Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Update eppudu takul
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
excellent updates icharu

sujita
[+] 2 users Like sujitapolam's post
Like Reply
S04E03

ముని వేగంగా నడుచుకుంటూ విక్రమాదిత్య ముందుకు వచ్చి ఆగాడు.. విక్రమాదిత్య చేతిలో ఉన్న గొడ్డలిని చూసి ఆయన కోపం కట్టలు తెంచుకుంది సంస్కృతం మరియు పురాతన తెలుగు మరియు ఇంకేదో భాష కలిసిన వచనాలు చాలా కోపంగా పలుకుతుంటే అంతా అర్ధమైనట్టు ఉన్నా ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు, అయోమయంగా చూసాడు.


సంస్కృతంలో : ఈ భార్గవ రాముడి పరుశుని తాకడానికి నీకెంత ధైర్యం, నీవంత వీరునివా, అయితే రా తలపడు అంటూ రెండు అడుగులు ముందుకు వేసాడు.

విక్రమాదిత్యకి ఒక్క ముక్క అర్ధం కాలేదు కానీ ఆయన ఎవరో కోపంగా ఉన్నాడని మాత్రం అర్ధం అయ్యింది, మధ్యలో పరుశు అన్నాడు అంటే సంస్కృతంలో గొడ్డలి అని అర్ధమయ్యి ఆయన ఈ గొడ్డలి గురించి మాట్లాడుతున్నాడేమో అని గొడ్డలిని చూసాడు, రెప్పపాటులో గొడ్డలి విక్రమాదిత్య చేతిలో నుంచి ఎగిరి ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ వెంటనే ఆయన మాటల్లో భార్గవ్ రామ్ అన్న పేరు గుర్తుకు వచ్చి ఆ వెంటనే ఆగిపోయి భక్తిగా కొంత భయంగా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు.

పరుశురాముడు మాత్రం కోపంగా గొడ్డలి తిప్పగానే విక్రమాదిత్య కూంగా పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ అందుకున్నాడు, అది చూసి ఆయన చులకనగా నవ్వుతూ పక్కనే ఉన్న నాలుగు అడుగుల వెడల్పు గల చెట్టుని ఒక్క వేటుతో నిలుచున్న చోటు నుంచి కదలకుండా అవలీలగా నరికేసాడు. విక్రమాదిత్య చేతిలో నుంచి చెట్టు కొమ్మ కింద పడిపోయింది. కింద పడ్డ కత్తి అందుకుని నిలబడ్డాడు.

పరుశురాముడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఎగిరి విక్రమాదిత్య మీద గొడ్డలితో వేటు వెయ్యబోతుంటే విక్రమాదిత్య కత్తి అడ్డం పెట్టాడు.ఇవ్వాల్టితో తన చావు మూడిందని ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు, అర రెప్ప పాటులో పరుశురాముడి గొడ్డలి వేటుకి అడ్డంగా సుదర్శన చక్రం వచ్చి ఒక్క క్షణంలో మాయం అయ్యింది, సుదర్శన చక్రం మరియు శివుడి పరుశు రెండు కలబడగానే ఒక మెరుపు మెరిసింది.. ఆ తాకిడికి పరుశురాముడు ఎగిరి అవతల పడ్డాడు. విక్రమాదిత్య కళ్ళు తిరిగి పడిపోయాడు.

లేచి నిలబడ్డ పరుశురాముడు తను చూసింది నిజామా కాదా అన్నట్టు గుర్తు తెచ్చుకుని పాహిమాం పాహిమాం అంటూ మోకాళ్ళ మీద కూర్చుని వేడుకుని లేచి విక్రమాదిత్య దెగ్గరికి వెళ్లి తన నుదిటిన అరచేయితో పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు.

పరుశురాముడు కళ్ళు తెరిచి ఏదో అర్ధం అయ్యిన వాడిలా ఒక చేత్తో విక్రమాదిత్యని ఎత్తుకుని తన భుజాన వేసుకుని ఇంకో చేత్తో గొడ్డలి పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

Like Reply
Nice update chala baagundi
Thank you sir.....
[+] 1 user Likes hrr8790029381's post
Like Reply
(08-03-2023, 12:56 AM)hrr8790029381 Wrote: Nice update chala baagundi
Thank you sir.....

Thankyou ❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
Wishing you all a Happy & safe
HOL
[+] 4 users Like Pallaki's post
Like Reply
(08-03-2023, 12:37 AM)Takulsajal Wrote: S04E03





పరుశురాముడు కళ్ళు తెరిచి ఏదో అర్ధం అయ్యిన వాడిలా ఒక చేత్తో విక్రమాదిత్యని ఎత్తుకుని తన భుజాన వేసుకుని ఇంకో చేత్తో గొడ్డలి పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.


Nice update 
ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది...
[+] 1 user Likes Warmachine's post
Like Reply
Nice update bro mari chinna update icharu
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Super bhayya
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
Nice update bro
phani kumar c
24*7 in sex trans
[+] 1 user Likes phanic's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Welcome back.. superb update
[+] 1 user Likes Dalesteyn's post
Like Reply
Superb ji , thanks for update
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Good start.... clps
[+] 2 users Like kummun's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice come back bro ...
[+] 1 user Likes Zixer's post
Like Reply
అప్డెట్ చాలా బాగుంది మిత్రమా
[+] 1 user Likes Lraju's post
Like Reply
(15-10-2022, 04:45 PM)Takulsajal Wrote:
A SMALL RECAP

అందరు పాత్రలు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అంటున్నారు. అందుకే ఒక రీకాప్ లాగా పాత్రల గురించి చెపుతాను.

విక్రమాదిత్య ఆనందంగా తన తల్లిని సంతోషంగా చూసుకోవాలని ఇక తన తాగుబోతు తండ్రిని అస్సలు పట్టించుకోని ఒక పిల్లాడు, తల్లిని చంపేసాక పిన్ని పల్లవితో కలిసి ముంబై వెళ్లి అక్కడే చదువుకుంటూ పనివాడిగా ఉంటూ ఆ ఇంట్లో ఏ మర్యాద లేని అనురాధని పెళ్లి చేసుకుంటాడు. మానస అనే అమ్మాయి తన స్నేహితురాలిగా తల్లిలా విక్రమాదిత్యకి అండగా ఉంటుంది. అక్కడ నుంచి తన అమ్మ ఒకరికి హెల్ప్ చెయ్యడం అది తిరిగి విక్రమాదిత్యకి హెల్ప్ అవ్వడంతో వేల కోట్లు వచ్చి పడతాయి.. రక్తపాతం వద్దనుకుంటూనే కానీ కుదరక అదే దారి ఎంచుకుని శత్రువులని నాశనం చెయ్యడం కొత్త శత్రువులు ఎదురు పడడం అక్కడే తన పిన్ని అయిన శశి దెగ్గర ప్రేమ పాఠాలతో పాటు శిష్యరికం అభ్యసించి తను చనిపోయాక చివరికి ఒక అమ్మాయిని కాపాడబోయి బెంగుళూరులో మోసపోయానని తెలుసుకునేలోపే మానస మోసం చెయ్యడం రవి దెబ్బకి గాయపడి బెంగుళూరు అడవుల్లో తెగ ప్రజలచే కాపాడబడి తన తల్లి గురించి తెలుసుకుంటాడు ఆ తరువాత సిద్దమయ్యి అందరిని కూడ గట్టుకుని యుద్ధానికి పోయి అక్కడ మానస అన్నయ రవిని చంపేస్తే మానస తల్లి దేవి అత్యాశతో అక్కడే బాంబుల వర్షంలో చనిపోతుంది. అమ్మని కాపాడుకుని చావుకి సిద్ధమైన మానసని చివరి క్షణాల్లో ప్రేమని అందించి తన దేహంతో ఇంటికి చేరతాడు.

ఇక ప్రస్తుత కధల్లోకి వస్తే 

వాసు గాడి వీర గాధ : వాసు, భార్య పద్మ, రెండో భార్య IAS శృతి 

సుబ్బు : సుబ్బు ఫ్రెండ్ అరవింద్, మరదలు శరణ్య

విక్రమ్ : తల్లి కావ్య, భార్య మానస, మావయ్య శివరాం 

ఆదిత్య : మరదలు అనురాధ, తండ్రి రాజు, అత్తయ్య సరిత , అమ్మ మంజుల

సాక్ష్యం : చిన్నా, అక్షిత, అక్షిత అమ్మ రక్ష, వదిన లావణ్య, తల్లి పార్వతి.

చాలా చాలా రోజుల తర్వాత ఇప్పుడే చదవడం స్టార్ట్ చేశా.....ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది ....

సీజన్ 3 ఆరంభం చాలా భగ ఉంది .... ..మి మార్క్ ట్విస్ట్   అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. చాలా అద్భుతంగా చూపించారు....
మొత్తం కథ చదివిన తర్వాత చెప్తా......

మీ కథ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది...... మర్చిపోలేము... చదవడం ఆపలేము.... కొన్ని క్యారెక్టర్లు బ్రెయిన్లు ఫీల్డ్ అయిపోయాఇ.......
[+] 3 users Like sez's post
Like Reply
S04E04


విక్రమాదిత్యకి మైకం తగ్గి కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ మంచు ఎడారి, ఎటు చూసినా తెల్లగా మంచు తప్ప ఇంకేమి కనిపించలేదు. తల తిప్పి చూసాడు పరుశురాముడు ధ్యానంలో ఉన్నాడు. ఏమి అర్ధం కాక లేచి అక్కడ నుంచి పరిగెత్తడం మొదలు పెట్టాడు, రెండు అడుగులు వేశాడో లేదో గొడ్డలి అడ్డంగా నిలబడింది. అటు ఇటు కదిలి చూసాడు లేదు ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వనంటూ ఎదురు పడుతుంది గొడ్డలి. కోపంగా వెనక్కి తిరిగి పరుశురాముడిని చూసాడు.

పరుశురాముడు కళ్ళు తెరిచి చూసాడు ఆయన మాములుగా మాట్లాడినట్లు ఉన్నా కళ్ళు మాత్రం కోపంగానే ఉన్నాయి, విక్రమాదిత్యకి అవేమి అర్ధంకాలేదు, ఆయనని పట్టించుకోకుండా వెనక్కి తిరిగేసరికి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క తన్ను తన్నాడు దెబ్బకి విక్రమాదిత్య నేలలో కుంగినట్టు కిందకి పడిపోయాడు, లేచి నిలబడ్డాడు నోట్లో నుంచి రక్తం అయినా కానీ తనకి ఏమి అర్ధం కాలేదు.

పరుశురాముడు వేలితో చుట్టూ తిప్పగానే గొడ్డలి దానికదే ఆయన చుట్టూ గుండ్రంగా పెద్ద గీత గీసింది, వెళ్లి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు. విక్రమాదిత్య ఆయన ఎలాగో ధ్యానంలో కూర్చున్నాడు కదా అని వెళ్ళబోతే గీత దాటలేకపోయాడు. కోపంగా పరుశురాముడిని చూసి ఆయన ముందుకు వెళ్లి నిలుచున్నాడు.

పరుశురాముడు కళ్ళు తెరిచి చెయ్యి చాపగానే ఆయన చేతిలో ఏవో తాళపత్రాలు ప్రత్యక్షమయ్యాయి, విక్రమాదిత్య మీదకి విసరగానే పట్టుకున్నాడు.

పరుశురాముడు : సంస్కృతం నేర్చుకుని నాతో మాట్లాడు

విక్రమాదిత్య : అస్సలు నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు, నాతో మీకేం పని.. నన్ను ఎందుకు బంధించారు.. నేను వెళ్ళాలి నన్ను పోనివ్వండి.

పరుశురాముడు ఏమి మాట్లాడలేదు, మౌనంగా ధ్యానం చేసుకుంటున్నాడు.

విక్రమాదిత్య : మాట్లాడడండి.. మీకు తెలుగు వచ్చినప్పుడు అదే మాట్లాడొచ్చు కదా

పరుశురాముడు : నీ భాషతో నాకేం పని.. నువ్వే నేర్చుకో.. నాతో ఏం మాట్లాడాలనుకున్నా అందులో నేర్చుకుని మాట్లాడు అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.. ఆ తరువాత విక్రమాదిత్య ఎంత గింజకున్నా ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది, చివరాఖరికి ఆయన ముందు కూర్చుని తాళపత్రాలు తెరిచాడు. పరుశురాముడి మొహంలో చిన్న గర్వం.. ఆయన కళ్ళు తెరవలేదు.

ఏకాగ్రతగా రెండు రోజులు నిద్ర లేకుండా ఆ తాళపత్రాలను ఆవగతం చేసుకుని లేచి ఆయన ముందుకెళ్లి నిలుచున్నాడు.

విక్రమాదిత్య : ఇప్పుడు చెప్పండి ఎందుకు నన్ను బంధించారు, నాకు పని ఉంది.. నా బిడ్డల కోసం నేను వెళ్ళాలి.

పరుశురాముడు : ఇక్కడి నుంచి ఈ బంధనం నుంచి నీవు వెళ్లాలంటే నన్ను ఓడించి, నన్ను పడగొట్టి వెళ్ళు

విక్రమాదిత్య : అది అసాధ్యం అని మీకు తెలుసు

పరుశురాముడు : కాదేమో, ప్రయత్నించు

విక్రమాదిత్య : నా దెగ్గర ఆయుధం లేదు

పరుశురాముడు చిటికె వెయ్యగానే గొడ్డలి మాయమంత్రం వదిలేసి తెల్లని మంచు నేల మీద పడిపోయింది.

పరుశురాముడు : తీసుకో ఆయుధం, నన్ను పడగొట్టి నీవు వెళ్ళవచ్చు

విక్రమాదిత్య వెళ్లి ఆ గొడ్డలిని లేపబోతే లేవలేదు, రెండు చేతులతో ఎత్తబోయాడు కానీ తన వల్ల కాలేదు. చాలా సేపు ప్రయత్నించి చివరికి పరుశురాముడి ముందుకు వచ్చాడు.

పరుశురాముడు : లేవట్లేదా.. నేర్పిస్తాను, నేర్చుకుంటావా.. లేదంటే వెళ్ళలేవు

విక్రమాదిత్య మోకాళ్ళ మీద కూర్చుని నేర్పండి అన్నాడు నిస్సహాయంగా.. పరుశురాముడు మాములుగా కూర్చోమని సైగ చెయ్యగానే విక్రమాదిత్య కూర్చున్నాడు.

పరుశురాముడు : ఆ గొడ్డలి నీ వశం కావాలంటే నీవు మళ్ళీ పుట్టాలి, పసి శిశువులా మారిపోవాలి, నీ క్రోధం నీ అసహనం నీ బాధ నీ ఆనందం నీ ప్రేమ బాంధవ్యం, బంధుత్వం అన్నిటిని వదులుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి మొదటిలో ఆ గొడ్డలి నా చేతికి వచ్చింది నేను యుద్ధాలు గెలిచాను కానీ అది ఎప్పుడు నాకు లొంగిందో తెలుసా నేను రక్తపాతం మీద విసుగెత్తి పోయినప్పుడు ఇప్పుడు నువ్వు కూడా అదే మీమాంసలో ఉన్నావు. ముందు నీ శరీరంలో ఉన్న అన్ని చక్రాలను తెరువు ఒక్కోటి నేర్పిస్తాను, బాధపడకు ఇక్కడి కాలానికి భూమ్మీద కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. నీ బిడ్డలకి ఎటువంటి ముప్పు కలుగదు.

విక్రమాదిత్య  ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించాడు, ఎప్పటి నుంచో దీని కోసమే ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ మాములు మనిషి కావాలని ప్రయత్నిస్తున్నాడు దానికి ఇదే సరైన మార్గం అని నిర్ణయించుకుని కళ్ళు తెరిచి నేను సిద్ధం అన్నాడు.

పరుశురాముడు : ముందు ధ్యానం చెయ్యడం నేర్చుకో అని సైగ చెయ్యగానే విక్రమాదిత్య లేచి పరుశురాముడి పక్కన కూర్చున్నాడు.

మూడు రోజుల ధ్యానం తరువాత విక్రమాదిత్య కళ్ళు తెరిచేసరికి పక్కన పరుశురాముడు కనిపించకపోవడంతో లేచి చూసాడు. పక్కనే ఉన్న జలపాతం కింద ఆయన స్నానమాచరిస్తుంటే వెళ్ళాడు, చెయ్యి పెట్టగానే తీసేసాడు, గడ్డ కట్టే నీరు చేతిని సూదిలా గుచ్చుతుంది.. పరుశురాముడిని చూస్తే మాములుగా నీళ్ల కింద తల పెట్టుకుని ఒంటి కాలితో నిలుచున్నాడు, విరబూసిన జుట్టుతో పెద్ద గడ్డంతో ఆయన శరీరం చూడగానే ఈయనే ఇలా ఉంటే ఇక శివుడు ఎలా ఉంటాడో అని అనుకున్నాడు, ధైర్యం చేసి నీళ్ల కింద నిలుచున్నాడు కానీ ఐదు క్షణాల కంటే ఎక్కువ నిలుచొలేకపోయాడు. పరుశురాముడు అది చూసి నవ్వుతూ బైటికి నడిచి ధ్యాన పద్ధతిలో కూర్చున్నాడు ఆయనకి ఎదురుగా విక్రమాదిత్య కూర్చున్నాడు.

పరుశురాముడు : ఆ జలపాతం చూసావా.. ఆ నీళ్ల వలే నీ శరీరంలో కూడా శక్తి ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి జీవితం మొత్తం భావోద్వేగాలతో నిండి ఉంటుంది అవి దాటుకుని ధ్రుడంగా నిలబడాలి, శరీరంలో మొత్తం ఏడు చక్రాలు.. ఒక్కో చక్రం ముసుకుపోయి ఉండటానికి ఒక్కో ఉద్వేగం. జాగ్రత్తగా ఏకాగ్రతగా ఒక్కో చక్రాన్ని తెరువు.. ఒక్కో చక్రం తెరుచుకునే కొద్ది నీలో ఉన్న శక్తి కూడా ఒక చక్రం నుంచి ఇంకో చక్రానికి ప్రవహిస్తూ ఉంటుంది.. గుర్తుంచుకో ఒక్కసారి మొదలయ్యాక మధ్యలో ఆపడానికి వీల్లేదు.

విక్రమాదిత్య అలాగే అని తీక్షణంగా ఆయన కళ్ళలోకి చూసాడు. పరుశురాముడు కళ్ళు మూసుకోగానే  విక్రమాదిత్య కూడా కళ్ళు మూసుకున్నాడు.

పరుశురాముడు : మొదటిది మూలాధార చక్రం, వెన్నపూస దిగువన ఉంటుంది, బ్రతుకుని సూచిస్తుంది.. భయం వల్ల మూసుకుపోయి ఉంటుంది. నీ భయం ఏంటి..?

విక్రమాదిత్య : నేనే నా భయం అని తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు కళ్ళ ముందు తన నరికిన మనుషులు, తెగిపడిన తలలు, ఎటు చూసినా రక్తమే అంతా ఎరుపే

పరుశురాముడు : నిన్ను నువ్వు గెలవగలవన్న నిజాన్ని నువ్వు నమ్మాలి.. నీ కోపానికి కారణాలు వెతుకు నిన్ను నువ్వు సమాధానపరుచుకో, నీ తప్పులని నువ్వు ఒప్పుకో నిన్ను నువ్వే క్షమించమని అడుగు. నీ భయాన్ని నువ్వు గెలువు

విక్రమాదిత్య గట్టిగా కళ్ళు మూసుకుని అలానే బిగపట్టి కూర్చున్నాడు, గంటన్నర తరువాత మామూలు స్థితికి వచ్చాడు, మనసులో ఏదో గంట కొట్టినట్టు శబ్దం.. కళ్ళు తెరిచాడు.. మూలధార చక్రం తెరుచుకుంది.

పరుశురాముడు : తరువాత చక్రం స్వాదిష్టాన చక్రం బొడ్డు కింద ఉంటుంది, ఆనందాన్ని సూచిస్తుంది.. నువ్వు చేసిన తప్పులని ఒప్పుకోక పోవడం వల్ల మూసుకుపోయి ఉంటుంది.. నీ తప్పులని గుర్తు చేసుకో వాటిని ఒప్పుకో.. నిన్ను నువ్వు ఎందుకు నిందించుకుంటున్నావో తెలుసుకో.. నిన్ను నువ్వే క్షమించు.. నిన్ను నువ్వు క్షమించుకున్నప్పుడే అవతలి వాడిని క్షమించేంత గుణం నీకు ఏర్పడుతుంది.

స్నేహితుడి తల్లిని ప్రేమించడం, చిన్నప్పుడు తన తల్లీ మరియు తన గురువు అయిన బిందు మేడంతో సరసాలు, తన గురువు మరియు అమ్మతో సమానమైన పిన్నితో రతి, కన్న తండ్రిని చంపడం.. ఇంకా చాలా ప్రతీ ఒక్క సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూనే ఏడుస్తూ వాటిని ఒప్పుకుంటూ దాటుకుంటూ స్వాదిష్టాన చక్రాన్ని తెరిచాడు.. ఒక రోజు గడిచిపోయింది.

పరుశురాముడు : (జలపాతం దెగ్గర) తరువాత మణిపూర చక్రం, కడుపులో ఉంటుంది, సంకల్పాన్ని సూచిస్తుంది.. నీకు జరిగిన అవమానాల వల్ల మూసుకుపోయి ఉంటుంది, నీకు జరిగిన అవమానాలు గుర్తుతెచ్చుకో ఎందుకు సిగ్గుపడుతున్నావ్.. వాటన్నిటిని దాటు.. దీనికి ఎవరూ అతీతులు కారని తెలుసుకో..

విక్రమాదిత్య తన చిన్నతనం నుంచి పడిన అవమానాలు చులకన మాటలు అన్ని గుర్తుతెచ్చుకున్నాడు, వాటన్నిటిని దాటడం పెద్ద కష్టం అనిపించలేదు. త్వరగానే మణిపూర చక్రాన్ని తెరిచాడు.

పరుశురాముడు : తరువాత అనాహత చక్రం, గుండెకి దెగ్గర్లో ఉంటుంది, ప్రేమని సూచిస్తుంది, దుఃఖం వల్ల మూసుకుపోయి ఉంటుంది.

విక్రమాదిత్య తన జీవితంలో కోల్పోయిన అత్యంత విలువైనది.. మానస.. కళ్ళు మూసుకుని ఉన్నా కన్నీరు కారడం ఆగలేదు.. ఆ తరువాత తన వాళ్ళు తన పిన్ని, స్నేహితుడు రాజు, సునీల్, రాజు వాళ్ల అమ్మ, ఎందరో..

పరుశురాముడు : అందరినీ కోల్పోయానన్న చింత వలదు, వాళ్లందరి ప్రేమా ఆప్యాయత నీలోనే ఉన్నాయని తెలుసుకో వాళ్ళని, వాళ్ళతో పాటు నిన్ను నీలోనే వెతుక్కో

పరుశురాముడి మాటలు వింటుండగానే మానస మదిలో మెదిలింది, తన చిరునవ్వు తన మాటలు.. విక్రమాదిత్య ముఖం ప్రశాంతమయమయ్యింది

పరుశురాముడు :  నీ బాధని అందులో ఉన్న గాయాలని పోనివ్వు అనగానే విక్రమాదిత్య నవ్వుతూ కళ్ళు తుడుచుకున్నాడు.

పరుశురాముడు : విశుద్ధ చక్రం గొంతు దెగ్గర ఉంటుంది, నిజాన్ని సూచిస్తుంది, నీ అబద్ధాల వల్ల మూసుకుపోయి ఉంటుంది.

విక్రమాదిత్య ఎంతో మంది దెగ్గర అబద్ధాలు అడాడు, ఈ లోకాన్ని తనొక పేద వాడిగా ఎంతో కాలం నమ్మించాడు అవన్నీ గుర్తు చేసుకుని వాటిని దాటేసారికి మూడో రోజు పూర్తయ్యింది.

పరుశురాముడు : ఆజ్ఞ చక్రం వెలుగుని సూచిస్తుంది, నీలో ఉన్న సందేహాల వల్ల లేనిపోనీ భయల వల్ల మూసుకుపోయి ఉంటుంది. అవేమి లేవని అంతా ఒకటేనని ప్రతీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని.. నిన్ను నువ్వు సమాధానపరుచుకో

విక్రమాదిత్య ఈ చక్రాన్ని కూడా చాలా కష్టపడి తెరిచాడు, అంతా ఒక్కటేనని కంగారు వలదని తనని తాను ధ్రుడపరుచుకున్నాడు. ఇప్పటికి ఐదో రోజులు పూర్తయ్యింది.

పరుశురాముడు : ఆఖరి చక్రం సహస్ర చక్రం, ఒక్కసారి ఈ చక్రం తెరుచుకున్నాక నీ శరీరం నీ మనసు అన్ని నీ అధీనంలోకి వస్తాయి. (దీని కోసమే విక్రమాదిత్య ఎదురు చూస్తుంది)
సహస్ర చక్రం మెదడు పై భాగంలో ఉంటుంది, విశ్వంలోని శక్తిని సూచిస్తుంది. ధ్యానం చెయ్యి.. నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ఏది నీ మనసుని లాగుతుంది, ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తావ్ అనగానే విక్రమాదిత్యకి అనురాధ కనిపించింది, ప్రశాంతమైన మొహం అమాయకమైన కళ్ళు, తన ప్రేమ అన్నీ..

పరుశురాముడు : దాన్ని వదిలేయి

విక్రమాదిత్య : లేదు.. నా వల్ల కాదు.. నా అనురాధ

పరుశురాముడు : లేదు, తప్పదు త్యాగం చెయ్యి.. నీ ప్రేమ వల్ల నువ్వు బలహీన పడిపోతావు.. నీకు ఆ మహాశక్తి దక్కదు

విక్రమాదిత్య : నాకు ఏ మహాశక్తి అవసరం లేదు, అవన్నీ నా అనురాధ ప్రేమ ముందు ఎందుకు పనికిరావు

పరుశురాముడు : నీ త్యాగం వృధా పోదు.. నీలో దాగి ఉన్న శక్తిని ఎందుకు లేపాలో నీ పుట్టుక ఎందుకు సంభవించిందో అన్నీ చెపుతాను.. ఆఖరి చక్రం తెరువు అని కోపంగా అరిచాడు.

విక్రమాదిత్య కళ్ళ ముందు తనని ప్రేమగా చూస్తున్న అనురాధ మెల్లగా మాయం అవుతుంటే తనని అందుకోవాలని ఉన్నా కళ్ళు మూసుకున్నట్టు భ్రమించాడు అంతే సహస్ర చక్రం తెరుచుకుంది.

ఒక్కసరిగా అంతా సూన్యం.. విక్రమాదిత్య గాల్లో రెండు చేతులు చాపి అలానే కళ్ళు మూసుకుని ఉన్నాడు. తనలో ఏదో వెలుగు తన వెనక ఏదో కాంతి.. ఉన్నట్టుండి విష్ణు చక్రం తన వీపు వెనుక పెద్దగా వేగంగా తిరుగుతుంటే విక్రమాదిత్య సన్నగిల్లుతున్న శక్తితో కళ్ళు తెరిచాడు విష్ణు చక్రాన్ని చూసే లోప కళ్ళు తిరిగి పడిపోయాడు.. కింద పడుతున్న విక్రమాదిత్యను పరుశురాముడు పట్టుకున్నాడు.

ఇలా ఆరు రోజుల్లో విక్రమాదిత్య ఏడు చక్రాలని తెరిచి తన మనసుని తేలిక పరిచాడు, అమ్మ మీద భార్యల మీద బిడ్డల మీద ప్రేమని కూడా అందుకు త్యాగం చెయ్యాల్సి వచ్చింది. ఇంకా స్పృహ రాలేదు కానీ మొగ్గ లోనుంచి పువ్వు విచ్చుకున్నట్టుగా ఒక కొత్త విక్రమాదిత్య పుట్టాడని పరుశురాముడు గ్రహించాడు.
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply




Users browsing this thread: 98 Guest(s)