్లితో పాటు బెడ్ మీద ఉంది ఇంట్లో అందరూ పడుకోని ఉన్నారు, అప్పుడు ఒక విచిత్రమైన గొంతు రోహిణి నీ తన వైపు పిలుస్తూ ఉంది అప్పుడు వాళ్ల ఇంటి స్టోర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక బీరువా నుంచి చప్పుడు రావడం మొదలు అయ్యింది ఆ చప్పుడు కీ భయపడిన రోహిణి గట్టిగా అరిచింది, దాంతో ఆ చిన్న రోహిణి కీ బదులు పెద్ద రోహిణి ఆ రూమ్ లోకి షిఫ్ట్ అయ్యింది పెద్ద రోహిణి ఆ రూమ్ లోకి రాగానే ఆ బీరువా నుంచి చప్పుడు తీవ్రంగా రావడం మొదలు అయ్యింది, దాంతో రోహిణి కీ వెన్నులో వణుకు పుట్టింది ఆ బీరువా తలుపు లో నుంచి కొన్ని చేతులు బయటకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాయ్, దాంతో రోహిణి భయం తో బయటికి పరుగులు తీయాలని చూసింది కానీ అలా జరగలేదు ఆ రూమ్ తలుపు కు అడ్డంగా ఆ బీరువా వచ్చి ఉంది, దాంతో రోహిణి కీ అర్థం అయ్యింది ఆ తలుపు తెరుచుకోవాలి అంటే ఈ తలుపు నీ తెరవాలి అని, దాంతో లేని ధైర్యం కూడ గట్టుకుని వెళ్లి ఆ బీరువా నీ తెరిచింది అప్పుడు ఆ బీరువా వెనుక అలల కోలాహలం ఆ సముద్రపు ఒడ్డున ఒక పెళ్లి పందిరి, అందులో ఆదిత్య కూర్చుని ఉంటే గులాబీ రేకులు పరిచిన దారి లో తను నడుస్తూ రావడం ఇది చూసి రోహిణి కీ మొహం మీద చిరునవ్వు వచ్చింది. కానీ అంతలోనే రోహిణి నీ మూడో దారిలోకి పంపించాడూ ఆ కుర్రాడు అప్పుడు అక్కడ రోహిణి చూస్తే చుట్టూ vampire's అన్ని మనుషుల పైన పైశాచికంగా మీద పడి వాళ్లనూ కొరికి వాళ్ల రక్తం నీ తాగుతున్నాయి, అలా ఉండగా "రోహిణి వద్దు" అని ఒక అరుపు వినిపించింది దాంతో రోహిణి వెనకు తిరిగి చూస్తే అక్కడ తను ఒక కత్తి తో ఆదిత్య గుండెల్లో పొడిచి చంపిన దృశ్యం చూసి షాక్ అయ్యింది రోహిణి వెంటనే తను కళ్లు తెరిచి ఆ దృశ్యాన్ని తలుచుకొని కంగారు పడింది, అప్పుడు ఆ కుర్రాడు కూడా కళ్లు తెరిచి "నువ్వు చూసిన ఈ భూత భవిష్యత్ లో నీ విధి ముడి వేసి ఉంది నువ్వు నీ విధి నుంచి తప్పించుకోవడం కష్టం నీకు నేను చెప్పింది అర్థం అయ్యింది అనుకుంటా Princess of Blood keeper" అని అన్నాడు ఆ కుర్రాడు.
04-05-2023, 06:11 AM
Excellent update bro Rohini princess of blood keeper aa except ee cheyaledhu
04-05-2023, 07:24 AM
Ante rohini Sanjana okate,rohini Aditya Ni enduku podichindi,little confusing ga undi
04-05-2023, 07:43 AM
04-05-2023, 07:58 AM
04-05-2023, 07:59 AM
04-05-2023, 08:00 AM
|
« Next Oldest | Next Newest »
|