Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
వేలల్లో చుట్టూ రాజ్యపు ప్రజలు పాలుపంచుకోవడంతో రెండు రోజుల్లోనే కొండ పాదం దగ్గర నుండి ఆనకట్ట నిర్మించే ప్రదేశం వరకూ ఏపుగా పెరిగిన ముళ్ల కంపలు - అడ్డుగా ఉన్న గుండ్రాళ్ళు అన్నీ నిర్మానుష్యం అయిపోయి చక్కటి మైదానాన్ని తలపించేలా మారిపోయింది .
మూడవరోజున అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించి , రాజ్యాల ప్రజలందరి సమక్షంలో బుజ్జాయిలు - చెల్లి - రాణులు - మహారాణీ గారి చేతులతో భూమిపూజ జరిపించి పునాది పనులు మొదలెట్టాము .
చుట్టూ రాజ్యాలు - సామంత రాజ్యాలు ..... తమ వంతు సహకారం మరియు రోజురోజుకూ ప్రజల ఉత్సాహం హుషారు పెరగడంతోపాటు ప్రజల సంఖ్య కూడా పెరుగుతుండటం వారిలో ఐక్యత చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది .

అలా ఆనకట్ట నిర్మాణపు పనులు చకచకా జరిగిపోతున్నాయి రోజులు గడిచిపోసాగాయి , రోజూ చీకటిపడగానే నా దేవకన్య మధుర స్మృతులతో - ఊహాలలో గడుపుతూ ఆనందిస్తూ తనను చేరడం ఆలస్యం చేస్తున్నందుకు బాధపడుతూ మన్నించమని కోరుతున్నాను , బుజ్జాయిలను జోకొడుతూ నిద్రకు ఉపక్రమించడం ....... ఇదంతా నాకు తెలిసే జరుగుతోంది కానీ ఉదయానికి మాత్రం ఒంటిపై వస్త్రాలు ఉండటం లేదు , వొళ్ళు విరుస్తూ లేస్తున్న క్షణం రాత్రంతా ఏదో మధురానుభూతిని పొందినట్లు ఒక పసందైన అనుభూతిని మాత్రం మాటల్లో వర్ణించడం అసాధ్యం , ఆ మధురానుభూతికి గల కారణాన్ని కనుక్కోవాలని ఎన్నో రాత్రులు నిద్ర నటించడానికి ప్రయత్నించాలనుకున్నా సాధ్యం కాలేదు , గుడారంలోకి చేరేంతవరకూ మాత్రమే గుర్తుంటోంది .......

అలా కొన్ని పక్షముల సమయం గడిచిపోయింది - చుట్టు ప్రక్క రాజ్యాల ప్రజలు మరియు వారి ముడిసరుకుల సహాయసహకారాలతో అమ్మవారి ఆశీస్సులతో ఆనకట్ట నిర్మాణం చివరకు చేరుకుంది , ఎలాంటి వర్షం కురిసినా - ఎన్ని నీళ్లు నిలబడినా చెక్కుచెదరకుండా నిలబడగలిగే ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యింది .
అందరిలో అంతులేని ఆనందం వెళ్లువిరిసింది పండగే ...... కానీ రాజ్యప్రజల ఆవసరాలు తీర్చేలా - పంటలు పండేలా వర్షం మాత్రం కురవడం లేదనేది బాధను కలిగిస్తోంది .
వర్షాలు కురవాలని అన్నీ దేవాలయాలలో పూజలు జరిపించాము - హోమాలు చేయిస్తున్నాము - సామూహిక భోజనాలు చేసాము .......

రోజులు గడుస్తున్నాయి - ఆనకట్ట రోజురోజుకూ బలపడుతోందని అనుభవజ్ఞులు సంతోషమైన విషయాన్ని తెలియజేస్తున్నారు కానీ వర్షం మాత్రం కురవడం లేదు , రాజ్యంలోని ధాన్యపు నిల్వలు అయిపోవస్తున్నాయి - ఎన్ని రోజులని చుట్టుప్రక్కల రాజ్యాల సహాయాన్ని ఆశించగలం .
వర్షాల మీదనే - వర్షాల ద్వారా పండే పంటల ద్వారానే సంతోషంగా జరుపుకునే పండుగలు మరియు వివాహాలు ఏనాడో ఆగిపోయాయి , మహారాజా మహారాజా అంటూ నామీదనే ఆసలుపెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు ప్రజలు , వర్షం పడటం తప్ప మరొకటి లేదన్నట్లు బుజ్జాయిలవైపు చెల్లీ మహారాణి వాళ్ళవైపు దీనంగా చూడటం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాని బాధపడని క్షణం లేదు .

అలాంటి విపత్కరమైన పరిస్థితుల నడుమ ఒక తెల్లవారుజామున ఆనకట్ట అమ్మవారి పూజలో ఉన్న మాదగ్గరికి వొళ్ళంతా నగలు ధరించిన వ్యక్తి వచ్చాడు .
అతడిని చూడగానే బుజ్జాయిలు - చెల్లి కళ్ళల్లో కోపం , మహారాణీ - రాణులు కూడా అలానే స్పందిస్తున్నట్లు వాళ్ళను చూస్తుంటేనే అర్థమైపోయింది .
అడవిరాజు గమనించి వాడిమీదకు దూకబోయింది - వారించడంతో ఆగిపోయింది .

అంతలో గజగజవణుకుతూనే కొత్త మహారాజులవారికి వందనాలు - ఎప్పుడో వచ్చి కలవాల్సింది కానీ తమరు ముఖ్యమైన పనిలో ఉన్నారని తెలిసి ఇంతకాలం ఎదురుచూసాను , ఎదురుచూసినందుకు తగిన ఫలితమే లభించిందిలేండి , మీకోసం అందమైన కానుకలు తీసుకొచ్చాను ఇంతవరకూ కనీవినీ ఎరుగని సౌందర్యపు కానుకలు , వెంటనే నాతోపాటు వచ్చి కానుకలు స్వీకరించి మీ మెప్పు పొందనివ్వండి .
కానుకలా ...... ఏమా కానుకలు ? , ఇంతకూ మీరెవరు ? .
చెల్లి - రాణులు : వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నయ్యా - మహారాజా ......
బుజ్జాయిలు : అవునవును నాన్నా ......
మీరెలా అంటే అలా బుజ్జాయిలూ ....... , నా బుజ్జాయిలను - చెల్లిని బాధపెట్టే కానుకలు మాకనవసరం లేదు వెళ్లిపోండి .......
బుజ్జాయిలు : సంతోషంతో నాబుగ్గలపై ముద్దులుపెట్టారు .
వచ్చి చూస్తేనే కదా మహారాజా ..... , ఇంతవరకూ నేను అందించే సౌందర్యమైన కానుకలను కాదన్న రాజు ఈ భువిలోనే లేడు , నేనెప్పుడు వస్తానా కానుకలు అందిస్తానా అని రాజులు సామంతరాజులు నాకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు , మీ వీరత్వం విని వారందరినీ కాదని మీకోసం ఈ భువిపైననే గల అత్యద్భుతమైన అందమైన కానుకలను తీసుకొచ్చాను అంటూ రాజంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు .

కోపం వస్తున్నా అనుచుకుని , బుజ్జాయిలూ ..... అంతటి అద్భుతమైన కానుకలను ఒకసారి చూడాల్సిందే ఒకసారి వెళ్ళిచూస్తే తప్పేముంది .
బుజ్జాయిలు : మీఇష్టం నాన్నగారూ అంటూ కిందకుదిగి బుజ్జిసింహాలను ఎత్తుకుని మహారాణీ చెంతకు చేరారు .
బుజ్జాయిలూ ...... అనుక్షణం నాతోనే ఉన్నారుకదా , రండి వెళ్లి ఆ కానుకలేంటో చూద్దాము .
బుజ్జాయిలు : అక్కడకు మేము రాకూడదు నాన్నగారూ .......
అవును మహారాజా ...... పిల్లలు ఆనందించే కానుకలు కాదు రండి వెళదాము మీ మందిరంలో ఆశగా ఎదురుచూస్తున్నాయి అంటూ పలికాడు .
నా బుజ్జాయిలు ఆనందించని కానుకలను కన్నెత్తైనా చూడను వెళ్లిపో .......
వ్యక్తి : మహారాజా .......

మహారాణి : బుజ్జాయిలూ వెళ్ళండి మీ నాన్నగారి గురించి మీకు తెలుసుకదా - ఈరోజుతో ఈ రాక్షసుడు కూడా అంతం అవుతాడు - ఎంతమంది జీవితాలు నాశనం చేసాడు .
రాణులు : అవునవును ......
బుజ్జాయిలు : అవునుకదా అంటూ మహారాణీ - రాణులను సంతోషంగా హత్తుకునివచ్చి బుజ్జి సింహాలను ఎత్తుకునే నాగుండెలపైకి చేరారు .
ఏమి జరుగుతోందో - కానుకలు ఏమిటో అర్థం కాకపోయినా వాడి వెనుకే నడిచాను.
వ్యక్తి : స్వాగతం మహారాజా ...... సౌందర్యమైన కానుకలు చూడగానే మైమరిచిపోయి ఈరాజ్యాన్నే బహుకరిస్తారు రండి రండి అంటూ ముందుముందుకు వెళుతున్నాడు .
మహారాణి : మహారాజా ...... మరొక మంచిపని చేయబోతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది , మిత్రమా అడవిరాజా ...... మీ అవసరం ఉంటుంది వెళ్ళండి .
అడవిరాజు : మహారాణీ వాళ్ళు జాగ్రత్త అన్నట్లు ఆడ సింహం వైపు సైగలుచేసి మాతోపాటు నడిచింది .
ఆ అందమైన కానుకలు ఏంటో నేనూ చూస్తాను అంటూ ఎగిరుకుంటూ వచ్చి బుజ్జితల్లి భుజంపైకి చేరింది మంజరి ........

వాడి వెనకాలే రాజ్యం మీదుగా రాజ్య భవనం ద్వారం వరకూ మిత్రుడిపై చేరుకున్నాను , దారిలో అందరూ వాడివైపు కోపంగా చూడటమో - అసహ్యించుకోవడమో - భయపడి తమ పిల్లలను గృహాలలోకి తీసుకువెళ్లడం చూసి మరింత ఆసక్తి నెలకొంది .
బుజ్జాయిలను ఎత్తుకునే కిందకుదిగి ఎక్కడ అన్నాను .
వ్యక్తి : ప్రభూ ...... ఆ కానుకలు చూశాక మీరు అగడం ఎందుకని మీ మందిరంలోనే ఉంచాను అన్నీ ఏర్పాట్లూ చేయించాను రండి అంటూ రాజభవనం లోపలికి నేరుగా రాజమందిరం దగ్గరికి తీసుకెళ్లాడు .
అక్కడ దారి వెంబడి ఇష్టం లేకపోయినా తమ కోపాలను - బాధను లోలోపలే దిగమింగుకుని మాపై సుగంధభరితమైన పూలను జల్లుతున్నట్లు చూస్తేనే తెలిసిపోతోంది , వెనుకే అడవిరాజు మౌనంగా వస్తున్నాడు .

రాజమందిరం దగ్గరికి చేరుకోగానే , ప్రభూ ...... లోపల ఉన్నాయి మిమ్మల్ని మైమరిపింపజేసి మిమ్మల్ని మొహంలోకి తీసుకెళ్లే కానుకలు అంటూ ద్వారాన్ని తెరిచి ఆహ్వానించాడు .
ఒక్కసారిగా మల్లెపూల సువాసన గుప్పుమంది - ఆ సువాసనకే కళ్ళు మూతలుపడ్డాయి , అఅహ్హ్ .......
వ్యక్తి : పూల పరిమళానికే ఇలా అయిపోతే ఇక మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్లే కానుకలను చూస్తే ఏమైపోతారో ........
కళ్ళు మూసుకునే లోపలికి అడుగుపెట్టి స్వర్గంలోకా ..... ? అంటూ కళ్ళుతెరిచాను .

ఎదురుగా పదిమందిదాకా అమ్మాయిలు ఒంటిపై నూలుపోగులేకుండా తమ అందాలను ప్రదర్శిస్తూ ఎదురెదురుగా నిలబడి ఉండటం చూసి ఉలిక్కిపడి బుజ్జాయిలూ బుజ్జాయిలూ కళ్ళుమూసుకోండి అంటూ బయటకువచ్చేసాను , ఇలాంటి కానుకలు అని అస్సలు అనుకోలేదు అమ్మా దుర్గమ్మా మన్నించండి మన్నించండి అంటూ కలవరపడుతున్నాను , నన్ను నేను కోప్పడుతున్నాను , నా బుజ్జాయిలు అక్కడే హెచ్చరించారు నేనే అర్థం చేసుకోలేకపోయాను అంటూ మదనపడుతున్నాను .
ఏంటి మహారాజా ...... ఎలా ఉన్నాయి కానుకలు , లోపలి అందాలను చూసి తట్టుకోలేకపోయారు కదూ , నేనైతే చూపు తిప్పుకోలేకపోతున్నాననుకోండి మీకోసం ఈ కన్నెలను బానిసలను ముట్టుకోకుండా తీసుకొచ్చాను , దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తేనూ కొరడాలకు ......
వారిని కొట్టావా ...... ? .
వ్యక్తి : లేకపోతే దారిలోకి రారు ప్రభూ ....... , ఇలా ఎంతమందిని దారిలోకి తీసుకురాలేదు ....... 
ఎంతమందిని ? .
వ్యక్తి : లెక్కించలేనంత మంది ప్రభూ ......
వారిని కూడా కొట్టావా ? .
వ్యక్తి : కొంతమంది కొడితే దారిలోకి వస్తారు మరికొంతమందిని మాత్రం చిత్రహింసలు పెట్టి దారిలోకి తీసుకువస్తాము .
వీరంతా ఎవరు ? .
వ్యక్తి : వేరు వేరు రాజ్యాల యువరాణులు మరియు ఆ రాజ్యంలోని అందగత్తెలు ప్రభూ ...... , వాళ్ళ గృహాలపై దాడిచేసి అడ్డొచ్చినవారి కుటుంబ సభ్యులను చంపైనా ఎత్తుకొస్తాము , దానికోసం ఒక సైన్యమే ఉంది నాదగ్గర ..... అవసరమైతే మీలాంటి రాజులు కూడా సైన్యాన్ని అందిస్తారు , అలా ఎత్తుకొచ్చినవారే ఈ రాజ్యపు రాణులుకూడా ......
బుజ్జాయిలు : పిన్నమ్మలు ముగ్గురూ నాన్నగారూ ...... , వాళ్ళను కొట్టాడు .
వ్యక్తి : అందరిలానే వాళ్ళను కూడానూ .......
అంతమందికి కన్నీళ్లు మిగిల్చావు కొద్దిగైనా తప్పుచేసాను ......
వ్యక్తి : అలాంటిదేదీ మనకు లేదు ప్రభూ ...... , వాళ్ళను హింసించడం కన్నీళ్లను పంచడం ఎంతో ఆనందం అంటూ రాక్షసానందం పొందుతున్నాడు .
అప్పటివరకూ పూలుజల్లిన చెలికత్తెల కళ్ళల్లో కన్నీళ్లు ......

చలించిపోయాను ...... , ఈమాత్రం చాలు మిత్రమా ..... ఇంకెందుకు ఆలస్యం అంటూ బాధ - కోపంతో ఆజ్ఞవేశాను .
ఆమాటకోసమే ఎదురుచూస్తున్నట్లు వాడిమీదకు ఎగిరి ఒక్క పంజాతో వాడి నోటి నుండి రాక్షసనవ్వులు - ప్రాణం ఆగిపోయేలా చేసి వాడి రక్తం లోపల ఉన్న అమ్మాయిల పాదాలను తాకేలా చేసాడు .
అధిచూసి మా నాయకుడినే చంపుతారా అంటూ వచ్చినవారి మీదకూ పంజా విసిరింది .
భటులకు ఆజ్ఞ వెయ్యడంతో మొకరిల్లిన వారిని బంధించారు .
చనిపోయినవారిని గ్రద్దలకు క్రూర జంతువులకు ఆహారంగా వేసి మిగిలినవారిని జీవితాంతం చీకటి గృహంలో బంధించి ఇంతవరకూ ఆ అమ్మాయిలు అనుభవించిన నరకాన్ని చూయించండి .
భటులు : చిత్తం ప్రభూ అంటూ లాక్కుని వెళ్లారు .
మహారాజా మహారాజా ...... మీరు నిజంగా దేవుడు అంటూ కన్నీళ్లు తుడుచుకుని చుట్టూ చేరారు చెలికత్తెలు .......
ముందు లోపల ఉన్నవారికి వస్త్రాలను అందించండి వెళ్ళండి .
చెలికత్తెలు : అలాగే ప్రభూ అంటూ లోపలికివెళ్లారు .

బుజ్జాయిలూ ...... ఇంకెంతసేపు అలా కదలకుండా నన్నే చూస్తుంటారు .
అంతలో అమ్మాయిలంతా వస్త్రాలలో వచ్చి మహారాజా మహారాజా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు .
మన్నించండి , నాలాంటి రాజుల వల్లనే మీకు ఈ పరిస్థితి .
అమ్మాయిలు : అలాంటి రాజులతో మీకు పోలిక ఏమిటి మహారాజా ...... , మీరు దేవుడు అంటూ దండాలు పెడుతున్నారు .
దేవుడినైతే కాదు , మీ అన్నయ్యను అనుకోండి , చెల్లెళ్లకు కష్టం వస్తే మాత్రం ఈ అన్నయ్య ఊరుకోదు . మంత్రి గారూ - సేనాపతి ...... వీరిని వెంటనే వారి వారి గృహాలకు చేర్చే ఏర్పాట్లు చెయ్యండి వీలైనంత వెంటనే అంటూ ఆజ్ఞాపించాను .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ మా గుండెలపైకి చేరారు .

అన్నయ్యా ..... నాకూ కాస్త చోటివ్వండి అంటూ అమ్మాయిలతోపాటు నన్ను చుట్టేసింది చెల్లి ....... , మా వదినమ్మ చెప్పినట్లు మా అన్నయ్య నిజంగా దేవుడే అంటూ వెనుకే వచ్చిన మహారాణీ వైపు సైగచేసి , మహారాణీ ముద్దు అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టింది .
వద్దు వద్దు అనేంతలో .........  ముందు నేను ముందు నేను అంటూ బుజ్జాయిలిద్దరూ నాబుగ్గలపై ముద్దుల వర్షమే కురిపిస్తున్నారు .
ఇప్పటికి తేరుకున్నారన్నమాట మీ ముద్దులకోసం ఇంతసేపు వేచిచూడాల్సి వచ్చింది .
బుజ్జాయిలు : అక్కయ్యలూ ...... భయపడకండి భయపడకండి మనవే బుజ్జిసింహాలు అంటూ ధైర్యం చెప్పారు .
మహారాణి : నేనుకూడా .......
లేదు లేదు లేదు .......
రాణులు : ప్చ్ ప్చ్ ప్చ్ ...... అయితే మాకు కూడా అవకాశం లేనట్లే అంటూ నిరాశ చెందుతున్నారు .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ప్రభూ ...... ఏర్పాట్లు సిద్ధం అంటూ సైన్యాధిపతి వచ్చాడు .

మీ చెల్లెళ్లను ఇలానే పంపించేస్తారా ..... ? , ఎప్పుడు తిన్నారో ఏమిటో - సరైన వస్త్రాలలోకూడా లేరు అంటూ మహారాణీ గారు ముందుకువచ్చారు .
అవును నిజమే , కుటుంబ సభ్యులు కంగారుపడుతుంటారేమోనని పంపించాలనుకున్నాను మన్నించండి మహారాణీ గారూ ...... , ముందైతే ఒంటిపై దెబ్బలకు మందు రాయండి , చెల్లెళ్ళూ ..... మీరిక ఎవ్వరికీ భయపడనవసరం లేదు మహారాణీ గారి వెంట వెళ్ళండి , బుజ్జాయిలూ ..... మీ అక్కయ్యలను పిలుచుకుని వెళ్ళండి అంటూ ముద్దులుపెట్టి కిందకు దించాను .
బుజ్జాయిలు : అక్కయ్యలూ రండి - చెలికత్తెలూ ...... వైద్యులను పిలిపించండి - పళ్ళు తీసుకురండి .

మహారాజు గారూ .....
బుజ్జితల్లి : అక్కయ్యా ..... మీకు మహారాజు కాదు అన్నయ్య .
ఒక చెల్లి : అన్న ..... య్యా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది .
చెల్లీ ..... దెబ్బలు నొప్పివేస్తున్నాయా ? .
చెల్లి : అన్నయ్యా ...... మా చెల్లి ......
మరొక చెల్లి : ష్ ష్ ష్ ..... ఏమీలేదులే అన్నయ్యా అంటూ ఆ చెల్లిని ఆపి సైగలుచేసి బుజ్జాయిల వెనుకే తీసుకెళ్లబోతోంది .
ఆ చెల్లి కన్నీళ్లను చూసి చలించిపోతున్నాను .
నాకులానే అనిపించినట్లు చెల్లీ .... అంటూ గుండెలపైకి తీసుకున్నారు మహారాణీ గారు - చెల్లీ ..... ఏమిటి ? .
మరొక చెల్లి : ఏమీలేదు ఏమీలేదు ......
చెల్లి : అవును ఏమీలేదు మహారాణీ ..... , దెబ్బలు నొప్పిగా ఉన్నాయి .
మహారాణి : ఈ కన్నీళ్లు - మీ అన్నయ్యవైపు చూసే చూపు ..... నొప్పివలన కాదని అర్థమైపోతోంది చెల్లీ ..... , మనం బాధపడితే మీ అన్నయ్య తట్టుకోలేడు ఇక చెల్లెళ్ళు కన్నీళ్లు చూస్తే తట్టుకోలేడు .
చెల్లెమ్మ : అవును అన్నయ్య తట్టుకోలేడు .
మహారాణి : చెప్పు చెల్లీ ...... , ఈ కన్నీళ్లకు కారణం ఏమిటి ? , నీ కళ్ళల్లోనే కాదు మీలో చాలామంది కళ్ళల్లో బాధ కనిపిస్తోంది , ఈ అక్కయ్యతో చెప్పకూడదా ......
చెల్లి : ఏమీలేదు ఏమీలేదు అంటూ కన్నీళ్లను తుడుచుకుంది కానీ బాధ ఆగడంలేదు .
ఇంకొక చెల్లి : అక్కయ్యా ...... తన చెల్లిని లాక్కెళ్లారు అని చెప్పడానికి ..... మా చెల్లిని , తన వదినను ఈమె అక్కయ్యను ....... కూడా తీసుకెళ్లారు అంటూ ఏడుస్తూ మహారాణిని హత్తుకుంది .
ఎవరు చెల్లెళ్ళూ ఎక్కడికి తీసుకెళ్లారు అంటూ ఒకేసారి ఆడిగాము , ఈ విషయం ఈ అన్నయ్యకు చెప్పడానికి ఎందుకు సంశయం ......
మరొక చెల్లి : వ్యభిచార రాజ్యానికి తీసుకెళ్లారు ...... 
వ్యభిచార రాజ్యమా ...... , మంత్రిగారూ ..... అదెక్కడో తెలుసుకోండి - సేనాపతీ ...... ఆ రాజ్యానికి బయలుదేరాలి .
చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా ..... అక్కడకు వెళ్ళకండి అంటూ అందరూ వచ్చి హత్తుకున్నారు , అక్కడ రాక్షసుల్లాంటి వాళ్ళు కాపలాగా ఉన్నారు , మమ్మల్ని అక్కడనుంచే తీసుకొచ్చారు , మావలన ఇంత మంచి మా అన్నయ్యకు ఏమీకాకూడదు .
ఈ అన్నయ్యకు ఏమైనా అవుతుందని తోబుట్టువుల విషయం చెప్పకుండా మీలో మీరే బాధపడుతున్నారు అది ఎంత నరకమే ప్రాణమైనవాళ్ళను దూరం చేసుకున్న నాకు తెలుసు అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను .
అక్కయ్యా - వదినమ్మా అంటూ మహారాణీ గారిని ఓదారుస్తున్నారు రాణులు - చెల్లెమ్మ ....... , మంజరి ఎగురుకుంటూ వెళ్లి మహారాణీ గారి భుజంపైకి చేరింది .
కలిసి కొద్దిసేపైనా ఈ అన్నయ్య గురించి ఆలోచిస్తున్న చెల్లెళ్ళ కన్నీళ్లను తుడవలేని అన్నయ్య ప్రాణం ఉంటే ఎంత లేకపోతే ఎంత , మాటిస్తున్నాను చెల్లెళ్ళూ ..... సూర్యుడు అస్తమించేలోపు నా ప్రాణాలు అర్పించి అయినా మీ తోబుట్టువులను మీచేంతకు చేరుస్తాను , వారినే కాదు అక్కడ బాధపడుతున్న ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛను పంచుతాను , స్వర్గం లాంటి రాజ్యాలు ఉండాలి కానీ వ్యభిచార రాజ్యం ఒకటి ఉండటం ఏమిటి - మంత్రిగారూ ......
మంత్రి : అటువంటి రాజ్యానికి ప్రాణం పోసినదే మన పాత రాజు ప్రభూ ...... , కొంతమంది మూర్ఖమైన రాజుల సహాయంతో వ్యభిచార రాజ్యాన్ని నిర్భయంగా నిర్వహిస్తూ వెళ్లారు .
ఈరోజుతో భూస్థాపితం అయిపోవాలి అన్నీ ఏర్పాట్లూ చెయ్యండి .
సేనాపతి : చిత్తం మహారాజా అంటూ వెళ్ళాడు .

నాన్నా నాన్నా ...... మేమూ వస్తాము అంటూ నా ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లు ఉరకాలేస్తున్న సింహాలపైకి ఎక్కారు .
నా బుజ్జాయిలు ధైర్యవంతులని నాకు తెలుసు కానీ భయపడుతున్న మీ అక్కయ్యలకు తోడుగా మరియు నేను లేని సమయంలో రాజ్యానికి రక్షణగా మీరుండాలికదా అంటూ ఎత్తుకునివెళ్లి మహారాణీ - చెల్లెమ్మకు అందించి ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : ఆ రాక్షసుల అంతుచూసి వెంటనే వచ్చేయ్యాలి .
నా బుజ్జాయిలను చూడకుండా నేనూ ఉండలేను .
రాణులు : మహారాణీ గారికి చెప్పరా మహారాజా ......
మన్నించండి మహారాణీ గారూ ...... , వెళతాను .
మహారాణి : వెళ్ళొస్తానని చెప్పండి , విజయులై తిరిగిరండి .
సంతోషం మహారాణీ గారూ ...... , బుజ్జాయిలూ జాగ్రత్త .
బుజ్జాయిలు : అలాగే నాన్నగారూ ...... , మీ మహారాణీ గారిని జాగ్రత్తగా చూసుకుంటాములే వెళ్లి రండి అంటూ నవ్వుతున్నారు .
చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా ......
మహారాణి : మీ అన్నయ్య దేవుడని అన్నారుకదా దేవుడికి ఏమీకాదు ధైర్యంగా ఉండండి .

మిత్రమా సింహం ఎక్కడికి , నేనూ - కృష్ణ పూర్తి చేసుకొస్తాములే .......
అడవిరాజు : ఊహూ నీవెంటే అన్నట్లు ముందు ముందుకు వెళ్లిపోతున్నాడు - జాగ్రత్త అంటూ ఆడ సింహం వైపు సైగచేశాడు .
కింద సేనాపతితోపాటు వీరులైన కొద్దిమంది సైనికులు సిద్ధంగా ఉండటంతో ఆయుధం చేతబట్టి మిత్రుడిపైకెక్కి బుజ్జాయిలకు ముద్దులువదిలి దుష్ట శిక్షణకు బయలుదేరాను - మంజరి ఎగురుకుంటూ వచ్చి మిత్రుడిపై చేరింది .
మంజరీ ఇప్పటికి గుర్తుకువచ్చానా ......
మంజరి : మహారాణీ గారు ఆజ్ఞవేశారు వచ్చాను .
అంటే ......
మంజరి : అంతేమరి అంటూ చుట్టూ ఎగురుతోంది .
నీసంగతి నాదేవకన్యను చేరాక చెబుతాను అంటూ నవ్వుకున్నాను .

రాజ్యం దాటగానే అరణ్యంలోని సింహాలు - పులులు - చిరుతపులులతోపాటు సాధు జంతువులుకూడా మావెనుకే వేగంగా రావడం చూసి అడవిరాజువైపు చూసాను .
నాకేమీ తెలియదు అన్నట్లు పెద్దమొత్తంలో జంతువులను వెనకేసుకుని మాకంటే ముందుముందుకు వెళ్లిపోతున్నాయి .
సేనాపతి మరొక మార్గంలోకి తిరుగడంతో మిత్రమా అటువైపు కాదు ఇటువైపు అంటూ కేకెయ్యడంతో బుద్ధిగా మాతోపాటు వేగంగా రాసాగాయి .

దాదాపు నాలుగైదు ఘడియలు ప్రయాణం తరువాత అల్లంతదూరంలోనుండే మహిళల ఆర్తనాదాలు వినిపించసాగాయి .
మంజరి : ప్రభూ ...... హింసిస్తున్నట్లు ఉన్నారు అంటూ ఎగురుకుంటూ వెళ్లి కొద్దిసేపటి తరువాత బాధ - కన్నీళ్ళతో వచ్చింది , నోటివెంట మాట రావడంలేదు .
మంజరీ ఏమైంది ......
మంజరి : ప్ర .... ప్రభూ ..... చిన్న వయసు అమ్మాయిలను గోలుసులలో బంధించి ఇనుప చువ్వలలో ఉంచి కొరడాలతో హింసిస్తున్నారు ప్రభూ ..... , లోపల అయితే మీదపడి బట్టలు చింపి రాక్షసుల్లా ...... చెప్పడానికి కూడా మాటలు రావడంలేదు ప్రభూ ....... , మన రాజ్యానికి తీసుకువచ్చినట్లుగా అన్ని రాజ్యాలకు తీసుకెళ్లడానికి కూడా రథాలు సిద్ధం చేశారు ప్రభూ ...... వాళ్ళను ప్రాణాలతో వదలకూడదు - చిత్రహింసలు పెట్టి నరకాన్ని తెలియజెయ్యాలి .

ఆపాటికే వ్యభిచార రాజ్యపు ద్వారం దగ్గరకు చేరుకున్నాము , అనుకున్నది అయితే మాటలతో నచ్చజెప్పి అందరినీ ఇక్కడినుండి తీసుకెళ్లాలనుకున్నాను కానీ లోపలనుండి వస్తున్న అక్కాచెల్లెళ్ల ఆర్తనాధాలను విని - ద్వారం దగ్గరనే రాక్షసుల్లాంటి వారు మహిళలను హింసిస్తుండటం చూసి కోపం కట్టలు తెంచుకుంది , మిత్రమా అంటూ వెళ్లి ద్వారం బయట ఆడవారిని హింసిస్తున్న వారి చేతులు తెగ నరికాను .
వాళ్ళ అరుపులు రాజ్యం మొత్తం వినిపించినట్లు కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం .......
ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నట్లు RRR లో NTR ఉసిగొలిపినట్లు అడవి జంతువులన్నీ పంజాలు విసురుతూ దాడిచేసుకుంటూ పోతున్నాయి .
అధిచూసి ప్రాణభయంతో పారిపోతున్నవారి మరొక అడుగు పడకుండా చేతులూ కాళ్ళూ నరుకుతున్నాము , గోలుసులలో - చేరసాలల్లో - పంజరాలల్లో ....... వొళ్ళంతా చిరిగిపోయిన వస్త్రాలు రక్తంతో విలపిస్తున్న మనకు జన్మనిచ్చే మహిళలు పిల్లలను చూసి హృదయం చలించిపోతోంది , సైనికులారా - మిత్రమా ఇటువంటి వారిని వదలనేకూడదు ఒక్కడూ తప్పించుకోకూడదు , కోన ఊపిరి మిగిలేలా జీవితాంతం జీవచ్చవాలుగా బ్రతికేలా కాళ్ళూ చేతులూ తెగనరకండి .
ఒక్కొక్కడి ప్రాణభయపు ఆర్తనాధాలను - చిందుతున్న వారి రక్తాన్ని చూసి బందీలుగా ఉన్న మహిళలందరూ కన్నీళ్లను తుడుచుకుని కోపంతో చంపేయ్యండి చంపేయ్యండి అంటూ భద్రకాలుల్లా తమవైపుగా పరిగెడుతున్నవారిని పట్టుకుని గోలుసులతో మెడలను చుట్టేస్తున్నారు .
కొద్దిసేపటికే ఒక్కడుకూడా మిగలలేదు , రక్తంతో విలవిలలాడుతూ కేకలువేస్తున్నవారిని లాక్కునివెళ్లి బయటపడేశారు - మా వస్త్రాలన్నీ ఆ రాక్షసుల రక్తంతో తడిచిపోయింది .
బంధింపబడిన వారందరినీ విడుదల చెయ్యగానే వారి వారి కుటుంబసభ్యులతో కలిసి మా అందరినీ దేవుళ్ళలా చూసి దండాలు పెడుతున్నారు .

సేనాపతీ - సైనికులారా ...... వీరందరినీ జాగ్రత్తగా వారి వారి రాజ్యాలకు - గృహాలకు చేర్చండి .
సేనాపతి : ప్రభూ ...... మన సైనికులు ఉన్నది కొద్దిమందే .....
అంతలో చెల్లెమ్మ ప్రియుడు తన సైన్యంతో వచ్చాడు - మహారాజా ...... నా కాబోవు రాణి వర్తమానం పంపింది ఉన్నపాటుగా మీకు సహాయం చెయ్యడం కోసం నా సైన్యంతో వచ్చేసాను , చూస్తుంటే అంతా పూర్తి చేసేసినట్లున్నారు .
అయిననూ సరైన సమయానికే వచ్చావు బావా ....... వీరందరినీ వారి వారి కుటుంబసభ్యుల చెంతకు జాగ్రత్తగా చేర్చే బాధ్యత నీదే ......
యువరాజు : ఒక్కొక్క అమ్మాయి వెంట ఇద్దరిద్దరు సైనికులను పంపి మీరిచ్చిన బాధ్యతను పూర్తిచేస్తాను మహారాజా ......
సంతోషం యువరాజా ....... , సైనికులారా ...... ఇలాంటి వ్యభిచార రాజ్యం ఒకటుందన్న ఆనవాళ్లు కూడా ఉండకూడదు .
సైనికులు : అలాగే మహారాజా అంటూ రాజ్యం మొత్తాన్నీ కాల్చి బూడిద చేసేసారు .
రాజ్యంలోని చెల్లెళ్ళ పేర్లు చెప్పి వారి కుటుంబసభ్యులను మావెంట రాజ్యానికి తీసుకెళ్లాము .

రాజ్య ప్రవేశం దగ్గరే నాకోసం ఎదురుచూస్తున్నట్లు నాన్నా నాన్నా అంటూ పరుగున వచ్చి విజయ స్వాగతం పలికారు .
వెంటనే కిందకుదిగి ఎత్తుకోబోయి వొళ్ళంతా రక్తం అంటూ ఆగిపోయాను .
బుజ్జాయిలు : ఆ రాక్షసుల రక్తమే కదా నాన్నగారూ అంటూ నా గుండెలపైకి చేరారు .
అఅహ్హ్ ...... ఇప్పటికి ప్రాణం తిరిగొచ్చినట్లుంది - మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయానంటే నమ్మండి అంటూ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెడుతున్నాను .
బుజ్జాయిలు : మేముకూడా నాన్నగారూ అంటూ ముద్దుల వర్షం కురిపిస్తున్నారు .
చుట్టూ చూసి ఒంటరిగానా ....... ? .
బుజ్జాయిలు : మా నాన్న రాజ్యంలో మాకు భయం ఏమిటి ? , మా బుజ్జి సింహాలు తోడుగా ఉన్నాయికదా అంటూ ముద్దులుపెట్టి కిందకుదిగి మిత్రుడు సింహం దగ్గరికివెళ్లి వదిలింది .
మాలానే ప్రేమను పంచుకున్నాయి .
మా బుజ్జాయిలు బంగారం అంటూ బుజ్జిచేతులను అందుకుని రాజ్యపు వీధుల వెంట నడిచాము .
ప్రజలు ...... తమ అమ్మాయిలను అక్కునచేర్చుకుని ఆనందబాస్పాలతో మహారాజా మహారాజా ...... అంటూ విజయనినాధాలతో స్వాగతం పలికారు - కొంతమంది అయితే పాలాభిషేఖం చెయ్యడానికి పాలు తీసుకొచ్చారు .
ప్రజలారా ...... మీ అభిమానానికి సంతోషం ఈ పాలను వృధా చెయ్యకుండా పిల్లలకు అందించండి అంటూ వారించాను .
అంతే దేవుడిలా దండాలు పెడుతున్నారు .

చెల్లెళ్ళ కుటుంబసభ్యులను రాజాప్రవేశద్వారం దగ్గర వదిలి మీవాళ్లదగ్గరికి వెళ్ళమని చెప్పి బుజ్జాయిలను ఎత్తుకుని మిత్రులు - వీరులైన సైనికులతోపాటు ఆనకట్ట దగ్గరకు చేరుకున్నాను .
కొద్దిపాటి జలపాతపు నీటిలోనే శుభ్రం చేసుకుని అమ్మవారి సన్నిధికి చేరాము - అమ్మా ...... మాకు తోడుగా ఉండి మీ బిడ్డలను రక్షించుకునేలా అనుగ్రహించినందుకు అంటూ మొక్కుకున్నాను .
బుజ్జాయిలు కూడా మొక్కుకుని నాన్నగారూ వొంగండి అంటూ అమ్మవారి కుంకుమను ఉంచారు .
నాదేవకన్య కూడా అచ్చు ఇలానే ఉంచేది మరి మీకు అంటూ అమ్మవారిని ప్రార్థించి కుంకుమ ఉంచి ఎత్తుకుని వెనక్కు తిరిగాను .

అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ నా గుండెలపైకి చేరారు చెల్లెళ్ళు , అన్నయ్యా అన్నయ్యా ...... మీకేమీ కాలేదుకదా వొళ్ళంతా రక్తం అని చెల్లీ - అక్కయ్య చెప్పారు అంటూ నావొళ్ళంతా చూస్తున్నారు .
నా చెల్లెళ్ళ ఇంత ప్రేమ రక్షణగా ఉండగా ఈ అన్నయ్యకు ఏమవుతుంది చెల్లెళ్ళూ ........
అవునవును ఈ వీరాధివీరుడిని ఎవ్వరూ ఏమీచెయ్యలేరు అంటూ నా బుగ్గపై చేతులతో ముద్దుపెట్టారు .
వద్దు వద్దు అంటూ ముద్దులను దులిపేసుకోవడం చూసి మహారాణీ గారితోపాటు రాణులు - చెల్లెమ్మ నవ్వుకుంటున్నారు .
బుజ్జాయిలు : భలే భలే అంటూ నవ్వుకుంటున్నారు .
మహారాణీ గారు : వెళ్ళేటప్పుడు కూడా మీ బుజ్జాయిలకు మాత్రమే ముద్దులు వదిలారు గాలిలో .......
అంతే ఒక్కసారిగా బుజ్జాయిల కళ్ళు ఎరుపురంగులోకి మారిపోయాయి .
బుజ్జాయిలను చూసి మహారాణీ వాళ్ళు మరింత గట్టిగా నవ్వుకుంటున్నారు .
బుజ్జితల్లీ బుజ్జినాన్నా ఏమైంది ? ఎందుకీ కోపం ? .
బుజ్జాయిలు : మీరు మాకోసం గాలిలో వదిలిన ముద్దులను అమ్మ పట్టేసుకుంది అంటూ ఈర్శ్యతో చూస్తున్నారు .
మహారాణి : నా మహారాజు ..... మాకోసం వదిలిన ముద్దులేమో అనుకున్నాను అంటూ నవ్వులు ఆగడంలేదు .
కాదు కాదు మహారాణీగారూ ...... బుజ్జాయిలకోసం .
మహారాణి : ఆవిషయం ఇప్పుడు చెబితే ఎలా మహారాజా ...... , మీ ముద్దులు ఎప్పుడో నా మనసులోతుల్లోకి చేరిపోయాయి .
బయటకు తీసేయ్యండి మహారాణీ గారూ .......

ఒక్కసారి మా ఆడవారి మనసుల్లోకి చేరాయంటే బయటకు తియ్యడం అసాధ్యం అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ చెల్లెళ్ళంతా నవ్వుకుంటున్నారు .
మహారాణి : అదీ అలా తెలియజేయ్యండి మీ అన్నయ్యకు .......
చెల్లెళ్ళూ ...... మీరుకూడా మహారాణీ వైపుకు చేరిపోయారా ? .
చెల్లెళ్ళు : మా వదిన అంతులేని ప్రేమ తెలిసాక మేమేంటి ఎవ్వరైనా మా వదినకు మద్దతు ఇవ్వాల్సిందే అంటూ మహారాణీ చెంతకు చేరిపోయారు .
వదిన ....... కొన్ని ఘడియలు ముందే కదా చెల్లెళ్ళూ అక్కయ్యా అని పిలిచారు .
చెల్లెళ్ళు : అది మీపై ప్రేమ గురించి తెలియనప్పుడు అన్నయ్యా ...... , మరీ ఇంత అమాయకులు అయితే ఎలా అన్నయ్యా అంటూ సంతోషంగా నవ్వుకుంటున్నారు - మా వదిన విశ్వమంత ప్రేమ మీకెప్పుడు తెలుస్తుంది .

ఆ సంగతి వదిలెయ్యండి కానీ అక్కడ మీ తల్లిదండ్రులు మీకోసం బాధపడుతుంటారు - మీ ప్రయాణానికి సన్నద్ధం చేయిస్తాను .
చెల్లెళ్ళు : మా వదినలను వదిలి అప్పుడే వెళ్ళము పైగా చీకటిపడుతోంది .
మరి .......
చెల్లెళ్ళు : మేము క్షేమమని మా వదిన ఎప్పుడో మా అమ్మానాన్నలకు పావురాల ద్వారా వర్తమనం చేరేలా చేశారు సమాధానాలు కూడా వచ్చేసాయి కూడా .......
అలా అయితే సంతోషం - మీ ఇష్టం వచ్చినాన్ని రోజులు ఉండవచ్చు .
చెల్లెళ్ళు : మీ ఈ సంతోషం మా వదిన వల్లనే కాబట్టి కానుకలేమైనా ఇవ్వాలనుకుంటే వారికే ఇవ్వండి .
చాలా సంతోషం మహారాణీ గారూ .......
అంతే అందరూ చప్పట్లు - కరతాళధ్వనులతో హోరెత్తించి ఆనందిస్తున్నారు .

సేనాపతీ మంత్రిగారిని పిలిపించండి .
మంత్రి : ఇక్కడే ఉన్నాను ప్రభూ ...... , మీ విజయానికి అభినందనలు .......
విజయానందం అప్పుడే కాదు మంత్రిగారూ ....... , మన మహారాణీ గారు ...... చెల్లెళ్ళ తల్లిదండ్రులకు వర్తమానం పంపినట్లుగానే మన సామ్రాజ్యంలోని పెద్ద చిన్న మరియు సామంత రాజ్యాలన్నింటికీ వెంటనే ఉన్నఫలంగా వర్తమానాలు పంపండి రేపు సూర్యోదయ సమయానికల్లా వాళ్ళ వాళ్ళ రాజ్యాలలో బలవంతంగా నిర్బంధించుకున్న ఆడవాళ్ళందరినీ క్షమించమని వేడుకుని తగిన బహుమతులతో వారి వారి కుటుంబాల చెంతకు చేర్చాలి లేకపోతే వారి రాజ్యానికి వ్యభిచార రాజ్యానికి పట్టిన గతే పడుతుందని నామాటగా హెచ్చరించండి - అందరూ స్వేచ్ఛను పొందారో లేదో మన గూఢచారుల ద్వారా మీరే స్వయంగా తెలుసుకుని నాకు తెలపండి - ఏ ఒక్కరూ కన్నీళ్లు కార్చకూడదు .
మంత్రి : ఆజ్ఞ ప్రభూ ఇప్పుడే వర్తమానాలు పంపుతాను .

దీనికైతే ఏకంగా రెండు ముద్దులు పెట్టాల్సిందే అంటూ రెండు బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు మహారాణీ గారు ........
చుట్టూ అందరి ఆనందాలకు అవధులు లేవు ......
బుజ్జాయిలు : ఇవికూడా అమ్మ ముద్దులే అంటూ ముద్దుల వర్షమే కురుస్తోంది .
చెల్లెళ్ళు సంతోషంతో కేకలువేసి చేతులు జోడించారు ఆనందబాస్పాలతో .......
ఇదిమాత్రం మీవల్లనే చెల్లెళ్ళూ ....... , మీరు ఇక్కడకు రాకపోయుంటే ఇదంతా జరిగేది కాదు , స్వేచ్ఛ పొందే ప్రతీ అమ్మాయి పెదాలపై చిరునవ్వులు మీవల్లనే .....
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ గుండెలపైకి చేరారు .
సంతోష వాతావరణం నెలకొంది .
Like Reply
మహారాణి : బుజ్జాయిలూ ...... మీ నాన్నకు ఆకలివేస్తోందేమో ఈ పళ్ళు తినిపించండి , మహారాజు గారూ ...... సైనికులకు మన మిత్రులకు కూడా తెచ్చాము మీసంగతి మాకు తెలియదా .......
ధన్యవాదాలు మహారాణీ గారూ అంటూ బుజ్జాయిలను బండపై కూర్చోబెట్టి పండు అందుకుని బుజ్జాయిలకు తినిపించి తిన్నాను .
అలా కొరకడం ఆలస్యం బుజ్జితల్లి ..... నాచేతిలోని పండును లాక్కుని అమ్మా అంటూ పరుగునవెళ్లి అందించింది .
మహారాణి : నా బంగారం అంటూ వారించేలోపు నేను కొరికిన చోటనే కొరికి చాలా చాలా తియ్యగా ఉంది ఇప్పుడు తీసుకోండి మహారాజా .......
వద్దు .......
బుజ్జాయిలు : మా నాన్న - అమ్మ కొరికినది మాకు కావాలి అంటూ తిన్నారు .

అంతలో ప్రజలు ...... ఆహారం తీసుకురావడంతో అమ్మవారి సమక్షంలో కలిసి తిన్నాము .
చెల్లెళ్ళూ ..... ఎప్పుడు పడుకున్నారో ఏమో రాజభవనానికి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి .
చెల్లెళ్ళు : మా అన్నయ్య - బుజ్జాయిలు మరియు మరియు .......
ష్ ష్ ష్ ...... చెల్లెళ్ళూ అంటూ మహారాణీ గారు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు .
చెల్లెళ్ళు : నవ్వుకున్నారు , మీరు రోజూ విశ్రాంతి తీసుకునేది ఇక్కడే అని తెలిసింది కాబట్టి మేముకూడా ఇక్కడే .......
ఇక్కడా ..... ? , వద్దు చెల్లెళ్ళూ ..... చాలా ఇబ్బంది - చలికూడా ఎక్కువ , మీలో సుకుమారంగా పెరిగిన వాళ్ళు - యువరాణులు ఉన్నారు , ఇక్కడ ఉన్నంతసేపూ మీకు ఏలోటూ లేకుండా చూసుకుని మిమ్మల్ని జాగ్రత్తగా మీవాళ్ళ దగ్గరికి చేర్చడం మా బాధ్యత , తెల్లవారగానే కలుద్దాము , చెల్లెమ్మా - రాణులూ - మహారాణీ గారు ........ పిలుచుకుని వెళ్ళండి , ఈ అన్నయ్య అంటే ఇష్టమే కదా వెళ్ళండి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి అని ఒప్పించి అందరినీ పంపించి ఈరాత్రికైనా వర్షం పడాలని ప్రార్థించి గుడిసెలోకి చేరాను .

బుజ్జాయిలు ముద్దులుపెట్టి పాన్పును ఏర్పాటుచేశారు .
నా బంగారు బుజ్జాయిలు అంటూ గుండెలపై పడుకోబెట్టుకుని జోకొడుతున్నాను .
బుజ్జితల్లి : నాన్నా ..... మన దేవకన్య గురించి చెప్పండి .
ఈపాటికి వందసార్లకు పైనే విన్నారుకదా ......
బుజ్జినాన్న : ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది .
బుజ్జితల్లి : మొదటనుండీ చెప్పండి నాన్నా ...... అంటూ ముద్దుపెట్టింది , మీకు విసుగు వస్తోందా నాన్నా .......
నా ..... మన దేవకన్య గురించి వందసార్లు కాదు వెయ్యి సార్లైనా సంతోషంగా చెబుతాను బుజ్జాయిలూ ....... , ఈరోజు మాత్రం చెబుతూ చెబుతూ నిద్రపోయేదేలేదు , ప్రతీరోజూ ఉదయానికల్లా ఒంటిపై నూలుపోగు ఉండటం లేదు , ఈరాత్రికి ఎలాగైనా కనిపెట్టాలి .
బుజ్జాయిలు : ( మీవాళ్ళ కాదులే ) అన్నట్లు నవ్వుకుంటున్నారు - ముద్దులుపెడుతున్నారు .
నా దేవకన్యను తొలిసారి కలిసిన క్షణం నుండీ ఎంతో ఉత్సాహంగా హుషారుగా చెబుతూ చెబుతూనే అంతులేని ఆనందాన్ని పొందుతూ నాకే తెలియకుండా నిద్రలోకిజారుకున్నాను .
( బుజ్జాయిలు : కనిపెడతారన్నారు కదా నాన్నగారూ అంటూ చిన్నగా నవ్వుకుని ముద్దులుకురిపించి అమ్మా అమ్మా అంటూ పిలిచారు ) .
*****************

యధావిధిగా బుజ్జాయిల ముద్దులు మేల్కొని ఒంటిపై పూలు కప్పి ఉండటం చూసుకుని ప్చ్ ప్చ్ అంటూ వస్త్రాలు ధరించి , బుజ్జాయిలను ఎత్తుకుని చిన్నపాటి జలపాతం కిందకుచేరి స్నానమాచరించి సూర్యవందనం చేసుకున్నాను - నిద్రలో ఏమో జరుగుతోంది ఇబ్బందిగా అయితే అనిపించదు పైగా హాయిగా ఉంటుంది ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను వెంటనే నిద్రపట్టేస్తోంది .
బుజ్జాయిల ముసిముసినవ్వులు వినిపించి చూస్తే నిశ్శబ్దం ........

అంతలో మహారాజా మహారాజా ...... మిమ్మల్ని కలవడం కోసం దూరప్రాంతాలనుండి ముగ్గురు రాజులు వచ్చారు - అర్ధ రాత్రే వచ్చారు ప్రభూ - అతిథి మందిరాలలో విశ్రాంతి తీసుకున్నారు - మీకోసం ఎదురుచూస్తున్నారు .
అయితే వస్తున్నాము .
అవసరంలేదు మహారాజా ..... , మీలాంటి వీరాధివీరులను రప్పించడం భావ్యం కాదు అందుకే మేమే స్వయంగావచ్చాము అంటూ తండ్రి వయసున్న ముగ్గురు రాజులు గుర్రాలపై వచ్చారు వెనుకే పెద్ద సంఖ్యలో సైనికులు .......

నావెనుకే మహారాజా - బుజ్జాయిలూ అంటూ రాణులు తోడుగా మహారాణీ - చెల్లెమ్మ వచ్చారు .
ముగ్గురు రాణులూ నావెనుకకు చేరి బుజ్జాయిలను ఎత్తుకుని ముద్దుచేస్తూనే నావైపుకు ఆరాధనతో చూస్తున్నారు - రాజులవైపూ చూస్తున్నారు .

మహారాజులకు స్వాగతం - మీ రాకకు కారణం .......
రాజులు : సంతోషం వీరాధివీరా ...... , ఏ రాజ్యానికి వెళ్లినా మీ వీరత్వం గురించే మాట్లాడుకుంటున్నారు , మా రాజ్యాలు అంటూ మూడు పేర్లు చెప్పి రాణులవైపు ఆశతో చూస్తున్నారు .
వెనకున్న రాణులవైపుకు చూస్తే మహారాణీ - చెల్లెమ్మలను వదలనంతగా హత్తుకుని ఊహూ అంటున్నారు .
వీరాధివీరా ...... మీ రాణులు మా ముగ్గురి బిడ్డలు , మీరు అనుమతిస్తే వారిని మా రాజ్యాలకు తీసుకువెళ్లాడానికి వచ్చాము - మీరు పంపిన వర్తమానం నిన్న సాయంత్రానికి రాగానే ఎంతో ఆశతో బయలుదేరాము - మా బిడ్డలను రాక్షసుడైన ఆ మూర్ఖుడు బలవంతంగా తీసుకొచ్చాడు .
సంతోషంగా మహారాజులూ ...... , వారు మీ బిడ్డలు మీఇష్టం , తల్లిదండ్రులను చేరడం కంటే మరొక సంతోషం ఏమిటి అంటూ సంతోషంతో రాణులవైపు చూస్తే ఊహూ ఊహూ ..... అంటూ సైగలుచేస్తున్నారు .

రాణులూ ...... వెళ్లడం ఇష్టం లేదా ? , మీ తండ్రులంటే ఇష్టం లేదా ? .
రాణులు : చాలా చాలా ఇష్టం ...... , అంతకుమించి మీరు ...... బుజ్జాయిలు అక్కయ్య చెల్లి అంటే ప్రాణం , మాకు వెళ్లాలని లేదు , మేమిక్కడ సంతోషంగా ఉన్నాము .
రాజులు : సంతోషం తల్లులూ ...... , కానీ అక్కడ మీకోసం మీ తల్లులు మంచం పట్టారు , మిమ్మల్ని చూడాలని మిమ్మల్నే తలుచుకుంటున్నారు , మీకిష్టం లేకపోయినా మీఅమ్మల కోసమైనా ఒకసారి రండి , మీ ఇష్టం మీరు ఉండాలంటే ఉండండి లేకపోతే ఇక్కడికే వచ్చెయ్యండి .
చక్కగా చెప్పారు ...... , మీఇష్టం అన్నారుకదా వెళ్ళిరండి రాణులూ .......
రాణులు : అమ్మలకోసం - మా ప్రాణమైన మహారాజు కోరుతున్నారు కాబట్టి వెళతాము కానీ మాకు మాట ఇస్తేనే .......
ఏమిటి ? .
రాణులు : ఇక్కడకు రావడం మాకు ఇష్టం ఇక్కడే మా జీవితం - ఎట్టి పరిస్థితులలో మమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తానని మాటిస్తే సంతోషంగా వెళతాము .
మీ తండ్రులు .......
రాణులు : మా తండ్రులు కాదు మా మహారాజు మీరు ..... మీరు మాటిస్తేనే వెళతాము .
అమ్మవారి సమక్షంలో మాటిస్తున్నాను - మీకు ఇష్టమైతే మీఇష్టప్రకారం మిమ్మల్ని ఇక్కడకు తీసుకొస్తాను .

రాజులు : చాలా చాలా సంతోషం వీరాధివీరా ...... , అక్కడ వీళ్ళ తల్లులు కంగారుపడుతుంటారు వెంటనే బయలుదేరాలి .......
మీఇష్టం ...... , మంత్రిగారూ ...... వజ్రవైఢూర్యాలు - మణి మాణిక్యాలను రాసులుగా కానుకలతో అంగరంగవైభవంతో ఏర్పాట్లు చెయ్యండి .
మంత్రి : అలాగే ప్రభూ అంటూ వెళ్ళాడు .
కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది .
మహారాణీ గారు : బిడ్డలు దూరమైతే తల్లులు - తల్లులకు దూరంగా బిడ్డల బాధ నాకు తెలుసు , సంతోషంగా వెళ్ళిరండి , అన్నీ సర్దుకున్నాక వచ్చెయ్యండి అంటూ ప్రాణంలా కౌగిలించుకొన్నారు .
బుజ్జాయిలను తమ గుండెలపైనుండి వదలడం లేదు రాణులు .......
అన్నీ ఏర్పాట్లు పూర్తవ్వడంతో రాజ్యం చివరవరకూ తోడుగా వెళ్లి మూడు దారులలో ఒక్కొక్కరూ వెళ్లడం చూసి నాకూ కొద్దిగా బాధవేసింది .
ఇక కష్ట సమయాలలో ఒకరికొకరు తోడుగా ఉన్నట్లు చెల్లెమ్మ - మహారాణీ గారి కన్నీళ్లు ఆగడంలేదు - బుజ్జాయిలు అయితే పిన్నమ్మా పిన్నమ్మా పిన్నమ్మా అంటూ ఏడుస్తూనే ఉన్నారు .
మళ్లీ వస్తారని నచ్చచెబుతూ ఆనకట్ట దగ్గరకు చేరుకుని తరువాతి కొన్నిరోజులపాటు వర్షం కోసం చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా ప్రయోజనం లేకపోయింది .

మరికొద్దిరోజులపాటు వర్షం కురావకపోతే దాదాపు రాజ్యంలోని ఆహారనిల్వలు ఖాళీ అయిపోతాయని మంత్రిగారు వ్యక్తపరిచారు .
ఎమ్మెచెయ్యలేకపోతున్నానన్న నా నిస్సహాయస్థితిని చూడలేకపోయింది మహి ..... , అమ్మవారి చెంతకువెళ్లి అమ్మా నదీతల్లీ ...... ప్రజలంతా నా ప్రాణనాథుడి మీదనే ఆధారపడి ఉన్నారు , అనుగ్రహించండి అంటూ నిద్రాహారాలు మాని ప్రార్థించింది - రెండుమూడురోజులు కావడంతో అమ్మవారి పాదాలముందే స్పృహకోల్పోయింది .
( తల్లీ మహీ ...... మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలని కాదు - మీఇద్దరి కలయికే ఏకైక మార్గం .
దుర్గమ్మ అనుగ్రహించినట్లు కళ్ళుతెరిచి భక్తితో మొక్కుకుంది - ఇప్పుడే ఇప్పుడే వెళ్లి నాదేవుడు గుండెలపైకి చేరతాను అమ్మా .......
అప్పుడే కాదు మహి తల్లీ ...... , ఒక చిలిపితనంలా జరగాలి , నీ ప్రాణ నాథుడిని ఆటపట్టిస్తూ నువ్వే కదా ఆలస్యం చేసినది , మీ చిలిపి ప్రేమను ఎంతలా ఆనందించానో మాటల్లో వర్ణించలేను , చివరగా మరింత రంజుగా ఉండాలి అంటూ వివరించారు .
మహి : అమ్మా ...... మీరేనా కోరిక కోరుతున్నది అంటూ ఆశ్చర్యపోతోంది .
మేము మాత్రమే మీ కోరికలు తీర్చాలా ...... నా సంతోషం కోసం తప్పదు , చిలిపి పసందైన శుభకార్యం జరగాల్సిందే అటుపై రాత్రికి ....... నీకు చెప్పాల్సిన అవసరం లేదులే ......
పో అమ్మా అంటూ సిగ్గులోలికిపోతోంది మహి ...... 
అలాగే మీతోపాటు యువరాణీ వివాహం కూడా .....
మహి ఆనందాలకు అవధులులేకుండాపోయింది - ఆనందబాస్పాలతో మొక్కుకుంది .
ఎంత త్వరగా శుభకార్యాలు జరిగితే మీ రాజ్యానికి అంత మంచిది ఎందుకంటే రాజ్యంలో చాలా ఉన్నాయి , అలా అని ఆహారానికి ఎప్పటిలానే ఇబ్బందిపెట్టనులే .......
మహి : అంటే ఎప్పుడో ఖాళీ అవ్వాల్సిన ఆహారనిల్వలు ...... మీవల్లనే అన్నమాట ధన్యులం అమ్మా అంటూ కన్నీళ్లను తుడుచుకుని పాదాభివందనం చేసుకుని పరుగున ఈవిషయమై బాధపడుతున్న చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళింది ) .

మహి : చెల్లీ చెల్లీ .......
చెల్లెమ్మ : వదినా వదినమ్మా ...... అంటూ కౌగిలించుకుంది .
మహి : చెల్లీ చెల్లీ ......
చెల్లెమ్మ : మూడురోజులయ్యింది మీరు తిని ముందైతే తినండి అంతో ప్రాణంలా తినిపించసాగింది .
మహి : సంతోషంగా తింటాను చెల్లీ ..... అంటూ తినిపించింది , చెల్లీ ..... శుభవార్త , రాబోవు శుభాధినాన మీ వివాహం ......
చెల్లెమ్మ : వదినమ్మా ..... అంటూ సిగ్గుపడుతూ కౌగిలిలోకి చేరింది , నాతోపాటు నా వదినమ్మ వివాహం కూడా జరిగితేనే నేను - బుజ్జాయిలు చూడలేదుకదా .......
మహి : పిల్లలు ..... తల్లిదండ్రుల వివాహం చూడలేరే చెల్లీ .....
చెల్లెమ్మ : అధినిజమే కానీ ఆ అదృష్టం మన బుజ్జాయిలకు కలగబోతోంది .
మహి : అంతా అమ్మవారి అనుగ్రహం అంటూ చెల్లెమ్మతోపాటు సిగ్గుపడింది , నాకిష్టమే కానీ ఎలా చెల్లీ ......
చెల్లెమ్మ : జరిపించడానికి నేనున్నానుకదా రండి అంటూ మంత్రిగారి దగ్గరకు తీసుకెళ్లింది , మంత్రిగారూ ..... వెంటనే ఎంతమంది ఉంటే అంతమందీ పురోహితులను వెంటనే పిలిపించండి అంటూ ఆజ్ఞవేసింది .
మంత్రి : అలాగే యువరాణీ .......
చెల్లెమ్మ : ఈవిషయం ముందుగా బుజ్జాయిలకు తెలియజెయ్యాలి వాళ్ళూ సహాయం చేస్తారు , చెప్పగానే వాళ్ళ సంతోషం .......
మహి ఇంకా సిగ్గుపడుతూనే ఉంది .
Like Reply
అలా వెళ్లిన మంత్రి వెంటనే వెనక్కువచ్చాడు - యువరాణీ ...... స్వయంగా పురోహితులే రాజ్యప్రజలందరితో కలిసి విచ్చేస్తున్నారు .
యువరాణి - మహారాణి : ఆశ్చర్యం వారే వస్తున్నారా ..... ? అంటూ ప్రాంగణానికి చేరుకున్నారు , రాజ పురోహితులకు స్వాగతం అంటూ సాధరంగా ఆహ్వానించి ఆశీర్వాదం తీసుకున్నారు .
పురోహితులు : మహారాణీ - యువరాణులకు ఆశీర్వాదాలు .
యువరాణి : మిమ్మల్నే ఆహ్వానించాలనుకున్నాము అంతలోపు మీరే దర్శనమిచ్చారు .
పురోహితులు : తప్పక రావాల్సిన పరిస్థితి యువరాణీ ....... , రాజ్యంలో వర్షాలు పడాలంటే వెంటనే శుభకార్యం జరగాలి .
యువరాణీ - మహారాణీ - చెలికత్తెలు ....... ఒకరివైపు మరొకరు చూసుకున్నారు .
పురోహితులు : ఆ శుభకార్యం ఎవరికి జరిపించాలో విన్నవించుకోవడానికే విచ్చేసాము - కానీ ఎలాచెప్పాలో అర్థం కావడంలేదు అంటూ సంశయిస్తున్నారు - ఆ శుభకార్యం జరిగితే మన రాజ్యంలో వర్షాలు విరివిగా కురవడమే కాదు రాజ్యం సకల సంతోషాలతో విరాజిల్లుతుంది .
యువరాణి : అయితే ఎవరికో వెంటనే తెలియజేయ్యండి పురోహితులారా జరిపించేద్దాము .
పురోహితులు : అదీ అదీ అదీ .......
యువరాణి : రాజ్యం సంతోషం కోసం అయితే ఎందుకు సంశయిస్తున్నారు , సంకోచించకుండా చెప్పండి .
పురోహితులు : అందరూ ఒకరినొకరు చూసుకున్నారు , మ అక్షరంతో మొదలయ్యే రాశులు గల వారికి వివాహం జరిపితే వెంటనే వర్షాలు కురుస్తాయి , మన రాజ్యానికి దేవుళ్ళు అనుగ్రహం లభిస్తుంది .
యువరాణి : ఎవరికో అర్థమైనట్లు సిగ్గుపడుతున్న మహారాణీ బుగ్గపై ముద్దుపెట్టి , వారెవరో మీరే తెలపండి పురోహితులారా అంటూ అడిగింది .
పురోహితులు : అదీ అదీ ..... మన రాజ్య ప్రజలకోసం అహర్నిశలూ ఆలోచించే వీరాధివీరుడైన మహారాజు మహేశ్వరుడికి మరియు మరియు .......
యువరాణీ : మరియు .....
పురోహితులు : మహారాజుతో ..... మా రాజ్యప్రజల సంతోషాలకోసం ఆరాటపడే దేవతైన మహా ..... మహారాణీ గారి వివాహం జరిపించాలి , తప్పుగా మాట్లాడితే మమ్మల్ని మన్నించండి కానీ శాస్త్రాల ప్రకారం ఇదొక్కటే మార్గం ......

యువరాణీ సంతోషాలకు అవధులులేనట్లు వదినమ్మా అంటూ కౌగిలించుకుని ముద్దులుకురిపిస్తోంది .
చుట్టూ చెలికత్తెలు సంతోషాలను వ్యక్తం చేస్తున్నారు .
పురోహితులు : మహారాణీవారికి ఇష్టమే అన్నమాట అంటూ ఊపిరిపీల్చుకున్నారు - రాజ్యప్రజలు ఆనందిస్తున్నారు .
చెలికత్తెలు : ఇష్టం అంటారు ఏంటి పురోహితులారా ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ అంటూ మా ప్రేమ మరియు జరిగిన వివాహం మరియు వివాహం గురించి వివరించారు .
రాజ్యప్రజాలందరూ ఉద్వేగాలకు లోనైనట్లు కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చుకుని ఆనందిస్తున్నారు .
పురోహితులు : మహారాణీ వివాహంతోపాటు రాజ్యపు రక్తం అయిన యువరాణీ వివాహం కూడా జరిగితే మరింత లాభం .......
మహారాణి : ఖచ్చితంగా ఖచ్చితంగా పురోహితులారా ...... శుభకారమైన విషయం చెప్పారు అంటూ చెల్లెమ్మ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .

యువరాణి : ఆనందంతో మహారాణీ గుండెల్లో ఒదిగిపోయింది , ఇందులో ఒక మతలబు ఉంది ప్రజలారా ...... , వివాహం అయ్యేంతవరకూ వదినమ్మ ఎవరనేది తెలపనని ఒకరికి ( దుర్గమ్మకు ) మాటిచ్చారు .
మరి మహారాజుగారు వివాహానికి ఒప్పుకుంటారా అంటూ ఒక అమ్మ అడిగారు .
యువరాణి : ప్రాణం పోయినా ఒప్పుకోరు అన్నయ్య ....... , అన్నయ్య హృదయంలో దేవకన్యకు తప్ప మరొకరికి స్థానం లేదు .
మరెలా .......
యువరాణి : మీరు అనుకుంటే సాధ్యం ...... అర్థమయ్యిందా ? .
ప్రజలు : అర్థమైంది అర్థమైంది , మేమంటే మేము సంతోషంగా ఉండాలన్నదే మహారాజుగారి ఏకైక కోరిక , ఆ ఒక్కటి చాలు కథను కంచికి చేరుస్తాము .
యువరాణి : అయితే వెంటనే ఆనకట్ట దగ్గరికి బయలుదేరదాము .
ప్రజలు : ఒక్కమాట ఒక్కమాట మహారాణీ గారు కూడా ఇష్టం లేనట్లుగానే వ్యవహరించండి ఇక మేము చూసుకుంటాము .
యువరాణి : కలలోనైనా కాదనలేరు కానీ ఎలాగోలా ఒప్పిస్తాను మరి , వదినమ్మా .........

అంతే పిల్లా పెద్దా రాజ్య ప్రజలందరూ పురోహితులతోపాటు ఆనకట్ట దగ్గర ఆలోచిస్తున్న మాదగ్గరికి చేరుకున్నారు , మహారాణీ - యువరాణి ...... పిల్లల మధ్యన దాక్కుని ఆనందిస్తున్నారు .

రాజ్యప్రజలందరూ రావడం చూసి , ప్రజలారా ఏమైంది అందరూ ఇలావచ్చారు అని అడిగాను .
ప్రజలు : ప్రభూ ..... రాజ్యంలో ఆహారనిల్వలు అయిపోవచ్చాయి , త్వరలో వర్షాలు పడకపోతే కరువు సంభవిస్తుంది .
లేదు లేదు లేదు అలా జరగకూడదు అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను , నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను మీ సంతోషం కోసం రాజుగా ఎంతదూరం అయినా వెళతాను , నా ప్రాణాలను కూడా .......
ప్రజలు : మా మహారాజు గురించి మాకు తెలుసు - మేమంటే ఎంత ఇష్టమో కూడా తెలుసు , వెంటనే వర్షాలు పడే మార్గాన్ని పురోహితులు విన్నవించారు .
అవునా అవునా రాజా పురోహితుల్లారా ...... అదేంటో తెలియజేయ్యండి వెంటనే వెంటనే అమలుపరుస్తాను .
పురోహితులు : మీచేతుల్లోనే ఉంది మహారాజా ......
నాచేతుల్లోనా అంటూ నావైపుకు చూస్తున్న బుజ్జాయిల వైపుకు చూసాను .
ప్రజలు : అవును మీచేతుల్లోనే ఉంది మహారాజా ...... 
పురోహితులు : అవును మహారాజా ...... , ఎన్నడూ సంభవించని ఈ ఉపద్రవానికి ఫలితం మహామహులైనవారికే అంతుచిక్కకపోవడంతో మన గ్రంథాలయంలోని పురాతన శాస్త్రాలను మరియు తాళపత్ర గ్రంథాలను తిరగేస్తే ఉపాయం లభించింది - ఆకాలంలోనే జ్ఞానులైన మన పూర్వీకులు ...... మూర్ఖులైన రాజులవలన ఇలాంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయని దానిని అంతమొందించడానికి పరమేశ్వర ప్రసాదమైన వీరాధివీరుడు మహేశ్వరుడు వస్తాడని రాసి ఉంది ఇదిగో ఇలా దేవుడిలా వచ్చి రాజ్య ప్రజలందరినీ కాపాడారు , రాజ్యం వర్షాలు - పచ్చని పంటలతో కళకళలాడాలంటే ఆ పరమేశ్వరుడి ప్రసాదమైన మా మహేశ్వరుడి వివాహం పార్వతీ దేవి ప్రసాదమైన మా మహారాణీ వారితో అంగరంగవైభవంతో జరిపించాలి . 
అంతే అలా కదలకుండా ఉండిపోయాను .......

బుజ్జాయిలయితే పట్టరాని సంతోషంతో బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి సంతోషపు కేకలువేస్తూ కిందకుదిగి అమ్మవారి చెంతకువెళ్లి మొక్కుకుంటున్నారు - బుజ్జాయిల ఆనందాలను చూసి బుజ్జిసింహాలూ ప్రార్థిస్తున్నాయి , నాన్నా నాన్నా ....... ఇన్నాళ్లకు మాకోరిక తీరబోతోంది అంటూ పూలవర్షం కురిపించారు .
తేరుకుని లేదు లేదు అలా జరగడానికి వీలులేదు , ఈ హృదయంలో ఒక్కరికే స్థానం నన్ను మన్నించండి ప్రజలారా ...... , పురోహితులారా వేరే మార్గమేమైనా ఉంటుంది చూడండి , ఇలా ఎక్కడైనా రాసి ఉంటుందా ...... ? .
పురోహితులు : కావాలంటే మీరే స్వయంగా చూడండి ప్రభూ అంటూ శిథిలావస్థకు చేరిన తాళపత్ర గ్రంథాన్ని అందించారు .
చూస్తే ఇప్పటివరకూ జరిగినది అచ్చుగుద్దినట్లు అప్పట్లోనే రాశారు - అంతే చేతిలో గ్రంథంతో బండరాయిపై కూలబడ్డాను .
బుజ్జాయిలు ముద్దులుకురిపిస్తూ సంతోషంతో నాట్యం చేస్తున్నారు .
పురోహితులు : మహారాజా ...... వారం దినములలో దివ్యమైన దైవ ముహూర్తం , ఆ ముహూర్తాన మహారాజు - మహారాణీ వివాహంతోపాటు యువరాణీ వివాహం కూడా జరిపించవచ్చు .
చెల్లెమ్మ వివాహం ...... చాలా సంతోషం కానీ నేనొప్పుకోలేను అంతకన్నా నా ప్రాణాలు ఇవ్వమనండి సంతోషంగా ఇస్తాను - ఈ జనం నా మహికోసం .......

తమరు ఒప్పుకుంటే మాత్రం సరిపోతుందా నేను ఒప్పుకోవాలికదా ....... అంటూ మహారాణీగారు వచ్చారు .
యువరాణి : వదినమ్మా .......
మన్నించండి మన్నించండి మహారాణీగారూ ...... అదే నేనూ సెలవిస్తున్నాను , అలా ఎన్నటికీ జరగకూడదు , పురోహితులారా ..... నాదొక సందేహం అయినా ఆ జగన్మాత పరమేశ్వరి అంశ మహి కదా కానీ మన మహారాణీ గారి పేరు హిమ ......
పురోహితులు : గ్రంథాలు చదివిన మీలాంటి వీరాధివీరులకు తెలియనిది ఏముంటుంది హిమ అంటే గంగ , గంగమ్మ కూడా పరమేశ్వరీ అంశమే మహారాజా ........
తప్పించుకునే మార్గమే లేదన్నమాట .......
పురోహితులు - ప్రజలు : మహారాణీ గారికి మేమంటే ఇష్టం మాకోసం ఎలాగైనా ఒప్పుకుంటారు - మీరు ఒప్పుకోకపోతే అతిత్వరలో కరువుకాటకాలతో అల్లాడుతాము , ఎలాగో అప్పుడు ఆహారం ఉండదు కాబట్టి మీరు ఒప్పుకునేంతవరకూ పిల్లలు - వృద్ధులు తప్ప ప్రతి ఒక్కరమూ మీరు ప్రార్థించే ఈ అమ్మవారి ముందు ఉపవాసదీక్షలో ఉండిపోతాము .
బుజ్జాయిలు : మేముకూడా అంటూ నాబుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి అమ్మవారి ముందు కూర్చున్నారు - తోడుగా బుజ్జిసింహాలూ ......
పిల్లలు : అయితే మేముకూడా అంటూ వెళ్లి బుజ్జాయిల చుట్టూ కూర్చున్నారు .
ప్రజలు : మాగురించి ఎలాగో పట్టించుకోరు పిల్లల గురించి అయినా ఆలోచించండి , మాటంటే మాటే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోము అంటూ అందరూ వెళ్లి కూర్చున్నారు .

అంతలో గుర్రంపై యువరాజు వచ్చి చెల్లెమ్మను అమాంతం పైకెత్తి ఆనందాన్ని పంచుకున్నాడు .
చెల్లెమ్మ : అంతలా ఆనందపడకు అన్నయ్య పెళ్లికి ఒప్పుకోవడంలేదు మన వివాహమూ జరగదు .
యువరాజు : ఒప్పుకోలేదా ..... ? , మహారాజా ..... కాదు కాదు బావగారూ సంతోషం కొద్దిసేపైనా లేకుండా చేశారు , మీరు ఒప్పుకునేంతవరకూ నేనుకూడా ఉపవాసమే అంటూ వెళ్లి చెల్లెమ్మ ప్రక్కన కూర్చున్నారు .

బుజ్జాయిలు : అమ్మా అమ్మా ఒప్పుకోవే .......
మహారాణి : సరే...... , మీకోసం - చెల్లికోసం - మన రాజ్యం కోసం ఒప్పుకుంటున్నాను .
సగం సంబరాలు నెలకొన్నాయి .
మహారాణీ గారూ ..... ఎంత పథకం పన్నారు , కావాలనే కాదని అందరి బలవంతంతో ఒప్పుకున్నట్లు నాటకం ....... , నేనైతే ఒప్పుకోనే ఒప్పుకోను .
మహారాణీ : నా రాజ్యపు ప్రజలకోసం నేనుకూడా ఉపవాసదీక్ష చేస్తాను అంటూ వెళ్లి అందరి మధ్యలో కూర్చున్నారు .

యువరాజు : బావగారూ ...... మీరు ఒప్పుకోకుంటే ఈ రాజ్యంతోనే ఆగదు , ఒక్క వర్తమానం పంపాను అంటే మా రాజ్యంలోని ప్రజలతోపాటు మన సామంతారాజ్యంలోని ప్రజలూ వచ్చేస్తారు .
ఈ ఒక్కటీ తప్ప ఏమైనా చేస్తాను , మీరంతా నాకు మద్దతు ఇవ్వకపోయినా నా మిత్రులు ........
అంతే మంజరి - కృష్ణ - సింహం మిత్రుడు ...... ఒక్కొక్కరుగా వెళ్లి మహారాణీ గారి ప్రక్కకు చేరుకున్నాయి .
మహారాణీ - యువారాణీ - బుజ్జాయిలతోపాటు అందరి నవ్వులు ......
మీరుకూడానా ...... మిత్రులారా , అమ్మా దుర్గమ్మా ..... వీరికెలా తెలియజెయ్యగలను , ఒకవైపు ప్రాణం కంటే ఎక్కువైన నా దేవకన్య మరొకవైపు రాజ్యపు సంతోషం ...... , నేను వివాహం చేసుకోలేను నేనుకూడా ఉపవాసం అంటూ మరొకవైపుకు తిరిగి కూర్చున్నాను .

కాసేపటికే సూర్యుడు తన ప్రతాపం చూయించడం మొదలెట్టాడు , తిరిగిచూస్తే కొద్దిమంది పిల్లలు ఎండలో ఉన్నారు , బుజ్జితల్లీ ...... పిల్లలందరూ చెట్టు చాటున కూర్చోండి .
బుజ్జాయిలు : అలాగే నాన్నగారూ అంటూ నీడన కూర్చున్న పిల్లలతోపాటు లేచి ఎండలో కూర్చున్నారు .
బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : అమ్మా నాన్న కలిసేంతవరకూ ఇంతే ......

మరికొద్దిసేపటి తరువాత బుజ్జాయిలూ ..... మీ ముద్దులులేకుండా ఉండలేకపోతున్నాను .
బుజ్జాయిలు పరుగునవచ్చి , అమ్మకు ముద్దులుపెడితేనే మేము ముద్దులుపెట్టేది అంటూనే ముద్దులుపెట్టి పరుగునవెళ్లి ఎండలో కూర్చున్నారు .
ప్రజలంతా నవ్వుకున్నారు .
ప్రజలారా ...... ఎండ ఎక్కువగా ఉంది ఉపవాసం విరమించి పిల్లలకు దాహం తీర్చి మీరుకూడా ......
ప్రజలు : మాగురించి ఆలోచించేవారు అయితే వివాహానికి ఒప్పుకోండి , మా కష్ట సమయాలలో మాకు ఎంతో సహాయం చేసిన మా దేవతలాంటి మహారాణీ గారిని వివాహం చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి .
ఆ అర్హత నాకు లేదు ప్రజలారా .......
ప్రజలు : దేవతను వివాహం చేసుకునే అర్హత దేవుడికి మాత్రమే , అయినా మీతో మాటలు అనవసరం మిట్ట మధ్యాహ్నం ఎండకే నాలుకలు తడారిపోతున్నాయి , కొద్దిసేపట్లో పిల్లలు - వృద్ధులు - ఆడవారు స్పృహకోల్పోతారు ఆ పాపం ఎవరిదో మీరే ఆలోచించుకోండి .
అలా జరగకూడదు , ప్రజలారా ...... నాకు ఇప్పటికే మీ మహారాణీ గారి మనస్సులాంటి దేవకన్యతో వివాహం జరిగింది .
ప్రజలు : వీరాధివీరులైన మహారాజులూ బహు వివాహాలుకూడా చేసుకోవచ్చు .
కానీ నేను ఏక .......
ప్రజలు : మాకు వినపడటం లేదు , మాట్లాడితే దాహం ఎక్కువ వేస్తోంది .
అయినా వివాహం చేసుకున్నాక వర్షం పడకపోతే .......
పురోహితులు : మహారాణీ గారూ అంటూ గుసగుసలాడారు , మహారాజా మహారాజా ...... ఇప్పుడు సరైన మాట అన్నారు , మీరు తొలిముడి వేసినప్పుడు మేఘావృతం కాకపోయినా రెండవ ముడికి ఉరుములు మెరుపులు రాకపోయినా మూడవ ముడి పడేసరికి చినుకులు పడకపోయినా వెంటనే వెంటనే శాస్త్రం ప్రకారం వివాహాన్ని రద్దుచేస్తాము .
మహారాణి : నాకు సమ్మతమే .......
మహారాణీగారికి ఏదైనా సమ్మతమే .......
నవ్వులు విరిసాయి .
నా గుండెలపై చేతినివేసుకుని ఊహూ ఊహూ ..... ఒప్పుకోలేను .
అయితే మేమూ ఉపక్రమించము ........

మధ్యాహ్నం అయ్యింది - సాయంత్రం అయ్యింది - చీకటిపడింది .
పిల్లలు ...... ఆకలి ఆకలి అంటూ గోలచేస్తున్నారు .
వెంటనే స్వయంగా నేనే అరణ్యంలోకివెళ్లి బోలెడన్ని పళ్ళు తీసుకొచ్చి పిల్లల ముందు ఉంచాను .
పిల్లలు : ఊహూ ..... ఆకలి అన్నాముకానీ తింటాము అనలేదుకదా మహారాజా ....... , ఎన్నిరోజులైనా ఇలానే ఉంటాము , పొట్టలో నొప్పివేస్తోంది అయినా పర్లేదు ........
పిల్లలూ దయచేసి ఆహారం తీసుకోండి , రేపు ఆలోచిద్దాము , ప్రజలారా పిల్లలకు తినిపించండి .
ప్రజలు : వాళ్ళు మా మాట వినే స్థితిలో లేరు మహారాజా ...... , అందరి భవిష్యత్తు మీ నిర్ణయంపైననే ఆధారపడి ఉంది , కరువు సంభవిస్తే ఎలాగో ఈ పరిస్థితి వస్తుంది అదేదో ఇప్పటినుండే అలవాటు చేసుకుంటాము , పిల్లలు ఎలాగో తట్టుకుంటారు పాపం చాలామంది వృద్ధులు ఉన్నారు ఉదయానికల్లా ఉంటారో .......
ప్రజలారా అలా అనకండి , నావైపు కూడా ఒకసారి ఆలోచించండి .
పురోహితులు : ఆలోచించే సమయం లేదు మహారాజా ...... , మూడురోజులలోగల ముహూర్తం దేవతలకిష్టమైన ముహూర్తం ......
ఉదయమేకదా వారం దినాలు అన్నారు .
పురోహితులు : వారం దినములలో అన్నాము వారం రోజుల తరువాత కాదు మహారాజా ....... 

తెల్లవారుతుండగా బామ్మా బామ్మా ...... ఏమైంది , వైద్యులు ఎక్కడ ......
పరుగునవెళ్లాను .
స్పృహకోల్పోయిన బామ్మను పరీక్షించి వెంటనే ఆహారం తీసుకోవాలి లేకపోతే ప్రాణాపాయం .......
వెనువెంటనే ఒక్కరొక్కరుగా వృద్ధులు స్పృహకోల్పోతున్నారు .

కన్నీళ్లను తుడుచుకుని అమ్మవారి చెంతకు వెళ్లి , అమ్మా ..... మీరే సరైన మార్గంవైపుకు తీసుకెళతారని భావిస్తున్నాను , రాజ్య ప్రజల శ్రేయస్సు కంటే రాజుకు మరొకటి ముఖ్యం కాదు , మహీ ...... నన్ను మన్నించు - నీ నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాను మన్నించరాని నిర్ణయం తీసుకోబోతున్నాను , ప్రజలారా ఒప్పుకుంటాను కానీ ఒక్కటి వివాహం తరువాత .......
వర్షం పడకపోతే మీ ఇష్టం మహారాజా అంటూ ప్రజలందరూ లేచి మహారాజా మహారాజా ...... అంటూ అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకుంటున్నారు .
నాన్నా నాన్నా .......
కిందకుదిగి బుజ్జాయిలను ఎత్తుకుని అఅహ్హ్ ...... ప్రాణం లేచొచ్చింది మీరులేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ ముద్దులుకరిపించాను , మహారాణీ - యువరాణి సంతోషాలను కోపంతో చూస్తున్నాను .
బుజ్జాయిలు : ప్రజలారా ...... అమ్మవైపు కోపంతో చూస్తున్నాను నాన్నకు ఇష్టంలేదు మళ్లీ కూర్చోండి కూర్చోండి .
లేదు లేదు ఇష్టమే ఇష్టమే ఇదిగో ఇదిగో సంతోషం ......
మా నాన్న బంగారం అంటూ ముద్దులుపెట్టారు బుజ్జాయిలు .

ఇక చూడండి దేవుడు - దేవత వివాహానికి రెండు రోజులే ఉన్నా ఎలాంటి ఏర్పాట్లు చేస్తామో ...... భూలోకమంత అలంకరణ ఆకాశమంత పందిరి  .......
ఆగండాగండి ముందైతే పిల్లలు - వృద్ధులకు తినిపించి మీరూ తినండి , సైనికులారా ...... పళ్ళు అందించండి అంటూ బుజ్జాయిలకు తినిపించి తిన్నాను .
బుజ్జాయిలు : అమ్మకు కూడా తినిపించండి నాన్నగారూ ......
పురోహితులు : అవునవును తినిపించండి అదే నిశ్చితార్థానికి సంకేతం అంటూ మహారాణీ గారిని నాముందుకు ప్రవేశపెట్టారు .
తప్పదా ......
బుజ్జాయిలు : తప్పదు నాన్నగారూ ...... , అత్తయ్యా ..... మీరుకూడా మామయ్యకు తినిపించండి .
చెల్లెమ్మ : ఆ తినిపించేదేదో ముసుగుతీసి తినిపించండి అన్నయ్యా - మీ దేవత సౌందర్యం చూసి ......
అవసరంలేదు వర్షం పడకపోతే ఎలాగో ఇలానే ఉండాలి , నా దేవకన్యను తప్ప మరొకరిని చూడను .
మహారాణీ : వర్షం పడుతుంది మహారాజా ..... ఆ ఆ ......
పండు తినిపించాను .
నిశ్చితార్థం అయినట్లు మాపై పూలవర్షం కురిపించారు .
మహారాజా - మహారాణీ ...... అంటూ పిల్లలందరూ సంతోషంతో హత్తుకున్నారు .
ప్రజాలారా ఒప్పుకున్నానుకదా ఇక ఇంటికి వెళ్ళండి .

ఇంటికి వెళ్లాడమా ...... , రెండురోజుల్లో వివాహ పండుగ , వివాహ ఏర్పాట్లకే సమయం సరిపోదు అంటూ రాజభవన ఉద్యానవనం కు వెళ్లి పనులు మొదలుపెట్టారు ఉత్సాహంగా ......
బుజ్జాయిలు : అత్తయ్యా ..... వెంటనే పిన్నమ్మలను పిలిపించండి , సింహం మిత్రమా ...... అడవిలోని జంతువులన్నింటికీ ఈ సంతోషమైన విషయాన్ని తెలియజేయ్యండి , రెండురోజుల్లో మన రాజ్యం అంతా నిండుగా నీటితో పచ్చని పంటలతో కళకళలాడబోతోంది .
సరిగ్గా చెప్పారు బుజ్జాయిలూ అంటూ ముద్దులు కురిపించిహత్తుకుంది చెల్లెమ్మ , ఇప్పుడే వదినలకు ఈ సంతోషమైన కబురును పంపుతాను , ఆఘమేఘాలమీద వచ్చేస్తారు .
తప్పుచేస్తున్నానో - ఒప్పుచేస్తున్నానో అర్థంకాక బుజ్జాయిలతోపాటు వెళ్లి అమ్మ ముందు మోకరిల్లాను .
( మహి : దేవుడా ..... అంతా లోకకల్యాణం కోసమే కాదు కాదు మన నదీ అమ్మ ఆనందం కోసమే , చిలిపి ఆనందాలు కావాలని కోరిక కోరారు తప్పలేదు , అమ్మా ..... సంతోషమే కదా అంటూ మొక్కుకుంది ) .
Like Reply
చెల్లెమ్మా సంతోషమేకదా ఇక వెళ్ళండి .
చెల్లెమ్మ : పురోహితులారా ....... శాస్త్ర బద్దంగా అన్నీ కార్యక్రమాలూ జరగాలంటే పెళ్లికూతురుతోపాటు పెళ్ళికొడుకు కూడా ఉండాలా వద్దా ...... 
పురోహితులు : తప్పకుండా ఉండాలి యువరాణీ .......
చెల్లెమ్మా ...... నా హృదయ దేవకన్యతో ఎప్పుడో ఆ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి వివాహం కూడా చేసుకున్నానని నీకు తెలుసుకదా ...... , ఆ అందమైన సంతోషపు అనుభూతులను నా ప్రాణమున్నంతవరకూ మరిచిపోలేను .
చెల్లెమ్మ : మాకు తెలియదా అన్నయ్యా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టింది .
మహారాణి బుగ్గపై ముద్దుపెట్టినట్లు బుగ్గపై స్పృశించుకుంది - ఆ ఆనందపు అందాలను మేము తిలకించలేదు కదన్నయ్యా ......
మహారాణీ గారూ ...... ముద్దుపెట్టింది నా ప్రాణం కంటే ఎక్కువైన నా దేవకన్యకు .
బుజ్జాయిలు : మన దేవకన్య ....నాన్నగారూ ..... అంటూ నా హృదయంపై ముద్దులు కురిపిస్తుంటే మహారాణీగారు మెలికలు తిరిగిపోతున్నారు .
అదిగో మళ్లీ .......
మహారాణి : రెండురోజుల్లో  ఆస్థానం ఎలాగో నాదే కదా మహారాజా ......
అది ఎప్పటికీ జరగదు మహారాణీ గారూ .......
మహారాణి : వర్షం పడితే సాధ్యమే .......
వర్షం పడాలని కోరుకోవాలా లేక పడకూడదని కోరుకోవాలా ...... , ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి పడేశావు అమ్మా ...... , మీకు తెలుసుకదా ఈ హృదయంలో మీ బిడ్డకు మాత్రమే స్థానం అని ......
మహారాణీ : నాకుకూడా అమ్మే .......
అయితే ఇక ఆ అమ్మపైనా భారం ......
చెల్లెమ్మ : సరిగ్గా చెప్పారు అన్నయ్యా ...... , భారమంతా మన దుర్గమ్మపై వేసి మాతోపాటు రండి అంటూ ఏకంగా లాక్కునివెళ్లారు .

రాజభవనంలోని ఉద్యానవనం చూసి ఆశ్చర్యపోయాము , చెల్లెమ్మా ..... ఇందాకనే కదా పనులు మొదలుపెట్టినది ఇంతలోనే ఎలా సాధ్యం ఇంత అందంగా మార్చివేశారు .
ఆహా ..... ఎంత అందంగా ఉందో అంటూ మహారాణీ - యువరాణి ఆనందాలకు అంతేలేకుండా పోయింది .
చెల్లెమ్మ : రాజ్యప్రజలు బంధువుల్లా మారిపోతే ఇలానే ఉంటుంది అన్నయ్యా ...... 

పురోహితుల నియమానుసారం ముత్తైదువులు ..... మహారాణీ - యువరాణీని తీసుకెళ్లి మంగళ స్నానాలతో పెళ్లి కార్యక్రమాలను మొదలుపెట్టారు , మరొకవైపు నన్ను - యువరాజును ముస్తాబు చేశారు .
సాయంత్రానికల్లా యువరాజు రాజ్యం మరియు బంధువులంతా విచ్చేసారు .
సాయంత్రానికి రాణులు ముగ్గురు నుండి బదులు వర్తమానాలు వచ్చేసాయి , అక్కయ్యా - చెల్లీ ...... కొన్ని ముఖ్యమైన పరిస్థితుల వలన వెంటనే రాలేకపోతున్నాము వివాహం రోజు ఉదయానికల్లా వచ్చేస్తాము చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ మా ముందు చదివి వినిపించింది చెల్లెమ్మ .......
మహారాణీ బుజ్జాయిలు నిరాశచెందినా వస్తున్నారని సంతోషించారు .

మరుసటిరోజు ఉదయానికల్లా రాజ్యంలోని ప్రతీ ఇల్లు పెళ్లి కళతో కళకళలాడసాగింది . 
ఇక రాజభవనం అయితే స్వర్గంలా మారిపోయింది - ఉద్యానవనం పందిరిలతో మహాద్భుతంగా మారిపోయింది .
ఘడియలు గడుస్తున్నకొద్దీ నాలో కంగారు అంతకంతకూ పెరుగుతుంటే , బుజ్జాయిల సంతోషం - ఉత్సాహం ...... అంతకంతకూ పెరుగుతూనే ఉంది , ప్రతీ కార్యక్రమానికి నాచేతులను పట్టుకుని లాక్కుని వెళ్లి మరీ జరిపించి మురిసిపోయారు ముద్దులుపెడుతూ ఈ అదృష్టం ఎవరికి లభిస్తుంది , ఆ ఆనందాలను పరుగునవెళ్లి మహారాణీ - యువరాణులతో పంచుకుంటున్నారు .

వివాహం రోజు రానే వచ్చింది - దైవ ముహూర్తం దగ్గరపడటంతో ముందుగా పురోహితులు పెళ్ళికొడుకులను పిలవడంతో ......
యువరాజు వెళ్లి సంతోషంగా కూర్చున్నాడు , నేను ఎంతకూ కదలకపోవడంతో బుజ్జాయిలు లాగుతున్నారు - వీలుకాక పిల్లలందరినీ కేకెయ్యడంతో ఉత్సాహంగా వచ్చి పెళ్లిపీటల మీదకు లాక్కునివెళ్లి కూర్చోబెట్టడం చూసి అక్కడున్న ప్రజలు మరియు లోపలనుండి మహారాణీ - యువరాణీ సంతోషంతో నవ్వుకున్నారు .
మంత్రాలు పలుకుతూ పెళ్ళికూతుర్లను పిలవడంతో బుజ్జాయిలిద్దరూ వెళ్లి పిలుచుకునివచ్చి మాఇద్దరి ప్రక్కన కూర్చోబెట్టారు .
ప్రాణమైన నాథుడిని మళ్లీ తనవాడిని చేసుకోబోతున్నానన్న ఆనందంలో బుజ్జాయిలిద్దరినీ మామధ్యన కూర్చోబెట్టి ముద్దుచేస్తోంది .
ఆ దృశ్యాలు చూసి తరించినట్లు ప్రజలంతా మాపై పూలవర్షం కురిపించారు .

ప్రజలారా ...... ఇంకా తాళి కట్టనేలేదు కాస్త ఆగండి .
ప్రజలు : నవ్వుకున్నారు , మా దేవుడు - దేవతల వివాహం అంటే ప్రతీదీ మాకు సంబరమే మహారాజా అంటూ మళ్లీ పూలవర్షం కురిపించారు .
ప్రక్కన పీటలపై కూర్చున్న చెల్లెమ్మవైపుకు తిరిగి తప్పదా చెల్లెమ్మా అని అడిగాను .
చెల్లెమ్మ : ప్రజలారా విన్నారా ..... ? .
ప్రజలు : ఉపవాస దీక్షకు సిద్ధమే యువరాణీ ...... అంటూ పైకిలేచారు .
వద్దు వద్దు వద్దు ...... , పురోహితులూ ...... తెలుసుకదా సూర్యుడు చూడండి ఎలా భాగభగలాడిపోతున్నాడో తొలి ముడి వేసేసమయానికి మేఘావృతం కాకపోతే .....
మహారాణి : మీఇష్టప్రకారమే పెళ్లిని ఆపేయ్యొచ్చు మహారాజా ....... , మరి మేఘాలు కమ్ముకుంటే సంతోషంగా మూడు ముళ్ళూ వేస్తారా ? .
వెక్కిళ్ళు వచ్చేసాయి , బుజ్జాయిలు అందించిన నీటిని త్రాగి అప్పుడు చూద్దాములే అన్నాను , ఎండ భయంకరంగా ఉండటం చూసి హమ్మయ్యా అనుకున్నాను , తప్పు తప్పు వర్షం పడాలి - రాజ్యం పులకించాలి .
మహారాణి : తథాస్తు .......

పురోహితులు : ముహూర్త సమయం ముహూర్త సమయం అంటూ తాళి అందించారు .
మహారాణి : పురోహితులారా ...... కొద్దిసేపు ఆపగలరా , చెల్లెళ్ళు ఇంకా రాలేదు .
చెల్లెమ్మ : అవునవును .......
బుజ్జాయిలు : నా - మహారాణి బుగ్గలపై ముద్దులుపెట్టి , ద్వారం దగ్గరికి పరుగులుతీశారు , సమయం గడుస్తున్నా రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు .
పురోహితులు : మహారాణీ - యువరాణీ ...... దైవ ముహూర్తం మళ్లీ ఇలాంటి ముహూర్తం పుష్కరానికి కూడా రాదు .
పురోహితులూ ..... ముహూర్తం కాదు ముఖ్యం , రాణులు రావడం ముఖ్యం ......
చెల్లెమ్మ : వదినా ..... ఆలస్యం చెయ్యాలని చూస్తున్నారు అన్నయ్య , నాకు తెలిసి దారి తప్పిపోయి ఉంటారు వచ్చేస్తారులే ......
మహారాణి : బుజ్జాయిలూ మీఇష్టం ఎలా అంటే అలా ......
బుజ్జాయిలు : ఆలోచించి అత్తయ్య చెప్పినట్లే కానిద్దాము .
బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : నాన్నగారూ ...... మీరు తప్పించుకోలేరు , పూజారిగారూ కానివ్వండి .
అయిపోయాను , హమ్మయ్యా బయట ఎండ ఉందిలే అంటూ నిర్భయంగా పురోహితుడి నుండి తాళి అందుకుని పైకిలేచి అందరివైపుకూ చూయించి మరొకసారి బయట ఎండను చూసి వెటకారమైన నవ్వుతో మహారాణీ మెడను చేరాను .

ప్రజలందరూ మావైపు సంతోషంతో - ఎండవైపు కంగారుపడుతూ పదేపదే చూస్తూనే లేచినిలబడ్డారు .
మహారాణీ ...... ఎండను చూసారా అంటూ గర్వంగా తొలిముడి వెయ్యడానికి రెండువైపులా కలిపానో లేదో ఆశ్చర్యం ఒక్కసారిగా చీకటి కమ్ముకున్నట్లు మబ్బులు .........
దేవుడు - దేవత , దేవుడు - దేవత ...... అంటూ సంతోషాలతో మాపై పూలవర్షం కురిపించారు , మహారాజుగారూ ..... తొలి ముడిని వేసినట్లే కదా .......
నోరెల్లబట్టి వేసినట్లే అన్నాను .
నవ్వుకుని అందరూ ఒకటి ఒకటి అంటూ కేకలువేస్తున్నారు .
బుజ్జాయిలు : భలేభలే అంటూ ముద్దులుపెట్టి చిందులువేస్తూ చప్పట్లుకొడుతున్నారు .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... రెండవ ముడిని కూడా వెయ్యండి .

అలాగే అంటూ నాకు తెలియకుండానే రెండవ ముడిని వేసాను - మహారాణీ అందమైన నవ్వులు నా హృదయాన్ని చేరుతున్నాయి .
మరింత ఆశ్చర్యం ...... పెద్దగా ఉరుములు మెరుపులు ......
మామూలుగా అయితే బుజ్జాయిలు - చుట్టూ పిల్లలు ...... ఆ శబ్దాలు భయపడేవారు కానీ సంతోషంతో చిందులువేస్తున్నారు .
చుట్టూ ప్రజలు అమితమైన ఆనందాలతో రెండు రెండు అంటూ పూలవర్షం కురిపిస్తున్నారు .

మహారాణి : మూడవ ముడి వెయ్యక తప్పదు మహారాజా ......
వేస్తున్నాను అంటూ మూడుముళ్లు వెయ్యడం ఆలస్యం గ్రంథాలలో రాసినట్లుగానే లోకకల్యాణం అన్నట్లు దేవతలే స్వయంగా ఆశీర్వదిస్తున్నట్లు వర్షం ధారాళంగా కురవసాగింది .
మూడుముళ్లు వేసిన సంగతే మరిచిపోయి బుజ్జాయిలను ఎత్తుకుని వర్షం కిందకుచేరి పూర్తిగా తడిచాము - ముద్దులలో మునిగిపోయాము .
బుజ్జాయిలకు మాత్రమేనా ముద్దులు నాకులేవా మహారాజా ....... అంటూ మహారాణి వచ్చింది .
తాళి కట్టడమే కాకుండా ముద్దులా అంటూ వర్షం ఆస్వాధిస్తున్న చెల్లెమ్మ చెంతకు చేరాను .
మహారాణి నవ్వుతూనే వెనుకే వచ్చింది .
చుట్టూ ప్రజలందరూ ఆనందబాస్పాలతో వర్షంలో తడుస్తున్నారు - నాచుట్టూ చేరి దండాలుపెడుతున్నారు .
ప్రజలారా ...... నావలన కాదు .
ప్రజలు : అవును మీవలన కాదు , మీరు - మహారాణీ గారు ఏకం అవ్వడం వల్లనే , మహారాజు - మహారాణీ , మహారాజు - మహారాణీ ...... అంటూ కేకలువేస్తూ మహారాణీ గారిని నాప్రక్కన చేర్చి వర్షంతోపాటు పూలవర్షం కురిపించి ఆనందిస్తున్నారు .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ చెల్లెమ్మతోపాటు మేము స్వచ్ఛను అందించిన చెల్లెళ్ళందరూ గుండెలపైకి చేరారు , ఈ కంగారులో వాళ్ళు వచ్చిన సంగతే తెలియదు .
చెల్లెళ్ళూ ...... మీరు ? .
చెల్లెళ్ళు : మా అన్నయ్య వివాహం అంటే ఆషామాషీ కాదు , అన్నీ రాజ్యాలలో ఈ వీరుడి వివాహం గురించే మాట్లాడుకుంటున్నారు , అలా తెలియగానే నలువైపుల రాజ్యాలలో ఉన్న మీ చెల్లెళ్ళంతా విచ్చేసాము , మీరేలాగో పిలవలేదు . 
వివాహమే .......
చెల్లెళ్ళు : తెలుసు తెలుసు ...... , అయినాసరే దేవతనే చేసుకున్నారు అంటూ ఆనందిస్తున్నారు వర్షంలో .......

వర్షం కోసం తప్పలేదు చెల్లెళ్ళూ - ప్రజలంతా ఒక్కటై నాకు ఇష్టం లేకపోయినా మూడు ముళ్ళు వేయించారు - మూడు ముళ్ళు వేసినంత మాత్రాన ఒక్కటైనట్లు కాదులే .......
అలా అన్నానో లేదో పెద్ద ఎత్తున పడుతున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది .
అందరిలో నిరాశ - బాధ .......
బుజ్జాయిలను ఎత్తుకుని రాజభవనం పైనున్న ఉద్యానవనం దగ్గరికి చేరుకుని చూస్తే కొండపైకూడా వర్షం ఆగిపోయింది , తల్లీ గంగమ్మా ఏమైంది అంటూ బాధపడుతూ కిందకుదిగి మిత్రుడిపై ఆనకట్ట దగ్గరకు చేరుకున్నాను - అప్పటివరకూ కురిసిన వర్షపు నీళ్లు ..... భూదేవి దాహం తీర్చడానికే సరిపోలేదు అన్నట్లు మొత్తం ఇంకిపోయాయి - మేఘాలవైపు ఆశగా చూస్తున్నకొద్దీ మేఘాలు పరుగులుతీస్తూ సూర్యుడికి దారిని ఇచ్చాయి .
నావెనుకే వచ్చిన కొంతమంది ప్రజాలుకూడా ఏమిజరిగిందో - అపరాధం ఎక్కడ జరిగిందో తెలియక బాధపడుతున్నారు .
సూర్యుడు అస్తమించి చీకటిపడి చంద్రుడి వెన్నెల ప్రకాశిస్తోంది కానీ మేఘావృతం మాత్రం జాడలేదు .

ప్రజలారా ప్రజలారా ...... వర్షం రాక మన దేవుడి వల్లనే - ఆగిపోవడం కూడా మన దేవుడి వల్లనే అంటూ పురోహితులు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు .
నావల్లనా ...... ? .
పురోహితులు : అవును మీవల్లనే మహారాజా ...... , వివాహానికి సంతోషంగా విచ్చేసిన వారిద్వారా మాకూ ఇప్పుడే తెలిసింది , " మూడు ముళ్ళు వేసినంత మాత్రాన ఒక్కటైనట్లు కాదు " గుర్తుకొచ్చాయా మహారాజా ......
అదీ అదీ ........
పురోహితులు : మీరు అలా అన్నారో లేదో తుఫానులా మారాల్సిన పెద్ద వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది .
అవి నా మమసులోని మాటలే ..... , పరిష్కార మార్గం సూచించండి పురోహితులూ .........
పురోహితులు : దేవుడు - దేవత ఒక్కటవ్వడమే ....... , వివాహం తరువాత జరగాల్సిన మూడు రాత్రుల కార్యం జరగాల్సిందే .......
బలవంతంగా మూడు ముళ్ళు వేయించారు కానీ మూడు రాత్రుల కార్యం జరిపించలేరు - ఇక్కడినుండి కదిలితేనే కదా .......

బుజ్జాయిలు : తప్పు నాన్నగారూ తప్పు , ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో జరగాలి అంటూ కిందకుదిగి బుజ్జిసింహాలను ఎత్తుకుని సింహాలపైకి చేరారు , నాన్నగారూ ..... మేము వెళుతున్నాము మావెనుకే మీరు వస్తున్నారు .
ముత్తైదువులు : అక్కడ అన్నీ ఏర్పాట్లూ చేసేసాము మహారాజా ...... , యువరాణీ కోసం రాజభవనంలో యువరాణీ మందిరాన్ని - ప్రకృతి ఒడిలో పెరిగిన మీకోసం రాజభవనపు కొండపైనున్న ఉద్యానవనంలోని పూరి గుడిసెను శ్రుంగార పూల గుడిసెగా అలంకరించాము , ఒక్కసారి వచ్చి చూశారంటే మీరే ఉత్సాహంగా లోపలికి చేరిపోతారు .
లేదు లేదు లేదు నేను రానంటే రాను - బుజ్జాయిలూ నన్ను వదిలి వెళ్లిపోతున్నారా ? .
బుజ్జాయిలు : లేదు నాన్నగారూ ..... మీరూ వెనుకే వచ్చేస్తారు మాకు తెలుసు , అన్నాచెల్లెళ్ళు ( మీరు , మీ చెల్లెమ్మ ) అలంకరించిన గధుల్లోకి వెలితే మళ్లీ మమ్మల్ని పట్టించుకుంటారో లేదో అందుకే ముందే వెళ్లి అత్తయ్య - అమ్మలకు ముద్దులు అందిస్తాము , రండి రండి ......
ఊహూ రానంటే రాను అంటూ అమ్మవారి ముందు కూర్చున్నాను .

పురోహితులు : ముహూర్త సమయం కావస్తోంది .
ప్రజలు : మహారాజుగారు మొండిగా కూర్చున్నారు ఏమి చెయ్యడం ......
పురోహితులు : గ్రంథాల ప్రకారం వర్షం కురవాలి అంటే దేవుడు - దేవత ఒక్కటవ్వాలి , మీఇష్టం ఏమిచేస్తారో ....... , ఈ ముహూర్తం దాటితే ......
ప్రజలు : తెలుసు తెలుసు పుష్కరం వరకూ ఆగాలి , మన దేవుడిని ఎత్తుకుని వెళ్లిపోవడం ఒక్కటే మార్గం .......
వద్దు వద్దు అంటూ పరుగుతీసాను .
అప్పటికే ప్రజలంతా చుట్టుముట్టడంతో తప్పించుకునే వీలులేక అమ్మవారి వృక్షాన్ని గట్టిగా చుట్టేసి పట్టుకున్నాను .
ప్రజలంతా నవ్వుకున్నారు , మహారాజుగారూ ..... మీరు ఒక్కరు - మేము వందకుపైనే అంటూ ఒక్కటై కాస్త కష్టమైనా చెట్టు నుండి వేరుచేసి కళ్ళూ చేతులూ కత్తివేసి జై వీరాంజనేయ అంటూ ఎత్తుకున్నారు .

అమ్మా దుర్గమ్మ తల్లీ ఇక మీరే రక్ష ......
రాజ్య వీధులగుండా ఎత్తుకుని వెళుతుంటే అందరూ చూసి మంచిపని చేశారు అంటూ సంతోషంతో నవ్వుకుంటూ రాజ్య ద్వారం వరకూ వచ్చి లోపలికి పంపించారు .
కింద ఉద్యానవనంలో ఉన్న చెల్లెళ్ళు - చెలికత్తెలు ..... ఇక మేము తీసుకెళతాము , ప్రజలు కిందకుదించి కట్లు విప్పారు , అన్నయ్యా అన్నయ్యా ..... తప్పించుకోవాలని ప్రయత్నించారో మీ చెల్లెళ్ళు ఒక్కొక్కరూ ఒక్కొక్క భద్రకాలీ అవతారం ఎత్తుతారు గుర్తుపెట్టుకోండి అంటూ నవ్వుకున్నారు , శోభనం నుండి పారిపోయే వీరాధివీరుడిని మిమ్మల్నే చూస్తున్నాము అంటూ రెండువైపులా చేతులను ఒడిసి పట్టుకుని పైకి తీసుకెళ్లారు .

చివరి అంతస్తులోని యువరాణీ మందిరం దగ్గర నాకోసమే ఎదురుచూస్తున్న చెల్లెమ్మ ..... నాగుండెలపైకి చేరి ఈరోజుతో మీ విరహ వనవాసం పూర్తవ్వబోతోంది చాలా చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా , మీరు - వదిన ఇక జీవితాంతం సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని మాత్రం చెప్పగలను .
చెల్లెమ్మా చెల్లెమ్మా ..... నా దేవకన్య గురించి నీకంటే ఎవరికి బాగా తెలుసు నువ్వే రక్షించాలి .
చెల్లెమ్మ : ప్రాణమైన చెల్లెమ్మగా చెయ్యాల్సినదే చేస్తున్నాను అన్నయ్యా - ఒక్కసారి మా వదిన సౌందర్యం చూశారంటే మేమెవ్వరం గుర్తుకురాము చివరికి బుజ్జాయిలుకూడా ......
ఇక నన్ను రక్షించేది బుజ్జాయిలు మాత్రమే ......, బుజ్జితల్లీ బుజ్జినాన్నా .......
చెల్లెమ్మ : అవునవును వారే వారే , మీకోసం మా వదినతోపాటు మీ మిత్రులతోపాటు పైన వెయ్యికళ్ళతో వేచిచూస్తున్నారు , నావలన ఆ సంతోషం ఆలస్యం అవ్వడం ఇష్టంలేదు తీసుకెళ్లండి తీసుకెళ్లండి అంటూ వెళ్లి యువరాజు కౌగిలిలోకి చేరి ఆనందిస్తోంది .
Like Reply
బుజ్జితల్లీ బుజ్జినాన్నా , బుజ్జితల్లీ బుజ్జినాన్నా ........
చెల్లెళ్ళు : వాళ్ళ దగ్గరకే తీసుకెళుతున్నాము అన్నయ్యా అంటూ చేతులతో కళ్ళుమూసి పైనున్న ఉద్యానవనం దగ్గరికి తీసుకెళ్లారు . 
ఒక్కసారిగా గుప్పుమన్న మల్లెపూల సువాసనకు వొళ్ళు జివ్వుమంది .
చెల్లెళ్ళు : ఈమాత్రం దానికే ఇలా అయితే ఎలా అన్నయ్యా అంటూ కళ్లపై చేతులను తీసేసారు .
రంగురంగుల పూలు - కొవ్వొత్తులతో అత్యంత సుందరంగా అలంకరించబడిన ఉద్యానవనాన్ని అలా చూస్తుండిపోయాను .
చెల్లెళ్ళు : ఎలా ఉంది అన్నయ్యా ......
చాలా అందంగా ఉంది .
చెల్లెళ్ళు : మా అన్నయ్య - వదినల శోభనం కోసం మేమే స్వయంగా ఇలా సర్వాంగ సుందరంగా అలంకరించాము .
శోభనమా ...... , లేదు లేదు అలంకరణ ఏమీ బాగోలేదు అంటూ చేతులను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను .
చెల్లెళ్ళు : మీ కళ్ళు ఆనందిస్తున్నాయే అంటూ పూలవర్షం కురిపిస్తూ పూలదారిలో నడిపించారు .

నాన్నా నాన్నా ...... అంటూ బుజ్జాయిలిద్దరూ పరుగునవచ్చి నామీదకు చేరారు .
చెల్లెళ్ళు : నాచేతులను వదిలి తప్పించుకోకుండా చుట్టూ చేరి నడిపించారు .
బుజ్జితల్లీ - బుజ్జినాన్నా ...... మీ దేవకన్య అమ్మకు అన్యాయం చెయ్యడం తగునా మీరే చెప్పండి .
బుజ్జాయిలు : అందుకే కదా నాన్నా ..... ఈ ఏర్పాట్లన్నీ , మీకు ఇప్పుడు అర్థం కాదు లోపలికి వెళ్ళాక తెలుస్తుంది .
చెల్లెళ్ళు : అవును లోపలికి వెళ్ళాక తెలుస్తుంది .

మిత్రులు నా మిత్రులు ఎక్కడ ? .
బుజ్జాయిలు : మిమ్మల్ని దగ్గరుండి ప్రకృతి గదిలోకి పంపించడం కోసం అక్కడే వేచిచూస్తున్నారు నాన్నగారూ ......
అవునన్నట్లు నృత్యం చేస్తున్నాయి .
అందరూ ఒక్కటైపోయారన్నమాట ఇక మంజరినే రక్షించాలి , మంజరీ మంజరీ ........
ప్రభూ ప్రభూ ...... ఏమిటి ఆలస్యం , శోభన ముహూర్తం దగ్గర పడుతుంటేనూ అంటూ ఏకంగా గుడిసెలోనుండి వచ్చి బుజ్జితల్లి భుజంపై వాలింది మంజరి .
నువ్వు లోపలే ఉన్నావన్నమాట , ఆయనా నా తప్పు ..... నువ్వెప్పుడో మహారాణీ వశం అయిపోయావు అని గుర్తించలేకపోయాను , చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ...... దయచేసి దయచేసి నన్ను వదిలెయ్యండి వెళ్లిపోతాను .
చెల్లెళ్ళు : మా జీవితాలను సంతోషయం చేసిన మా ప్రాణమైన అన్నయ్య రుణం తీర్చుకునే సమయం దక్కింది ఎలా వదులుకుంటాము , బుజ్జాయిలూ ..... సమయం ఆసన్నమయ్యింది చివరగా ఎన్ని ముద్దులిస్తారో ఇవ్వండి ఒక్కసారి లోపలికి వెళ్లారంటే ఎన్ని రాత్రుల తరువాత బయటకువస్తారో .......
బుజ్జాయిలు : నాన్నను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేము అలాంటిది రోజులు చూడలేము , అమ్మాన్నాన్నల కోసం కాబట్టి మిక్కిలి సంతోషమే అంటూ ముద్దులవర్షం కురిపించారు .
బుజ్జాయిలు - మంజరి - మిత్రుల కళ్ళల్లో సంతోషం ...... మనసుకు ఆహ్లాదాన్ని అయితే పంచుతోంది కానీ ...... , వెంటనే తప్పించుకోవాలి ......
చెల్లెళ్ళు : కుదరని పని అన్నయ్యా ......
బుజ్జాయిలు : నవ్వుకున్నారు , అమ్మా అమ్మా ..... నాన్నగారు వస్తున్నారు అని కేకలువేసి ముద్దులుపెట్టి కిందకుదిగారు , నాన్నగారూ ...... మాగురించి ఏమీ ఆలోచించకండి మంజరి - మిత్రులతో సంతోషంగా ఆడుకుంటాము అంటూ బుజ్జిసింహాలను ఎత్తుకుని సింహాలపైకి చేరారు .
చెల్లెళ్ళు : లోపలికి వెళ్ళాక మీరుకూడా గుర్తుండరులే బుజ్జాయిలూ - ఎక్కడైనా వధువు పాలగ్లాసుతో శోభనం గదిలోకి వెళుతుంది మా అన్నయ్య మొండితనం వలన వరుడు పాలగ్లాసుతో వెళ్లాల్సి వస్తోంది , ఏదైనా అందమేలే అంటూ చేతిలో పాలగ్లాసు ఉంచి కష్టంగా బలవంతంగా లోపలికితోసి పూలతో అలంకరించిన ద్వారాన్ని మూసేసి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు , వదినమ్మా ..... మేము వెళుతున్నాము ఇక మీ ఇష్టం ........

పాలను రాతిపై ఉంచేసే చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ...... అంటూ తలుపును ఎంత తియ్యడానికి ప్రయత్నించినా వీలుపడలేదు .
హ హ హ ...... ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోదు మహారాజా కాదు కాదు నా ప్రియాతిప్రియమైన నాథా ...... , సూర్యోదయం వరకూ తేరుచుకోనే తెరుచుకోదు .
ఏమిటీ ...... అంటూ పలుకులు వినిపించినవైపుకు తిరిగాను .
ఎదురుగా శృంగారం ఉట్టిపడేలా పూలతో అలంకరించిన పూలపాన్పుపై సిగ్గుపడుతూ ముసుగులో కూర్చున్న మహారాణీని చూస్తుంటేనే పాదరసంలా కరిగిపోతున్నాను - నుదుటిపై చెమట బిందువులు కూడా ...... , చుట్టూ పూలు - కొవ్వొత్తులతో శృంగారంగా అలంకరించిన శోభనపు గదిలో మనస్సు జివ్వుమనేలా నవ్వుతున్న మహారాణీ వయ్యారాన్ని చూస్తుంటేనే పెదాలు తడారిపోసాగాయి .
మహారాణీ నవ్వులకు తేరుకుని పెదాలను తడుముకున్నాను .
ఏమండీ అంటూ తియ్యని పిలుపు ......
వద్దు వద్దు అలా పిలవద్దు , అలా పిలిచే అర్హత ఒక్కరికే సొంతం నా హృదయంలో నిండిపోయిన నా సౌందర్యారాశి దేవకన్యకే సొంతం .......
నా సౌందర్యం ...... మీదేవకన్యకేమీ తీసిపోదులేండి అంటూ పాన్పు మీదనుండి కిందకుదిగి నిలబడింది .
అక్కడే ఆగిపోండి మహారాణీ ..... , మన మధ్యన ఈమాత్రం దూరం ఉండాలి .
దూరంగా ఉండటం కోసమా అమ్మవారి సమక్షంలో తాళికట్టి భార్యను చేసుకున్నది .......
అది బలవంతం చేసి ......
మహారాణి : బలవంతం చేస్తే బయపడటానికి మీరేమైనా బుజ్జాయినా ? .
అవును బుజ్జాయినే చేసి తాళికట్టించారు - ఇప్పుడుకూడా చేతులూ కాళ్ళూ కట్టేసి ఈ గదిలోకి తోసారు .
మహారాణి : హ హ హ ...... , ఏ గదిలోకి నాథుడా ..... ? .
అదే అదే శోభనం గదిలోకి .......
మహారాణి : అఅహ్హ్ మీ మాటలకే వొళ్ళంతా పులకరించిపోతోంది ఇక మీ కౌగిలిలో అంటూ ముందుకువచ్చింది .
వద్దు వద్దు అక్కడే ఆగిపోండి , అర్థం చేసుకోండి ఈ మనసును ఎప్పుడో నా దేవకన్యకు అప్పజెప్పి నా హృదయమంతా తనతో నింపుకున్నాను , వేరొకరికి స్థానం లేదు .
మహారాణి : ఎక్కడ ఉందో ఏమి చేస్తోందో ......
ఎక్కడ ఉన్నా ఆ దుర్గమ్మ తల్లి రక్షణలో నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది - ఎప్పటికైనా ఒక్కటవుతాము .
మహారాణి : తనను చేరుకునేలోపు మీ జీవితం అయిపోతుందేమో .......
సంతోషంగా ప్రాణాన్ని వధులుతాను - ఈ ప్రాణం ..... నాదేవకన్యకోసం అంటూ హృదయంపై చేతినివేసుకుని అనుభూతి పొందుతున్నాను , మరొకరిని ఊహించుకోలేను వేచిచూస్తాను ప్రపంచం మొత్తం అన్వేషిస్తాను , అందులో ఆనందం ఉంది - చూడలేకపోతున్నానన్న అంతులేని బాధకూడా ఉంది అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను .

అమ్మా దుర్గమ్మా ...... ఇక నాదేవుడిని బాధపెట్టడం ఇష్టంలేదు అంటూ మహి లా మాట్లాడింది , దేవుడా ...... నన్ను మన్నించండి .
ఆ మాటలకే కన్నీళ్లు కాస్త ఆనందబాస్పాలుగా మారిపోయాయి , నా మహి స్వరం - నా ప్రియమైన ప్రాణమైన ప్రాణం కంటే ఎక్కువైన నా దేవకన్య స్వరం .......
దేవుడా అంటూ ముసుగులోనే పరుగునవచ్చి నా గుండెలపైకి చేరి చుట్టేసింది .
అఅహ్హ్ ..... హ్హ్ .... హ్హ్హ్..... హృదయవేగం - శ్వాస ..... అమాంతం పెరిగిపోసాగింది , ఆ క్షణం కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాను , వొళ్ళంతా తియ్యదనంతో వణికిపోతున్నాను .
ఆ చిరు కౌగిలింతకే బయట ఉరుములు మెరుపులతో వర్షం మొదలైనట్లు తుంపర మమ్మల్ని తాకుతోంది .
దేవుడా దేవుడా నా ప్రియమైన ప్రాణమైన ప్రాణం కంటే ఎక్కువైన దేవుడా ...... ఈక్షణం కోసం మీ ప్రియమైన కౌగిలిలో చేరడం కోసం ఎన్ని రోజులు యుగాలుగా గడిపానో ....... , మీ ముద్దుకోసం ......
మహీ - నా దేవకన్యా - అతిలోకసుందరీ ...... అంటూ ముఖంపై ముసుగును తీసేసి అహ్హ్హ్ ..... హ్హ్ .... హ్హ్ ...... హృదయంలోనుండి సంతోషం కళ్ళల్లోనుండి బాస్పాలుగా ......
మహి : నాదేవుడి కన్నీళ్లు భూదేవిని స్పృశించినా ప్రళయమే , ఆ తల్లికూడా తట్టుకోలేదు అంటూ నా కన్నీటి బిందులను పెదాలతో అందుకుని పాదాలను పైకెత్తి కళ్లపై ముద్దులుపెట్టింది .
మహీ అంటూ ప్రేమతో కౌగిలించుకుని బుగ్గలను సున్నితంగా అందుకుని కళ్ళల్లోకే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ నుదుటిపై పెదాలను తాకించాను .
నాకౌగిలిలో జలదరించిపోతోంది - ఈ ముద్దుకోసమే జీవిస్తున్నట్లు స్పర్శ ద్వారానే తెలియజేస్తోంది .
నుదుటిపై పెదాలను తాకించి ఎంతసేపు ఉండిపోయామో ఒకరికౌగిలిలో మరొకరం ప్రపంచాన్నే మరిచిపోయాము .
బయట వర్షం అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
Like Reply
Nice update
[+] 1 user Likes Hydguy's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice excellent  & marvelous update  banana

thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
Excellent update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Xossipy history lo the best gaa /////. MAHESH THE HERO .\\\\\ nilichipothundhi brother.
[+] 2 users Like Manavaadu's post
Like Reply
Thumbs Up 
Nice????
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
రవి కాంచనదీ కవి గాంచును. 
కవివర్మ కాంచునది రవిర్మ గాంచును.

కవి వర్మ --- >  మన   xossipy  రైటర్స్ 
రవివర్మ --- >   మన  బోమ్మల  దేవుళ్ళు 

తలుచుకుంటే సత్కవి, సాధ్యము కానిది లేదిభువి! 
[+] 3 users Like smartrahul123's post
Like Reply
Super update
[+] 1 user Likes Madhu's post
Like Reply
Heartfully thankyou so much .
Like Reply
చాలా చాలా బాగుంది
[+] 1 user Likes Gova@123's post
Like Reply
Keka puttincharu bayya.
Ika climax kosam waiting.
[+] 1 user Likes Mahe@5189's post
Like Reply
ఆనంద భాష్పాలు కురిశాయి నాకు.
చాలా ధన్యవాదాలు సార్ .మీ అద్భుత రచనకు నా జోహార్లు.
[+] 2 users Like TRIDEV's post
Like Reply
Super update bro.
[+] 1 user Likes donakondamadhu's post
Like Reply




Users browsing this thread: 362 Guest(s)