26-01-2023, 02:39 PM
కింగ్ ఈస్ బ్యాక్
Romance శృంగార కథామాళిక
|
26-01-2023, 02:39 PM
కింగ్ ఈస్ బ్యాక్
26-01-2023, 05:22 PM
Update yeppudu isthunnav bro
27-01-2023, 10:44 AM
Update please bro
30-01-2023, 12:37 PM
Anna edho okati cheppu Anna people are waiting for gige update with lot of love.
31-01-2023, 05:57 AM
Mahesh bro waiting for your update
31-01-2023, 07:17 AM
update plz bro
31-01-2023, 10:13 AM
Enti MAHESH Anna login avutharu emi comment pettakunda velipothunaru
31-01-2023, 11:12 AM
బ్రదర్ మీ అప్డేట్ కోసం తన ప్రియుడికోసం ఎదురుచూసే అభిసారికల ఎదురుచూస్తున్నాము అప్డేట్ ప్లీజ్ బ్రదర్
01-02-2023, 10:22 PM
Enti bayya update ivvatam ledhu story complete avaledha . Edho okati cheppu Anna.
02-02-2023, 09:24 AM
నేను update ఇవ్వకపోయినా కొప్పడనందుకు థాంక్స్ ..........
జీవిత ప్రయాణం అంటే ఇంతే కదా ...... , బిజీ లైఫ్ ...... మనకిష్టం లేకపోయినా గ్యాప్ వచ్చేస్తుంది , గ్యాప్ వస్తుంది కానీ స్టాప్ అయితే చెయ్యను . Extremely sorry xossipy లవర్స్ ....... 11 లోపు అప్డేట్ తో కలుద్దాము .
02-02-2023, 09:27 AM
Mahesh Bro, janmanichina thalli kosam prayanam story updates kosam waiting for 1000 eyes plz continue that story plz plz
02-02-2023, 09:42 AM
Hi bro good morning
Yala unavu bro Thanks bro Waiting bro
02-02-2023, 10:23 AM
Anna love you anna .... Nuvvu busy ayyavu ardamayyindi... Anduke andaram nuvvu vegam update ivvali ani korukunnamu... Ninnu,ne story's ni andaru gattiga love chestaru... Me story laga me meeda positive ga vuntaru....
Waiting for update
02-02-2023, 10:52 AM
ఏంటీ ...... " రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అంటూ మంజరి - రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అని నేను " ఇద్దరమూ ఒకేసారి అన్నాము .
మంజరి : ఆ రాజ్యాలు ఎటువైపు అడవిరాజా ...... , మేము వెంటనే అక్కడికి వెళ్ళాలి ఇటువైపా అటువైపా అంటూ ఆతృతతో అడిగింది , ఒక్కసారిగా ఆకాశంలో అంతెత్తుకు ఎగిరి చుట్టూ చూసినట్లు కిందకువచ్చి అటువైపు ప్రభూ ..... అడవిరాజా ..... నీ కుటుంబం దగ్గరికివెళ్లు , మిత్రమా అంటూ పైకెక్కాను . అంతలో ఇంతవరకూ మేము వెళుతున్న వైపు నుండి " అన్నయ్యా - చెల్లీ , అన్నయ్యా - చెల్లీ ....... అమ్మా అమ్మా ...... కాపాడండి కాపాడండి అంటూ బుజ్జాయిల కేకలు వినిపించాయి . రాను రాను కేకలు పెరుగుతూ రావడంతో మళ్లీ అటువైపుకే తిరిగి కేకలు వస్తున్నవైపు వేగంగా పోనిచ్చాను . ప్రభూ అంటూ మంజరి , మంజరితోపాటు నొప్పి ఇంకా ఉన్నట్లు వేగంగా కాకపోయినా మావైపుకు పరుగులుతీసాడు అడవిరాజు . " అన్నయ్యా - చెల్లీ " అంటూ బుజ్జాయిల హాహాకారాలు - ఏడుపులు మరింత పెరగడంతో ...... చలించిపోయి మిత్రమా హో అంటూ మరింత వేగంగా పోనిచ్చాను . దూరాన సైనికుల వస్త్రలలో చేతులలో కత్తులు - ఈటెలతో ...... అన్నయ్యా - చెల్లీ అంటూ ప్రాణభయంతో ఏడుస్తూ పరుగులుతీస్తున్న బుజ్జాయిలవైపుకు భీకరంగా వచ్చి , చిక్కినట్లు చుట్టుముట్టారు . అమ్మా అమ్మా ....... అన్నయ్యా - చెల్లీ అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు , చెల్లీ అంటూ వెనకనుండి చేతితో పట్టుకుని మరొకచేతిలో చిన్న కత్తితో చుట్టూ రాక్షస నవ్వులు నవ్వుతున్న సైనికులవైపుకు తిరుగుతూ , నా చెల్లిని వదిలెయ్యండి లేకపోతే అంటూ ధైర్యంగా నిలబడ్డాడు . లేకపోతే ఏమిచేస్తావు అంటూ ముందుకువచ్చిన సైనికుడి చేతిని చిన్న కత్తితో గాయపరిచాడు . స్స్స్ ....... పిల్లలిద్దరినీ చంపేయ్యండి . యువరాజుగా ఆజ్ఞాపిస్తున్నాను పిల్లలను వదిలెయ్యండి అంటూ ఆయాసపడుతూ మరొకడు వచ్చాడు . గాయపడిన సైనికుడు : చంపేయ్యమని మీ నాన్నగారు ఆజ్ఞాపించారు - వారి ఆజ్ఞనే మేము పాటిస్తాము - పిల్లలని జాలి చూయించకుండా చంపేయ్యండి . పిల్లలవైపుకు ఇద్దరు కత్తులతో రావడం చూసి మిత్రమా అంటూ వాయువేగంతో వెళ్లి , మిత్రుడి మీద నుండే చుట్టుముట్టిన సైనికుల మీదుగా బుజ్జాయిల ముందుకు దూకి బుజ్జాయి చేతిని అందుకుని బుజ్జి కత్తితోనే ఇద్దరు సైనికులు చంపడానికి ఎత్తిన కత్తులను అడ్డుకుని వారిద్దరి బొటన వేళ్ళను నరికేసాను . హమ్మా హమ్మా ...... అంటూ చిందిస్తున్న రక్తంతో వాళ్ళ కేకలు అడవి మొత్తం వినిపించాయి . బుజ్జాయి గాయపరిచిన సైనికుడు : ఎవర్రా నువ్వు , భటులారా ..... పిల్లలతోపాటు వీడిని కూడా చంపేయ్యండి . 3 - 4 ఏళ్ల వయసున్న బుజ్జాయిలిద్దరినీ గుండెలపైకి ఎత్తుకుని ( వారిని స్పృశించగానే ఏదోతెలియని తియ్యదనం ), బుజ్జి కత్తితో చుట్టూ అందరినీ నిలువరిస్తూ ఒక్కొక్కడి వేళ్ళను నరికేస్తున్నాను . వీడు సామాన్యుడు కాదు చిన్న కత్తితోనే పాతికమందిని నిలువరిస్తున్నాడు పారిపోదాము రoడ్రోయ్ అంటూ పరుగులుతీసారు . అంతలో ఒక్కసారిగా నామీదుగా మరియు సైనికుల మీదుగా సింహం ఎగిరి వారివైపుకు తిరిగి అడవికి రాజుని నేను నన్ను తప్పించుకుని ఎలా వెళతారన్నట్లు ఒక్క గర్జన గర్జించింది . అంతే సింహం సింహం అంటూ వొళ్ళంతా చెమటలతో గజగజ వణికిపోతున్నారు . మరొక్క అడుగువేశారో సింహానికి ఆహారం అయిపోతారు మీఇష్టం - మోకాళ్లపైకి చేరి శరణు కోరండి . అంతే భయంతో వణుకుతూ మోకాళ్లపైకి చేరారు . అమ్మో సింహం ...... అన్నయ్యా - చెల్లీ అంటూ నన్ను గట్టిగా హత్తుకున్నారు ( మళ్లీ అలాంటి మధురమైన అనుభూతి ) . నవ్వుకున్నాను , బుజ్జాయిలూ ...... సింహం మనదే మనల్ని ఏమీ చెయ్యదు చూడండి చూడండి అంటూ ఎత్తుకెళ్ళి తాకించాను - మరింత గట్టిగా పట్టుకోవడంతో భయపడకండి వద్దులే వద్దులే ఇదిగో అందమైన మంజరి ఎంత ముద్దొస్తోందో కదా ...... బుజ్జాయిలు : మంజరి అని ఎక్కడో విన్నాము కదా అన్నయ్యా - అవును చెల్లీ ....... , చాలా చాలా ముద్దుగా ఉంది చిలుక మంజరి మంజరి ...... నేను - మంజరి - ఇదిగో కృష్ణ మరియు అడవికే రాజు అయిన సింహం మేమంతా మిత్రులం , ఇప్పుడు ముట్టుకోండి ...... భయపడుతూనే ముట్టుకుని , అవును ఏమీ చెయ్యలేదు అంటూ బుజ్జిబుజ్జిగా ఆనందిస్తున్నారు . భయం పోయింది కదా అడవిరాజుపై కూర్చుంటారా ...... ? . అంతే భయంతో నా వస్త్రం చిరిగిపోయేలా అల్లుకుపోయారు . సరే సరే వద్దులే అంటూ స్వచ్ఛమైన అనుభూతిని ఆస్వాదిస్తూ బుజ్జాయిల వీపులపై ఆప్యాయంగా స్పృశిస్తున్నాను - నాకుకూడా బుజ్జాయిలను అప్పుడే కిందకు దించాలని అనిపించడం లేదు - మరింత ప్రేమతో హత్తుకున్నాను . మంజరి అయితే నాకంటే ఎక్కువగా బుజ్జాయిలకు ప్రేమను పంచుతూ నవ్విస్తోంది నేను - మంజరి ...... బుజ్జాయిల అందమైన మైకంలో ఉండగా , మరొకవైపు అడవిరాజు మాత్రం నేను నరికిన సైనికుల వేళ్ళను బఠాణీల్లా లాగించేస్తూ రక్తం రుచిమరిగినట్లు వెళ్లి సైనికుల చేతుల నుండి కారుతున్న రక్తాన్ని జుర్రేస్తోంది . వాళ్ళ భయం చూసి బుజ్జాయిలకు చూయించి ఆనందించాము . యువరాజా ...... చూస్తుంటేనే తెలిసిపోతోంది మీరు మంచివారని మీరు మోకాళ్లపై కూర్చోవాల్సిన అవసరం లేదు మాదగ్గరకు రండి . బుజ్జాయిలు : అవును మంచివారు , అమ్మ పారిపొమ్మని చెబితే సహాయం చేసినది వారే ....... మిత్రుడి సంచీలో ఉన్న కాసిన్ని నీళ్లను బుజ్జాయిలకు తాగించి , బుజ్జాయిలూ ..... ( బుజ్జాయిలను బుజ్జాయిల కళ్ళల్లోకి అలా చూస్తుండిపోవాలనిపిస్తోంది ) . బుజ్జాయిలు : వీరాధివీరా ...... ఏంటి అలా చూస్తున్నారు ? - ఏదో అడుగుతున్నట్లున్నారు ? అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో ముద్దుముద్దుగా అడిగారు . మంజరి : వీరాధివీరుడని బుజ్జాయిలకు కూడా తెలిసిపోయిందన్నమాట . అదే అదే ఎవరుమీరు ? - అభం శుభం తెలియని మిమ్మల్ని ఈ సైనికులంతా చంపాలని ఎందుకు పరిగెత్తిస్తున్నారు ? - మిమ్మల్ని పారిపొమ్మని చెప్పిన మీ అమ్మగారు ఎక్కడ ? . బుజ్జాయిలు : అమ్మ అమ్మ ...... అమ్మ అంటే గుర్తుకువచ్చింది , అమ్మ ఆపదలో ఉంది అంటూ ఏడుస్తున్నారు . బుజ్జాయిలూ బుజ్జాయిలూ ...... ఏడవకండి , ఎక్కడ ఉన్నారు ? ఏమిటా ఆపద ? , యువరాజా ...... యువరాజు : మహారాణి గారు మాత్రమే కాదు మా నాన్నగారి వలన రాజ్యం మొత్తం ఆపదలో ఉంది , తీరం వెంబడి ఉన్న రాజ్యాలలో మా రెండు రాజ్యాలే పెద్దవి కానీ ఈ పిల్లల రాజ్యానికి ఆనుకుని ఉన్న అదిగో ఎదురుగా కనిపిస్తున్న కొండలలో బంగారు - వజ్రపు నిధులు పుష్కలంగా ఉన్నాయి , వాటిని చేజిక్కించుకుంటే తరతరాలుపాటు సుసంపన్నంగా జీవించవచ్చు - చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటినీ సామంత రాజ్యాలుగా కాళ్ళ కింద తొక్కేయ్యవచ్చు ........ యువరాజా ...... అధికారం కోసం ప్రయత్నం అని తెలిసిపోతోంది - ముందైతే బుజ్జాయిల అమ్మగారి ఆపద గురించి చెప్పండి అంటూ బుజ్జాయిలకు తెలియకుండా ఇద్దరినీ సింహం పై కూర్చోబెట్టి సైనికులందరినీ యువరాజు సహాయంతో ఊడలతో చెట్లకు కట్టిపడేసాను - వెనక్కు తిరిగిచూస్తే బుజ్జాయిలిద్దరూ భయంతో చప్పుడు చెయ్యకుండా కదలకుండా కూర్చుని ఉండటం చూసి నవ్వుని ఆపుకుంటూ ఎత్తుకున్నాను . బుజ్జాయిలు : కొట్టబోయి గట్టిగా అల్లుకుపోయారు . కొట్టొచ్చు కదా ప్చ్ ప్చ్ ...... , మా మిత్రుడు అంటే మీ మిత్రుడు కూడానూ బుజ్జాయిలూ , చూడండి మీవైపు ఎంత ఇష్టంతో చూస్తున్నాడో అడవిరాజు ఎందుకంటే అడవిరాజుకు కూడా మీలానే ఇద్దరు పిల్లలు - బుజ్జి సింహాలు అంటూ బుగ్గలపై ఆప్యాయంగా ముద్దులుపెట్టాను . బుజ్జాయిలు : నా బుగ్గలపై చెరొక ముద్దుపెట్టి మరింత గట్టిగా హత్తుకున్నారు - ఆహ్హ్ ...... ఏమిటీ కొత్త అనుభూతి అంటూ పులకించిపోసాగాను , తేరుకుని యువరాజా ...... వెళదాము పదండి . యువరాజు : ఎంతో కాలంగా వేచిచూస్తున్న మా నాన్నగారు ..... ఈ రాజ్యానికి మహారాజు ఆకస్మికంగా మరణించడం ఆ వెంటనే కరువు రాగానే సహాయం చెయ్యడం మానేసి చుట్టుప్రక్కల రాజ్యాలను కూడగట్టి మూడువైపుల నుండీ దాడిచేశారు , ఈ విషయం తెలుసుకున్న పిల్లల తండ్రి యువరాజు చేతనైనంత సంపద వందలమంది భద్రతా సిబ్బందితో రాజ్యాన్ని - పిల్లల అమ్మ రాణిని - పిల్లలను మీ చావు చావండి అని వదిలేసి పిరికివాడిలా వీలైనన్ని ఓడలలో పారిపోయాడు , మా తండ్రి ఊరికే వదలరు కదా వెనుకే అంతకు రెట్టింపు ఓడలను పంపించారు ఈపాటికి చంపేసే ఉంటారు . బుజ్జాయిలు వినకూడదని ప్రయత్నించాను . బుజ్జాయిలు : ఆ రాజు గురించి మేము బాధపడము వీరాధివీరా - అతడు కూడా రాక్షసుడు - అందరినీ హింసించేవాడు . యువరాజు : కుటుంబాలు ఉన్న సైనికులు పోరాడి ఓడి శరణు కోరారు - వారిక జీవితాంతం కారాగారంలోనే ఉండిపోతారు - ఈపాటికి రాజభవనంలోని ద్వారాలన్నింటినీ బద్ధలుకొట్టి రాజ్యాన్ని ఆక్రమించేసుకుని ఉంటారు - నేను ఎంత వారించినా వినలేదు మా తండ్రి - మన్నించండి పిల్లలూ ....... బుజ్జాయిలు : అంటే అమ్మ - పిన్నమ్మలంతా ...... యువరాజు తలదించుకున్నారు - పిల్లలు ...... రహస్య ద్వారం ద్వారా బయటకు రావడం చూసి భటుల నుండి తప్పించాను , మా తండ్రి చంపేయ్యండి అంటూ ఆజ్ఞాపించడంతో కాపాడాలని వెనుకే వచ్చాను , ఇక జరిగినది మీకు తెలుసు .
02-02-2023, 10:53 AM
బుజ్జాయిలు : వీరాధివీరా ...... అమ్మను రక్షిస్తారా ? అంటూ ఏడుస్తూ అడిగారు .
మంజరి : మీ కళ్ళల్లో కన్నీళ్లు అంటే మన వీరాధివీరుడి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నట్లున్నాయి - మీరంటే ఎంత ఇష్టమో అర్థమైపోతోంది - మిమ్మల్ని బాధపడనిస్తాడా ..... ? . యువరాజు : అసాధ్యమైన పనే వీరాధివీరా ...... , రాజ్యం చుట్టూ లోపల వేలాదిమంది సైనికులు రక్షణగా చేరుకుని ఉంటారు - అపాయం . బుజ్జాయిలూ ....... ఏడవకండి , నా ప్రాణాలను ఫణంగా పెట్టైనా మిమ్మల్ని మీ అమ్మగారి చెంతకు చేరుస్తాను అంటూ కన్నీళ్లను తుడిచి ముద్దులుపెట్టాను నుదుటిపై , మిత్రమా - మంజరీ - అడవిరాజా ...... అపాయానికి ఎదురు వెళ్లబోతున్నాను , మిమ్మల్ని మళ్లీ దూరం చేసుకోలేను మీరు ఇక్కడే ఉండండి . మంజరి : మీరు లేని ప్రాణం నిర్జీవం ప్రభూ ...... , బ్రతుకైనా చావైనా మీతోనే ....... మీతోనే అన్నట్లు మిత్రుడు ఘీంకరించాడు - అడవిరాజు గర్జించాడు . మంజరీ - మిత్రమా - అడవిరాజా ....... నా మాటలను పట్టించుకోకుండా ముందు ముందుకు వెళ్లిపోతున్నారు . యువరాజు : వీరాధివీరా ...... ప్రణాళిక - ఉపాయం లేకుండా వెళితే మరింత అపాయం . అడవిరాజా - మంజరీ ...... సరే సరే ఒప్పుకుంటున్నాను ఆగండి ఆగండి . మంజరి : అలా అన్నారు సరిపోయింది అంటూ నా చెంతకు చేరారు . బుజ్జాయిలు కూడా నవ్వడం చూసి , ఈ సంతోషాలను శాశ్వతం చేసే వెళతాము అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాను . మంజరి : బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వించి , పదండి ఆ వేలాది సైన్యాన్ని మట్టికరిపిద్దాము . యువరాజు : అది అంత సులభం కాదు వీరా ...... , కనీసం రాజ్యానికి దగ్గరగా కూడా వెళ్లలేము , రహస్య మార్గం దగ్గరకూడా భటులు ఉంటారు - లోపలికి నేను తీసుకెళతాను , రక్తపాతం జరగడం నాకేమాత్రం ఇష్టం లేదు . మహారాజైన మీ నాన్నగారి ఆజ్ఞలనే ధిక్కరిస్తున్నావు - మాకు సహాయం చేస్తున్నావు - రక్తపాతం వద్దు అంటున్నావు అంటే ....... యువరాజు : ఇందులో నా స్వార్థం లేకపోలేదు వీరా ...... , కొద్దిరోజుల ముందు చనిపోయిన ఈ రాజ్యపు మహారాజు గారి చివరి కూతురు ........ అర్థమైపోయింది అర్థమైపోయింది ....... మంజరీ విన్నావా ప్రేమ , ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళుతుంది , ప్రేమకోసం యుద్ధాలు జరిగాయని విన్నాను - ఇక్కడ ప్రేమ ..... యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు . బుజ్జాయిలు : ఇప్పుడు అర్థమయ్యింది మా అత్తయ్య ఎందుకంత ఆనందంగా ఉండేదో - తనలోతాను ఎందుకు నవ్వుకునేదో - అమ్మ ఎన్నిసార్లు అడిగినా చెప్పనేలేదు పరుగున వెళ్లిపోయేది . యువరాజు : ఒకరంటే ఒకరికి ప్రాణం పిల్లలూ ...... , ఇద్దరం రహస్య మార్గం దగ్గర కలుసుకుని ప్రేమించుకునేవాళ్ళం . బుజ్జాయిలు : అంటే అత్తయ్యను తప్పించడానికి రహస్య మార్గం దగ్గరకు చేరుకుని మేము పారిపోవడానికి సహాయం చేసారన్నమాట . యువరాజు : అవును పిల్లలూ ...... , తన పరిస్థితి ఎలా ఉందో ఏమిటో అంటూ కంగారుపడుతున్నాడు . మీ నాన్నగారికోసం .... మీ రాజ్యం బాగుండాలి , ప్రియురాలికోసం ..... ఈరాజ్యం బాగుండాలి . యువరాజు : అవును రెండు రాజ్యాలు ఒకరికొకరు సామరస్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలన్నదే నాకోరిక ....... చాలా సంతోషం యువరాజా ...... , అలా జరగాలనే ఆశిద్దాము . యువరాజు : అంతకంటే మరేమీ కోరుకోను - దానికోసం ఏమైనా చేస్తాను . అయితే ఒక ఉపాయం యువరాజా అంటూ వివరించాను . యువరాజు : తప్పకుండా తప్పకుండా మీరు చెప్పినట్లుగానే చేస్తాను వీరాధివీరా ......... బుజ్జాయిలు : అమ్మను చేరుకోబోతున్నామన్నమాట అంటూ సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు , వీరాధివీరా ...... మీ చేతులు నొప్పివేస్తాయేమో మమ్మల్ని సింహం పై కూర్చోబెట్టండి అంటూ ముద్దుముద్దుగా మాట్లాడారు . లేదు లేదు ...... సింహంపై ...... ఇందాకనే కదా తెగ భయపడిపోయారు . బుజ్జాయిలు : మీరు ఉండగా మాకు భయమేల సింహంపై కూర్చోబెట్టండి . ప్చ్ ప్చ్ ...... అంతేనా కూర్చోబెట్టాల్సిందేనా ...... మరికొంతసేపు ఇలాగే ఉండొచ్చుకదా అంటూ మరింత ఆప్యాయంగా హత్తుకున్నాను . మంజరి : అమ్మో ఇంత ప్రేమనా ...... ? . బుజ్జాయిలు : ఆనందించి , ఎందుకో తెలియదు మాకు కూడా ఇలాగే ఉండిపోవాలని ఉంది కానీ కానీ ...... కానీ లేదు పోనీ లేదు నాకేమీ నొప్పిగా లేదులే అంటూ ముద్దులుకురిపిస్తూ హత్తుకున్నాను - ఇలాంటి తియ్యనైన అనుభూతిని పొందడం ఇదే తొలిసారి నేనెలా వదులుకుంటాను . బుజ్జాయిలు : మేముకూడా అంటూ బుగ్గలపై ముద్దులుకురిపిస్తూ నవ్వుతున్నారు . యువరాజు : వీరాధివీరా రహస్య ద్వారం ఇటువైపు ..... , అటువైపుకు వెళితే రాజ్యపు ప్రవేశద్వారం అంటూ కొండలవైపుకు పిలుచుకునివెళ్ళాడు . రహస్య ద్వారం దగ్గర ప్రియురాలిని కలిసీ కలిసీ ఈ రాజ్యపు నలుదిక్కులూ పూర్తిగా అవగతమయ్యాయన్నమాట . యువరాజు : సిగ్గుపడ్డాడు , దూరంగా కనిపిస్తున్న రాజ్యపు పటిష్టమైన కోట వెంబడి కొద్దిదూరం తీసుకెళ్లాడు . ఎక్కడచూసినా పొలాలన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి - ఎండిపోయిన పొలంలోని మొక్కలను స్పృశించి బాధపడ్డాను . యువరాజు : ఒకప్పుడు అంటే మహారాజు పరిపాలనలో ఉన్నప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉండేవి - ఎప్పుడైతే ఈరాజ్యం యువరాజు బలవంతంగా రాజ్యాన్ని చేజిక్కించుకుని ప్రజలను ముఖ్యంగా స్త్రీలను ఇబ్బందిపెట్టాడో అప్పటినుండి ఇలా మారుతూ వచ్చింది . అదిగో వీరాధివీరా ఒకప్పుడు నదీప్రవాహం ప్రవహించినట్లు ఎండిపోయిన జాడలు కనిపిస్తున్నదే అటువైపు కొండ కింద భాగంలోనీదే రహస్యమార్గం - సైనికులు కాపలాగా ఉన్నారు అంటూ చెట్ల చాటు నుండి చూయించాడు . ప్రభూ ఆజ్ఞ వెయ్యండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటూ నావైపు ఆశతో చూస్తున్నాడు అడవిరాజు . శాంతించు శాంతించు అడవిరాజా ....... , నిన్ను చూసి భయంతో కేకలువేస్తే మిగతావారికి కూడా తెలిసిపోతుంది . మంజరి : మరెలా ప్రభూ ....... యువరాజు : ఆసంగతి నాకు వదిలెయ్యండి వీరాధివీరా కాసేపు చప్పుడు చేయకండి అనిచెప్పి ఒంటరిగా వెళ్ళాడు . పరిస్థితిని గమనించడానికన్నట్లు గుట్టుచప్పుడు కాకుండా మంజరి ఎగురుకుంటూ వెనుకే వెళ్ళింది . ఎవరో వస్తున్నారు అంటూ కత్తులు తీశారు , యువరాజా మీరా మన్నించండి అంటూ పరుగున యువరాజు దగ్గరికి చేరుకున్నారు , పిల్లలిద్దరినీ చంపేశారా యువరాజా ? - మన సైనికులు ఎక్కడ ? . యువరాజు : పని పూర్తిచేసి వాళ్ళు అటునుండి ఆటే రాజ్య ప్రవేశద్వారంవైపుకు వెళ్లిపోయారు - పిల్లల మృతదేహాలు ఎండిపోయిన పొలాలలో ఉన్నాయి మహారాజుకు చూయించాలికదా తీసుకురండి - ఐదుగురూ వెళ్ళండి - మహారాజు చూస్తే మీకు తగిన బహుమానం ఇవ్వవచ్చు . అవునవును ఆజ్ఞ యువరాజా అంటూ హుషారుగా పరుగులుతీస్తూ వచ్చిన సైనికులు సింహాన్ని చూసి అక్కడికక్కడే ఉచ్ఛపోసుకున్నారు . బుజ్జాయిలు చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ముద్దులుపెట్టాను - సైనికులారా అరిచారో మిమ్మల్ని చంపేస్తుంది అంటూ బుజ్జాయిలిద్దరినీ సింహంపై కూర్చోబెట్టి ఐదుగురూ మూర్చబోయేలా తలలపై దెబ్బలువెయ్యడంతో నేలకొరిగారు . అంతలో మంజరి వచ్చి సురక్షితంగా వెళ్ళవచ్చు ప్రభూ అని తెలియజెయ్యడంతో మిత్రుడిపై ఉన్న ధనుస్సు - విల్లులు మరియు కిందపడిన సైనికుల చేతిలోని ఖడ్గాన్ని అందుకుని , ముద్దులుపెట్టి బుజ్జాయిలు జాగ్రత్త అంటూ అడవిరాజుకు తెలియజేసి , ఎండిపోయిన ప్రవాహాన్ని చూసి బాధపడుతూ అమ్మా ..... బుజ్జాయిలను వారి తల్లి చెంతకు చేర్చేలా సహాయం చేయండి అని ప్రార్థించి పరుగున రహస్యమార్గం లోపలికి వెళ్ళాను - వెనుకే యువరాజు మిత్రులు పిల్లలు వచ్చారు , యువరాజా ..... మన ఉపాయం గుర్తుందికదా అంటూ గుహలలా ఉన్న రహస్యమార్గం కాగడాల వెలుతురులో రాజ్యానికి చేరుకున్నాము . పథకం ప్రకారం అందరినీ అక్కడే ఉండమని ముఖ్యoగా యువరాజును దాక్కోమని చెప్పి , సైనికులంతా అటువైపుకు తిరిగి ఉండటం చూసి ఆయుధాలతో నెమ్మదిగా వెళ్లి ఉద్యానవనంలోని చెట్టు చాటుకు చేరుకున్నాను . రాజ్యంలోని సుందరీమణులందరినీ తీసుకొచ్చినట్లే కదా సామంత రాజుల్లారా ....... రాజ్యంలోని ప్రతీ గడపలో బిక్కుబిక్కుమంటూ దాక్కున్న సుందరీమణులు మరియు కన్నెపిల్లలందరినీ ఈడ్చుకువచ్చాము మహారాజా ...... మహారాజు : ఎవరికి ఎంతెంతమంది కావాలో మీఇష్టం కానీ రాణి - చిన్నరాణులు మరియు ఒక్కగానొక్క చిన్న యువరాణి మాత్రం నా సొంతం , ముఖ్యంగా రాణీ హిమాదేవి ...... రోజులు గడిచేకొద్దీ అందం రెట్టింపవుతూనే ఉందని దైవ రహస్యం , ఈ రాజ్యాన్ని దండెత్తే కారణాలలో తనూ ఒకటి - తనను , నేను తప్ప ఎవరూ చూడకూడదు ముసుగులోనే ఉంచండి - మిగిలిన చిన్నరాణులు మరియు యువరాణిని కూడా ........ , అయినా స్త్రీలు - కన్నెపిల్లలను మాత్రమే తీసుకురమ్మని ఆజ్ఞాపించాముకదా ........ సామంత రాజులు : వాళ్ళ తల్లులు - అక్కయ్యలకోసం ఎలా తప్పించుకునివచ్చారో తెలియడం లేదు ప్రభూ ...... ఉద్యానవనంలో ఒకవైపున కొంతమంది బుజ్జాయిలు - పిల్లలు ...... తమ తమ తల్లులకోసం ఏడుస్తున్నారు , మరొకవైపు సంకెళ్లతో రక్తపు మడుగులలో బంధించబడిన రాజ్యపు సైనికులు ఏమీచెయ్యలేక నిస్సహాయస్థితిలో ఉండిపోయారు కన్నీళ్లు కారుస్తున్నారు . తమ తండ్రి భర్తలను మరియు పిల్లలను చూసి స్త్రీలంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు - వదిలెయ్యమని కాళ్ళా వేళ్ళా ఆర్థిస్తున్నారు . అందరి ఏడుపులను చూసి మహారాజు సామంతరాజులతోపాటు అక్కడున్న మంత్రులు సైన్యాధ్యక్షులు రాక్షసానందం పొందుతున్నారు - వదిలెయ్యడానికా మిమ్మల్ని లాక్కునివచ్చినది - మీ మగాళ్ల ముందే మిమ్మల్ని బలవంతంగా రమించి సుఖాలలో మునిగితేలాలి కదా అంటూ చేతి వేళ్ళను నలిపేస్తున్నాడు. మీకు కావాల్సినది రాజ్యం - రాజ్యంలోని సంపద , వాటిని మొత్తం తీసుకుని వారిని వదిలెయ్యండి అంటూ ముసుగులో ఉన్న రాణులు వేడుకున్నారు . మహారాజు : వాటితోపాటు మీ శృంగార సంపద కూడా కావాలి రాణులూ ....... , మీ అందాలను తనివితీరా జుర్రుకుని మా సైనికులకు అటుపై బానిసలు ....... అంటూ రాక్షసుల్లా నవ్వుతున్నారు . చూసి తట్టుకోలేకపోయాను - ఒక్కొక్కడి పాదాలను నరికెయ్యాలన్నంత కోపాన్ని నియంత్రించుకున్నాను - చుట్టూ ఉద్యానవనంలోని పరిస్థితులను గమనిస్తున్నాను - అడుగుకు నలుగైదుగురు భటులు ఉన్నారని మంజరి తెలియజేసింది - ఎలా రక్షించాలో ఆలోచిస్తున్నాను . అంతలో ఒక సామంతరాజు కోరరాని కోరిక కోరాడు . మహారాజా ...... ఈ రాజ్యపు సైనికులు మరియు పిల్లలముందు వాళ్ళ తల్లులతో ఒక వినోదం చెయ్యాలని ఉంది . మహారాజు : ఈ సుందరీమణులంతా మీసొంతం ఏమైనా చేసుకోండి . సామంతరాజు : కృతజ్ఞులం యువరాజా ...... , సైన్యాధ్యక్షా ...... ముగ్గురు పిల్లలను లాక్కుని రండి - ప్రక్కప్రక్కనే ధూలాలకు కట్టెయ్యండి . చిత్తం మహారాజా అంటూ అమ్మా అమ్మా అమ్మా ఏడుస్తున్న ముగ్గురిని ఎత్తుకొచ్చి తాళ్లతో వెనక్కు చేతులను కట్టేశారు . సామంతరాజు : భటులారా విల్లులు ఎక్కుపెట్టండి . ఆజ్ఞ మహారాజా అంటూ ముగ్గురు భటులు ...... కట్టివేసిన ముగ్గురు పిల్లలవైపుకు బాణాలను ఎక్కుపెట్టారు . సామంతరాజు : రాక్షసనవ్వు నవ్వి , ఈ ముగ్గురు పిల్లల తల్లులు ఎవరో ముందుకురండి . ముగ్గురు తల్లులు రోధిస్తూ కట్టివేసిన పిల్లల చెంతకు చేరుకుని మీకేమీ కాదు మీకేమీ కాదు అంటూ హత్తుకున్నారు - మా పిల్లలను ఏమీ చేయకండి కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి అంటూ ప్రాధేయపడుతున్నారు . సామంతరాజు : మిమ్మల్ని ఎలా చంపుతాము , మీరు మాకు స్వర్గాన్ని పంచే వేశ్యలు , మీ పిల్లలను చంపకుండా ఉండాలంటే మీరొక పనిచెయ్యాలి . తల్లులు : మాపిల్లలకోసం ఏమైనా చేస్తాము . సామంతరాజు : అయితే మీ భర్తలు - పిల్లల ముందే మీరు వివస్త్రులై నగ్నంగా నాట్యం చేసి మమ్మల్ని మెప్పించాలి . ఒక్కసారిగా నిశ్శబ్దన్గా మారిపోయింది . మిగిలిన సామంతారాజులు - మహారాజు మాత్రం కోరిక కోరిన సామంతరాజును అభినందిస్తూ రాక్షసానందం పొందుతున్నారు . నా రక్తం సలసలా మరిగిపోసాగింది . వారిని వదిలెయ్యండి లేకపోతే ........ సామంతరాజు : లేకపోతే ఏమిచేస్తారు రాణులూ , భటులారా ...... ఎక్కుపెట్టండి . తల్లులు : వద్దు వద్దు అంటూ మోకాళ్లపై కూర్చుని కన్నీళ్ళతో ఆర్థిస్తున్నారు . సామంతరాజులు : మీరు నగ్నంగా నాట్యం చేసి మమ్మల్ని మెప్పిస్తేనే తప్ప మీ పిల్లలు బ్రతకరు అంటూ భటులవైపు కన్నుకొట్టి సైగచేసారు . మూడు బాణాలు వదలడంతో దూసుకెళ్లి పిల్లల తలలపైన ధూలాలకు చిక్కుకున్నాయి . అఅహ్హ్ ...... హమ్మయ్యా అనుకున్నాను . పిల్లలూ - బాబూ ...... అంటూ తల్లులంతా ఊపిరిపీల్చుకున్నారు . సామంతరాజు : మీరు వెంటనే వివస్త్రులు కాకపోతే తరువాతి బాణాలు మాత్రం నెరుగామీ గుండెల్లోకి దూసుకుపోతాయి - భటులారా ....... ఆజ్ఞ ప్రభూ అంటూ బాణాలను పిల్లలవైపు ఎక్కుపెట్టారు . వద్దు వద్దు వద్దు ....... మీరు చెప్పినట్లుగానే చేస్తాము అంటూ పిల్లలవైపు ప్రాణంలా చూస్తూ పైకిలేచారు తల్లులు . అమ్మా అమ్మా అమ్మా ...... వద్దు వద్దు అంటూ కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తున్నారు . పిల్లల తండ్రులు ఏమీచెయ్యలేక నరకాన్ని అనుభవిస్తున్నారు . తల్లులు : మీ కంటే మాకేదీ ఎక్కువకాదు . అమ్మా అమ్మా అమ్మా వద్దు వద్దు వద్దు ....... సామంతరాజులు : వీళ్ళు ఇలాగే ఆలస్యం చేసేలా ఉన్నారు మనమే వివస్త్రులను చేద్దాము అంటూ రాక్షసనవ్వులతో ముగ్గురు తల్లులదగ్గరికి చేరుకుని భుజంపై వస్త్రాలను అందుకోబోయారు . వారిపై చెయ్యివేస్తే మీ చేతులను ఖండఖండాలు చేస్తాను అంటూ గోలుసులలో ఉన్న రాణులు కోపంగా ముందుకు రాలేకపోతున్నారు .
02-02-2023, 10:54 AM
సామంతరాజులు : ముందుకువస్తే మిమ్మల్నీ వివస్త్రులను చెయ్యాల్సివస్తుంది రాణులూ ........ అంటూ తల్లుల ఒంటిపై చేతులు వెయ్యబోయారు .
ఆ ఆరాచకాన్ని చూస్తూ ఇక ఊరికే ఉండలేకపోయాను - దుర్గమ్మ తల్లీ ఇక మీపైనే భారం అంటూ వెనుక నుండి మూడు బాణాలను నాలుగు వేళ్ళతో అందుకుని చెట్టు చాటునుంది బయటకువచ్చి ఒకేసారి వదిలాను . ఒక్కసారిగా మూడు బాణాలు వాయువేగంతో వెళ్లి ముగ్గురి సామంతరాజుల అరచేతులను చిట్లిపోయేలా చీల్చేశాయి . ముగ్గురు తల్లుల వస్త్రాలకు ఇంచు దూరంలో భయంకరమైన నొప్పితో హాహాకారాలు ఉద్యానవనం మొత్తం వినిపించాయి . ఆ కంగారులో సైనికులు ఎక్కుపెట్టిన బాణాలు విడుదల అవ్వడంతో పిల్లలూ పిల్లలూ ...... అంటూ రాణులు గట్టిగా కేకలువేశారు . అధిచూసి వెంటనే మరొక మూడు బాణాలను అందుకుని అంతకు రెట్టింపు వేగంతో గురిచూసి వదిలాను . పిల్లల గుండెల్లోకి దిగడానికి కసింత దూరంలో నా బాణాలు ..... ఆ బాణాలను గురితప్పించడంతో రాణులు - తల్లులు - బంధింపబడిన తండ్రులు ఊపిరిపీల్చుకున్నారు . సామంతరాజులు చేతులను మరొకచేతితో పట్టుకుని ఇంకా నొప్పితో కేకలువేస్తూనే ఉన్నారు . బాణాలు వదిలినవాడు ఎవడు ? - ఎటువైపు నుండి వచ్చాయి ? అంటూ చుట్టూ చూస్తున్నారు మహారాజు - సామంతరాజులు ....... అటువైపు మహారాజా అంటూ నావైపుకు బాణాలను ఎక్కుపెట్టారు వందలమంది సైనికులు , అంతటితో ఆగకుండా మరొక వందమంది నావైపుకు కత్తులతో - ఈటెలతో నావైపుకు పరుగునవస్తున్నారు . మహారాజు : వాడిని ఖండఖండాలుగా నరికేయ్యండి - వొంట్లోకి కనీసం వంద బాణాలైనా దిగాలి . వీరాధివీరా జాగ్రత్త అంటూ కంగారుపడిపోయారు బుజ్జాయిలు రహస్య మార్గంలో ......... బుజ్జాయిలవైపు కన్నుకొట్టి , ఎవరు ఎవరి ఒంట్లో ధింపుతారో రండి అంటూ ధనుస్సును కిందకువదిలి చేతులతో రెండు కత్తులను అందుకుని నావైపుకు వస్తున్న వందమంది మీదకు విరుచుకుపడ్డాను , చేతులు - వేళ్ళు - చెవులు ....... తెగ నరుకుతూ నేరుగా వెళ్లి మహారాజు ముందు నిలబడ్డాను గర్వంగా ........ గుంపులో ఎవరెవరికి ఏమేమి తేగాయో చూసుకుని హాహాకారాలతో నొప్పిని అనుభవిస్తున్నారు . మహారాజు : ఊహించనట్లుగా నుదుటిపై చెమటతో వెనక్కు అడుగులువేసి , ఇంకా చూస్తున్నారే వీడిపై బాణాల వర్షం కురిపించండి . రాణి అయితే కదలకుండా చూస్తూ ఉండిపోయారు . కురిపించండి కురిపించండి ....... , ఇక్కడ నాపై బాణాల వర్షం కురిస్తే అక్కడ రాజ్యపు పొలాలలో మీ యువరాజుపై బాణాల వర్షం కురుస్తుంది . మహారాజు : నా బిడ్డ ....... , ఆగండి అంటూ రెండుచేతులతో సైగలుచేశాడు . అవును మీ ఒక్కగానొక్క వారసుడైన యువరాజు మా బానిసగా ఉన్నాడు . మహారాజు : నేను నమ్మను ....... బుజ్జాయిలూ ధైర్యంగా రండి . వీరాధివీరా వీరాధివీరా ....... అంటూ బుజ్జాయిలు పరుగున రావడం - మీరు ఉండగా మాకెందుకు భయం మీకేమీ కాలేదుకదా అంటూ నా గుండెలపైకి చేరడం ముద్దులుపెట్టడం చూసి నోటివెంట మాట రాలేదు మహారాజుకు ........ మీరు ప్రార్థిస్తున్నారుగా నాకేమీ కాకూడదు అని నాకేమీ కాలేదు అంటూ కత్తులను కిందకువదిలి ముద్దులుపెట్టి ఆప్యాయంగా హత్తుకున్నాను . రాణి : బుజ్జితల్లీ - నాన్నా ....... అంటూ సంతోషంతో సంకెళ్లను తెంచుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు . మీ అమ్మగారు కంగారుపడుతున్నట్లుగా ఉన్నారు వెళ్ళండి , వెళ్లి సంకెళ్ల నుండి విడుదల చెయ్యండి . బుజ్జాయిలు : సంకెళ్లు తొలగించాలి కాబట్టి వెళుతున్నాము తొలగించి వచ్చేస్తాములే మీరు జాగ్రత్త అంటూ ముద్దుముద్దుమాటలతో ముద్దులుపెట్టడంతో , ఆహ్హ్ ..... అంటూ వదల్లేక కిందకు వదిలాను . బుజ్జాయిలు : అమ్మా - అత్తయ్యా - పిన్నమ్మలూ ...... అంటూ పరుగునవెళ్లి , వీరాధివీరుడు వచ్చాడుగా వీళ్ళు మనల్ని ఏమీచెయ్యలేరు అంటూ సంకెళ్లను లాగుతున్నారు - అమ్మా ..... ఏంటమ్మా వీరాధివీరుడిని అలా చూస్తున్నావు ? అమ్మా అమ్మా ........ బుజ్జాయిలూ బుజ్జాయిలూ ........ మీకేమీ కాలేదుకదా అంటూ సంతోషంతో మోకాళ్లపైకి కూర్చుని హత్తుకున్నారు బుజ్జాయిల తల్లి . బుజ్జాయిలు : మమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన భటులనుండి వీరాధివీరుడు కాపాడారమ్మా , ఇప్పుడు మిమ్మల్ని - మన ప్రజలందరినీ కాపాడటానికి వచ్చారు . కట్టివేసిన పిల్లలను విడుదలచేస్తూ బుజ్జాయిల సంతోషాలను అలా చూస్తుండిపోయాను . మా చేతులనే గాయపరిచినవాడిని ఏమీచెయ్యకుండా ఊరికే ఉండిపోయారేమిటి మహారాజా అంటూ సామంతరాజులు కోపంతో రగిలిపోతున్నారు . మహారాజు : వాడి దగ్గర నా ఒక్కగానొక్క వారసుడు బందీగా ఉన్నాడు - వాడే నా సర్వస్వం వాడికేమైనా అయితే నేను తట్టుకోలేను - ఇదంతా వాడికోసమే కదా ....... మంచి నిర్ణయం మహారాజా ...... సామంతరాజులు : మహారాజా ...... ఇలాంటి అవకాశాన్ని వధులుకుoటారా , ఇలాంటి అవకాశం మళ్లీ రాదు , ఈ రాజ్యపు అదిగో ఈ కొండల్లోని వజ్రవైఢూర్యాలతో ఇంతటి సుందరీమణులతో ఒక్కరేటిమిటి వందమంది వారసులను కనవచ్చు ....... మహారాజు : నా భార్య జ్ఞాపకం వాడు - మా నాన్నగారి పేరుతో పెరిగాడు , వాడు లేని జీవితం వృధా వదిలెయ్యండి . సామంతరాజులు : మీ చివరి నిర్ణయం ఇదేనా మహారాజా ....... మహారాజు : సైనికులారా ...... ఆయుధాలను కిందకుదించండి . సామంతరాజులు ఒక్కటైనట్లు మహారాజు వెన్నులో కత్తులను దించేశారు , మన్నించండి మహారాజా ...... ఇంతటి అవకాశాన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము , ఇక ఈ రాజ్యం మాదే - రాజ్య సంపద మాదే - అతిలోకసుందరీమణులైన రాణుల అందాలు మావే అంటూ మళ్లీ కత్తులతో పొడిచి చంపేశారు , సైనికులారా ...... మీ మహారాజు కంటే ఎక్కువ సంపదను ఇస్తాము - మీకిష్టమైన అమ్మాయిలను చెరపట్టవచ్చు మాతో కలవండి . నాన్నగారూ నాన్నగారూ ...... అంటూ ఏడుస్తూ పరుగునవచ్చాడు యువరాజు - నాన్నగారు వీరి కపటాల గురించి ముందుగానే మన మంత్రిగారు చెప్పినా మీరు వినలేదు అంటూ కోపంతో సామంతారాజులపైపుకు ఆయుధాన్ని ఎత్తాడు . సామంతరాజులు : భటులారా ...... బంధించండి , జీవితాంతం చీకటి కారాగారంలో ఉంచి ఆనందిస్తాము . వీరాధివీరా వీరాధివీరా ...... అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరారు . సామంతరాజులు : వీరాధివీరుడా ? , వీరాధివీరా ...... ఇప్పుడేమి చేస్తావు ? - మమ్మల్నే గాయపరుస్తావా ...... నిన్ను ఎలా హింసించి చంపుతామో చూడు , భటులారా వాడిని బంధించి మొదట వాడిచేతిని తెగ నరకండి . అంత తొందర దేనికి వెన్నుపోటు రాజుల్లారా ...... , ఇలాంటి ద్రోహాలు ఉంటాయని తెలియనివాడిని కాదు , బుజ్జాయిలూ ...... మనదగ్గర ఎవరు ఉన్నారో తెలుసుకదా ......... బుజ్జాయిలు : అడవికే రాజు ....... ఇంకెందుకు ఆలస్యం పిలవండి మరి ........ బుజ్జాయిలు : మిత్రమా మిత్రమా ...... అంటూ కేకలువేశారు . ఒక గర్జన వినిపించింది - ఆ గర్జనకే సామంతరాజులతోపాటు సైనికులంతా భయపడ్డారు , అడవికే కాదు అడవిలో ఉన్న రాజ్యాలకు కూడా నేనే రాజును అన్నట్లు సైనికుల దర్జాగా వస్తోంది - వెనుకే అంతకంటే దర్జాగా కృష్ణ రావడం బుజ్జాయిలకు చూయించి నవ్వుకున్నాము . సైనికులంతా భయంతో పరుగులుతీస్తూ దారిని వదిలారు - సామంతరాజులు భయంతో సైన్యాధ్యక్షుల వెనుక దాక్కున్నారు . సైన్యాధ్యక్షుడు : ఒక్క సింహం ఎంతమందిని చంపుతుంది మిగిలినవారు కురిపించే బాణాల వర్షంలో కొట్టుకుపోతుంది . బుజ్జాయిలు చెప్పినది మీరు సరిగ్గా విన్నట్లు లేదు అక్కడ ఉన్నది ........ బుజ్జాయిలు : అడవికే రాజు ...... అడవిరాజా ...... మీరేమిచెయ్యగలరో కాస్త చూయించండి అంటూ బుజ్జాయిలను సింహంపై కూర్చోబెట్టాను . బుజ్జాయిలు : మేము సింహంపై కూర్చున్నా భయపడటంలేదు - కంగారుపడటంలేదు ఏమిటమ్మా ....... ముసుగులోనుండే నావైపుకు వేలిని చూయించారు . బుజ్జాయిలు : వీరాధివీరుడి గురించి మీకూ తెలిసిపోయిందన్నమాట అంటూ గాలిలో వారి తల్లికి ముద్దులువదిలారు , అత్తయ్యా - పిన్నమ్మలూ ...... కంగారుపడాల్సిన అవసరమేలేదు , అమ్మ చూడండి ఎంత ధైర్యంగా ఉంది . ఎంత ముద్దుముద్దుగా మాట్లాడుతున్నారో ...... , మీరు పొగుడుతుంటే నాకు తెగ సోగ్గేస్తోంది అంటూ బుజ్జాయిలకు ముద్దులువదిలాను . బుజ్జాయిలు : ఇంతటి వీరాధివీరుడికి సిగ్గు బాగోదు అంటూ నవ్వుకున్నారు . ఇంతమంది వేలమంది సైనికులు వారి చేతుల్లో ఆయుధాలను చూసికూడా భయం కలగడం లేదు అంటూ సామంతరాజులు వణుకుతూనే అన్నగారి . అడవిరాజు సైగచెయ్యడం చూసి , బుజ్జాయిలూ ...... జాగ్రత్తగా పట్టుకోండి అంటూ మంజరి బుజ్జాయి భుజంపైకి చేరింది . బుజ్జాయిలూ ....... చెవులు మూసుకోండి . బుజ్జాయిలు : అత్తయ్యా - పిన్నమ్మలూ - అమ్మా - చెలికత్తెలూ - రాజ్య ప్రజలారా - పిల్లలూ ...... వీరాధివీరుడు చెబుతున్నాడు చెవులు మూసుకోండి అనిచెప్పి మంజరిని రెండుచేతులతో సున్నితంగా అందుకుని వస్త్రంలో దాచుకుని చెవులు మూసుకున్నారు . మిత్రుడు అయితే సింహం వెనుకే నిలబడ్డాడు తక్కువ వినిపించేలా ....... అడవిరాజు ఒక్కసారిగా ముందుపాదాలను మనిషి అంతెత్తుకు లేపి జూలువిధిలిస్తూ రాజ్యం చుట్టూ ఉన్న అడవి మొత్తం వినిపించేలా ఒక భయంకరమైన గర్జన గర్జించింది . చెవులు మూసుకున్న వాళ్ళం తప్ప మిగతావారంతా చెవులలో రక్తం వచ్చినట్లు కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం అయిపోయినట్లు చెవులను స్పృశించుకున్నారు . బుజ్జాయిలు : వీరాధివీరా ...... చెవులు మూసుకున్నా గుండె దడదడలాడిపోయింది . అవునా అంటూ ఇద్దరినీ ఆప్యాయంగా ఎత్తుకున్నాను . బుజ్జాయి : మంజరి మంజరి అంటూ ఎగరేసి , ఏమీకాలేదులే వీరాధివీరా ...... , మేమంటే ఎందుకంత ఇష్టం ....... ఏమో ఈ హృదయానికే తెలియాలి - మిమ్మల్ని గుండెలపై ఎత్తుకోకుండా ఒక్క క్షణమైనా ఉండలేకపోతున్నాను అంటూ ముద్దుచేసాను . బుజ్జాయిలు : అమ్మ ప్రేమకంటే బాగుంది . ఎదురుగా రాణిగారు హృదయంపై చేతినివేసుకున్నారు . మన్నించండి రాణీగారూ ...... , బుజ్జాయిలు ...... గర్జించింది కొద్దిసేపు భయపడ్డాము ఇంకేమిటి ? అంటూ సైన్యాధ్యక్షులు కత్తులు తీశారు . సామంతరాజులే అనుకుంటే ధైర్యవంతులైన మీరుకూడా ఆతృతగా ఉన్నారు - కొద్దిసేపు ఆగితే మీకే తెలుస్తుంది అదిగో ........ సముద్రం వైపునుండి తప్ప కొండపాదంగా ఉన్న కొండపైనుండి మరియు మిగిలిన రెండువైపుల నుండీ సింహం గర్జనలు - పులి చిరుతపులుల గాండ్రిoపులు - ఎలుగుబంటి - ఏనుగు - చింపాంజీలు - ఏనుగు గుర్రాలు - కోతులు - నక్కలు - జింకలు ....... ఇలా అన్నిరకాల జంతుల కేకలు వినిపించాయి , మరుక్షణంలో కోటగొడ ఎక్కివచ్చేవి కోటగొడపై మిగిలినవి సింహద్వారం బద్ధలుకొట్టుకుని లోపలికివచ్చాయి . అందరూ ఆశ్చర్యంతో - అవాక్కై చూస్తుండటం చూసి భలేభలే అంటూ బుజ్జాయిలు చప్పట్లుకొడుతూ అడవిరాజుకు ముద్దులు కురిపిస్తున్నారు . అంతలో మరొక సింహం వెనుకే బుజ్జి సింహాలు ...... ఏనుగులు బద్ధలుకొట్టిన సింహద్వారం నుండి లోపలికివచ్చి అంతులేని సంతోషంతో నేరుగా అడవిరాజు దగ్గరికివచ్చి ప్రేమను పంచుకున్నాయి - మళ్లీ చూస్తాననుకోలేదు అన్నట్లు బుజ్జి సింహాలను ముద్దుచేస్తున్నాడు . బుజ్జాయిలు : బుజ్జిసింహాలు భలే ముద్దుగా ఉన్నాయి వీరాధివీరా ...... , అడవిరాజు బుజ్జిపిల్లలు ఇవేనన్నమాట ........ అడవిరాజు : తీర్చుకోలేని రుణం కృతజ్ఞతలు అన్నట్లు బుజ్జి సింహాలను నోటితో కరుచుకునివచ్చి నాముందుకు వదిలాడు . బుజ్జాయిలూ ....... ఎత్తుకోవాలని ఉందా ? అంటూ కిందకుదించాను . బుజ్జాయిలిద్దరూ సంతోషంతో బుజ్జి సింహాలను ఎత్తుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు . చూసి ఆనందించాను , సైన్యాధ్యక్షులారా ...... ఇంకేమిటి అన్నారుకదా మరొకసారి చూయించాలా ....... అంతే ఈసారి ఏకంగా అడవిరాజుతోపాటు తన అర్ధాంగి కూడా జూలువిధిలిస్తూ గర్జించగానే , మూడువైపులా ఉన్న జంతువులన్నీ గాండ్రించాయి . ఆ అరుపులకు రాజ్యం - అరణ్యమే దద్దరిల్లింది ఇక సైనికులెంత , ఒక్కసారిగా భయంతో తమ ఆయుధాలను కిందకువదిలేసి శరణు శరణు అంటూ మొక్కాళ్లపైకి చేరారు . సామంతరాజులారా ...... మీరేమంటారు ? . వొళ్ళంతా చెమటతో వణుకుతూనే చుట్టూ చూసి , మన్నించండి మన్నించండి వీరాధివీరా మేము తప్పుచేసాము అంటూ నా కాళ్ళ చెంతకు చేరారు . మిమ్మల్ని మన్నించాల్సింది నేనుకాదు ఈ రాజ్యపు బుజ్జి యువరాజు - బుజ్జి యువరాణి అంటూ బుజ్జాయిలవైపు చూయించాను . బుజ్జి యువరాజా - బుజ్జి యువరాణీ మమ్మల్ని క్షమించి వదిలెయ్యండి ఇక ఇలాంటి తప్పులు ఎన్నటికీ చెయ్యము . రాణులు - యువరాణులు ....... సంతోషిస్తున్నట్లు ముసుగులలోనే ఆనందబాస్పాలను తుడుచుకుంటున్నారు . వీరాధివీరా - వీరాధివీరా ...... అంటూ నా గుండెలపైకి చేరారు , ఓహో అలాగా బుజ్జి యువరాణీ ...... మీ ఆజ్ఞగా చెబుతాను అంటూ ముద్దుపెట్టాను , ముందైతే మీరే స్వయంగా వెళ్లి ఈరాజ్యపు వీరులైన సైనికులను సంకెళ్ళ నుండి విముక్తులను చేసి రాజ్యపు ఆడపడచుల పాదాలపై పడండి . వెంటనే వెంటనే చేస్తాము అంటూ పరుగునవెళ్లి సైనికులను విడుదల చేసి స్త్రీల పాదాల చెంతకు చేరారు . అమ్మలూ - అక్కయ్యలూ ...... వెంటనే క్షమించకండి అంటూ పిల్లలంతా సంతోషాలతో పరుగునవెళ్లి కోపాలతో సామంతరాజుల వేళ్ళను నలిపేశారు పాదాలతో ....... , అమ్మా - నాన్నా - అక్కయ్యలూ ...... కుటుంబాలు కలిసాయి . వారి ఆనందాలను అలా చూస్తుండిపోయాను . బుజ్జాయిలు : వీరాధివీరా ..... నీవల్లనే ఆ ఆనందాలు అంటూ ముద్దులుపెట్టారు . లేదు లేదు మీవల్లనే అంటూ గట్టిగా హత్తుకుని ఆనందిస్తున్నాను , సైనికులారా ..... ఇందులో మీ తప్పేమీ లేదు రాజులు ఎలాచెబితే అలా పాటించారు - ఇకనుండి మీ మహారాజు యువరాజే ...... యువరాజా యువరాజా ....... అంటూ నినాదాలు చేశారు , యువరాజా ...... మీ తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలి - ఆ సామంతరాజులకు ఎలాంటి శిక్ష వేస్తారో మీఇష్టం ....... యువరాజు : సైనికులారా ...... సామంతరాజులతోపాటు సైన్యాధ్యక్షులను బంధించి తీసుకెళ్లి మనరాజ్యపు కారాగారంలో పడేయ్యండి , మీ అందరినీ మనరాజ్యంలో కలుస్తాను - నాన్నగారి అంత్యక్రియలకు ఏర్పాటుచేయ్యండి . ఆజ్ఞ మహారాజా అంటూ సామంతరాజులను బంధించి - మహారాజు మృతదేహాన్ని గౌరవంగా తీసుకునివెళ్లిపోయారు . యువరాజు : మంత్రిగారూ ...... మా తాతయ్య దగ్గరనుండి ఇప్పటివరకూ ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో సహాయం చేస్తూనే వచ్చారు - ఇకపై కూడా మమ్మల్ని ధర్మ మార్గంలో మీరే తీసుకెళ్లాలి . మంత్రి : సంతోషం యువ ...... మహారాజా ...... యువరాజు : మేము వచ్చేన్తవరకూ రాజ్యపు బాధ్యతలు మీవే ........ మంత్రి : చిత్తం మహారాజా ....... అంతలో సముద్రం వైపు ఓడలు తీరానికి చేరినట్లు శబ్దాలు వినిపించాయి . మంత్రి : ప్రభూ ...... ఈరాజ్యపు రాజును వెంబడిస్తూ వెళ్లిన ఓడలు వచ్చినట్లున్నాయి . అదే నిజం అన్నట్లు ఈ రాజ్యపు సైనికులను బందీలుగా పట్టుకుని సైనికులు లోపలికివచ్చారు - మంత్రి ద్వారా విషయం తెలుసుకుని యువరాజు ముందు మోకరిల్లారు , మహారాజా ...... ఈ సైనికులను అడ్డుగా ఉంచి ఈరాజ్యపు రాజు - మంత్రి - సైన్యాధ్యక్షుడు పరాయిదేశం పారిపోయారు ప్రభూ , మన విలుకాళ్ళు రాజు గుండెల్లో బాణాన్ని దించారు ప్రభూ ....... బుజ్జాయిలు : ఆ రాక్షసుడు ఎంతదూరం పారిపోతే రాజ్యానికి అంత మంచిది . సరిగ్గా చెప్పారు బుజ్జి యువరాజా ...... అంటూ కష్టాలు - ఇబ్బందులుపడ్డట్లు స్త్రీలు కన్నీరు కారుస్తున్నారు , రాణీగారూ - యువరాణీ ...... అంటూ వెళ్లి చుట్టూ చేరారు . యువరాజు : సైనికులారా ...... అందరినీ విడుదలచెయ్యండి , మీరు ..... మంత్రి గారితోపాటు వెళ్ళండి . చిత్తం మహారాజా అంటూ వెళ్లిపోయారు . సైనికులంతా వారి వారి కుటుంబాలను చేరారు . హమ్మయ్యా ...... కథ సుఖాంతం అయ్యింది . అప్పుడేనా వీరాధివీరా వీరాధివీరా అంటూ బుజ్జాయిలు - యువరాజు ఒకేసారి అని నవ్వుకున్నారు . ఒక్కసారిగా వీరాధివీరా వీరాధివీరా వీరాధివీరా ....... అంటూ రాజ్యంలోని పిల్లలు ఆ వెనుకే సైనికులంతా చుట్టూ చేరి , మీరు లేకపోయుంటే మేమంతా జీవితాంతం భయంకరమైన శిక్షలు అనుభవిస్తూ బాధపడుతూనే ఉండేవాళ్ళం ....... , రాణులతోపాటు రాజ్యపు స్త్రీలందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు . లేదు లేదు లేదు నేనేమిచేసాను మనిషిగా సాటిమనుషులకు సహాయం చేసాను అంతే , మీరు కృతఙ్ఞతలు చెప్పుకోవాలనుకుంటే ఈ మీ బుజ్జి యువరాజు యువరాణీలకు , అడవిరాజుకు మరియు చుట్టూ ఉన్న అడవి జంతువులకు ఎందుకంటే ఈ బుజ్జాయిలను కలవకపోయి ఉంటే ఈరాజ్యానికి వచ్చేవాడినే కాదు అంటూ బుజ్జి సింహాలను ఎత్తుకున్న బుజ్జాయిలను ఒక్కొక్క సింహంపై కూర్చోబెట్టాను . బుజ్జాయిలు : లేదు లేదు వీరాధివీరుడికే ...... సరిలేకానీ బుజ్జాయిలూ ...... , వీరంతా వీరాధివీరా వీరాధివీరా అంటూ నినాదాలు చేస్తారని మీకెలా తెలుసు . రాజ్యంలో ఎవరైనా గొప్ప పని చేస్తే నినాదాలతో అభినందించడం చూసాము - మీరు చేసినది మహా మహా గొప్ప పని కదా ....... అంటూ ముద్దుముద్దుగా చెప్పారు . బుజ్జాయిలే కానీ పిడుగులు అంటూ గాలిలో ముద్దులువదిలాను . అంతవరకూ సింహాలను చూసి భయపడుతున్న చుట్టూ ఉన్న పిల్లలకు ఏమీచెయ్యవు అంటూ పిలిచి తాకించి ఆనందిస్తున్నారు . సైనికులారా ...... నన్ను తరువాత అభినందించవచ్చు , మొదట రాజ్యంలో తాళాలువేసి బంధించిన మీ మీ కుటుంబాన్ని చేరండి . సైనికులు : మీరు దేవుడు వీరాధివీరా అంటూ నమస్కరించి వెళ్లారు .
02-02-2023, 10:55 AM
ఎప్పుడు వచ్చారో ఏమిటో వెనక్కు తిరుగగానే నాకు అతిదగ్గరగా ముసుగులలో రాణీగారు ఉన్నారు , ఆగండి ఆగండి ప్రజలారా ...... ఈక్షణం నుండీ మన రాజ్యాన్ని - మనల్ని కాపాడిన ఈ వీరాధివీరుడే మన మహారాజు అంటూ అభినందించడానికన్నట్లు నన్ను కౌగిలించుకోబోయారు ...........
మంజరి ...... మహారాణీ గారి చుట్టూనే తిరుగుతోంది . ష్ ష్ ష్ అన్న సైగలూ వినిపిస్తున్నాయి . మహారాజు మహారాజు మహారాజు ...... అంటూ రాజ్యం మొత్తం దద్దరిల్లింది . బుజ్జాయిలు : మహారాజు మహారాజు ....... అడవిరాజుతోపాటు చుట్టూ ఉన్న జంతువులన్నింటికీ ఇష్టమే అన్నట్లు సంతోషంలో గర్జిస్తున్నాయి - గాండ్రిస్తున్నాయి - అరుస్తున్నాయి . యువరాజు : సరైన నిర్ణయం తీసుకున్నారు మహారాణీ - మా రాజ్యం కూడా సంతోషంగా మద్దతిస్తుంది అంటూ ఆనందాన్ని పంచుకున్నారు . అక్కయ్యా - వదినా ...... గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటూ చప్పట్లు కొడుతున్నారు . లేదు లేదు లేదు మన్నించండి మన్నించండి రాణీగారూ ..... క్షమించండి ఇప్పుడు మహారాణీ గారు కదూ ....... అంటూ వెనక్కు వెళ్ళాను . మహారాణి : లేదు లేదు అన్నది నేను కౌగిలించుకుని అభినందించబోతున్నందుకా లేక మహారాజునని అందరి ఇష్టాలతో ప్రకటించినందుకా ....... మంజరి ..... మహారాణీ గారి భుజంపైకి చేరబోతే నాకు కనిపించకుండా తోసేస్తున్నారు . మన్నించండి మహారాణీ గారూ ...... రెండింటినీ తిరస్కరిస్తున్నాను , నా హృదయంలో నా దేవకన్యకు మరియు ఈరోజు నుండీ ఈ బుజ్జాయిలకు మాత్రమే స్థానం మరొకరు ...... మన్నించండి , ఇక రాజ్యకాంక్ష నాకు లేదు , నా గమ్యం నా ప్రియమైన ప్రాణమైన దేవకన్య అంటూ హృదయంపై చేతినివేసుకుని అనుభూతిని పొందుతున్నాను . తిరస్కరించినా మహారాణీ గారు తెగ సంతోషిస్తున్నట్లు తెలుస్తోంది . అయితే మమ్మల్ని అభినందించనివ్వండి అంటూ ముగ్గురు రాణులు ముందుకువచ్చారు . మన్నించండి మన్నించండి రాణులూ ...... ఇక్కడ కేవలం నా ప్రాణసఖికి మాత్రమే స్థానం , ఈ ప్రయాణం కూడా తనకోసమే మీరు సెలవిస్తే బయలుదేరుతాను . మహారాజా మహారాజా ...... అంటూ బుజ్జి సింహాలను ఎత్తుకుని నా గుండెలపైకి చేరారు బుజ్జాయిలు , ఇప్పుడే కదా మీ హృదయంలో మేమూ ఉన్నామని అన్నారు అప్పుడే వెళ్లిపోతాను అంటున్నారు . మిమ్మల్ని విడిచివెళ్లడం కష్టమే కానీ అంటూ గట్టిగా హత్తుకున్నాను - కళ్ళల్లో చెమ్మ ........ బంజాయిలు : మీ కళ్ళల్లో నీటిని చూస్తుంటేనే మేమంటే ఎంత ఇష్టమో అర్థమైపోతోంది . ఎందుకో తెలియదు ఈ గుండెలపై చేరిన క్షణమే నా ప్రాణసఖితో సమానం అయిపోయారు . అయితే ఉండిపోండి అన్నయ్యా అంటూ హత్తుకోబోయింది యువరాణి , అన్నయ్య ఆప్యాయతతో ....... చెల్లీ అంటూ నవ్వడంతో హత్తుకుంది - చెల్లీ ...... నీ ప్రేమికుడి సహాయం వల్లనే ఇదంతా సాధ్యం అయ్యింది పాపం నీ ప్రేమకోసం ఎంతలా ఎదురుచూస్తున్నాడో చూడు . సిగ్గుపడుతూ వెళ్లి యువరాజు గుండెలపైకి చేరింది . మహారాణి : చీకటిపడుతోంది ఎలాగో మార్గమధ్యమంలో విశ్రాంతి తీసుకోవాలికదా అదేదో ఇక్కడే తీసుకోండి . మంజరి ..... మహారాణీగారి చుట్టూనే ప్రదక్షణలు చేస్తుండటం ఆశ్చర్యంగా ఉంది . బుజ్జాయిలు : బుజ్జి యువరాజు యువరాణిగా ఆజ్ఞ వేస్తున్నాము - బ్రతిమాలుకుంటున్నాము అంటూ ముద్దులవర్షం కురిపిస్తున్నారు . మంజరీ - మిత్రమా ....... ఏమంటారు ? . మంజరి : జీవితాంతం ఇక్కడే ఉండమన్నా సంతోషమే అంటూ మహారాణి దగ్గరకు వెళుతుంటే తప్పించుకుంటున్నారు . బుజ్జాయిలకోసం ఒప్పుకుంటున్నాను . అంతే బుజ్జిసింహాలను పట్టుకున్న బుజ్జాయిలను ఎత్తుకున్న నన్ను అమాంతం పైకెత్తేసి మహారాజా మహారాజా ....... అంటూ హోరెత్తిస్తున్నారు . వద్దన్నా వినకపోవడంతో తప్పలేదు . మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి అంటూ సంతోషంగా కిందకుదిగాను , బుజ్జియువరాజా - బుజ్జి యువరాణీ ...... రాజ్యంలోని పొలాలు మరియు వాటిచుట్టూ ఉన్న అడవి చెట్లన్నీ ఎండిపోయాయి కానీ ఈ ఉద్యానవనం మాత్రం పచ్చదనంతో కళకళలాడుతోంది , ఈ గడ్డి - పూలమొక్కలకు నీరు ఎక్కడనుండి చేరుతోంది . బుజ్జాయిలు : కొండపైనుండి అంటూ పైకి చూయించారు - ఇంతకుమించిన ఉద్యానవనాలు బోలెడన్ని ఉన్నాయి , ఇక కొండ ఉపరితలంపై అమ్మ - అత్తయ్య - పిన్నమ్మల ఉద్యానవనాలు అయితే మరింత అందంగా ఉంటాయి . ఆశ్చర్యం - అద్భుతం ...... ఈ పోరాట హడావిడిలో గమనించలేదు కానీ కొండ పైనుండి పాదాలవరకూ రాజభవనం అత్యద్భుతం , రాజభవనాల వాస్తుశిల్ప సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు . బుజ్జాయిలు : ఏమిటి మహారాజా అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు . అత్యద్భుతమైన రాజ్యం అంటూ కింద నుండి పైకి - పైనుండి కిందకు పదేపదే చూస్తున్నాను , నేను మహారాజుని కాదు . మహారాజా మహారాజా మహారాజా ...... అంటూ చుట్టూ ఉన్నవారితోపాటు ఇళ్లల్లో బంధింపబడినవారూ వచ్చినట్లు నినాదాలు చేస్తున్నారు . బలవంతంగా మహారాజును చెయ్యడం భావ్యం కాదు , బుజ్జాయిలూ ..... చెప్పానుకదా నా పియసఖికి మాత్రమే ప్రభువునని ........ , ఏంటి రాణీగారు సిగ్గులొలికిపోతున్నారు - మంజరి అయితే రాణిగారి చుట్టూనే ప్రదక్షణలు చేస్తోంది , సరికానీ బుజ్జాయిలూ ..... ఆ ఉద్యానవనాలు కూడా ఇలాగే పచ్చగా ఉన్నాయా ? . బుజ్జాయిలు : అవును . ఉద్యానవనాలన్నింటికీ నీళ్లు ఎక్కడనుండి వస్తున్నాయి . బుజ్జాయిలు : పైనున్న చిన్న కొలను నుండి , పారిపోయిన రాజు ఉన్నాడుకదా అతడు కేవలం రాజభవనంలో ఉన్న వారికి - ఉద్యానవనాలకు మాత్రమే నీటిని వదిలేలా అడ్డుకట్ట వేసాడు , రాజ్యంలోని ప్రజలు దాహంతో అలమటిస్తున్నారని అమ్మా - అత్తయ్యావాళ్ళు ఎంత విన్నవించుకున్నా వదలలేదు , మళ్లీ వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియదు ప్రజలకు వదిలితే చివరికి నాకు త్రాగడానికి ఉండవు అని నీళ్లు అడిగిన ప్రజలను చిత్రహింసలు పెట్టాడు , ప్రజల ప్రార్థనలు ఫలించాయి . బుజ్జియువరాజా - బుజ్జియువరాణీ ...... రాజ్యంలోని ప్రజలతోపాటు రాజ్యం చుట్టూ ఉన్న అడవులలో ఉన్న జంతువులన్నీ రోజుల తరబడి నీళ్లు లేక దాహంతో అలమటిస్తున్నాయి , మీరు అనుమతి ఇస్తే వాటి దాహం తీరుద్దాము . దాహం అని వినిపించగానే చుట్టూ ఉద్యానవనంలో మరియు రాజ్యపు కోటపై ఉన్న జంతువులన్నీ మాచుట్టూ చేరాయి . అమ్మా అమ్మా నాన్నా ....... అంటూ పిల్లలందరూ భయపడటం చూసి , అక్కయ్యలూ - అన్నయ్యలూ ...... భయపడకండి , మన మహారాజు ఆజ్ఞలతో మనల్ని - మన రాజ్యాన్ని రక్షించిన దేవుళ్ళు ఈజంతువులు . బుజ్జాయిల మాటలకు ఈలలు - చప్పట్లు హోరెత్తాయి . వయసుకే బుజ్జాయిలు నిజానికి పిడుగులు ....... బుజ్జాయిలు : మా మహారాజు వల్లనే పిడుగులం అయ్యాము - అది వదిలెయ్యండి ముందైతే రాజ్యానికి మహారాజు ఎవరు ప్రజలారా ...... ? . ప్రజలు - సైనికులు : వీరాధివీరుడు - మహారాజు , వీరాధివీరుడు - మహారాజు ........ బుజ్జాయిలు : మహారాజు ఆజ్ఞ వేస్తేనే పైనున్న చిన్నకొలనులోని నీరు కిందకువస్తుంది . మిమ్మల్నీ అంటూ బుగ్గలపై సున్నితంగా కొరికేసాను . బుజ్జాయిలు : స్స్స్ స్స్స్ ...... క్షమించండి క్షమించండి అంటూ లెంపలేసుకోబోయి ఎత్తుకుని ఉండటంతో కుదరలేదు . బుజ్జాయిలు : మేము సహాయం చేస్తాము అంటూ కొట్టబోయి ముద్దులుపెట్టి నవ్వుతున్నారు . బుజ్జితల్లీ - నాన్నా ....... అంటూ ముసుగులోనే ఆనందిస్తున్నట్లు హృదయంపై చేతినివేసుకున్నారు . బుజ్జాయిలు : మాకిష్టమైన వీరాధివీరుడిని కొడతామా అమ్మా ....... , అయినా మహారాజును కొట్టే ధైర్యం ఎవరైనా చేస్తారా అంటూ నవ్వుతున్నారు . అయ్యో ....... బుజ్జాయిలు : మళ్లీ ముద్దులుపెట్టి , నీరు అంటూ గుర్తుచేశారు . అవునవును అంటూ బుజ్జాయిలకు ముద్దులుపెట్టాను , సైనికులారా ....... వెంటనే వెళ్లి జంతువులకు మరియు రాజ్యంలోని ప్రజలందరికీ దాహం తీరేలా నీటిని వదలండి . సైనికులు : ప్రభూ ...... అలాచేస్తే చిన్న కొలనులోని నీళ్లన్నీ అయిపోతాయి . రాజ్యంలోని ప్రజల మరియు జంతువుల దాహం తీర్చలేని రాజులు ఉంటే ఏమి లేకపోతే ఏమి , మహారాణీ ....... మాహారాణి ...... ఆహ్హ్హ్ అంటూ ప్రక్కనున్న రాణి భుజంపై తలవాల్చి పరవసించిపోతున్నారు మహారాణి . నా ఉద్దేశ్యం అధికాదు మహారాణీ గారూ ....... , ఇక్కడ ఉన్నది ....... మహారాణి : కేవలం మీ దేవకన్య మాత్రమే తెలుసు , ప్చ్ ప్చ్ ...... అంటూ మంజరిని భుజం మీదనుండి తోసేశారు , అయినాకూడా మంజరి మహారాణి చుట్టూనే ఎగురుతూ ఆనందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది . నవ్వుకున్నాను , మహారాణీ గారూ - రాణులూ - చెల్లీ - బుజ్జి యువరాజా - బుజ్జి యువరాణీ ...... మీ అనుమతి లేకుండా నీటిని వదలమన్నాను . మహారాణి : ఇన్నాళ్లకు దేవుడే స్వయంగా మహారాజులా వచ్చారు , ప్రజలు - జంతువుల దాహార్తి తీర్చే దేవుడు మా దాహార్తిని తీర్చలేడంటారా ? , మహారాజు మాటే శాసనం - మహారాజు మహారాజు అంటూ నినాదాలు చేయడంతో మళ్లీ అందరూ హోరెత్తించారు . ధన్యవాదాలు మహారాణీగారూ ........ మాహారాణి : గారు అవసరంలేదు అంటూ సిగ్గుపడితున్నారు . మహారాణిగారు అంతే , సైనికులారా ఇంకా ఇక్కడే ఉన్నారే , చూసారా ...... మీ మహారాజుని నేను కాదు . చిత్తం మహారాజా ...... మా ఆలస్యాన్ని మన్నించండి మన్నించండి అంటూ పైకి పరుగులుతీశారు . జంతువులు - ప్రజలతోపాటు అందరమూ పైకి చూస్తుండగానే కొండ పైభాగం నుండి వేదికల వారీగా చిన్న చిన్న జలపాతాలుగా అందమైన దృష్యంగా కింద ఉద్యానవనంలోని ఈతకొలనులలోకి అవి నిండటం ద్వారా పాయలుగా ప్రజల గృహాలవైపుకు ప్రవహిస్తోంది గంగమ్మ తల్లి ....... నీటిని చూడగానే జంతువులన్నీ సంతోషంతో గెంతులువేస్తూ ఈతకొలనులలోకి చేరి దాహాన్ని తీర్చుకుని జలకాలాడుతున్నాయి . ఏనుగులైతే తమ తొండాలతో మాపైకి నీటిని చిమ్మరించడంతో తడిసిపోయాము . ఆ అందమైన దృశ్యాలను చూసి బుజ్జాయిల ఆనందాలకు అవధులులేకుండాపోయాయి - భలే భలే ....... బుజ్జాయిలూ ...... మీ బుజ్జిసింహాలకు కూడా దాహం తీర్చండి అంటూ ముద్దులుపెట్టి కిందకుదించాను , అడవిరాజా - అడవిరాణీ ..... మీరూ వెళ్లి దాహం తీర్చుకోండి . అడవిరాజును రక్షించి మాదగ్గరికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు అన్నట్లు ఆనందబాస్పాలతో నన్ను వదిలివెళ్లడం లేదు అడవిరాణి . బుజ్జాయిల రాజ్యాన్ని కాపాడి రుణం తీర్చుకున్నారు అడవిరాణీ ...... ఊహూ అంటూ నన్ను స్పృశిస్తూనే ఉంది . భలేభలే అంటూ ఆనందిస్తున్నారు బుజ్జాయిలు - మీరుకూడా వెళతారా వెళ్ళండి అంటూ బుజ్జిసింహాలను కిందకు దించారు - వడివడిగా నాచెంతకు చేరడంతో ఎత్తుకుని ఆనందించాను . బుజ్జిసింహాలూ ...... నేనెక్కడికీ వెళ్లను అమ్మానాన్నలతో వెళ్లి దాహం తీర్చుకోండి అంటూ బుజ్జాయిల చేతికి అందించి వెల్లమన్నాను . బుజ్జాయిలు : దాహం తీర్చినవంటనే మళ్లీ మీపైకి ఎక్కుతాము . అఅహ్హ్ ...... అంతకంటే భాగ్యమా అంటూ మురిసిపోతున్నాను . మహారాణిగారు ...... క్షణకాలం కూడా వదలకుండా నావైపే చూస్తున్నట్లు అనిపించి కాస్త ఇబ్బందిపడుతున్నాను .
02-02-2023, 10:55 AM
బుజ్జాయిలు : బజ్జిసింహాల దాహం తీర్చి , ఆకలివేస్తోందా ...... అమ్మ చెంతకు చేరి పాలు త్రాగుతారా అంటూ అడవిరాణి దగ్గరికి వదిలి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరారు , మహారాజా ...... నీళ్లు లేవు కాబట్టి ఆహారం కూడా లేదేమో , వంటశాల ప్రక్కనే ఉన్న పెద్ద భవనంలో కూరగాయలతోపాటు మాంసం కూడా చాలా నిల్వ ఉంచారు , మహారాజుగా ఆజ్ఞవేస్తే వెంటనే తీసుకొస్తారు .
మహారాజు మహారాజు ....... మిమ్మల్నీ , మహారాజే ఆజ్ఞ వెయ్యాల్సిన అవసరం లేదు మా ముద్దిచ్చే బుజ్జి యువరాజు యువరాణి కూడా ఆజ్ఞ వెయ్యవచ్చు ఎందుకంటే జంతువుల ఆకలి తీరబోతున్నది మీవల్లనే కదా ...... , మీ మనస్సు గొప్పది మీ అమ్మగారిలానే అనుకుంటాను , మహారాణీగారు ...... దాహం తీరుస్తున్నారు - మీరు ..... ఆకలి తీర్చబోతున్నారు అంటూ ఇష్టంగా ముద్దులుపెట్టాను . బుజ్జాయిలు : ఊహూ మహారాజుగారే ఆజ్ఞ వెయ్యాలి . నాకోసం నాకోసం దయచేసి నాకోసం అంటూ బ్రతిమాలుకున్నాను . బుజ్జాయిలు : మహారాజు ఆజ్ఞ మేముకూడా పాటించాలి కాబట్టి సరే అంటూ సైనికులకు ఆజ్ఞవేశారు మొత్తం ఆహారాన్ని తీసుకురమ్మని ........ మా బుజ్జాయిల మనస్సు బంగారం అంటూ ముద్దులుకురిపిస్తాను . మహారాణిగారు సంతోషం పట్టనట్లు చప్పట్లు కొడుతూనే ఉన్నారు . కాస్త ఇబ్బందిపడుతూనే , ప్రజలందరికీ కూడా ధాన్యాన్ని పంచండి . మహారాజా మహారాజా మహారాజా ......... ఆగండి ఆగండి ....... , ఎవరి గొప్పతనం ఎవరికి ఇస్తున్నారు , బుజ్జియువరాజు - బుజ్జియువరాణి ........ ప్రజలు : బుజ్జి యువరాజు - బుజ్జి యువరాణి ....... అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా హోరెత్తించారు సంతోషంతో ........ జంతువులు మాంసం - కూరగాయలను చూసి సంతోషాలతో గర్జించాయి - గాండ్రించాయి , మాపైకి నీళ్లు వెదజల్లి సంతృప్తిగా తిని ఆశీర్వదించి వెళ్లిపోయాయి , చివరగా అడవిరాజు కుటుంబం మాత్రమే మిగిలింది . ప్రజలు : మహారాజా ...... ఈ ధాన్యంతో చాలారోజుల తరువాత పిల్లలు కడుపునిండా తినబోతున్నారు - ధన్యవాదాలు మహారాజా అంటూ దండాలు పెడుతున్నారు . ఈ ఒక్కపూటే కాదు రోజూ మూడుపూటలా ఇంటిల్లిపాది సంతృప్తిగా తినేలా చెయ్యాలి ఎలా యువరాజా మహారాజా ....... ? . యువరాజు : వీలవుతుంది మహారాజా ...... , మీవీరత్వం వలన చుట్టుప్రక్కల వేరువేరుగా ఉన్న పదులసంఖ్యలో పెద్ద చిన్న రాజ్యాలు ఒక్కటైపోయాయి ఒకరికొకరం సహకరించుకుంటే సంతోషంగా జీవించవచ్చు , ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను నాకు వదలండి . చాలా చాలా సంతోషం మహారాజా ...... , అలాగే మన రాజ్యం కరువు పోయేలా దుర్గమ్మ తల్లికి పూజలు జరిపించాలి . యువరాజు : మీరు ఎలా అంటే అలా మహారాజా ...... , నాకుకూడా సెలవు ఇప్పిస్తే మా తండ్రిగారి దహన సంస్కారాలు పూర్తిచేయాలి . మరొకసారి మా సంతాపం మహారాజా ...... యువరాజు : కృతజ్ఞుణ్ణి మహారాజా ...... , పూర్తయ్యాక కలుస్తాను అంటూ చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి తన భద్రతా సైన్యంతోపాటు వెళ్ళిపోయాడు . ప్రజల గురించి ఆలోచించే మహారాజు దొరకడం మన అదృష్టం అంటూ సంతోషంతో నినాదాలు చేసి సెలవు తీసుకున్నారు ప్రజలు ....... అడవిరాజా ...... పూర్తిగా చీకటిపడింది మీరు వెళ్లలేదే ? , ఓహో ...... మీ పిల్లలు కదూ ...... ఊహూ ..... అంటూ తలలను అడ్డంగా ఊపి నాప్రక్కనే చేరి ఆశతో చూస్తున్నాయి . మంజరి : అడవిరాజుపైకి చేరి , " నేను , నా కుటుంబాన్ని చేరినట్లుగానే మీరుకూడా మీ ప్రియసఖి చెంతకు చేరేంతవరకూ మీరు ఔనన్నా కాదన్నా మీవెంటే " అంటున్నాడు ప్రభూ అడవిరాజు అనిచెప్పివెళ్లి మహారాణీ చుట్టూ ఎగురుతోంది . అడవిరాజా ....... నిర్ణయానికి వచ్చేసారన్నమాట నామాటకూడా వినరు అయితే , కృతజ్ఞుణ్ణి ....... మేమే కృతజ్ఞులం అన్నట్లు నా పాదాలను స్పృశిస్తున్నారు . భలేభలే అంటూ ఆనందిస్తున్నారు బుజ్జాయిలు ....... కృష్ణా ...... రేయ్ మిత్రమా ఎక్కడ ఎక్కడ , నువ్వుకూడా మహారాణీ చెంతకే చేరిపోయావా ...... సరిపోయింది - ఏమైంది మీకు ? , మీకు ఆకలివెయ్యడం లేదా నాకైతే తెగ ఆకలిగా ఉంది . ఆకలిగా ఉందా వెంటనే వంటలు సిద్ధం చేస్తాము అంటూ మహారాణిగారు ఆతృతతో రాణులు - చెల్లితోపాటు రాజమందిరం లోపలికివెళ్లారు . బుజ్జాయిలూ ....... మీ రాజ్యంలో ..... బుజ్జాయిలు : మన రాజ్యం ...... అమ్మో సరే సరే మనరాజ్యంలో మాహారాణి - రాణులు వంటలు చేస్తారా ? . బుజ్జాయిలు : లేదు లేదు వంట మనుషులు చాలామంది ఉన్నారు కదా ..... మాకూ అదే ఆశ్చర్యంగా ఉంది , మీరు ఆకలి అనగానే అమ్మ చలించిపోయి పరుగులుతీశారు వెనుకే మంజరి కూడా ...... మంజరి కూడా వెళ్లిపోయిందా సరిపోయింది - నువ్వు వెళ్లలేదే మిత్రమా ....... బుజ్జాయిలు : వెళ్లడానికే ప్రయత్నించి ఆగడం చూసాము మహారాజా ...... ఏమో అయ్యింది మీకు , నాకంటే మహారాణీగారే ఎక్కువ అయిపోయింది మీకు . బుజ్జాయిలు : గారు వద్దండి అమ్మ ....... తప్పు తప్పు ....... , ఆహా ...... చంద్రుడి వెన్నెల మరియు కాగడాల వెలుగులలో ఎంత అద్భుతంగా ఉంది అంటూ కొండకు ఆనుకుని నిర్మించిన మహాద్భుతమైన రాజభవనాలను చూస్తున్నాను . బుజ్జాయిలు : కొండ పైభాగం మరింత అద్భుతంగా ఉంటుంది రండి చూయిస్తాము అంటూ బుజ్జిచేతులతో చూయించారు అటు అంటూ ....... , అడవిరాజా - కృష్ణ మిత్రమా రండి ........ ఉమ్మా ఉమ్మా ....... బుజ్జాయిలు : మహారాజా ...... మీకు రాజభవనాలంటే ఇష్టమా ? , భవనాలలోపల మరింత విలాసవంతంగా ఉంటుంది . నాకు - నా ప్రాణ సఖికి ...... ప్రకృతి అంటే ఇష్టం , కొండ అందాలను చెరపకుండా - పచ్చని చెట్లను నరికి వెయ్యకుండా నిర్మించిన రాజభవనాల నిర్మాణపు సౌందర్యం ఇష్టం , ఇక విలాసాలకు చాలాదూరం - ఉద్యానవనాల సౌందర్యం చూయించండి చాలు ....... , మేము విశ్రమించబోయేది కూడా అక్కడే ....... బుజ్జాయిలు : మహారాజు గారు ఉద్యానవనంలోనా ? . అవునుమరి మేము పుట్టి పెరిగినది ప్రకృతి ఒడిలో ........ బుజ్జాయిలు : సరిగ్గా అమ్మలానే మాట్లాడుతున్నారు - అమ్మకూడా ........ ఇప్పుడు మహారాణిగారి గురించి ఇప్పుడెందుకు ? . బుజ్జాయిలు : మీ ప్రాణసఖి చాలా చాలా అదృష్టవంతురాలు , పరాయి స్త్రీ గురించి ఆలోచనే లేదు . ఇక్కడ ఉన్నది కేవలం ....... బుజ్జాయిలు : తెలుసులే మహారాజా ...... , ప్రతీసారీ గుర్తుచేయ్యాల్సిన అవసరం లేదు అంటూ బుజ్జి అసూయ చెందుతున్నారు . అసలు మరిచిపోతేనే కదా నా హృదయసుందరి దేవకన్యను అంటూ కళ్ళు మూసుకుని అనుభూతి చెందుతున్నాను. బుజ్జాయిలు : దేవకన్యనా ...... ? , ప్చ్ ...... ఆ దేవకన్య మా అమ్మ కానీ పిన్నమ్మలు కానీ అయిఉంటే ఎంత బాగు ........ ష్ ష్ ష్ ...... తప్పు తప్పు బుజ్జాయిలూ ....... మహారాణీ గారు - రాణీ వాళ్ళు వింటే బాధపడతారు . బుజ్జాయిలు : మాకైతే అలా అనిపించనే లేదు , అమ్మ - పిన్నమ్మలు ...... ఇక్కడ ఉన్నంతసేపూ మిమ్మల్నే ప్రేమతో చూస్తూనే ఉన్నారు తెలుసా ? , మీకెలా అనిపించింది మిత్రమా కృష్ణా - అడవిరాజా ....... అవునన్నట్లు తలలుఉపారు . బుజ్జాయిలు : మీరు ఊ అనాలేకానీ మమ్మల్ని లాగేసి మీ గుండెలపైకి చేరిపోరూ ....... నాకూ అదే భయంగా ఉంది బుజ్జాయిలూ ...... , మహారాణులు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు , తెల్లవారగానే ఇక్కడనుండి జారుకోవడం ఉత్తమం . బుజ్జాయిలు : వీరాధివీరా అంటూ కళ్ళల్లో చెమ్మతో నా వస్త్రాన్ని చిరిగిపోయేలా పట్టేసుకున్నారు . మిమ్మల్ని వదిలివెళ్లడం కూడా కష్టమే అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి ఆప్యాయంగా హత్తుకున్నాను . బుజ్జాయిలు : అయితే మమ్మల్ని కూడా మీవెంటే తీసుకెళ్లండి . తల్లీబిడ్డలను వేరుచెయ్యడం పాపం తెలుసా ...... బుజ్జాయిలు : అమ్మా దుర్గమ్మా ...... వీరాధివీరుడి దేవకన్య అమ్మను ఎందుకు చెయ్యలేదు అంటూ బాధపడుతున్నారు . ష్ ష్ ష్ ...... బుజ్జాయిలూ మీరుకూడా దుర్గమ్మ తల్లినే పూజిస్తారా ? . బుజ్జాయిలు : ఆ దుర్మార్గపు రాజు నుండి అమ్మను - పిన్నమ్మలను కాపాడుతూ వస్తున్నది దుర్గమ్మ తల్లే , మేముకూడా రోజూ పూజిస్తాము అంటూ ముద్దుముద్దుగా చెప్పారు , అంటే మీరుకూడా ....... అవును అమ్మవారి భక్తుడినే అంటూ ముద్దులుపెట్టాను . బుజ్జాయిలు : ఆనందించారు , మహారాజా ....... రాజ భవనాలలోకి వచ్చేసాము - ప్రకృతి తప్ప ఏ అద్భుతాలనూ వీక్షించారన్నమాట అయితే ఉద్యానవనాల దగ్గరకే తీసుకెళతాము రండి పైకివెళ్లండి అటువైపు అటువైపు ...... , సింహాసనం ఇటువైపు ....... మనకు సింహాసనంతో పనిలేదు పైకివెళదాము . బుజ్జాయిలు : నవ్వుకున్నారు , ఆయుధ నిల్వాగారం - వజ్రాలు బంగారం రాసులుగా పోసిన బాండాగారం ...... అంటూ చూయిస్తూ సగం పైకి వచ్చేసాము మహారాజా అన్నారు , దారిపొడుగునా కాపుకాస్తున్న సైనికులు - చెలికత్తెలు ..... సింహాలను చూసి భయపడటం చూసి నవ్వుకుంటున్నారు . అవన్నీ అవసరంలేదు అందమైన ఉద్యానవనాల దగ్గరకు ....... బుజ్జాయిలు : అక్కడికే తీసుకెళతాము అంటూ బుజ్జికోపాలతో ముద్దులుపెట్టారు - ముందైతే వంటశాలలో మా మహారాజుగారికోసం ఏమేమి వంటలు చేస్తున్నారో చూసి ఆకలివేస్తోంది అన్నారుకదా రెండుచేతులతో తీసుకొస్తాము అదిగో అతిపెద్దదైన వంటశాల - అమ్మావాళ్ళు లోపలే ఉన్నట్లున్నారు తీసుకెళ్లండి . మీరువెళ్లి మీ అమ్మలను పలకరించి రండి నేను ఇక్కడే వేచిచూస్తాను అంటూ అడవిరాజుపై బుజ్జిసింహాన్ని ఎత్తుకున్న బుజ్జియువరాజును - అడవిరాణిపై బుజ్జిసింహాన్ని ఎత్తుకున్న బుజ్జియువరాణిని కూర్చోబెట్టాను . బుజ్జాయిలు : అమ్మలేమీ మిమ్మల్ని కొరుక్కుని తినెయ్యరు . ముసిముసినవ్వులతో తలదించుకున్నాను రాను అన్నట్లు ...... బుజ్జాయిలు : అయితే కొద్దిగా ముందుకువెలితే ఉద్యానవనం ఉంది అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండండి వెంటనే వచ్చేస్తాము . ఎటువైపు బుజ్జాయిలూ ....... బుజ్జాయిలు : ప్రకృతి అంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం - చెలికత్తెలూ ..... మన మహారాజుగారిని ఉద్యానవనానికి తీసుకెళ్లండి అంటూ ఆజ్ఞవేశారు . చిత్తం బుజ్జియువరాణీ ...... , మహారాజా ..... ఇటువైపు అంటూ తీసుకెళ్లారు . బుజ్జాయిలను వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వెళ్లడం చూసి సంతోషంతో ముద్దులువదిలి అమ్మా - అత్తయ్యా - పిన్నమ్మలూ ...... అంటూకేకలువేస్తూ వంటశాల లోపలికివెళ్లారు .
02-02-2023, 10:56 AM
( సింహాలను చూసి భయంతో అక్కయ్యా అక్కయ్యా - చెల్లెళ్ళూ - వదినలూ - మహారాణీ ( చెలికత్తెలు - వంట వాళ్ళు ) ...... అంటూ మహారాణిగారు తప్ప అందరూ ఒకరినొకరు హత్తుకున్నారు .
బుజ్జితల్లీ - నాన్నా ...... అంటూ ధైర్యంగా సింహాల దగ్గరకువెళ్లి వెనక్కు చూస్తున్నారు - గుమ్మం దగ్గరికి వెళ్లి బయటకు తొంగి తొంగి చూస్తున్నారు మాహారాణి గారు ఆశతో . బుజ్జాయిలు : అమ్మా అమ్మా ...... ఎవరికోసం చూస్తున్నావో మాకు తెలుసులే మహారాజుగారు రాలేదు - ఎంత బ్రతిమాలుకున్నా ఊహూ , మీపేరు చెబితేనే చాలు అంతదూరం పారిపోతున్నారు , ప్రాణసఖి - దేవకన్య - హృదయసుందరి ..... ఇంకా ఏవేవో ప్రియమైన పేర్లతో ఊహల్లోనే ఉంటున్నారు అంటూ ఇప్పటివరకూ జరిగిన సంభాషనను వివరించారు . మాహారాణి గారి ఆనందాలకు అవధులులేకుండాపోయాయి - బుజ్జాయిలకు ముద్దులవర్షం కురిపించారు . బుజ్జాయిలు : నువ్వంటేనే ఇష్టం లేదని తెలిపినా ఎందుకమ్మా అంత సంతోషం , పిన్నమ్మలూ - అత్తయ్యా ...... ఎందుకంత భయం అంటూ సింహాలతో మరింత దగ్గరికివెళ్లి భయాన్ని ఆనందిస్తున్నారు , అమ్మా ...... నువ్వెంటి అస్సలు భయపడటం లేదు . మంజరి : ఎందుకంటే బుజ్జాయిలూ ....... , మీ మహారాజు హృదయసుందరి - ప్రాణసఖి - దేవకన్య - మహి ...... ఎవరోకాదు మీ అమ్మనే కాబట్టి . కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం ...... , అవునా అక్కయ్యా అక్కయ్యా - వదినా అంటూ అంతులేని ఆనందంతో మహారాణీగారి కాదు కాదు నా దేవకన్య మహిని చుట్టేశారు - అంటే మీ అసలుపేరు అందమైన పేరు మహి అన్నమాట , వీరాధివీరుడి వీరపత్ని ........ , అందుకేనా ...... మహారాజు గారిని కోరుక్కుతినేసేలా చూస్తూనే ఉన్నారు - గుండెలపై చేరడానికి అంతలా ప్రయత్నించారు . దేవకన్య : అవును అంటూ సిగ్గుపడింది , ముసుగులో ఉన్నా నా మంజరి మరియు మిత్రుడు కృష్ణ కనిపెట్టేసారు అంటూ మంజరిని ప్రేమతో అక్కున చేర్చుకుంది . బుజ్జాయిలకు పట్టరాని ఆనందంతో వెక్కిళ్ళు వచ్చేసాయి , బుజ్జితల్లీ - నాన్నా ..... అంటూ నీళ్లు త్రాగించారు అందరూ ...... బుజ్జాయిలు : అమ్మా అమ్మా అంటూ కిందకుదిగి బుజ్జిసింహాలను కిందకువదిలి వెళ్లి సంతోషంతో హత్తుకున్నారు , అంటే మమ్మల్ని నిద్రపుచ్చడానికి చెప్పిన " మహి - మహేశ్వరుడి కథలు " ....... అవునన్నట్లు సిగ్గుపడింది మహి ........ అడవిరాజు - అడవిరాణి ఆనందాలకు అవధులులేనట్లు గుర్రంలా ఎగురుతున్నాయి , అమ్మానాన్నలను చూసి బుజ్జిసింహాలు కూడా నాట్యం చేస్తున్నాయి . బుజ్జాయిలు : చూసి ఆనందించి , నాన్న నాన్న ....... ఇప్పుడా చెప్పేది అంటూ తొడలపై గిల్లేసారు . దేవకన్య : స్స్స్ స్స్స్ ....... బుజ్జాయిలు : మాకొస్తున్న కోపానికి కొరకలేదు సంతోషించండి అంటూ బయటకు పరుగులుతీశారు . దేవకన్య : బుజ్జితల్లీ - నాన్నా ....... ఆగండి ఆగండి . బుజ్జాయిలు : మమ్మల్ని ఆపకండి మరొక్క క్షణం కూడా ఉండలేము . దేవకన్య : అధికాదు బుజ్జితల్లీ ...... , ఈ విషయం ఇప్పుడే చెప్పకండి . బుజ్జాయిలు : మావల్ల అయితే కాదు , నాన్నగారి ప్రేమ అంతులేనిది , మేమంటే ఎంతో ఇష్టం , ఈ విషయం తెలిస్తే ..... అంటూ మురిసిపోతున్నారు . దేవకన్య : మీకు కథలుగా చెప్పినవన్నీ మీ నాన్నగారికి తెలియదు కదా ....... బుజ్జాయిలు : అవును నదీఅమ్మ సహాయంతో ప్రేమను పంచారు కదూ ...... అయ్యో ఇప్పుడెలా అమ్మా ....... బుజ్జాయిలు : మీ నాన్నగారితో గడిపినది మూడే మూడు రోజులు అయినా జీవితాంతం సరిపోతుంది , మీ నాన్నకు తెలియనివ్వకుండా ప్రేమను పంచాలన్న కోరిక కలిగింది . చిలిపికోరిక - చిలిపి పనులు - చిలిపి ప్రేమ అన్నమాట అంటూ రాణులు - చెల్లి ..... దేవకన్య చుట్టూ చేరి గిలిగింతలుపెట్టారు . దేవకన్య : చిరునవ్వులు చిందిస్తోంది . బుజ్జాయిలు : అమ్మా అమ్మా ...... మిమ్మల్ని ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడనేలేదు కనీసం నవ్వడం కూడా చూడలేదు , " మహి - మహేశ్వరుడి కథలు " చెప్పేటప్పుడు తప్ప , మిమ్మల్ని ఇలానే చూడాలి - ఇప్పుడు మేమేమి చెయ్యాలో చెప్పండి . దేవకన్య : ఆ మాత్రం తెలియదా ....... , మీరు పిల్లలుకాదు పిడుగులు అని మీ నాన్నగారు పొగిడారు కదా ....... బుజ్జాయిలు : అర్థమైంది అర్థమైంది అమ్మా ...... , ముఖాన్ని పారదర్శకంగా ఉండే వస్త్రంతో దాచుకోండి అంటూ మహితోపాటు రాణులు - యువరాణి బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిసింహాలను ఎత్తుకుని పరుగులుతీశారు , ఒక్కసారిగా ఆగి మళ్లీ వెనక్కువచ్చి నాన్నగారికి - మిత్రుడు కృష్ణకు ఆకలివేస్తోంది అంటూ ఒక బుజ్జి చేతిలో బుజ్జిసింహం మరొక బుజ్జిచేతిలో ఆహారపాత్రను పట్టుకుని పరుగులుతీశారు . మంజరి : నిజంగా పిడుగులే అంటూ దేవకన్య భుజంపైకి చేరింది . అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా - వదినా ...... మీ నిజమైన పేరు మహేశ్వరి అన్నమాట , " మహి - మహేశ్వరుడి కథలు " మాకూ చెప్పండి - చెప్పాల్సిందే అంటూ హత్తుకున్నారు . యువరాణి : నా ప్రేమకంటే అందమైనది - మా వదిన ఇక్కడకువచ్చి నాలుగేళ్లు అవుతోంది , ఇప్పటికీ అన్నయ్య హృదయదేవతగా మా అందమైన వదిననే ...... దేవకన్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో సిగ్గుపడుతోంది . రాణులు : మీ దేవుడి దగ్గర సిగ్గుపడవచ్చుకానీ ముందైతే మాకు ఆ మహా అద్భుతమైన కథలు కాదు కాదు ప్రేమదృశ్యకావ్యం గురించి చెప్పండి చెప్పండి . దేవకన్య : సరే సరే అంటూ పులకించిపోతూ మొదలుపెట్టింది . రెండు సింహాలూ బుద్ధిగా వెళ్లి దేవకన్య వాళ్ళ ముందు కూర్చున్నాయి . మంజరి ...... అడవిరాజుమీదకు చేరి , మహీ ..... వినాలని ఆశపడుతున్నారు చెప్పు చెప్పు ...... అందరూ ఆనందించారు ) . వచ్చేసాం మేము వచ్చేసాం అంటూ చాలావేగంగా వచ్చి బుజ్జి పాత్రలను బండపై ఉంచేసే , చేతులలో బుజ్జిసింహాలతో ఏకంగా నామీదకు ఎగిరారు . జాగ్రత్త జాగ్రత్త అంటూ ఇద్దరినీ గుండెలపై ఆప్యాయంగా హత్తుకుని హమ్మయ్యా అన్నాను . కొన్ని క్షణాలపాటు నన్నే చూస్తూ ముద్దులు ఆగడం లేదు . ముద్దుముద్దుకూ ఆనందం రెట్టింపవుతూనే ఉంది - ఏంటి ఏమయ్యింది బుజ్జాయిలూ ...... ఈ అంతులేని సంతోషపు ముద్దులు మరియు ఆనందబాస్పాలతో కొత్తగా చూస్తున్నారు . మారు మాట్లాడకుండా ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లు ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు , కానివ్వండి కానివ్వండి మీరెన్ని ముద్దులుపెడితే అంత ఇష్టం అంటూ చిరునవ్వులు చిందిస్తూ ముద్దులను ఆస్వాధిస్తున్నాను . అంతలో ఒక్కసారిగా ముద్దులుఆపి నాకళ్ళల్లోకే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ " నాన్న - నాన్న " అంటూ పిలిచారు . హృదయం పులకించిపోసాగింది - అంతే ప్రాణంలా వాళ్ళ కళ్ళల్లోకి కన్నార్పకుండా చూస్తుండిపోయాను , " నాన్న " పిలుపులోని మధురానుభూతిలో నన్ను నేను మరిచిపోయాను . " నాన్న - నాన్న " అంటూ ముద్దులతో మళ్లీ పలికి నా భుజంపైకి చేరారు . వొళ్ళంతా తియ్యదనంతో జలదరించిపోతోంది . ఆ దృశ్యాలను చూసి ప్రక్కనే ఉన్న మిత్రుడు నాట్యం చేస్తున్నాడు . బుజ్జాయిలు : నాన్న నాన్న నాన్న నాన్న ....... ఆ అందమైన పిలుపుల మైకం నుండి తేరుకున్నట్లు లేదు లేదు లేదు అలా పిలవకూడదు బుజ్జాయిలూ , మహారాణీగారు వింటే బాధపడతారు ష్ ష్ ష్ అంటూ ఆపడానికి ప్రయత్నించినా ఆపడంలేదు . బుజ్జాయిలు : నాన్న నాన్న నాన్న నాన్న ....... , ఈ పిలుపుకోసం మాటలు వచ్చినప్పటి నుండీ ఎదురుచూస్తున్నాము నాన్నా - నాన్నా ....... ష్ ష్ ష్ ...... అలా అని నన్ను పిలవకూడదు - మీ అమ్మ కోప్పడతారు . బుజ్జాయిలు : కోప్పడితే అమ్మను అమ్మ అని పిలవడం మానేస్తాము - మిమ్మల్ని నాన్న అని పిలుస్తాము , మాకు మా అమ్మ కాదు కాదు ఆ మహారాణీ కంటే మా నాన్ననే ప్రాణం - మిమ్మల్ని నాన్న అని పిలవడమే ఇష్టం అంటూ గట్టిగా చుట్టేశారు , ఇక మీతోనే ఉండిపోతాము , నాన్నా - నాన్నా ...... మమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళకండి . మంజరి చూసి అంతులేని ఆనందంతో ఎగురుకుంటూ వచ్చి , బుజ్జాయిల సంతోషం కోసమైనా అవును ఆనండి ప్రభూ ....... నాకు తెలియకుండానే నానోటి నుండి " ఊ " పలకడమే కాకుండా వెనుక మెత్తటి గడ్డిమీదకు చేరిపోయాను . బుజ్జాయిలు : నాన్న నాన్న నాన్న నాన్న అంటూ అంతులేని ఆనందాలతో ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు , నాన్నా - నాన్నా ...... ఆకలివేస్తోంది అన్నారుకదూ అంటూ నన్ను లేపి కూర్చోబెట్టి ఒకపాత్రను మిత్రుడి ముందు ఉంచి నాదగ్గరకు చేరుకుని ఒడిలో కూర్చున్నారు బుజ్జిసింహాలతో ....... , నాన్న నాన్న ...... మీకోసం అమ్మ - అత్తయ్య - పిన్నమ్మలు కలిసి ప్రేమతో చేశారు తినండి . మంజరి : బుజ్జాయిలూ ...... మీ బుజ్జిబుజ్జిచేతులతో తినిపిస్తే మరింత సంతోషం మీ నాన్నకు . బుజ్జాయిలు : అవునా నాన్న - నాన్న ...... " నాన్న " మధురమైన పిలుపు మైకంలో మళ్లీ ఊ అన్నాను . బుజ్జాయిలు : సంతోషంతో కేకలువేస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించి ప్రేమతో తినిపించారు . మ్మ్ మ్మ్ ...... చాలా రుచి . బుజ్జాయిలు : అమ్మ వంట మరి అంటూ ముద్దులతో ముద్దలు తినిపించి ఆనందిస్తున్నారు . బుజ్జాయిల ఆనందాలను చెరపడం ఇష్టంలేక మౌనంగా ఉండిపోయాను - ఆ ముద్దైన ఆనందాలను చూస్తూ ఉండిపొమ్మని మనసు హృదయం పరవళ్లు తొక్కుతున్నాయి .
02-02-2023, 10:57 AM
మంజరి : అదిగో మహారాణీ - రాణులు - యువరాణీ వంటలు కూడా సిద్ధం , మీకోసం ప్రేమతో ...... అదే అదే స్వయంగా తీసుకొస్తున్నారు ప్రభూ అంటూ ఎగురుకుంటూ వెళ్లి మహారాణీ గారి భుజంపైకి చేరింది .
అంతలోనే మహారాణీ చెంతకు చేరిపోయావా మంజరీ అన్నట్లు చిరుకోపంతో చూస్తున్నాను . మహారాణీ - రాణులంతా చిరునవ్వులు చిందిస్తూ తమ తమ చేతుల్లోని వంట పాత్రలను మాచుట్టూ ఉంచారు , ఆకలివేస్తోంది అన్నారుకదా ప్ర .....భూ .... మహారాజా ...... మీకోసం ప్రేమతో మేమే వండాము స్వీకరించండి అంటూ ముఖాలను చెంగులతో కప్పుకునే మాట్లాడారు . ప్రేమతోనా ....... ? . మాహారాణి : అంతులేని ప్రేమతో ...... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . మంజరి : ( మా ముద్దుల మహిలా కాకుండా భలేగా మాట్లాడుతున్నావు మహీ ) అంటూ మహారాణీ బుగ్గపై ముద్దుపెట్టింది . బుజ్జాయిలు : ముద్దులుకూడా అమ్మకే పెడుతోంది , అమ్మ - పిన్నమ్మలు - అత్తయ్య ....... వంట చెయ్యడం మెమెప్పుడూ చూడనేలేదు - చివరికి మాకోసం కూడా వండనేలేదు - ప్రాణంలా తినిపించేవాళ్ళు అంతే , ఘుమఘుమలాడిపోతున్నాయి ....... మీరంటే ఎంత ప్రేమో అర్థమౌతోందా నాన్నా - నాన్నా ....... ష్ ష్ బుజ్జాయిలూ ....... , మీ అమ్మగారు వింటే బాధపడతారు అంటూ సున్నితంగా బుజ్జి నోళ్ళకు చేతులను అడ్డుపెడుతున్నాను . మాహారాణి: నాన్న - నాన్న ........ బుజ్జాయిలు : మహి హృదయంపై చేతినివేసుకుని పరవసించిపోతుండటం చూసి అంతులేని ఆనందంతో మహారాణీవైపు గాలిలో ముద్దులు వదిలారు , మరింత సంతోషపెట్టడానికన్నట్లు నాన్నా నాన్నా నాన్నా నాన్నా ....... అంటూ ప్రాణంలా పిలుస్తూనే ఉన్నారు నేను ఎంత వారించడానికి ప్రయత్నిస్తున్నా ....... మహారాణి : అఅహ్హ్ ...... అంటూ రాణుల గుండెలపైకి చేరారు . బుజ్జాయిలు : మహి సంతోషాన్ని ఆస్వాదిస్తూనే నాన్నా - నాన్నా అంటూ నా బుగ్గలపై ముద్దుల వర్షమే కురిపిస్తున్నారు . అఅహ్హ్ ...... మీ ముద్దులతో నన్ను మంత్ర ముగ్ధుడిని చేసేస్తున్నారు తెలుసా అంటూ అంటూ ఆప్యాయంగా గుండెలతో హత్తుకుని అంతే ప్రాణంలా ముద్దులుపెట్టాను . మాహారాణి గారి సంతోషమైన మూలుగుకు స్పృహలోకొచ్చి , బుజ్జాయిలూ బుజ్జాయిలూ ...... అలా పిలవకూడదు - మీ అమ్మగారు బాధపడతారు అంటూ తలదించుకుని వారిస్తున్నాను . ఏంటి బాధపడటమా ....... , మాకైతే అలా అనిపించడం లేదు అన్నయ్యా అంటూ నాప్రక్కన చేరి బుజ్జితల్లికి ముద్దులుకురిపించింది చెల్లి , ఏంటి వదినమ్మా ..... బాధపడుతున్నారా లేక లేక ....... సిగ్గుపడుతున్నారా ? అంటూ బుజ్జాయిలతోపాటు ఆనందిస్తోంది . చెల్లీ చెల్లీ ....... నువ్వుకూడానా ? . యువరాణి : నన్నేమి చేయమంటారు అన్నయ్యా ...... , ఎదురుగా జరుగుతున్నదే చెబుతున్నాను . బుజ్జాయిలు : అవునవును నాన్నా నాన్నా ....... ష్ ష్ ష్ ....... బుజ్జాయిలు : అమ్మ బాధపడితే అమ్మను అమ్మ అని కాకుండా మహారాణీ అని పిలుస్తాము - మా నాన్నను .... నాన్న అని పిలవకుండా ఉండలేము . బుజ్జాయిలూ ...... అంటూ కళ్ళల్లో బాస్పాలు . యువరాణి : మీ నాన్న కళ్ళల్లో ఆనందబాస్పాలు చూస్తేనే తెలియడం లేదూ ...... , మీరంటే ఎంత ప్రాణమో ....... బుజ్జాయిలు : నాన్నంటే నాన్నే అంటూ గట్టిగా ముద్దులుపెట్టారు . మాహారాణి : ముద్దులు మాత్రమేనా బుజ్జాయిలూ లేక ఆకలివేస్తోంది అన్న మీ నాన్నకు తినిపించడం ఏమైనా ఉందా ? . అమ్మో అమ్మో అమ్మో ఇంత ప్రేమ - ఇంత ప్రాణమా అంటూ గిలిగింతలు పెట్టి ఆటపట్టించారు రాణులు . లేదు లేదు లేదు ....... రాణులు : ఆ విషయం మీరు కాదు మా అక్కయ్య చెప్పాలి , ప్రాణం పోయినా చెప్పరు , మీరంటే ప్రాణం కంటే ఎక్కువేమో ....... లేదు లేదు నా ప్రాణం కంటే ఎక్కువ నా దేవకన్య మహి మాత్రమే అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పచ్చని గడ్డిపైకి వాలిపోయాను బుజ్జాయిలతోపాటు తియ్యనైన అనుభూతితో ....... , చూసారా ...... తలుచుకుంటేనే ఎంత ఆనందమో ...... , మహీ ..... ఎక్కడ ఉన్నావురా - తెల్లవారగానే నా ప్రయాణాన్ని మొదలుపెట్టి నిన్ను ఎలాగైనా చేరుకుంటాము , ఈ మంజరి ఉందే నువ్వే సర్వస్వమని చెప్పి ఇప్పుడేమో మరొక మాహారాణి చెంతకు చేరిపోయింది , తెల్లారాక మా వెంట వస్తుందో లేదో ....... మహారాణీ గారు నాకంటే ఎక్కువగా పులకించిపోతున్నట్లు మంజరిని సున్నితంగా చేతుల్లోకి తీసుకుని ముద్దులుపెడుతూ మురిసిపోతుండటం చూసి ఆశ్చర్యపోయాను . యువరాణి : మీ హృదయంలో మీ దేవకన్య ఉన్నా మీరంటే ఇంత ప్రాణం అన్నమాట వదినమ్మకు , ఉమ్మా వదినమ్మా ....... బుజ్జాయిలు : భలే భలే మహారాణీ మహారాణీ ...... మాహారాణి : ఉమ్మ్ ....... బుజ్జాయిలు : అలాగే అలాగే అమ్మా అమ్మా ....... , భలే భలే ....... చిరుకోపంతో లేచి కూర్చున్నాను . యువరాణి : మీ నాన్నగారికి కోపం వచ్చినట్లుంది - ఆకలిలో మరింత కోపం రాకముందే తినిపించండి బుజ్జాయిలూ ....... బుజ్జాయిలు : కోపంలో కూడా మా నాన్న ముద్దొచ్చేస్తున్నారు అంటూ ముద్దులుపెట్టి నవ్వుతున్నారు . ఆ ముద్దులకే కోపం మొత్తం ఎగిరిపోవడం తెలిసి నాకే ఆశ్చర్యం వేసింది . బుజ్జాయిలు : నాన్న నవ్వారు నాన్న నవ్వారు ....... మాహారాణి : మా బంగారుకొండలు అంటూ బుజ్జాయిలతోపాటు నావైపుకు కూడా ముద్దులు వదిలి సిగ్గుపడుతున్నారు . మహారాణీ గారూ ......... యువరాణి : అన్నయ్యా ...... మీ దేవకన్య అంత అందంగా ఉంటుందా ? . స్వయంగా దివి నుండి భువికి దిగివచ్చిన విశ్వ సుందరి సుగుణాల రాశి , అందంతోపాటు అనకువ - నేనంటే అంతులేని ప్రేమ అంటూ నాకు తెలియకుండానే అనుభూతిలో బుజ్జాయిల బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టాను . యువరాణి : ఒక్కసారి వదినమ్మను చూశారంటే ...... , వదినమ్మా ...... లేదు లేదు లేదు అంటూ బుజ్జాయిలతోపాటు అటువైపుకు తిరిగేసాను . యువరాణి : అంటే వదినమ్మ అందం చూస్తేనే దాసోహం అయిపోతారని అటువైపుకు తిరిగారన్నమాట . లేదు లేదు లేదు , నా దేవకన్యను మించిన సౌందర్యారాశి ఈ భువిపై లెనేలేదు అంటూ మహారాణీ వైపుకు తిరిగాను . యువరాణి : అందరితోపాటు నవ్వుకుని , అయితే ఒకసారి ...... ఆకలి అమ్మో ఆకలి ...... బుజ్జాయిలూ ఆకలి ...... మాహారాణి : నవ్వుకుని , బుజ్జాయిలూ ...... మీ నాన్నకు ప్రాణంలా తినిపించండి . బుజ్జాయిలు : అలాగే అమ్మా ...... , నాన్నా నాన్నా ...... మీ ముందు ఉన్నవాటిలో ముందు ఏమి తినిపించాలి ? . అన్నీ చూసి మధ్యలో ఉన్న వంట పాత్రవైపు చూయించాను . అమ్మో అమ్మో అంటూ అందరూ ఆశ్చర్యపోయి ఆనందిస్తున్నారు . మంజరి అయితే చుట్టూ సంతోషంతో ఎగురుతోంది . ఏమైంది ఏమైంది ? బుజ్జాయిలు : అంతులేని ఆనందంతో ముద్దులుపెట్టి , ఆ పాత్రను అందుకుని ప్రేమతో నోటికి అందించారు . బుజ్జాయిలూ ...... ముందు మీరు ? . బుజ్జాయిలు : మాకు మాకు ....... ఓహో ...... మీ అమ్మ గోరుముద్దలు తినాలని ఉందా వెళ్ళండి . బుజ్జాయిలు : ఊహూ ఊహూ ...... మా నాన్నను వదిలి ఆ మాహారాణి ...... లేదు లేదు అమ్మ దగ్గరికి వెళ్లాడమా ? అంటూ నవ్వుకుంటున్నారు . మరి ........ బుజ్జాయిలు : అమ్మ గోరుముద్దలను నాన్న చేతులతో తినాలని ఆశగా ఉంది . మీ అమ్మగారు బాధపడతారేమో ....... యువరాణి : బాధపడటమా ...... ? , ఇప్పటివరకూ జరిగినది చూశాక కూడా మా అన్నయ్య లాంటి వీరాధివీరులు అడిగాల్సిన ప్రశ్నలేనా అవి అంటూ నవ్వుకుంటున్నారు . నిజమేకదా అంటూ ఇద్దరినీ తొడలపై కూర్చోబెట్టుకుని ప్రాణంలా నోటికి అందించాను . మాహారాణి : బుజ్జాయిలూ ముద్దులతో ........ బుజ్జాయిలు : అవునవును నాన్నా నాన్నా ..... , ముద్దులతో మా అమ్మ గోరుముద్దలను మీ చేతులతో తినిపించండి . మాహారాణి : సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు . చెల్లీ ...... నాకేమీ అర్థం కావడం లేదు . యువరాణి : పోను పోను అర్థమవుతాయిలే అన్నయ్యా ...... , దేవదేవుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారుకదా ....... బుజ్జాయిలు : నాన్నా నాన్నా ఆకలి ఆకలి అంటూ ముద్దుముద్దుగా ....... చెల్లెమ్మా ...... ఇదిమాత్రం నిజం , బుజ్జాయిల పిలుపులు మాత్రం నేరుగా హృదయానికే చేరుతున్నట్లు ఏదో తెలియని మాధుర్యం అంటూ ఎవ్వరికీ వినిపించకుండా చెవిలో గుసగుసలాడాను . యువరాణి : వదినమ్మా ....... చెల్లెమ్మా చెల్లెమ్మా ....... యువరాణి : పో అన్నయ్యా ...... , ఈ మాటలను వినాల్సిన వాళ్ళు వింటే మరింత ఆనందం ....... ష్ ష్ ష్ చెల్లీ ....... , బుజ్జాయిలకు ముద్దులతో తినిపించాను . బుజ్జాయిలు : నా వేళ్ళతో సహా జుర్రుకుని మ్మ్ మ్మ్ ....... అంత రుచిగా ఉందా బుజ్జాయిలూ ...... , మిమ్మల్ని చూస్తుంటేనే నోరూరిపోతోంది అంటూ మళ్లీ ముద్దులుపెట్టాను . బుజ్జాయిలు : ఎంత బాగుందో తింటే మీరే చెబుతారు , నాన్నా - నాన్నా ...... అంటూ నోటికి అందించారు . మిత్రమా - అడవిరాజా ....... అంటూ వాళ్ళవైపు చూసాను . యువరాణి : వాళ్లంటే ఎంత ఇష్టమో తెలిసే ముందు వాటికి ఆహారం అందించింది వదినమ్మ , మీరు సంతోషంగా తినవచ్చు ...... కుమ్మేస్తున్నారన్నమాట తినండి తినండి , మంజరీ ........ రా తినిపిస్తాను . ఎగురుకుంటూ వచ్చి నా భుజంపైకి చేరి నాతోపాటు బుజ్జాయిలకు ముద్దులుపెట్టి అంతలోనే మళ్లీ మహారాణీ భుజంపైకి చేరి , మహారాణీ చేతినుండి గింజలను తింటోంది . మంజరీ ....... అందరితోపాటు బుజ్జాయిలు - మహారాణీగారు కూడా నవ్వేశారు , నాన్నా - నాన్నా ....... తినండి . మహారాణీ గారూ - చెల్లీ - రాణులూ ....... వెళ్లి మీరూ తినండి . మాహారాణి : తినడం కోసం వెళ్లడం దేనికి ఇక్కడే తింటాము . ఇక్కడే తింటారా కానివ్వండి , బుజ్జాయిలూ ..... ఆకలి . మహారాణీ చిరునవ్వులు ....... బుజ్జాయిలు : చిరునవ్వులు చిందిస్తూ నాన్నా నాన్నా అంటూ ముద్దులుపెట్టి బుజ్జి బుజ్జి చేతులతో ఒకేసారి తినిపించారు . ముద్దలతోపాటు బుజ్జాయిల బుజ్జివేళ్ళను చప్పరించాను . బుజ్జాయిలు : సంతోషంతో మళ్లీ ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు . మ్మ్ మ్మ్ ...... మీరు చెప్పినట్లుగానే అమృతంలా ఉంది - మొత్తం తినేయ్యాలని ఉంది . యువరాణి : ఆ వంట వండినది మా దేవత వదినమ్మ కాబట్టి అంత రుచి ....... అవునా ...... , అదేమీకాదు మన బుజ్జాయిలు తినిపించారు కాబట్టి అంత రుచి . యువరాణి : బాగుంది అన్నయ్యా ...... , ఏదో సామెత ఉంది కానీ గుర్తుకురావడంలేదు , సరిగ్గా వదినమ్మ వండిన వంటను ఎంచుకుంది మీరు - అమృతం అంటూ పొగిడింది మీరు - మొత్తం తినేయ్యాలని అన్నది మీరే కదా ...... నేనే ....... , అదంతా మన బుజ్జాయిల బుజ్జి గోరుముద్దలు మహిమ అంటూ తినిపించి తిని బుజ్జిచేతులపై ముద్దులుపెట్టాను . బుజ్జాయిలు : లేదులే నాన్నా నాన్నా ...... , అమ్మ చేతి గొప్పతనం అది అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుంటున్నారు . సరేసరే బుజ్జాయిలూ ష్ ష్ ....... , చెల్లీ ...... వదినమ్మ అంటూ ప్రాణంలా పిలుస్తున్నావు . యువరాణి : వదిన నిజంగా అమ్మనే దేవతనే , చిన్నప్పుడే అమ్మను కోల్పోయాను - అమ్మ ప్రేమ తెలియకుండా పెరిగాను , ఎప్పుడైతే వదిన వచ్చారో అమ్మలా చూసుకున్నారు అంటూ మహారాణీ చెంతకు చేరబోతే ....... మహారాణీ గారు ఆపారు . యువరాణి : అన్నయ్యతో ఈ సంతోషాన్ని పంచుకోవడమే మా వదినమ్మకు మరింత సంతోషం అన్నమాట అంటూ బుజ్జితల్లి బుగ్గను వదలడం లేదు . మహారాణీ సంతోషం మనసుకు తెలుస్తోంది . చాలా సంతోషం చెల్లీ ....... , ఎక్కువ చెబుతున్నాను అనుకోకండి మహారాణీ గారిని మించిన గొప్ప యువరాణి నా దేవకన్య అంటూ బుజ్జితల్లికి ముద్దుపెట్టి అనుభూతి చెందుతున్నాను . మహారాణి : తెగ పులకరించిపోతూనే చాలు చాలు భోజనం చెయ్యండి - బుజ్జాయిలూ ...... ముద్దులతో తినిపించండి , మీ అత్తయ్య - పిన్నమ్మలు నాకంటే రుచిగా వండారు . చెల్లీ ...... అసూయ చెందుతున్నారా ? లేక ఆనందిస్తున్నారా ? , నాకు నవ్వులు కూడా వినిపిస్తున్నాయి . యువరాణి : ప్రాణ నాథుడే అంతలా పొగిడితే వొళ్ళంతా సీతాకోకచిలుకలే ....... చెల్లీ ...... నేను పొగిడినది నాదేవకన్యను కదా ....... యువరాణి : మనసు గెలిచిన వీరాధివీరుడు ఎవ్వరిని పొగిడినా ...... తనే పరవసించిపోతుంది . అర్థం కానట్లు ఆలోచనలో పడ్డాను . యువరాణి : అన్నయ్యా ...... పోను పోను మీకే అర్థమవుతుందిలే తినండి . బుజ్జి గోరుముద్దలు అందుకుని , ఆడువారిమాటలకు అర్థాలే వేరు అంటూ తృప్తిగా తిని బుజ్జాయిలకు తినిపించాను . మాహారాణి : ప్చ్ ....... నాకూ తినిపించొచ్చుకదా ప్రభూ ...... అంతే ఒక్కసారిగా వెక్కిళ్ళు వచ్చేసాయి . మహారాణీ గారితోపాటు అందరూ నీళ్లు అందించి నవ్వుకుంటున్నారు . బుజ్జాయిలు ఎవరి గ్లాస్ అయితే అందుకోకూడదు అనుకున్నానో వారిదే అందుకుని నోటికి అందించారు - వెక్కిళ్ళు ఎక్కువ అవ్వడంతో తప్పక త్రాగి బుజ్జాయిల నుదుటిపై సున్నితంగా తాకించాను . బుజ్జాయిలు : స్స్స్ స్స్స్ ..... నొప్పివేసిందా బుజ్జాయిలూ ....... , నన్నూ ...... బుజ్జాయిలు : లేదు లేదు నాన్నా ...... హాయిగా ఉంది అన్నారు . మా మంచి బుజ్జాయిలు అంటూ ముద్దులుపెట్టాను . మాహారాణి : అలా మళ్లీ నన్నెప్పుడు కొడతారు - మళ్లీ ఇప్పుడు ముద్దులుపెడతారు ? . లేదు లేదు లేదు ....... , బుజ్జాయిలూ ...... కొండపైనున్న అందమైన ఉద్యానవనాన్ని చూయిస్తాను అన్నారుకదా తీసుకెళ్లండి అంటూ పైకిలేచాను . మహారాణీ నవ్వులు ఆగడంలేదు . బుజ్జాయిలు : ఆ ఉద్యానవనం అమ్మ - అత్తయ్య - పిన్నమ్మలది ..... నాన్నా , ఎంత అందంగా ....... ఈ మాటలను వినడం కంటే అక్కడకు వెళ్లడమే ఉత్తమం పదండి . |
« Next Oldest | Next Newest »
|