Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
Exllent update mahesh garu
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Hi ji pls update evande weekly once ayina yedho oka story lo pls pls pls ji
Like Reply
Update bro
Like Reply
Sir please update evande ???????
Like Reply
Next .........
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
(17-03-2024, 01:36 PM)Mahesh.thehero Wrote: Next .........

Nxt yepudu ji pls we are waiting
Like Reply
(17-03-2024, 01:36 PM)Mahesh.thehero Wrote: Next .........

Nxt yepudu ji pls we are waiting
[+] 1 user Likes Manoj1's post
Like Reply
12 లోపు ........
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
Waiting bro
Like Reply
(27-02-2024, 11:05 PM)కిరణ్కుమార్ Wrote: Excellent bro

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(20-02-2024, 12:13 AM)prash426 Wrote: Nice update mahesh Garu

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(18-02-2024, 07:11 PM)maheshvijay Wrote: Lovely update

Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(18-02-2024, 04:09 PM)కిరణ్కుమార్ Wrote: Superb bro

Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(18-02-2024, 10:17 AM)Teja.J3 Wrote: Wow keka anthey maastaru..em cheppalem..super anthey..aunties tho naughty fight ni ela gaina inka kastha spice cheyali ani koruthunna mee abhimani..

Heartfully thankyou so much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
మహేష్ - తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... తీసుకో అంటూ అమ్మకూచీ - అక్కయ్యలు ..... బజ్జీలు తీసుకొచ్చారు .
లవ్ ..... థాంక్యూ అమ్మకూచీ , అచ్చు అమ్మలానే ఉన్నావు అమ్మకూచీ ......
బుజ్జిజానకి : నీవల్లనే అమ్మలా రెండోసారి ......
నావల్ల ఏంటి ? , గిఫ్ట్స్ తెచ్చినది దేవతలైతేనూ .......
బుజ్జిజానకి : అక్కయ్యలు అంతా చెప్పారులే .....
చెప్పినంత మాత్రాన నావల్లనే అయిపోతోందా ? , దేవతలు ఎంతో ప్రేమతో తీసుకొస్తేనూ ......
బుజ్జిజానకి : సరే సరే నీకు ఏది ఆనందం పంచితే అదే అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
అఅహ్హ్హ్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని , వెనక్కు పడిపోబోతే అక్కయ్యలు పట్టేసుకుని హమ్మయ్యా అనుకున్నారు .
నో నో నో స్ట్రేంజర్స్ వదిలెయ్యండి వదిలెయ్యండి .
అక్కయ్యలు : స్ట్రేంజర్స్ ..... అంటూ కోపంతో వదిలేశారు .
కోపంతో వచ్చిన దేవతలు .... మంచిపని చేశారు తల్లులూ అంటూ ముద్దులుపెట్టి సంతోషంతో వెళ్లారు .
గడ్డిలో పడ్డాను సరిపోయింది .
అక్కయ్యలు : మరి స్ట్రేంజర్స్ అంటావా ...... ? .
మహేష్ మహేష్ ....... అంటూ నవ్వుతూ పైకిలేపి , అలా అనవచ్చా అంటూ కొడుతోంది - గిల్లేస్తోంది .
స్స్స్ స్స్స్ ..... , అలా అనగానే నా దేవతల పెదాలపై సంతోషాలను చూశావుకదా ...... , దేవతల సంతోషం కంటే నాకింకేమీ అవసరం లేదు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... కాస్త పైనుండి వదలాల్సింది .
అక్కయ్యలు : పర్లేదులే చెల్లీ ...... , మొదటి రోజు నుండీ పాడుతున్న పాటే కదా , అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... మాకూ ఒకరోజు వస్తుంది , అప్పుడు అంతులేని ప్రేమను పంచుతాము .
బుజ్జిజానకి : విన్నావా దేవుడా ...... ? .
దేవతల ప్రేమ తప్ప వేరొకటి కనిపించనే కనిపించదు .
అక్కయ్యలు కోపంతో గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ......
అంటీలు : అల్లరి చేస్తున్నాడా ? , అదీ అలా గిల్లేయ్యండి .

నేనేమీ మాట్లాడటం లేదు దేవతలూ ..... , అయినా సరే అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను .
అంటీలు : ఫస్ట్ గుంజీలు మొదలుపెట్టేస్తాడు , ఇప్పటికే వెయ్యి గుంజీలు తీయించామని బాధగా ఉంది .
బుజ్జిజానకి : నాకు తెలుసు అత్తయ్యలూ ..... , అల్లరి పిల్లాడిపై ఎక్కడో ప్రేమ ఉంది .
అంటీలు : ష్ ష్ ష్ జానకీ ..... , అలాంటిదేమీ లేదు వెయ్యి గుంజీలు తీయించాము అని ఫీల్ అవుతున్నాము , అమ్మా దుర్గమ్మా ..... ఆ అల్లరి పిల్లాడికి ఏమీ కాకూడదు , ఇలా ప్రార్థించానని చెప్పకండి మరింత అల్లరి చేస్తాడు , హలో హీరో .... చాలు చాలు ఆపు .
దేవతలు ఎలా అంటే అలా .......
అందరూ నవ్వుకున్నారు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ..... అంటూ ముద్దులుపెట్టి నావైపు కన్నుకొట్టింది .
అఅహ్హ్ ......

మేడమ్ కు కాల్ రావడంతో ప్రక్కకువెళ్లి మాట్లాడారు , కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని రావడం చూసి పెద్దమ్మనే మేడమ్ దగ్గరికి వెళ్లారు , విషయం తెలిసినా చెల్లీ ...... ఏమైంది ? అని అడిగారు .
మేడమ్ : అక్కయ్యా ..... అదీ అదీ .....
పెద్దమ్మ : నాదగ్గర మొహమాటం ఏమిటి చెల్లీ ...... 
మేడమ్ : పెద్దమ్మ చేతిని అందుకుని లోపలికి తీసుకెళ్లారు , అక్కయ్యా ...... అదీ అదీ డిన్నర్ నేను తీసుకురావాల్సింది కదా ..... , అత్తయ్యగారిని అడిగితే సరే అన్నారు అన్నీ ఉదయమే సిద్ధం చేసాము - ఇప్పుడు నేను వెళ్లి వంట చేయాల్సింది - ఈ విషయం తెలుసుకున్న మావారు అనవసరమైన ఖర్చులు అంటూ అత్తయ్య గారిపైనే కోప్పడ్డారట - స్టోర్ రూమ్ లాక్ చేసుకుని వెళ్లిపోయారట - వంట సరుకులన్నీ అందులోనే ఉన్నాయి , ఏమిచెయ్యాలో పాలుపోవడం లేదు అక్కయ్యా ...... , ఇప్పుడేలాగోలా బయటపడితే మన బుజ్జిజానకి కోసం ఉదయం ప్రేమతో వంట చేసుకొస్తాను , నాపై నమ్మకంతో బయట అందరూ అంటూ పెద్దమ్మ గుండెలపైకి చేరారు కన్నీళ్ళతో .......
పెద్దమ్మ : ఈ మగాళ్లు ఎప్పుడూ ఇంతే కొంతమంది మగాళ్లు ...... - చెల్లీ ..... ఈమాత్రం దానికి కన్నీళ్ళుపెడితే ఎలా ..... ? .
మేడమ్ : వారు ఎప్పుడూ ఇలానే అక్కయ్యా , అత్తయ్యగారి మాటకు అదే అమ్మ మాటకు కూడా విలువ ఇవ్వరు .
పెద్దమ్మ : చెల్లీ ...... స్టోర్ రూమ్ లాక్ చేసేసాడు కదా మరి ఉదయం ఎలా క్యారెజీ తీసుకొస్తావు ? .
మేడమ్ : కావాల్సిన సరుకులను ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురమ్మన్నారు అత్తయ్య గారు , ఆయన ఎలాగో ఉదయమే వెళ్ళిపోతారు .....
పెద్దమ్మ : అర్థమైంది చెల్లీ ..... , ఇక డిన్నర్ సంగతి ఈ అక్కయ్య చూసుకుంటుందిలే , ఉదయం మాత్రం నీ వంతు , ఎందుకంటే మా అందరికంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం బుజ్జిజానకికి , నీ చేతి వంట జానకి చేతి వంటతో సమానం అంటూ కన్నీళ్లను తుడిచారు .
మేడమ్ : లవ్ టు లవ్ టు అక్కయ్యా అంటూ సంతోషమైన నవ్వులు ......

ఏంటి అక్కాచెల్లెళ్ళు లోపలికి వచ్చిమరీ సీక్రెట్స్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు , మాకూ చెబితే మేమూ సంతోషిస్తాము కదా అంటూ దేవతలు - అక్కయ్యలు లోపలికివెళ్లారు .
దేవతలను హత్తుకునే ఉన్న అమ్మకూచీ లోపలికి రా అంటూ కన్నుకొట్టింది .
అంత ప్రేమతో పిలిస్తే వెళ్లకుండా ఉంటానా ..... ? , నాకు తెలియకుండానే అడుగులు పడ్డాయి .
అంటీ - దేవతమ్మా ...... మాకు చెప్పకూడదా అంటూ హత్తుకున్నారు అక్కయ్యలు .

పెద్దమ్మ : అలాంటిదేమీ లేదు తల్లులూ మా ప్రాణమే మీరు ...... 
అక్కయ్యలు : అయితే ఆ సీక్రెట్ ఏంటో చెప్పాల్సిందే ......
పెద్దమ్మ : సీక్రెట్ ఏమీ కాదులే తల్లులూ ...... , మీ అమ్ములు ..... షాపింగ్ వెళ్లి ఇదిగో ఇంతటి అందమైన గిఫ్ట్స్ తీసుకొచ్చి జానకిలా మార్చేసి ఫుల్ మార్కులు కొట్టేశారు , మీరే చూడండి అత్తయ్యలూ అత్తయ్యలూ ...... అంటూ వదలకుండా హత్తుకునే ఉంది మీ చెల్లి ......
లవ్ యు అత్తయ్యలూ అంటూ ముద్దులుపెట్టి మురిసిపోతోంది అమ్మకూచీ .....
పెద్దమ్మ : చూసారా ముద్దులన్నీ మీ అమ్మలకే , రేపు మాత్రం జానకి మొత్తం ప్రేమను - మొత్తం ముద్దులను మేము పొందాలని ఫిక్స్ అయిపోయాము .
అక్కయ్యలు : ఎలా ? .
పెద్దమ్మ : మీ అమ్ములు ఎలా అయితే బుట్టలో వేసుకున్నారో అచ్చు అలానే .......
అంటీలు : అంటే మా బుజ్జితల్లికి కాదు కాదు జానకికి బోలెడన్ని గిఫ్ట్స్ రాబోతున్నాయన్నమాట అంటూ సంతోషంతో నుదుటిపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ : అవును దేవతలూ ...... రేపు నువ్వా ? - నేనా ? చెల్లీ అంటూ అందమైన మేడమ్ గారితో డిస్కస్ చేస్తున్నాను అంతలోనే మీరు వచ్చేసారు , కన్నయ్యా ..... అంటూ కంటి సైగ ద్వారా విషయం తెలియజేసి , చెప్పు చెల్లీ ..... ఆ ముగ్గురు దేవతల కంటే ఎక్కువ గిఫ్ట్స్ నువ్వు తీసుకొస్తావా ? లేక నన్ను తీసుకురమ్మంటావా ? , ముందుగా నువ్వు తెస్తేనే కదా జానకికి మరింత సంతోషం .......
మేడమ్ : అక్కయ్యా ...... అదీ అదీ ఈ నెల సాలరీ మొత్తాన్నీ ఆయన తీసేసుకున్నారు , ఒకటో తారీఖున సాలరీ పడగానే మొత్తం సాలరీతో మా బుజ్జిజానకికి ప్రేమతో గిఫ్ట్స్ తీసుకొస్తాను అంటూ బాధపడుతూ చెప్పారు .
అంటీ ...... గిఫ్ట్స్ కంటే మీ ప్రేమ విలువైనది , ఇన్నాళ్లూ ప్రాణంలా చూసుకున్నది మీరే కదా అంటూ మేడమ్ గుండెలపైకి చేరింది అమ్మకూచీ ......
మేడమ్ : లవ్ యు లవ్ యు సో మచ్ బుజ్జిజానకీ ...... అంటూ ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .

మేడమ్ గారూ ...... మీ ప్రాణమైన బుజ్జిజానకికి గిఫ్ట్స్ తీసుకురావడం ఇష్టంలేదు అని చెప్పండి కానీ సాలరీ వంక చూపి తప్పించుకోవాలని ప్రయత్నించకండి .
మహేష్ ...... అనబోయి ఏదో సర్ప్రైజ్ ఉందని అర్థమై కన్నుకొట్టి నవ్వుతోంది అమ్మకూచీ , కంటిన్యూ కంటిన్యూ దేవుడా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
అంటీలు : మా చెల్లి అలాంటిది కాదులే అల్లరి పిల్లోడా ..... అంటూ మేడమ్ చుట్టూ చేరారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ అంటూ చెవులలో గుసగుసలాడింది .
అక్కయ్యలకు అర్థమైనట్లు అమ్మకూచీతోపాటు ఆనందిస్తున్నారు .
పెద్దమ్మ : నవ్వుకుని , అవునవును మాట జాగ్రత్త మహేష్ , నువ్వు ..... నీకూచీ జీవితంలోకి వచ్చినది రోజులే కానీ ఊహతెలిసినప్పటి నుండీ ప్రాణంలా చూసుకుంటున్నది మా చెల్లి .......

మేడమ్ గారి ప్రాణం బుజ్జిజానకి అందులో సందేహం లేదు దేవతలూ ...... , మేడమ్ గారి కళ్ళల్లో చెమ్మ చూస్తుంటే విషయమైతే తెలిసినట్లుగా లేదు , తప్పైతే నాదే sorry sorry మేడమ్ అంటూ గుంజీలు తీస్తున్నాను .
అంటీలు : తప్పు ఒప్పుకున్నావుకదా ముందైతే గుంజీలు తియ్యడం ఆపు , ఇప్పటికే వెయ్యి గుంజీలు తీయించినందుకు ఫీల్ అవుతున్నాము .
బుజ్జిజానకి : నాకు తెలుసు అత్తయ్యలూ ......
అంటీలు : జానకీ ..... నువ్వేమి చెప్పబోతున్నావో తెలుసులే , అలా ఏమీ కాదు అంటూ ముద్దుపెట్టి నవ్వించారు .
బుజ్జిజానకి : ఇంతకూ మేడమ్ కు - మాకు కాకుండా నీకు మాత్రమే తెలిసిన ఆ విషయం ఏమిటో చెప్పు .......
మేడమ్ గారికి విషయం తెలియదే అనుకుంటున్నాను .
అంటీ : ఏ విషయం మహేష్ ...... ? .
బుజ్జిజానకి : టెన్షన్ పెట్టకుండా ముందైతే ఆ విషయం చెప్పు మహేష్ అంటూ కన్ను కొట్టింది .
కూల్ కూల్ కూల్ బుజ్జిజానకీ ..... , మేడమ్ అంటే ఎంత ప్రాణమో తెలుసులే , హెడ్ మిస్ట్రెస్ ..... మధ్యాహ్నం నిద్రపట్టక టీవీ చూస్తుంటే న్యూస్ లో చెప్పారు ......
బుజ్జిజానకి : ల్యాగ్ లేకుండా చెబుతావా లేక అంటూ లోలోపలే నవ్వుకుంటూ వచ్చి నాచేతిని చుట్టేసి భుజంపై కొరికేసింది .
స్స్స్ ......
అంటీలు : అదీ అలా కొరికేయ్యి జానకీ అంటూ అమ్మకూచీతో హైఫై కొట్టి ఆనందిస్తున్నారు .
పనిలోపనిగా దేవతలూ అంటూ హైఫై కోసం చేతిని ఉంచాను .
దేవతల కోపం చూసి అమ్మకూచీ - అక్కయ్యలతోపాటు మేడమ్ కూడా నవ్వేశారు .
బుజ్జిజానకి : నవ్వించి మాట మార్చడం కుదరదు చెబుతావా కొరికేయ్యాలా .... ? , న్యూస్ లో ఏమి చెప్పారు ?  .
చెబుతాను చెబుతాను ...... , న్యూస్ లో ఏమి చెప్పారంటే సంక్రాంతి రాబోతున్నందుకు గానూ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఏకంగా సంవత్సరం జీతాన్ని కానుకగా ఇచ్చేసాము .
బుజ్జిజానకి : వన్ ఇయర్ సాలరీ ..... wow అంటీ అంటూ వెళ్లి హత్తుకుంది , అంటీ అంటీ ..... ఓహో స్వీట్ షాక్ లో ఉన్నారా ? .
మేడమ్ : అమ్మకూచీ బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మకూచీని హత్తుకునే చేతిలోని మొబైల్లో అకౌంట్ ఓపెన్ చేసి చూసి , 5 lakhs ...... పట్టరాని ఆనందంతో అమ్మకూచీకి ముద్దుల వర్షం కురిపించి , బుజ్జిజానకీ ...... రేపటి వరకూ ఆగలేకపోతున్నాను షాపింగ్ కు ఇప్పుడే వెళ్లిపోవాలని ఉంది , మన బుజ్జిజానకికి ఎప్పటి నుండో ఎన్నో ఇవ్వాలని ఆశపడ్డాను , ఇప్పటికి అదృష్టం కలిగింది అంటూ పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు .
చెల్లీ చెల్లీ ..... అంటూ దేవతలంతా సంతోషాన్ని పంచుకుని నవ్వుకున్నారు .
ప్చ్ ప్చ్ ...... వన్ ఇయర్ కాకుండా two year బోనస్ ఇచ్చి ఉంటే మరింత బాగుండేది .

మేడమ్ : థాంక్యూ సో సో మచ్ మహేష్ ...... 
నో నో నో నేనే sorry మేడమ్ ......
మేడమ్ : ఏమీ పర్లేదు , గుడ్ న్యూస్ తెలియజేశావు , ఎన్ని గంటల న్యూస్ లో చెప్పారు ? .
టైం తెలియదు మేడమ్ , బుజ్జిజానకి - ఆక్ ..... ప్రాణంలా జోకొడుతూ నిద్రపుచ్చి మీరూ నిద్రపోయారు కదా అప్పుడు ......
బుజ్జిజానకి : అంటే సంతోషంతో ఈ విషయం చెప్పడానికే టీపాయ్ దగ్గరకు వచ్చి చూసి చూసి అలాగే నిద్రపోయావన్నమాట ....... అంటూ కన్ను కొట్టింది .
ఆ ఆ ఆ ...... అవునవును బుజ్జిజానకీ , దేవతలూ ...... ఎందుకు ఎందుకు అని ఆడిగారుకదా అర్థమయ్యిందా ? , ఎన్ని గుంజీలు తీసానో అమ్మా హమ్మా ......
బుజ్జిజానకి : యాక్టింగ్ చెయ్యకు మహేష్ ...... , ఇదే విషయం అప్పుడేందుకు చెప్పలేదు ? .
అదీ అదీ ..... ఆ ఆ , ఎంత కోపంతో అడిగారు దేవతలు , భయపడిపోయాను ఆ సందర్భంలో మైండ్ పనిచెయ్యలేదు .
కవరింగ్ ......
నో నో నో ........
అందరూ నవ్వేశారు .
మేడమ్ : మహేష్ ..... ఇంత గుడ్ న్యూస్ తెలియజేసినందుకు ......
అంటీలు : అంతలా పొగడకు చెల్లీ ...... , మరింత అల్లరి చేస్తాడు .
మేడమ్ : నావైపే దీనంగా - ఆరాధనతో - సంతోషంతో చూసి , అల్లరి చేసినా అందంగా ఉంటుంది అంటూ నవ్వుకున్నారు .
బుజ్జిజానకి : నావైపే ప్రేమతో చూస్తూ మేడమ్ బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుతోంది , అత్తయ్యలూ ...... మధ్యాహ్నం మీరు లేకుండా కళ్ళకు గంతల ఆట ఆదుకున్నాము , మీరు లేకుండా మేమూ ఆడలేము అన్నారు అంటీ - పెద్దమ్మ , ఇప్పుడు అందరం కలిసి ఆడుకుకుందాము .
అంటీలు : మా ముద్దుల జానకి కోరడమూ మేమంతా కాదనడమూనా ..... ? , లవ్ టు బంగారూ అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు , లవ్ యు చెల్లీ - అక్కయ్యా ......
లోపల సోఫాలు - టేబుల్స్ అడ్డుగా ఉన్నాయి , మధ్యాహ్నం మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం గమనించాము , బయట కాంపౌండ్ లో ఆడుకుందాము అన్నారు పెద్దమ్మ .
బుజ్జిజానకి - అక్కయ్యలు : యాహూ యాహూ ...... అంటూ దేవతల చేతులను అందుకుని బయటకు నడిచారు , మహేష్ - తమ్ముడూ రా ...... , అంటీ ఆగిపోయారే ......
మేడమ్ : ఒక కాల్ చేసుకుని వచ్చేస్తాను తల్లులూ , వన్ మినిట్ అంతే ......
త్వరగా వచ్చెయ్యండి .
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply
మేడమ్ : వన్ ఇయర్ సాలరీని సంక్రాంతి కానుకగా అంటే మాటలా ...... యాహూ యాహూ ...... బుజ్జిజానకికి బోలెడన్ని అందమైన గిఫ్ట్స్ ఇచ్చేస్తాను , వెంటనే విజయవాడ లోని నా స్నేహితురాలితో సంతోషాన్ని పంచుకోవాలి అది నాకంటే లేజీ , ఇప్పటికైనా తెలుసుకుందో లేదో అంటూ కాల్ చేశారు .
" హలో మై ఫ్రెండ్ ఎలా ఉన్నావు ? అంటూ సంతోషంతో అడిగారు" 
మేడమ్ ఫ్రెండ్ : ఏంటి మేడమ్ గారు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు ఏంటి విషయం .
మేడమ్ : నాకు తెలిసే నువ్వునాకంటే లేజీ అని , క్షేమసమాచారాలు తరువాత మాట్లాడుకుందాము అర్జెంట్ గా వెళ్ళాలి , ఒసేయ్ ..... సంక్రాంతి కానుకగా వన్ ఇయర్ సాలరీ ఇచ్చారు .
మేడమ్ ఫ్రెండ్ : ఎవరు ? .
మేడమ్ : ఇంకెవరు ఇస్తారే govt .....
మేడమ్ ఫ్రెండ్ : ఏంటీ మన govt .... వన్ ఇయర్ సాలరీ బోనస్ , జోక్స్ వెయ్యడానికి నేనే దొరికానేoటే ..... చాలా పనులున్నాయి ఆయన పిల్లలు వచ్చారు వెంటనే వంట చెయ్యాలి .
మేడమ్ : నిజమే ఒకసారి చూసుకో .....
మేడమ్ ఫ్రెండ్ : చూసుకున్నాను ...... నథింగ్ , అయినా మా జిల్లాలోనే కాదు కొన్ని జిల్లాలలో ఈ మంత్ సాలరీనే పడలేదే - నాకే కాదు మా వారికి కూడా పడలేదు , నెల నెలా సాలరీలు ఇవ్వడానికే డబ్బులు లేవక్కడ , వన్ ఇయర్ సాలరీ బోనస్ ఇచ్చారట దీనికి - కల ఏమైనా కన్నావా ఏమిటి ? , ఫోన్ పెడతావా లేక అక్కడకు వచ్చి నీ పీక పిసికెయ్యమంటావా ? ...... నాకొస్తున్న కోపానికి .....
మేడమ్ : కూల్ కూల్ వే అంత కోపం దేనికి ? .
మేడమ్ ఫ్రెండ్ : జీతాలు సరిగ్గా వస్తే చాలయ్యింది ఇది వన్ ఇయర్ బోనస్ అంటూ ఆటపట్టించడానికి కాల్ చేసింది .
మేడమ్ : ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లున్నావు తరువాత కాల్ చేస్తాను .
మేడమ్ ఫ్రెండ్ : నీకు సాలరీ పడింది మాట్లాడుతావే , సాలరీ గురించి వదిలెయ్యి బాబు ఎలా ఉన్నాడు ? .
మేడమ్ : బాగున్నాడు .
మేడమ్ ఫ్రెండ్ : నీకిష్టమైన పాపను కనేది ఉందా లేక .....
మేడమ్ : గుర్తుచేయ్యకే కన్నీళ్లు వచ్చేస్తాయి , ఒక్కడే చాలు అంటాడు ఎంత చెప్పినా ఒప్పుకోవడం లేదు .
మేడమ్ ఫ్రెండ్ : మీ ఆయన నిర్ణయంలో మార్పు రావాలని కనక దుర్గమ్మను ప్రార్ధిస్తాను .
మేడమ్ : థాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్ , బాబు - పాప ..... ఈ జీవితాన్ని హ్యాపీగా పూర్తిచేస్తాను , పిల్లలు ఎలా ఉన్నారు ? .
మేడమ్ ఫ్రెండ్ : అల్లరే అల్లరి ..... అంటూ నవ్వుకున్నారు .
మేడమ్ : ఎంజాయ్ వే , ప్రేమతో చూసుకునే భర్త - అల్లరి చేసే పిల్లలు , సరేనే వెళ్ళాలి బై బై ..... అంటూ కట్ చేశారు . అవును రాష్ట్రమంతా పూర్తిగా సాలరీనే పడలేదు బోనస్ అంటే కోప్పడక ఏమిచేస్తారు - వాళ్ళ జిల్లాలో పడలేదేమో నా స్కూల్ కొలీగ్ కు కాల్ చేస్తాను ..... , " హలో మేడమ్ ...... సాలరీ ....." 
మేడమ్ కొలీగ్ : మీకు వారం ముందే పడితే మిగతా సగం మందికి ఈరోజే పడ్డాయి మేడమ్ , ఇప్పుడు కాస్త ఊపిరి ఆడుతోంది , EMI లు - బిల్లులు ...... ఒకటి తరువాత ఒకటి మీదపడుతుంటే నరకం కనిపించింది అనుకోండి , అడిగినందుకు థాంక్స్ మేడమ్ ......
మేడమ్ : సరే మేడమ్ సంతోషం ఉంటాను అంటూ కట్ చేశారు , సాలరీనే ఇప్పుడు పడింది ఇక బోనస్ ...... అంటే నాకు మాత్రమే అంటే అంటే ..... మహేష్ .....

అంటీ అంటీ ...... ఒక్క నిమిషం అన్నారు 10 నిమిషాలు అయ్యింది అంటూ అమ్మకూచీ లోపలికివెళ్లింది , అంటీ అంటీ ......
మేడమ్ : తేరుకుని , బుజ్జిజానకీ .....
బుజ్జిజానకి : ఏమైంది అంటీ ..... ఏదో ఆలోచిస్తున్నారు  .
మేడమ్ : నథింగ్ నథింగ్ పదా వెళదాము , దేవుడు ఎక్కడ ఉన్నాడు ? .
బుజ్జిజానకి : దేవుడా ? ..... కొత్త పిలుపుకు ఆశ్చర్యపోయింది .
మేడమ్ : నీ మరియు నీ చుట్టూ ఉన్నవాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేస్తున్న బుజ్జి దేవుడు మహేష్ ఎక్కడ అని ......
బుజ్జిజానకి : సిగ్గుపడి మేడమ్ గుండెలపైకి చేరింది .
మేడమ్ : ఎంత సిగ్గుపడినా తప్పులేదు బంగారూ ...... , నిజంగా నీసంతోషం కోసం వచ్చిన దేవుడేరా అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు , ఇంతకూ ఎక్కడ నీ దేవుడు ? .
బుజ్జిజానకి : పులకించి బయట అంటీ ...... , ఏమీ ఎరుగనట్లు అందరి సంతోషాలను ఆస్వాధిస్తున్నాడు .
మేడమ్ : వెంటనే చూడాలి పదపదా అంటూ బయటకువచ్చి , గుమ్మం దగ్గరే ఆగిపోయి నావైపే కొత్తగా ఆరాధనతో చూస్తున్నారు .
బుజ్జిజానకి : నవ్వుకుని , అమ్మో నాకంటే ఎక్కువ ప్రేమతో చూస్తున్నారు అంటే ఏదో అంతులేని ఆనందాన్నే నా అంటీకి పంచినట్లున్నాడు , ఏమిటబ్బా ...... ? .
మేడమ్ : మా బంగారం కంటే ఎక్కువ ప్రేమతో ఎవరూ చూడలేరులే , ఉదయమంతా ఏమిచేసావో అమ్మ చెప్పిందిలే ...... , కొట్టావాట - గిల్లేసావట - కొరికేశావట ...... పాపం వొళ్ళంతా పంటి గాట్లు .....
బుజ్జిజానకి : సిగ్గుపడి , ఫీల్ అవ్వకండి ప్రతీ పంటి గాటుపై ప్రేమతో బోలెడన్ని ముద్దులుకూడా ......
మేడమ్ : ఆ ఆ ..... ఇది తెలుసుకోవాలనే కవ్వించాను .
బుజ్జిజానకి : పో అంటీ అంటూ మేడమ్ బుగ్గపై ముద్దుపెట్టి పరుగున దేవతల గుండెలపైకి చేరి నవ్వుతోంది .
మేడమ్ : మా బంగారం అంటూ నావైపే చూస్తూ దిష్టి తీసి ఆనందిస్తున్నారు .

అక్కయ్యలు : అంటీ వచ్చారా ? , మొదట కళ్ళకు గంతలు కట్టుకోవాల్సినది మీరే ......
మేడమ్ : నేనా ? .
బుజ్జిజానకి : నేను - అక్కయ్యలం మధ్యాహ్నం కట్టేసుకున్నాము , ఇక మిగిలినది మీరు - అత్తయ్యలు - దేవతమ్మ - అమ్మమ్మ ...... , అందరూ కలిసి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు .
మేడమ్ : అక్కయ్యలు సెలెక్ట్ చేశారంటే అంతకంటే ఆనందం ఏముంది ? , ఇంతకూ రూల్స్ ఏంటి ? .
బుజ్జిజానకి - అక్కయ్యలు : టచ్ చేస్తే కాదు గట్టిగా పట్టేసుకోవాలి , చివరగా ఎవరిని పట్టుకుంటే వారే ఔట్ .
అంటీలు : పట్టేసుకోవడం ok కానీ చివరన ఔట్ రూల్ ఫస్ట్ టైం వింటున్నాము , చిన్నప్పుడు ఆడింది ఎలాగో అలాగే ఆడుదాము , మొదట ఎవరిని పట్టేసుకుంటే వారే ఔట్ ......
బుజ్జిజానకి : దేవతలు ఎలా అంటే అలా అంటూ మధ్యాహ్నం కొత్త రూల్ పెట్టిన పెద్దమ్మ వైపు చుర చురమంటూ చూసారు .
పెద్దమ్మ : మీకోసమే ..... ఎంజాయ్ చేశారా లేదా తల్లులూ ? .
ఫుల్ గా అంటూ పెద్దమ్మను చుట్టూహత్తుకుని ముద్దులు కురిపించారు అమ్మకూచీ - అక్కయ్యలు ...... , అంటీ రండి రండి అంటూ కర్చీఫ్ తీసుకొచ్చి కళ్ళకు గంతలు కట్టారు .
మేడమ్ : ఇంతకూ మన బుజ్జిదేవుడు ఆటలో ఉన్నాడా లేదా ? .
బుజ్జిజానకి - అక్కయ్యలు : ఎందుకలా అడిగారు అంటీ ...... , మహేష్ లేకుండా ఎలా ఆడుతాము - అత్తయ్యలు కూడా ok అన్నారు .
మేడమ్ : లేదు అమాయకుడిలా దూరంగా నిలబడి ఉంటేనూ ......
బుజ్జిజానకి : కళ్ళకు గంతలు కట్టాము కదా ......
మేడమ్ నవ్వులు ......
అక్కయ్యలు : అంటే కనిపిస్తోందన్నమాట మోసం మోసం .....
మేడమ్ : కట్టుకుంది నేనైతే కాదు అంటూనవ్వుతున్నారు .
ఇప్పుడు చూడండి అంటూ చిమ్మ చీకటిలా జాగ్రత్తగా కట్టారు .
మేడమ్ : అమ్మో మొత్తం చీకటి ..... 
ఇప్పుడు పట్టుకోండి అంటూ చుట్టూ తిప్పి వదిలి , అంటీ - అంటీ - చెల్లీ - చెల్లీ ..... అంటూ పిలుస్తూ కవ్విస్తున్నారు , మధ్యమధ్యలో ముద్దులుపెడుతున్నారు .
మేడమ్ : బుజ్జిజానకి ముద్దు - వాగ్దేవి ముద్దు - అక్కయ్య ముద్దు ..... ప్చ్ ప్చ్ ప్చ్ దొరకడం లేదే ..... , అందరూ ముద్దులుపెడుతున్నారు కానీ ఒకరు మాత్రం ప్చ్ ప్చ్ ......
ఎవరో తెలుసులే అంటీ , దేవతలు ఉండగా అంత ధైర్యం చేయలేడు పాపం , మహేష్ ముద్దు నేను పెడతాను కదా అంటూ బుగ్గపై కొరికేసింది బుజ్జిజానకి ......
మేడమ్ : స్స్స్ ......
బుజ్జిజానకి : మహేష్ ముద్దు ఇలానే ఉంటుంది మరి తెలుసుకదా ......
మేడమ్ పెదాలపై నవ్వులు ...... 
బుజ్జిజానకి : అంటీ ..... గైడ్ చేస్తాను వెళ్లి అత్తయ్యలను పట్టేసుకోండి , దేవతలకు ముద్దులుపెట్టాలన్నదే మహేష్ కోరిక ...... 
మేడమ్ : లవ్ టు బంగారూ ..... , అమ్మకూచీ గుసగుసలతో వెళ్లి సునీత అంటీని కాంపౌండ్ కార్నర్ కు చేసి పట్టేసుకుని ఔట్ ఔట్ ఔట్ అంటూ కేకలువేస్తున్నారు .

బుజ్జిజానకి : అత్తయ్యలు ఔట్ ముగ్గురు అత్తయ్యలూ ఔట్ ......
అవునవును ముగ్గురు అమ్మలూ ఔట్ ..... అంటూ వంత పాడారు అక్కయ్యలు .
ఔట్ అయ్యింది సునీత ఒక్కటే కదా ..... అన్నారు పెద్దమ్మ .
బుజ్జిజానకి : మాకైతే ముగ్గురు అత్తయ్యలూ ఒక్కటే , ఒక్కరు ఔట్ అయినా ముగ్గురూ ఔట్ అయినట్లే - ఒక్కరు గెలిచినా ముగ్గురూ గెలిచినట్లే ......
సంతోషంతో గట్టిగా ఈల వేసాను .
అంటీలు : లవ్ యు బుజ్జితల్లీ కాదు కాదు జానకీ అంటూ ఒకేసారి అమ్మకూచీ బుగ్గలపై - నుదుటిపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : లవ్ యు సో మచ్ అత్తయ్యలూ అంటూ ముగ్గురినీ చుట్టేసింది .
అంటీలు : మేము ఔట్ అయ్యామని విజిల్ వేశావు కదూ ...... , అయినా నీకేంటి అంత సంతోషం ......
అక్కయ్యలు : మీ కళ్ళకు గంతలు ఏమైనా చేసుకోవచ్చుకదా ...... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అంటీలు : తల్లులూ ...... ఏమిటో అన్నారు ? .
అక్కయ్యలు : నథింగ్ నథింగ్ అమ్మలూ ..... నావైపు కన్నుకొట్టి నవ్వుకుంటున్నారు .
అంటీలు : నో నో నో ..... ఆ అల్లరి పిల్లాడు ఆటలో ఉండగా కళ్ళకు గంతలు కట్టుకోమంటే కట్టుకోము .
బుజ్జిజానకి : మా అత్తయ్యలు ఎలా అంటే అలా ..... , మహేష్ నిన్ను గేమ్ నుండి తీసేసాము దూరంగా వెళ్లు - బుద్ధిగా కాంపౌండ్ మీద కూర్చో మేము మళ్లీ చెప్పేంతవరకూ కిందకు దిగకూడదు అంటూ కన్ను కొట్టింది .
ప్చ్ ప్చ్ అంటూ కాంపౌండ్ పైకెక్కాను - పెద్దమ్మా అంటూ ఆశతో చూసాను .
పెద్దమ్మ : నేనున్నానుకదా ......
లవ్ యు పెద్దమ్మా అంటూ మనసులో బోలెడన్ని ముద్దులు కురిపించాను .
పెద్దమ్మ : బుగ్గలపై - పెదాలపై తడుముకుని మురిసిపోతున్నారు .

అంటీలు : లవ్ యు లవ్ యు లవ్ యు జానకీ ...... , ఈ అత్తయ్యలంటే ప్రాణం , ఆ అల్లరి పిల్లాడు కోతికొమ్మచ్చిలా పైన ఉన్నాడు కాబట్టి మేము సిద్ధం , ఇక కళ్ళకు గంతలు కట్టెయ్యండి .
కోతికొమ్మచ్చిలానా ...... అంటూ బుంగమూతిపెట్టుకోవడం చూసి దేవతలు నవ్వుకున్నారు , బుజ్జిజానకి - అక్కయ్యలు ...... ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , అంటీలు ముగ్గురికీ గంటలుకట్టి కనిపించడం లేదుకదా అంటూ టెస్ట్ చేశారు , లెట్స్ స్టార్ట్ అత్తయ్యలూ - అమ్మలూ ..... అంటూ చుట్టూ తిప్పి వదిలారు .
ముగ్గురు దేవతలూ మూడువైపులా వెళ్లడం చూసి అందరూ నవ్వుకున్నారు , అత్తయ్యలూ - అక్కయ్యలూ - చెల్లెళ్ళూ - అమ్మలూ ..... అంటూ వీపుపై తాకుతూ కవ్విస్తున్నారు .
అత్తయ్యలు : జానకీ - చెల్లీ - అక్కయ్యా - తల్లులూ ..... పట్టేస్తాము ఇక్కడ ఉన్నారు కదూ ..... ప్చ్ ప్చ్ ప్చ్ .....
అక్కడ కాదు ఇక్కడ అంటూ అమ్మకూచీ మొదలుకుని అందరూ ముద్దులుపెడుతున్నారు . 
గోడపైనుండే ఎంజాయ్ చేస్తున్నాను .
అంటీలు : ముద్దులుపెట్టి భలేగా తప్పించుకుంటున్నారే ....... , జానకి ముద్దు - అక్కయ్య ముద్దు - తల్లుల ముద్దు - చెల్లి ముద్దు ..... మరొక ముద్దు ఎవరిది ఎవరిది కొంపదీసి అంటూ కోపంతో గంతలు కిందకు జార్చేసి చుట్టూ చూసి నావైపుకు తిరిగారు , గోడపైననే ఉన్నాడే మరి చివరి బుజ్జి పెదాల ముద్దు ఎవరిది ?.
బుజ్జిజానకి : అయ్యో అత్తయ్యలూ ..... ఆ బుజ్జిపెదాలు మరెవరివో కాదు అమ్మమ్మ ఎత్తుకున్న బాబువి ......
అమ్మలూ ..... ఇలా ఆట మధ్యలో గంతలు విప్పడం మోసం .....
అంటీలు : లవ్ యు లవ్ యు లవ్ యు జానకీ - తల్లులూ ...... మళ్లీ గంతలు కట్టండి గట్టిగానే కట్టండి .
అక్కయ్యలు : ఈసారి విప్పారో బాగోదు .....
అంటీలు : లేదు లేదు లేదు ...... 
గంతలు గట్టిగా కట్టి తిప్పి వదిలారు , తాకుతూ కవ్విస్తున్నారు  ......

బుజ్జిజానకి : హలో హీరో ...... నీ దేవతలకు ముద్దులుపెట్టాలని లేదా ? .
లవ్ టు లవ్ టు అమ్మకూచీ అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు .....
బుజ్జిజానకి : మళ్లీ ఇలాంటి అవకాశం రాదు , రామరి .....
అమ్మో ఇంకేమైనా ఉందా ..... ? , తెలిస్తే ముగ్గురు దేవతలూ మూడో కన్ను తెరిచినా తెరిచేస్తారు , పైగా ఆక్ ..... లు ఉన్నారు .
బుజ్జిజానకి : ప్లాన్ చేసినదే అక్కయ్యలు .....
ఊహూ ఆక్ ..... చూస్తుండగా నావల్ల కాదు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ......
అంతే ముగ్గురు అక్కయ్యలూ అటువైపుకు తిరిగి కళ్ళు మూసుకున్నారు .
బుజ్జిజానకి : నా పెదాలపై చిరునవ్వులను చూసి కిందకు లాగింది .
మరి మేడమ్ - పెద్ద .... దేవతమ్మ ? .
మేడమ్ : All the best మహేష్ , గో గో ......
స్వీట్ షాక్ ...... , పెద్దమ్మ ఫ్లైయింగ్ కిస్ ..... , అమ్మమ్మ నవ్వులు ..... , yes yes yes అంటూ వెళ్లి అమ్మకూచీ వరుసగా ముద్దుపెట్టగానే నా ప్రియమైన దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి , యాహూ యాహూ యాహూ ..... పరుగున గోడపైకి చేరాను .
అంటీలకు అనుమానం వచ్చినట్లు తీద్దామా వద్దా అన్న ఆలోచనలో నేను గోడపైకి చేరిపోయాను , అంటీలు మళ్లీ గంతలు లాగేసి చూస్తున్నారు .
బుజ్జిజానకీ - ఆక్ .... - మేడమ్ ...... మళ్లీ మళ్లీ గంతలు తీసేసారు అంటూ ఏమీ ఎరుగనట్లు అమాయకంగా చూయించాను .
అమ్మకూచీతోపాటు అందరూ నవ్వుకుని , అత్తయ్యలూ - అమ్మలూ ...... మోసం మోసం అంటూ వెళ్లి బుగ్గలపై - చేతులపై గిల్లేసారు .
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ ...... అదీ అదీ ఆ అల్లరి పిల్లాడు ముద్దులుపెట్టినట్లు అనిపించి ......
అవునా అంటీలూ ...... నా ముద్దులు ఎలా ఉన్నాయి ? అని అడిగాను .
అంటీలు : నువ్వు గోడపై ఉండగా ముద్దులు ఎలా ? , ముద్దులే పెట్టనప్పుడు ఎలా ఉన్నాయో ఎలా చెప్పగలం ? .
బుజ్జిజానకి : ఆ అల్లరి పిల్లాడి గురించి వదిలెయ్యండి , నా తరువాత పెట్టిన బాబు ముద్దులు ఎలా ఉన్నాయి అత్తయ్యలూ ...... ? అంటూ నావైపు కన్ను కొట్టింది .
అంటీలు : మా జానకికి నిజం చెప్పాలి కాబట్టి , నీతో మొదలుకుని మీ అందరి ముద్దులకంటే తియ్యదనం - ప్రేమ  హాయిగా అనిపించింది .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ......
దేవతలకు కనిపించకుండా ఎంజాయ్ చేస్తున్నాను , బుజ్జిజానకీ ...... ఎందుకో తెలియదు డాన్స్ చెయ్యాలనిపిస్తోంది , పర్మిషన్ ఇస్తే ......
బుజ్జిజానకి : అత్తయ్యలూ ...... నాకు డాన్స్ చూడాలని ఉంది .
పెద్దమ్మ : నువ్వు కోరాడమూ నీ అత్తయ్యలు కాదనడమూనా మహేష్ కూచీ .....

అంతే పైనుండి జంప్ చేసి సాంగ్ అని అరవగానే నాటు నాటు పెద్దగా ప్లే అవ్వడంతో అచ్చుగుద్దినట్లు అలాగే స్టెప్స్ వేసాను .
Wow wow సూపర్ అంటూ అందరితోపాటు అత్తయ్యలూ ఎంజాయ్ చేసినట్లు చప్పట్లు - ఈలలు ......
థాంక్యూ థాంక్యూ అల్ అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మకూచీ - అక్కయ్యలు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు , అమ్మకూచీతోపాటు అక్కయ్యలు ముద్దులుపెట్టబోతే .......
నో నో నో ..... sorry అంటీలు అంటూ గుంజీలు తియ్యడం మొదలెట్టాను .
అంటీలు : మొదలెట్టేసాడు .......
అందరూ నవ్వుకున్నారు .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply
అందరి ఆనందాల మధ్యన అమ్మకూచీ అంతులేని ఆనందాలను చూసి ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు , అమ్మో సమయం 8 అవుతోంది నేనువెళ్లి వంట ఏర్పాట్లు చూస్తాను .
మేడమ్ దీనంగా పెద్దమ్మ వైపు - మేడమ్ ప్రేమ నాపై కురావాలని పెద్దమ్మ నావైపు చూసారు ఆటోమేటిక్ గా మేడమ్ ..... నావైపుకు తిరిగారు డిన్నర్ వచ్చేస్తుందన్న ఆశతో ఒక్కసారిగా మేడమ్ పెదాలపై చిరునవ్వులు ......

అంతలోనే ఫుడ్ డెలివరీ వెహికల్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది - నిమిషంలో డెలివరీ బాయ్స్ ఐటమ్స్ అన్నిoటినీ లోపల ఉంచేసే ఆశ్చర్యంగా నావైపు సెల్యూట్ చేసి వెళ్లిపోయారు .
పెద్దమ్మ వైపు చూస్తే , ( కాసేపట్లో ఏమిజరుగుతుందో చూడు ఎంజాయ్ అంటూ తెలిపారు ) .
పెద్దమ్మ ఏమిచేసినా నాకోసమేలే అంటూ లోలోపలే మురిసిపోయాను .
అమ్మమ్మ : తల్లులూ - బుజ్జితల్లులూ ..... ఆడి ఆడి అలసిపోయి ఉంటారు , లైట్ గా ఫ్రెష్ అయితే డిన్నర్ చేద్దాము .
బుజ్జిజానకి : రేపు ఆటను ఇక్కడి నుండే కంటిన్యూ చేస్తాము అంటేనే ......
అంటీలు : లవ్ టు లవ్ టు లవ్ టు జానకీ .......
బుజ్జిజానకి : మా అత్తయ్యలు బంగారం - లవ్ యు అత్తయ్యలూ ..... అంటూ కౌగిళ్ళలోకి చేరిపోయింది చిరునవ్వులు చిందిస్తూ ..... , అక్కయ్యలూ - అంటీ - దేవతమ్మా ...... రండి అంటూ నావైపు కన్ను కొట్టింది , లోపలికి వెళ్లిపోయారు .
అఅహ్హ్హ్ ...... అంటూ తోకలా వెనుకే అడుగులివేశాను , ఎవరో చెయ్యి పట్టుకుని ఆపడంతో తేరుకుని చూస్తే మేడమ్ , మేడమ్ ......

బుజ్జి దేవుడా అంటూ అమాంతం కౌగిలిలోకి తీసుకున్నారు మేడమ్ ..... , థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో సో మచ్ మహేష్ .......
పెదాలపై చిరునవ్వులతో మీ కౌగిలి హాయిగా ఉందికానీ , కౌగిలి - ఇన్ని థాంక్యూ లు ఎందుకు మేడమ్ ......
మేడమ్ : అన్ని ఆనందాలను పంచి ఎందుకు అని అడుగుతున్నావా ? అంటూ ఆనందబాస్పాలతో నా ఛాతీపై దెబ్బలు కురిపిస్తున్నారు .
నో నో నో మీరు పొరబడుతున్నారు నేనేమీ చెయ్యలేదు , ఎవరికో చెందాల్సినవి నాకు ......
మేడమ్ : మళ్లీ దెబ్బలుపడతాయి , నిన్న మొదటగా నీకూచీకి గిఫ్ట్ ఎవరు ఇప్పించారు అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
అదీ అదీ ....... అఅహ్హ్ అంటూ తియ్యదనంతో బుగ్గను స్పృశించాను .
మేడమ్ : మళ్లీ ఈరోజు ఉదయం మళ్లీ మొదట గిఫ్ట్ ను నాచేతుల మీదుగానే ఇప్పించినది ఎవరు ? అంటూ మరొక బుగ్గపై ముద్దుపెట్టారు .
అదీ అదీ ...... అఅహ్హ్ అంటూ మరొక బుగ్గను స్పృశిస్తూ ఆనందిస్తున్నాను .
మేడమ్ : నవ్వుకున్నారు , బుజ్జిజానకి గిఫ్ట్స్ కోసం ఏకంగా సంక్రాంతి కానుకగా వన్ ఇయర్ బోనస్ ...... అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టారు .
మ్మ్ ..... , మేడమ్ గారూ ...... అది govt ఇస్తే నాకు క్రెడిట్ ఇవ్వడం ఏమీ బాగోలేదు.
మేడమ్ : నా ఫ్రెండ్ కు - నా కొలీగ్ కు కాల్ చేసాను , వారికింకా ఈ నెల సాలరీనే రాలేదు తెలుసా అంటూ బుగ్గపై గిల్లేసారు .
స్స్స్ ..... మేడమ్ అయితే గిల్లేస్తారా ? , బాగుందిలేండి మేడమ్ .....
మేడమ్ : నాకు తెలుసులే , ఇక ఇప్పుడు నేను తీసుకురావాల్సిన డిన్నర్ తీసుకురాలేకపోయాను - ఆ లోటు కూడా తీర్చేశావు , దీనికోసం అయితే ప్రేమతో ముద్దుపెట్టాల్సిందే అంటూ ఏకంగా పెదాలను ..... నా పెదాల దగ్గరికి అతి దగ్గరికి , ఇలాకాదు నువ్వెలా ముద్దులుపెడతావో అలాగా అంటూ బుగ్గపై పంటి గాట్లు పడేలా కొరికేశారు .
కెవ్వుమని కేకవేశాను , స్స్స్ స్స్స్ ......
మేడమ్ నవ్వులు ఆగడం లేదు , థాంక్యూ థాంక్యూ సో సో మచ్ బుజ్జిదేవుడా ..... నువ్వు నాద్వారా బుజ్జిజానకికి పంచిన ఒక్కొక్క ఆనందపు అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది అంటూ మళ్లీ కౌగిలిలోకి తీసుకున్నారు - ఈసారి అయితే ఏకంగా ఊపిరాడనట్లుగా .......

మహేష్ మహేష్ అంటీ .... దేవతలు పిలుస్తున్నారు , నో నో నో sorry sorry అంటూ లోపలికి వెళ్లిపోతోంది అమ్మకూచీ .......
అమ్మకూచీ - మహేష్ కూచీ ..... అంటూ నన్ను వదిలి కౌగిలిలోకి ఆహ్వానించారు మేడమ్ ......
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాను .
మేడమ్ : నీ సంతోషం కోసం కాకపోతే ఇంకెందుకు , లవ్ యు మహేష్ కూచీ అంటూ ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై పెదాలను తాకించారు .
బుజ్జిజానకి : మహేష్ కూచీ అన్నారుకదూ , హ హ హ అంటూ పులకించిపోతోంది , మహేష్ ఏంటి కదలకుండా ఉండిపోయాడు , మహేష్ మహేష్ ...... ok ok అర్థమైంది , దేవుడి నాలుగో దేవత ప్రేమకౌగిలి మధుర్యంలో మైమరిచిపోతున్నాడన్నమాట ......
మేడమ్ పెదాలపై సిగ్గు - నవ్వులు ......
బుజ్జిజానకి : దేవుడు తెరుకోవాలంటే ఏదైనా స్వీట్ షాక్ ఇవ్వాలి అంటీ .....
ఇద్దరూ గుసగుసలాడుకుని నవ్వుకున్నారు , రెడీ 3 2 1 అంటూ ఒకేసారి చెరొక బుగ్గపై కొరికేశారు .
చెట్టుపై కూర్చున్న పక్షులన్నీ ఎగిరిపోయేలా కేకలువేశాను .

ఏమైంది ఏమైంది అంటూ - అక్కయ్యలు - దేవతలంతా గుమ్మం దగ్గరికి చేరుకున్నారు .
బుజ్జిజానకి : నథింగ్ నథింగ్ అత్తయ్యలూ ..... , మీ అల్లరి పిల్లాడిని కంట్రోల్ లో ఉంచడానికి కొరి ..... గట్టిగా గిల్లేసాము .
అంటీలు : మంచిపని చేశారు , మాతరుపున కూడా గిల్లేయ్యండి .
బుజ్జిజానకి : లవ్ టు అత్తయ్యలూ అంటూ గిల్లేసింది , ముగ్గురు దేవతలు కాబట్టి మూడు సార్లు ......
స్స్స్ స్స్స్ స్స్స్ .......
అంటీలు : అదీ అలా ..... , లవ్ యు లవ్ యు లవ్ యు జానకీ , త్వరగా లోపలికి రండి అన్నీ సిద్ధం అంటూ లోపలికివెళ్లారు .
బుజ్జిజానకి : కమింగ్ అత్తయ్యలూ .....
స్స్స్ స్స్స్ స్స్స్ .....
బుజ్జిజానకి - మేడమ్ : నొప్పివేస్తోందా ..... ? , లవ్ ..... sorry sorry అంటూ కొరికిన చోట మరియు గిల్లిన చోట ముద్దులు కురిపిస్తున్నారు .
అఅహ్హ్హ్ ..... కలనా నిజమా అంటూ హృదయంపై చేతినివేసుకోగానే .......
అంటీ - మహేష్ కూచీ ..... అంటూ రెండువైపులా నన్ను పట్టేసుకుని నవ్వుకుంటున్నారు .

బుజ్జిజానకి : అవును అంటీ ఇంతకూ ఎందుకు మీ శిష్యుడిని ప్రేమతో కౌగిలించుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
మేడమ్ : అదీ సంక్రాంతి ......
లేచి నిలబడి , అమ్మకూచీ ..... అన్నీ తెలియాలా నీకు అంటూ సున్నితంగా మొట్టికాయవేశాను , అమ్మా ..... sorry sorry .
బుజ్జిజానకి : యాహూ యాహూ ..... దేవుడు ప్రేమతో కొట్టాడు కొట్టాడు అంటూ గట్టిగా చుట్టేసి ఎంజాయ్ చేస్తోంది .
మేడమ్ : లవ్ యు మహేష్ కూచీ - మహేష్ ..... ఇలా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి .

జానకీ జానకీ ..... ఏమైంది ఏమైంది అంటూ కంగారుపడుతూ వచ్చారు దేవతలు .
బుజ్జిజానకి : అత్తయ్యలూ ...... మీరు చెప్పారని గిల్లినందుకు కొట్టి పారిపోతుంటే గట్టిగా పట్టేసుకున్నాను .
అంతే దేవతలు భద్రకాళీ అవతారం ఎత్తేశారు .
అమ్మకూచీ కౌగిలిలోనే భయంతో వణుకుతూ గుంజీలు తియ్యడం మొదలుపెట్టాను .
బుజ్జిజానకి : చిరునవ్వులతో నాబుగ్గపై ముద్దుపెట్టి , కూల్ కూల్ కూల్ అత్తయ్యలూ ...... , మీ చూపులకే గజగజావాణికిపోతున్నాడు పాపం అంటూ దేవతల గుండెలపైకి చేరింది .
అంతటి కోపంలోనూ దేవతల పెదాలపై గట్టిగా నవ్వులు ......
బుజ్జిజానకి : దేవతలు నవ్వేశారు దేవతలు నవ్వేశారు అంటూ ముద్దులుకురిపించి , అంటీ - మహేష్ లోపలికి వచ్చెయ్యండి అనిచెప్పి దేవతలతోపాటు లోపలికివెళ్లింది .
గుంజీలు తీస్తున్న నన్ను అమాంతం కౌగిలిలోకి తీసుకున్నారు మేడమ్ , నీకూచీకి ఎందుకు చెప్పలేదు మహేష్ ......
దేవతల చేతులతో అందుకుని అమ్మకూచీ ఎంత మురిసిపోయిందో గుర్తులేదా మేడమ్ ......
మేడమ్ : మాటల్లో వర్ణించలేనంత ఆనందం మహేష్ , ఇప్పటికీ ..... జీవితాంతమైనా గుర్తుండిపోతుందేమో ......
అందుకు మేడమ్ ...... , ఆ క్షణం అమ్మకూచీతోపాటు ఐదుగురు దేవతల ఆనందాలతో హృదయం అంతా నిండిపోయింది .
మేడమ్ : లవ్ ...... థాంక్యూ థాంక్యూ సో సో మచ్ మహేష్ కాదు కాదు గాడ్ అంటూ ఆనందబాస్పాలతో బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు .
అఅహ్హ్ మ్మ్ మ్మ్ ...... ఇంతలా ముద్దులు కురిపిస్తారని తెలిసి ఉంటే ......
మేడమ్ : తెలిసి ఉంటే .......
మరిన్ని ఆనందాలను చేకూర్చేవాడిని ......
మేడమ్ : అవునా అవునా అంటూ ముద్దులుకురిపించి , మనకోసం ఎదురుచూస్తున్నారు లోపలికి వెళదాము .

బుజ్జిజానకి : అత్తయ్యలూ వచ్చేసారు , అంటీ అంటీ ...... అంటూ మాదగ్గరికే వచ్చి మహేష్ కు ఎందుకు ముద్దులుపెట్టారో చెప్పనేలేదు .
నేను చెబుతాను అమ్మకూచీ ...... , భోజనం చేస్తూ చెబుతాను - నావలన ఆలస్యం అయితే మీ అత్తయ్యలు మూడో కన్ను తెరిచినా తెరుస్తారు .
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ ...... అంటూ నవ్వుకుంటున్నారు .
వినపడిందా ? అయిపోయాను అంటూ అక్కడికక్కడే గుంజీలు ......
అంటీలు : మళ్లీ యాక్టింగ్ మొదలెట్టేసాడు , వచ్చి కూర్చుంటావా లేక ......
నో నో నో దేవతలూ అంటూ బుద్ధిగా కూర్చున్నాను .
బుజ్జిజానకి : నవ్వుకుని , మేడమ్ ను దేవతలతోపాటు కూర్చోబెట్టి పరుగునవచ్చి నాప్రక్కన కూర్చుంది , పెద్దమ్మ - దేవతలు వడ్డించడంతో తింటూ అడిగింది .

చెబుతాను చెబుతాను అమ్మకూచీ ...... , అమ్మ స్కూల్ లో ఈరోజు మధ్యాహ్నానికి స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ పూర్తయిపోయిందట - వర్కర్స్ తోపాటు పేరెంట్స్ కూడా పెద్దమొత్తంలో వచ్చి సహాయం చేస్తున్నారట - కొద్దిరోజుల్లోనే అమ్మ స్కూల్ ..... అందంగా మారిపోతుందని , దీనికంతటికీ తొలి కారణం నువ్వే మహేష్ అంటూ కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నారు మేడమ్ .......
బుజ్జిజానకి : సంతోషంతో మేడమ్ వైపు చూసింది .
మేడమ్ : చెప్పకుండానే మహేష్ కు ఎలా తెలిసింది అంటూ ఆశ్చర్యపోతూనే అవునన్నట్లు సైగచేశారు , అంతా మహేష్ వల్లనే బుజ్జిజానకీ ......
అంటీలు : నిన్న నీ నోటనే విన్నాము చెల్లీ ...... , అంతా ఆ అల్లరి పిల్లాడి వల్లనే కాదులే ......
మేడమ్ : అక్కయ్యలూ ..... అంటూ ముద్దులుపెట్టడంతో కూల్ అయ్యారు .

బుజ్జిజానకి : ఈ ఈ ఈ అంటూ యాక్టింగ్ ఏడుపుతో వెళ్లి సోఫాలో కూర్చుంది .
ఏమైంది ఏమైంది ఏమైంది జానకీ బుజ్జిజానకీ మహేష్ కూచీ ......
బుజ్జిజానకి : నావైపు ప్రేమతో చూస్తూనే , అమ్మకూ ..... మహేష్ అంటేనే ప్రాణం - అమ్మమ్మకూ ...... మహేష్ అంటేనే ప్రాణం - అత్తయ్యలూ మీకు తెలిసీ తెలియదు అక్కయ్యలకూ ..... మహేష్ అంటేనే ప్రాణం - నిన్నటి నుండీ చూస్తున్నాను దేవతమ్మకూ ..... మహేష్ అంటేనే ఇష్టం - ఇదిగో వీడున్నాడే బాబుకూ ..... మహేష్ అంటేనే ఇష్టం , ఇప్పుడేమో అంటీకి కూడా మహేష్ అంటేనే ఇష్టమైపోయాడు ఈ ఈ ఈ ...... స్కూల్ మార్పులు మహేష్ కే చెబుతున్నారు .
అంటీలు తప్ప అందరి పెదాలపై చిరునవ్వులు చివరికి బాబు బుజ్జిపెదాలపై కూడా ........
అమ్మకూచీ కూడా నవ్వేసి మళ్లీ ఈ ఈ ఈ ...... 
అంటీలు : మాకు మాత్రం మీ అక్కయ్యల కంటే మా జానకి అంటేనే ప్రాణం .
బుజ్జిజానకి : నాకు తెలుసు అత్తయ్యలూ ...... అంటూ లేచి కౌగిలించుకుని , నీ ముద్దులే అన్నట్లు కొరికేస్తోంది .
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ ..... పర్లేదులే నీఇష్టం జానకీ అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
నాతోపాటు మిగతావారంతా నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : అత్తయ్యలూ ...... రేపు స్కూల్లో ఏమి మార్పు జరిగిందో నాకే ముందు చెప్పెలా ఆదేశించండి మీ చెల్లికి .......
అలాగే అలాగే .......
అంటీలు : నిన్ను కాదు , చెల్లీ ......
మేడమ్ : లవ్ టు లవ్ టు మహేష్ కూచీ ...... , ప్లేట్ అందుకుని సోఫాలోనే తినిపించారు .
అంటీలు కూడా తినిపించారు .
దేవతలూ ...... ఆ ఆ .....
అంటీలు : ఒక్క చూపు చూసారు .
వెక్కిళ్ళు వచ్చేసాయి .
అమ్మకూచీ - అక్కయ్య - అంటీ - అమ్మమ్మ ...... క్షణంలో నాముందుకు చేరి నీళ్లు అందించారు , త్రాగాక నవ్వుకున్నారు , ఎంజాయ్ ఎంజాయ్ .......
చిరునవ్వులు చిందిస్తూ డిన్నర్ పూర్తిచేసి కాంపౌండ్ లోని గడ్డి మీదకు చేరారు , అమ్మకూచీ - అక్కయ్యలను ఒడిలో పడుకోబెట్టుకుని ముద్దులతో ప్రేమను పంచుతున్నారు .
నాకెప్పుడో ఆ అదృష్టం ......
దేవతలు : ఏమిటీ ......
నథింగ్ నథింగ్ దేవతలూ అంటూ గోడమీదకు చేరి అందరి ఆనందాలను ఎంజాయ్ చేస్తున్నాను .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply
అమ్మమ్మా ..... తాతయ్య గారు ఎప్పుడు వస్తారు ? , భోజనం చేశారో లేదో ......
అమ్మమ్మ : ఈపాటికి వచ్చేయ్యాలే .......
మా జానకి తాతయ్య కాదు కాదు నాన్నగారు వచ్చేన్తవరకూ జానకితోనే ఉంటాము అంటూ దేవతలు ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : అవునా అత్తయ్యలూ లవ్ యు లవ్ యు ...... , తాతయ్యా తాతయ్యా ...... కాస్త ఆలస్యంగా రాగలరు అంటూ ప్రార్థిస్తోంది .

అంతలోనే స్కూటీ ఆగడం బుజ్జిజానకీ - ఏమేవ్ ..... అంటూ తాతయ్యగారు మెయిన్ గేట్ తెరుచుకుని లోపలికిరావడంతో .......
తాతయ్యా ...... వచ్చేశారా ? అంటూ కోపంతో లేచివెళ్లి చిన్నగా మొట్టికాయవేసి పరుగున వెనక్కువచ్చి దేవతను చుట్టేసింది గట్టిగా ......
అందరూ నవ్వుకుంటున్నారు . 

తాతయ్య : ఏదో తప్పు చేసే ఉంటాను sorry బుజ్జిజానకీ ..... , బుజ్జిజానకీ - ఏమేవ్ చూడండి అంటూ అమ్మమ్మ ముందు మీడియం సైజ్ బ్యాగ్ ఓపెన్ చేశారు .
ఇంత డబ్బా అంటూ అమ్మమ్మ ఆశ్చర్యపోయారు , బ్యాంకుకు ఏమైనా కన్నం వేశారా ఏమైనా , ఇంతవరకూ జూదం ఒక్కటే అనుకున్నాము , రోజూ ఓడిపోయే కదా వచ్చేవారు .......
తాతయ్య : ఆ జూదంలో గెలిచినవేనే , సంవత్సరాలుగా ఇంతవరకూ ఓడిన డబ్బుకు పదింతలు ఈరోజు సంపాదించాను , ఈరోజు అదృష్టం ఎలా ఉండినదంటే ముట్టుకుంటే బంగారం అయ్యింది ఓటమే లేకపోయింది , ఈ డబ్బుతో జీవితాంతం విలాసవంతంగా ఉండవచ్చు , సొంత ఇల్లు సొంత కారు ..... బుజ్జిజానకి కోరినవన్నీ ముందు ఉంచవచ్చు .
తాతయ్యా ...... ఈ డబ్బును మీరు గెలిచారు అంటే మీలాంటి వారు చాలామంది ఒడిపోయినట్లే కదా అంటే వారంతా బాధతో - కన్నీళ్ళతో తమ తమ భార్యా పిల్లల దగ్గరికి చేరుకుని ఉంటారు , అంటే నాలాంటి పిల్లల కోరికలన్నీ తీరవు అన్నమాట ..... వారిని బాధపెడతాయన్నమాట , అలా గెలుచుకున్న డబ్బుతో మనం సంతోషంగా ఉండటం నాకైతే ఇష్టంలేదు అమ్మమ్మా .......
అమ్మమ్మ : మీ అమ్మ కూడా ఇలాగే చెబుతూ ఉండేది బుజ్జిజానకీ ...... , అయినా మీ తాతయ్య మారలేదు , ఈ డబ్బుతో వచ్చే సంతోషాలు నాకూ ఇష్టం లేదు , నా బిడ్డ వలన నెలనెలా వస్తున్న డబ్బుతో ఇప్పటివరకూ ఎలాగైతే సంతోషంగా ఉన్నామో ఇకనుండీ కూడా అలానే , అంతమందికి బాధను మిగిల్చిన ఈ డబ్బు అవసరమే లేదు ...... , బిడ్డ మాట వినలేదు బిడ్డబిడ్డ మాట అయినా వింటారో లేదో .......
తాతయ్య : ఓడిపోయినప్పుడు నేనొక్కడినే బాధపడ్డాను కాబట్టి తెలిసిరాలేదు , గెలిచిన తరువాత నా చుట్టూ ఉన్నవారంతా బాధతో వెళ్లడం చూసినప్పుడు , నువ్వూ - మీ అమ్మమ్మే గుర్తుకువచ్చారు , వారంతా వారి కుటుంబం గురించే బాధపడ్డారని , ఒక్కసారైనా గెలవాలన్న తాపత్రయంతో రోజూ ఉత్సాహంగా వెళ్ళాను , గెలిచాక ఇంతేనా అనిపించింది , నా బుజ్జిజానకికి మాటిస్తున్నాను ఇకనుండీ జూదానికి వెల్లనంటే వెళ్లను .......
బుజ్జిజానకి : థాంక్యూ తాతయ్యా ......
అమ్మమ్మ : మన బుజ్జిజానకికి మాటిచ్చారు , వెళ్లారని తెలిసిందో కాళ్ళు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతాను .
తాతయ్య : అమ్మో అలా చేసినా చేసేస్తుంది లేదు లేదు వెల్లనంటే వెళ్లను .
బుజ్జిజానకితోపాటు అందరూ నవ్వేశారు .
తాతయ్య : మరి ఈ డబ్బును ఏమిచెయ్యమంటావు ? .
బుజ్జిజానకి : ఈ డబ్బు ఇంట్లోకి చేరడం కూడా ఇష్టంలేదు అమ్మమ్మా ...... 
అమ్మమ్మ : నీ ఇష్టమే నాఇష్టం జానకీ ......
బుజ్జిజానకి : ఎక్కడ గెలిచారో అక్కడే వదిలేసి రండి .
తాతయ్య : ఇక జన్మలో అటువైపుకు వెళ్లను - అంతమందిని బాధపెట్టిన డబ్బును తాకనుకూడా తాకను , నాకు ఆకలివేస్తోంది లోపలికివెళ్లి తింటాను .

అమ్మకూచీ ...... అమ్మల ఆశ్రమం .
బుజ్జిజానకి : లవ్ ..... so స్వీట్ మై గాడ్ ఉమ్మా ...... , దేవతలూ ...... ఈడబ్బును " అమ్మ అనాధసరణాలయానికి " అందిద్దాము ఏమంటారు ? , అమ్మానాన్న లేని అనాధ చెల్లీ - తమ్ముళ్లకు మరియు మహేష్ చెప్పినట్లు పిల్లలు ఉన్నా అనాధలుగా వృద్ధాశ్రమంలో ఉంటున్న అమ్ములు - అమ్మమ్మలకు ఉపయోగపడితే సంతోషం . 
ఐదుగురు దేవతలు : మా బుజ్జిజానకి - జానకీ - బుజ్జితల్లి మనసు బంగారం , మా మనస్సులను కదిలించావు బుజ్జితల్లీ ..... ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేము లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ప్రాణంలా ముద్దులుకురిపించి మురిసిపోతున్నారు .
బుజ్జిజానకి : మా దేవతలకు ఆనందాన్ని పంచాను అంతకంటే ఆనందం మరొకటి లేదు , ఈ డబ్బును నాతోపాటు నాదేవతలు - అక్కయ్యలు కూడా తాకడం ఇష్టంలేదు .
నేనున్నాను కదా బుజ్జిజానకీ .....
బుజ్జిజానకి : దేవుడా .......
దేవుడిని కదా ఏమీ కాదులే , దేవతల బుజ్జి దేవకన్య కోసం మరియు తన దేవతలకోసం తప్పదుకదా ...... 
బుజ్జిజానకి : అమ్మా దుర్గమ్మా ...... మహేష్ కు ఏమీ కాకూడదు అంటూ ప్రార్థించింది .
లవ్ ..... థాంక్యూ .....
బుజ్జిజానకి : ముద్దు లేదా అంటూ సైగచేసింది .
అఅహ్హ్ ..... 
బుజ్జిజానకి - అక్కయ్యలు : జాగ్రత్త గోడపై ఉన్నావు అంటూ పరుగునవచ్చారు .
మీరు ఉండగా ఏమవుతుంది చెప్పండి అంటూ పెద్దమ్మ వైపు కొంటెగా చూస్తూ కిందకుదిగాను .

బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... రేపు exam కోసం చదువుకోవాలి కదూ .
ఊ - ఊహూ ..... అన్నట్లు తలలను అడ్డంగా - నిలువునా ఊపుతున్నారు .
బుజ్జిజానకి : ఉదయమే వచ్చేయ్యాలి , exam టైం వరకూ కూడా ఇక్కడే చదువుకోవచ్చు .
అక్కయ్యలు : నీ అత్తయ్యలు వస్తే సరిపోతుందా లేక మేమూ రావాలా ? .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ......
అక్కయ్యలు : మాకు తెలుసులే , ఈ బుజ్జిహీరోకు దేవతలంటేనే ప్రాణం - ఈ బుజ్జిజానకికి దేవతలంటేనే ప్రాణం ...... , కానివ్వండి కానివ్వండి మాకూ సంతోషమేలే అంటూ ప్రాణంలా హత్తుకుని ఒకేసారి ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ ...... , వెళ్లేంతవరకూ దేవతలతో ఉంటాను అంటూ అక్కయ్యల బుగ్గలపై ముద్దులుపెట్టి బాబును ఎత్తుకుని వాసంతి అంటీ ఒడిలోకి చేరింది చిరునవ్వులు చిందిస్తూ ...... , అత్తయ్యలూ ..... 5 మినిట్స్ ప్లీజ్ .
అంటీలు : లవ్ టు జానకీ ...... అంటూ ముద్దులతో ప్రాణంలా జోకొట్టారు .
చెల్లెళ్ళూ ..... నిమిషాలలోనే మీ ఒడిలో నిద్రలోకిజారుకుంది బుజ్జిజానకి - మీరంటే అంత ప్రాణమన్నమాట , sorry sorry ష్ ష్ ష్ అన్నారు పెద్దమ్మ .
దేవతలు మురిసిపోయారు , పెద్దమ్మా ...... చలిపెడుతోంది అనుకుంటాను లోపల పడుకోబెడదాము .
పెద్దమ్మ : ముగ్గురు దేవతలు ఉన్నారుకదా ప్రాణంలా ఎత్తుకునివెళ్లి బెడ్ పై పడుకోబెట్టండి .
అంటీలు : నో నో నో అలా ముగ్గురూ కలిసి ఎత్తుకుంటే మెలకువ వచ్చేస్తుంది , ఒక్కరే రెండుచేతులతో జాగ్రత్తగా గుండెలపైకి ఎత్తుకోవాలి , ఎప్పుడైతే ఎంచక్కా భుజంపై వాలి మరింత హాయిగా నిద్రపోతుంది .
పెద్దమ్మ : మీ శ్రీవార్లు అంత రొమాంటిక్ అన్నమాట , మిమ్మల్ని అలానే ......
అంటీలు : ఒకరినొకరు చూసుకుని నిట్టూర్చారు , అదొక్కటే తక్కువ - బిజినెస్ బిజినెస్ అంటూ వీళ్ళను కడుపున పడేసి తిరుగుతూనే ఉన్నారు , అది వదిలెయ్యండి కానీ దేవతమ్మ కదా ఎత్తుకోండి మావలన కావడం లేదు .
పెద్దమ్మ : బుజ్జిజానకి అయితే సులభంగా ఎత్తుకునేదానిని ఇప్పుడేమో జానకి నావల్ల ఎక్కడ అవుతుంది , మేడమ్ చెల్లీ ..... నువ్వు ట్రై చెయ్యి అంటూ నావైపు సైగచేసింది .
మేడమ్ : అర్థమైనట్లు ..... , దేవతమ్మ లాంటి పెద్దక్కయ్య - దేవతల్లాంటి అక్కయ్యల వల్లనే కావడం లేదు , నావలన అవుతుందా ? , తల్లులూ ..... మీరు ట్రై చెయ్యండి నో నో నో .......
అక్కయ్యలు : నవ్వుకున్నారు , ఐదుగురు దేవతల వల్లనే కాలేదు , దేవతల బిడ్డలం మావల్ల అవుతుందా ? .
అంటీలు : అమ్మా ......
అమ్మమ్మ : అందాలతో పిటపిటలాడుతున్న మీవల్లనే కావడం లేదు , వయసు మళ్ళిన నన్ను ఎత్తుకోమంటున్నారే భావ్యమా ? .
అంటీలు : ఇప్పుడెలా ..... ? , తల్లుల కంటే బరువుగా ఉంది జానకి ఇప్పుడెలా ? .
మ్మ్ మ్మ్ ......
అంటీలు : లేదు లేదు జానకీ ..... , నిన్ను కాదు నిన్ను కాదు ఇదిగో మీ అక్కయ్యలను అంటూ ముద్దులతో ప్రాణంలా జోకొడుతున్నారు .
అక్కయ్యలు : ఇక మిగిలినది తమ్ముడే అమ్మలూ ......
అంటీలు : మన వల్లనే కాలేదు , ఇంతలేడు ఆ అల్లరి పిల్లాడి వలన అవుతుందా ? .
అక్కయ్యలు : ఖచ్చితంగా అవుతుంది అమ్మలూ ..... , మొదటిరోజు కాలేజ్ కు వెళ్ళేటప్పుడు ఒక షాప్ ముందు బులెట్ బండి పడిపోతే ఎత్తడానికి ఇద్దరి వలనా కాలేదు కానీ తమ్ముడు సులభంగా ఎత్తేశాడు .
నేనా ..... ? .
అక్కయ్యలు : అవును నువ్వే .....
అంటీలు : మేము నమ్మము , ఈ అల్లరి పిల్లాడు దున్నపోతులా ఉండే బుల్లెట్ బండిని ఎత్తడం ఏమిటి ? .
మేడమ్ : నాకూ ఇలాంటి అనుభవం ఎదురైంది అక్కయ్యలూ ..... , స్కూల్లో పెద్ద బండ అడ్డుగా ఉంది , PET టీచర్ ఎంత ట్రై చేసినా ఇంచు కదలలేదు కానీ బాల భీముడిలా ఎత్తుకుని ప్రక్కన పడేసాడు .
ఇదికూడా నేనేనా ? .
మేడమ్ : నువ్వే , మాకు నమ్మకం ఉంది అంటూ కళ్ళతోనే సైగచేశారు .
అంటీలు : చెల్లి చెబుతోంది కాబట్టి నమ్ముతున్నాము , అయితే ట్రై చెయ్యమనండి .
అక్కయ్యలు : మాతో మాట్లాడనే మాట్లాడాడు ఇక మా మాట వింటాడా ? , మా అమ్మల మాట వేదంతో సమానం , మీరే ఆర్డర్ వెయ్యండి .
అంటీలు : చెల్లీ ......
మేడమ్ : ఈకాలంలో టీచర్స్ మాట ఏ పిల్లలు వింటున్నారు అక్కయ్యలూ ......
పెద్దమ్మ : మీ జానకికి చలివేస్తోంది దేవతలూ ..... , త్వరగా ..... మీరు ఆజ్ఞ వేస్తే శిరసావహిస్తాడు .

అదేసమయానికి వీచిన చల్లగాలికి నిద్రలోనే వణికింది అమ్మకూచీ .....
అంటీలు : లవ్ యు లవ్ యు లవ్ యు జానకీ అంటూ పైటలను కప్పి వెచ్చనైన ముద్దులుపెట్టారు .
మ్మ్ మ్మ్ మ్మ్ అంటూ వాసంతి అంటీని చుట్టేసింది అమ్మకూచీ వెచ్చదనంతో .....
అంటీలు : అవునవును చల్లటి గాలులు ..... , హలో హీరో గుడ్లప్పగించి చూస్తున్నావు వినిపించడం లేదా ? .
మీ ఆజ్ఞ కోసం వేచిచూస్తున్నాను దేవతలూ ..... అంటూ దేవతల ఒడిలో హాయిగా నిద్రపోతున్న అమ్మకూచీ ముందు మోకాళ్లపై కూర్చున్నాను , వాసంతీ అంటీ చీర కొంగును అందుకుని వారికి - కాంచన అంటీ చీర కొంగును వారి చేతికి - స్స్స్ .... సునీత అంటీ అయితే నేను టచ్ చెయ్యకముందే లాగేసుకుని అందమైనకోపంతో చూస్తున్నారు .
అక్కయ్యల నవ్వులు ఆగడం లేదు .
అంటీలు : త్వరగా ......
లవ్ టు దేవతలూ ...... ( జై పెద్దమ్మ ) , వాసంతి అంటీ ..... మీ ఓడిలోనుండి నేలపై పడుకోబెడితే ......
అంటీ : ఎందుకు ? .
అక్కయ్యలు : అమ్మా ..... చెల్లిని ఎత్తుకోవాలంటే మిమ్మల్ని తాకాల్సివస్తుంది కాబట్టి ......
బుజ్జిజానకి : మ్మ్ ..... అంటూ ఒడిలోకి మరింత ఎగబ్రాకింది .
అంటీ : లేదు లేదు లేదు మీ అక్కయ్యలు - ఈ అల్లరి పిల్లాడు చెబితే మాత్రం నిన్ను నెలపైకి చేర్చుతానా బంగారూ ...... , నన్ను తాకకుండా ఎత్తుకో ......
అర్థం కానట్లు దిక్కులుచూస్తున్నాను .
అక్కయ్యలు : నవ్వుకున్నారు , పుట్టలోకి చెయ్యిపెట్టకుండా పామును తియ్యమన్నట్లుంది అమ్మా ......
అంటీ : సరే సరే పర్లేదు , జానకి నిద్ర డిస్టర్బ్ కాకుండా ఎత్తుకో ......
మీరెలా అంటే అలా దేవతా అంటూ అమ్మకూచీ వీపు కింద - మోకాళ్ళ కిందకు చేతులను పోనిచ్చాను , సాఫ్ట్ గా ఉండే పట్టుచీర మీదనే తొడలను స్పృశించినట్లు జలదరిస్తూ కళ్ళు మూసుకుని కుడివైపున ఉన్న పెద్దమ్మ చేతిని - ఎడమ వైపు ఉన్న కాంచన అంటీ చేతిని నొక్కేసేలా పట్టేసుకున్నారు .
( జై పెద్దమ్మ ) అంటూ సులువుగా ఎత్తుకుని గుండెలపై వాల్చుకున్నాను .
పెద్దమ్మ : చెల్లీ ..... ఎత్తుకున్నాడు ఇక కళ్ళు తెరవచ్చు అంటూ కొంటె నవ్వుతో గుసగుసలాడి బుగ్గపై ముద్దుపెట్టారు .
Wow wow wow అంటూ సౌండ్స్ లేకుండా ఆనందిస్తున్న అక్కయ్యలు - మిగతా దేవతలతోపాటు నుదుటిపై చెమటతో వాసంతి అంటీ పైకిలేచారు .
పెద్దమ్మ : ఇంతటి చలిలోనూ చెమట ఎలా పట్టింది చెల్లీ అంటూ చిలిపినవ్వులతో తుడిచారు పెద్దమ్మ .
వాసంతి అంటీ : ష్ ష్ ష్ ..... అక్కయ్యా అంటూ సిగ్గుపడి , హీరో నెమ్మదిగా లోపలికి తీసుకురా పరుపు సిద్ధం చేస్తాము .
పెద్దమ్మ : మీరు కోరినట్లుగానే ఎత్తుకున్నాడా దేవతలూ .....
అంటీలు : అచ్చు అలానే అక్కయ్యా ...... , నమ్మలేకపోతున్నాము అంటూ లోపలికివెళ్లారు .

అంతే నా బుగ్గపై ముద్దులు ......
అమ్మకూచీ నిద్రపోలేదా ? .
బుజ్జిజానకి : లేదు , దేవతల మాటలు వింటూ కళ్ళు మూసుకునే ఎంజాయ్ చేసాను , దేవతలు ఎత్తుకుంటారేమోనని ఆశపడ్డాను ప్చ్ ప్చ్ ......
అయితే ......
బుజ్జిజానకి : నో నో నో నిజం చెప్పనా ..... , దేవుడు ఎత్తుకోవాలని అమ్మ పర్మిషన్ కూడా తీసుకున్నాను నమ్మకం లేకపోతే నువ్వే కనుక్కో ......
బుగ్గపై ముద్దు ...... పెదాలపై చిరునవ్వులు , లవ్ ..... థాంక్యూ థాంక్యూ అమ్మకూచీ ..... గాలిలో తేలిపోతున్నట్లు ఉంది .
గాలిలో తేలిపోతున్నది నేను అంటూ బుగ్గపై కొరికేసింది .
కెవ్వున కేకవేశాను .
దేవతలు పరుగునవచ్చారు , పడేసావేమోనని ఎంత కంగారుపడ్డామో ...... థాంక్ గాడ్ , ఎందుకు అరిచావు ? .
అదీ అదీ ......
అక్కయ్యలు : చెల్లి కొరికేసిందేమో అమ్మలూ .....
ఊ - ఊహూ అంటూ ఊపుతున్నాను .
హాయిగా నిద్రపోతుంటే అనవసరంగా అబాండాలు వేస్తున్నారు మాజానకిపై అంటూ అక్కయ్యలకు మొట్టికాయలు పడ్డాయి .
నవ్వుకున్నాను .
అక్కయ్యలు : నిజం చెప్పు తమ్ముడూ ..... , కొరికింది చెల్లే కదా ......
దేవతలు కొట్టడంలో తప్పేలేదు .
దేవతలు మళ్లీ మొట్టికాయలువేశారు .
అక్కయ్యలు : స్స్స్ స్స్స్ స్స్స్ నిన్ను ఆడిగాము చూడు మాకు బుద్ధిలేదు , దేవతలే నీ ప్రాణం ..... దేవతలూ దేవతలూ దేవతలూ ...... అంటూ గిళ్లబోయారు .
నో నో నో దేవతల పర్మిషన్ తీసుకోండి .
అక్కయ్యలు : సరిపోయింది , లోపలికి వెళ్లు తమ్ముడూ అంటూ దారిని వదిలారు .
అంటీలు : బెడ్ రెడీ చేసాము సౌండ్ చెయ్యకుండా పడుకోబెట్టి వచ్చెయ్యి .
అమ్మకూచీ గదిలోకి ఎత్తుకునివెళ్లి పడుకోబెట్టాను - అమ్మకూచీ మాత్రం వదలడం లేదు , కళ్ళు తెరిచి మ్మ్ మ్మ్ మ్మ్ అంటూ బుగ్గను చూఇస్తోంది , అమ్మ పర్మిషన్ తీసుకున్నానులే గుడ్ నైట్ కిస్ ......
నా గుడ్ నైట్ కిస్ ఎలా ఉంటుందో తెలుసుకదా ..... 
బుజ్జిజానకి : వెయిటింగ్ ......
హాయిగా నిద్రపో అమ్మకూచీ , అమ్మ కలలోకి వస్తారుగా , గుడ్ నైట్ అంటూ బుగ్గపై కొరికేసాను .
అంతే వెంటనే నోటిని చేతులతో మూసేసి కంట్రోల్ చేసుకుని yes yes yes అంటూ ఎంజాయ్ చేస్తోంది , సో స్వీట్ ఆఫ్ యు గుడ్ నైట్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
నవ్వుకుని భుజాలవరకూ దుప్పటికప్పి గుడ్ నైట్ అంటూ మరొక ముద్దుపెట్టి , అఅహ్హ్ ..... అంటూ అమ్మకూచీ సంతోషాలను ఆస్వాదిస్తూ వెనక్కు నడుస్తూ బయటకువచ్చాను .
దేవతలు - అక్కయ్యలు అడుగుల్లో అడుగులువేసుకుంటూ లోపలికివెళ్లి , తెల్లవారకముందే వచ్చేస్తాము గుడ్నైట్ అంటూ కిస్సెస్ పెట్టారు .
నిద్రలోనే గుడ్ నైట్ అత్తయ్యలూ - అంటీ - దేవతమ్మా - అక్కయ్యలూ ......
అక్కయ్యలు : నువ్వు నిద్రపోలేదని తెలుసులే చెల్లీ ..... గుడ్ నైట్ ఉదయం కలుద్దాము .
అమ్మమ్మ డోర్స్ క్లోజ్ చేశాక కార్స్ దగ్గరకు చేరుకున్నారు - మనీ బ్యాగ్ అందుకుని మెయిన్ గేట్ క్లోజ్ చేసి కారు దగ్గరికి వెళ్ళాను .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply
హలో హలో హలో ఎక్కడికి వస్తున్నావు , నువ్వు ఆటోలోకానీ క్యాబిలోకానీ రా , చెల్లిని వదిలి వెళ్ళాలి అన్నారు అంటీలు .
పెద్దమ్మ : చెల్లిని నేను డ్రాప్ చేస్తానులే దేవతలూ ......
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... కారే తమ్ముడిది .
అంటీలు : అయితే మనమే ఆటోలో వెళదాము దిగండి .
నో నో నో దేవతలూ ...... , ఏ క్షణమైతే మీ అడుగుపడిందో ఆ క్షణం నుండీ కారు మీ సొంతమైపోయింది , నా కారు అన్నవాళ్లను మొట్టికాయలు వెయ్యండి అంటూ నవ్వుకున్నాను , నేను ఆటోలో వస్తానులే అంటీలూ ......
అక్కయ్యలు : ఇప్పటికే ఉదయం ఇంటిదగ్గర మొదలుకుని ఇక్కడ వరకూ నాలుగైదు మొట్టికాయలు , మా అమ్మలను మేముకూడా అనకూడదా ? .
ఊహూ ......
అంటీలు : నువ్వెవరు చెప్పడానికి ఎక్కండి తల్లులూ .......
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ ..... ఎన్ని గుంజీలు తీసాడో గుర్తుందికదా పాపం పైగా చేతిలో బరువైన పెద్ద బ్యాగు ......
గుంజీలు గుర్తుకురాగానే కరిగిపోయారు దేవతలు , సరే బుద్ధిగా కూర్చోవాలి - ఇంటికి చేరుకునేంతవరకూ నోటికి తాళం వేసుకోవాలి .
గుంజీల వలన ఏమీకాలేదు దేవతలూ - స్వీట్ పనిష్మెంట్ ను భలేగా ఎంజాయ్ చేసాను , ఆటోలో కాదు నడుచుకుంటూ రమ్మని ఆజ్ఞ వేసినా హ్యాపీ ......
అక్కయ్యలు : మాకోసం నటించవచ్చుకదా తమ్ముడూ ......
దేవతలతో నిజాయితీగా ఉంటాను .
అక్కయ్యలు : నిజాయితీ నిజాయితీ ...... దేవతలూ దేవతలూ ..... సరిపోయింది .
పెద్దమ్మ - మేడమ్ నవ్వుకుంటున్నారు .
అంటీలు : అల్లరి చెయ్యకుండా ఎక్కుతావా లేదా ? .
దేవతల మాట శిరసావహిస్తాను .

మేడమ్ సంతోషంతో వచ్చి , లవ్ యు వాగ్దేవి - కావ్య - సునీత అంటూ కౌగిలించుకుని ముద్దులుపెట్టారు .
చివరగా నన్నూ కౌగిలించుకుని అన్నింటికీ చాలా చాలా థాంక్స్ , నా శిష్యుడి రుణం తీర్చేసుకుంటానులే గుడ్ నైట్ అంటూ బుగ్గపై కొరికేసి తుర్రుమని పెద్దమ్మ కారులోకి చేరారు , పెద్దమ్మ నుండి బాబుని ఎత్తుకుని అక్కయ్యలూ - తల్లులూ గుడ్ నైట్ .
అంటీలు : ఇంకా గట్టిగా కొరకాల్సింది చెల్లీ గుడ్ నైట్ , అక్కయ్యా గుడ్ నైట్ .....
బాబూ గుడ్ నైట్ - పెద్దమ్మవైపు కొంటెగా కన్నుకొట్టాను - కూర్చోగానే వ్యతిరేకదిశలలో బయలుదేరాయి .

కావ్య అక్క ముందుకువచ్చి ఎంజాయ్ అంటూ దేవతలు కనిపించేలా మిర్రర్ సెట్ చేసి దేవతపై కూర్చున్నారు .
అమ్మకూచీతో గడిపిన సంతోషాలను గుర్తుచేసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న దేవతలను మనసారా నింపుకుంటున్నాను , మనీ బ్యాగును పాదాల ముందు ఉంచబోతే షాపింగ్ బ్యాగ్ కనిపించింది , అంటీలూ ...... మీ షాపింగ్ లో ఒకటి ఇక్కడే ఉండిపోయింది అంటూ ఓపెన్ చేసి చూస్తే షర్ట్ ప్యాంట్ ......
అంటీలు : ఒకటి కాదు మూడు ఉంటాయి చూడు , ఇటివ్వు ......
బుజ్జిజానకికి ప్యాంటు షర్ట్ - మరొకదానిలో టీ షర్ట్ జీన్స్ - ఇంకొకదానిలో జుబ్బా పైజామా .......
ఏదీ ప్యాంటు - టీ షర్ట్ - జుబ్బానా ? అంటూ అందుకుని చూసారు అక్కయ్యలు , అయ్యో తమ్ముడూ ...... ఈ గిఫ్ట్స్ నీకోసం తీసుకొచ్చినట్లున్నారు - ముగ్గురు దేవతలు మూడు గిఫ్ట్స్ ....... , అమ్మలూ ......
అంటీలు : ష్ ష్ ష్ తల్లులూ .....
అక్కయ్యలు : అంటే అందరితోపాటు తమ్ముడికి కూడా షాపింగ్ చేసారన్నమాట , లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మలూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... , తమ్ముడూ నీకోసమే డౌట్ లేదు .
అంటీలు : ష్ ష్ ష్ ......

యాహూ యాహూ ...... స్టాప్ స్టాప్ స్టాప్ సిస్టర్ , కారు సైడ్ కు ఆగగానే కిందకుదిగి పట్టరాని సంతోషంతో డాన్స్ చేస్తున్నాను .
అంటీలు : ఇదిగో ఇలా అల్లరి - ఓవర్ చేస్తాడని తెలిసే కారులోనే ఉంచాము , ఇంటికి చేరుకున్నాక కిటికీలో ఉంచుదామనుకున్నాను .
దేవుడున్నాడు ..... నా ప్రార్థనలు ఆలకించారు , థాంక్యూ థాంక్యూ దేవతలూ ..... , ఈ సంతోషాన్ని వెంటనే బుజ్జిజానకితో ......
అంటీలు : జానకిని డిస్టర్బ్ చేసావో దెబ్బలుపడతాయి ఇప్పటికే ఆలస్యం అయ్యింది బుద్ధిగా ఎక్కి కూర్చో ...... , సిస్టర్ ..... ఇంటివరకూ ఆపమన్నా ఆపకు .
కారు కదిలింది , దేవతలు దేవతలూ ..... నాకోసం గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇంతకంటే ఆనందం ఏముంటుంది , లవ్ .... థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో సో మచ్ దేవతలూ అంటూ పొంగిపోతున్నాను , ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను .
అంటీలకు కూడా నవ్వు వచ్చేసింది .
యాహూ యాహూ దేవతలు నవ్వారు .....
అంటీలు : లేదు లేదు లేదు ......
అక్కయ్యలు : అవునవును తమ్ముడూ ......
అంటీలు : ష్ ష్ ష్ అంటూ మళ్లీ మొట్టికాయలు వేశారు .
అక్కయ్యలు : ఐదోసారి స్స్స్ స్స్స్ స్స్స్ ...... , చిన్నప్పటి నుండీ ఎలాగో దెబ్బలు తినలేదు , నీ వలన ఆ అదృష్టం తమ్ముడూ , లవ్ యు సో మచ్ ......
మాట్లాడితే దెబ్బలు అన్నట్లు నావైపుకు కోపంతో చూస్తున్నారు అంటీలు .
నోటికి తాళం వేసుకుని బుద్ధిగా కూర్చున్నాను .
అక్కయ్యలు : ఎవ్వరికీ భయపడడు మీకు తప్ప అమ్మలూ అంటూ దేవతల బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ......
నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నాము .

అంటీలు : అమ్మాయీ ..... తెల్లవారకముందే బుజ్జితల్లి దగ్గర ఉంటామని మాటిచ్చాము.
అలాగే మేడమ్ .....
అంటీలు : థాంక్యూ ..... , తల్లులూ చదువుకోవాలి కదా రండి అంటూ చేతులుపట్టుకుని లాక్కుని వెళుతున్నారు .
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ ఒక్క నిమిషం ఓకేఒక్క నిమిషం అంటూ నావైపుకు చూస్తున్నారు .
అంటీలు : నో అంటే నో ......
అక్కయ్యలు : గుడ్నైట్ గుడ్నైట్ గుడ్నైట్ తమ్ముడూ .....
గుడ్ నైట్ దేవతలూ ......
మేము విష్ చేస్తే విష్ చెయ్యలేదు , విష్ చెయ్యని అమ్మలకు  అంటూ అక్కయ్యలు కోపంతో చూస్తూ వెళ్లారు .
నవ్వుకుని ఇంటివైపుకు కాకుండా రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళాను .
తమ్ముడూ తమ్ముడూ ..... ఇంటికి కాకుండా ఎక్కడికి , ప్లీజ్ ప్లీజ్ చెప్పు .....
అక్కయ్యల కళ్ళల్లో చెమ్మ చేరినట్లు స్వరం ...... , వెనక్కు తిరిగి మనీ బ్యాగ్ చూయించాను .
అక్కయ్యలు : కన్నీళ్లను తుడుచుకుని , ఓహో శరణాలయానికా ? జాగ్రత్తగా వెళ్ళిరా , నువ్వు వచ్చేన్తవరకూ బాల్కనీలోనే చదువుకుంటూ ఉంటాము , కారులో వెళ్ళొచ్చుగా ...   సిస్టర్ సిస్టర్ ...... జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటికి చేర్చండి ప్లీజ్ ప్లీజ్ ...... , అమ్మలూ అమ్మలూ ..... ok అనండి , చెల్లి కోసమే కదా వెళుతున్నది .
అంటీలు : బుజ్జితల్లికోసం ఒప్పుకుంటున్నాము .
అక్కయ్యలు : సిస్టర్ వెళ్ళండి వెళ్ళండి , కారు నాముందు ఆగడంతో అక్కయ్యలు సంతోషంతో దేవతలను హత్తుకుని ముద్దులు కురిపించారు .

సిస్టర్ ...... ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీరు ఇంటికి వెళ్ళండి నేను క్యాబులో వెళతానులే ......
సిస్టర్ : వదిలేసి వెళితే మీ అక్కయ్యలు బాధపడతారు - నాకు అలవాటే నైట్ డ్యూటీ కూడా చేసేదానిని కూర్చో మహేష్ .....
థాంక్యూ సిస్టర్ ..... , govt కాలేజ్ ప్రక్కన శరణాలయం ఉండాలికదా .....
సిస్టర్ : ఓహో బాలికల శరణాలయం మరియు విమెన్ వృద్ధాశ్రమం ..... అంటూ 20 నిమిషాలలో తీసుకెళ్లారు , మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటారు అని ఒప్పించి పంపించాను .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply
బ్యాగు భుజంమీద వేసుకుని వెనక్కు తిరిగిచూస్తే , శరణాలయం మొత్తం చీకటి - సిటీ మధ్యలోనే ఉన్నప్పటికీ ఇక్కడ ఒక బాలిక శరణాలయం మరియు వృద్ధాశ్రమం ఉన్నట్లుగానే అనిపించనట్లు ఏమాత్రం సేఫ్టీ లేనట్లు పూర్తిగా డ్యామేజ్ అయిన మెయిన్ గేట్ ఇక నేమ్ బోర్డ్ అయితే సరేసరి - చుట్టూ కాంపౌండ్ కూడా అక్కడక్కడా కూలిపోయినట్లు చీకటిలో కనిపిస్తోంది , ఆడుకోవడానికి స్థలం ఉన్నాకూడా వసతులు లేనట్లు కనిపించింది , ఒక్కటి మాత్రం సంతోషపడే విషయం ...... బయట గుట్కా మరకలు చెత్త చెదారం ఉన్నప్పటికీ లోపల శరణాలయం మాత్రం ఎటుచూసినా శుభ్రం - చెట్లు మొక్కలతో చల్లటి గాలి తగులుతోంది .
అనుమతిలేకుండా బాలికల శరణాలయంలోకి వెళ్లడం తప్పు - ఈ సమయంలో వార్డెన్ గారిని కేకవేసి పిలిచి నిద్రపోతున్న వారిని డిస్టర్బ్ చెయ్యడమూ ఇష్టంలేదు - వెనక్కు తిరిగీ వెళ్లలేను ( చూడు మహేష్ ఈ డబ్బు వెంటనే మంచికి ఉపయోగపడాలి అప్పుడే తాతయ్య మన్నించబడతారు అని బుజ్జిజానకి మాట తీసుకుంది ) ఇక పెద్దమ్మ సహాయం తీసుకోవాల్సిందే ......

అలా తలుచుకున్నానో లేదో లోపల చిన్న లైట్ వెలిగింది - ఒక అమ్మ నాదగ్గరకు చేరుకుని ఎవరు బాబూ ఎవరు కావాలి అని అడిగారు .
క్షమించండి అమ్మా ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మరియు విరాళంగా ఈ డబ్బు ఇస్తున్నందుకు అంటూ బ్యాగును అందించాను .
ఆ అమ్మ తెరిచి చూసి ఆశ్చర్యపోయారు , ఎవరు బాబూ నువ్వు ? ఇంత డబ్బు ? .
నేనెవరిని అన్నది ముఖ్యం కాదు , ఊహ తెలిసేలోపే అమ్మను కోల్పోయిన ఒక బిడ్డ ...... తనతోపాటు ఇక్కడున్న పిల్లలు మరియు బామ్మలు అనాధలుగా ఏ క్షణమూ ఫీల్ కాకూడదు అని వారి సంతోషం కోసం తన వంతుగా పంపించింది , మీరే ఈ డబ్బుతో ఇక్కడుంటున్న అందరిలో సంతోషాలను నింపాలి ......
సంతోషం చాలా సంతోషం బాబూ ..... , ఆ తల్లి ఎవరో కానీ నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండాలి , ఏదో గుర్తుకువచ్చినట్లు వద్దు వద్దు వద్దు ఈ డబ్బు నాతో ఉండకూడదు - ఆ వార్డెన్ కంట పడితే అంతే ......
అమ్మా మీరు వార్డెన్ కాదా ? .
కాదు బాబూ ..... , నేనిక్కడ అమ్మాయిలను చూసుకునే ఆయాను మాత్రమే , మా వార్డెన్ గయ్యాలికి ఎంత డబ్బు ఉన్నా ఇంకా ఆశే , పాపం ..... ఇక్కడున్న అమ్మాయిలు - వృద్ధుల అవసరాలకోసం ముఖ్యంగా అమ్మాయిల చదువుల కోసం govt సహాయంతోపాటు వచ్చే దాతల విరాళాలలో సగానికి పైగా దోచేస్తూనే మిగిలిన ఆ డబ్బును కూడా ఖర్చు చెయ్యడానికి పిల్లలను నానా చాకిరీలు చేయిస్తుంది , ఇంత డబ్బును చూసిందంటే మొత్తం తనే తీసేసుకుంటుంది , ఒక్కసారి నాతోపాటు లోపలికి రా బాబూ ...... అంటూ ఒకచేతితో బ్యాగు పట్టుకుని మరొక చేతితో నా చేతిని అందుకుని తీసుకెళ్లారు .

అమ్మా ..... ఎంత పరిశుభ్రంగా ఉంది - మొక్కలు కళకళలాడుతున్నాయి .
" ఖర్చులేనిది కదా బాబూ ..... , పిల్లలు - మా వృద్ధులమే సంతోషంగా శుభ్రంగా ఉంచుతాము , ఇక్కడ శుభ్రం చేసింది చాలదన్నట్లు అమ్మాయిలు చదువుకునే సమయంలో చాలాదూరం నడిపించుకుంటూ తీసుకెళ్లి మా వార్డెన్ తన ఇంటిలోకూడా పనులు చేయించుకుని , పనులు చేయించుకోవడమే కాదు అభం శుభం తెలియని అమ్మాయిలను నానా హింసలు పెడుతుంది , ఆట స్థలాలు ఉన్నా ఆడుకునే వస్తువులు ఉండవు ఆ డబ్బునూ తీసేసుకుని రికార్డ్ లో మాత్రం అప్డేట్ చేస్తుంది , డ్యామేజ్ అయిన మెయిన్ డోర్ తెరిచి వెలగాలా వద్దా అన్నట్లు వెలిగిన 60w బల్బ్స్ రెండు వెలుగులో నిద్రపోతున్న నా వయసు మొదలుకుని బుజ్జాయిలను చూయించారు .

చిన్న హాలులో రెండింతలు మూడింతల అమ్మాయిలు అడ్జస్ట్ అయ్యి కటిక నెలపైననే పడుకుని ఉండటం - ఒకవైపు కప్పుకోవడానికి సరిగ్గా దుప్పట్లు కూడా లేకపోవడం మరొకవైపు దోమలు ..... నిద్రలోనే దోమల వలన అటూ ఇటూ కదలడానికి కూడా వీలులేదు , సరిగ్గా క్లోజ్ చెయ్యడానికి కూడా లేని కిటికీలనుండి వస్తున్న చల్లటి గాలికి నిద్రలోనే వణుకుతుండటం చూసి చలించిపోయాను , బిల్డింగ్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు ఎప్పుడు పైనుండి పెచ్చులు ఊడి ఎవరిమీద పడతాయో అని భయం వేసింది , కళ్ళల్లో చెమ్మతో ...... అమ్మా బయటనుండి చూస్తే పెద్దగా ఉందికదా ? .
" అదిగో మూసిన తలుపులు ...... , లోపల ఇలాంటి హాల్ ఉంది దానిని చక్కగా పిల్లలతోనే రెడీ చేయించుకుని తను ఇక్కడ ఉండే 10 నిమిషాలకోసం ఎవ్వరూ లోపలికి వెళ్లకుండా లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది - పిల్లలు భయంతో ఇలా సర్దుకుంటున్నారు , ఇక బాత్రూమ్స్ పరిస్థితి మరింత ఘోరం ...... గొళ్ళెం లతోపాటు తలుపులూ లేవు , మేము అడ్డుగా నిలబడటంతో స్నానం చేస్తారు , సబ్బు ఉండదు పేస్ట్ ఉండదు - స్కూలుకు వెళ్లాలంటే డ్రెస్సెస్ ఉండవు బుక్స్ ఉండవు పాదాలకు చెప్పులు ఉండవు , ఇక భోజనం పరిస్థితి చెప్పనక్కర్లేదు - పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేన్తవరకూ ఆకలితోనే ఉండాలి " .
అమ్మా .......
" అవును బాబూ ..... టిఫిన్ ఉండదు , ఆ డబ్బును కూడా దోచేసుకుంటోంది , పిల్లలు ఆకలితో బాధపడుతూనే స్కూలుకు వెళ్లడం చూసి మేమంతా ఏమీ చేయలేక కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నాము ఎప్పటికైనా ఆ దేవతల అనుగ్రాహం పిల్లలపై కురావాలని ...... " 
కన్నీళ్లు ఆగడంలేదు ......
" వింటుంటేనే నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి , పాపం ఈ అమ్మాయిలు ..... అనాధాలుగా మారడమే వీరు చేసుకున్న పాపం " 
అమ్మా ...... అధికారులు పట్టించుకోరా ? .
" అవినీతి లేనిది ఎక్కడ బాబూ ...... , ఈ డబ్బును చూడగానే పందికొక్కుల్లా పంచేసుకుంటారు , నిన్ను లోపలికి తీసుకొచ్చిన ఉద్దేశ్యం ఏమిటో తెలిసిందని అనుకుంటున్నాను , ఈ డబ్బు నువ్వే ఉంచుకుని చెయ్యాల్సినది చేసి పిల్లలలో సంతోషాలను నింపితే అంతే చాలు ..... " 
నింపుతాను అమ్మా ...... , శరణాలయం - వృద్ధాశ్రమం రూపురేఖలే మార్చేస్తాను , ఈ డబ్బుతోపాటు సంవత్సరాలుగా పిల్లలు - మీకు చేరాల్సిన డబ్బుతోనే మొత్తం మార్చేస్తాను , మీ అందరిలో సంతోషాలను నింపమని పంపించిన నా బుజ్జిజానకి కోరిక తీరుస్తాను .
" బుజ్జిజానకి ...... సంతోషంగా ఉండాలి " 
థాంక్యూ అమ్మా ..... , మీలాంటి పెద్దవారి ఆశీస్సులు తనకు ఉండాలి అంటూ ఆనందించాను .
అమ్మా ...... అంతా మ్యాజిక్ లా ఉంటుంది , ఉదయం లేచి కంగారుపడకండి , అంతా దైవేచ్చ ...... , ఈ ఒక్క పూట అడ్జస్ట్ అవ్వండి నన్ను నమ్మి వెళ్లి పడుకోండి , ముందైతే లైట్స్ ఆఫ్ చెయ్యండి నిద్ర డిస్టర్బ్ అవుతోంది - అమ్మా ..... నన్ను నమ్ముతారా ? .
" ఈ సమయంలో వచ్చి సహాయం చేస్తాను అన్నావు - దైవేచ్చ అంటున్నావు - ఏమీ కాకపోయినా పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయి కన్నీళ్లు కార్చావు ...... ఇవి చాలదా ? నమ్మడానికి ..... , ఇంతమంది పిల్లలకు మంచి జరిగితే అంతే 
చాలు అంటూ ప్రార్థించారు , బాబూ ..... బుజ్జిజానకి అమ్మ పేరేమిటి ? " .
" జానకి - మహి ..... తల్లీబిడ్డలు " , వీరందరి సంతోషమే వారి సంతోషం .
" అర్థమైంది అర్థమైంది అమ్మపై మమకారంతో బుజ్జిజానకిగా పిలవబడుతోందన్నమాట మహి - మహీ ..... నీ అక్కాచెల్లెళ్లకోసం బుజ్జిదేవుడిని పంపించావన్నమాట " .
అమ్మా ..... మీరుకూడానా ? .
" అయితే బుజ్జిదేవుడిగా ఈపాటికే పిలవబడుతున్నావన్నమాట అంటూ ఆనందిస్తున్నారు " 
మహేష్ అని పిలవండి చాలు , సూర్యోదయానికల్లా మీపెదాలపై సంతోషాన్ని ఇక్కడున్న అమ్మాయిలు మరియు బామ్మల పెదాలపై కూడా విరాజిల్లేలా చేస్తాను , అమ్మా ..... దోమలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి  నిమిషంలో వెళ్లి ALLOUT తీసుకొస్తాను .
" లోపల ఉన్నాయి బాబూ ...... వాటిని కూడా బయట అమ్ముకుంటుంది " 
వార్డెన్ మనిషేనా ? అంటూ వెళ్లి తాళం పగలగొట్టి , అమ్మతోపాటు వెళ్లి తీసుకొచ్చి నాలుగువైపులా ఉంచి తలుపులువేసి బయటకువచ్చాను .

మెసేజ్ ...... పెద్దమ్మ నుండి .....
" చిటికెలో మా బుజ్జిదేవుడి మనసులోని ఊహలా శరణాలయాన్ని మార్చేయమంటావా ? " 
నో నో నో పెద్దమ్మా ..... , " కష్టే ఫలి " అంటారుకదా ..... , శరణాలయం - వృద్దాశ్రమం కోసం సంతోషంగా శ్రమిస్తాను - ఫలితపు ప్రతిఫలాన్ని మాత్రం మన బుజ్జిజానకికి చెందేలా చూస్తే చాలు పెద్దమ్మా ......
" ఇందుకు కాదూ ..... మా బుజ్జిదేవుడు అంటే మాకు పిచ్చిప్రేమ అంటూ ముద్దులు ...... " 
నాదగ్గర కాకుండా అక్కడ ఒంటరిగా ఉన్న అమ్మ దగ్గరికి వెళితే చాలా సంతోషం - పాపం అమ్మకు ఒంటరిగా బోర్ కొడుతూ ఉంటుంది .
" సరేసరే ..... - ఈ విషయం జానకికి చెబుతానులే , చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో ..... , బిడ్డ గురించి తల్లికి తెలియదా ఏమిటి ? " 
మురిసిపోతున్నాను ...... , పెద్దమ్మా పెద్దమ్మా ..... అలాగే మధ్యమధ్యలో బుజ్జిజానకి నిద్రలో ఉండగా ఇద్దరూ వెళ్లగలరు .....
" అది జరగదు " 
అయితే ఇప్పుడే నేను పైకి వచ్చేస్తాను .....
" కూల్ కూల్ ...... జరగదు అంటే వెల్లము అనికాదు అర్థం , పూర్తిగా చెప్పేంతవరకైనా ఆగవు - ఒకరిని సొంతం అనుకుంటే ఎంత దూరమైనా వెళ్లిపోతావని నాకు తెలుసులే , విషయం ఏమిటంటే నిద్రలో ముందుగా నీ కలలో కనిపించి ప్రేమను పంచికానీ బుజ్జితల్లి దగ్గరకు వెళ్లనని ఇలానే మారాం చేస్తుంది జానకి ...... " 
అంతే పట్టరాని సంతోషంతో పొంగిపోతున్నాను , లవ్ యు అమ్మా ...... , అమ్మా ..... ఈరాత్రికి పడుకోవడం ఆలస్యం అవ్వవచ్చు ఈ ఒక్కసారికి మొదట బుజ్జిజానకి దగ్గరకే వెళ్ళండి ......
" జానకి ఒప్పుకోవడంలేదు బుజ్జిదేవుడా ..... , ఎంతసేపైనా సరే వేచిచూసే వెళతాను అంటోంది , బుజ్జిజానకి మాట ప్రకారం ఏమిచెయ్యబోతున్నావో నాద్వారా అపుడే వినేసింది , ఆ క్షణం నుండీ ఇంకా ప్రాణం అయిపోయావు మరి ...... " 
లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా ..... 
" ఎంజాయ్ ఎంజాయ్ ...... "
నవ్వుకుని , పెద్దమ్మా ..... మీరు సహాయం చేయాలనుకుంటే ఆ వార్డెన్ ఇప్పటివరకూ శరణాలయం ద్వారా తిన్నదంతా కక్కించాలి , పిల్లలు - బామ్మలు లేచేసమయానికి వారి ముందు మోకరిల్లి క్షమాపణలు చెప్పి వార్డెన్ గా తప్పుకోవాలి - అందరి సంతోషం కోరుకునే ఆయా అమ్మ వార్డెన్ అవ్వాలి .
" అలాగే ..... , ఉదయంలోపల నేనేమి చెయ్యాలో ఆజ్ఞలు వెయ్యి " 

లవ్ యు పెద్దమ్మా ..... , ముందైతే కార్ కావాలి - మెయిన్ గేట్ ముందు ఆగింది , ముందు డోర్ తెరిచి కూర్చోబోతే వెనుక సీట్లో కట్టల కట్టల డబ్బు ......
" వార్డెన్ తిన్న డబ్బు - నల్ల డబ్బులా గోడలో దాచుకుంది " 
అంతలోనేనా ..... , అయినా అక్కడ దాచుకుని ఏమిచేస్తుందో , అయినా ఇంత డబ్బు ఎలా ? , అలాగే అలాగే పై అధికారులు కూడా తిన్నారని ఆయా చెప్పారు .
" అమ్మో కనిపిస్తోంది కనిపిస్తోంది చాలా అధికారుల బిల్డింగులలో దాక్కుంది , ఈ కారు సరిపోయేలా లేదు పెద్ద వెహికల్ కావాలి " 
అలా పెద్ద వెహికల్లోకి మారిపోయాను ..... , వెనుక నిండిపోయి ముందు కూర్చున్న నామీదకు పడేంత డబ్బు ...... , చిన్న శరణాలయంలో ఇంత అవినీతి ? .
" పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుండి పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చాయి , ఎవ్వరికీ తెలియకుండా మొత్తం పంచేసుకున్నారు " 
పెద్దమ్మా ......
" డన్ ...... , అందరూ బయటపడతారు - తదనుగుణంగా శిక్షనూ అనుభవిస్తారు " 
శిక్ష పడాల్సిందే పెద్దమ్మా ...... , లోపల చూసి చలించిపోయాను .
" నువ్వెలా అంటే అలా ...... " 

పెద్దమ్మా ..... మొదట ఫర్నిచర్ & షాపింగ్ చెయ్యాలి , కాట్స్ - బెడ్స్ - బ్లాంకెట్స్ - లాకర్స్ - డ్రెస్సెస్ - స్కూల్ కు వెళ్ళడానికి అవసరమైనవి - స్కూల్ కు వెళ్ళడానికి స్కూల్ బస్ - చెల్లెళ్లకు ఆడుకోవడానికి బొమ్మలు ....... ఇలా అన్నీ అన్నీ రాత్రికి రాత్రి చేర్చాలి , నేను షాప్స్ కు వెళ్ళేటప్పటికి ఒక్కరోజు ఇబ్బందిపడినా పర్లేదు తెరిచే ఉండాలి - ట్రాన్స్పోర్ట్ available గా ఉండాలి .
" డన్ డన్ ...... " 
నేను షాపింగ్ చేసుకొచ్చేలోపు శరణాలయం ..... స్టార్ హోటల్లా మారిపోవాలి ఇరుకుగా కాదు విశాలంగా పడుకునేలా - బాత్రూమ్స్ కూడా ...... , అలాగే అలాగే ఆట స్థలాలు రెడీ అయిపోవాలి - గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ అనుకూలంగా ఉండాలి - కాంపౌండ్ లోపలికి ఎవ్వరూ ప్రవేశించకుండా పటిష్టం అవ్వాలి - ముఖ్యంగా ముఖ్యంగా ...... డిన్నర్ హాల్ - వంటలు అధిరిపోవాలి - వారికిష్టమైనవి వారికిష్టమైన సమయంలో వండి ముందు ఉంచేలా వంటవారు 24/7 అందుబాటులో ఉండాలి - చదువుకోవడానికి వీలుగా లైబ్రరీ  .....
" ఆజ్ఞ బుజ్జిదేవుడా " 
లవ్ యు పెద్దమ్మా అంటూ బయలుదేరాను , ఒక్కొక్క షాప్ కే వెళుతూ అందరికీ అవసరమయ్యేలా అన్నింటినీ తీసుకుని శరణాలయానికి పంపించి స్పాట్ పేమెంట్ చేసేస్తున్నాను - అన్నీ చకచకా జరిగిపోయాయి , షాపింగ్ కు పోనూ ఇంకా కొద్ది డబ్బు మిగిలి ఉండటంతో ..... పెద్దమ్మా ఒక పని చేద్దాము ఈ డబ్బునంతా శరణాలయంలోని అందరి పేరుమీద సమానంగా బ్యాంక్ అకౌంట్స్ లోకి చేర్చేయ్యండి .
" ఒక్కరికి కూడా అకౌంట్స్ లేవు బుజ్జిహీరో ...... " 
పెద్దమ్మా ....
" జస్ట్ ఫర్ ఫన్ బుజ్జిహీరో ...... , కష్టపడుతున్నావుకదా నవ్విద్దామని ..... లవ్ యు లవ్ యు ఇష్టంగా కదూ ....... , డన్ బుజ్జిహీరో ..... ఒక్కొక్కరి అకౌంట్ లో లాక్షా పాతిక వేలు - వారికిష్టమైనవి కొనుక్కోవచ్చు " 
ఇకనుండీ govt ఫండ్స్ మరియు విరాళాలు ....... నేరుగా కొత్త వార్డెన్ అకౌంట్లోకి చేరిపోతాయి , నెలాఖరున మిగిలిన మొత్తం అమ్మాయిల అకౌంట్ల లోకి వెళ్లిపోతాయి " 
సూపర్ పెద్దమ్మా ...... , అన్నీ పూర్తయ్యి శరణాలయం చేరుకునేసరికి ఉదయం 5 గంటలు అయ్యింది - కాస్తoత వెలుగులో పూర్తిగా కొత్తగా మారిపోయిన శరణాలయాన్ని చూసి అవాక్కైపోయాను - సంతోషాశ్చర్యంతో అలా చూస్తుండిపోయాను , లోపలికివెళ్లి చూస్తే వరుసగా కాట్స్ బెడ్స్ పై విశాలంగా AC లో హాయిగా నిద్రపోతుండటం చూసి చప్పుడు చెయ్యకుండా బయటకువచ్చాను , బుజ్జిజానకి చూస్తే ఎంత ఆనందిస్తుందో అంటూ మురిసిపోతూ ఇంటికి చేరుకున్నాను , నాకోసం వేచిచూస్తూ వేచిచూస్తూ బుక్స్ చేతుల్లోనే బాల్కనీలో అక్కయ్యలు నిద్రపోతుండటం చూసి sorry అక్కయ్యలూ ఆలస్యం చేసాను , పెద్దమ్మా ......
" నేనే స్వయంగా ఎత్తుకునివెళ్లి పడుకోబెడతాను , నువ్వెళ్ళి కాసేపైనా రెస్టుతీసుకో ఫంక్షన్ కు ఒక్కరోజే సమయం ఉంది " 
లవ్ యు పెద్దమ్మా ..... అంటూ తలుచుకుని లోపలికివెళ్లి బెడ్ పైకి వాలగానే నిద్రపట్టేసింది .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply




Users browsing this thread: 10 Guest(s)