Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance తీరం తడి
#1
Heart 
బేసిగ్గా నా కథలు అంటే వయలంట్ గా వుంటాయి అని పేరు వుంది.  చాలా చాలా తక్కువ మందికి నచ్చే కథలు నావి. కానీ ఈ కథ దాని భిన్నమైనది. ఇది ప్రేమ కథ. కామం కూడా వుంటుందిలే... ట్రై చేయండి. 
[+] 2 users Like rambabu_penta's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Episode 1: NO


      రోడ్డంతా అటూ ఇటూ కాలేజీల బస్ ల కోసం తమ తమ స్టాప్స్ లో ఎదురుచూసే యువ్వనంతో కళ్ళనిండుగా ఉంది. రోడ్ కి ఇటుపక్కనున్న శ్రీధి కాలేజీ బస్ స్టాప్ మీదే చుట్టుపక్కలున్న అందరి దృష్టి. మామూలుగానే శ్రీధి కాలేజి అమ్మాయిలంటే విజయవాడలో ఒక రేంజ్ ఉంది. బయటి కాలేజీ అబ్బాయిలకు శ్రీధి కాలేజి అమ్మాయితో మాట్లాడడం ఒక స్టేటస్ సింబల్ లాగా అన్నమాట. ఇక ఆ కాలేజీ అమ్మాయిని పడేస్తే వాడిక వాడి కాలేజీలో హీరో బిల్డఅప్ ఇచ్చుడే. అలాంటిది ఈ బస్టాప్ లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురు అమ్మాయిలు ఎక్కుతారు. వీళ్ళు కాలేజీలోకల్లా అందమైన అమ్మాయిలే కాదు, అల్లరి చేసే అమ్మాయిలు కూడా.. సనా అయితే మరీనూ. ఈ రోజు అప్పటికే ఐదుగురు అమ్మాయిలు వచ్చేశారు సనాతో సహా. చుట్టుపక్కల అందరి కళ్ళూ వీళ్ళ మీదే ఉన్నాయి. ఒక్కడివి తప్ప. వాడెవడో కొత్త అనుకుంటా ఇక్కడ. ఈ అమ్మాయిల  పక్కనే ఉన్న స్టాప్ లో ఆ కుర్రాడు వీపుకి బాగ్ తగిలించుకుని మెడలో కెమెరా పెట్టుకుని అటెటో తిరిగి వంగి వంగి పువ్వుల్ని పురుగుల్ని ఫోటో తీస్తున్నాడు. నవ్వుకుంటూ, తుళ్ళకుంటూ, బట్టలు సరి చేసుకుంటూ, ఎవరెవరు తమని చూస్తున్నారో ఓరకంటితో లెక్కేస్తున్న సనాకి వీడి నిర్లక్ష్యపు ధోరణి ఆశ్చర్యం తెప్పించింది. 
"అటు చూడండే.. ఎదురుగా పువ్వుల్లాంటి మనల్ని పెట్టుకుని పురుగుల్ని ఫోటోలు తీస్తున్నాడు అంది"
అంతే ఐదుగురు కలిపి వాడిని స్కాన్ చేసేస్తున్నారు. 
"కుర్రాడి కలర్ నీకు మాచింగేనే సనా" అంటూ పక్కనున్న పాప సనా నడుం గిల్లి చెప్పింది. 
"ఐ హావ్ ఏ బాయ్ ఫ్రెండ్" ఆ కుర్రాడి మొహం చూడడం కోసం అటే చూస్తూ ఇటు పాపతో చెప్పింది సనా.
"మరీ అలా తినేసేలాగా చూడకే.. దిలీప్ కి చెప్తా.. అదే నీ బాయ్ ఫ్రెండ్ కి చెప్తా"
"చెప్పుకో"
అంతలో బీప్ అని గట్టిగా హార్న్ మోగడం వలన అంతా రోడ్ వైపు తిరిగారు. ఎదురుగా కార్ ఆగింది. అద్దం దించి లోపల నుండి ఓ అమ్మాయి తొంగి చూస్తూ "గెట్ ఇన్" అంది.
అప్పటిదాకా ఈ ఐదుగురు అమ్మాయిల్నే చూసిన చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు కారులోని అమ్మాయి కోసం తొంగి తొంగి చూస్తున్నారు. ఎందుకంటే తానే ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆఫ్ శ్రీధి కాలేజీ. అఫ్కోర్స్ ఆ కాలేజీలోకల్లా అందమైన అమ్మాయి అంటే విజయవాడలోకల్లా అందమైన అమ్మాయనే అర్థం. పేరు రాశి.. రాశి ఖన్నా..
"ఏంటే సడన్ గా కార్ ఏసుకొచ్చావ్" తన బరువైన ఛాతిని తలుపుకు అద్ది తల లోపలికి పెట్టి అడిగింది సనా
"ఇక ఈ కార్ మనదే" కళ్ళు మెరుస్తూ చెప్పింది రాశి
[Image: 91061264_269112037430694_3576758183248527360_n.jpg]
"మీ డాడ్ అంత ఈజీగా ఎలా ఇచ్చేసాడే" మళ్ళా ఆశ్చర్యంగా అడిగింది సనా..
"ముందు ఎక్కండి.. దారిలో చెప్తా" అని కొద్దిగా వంగి డోర్ ఓపెన్ చేసింది. తాను పంజాబీ టాప్ వేసుకోవడం వలన కొద్దిగా ఎద అలా అలా సనాకి దర్శనమిచ్చింది. అయినా ఇలా కనపడడం అమ్మాయిలకు కొత్తేమి కాదు. ఒకళ్ళవి ఒకళ్లకు ఏదో రకంగా కనిపిస్తూనే ఉంటాయి. 
వెంటనే  తలుపులు తీసుకుని ఐదుగురు అమ్మాయిలు ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటూ ఇరుగ్గా కూర్చున్నారు.
"మంచి కుర్రాడు ఉన్నాడు. కాసేపాగి వచ్చి ఉంటే సైట్ ఏసుకునే వాళ్ళం కదే" అంది సనా వేలు ఆ కుర్రాడి వైపు చూపిస్తూ.. రాశి కళ్ళు ఆమె చూపుడు వేళ్ళని అనుసరిస్తూ అతనిని చూస్తున్నాయి. అతను వంగి ఏవో ఫోటోలు తీసుకుంటూనే వున్నాడు.
"వాళ్ళం కాదు, నువ్వే సైట్ కొడ్తున్నావ్ మమ్మల్ని కలపకు" పక్కనున్న పాప సనాకు కౌంటర్ ఏసింది.
"అబ్బాహ్ చూడవే.. ఇంకొంచెం వంగుంటే బ్యాక్ క్లీవేజ్ కనిపిస్తది" చిలిపిగా రాశిని భుజం మీద పొడుస్తూ అనింది సనా.
"వాట్ ద నాన్సెన్స్.  సనా.. థిస్ ఐస్ రాంగ్, disgusting.. unintentional గా కనిపించే వాటిని మనం చూడకూడదు అండ్ ఇలా మాట్లాడకూడదు" అతన్ని చూస్తూనే అంది రాశి.
"ఇదొకటి.. జోక్ కి నిజానికి తేడా తెలీదు" చిరాగ్గా ఫేస్ పెట్టింది సనా..
"వాటెవర్" అని చూపు తిప్పి కార్ కీ తిప్పి స్టార్ట్ చేసింది.
అంతలో ఎదురుగా..ఒక 15 మీటర్ల దూరంలో ఒక ముసలి మనిషి నేల మీద పడి ఉండడం గమనించింది రాశి. తదేకంగా అతన్నే చూస్తుంది. ఒక్క సారిగా కళ్ళు పెద్దవి చేసి కార్ ఆపేసింది. తలుపు తీయబోతున్న రాశితో "ఏమైందే" అని అడిగింది సనా. 
"సీ అక్కడ ఎవరో ముసలాయన పడిపోయి ఉన్నాడు.. ఎవరూ పట్టించుకోవట్లేదేంటి ఇంతమంది ఉన్నారు రోడ్ మీద.." అంటూ దిగిపోయింది.
తనతో పాటు మిగతా అమ్మాయిలు కూడా దిగి రాశి తో పాటు నడుస్తున్నారు.
"ఎవడో తాగుబోతు అయ్యుంటాడు లేవే" పక్కనున్న పాప ఆపడానికి ప్రయత్నిస్తుంది.
"మే బీ..బట్ అక్కడ బ్లడ్ ఉంది" అంది రాశి వేగంగా నడుస్తూ.
వెంటనే సనా నడకని పరుగులాంటి నడకగా మార్చింది రాశి తో సమానంగా.
వీళ్లంతా వేగంగా నడుచుకుంటూ ఆ ఫోటోలు తీసుకుంటున్న కుర్రాడిని దాటేశారు. ఇంతమంది అంత వేగంగా నడిచేసారికి అతని దృష్టి వీళ్ళ మీద పడింది. ఇతనూ వీళ్ళని చూస్తూ చిన్నగా నాలుగు అడుగులు వేసాడు.
పడిపోయిన ఆ ముసలి వ్యక్తి దగ్గరకు చేరిన రాశి అతన్ని లేపి కూర్చోపెట్టింది. 
"థాంక్ గాడ్, ఈ బ్లడ్ కాలికి తగిలిందే.. ఏదో చిన్న గాయమే" ఊపిరి పీలుస్తూ చెప్పింది సనా. 
"యా, హే నా కార్ లో వాటర్ తీసుకురా" అని పక్కనున్న పాపకు చెప్పింది రాశి. 
"రాశి.. అవసరమా.. ఏదో చిన్న దెబ్బే కదా.. వాసన చూడు.తాగి దేనికో తగిలి పడిపోయి వుంటాడు. లెట్స్ గో.. ఇవన్నీ మనం.." అని పక్కనున్న పాప ఏదో చెప్తుండగా "నువ్వేమన్నా మోస్తున్నవా? వాటర్ కదా నిన్ను తెమ్మంది?!" సూటిగా కోపంగా చూసింది రాశి
"ఓకే" అని పైకి అని అసహనంగా వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది.
ఒక ఐదు నిమిషాల్లో ఆ ముసలి వ్యక్తిని పక్కన బండ మీద చేర్చి మొహం మీద నీళ్లు కొట్టి లేపడానికి ప్రయత్నించారు. అతను చిన్నగా స్పృహలోకి వచ్చాడు. తాగడానికి కొంచెం నీళ్లు ఇచ్చి అతనితో మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలంటూ ఆరా తీస్తే కృష్ణలంక అన్నాడు. సరే పదండి కార్ ఎక్కుదాం అని లేపడానికి ప్రయత్నిస్తే లేవలేకపోయాడు. అంతే రాశి, సనా అతని చెరొక చేయి చెరొక భుజం మీద వేసుకుని అతన్ని లేపారు. అప్పటికే కొద్దిగా స్పీరోహలోకి వచ్చిన అతను.. "ఫో.. ఫో.. ఫోన్ కావాలి" అన్నాడు. 
వెంటనే తడుముకోకుండా రాశి తన ఫోన్ తీసుకుని నెంబర్ చెప్పమంది. తన చున్నీ కిందపడడం తాను చూసుకోలేదు. అతను చెప్పిన నెంబర్ కి కాల్ చేసింది. సనా మీద నుండి చేయి తీసి రాశి ఫోన్ తీసుకున్నాడు. 
"హలో.. అరేయ్ నేనురా ఎంకట్రావుని.. ఆ నాకేం గాలేదు.. ఆ లంజకొడుకులేదో అనుకున్నారు నన్ను దెంగబెట్టడం మాటలా.." అతను లంజకొడుకులు అన్న మాట వినపడగానే అమ్మాయిలందరూ ఇబ్బంది పడిపోయారు.. చుట్టూరా ఉన్న జనాల మొహాల్లోకి చూడబుద్ది కాలేదు. రాశికి కూడా ఏమి చేయాలో అర్థం కాలేదు. సరే అనింది ఏదో అనేశాడు. ఏదో తాగిన మత్తులో అన్నాడు అనుకుని రాశి సర్దిచెప్పుకుంది. అంతలో "ఆ నా కొడుకులు నా ఆతులతో సమానం. ఆ ఏంది? వాళ్ళమ్మా పూకులే..నా మొడ్డ గుడిపిస్తా.." అంతే.. "హెలో" అంటూ ఓ పాప ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ పక్కకి పారిపోయింది. ట్రిక్ అర్థంచేసుకున్న అమ్మాయిలు ఒక్కొక్కరుగా పక్కకి హలో అంటూ పోయారు. రాశి, సనా తప్ప.
"ఇక్కడే సర్కిల్ కాడే వున్నా.. లేదు లేదు నా కొడుకులు ఒంటరిగా దొరికా అని మాటు ఏసి కొట్టి దెంగారు. వాళ్ళమ్మల్ని దెంగ.. దొంగ దెబ్బ తీశారు. ఆతులు కూడా మొలవని పిల్ల మొడ్డలు గుద్దలో కారం కొట్టి దెంగుతా.. అవును. అదే.. అంతే..ఒక్కొక్కడి పెళ్ళాన్ని లంజని చేసి బజారులో దెంగాలి అప్పుడు తెలుసుద్ది మన దెబ్బ" అంటుండగా.. సనాకి కోపం వచ్చింది "ఎనఫ్.. లీవ్ హిం.. లెట్స్ గో" అంటూ కోపంగా నడిచిపోయింది. వెనుక రాశి వస్తుంది అనుకుందేమో పాపం. పాపం రాశి ఏమో అలా పారిపోలేదు. ఎందుకంటే తనది అలా బాధితుణ్ణి ఒంటరిగా వదిలేసే స్వభావం కాదు. పైగా అతనికి చేసే సహాయంతో మధ్యలో ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా అతను చెవుల్లో తుప్పు వదిలే భాషని మాట్లాడుతుంది తన ఫోన్ లొనే. "లేదు సెక్యూరిటీ ఆఫీసర్ కాదు.. ఎవత్తో లేపింది. కాలేజీ ముండ అనుకుంట.. ముండ నీళ్లు కొట్టి..." అంతే రాశికి కోపం వచ్చింది. అతని ఫోన్ లాక్కుని. నడుచుకుంటూ పక్కకి వచ్చింది కోపంగా చూస్తూ అతన్ని. అతను తూలి కింద పడబోయి పక్కనే ఉన్న బండ మీద కూర్చుని ఏదో తిడ్తున్నాడు. తాను అలా వెళ్ళి కార్ ఎక్కి స్పీడ్ గా వెళ్లిపోయింది.

వెళ్లిపోయే కారుని తన కెమెరాలో చూసి కెమెరా ఆఫ్ బటన్ నొక్కాడు ఆ కుర్రాడు.

***

"రాశీ ఇది చూశావా" పరిగెత్తుకుంటూ ఒకమ్మాయి కాలేజీ కారిడార్ లో నడుస్తున్న రాశి దగ్గరకొచ్చింది తన మొబైల్ చూపిస్తూ..
ఏమిటన్నట్టుగా చూస్తూ ఆమె చేతిలో ఫోన్ ని తన చేతిలోకి తీసుకుని చూస్తుంది. "ఇయర్ ఫోన్స్" అంటూ ఇచ్చింది ఆ అమ్మాయి. చెవిలో వాటిని పెట్టుకుని చేతిలో కదిలే ప్లే బటన్ నొక్కింది. అంతే.. ఒక్కసారిగా రాశి కళ్ళు పెద్దవి అయ్యాయి. బుగ్గలు చిన్నగా ఎరుపెక్కాయి. కోపమో, ఆశ్చర్యమో మూతి ముడుచుకుని ముందుకు వచ్చింది. పక్కనున్న పాప రాశిని చూస్తూ రాశి రియాక్షన్ తో పాటు తన పెదాలు వికశింపచేస్తుంది. వీడియో ఐపోయాక ఆ పాప నవ్వుతూ.. "ఎవడో సూపర్ క్లియర్ గా తీసాడు కదే".. రాశి కోపంగా చూసింది. "వ్యూస్ చూడు 20k.. ఒక్కరోజులోనే 20k అంటే నువ్వు మాస్ ఏ.. ఈ రోజే అప్లోడ్ చేశాడు ఆడెవడో". రాశి వింటూనే ఆ యూట్యూబ్ ఛానెల్ ని చూస్తుంది. 'క్యూట్ గర్ల్ ఎంబ్రాస్డ్ ఆన్ విజయవాడ స్టీట్స్' అనే టైటిల్, తన రకరకాల హావాభావాల ఫిక్స్ తో థంబ్ నైల్ పెట్టాడు. ఆ ఛానెల్ లో హైయెస్ట్ వ్యూస్ కూడా ఈ వీడియో కే. వారం క్రితం ముసలాయనకు సాయం చేయబోయి రోడ్ మీద ఇబ్బంది పడ్డ తన పరిస్థితిని ఆడియో తో సహా ఇలా నెట్లో పెట్టేసాడు. రాశికి ఏం చేయాలో ఏమి అర్థం కాలేదు.  కామెంట్స్ లో అందరూ తన అందాన్ని, మంచితనాన్ని పొగుతున్నారు. ఇదంతా రాశికి కొత్తగా ఉంది. అసలే సోషల్ మీడియాలో కూడా తాను ఫొటోస్ పెట్టదు. ఇలా ఇన్ని పొగడ్తలు ఒకేసారి వస్తుంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. మరో పక్క ఆరోజు పడిన ఇబ్బందిని ఇలా పాపులర్ చేసి అందరికీ తాను ఇలానే గుర్తుండేట్టుగా చేశాడు.
 "ఆ ఛానెల్ వాడికి ఎలా అయినా మెసేజ్ చేసి ఇది తీపించేయలి" అంది రాశి. పక్కనున్న పాప షాక్ అయింది. "
ఏంటే అంత మాటాన్నావ్.. చూసావా అందరూ నిన్నెలా పొగుతున్నారో.. కానీ నువ్వు.." అని ఇంకేదో చెప్పేలోగా "అది డిలీట్ అవ్వాల్సిందే" అంది సూటిగా. ఇంక రాశికి చెప్పి ఉపయోగం లేదు అనుకుంది పాప. 
ఆ వీడియో లింక్ ని సనాకు వాట్సాప్ చేసి. మేక్ హిం డిలీట్ థిస్ అని పంపింది.
"Excuse me" క్లాస్ రూంలో ఇబ్బందిగా కూర్చుని ఫోన్లో ఏదో చూస్తున్న రాశికి పిలుపు వినగానే పైకి చూసింది. ఫార్మల్ డ్రెస్ లో తెల్లగా కొంచెం అమాయకంగా కనిపిస్తున్న కుర్రాడు ఉన్నాడు ఎదురుగా.
"యెస్" అంది ఎవరా ఇతను అని ఆలోచిస్తూ.
"హాయ్ అండి. నా పేరు అర్జున్. ఈసీఈ 3 నేను" అని ఆపాడు
"ఓహ్"
"అదీ.. మొన్న saturday మీరు benz circle దగ్గర.." అని చెప్పబోతుండగా రాశికి అతను ఏ సంఘటన గురించి మాట్లాడబోతున్నాడో అర్థం అయింది. "హే.. ప్లీస్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ ఇన్సిడెంట్" అంటూ కట్ చేసింది.
"అంటే అదీ.." అంటూ భయంగా మాట్లాడబోతున్నాడు
"ప్లీస్" అంటూ మళ్ళా ఫోన్ లోకి దూరిపోయి ఏదో స్క్రోల్ చేస్తుంది.
"ఆ వీడియో నేనే తీశాను"
రాశి ఫోన్ లో చేసేది ఆపేసి. కళ్ళతో పైకి చూసింది. అలా చూస్తూనే చిన్నగా లేచింది. అతను ఏదో ఇబ్బందిగానే చూస్తున్నాడు. రాశి చేతులు కట్టుకుని "యా చెప్పు" అంది కొంచెం కళ్ళతో కోపాన్ని ఒలికిస్తూ
"అదే.. నాకో యూట్యూబ్ ఛానల్ ఉంది.. ప్రాంక్ వీడియోస్ అవీ చేస్తుంటాను. మొన్న ఆరోజు మీరంతా కలిపి ముసలాయనికి హెల్ప్ చేశారు కదా.. అప్పుడు అక్కడే ఉన్నా.. అప్పుడు వీడియో తీశాను.."
రాశి అలానే చూస్తుంది. కోపంగా చూస్తుందని అర్థం అయినా చెప్పడమే గతి అని మళ్ళా గొంతు సరిచేసుకుని
"...అది నా ఛానెల్ లో పెట్టాను. రెస్పాన్స్ అంత బాగా వస్తుందనుకోలేదు" అంటూ చూశాడు
"అయితే" అంది ఇంకా ఇంకా అతని కళ్ళల్లోకి చూస్తూ
"అదే మీ పెర్మిషన్ తీసుకుందాం అని..."
రాశికి ఈ మాటకి మండిపోయింది. అంతే తన స్టైల్ లో క్లాస్ మొదలెట్టడానికి సిద్ధమైంది.
"నీకు కంసెంట్ మీనింగ్ తెలుసా అసలు? పెర్మిషన్ అడుగుతున్నవా? ఇప్పుడు? 20 వేల మంది చూసిన తర్వాత అందులో ఉన్న నన్ను అడుగుతున్నవా? డోంట్ యూ నో హౌ టు రెస్పెక్ట్ ప్రైవసీ?"
"Sorry"
"Not accepted" అని తాను కూర్చుని తన ఫోన్లో చూసుకుంటుంది.
"తప్పు నాదే. మిమ్మల్ని ముందే అడగాల్సింది. కానీ నాకు అంత ఆలోచన రాలేదు. అలా అడగాలని కూడా తెలియదు. ఏదో హెల్ప్ చేస్తున్న అమ్మాయిని తీసి అందరికీ ఇన్స్పిరేషన్ ఇద్దాం అనుకున్నా. కానీ ఆ ముసలాయన అలా మాట్లాడేసరికి అది ఇలా టర్న్ తీసుకుంది." రాశి ఫోన్లో ఏదో స్క్రోల్ చేస్తోంది గానీ.. అతని మాటలే వింటోంది. "అసలే మీరు అందంగా ఉంటారు కదా.. నా ఛానెల్ కి వ్యూస్ కూడా వస్తాయి అని చేసేశాను. నిజంగా sorry అండి" ఫోన్ ఆపేసి రాశి అతన్ని చూసింది. అతను నిజాయితీగా చెప్పినట్టు తోస్తుంది తనకు. నిజమే చాలా మందికి కాన్సెన్ట్ అనేది అడగాలని తెలియదు. కానీ అడగకపోవడం తప్పు అని తెలిసినా అదే తప్పు చేసే వాళ్లదే తప్పు. కానీ ఇతను నిజాయితీగా నాకు తెలియదు, నేను చేసింది తప్పు అంటున్నాడు. రాశికి ఏం చెప్పాలో తెలియలేదు.
[Image: AnyConv.com__EsK5KzlVQAEIeDa.jpg]
 "నీ sorry accepted లే.. ఇంతకీ నీ పేరేంటి బాబూ" అని అతని వెనకాల నుండి మాట వినపడింది. వెనక్కి తిరిగి చూసాడు. అతనికి ఆ అమ్మాయి తెలుసు. వీడియో లో చూశాడు. "అర్జున్" అన్నాడు. "సనా నా పేరు, దీని పేరు రాశి" 
"హా తెలుసండీ"
"ఏం తెలుసు? నా పేరా? దాని పేరా? లేక ఇద్దరివా?" సనా అంతే. సందర్భాన్ని ఎప్పుడూ ఇలా ఫ్రెండ్లీ గా మార్చేస్తుంది.
"ఆమె పేరు"
"అంతేలే నీకు 'ఆమె' మీదనే ఈ ఇంటరెస్టు లాగుంది. అక్కడ ఆరుగురం వున్నా కూడా క్యూట్ గర్ల్ అంట.. మరి మేమేంటో.." ఆమె అన్న పదాన్ని నొక్కి చెప్పింది. అతను రాశిని 'ఆమె' అన్నాడని పొడుస్తూ. 
రాశికి కూడా నిజమే కదా అక్కడ అంతమంది ఉంటే క్యూట్ గర్ల్ అని తనొక్కదాన్ని ఉద్దేసింది టైటిల్ పెట్టాడు అనుకుంది.
"అంటే ఆమె.." మళ్ళా ఆమె అంటే ఈ సనా ఏమంటదో అని ఆమెని మింగేసి " అంటే తాను కదా మిమ్మల్ని అందరినీ హెల్ప్ చేయమంటూ లాక్కెళ్ళింది. అందుకే ఆమెకు ఫోకస్ పెట్టాను.. ఆమె సర్వీస్ నేచర్ వల్ల అలా.."
"అలా ఫోకస్ అంతా 'తాను' మీద పెట్టా అంటావ్" చిలిపిగా చూస్తూ అంది సనా
అర్జున్ కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అది చూసి రాశి కి నవ్వొచ్చింది. ఈ సనా నుండి ఈ క్యూట్ అబ్బాయిని కాపాడాలి అనిపించింది.
"అతను మనతో పాటు, నువ్వు రాగింగ్ చేయక్కర్లేదు" 
" ఓహో.. 'అతణ్ణి' వదిలేయమంటావ్.. నేనేం ఎత్తుకుపోనులేవే"
"ఏం మాట్లాడుతున్నవే.." ఇంక ఆపమన్నట్టుగా ఏంటి ఈ గోల అన్నట్టుగా అరచేయి తిప్పుతూ..
అలా రాశి అన్నప్పుడు అర్జున్ తననే చూస్తున్నాడు. అలా అన్నప్పుడు తన కదిలే కనుబొమ్మలు, పెదవులు, అటూ ఇటూ తిరిగిన తల, అన్ని దిక్కులూ కదిలిన చెవి దుద్దులూ అన్నీ భలే నచ్చేస్తున్నాయి. ఇంకాసేపు అలా చూస్తే బాగోదని బలవంతంగా తల తిప్పుకుని రాశి ఇబ్బందిని చూసి నవ్వుతున్న సనాని చూస్తున్నాడు.
"బాబూ.. అలా చూడకు. ఐ హావ్ ఏ బాయ్ ఫ్రెండ్" టీజింగ్ గా అంది సనా
"అవును ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్ తోనే షికార్లు కొట్టి సాయంత్రానికి వచ్చింది కాలేజీకి" పక్కనున్న పాప అనింది.
"వాడు అడిగాడా?" పాపతో అనింది సనా
"వాడు ఆడిగాడని చెప్పవా ఇవన్నీ" సనా కి కౌంటర్ ఏసింది పాప.
వాళ్లిద్దరూ వాడు అనేసరికి అర్జున్ కి ఇబ్బందిగా అనిపించింది. అది రాశికి అర్థం అయింది.
"వాళ్ళు ఓవర్ ఫ్రెండ్లీలే.. నాట్ ఇంటెన్షనల్" అంది అర్జున్ తో
"ఇట్స్ ఓకే" అని గొంతు సరిచేసుకుని "మీరు చూసారో లేదో.. నేను మొత్తం వీడియో పెట్టలేదు. చివరన మీరు అతన్ని వదిలేసి వెళ్లే అంత వరకూ తీయలేదు.."
"పెట్టాల్సింది ఏముంది" అంది సనా
"అంటే అతను చివర్లో తనను తిట్టాడు వాడు అందుకే.." అంటూ చేతిలో ఫోన్ తీసి రాశికి ఇచ్చాడు చూడమని. 
రాశి ప్లే చేసి చూసింది. సనా, పక్కనున్న పాప కూడా చేరారు. వీడియోలో సనా వదిలేయడం వరకే తీశాడు. రాశిని ప్రపంచానికి చాలా పాజిటివ్ గా చూపిస్తున్నాడు. రాశికి అతను చూపించిన ఈ శ్రద్ధ నచ్చింది. చిన్నగా కామెంట్స్ వైపు వెళ్ళింది. ఒక కామెంట్ చూసి ఆగింది. 'పిట్ట  వెనుక బస్తాల సైజ్ ఎంత మాస్టారు' అని ఉంది. రాశికి కోపం వచ్చింది. అసహనం పెరిగిపోయింది.  దానికి ఛానల్ ఓనర్ ఏదో రిప్లై ఉంది. 'మీ అమ్మని అడుగు మాస్టారు బాగా గెస్ చేస్తుంది' అని. అది చూసాక రాశికి కుదుటపడింది. సంతృప్తిగా ఉంది. రాశి ఆ కామెంట్ చదివింది అని అర్థం చేసుకున్న సనా రాసి భుజాల మీదుగా చేయి వేసి దగ్గరకి తీసుకుని "డోంట్ కేర్ ఇవన్నీ" అంది. 
ఇప్పుడు రాశికి అర్జున్ నచ్చాడు. అతను చేసిన పని నచ్చింది. అతను తన దగ్గరకు రావడం నచ్చింది. అమాయకంగా పర్మిషన్ అడగడం నచ్చింది. సనా దగ్గర ఇబ్బంది పడడం నచ్చింది. సనా దగ్గరనుండి అతన్ని కాపాడడం నచ్చింది.
కానీ "వాట్ ఈజ్ థిస్ రిప్లై" అంది అతను ఇచ్చిన రిప్లై చూపిస్తూ..
"హా..మిమ్మల్ని అన్నాడు అని నేను అన్నా.."
"నో. నన్ను అన్నాడని నువ్వు వాళ్ళమ్మని అన్నావ్"
"అదే.. బట్ వాడినే అన్నా.."
"మరి వాళ్ళమ్మ ఎందుకు వచ్చింది"
"నేను వాడిని బ్లాక్ చేసేసాను ఇంక అలాంటి కామెంట్స్ రావు"
"అలా అనే వాళ్ళు ఏ మూల చూసినా ఉంటారు. కానీ నువ్వు కూడా అలా అంటే నీకు వాడికి తేడా ఏముంది"
అర్జున్ ఒక్క నిమిషం ఆలోచించాడు. ఏమనుకున్నాడో మరి "ఇంకెప్పుడూ అలా అనను" అన్నాడు.
"ఐ కెన్ అండర్స్టాండ్. నీ ఇంటెన్షన్ తిట్టడం కాదు. బట్ మనం కూడా వాడి భాషే మాట్లాడితే యూజ్ ఏముంది? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ వి కన్ మేక్ విత్ దట్ లాంగ్యుఏజ్"
"హ్మ్మ్.." అంటూ.."మీరు ఫెమినిష్టా"అన్నాడు
రాశికి ఏమనాలో అర్థంకాలేదు. సనా, పక్కనున్న పాప మొహంలోకి చూసింది రాశి. ముగ్గురూ ఒకేసారి నవ్వేశారు. 
"ఏంటి" అయోమయంగా అన్నాడు అర్జున్
కాస్త నువ్వు ఆపి "ఫ్రీడమ్, ఈక్వాలిటీ గురించి పోరాడే అందరూ ఫెమిస్టులే". 
"మరి.."అని అర్జున్ ఏదో అనబోతుండగా "ఫెమినిస్టు పేరు వాడే వాళ్ళందరూ ఫ్రీడమ్, ఈక్వాలిటీ గురించే మాట్లాడాలని లేదు. కొందరు పెర్సొనల్ బెనిఫిట్స్, ఇంకొందరు సరిగా అర్థంచేసుకోలేక ఫెమినిస్ట్ మంటూ ఉంటారు"
"అయితే మీరు ఫెమినిస్టు అంటారు"
"హ్మ్.. యా.. బట్ ఫెమినిజం పేరు చెప్పకుండా కూడా మనం ఫెమినిస్టులమవ్వొచ్చు"
"ఓకే.." అన్నాడు ఏదో అర్థంచేసుకున్నట్టు.
రాశికి ఇప్పుడు అతనికి నేర్పడం నచ్చింది. అతన్ని మార్చడం నచ్చింది. అతను తనని ప్రశ్నలు అడగడం నచ్చింది.
"పెర్మిషన్ ఇస్తున్నారా అయితే" ఈసారి ఫ్రీగా అడిగాడు
"నో" అంది నవ్వుతూ అతని ఫోన్ అతనికిచ్చేస్తూ..
"నా ఫోన్ మీ చేతిలోనే వుంది కదా. మీరే డిలీట్ చేసేయండి" అన్నాడు.
నవ్వుతూ టేబుల్ మీద పెట్టింది. తనని చూస్తే అదే నవ్వుతో "నో" అంది.
***
[+] 7 users Like rambabu_penta's post
Like Reply
#3
March 26, 2021
తీరం తడి
 Episode 2: YES
"ఏంటి ఇక్కడా..?"  ఆశ్చర్యపోయాడు అర్జున్
"అవును ఇక్కడే" నవ్వుతూ చెప్పింది రాశి
"ఇంత ఎండలో.. నడి రోడ్డులో.. నువ్వేమో తెల్లగా లేతగా ఉన్నావ్.. తట్టుకోలేవేమో"
"ఐ కెన్ హ్యాండిల్" మళ్ళీ నవ్వుతూ చెప్పింది రాశి.
"అది కాదు.. చూడు ఎంతమంది ఉన్నారో.. మూడు వైపుల నుండీ.. నీ ఒక్క దాని వల్ల కాదు"
"అవును. వల్ల కాదు అందుకే సన అటు వచ్చే వాళ్ళని హ్యాండిల్ చేస్తది"
"సన చేస్తుంది. బట్ నువ్వు అలా చేసే అమ్మాయిలాగా ఉండవు.."
"ష్.. అబ్బా.. నువ్వు వీడియో తీయి అంతా.. నేను చూసుకుంటా ఇదంతా.. ఐ ఫైండ్ మై హ్యాపీనెస్ హియర్"
ఇంకేం మాట్లాడలేకపోయాడు. నది రోడ్డున, అదీ మిట్ట మధ్యాహ్నం, అదీ కాళేశ్వరం మార్కెట్ ఏరియా లో ఇలా ఇద్దరు క్యూట్, పోష్ అమ్మాయిలు ట్రాఫిక్ సెక్యూరిటీ అధికారి లాగా కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయమా..

రాశి ఒకవైపు, సన ఒకవైపు నుంచుని ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. వీళ్లకు ఇదేం సామాజిక పిచ్చో అనుకుంటూ అర్జున్ వాళ్ళని కవర్ చేస్తున్నాడు. 
[Image: EQLB3ZGU0AE7hyI-_1_.jpg]
రాశికి అర్జున్ పరిచయమై వారం తిరక్కుండానే దగ్గరయ్యాడు.  తాను తీసిన వీడియో ఛానల్ లో ఉంచడానికి పెర్మిషన్ కోసమంటూ తిరిగాడు. రాశి కూడా పెర్మిషన్ ఇవ్వనంటూనే తీసేయమని కూడా చెప్పట్లేదు. ఇలా అందమైన అమ్మాయి వెంట తిరగడానికి ఆ అమ్మాయే అవకాశం ఇస్తుంటే ఏ అబ్బాయినా ఎందుకు తిరగడు. సనకు కూడా అర్జున్ నచ్చాడు. అందుకే ఫ్రెండ్ చేసేసుకుంది. సనకు నచ్చడం వల్ల రాశికి కూడా ఫ్రెండ్ గా నచ్చాడు. అతనిలోని అమాయకత్వం, నిజాయితీ నచ్చింది రాశికి. అన్నిటికన్నా ముఖ్యంగా అతను ఆ వీడియోలో ఉన్న మిగతా అమ్మాయిల అందరి దగ్గరకు వెళ్లి పెర్మిషన్ తెచుకోడానికి పడ్డ పాట్లు నచ్చాయి. అయినా కూడా రాశి చివరకు నో అనే అంది. బహువచనాలు ఏకవచనాలు అయిన కొత్తల్లోనే అర్జున్ అడిగాడు "ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు ఆ వీడియో ఉంచడానికి" అని.
"నీకు కంసెంట్ గురించి చెప్పడానికి" అంది. 
"నాకు అర్థం అయింది కదా.. అందుకేగా అందర్నీ అడిగి ఒప్పించా.. నిన్ను తప్ప" అన్నాడు.
"ఇంకొకళ్ళు ఉన్నారు"
"ఎవరు?" ఆశ్చర్యపోయాడు.
"ఆ అంకుల్" 
"అంకులా.. వాట్ ద ఫ.. ఆ ముసలాడా.. వాడిని అడిగేది ఏంటి.. వాడు ఏమన్నా నష్టపోతాడా అసలు ఈ వీడియో వల్ల నువ్వేదో"
"అవన్నీ కాదు అతన్ని ఒప్పిస్తేనే నేను ఒప్పుకుంటా.."
"రాశి.. వాడు.."
రాశి కోపంగా చూసింది రెస్పెక్ట్ ఇవ్వమన్నట్టుగా
"అతను చేసింది తప్పు..ఈ వీడియో వల్ల ఎప్పటికైనా అతను గిల్ట్ ఫీల్ అవుతాడు.. చేంజ్ అవుతాడు చూడు.."
"ఐ బిలీవ్ ఇన్ చేంజ్. బట్ ఇలా ఒక్క వీడియోకే ఎవరూ మారరు.. అయినా నువ్వు అతన్ని అడిగి పెర్మిషన్ తీసుకోవాల్సిందే.." అని అంది. అంతే ఇంక అర్జున్ ఆ వీడియో మాట ఎత్తలేదు.. కాకపోతే ఇక నుండి రాశి చేసే పనులు వీడియో తీసుకోడానికి పెర్మిషన్ అడిగాడు. వాటికి ఒప్పేసుకుంది. అలా వాళ్ళు వీడియోస్ తీస్తూ దగ్గరవుతున్నారు.. అలా ఇలా ఈ రోడ్ మీదకు చేరారు.

రాశి, సన చెరో వైపు నుంచుని ట్రాఫిక్ ని మ్యానేజ్ చేస్తుంటే అబ్బాయిలు, అంకుల్స్ కళ్ళు వీళ్ళని తడిమేస్తున్నాయి.  పాలకోవాల్లాగా నోరూరిస్తున్నారు.. వెళ్లే వాళ్ళు వెనక్కి తిరిగిమరీ రాశి వెనుకని చూస్తున్నారు. అసలే చుడిదార్ కొద్దిగా టైట్ గా ఉంది కదా.. రాశి పెద్ద విశాలమైన పిరుదుల షేప్ కనిపిస్తుంది. అటు ఇటు పోయే కుర్రాళ్ళు వెక్కి నవ్వులు నవ్వుతూ పోతున్నారు.. అర్జున్ ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అంతలో ఒకతను రాశి దగ్గరకు వచ్చాడు. అతన్ని చూడగానే అర్జున్ అతన్ని గుర్తు పట్టాడు, రాశి కూడ గుర్తుట్టిందని చూస్తున్న అర్జున్ కి అర్థం అయింది. ఎందుకు మర్చిపోతారు అసలు. అప్పటికే కొన్ని వందల సార్లు అతన్ని వీడియోలో చూశారు వీళ్ళు. ఆ రోజు రాశి హెల్ప్ చేసిన ముసలాయనే ఇతను. 
"అమ్మాయ్.." అంటూ దగ్గరకు వచ్చాడు.
అంతే రాశి భయపడి అర్జున్ ని సైగ చేసింది. భయపడింది ఏమన్నా చేస్తాడని కాదు. మళ్ళా బూతు పురాణం ఎత్తుకుంటాడేమో అని. అర్జున్ దగ్గరకి వచ్చాడు. "ఆరోజు తాగినా అమ్మాయ్.. నా పెళ్ళాం బాగా దెంగులు పెట్టింది.. అంత మంచి అమ్మాయిని, పైగా నన్ను కాపాడి సాయం చేసిన అమ్మాయిని ముండ అన్నాను అని. సారీ అమ్మాయి" అంటూ దణ్ణం పెట్టాడు. అంతే రాశికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "నేను తాగుడు తగ్గించా అమ్మాయ్ చాలా బాధ పడ్డా.. ఆ వీడియో చూసినోళ్లు అంతా నన్ను తిట్టారు.. ఎంత తప్పు చేసానో తెలిసొచ్చింది"
"అయ్యో పర్లేదు అంకుల్" అని అర్జున్ వైపు చూసింది రాశి
చూసావా నేను చెప్పినట్టు మారిపోయాడు అన్నట్టుగా చిన్ని నవ్వు ఇస్తున్నాడు అర్జున్.
"నేను ఏదో తాగి అనేసాను.. తప్పు తెలుసుకున్నాను..కానీ ఆ లంబ్ది కొడుకు వలన నీ పరువు పోతుంది"
"ఎవర్ని అంటున్నారు అంకుల్?" 
"అదే పిల్లి లాగా ఎవడో పూగ్గడు వీడియో తేశాడుగా.. ఆ లంబ్ది కొడుకు గురించే" రాశికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళా తిరిగి అర్జున్ వైపు చూసింది అయోమయంగా.. అర్జున్ మొఖంలో నెత్తురు చుక్కలేదు. అర్జున్ మొహం చూడగానే రాశికి పొట్టపగిలేల నవ్వొచ్చింది. కానీ అంతా కడుపులోనే దాచుకుని పెదాలు కరుచుకుని నవ్వు ఆపుకుంటూ ముసలాయనతో "ఏం పర్వాలేదు అంకుల్" అంది.
"పర్లేదు కాదమ్మా అలా ఎలా తీస్తాడు లంబ్డికొడుకు అసలు.. అలాంటి ముండా.." అని ఇంకేదో చెప్పబోతుంటే.. రాశి నవ్వు ఇంకా ఎక్కువసేపు ఆపుకోలేదని అర్థం అయ్యి "అంకుల్ అంకుల్ పర్లేదు.. ఏం కాదు మీరు వెళ్ళండి.. మర్చిపోండి ఇదంతా" అంటూ అతన్ని చిన్నగా పంపిచేస్తూ అతను కొంత దూరం వెళ్ళగానే పగలబడి నవ్వింది. 
"సరేలే నేను చెప్పినట్టే మారాడుగా అది చాలు" అని కవర్ చేసుకుంటున్నాడు అర్జున్.
"సారి అర్జున్.. బట్ ఐ కాంట్ కంట్రోల్..మై..." అంటూనే నవ్వేస్తుంది.. నువ్వు నవ్వుకో అంటూ.."సన నీ ఫ్రెండ్ ని చూసుకోలేకపోతే నవ్వి నవ్వి ట్రాఫిక్ జామ్ చేసేట్టు ఉంది" అంటూ పక్కకు..ఆ ముసలాయన పోయే వైపు పోయాడు. ఇవేమీ గమనించని సన రాశి ఎందుకు నవ్వుతుందో తెలియక దగ్గరకొచ్చి అడుగుతుంది.
"ఇదిగోండి అంకుల్.." అంటూ అర్జున్ పిలిచాడు..
వెనక్కు తిరిగి..రాశితో వచ్చిన అబ్బాయి అని గుర్తుపట్టి "ఏంటి" అన్నాడు
"అదే.. ఆ వీడియో ఇంటర్నెట్లో ఉండడానికి నీకేం ప్రాబ్లెమ్ లేదు కదా"
"ఏ వీడియో??"
"అదే.. నువ్వు, మా రాశి ఉన్న వీడియో"
"నాకేం ప్రాబ్లెమ్..  ఆ అమ్మాయికే ప్రోబ్లమ్"
"అయితే ఉంచొచ్చా?"
"తీసి దెంగాలి.. ఆ అమ్మాయి ఇబ్బంది పడదూ... అయినా ఆ లంబ్డికొడుకు ఎవడో తీయాలి గా"
"ఆ అమ్మాయి ఒప్పుకుందిలే గాని నీ సంగతి చెప్పు" అసహనంగా అడిగాడు అర్జున్
"అమ్మాయి ఒప్పుకుందా.. ఎవడు అడిగాడు?"
"నేనే"
"అంటే ఆ వీడియో తీసిన లంబ్డి.."
"ఆ..నేనే.." ఇంకా అసహనంగా...
ఆ ముసలాడు అర్జున్ ని, దూరంగా ఉన్న రాశిని చూసి ఏం అనుకున్నాడో ఏమో "సావు" అని వెళ్ళిపోయాడు.

***

"ముసలాడు.. అదే ముసలాయన కూడా ఒప్పుకున్నాడు..సో ఇక వీడియో డిలీట్ చేయను సరేనా" రాత్రి 8 ప్రాంతంలో రాశి కార్ లో అర్జున్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లే దారిలో అడిగాడు.
"ఆ టైం లో నిన్ను వీడియో తీసి పెట్టాల్సింది నీ వీడియో" అంటూ నవ్వుతుంది రాశీ.
"ఐ కన్సిడర్ థిస్ యాస్ యెస్" అన్నాడు.
"క్యూట్ బాయ్ ఎంబరాస్డ్ ఆన్ విజయవాడ స్ట్రీట్ అని థంబ్ నైల్ పెడితే నా వీడియో వ్యూస్ దాటిపోతాయి"
"నో వే.. నిన్ను దాటలేం"
"ఎందుకేంటి" నవ్వుతూనే అడిగింది రాశి.
"ఎందుకంటే ఆ వీడియోలో నీది ఎంత అందమైన మనసో తెలుస్తుంది. ఇంత అందమైన అమ్మాయిలు అంతే అందమైన మనసు కలిగి ఉండడం రేర్ తెలుసా"
కార్ నడుపుతూనే కళ్ళు అర్జున్ వైపు చూశాయి. నిజమే చెప్తున్నట్టుగా ఉన్నాయి అతని కళ్ళు. 
"అందుకే ఇంత డబ్బు వుండి కూడా మిడిల్ క్లాస్ బోయ్ తో ఇంత దగ్గరగా ఉన్నావ్, అదీ నీ పెర్మిషన్ లేకుండా నిన్ను వీడియో తీసిన అబ్బాయితో.. ఎంత బ్యూటిఫుల్ నువ్వు.. నన్ను అర్థం చేసుకున్నావ్.. వేరే ఎవరన్నా అయితే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు.. కానీ నువ్వు నాకు తెలియదు అంటే చెప్పావ్.. అది తప్పు అని తెలిసేలా చెప్పావ్.. అందుకే నువ్వు బ్యూటిఫుల్.."
రాశి సైలెంట్ గా కార్ నడుపుతోంది.. కానీ రాశి ఇదంతా మనసుతో వింటుంది అనడానికి సాక్ష్యంగా కార్ స్లో అవుతోంది. 
"ఇప్పుడు చెప్పు నా వీడియో నీ వీడియోని క్రాస్ అవుతుందా?"
చిన్నగా నవ్విన రాశి. "అవుతుంది" అంది.
"ఎందుకు?"
"బికాస్ యు అర్ బ్యూటిఫుల్"
"అబ్బాయిల్ని హ్యాండ్సమ్ అంటారు అండీ" అంటూ నవ్వాడు
"నేర్పే వాళ్ళ కన్నా నేర్చుకునే మనసున్న వాళ్లే బ్యూటిఫుల్" అంది రాశి.
రాశి వైపు తదేకంగా చూస్తూ.. "అయితే నువ్వు కూడా నాలగా బ్యూటిఫుల్ హార్ట్ ని ప్రేమిస్తావా?" అన్నాడు
"వాట్.." చాలా చిన్నగా అంది రాశి. అయోమయంగా అతన్నే చూస్తూ పక్కకు కార్ ఆపింది. 
"వాట్ డూ యూ మీన్ అర్జున్?"
"మనం కలిసి 1 మంత్ కూడా కాలేదు..కానీ నాకు నువ్వంత ఎవరూ నచ్చలేదు. అసలు నీలో ఏం చూసినా నచ్చుతుంది. లేక నాకు నచ్చేవి అన్నీ నీలోనే దొరుకుతున్నాయేమో.. ఐ డోంట్ నో..నేనైతే ఇంత షార్ట్ టైం లో ఎవరితోనూ ఇలా క్లోస్ అవ్వలేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఇపుడు నాక్కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నీ ఇష్టాలు నా ఇష్టాలు అయిపోయాయి. నీ వరల్డ్ నా వరల్డ్ అనిపిస్తుంది.. నీకేం అనిపించట్లేదా..?"

రాశికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇదంతా కొత్తగా ఉంది. అంటే తనకు చాలా మందే చాలా రకాలుగా చెప్పారు ఇలాంటివి. కానీ ఇది కొత్తగా ఉంది. మొదటి నుండి రాశికి అర్జున్ నచ్చాడు. సన కూడా మంచిగా చెప్పడం వలన ఇంకా నచ్చాడు. అర్జున్ ని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏమి కనపడలేదు తనకు. అలాగని ఇంత త్వరగా నిర్ణయం తీసుకోడం కరెక్ట్ కాదనిపించింది. అదే చెబుదాం అని అర్జున్ వైపు తిరిగి చీకటి లో అతని మొహం వైపు చూస్తూ చెప్పబోయే లోపు "ఒక్క నెలలో ఆ ముసలాయన మారి నీకు సారీ చెప్పాడు, ఒక్క నెలలో మనిద్దరం క్లోస్ అయ్యాం.. ఒక్క నెలలో నాకు నీమీద చాలా ప్రేమ వచ్చింది. నీకు ఈ నెలలో ఏమీ అవ్వలేదా..? లేక దాస్తున్నవా? నువ్వు నిజంగా నిజం చెప్పు..నాకు కంసెంట్ నేర్పించావుగా.. నేను నిన్ను ఆ విషయంలో దిస్తుర్బ్ చేయను.. జస్ట్ యెస్ ఆర్ నో అంతే.."

రాశికి అతన్ని వదులుకోవడం ఇష్టం లేదు. అలాగని ఇప్పుడే చెప్పడమూ భయంగా ఉంది. ఊపిరి తీసుకుని అర్జున్ వైపు చూస్తూ..
"చాలా ప్రశ్నలకు ఆన్సర్స్ యెస్ కి నో కి మధ్యలో ఉంటాయి అర్జున్.."
"బట్ డెసిషన్స్ యెస్ ఆర్ నో మధ్యనే ఉంటాయి" తడుముకోకుండా అన్నాడు అర్జున్
అతను అన్నది రాశికి నచ్చలేదు. కానీ అలా అనడం నచ్చింది. చిన్నగా నవ్వి "నీకు చాలా నేర్పాలి.. అందుకే యెస్. నువ్వు చాలా నేర్చుకోవాలి అందుకే నో" అంది
అర్జున్ కి ఇది యెస్ అన్నంత ఆనందమూ.. నో అన్నంత బాధా ఒకేసారి వచ్చాయి. 
"తిన్నగా ఒకటి చెప్పొచ్చుగా" అలక ఫేస్ పెట్టాడు.
రాశికి ఇది నచ్చింది. "ఆల్మోస్ట్ యెస్ అనుకో.. కాకపోతే మన టేస్ట్స్ ఒకళ్ళవి ఇంకొకళ్ళకి తెలియాలి ఇంకా..అందుకే మనం ఇంకొంచెం తెలుసుకోవాలి"
"అయితే డేటింగ్ ఆహ్" ఎక్ససిటింగ్ గా అడిగాడు అర్జున్.
"మోర్ దాన్ దట్" నవ్వుతూ అంది. ఆ నవ్వులో ఎన్నెన్నో అర్థాలు వెతుక్కోవచ్చు.
"అయితే టేస్ట్స్ తెలుసుకోవాలి అంటావ్" చిలిపిగా అన్నాడు అర్జున్.
"హ్మ్మ్.. యా"
"కెన్ ఐ టేస్ట్ యువర్ లిప్స్" ఆశగా అడిగాడు
రాశి షాక్ అయ్యింది. వీడు ఇంత ఫాస్ట్ అనుకోలేదు. 
"కంసెంట్ అడిగా సినిమాల్లో హీరోల్లాగా కిస్ చేయలేదుగా"
రాశి చిలిపిగా కోపం నటిస్తూ "అంటే కిస్ చేసేద్దాం అనే.."
"మరి ఆల్మోస్ట్ యెస్ అన్నప్పుడు కిస్ అనేది కూడా ఆల్మోస్ట్ యెస్ ఏ గా" 
"నో" కొంచెం ఉడికిస్తూ అంది రాసి
"అదేంటి మళ్ళీ" నీరసంగా అన్నాడు అర్జున్
"ఆల్మోస్ట్ యెస్ కి నో. కంప్లీట్ యెస్ కి యెస్" కసిగా చూస్తూ అంది రాశి.
"అంటే.." ఆశ్చర్యంగా అడిగాడు
"యెస్" అంది
నమ్మలేకపోయాడు అర్జున్. రాశి నుండి ఇలాంటి మాట ఊహించలేదు. ఇంత రొమాంటిక్ పర్సన్ ఉందా రాశిలో.. ముద్దుకు యెస్ అని తానే తన నోటితో చెప్తుందా.. తనలో ఇంకా ఏమేమి దాగున్నాయో చూడాలనిపిస్తుంది. ముందు తన పెదాల రుచి చూడాలి.
[Image: EMUr7yKUwAAja0e.jpg]
కార్ లో లైట్ ఆన్ చేసాడు. తనకు అడుగు దూరంలో అందమైన రాశి. ఇప్పుడే యెస్ చెప్పిన తడి పెదాలు మూసి ఉన్నాయి. చిన్నగా నవ్వుతూ ఉన్నాయి. కళ్ళు అతనిని కట్టేసి దగ్గరకు లాగుతున్నాయి. అందుకే ఏమో అడుగు దూరం అంగుళం అయ్యింది. ఒకళ్ళ ఊపిరి ఒకళ్లకు తగులుతుంది. రాశి కళ్ళు మూసుకుంది. అర్జున్ చిన్నగా రాశి నవ్వే పేదలకు తన పెదాలు ఆనించాడు. ఇద్దరిలో ఎవరు తెరిచారో గుర్తులేదు ఐదు నిముషాల తర్వాత ఇద్దరి పెదాలు ఇద్దరి లాలాజలంతో తడిసిపోయాయి. చెంపలు ముక్కు చెవులు కూడా తడి అయ్యాయి.ఆ తడిని పొడుస్తూ కార్ ఏసీ ఇద్దరిని రెచ్చగొడుతుంది. అర్జున్ భుజాలు, వీపు గట్టిదనాన్ని రాశి, రాశి చేతుల, వీపు మెత్తదనల్ని అర్జున్ తడుముతున్నారు. అలా అర్జున్ రాశి మీద కి అలా వెళ్ళగానే.. అర్జున్ మోచేయి తగిలి హారన్ మోగింది. వాళ్ళకది ఇంకాసేపు ఇలానే ఉంటే ఏమేమి అయిపోతాయో అన్నట్టుగా అలారం సౌండ్ లాగా అనిపించింది.  అందుకే విడిపోయారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు. ఏసీ ఊపిరి పీల్చుకుంది. "వెళదామా" అంది రాశి.
"సరే" అన్నాడు
"ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది?" స్టార్ట్ చేస్తూ అడిగింది
"అలా అడిగితే ఈ సారి అడక్కుండా పెట్టేస్తా"
దారంతా ముసిముసి నవ్వులు.

***
[+] 9 users Like rambabu_penta's post
Like Reply
#4
Nice start
Like Reply
#5
Nice start
Like Reply
#6
సూపర్ గా ఉంది
Like Reply
#7
Story starting chala bagundi 
Please continue
Like Reply
#8
GOOD UPDATE
Like Reply
#9
Nice update bro
Like Reply




Users browsing this thread: 2 Guest(s)