Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
BREAK {completed}
#1
•1•

అక్షిత ఈ పేరుతో కొన్ని కధలు ఇప్పటికే రాసాను, ఇంకొన్ని రాస్తానేమో తెలీదు. చదువరులందరికి పాత్రా పరిచయం ఉన్నా, నా కధలో సెక్స్ కంటెంట్ ఎక్కువగా లేకపోయినా నన్ను ఆదరించారు. మీకు బోర్ కొట్టకుండా మీ నిత్య జీవితాల్లో ఉండే టెన్సన్స్ ని ఇంకెన్నో బాధలని ఇంకా ఏముంటే అవి వాటన్నిటినీ కొంత సమయం మీకు దూరం చేసి, అలరింపజేయ నా ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటూ •)


అక్షిత

నలభై ఏళ్ల ప్రౌఢ, ఒంటి మీదకి ఇంకా ముడత రాలేదు, ఎప్పుడు కొంటెగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే అక్షితకి ఇద్దరు పిల్లలు. కొడుకు వేణు ఇంటర్ చదువుతున్నాడు. మొగుడు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకునేసరికి కాదనలేక చేసేదిలేక వాడిని చిన్నా అని ముద్దు పేరుతో పిలుచుకుంటుంది.

చిన్నది మధుమతి, పది చదువుతుంది. కూతురికి తనే పెట్టుకుంది పేరు, ఆ పేరంటే అక్షితకి దైవంతో సమానం. తన పూజ గదిలో ఉన్న మధుమతి గారి ఫోటోకి మొక్కినంతగా ఆ గదిలో ఉన్న ఇంకే దేవుడుకిని అంత భక్తిగా అంత ప్రేమగా వేడుకోదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా జీవితంలో ఏ ఆటంకం ఎదురైనా పూజ గదిలోకి వచ్చి మధుమతి గారి ఫోటో ముందు మోకాళ్ళ మీద కూర్చుని తనతో మాట్లాడుతుంది. రోజు పొద్దున్నే అందరూ లేవకముందే వెళ్లి తన సంగతులు ఆలోచనలు మధుమతి గారితో పంచుకోవడం అక్షిత దినచర్యలో భాగం.

ఇక మొగుడు శ్రీధర్, బ్యాంకు ఉద్యోగి. బాగానే సంపాదించాడు అనుకున్నట్టే అమ్మా నాన్నని వాళ్ళు కోరుకున్నట్టు దైవ దర్శనాలకి దేశం అంతా తిరగమని పంపించాడు. తన పని తన భార్య బిడ్డలే లోకం అలానే పక్కింట్లో ఉంటున్న తన తమ్ముడు.

ఇక అక్షితకంటూ సొంత ఆప్తులు ఎవరైనా ఉన్నారంటే అది పక్కింట్లో ఉన్న లావణ్యే.. తన తోడికోడలు. ఇద్దరు ఆనాధలు. కలిసే పెరిగారు. ఒకటే కంచం ఒకటే మంచం. సుమారు ఊహ తెలిసినప్పటి నుంచీ ఇద్దరు కలిసి మెలిసి ఉంటున్నారు అలానే జీవితాంతం ఉండాలని అన్నదమ్ములని ఏరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

పీజీ చదివిన అక్షిత కొత్తగా మొదలైన చిన్న టెక్ కంపెనీలో హెడ్ గా పనిచేస్తుంది. మొగుడు కంటే ఎక్కువ సంపాదిస్తున్నా తన మాటలో కానీ ఒంట్లో కానీ పొగరు లేదు. ఇక తనకున్న కోరికలకైతే అడ్డు అదుపు లేదు. పెళ్ళై ఇన్నేళ్ళలో మొగుడికి ఇంకా తన గురించి తన కామం గురించి అర్ధం కాలేదని అప్పుడప్పుడు బాధ పడుతుంది. ఎంత కసి దాగున్నా లోపలే దాచుకునేది. ఇంకో మగాడి చూపుకి కూడా అందనంత ఎత్తు ఆమెలోని భావాలు. అనాధ అయినందువల్లో పెళ్లయ్యాక మరే ఇతర కారణాల వల్లో అత్త మామల మీద ప్రేమా లేదు అలా అని ద్వేషము లేదు. తనకున్న బిజీ లైఫ్ లో జీవితం సాగిపోతుంది.

ఐదు గంటలకి పొద్దున్నే లేచి పూజ గదిలోకి వెళ్లి మధుమతి గారి ముందు తన గోడు వెళ్లబోసుకోవడం, కొంతసేపు ఏడవటం ఆ తరువాత లేచి సరదాగా ఉంటూ పిల్లలని లేపి పనుల్లో పడి ఇంట్లో ఉన్న ముగ్గురిని బైటికి గెంటేసి, అదే మొగుడిని ఆఫీస్ కి కొడుకుని కాలేజీకి కూతురిని కాలేజ్ కి పంపించేసి, తన పక్కింట్లో ఉన్న లావణ్యతో కలిసి ఆఫీస్ కి వెళ్లి అక్కడ సాయంత్రం వరకు అలిసిపోయేలా పని చేసి తిరిగి ఇంటికి వచ్చి ఆడుతూ పాడుతూ పని చేస్తూ పిల్లల్ని చదివించి వాళ్ళకి తినిపెట్టి వాళ్ళని పడుకోబెట్టి రోజూలానే మంచం మీద మొగుడు మీదెక్కి పది నిమిషాలు కానించి మొగుడికి ముద్దు పెట్టి ఇంకోవైపుకు తిరిగి మొగుడు పడుకున్నాక కసితీరా అరగంట అప్పుడప్పుడు గంటా స్వయం తృప్తిచెంది ఆ తరువాత నిద్ర పోతుంది. ఇది అక్షిత
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
•2•

అక్షిత ఇంటి గోడ పక్కనే ఆనుకుని ఉన్న ఇల్లు లావణ్యది. అక్షిత కంటే రెండేళ్లు పెద్దదైనా అక్షితకి చెల్లెల్లా ఉంటుంది. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా ఒంట్లో బాగోలేకపోయినా కూతురు పుట్టింటికి పరిగెత్తినట్టు లావణ్య అక్షిత ఒడి చేరుతుంది.


శ్రవణ్.. లావణ్య భర్త.. ఎవరో కాదు అక్షిత మొగుడు శ్రీధర్ తమ్ముడే. దంపతులిద్దరికి ఒక్కడే కొడుకు పేరు చిరంజీవి అని ఎంతో ఇష్టంగా పెట్టుకుంది లావణ్య.

అక్షిత కుటుంబంలా హడావిడిగా కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లావణ్య కుటుంబం. ఎక్కువ గోల ఉండదు. ఇంట్లో ఉన్నారా లేరా అన్నట్టు ఉంటారు. అక్షిత లావణ్యలు ఎంత స్నేహంగా ఉంటారో అక్షిత కొడుకు వేణు మరియు లావణ్య కొడుకు చిరంజీవి ఇద్దరు అంత స్నేహంగా ఉంటారు మధ్యలో పుల్లలా మధుమతి ఇద్దరినీ అల్లరి చేసి ఇబ్బంది పెడుతుంది.

పేరుకే అక్షిత కంటే రెండేళ్లు పెద్దది కానీ ఇద్దరు కలిసి చదవడం వల్ల సమం అయ్యారు. చదువులో, ఉద్యోగంలో ఒకరిని ఒకరు బ్యాకప్ చేసుకుంటూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇద్దరు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. డబ్బు మరేతర విషయాల్లో లావణ్య అక్షిత సలహాలు తీసుకుంటే కుటుంబపరంగా పెద్ద పెద్ద నిర్ణయాలు వరకు అక్షిత లావణ్య సలహాలు తీసుకుంటుంది. ఈ రెండిళ్ళకి అక్షిత సూత్రాధారి అయితే లావణ్య ముందుండి నడుపుతుంటుంది. పేరుకే రెండిళ్ళు కాని మనసులు కుటుంబాలు ఆలోచనలు ఒక్కటే

లావణ్యకి భక్తి చాలా ఎక్కువ, గణపయ్య నామస్మరణ లేనిదే తన రోజు మొదలవ్వదు. భయం వేసినా బాధ వేసినా అన్నిటికి గణపతిని తలుచుకుంటుంది. ఇక వినాయకచవితి వచ్చిందంటే చాలు ఇంట్లో కంటే వీధిలోనే ఎక్కువగా ఉంటుంది. నిమజ్జనానికి ఏడుస్తూ వినాయకుడిని సాగనాంపడం ఒక్క లావణ్య వల్లే సాధ్యం. ఒక్క లావణ్యకే కాదు అక్షితకి కూడా దేవుళ్ళలో వినాయకుడే ముఖ్యుడు, ఆ తరువాతే ఎవరైనా..

పొద్దున్నే లేచి రెండిళ్ళ ముందు ఊడ్చి, అక్షితలానే మొగుడిని కొడుకుని పంపించి ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్ళిపోతారు. వారానికి ఒకసారి బైటకి వెళ్లడం లేదా రెండిళ్ళు కలిసి వండుకుని తినడం ఇలా రెండు కుటుంబాలు వారి జీవనం సాగిస్తున్నారు. ఇది లావణ్య 

Like Reply
#3
•3•

చెన్నై

కొవిలంబక్కం నడి రోడ్డులో చెప్పులు సైతం కరిగిపోయేంత ఎండలో ఒకడు చెప్పులు లేకుండా నడుస్తుంటే వాడి కాళ్లు కాలి తట్టుకోలేక అడుగులు తడబడుతు వేస్తున్నాడు. వెనక అందరూ జనాలు కోపంగా వాడి వైపు నడుచుకుంటూ వస్తుంటే ఒక్కో అడుగు తూలుతూ ముందడుగు వేస్తున్నాడు.

గుంపులోని కుర్రవాడెవడో రాయి తీసుకుని కొట్టాడు, ఇదంతా పక్కనే నిలబడి ఏడుపు బిగపట్టుకుని చూస్తూ ఇక తన వల్ల కాక ముందుకు రాబోతే అది గమనించి వద్దని వారించాడు. ఇంకో రాయి పడింది.. ఆ నలభై ఐదేళ్ళ శరీర ఓపిక అప్పటికే అయిపోయిందేమో వాడు చలనం లేకుండా అలా పట్టించుకోకుండా వెనక్కి చూడకుండా ముందుకు ఒక్కో అడుగు వేస్తూనే ఉన్నాడు.

ఎవరు కాలర్ పట్టుకులాగారో జేబు చినిగింది, మొహం మీద టమాటాలు గుడ్లతో కొట్టారేమో నీసు వాసన వస్తుంది. షర్ట్ కొంచెం చినిగింది, మొహం మీద కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయి అవి జనాలు కొట్టినివిలా లేవు, ఎవరో జనాల్లో కలిసిపోయి కావాలని కొట్టినట్టున్నాయి. మీడియా మాత్రం ఒక్క సెకండు ఒక్క బిట్టు పోకుండా మొత్తం కవర్ చేస్తుంది. టీవీలో లైవ్ కవరేజ్ ఇవ్వాలిగా మరి..

రోడ్డు దాటి వెళుతుంటే వీపు మీద వెనక నుంచి గట్టిగా తన్నాడు ఒకడు.. దెబ్బకి ఎదురుగా పందులు దొల్లాడుతున్న నల్లటి మురికి కుప్పలో పడ్డాడు. ఇప్పటికి చాలా సార్లు అలా తన్నారు అయినా లేచాడు.. కానీ ఈ సారి లేవలేదు.

పదండ్రా అని అరిచాడెవడో అంతే అందరూ మరమనుషుల్లా వెనక్కి తిరిగారు. గుంపులో మాట్లాడుకంటున్నారు.

ఇలాంటి వాడికి ఇలానే జరగాలిరా
ఆల్రెడీ పుల్లీసులకి ఫోన్ చేశారు వాళ్ళు ఈ పాటికి వస్తూనే ఉంటారు
ఇంతకీ వాడి మీద ఏమేమి కేసులు పెడతారంటావ్

అబ్బో చాలా ఉన్నాయి మానవ హక్కుల ఉల్లంఘన, నిర్భయ, సెక్సువల్ అస్సాల్ట్, సెక్షన్ 377 ఇంకా ఉన్నాయేమో.. వీడిని ఎన్కౌంటర్ చేస్తే బాగున్ను

ఎంత బాగా మోసం చేశాడు రా, బైటికేమో బాలికా వసతి గృహం లోపలేమో అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం

పోనీలేరా వాడి పాపాన వాడే పోతాడు
ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు


ఇందాకటి నుంచి ఏడుస్తూ వాడిని చూస్తున్న ఆవిడ మాత్రం అక్కడే ఉంది, జనాలు వెళ్లిపోయాక ఏడుస్తూ అతని కోసం పరిగెత్తింది అన్నయ్యా అని కేక వేస్తూ.

ఒక్కటే లేపుకుని వాడిని మొయ్యలేక ఈడ్చుకెళ్లి పక్కనే ఉన్న బోరింగ్ పంపు కింద వాడిని పడుకోబెట్టి, బోరు కొడుతూ వాడిని లేపుతూ ఒళ్ళు కడుగుతూ ఏడుస్తుంటే పుల్లీసుల జీప్ వచ్చి ఆగింది.

వీడే ఆ చిరంజీవి, ఈ నా కొడుకుని లోపలికి ఎక్కించండి.. దీన్ని కూడా అని ఆవిడని చూసి గట్టిగా నవ్వాడు si

భయంతో లేచి నిలబడింది ఆవిడ.. పేరు సంజన అలియాస్ సంజు 

Like Reply
#4
•4•

చిన్నా : మమ్మీ.. మమ్మీ.. కాలేజీకి టైం అవుతుందే, త్వరగా కానీ..

అక్షిత : అయిపోయింది.. పొద్దున్నే లేచి తమరి పనులు తమరు చేసుకుంటే ఇంత బాధ పడనవసరంలేదు కదా

చిన్నా : నీకే నువ్వెన్నైనా చెప్తావ్, కష్టపడి చదివేది నేనూ

అక్షిత : అబ్బో.. అందుకేనా రెండు బ్యాక్లాగ్స్ ఉన్నాయి నీకు ?

చిన్నా : ఏ.. పోవే.. నేను వెళ్ళాలి.. ముందు టిఫిన్ పెట్టు

అక్షిత : కూర్చో పదినిముషాలు పడుతుంది.

చిన్నా : హబ్బా..

అక్షిత : ఏవండీ.. కొంచెం ఆ న్యూస్ ఛానల్ కట్టేసి ఇటు రండీ

అమూల్య : అమ్మా జడ

అక్షిత : ఉండవే వేస్తాను.. అని ఇడ్లీ మూతని తీస్తుంటే చెయ్యి కాలి కెవ్వుమంది

శ్రీధర్ : అబ్బబ్బబ్బా.. రోజూ పొద్దున్నే ఇల్లు సత్రంలా తయారవుతుందే.. దానికి జడెయ్యిపో.. ఈ ఇడ్లీ సంగతి నేను చూస్తాను.

అక్షిత వెళ్లి గబగబా తన కూతురికి జడ వేసి తిరిగి కిచెన్ లోకి వెళ్లి పని చేసుకుని ముందు మొగుడిని తన వెంట కూతురిని ఆ వెంటనే కొడుకుని పంపించేసి చకచకా తయారయ్యి తన పక్కింట్లో కాపురముంటున్న తన స్నేహితురాలు కం ఇంటి తోడికోడలు, అక్క అయిన లావణ్యని కేకేసింది.

లావణ్య : హా వస్తున్నా

అక్షిత : ఎంతసేపే టైం అవ్వట్లా

లావణ్య : అయిపోయింది బంగారం, నువ్వు ఇల్లు లాక్ చేసి వచ్చేసరికి నేను బైటుండక పోతే అడుగు

అక్షిత కానీ త్వరగా అని లోపలికి వెళ్ళిపోయింది. హ్యాండ్ బాగ్, కార్ తాళాలు, ఇంటి తాళాలు తీసుకుని హాల్లోకి వచ్చేసరికి టీవీ మోగుతూనే ఉంది. ఈ నా మొగుడున్నాడే పిల్లల కంటే అధ్వాన్నం, వచ్చాక చెపుతా నీ సంగతి అని నవ్వుతూ తిట్టుకుంటూ రిమోట్ తీసి ఆపడానికి టీవీ వంక తిరిగింది.

బైట నిలబడి అక్షిత కోసం ఎదురుచూస్తున్న లావణ్య, అక్షిత ఎంతకీ రాకపోవడంతో తనే లోపలికి వెళ్ళింది. ఏంటే నన్ను గోలగోల చేసి బైట ఎండలో నిలుచోబెట్టి ఇక్కడ నువ్వు టీవీ చూస్తున్నావా అని కసురుతూ చెప్పులు విప్పి తలుపు నెట్టి లోపలికి వెళ్ళింది.

అక్షిత కూర్చుని టీవీ చూస్తున్నట్టు లేదు ఆ వాలకం, అన్ని తలుపులు వేసి ఉండటం వల్ల చీకటికి కనిపించక హ్యాండ్ బాగ్ లోనుంచి కళ్ళజోడు తీసి పెట్టుకుని చూసింది. అక్షిత కళ్ళనుంచి ధార, కంగారుగా దెగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని గడ్డం పట్టుకుని కదిలించింది. అయినా అక్షిత మొహం తిప్పకపోవడంతో వెనక్కి తిరిగి టీవీ చూసి ఒక్క నిమిషం ఏమి అర్ధంకాక లేచి నిలబడి టీవీలో కనిపిస్తున్న చిరంజీవి మొహం గుర్తుపట్టి అక్షిత భుజం మీద చెయ్యి వేసి అడుగు వెనక్కి వెయ్యబోయి సోఫా తగలడంతో పడిపోయింది.

టీవిలో వాడి మీద వస్తున్న వార్త, ఇన్నేళ్ల తరువాత వాడిని అలా చూడటం ఇటు అక్షితకి అటు లావణ్యకి ఇద్దరికీ కళ్ళు బైర్లు కమ్మినట్టు అయ్యింది. తెరుకునే సరికి కొంత సమయం పట్టింది. లావణ్య వెంటనే తన కొడుక్కి ఫోన్ చేసి ఉన్నపళంగా ఇంటికి రమ్మంది.

చిరంజీవి, వేణు లిద్దరు ఇంటికి వచ్చారు. అప్పటికప్పుడు కారు చెన్నై బైలుదేరింది, చిరంజీవికి తమ అమ్మ ఎందుకు ఏడుస్తుందో కూడా తెలీదు కానీ జరుగుతుంది వాళ్ల నాన్నలకి ఫోన్ చేసి చెప్పారు. వేణు మాత్రం తన అమ్మ ఇంతవరకు ఏడవటం చూడలేదు, ఎప్పుడు హైపర్ గా ఉండే తన అమ్మ చిన్నపిల్లలా బిక్కు బిక్కుమంటూ ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు.. ఇద్దరు మొగుళ్ళు పెళ్ళాలకి ఫోన్ చేసినా ఎవ్వరు ఎత్తలేదు మధ్యలో కొడుకులు పలకరించినా పలకలేదు, ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. అటు లావణ్య ఇటు అక్షిత ఇద్దరు గతంలోకి వెళ్లిపోయారు. కారు పరుగులు తీస్తుంది.

ఇటు జైల్లో కూర్చున్న చిరంజీవి పరిస్థితి కూడా అలానే ఉంది ఇంతలో కానీష్టేబుల్ వచ్చి నిన్ను చూడటానికి ఎవరో వచ్చారని చెపితే తల ఎత్తి ఎవరు అని మాత్రమే అనగలిగాడు. అవతల వాడి గొంతు నుంచి శృతి అని వినిపించగానే చిరంజీవి కళ్ళలో నీరు ఒక్కసారిగా చేరిపోయింది. కళ్ళు తిరిగిపడిపోయాడు. గతం గిర్రున తిరిగింది.


Like Reply
#5
•5•


ఇంటి ముందు చీకటిలో తన ఐదేళ్ల కొడుకుని ఒక సంక నెత్తుకుని ఇంకో చేతిలో అన్నం గిన్నెతో కొడుకుని నవ్విస్తూ వీధి దీపాల కిందకి వెళుతూ అటు ఇటు పరిగెడుతూ వాడికి పట్టలేనంత సంతోషాన్ని వాడి మొహం మీదకి నవ్వుని ఇచ్చి అన్నం తినపెడుతుంది ఆ బిడ్డకి. ఎవరో కాదు మా అమ్మ మధుమతి.

చిన్నా : అమ్మా నా చిన్ని బంగారం అను

మధుమతి : నా చిట్టి బంగారం నాన్నా నువ్వు.. ఐ లవ్ యు

చిన్నా : హి హి లవ్ యు

దానికి అమ్మ కూడా నవ్వుతుంది...
ఆ గొంతు, తన నవ్వు వినపడుతుంటే ఏదో తెలియని సంతోషం తృప్తి.. ఇంతలో కల మాయం అవుతుంది, ఇక్కడితో ఆగిపోతుంది అది నాకు నచ్చలేదు, కలలో కనిపిస్తున్న మా అమ్మ అందాన్ని తన నవ్వుని చూస్తున్నాను ఒక్కసారిగా అమ్మ, పిల్లాడిని అయిన నన్ను ఎత్తుకుని నా వైపు తిరిగి నవ్వడం ఆపెయ్యడంతో మెలుకువ వచ్చింది.. చూస్తే లావణ్య లేపుతుంది.

చుట్టూ పదుల సంఖ్యలో పిల్లలు పడుకుని ఉన్నారు, ఇవ్వాళ ఇక్కడ నుంచి తప్పించుకుందామని నేను లావణ్య గత ఇరవై రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం. నాకు పదేళ్లు ఉన్నప్పుడు అనుకుంటా అమ్మ ఎలా చనిపోయిందో నాకు తెలీదు.. రోడ్డున పడ్డానని కూడా తెలియని వయసు నాది, నన్ను నమ్మించి కిడ్నప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసారు. చూస్తే పదుల సంఖ్యలో నా తోటి పిల్లలు, వీళ్ళతో ముష్టి ఎత్తిస్తున్నారు. నాకు భోజనం పెట్టి చేతికి ఒక బొచ్చ ఇచ్చి అడుక్కోమన్నారు.. ఏడుపొచ్చింది కానీ వీళ్ళ మాట వినకపోతే కళ్ళు లేదా కాళ్ళు తీసేస్తారు ప్రత్యక్షంగా ఒకడి కళ్ళు పీకేయడం మాకు చూపించి అందరిని భయపెట్టి పిల్లలందరిని కంట్రోల్లోకి తీసుకున్నారు.

అప్పుడే నాకు లావణ్య పరిచయం అయ్యింది, తనతో స్నేహం కుదిరింది. ఆ తరువాత కొన్నేళ్ళకి అక్షిత అనే అమ్మాయిని తీసుకొచ్చారు. ఎందుకో ఆ అమ్మాయి కళ్ళు చూడగానే పడిపోయాను. నాది చిన్న వయసే అది ప్రేమో దోమో నాకు తెలీదు కానీ ఎప్పుడూ అక్షిత వంక చూడాలనిపించేది, అది ఏమి చేసినా నాకు నచ్చేది.. ఈ విషయం లావణ్యకి తెలియనివ్వలేదు. అక్షితకి కూడా తెలీదు నాకు తనంటే భయం, చాలా రఫ్ గా ఉంటుంది పిల్ల.. అలా ఎనిమిదేళ్లు ఇక్కడే గడిచిపోయాయి.

లావణ్య పెద్దది అయ్యింది ఇక్కడే ఉంటె దాన్ని అమ్మేస్తారు నన్ను కూడా వదలరు పదిహేనేళ్ళు దాటిన పిల్లల్ని అమ్మాయిలైతే అమ్మేయడం అబ్బాయిలు అయితే కాళ్ళో కళ్ళో పీకేయడం ఇక్కడ వీళ్ళ రూల్ అందుకే గత కొన్ని రోజులుగా తప్పించుకోడానికి దారి వెతుకుతుంటే ఒక దారి కనిపించింది. ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాలు ఉన్నాయి.. రోజు పావుగంట ఆగుతుంది. పిల్లలందరికీ చోటు సరిపోక కొత్త వాళ్ళని లోపల దాచి మమ్మల్ని తడికల రూంలో ఉంచారు. గత పదిహేను రోజుల నుంచి ప్లాన్ చేస్తూనే రోజూ కొంచెం కొంచెం తడికని కోసి.. కోసిన దెగ్గర దారం కడుతూ ఎవ్వరికి అనుమానం రాకుండా అటు ఇటు బండలు పెట్టి బ్యానర్ కప్పి జాగ్రత్త పడుతున్నాను. గత మూడు రోజులుగా ఇక్కడ పడుకునే అవకాశం రాలేదు కానీ ఇవ్వాళ వచ్చింది.

లావణ్య : ఒరేయి, ఎం ఆలోచిస్తున్నావ్

పక్కకి చూస్తే అక్కడ కాపలా కాస్తున్న వాడికి కనిపించకుండా నా పక్కనే పడుకుని నన్ను గిల్లుతుంది లావణ్య. నిద్రలో అటు పక్క వాడు లావణ్య మీద కాలు వెయ్యగానే వాడిని విధిలించి ఒక్క తన్ను తన్నింది.. నవ్వాను. తల వంచి చూస్తే నా కాళ్ళకి అటువైపున ఇవేమి తెలియక అలిసిపోయి పడుకుని ఉంది అక్షిత. లేవకుండా పక్కన లావణ్యని చూసాను.

లావణ్య : ఎలా తప్పించుకుందాం, దొరికితే మాత్రం వీళ్ళు పెట్టె బాధ కంటే చచ్చిపోవడమే మేలు అనేలా చేస్తారు.. చచ్చే అవకాశం కూడా ఇవ్వరేమో.

చిన్నా : టైం ఎంతా

లావణ్య : ఎవరికీ తెలుసు

చిన్నా : పాసెంజర్ బండి వెళ్లిపోయిందా

లావణ్య : ఇంకా లేదు

చిన్నా : అయితే ఇంకా పదిన్నర కాలేదు, అప్పటి వరకు పడుకో.. సరిగ్గా పాసెంజర్ బండి కూత వినిపించినప్పటి నుంచి గంటన్నర మనుసులో లెక్కపెడుతూ ఉండు టైం కాగానే పారిపోదాం.

లావణ్య : కానీ ఎలా.. ఏడుస్తున్నట్టే అడిగింది

చిన్నా : చెప్పింది చెయ్యి

లావణ్య : సరే అని చిన్నగా ఎలా వచ్చిందో అలానే మిలిటరీ సోల్జర్ లా పాక్కుంటూ వెళ్లి అక్షిత పక్కన పడుకుంది.

నవ్వుకున్నాను, అస్సలు అక్షితకి లావణ్యకి పరిచయమే లేదు.. అక్షిత మా కంటే రెండేళ్లు చిన్నది. ఎలా తెలుసంటే తెలుసంతే.. వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అయ్యేలా చేసాను, అలా చెయ్యడానికి నేను పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కావు. ఆలోచిస్తూ అక్షితని చూస్తూ ఉన్నాను. పాసెంజర్ బండి కూత వినిపించింది. సమయం లెక్కించడం మొదలు పెట్టాను. సరిగ్గా గంట లెక్కపెట్టాక గూడ్స్ బండి కూత చాలా గట్టిగా వినిపించింది. లావణ్య ఉలిక్కిపడి లేచి కూర్చుంది అంతే కాపలా కాసేవాడు బూతులు తిట్టేసరికి మెలకుండా పడుకుని నన్ను చూసి క్షమించమని మొహం పెట్టింది.

సరిగ్గా పది నిమిషాలు మనుసులో లెక్కపెట్టి ధైర్యం తెచ్చుకుని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదని నాకు నేనే చెప్పుకుని రెండు చేతులతో వేళ్ళు నోట్లో పెట్టుకుని గట్టిగా ఈలేసాను. అంతే కాపలా వాడు బూతులు తిడుతూ నా వైపు వస్తుంటే పడుకున్నట్టు నటించాను. వాడు నా దాకా వచ్చి అందరిని తంతూ గొడవ చేస్తుంటే అదే సమయానికి ఓ కుక్క ఆపకుండా అరుస్తుంది. నేను ఈల వేసింది అందుకే.. ఆ కుక్కని మచ్చిక చేసుకోవడానికే ఇన్ని రోజుల సమయం పట్టింది. ఈల వెయ్యగానే అరవడం దాని పని ఎవరైనా కొట్టడానికి ముందుకు వస్తే వాళ్ళని చూసి అరుస్తూ పక్కకి పక్కకి జరిగేలా ట్రైనింగ్ ఇచ్చాను.. అరుస్తూ అక్కడ నుంచి వెళ్లకుండా ఉంటేనే కదా మరి కొట్టడానికి ఇంకా ముందుకు వెళ్ళేది.

ఆ కాపలా కాసేవాడు కుక్క అరుపులు తట్టుకోలేక నీ అమ్మ అని తిడుతూ బైటికి వెళ్ళాడు అంతే వెంటనే లేచి నిలబడి బ్యానర్ అడ్డు పెట్టిన బండ అన్ని తీసేసి లావణ్యని పిలిచాను, అది వెంటనే లేచివచ్చి బొక్కలో దూరి బైటున్న బండని పడేసి రమ్మని చెయ్యి చూపించింది. వెంటనే అక్షిత కాలు పట్టుకుని ఈడ్చి అది నిద్ర లేవక ముందే బియ్యం బస్తాని కుక్కినట్టు బొక్కలోకి కుక్కాను. లావణ్యకి బైట అక్షితని చూడగానే నా మీద కోపం వచ్చినా చేసేది లేక వెంటనే అక్షిత చెయ్యి పట్టుకుని గట్టిగా లాగి వెంటనే అది అరవకుండా దాని నోరు మూసింది. నేను బైటికి వచ్చేసి ఒక చేత్తో లావణ్య చెయ్యి పట్టుకుని అక్షిత వంక చూసాను.. దానికి ఎం జరుగుతుందో ఈ పాటికి అర్ధమయ్యిందేమో నా చెయ్యి పట్టుకుని వేగంగా పరిగెడుతుంటే నేనే అక్షిత చెయ్యి పట్టుకుని ఆపకుండా రెండు కిలోమీటర్లు పరిగెత్తించాను.

అప్పటికే గూడ్స్ బండి కదిలింది వేగం పెంచి పరిగెడుతూ ముందు లావణ్యని ఎక్కించి అక్షిత ఎక్కలేకపోతుంటే దాని పిర్ర మీద చెయ్యి వేసి ఎత్తి విసిరేసాను.. దాని వెనకే నేను ఎక్కి ముందు కూలబడి ఆ తరువాత నెమ్మదించి గణేశా థాంక్స్. నాకు తెలుసు నువ్వెప్పుడూ నాతోనే ఉంటావని కానీ అప్పుడప్పుడు నీమీద అనుమానం వేస్తుంది.. సరే ఈ సారికి హెల్ప్ చేసావ్ థాంక్స్.. అని లావణ్యని అక్షితనీ చూసాను. ఇద్దరూ నా వంకే చూసి చిన్నగా నవ్వుకున్నారు.

లావణ్య థాంక్స్ గణేశా అంటూ నన్ను వాటేసుకుంది, నేను అక్షితని చూసాను తనూ మా దెగ్గరికి వచ్చి మా పక్కన చేరింది.. లావణ్య అక్షితని గట్టిగా వాటేసుకుంది. నేను అక్షిత చెయ్యి పట్టుకున్నాను. నన్ను చూసి నవ్వి చిన్నగా నా చెయ్యి వదిలి థాంక్స్ అంది అంతే.. బహుశా ఇంకా తనలోని ఆ భయం పోలేదేమో

లావణ్య : ఈ ట్రైన్ ఎక్కడికి వెళుతుంది

చిన్నా : తెలీదు, ఆ నరకం నుంచి బయట పడ్డాం అదే చాలు

లావణ్య : తరవాత ఏం చేద్దాం

చిన్నా : కలిసి ఉందాం, మనకి మనమే తోడు.. అడుక్కోకపోతే అదే చాలు అని అక్షితని చూసాను

అక్షిత నా చెయ్యి లావణ్య చెయ్యి పట్టుకుని మా దెగ్గరికి వచ్చి మమ్మల్ని గట్టిగా వాటేసుకుని అలా ఉండిపోయింది.. తన గుండె వేగం నెమ్మదిస్తుంటే హమ్మయ్యా ఇప్పటికైనా ఆ నరకం నుంచి బైట పడిందని అక్షిత నమ్మింది అనిపించింది. తన మెడకి దెగ్గరగా ఉన్నాను బుగ్గ మీద ముద్దు పెడదామా అని అనుకుంటుండగానే  అక్షిత నా నుంచి విడిపడింది. ఏం లేదు ఏం లేదు అనుకుంటూ వెళ్లి మూలకి కూర్చున్నాను.

ఇందాక అక్షిత పట్టుకున్న నా చెయ్యిని అక్షిత పిర్రని పట్టుకుని ఎత్తిన ఇంకో చెయ్యిని చూసుకోగానే సిగ్గేసింది.. ఎలాగో అనిపించినా నా రెండు బుగ్గల మీదా పెట్టుకుని కళ్ళు మూసుకున్నాను. అర్ధరాత్రి చల్ల గాలి వల్ల ఒళ్ళు ఒణుకుతుంటే నాకు మాత్రం ఆ చేతులు చాలా వెచ్చగా అనిపించాయి. కింద ప్యాంటులో ఏదో అలజడి అవ్వడం ఇదే మొదలు. అంతా తేరుకుని చూస్తే అక్షిత లావణ్య పరిగెత్తడం వల్ల అనుకుంటా అలిసిపోయి సొయ లేకుండా పడుకున్నారు. నేనూ కళ్ళు మూసుకున్నాను.
Like Reply
#6
•6•

చెయ్యి తల కింద పెట్టి పడుకున్నానేమో చెమట వల్ల తడికి మెలుకువ వచ్చి లేచి చూసాను, టైం ఎంతో తెలీదు కానీ నడినెత్తి మీద సూరీడు ఎర్రగా భగభగమని మండుతున్నాడు. లేచి నిలబడ్డాను ట్రైన్ ఆగి ఉంది, చుట్టూ చెట్లు.. వెంటనే లావణ్యని, అక్షితని లేపాను ఇద్దరు లేచి చుట్టూ చూసుకున్నారు, నేను ట్రైన్ దిగి ముందుకు నడిచాను.


లావణ్య : రేయి ఎక్కడికి

చిన్నా : ఆకలేస్తుంది, ఎంతసేపని ట్రైన్లో ఉంటాం.. అస్సలు ఎక్కడున్నాం ఎటు వెళుతున్నామో మనకైనా తెలియాలిగా అని వెనక్కి చూసాను. అక్షిత ఏం మాట్లాడకుండా ట్రైన్ దిగి చెట్టు వెనక్కి వెళ్ళింది అది చూసి లావణ్య కూడా దిగింది. రెండు నిమిషాల తరువాత ఇద్దరు వచ్చి నా ముందు నిలబడ్డారు. నేను ముందుకు నడుస్తుంటే ఇద్దరు నా వెనక నడుస్తూ వస్తున్నారు.

అక్షిత మా ఇద్దరినీ దాటుకుంటూ వెళుతుంటే చూసాను చెట్టుకున్న చిన్న కొమ్మ ఒకటి విరిచి సీరియస్ గా నడుస్తుంది. ఎప్పుడు సీరియస్ గా ఉంటది, ఏం ఆలోచిస్తుందో ఏంటో అనుకుని నడుస్తున్నాను.. చిన్నగా మాకు తెలియకుండానే దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాము. కొంత దూరం వెళ్ళాక చిన్న గుడిసె కనిపించింది, లోపలి వెళ్లాను అంతా కాళీ.. లోపల ఏమి లేవు బైటికి వచ్చి చుట్టూ చూసాను ఏ ఆనవాళ్లు కనిపించలేదు, భయమేసింది.. అడవిలో అన్నలా లేదా టెర్రరిస్ట్ లా, వాళ్ళకి దొరికితే పరిస్థితి ఏంటి.. నాకు భాష కూడా రాదు. ఇద్దరినీ ఇక్కడే ఉండమని చెప్పి కొంచెం ముందుకు వెళ్లాను రెండు ఎలుకలు పరిగెత్తడం కనిపించాయి.. అవి అడవి ఎలుకలు కావు కానీ ఇక్కడివేం చేస్తున్నాయని వెంబడించాను ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే అన్ని శవాలు, ఎలుకలతో పాటు గద్దలు కూడా ఉన్నాయి.. చూస్తుంటే కాల్పులు నిన్న మొన్నే జరిగినట్టున్నాయి.. అంతా చూస్తున్నాను ఇంతలో నేను వెంబడించిన ఎలుకలు నేరుగా ఒక సంచిలో దూరాయి, వెళ్లి సంచి విదిలించాను నోట్ల కట్టలు పడ్డాయి, కానీ అన్ని ఎలుకలు కొరికేసినవి ఒక్క కట్ట మాత్రం బాగుంది తీసుకుని జోబులో పెట్టుకున్నాను, నాకు తెలుసు నా గణేషుడు ఎప్పుడు నాకు తోడుగానే ఉంటాడని

థాంక్స్ గణేశా అనుకుంటూ వెనక్కి పరిగెత్తాను వెంటనే లావణ్యని అక్షితనీ పిలిచి అక్కడనుంచి బైటికి తీసుకోచ్చి వీలైనంత త్వరగా ఆ ప్రాంతం నుంచి బైట పడ్డాను. ఆడవెమ్మట నడుస్తూనే ఉన్నాము, ముగ్గురికి ఓపిక అయిపోయింది, ఎండలో అక్కడే పడిపోయి చెట్టు కింద పడుకున్నాము మళ్ళి లేచింది లావణ్య కేక వినే.. అక్షిత నేను ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాము. పచ్చ డ్రెస్ లో ఉన్నాడు మొహానికి కళ్ళజోడు ఉంగరాల జుట్టు పెద్ద మీసం ఉంది కానీ గడ్డం లేదు.. చేతిలో గన్ను.. నడుముకి కుడివైపున చిన్న లెదర్ బ్యాగు.

ఎవరు మీరు ఇక్కడేం చేస్తున్నారు

చిన్నా : మీరు తెలుగు వాళ్ళా

అవును

చిన్నా : మేము ఎక్కడున్నామో చెప్తావా

ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఇప్పుడు మీరు ఉన్నది తెలంగాణ ప్రాంతము, మీరు ఇక్కడ ఉండకూడదు చాలా ప్రమాదం.

తెలుగు వినేసరికి ప్రాణం చేతిలోకి వచ్చింది.. అవును అక్కడ కాల్పులు జరిగాయి నేను చూసాను.. సమాధానం చెప్పాను

మా వాళ్ళు ఓరుగల్లు ips ఆఫీసర్ మీద దాడి చేసి చంపేశారు దానికి బదులుగా జరిగినదే మాపై ఈ దాడి

చిన్నా : మేమిక్కడి నుంచి వెళ్ళిపోవాలి

మీ కధేమిటి, ఎక్కడ నుంచి వస్తున్నారు.. ఆకలితో ఉన్నట్టున్నారు రండి ముందు భోజనం చేద్దురు

చిన్నా : వద్దు మా దారి మాది, మీ దారి మీది కలవనసరం లేదు

నవ్వి.. సరే మీరు వచ్చింది తప్పు దారి తూర్పు వైపుకి వెళ్ళండి మెయిన్ రోడ్డు వస్తుంది అక్కడనుంచి పదిహేను కిలీమీటర్లకి రైల్వే స్టేషన్ వస్తుంది.. వెళ్ళండి అని తరిమాడు.. ముగ్గురం అక్కడ నుంచి ప్రాణం అరచేతిలో పట్టుకుని పరిగెత్తాం.

మెయిన్ రోడ్డు చేరుకునే వరికి చీకటి పడింది, ముగ్గురికి ఆకలి దాహంతో అల్లాడిపోతున్నాం. రోడ్డు ఎక్కకముందే తాటి చెట్టు ఒకటి కనిపించింది దానికి కుండ కట్టి ఉంది.. చిన్న రాయి తీసుకుని కొట్టాను.. అందులో నుంచి కల్లు కారుతుంటే ముగ్గురం పోటీ పడి మరీ తాగేసి ఒకరినొకరు చూసుకుని మా ఆత్రం గుర్తు చేసుకుని నవ్వుకున్నాం. మత్తుకి ముగ్గురం రోడ్డు పక్కనే పడుకోగా మళ్ళీ లేచేసరికి తెల్లారింది. కిందా మీదా పడుతూ సిటీ చేరి కడుపునిండా భోజనం చేసి రైల్వే స్టేషన్ కి వెళ్లి హైదురాబాదు రైలు ఎక్కాం. ట్రైన్ ఎక్కి బాత్రూం దెగ్గర కింద కూర్చున్నాం. అక్షితకి భోజనం డబ్బులు గుర్తొచ్చి నా దెగ్గర డబ్బు ఎక్కడిది అని అడగబోయి మౌనంగా కూర్చుంది. నాకు అర్ధమైనా ఏమి మాట్లాడలేదు.. ముగ్గురం పట్నం చేరాము.

హైదరాబాదులో దిగాము కానీ ఎటు వెళ్ళాలో ఎం చెయ్యాలో తెలీదు, అక్షిత లావణ్య ఇద్దరు నా వంక చూసారు. స్టేషన్ నుంచి బైటికి వచ్చాను. నేరుగా బట్టల షాపుకి వెళ్లాను, ఇద్దరికీ చెరో జత బట్టలు తీసుకున్నాను బైటంతా హడావిడి.. ఇద్దరినీ స్టేషన్ లోపల వదిలి కొన్ని డబ్బులు ఇచ్చి నేను మళ్ళి వచ్చేంత వరకు తిరుగుతూ తింటూ ఉండమని చెప్పాను. ఇంత హడావిడిలో వీళ్ళని వదలచ్చు అనిపించింది. పైగా మంచి బట్టల్లో ఉన్నారు ఎవ్వరూ కదిలించరన్న ధైర్యం వచ్చింది.

స్టేషన్ నుంచి బైటికి వచ్చాను లోకల్ బస్సు ఒకటి కనిపించింది ఎక్కి కూర్చున్నాను, కండక్టర్ అడిగితే బస్సు బోర్డు మీదున్న చివరి పేరు చూసి చెప్పాను. బస్సు సిటీలో తిరుగుతుంది, ఈ చివర నుంచి ఆ చివర వరకు బస్సు ఒక రౌండు వెయ్యగానే బస్సు దిగి మళ్ళి స్టేషన్ కి వెళ్లే ఇంకో బస్సు ఎక్కాను సిటీ అంతా హడావిడిగా ఉంది ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనాలు.. అందరిని అన్నిటిని గమనిస్తున్నాను, నా పక్కన కూర్చుని మాట్లాడుకునే కుర్రాళ్ళ నుంచి ముందు వైపు కూర్చుని కాలేజీకి వెళ్లే అమ్మాయిల వరకు అందరి మాటలు వింటున్నాను.

సాయంత్రం వరకు అలా తిరుగుతూ గమనిస్తూ నా అడుక్కుతినే తెలివితేటలు ఏమైనా పనికొస్తాయా అని తిరిగి స్టేషన్ కి వెళ్లి అక్కడ కూర్చుని తల పట్టుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే ఒక దారి దొరికింది.. నా భుజం మీద చెయ్యి పడేసరికి లేచి చూసాను ఎదురుగా లావణ్య.. తన చేతిలో చిన్న గణేశుడి బొమ్మ.. నా చేతికిచ్చింది తీసుకున్నాను.. గట్టిగా పట్టుకుని నా కళ్ళకి ఆనించుకుని లేచి నిలబడ్డాను. బైటికి వెళ్లి తిని లోపలి వచ్చి పడుకుందామంటే పుల్లీసులు కొడతారేమో అని భయం వేసింది.. తెల్లారే వరకు అటు ఇటు తిరిగాము. తెల్లవారగానే లేచాను, నా చేతిలో ఉన్న గణేష్ ని చేతిలోనే గట్టిగా పట్టుకుని నాతోనే ఉండి నాకు సాయం చెయ్యమని ఆయనకి చెప్పి ఇద్దరితో బైటికి నడిచాను.

రెండు కాలేజీ బ్యాగులు, రెండు జతల బట్టలు ఇంకొన్ని వస్తువులు తీసుకుని రెండు బ్యాగుల్లో సర్ది ఇద్దరికీ ఇచ్చి తీసుకెళ్లి గర్ల్స్ హాస్టల్లో చేర్చాను.

లావణ్య : నాకు భయంగా ఉంది

చిన్నా : తోడుగా అది ఉందిగా.. రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి కాలేజీకి వెళ్లినట్టు బైటికి వచ్చెయ్యండి. ఏం చెయ్యాలో తరవాత ఆలోచిద్దాం.. నేను వెళ్తాను.

అక్షిత : మరి నువ్వు ?

చిన్నా : ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావ్

అక్షిత లోపలికి వెళ్ళిపోయింది.

లావణ్య : మాములుగా మాట్లాడొచ్చు కదా

చిన్నా : వెళ్ళు

ఇద్దరు లోపలికి వెళ్లిపోయారు, బస్ స్టాండు వరకు నడిచాను ఇక నా వల్ల కాలేదు, వెళ్లి బస్టాండ్ లో ఉన్న ఐనప కుర్చీల వెనుక పడుకున్నాను. ఆకలేస్తుంది కానీ అంతకుమించి నిద్ర వస్తుంది ఒంట్లో ఓపిక లేదు.. కళ్ళు మూతలు పడుతున్నాయి.

(*  *  *  *  *  *  *)
(*  *  *  *  *)
(*  *  *)
(*)

చిన్నా : అమ్మా.. నువ్వు చేసింది నాకు నచ్చలేదు

మధు : ఏమైంది చిన్నోడా.. నువ్వు నా మీద అలిగావా.. నిజమేనా నేనేమైనా కలలో ఉన్నానా

చిన్నా : ఆ అడుక్కునే అబ్బాయికి నాకు ఇద్దరికీ ఒకే భోజనం పెట్టావ్

మధు : కోపంగా చూసింది.. ముందు లెంపలు వేసుకో..

చిన్నా : అమ్మా..

మధు : వేసుకో..

రెండు చెంపలు కొట్టుకున్నాను

మధు : తప్పయింది గణేశా అని ఒప్పుకో

చిన్నా : ఒప్పుకున్నాను

మధు : అన్నం పరబ్రహ్మస్వరూపం నాన్న.. అది అందరిదీ.. నీకసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది.. ఎవరు చెప్పారు

చిన్నా : మా ఇద్దరికీ ఒకే భోజనం పెట్టావని కాదు, నన్ను ఎత్తుకున్నట్టే వాడిని ఎత్తుకున్నావ్.. ముద్దు పెట్టావ్

మధు : ఒక్కసారి వాడిని చూడు.. చిరిగిపోయిన బట్టలు.. నల్లటి మొహం.. మొహం అంతా దుమ్ము.. దగ్గుతున్నాడు.. ఒంట్లో బాలేదు.. ఇంతలేడు వాడి భుజాన వాడికంటే ఎత్తుగా ఉన్న చిత్తు కాగితాల సంచి.. పాపం కదూ.. అలా ఒక్కరోజు కూడా మనం ఉండలేం.. పాపం వాడికి ఎంత కష్టం.. బాబు మీ అమ్మా నాన్నా ఎక్కడా

నాకెవ్వరు లేరండీ..

మధు : చూసావా.. అమ్మా నాన్నా కూడా లేరు.. నువ్వు చెప్పు నేను లేకుండా నువ్వు ఒక్క రోజైనా ఉండగలవా

చిన్నా : ఆమ్మో.. నా వల్ల కాదు.. పది నిముషాలు కూడా ఉండలేను.

మధు : కదా.. ఆ అబ్బాయి పాపం కదా.. మనం పెంచుకుందామా

చిన్నా : సరే.. కానీ..

మధు : కానీ..

చిన్నా : మనదే చిన్న ఇల్లు

మధు : మన మనసులు మాత్రం చాలా పెద్దవి కదా చిన్నయ్యా

చిన్నా : అవుననుకో.. సరే.. ఒప్పుకుంటున్నా.. కానీ నాకంటే ఎక్కువ ప్రేమ వాడి మీద చూపిస్తే ఒప్పుకోను

మధు : పిచ్చి కన్నయ్య.. నా చిన్నా కంటే ఎవరు ఎక్కువ చెప్పు నాకు.. మనకి ఉన్నదాంట్లో కొంత సాయం.. ఈ లోకంలో ఎలా అయినా బతకోచ్చు.. ప్రతీ ఆదివారం మటన్ బదులు చికెన్ తెచ్చుకుందాం అంతే..  నీకున్న దాంట్లో ఒక ముద్ద లేనోడికి పంచితే చాలు.. నాకు నీ గణేషే చెప్పింది.

చిన్నా : గణేష్ చెప్పాడా

మధు : ఒట్టు

చిన్నా : ఐతే నేను కూడా ఇవ్వాల్టి నుంచి నీలానే ఉంటాను.. నీ లాగే అందరికీ హెల్ప్ చేస్తా

మధు : అందరికీ కాదు.. అవసరం ఉన్న వాళ్లకి మాత్రమే.. నీ ముందుకు వచ్చి చెయ్యి చాచిన వాళ్ళని లేదని పోనివ్వద్దు అందులోనూ అది నీ వల్ల అవుతుంది అంటే అస్సలు పోనివ్వద్దు.. నీకు తోచిన సాయం చెయ్యి అది ఎప్పటికైనా నిన్ను కాపాడుతుంది.

చిన్నా : నా చిన్ని బంగారం అను

మధు : నా చిన్ని పొట్టి బుజ్జి బంగారం వీడు

చిన్నా : వాడిని లోపలికి పిలువు.. పాపం చూస్తున్నాడు

మధు : నాన్న.. నీ పేరేంటి.. ఇలా రా

నా పేరు గుణ అండి

మధు : నిన్ను నేను చూసుకుంటాను.. నాతో ఉంటావా.. నీకు బట్టలు బొమ్మలు అన్ని కొనిస్తా.. ఇదిగో అన్నయ్య కూడా ఉన్నాడు

కానీ..

అమ్మ ముందు అన్నం తిందువు లోపలికి రా.. అనగానే ఆకలికి అన్ని మర్చిపోయి లోపలికి పరిగెత్తాడు.. అమ్మా నేను అది చూసి నవ్వుకున్నాం.

మెలుకువ వచ్చింది చూస్తే బస్సు డ్రైవర్ పెద్దగా హారన్ కొడుతున్నాడు లేచి బెంచి మీద కూర్చున్నాను. గణేషుడి బొమ్మ నా చేతిలోనే ఉంది.
Like Reply
#7
•7•

లేచి పక్కనే ఉన్న వేప పుల్ల ఒకటి విరిచి పళ్ళు తోమి పక్కనే ఉన్న చలివేంద్రంలో నీళ్లు తాగాను. కొంతసేపటికి అక్షిత లావణ్య లిద్దరూ వచ్చారు.. ముగ్గురం భోజనం చేసాము.

అక్షిత : ఇప్పుడేంటి.. అక్కడ నుంచి బయటపడ్డాం.. హైదరాబాద్ వచ్చేసాం.. ఒక నెల వరకు తిండికి నిద్రకి లోటు లేదు.. తరవాత ఏంటి

చిన్నా : నన్నడిగితే.. ఇక్కడ ఎవరి జీవితాలు వాళ్ళవి.. నేనేమి మీకు సాయం చెయ్యలేదు.. మీరేమి నా మీద ఆధారపడనవసరం కూడా లేదు.. చేతిలో ముప్పై రోజులు ఉన్నాయి.. మీ చావేదో మీరు చావండి.. ముందు నేను అర్జెంటుగా పని వెతుక్కోవాలి.. ఇక పోండి

లావణ్య : ఎక్కడికి పోవాలి

చిన్నా : అడుక్కుంటారా మళ్ళీ.. లేదు కదా.. పొయ్యి పని వెతుక్కోండి.. కిరాణా షాపుల్లోనో పెద్ద పెద్ద బిల్డింగుల్లోనో చాలా మంది ఆడవాళ్లు పని చెయ్యడం చూసాను.. ముందు పోండి.. ఏదో ఒక దారి దొరుకుద్ది.. మళ్ళీ రేపు పొద్దున ఇక్కడే కలుద్దాం

అక్షిత తల ఊపి లావణ్య చెయ్యి పట్టుకుని లాక్కేళ్ళింది.. ఆ మాత్రం పొగరు లేకపోతే బతకడం కష్టమేలే ఆనుకుని నవ్వుకున్నాను.. అక్షిత వెళుతుంటే వద్దనుకుంటూనే చూసాను.. బుర్ర వద్దంటుంది కానీ నా కళ్ళు మనసు నా మాట వినడం లేదు.. కొత్త బట్టల్లో అది నడుస్తుంటే నడుము కింద పిర్రలు అటు ఇటు ఊగుతుంటే నా కళ్ళు కూడా లయబద్ధంగా ఊగాయి.. హహ

రోజంతా వెతికితే నా మీద దయతలిచి మెకానిక్ పని నేర్పుతాను అన్నాడు ఒక అన్న.. మా గణేష్ కి దణ్ణం పెట్టుకుని పనిలోకి చేరాను.. పంచర్లు వెయ్యడం దెగ్గర నుంచి మొదలయ్యింది నా జీవితం.. అక్షిత తనకి లావణ్యకి ఇద్దరికీ ఉద్యోగం వెతికింది.. ఊరి చివర స్లంలో చిన్న రేకుల ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుని అందులో దూరాము.

మూడు నెలల తరువాత అక్షిత ఉద్యోగం మానేసింది, అదేమంటే ఏమి చెప్పలేదు.. లావణ్య మాత్రం ఆపలేదు.. అక్షిత తనకి పరిచయం అయిన స్నేహితులతో కలిసి ఓపెన్ గా పది పరీక్షలు రాసింది.. అందులో పాస్ అయ్యి ఆ సర్టిఫికెట్ తో వెంటనే ఇంకో ఉద్యోగం వెతుక్కుంది.. అక్షితకి ఉద్యోగం రాగానే లావణ్యని మానిపించేసి తనని పది చదివిస్తుంది.. అక్షిత ఇప్పుడు నాతో పాటు సమానంగా సంపాదిస్తుంది అది నాకు నచ్చలేదు.

పొగరులో అది స్నానం చేస్తుంటే చూడటం మానేశాను.. ఎవడికి నష్టం నాకే నష్టం.. మళ్ళీ అన్ని మూసుకుని బొక్కలోనుంచి అది స్నానం చేస్తుంటే చూసేవాడిని.. ఒక రోజు లావణ్యకి దొరికిపోయా.. అప్పటి నుంచి వాళ్ళు స్నానం చేస్తుంటే నన్ను బైటికి గెంటేసి తలుపు వేసుకునేవారు. అంతా అయిపోయాక గాని నన్ను లోపలికి రానిచ్చేవారు కాదు. ఒకరోజు ఏడుపొచ్చేసింది

అక్షిత : ఒసేయి లవ్వు.. ఏడుస్తున్నాడే వీడు.. అని నవ్వింది

లావణ్య : ఏంట్రా నీ బాధా

చిన్నా : ఏం లేదు

అక్షిత : కామాంధుడా.. నీపేరు చిరంజీవి అని కాకుండా కామేష్ అని పెట్టాల్సింది.. సరిగ్గా సరిపోయేది

చిన్నా : నాకు నువ్వంటే ఇష్టం..

అక్షిత : సాయంత్రానికి తినడానికి బియ్యం లేవు.. నిన్న తెమ్మంటే ఇవ్వాళ తెస్తా అన్నావ్.. గుర్తుందా తమరికి

చిన్నా : గుర్తుంది

అక్షిత : బైల్దేరు మరి..

చిన్నా : వచ్చాక చెప్తా నీ పని

అక్షిత : రోజూ ఇదే అంటావ్.. ఇంటికొచ్చాక అలిసిపోయి పడిపోతాడు.. రోజూ రాత్రి భోజనానికి నిన్ను లేపాలంటే అదో పెద్ద పని అయిపోయింది.. అంత కష్టపడుతున్నారా తమరు.. డబ్బులు మాత్రం రావే..

చిన్నా : పోవే.. నాతో సమానంగా సంపాదిస్తున్నావని నీకు బాగా బలుపెక్కింది.. అటు ఇటు వాయిస్తే కానీ మాట వినవు

అక్షిత : దా.. దా.. వాయించు అని ఒంగింది.. నవ్వుతూ

లావణ్య : ఏయి ఆపండి ఇద్దరూ.. రేయి చిన్నా నువ్వు పో.. ఒసేయి నువ్వు కూడా పో

అక్షిత : బై.. అని లావణ్యని చూసి నా వైపు తిరిగి బై రా కామేష్ అని నాలిక తిప్పుతుంటే నాకు ఆ నాలికే కనిపించింది.. అది అక్షిత గమనించింది.. సిగ్గు లేదురా నీకు

నవ్వాను.. నవ్వుతూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది.. జేబులో ఉన్న గణేష్ ని తీసి లావణ్యకి బై చెప్పి నడుస్తున్నాను.. రోజూ ఒకేఒక్క కోరిక ఈ గణేష్ ని నేను కోరేది.. అక్షిత కావాలని అడుగుతాను అంతే.. మా గణేష్ కి దణ్ణం పెట్టుకుని పనిలోకి దిగడం, మధ్యానానికి లావణ్య వండిన క్యారెజ్ తో భోజనం రాత్రి ఎనిమిదింటి వరకు కష్టపడటం ఇంటికెళ్ళగానే చెమటకి చిరాకు వేసి స్నానం చేస్తాను ఆ తరువాత నిద్ర వచ్చేస్తుంది.. ఈ మెకానిక్ పని అంటేనే ఒళ్ళు హునం అయిపోతుంది, ఒళ్ళు నెప్పులు తట్టుకోలేరు.. అందుకే చాలా మంది సాయంత్రానికి చుక్క పడకపోతే నిద్ర పట్టక తాగుతుంటారు. నేను తాగను.. గొడ్డు నిద్రపోయినట్టు పడుకుంటాను.. అయినా కానీ పాపం నన్ను లేపలేపి అన్నం పెట్టి నన్ను మళ్ళీ పడుకోబెడతారు.

ఒకరోజు షెడ్ లో కొత్త పిల్లాడు చేరాడు, నా పక్కన ఎవ్వరు లేక ఇంజన్ విప్పుతూ సుత్తి వాడి చేతికి ఇచ్చి కొట్టమన్నాను అంతే వాడి పనితనం చూపించాడు నా వేలు చిత్తు చిత్తు అయ్యింది.. ఇంటికి వెళితే లావణ్య ఒకటే ఏడుపు.. అప్పుడే మొదటిసారి అక్షిత కంట్లో నీళ్లు చూసాను.. ఆ రోజు అదే దెగ్గరుండి తినిపించింది.. పొద్దున షెడ్ కి వెళ్ళాక ఆ కొత్త పిల్లోడికి థాంక్స్ చెప్పాను.. అంత పిచ్చి నాకు అదంటే.. ఎందుకో తెలీదు

కొన్ని నెలలకి నాకు అలవాటు అయిపోయింది, నేను దెబ్బలతో ఇంటికి రావడం వాళ్ళు ఏడవటం.. అప్పుడే నాకు దుబాయి వెళ్లే అవకాశం వచ్చింది.. కాకపోతే మూడేళ్లు అక్కడే కాంట్రాక్టు.. ముందు ఇరుక్కుపోతానేమో ఇక్కడే ఉంటే అక్షిత నా కళ్ళ ముందే ఉంటుంది కదా అది చాల్లే అనుకున్నాను.. కానీ అక్షిత ఇంకా చదవాలని ఆశపడుతుంది.. అది చదివితే దానితోపాటు లావణ్య కూడా చదువుతుంది.. ఇష్టంలేకపోయినా వెళతానని ఒప్పుకున్నాను.

•\\•
•\\•
•\\•

అక్షిత : ఎవరినిడిగి ఈ నిర్ణయం తీసుకున్నావ్

చిన్నా : ఎవరినడగాలి

అక్షిత : మమ్మల్ని అడగాలి

లావణ్య : నాకు కూడా నువ్వు చేసింది నచ్చలేదు చిన్నా.. మమ్మల్ని అడక్కుండా సంతకం ఎందుకు పెట్టావ్

చిన్నా : మూడేళ్ళే కదే

అక్షిత : పో దెంగేయి.. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.. అని కోపంగా బైటికి వెళ్ళిపోయింది.

నీ కోసమే కదే అనుకున్నాను మనుసులో.. లావణ్యకి నచ్చజెప్పాను.. దుబాయి ప్రయాణం ఇంకొన్ని రోజుల్లో పాస్పోర్ట్ పని అయిపోగానే మొదలవుతుంది.
Like Reply
#8
•8•

దుబాయి వెళ్లే రోజున అక్షిత మరియు లావణ్య ఇద్దరు కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకుంటే చూడలేక ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాను. మమ్మల్ని గంపుగా ఫ్లైట్ ఎక్కించారు నా సీట్లో కూర్చున్నాను.. గణేష్ ని తీసుకెళ్లలేదు.. భయంగా ఉంది.. నా చేతుల్లో ఉందల్లా అమ్మ ఫోటో మాత్రమే.. ఫ్లైట్ ముందుకు వెళుతుంటే ఎంతగా ఏడ్చానో నాకే తెలుసు అన్నిటికి ఆ గణేషుడే ఉన్నాడు ఆయనే చూసుకుంటాడని ఆయన్ని అమ్మని తలుచుకుని కళ్ళు మూసుకున్నాను.


మూడు నెలల వరకు అస్సలు నాకు తీరికే లేదు, నేను సర్దుకుని అలవాటు పడడానికి ఇంత సమయం పట్టింది. నాతో మాట్లాడడానికి అటు వాళ్ళ దెగ్గర ఫోన్ లేదు ఇటు నా దెగ్గర కూడా లేదు.. నాతో మాట్లాడాలంటే వాళ్ళు నన్ను పంపించిన ఆ ఆఫీస్ కి వెళ్లాల్సిందే.. ఈ మూడు నెలల్లో అక్షితతో మూడు సార్లు మాత్రమే నేను మాట్లాడింది. రోజులు చాల భారంగా గడుస్తున్నాయి కానీ ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి.. ఇక్కడ పనిచేయడం, పడుకోవడం తప్పితే వేరే వ్యాపకం లేదు.. పని.. నిద్ర.. పని.. నిద్ర.. రోజులు చాలా త్వరగా వెళ్లిపోతున్నాయి.

డబ్బు మొత్తం అక్షితకే పంపిస్తున్నాను, తన స్నేహితురాలి బావ ఇల్లు కట్టి అమ్ముతాడట కొత్తగా కట్టిన ఇల్లు ఒకటి ఉంది అక్షిత కోసం తక్కువలోనే ఇస్తాడు లోన్ పెడతాను అని చెపితే తనకి తోచింది చెయ్యమన్నాను.. ఇల్లు ఇద్దరి పేరు మీదా తీసుకోమన్నాను దానికి సరే అంది.

అక్షిత, లావణ్య ఇద్దరు పార్ట్ టైం చేస్తూ డిగ్రీ జాయిన్ అయ్యారట, సర్టిఫికెట్స్ మానేజ్ చేశారట.. ఇద్దరం బాగా చదువుతున్నాం అని లావణ్య చెప్పింది.

చిన్నా : హలో

అక్షిత : ఎలా ఉన్నావ్ రా.. మేము గుర్తొస్తున్నామా

చిన్నా : రోజూనే.. అయినా ఇంకొక్క పది నెలలు అంతేగా వచ్చేస్తా.. ఎంతలో అయిపోయాయి చూడు

అక్షిత : ఎలా ఉన్నావో ఏంటో.. ఇది నీ మీద బెంగ పెట్టుకుంటుంది

చిన్నా : నీకు లేదా బెంగ

అక్షిత : ఏం మారలేదు.. కామేష్.. హహ.. చెప్పరా ఇంకా

చిన్నా : ఎక్కడిదాకా వచ్చింది మీ డిగ్రీ

అక్షిత : దెగ్గర పడింది, ఇంకో సంవత్సరం అంతే..

చిన్నా : ఇంకా

అక్షిత : ఇద్దరం ఫోన్లు కొనుక్కున్నాం.. ఇంటి లోను నెల నెలా కడుతున్నాం.. సాగుతున్నాయి.. నీ సంగతి ?

చిన్నా : ఇక్కడేముంది.. తినడం పనిచెయ్యడం నిద్రపోవడం ఈ మూడే

అక్షిత : ఉండేనా మరీ..

చిన్నా : ఉమ్మ్.. బై

ఫోన్ పెట్టేసి అక్షిత మొహం తలుచుకున్నాను.. కనీసం ఒక్క ఫోటో కూడా తెచ్చుకోలేదు.. ఇద్దరు ఎలా ఉన్నారో.. చూస్తుండగానే నా మూడేళ్ళ కాంట్రాక్టు అయిపోవచ్చింది కానీ ఏదో చిన్న సమస్య వచ్చిందన్నారు. మా వర్క్ పర్మిట్ అయిపోయింది కనిపిస్తే లోపల వేస్తారని భయపెట్టారు.. దేశం కానీ దేశంలో ఇరుక్కుపోయామా అనిపించింది. పని చేపించుకుంటున్నారు డబ్బులు వేస్తున్నారు కానీ మమ్మల్ని ఇండియా ఎప్పుడు పంపిస్తారని అడిగితే మాత్రం సమాధానం రావడంలేదు.. అందరం కలిసి ధర్నా చేద్దాం అని నిర్ణయించుకున్నాం కానీ ఆలా చేస్తే మా గురించి అందరికి తెలిసి మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అని భయపడి ఆ ప్రయత్నం మానుకున్నాము.

ఇంకో రెండు సంవత్సరాలు పట్టింది, ఈ గొడవల్లో పడి నేను అక్షిత వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోయాను.. వాళ్ళు ఈ మధ్య నెలకి ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యడం లేదు.. ఏడుపొస్తుంది.. ఫోన్ చేసినా అరాకోరా మాట్లాడి పెట్టేస్తున్నారు.. మా ఓపిక అయిపోతుందనగా ఇంకో వారంలో ఇండియా వెళ్ళిపోతున్నామని ప్రకటించారు.. ఇంత సంతోషం నాకు ఎప్పుడు వెయ్యలేదు

ఐదున్నర ఏళ్ళు ఎలా గడిచిపోయాయో నాకు తెలీదు కానీ, ఈ ఒక్క వారం మాత్రం దుబాయిలో గడిపిన సమయం మా అందరికి నరకంలా తోచింది.. నా బాధ అయితే వర్ణాతీతం.. ఫ్లైట్ ఎక్కి కూర్చుంటే కానీ మమ్మల్ని మేము నమ్ముకోలేకపోయాం.. అందరూ ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎంత ఆరాటపడుతున్నారో.. నా పక్కనే కూర్చున్న సలీంకి కొడుకు పుట్టి ఐదేళ్ళు అవుతుంది, ఇంతవరకు తన కొడుకుని చూసుకుంది లేదు.. తన కళ్ళలో ఆ మెరుపు, పట్టరాని సంతోషంతో నన్ను వాటేసుకున్నాడు.. నేనూ అంతే.. అక్షితనీ లావణ్యని చేస్తానన్న సంతోషంలో ఇంకా గట్టిగా వాటేసుకున్నాను.

ఎలాగోలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బైటికి వచ్చి నిలుచున్నాను.. నాకోసం లావణ్య వచ్చింది.. దాన్ని చూడగానే ఏడుపు వచ్చేసింది.. పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాను, ఇద్దరం ఏడ్చుకున్నాం.. అక్షిత కోసం నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి.

చిన్నా : అదెక్కడా

లావణ్య  : ఏదో పని ఉందని బైటికి వెళ్ళింది.. పదా వెళదాం.. చాలా మారిపోయావ్ రా.. అంకుల్లా తయారయ్యావ్.. ఆ పొట్ట ఏంటి

చిన్నా : మెకానిక్ నే.. నేను.. జింకి వెళ్ళానా సిక్స్ పాక్స్ తో రాడానికి..

ఇద్దరం బైటికి వచ్చాం.. నేను నడుస్తుంటే లావణ్య త్వరగా వెళ్లి స్కూటీ తీసుకొచ్చింది.

చిన్నా : ఎవరిదే ఇది..

లావణ్య : మనదే.. ఇద్దరం కలిసి తీసుకున్నాం

చిన్నా : బాగుంది

లావణ్య : నడుపుతావా

చిన్నా : వద్దులే.. నడుపు.. చూస్తాను ఎలా నడుపుతావో

లావణ్య నవ్వుతూ ముందుకు వెళుతుంటే తన భుజం మీద చెయ్యి వేసి ఊరు చూస్తున్నాను

చిన్నా : ఎలా ఉండే సిటీ ఎలా మారిపోయిందే

లావణ్య : అవును.. తెలంగాణ విడిపోయాక కెసిఆర్ సీయం అయ్యాక చాలా మార్పులు జరిగాయి.. రోజూ ఏదో ఒక అభివృద్ధి జరుగుతూనే ఉంది.

చిన్నా : కనిపిస్తుంది

చాలా సేపటి ప్రయాణం తరువాత సందులు గొందులు తిప్పి నన్ను ఒక ఇంటి ముందుకు తీసుకెళ్లింది.

లావణ్య : ఇదేరా మన ఇల్లు.. ఇవ్వాళ పక్కింట్లో గృహ ప్రవేశం.

చిన్నా : టెంటు కనిపిస్తుందిగా.. అని మాట్లాడుతూనే చుట్టు చూస్తూ ఎందుకో తల పైకి ఎత్తాను, ఎవరో ఒక అమ్మాయి పక్కింటి మేడ మీద నిలుచుని నన్నే చూస్తుంది.. అంత ఎండలో నిలుచుంది ఏంటా అనుకున్నాను.. ఒక్కసారి ఆ అమ్మాయిని చూసి లోపలికి వెళ్లాను.


సాయంత్రం వరకు తీరికగా ముచ్చట్లు పెట్టుకున్నాం. లావణ్య తన ఫోన్ చూపించింది.. అక్షితకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా అది తీయలేదు. చీకటి పడుతుండగా గేట్ చప్పుడు అయ్యేసరికి తల తిప్పి చూస్తే అక్షిత ఫోన్ మాట్లాడుతూ గడప పట్టుకుని ఒక కాలు ఎత్తి కాళ్ళకి సండల్స్ విప్పుతూ నన్ను చూసి నవ్వింది.

లేచి నిలుచున్నాను, అక్షిత జీన్స్ వేసుకుంది, చాలా పొడవు పెరిగింది, ఒళ్ళు వస్తుందేమో అనుకున్నా కానీ లేదు బక్కగానే ఉంది.. లోపలికి వస్తూనే ఫోన్ జోబులో పెట్టుకుని నవ్వుతూ వచ్చి వాటేసుకుంది.. గట్టిగా పట్టేసుకున్నాను.. ఏడుపు వచ్చేసింది.. లావణ్య కూడా వచ్చింది ముగ్గురం కరుచుకున్నాం.. తలుపు శబ్దం అయితే ముగ్గురం తలుపు వైపు చూసాం.. మధ్యాహ్నం నేను ఇంట్లోకి వస్తుంటే మేడ మీద నుంచి నన్ను చూసిన అదే అమ్మాయి.. చేతిలో బేషన్ ఉంది.

మీకు భోజనం ఇద్దమనీ..

లావణ్య : లోపలికి రా

ఆ అమ్మాయి లోపలికి వచ్చింది..

లావణ్య : నా పేరు లావణ్య.. తను అక్షిత.. తను చిరంజీవి.. మేము ముగ్గురమే ఉండేది

భోజనం అక్షిత చేతికి ఇస్తూ.. మధ్యనమే పలకరిద్దాం అనుకున్నాను కానీ చుట్టాల వల్ల కుదరలేదు.

అక్షిత : పేరు చెప్పలేదు...?

నా పేరు శృతి 
Like Reply
#9
•9•

బైట నుంచి ఎవరో కేక వేశారు శృతీ అని.. ఆ అమ్మాయి బైటికి వెళ్లి మళ్ళీ లోపలికి వచ్చి పిలుస్తున్నారు నేను మళ్ళీ వస్తాను మీరు భోజనం చెయ్యండి అని వెళ్ళిపోయింది.


అక్షిత : తిందామా

లావణ్య : నువ్వు బట్టలు మార్చుకుని రాపో

ఆ మాట వినగానే నాకు సిగ్గేసింది.. పాత జ్ఞాపకాలు ఎన్నో గుర్తొచ్చాయి.. అక్షిత లోపలికి వెళ్ళిపోయింది.. లావణ్యకి ఫోన్ వస్తే మెట్ల మీదకి వెళ్ళిపోయింది. ఎందుకో నాకు ఇంతక ముందున్నంత చనువు ఇప్పుడు లేదేమో అనిపించింది.. నేను మారిపోయానో వాళ్ళు మారిపోయారో నాకు అర్ధం కాలేదు. మూలన సాప ఉంటే వేసాను.. అక్షిత బైటికి వచ్చింది.

అక్షిత : పైన కూర్చుందాం రా.. డైనింగ్ టేబుల్ ఉందిగా

చిన్నా : నాకు కిందే బాగుంటుంది.

అక్షిత : సరే.. అయితే అని అన్ని పెట్టుకొచ్చింది

అక్షిత వడ్డీస్తుంటే దాన్నే చూస్తున్నాను.. మెడలో చిన్న చైన్ ఉంది, వేలుకి ఉంగరం. కమ్మలు కూడా చిన్నవే.. చాలా స్టైల్ గా ఉంది. ఇంతకముందు ఎప్పుడు నేను తనని చూస్తున్నానా లేదా అని నన్ను గుచ్చి గుచ్చి చూసేది కానీ ఇప్పుడు అస్సలు చూడలేదు.. మర్చిపోయిందేమో..

అక్షిత : ఏంట్రా

చిన్నా : డిగ్రీ అయిపోయిందా

అక్షిత : డిగ్రీ అయిపోయింది, పీజి కూడా అయిపోవచ్చింది.. ప్లేస్మెంట్స్ లో జాబ్ కొట్టేస్తాను.. జాబ్ వచ్చిందంటే నెలకి యాభై వేలైనా వస్తాయి

చిన్నా : ఓహ్.. కంగ్రాట్స్

అక్షిత : పర్లేదే ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావ్

చిన్నా : అక్కడ అంతా ఉర్దూ లేకపోతే ఇంగ్లీష్

లావణ్య కూడా వచ్చి కూర్చుంది, కానీ మౌనంగా ఉంది.. అక్షిత ఏమయిందని సైగ చెయ్యగా లావణ్య తరవాత మాట్లాడదాం అని సైగ చేసింది.. నేనేమి మాట్లాడలేదు.. మౌనంగా తింటున్నాను.

అక్షిత : ఏంట్రా ఏం మాట్లాడట్లేదు.. చాలా సైలెంట్ గా ఉన్నావ్

చిన్నా : ఏం లేదు..

అక్షిత : అమ్మ ఫోటో నువ్వే తీసుకుపోయావ్.. చూసి ఐదేళ్ళు దాటిపోయింది.. ఏది ఇటీవ్వు

అమ్మ ఫోటో అక్షితకి ఇచ్చాను..

అక్షిత : ఒసేయి రేపు దీన్ని ఫ్రేమ్ చేపిద్దాం.. జాగ్రత్తగా పెట్టు అని లావణ్య చేతికిచ్చింది.

లావణ్య ఒక్క నిమిషం అంటూ లేచి వెళ్లి గబగబా వచ్చి తన చెయ్యి తెరిచింది, నా గణేష్.. చేతుల్లోకి తీసుకున్నాను. నా వాగుడుకాయ అక్షిత మాటలు వింటూ అన్నం తినేసి ఒకసారి ఇల్లు మొత్తం చూసాను.. చక్కగా సర్దుకున్నారు. ఇద్దరు తినగానే ఫోన్లు పట్టుకున్నారు.. ఒకటే నొక్కడం అందులో.. కొంచెం ఈ ఫోన్ నేర్చుకోవాలి నేను కూడా

రాత్రికి ఎక్కడ పడుకోవాలో అర్ధంకాలేదు, అక్షిత లావణ్య చెరొక రూం తీసుకున్నారు.. నాకేమో నిద్రొస్తుంది.. వీళ్లేమో ఫోన్లో ఉన్నారు.. కొంచెం ఇబ్బందిగా అనిపించింది.. ఇక్కడికి వచ్చేదాకా ఏదేదో ఊహించుకున్నాను కానీ ఇంత మొహమాట పడాల్సి వస్తుందని అనుకోలేదు అదీ లావణ్య అక్షితల దెగ్గర.. సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకున్నాను.

లావణ్య లేపి తన రూంలోకి తీసుకెళ్ళింది.. ఇద్దరం ఒకే మంచం మీద పడుకున్నాం.. కొంచెంసేపటికి అక్షిత వచ్చి నా పక్కన పడుకుంది.. ఇద్దరు నా భుజం మీద తలలు పెట్టుకుని వాళ్ళ కష్టాలు చదువులు చెపుతుంటే వింటూ నిద్రలోకి జారుకున్నాను.

తెల్లారి లేచి చూస్తే లావణ్య నా పక్కన పడుకుంది, టైం చూస్తే ఐదవుతుంది.. రోజు పొద్దున్నే అమ్మ ఫోటో చూడకుండా లేవను.. రాత్రి లావణ్య ఎక్కడ పెట్టిందో గుర్తుకురాలేదు, లావణ్య మొహం చూసి లేచి బైటికి వచ్చాను అక్షిత తన రూంలో మంచం మీద పడుకుని ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంది. గేట్ తీసుకుని బైటికి వచ్చాను. నిన్న రాత్రి ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి కనిపించింది. టెంటు కింద వేసిన కుర్చీల్లో కూర్చుని ఉంది.. నన్ను చూడగానే లేచి నిలబడి నవ్వుతూ నావైపు వచ్చింది.

శృతి : గుడ్ మార్నింగ్

చిన్నా : గుడ్ మార్నింగ్ అని నవ్వాను

శృతి : ఇంకా ఎవ్వరు లేవలేదు, అలా వాకింగ్ కి వెళదాం అనుకుంటున్నాను.. కానీ కుక్కలు ఉన్నాయి.. తోడుగా వస్తారా

చిన్నా : పదండి

శృతి : మీరేం చేస్తుంటారు..?

చిన్నా : నేను మెకానిక్.. దుబాయిలో చేసేవాడిని నిన్నే వచ్చాను, ఇక ఇక్కడే ఏదైనా చూసుకోవాలి

శృతి : వాళ్ళు మీకు ఏమవుతారు

చిన్నా : నా స్నేహితులు.. ఏ..

శృతి : లేదు.. ఇల్లు కట్టేటప్పుడు అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడేదాన్ని మీ పేరు వినిపించేది

చిన్నా : అలాగా

శృతి : మరీ మొహమాటస్తుడిలా ఉన్నావే

నేను చిన్నగా నవ్వాను

శృతి : నిన్ను ఇబ్బంది పెట్టనులే.. వాళ్ళు చిన్నా అని పిలుస్తున్నారు..

చిన్నా : మీరు కూడా అలానే పిలవండి

శృతి : థాంక్యూ

చిన్నా : మీరేం చదువుతున్నారు..

శృతి : నాకు చదువులు అంటే పడవు.. నేనొక vfx ఆర్టిస్ట్ ని..

చిన్నా : అంటే..

శృతి : అంటే.. సినిమాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోతుంటాయి కదా.. నిజంగా కూలిపోవు.. మేము కూలిపోయినట్టు క్రియేట్ చేస్తాం అనమాట.. లైటింగ్.. కలర్స్.. అన్నీ గ్రాఫిక్స్ చేస్తాం..

చిన్నా : మీరేం చెపుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు, కాని మీరు చెప్పినదాని బట్టి చూస్తుంటే.. ఆ పని మీద మీకున్న మక్కువ కనిపిస్తుంది. మనసుకి నచ్చిన పని చేస్తున్నారు.

శృతి : అవును.. ఒక్క మాటలో అర్ధం చేసుకున్నావ్.. నువ్వు చాలా గ్రేట్.. అవును నువ్వు సినిమాలు చూడవా

చిన్నా : ఇంతవరకు నేను సినిమా చూడలేదు

శృతి : నిజంగానా.. చిన్నప్పుడు.. దుబాయిలో.. కనీసం టీవీలో

చిన్నా : హా.. ఒకటి రెండు సార్లు.. రోడ్ల మీద హోటల్స్ లో చూసాను టీవీ అంతే..

శృతి : నిజమేనా.. నన్ను ఆటపట్టిస్తున్నావా

చిన్నా : లేదు నిజమే

శృతి : అలాగా.. అయినా నిన్ను ఒకటి అడగాలి.. మీ స్టోరీ ఏంటి.. ముగ్గురు ఫ్రెండ్స్.. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి.. ఇక్కడ కలిసి ఉంటున్నారా మీ వాళ్ళు ఊర్లో ఉంటారా

చిన్నా : లేదు.. మాకెవ్వరు లేరు.. మేము ముగ్గురమే.. వాళ్లిద్దరే నా కుటుంబం

శృతి : ఈ సిటీలో అంత త్వరగా లేచే వాళ్ళు చాలా తక్కువ.. మనకి చాలా టైం ఉంది.. నీకు ఓకే అయితే మీ కధ చెప్పు.. నాకు తెలుసుకోవాలని ఉంది.. నీకు ఇష్టమైతేనే..

ఎందుకో ఈ అమ్మాయి నాకు నచ్చింది, చాలా బాగా మర్యాదగా మాట్లాడుతుంది.. మా లాంటి మెకానిక్లకి ఇది చాలా ఆరుదు, ముందు బాగా మాట్లాడతారు నేను మెకానిక్ అని తెలిసాక మాత్రం చులకనగా మాట్లాడతారు, కానీ ఈ అమ్మాయి అలా కాదు.. చాలా సంస్కారం ఉన్న అమ్మాయి. గంటలో నా కధ మొత్తం చెప్పాను. మౌనంగా వినింది.

శృతి : నేను కూడా నీ ఫ్రెండ్ని అవ్వచ్చా

చిన్నా : కచ్చితంగా..

శృతి : థాంక్స్ అని చెయ్యిచ్చింది.

తన చెయ్యి పట్టుకున్నాను.. నా చెయ్యి వదల్లేదు.. అలానే నా చెయ్యి పట్టుకుని నడుచుకుంటూ చుట్టు పక్కల ఉన్న షాపులు అన్ని చూపించింది. చెయ్యి వెనక్కి తీసుకుంటే మళ్ళీ ఏమనుకుంటుందోనని అలానే ఉండిపోయాను.. తిరిగి ఇంటి దారి పట్టాము

శృతి : ఇంకా మెకానిక్ పని కాకుండా నీ హాబీస్ ఏంటి

చిన్నా : అర్ధం కాలేదండి..

శృతి : ముందు అండి గిండి మానెయ్యి.. హాబీస్ అంటే.. నీకు నచ్చే పని.. రోజూ చేసేది.. ఇప్పుడు నా పని vfx చెయ్యడం.. కానీ నేను కాళిగా ఉన్నప్పుడు బొమ్మలు గీస్తుంటాను.. అలా

చిన్నా : నాకు మెకానిక్ పని ఒక్కటే వచ్చు.. అలాంటివి ఇంకేమి నాకు చేతకావు.. మీరు బొమ్మలు బాగా గీస్తారా

శృతి : పరవాలేదు.. బాగానే గీస్తాను.. మీ అక్షిత బొమ్మ గియ్యాలా అని నవ్వింది

చిన్నా : అదేంటండీ..

శృతి : నీ మాటల్లోనే తెలుస్తుంది.. మళ్ళీ నువ్వు చెప్పాలా.. ఈ సీక్రెట్ మన మధ్యలోనే ఉంటుందిలే.. అది కూడా నువ్వు అండి.. మీరు.. అని మానెస్తేనే..

చిన్నా : అలాగే అని నవ్వాను

శృతి : ఇంతకీ ఎవరి బొమ్మ గియ్యాలి..?

చిన్నా : మా అమ్మది

శృతి : తప్పకుండా.. అదిగో మీ వాళ్ళు చూస్తున్నారు అని కళ్ళు ఎగరేసి.. మళ్ళీ కలుద్దాం.. నీ నెంబర్ ఇవ్వు

చిన్నా : నాకు ఫోన్ లేదు

శృతి : చాలా అరుదైన మొక్కవి నువ్వు అని నవ్వుతూ వెళ్ళిపోయింది.

గేట్ తీసుకుని లోపలికి వచ్చాను, లావణ్య స్నానం చేసినట్టుంది మెట్ల మీద కూర్చుని చుడిధార్ వేసుకుని తల దువ్వుకుంటుంది.

లావణ్య : ఏంటంటా

చిన్నా : కుక్కలు ఉన్నాయి అంటే తోడుగా వెళ్లాను

ఇద్దరు చకచకా రెడీ అయ్యి వెళ్లిపోయారు.. వాళ్ళు వెళ్లిపోయే టైంకే పక్కింటి అమ్మాయి శృతి కూడా వెళ్ళిపోయింది తన స్కూటీలో.. వెళ్లేప్పుడు నన్ను చూసి నవ్వింది.. తిరిగి నవ్వాను. అక్షిత అది చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

స్నానం చేసి బైటికి వెళ్లాను, రోడ్లన్నీ చూస్తూ మెకానిక్ షాపుల కోసం వెతికాను, బోర్ కొట్టింది.. ఇంటికి వచ్చేసాను. శృతి వాళ్ళ అమ్మగారు పలకరించింది.. బాగా మాట్లాడింది.. బహుశా శృతి అంత మంచిగా ఉండటానికి ఈమే కారణమెమో అనిపించింది. కొంతసేపు పడుకున్నాను.
Like Reply
#10
•10•

లేచేసరికి నాలుగు అయ్యింది, సాయంత్రం ఎప్పుడో వచ్చారు. వచ్చిన దెగ్గర నుంచి ఒకటే ఫోన్లు. చూస్తున్న నాకే చిరాకు పుట్టింది. బాత్రూంకి వెళుతూ కూడా తీసుకెళ్ళింది అక్షిత. నాకు నచ్చలేదు, అదే చెప్పాను.

అక్షిత : నాకు నచ్చదు రా.. కానీ అలవాటు పడిపోయాము, ఇదిగో ఇలా తిప్పుతుంటే ఇక వస్తూనే ఉంటాయి వీడియోలు.. గంటలు గంటలు గడిచిపోతాయి. మర్చిపోయా పదా నీకు కూడా ఫోన్ తీసుకుందాం.

చిన్నా : దాన్ని కూడా రానీ..

అక్షిత : త్రిపుల్స్ పట్టుకుంటే అస్సలు వదలరు.. మనం వెళ్లొద్దాంలే పదా

లావణ్యకి చెప్పి ఇద్దరం స్కూటీ తీసి బైటికి వచ్చాం.. అక్షిత మాట్లాడుతూ బండి నడుపుతుంటే తన భుజం మీద చెయ్యి వేసాను, కింద నడుము కనిపించింది కాని అంత ధైర్యం నాకు లేదు.. వెనక కూర్చున్నంతసేపు తన మెడ దాని మీద పుట్టుమచ్చ.. మెడలో చైన్ చూస్తూ కూర్చున్నాను.

నా కోసం తనే ఫోన్ చూసింది, సిమ్ అన్ని మాట్లాడి మంచి నెంబర్ తీసుకుందట. ఆన్ చేసి సెట్టింగులన్ని తనే చేసింది. ఫోన్ తెరవగానే వినాయకుడు కనిపించేలా పెట్టింది.. ఈ ఫోన్లో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే అది ఇదే.. ఇంటికి వెళ్లేప్పుడు నన్ను మాల్ కి తీసుకెళ్ళింది. నాకు జీన్స్ టీ షర్ట్లు తీసింది..

చిన్నా : మేడం.. నేను మెకానిక్ ని.. మీలా స్టూడెంట్ ని కాను

అక్షిత : అయితే.. దానికి దీనికి ఏంటి సంబంధం

చిన్నా : అవన్నీ వద్దు.. మాములు పాంట్లు, ఓ నాలుగు చొక్కాలు తీసుకుందాం చాలు..

అక్షిత : నా మాట ఎప్పుడు విని చచ్చావ్.. నీ ఇష్టం వచ్చినవి ఏరుకో.. అని పక్కకి వెళ్ళిపోయింది. ఓ పది నిముషాలు పట్టింది నాకు..

చిన్నా : అయిపోయింది వెళదామా

అక్షిత : ఏంటప్పుడే..

చిన్నా : హా..

అక్షిత : పదా.. చూద్దాం తమరి సెలక్షన్

మాల్ వాడు బిల్ వేస్తూ ఒక్కో షర్ట్ తీస్తుంటే అక్షిత నన్ను కోపంగా చూస్తుంది.

అక్షిత : అనుకున్నాను

చిన్నా : నాకు ఇలా మాములుగా ఉంటేనే ఇష్టం అక్షితా.. అలాంటివి నేను వేసుకోలేను

అక్షిత : దండం రా దూతా నీకు, పదా అని కార్డుతో బిల్ కట్టేసింది.

రాత్రికి భోజనాలు కానిచ్చేసి పడుకున్నాం, తెల్లారి మెలుకువ రాలేదు.. లేచేసరికి అక్షిత లావణ్య ఇద్దరూ వెళ్లిపోయారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాను.. అంతే ఛార్జింగ్ అయిపోయేవరకు లేవలేదు, స్విచ్ ఆఫ్ అవ్వగానే ఛార్జింగ్ పెట్టడం అది అయిపోయే వరకు చూడటం.. సాయంత్రం గేట్ చప్పుడు అయితే కానీ నా తల పక్కకి తిరగలేదు. చూస్తే శృతి.. లేచాను.

శృతి : పొద్దున నీకోసం చాలా సేపు చూసాను.. నువ్వు రాలేదు

చిన్నా : నాకు చెప్పలేదుగా

శృతి : రేపటి నుంచి అయినా వస్తావా

చిన్నా : రావాలా

శృతి : బలవంతం ఏమి లేదు.. ఆరోగ్యానికి మంచిదే కదా.. రా.. తమరికి పొట్ట కూడా కావాల్సినంత ఉంది

చిన్నా : అదిగో అలా అయితే నేను రాను చెప్తున్నా

శృతి : సరే సరే.. సరదాకి.. రేపటి నుంచి రా.. నీ పొట్ట కరిగించేద్దాం.. ఏంటి ఫోన్ కొన్నావా

చిన్నా : నిన్నే.. అక్షిత కొనింది అని తన చేతికిచ్చాను

శృతి : నెంబర్ బాగుంది.. వాట్సాప్ ఏమి వేసుకోలేదే

చిన్నా : ఏమో..

ఒక పావుగంట కూర్చుని ఏదేదో నొక్కింది.

శృతి : ఇదిగో నీ ఫోన్

చిన్నా : ఏమేమి నొక్కావో..  మళ్ళీ నాకు తెలుస్తాయా

శృతి : నేనేమి నొక్కలేదు బాబు.. చూసాను అంతే.. నా నెంబర్ సేవ్ చేసాను పొద్దున్నే ఫోన్ చేస్తా వచ్చేయి.. వెళుతున్నా.. అవును మీ అమ్మ బొమ్మ గీయాలన్నావ్.. ఏదైనా ఫోటో ఉంటే ఇవ్వు

చిన్నా : ఒక్క నిమిషం.. అని లోపలికి వెళ్ళు చూస్తే ఫోటో కనిపించలేదు.. ఫ్రేమ్ చేపిస్తామన్నారు కదా మర్చిపోయాను.. అదే విషయం శృతికి చెప్పాను.. సరే రేపు ఇవ్వు అని వెళ్ళిపోయింది.

చీకటి పడుతుండగా వచ్చారు ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి రాగానే కామ్ అయిపోయి వచ్చి నా పక్కన కూర్చున్నారు. లావణ్య చున్నీ కుర్చీలో వేసి లోపలికి వెళ్ళింది.

అక్షిత : ఏం చేసావ్ రా రోజంతా

చిన్నా : పడుకున్నా.. ఫోన్ చూస్తూ కూర్చున్నా.. రోజు గడిచిపోయింది.

లావణ్య : వీడు అన్నం తినలేదు.. అలానే ఉంది అన్నం లోపల

అక్షిత : ఏరా..

చిన్నా : అవును అమ్మ ఫోటో చేపించావా

అక్షిత : హా.. ఇచ్చాము.. రేపు ఇస్తామన్నాడు.

చిన్నా : ఫోటో ఏది.. వాళ్ళకే ఇచ్చావా

అక్షిత : లేదు ఇచ్చారు.. ఇదిగో అని చేతిలో పెట్టింది.

చిన్నా : నేనలా తిరిగొస్తా అని లేచాను.. బైట కొంచెం సేపు అటు ఇటు నడిచాను.. రాత్రికి అన్నం తినేసి మంచం ఎక్కాను.. అక్షిత లావణ్య ఇద్దరు ఇంకో రూంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.. వెళదాం అనుకున్నాను.. కానీ ఎందుకులే మధ్యలోకి అనిపించింది.. ఇలా వచ్చి వేరే రూంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారంటే నేను వినకూడదనేగా.. మంచం ఎక్కి ఫోన్ చూస్తూ పడుకున్నాను.

పొద్దున్నే శృతి ఫోన్ తో లేచాను.. వాకింగ్ కి వెళ్ళాం.. పార్క్ కి తీసుకెళ్ళింది.. ఎక్సర్సైజులు చెయ్యమంది.. ఇలా బైట అందరికీ కనిపించేలా అంటే నాకు సిగ్గు.. నా వల్ల కాదు అదే చెప్పాను.. గట్టిగా నవ్వింది.. అది కూడా ఎవరైనా చూస్తారేమో అని భయపడ్డాను.. నా చెయ్యి పట్టుకుని ఎవ్వరు లేని దెగ్గరికి తీసుకెళ్లి తను చేస్తూ అలానే చెయ్యమంది.. గంటలో ఇంటికి తిరిగొచ్చేశాం.

వారానికి ఏరియా మొత్తం తెలిసింది.. రోడ్డు మీద షాపులు కలవారిని కొంతమందిని పరిచయం చేసుకున్నాను. ఒక షటర్ చూసాను.. బాగుంది.. మంచి పాయింట్ అవుతుందనిపించింది. నేను దుబాయిలో ఉన్నప్పుడు ఎంత సంపాదించానో లెక్కలు వెయ్యలేదు మొత్తం అక్షితకే పంపించేసాను.. కానీ బానే సంపాదించానని నాకు తెలుసు.

ఆ రోజు ఇంటికి వెళ్లి అక్షితకి షటర్ గురించి చెప్పాను.. డబ్బులు ఉన్నాయి అంది.. అంతా మాట్లాడుకుని మంచిరోజు చూసి ఓపెన్ చేసాను. డబ్బు వ్యవహారం మొత్తం అక్షితే చూసుకుంది.. ఎంతకావాలో అంతే ఇచ్చింది.. అది నాకు నచ్చకపోయినా ఎందుకో నేనేమి మాట్లాడలేకపోతున్నాను.. ఈ మధ్య అన్నిటికి తడబడుతున్నాను.. నాకు నేనే నచ్చట్లేదు.. నేను కొంచెం అల్లరోడినే నాలో మంచి చతురత కూడా ఉన్నదని నాకు తెలుసు కానీ అవేమి ఇప్పుడు రావడం లేదు.. గణేష్ మెకానిక్ పాయింట్ తెరుచుకుంది.

పొద్దున్నే వెళ్లడం గణేష్ కి దణ్ణం పెట్టుకుని పని మొదలుపెట్టడం, సాయంత్రం వరకు ఒక్కణ్ణే గొడ్డులా పని చెయ్యడం ఇంటికి వచ్చి తొంగోవడం ఇదే పని.. మళ్ళీ మొదలయ్యింది అనుకున్నాను. మొదటి నాలుగు రోజులు లావణ్య, అక్షిత వచ్చి చూసి వెళ్లేవారు.. కానీ తరువాత తరవాత అస్సలు రావడమే మానేశారు.. ఇంట్లో కూడా లావణ్య, అక్షిత ఒక రూం తీసుకుని నాకు ఇంకో రూం ఇచ్చారు.. నేనెప్పుడు ఇంట్లో ఉన్నా వాళ్ళ తలుపు మూసే ఉండేది.. చాలా కోపం వచ్చేది.. నాకు తెలిసిన అక్షిత, లావణ్యలు వీళ్ళు కారు అనిపించినప్పుడల్లా బాధగా ఉండేది. ఎందుకో నాకు ఇక్కడ కంటే దుబాయిలో ఒంటరిగా ఉన్నప్పుడే బాగుందేమో అనిపించింది.

శృతి మాత్రం నాకు మంచి స్నేహితురాలు అయ్యింది, అమ్మ బొమ్మ ఎంత అందంగా గీసిచ్చిందో దాన్ని నా రూంలో చాలా భద్రంగా దాచుకున్నాను మా స్నేహానికి గుర్తుగా.. ఎప్పుడైనా తను ఆఫీస్ కి వెళ్లకపోతే నాకోసం తన ఇంటి నుంచి క్యారెజ్ తెచ్చేది.. నేను ఒక్కణ్ణే పని చేసుకుంటుంటే వచ్చి కూర్చుని నాతో కబుర్లు చెప్పేది.. నిజానికి ఇవన్నీ నేను అక్షిత నుంచి ఆశించాను.. నెలలు గడుస్తున్నాయి కానీ ఇప్పటివరకు నేను అనుకున్నది గణేష్ ని కోరుకున్నది ఒక్కటి కూడా జరగలేదు.. ఈ విషయంలో గణేష్ ని మొక్కెటప్పుడు పాపం ఆయన మీద తెగ కోప్పడేవాడిని.

అక్షిత, లావణ్య చదువులు అయిపోయాయి.. ఇద్దరు ఉద్యోగం తెచ్చుకున్నారు.. చాలా సంతోషం వేసింది. మంచో చెడో..వాళ్ళ కష్టమో అదృష్టమో.. ఇద్దరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు.. అందులో నా హస్తం ఉంది.. అక్షిత లావణ్య ఈ పేర్లు తీసేసి చూస్తే ఇద్దరు అమ్మాయిల జీవితం వెనుక నా చెయ్యి ఉంది.. అమ్మే కనక ఉండుంటే నన్ను చూసి గర్వపడేదేమో.. అమ్మ అనుకున్నట్టుగానే నేను నడుచుకుంటున్నానా.. పనికొచ్చే సాయం చేస్తున్నాను అనిపించింది.
Like Reply
#11
•11•

ఒకరోజు సాయంత్రం షెడ్లో ఉండగా శృతి వచ్చి కూర్చుంది.


చిన్నా : ఏంటి మేడం గారు, వెళ్లలేదా ఆఫీస్ కి ఇవ్వాళా

శృతి : లేదురా.. మధ్యలోనే వచ్చేసా.. తల నొప్పిగా ఉంటేనూ..

చిన్నా : ఎందుకట నీ తలకి నొప్పి

శృతి : దాని బాధ దానిది.. ఇంకా.. అక్షితకి నీ లవ్ మ్యాటర్ ఎప్పుడు చెపుతున్నావ్

చిన్నా : నేను చెప్పదలుచుకోలేదే.. రోజూ చూస్తున్నా.. రోజూ గణేష్ ని అడుగుతున్నా.. ప్రతీ వినాయకచవితికి మొక్కి నా చేత్తోనే ఆయనకి సేవలు చేసి నిమజ్జనం చేస్తున్నా.. ఆయనకి మమ్మల్ని కలపాలని ఉంటే కలుపుతాడు లేదంటే లేదు

శృతి : అలా అంటే ఎలా రా.. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా.. అంతా ఆయన మీదకి తోస్తే ఎలా

చిన్నా : ఎందుకో నాకు అక్షితకి కుదరదు అనిపిస్తుంది శృతి

శృతి : ఎందుకు అలా అంటున్నవ్.. నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం

చిన్నా : ఇప్పుడు అలా లేదేమో.. మొన్న అక్షిత వాళ్ళ స్నేహితులు ఇంటికి వచ్చారు.. వాళ్ళకి నేను మెకానిక్ పని చేస్తానని చెప్పడానికి కొంత ఇబ్బంది పడింది.. తన మొహంలో గమనించాను.

శృతి : వాళ్ళని నిలబెట్టింది ఈ మెకానిక్ చేతులే అన్న సంగతి మర్చిపోయారా.. పోగరు బాగా నెత్తికెక్కినట్టుందే

చిన్నా : ఓయి..

శృతి : వాళ్ళని ఏం అనకూడదు అంతేనా

చిన్నా : అంతే

శృతి : పోనీ నన్ను అడగమంటావా.. నీ గురించి.. ఏ విషయం తెల్చేస్తా.. ఒక్క మాటలో అయిపోద్ది.. ఏమంటావ్

చిన్నా : నువ్వు మధ్యలో దూరి చెడకొట్టకు.. వాళ్ళు బాధపడితే నేను చూడలేను.. ఒక వేళ నా మీద అక్షితకి ప్రేమ లేకపోతే ఇది ఇలాగే ఉండనీ.. నాతోనే ఉండిపోద్ది.. తనకి తెలిసి తను బాధపడి అది చూసి నేనూ బాధపడి ఎందుకు చెప్పు

శృతి : ఏంటో.. నీ మీద కోపం రావట్లేదు..

చిన్నా : మాటివ్వు.. అని చెయ్యి చాపి.. బలవంతంగా ఒట్టు వేపించుకున్నాను.

శృతి : ఇంక పోదాం పద.. ఫలుదా తిందాం.. చాలా రోజులు అవుతుంది.

చిన్నా : పదా అని అన్ని సర్ది, బండ్లు లోపల పెట్టి షటర్ కట్టేసి ఇంటి దారి పట్టాము.. శృతి నా చెయ్యి పట్టుకుని నడుస్తుంది.

శృతి : జీవితం ఎటు పోతుందో అర్ధం కావట్లేదు చిన్నా.. ముందుకు వెళుతుంది కానీ నా జీవితంలో అర్ధం లేదు.. ఏటూ ఏది తెల్చుకోలేకపోతున్నాను.

చిన్నా : నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెయ్యి

శృతి : అదే చేస్తాను.. నీ లావణ్యకి లవర్ ఉన్నాడని అనుమానం నాకు

చిన్నా : నాకూ ఉంది.. ఫోన్ రాగానే పరిగెత్తిద్ది

శృతి : అక్షిత..?

చిన్నా : తెలీదు.. అది తెలివికల్లది అంత ఈజీగా దొరకదు..

శృతి : ఒకవేళ ఉంటే

చిన్నా : ఉంటే ఏం చేస్తా.. వాళ్ళకి పెళ్లి చేస్తా

శృతి : చెప్పినంత ఈజీ కాదు

చిన్నా : అప్పుడు చూద్దాం

శృతి : మరి అప్పుడు నీ సంగతేంటి..?

చిన్నా : నేనా.. ఇంకా ఏమి ఆలోచించలేదు

శృతి : నన్ను చేసుకుంటావా

తన చెయ్యి వదిలేసాను, వెంటనే నా చెయ్యి పట్టుకుని నన్ను దెగ్గరికి లాక్కుంది.. నా కళ్ళలోకి చూస్తూంటే నా నోటా మాట రాలేదు.

శృతి : చిన్నా.. ఒకవేళ అలా జరిగితే నన్ను చేసుకుంటావా

చిన్నా : ఆకలేస్తుంది.. వెళ్ళాలి..

నా చెయ్యి వదిలేసింది.. వెనక్కి చూడకుండా పారిపోయాను.. తెల్లారి వాకింగ్ కి వెళ్ళలేదు. శృతితో నా మాటలు తగ్గాయి.. కొన్ని రోజులు మౌనంగా గడిచిపోతున్నాయి. ఒక రోజు లావణ్య నేను షెడ్ కి వెళుతుంటే ఆపింది.

లావణ్య : చిన్నా.. నీతో కొంచెం మాట్లాడాలి.

చిన్నా : చెప్పవే..

లావణ్య : ఇలా కాదు.. రా అని చెయ్యి పట్టుకు లాగి నన్ను మంచం మీద కూర్చోపెట్టింది.

చిన్నా : ఏంటే.. చెప్పు

లావణ్య : నేనొక అబ్బాయిని ఇష్టపడ్డాను.. అని నన్ను చూసింది..
Like Reply
#12
•12•

చిన్నా : అనుకుంటూనే ఉన్నా నేను.. నీ యవ్వారం చూస్తేనే అర్ధమైపోయింది.. ఎవరు..? ఏం చేస్తాడు..? అస్సలు అదేది.. ?

లావణ్య : అదిగో అక్కడ మూలన దాక్కుంది.. అది కూడా లవ్ చేసింది.. ముందు నన్ను చెప్పమని తోసింది

చిన్నా : ఓహ్.. మీ కాలేజీ ఫ్రెండ్స్ ఆ..?

అక్షిత నవ్వుతూ తలుపు చాటు నుంచి లోపలికి వచ్చింది.

అక్షిత : అవును.. కానీ ఇద్దరు సొంత అన్నదమ్ములే.. ఒకే ఇంటి వారు.. నేను అన్నయ్యని లవ్ చేస్తే అది తమ్ముణ్ణి లవ్ చేసింది.. వాళ్ళ ఇంట్లో చెప్పారట వాళ్ళు ఒప్పుకున్నారు.. ఇప్పటి వరకు అందుకే నీకు చెప్పలేదు.. వాళ్ళు ఇంటికి వస్తాం అంటున్నారు.

చిన్నా : రమ్మను

లావణ్య : నువ్వేమంటావ్

చిన్నా : నేనేమంటా.. ముందు చూడడానికే కదా రమ్మంది.. ఎప్పుడు వస్తారట

అక్షిత : కబురు చెయ్యనా

చిన్నా : చెయ్యి.. అక్షిత సంతోషంగా ఫోన్ అందుకుని పరిగెత్తింది.

లావణ్య : చిన్నా.. నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేసావా

చిన్నా : నాకంత టైం ఉందా

లావణ్య : శృతితో..

చిన్నా : లేదు

అక్షిత నవ్వుతూ వచ్చింది..

అక్షిత : ఇవ్వాళ వస్తారట.. చిన్నా..

చిన్నా : హా..

అక్షిత : నువ్వు శృతి కూడా మాట్లాడేసుకుంటే ఒక పని అయిపోద్ది.. ముగ్గురం ఒకేసారి పెళ్లి చేసుకోవచ్చు

చిన్నా : నేను శృతి పెళ్లి చేసుకుంటామని నీకు ఎవరు చెప్పారు

అక్షిత : అదేంటి మీరిద్దరూ చేతుల్లో చెయ్యేసుకుని తిరగడం ఎన్ని సార్లు చూడలేదు

చిన్నా : అయితే.. తను నన్ను పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావ్

లావణ్య : ఏ.. నీకేం తక్కువ

చిన్నా : మొన్న మీరిద్దరూ మీ స్నేహితులకి నన్ను మెకానిక్ గా పరిచయం చెయ్యడానికే చాలా ఇబ్బంది పడ్డారు.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మీకే అలా అనిపించినప్పుడు.. మీ ఇద్దరి కంటే తను ఎక్కువ సంపాదిస్తుంది, పెద్ద ఉద్యోగం.. ఆస్తిలో కులంలో మనకంటే చాలా.. చాలా రెట్లు ఎక్కువ స్థాయిలో ఉంది. తను నన్ను పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నారు మీరు..?

ఇద్దరు తలలు కిందకి వేసుకున్నారు, లావణ్య తల ఎత్తి ఏదో మాట్లాడబోయింది.

చిన్నా : ముందు ఆంటీ వాళ్ళకి చెపుదాం రండి అని బైటికి నడిచి శృతి వాళ్ళ ఇంటికి వెళ్లాను.. ఆంటీ ఉన్నారా

ఆంటీ : ఏం బాబు శృతి కోసమా.. రెడీ అవుతుంది కూర్చో

చిన్నా : లేదాంటీ.. అక్షితనీ లావణ్యని చూసుకోవడానికి వస్తున్నారు.. పెళ్లి ఖాయమే.. ప్రేమించుకున్నారట.. ఇద్దరు అన్నదమ్ములేనట.. ఇవ్వాళ చూసుకోవడానికి వస్తామన్నారు.. మీకోసం వచ్చాను

ఆంటీ : అలాగా.. వస్తాను.. ఒక అరగంట అయితే ఈ పని అయిపోతుంది.. అంకుల్ ని కూడా ఉండమని చెపుతాను.. చిన్న పిల్లాడివి నువ్వు అన్ని మాట్లాడలేవు.

చిన్నా : చాలా థాంక్స్ ఆంటీ.. నేను అదే అడుగుదామని వచ్చాను.. మీరే వస్తామన్నారు

ఆంటీ : మరేం పరవాలేదు

శృతి లోపల నుంచి హాల్లోకి వచ్చింది.

ఆంటీ : ఏమే.. అక్షిత లావణ్యని చూసు...

శృతి : వినపడింది.. ఇంకోసారి రిపీట్ చెయ్యకు అంటూనే నా వంక కోపంగా చూస్తూ కిచెన్ లోకి వెళ్లి మళ్ళి బైటికి వచ్చింది.

ఆంటీ : అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి మనకి తప్ప

శృతి : ఆపు.. నేను ఆఫీస్ కి వెళుతున్నా అని కేక వేస్తూ నన్ను చూసింది.

ఆంటీ : అదేంటే ఉండు ఇవ్వాళ ఒక్కరోజు..

చిన్నా : ఉండు ప్లీజ్.. అన్నాను ఆంటీకి వినపడకుండా

శృతి : ఉంటాలే అని తన అమ్మకి చెప్పి లోపలి వెళ్ళిపోయింది.

నేను అక్కడ నుంచి  బైటికి వచ్చేసి ఇంట్లోకి వెళ్లాను. అక్షిత పిలిచింది.

అక్షిత : ఏమన్నారు ఆంటీ వాళ్ళు

చిన్నా : వస్తామన్నారు.. వాళ్ళు ఎప్పుడు వస్తారట

అక్షిత : మధ్యాహ్నం వస్తామన్నారు.. వాళ్ళకి కూడా తొందరగానే ఉంది పెళ్లి చేసెయ్యాలని.. వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుని చాలా ఏళ్ళు అయిపోయిందట.. అందుకే ఇందాక ఫోన్ చెయ్యగానే వస్తామన్నారు.

లావణ్య : చిన్నా.. నువ్వు వాళ్ళని చూడలేదుగా ఇదిగో అని ఫోన్ ఇచ్చింది.

చూసాను, ఇద్దరు హీరోల్లా ఉన్నారు.. వాళ్ళని చూడగానే నా పొట్టని కొంచెం లోపలికి అనుకువాలనిపించింది. బాగున్నారని తిరిగి ఫోన్ తన చేతికిచ్చేసాను.

అక్షిత : చిన్నా.. నువ్వు దుబాయి నుంచి పంపించిన డబ్బులన్నీ నా దెగ్గరే ఉన్నాయి.. నీకు పంపించెయ్యనా..

శృతి : ఏంటప్పుడే పంపకాలు కూడా చేసుకుంటున్నారా.. మీ స్పీడ్ చూస్తుంటే పెళ్లయ్యాక మళ్ళీ మా మొహాలు కూడా చూసేలా లేరే..

అక్షిత : అదీ.. ఖర్చులు ఉంటాయిగా.. ఊరికే నన్నేం అడుగుతాడని.. కూర్చో శృతి..

శృతి : కంగ్రాట్స్ అని ఇద్దరికీ చెయ్యిచ్చింది.. రేయి అమ్మ నిన్ను రమ్మంటుంది.. ఏవో తేవాలట వెళ్ళు

చిన్నా : వెళుతున్నా అని లేచాను..

శృతి : రోజు మెట్లెక్కి తెగ ముచ్చట్లు ఫోన్లో.. అప్పుడే అనుకున్నాం.. నేను చిన్నా

లావణ్య : చిన్నాకి ముందే తెలుసా

శృతి : ఎవరికైనా తెలుస్తుంది.. అందులో ఆశ్చర్యం ఏముంది.. ఒక్క అక్షిత విషయంలోనే అస్సలు ఎక్సపెక్ట్ చెయ్యలేదు.. చాలా సైలెంట్ గా ఉండేది.

అక్షిత : ముందు లవ్ చేసింది నేనే.. రోజు కలుస్తుంటే వాళ్ళ తమ్ముడు ఇది కూడా కనెక్ట్ అయ్యారు.

శృతి : పోనీలే.. మంచిదేగా.. మీ స్నేహం విడిపోకుండా ఒకే ఇంటికి చేరుతున్నారు.

లావణ్య : అవును.. చిన్నా గాడొక్కడే బాలన్స్.. వాడి పెళ్లి కూడా అయిపోతే..

శృతి : చూడండి మీరే మంచి లో క్లాస్ అమ్మాయిని.. అందంగా లేకపోయినా పరవాలేదు కానీ కొంచెం కృతజ్ఞత ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది.. అంటే వాడు ఎప్పుడు ఇంట్లో ఉండడు కదా.. ఇంటి పట్టున ఉంటూ వాడిని చూసుకునే అమ్మాయి కావాలి.

అక్షిత ఫోన్ రింగ్ అయ్యింది, స్క్రీన్ మీద లవ్ అని చూడగానే శృతికి కోపం వచ్చేసింది.. అక్షిత తన మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే కనిపించకుండా పిడికిలి బిగించి మళ్ళీ నాకెందుకు అన్నట్టుగా కూర్చుంది.

లావణ్య : శృతీ.. నీ మనసులో ఏమైనా ఉందా.. నీకు నచ్చకుండా ఏమైనా జరుగుతుందా.. ఎందుకు అలా మాట్లాడావ్

శృతి : నిన్న నాకు చిన్నాకి చిన్న గొడవ అయ్యిందిలే.. ఇందాక మళ్ళీ గెలికాడు.. పొద్దున్నే నాకు నచ్చని వార్త ఒకటి చెప్పి ఆటపట్టించేసరికి కొంచెం కోపం వచ్చింది.. మీ సంగతి చెప్పు.. పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు.

లావణ్య : ఈ నెలలో పెళ్లి అయిపోవాలని, మేము నలుగురం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం శృతి.. అనుకున్నట్టే వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒప్పుకున్నారు. కానీ ఈ అక్షితే.. చిన్నాకి ఇప్పుడే చెప్పొద్దని నన్ను ఆపేసింది.. పొద్దున నేను సడన్ గా చెప్పేసరికి వాడి మొహం మాడిపోయింది.. బాధ పడ్డాడేమో.. చాలా డల్ అయిపోయాడు.. పైకి అలా లేడు కానీ నాకు తెలుస్తుంది.

శృతి : వాడికివన్ని మామూలేలే.. ఏదైనా పని ఉందా.. ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు.. మీ కోసం నన్ను వాడు ఇవ్వాళ ఆఫీస్ కి కూడా వెళ్ళనివ్వలేదు.

లావణ్య : మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు

శృతి : అవును వాడు చాలా మంచి ఫ్రెండ్, దాని అర్ధం మనం అని కాదు..

లావణ్య : అంటే..

శృతి : నువ్వే చెప్పావు కదా.. మిమ్మల్ని కాపాడాడు.. మీ కోసం కష్టాలు పడ్డాడు.. మీ కోసం దేశం కానీ దేశం వెళ్లి అక్కడ ఎన్ని పాట్లు పడ్డాడో నాకు చెపుతుంటే ఏడుపు వచ్చింది.. కానీ మీరు కనీసం మీ ప్రేమ విషయం కూడా వాడికి ఏదో బైట వాళ్లకి చెప్పినట్టు అంతా అయిపోయి మీకు మీరు సెట్ చేసుకున్నాక చెప్పారు.. ఇందాక అందుకే అలా మాట్లాడాను.

లావణ్య : అవును.. నేను వాడికి సారీ చెప్పాలి

శృతి : ఏం కాదులే.. నేను కూడా అంతే కొంచెం సెల్ఫిష్ వాడికి అది నచ్చదు అయినా కూడా నాతో స్నేహం చెయ్యట్లేదు.. పదా రెడీ అవ్వండి.. నేనొక సారి ఇంటికెళ్లి వస్తా అని లేచింది.. వెనక చిన్నా అక్కడే నిలుచుని శృతి వంక కోపంగా చూసేసరికి అక్కడినుంచి జారుకుంది.

లావణ్య : చిన్నా.. సారీ రా

చిన్నా : ఎవరో ఏదో వాగారని నువ్వెందుకు బాధ పడుతున్నావ్.. ఇన్ని రోజులు నాకు ఒక టెన్షన్ ఉండేది, రేపు నీకు పెళ్లయ్యాక ఎలా ఉంటావో ఏంటో అని.. కానీ ఇప్పుడు ఆ గొడవే లేదు.. ఆ రాక్షసి ఉందిగా.. అంతా అది చూసుకుంటుంది..

అక్షిత : ఎవరినిరా.. రాక్షసి అని తిడుతున్నావ్

చిన్నా : ఒకటి ఉందిలే.. మాకు తెలిసిన దయ్యం.. కద లావణ్య

లావణ్య నవ్వుతూ అవును అంది

అక్షిత : నన్నే మీరు అనేది..

చిన్నా : అవును నిన్నే అనేది.. అన్ని చెప్పకుండా సెట్ చేసుకున్నావ్ గా.. మళ్ళీ మాతో ఏం పని నీకు అని తల మీద ఒక్కటి మొట్టాను.

అక్షిత మౌనంగా నా పక్కన కూర్చుని తల నా భుజం మీద పెట్టుకుంది..

చిన్నా : సరదాగా అన్నానే

అక్షిత : లేదురా.. నువ్వు మా కోసం ఎంతో చేసావ్.. నీకు మానుంచి భారం కాదలుచుకోలేదు.. మా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదని అని ఇంటి విషయం ఈ విషయం నేనే చూసుకోవాలనుకున్నాను.. అంతే కానీ నిన్ను తక్కువ చెయ్యాలని కాదు.. ఆ రోజు మా ఫ్రెండ్స్ ముందు కూడా నేను ఇబ్బంది పడింది వాళ్ళు నిన్నెక్కడ చులకనగా చూస్తారేమో అని.. అంతే కానీ నువ్వంటే కాదు.. నా చేతులు పట్టుకుని.. ఈ చేతుల వల్లే కదరా మేము ఇలా ఉంది.. లేకపోతే మా జీవితాలు తలుచుకుంటేనే నాకు నిద్ర పట్టదు.. కలలు కూడా వస్తాయి.. నాకు ఏ ఆపద వచ్చినా ఆ రోజు నువ్వు వచేస్తావ్.

చిన్నా : ఆమ్మో.. ఎమోషనల్ డామేజి.. ఇక్కడే ఉంటే సీరియల్ చూపించేలా ఉన్నారు. అని నవ్వుతూ లేచి బైటికి పరిగెత్తాను నా ఏడుపుని బిగపట్టుకుని..
Like Reply
#13
•13•

నేను శృతి అక్షిత లావణ్య.. వాళ్ళు వచ్చేసరికి నలుగురం కలిసి ఇల్లు సర్ధేసాం. శృతి వాళ్ళ అమ్మ వచ్చి మాకు కొన్ని జాగ్రత్తలు చెప్పింది.. ఎలాగో ఖాయం అనుకున్నారు కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదంది. వాళ్ళు రావడం ఇల్లు చూసుకోవడం కూర్చోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. అక్షిత ఆ ఇద్దరు అన్నదమ్ములని పరిచయం చేసింది. కొంచెంసేపు మాట్లాడారు మంచివారని అర్ధమైంది. వాళ్ళ అమ్మా నాన్న నాతో చాలా సేపు మాట్లాడారు.

అక్షిత లావణ్య వాళ్ళ కాబోయే వాళ్ళతో కలిసి బైట ముచ్చట్లు పెడుతుంటే శృతి మాత్రం నా పక్కనే కూర్చుంది, నా చెయ్యి పట్టుకుని తను అందరితో మాట్లాడుతుంటే ఒక్క క్షణం నాకే అనిపించింది శృతి నా భార్య అయిపోయిందా అని.. అంత చనువు తీసుకుని మాట్లాడటం నాకు మాత్రమే కాదు మా ఇద్దరినీ చూస్తున్న శృతి అమ్మ నాన్నలకి కూడా  నచ్చలేదు. మరుక్షణం శృతి నుంచి విడిపడి పక్కకి వచ్చేసాను.

ఇక వచ్చిన వాళ్ళ మాటలని బట్టి వాళ్ళకి ఈ ఇల్లు అక్షిత లావణ్యల పేరు మీద ఉందని తెలుసనిపించింది. వాళ్ళు ఆశపడుతున్నారు.. అడక్కముందే ఇల్లు వాళ్ళ పేరు మీదే ఉంటుందని అది వాళ్ళకేనని మాటిచ్చేసాను. ఆ మాట వల్ల శృతికి ఎంత కోపం వచ్చిందంటే అందరూ వెళ్లిపోయాక నా మీద చెయ్యి కూడా చేసుకోబోయి తన అమ్మా నాన్నని చూసి ఆగిపోయింది.

అక్షిత వాళ్ళు అందరినీ పంపించి లోపలికి వచ్చారు, నేనింకేం మాట్లాడొద్దని శృతికి సైగ చేసాను, కోపంగా వెళ్ళిపోయింది. శృతి వాళ్ళ అమ్మ నన్ను ఒకసారి కోపంగా చూసి వెళ్లిపోతుంటే వెనకే వెళ్లాను.

చిన్నా : ఆంటీ.. ప్రతినిమిషం నేను తలుచుకునే వినాయకుడిమీద ఒట్టు పెట్టి చెపుతున్నా.. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఏ రోజు దేని మీదా ఎవరి మీద ఆశపడలేదు ఒక్కరి కోసం తప్ప అని ఆంటీ చెయ్యి పట్టుకుని అక్షిత వంక చూపించాను.. ఆంటీ ఆశ్చర్యంగా చూసింది.. మీరు అనుకున్నట్టుగా ఏమి లేదాంటి.. శృతి నా స్నేహితురాలు అంతే అని తన చెయ్యి వదిలేసాను.


ఆంటీ : మరెందుకు దెగ్గరుండి పెళ్లి చేస్తున్నావ్

చిన్నా : నేను తప్ప వాళ్ళకి ఇంకెవ్వరున్నారాంటి.. పైగా వాళ్ల మనసుకి నచ్చిన వాళ్ళతో పెళ్లి అనుకుంటుంటే.. ఎలా.. అందరినీ బాధపెట్టేకంటే నేనొక్కడినే బాధపడితే మేలే కదా.. కొన్ని రోజులు ఆగితే నేను కూడా మాములు అయిపోతాను.

ఆంటీ : ఇదంతా శృతికి తెలుసా

చిన్నా : తెలుసు

ఆంటీ : అంటే అన్ని తెలిసి కూడా నిన్ను ఇష్టపడుతుందా

చిన్నా : ఆంటీ..

ఆంటీ : శృతి నీ గురించి నిన్న రాత్రే మొత్తం చెప్పింది కానీ కేవలం తను నిన్ను ప్రేమిస్తుందని మాత్రమే చెప్పింది. అక్షిత విషయం నాకు చెప్పలేదు.

చిన్నా : వీళ్ళ పెళ్ళైయ్యేవరకు ఓపిక పట్టండి ఆంటీ.. ఈ ఒక్క సాయం చెయ్యండి.. మళ్ళీ నేను మీకు కనిపించను..

ఆంటీ : ఒప్పుకుంటున్నాను. అని వెళ్ళిపోయింది.

ఆ తరవాత రోజుల్లో కూడా శృతి నాతో చనువుగానే ఉండేది, శృతి వాళ్ళ అమ్మ తనతో మేము మాట్లాడుకున్న సంగతి చెప్పలేదని నాకు అర్ధమయ్యింది. నేను అలానే మౌనంగా ఉండిపోయాను.

పది రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అక్షిత వేలుకి పట్టకపోయినా ఉంగరం బలవంతంగా ఎక్కిస్తుంటే దాని మొహంలో నొప్పి చూసి నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు.. నేనేమి ఏడవదలుచుకోలేదు.. నాకు అక్షిత దక్కలేదంతే.. నేను దాన్ని ఒప్పుకున్నాను.. కొంత బాధగా ఉంది అంతే.. నరకంలా ఉంది అంతే..

ఆ రోజు నుంచి అక్షిత లావణ్యల కోసం అన్నదమ్ములు తరచూ ఇంటికి వచ్చేవారు.. వాళ్ల సరదాలు సరసాలు నన్ను చాలా ఇబ్బందులకి గురిచేసేవి. కాబోయే వాళ్ళు కొంచెం అతి చెయ్యడం మామూలే.. ఎక్కువ కాలం షెడ్ లోనే గడపాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు నలుగురు నా షెడ్ కి వచ్చారు.

అక్షిత : అరేయి బైటికి వెళదాం పదా

చిన్నా : పనుంది అమ్మడూ.. కష్టం

లావణ్య : ఎప్పుడు ఉండేదేకదా పదరా వెళదాం

చిన్నా : లేదు లావణ్య.. ఎట్టి పరిస్థితులో రేపు హ్యాండ్ ఓవర్ చేస్తానని మాటిచ్చాను.. మీరు కానివ్వండి.. మళ్ళీ ఎప్పుడైనా వెళదాం

అక్షిత : రావా.. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నీ కోసం

చిన్నా : ఉహు.. కష్టం అని చెప్పి వాళ్ళని కూడా పలకరించి పంపించేసాను.. పావుగంటకి శృతి వచ్చి కూర్చుంది. చెప్పవే ఏంటి సంగతులు

శృతి : సినిమాకి వెళదాం, నువ్వు చూడబోయే మొదటి సినిమా నాతోటే

చిన్నా : కష్టం

శృతి : నేను నిన్ను వస్తావా అని అడగలేదే

చిన్నా : మరి

శృతి : వచ్చి తీరాలంతే.. పొద్దునే బుక్ చేసేసా టికెట్స్

చిన్నా : ఓవర్ చెయ్యకు

శృతి : నా ప్రేమని ఎలానో కాదన్నావ్.. కనీసం నా కోరికలైనా తీర్చు.. నీతో కొన్ని జ్ఞాపకాలు నాకు కావాలి

షటర్ మూసేసాను.. ఇద్దరం సినిమాకి వెళ్ళాము.. సోఫా బుక్ చేసింది. వెళ్లి కూర్చున్నాం. సినిమా మొదలయ్యింది.. మొదటిసారి అంత పెద్ద తెర.. అలా చూస్తూ ఉండిపోయాను.. ఈలలతో కేకలతో హడావిడిగా మొదలయ్యింది. సినిమా మొదలయిన పావుగంటలోనే శృతి నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది.

చిన్నా : ఏంటే..

శృతి : నువ్వు చూడు.. అని కళ్ళు మూసుకుంది.

ఇంటర్వెల్లో లైట్లు వేశారు.. నా ఒళ్ళో గాఢంగా నిద్రపోతున్న శృతిని చూసి తల ఎత్తాను.. నా ఎదురుగా అక్షిత లావణ్య ఇద్దరు కాబోయే వాళ్ళు.. అక్షిత అయితే చేతులు కట్టుకుని కోపంగా చూస్తుంటే నవ్వొచ్చింది.

అక్షిత : హ్యాండ్ ఓవర్, మాటిచ్చా.. కష్టం.. అన్నావ్.. ఇదేనా తమరి కమిట్మెంట్.. మేమింకా నువ్వేదో తెగ కష్టపడిపోతున్నావ్ అనుకున్నాం.

లావణ్య : దొంగవి రా.. నువ్వు

ఏంటి బ్రో ఇలా దొరికేసావ్..

వదిలెయ్యండి ప్లీజ్ అని చేతులు ఎత్తాను దణ్ణం పెడుతూ.. అక్షిత నా పక్కన కూర్చుంది.. లావణ్య మిగతా వాళ్ళు వెళ్లి వాళ్ల సీట్లో కూర్చున్నారు.

అక్షిత : ఇక్కడిదాకొచ్చి కార్నర్ సీట్లో నిద్రపోతుంది.. ఏమైనా చెప్తావా లేదా

చిన్నా : ఏం లేదు.. కానీ చాలా మంచి అమ్మాయి ఈ అమ్మాయి

అక్షిత : అది తెలుసులే.. కానీ మరి ఇలా చిన్నపిల్లలా నీ చెయ్యి పట్టుకుని నీ ఒళ్ళో పడుకుంది.. ఒకప్పుడు నేను కూడా ఇలానే పడుకునేదాన్ని కదా

చిన్నా : నీ కోసం చూస్తున్నాడు వెళ్ళు

అక్షిత నా భుజం మీద కొడుతూ లేచి వెళ్ళిపోయింది. ఆ తరువాత శృతి నా ఒళ్ళో పడుకుందనే కానీ నా చూపు మొత్తం అక్షిత మీదె ఉంది, అది నాది కాదని తెలుసు కానీ జీర్ణించుకోవడానికి నా మనసు అంగీకరించట్లేదు. ఆ అబ్బాయి అక్షితని ముద్దు పెట్టుకుంటూ మీద చెయ్యి వేసినప్పుడల్లా నన్నెవరో ముందు నుంచే గుండెలో తూట్లు పొడుస్తున్నంత బాధ. సినిమా అయిపోయింది అక్షిత లేచి నాకోసం వెనక్కి చూసింది. వెంటనే తల కిందకి దించి శృతిని లేపాను.

శృతి : అయిపోయిందా.. అని కళ్ళు తుడుచుకుంటూ లేచింది

చిన్నా : అయిపోయింది.. ఇంక లెగు

శృతి : ఎందుకంత కోపం.. సినిమా చూడమని తీసుకొచ్చాను అక్షితని చూడమని కాదు

చిన్నా : లేచే ఉన్నావా

శృతి : మొత్తం చూసా.. అస్సలు ఏడవ్వేంట్రా నువ్వు

చిన్నా : అవన్నీ నా వల్ల కానీ పనుల్లే.. పద వెళదాం

ఆ రోజు నుంచి శృతి నాతో తెగ తిరిగేది, వాళ్ళ అమ్మగారు అన్ని గమనిస్తున్నా ఊరుకుంది. పెళ్లి పనులన్నిటికీ నేను శృతినే వెళ్ళేవాళ్ళం. ఇంకా పెళ్ళికి వారం ఉందనగా శృతి వాళ్ళ అమ్మ షాపింగ్ కోసమని వాళ్ళ సొంతూరు కంచికి వెళదాం అంది. ఆంటీ అంకుల్ అక్షితని లావణ్యని తీసుకుని వెళ్లారు. ఆంటీ శృతిని ఒంటరిగా ఎందుకు వదిలి వెళ్లిందో నాకు అర్ధం కాలేదు. ఆ రోజు రాత్రి నేనూ శృతి బైటే తిన్నాం.

ఇంటికి వచ్చాక నా పక్కన పడుకుని నా మీద కాలేసింది.. తల నా గుండె మీద పెట్టింది. నన్ను గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుంది.
Like Reply
#14
•14•


చిన్నా : శృతీ..

శృతి : హ్మ్మ్..

చిన్నా : మీ అమ్మగారు నీతో మాట్లాడారా

శృతి : కనుక్కున్నావే

చిన్నా : చెప్పు

శృతి : గట్టిగా అడిగింది, నువ్వంటే ఇష్టమని చెప్పా.. ఏమనలేదు.. నా ప్రేమని గౌరవిస్తానంది కానీ ఒప్పుకోనని చెప్పింది.. మా స్టేటస్ పడిపోద్ధట.. ఈ రెండు రోజులు నీతో గడుపుతానని అడిగాను.. దానికి ఒప్పుకుంది

చిన్నా : అలా ఎలా ఒప్పుకుంది.. ఆంటీ...

శృతి : నువ్వంటే మా అమ్మకి చాలా గౌరవం రా.. ఇంట్లో మా వాళ్ళు ఒప్పుకోరని తనకి తెలుసు.. అందుకే కుదరదని ముందుగా తనే చెప్పింది. నేనూ ఓకే అన్నాను.. నువ్వెలాగో నన్ను కాదన్నావ్ కదా అని నా కళ్ళలోకి చూసింది మొహం పక్కకి తిప్పాను.

నేనేమి మాట్లాడలేదు, రాత్రంతా నా మీద పడుకుని గడ్డంతో గుచ్చుతూ ఎన్నో మాటలు చెప్పింది, రెండు కధలు కూడా చెప్పింది. పడుకోబెట్టాను. తెల్లారి మళ్ళీ నన్ను షెడ్డుకి కూడా వెళ్లనివ్వలేదు రోజంతా కలిసి తిప్పింది, నాతో అన్నం తినిపించుకుంది, ఆటలు ఆడింది పాటలు పాడింది అలానే సమయం గడిచి చీకటి పడింది. అక్షిత వాళ్ళు ఇంకో గంటలో వచ్చేస్తాం అని ఫోన్ చేశారు.

శృతి : చిన్నా.. నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా

చిన్నా : నేనిప్పుడు ఎవ్వరిని ప్రేమించే స్థితిలో లేనే.. అర్ధం చేసుకో.. నీ లాంటి అమ్మాయి చెయ్యి పట్టుకోవాలంటే పెట్టి పుట్టాలి.. నాకు ఆ అదృష్టం కూడా లేదు.. నీకు చాలా మంచివాడు దొరుకుతాడు.

శృతి : లేదు దొరకడు.. నీకు నా గురించి తెలీదు.. నువ్వు కాకపోతే నా పక్కన ఇంకెవ్వరు ఉండరు.. నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో.. ఎక్కడికైనా పో.. నాకు అనవసరం.. కానీ నీ కోసం చచ్చేదాకా ఎదురుచూస్తాను. ప్రేమలో నువ్వు పడ్డంత బాధ నన్ను పెట్టవనే అనుకుంటున్నాను అని లేచి ఇంటికి పరిగెత్తింది..

రోజులు చాలా వేగంగా చాలా సంతోషంగా గడుస్తున్నాయి అందరికీ.. ఒక రోజు పూజ చేస్తుంటే అక్షిత మరియు లావణ్య అమ్మ ఫోటోకి గణేష్ కి దణ్ణం పెట్టుకుంటుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది.. అస్సలు నేను గణేష్ ని అమ్మని తలుచుకునే చాలా రోజులు అయిపోయింది.. ఎందుకో నా జీవితంలో మొదటిసారి గణేష్ వంక చూడలేదు, ఆయన కోసం నేను చేతులు ఎత్తలేదు.. చివరిగా మాత్రం ఒకసారి ఆయన వంక చూసి కనీసం వాళ్ళని సంతోషంగా ఉండేలా అన్నా దీవించు అని ఒక వార్నింగ్ ఇచ్చి బైటికి వచ్చేసాను.

చూస్తుండగానే పెళ్లి రోజు వచ్చేసింది, రెండు రోజుల నుంచి పనుల వల్ల అస్సలు తీరిక లేకుండా పోయింది.. ఆంటీ తనకి తెలిసిన స్నేహితులు చుట్టాలని తీసుకొచ్చి ఎంతో సాయం చేసింది.. తనకి కృతజ్ఞత చూపించడానికి నా దెగ్గర ఏమి లేవు.. నేను తనకి ఇచ్చిన మాట తప్ప.

అక్షిత మెడలో తాళి పడింది, అక్షింతలు కూడా మనస్ఫూర్తిగా వేసాను.. లావణ్య అక్షిత ఈ ఇద్దరు నా నుంచి విడదీయలేని బంధం మా ముగ్గురిది అనుకునేవాడిని ఒకప్పుడు.. సాయంత్రానికి అప్పగింతలు అయిపోయాయి.. వెళ్లిపోయారు.. లావణ్య ఏడవబోతే అక్షిత పక్కనేనే ఏదో పక్క గ్రహానికి వెళ్లిపోయినట్టు ఏడుస్తున్నావ్ అనేసరికి అందరం నవ్వుకున్నాం.. మండపం నుంచి ఇంటికి వచ్చాను.. ఒక్కసారి ఇంట్లోకి వెళ్లాను.. ఇల్లంతా చిందరవందర.. లోపల అమ్మ ఫోటో లేదు.. అక్షిత తీసుకెళ్లిపోయి ఉంటుంది.. ఈ మధ్య దేవుడి కంటే అమ్మతోనే ఎక్కువ మాట్లాడుతుంది అది.. అమ్మ పాస్పోర్ట్ ఫోటో అక్కడే ఉంది గణేషుడి బొమ్మ కూడా ఉంది.. ఎందుకో ముట్టుకోవడానికి చెయ్యి రాలేదు.. ఇంటి నుంచి బైటికి వచ్చాను. శృతి వాళ్ళ అమ్మ కనిపించింది. తన దెగ్గరికి వెళ్లి చేతులెత్తి మొక్కాను..

ఆంటీ : ఇదంతా నీకోసం చేసాను.. నా కూతురి మనసు గెలిచిన వాడివి.. చాలా మంచివాడివి.. నీకంతా మంచే జరగాలి

చిన్నా : శృతి ఎక్కడ ఆంటీ

ఆంటీ : వాళ్ళ నాన్నతో వస్తుంది.. తరువాత అందరం కలిసి పెళ్లి ఇంటికి వెళదాం

చిన్నా : నేనలా బైటికి వెళ్ళొస్తాను అని నడుచుకుంటూ వచ్చేసాను..

ఏవేవో ఆలోచనలు.. ఒంటరిగా మిగిలిపోయానన్న బాధ.. ఎక్కడికి నడుచుకుంటూ వెళుతున్నానో కూడా తెలీకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.. రైలు పట్టాలు వచ్చాయి..  ఎక్కి నడుస్తున్నా.. దాదాపు సాయంత్రం కావొస్తుంది.. నడిచి నడిచి కాళ్లు పీక్కుపోయాయి.. వెనక్కి తిరిగి చూస్తే హైదరాబాద్ దాటి చాలా దూరం వచ్చేసానేమో అనిపించింది.. ఇంకొక్క అడుగు వేసినా అరికాళ్ళు మంటకి కాలిపోతాయేమో అనిపించింది.. అక్కడే కూర్చున్నాను. ఎంతసేపు కూర్చున్నానో తెలీదు.. చెమట ఆగకుండా కారుతూనే ఉంది.. దూరం నుంచి ట్రైన్ కూత వినపడగానే లేచి నిలుచున్నాను కానీ ఏమైందో ఏమో నాకే తెలియట్లేదు మళ్ళీ కూర్చున్నాను.. ట్రైన్ చాలా వేగంగా వస్తుంది ఇంకో పది క్షణాల్లో మా అమ్మ దెగ్గరికి పోతాననగా వెనక నుంచి ఒక గొంతు చిన్నా అని గట్టిగా కేక వినిపించింది.. అవును అది మా అమ్మ గొంతు.. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాను

చిన్నా : అమ్మా

మధు : హా.. నేనే.. ముందు అక్కడ నుంచి లే.. సస్తావ్

ఒక్క క్షణంలో పక్కకి దూకేసాను.. లేచి చూసుకున్నాను.. దెబ్బలేమి తగల్లేదు.. ట్రైన్ వెళ్ళిపోయింది.. అటు వైపు అమ్మ అక్కడే నిలుచొని ఉంది.

చిన్నా : అమ్మా

మధు : అమ్మనే

చిన్నా : నా కోసం మళ్ళీ పుట్టావా.. నీకు గతం గుర్తుకొచ్చిందా.. నాకోసం వెతుక్కుంటూ వచ్చావా.. నేనిక్కడున్నానని ఎవరు చెప్పారు.

మధు : నువ్వేం మారలేదు రా.. నేనేమి మళ్ళీ పుట్టలేదు

చిన్నా : మరి ఆత్మవా.. ముందంతా కనిపించకుండా నాతోనే ఉన్నావా.. ఇప్పుడు నన్ను కాపాడుకోవడానికి నాకు కనిపించావా

మధు : హమ్మో అని నవ్వుతూ తల కొట్టుకుని... నేను ఆత్మని కూడా కాదు

చిన్నా : మరి.. నాకు పిచ్చి పట్టిందా.. ఏది నిన్ను ముట్టుకోనివ్వు.. అని చెయ్యి ముందుకు చాపాను.. ఏమి లేదు గాలి..

మధు : పిచ్చి కాదు రా.. నీలో ఉన్న బాధ నీ మనసు తట్టుకుంది కానీ నీ మెదడు తట్టుకోలేకపోయింది.. అందరికంటే నేనే నీకు ఎక్కువ ఇష్టం కదా, అందుకే నేను బైటికి వచ్చాను.. దీన్ని ఏమంటారంటే.. దీన్ని.. దీన్ని.. చిన్నా నీకు పిచ్చి పట్టింది.
Like Reply
#15
•15•

చిన్నా : పోనీలే.. ఒంటరిగా మిగిలిపోయానేమో అనుకున్నాను

మధు : అస్సలు భయం లేదురా నీకు

చిన్నా : అవన్నీ నీతో పాటే తీసుకుపోయావ్.. కానీ అమ్మా నిన్ను చూస్తుంటే ఏడుపు తన్నుకోస్తుంది.. కానీ నువ్వు నా అమ్మవి కాదు.. కానీ అచ్చు అలానే ఉన్నావ్

మధు : నువ్వు ఎలా ఊహించుకుంటే అలా ఉంటాను.. అక్షిత గురించి ఏమైనా చెప్తావా

చిన్నా : నా బుర్ర బద్దలు కొట్టుకుని వచ్చానన్నావ్.. నీకన్నీ తెలుసు కదా

మధు : తప్పు నీదే

చిన్నా : నాకు తెలుసు.. ఇంక ఆపేయి

మధు : ఇప్పుడేం చేద్దామని

చిన్నా : ఆకలేస్తుంది అని లేచాను.. నా వెనకాలే నడుస్తుంది

మధు : నన్నేమి అడగవా

చిన్నా : నేను రోజూ మా అమ్మతో మాట్లాడతాను, నువ్వు నా ఆలోచనవే కదా.. అంతగా ఆశ్చర్యపొనవసరం లేదు. ఇలాంటి షాకులు నా జీవితంలో చాలా ఎదురుకున్నాను ఇది కొత్తది అంతే..

మధు : అయితే నేను నీ అమ్మని కాదంటావా, నా గొంతు తనది కాదంటావా.. నువ్వు చూస్తున్నది నిజం కాదంటావా

చిన్నా : ఇప్పటికే తల పగిలిపోతుంది.. అవునన్నా కాదన్నా నువ్వు నా అమ్మవే.. సరేనా.. కొంచెం మెలకుండా ఉండు.

మధు : అయితే సరే.. ఇంకొకటి..

చిన్నా : మళ్ళీ ఏంటి.. అసహనంగా వెనక్కి తిరిగాను

మధు : అక్కడ భోజనాలు పెడుతున్నారు.. ఇవ్వాళ హనుమాన్ జయంతి

చిన్నా : ఆకలేస్తుంది

మధు : ఇంకోటి

చిన్నా : వినపడుతుంది..

మధు : వినాయకుడికి ఆంజనేయుడికి చుట్టరికం ఉందనుకుంటా

చిన్నా : చాలా దూరపు చుట్టంలే.. అయినా ఆ గణేష్ మీద నాకేం కోపం లేదు.. అలా అని ప్రేమ భక్తి కూడా లేవు అంటూనే నడుచుకుంటూ వెళ్లి అన్నం పెట్టించుకుని తినేసి పక్కనే మూసి ఉన్న బడ్డీ కొట్టులో బండ మీద పడుకున్నాను.

మధు : ఇక్కడ పడుకుంటావా

చిన్నా : ఇంతకంటే మురికి స్థలాల్లో పడుకున్నాను..

మధు : జోక్ చెప్పనా

చిన్నా : నాకు తెలియనివి చెప్పు

మధు : పోరా..

చిన్నా : సరే చెప్పు మా

మధు : భార్య అందట ఏవండీ నేను పాట పాడతాను మీరు తాళం వేయరూ అని.. దానికి ఆ భర్త తన భార్య పాడుతుంటే ఆ రూం గొళ్ళెం పెట్టి తాళం వేసి బయటకి వెళ్లిపోయాడట.. అని నవ్వుతూ తన వంక నిషితంగా చూస్తున్న కొడుకుని చూసి ఏరా అంది..

చిన్నా : ఒకప్పుడు మనం ఇద్దరం నవ్వుకున్న క్షణాలు గుర్తొచ్చాయి.. నువ్వు నిజమైతే ఎంత బాగుండేది అమ్మా.. చాలా నరకం అనుభవించాను నువ్వు లేక..

మధు : పడుకో అని పక్కన కూర్చుని.. కొడుకు మీద చెయ్యి వేసి..

జొ అచ్యుతానంద జోజొ ముకుందా..
రావె పరమానంద రామ గోవిందా జో జో.. అంటూ పాట అందుకుంది..

సరిగ్గా చిన్నా నిద్రపోయేసమయానికి చిన్నా మెదడు నుంచు పుట్టుకొచ్చిన తన అమ్మ మధు.. ఒక బ్రేక్ తీసుకో చిన్నోడా అంటూ.. చిన్నా నిద్రలోకి జారుకోగానే మాయం అయిపోయింది. మళ్ళీ చిన్నా మెలుకుంటే కానీ తన అమ్మ మధుమతి ప్రత్యక్షమవదు.
Like Reply
#16
A
SHORT
B•R•E•A•K
[+] 9 users Like Pallaki's post
Like Reply
#17
•16•

శృతి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పెళ్లింటికి వెళ్లి అక్షితకి లావణ్యకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసి వాళ్ళతో మాట్లాడి అందరికీ చెప్పేసి ఇంటికి బైలుదేరారు. దంపతులు ఇద్దరు ఎత్తుకున్న బాధ్యతని సమర్ధవంతంగా పూర్తి చేశామని కారులో కూర్చుని ఊపిరి పీల్చుకున్నారు.


అంకుల్ : అవును ఆ అబ్బాయి అస్సలు కనిపించనేలేదు

ఆంటీ : అదేనండి నేనూ అనుకుంటున్నాను, బహుశా బాదపడుతుండుంటాడు.. పాపం ఆ అబ్బాయి అక్షితని ఎంతగానో ప్రేమించాడు. ఆ అమ్మాయికి అది తెలియనేలేదు.. చిన్నప్పటి నుంచి కోరుకున్న అమ్మాయి దక్కాకపోతే ఎంత బాధ.. అందులోనూ ఆ అబ్బాయి అదేమి కనిపించకుండా మనస్ఫూర్తిగా పెళ్లి చేశాడు.. ప్రేమంటే ఇవ్వడమే కానీ తిరిగి ఆశించకూడదని తన పనులతో చెప్పకనే చెప్పాడు. ఎంత నిజాయితీ..

అంకుల్ : మరి శృతి విషయం.. మొన్నే ఎంగేజ్మెంట్ రోజే అడుగుదాం అనుకున్నాను కానీ ఎందుకో అడగలేకపోయాను

ఆంటీ : ఏవండీ.. అని తలని తన భర్త గుండె మీద పెట్టుకుని.. ఆ అబ్బాయికి మన శృతిని ఇచ్చి చేద్దామండీ.. చాలా మంచివాడు, కష్టపడతాడు, మన అమ్మాయి మనసుకి నచ్చినవాడు.. ఏ కులమో తెలీనప్పుడు అన్ని కులాలు తనవే కదండి.. కావాలంటే నేను మాట్లాడి మార్పించేస్తాను.. మన అమ్మాయిని అంతగా ప్రేమించేవాడు ఎక్కడా దొరకడు.. మన అమ్మాయిని బాధ పెట్టమాకండి.. ఇన్నేళ్ళ మన కాపురంలో ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమి అడగలేదు.. ఈ ఒక్కటి నా మాట వినండి. శృతి ఆ అబ్బాయిని కోరుకుంటుంది.. దాని ప్రేమని మనమెందుకు కాదనడం

అంకుల్ : ముందు నన్ను ఒకసారి శృతితో మాట్లాడనివ్వు.. ఇక నీ కోరిక నెరవేర్చుతాలే.. ఇంతకీ ఆ అబ్బాయి ఒప్పుకుంటాడా

ఆంటీ : థాంక్యూ థాంక్యూ సో మచ్.. నా కూతురు ఇది వింటే ఎంత సంతోషిస్తుందో.. ఒప్పుకుంటాడు.. తెరుకోవడానికి కొంత సమయం పడుతుంది.. దెగ్గరుండి పెళ్లి చేసినవాళ్ళం.. మనం కోరితే కాదంటాడా.. బలవంతంగా చేసినా ఆ తరువాత వాళ్ళే వాళ్ళ కాపురాన్ని నిలబెట్టుకుంటారు. అంటూ భర్తకి దారిపొడవునా సర్ది చెపుతూ వచ్చింది.

శృతి అమ్మ కారు దిగి ఇంట్లోకి వెళ్లి నేరుగా శృతి రూంలోకి వెళ్ళింది, కానీ అక్కడ శృతి మంచం మీద పడుకుని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే పరిగెత్తి తనని కౌగలించుకుని అడిగింది, ఏమైందంటూ

శృతి : చిన్నా ఫోన్ స్విచ్ ఆఫ్.. ఇల్లు కనీసం తాళం కూడా వెయ్యలేదు.. వాడు వెళ్ళిపోయాడు మా అని ఏడ్చేసింది గట్టిగా తన అమ్మ చేతిని పట్టుకుని.

అప్పటికి కానీ శృతి అమ్మకి గుర్తురాలేదు, చిన్నా తనకి వెళ్లిపోతానని మాట ఇచ్చాడని.. అదే విషయం కూతురికి చెప్పి బాధపడింది, ఆ వెంటనే తమ నిర్ణయం గురించి కూడా చెప్పింది. చిన్నాని వెతికించే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చి అప్పటికి తన కూతురి బాధని కొంత తగ్గించింది.


వారం గడిచింది.. ఇటు అక్షిత లావణ్యల ఇద్దరి కొత్త జీవితం కొత్త కుటుంబం, కలుగుతున్న ఆనందాన్ని సుఖాన్ని ఆస్వాదిస్తున్నారు.. ఇల్లంతా ఆనందంగా ఇద్దరు కోడళ్ల కాలి గజ్జలతో సందడిగా ఉన్నా ఆ ఇద్దరి కొత్త కోడళ్ల మోహంలో మాత్రం నవ్వు లేదు.

చిన్నా మొహం కనిపించక, వాడి నుంచి ఫోన్ రాక వారం గడిచింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నారు కానీ అత్తయ్య ఏమంటుందో అని ఆగిపోయారు. అదే రోజు రాత్రి లావణ్యకి ఫుల్లుగా చలి జ్వరం వచ్చేసింది. రాత్రంతా అక్షిత ఒళ్లోనే ఉంది.. ఒకటే కలవరింపు చిన్నా.. చిన్నా.. చిన్నా..


అక్షిత తెల్లారే కట్టుకున్న చీర కూడా మార్చుకోకుండా లేచి స్కూటీ తీసుకుని షెడ్ కి వెళ్ళింది, అది మూసేసి ఉండటంతో ఇంటికి వెళ్ళింది. గేట్ మూసేసి ఉంది, తలుపుకి తాళం వేసి లేదు పక్క డోర్ తెరిచే ఉండటంతో కోపంగా చిన్నాని కడిగిపారెయ్యాలని లోపలికి వెళ్ళింది. కానీ లోపల ఎవ్వరు లేరు, ఇంటి తలుపులు తెరిచే ఉండటం వల్ల త్వరగా లోపల బూజు పట్టేసింది. టేబుల్ మీద మధు అమ్మ ఫోటో వినాయకుడి బొమ్మ గాలికి పడిపోయి ఉన్నాయి. ఇల్లంతా పరికించి చూసి అనుమానంగా పక్కన శృతి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. శృతి వాళ్ళ అమ్మగారు తలుపు తీసి అక్షితని పలకరించి లోపలికి రమ్మని శృతి రూం చూపించింది.. లోపల శృతి ఏదో పెయింటింగ్ చేసుకుంటుంది. ఎవరో వచ్చారని తల ఎత్తి చూసి అక్షితని చూసి రమ్మని సైగ చేసింది. అక్షిత లోపలికి వస్తూనే చిన్నా.. అని దీర్ఘం తీసింది.

శృతి : చిన్నా మీ పెళ్ళైన తెల్లారి నుంచి కనిపించలేదు అక్షితా.. నేనూ వెతికాను.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్.. ఎటు వెళ్ళాడో తెలీదు. మీకు చెప్పలేదా

అక్షిత : లేదు అంటూనే లేచి నిలబడింది పైట కప్పుకుంటూ

శృతి : నాకు చెప్పకుండా వెళ్లిపోయాడని కోపం వచ్చి నేను మీకు ఫోన్ చెయ్యలేదు.. మీకు తెలుసనుకున్నాను.. ఒకసారి నాతో అన్నట్టు గుర్తుకు.. మీ పెళ్లయ్యాక దుబాయి వెళ్తానని.. నిజంగానే మీకు చెప్పలేదా ?

అక్షిత తల అడ్డంగా ఊపి బైటికి వెళుతూనే నేనొకసారి ఆ ఆఫీస్ కి వెళ్ళొస్తానని చెపుతుంటే శృతి అలాగే అని సైగ చేసింది. అక్షిత ఇంటి నుంచి బైటికి వెళ్ళగానే శృతి మాటలు విన్న తమ అమ్మ లోపలికి వెళ్లి శృతిని అడిగింది. ఇటు బైటికి వచ్చిన అక్షిత స్కూటీ కీస్ లోపలే మర్చిపోవడంతో లోపలికి వెళ్లి శృతి రూం దెగ్గర శృతి అమ్మ మాటలు వినగానే ఆగిపోయింది.

ఎందుకు ఆ పిల్లకి అబద్ధం చెప్పావ్ ?

శృతి : వాళ్ళు బాధ పడకూడదనే కదా.. ఆ పిచ్చోడు వాడి ప్రేమని త్యాగం చేసి అందరికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనకి చెప్పి బాధ పెట్టడం ఎందుకు ?

నాకు ఒకటే అర్ధంకాని విషయం. చిన్నా అక్షితని అంతగా ప్రేమించాడు కదా కనీసం అక్షితకి అనుమానం కూడా రాలేదా, తనకి ఎప్పుడు అనిపించలేదా.. లేదా తెలిసే కావాలని దూరం పెట్టిందా

శృతి : ఎవరికీ తెలుసు.. కానీ అబ్బాయి ఒక అమ్మాయిని అంత పిచ్చిగా ప్రేమిస్తారని వాడిని చూసాకే తెలిసింది. ఒకప్పుడు వాడు దణ్ణం పెట్టుకున్నాడు అక్షిత దక్కాలని, ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా చిన్నా నాకు దక్కాలని.. మా ఇద్దరి కోరికలు తీరావేమో అని ఏడ్చేసింది.

ఇలా ఇంకెన్ని రోజులు.. ఉద్యోగం మానేశావ్.. నీకు ప్రాణం అయిన గ్రాఫిక్స్ వదిలేసావ్.. ఇలా వాడి బొమ్మలు కుప్పలు కుప్పలుగా గీసి ఏం చేద్దామని.. పిచ్చిదానివి అయిపోతున్నావ్ శృతి.. నిన్నిలా చూడలేకపోతున్నాను.

శృతి : నేనేమి ఏడవటం లేదు, బాధ ఉంటుంది కదా.. ఇక జాబ్ విషయానికి వస్తే కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి, ఇదంతా నా ఒక్క దానికేగా. జాబ్ చేయడం నాకు ఇప్పుడు ఇష్టంలేదు..ఇక చిన్నా విషయానికి వస్తే, వాడు నా దెగ్గరికి వచ్చేదాకా ఎదురుచూస్తాను.

వాడు రాకపోతే

శృతి : వస్తాడు.. వచ్చేదాకా నేను చచ్చేదాకా ఎదురుచూస్తాను.. అని మళ్ళి చిన్నాకి తనకి పెళ్లి జరుగుతున్న బొమ్మని గీసే పనిలో పడింది శృతి.

శృతి వాళ్ళ అమ్మకి బైట ఎవరో ఉన్నారనిపించి రూం నుంచి బైటికి వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు.
Like Reply
#18
•17•

అక్షిత నేరుగా ఇంతకముందు చిన్నాని దుబాయికి పంపిన ఆఫీస్ కి వెళ్లి ఎంక్వయిరీ చేసింది కానీ అస్సలు చిన్నా అక్కడికి రాలేదని చెప్పడంతో అక్షితకి ఏడుపు ఆగలేదు.. ఆఫీస్ నుంచి బైటికి వచ్చి రోడ్డు మీద ఎండలో నిలబడింది.. చుట్టూ చూసింది.. ఇంత పెద్ద సిటీలో చిన్నాని ఎలా వెతకాలో అర్ధం కాక అలా నిలబడిపోయింది.. ఆలోచించగా ఇంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అన్న విషయం తట్టగానే వెంటనే కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్లి చిన్నా రూం తెరిచింది.. గోడకి వాడు ఇడిచిన బట్టలు అలానే ఉన్నాయి.. (అక్షితా.. నాకు బట్టలు ఇలా ఉంటేనే ఇష్టం.. మోడరన్ స్టైల్ నా వల్ల కాదు) బట్టలు చూస్తూనే సెల్ఫులు అన్ని వెతికింది. లోపల చివరన కొన్ని పేపర్లు దొరికాయి తెరిచి చూసింది.. అవి శృతి వేసిన పెయింటింగ్స్

మొదటిది మధుమతిది, చిన్నా అమ్మ బొమ్మ చూసి పక్కన పెట్టింది.. రెండోది చూసి కళ్ళనిండా నీళ్లతో మంచం మీద కూర్చుంది. అందులో ఉన్నది తనది చిన్నాల పెయింటింగ్. ఎర్ర చీరలో ఒంటి నిండా బంగారంతో చేతికి ఎర్రని గాజులు, మెడలో పసుపు తాడుతో.. అక్షిత తన చేతిలో ఉన్న పేపర్ పట్టుకుని చిన్నా పక్కన నిలుచుని వాడి వంక వెటకారంగా చూస్తుంటే చిన్నా మాత్రం స్టైల్ గా జీన్స్ హుడి టీషర్ట్ లో అక్షితని చూసి సిగ్గుపడుతూ తన భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్న పెయింటింగ్ అది.

పెయింటింగ్ చేతబట్టుకుని ఏడుస్తూనే నేరుగా శృతి దెగ్గరికి వెళ్ళింది. శృతి ఏమైందన్నట్టుగా చూడటంతో అక్షిత తన చేతిలో ఉన్న పెయింటింగ్ తీసి శృతి ముందు పెట్టింది.

అక్షిత : ఇందాక ఆంటీ మాటలు నీ మాటలు విన్నాను

శృతి  ఆ పెయింటింగ్ తీసి చూస్తూ నవ్వి పక్కన పెట్టేసి అక్షిత వంక కూర్చోమని సైగ చేసింది.

శృతి : ఒక రోజు చిన్నా నా దెగ్గరికి వచ్చి దెగ్గరుండి ఈ పెయింటింగ్ గీయించుకున్నాడు. అన్ని అనుకున్నట్టు నీకు వాడికి పెళ్లి జరిగితే నిన్ను ఈ పెయింటింగ్ లో ఉన్నట్టు రెడీ చేసి వాడు పొట్ట కరిగించి ఆ బట్టలు వేసుకుని అందులో ఉన్నట్టే నిలబడి నీ చేతిలో ఈ పెయింటింగ్ పెట్టాలని అనుకున్నాడు.. నీకోసం సప్రైస్ ప్లాన్ చేశాడు అని నవ్వింది ఆ రోజు చిన్నా మాటలు గుర్తు చేసుకుంటూ

అక్షిత : నాతో ఒక్కసారి కూడా చెప్పలేదు

శృతి : చిన్నప్పటి నుంచి చాలా సార్లు చెప్పాడు అక్షితా.. నువ్వు పట్టించుకోలేదు

అక్షిత : ఒక్కసారి వాడిని చూడాలని ఉంది

శృతి : ఆ కోరిక నాకూ ఉంది.. కనపడితే కబురుచేస్తాను

అక్షిత లేచి ఏడుస్తూనే మంచం మీదున్న ఆ పెయింటింగ్ తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది.

•°•  •°•
°•°

చిన్నా : అమ్మా.. నీ వల్ల నన్ను అందరూ పిచ్చివాడిలాగ చూస్తున్నారు.. అందరూ నన్ను మెంటలోడని అనుకుంటున్నారు

మధు : నీకిప్పుడు మెంటలే నాన్నా అని గట్టిగా నవ్వింది

చిన్నా : ఎవ్వరు లేనప్పుడు మాట్లాడుకుందాం.. అందరి ముందు వద్దు సరేనా

మధు : నీ పిచ్చి తగ్గిపోతే నేనే వెళ్ళిపోతా బంగారం.. కావాలంటే నన్ను పంపించేయి.. ఒకసారి ప్రయత్నించి చూడు

చిన్నా : వద్దులే.. నువ్వైనా నాకు తోడుగా ఉండు

మధు : ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం

చిన్నా : ముందా చీర మార్చు, వారం నుంచి అదే చీరలో ఉన్నావ్

మధు : నేనెలా ఉండాలో ఊహించుకో అలానే మారిపోతాను, మళ్ళీ అడగడం దేనికి

చిన్నా కళ్ళు మూసుకుని తెరిచేసరికి మధుమతి ఒంటి మీదకి ఎర్ర చీర, చేతికి గాజులు మెడలో బంగారం దేవతలా అయిపోయింది.

మధు : బాగున్నానా

చిన్నా : సూపర్

మధు : అక్షిత కంటేనా

చిన్నా ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తున్నాడు..

మధు : సరే సరే.. నీ అక్షితే బాగుంది.. ఓకే నా

చిన్నా వెనక్కి తిరిగి నవ్వాడు

మధు : ఓయబ్బో.. సిగ్గే.. ఇంతకీ ఎటు వెళుతున్నాం

చిన్నా : చెన్నై అంటూనే ఆటో ఆపాడు

మధు : నేనెక్కడ కూర్చొనూ

అసహనంగా అమ్మా.. అంటూ చూసేసరికి ఆటో వాడు అయోమయంగా చూసాడు.. చిన్నా ఇంకేం మాట్లాడకుండా తన అమ్మ వంక కోపంగా చూస్తూ ఆటో ఎక్కేసారికి మధుమతి నవ్వుతూ డ్రైవర్ పక్కన కూర్చుంది. సరిగ్గా అప్పుడే ఆటో వెనక ఎవరో కత్తులతో పరిగెడుతూ వస్తుంటే అంతకముందే ఆటోలో కూర్చుని ఉన్న ఒక అమ్మాయి అన్నా పోనివ్వండి వాళ్ళకి దొరికితే చంపేస్తారు అని భయపడుతూ అరుస్తుంటే అమ్మా కొడుకులు ఇద్దరు వెనక్కి తింగి చూసారు. ఆటో వాడు భయపడి ఆటో అక్కడే వదిలేసి పారిపోయాడు.

మధు : కాపాడతావేంటి

చిన్నా : నేను హీరోని కానమ్మా.. నా పొట్ట చూడు

మధు : అయితే.. మెకానిక్ వే కదరా నువ్వు.. వేరే మెకానిక్లు విప్పలేని నట్లు బోల్టులు విప్పుతావ్.. మెకానిక్లే నీ కోసం క్యూ కడతారు.. ఓ నలుగురిని కొట్టలేవా

చిన్నా : ఉష్.. అబ్బబ్బా.. మా అమ్మ ఇంత విసిగించదు నన్ను

మధు : ఈ పాటికి నేను బతికి ఉంటే ఇదిగో ఇలానే ఉంటాను నేను..

చిన్నా : లేదు.. రూపం మా అమ్మని ఊహించుకుంటే మాటలు చేష్టలు అక్షితని ఊహించుకుంటున్నానేమో..

మధు : అస్సలు నేను బతికి ఉంటే ఈ పాటికి అది నా కోడలు అయ్యుండేది

చిన్నా : నువ్వు బతికుంటే అది నాకు అస్సలు పరిచయమే అయ్యేది కాదు

మధు : ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడతావా లేదా.. చూడు నిన్నే పిచ్చోడిని చూసినట్టు చూస్తుంది.

చిన్నా ఆ అమ్మాయి వైపు చూసాడు, ఆ అమ్మాయి భయం భయంగా చిరంజీవి వంక వెర్రి చూపులు చూసింది..

°•°
•°•  •°•

చెన్నై హైవే దిగి సిటీ సెంటర్ రోడ్డు ఎక్కి అక్కడి నుంచి చిరంజీవిని అరెస్ట్ చేసిన సెంట్రల్ జైలుకి వెళ్ళింది అక్షిత మరియు లావణ్యని తీసుకొస్తున్న కారు. అక్షిత నేరుగా లోపలికి వెళ్లి జైలు అధికారులతో మాట్లాడుతుంటే లావణ్య బైటే కొడుకులతో నిలుచుని అటు ఇటు చూస్తూ చెట్టు కింద కూర్చుని ఉన్న శృతిని చూసి అటు పరిగెత్తింది. అక్షిత లోపల మాట్లాడి బైటికి వచ్చేసరికి లావణ్య, శృతి మాట్లాడుతుండడం చూసి దెగ్గరికి వచ్చింది.

అక్షిత : ఎలా ఉన్నావ్ శృతి

శృతి : ఇదిగో ఇలా ఉన్నాను

అక్షిత : వాడితో మాట్లాడావా

శృతి : లేదు పిలుస్తాం అన్నారు

అక్షిత : అదే అడిగాను.. అందరికీ కలిపి ఒకేసారి అవకాశం ఇస్తారట

ఇదంతా చూస్తున్న అక్షిత కొడుకు వేణుకి లావణ్య కొడుకు చిరంజీవికి సరిగ్గా అర్ధంకాకపోయినా తన పేరు కూడా చిరంజీవి అవ్వడం అందులో చిన్నా అని వేణు ముద్దు పేరుతో పిలుచుకోవడంతో తమ అమ్మలకి చాలా దెగ్గరవాడని అర్ధం అయ్యింది.. ఇద్దరు కుర్రోళ్లకి కొన్ని అనుమానాలు కూడా పుట్టాయి కానీ మౌనంగా ఉన్నారు.

కొంతసేపటికి ఒక అధికారి వచ్చి పిలవగా అక్షిత, లావణ్య మరియు శృతి లోపలికి వెళ్లారు, ఇక్కడ కొడుకులు మాత్రం అస్సలు ఏం జరుగుతుందో మొత్తం పూస గుచ్చినట్టు ప్రతి విషయం తమ నాన్నలకి అందిస్తున్నారు.

లోపలికి వెళ్లిన ముగ్గురు ఆడవాళ్ళకి చిన్నా తన పక్కనే ఉన్న తమ వయసు గల ఇంకొకరితో మాట్లాడుతుంటే వెళ్లి చిన్నా ముందు నిలుచున్నారు.

చిన్నా : సంజు ఇక్కడి నుంచి వెళ్ళిపో

సంజు : నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను

అక్షిత : చిన్నా..

చిన్నా తల పక్కకి తిప్పి చూసాడు.. లోపల కొట్టినట్టున్నారు మొహం అంతా వాచిపోయింది.. పెదం పగిలిపోయింది..

అక్షిత : ఏంట్రా ఇదంతా

చిన్నా ఏం మాట్లాడకుండా శృతి వంక ఒకసారి చూసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి అక్షితని లావణ్యని చూసి వెళ్లిపోండి అని చెపుతూనే శృతి మెడ వంక చూసి కిందకి చూసాడు కాళ్ళకి మెట్టెలు ఉన్నాయా లేవా అని.. శృతి ప్రేమగా చూసింది. చిన్నా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

ఇప్పటివరకు చిన్నాతో మాట్లాడిన ఆమె బయటకి వచ్చి ఏడుస్తుంటే అక్షిత, లావణ్య, శృతిలు వెళ్లి ఆమెని పలకరించారు.

అక్షిత : మీరు చిన్నా అదే చిరంజీవికి ఏమవుతారు

చిన్నా నా అన్నయ్య అంది ఏడుస్తూనే

లావణ్య : తను నీకెలా తెలుసు.. ఎలా పరిచయం

ఎవరు మీరంతా.. ప్రెస్ ఆ.. తమిళ్ నాడులో చిరంజీవి అంటే చాలా మందికి తెలుసు.. ఇప్పటికే అందరితో విసిగిపోయి ఉన్నాను.. నన్నేమి అడగకండి వెళ్లిపోండి.

అక్షిత : మేమందరం చిన్నా కుటుంబంలోని వాళ్ళం

కళ్ళు తుడుచుకుని తనకి ఎవ్వరు లేరని చెప్పాడు

శృతి : వాడంతే చెపుతాడు.. అస్సలు ఏంటి ఇదంతా

వాడు అని అంత చనువుగా పిలవడం విన్న తను ఆశ్చర్యపోతూ..
చెపుతాను.. నా పేరు సంజన.. సంజు..
Like Reply
#19
•18•

నా పేరు సంజన.. సంజు.. నేనొక అనాధని.. పెరిగింది చదివింది అంతా మదర్ తెరిసా ఫౌండేషన్ లోనే.. నాకు తనే ఇన్స్పిరేషన్. ఇంజనీరింగ్ చేసాను ఒక చేత్తో సంపాదిస్తూనే ఇంకో చేత్తో చిన్న ఫౌండేషన్ ఒకటి దత్తత తీసుకున్నాను ఆరుగురు అమ్మాయిలు ఉన్న చిన్న బాలికా వసతి గృహం. సాఫీగా సాగిపోయే నా జీవితంలోకి ఒక రౌడీ వచ్చి నన్ను చిన్నాభిన్నం చేసాడు.. భయపడి పారిపోతున్న సమయంలో నేను ఎక్కిన అదే ఆటోలో చిన్నా అన్నయ్య కూడా ఉన్నాడు. నన్ను కాపాడి నా గురించి తెలుసుకుని నాకు సాయం చేశాడు.

సాయం చెయ్యమని ఆ రౌడీ బారి నుండి నన్ను నా ఫౌండేషన్ ని కాపాడమని వేడుకున్నాను, చేస్తానన్నాడు కానీ ఇక్కడ కాదు వేరే ఊర్లో అయితే చేస్తానన్నాడు. నేనూ అదే అనుకున్నాను.. ఇక్కడుంటే వాడు మళ్ళీ వస్తాడు అందుకే దేవుడికి దణ్ణం పెట్టుకుని ఏం ఆలోచించకుండా గుడ్డిగా అన్నయ్యని నమ్మి ఆరుగురు ఆడపిల్లలతో పాటు అన్నయ్య వెంట ట్రైన్ ఎక్కేసాను అలా మొదలయ్యింది మా ప్రయాణం.

చెన్నైలో దిగి ముందు తినేసి అందరం కలిసి అన్నయతో వెళ్లిపోయాం.. ముందు ఒక రూం తీసుకుని పిల్లలని పడుకోమని చెప్పి మమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నాడు.. నేను అన్నయ్యతో మాట్లాడదామని బైటికి వచ్చాను. అన్నయ్య అప్పటికే కిందకి వెళ్లడం చూసి నేనూ కిందకి వెళ్లాను. తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ వెళుతుంటే కొంచెం భయం వేసింది.. అన్నయ్య వెళ్లి చెట్టు కింద కూర్చుని కొంతసేపటికి నన్ను చూసి.. ఏమి లేదన్నట్టుగా ప్రవర్తిస్తూ నన్ను రమ్మని సైగ చేసి కూర్చోమన్నాడు. చెట్టు కింద బల్ల మీద కూర్చున్నాను.

చిన్నా : నీ పేరు సంజన కదా.. నా పేరు చిరంజీవి

సంజు : చెప్పారు

చిన్నా : సరే.. అన్నయ్య అని పిలిచావ్ గా అలానే పిలువు.. నువ్వు ఫౌండేషన్ పెట్టడానికి నేను సాయం చేస్తాను.. నా దెగ్గర కొంత డబ్బు ఉంది, తక్కువ విలువ చేసే దెగ్గర స్థలం తీసుకుందాం.. నువ్వు జాబ్ చేస్తా అన్నావ్

సంజు : అవును.. నాకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది.. నా దెగ్గర కూడా కొంత డబ్బు ఉంది, అవి ఫౌండేషన్ కట్టడానికి, మిగతా ఖర్చులకి సరిపోతుందనే అనుకుంటున్నాను.

చిన్నా : మరింకే.. ఎమ్మా అని పక్కకి చూసాడు.. మళ్ళి నా  వంక చూసాడు, భయం వేసి అయోమయంగా చూసాను. సంజన నీతో ఇంకో విషయం మాట్లాడాలి.. నీకు నన్ను చూస్తుంటే భయంగా ఉందా

సంజు : లేదండి

చిన్నా : నీ కళ్ళలో చూస్తేనే తెలుస్తుంది.. కదమ్మా అని పక్కకి తిరిగి నవ్వి మళ్ళి నన్ను చూసాడు. నేనేం మాట్లాడలేదు. నాకు కొంచెం పిచ్చి ఉంది అదే క్రాక్ అంటారు కదా

భయపడి లేచి నిలబడ్డాను

చిన్నా : అయ్యో.. భయపెట్టానా.. పిచ్చి అంటే నేనేం సైకోని కాను.. ముందు కూర్చో అమ్మాయి నిన్ను అలా చూస్తుంటే నాకు భయంగా ఉంది అనేసరికి బల్ల మీద కూర్చున్నాను. నాకు పిచ్చి అంటే ఎలా చెప్పాలి నీకు.. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది ఎందుకని అడక్కు నాకు తెలీదు.. ఒక్కన్నే అడుక్కుంటూ మెకానిక్ పని నేర్చుకుని అక్కడ నుంచి దుబాయి వెళ్లి అక్కడ డబ్బు సంపాదించి మళ్ళి ఇండియా వచ్చాను ఇక్కడ వరకు బానే ఉంది.. ఆ తరువాత కొంచెం లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయి అప్పుడే ఇదిగో మా అమ్మ అని గాల్లో చెయ్యి తిప్పి ఎవరినో చూపిస్తున్నట్టు చెయ్యి పెట్టి.. నా బ్రెయిన్ లోనుంచి బైటికి వచ్చింది.. నాకు తప్ప ఇంకెవ్వరికి కనిపించదు వినిపించదు.. నేనేదో నాకున్న హీరో పవర్ లా చెపుతున్నానా.. ఇదే నాకున్న పిచ్చి.. మాములుగా నేను ఒక్కణ్ణి ఉన్నప్పుడే అలా ప్రవర్తిస్తుంటాను కానీ అప్పుడప్పుడు బాగా విసిగిస్తుంది మా అమ్మ అప్పుడు కొంచెం తల నొప్పి వస్తుంది.. బైట వాళ్ళకి మాత్రం నాలో నేనే మాట్లాడుకుంటూ ఉన్నట్టు కనిపిస్తా అంతే.. నాకింకే జబ్బు లేదు.. నాకూ కొంచెం తోడు కావాలని నేను అలా వదిలేసాను.. హాస్పిటల్లో చూపించుకోలేదు.. ఆమ్మో మా అమ్మ అలిగింది అని లేచి బతిమిలాడుకున్నట్టు వెళుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను.

కొన్ని రోజుల తరువాత అన్నయ్య చాలా మంచివాడని అర్ధం అయ్యింది, అప్పుడప్పుడు తనలో తనే మాట్లాడుకుంటాడు. మొదట్లో నేను పక్కన ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పడేవాడు ఆ తరువాత నేను కూడా ఆయనకి ఇబ్బంది కలగకుండా అమ్మకి గుడ్ మార్నింగ్ లవి చెపుతూ ఉండేదాన్ని.. అలా ఇద్దరం అన్నా చెల్లెళ్ళుగా కలిసిపోయాం.

అక్షిత నోటి మీద చెయ్యి వేసుకుని ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది.. లావణ్య శృతి ఇద్దరూ చెరో రెక్క పట్టుకుని లేపి పక్కన కూర్చోబెట్టారు. వేణుకి వాళ్ళ అమ్మని ఎలా ఓదార్చాలో ఎందుకు ఓదార్చాలో కూడా తెలీదు.

అక్షిత : అంతా నా వల్లే.. అని చెంపల మీద కొట్టుకుంది గట్టిగా ఏడుస్తూ

శృతి : ఊరుకో.. అంతా మన చేతుల్లో ఉంటుందా అని అక్షితని కొంచెం కఠినంగానే ఓదార్చింది కళ్ళు తుడుచుకుంటూ.. మీరు చెప్పండి.. మరి ఇదంతా ఏంటి..? ఎలా జరిగింది..?
Like Reply
#20
•19•

సంజు :
ఆరుగురుతో పాటు నేను అన్నయ్య అయ్యేసరికి ఖర్చులు బాగా పెరిగిపోయాయి, అన్నయ్య వెంటనే రెండు రోజుల్లో ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక స్థలం చూసి అది కొనేసాడు. అదే రోజు సాయంత్రానికి అందులో చిన్న రూం ఒకటి కట్టించి పైన రేకులు కప్పి మమ్మల్ని అందులో ఉంచాడు. తెల్లారి మెయిన్ రోడ్డు మీద ఒక షటర్ అద్దెకి తీసుకుని మెకానిక్ షెడ్ తెరిచాడు. మెకానిక్ అవ్వడం వల్ల చేతిలో ఎప్పుడు ఒక బండి ఉండేది అలా చిన్నగా ఒక్కోటి సమకూర్చుకున్నాం.

నేను ఉద్యోగం వెతుక్కున్నాను జీతం తక్కువే కానీ ఏదో ఒకటి అని జాయిన్ అయిపోయాను. ఉన్న డబ్బులతో నాలుగు రూములు చుట్టూ కంపౌండు కట్టుకున్నాం. మూడు నెలలు గడిస్తే కానీ ఊపిరి పీల్చుకోలేకపోయాము. అన్నయ్య ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అన్నిటికి మౌనంగా ఉండేవాడు.. నేను బాగా చనువు ఇస్తే గానీ కొంచెం సరదాగా ఉండేవాడు కాదు.

సంజు : అన్నయ్యా ఎందుకు మా కోసం ఇంత కష్టపడుతున్నావ్.. ఇదంతా చేస్తున్నావ్.. వాటి వెనకాల ఉన్న కారణాలు నాకు తెలుసుకోవాలని ఉంది

చిన్నా : చెప్పాను కదా నాకు క్రాక్ అని.. నేను ఇలా ఉంటేనే మా అమ్మకి ఇష్టం. మొదటి నుంచి నేను ఎలా ఉంటే తనకి నచ్చుతుందో అలానే నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను.. అందుకే నాది ఇంత మాస్ ఫీల్డ్ అయినా తాగుడు కానీ మరే అలవాటు కానీ చేసుకోలేదు. నా జీవితంలో ఏది నేను కోరుకున్నట్టు జరగలేదు కనీసం నా చుట్టూ ఉండే వాళ్ళు కోరుకున్నట్టు అయినా జరిగితే వాళ్ళైనా సంతోషంగా ఉంటారని.. అంతే.. అలా చేసాను కూడా.. వాళ్ళ మొహంలో ఆనందం నాకింకా గుర్తుంది.. అమ్మా నాన్న లేక చిన్నప్పటి నుంచి ఎలా బతికానో నాకే తెలుసు.. అంత నీచమైన స్థితిలో బతికాను.. నా పరిస్థితి ఎవ్వరికి రాకూడదనే ఇంకో గట్టి కారణమే నీకు నేను సహాయం చేసేలా చేసింది. అని తను చిన్నప్పుడు ఎదురుకున్న కష్టాలు చెపుతుంటే విన్నాను

అన్నయ్య తను చూసినవి అనుభవించిన విషయాలు.. అనాధ అమ్మాయిలని అడుక్కునేలా చేసి రాత్రికి ఎలా బలవంతంగా అనుభవించేవాళ్ళో ఎన్ని చిత్రహింసలు పెట్టేవాళ్ళో ఆ తరవాత వాళ్ళని అమ్మేసి సొమ్ము చేసుకునేవాళ్ళని అన్నయ్య చెపుతుంటే ఏడుపొచ్చి ఆయన్ని గట్టిగా వాటేసుకున్నాను.. మొదటి సారి అన్నయ్య ప్రేమగా నా తల మీద చెయ్యి వేసాడు.. ఆ స్పర్శలో ఎంతో ప్రేమ.. నిజాయితీ.. నాకది అర్ధంకాకపోయినా నా మనసుకి తెలిసింది.. జీవితాంతం ఈ అన్నయ్య చెయ్యి వదలకూడదాని గట్టి నిర్ణయం తీసుకున్నాను.

చిన్నా : ఏమైంది సంజన

సంజు : నన్ను సంజు అని పిలువు అన్నయ్యా.. మర్చిపోయా అమ్మాయిలు రోజూ నీతో మాట్లాడతామని అడుగుతున్నారు.. నువ్వేమో షెడ్ వదిలి అస్సలు ఇటు రావట్లేదు. ఇంకా పడుకోలేదు పిలవనా

చిన్నా : అవును వాళ్ళకి నాకు అస్సలు పరిచయమే లేదు.. రమ్మను

సంజు : అందరినీ పిలిచాను.. అన్నయ్య ఇదిగో ఇది ఉందే పేరు పూజ..

చిన్నా : వాళ్ళని చెప్పనీ సంజు అనగానే ఆగిపోయి నవ్వుతూ వెళ్లి అన్నయ్య పక్కన కూర్చున్నాను.

పూజ : అన్నయ్యా నా పేరు పూజ.. ముందుగా మా అందరి కోసం మీరు ఉన్నారు.. మాకు ధైర్యంగా ఉంది.. కానీ మీరు కూడా ఇక్కడే ఉండండి అన్నయ్యా..

చిన్నా : నీ గోల్ ఏంటి
(మధు : చదివిస్తావేంటి..)

పూజ : ఐపీయస్ అవ్వాలని ఉంది అన్నయ్యా

(మధు : అబ్బో బానే ఉన్నాయి కోరికలు.. కొంపతీసి తీరుస్తావెంట్రా)
చిన్నా : షు.. సారీ పూజా నిన్ను కాదు.. హే.. మీరు కూడా మీ పేర్లేంటి

నా పేరు శ్రావణి అన్నయ్యా.. నాకు ఐఏఎస్ అవ్వాలని కోరిక

నా పేరు చందన అన్నయ్య.. నాకు డాక్టర్ అవ్వాలని కోరిక

నా పేరు శృతి అన్నయ్యా నాకు లాయర్ అవ్వాలని కోరిక

పేరు వినగానే చిన్నా ఒకసారి తల ఎత్తి శృతి అనే అమ్మాయిని చూసి మళ్ళీ మాములు అయిపోయాడు.
(మధు : ఏరా గుర్తొస్తుందా.. వెళ్ళిపోదామా వెనక్కి...)

మిగతా ముగ్గురు పిల్లలు వాళ్ళ పేర్లు చెపుతుంటే అన్నయ్య వినకుండా ఏదో ఆలోచిస్తూ ఉండటం నేను గమనించాను..

సంజు : అన్నయ్యా..!

(మధు : ఒక్కొక్కళ్ళు ఒక్కో దారిలో వెళతాం అంటున్నారు.. ఎలా చదివిస్తావ్ రా వీళ్ళని.. నట్లు బిగించా.. లేదా ఏదైనా బ్యాంకుకి కన్నం వేస్తావా.. చెప్పు.. ఏం మాట్లాడవే.. చెప్పు.. అమ్మకి సమాధానం చెప్పు.. ఇవన్నీ నీ వల్ల కాదు పొయ్యి అక్షిత కాళ్లు పట్టుకుని అడుక్కో.. దాని మొగుడిని వదిలేసి నీతో వచ్చెయ్యమని అడుగు.. నా మాట విను వెనక్కి వెళ్ళిపోదాం.. కావాలంటే శృతి ఉంది.. అది కాకపోతే ఇది.. ఇక్కడ నీ బతుకు కుక్క బతుకే మళ్ళీ కష్టపడి వీళ్ళని చదివిస్తే వీళ్ళ దారి వీళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు.. ఇప్పటికే ఇద్దరు వెళ్లిపోయారు.. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు.. కనీసం నువ్వు ఎక్కడున్నావ్ ఎలా ఉన్నావ్ అన్నది కూడా వాళ్ళకి అనవసరం.. ఆగకుండా మాటలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి మధ్యలో అక్షిత లావణ్య చిన్నాని విసురుకున్నప్పుడు మాటలు.. గోల గోల.. బీ......ప్ మని చిన్నా చెవుల్లో శబ్దం)

ఒక్కసారిగా అన్నయ్య రెండు చెవులు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకునేసరికి భయం వేసి అన్నయ్యని గట్టిగా పట్టుకుని పిలిచాను.. నా చుట్టూ ఉన్న పిల్లలు కూడా అన్నయ్యా అన్నయ్య అని అరుస్తుంటే నేను చెయ్యి పట్టుకుని గట్టిగా కదిలించాను రెండు నిమిషాలకి చెవుల మీద నుంచి చేతులు తీసేసాడు.

సంజు : అన్నయ్యా..

చిన్నా : సారీ రా.. భయపడ్డారా

సంజు : లేదు.. బాధ పడ్డాం..

పూజ : నువ్వంటే మాకు భయం లేదన్నయ్యా.. కానీ నీ గురించి సంజు అక్క చెప్పింది.. మా కోసం అయినా హాస్పిటల్ కి వెళ్ళు అన్నయ్యా

చిన్నా : హ్మ్మ్.. వెళతాలే.. సరే ఇక మీతో ఒకటి చెప్పాలి నేను.. రండి అందరం కింద కూర్చున్నాం.. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది.. తన దెగ్గర చదువు లేదు, డబ్బు లేదు కానీ ఉండాల్సిన తెలివితేటలు మాత్రం నిండుగా ఉన్నాయి.. మీలో పది పాస్ అయిన వాళ్ళు ఎంతమంది..?

అందరూ చేతులు ఎత్తారు

ఓహ్.. అందరూ బాగా చదివేవాళ్ళే అయితే.. ఆ అమ్మాయి ఓపెన్ లో పది రాసింది.. ఆ తరువాత ఏం చేసిందో ఏమో మళ్ళీ ఓ పక్క పార్ట్ టైం జాబ్ చేస్తూనే ఓపెన్ లో డిగ్రీ చేసింది.. తరవాత పై చదువులు కూడా చదివి ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి నెలే యాభై వేల పైన జీతం తీసుకుంది.

అలానే మీరు కూడా చదువుకోండి.. ఆ అమ్మాయికి చదువులో సాయం చెయ్యడానికి ఎవ్వరు లేరు.. కానీ మీకు సంజు అక్క ఉంది.. తరవాత ఏం చెయ్యాలో మీరు అనుకున్నది ఎలా సాధించాలో తను చెపుతుంది, అర్ధం చేసుకుంటూ కష్టపడి చదవండి.. నేను మీకు బట్టా, తిండి, నిద్రకి ఇంత చోటు మాత్రమే ఇవ్వగలను.. చదువు ఇవ్వలేను.. దాని విలువ నాకు అటుఇటుగా తెలుసు అంతే.. చదువుకుంటే డబ్బులు వస్తాయి సుఖంగా ఉండొచ్చని మాత్రం తెలుసు.. అందరూ నవ్వారు..

భోజనాలు చేసారా

శృతి, పూజ : ఎప్పుడో అన్నయ్యా

చిన్నా : వెళ్ళండి పడుకోండి.. ఇక రేపటి నుంచి మీ పని ఏంటి

అందరూ : మా గోల్స్ రీచ్ అవ్వడమే మా పని

చిన్నా : ఏంటో అర్ధం కానీ ఇంగ్లీష్ లో మాట్లాడతారు.. తెలుగు మర్చిపోకండి

పిల్లలు నవ్వుతూ వెళ్లిపోయారు.. అన్నయ్య లేచి వెళ్లిపోతుంటే మాట్లాడాలనిపించినా పిలవలేదు.. పిల్లలు చదువుకోవడం మొదలుపెట్టారు.. గవర్నమెంట్ కాలేజ్లు కాలేజీలు ఆతిధ్యం ఇచ్చాయి. రోజులు గడిచే కొద్ది అన్నయ్యతో నా చనువు పెరుగుతూ వస్తుంది.

ఒకరోజు అన్నయ్య తల పట్టుకుని కూర్చుంటే ఆ రోజు లాగే మళ్ళీ ఏమైనా అయ్యిందేమో అని భయపడి వెళ్లి అన్నయ్య పక్కన కూర్చున్నాను

చిన్నా : ఏంటి నువ్వు కూడా చదువుకుంటావా.. మళ్ళీ చదువుతావా

సంజు : అన్నయ్యా.. నవ్వాను

చిన్నా : తిన్నావా

సంజు : హ్మ్మ్ ఇందాకే కలిసి తిన్నాం.. ఆ రోజు ఏమైంది.. నువ్వు బాధపడతావని ఆ రోజు అడగలేదు

చిన్నా : ఈ మధ్య కొంచెం తల నొప్పి వస్తుంది..

సంజు : హాస్పిటల్ కి వెళదామా

చిన్నా : లేదు.. ఏ రోగం లేకపోతే నిజంగానే పిచ్చోడిని అయిపోతానేమో

సంజు :  భయం వేసింది

చిన్నా : రెండు నిముషాలు అంతే.. సరే చెప్పు ఇంకా.. నువ్వు పెళ్లి చేసుకోవా ఇక.. వీళ్ళ సంగతి నాకు వదిలేయి.. నేను చూసుకుంటాను.. నీ కోసం స్కూటీ కూడా పాతది ఒకటి తీసుకున్నా బాగు చేస్తున్నా.. మంచి ఆఫీస్ చూసుకో దూరం అయినా బండి ఉంటుంది కదా..

సంజు : నేను కూడా నువ్వు నిర్ణయం తీసుకున్నట్టే ఒక నిర్ణయం తీసుకున్నా

చిన్నా : ఏంటో అది

సంజు : జీవితాంతం నీకు చెల్లిగా.. వీళ్ళకి అక్కగా.. నీకు తోడుగా ఉంటాను.. నువ్వు ఎలాగొ ఒంటరిగా ఉండిపోతానన్నావు.. నేను కూడా అంతే.. అమ్మ కోరుకున్నట్టు ఇద్దరం వీలైనంత మంది అమ్మాయిలని చదివిద్దాం.. ఏమంటావ్.. ఏంటన్నయ్యా నవ్వుకుంటున్నావ్.. ఏమంటుంది అమ్మా..

చిన్నా : నువ్వే తన అసలైన కూతురివి అని చెపుతుంది

సంజు : థాంక్స్ అమ్మా.. చూసావా అమ్మకి కూడా ఇష్టమే..

చిన్నా : ఇలా నాతో మాట్లాడుతూ కూర్చుంటే నీకు కూడా పిచ్చి ఎక్కిద్ది.. ఇప్పటికే అమ్మతో మాట్లాడుతున్నావ్.. నాకంటే పిచ్చి ఉంది అది కనపడుతుంది మాట్లాడుతున్నా.. నీకస్సలు కనిపించనే కనిపించదు

సంజు : అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదా.. తను ఎలా ఉంటుందో చూడాలని ఉంది

(మధు : ఏరా వెళ్లి ఫోటో తీసుకొద్దాం వస్తావా.. హహహ్హ)
చిన్నా : పేపర్ పెన్సిల్ తీసుకురా.. చూపిస్తా

పేపర్ పెన్సిల్ తెచ్చిచ్చాను.. అరగంటలో బొమ్మ గీసి చేతికి ఇచ్చాడు. చాలా అందంగా గీసాడు.

సంజు : బాగుంది అన్నయ్యా అమ్మ.. భలే గీసావ్.. మెకానిక్ చేతికి బొమ్మలు గీయడం కూడా వచ్చా

చిన్నా : చెయ్యి పట్టుకుని నేర్పించిన గురువుగారు ఉన్నారు నాకు.. అంటూ ఒకప్పుడు శృతి చిన్నాని వెనక నుంచి వాటేసుకుని తన చెయ్యి పట్టి బొమ్మ గీయించడం గుర్తుతెచ్చుకుని నవ్వుకున్నాడు.

అన్నయ్య అలా నవ్వుకుంటుంటే అన్నం వండలేదని గుర్తొచ్చి లోపలికి పరిగెత్తాను.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)