Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
Sarlevo 

Nenu kuda common points cheppaanu, but nuvvu common points annintiki common point cheppinav.

Ante ippudu ee kutumbham vaalle nidhiki vaarasula
[+] 1 user Likes Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(29-11-2022, 05:26 PM)ITACHI639 Wrote: Sarlevo 

Nenu kuda common points cheppaanu, but nuvvu common points annintiki common point cheppinav.

Ante ippudu ee kutumbham vaalle nidhiki vaarasula

తూచ్ ఇది దొంగాట నేను ఒప్పుకోను ..ఇంకో 2 అప్డేట్స్ లో కథ ముగిస్తా . అప్పుడు చదువుతా అన్ని కథలూ alienx వి
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
(29-11-2022, 06:16 PM)Jani fucker Wrote: తూచ్ ఇది దొంగాట నేను ఒప్పుకోను ..ఇంకో 2 అప్డేట్స్ లో కథ ముగిస్తా . అప్పుడు చదువుతా అన్ని కథలూ alienx వి

Sorry mitrama spoiler leak chesana enti, nen anukoledu 

PG aithe chaduvu niku nacchuthundi
[+] 1 user Likes Haran000's post
Like Reply
కథ లో నిధి కోసం కేవలం విశ్వాస్ ఒక్కడే ట్రై చేస్తూ ఉన్నట్టు ఉంది . మొదటి నుండి చివరి వరకు.. మరి ఇంక ఎవరు ట్రై చెయ్యలేదా అంటే చేశారు . కానీ మీకు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.. ఫస్ట్ టైం నిధి కోసం వచ్చినప్పుడు విశ్వాస్ ఇంకా తన టీమ్ ఆ గ్రామం దాటి ముందుకు వెళ్ళలేక పోయారు..కాబట్టి అలాగే ఇంకా ఎవరైన వస్తె వాళ్ళ పరిస్థితి కూడా అంతే కదా...

పైగా ఆ జలపాతం గుర్తు ఉంది కదా ఎవ్వరూ ఊహించని సొరంగ మార్గం ద్వారా వెళ్ళాలి .[Image: images-2022-12-01-T052049-851.jpg]

ఎక్కడా ఈ జలపాతం , ఎక్కడ ఆ అడవి దేవర గుడి రెండిటికీ ఎంతో దూరం కానీ ఆ గుడి లో విగ్రహం కింద నుండి జలపాతం లోకి దారి ఇది ఊహా కి కూడా అందదు.. ఇలా ఈ జలపాతం వరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిన వారు ఉంటారు.లేక అందులో పడి చనిపోయిన వారు ఉంటారు..సరే నిధి దగ్గరకు వెళ్లడానికి వేరే దారులు లేవా అంటే లేవు..ఇదేమి మనకి టౌన్ లో ఉండే సూపర్ మార్కెట్ కాదు కదా ఏదో ఒక రోడ్ నుండి వచ్చి స్టోర్ లోకి వెళ్ళడానికి..అయిన మార్కెట్ కి ఎటు నుండి వచ్చిన చివరికి దాని ముందు నుండే లోపలికి వెళ్ళాలి గానీ వెనుక నుండి వెళ్ళలేము కదా..

నేను ఇక్కడ చెప్పాలి అనుకున్నది . చివరి వరకు పోరాడిన విశ్వాస్ గురించి మాత్రమే.

విక్రమ్ ఆ గ్రామం వరకు వెళ్ళాడు కానీ అక్కడే చనిపోయాడు. అది తన అదృష్టం అనే చెప్పాలి . ఆ తెగవారు విక్రమ్ నీ లోపలికి రాణించారు..కానీ వాళ్ళతో పాటు అక్కడే ఉంచేసారు..[Image: images-2022-12-04-T215513-301.jpg]

ఇంకా హిమజ తను వెళ్లగలిగింది కదా . హా ఎందుకంటే నిధి సంరక్షకుడు అందుకు సహాయం చేసాడు..అదేంటి మళ్లీ ఇలా చెప్తున్న అని అనుకోకండి.. మీరు స్టోరీ లైన్ కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటే . విరిజిత్ సంపద వారసులకు దక్కాలి అని అన్నాడు. హిమజ వాళ్ళు అంబీ రాజ్యం వెళ్ళినప్పుడు విరిజిత్ అబద్ధం చెప్పి ఉంటాడు అని అనుకున్నారు..కానీ అశోకుడు మొత్తం చెప్తాడు.. అంటే దాని అర్థం హంశనందుడి వారసులు ఆ సంపద దక్కించుకొని దానిని హిమాలయ పర్వతాల లో విడిచి రావాలి సురక్షితం గా..

సరే కానీ హిమజ ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు ఎవరు లేరా అంటే ఇక్కడ నేను add చేసిన ఇంకో పాయింట్ బలి. కడుపు తో ఉన్న  స్త్రీ .. మరి కథ లో కడుపు తో ఉన్నది హిమజ నే కదా ..( మళ్లీ చెప్తున్న హిమజ ఇంకా సుభాష్ హైదరాబాద్ లో ఉన్నప్పుడే తను ప్రెగ్నెన్సీ లో ఉంది.). తనని తాను అగ్నికి అర్పించుకొని ఆ పుస్తకం ద్వారా ఇంత దూరం వచ్చింది.. అందరూ ఆ పుస్తకం గురించి ఆలోచించడం లేదు. కారణం అది ఇప్పుడు ఇక్కడ లేదు.ఎప్పటికీ దొరకదు..

ఇప్పుడు వారసులు.. హంశనండుడి కుటుంబం లో వాడు రామాచారి... అతని పెద్ద కొడుకు విశ్వాస్... అతని తమ్ముడు కూతుర్లు లావణ్య ఇంకా శరణ్య.. అలాగే అతని రెండో కొడుకు సుభాష్ యొక్క బిడ్డ హిమజ కడుపు లో ఉన్నాడు కదా..

వీళ్లు నలుగురు మాత్రమే ఆ సంపద చూసే అదృష్టం ఉంది.. హిమజ తన కడుపులో ఉన్న బిడ్డ వల్ల తనకి ఆ అదృష్టం దక్కింది.. మరి అదేంటి విశ్వాస్ చెడ్డవాడు కదా అని అనుకుంటే కాదు తను roose నీ కొనేసి తరువాత అతని తో ఒక విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నాడు.. అవి ఎంటి అనేది మీకు తెలుస్తుంది...

..... చివరి అధ్యాయం రెండవ భాగం ..... ప్రేమ,పశ్చాతాపం..

సరిగ్గా 23 గంటల సమయం జాతర చివరి రోజు అమ్మవారి జాతర బేతంచర్ల లో అంగరంగ వైభోగంగా జరుగుతుంది. దేశం నలుమూలలా నుండి అక్కడికి భక్తులు వస్తున్నారు..ఇక్కడ అడవి లో రామాచారి కుటుంబం చివరి రోజు పూజలకు అన్ని సిద్దం చేసారు ..( మైల ఉన్న కుటుంబం ఇదంతా ఎలా చేయగలుగుతుంది అని అనుకోవచ్చు కానీ ఇవన్నీ మనం పెట్టుకున్న ఆచారాలు మాత్రమే దేవుళ్ళకి ఇవి ఉండవు అందుకే ఆ తల్లి వారి పూజలు స్వీకరించింది..) తెల్లవారితే అక్కడ గుడి దగ్గర రథోత్సవం జరుగుతుంది. [Image: images-2022-12-04-T215758-350.jpg]

విశ్వాస్ తన గురించి అసలు తనకే తెలియని ఒక వ్యక్తి కథ లాగా చెప్తూ ఉంటే ఏమి మాట్లాడకుండా వింటున్నాడు. 

కేరళ ఆశ్రమం దగ్గర మిశ్రా అడవిలోకి వచ్చి విశ్వాస్ కి కాల్ చేయాలి అని నిర్ణయించుకుని అటు ఇటు చూస్తూ వెళ్తున్నాడు. అప్పుడే అతన్ని కొంత మంది తరమాడం మొదలు పెట్టారు.మిశ్రా మొదట పిచ్చి వాడిలా ఆక్ట్ చేశాడు కానీ వాళ్ళు తనని చంపడానికి కత్తులు బయటకు తీశారు. దాంతో మిశ్రా అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేసాడు. వాళ్ళకి దొరకకుండా అడవి లో పరిగెడుతున్నాడు..అతని వెనుక ఆ హంతకులు కూడా పరిగెడుతూ ఉన్నాడు.. *** విశ్వాస్ ఇంకా roose మాట్లాడుకున్న సంఘటన***

విశ్వాస్...roose నువ్వు ఇప్పుడు నా మనిషి వే కదా..

Roose...ఎస్ సార్ మన కాంట్రాక్ట్ క్లోజ్ అయ్యేవరకు మీరే నా బాస్.

విశ్వాస్...గుడ్ అయితే నేను నీకు ఇప్పుడు ఒక పని అప్పగిస్తున్నా అది రేపటి లోగా పూర్తి చేయాలి..

Roose...చెప్పండి సార్ ఏమి చేయాలి .

విశ్వాస్...నువ్వు మిశ్రా నీ చంపాలి ..

Roose...yeah సార్ చంపుతాను.

విశ్వాస్...అదేంటి రూస్ ఎందుకు ఎంటి అని అడగవా..

Roose...ఇప్పుడు అయితే నాకు మీరే బాస్. కాబట్టి మీరు ఎది చెప్తే అది చేస్తాను..

విశ్వాస్... that's good అయితే నువ్వు వెంటనే బయలుదేరి వెళ్లి వాడిని చంపు నీకు తిరుచ్చి లో నా మనుషులు కలుస్తారు.సరే నా.

Roose...ok sir అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు...

అడవి లో roose ఇంకా విశ్వాస్ మనుషులు కలిసి ఆశ్రమం దగ్గర నుండి మిశ్రా నీ follow అవుతూ చివరికి అడవి లోకి వచ్చిన తర్వాత దాడి చేశారు.. మిశ్రా వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు..[Image: 6798c5368194219524ec8d9227ba608c.gif] వీళ్ళందరూ మొఖానికి ముసుగులు వేసుకొని ఉండటం తో మిశ్రా గుర్తు పట్టలేక పోయాడు.. 

అలా పరిగెడుతున్న మిశ్రా కాలికి ఏదో తగలడం తో కింద పడ్డాడు. అతను మళ్లీ పైకి లేచి పరిగెత్తే సమయం లో ఎవడో గొడ్డలి విసరడం తో అది నేరుగా వచ్చి మిశ్రా వీపు లో తగిలింది. దాంతో మిశ్రా అక్కడికి అక్కడే కుప్పకూలిపోయాడు..roose ఇంకా మిగిలిన వాళ్ళు కలిసి మిశ్రా మీద కత్తులతో దాడి చేసి అతని వొళ్ళు మొత్తం జల్లెడ చేసి పడేశారు . రక్తం మడుగులో గిల గిల కొట్టుకుంటూ మిశ్రా ప్రాణాలు వదిలాడు.. 

రూస్...సరే నేను విశ్వాస్ సార్ దగ్గర కి వెళ్లి పని పూర్తి అయ్యింది అని చెప్తాను అని మిగిలిన వాళ్ళతో అన్నాడు..

అందులో ఒకడు ముందుకు వచ్చి నువ్వు చెప్పాల్సిన పనిలేదు. అయ్యగారికి మేము చెప్తాము. నీ పని ఇక్కడి తో పూర్తి అయ్యింది అంటూ బొడ్డు లో నుండి కత్తి తీసి roose కడుపు లో పొడిచాడు..డబ్బులు కి అమ్ముడు పోయే నీ లాంటి కుక్కలు మా అయ్యగారికి అవసరం లేదని నీతో చెప్పమన్నారు అంటూ కత్తి బయటకు తీసి మళ్ళీ పొడిచాడు...

ఆహ్ అంటు అరుస్తూ రూస్ u cheaters I will kill....u అంటూ అక్కడే కింద పడిపోయాడు.. విశ్వాస్ మనుషులు ఇద్దరి శవాలను అక్కడే గొయ్యి తీసి పుడ్చేసి వెనక్కి వచ్చేశారు...

..... అడవి లో ఉన్న మూడు వేరు వేరు ప్రదేశాలలో....

హిమజ ఎందుకు అలా ప్రవర్టిసుంది అని భాను కి ఏమి అర్ధం కావటం లేదు. ఒక వేళ తన అవసరం లేదని అనుకుంటూ ఉందా . ఛా దీని వల్ల నా ముగ్గురు ప్రాణ స్నేహితులను పోగొట్టుకున్న ఈ మాటలాడి తన మాటలతో నన్ను మోసం చేసింది. నేను ఇక్కడ ఉండటం అనవసరం అని అనుకుంటూ అంత రాత్రి వేళలో ఆ గూడెం నుండి ఎక్కడికో బయలుదేరాడు. 

అప్పుడు హేయ్ భాను ఎక్కడికి వెళ్తున్నావు అని పిలిచింది హిమజ . 

హిమజ గొంతు విని వెనక్కి తిరిగి చూస్తూ ఏమి లేదు ఊరికే అల అని నసుగుతూ ఉన్నాడు.. హిమజ నడుచుకుంటూ భాను దగ్గరకి వచ్చి అతని చెయ్యి పట్టుకుని హ్మ్మ్ అర్ధం అయ్యింది. నువ్వు సాయంత్రం నుండి ఇలా ఎందుకు ఉన్నావు నాకు తెలుసు నేను నీకు ఒక విషయం చెప్పాలి రా నాతో పాటు అంటూ చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్లి ఒక చోట కూర్చుంటూ తనని కూడా కూర్చోమని చెప్పింది...భాను కూడా కింద కూర్చొని హ్మ్మ్ ఎంటి చెప్పు అని అడిగాడు..

హిమజ...నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.కానీ నా లైఫ్ లో నాకు అంటూ ఉన్న వాళ్ళలో నువ్వు కూడా ఒకడివే నాకు కూడా ఈ విషయం సాయంత్రం తెలిసింది..

భాను కి హిమజ మీద ఇప్పుడు ముందు ఉన్న ప్రేమ లేకపోవడం తో కాస్త చిరాకు పడుతు అసలు విషయం చెప్పు అని అడిగాడు..

హిమజ తన పెదాలను నలుపుకుంటూ అది భాను నేను కడుపుతో ఉన్నాను.ఇప్పుడు మూడవ నెల అని చెప్పింది..

భాను కి హిమజ చెప్పింది విని నవ్వు వచ్చింది. అలాగే నవ్వుతూ హిమజ ను చూసాడు. హిమజ తన వైపు సీరియస్ గా చూస్తుంది.

భాను వెంటనే మామూలుగా అయ్యి నవ్వడం ఆపేసి కానీ ఇది ఎలా సాధ్యం హిమజ మాలో ఎవరి వల్ల అయితే కాదు ఇది నీతో పరిచయం కూడా మాకు పది రోజులు మాత్రమే కదా...అని అన్నాడు..

హిమజ...లేదు ఇది సుభాష్ వల్ల అతను గురించి చెప్ప కదా మీకు మొదట్లో గుర్తు ఉంది కదా..

భాను...హా అందుకేనా నువ్వు సాయంత్రం అలా ఉన్నావు అని అడిగాడు .

హిమజ...హా అవును నాకు నీతో ఎలా చెప్పాలి అని అర్థం కాలేదు.కానీ ఈ క్షణం నాకు అంటూ ఉన్న ఏకైక తోడు నువ్వు మాత్రమే అందుకే నీకు చెప్పాను..

భాను కి హిమజ మాటలు కదిలించి వేశాయి.అతను వెంటనే హిమజ ను గట్టిగా హత్తుకొని sorry నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న అని sorry చెప్తున్నాడు.. హిమజ కూడా భాను నీ హత్తుకొని లేదు నేను నీకు సాయంత్రం చెప్పి ఉండాలి కానీ చెప్తే నువ్వు ఎలా స్పందిస్తావో అని భయం అంటూ అలాగే హత్తుకొని ఉంది..

ఇద్దరు ఒకరిని ఒకరు వాటేసుకుని ఒడార్చుకుంటు ఉన్నారు..

ఇంకో వైపు పిల్లలు లావణ్య ఇంకా శరణ్య వాళ్ళు తీసి దాచిపెట్టిన గ్రందాలను చూస్తూ వీటిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ కథలు ఉంటాయి ఎమో కదా అని చెప్పుకుంటూ ఉన్నారు..

లావణ్య ..హేయ్ మనం ఊరికి వెళ్ళిన తర్వాత ఇవి నాయనమ్మ కి ఇచ్చి ఇందులో రాసి ఉన్నవి చదివి మనకి చెప్పమని అడుగుదాం ఏమంటావు..

శరణ్య...హా అవును తనకు ఇవన్నీ చదవడం వచ్చు కదా సో మనకి బోరింగ్ కథలు కాకుండా ఏదైనా మంచి కథ ఇందులో ఉన్నది చదివి చెప్పు అని అడుగుదాం ..

ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు.. అక్కడ కార్ దగ్గర సుభాష్ కూర్చొని తన పర్స్ లో ఉన్న హిమజ ఫోటో చూసుకుంటూ తన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు... 

6 సం"ల క్రితం... Hyderabad....*** Hospital & medical college...

ప్రొఫెసర్...స్టూడెంట్స్ ఇదిగోండి ఈ అమ్మాయి నీ చూసారా . తన గురించి చెన్నై హాస్పిటల్ లో కూడా ఎటువంటి information లేదు తనను ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ తెచ్చి జాయిన్ చేశాడు అంట ఆ తర్వాత తన గురించి ఎవరు రాలేదు .. 8 నెలలు గా తను ఇలాగే బెడ్ కి పరిమితం అయి ఉంది..చివరకు మన డీన్ గారు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి తనని ఇక్కడికి తీసుకొని వచ్చారు. చూడటానికి ఇంత అందంగా ఉన్న ఈ అమ్మాయి పేరు కూడా మనకి తెలియదు.సరే అసలు విషయం ఏమిటంటే హ్యూమన్ బాడీ మీద మీకు ఇప్పుడు ప్రాక్టికల్స్ ఉంటాయి అని చెప్పాడు..

స్టూడెంట్స్ కూడా ఆ అమ్మాయి నీ చూస్తూ సరే అని అన్నారు.. ఆరోజు ఏదో పని మీద సుభాష్ అక్కడికి వచ్చాడు.తనకి ప్రొఫెసర్ తో పరిచయం ఉండటం తో lab లోకి వెళ్లి అతన్ని కలిశాడు..

సుభాష్...సార్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది.నేను తయారు చేసిన థియోరీ మీకు ఏమైనా ఉపయోగపడుతుంది ఎమో చూడండి అని ఇచ్చాడు.. 

అప్పుడే సుభాష్ ఆ అమ్మాయి నీ చూసాడు . తన గురించి అడిగాడు ప్రొఫెసర్ మొత్తం చెప్పుకొని వచ్చాడు..తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు . సుభాష్ మనసు నిండా ఆ అమ్మాయి నిండి పోయింది..

ప్రొఫెసర్ లేకపోవడం తో స్టూడెంట్స్ తమ అతి తెలివి చూపిస్తు ఆ అమ్మాయి కి high voltage current ఇచ్చారు.దాంతో ఒక్కసారిగా తను లేచి కూర్చుంది..

వెంటనే ఈ విషయం ప్రొఫెసర్ కి తెలిసింది. తనతో పాటు సుభాష్ కూడా వచ్చాడు. ఆ అమ్మాయి నీ ప్రొఫెసర్ ప్రశ్నలు అడిగారు కానీ తనకు ఏమి గుర్తు లేదు.ప్రొఫెసర్ ఆ అమ్మాయి కి తన కూతురు పేరు పెట్టాడు..(హిమజ)..సుభాష్ ఆ క్షణం ఆ అమ్మాయి ప్రేమ లో పడిపోయాడు. కొన్ని రోజులు అక్కడే treatment తీసుకొని హిమజ కోలుకుంది.. తనని డిశ్చార్జ్ చేశారు. హిమజ కి ఎక్కడికి వెళ్ళాలి అని అర్థం కాలేదు. సుభాష్ ప్రొఫెసర్ కి చెప్పి తనతో పాటు తీసుకొని వెళ్ళాడు . అలా తమ ప్రేమ ప్రయాణం మొదలు పెట్టాడు. హిమజ తో 5 యేళ్లు ఉన్న సుభాష్ కి హిమజ నే సర్వస్వం అయిపోయింది.. ఇటు హిమజ పరిస్తితి కూడా అదే..

ఇదంతా ఆలోచిస్తూ ఉన్న సుభాష్ కు ఏదో అలికిడి వినిపించి శబ్దం వచ్చిన వైపు చూసాడు...లావణ్య ఇంకా శరణ్య ఇద్దరు దేనినో వెంబడిస్తూ వెళ్తున్నారు.. వాళ్ళ వెనుక సుభాష్ కూడా వెళ్తూ వాళ్ళని పిలిచాడు... వాళ్ళు వెనక్కి తిరిగి అన్నయ్య అని సుభాష్ నీ చూస్తున్నారు..

సుభాష్ వాళ్ళని చూస్తూ వాళ్ళు వెంబడిస్తున్న వస్తువు చూసి ఆశ్చర్యపోయి అలాగే నిలబడి పోయాడు

గాలిలొ తాలపట్రాలు ఎగురుతూ ఉన్నాయి . లావణ్య ఇంకా శరణ్య వాటిని వెంబడిస్తూ వెళ్తున్నారు..సుభాష్ వెంటనే తన చెల్లెళ్ళ దగ్గర కు వెళ్లి ఎంటి ఇదంతా అని అన్నాడు..

శరణ్య...ఎమో అన్నయ్య తెలీదు ఇవి మాకు అక్కడ దొరికాయి.సాయంత్రం ఇప్పుడు వాటంట అవే ఇలా ఎక్కడికో వెళ్తున్నాయి.మేము follow అవుతున్నాం అని చెప్పింది.

సుభాష్ కి ముందు భయం వేసింది.కానీ తన చెల్లెళ్ళు ఎక్కడ భయపడతారు అని ఆలోచిస్తూ హ్మ్మ్ సరే పదండి నేను మీకు తోడుగా వస్తాను అని అన్నాడు...


గుడిసె దగ్గర అవ్వ కథ మొత్తం చెప్పడం అయిపోయింది.అప్పటి వరకు విశ్వాస్ ఇంకా అలాగే కింద కూర్చొని ఆ అవ్వ నీ చూస్తూనే ఉన్నాడు..అవ్వ లేచి విశ్వాస్ దగ్గర కు వచ్చి అతనికి చెయ్యి అందించింది.. విశ్వాస్ అలాగే చూస్తూ అవ్వ చెయ్యి అందుకొని పైకి లేచాడు...

అవ్వ నవ్వుతూ హ్మ్మ్ అడుగు విశ్వాస్ నీకు ఉన్న సందేహాలు సమాధానాలు దొరుకుతాయి అని చెప్పింది..
[Image: images-2022-12-04-T210504-820.jpg]
విశ్వాస్ ... అసలు మీరు ఎవరు నా గురించి నా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియని విషయాలు మీకు ఎలా తెలుసు నేను వచ్చిన పని గురించి మీకు ఎవరు చెప్పారు.ఇలా అడుగుతూనే ఉన్నాడు..

దానికి అవ్వ నవ్వుతూ నువ్వు ఒక మహా కార్యం తలబెట్టడానికి పుట్టావు. మీ వంశం ఇప్పటి వరకు రక్షణ గా ఉన్న విలువైన వస్తువులు వాటి అసలు స్థానానికి చేర్చడానికి ఈ యుగం లో నువ్వే రాచకారి అని చెప్పింది..

విశ్వాస్...నాకు ఏమి అర్ధం కావటం లేదు దీనికి మా ఫ్యామిలీ కి సంబంధం ఏమిటి నాకు చెప్పండి అని అడిగాడు..

అవ్వ మళ్లీ నవ్వుతూ ఏ కారణం లేకుండా నువ్వు ఇక్కడి వరకు వచ్చావా . ఒక సారి ఆలోచించు ఇన్ని సార్లు ప్రయత్నం చేసిన నువ్వు మాత్రమే ఎందుకు మిగిలి ఉంటున్నావు.. ఎవరికి భయపడని అఘోరాలు నువ్వు అడిగిన వెంటనే ఈ పుస్తకం ఎందుకు ఇచ్చారు అంటూ తన చేతిని చాచి పుస్తకం చూపించింది.నువ్వు చేసిన పాపాలు కూడా నిన్ను వెంటాడి ఇంత దూరం వచ్చాయి . కానీ ఎప్పుడైతే నువ్వు నీ వల్ల ఒక ఆడపిల్ల బాధపడింది . తను బంధించి ఉంచడం తప్పు అని అనుకున్నావో అప్పుడే నువ్వు పశ్చాతాపం పడ్డావు. 

విశ్వాస్..ఈ విషయం మీకు ఎలా తెలుసు..

అవ్వ .. నాకు నీ గురించి మొత్తం తెలుసు నువ్వు ఈ సంపద కు సంరక్షకుడివి. నువ్వు చేయాల్సిన పని ఈ సంపదను పరమశివుని నివాసం అయిన హిమాలయ పర్వతాల కు తీసుకొని వెళ్ళాలి అని చెప్తూ చివరిగా ఒక్క మాట ఇప్పుడు నువ్వు నీ కుటుంబం లోని కొంత మంది నీ కలుసుోబోతున్నావు . వాళ్ళు కూడా నీకు తోడుగా వస్తారు.

విశ్వాస్... నేను దుర్మగుడిని చాలా పాపాలు చేశాను . ఈ పని నా వల్ల కాదు.అయిన మా కుటుంబాన్ని ఒక శాపం వెంటాడుతుంది.నేను చేసిన పనికి మీ దేవుడు నా కుటుంబానికి శిక్ష ఎందుకు వేసాడు..

అవ్వ.. కర్మ ఫలం అనుభవించక తప్పదు. అయినా ఇప్పుడు శాపం తొలగిపోయింది. నీ కుటుంబం నీకు దగ్గరలో ఉంది . నువ్వు ఈ మహా కార్యం పూర్తి చేయడానికి నీ కుటంబం లోని కొందరు నీకు తోడుగా వస్తారు..

విశ్వాస్...నవ్వుతూ ఎటువంటి ప్రయోజనం లేకుండా అదే శాపం ఎలా తొలగింది. నేను ఈ పని చేయలేను .నాకు వజ్రాలు బంగారం మాత్రమే కావాలి..

అవ్వ చూడు నాయనా ఏ అమ్మాయిని అయితే నువ్వు బంధించి ఉంచావో. ఆ అమ్మాయి వల్లే నీ కుటుంబానికి ఉన్న శాపం తొలగిపోయింది.తను తన ప్రాణాలను పణం గా పెట్టీ ఈ పని చేసింది.ఇప్పుడు నువ్వు సిద్దమా.

విశ్వాస్ కి కళ్ళు తెరుచుకున్నాయి. తనలో తాను కుమిలిపోతూ ఉన్నాడు. నా వల్ల కాదు నేను నిచుడిని అంటూ ఏడుస్తూ ఉన్నాడు..

అవ్వ...నువ్వు చేయగలవు అందుకే ఇప్పటి వరకు ఇంకా బ్రతికే ఉన్నావు . ఇంకా సెలవు అంటూ మాయం అయిపోయింది.తను మాయం అయిన వెంటనే అమృత సేఖీ ప్రత్యేక్షం అయి అది విశ్వాస్ చేతిలోకి వచ్చి పడింది..[Image: souldrop-tdd.gif]

విశ్వాస్..దానిని అలాగే చూస్తూ అసలు ఆ అమ్మాయికి మా కుటుంబానికి సంబంధం ఎంటి అని అవ్వ నీ అడగాలి అని అవ్వ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో తన ఎదురుగా ఎవరో వస్తున్న అలికిడి వినిపించి అటు చూసాడు..


గూడెం లో హిమజ ఇంకా భాను మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు పూజ గది నుండి ఏదో వెలుతురు రావడం చూసి ఇద్దరు అటు వెళ్ళారు.. గది తలుపు తీసుకొని లోపలికి వెళ్లారు..అక్కడ ఉన్న పుష్పం మిల మిలా మెరుస్తూ గాలిలొ ఎగురుతూ వెళ్తుంది.. హిమజ ఇంకా భాను ఒకరిని ఒకరు చూసుకుంటూ దాని వెనకాలే వెళ్ళారు...
[Image: d5afvul-bfb6248b-e224-4f26-9b7c-7e1479d697e9.gif]
ఒక వైపు హిమజ..మరో వైపు లావణ్య ఇంకా శరణ్య.. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను అనుసరిస్తూ వెళ్తున్నారు.. 

అక్కడ విశ్వాస్ అక్కడ నుండి ముందుకు వెళ్తుంటే అమృత సెఖి అక్కడే ఉండిపోతుంది. అతనికి ఏమి అర్థం కాక తను కూడా అక్కడే ఉన్నాడు.. అప్పుడే ఏదో శబ్దం వినిపించి చూసాడు..

హిమజ ఇంకా భాను ఇద్దరు స్వర్ణ కంబళి పువ్వు నీ అనుసరిస్తూ అమృత శేఖి దగ్గరకు వచ్చారు . వాళ్లకు ఎదురుగా విశ్వాస్ నిలబడి ఉన్నాడు.. ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు..

భాను కి కోపం వచ్చి నీ వల్లే నా frnds చనిపోయారు . నువ్వే వాళ్ళని చంపేసావు అని విశ్వాస్ నీ కొట్టడానికి వెళ్ళాడు.. విశ్వాస్ తల దించుకొని నిలబడి నన్ను క్షమించు అని అన్నాడు..

భాను కోపం ఆపుకోలేక విశ్వాస్ మొఖం మీద బలంగా గుద్దాడు..దాంతో విశ్వాస్ కింద పడ్డాడు . మళ్ళీ కొట్టడానికి వెళ్ళాడు భాను. అయితే ఎవరో వస్తున్న శబ్దం వినిపించి హిమజ వెంటనే భాను తో భాను ఇది వీడి ప్లాన్ అనుకుంటా వాడి మనుషులు వస్తున్నారు.పద వెళ్దాం అని భాను చెయ్యి పట్టుకుని అక్కడి నుండి వెళ్ళబోయింది. కానీ తన అడుగు ముందుకు పడటం లేదు. ఎంత ప్రత్నించినా ముందుకు వెళ్ళలేక పోతుంది .కానీ భాను హిమజ చెప్పిన వెంటనే అక్కడ నుండి పరిగెత్తాడు.. 

హిమజ అక్కడే ఆగిపోయింది.. చెట్ల మధ్యలో నుండి ఏదో వెలుతురు వస్తుంది.. హిమజ అది చూసి లైట్ వెలుతురు అనుకుంది కానీ దాని వెనుక నుండి ఇద్దరు పిల్లలు వాళ్ళ వెనుక ఒక యువకుడు వచ్చారు..( లావణ్య ఇంకా శరణ్య అలాగే సుభాష్)...

మూడు సమూహాలు దగ్గరకి రావటం తో ఆ పవిత్రమైన మూడు వస్తువులు ఒకటిగా కలిసిపోయాయి.. విశ్వాస్, హిమజ అలాగే పిల్లలు , సుభాష్ ఆ అద్భుత సంఘటనకు సాక్ష్యం గా ఉన్నారు..

విరిజిత్ వీటిని ఎప్పుడైతే మూడు భాగాలుగా విడదీసి మూడు వేరు వేరు ప్రదేశాలలో అప్పగించాడో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి అల ఉండి పోయాయి .మళ్లీ ఇప్పుడు అవి కలిశాయి..ఇది జరిగిన కథ..


 ఆ వచ్చిన మనుషులని  హిమజ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. వాళ్ళు ఇంకా తనని చూడలేదు..వాళ్ళు కూడా దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ పెద్ద అన్నయ్య విశ్వాస్ నీ అలాగే హిమజ ను చూసి షాక్ అయ్యారు.. సుభాష్ పరిస్థితి కూడా అలాగే ఉంది..అసలు ముందు తనకి ఎదురుగా ఉన్న హిమజ ను చూసి ఇది కల లేకా నిజమా అని నమ్మలేకపోతున్నాడు.

హిమజ...సుభాష్ చూసి నవ్వుతూ ఒక పక్క ఏడుస్తూ సుభాష్ మై honey అని పిలిచింది..

సుభాష్ కి ఇంకా నమ్మకం కలగడం లేదు. అయినా కానీ హిమజ దగ్గరకు వెళ్ళి తనను ముట్టుకుని చూసి నవ్వుతూ నువ్వు నిజమే కానీ ఎలా అంటూ గట్టిగా హత్తుకొని ముద్దులు పెడుతున్నాడు నుదిటి మీద..

పిల్లలు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని పట్టుకొని హిమజ చెయ్యి పట్టుకుని లాగుతూ వదిన అని పిలిచారు . హిమజ సుభాష్ నీ వదిలి పిల్లలను హత్తుకొని మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అంటూ ఇద్దరికీ ముద్దు పెట్టింది..

శరణ్య ..మేము కూడా వదిన నువ్వు ఇంకా మాకు లేవు అని అనుకున్నాం. అది హాస్పిటల్ లో అని చెప్పబోతుంటే సుభాష్ శరణ్య నోరు మూసి విశ్వాస్ నీ చూస్తూ అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు..

హిమజ... honey తను మీ అన్నయ్య అని షాకింగ్ గా అడిగింది..

సుభాష్...హా అవును బేబీ మా అందరి కంటే పెద్ద వాడు చాలా మంచి వాడు అని అన్నాడు..

విశ్వాస్ కి మొత్తం అయోమయం గా ఉంది. తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు..నా తమ్ముడు ప్రేమించిన అమ్మాయి నీ నేను అల కట్టేసి ఉంచాన అని బాధపడుతూ ఉన్నాడు..

హిమజ జరిగిన విషయం సుభాష్ కి చెప్పకుండా మౌనంగా ఉండపోయింది.అడవి లో పరిగెడుతున్న భాను కి తనతో పాటు హిమజ లేదు అనే సంగతి గుర్తుకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు..

అక్కడ హిమజ ఇంకా సుభాష్ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు..

సుభాష్... హిమజ ను గట్టిగా హత్తుకొని మా బిడ్డ ఎలా ఉన్నాడు నీ కడుపులో అని అడిగాడు ..

హిమజ... తల ఎత్తి సుభాష్ నీ చూస్తూ ఈ విషయం నీకు ఎలా తెలుసు నేను ఎవరికీ చెప్పలేదు కదా అని మనసులో అనుకుంటూ.హా బాగున్నాడు అంటు సుభాష్ చెయ్యి తీసుకొని తన కడుపు మీద వేసుకుంది..

అక్కడ దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న భాను కాస్త గుండె భారం తో అక్కడ నుండి వెల్లిపోబోయాడు.

పిల్లలు భాను నీ చూసి హేయ్ ఎవరు అని అరిచారు.. పిల్లల అరుపు విని అందరూ అటు చూశారు.. హిమాజ కూడా చూసి భాను దగ్గరకు వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని థాంక్స్ చెప్తూ రా నీకు సుభాష్ నీ పరిచయం చేస్తాను అని తీసుకొని వచ్చింది ..విశ్వాస్ చేసిన దాని గురించి సుభాష్ కు చెప్పొద్దు అని చెప్పింది..

సుభాష్ సరే పదండి అక్కడ అమ్మవాల్లు కంగారు పడుతుంటారు అని అన్నాడు..
హిమజ నేను రాను సుభాష్ అని చెప్పింది.. విశ్వాస్ ఎందుకు అన్నట్టు చూసాడు.. సుభాష్ హిమజ చెయ్యి పట్టుకుని వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. నన్ను నమ్ము నిన్ను చూసి నా కంటే ఎక్కువ ఆనందించేది వాళ్ళే అని హిమజ కు చెప్పి చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్ళాడు..

ఇక్కడ గుడి దగ్గర పిల్లలు కనపడకపోవడం తో భువన ఇంకా త్రివేణి కంగారు పడుతూ ఉన్నారు... రామాచారి,విష్ణు అలాగే ఆదిత్య చుట్టూ పక్కల వెతుకుతూ ఉన్నారు...

ఆదిత్య . అన్నయ్య , లావణ్య ,శరణ్య ఎక్కడ ఉన్నారు అని గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న ఇళ్లలో వెతుకుతూ ఉన్నాడు..

విష్ణు... చిన్నోడ ఎక్కడ ఉన్నావు , వినపడుతుందా అని అరుస్తూ అడవి లోకి వెళ్తున్నాడు.అతనికి ఎదురుగా సుభాష్ వాళ్ళు వస్తూ కనిపించారు..

వెంటనే విష్ణు వీళ్లు ఇక్కడ ఉన్నారు వస్తున్నారు అని అరిచాడు..

రామాచారి లైట్ వేసుకొని లోపలికి వెళ్ళాడు   అడవి లోకి విష్ణు గొంతు విని వెనక్కి వచ్చాడు..

అందరూ ఒక చోట చేరుకున్నారు. రామాచారి విశ్వాస్ నీ చూసి అరేయ్ పెద్దొడా ఏమైపోయావు అని అడుగుతూ హిమజ ను చూసి ప్రశాంతంగా చెప్పినట్టు తిరిగి వచ్చావా తల్లి అని అన్నాడు..

హిమజ కి అర్ధం చేసుకోవడానికి సమయం పట్టింది .తనకు మెల్లిగా అన్ని అర్ధం అయ్యాయి. విరిజిత్ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు అని..

భువన ఇంకా త్రివేణి ఇద్దరు పిల్లలు దగ్గరకు తీసుకొని మందలించి హిమజ దగ్గరకి వచ్చారు. హిమజ వాళ్ళని కోపంగా లేచి ఉంది..కానీ వాళ్ళు హిమజ కు చేతులు ఎత్తి దండం పెడుతూ మమ్మల్ని క్షమించు నీతో చాలా కఠినంగా ఉన్నాం .కానీ నువ్వు చాలా గొప్పదానివి అని అన్నారు ..


రామాచారి ఇంకా విష్ణు వీళ్లు తమ భార్య ఇంకా పిల్లలతో ఇక్కులం మాత దర్శనం కోసం వస్తూ ఉన్నారు..

భువన...ఎంటి మీరు చెప్తున్నది నిజమేనా ఆ అమ్మాయి హిమజ రెండు గా మారిందా అని తన భర్త నీ అడిగింది.

రామాచారి ..అవును భువన తను చావు చివరి అంచుల్లో ఉన్నప్పుడు నాకు చెప్పింది. చచేటప్పుడు ఎవరు అబద్ధం చెప్పరు కదా. ఒక వేళ తన మరో రూపం ఇక్కడే ఉంటే తనని తీసుకొని వచ్చి మన సుభాష్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం సరే నా..

త్రివేణి...మా అందరికీ మీ మాట అంటే గౌరవం బావగారు. ఒక వేళ హిమజ మనకి దొరికితే తనకు మన సుభాష్ కి పెళ్లి చేద్దాం..తన కంటే మంచి అమ్మాయి మన సుభాష్ కి దొరకదు.

భువన...అవును త్రివేణి చెప్పింది కూడా నిజమే అలాగే చేద్దాం..ఆ తల్లి ఆశిసులతో మన సుభాష్ కి తను ప్రేమించిన అమ్మాయి దొరికితే నేను నెల రోజులు ఉపవాసం ఉంటాను..

విష్ణు కార్ డ్రైవ్ చేస్తూ అన్నయ్య మరి ఆ అమ్మాయి గురించి సుభాష్ కి చెప్పావా .. అని అడిగాడు.

రామాచారి... మీ అందరి కంటే ముందు తనకే చెప్పాను.తను ఇక్కడి అడవికి వచ్చింది అని హాస్పిటల్ లో చెప్పింది.అందుకే సుభాష్ నీ తీసుకొని వస్తున్నాను...

అడవిలో ప్రస్తుతం.....
భువన తన భర్త దగ్గరకు వెళ్ళి ఏదో సైగ చేసింది..రామాచారి సరే అన్నట్టు తల ఊపుతూ హిమజ దగ్గరకు వచ్చి అమ్మ హిమజ నీకు మా రెండో కొడుకు సుభాష్ చంద్ర నీ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు..

హిమజ సుభాష్ నీ చూస్తూ సంతోషం తో హ్మ్మ్ ఇష్టమే అని తల ఊపింది..

విష్ణు ..మరి ఇంకా ఆలస్యం ఎందుకు బ్రహ్మ ముహూర్తం లో వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం . తరువాత ఇంటికి వెళ్లి గ్రాండ్ గా రిసెప్షన్ పెట్టొచ్చు అని అన్నాడు..

పిల్లలు హేయ్ అని చప్పట్లు కొడుతూ అరుస్తున్నారు..

భువన ఇంకా త్రివేణి తమతో పాటు హిమజ ను తీసుకొని వెళ్ళి వాళ్ళు అమ్మవారి కోసం తెచ్చిన మరొక చీర హిమజ కు ఇచ్చి కట్టుకొని రెఢీ అవ్వమని చెప్పారు...కాసేపటికి హిమజ రెఢీ అయ్యి వచ్చింది.సుభాష్ కూడా రెడీ అయ్యి ఉన్నాడు..

ఇద్దరినీ అమ్మవారి దగ్గరకు తీసుకొని వెళ్ళి దండం పెట్టించి సుభాష్ చేతికి పసుపు కొమ్ము కట్టిన తాడు ఇచ్చాడు రామాచారి.

త్రివేణి తన రెండు చేతులతో హిమజ జడ పైకి ఎత్తి పట్టుకుంది.సుభాష్ తన అదృష్టాన్ని నమ్మలేక ఆనందం తో ఊగిపోతూ హిమజ మెడ లో మూడు ముళ్లు వేసాడు.. హిమజ కూడా చాలా సంతోషం గా ఉంది..

విశ్వాస్ ఇద్దరి దగ్గరకి వచ్చి sorry చెప్తూ తన తమ్ముడికి అభినందనలు చెప్పాడు..

భాను కాస్త దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్నాడు....

రామాచారి ఇంకా భువన,అలాగే త్రివేణి,విష్ణు లా దగ్గర హిమజ ఇంకా సుభాష్ ఆశీర్వాదం తీసుకున్నారు..

విశ్వాస్ తన తండ్రి దగ్గరకు వచ్చి నాన్న ఒక ముఖ్యమైన పని ఉంది . నేను వెళ్ళాలి బహుశా ఇదే నా చివరి చూపు అవ్వొచ్చు అంటూ అందరికీ పేరు పేరున నా తరుపున ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మీలో ఒకడిగా భావించి క్షమించండి అంటూ హిమజ దగ్గరకు వచ్చి జరిగిన విషయాలు మనసులో పెట్టుకోకుండా నా తమ్ముడిని అలాగే నా తల్లదండ్రులను జాగ్రతగా చూస్కో వాళ్ళ బాధ్యత ఇక మీద నీదే అంటూ చెప్పి సుభాష్ దగ్గరకు వచ్చి అమ్మ నాన్న జాగ్రత అని తన తమ్ముడిని గట్టిగా వాటేసుకొని మళ్లీ జన్మ అంటూ ఉంటే నువ్వే నా తమ్ముడిగా పుట్టాలి అని ఆ సుంకాలమ్మ ను కోరుకుంటున్న అని అన్నాడు..

సుభాష్ తన అన్న నీ హత్తుకొని ఏడుస్తూ వద్దు వెళ్లొద్దు అని బ్రతిమాలాడు..

.... అడవి లో మూడు వస్తువులు కలిసినప్పుడు విశ్వాస్ వాటి గురించి తన తమ్ముడు ఇంకా ఇద్దరు చెల్లెలకు చెప్పి తను వాటిని హిమాలయ పర్వతాల లో ఒక చోట విడిచి రావాలి అని అన్నాడు....

విశ్వాస్ తన తమ్ముడి వీపు నిమురుతూ తప్పదు , ఇవి నాలాగ వచ్చే మరొకరి ఎవ్వరి చేతుల్లోకి వెళ్ళకూడదు . మనం వీటి రక్షకులం అంటూ చెప్పి చివరిగా తన ఇద్దరు కవల చెల్లెళ్ళు ఇంకా ముద్దుల చిన్న తమ్ముడు ఆదిత్య దగ్గరకు వచ్చి హేయ్ నా బంగారాలు అమ్మ నాన్న మాట వినండి, బాగా చదువుకోండి అలాగే అల్లరి చేయకూడదు సరేనా ఇంకా మీ హిమజ వదిన లాగా ధైర్యం గా ఉండాలి అని అన్నాడు .


లావణ్య ఇంకా శరణ్య ఏడుస్తూ విశ్వాస్ నీ పట్టుకొని వద్దు అన్నయ్య వెళ్లొద్దు మేము కూడా వస్తాము అని అన్నారు. 

విశ్వాస్ ఆదిత్య నీ చూస్తూ చెల్లెళ్ళు జాగ్రత అని అతనికి అప్పగించి వెళ్తూ భాను నీ చూసాడు. 

భాను దగ్గరకి వచ్చి నా వల్ల అందరి కంటే ఎక్కువ నష్టం జరిగింది నీకు మాత్రమే నన్ను క్షమించు అని అడిగాడు .

భాను..విశ్వాస్ చేతిని తన చేతిలోకి తీసుకుని నన్ను కూడా క్షమించు నీ మీద చెయ్యి చేసుకున్న అని అన్నాడు..

విశ్వాస్ నవ్వుతూ హా చాలా స్ట్రాంగ్ పంచ్ ఇప్పటికీ నొప్పి పుడుతుంది దవడ అని అన్నాడు..

భాను కూడా నవ్వుతూ నేను కూడా మీతో పాటు వస్తాను అని అన్నాడు..

విశ్వాస్...మరి నీ ఫ్యామిలీ సంగతి.

భాను...మా రూపాల్లో నేను బ్రతికే ఉన్నాను అని అర్థం అయింది .తను అక్కడ నా ఫ్యామిలీ తో ఉంటాడు అని అన్నాడు..

విశ్వాస్ సరే అయితే ఈ దారిలో మలుపు తీసుకోవడం కుదరదు ముందుకు వెళ్లడం మాత్రమే ఉన్న చివరి అవకాశం . పద అని భాను తో అన్నాడు...

భాను సరే అని విశ్వాస్ తో కలిసి అడుగు ముందుకు వేశాడు...ఇద్దరు ఆ పరమశివుని నివాసం అయిన హిమాలయ పర్వతాల కు ప్రయాణం మొదలు పెట్టారు... [Image: images-2022-12-04-T225430-878.jpg]

వీరి ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ లోకేశ్వరుడికి ప్రార్థించారు....

... బేతంచర్ల భాను ఇంకా అతని ఇద్దరు స్నేహితులను వదిలేస్తూ తేజ్ వాళ్ళ నాన్న రేయ్ మీరు కుర్రోళ్ళు చాలా జీవితం ఉంది . ఇలా పాడు చేసుకోకండి .మీరు కూడా నా తేజ్ లాగే నాకు కొడుకులతో సమానం వెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి వదిలేశాడు....వాళ్ళు ముగ్గురు క్షణం కూడా ఆలోచించకుండా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు..

రామాచారి కుటుంబం కూడా నవ దంపతుల తో అక్కడ నిద్ర చేయించి తిరిగి ఊరికి ప్రయాణం అయ్యారు...

విశ్వాస్ ఇంకా భాను హిమాలయ పర్వతాల వైపు ప్రయాణం మొదలు పెట్టారు...అయితే ........


నిధి రహస్యం...అంతు చిక్కని కథ....(దైవ కార్యం పూర్తి చేయడం అంత సులువు కాదు)....

                      THE -END
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 13 users Like Jani fucker's post
Like Reply
అప్డేట్ బాగుంది, బాగా ముగించారు
[+] 1 user Likes ramd420's post
Like Reply
(04-12-2022, 11:09 PM)Jani fucker Wrote: కథ లో నిధి కోసం కేవలం విశ్వాస్ ఒక్కడే ట్రై చేస్తూ ఉన్నట్టు ఉంది . మొదటి నుండి చివరి వరకు.. మరి ఇంక ఎవరు ట్రై చెయ్యలేదా అంటే
Nice Story, Jani F garu !!!
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Gd mrng ... Hi all thank you so much for your compliment
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Fantastic మిత్రమా..... 

ఎప్పటి లాగే చాలా చక్కగా సన్నివేశాలను ఆనుకులించావు.

ఇదే ముగింపా?

కథ ఇంకా ఉందా...?
[+] 1 user Likes Haran000's post
Like Reply
(05-12-2022, 09:30 AM)ITACHI639 Wrote: Fantastic మిత్రమా..... 

ఎప్పటి లాగే చాలా చక్కగా సన్నివేశాలను ఆనుకులించావు.

ఇదే ముగింపా?

కథ ఇంకా ఉందా...?

ముగింపు పలుకుతున్న ఒక వేళ ఫ్యూచర్ లో రాయాలి అనుకుంటే అప్పుడు చూస్తాను.. నిధి కోసం ఇంకో ముఖ్య వ్యక్తి ప్రయత్నం చేశాడు కదా... నంబియార్...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 2 users Like Jani fucker's post
Like Reply
(05-12-2022, 10:38 AM)Jani fucker Wrote: ముగింపు పలుకుతున్న ఒక వేళ ఫ్యూచర్ లో రాయాలి అనుకుంటే అప్పుడు చూస్తాను.. నిధి కోసం ఇంకో ముఖ్య వ్యక్తి ప్రయత్నం చేశాడు కదా... నంబియార్...

Ok mitrama 

Thelsa naa KSN kuda ee month end avuthundi 
[+] 1 user Likes Haran000's post
Like Reply
(05-12-2022, 10:45 AM)ITACHI639 Wrote: Ok mitrama 

Thelsa naa KSN kuda ee month end avuthundi 

ఆపు...ఆపు...ఆపు... నువ్వు అది end చేస్తూనే ఉన్నావ్ one month నుండి.  
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
(05-12-2022, 11:33 AM)Jani fucker Wrote: ఆపు...ఆపు...ఆపు... నువ్వు అది end చేస్తూనే ఉన్నావ్ one month నుండి.  

Ala antav em bro
[+] 1 user Likes Haran000's post
Like Reply
The true MAN REALLY you make a big difference in this site the story telling is awesome

నిధి రహస్యం...అంతు చిక్కని కథ....(దైవ కార్యం పూర్తి చేయడం అంత సులువు కాదు).

No words to say about the update and the last chapter was super excited for the next part దైవ కార్యం పూర్తి చేయడం అంత సులువు కాదు?

Really it's making interesting and eagerly looking for your future plans
ALL THE BEST FOR YOUR FUTURE STORY LINE UPDATES

YOUR FOLLOWER MURALI
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
(05-12-2022, 11:33 PM)Muralimm Wrote: The true MAN REALLY you make a big difference in this site the story telling is awesome

నిధి రహస్యం...అంతు చిక్కని కథ....(దైవ కార్యం పూర్తి చేయడం అంత సులువు కాదు).

No words to say about the update and the last chapter was super excited for the next part  దైవ కార్యం పూర్తి చేయడం అంత సులువు కాదు?

Really it's making interesting and eagerly looking for your future plans
ALL THE BEST FOR YOUR FUTURE STORY LINE UPDATES

                             YOUR FOLLOWER MURALI

Gd mrng...

No words to say your support...

Present ఈ స్టోరీ లో నిధి కనిపెట్టడం దానిని హిమాలయ పర్వతాల కు తీసుకుని వెళ్ళే ప్రయాణం మొదలు అయ్యింది.. ఇది ఇక్కడికి ముగింపు....

దైవ కార్యం నీ అడ్డుకుంటూ విశ్వాస్ కి ఎదురు అయ్యే సమస్యలు గురించి ఆలోచిస్తే .. ఉదాహరణ కి నంబియార్ వంశం..

ఛాన్స్ ఉన్నాయి ఈ స్టోరీ సీజన్ 6 రావడానికి .కానీ ఎప్పుడూ అనేది చెప్పలేను.. plz support me like this till the end..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 3 users Like Jani fucker's post
Like Reply
(06-12-2022, 06:33 AM)Jani fucker Wrote: Gd mrng...

No words to say your support...

Present ఈ స్టోరీ లో నిధి కనిపెట్టడం దానిని హిమాలయ పర్వతాల కు తీసుకుని వెళ్ళే ప్రయాణం మొదలు అయ్యింది.. ఇది ఇక్కడికి ముగింపు....

దైవ కార్యం నీ అడ్డుకుంటూ విశ్వాస్ కి ఎదురు అయ్యే సమస్యలు గురించి ఆలోచిస్తే .. ఉదాహరణ కి నంబియార్ వంశం..

ఛాన్స్ ఉన్నాయి ఈ స్టోరీ సీజన్ 6 రావడానికి .కానీ ఎప్పుడూ అనేది చెప్పలేను.. plz support me like this till the end..



నువ్వు ఇంకా రాయాలి మిత్రమా, ఈ adventurous story నీ నీకు వీలు ఉన్నప్పుడు కొనసాగించు. 

మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది నీకు.

నీ మిగతా కథలు కూడా ఇంతే జోష్ తో రాస్తావని ఆశిస్తూ మీ అభిమాని,
[+] 3 users Like Haran000's post
Like Reply
Nice Story & Nice Ending  clps clps clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
I think One of the Best Story in Xossipy Stories List  Shy
[+] 1 user Likes sri7869's post
Like Reply
(06-12-2022, 11:49 AM)ITACHI639 Wrote: నువ్వు ఇంకా రాయాలి మిత్రమా, ఈ adventurous story నీ నీకు వీలు ఉన్నప్పుడు కొనసాగించు. 

మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది నీకు.

నీ మిగతా కథలు కూడా ఇంతే జోష్ తో రాస్తావని ఆశిస్తూ మీ అభిమాని,

మీ లాంటి వాళ్ళకి జస్ట్ థాంక్స్ అని చెప్పి సరి పెట్టుకోవడం చిన్న మాట అది.. కానీ నేను మీ కోసం చేయగలిగేది.మంచి కథలు రాయడం మాత్రమే.. once again thank you so much... Namaskar
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
(06-12-2022, 12:29 PM)sri7869 Wrote: I think One of the Best Story in Xossipy Stories List  Shy

Thank you so much.. Sri గారు .. I hope NAA migilina కధలను కూడా ఇలాగే ప్రోత్సహించడం జరుగుతుంది అని భావిస్తూ . 

ఇప్పటికీ నిధి రహస్యం కి ముగింపు...

కుదిరితే ఆ అమూల్యమైన వస్తువులు వాటి గమ్యానికి చేరకుండా ఆపే ప్రయత్నం చేసే వాటి గురించి సీజన్ 6 తో మీ ముందు ఉంటాను...

అప్పటి వరకు ఈ కథకు సెలవు... Namaskar
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
(06-12-2022, 01:31 PM)Jani fucker Wrote: Thank you so much.. Sri గారు .. I hope NAA migilina కధలను కూడా ఇలాగే ప్రోత్సహించడం జరుగుతుంది అని భావిస్తూ . 

ఇప్పటికీ నిధి రహస్యం కి ముగింపు...

కుదిరితే ఆ అమూల్యమైన వస్తువులు వాటి గమ్యానికి చేరకుండా ఆపే ప్రయత్నం చేసే వాటి గురించి సీజన్ 6 తో మీ ముందు ఉంటాను...

అప్పటి వరకు ఈ కథకు సెలవు... Namaskar
Ok Sir, Please Continue Sir,
We will wait for your Marvelous Season - 6 Story Updates  horseride
[+] 2 users Like sri7869's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)