Poll: Story ela vundi
You do not have permission to vote in this poll.
Super
92.86%
13 92.86%
Avarage
7.14%
1 7.14%
Total 14 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శైలు సంజు ల ♥️లవ్ స్టోరీ
#41
Brick 
ఆదిత్య శైలుని హాస్పిటల్ లో చూపించికొని ఇంటికి  తీసుకొని వెళ్తాడు. తనుకు  మత్తు మందు ఇవ్వడం వల్ల శైలు అలాగే నిద్రలో ఉంటుంది.  ఆదిత్య శైలును తిసుకపోయి తన బెడ్ మీద పడుకోబెడతాడు.

అందరూ శైలు చుట్టూ ఆదిత్య  చుట్టూ చేరి శైలు పరిస్థితిని చూసి అందరూ ఏడుస్తుంటారు. ఆదిత్య పై అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఏమైందిరా శైలుకు ఎందుకు అలా ఉంది అని అడుగుతుంది ఆదిత్య వాళ్ళ నాయనమ్మ తులసమ్మ. ఆదిత్య భయపడాల్సిందేం నానమ్మ  తనకు మత్తు మందు ఇవ్వడం వల్ల తను నిద్రపోతుందని చెప్తాడు. భయపడాల్సింది ఏం లేదంటావ్ ఏందిరా? శైలు పరిస్థితి ఆలా ఉంటే అని అంటుంది రుక్మిణమ్మ ఆదిత్య వాళ్ళ అమ్మ. అమ్మ నేను  శైలుని హాస్పిటల్ లో చూపించుకొని వస్తున్నాను తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పాడు.ఆదిత్య నువ్వు వెళ్లే ఫ్రెష్ అప్  అవ్వు అని చెప్తాడు వాళ్ళ బాబాయ్ మధుసూదన్. ఆదిత్య తన రూముకి వెళ్తాడు తనతో పాటే ఆమని కూడా వెళుతుంది. ఏంటండీ అలా ఉన్నారు నిజంగా  శైలు కి ఏం కాలేదు కదా అని అడుగుతుంది ఆమని. ఆదిత్య ఆమని తో ఏం కాలేదా భయపడాల్సిందే ఏం లేదని చెప్తాడు.  మరి మీరు ఎందుకండి అలా ఉన్నారు అని అడుగుతుంది ఆదిత్యను ఆమని. శైలుని  అ పరిస్థితిలో చూసి నాకు భయమేసింది ఆమని. అసలు శైలు మనకు  దక్కుతుందా లేదా అనిపించింది. శైలుకి ఏమన్నా అయితే మన ఇంట్లో పరిస్థితి ఏంటి అని భయమేసింది.ఆదిత్య ఏడుపు ఆపుకోలేక ఆమని ని హత్తుకుని ఏడ్చేస్తాడు. ఏం కాదులే ఆదిత్య ఇప్పుడు మన శైలు మన దగ్గరకు వచ్చింది కదా ఇకనుంచి చాలా జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్తుంది  ఆమని.

ఆదిత్య అసలు శైలు ఎక్కడుందో నీకు ఎలా తెలిసిందని అడుగుతుంది ఆమని. సంజు వల్లే అని చెప్తాడు.ఈ విషయంలో సంజు లేకపోతే నేను ఏం చేసే వాడిని కూడా నాకు తెలియదు. సంజు లేకుంటే ఈరోజు  మన ఇంట్లో  పరిస్థితి ఎంటో ఊహించుకుంటేనే చాలా భయంకరంగా అని ఉంది చెప్తాడు ఆదిత్య. సంజయ్ కి చాలా థాంక్స్ చెప్పాలి అని అంటుంది ఆమని. టవల్ ఇచ్చి మీరు ఫ్రెష్ ఐ రండి నేను వంట ప్రిపేర్ చేస్తాను అని అంటుంది ఆమని.సరే అని బాత్రూంలోకి వెళ్తాడు ఆదిత్య. ఆమని కూడా వెళ్లి వంట ప్రిపేర్ చేస్తుంది. ఆదిత్య ఫ్రెష్ అయ్యి రాగానే అందరినీ తినడానికి రమ్మని చెప్తుంది ఆమని. రుక్మిణి నేను తర్వాత తింటాను అని చెప్తారు. ఆమని అందరికీ భోజనాలు వడ్డించి తను కూడా తినేస్తుంది. ఆ తర్వాత రుక్మిణమ్మ కోసం ఆమని ప్లేట్లో భోజనం వడ్డించి తన  దగ్గరికి తీసుకొని వెళుతుంది. నాకు ఇప్పుడు తినాలని  లేదు అని అంటుంది రుక్మిణమ్మ.
అత్తయ్య  అందరూ తిన్నారు.  మీరు తినకుంటే నీరసం వస్తుంది మీరు ఇప్పుడు తినాలి అని కలిపి తినిపిస్తుంది ఆమని. రుక్మిణమ్మ తిన్నాక ఆమని కిచెన్ అంతా సర్దుతుంది. తులసమ్మ, రుక్మిణమ్మ, చందు, పృద్వి, విజయ్, అజయ్,  శైలు రూంలో పడుకుంటారు.మిగతా వాళ్లంతా ఎవరి రూములకు వాళ్ళు వెళ్ళిపోతారు.



అందరూ పడుకున్నాక. అర్ధరాత్రి ఒకటిన్నర(01:30)  సమయంలో  చందకు బాగా దాహం నిద్రలేస్తాడు. ఆ రూమ్ లోనే నీళ్ల కోసం వెతుకుతాడు కానీ అక్కడ నీళ్ళు ఉండవు. నీళ్లు తాగడానికి చందు కిందికి వస్తాడు. నీళ్లు తాగి పైకి వెళ్ళేటప్పుడు  శైలు బాల్కనీలో ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది చందు కి. ఒక్కడే వెళ్లి రిస్కు తీసుకోవడం ఇష్టం లేక   అన్నయ్యకు చెబుదామని పైకి వెళ్తాడు. పైకి వెళ్లి ఆదిత్య వాళ్ళ డోర్ కొడతాడు ఆదిత్య తలుపు తీసి ఏంటి చందు ఈ టైంలో ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. అన్నయ్య నాకు నీళ్ళు దాహం వేసే కిందికి వెళ్లి నీరు తాగి పైకి వస్తున్నప్పుడు.

 శైలు బాల్కనీలో ఎవరో ఉన్నట్టు కనిపించారు అన్నయ్య అని చెప్తాడు. ఇద్దరు వెళ్లి అక్కడ చూసేసరికి ఎవరు కనిపించరు. ఆదిత్య కూడా ఎందుకు అనుమానం గా ఉంటది.

 శైలును  ఆదిత్యని ఆస్పటల్ నుండి ఇంటికి పంపించి అక్కడి నుండి సంజయ్ ఇంటికి తిరిగి వస్తాడు. సంజయ్ కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఆలోచిస్తూ ఉంటాడు.  శైలుకు భాటియాకు సంబంధమేంటి. అయినా శైలును చంపాల్సిన అవసరం భాటియాకేంటి ఎంత ఆలోచించినా అసలు ఏమి అర్థం కాదు.  సంజయ్ కి శైలు చాలా నచ్చేస్తుంది. శైలుకు ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కుందామని ఆయన ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదులే అని అనుకుంటాడు.మళ్లీ కళ్ళు మూసుకున్న శైలు  ముఖమే గుర్తొస్తుంది. నిద్రపోతున్న శైలు ముఖం గుర్తుకు రాగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సంజయ్ కి.నిద్రపోవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ సంజయ్ కి నిద్ర పట్టడం లేదు. శైలు ముఖమే పదేేేే పదే గుర్తుకొస్తుందిి సంజయ్ కి.తప్పురా సంజయ్ తను నీ ఫ్రెండ్ చెల్లెలు అని అనుకుంటాడు.  అలా అలా ఆలోచిస్తూనే ఎప్పుడో  నిద్రలోకి   జారుకుంటాడు.

నెక్స్ట్ డే సెక్యూరిటీ అధికారి  స్టేషన్లో ఆదిత్య ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు.అక్కడికి వచ్చిన సంజయ్ అది గమనించి ఏమైందిరా ఆదిత్య  అని అడుగుతాడు. అవును అడగటం మర్చిపోయాను అసలు శైలు కీ  ఎలా ఉంది ఇప్పుడు.పరవాలేదు రా మార్నింగ్  లేచింది  ఏదో కొద్దిగా తినింది అని చెప్తాడు. అవును నువ్వు దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ ఏంది అని అడుగుతాడు.  ఆదిత్య రాత్రి జరిగింది మొత్తం చెప్తాడు. శైలుకు అలా అయ్యేసరికి చందు భయపడి ఉంటాడు అందుకే బాల్కనీలో ఎవరో ఉన్నట్టు అనిపించి ఉంటది అంటాడు సంజయ్. లేదురా నాకెందుకు అనుమానంగా ఉంది అని అంటాడు ఆదిత్య. అలాంటిదేమీ ఉండదు లేరా  ఈసారి జరిగితే చూద్దాంలే నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిద్దామని చెప్తాడు.  సంజయ్ మాటలు విని పనిలో పడిపోతాడు ఆదిత్య.




 ఆరోజు రాత్రి సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి మాధవరావు గారు శైలునిి  అసలు ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు. నేను కాలేజ్ అయిపోయాక క్యాబ్ బుక్ చేసుకొని అక్కడే నిలబడ్డాను క్యాబ్ వచ్చాక ఎక్కి ఇంటికి బయలుదేరాను. కొద్ది దూరం వచ్చాక డ్రైవర్ వేరే రూట్ లో పోనిచ్చాడు. ఇటు ఎందుకు  పోనిస్తున్నావ్ అని  డ్రైవర్ని అడిగాను. ఇలా వెళ్తే కూడా మీ ఇల్లు వస్తుందమ్మా అని చెప్పాడు. నాకెందుకు అనుమానంగా ఉండి ఫోన్ తీసి మీకు ఫోన్ చేద్దామని చేస్తున్నాను అప్పుడే వాడు నా ఫోన్ తీసుకొని బయటకు విసిరేశాడు. నాకు కోపం వచ్చి నేను వాని కొడుతున్నాను. వెనక నుండి ఎవరో దేనితో గుచ్చారు. ఎమ్మటే నేను స్పృహ తప్పి కోల్పోయాను  తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు నాన్న మళ్లీ చూస్తే  మన ఇంట్లో ఉన్నాను.

 నీకు డ్రైవర్ మొఖం ఏమైనా గుర్తుందా రా అని అడుగుతాడు ఆదిత్య. లేదు  అన్నయ్య  అతను ముఖానికి  స్కార్ కట్టుకున్నాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు అన్నయ్య అని  చెప్తది శైలు. పోనీ కార్ నెంబర్ ఏమైనా చూశావా అని అడుగుతాడు ఆదిత్య లేదు అన్నయ్య అని చెప్తుంది. ఇక చేసేది ఏం లేక జాగ్రత్తగా  ఉండు శైలు అని చెప్తాడు ఆదిత్య. ఎవరి జోలికి పోమాకు  ఇకనుండి స్కూటీ వద్దు అని చెప్తాడు.  ఎవరో ఒకరు నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి పికప్ చేసుకుంటామని చెప్తాడు ఆదిత్య. అన్నయ్య ప్లీజ్ ఒక్కసారి అలా జరిగిందని మళ్లీ మళ్లీ అలా ఏం జరగదు నేను స్కూటీ మీదనే వెళ్తాను అని  అంటుంది శైలు. వద్దు అమ్మ అన్నయ్య చెప్పింది  కొన్ని రోజులు విను  శైలు వాళ్ళ నాన్నగారు మాధవరావు గారు శైలు ను బుజ్జగిస్తాడు  సరే నాన్న మీరు అన్నయ్య చెప్పినట్టే వింటాను అని అంటుంది శైలు.  నా తల్లి బంగారం అని మధుసూదన్ రావు ముద్దు చేస్తాడు.

 తర్వాత అందరు పడుకోవడానికి వెళ్తారు. ఆమని ఈరోజు నువ్వు అమ్మతో పాటే అమ్మ రూములో పడుకో అని చెప్తాడు. ఏ ఏమైందో ఆదిత్య ఎందుకు అని అడుగుతుంది ఆమని నేను నీకు తర్వాత చెప్తాను ఆమని అని అంటాడు. రుక్మిణి ఆమని ఒక రూమ్ లో పడుకుంటారు. విజయ్ చందు రూమ్ లో పడుకుంటాడు. మాధవరావు గారిని పురుద్వీరంలో పడుకో ఉంటాడు. లైట్ల ఆఫ్ చేసి బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తారు. ఎవరు రూములోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు.



ఆదిత్య కైతే ధైర్యం చెప్పాడు కానీ సంజయ్ కి ఎందుకో తేడాగా  అనిపిస్తది. నిద్ర పట్టక  ఏదో ఆలోచిస్తూ గన్ తీసుకొని బైక్ వేసుకొని  ఎక్కడికో వెళ్తాడు.

  ఆదిత్య, చందు, అజయ్  శైలు తో పాటు శైలు రూమ్ లోనే పడుకున్నట్టుగా నటిస్తారు.సరిగ్గా నిన్న వచ్చిన ఒకటిన్నర(01:30) సమయంలోనే  ఎవడో నచిన  అడుగుల సౌండ్ వస్తాది. వీళ్ళ ముగ్గురు జాగ్రత్తగా ఉంటారు. వచ్చినవాడు శైలు రూమ్ వైపు  అడుగులు వేస్తూ  వస్తూ ఉంటాడు ఆ సమయంలో నే లైట్ వేస్తాడు ఆదిత్య. లైట్ వెలిగింది చూసి వాడు కిందికి దూకి పారిపోతుంటాడు. చందును  శైలు దగ్గర ఉండమని చెప్పి ఆదిత్య అజయ్ వాడి వెంట పరిగెత్తుతారు వెళ్తారు .అలా పరిగెత్తు  పరిగెత్తుతో వెళ్తున్న  వాడు ఒక్కసారిగా కింద పడిపోతాడు.ఎదురుగా సంజయ్ ఉంటాడు సంజయ్ చేతిలో గన్ను కూడాా ఉంటుంది. ఆదిత్య సంజయ్ ని ఆ టైంలో చూసి షాక్ అవుతాడు. అలా  శైలు కోసం వచ్చిన వాడు దొరుకుతాడు కానీ స్పృహలో ఉండడు.



ఏం జరిగిందో నెక్స్ట్ అప్డేట్ లో తెలుసుకుందాం.......





 కథ చదివి లైక్ గాని కామెంట్ గాని చేయవలసిందిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

కథ ఎలా ఉందో  చెప్పండి. ఏమైనా చేంజ్ చేసుకోవాలా చెప్పండి.......
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 8 users Like ANUMAY1206's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
బాగుంది మిత్రమా నీ కధాగమనం

కాకపోతే, కొద్దిగా వివరంగా వ్రాస్తే స్పష్టంగా ఉంటుంది, పాఠక మితృలకు.

కొద్దిగా భాష సరిచూడగలవని మనవి.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#43
Nice thriller
Like Reply
#44
Nice update
Like Reply
#45
Katha super gaa undi
Like Reply
#46
Nice sir please update sir
Like Reply
#47
Nice Update
Like Reply




Users browsing this thread: 3 Guest(s)