Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
50.36%
281 50.36%
వొద్దు
15.77%
88 15.77%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
33.87%
189 33.87%
Total 558 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 66 Vote(s) - 3.09 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
E 69

Inkaa comments chesthu chinna aasha nu pettukunnanduku 
Already na daggara unna story ni modify chesi post chesthunna 
Next update eppudo teleedu but idi satisfy chesthundi anukuntunna

మేడం అలా ముద్దు పెడుతూ తను కూడా అటు వైపు చూసింది. అక్కడ మామ తనని చూస్తూ ఉండడం చూడగానే షాక్ అయ్యి నా నుండి విడిపోయింది. 

నేను, మేడం మామ ను అలాగే చూస్తూ ఉండగా నాకు మెలుకువ వచ్చింది. మెలుకు రాగానే చుట్టూ చూసా. అంతా మాములుగానే ఉంది. మేడం బెడ్ మీద పడుకుని ఉంది. నేను కాస్త ఊపిరి పీల్చుకుంటూ జరిగింది గుర్తు తెచ్చుకున్నా. మేడం అలా ప్రవర్తించడం, ఇంకా మామ ముందు నాకు అలా ముద్దు పెట్టడం గుర్తు రాగానే కాస్త ఇబ్బంది గా అనిపించింది. 
అప్పటికీ అనుకుంటూనే ఉన్నా ఇదేంటి ఇంత ఘోరంగా జరుగుతుంది ఏంటి అని. కల కాబట్టి అలా జరిగింది నిజంగా జరుగుతుందా ఏంటి అని అనుకుని తిరిగి అటు వైపు పడుకున్న మేడం వైపు  చూసా. మేడం ప్రశాంతంగా పడుకుని ఉంది. తనని చూస్తూ ఆలోచనలలో పడిపోయా. ఒకవేళ మేడం కానీ ఇప్పుడు లేస్తే కల లో లాగా నాతో ప్రవర్తిస్తుందా ? అని అనిపించింది. అబ్బే మరీ అలా చుట్టూ గమనించకుండా ప్రవర్తించదు లే అని మళ్ళీ నాకు నేనే అనుకుని సరిపెట్టుకున్నా.
అలా కాసేపు గడిచింది. నిద్ర రావడం లేదు. చుట్టూ చూస్తూ మళ్ళీ ఆలోచనలలో పడిపోయా. ఇందాక అలా మళ్ళీ జరదగు లే అని సరిపెట్టుకున్నా కానీ ఎందుకో నాకు కాస్త భయం పట్టుకున్నట్లు అనిపించింది. జరిగిన విశయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆ భయం నిజమే అనిపించింది. అప్పుడు రోడ్ మీద బస్స్తాడ్ లో నాకోసం గొడవ పడింది గుర్తు రాగానే 
తను ఇప్పుడు గానీ లేస్తే నిజంగా ఎదో ఒక సమయాన నాతో అలాగే దగ్గరయ్యే అవకాశమే కనిపించింది నాకు. మామయ్య కానీ మా ఇద్దరి మధ్య ఆ సన్నిహిత్యం చూస్తే కష్టమే కదా అని అనిపించింది. మళ్ళీ అంతలోనే అలా ఎందుకు జరుగుతుంది లే అని అనుకున్నా. కానీ ఆ ఆలోచనలు నన్ను వొదలడం లేదు. అలా నా ఆలోచనలతో నేనే గొడవ పడుతూ తెల్లవారెంత వరకు పడుకోలేదు.  
పొద్దున అవుతుండగా బిందు లేచింది. నన్ను, నా కళ్ళను చూసి ఏంటి పడుకొలేదా అంది. నేను అవును కాదు అన్నట్లు తల ఊపాను. బిందు లేచి నా దగ్గరికి వస్తూ, తను లేస్తే ఎక్కడికీ పోదు లే కాసేపు పడుకో అంటూ నా తల నిమిరి బాత్రూం వైపు వెళ్ళింది. నేను తననే చూస్తూ మనసులో అనుకున్నా ఎదో ఒకటి చేయాలి అని.
కాసేపటికి బిందు వచ్చింది. నేను తనని చూసి చిన్న స్మైల్ ఇచ్చా. బిందు నవ్వుతూ దగ్గరికి వచ్చింది. నేను పైకి లేచి నీతో మాట్లాడాలి అన్నా. బిందు ఏంటి అంది. నేను అప్పుడే నిద్ర లో నుండి లేచిన సిద్దు నాన్న ను చూసా. సిద్దు నాన్న లేచి మమ్మలని చూసి స్మైల్ ఇచ్చాడు. మేము తిరిగి స్మైల్ ఇచ్చాం. బిందు నన్ను చూసి ఏంటి విశయం అన్నట్లు సైగ చేసింది. నేను పద అలా బయటకు వెళ్దాం అని అన్నా. సిద్దు నాన్న తో కాఫీ తాగొస్తం అని చెప్పేసి కింద ఉన్న కేఫ్ దగ్గరికి వచ్చాం. 
కూర్చుని కాఫీ ఆర్డర్ చేసి ఏంటి సార్ అంత సీక్రెట్ చెప్పండి అంది బిందు. నేను మొదలు పెడుతూ, బిందు నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్నా.
బిందు : దేనికి అంది. నేను మెల్లగా నిన్న రాత్రి జరిగిన కల ను  చెప్పడం మొదలు పెట్టా. అంతా విన్న బిందు ఇప్పుడు సంధ్య లేస్తే నీతో అలా ప్రవర్తించి, వినీల్ (సిద్దు నాన్న) కు దొరికితే ఎలా అనే గా అంటున్నావ్ అంది. నేను హ్మ్మ్ అన్నా. బిందు నా వైపు చూసి ఇది నిన్న నే గా మనం డిస్కస్ చేశాం అలా ఎం జరగదు నువ్వు కాస్త కంట్రోల్ లో ఉంటే అని అనుకున్నాం గా అంది. నేను బిందు ను చూస్తూ అది కాదు అంటూ చెప్పడం మొదలు పెట్టా. నేను చెప్పింది మొత్తం విని చివరికి బిందు అయిష్టం గానే సరే అంది. 
ఆరోజే నాకు పని ఉంది అని సిద్దు నాన్న కు చెప్పేసి ఇంటికి బయలు దేరా. హారిక సిద్దు లు బిందు తో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగారు. బిందు అంతా మంచికే లే అంది. 
ఆరోజు సాయంత్రం మేడం కు మెలుకువ వచ్చింది. లేవగానే అయోమయంగా చుట్టూ చూసింది. బిందు దగ్గరకు వస్తూ మేడం ను పలకరించింది. మేడం కు చిన్నగా జరిగింది గుర్తు రాసాగింది. బిందు మేడం లేస్తే భరత్ ఎక్కడా అని గోల పెడుతోంది ఏమో అని అనుకుంది. కానీ మరీ బిందు ఊహించనంతగా అయితే మేడం రియాక్ట్ కాలేదు. మామూలుగానే కనిపించింది. దాంతో బిందు కు మేడం పై మెడిసిన్ ప్రభావం బాగా చూపించింది, తను ఇప్పుడు అప్పట్లా గా లేదు, కాస్త మెరుగయ్యింది అని అర్దం అయ్యింది. బిందు తను చేయబోయే పని చాలా వరకు తగ్గిపోయింది అని కాస్త సంతోషించింది. అంతలో మేడం కోలుకుంది అని తెలిసిన సిద్దు నాన్న కూడా తన దగ్గరికి వచ్చాడు. హారిక, సిద్దు, సిద్దు నాన్న బిందు నలుగురు కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నా మేడం కు ఎదో లోటు అనిపించింది. తన భర్త ముందు భరత్ ను అడగడం ఎందుకు లే అని సైలెంట్ అయిపోయింది.

(మరుసటి రోజు)
బిందు ఇంట్లో...
మేడం : (కాస్త గట్టిగా) వాడు వచ్చాడు అని నాకు ఎందుకు చెప్పలేదు.
బిందు : అప్పటికే నీ పరిస్థితి బాగోలేదు. మళ్ళీ వాడి గురించి చెప్తే డిస్ట్రబ్ అవుతావు అని చెప్పలేదు
మేడం : అబద్దం. నా వరకు వచ్చిన వాడు నేను కొలుకునెంత వరకు ఎందుకు ఆగలేదు ? ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పు. అసలు వాడే వెళ్లిపోయాడా ? లేక నువ్వే పంపించావా? చెప్పు, చెప్పు, అంటూ గట్టిగా అరిచింది.
బిందు మళ్ళీ మేడం అప్పటిలాగే పిచ్చి గా అరవడం  గమనించి ఎందుకు అలా అడిగిందే అడిగి అడిగి విసిగిస్తావ్. ఇలా విసిగించే గా వాడిని దూరం చేసుకున్నావ్ అంది. 
మేడం అర్దం కాక నేను విసిగించానా ? అంది. 
బిందు : చెప్తే అర్దం చేసుకో. ఆ క్షణం లో నువ్వు ఎలా ప్రవర్తించావో నీకే గుర్తు లేదు. రోడ్ మీద ఎవడినో ఆపి వాడినే భరత్ అనుకున్నావ్
 వాడితో నీ శరీరం అప్పగిస్తా అంటూ పిచ్చి మాటలు మాట్లాడావు. భరత్ కోసం పిచ్చి దానిలా అయ్యావ్. ఎవరు ఏంటి అనేదే లేకుండా ఎది పడితే అది మాట్లాడుతూ పిచ్చి దానిలా ప్రవర్తించావ్. అదంతా నీకు గుర్తు లేదేమో మాకు బాగా గుర్తు ఉంది. 
మేడం : అయితే మరి నా ఆ పిచ్చి తగ్గడానికి వాడిని నా దగ్గరికి తీసుకు రావాలే కానీ, ఎందుకు దగ్గరుండి నువ్వే వాడిని పంపించే సావ్ ? మొన్నే గా నీ దగ్గరకు వచ్చి వాడు లేకుంటే నేను ఉండలేను నాకోసం వాడిని నన్ను కలుపు అని చెప్పింది. ఆరోజు ఒప్పుకున్నట్లు ఒప్పుకుని, మళ్ళీ నేను స్పృహ లో లేనప్పుడు వాడిని వెనక్కు పంపిస్తావా ? నా ముందేమో మమ్మల్ని కలిపెలా, వెనుకేమో మమ్మల్ని విడదీసేలా నాటకం ఆడుతున్నావా ? (కోపంగా)
బిందు : ఎందుకు ఎం జరిగిందో తెలుసుకోకుండా ఆ భరత్ గాడి లాగే ఊరికే వాగుతావ్ ?
మేడం : (కోపంగా చూసింది)
బిందు : చెప్పేది వినవా ? వాడితో తిరిగి తిరిగి వాడి లాగే తయారు అయ్యావ్. కాస్త అవతల వాళ్ళు చెప్పేది కూడా విను అంది మనసులో తను దారిలోకి వస్తుంది లే అని సంతోష పడుతూ..
మేడం : ఏంటి చెప్పు అన్నట్లు చూసింది
బిందు : నువ్వు హాస్పిటల్ లో జాయిన్ కాక ముందు నువ్వు ఎలా ప్రవర్తించావో నీకు తెలీదు. ఒక పిచ్చి దానిలా చేశావ్. నిజంగా ఒకవేళ భరత్ గాడే గానీ నీ దగ్గరికే వచ్చింటే నిజం చెప్తున్నా నీ వొళ్ళు తెలీకుండా వాడితో నువ్వు ఎం చేసేదానివో ఏంటో అంది.
మేడం సైలెంట్ గా వింటు ఉంది. బిందు మాట్లాడుతూ నీ పరిస్థితి నీకు అర్దం కావడం లేదు. ఇన్నాళ్ళుగా ఎదురు చూసి చూసి నీకు నీ పైనే అదుపు తప్పింది. అలా అదుపు తప్పి భరత్ తో అటు ఇటుగా ప్రవర్తిస్తే అది మా ముందు బాగుంటుంది. కానీ సమాజం లో బాగుండదు, ముఖ్యంగా మీ ఆయన ముందు అంది మేడం ను చూసి.
మేడం : అంటే ఏంటి ? నేను మా ఆయన ముందు వెళ్లి వాడిని ముద్దు పెట్టుకుంటానా ఏంటి ? అదేనా నువ్వు చెప్తున్నావ్?
బిందు : నేను అలా అనడం లేదు. ముద్దు పెట్టుకోవడం చాలా చిన్న విశయం ఎదో లా కవర్ చేయొచ్చు. కానీ నీ మీద నీకే అదుపు లేదు. అంతకు మించి ఎదో ఒకటి చేస్తావ్ అని కచ్చితంగా చెప్పగలను. నువ్వు తెలివి లో ఉండి ఆ పని చేయక పోయినా కూడా ఇంత కాలం దాచిపెట్టుకున్న బాధ ఆ రూపం లో బయటకు రావొచ్చు,  ఫిసికల్ గానే కాదు మాటల్లో కూడా రావొచ్చు. దాన్ని నువ్వు అదుపు చేయలేక పోవచ్చు.
మేడం : అందుకని వాడిని వెనక్కు పంపించేసావా ?
బిందు : నీకు ఇంత చెప్పినా అర్దం కాలేదు. 
పిచ్చి దానా, నీ పరిస్థితి ఏంటో అర్దం చేసుకో, ఒక వేళ పొరపాటునే మేము అనుకున్నది జరిగితే అప్పుడు మీ ఆయన ముందు, సమాజం ముందు నీ పరువు ఎం అవుద్ది ? అది అర్దమ్ చేసుకో. నిజమే నువ్వు ఇప్పుడు ఈ సమాజం గురించి నీ మొగుడు గురించి ఆలోచించడం లేదు కానీ, మాకు ఆ బాధ్యత ఉంది. నువ్వు అలా మీ ఆయన ముందో లేక అందరి ముందో తప్పు చేస్తే నీకొక్క దానికే దాని ఇంపాక్ట్ పడుతుంది అని అనుకోకు. చుట్టూ ఉన్న మేము కూడా సఫర్ అవుతాము.  అందుకే వాడిని పంపించేశా. నువ్వు లేచి ఎక్కడ పిచ్చి దానిలా వాడితో ప్రవర్తిస్తావో అని భయం వేసి పంపించా అంతే గానీ మిమ్మల్ని విడదీయాలని కాదు. అర్దం చేసుకో..
(సైలెంట్ అయ్యి మళ్ళీ,) మేడం : అయితే వాడిని వదిలేయమని చెప్తున్నావా ?
బిందు : లేదు అది కాదు 
మేడం : మరీ ?
బిందు : దానికో మార్గం ఉంది. కానీ నాకు నువ్వు ఒక ప్రామిస్ చేస్తేనే..
(ఆలోచిస్తూ) మేడం : ఏంటి అది ?
బిందు : నువ్వు మళ్ళీ అప్పట్లా పిచ్చిగా వాడి కోసం ప్రవర్తించ కూడదు. మళ్ళీ నా రియల్ ఫ్రెండ్ సంధ్య లా కోలుకోవాలి. నార్మల్ గా కావాలి. మళ్ళీ తన కంటి చూపు తోనే భరత్ ను ఆడించే సంధ్య కావాలి. అప్పుడే మీ ఇద్దరినీ దగ్గర చేస్తా. అంతవరకు వాడి ఊసు కూడా నీ దగ్గరికి రానివ్వను అంది. 
మేడం అంతా వింటూ సైలెంట్ అయిపోయింది. తనకు కూడా లోపల తెలుసు, తను పిచ్చి గా భరత్ కోసం ఎలా వెంపర్లాడిందో ? అందుకే బిందు తో ఎం మాట్లాడలేక పోయింది. కాసేపు అలాగే ఉండిపోయింది.
చాలాసేపటి తరువాత బిందు ఇంకేమీ మాట్లాడక పోవడం తో మేడం చిన్నగా ఇంటికి వెళ్ళిపోయింది.
బిందు తరువాత మేడం తో మాట్లాడలేదు తనకు తానే మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంది. మేడం కూడా బిందు తో మాట్లాడలేదు, ఇంట్లోనే కూర్చుని తనలో తానే ఆలోచిస్తూ గడిపింది. 
అలా రెండు రోజులు గడిచాక ఒకరోజు
ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక మేడం బిందు తో ఫోన్లో
బిందు : ఫోన్ చేసి మౌనంగా ఉంటే ఏంటి అర్దం ?
మేడం : (మౌనం)
బిందు :హెలో...
హెలో....
మేడం : (కాసేపు మౌనం తరువాత... చిన్నగా చెప్తూ...
మేడం : నువ్వు చెప్పినట్లే ఉంటా.
బిందు : ఏంటి ? (అర్దం కనట్లు)
 మేడం : (కాస్త గట్టిగా చెప్తూ ) నువ్వు చెప్పినట్లే నడుచుకుంటా, మళ్ళీ అలా పిచ్చి పట్టినట్లు చేయను..
 బిందు :  త్వరగానే మార్పు వచ్చిందే అని అనుకుంటూ, మనసులోనే భరత్ కు ఈ ప్లాన్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పుకుంటూ) కాసేపట్లో ఇంటికి వస్తా కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేసింది..

రెండు వారాల తరువాత
భరత్ ఇంట్లో...
నేను టిఫిన్ చేస్తూ ఉండగా మా అమ్మ ఫోన్ రింగ్ అయ్యింది. మా అమ్మ వెళ్లి చూసింది. మీ మామ చేస్తున్నాడు రా అంది కాల్ లిఫ్ట్ చేస్తూ. నేను మనసులో అనుకున్నట్లుగానే జరుగుతుంది లే అని సంబర పడిపోయాను. అంతలో నాకు కూడా కాల్ వచ్చింది. చూస్తే బిందు. నేను ఫోన్ లిఫ్ట్ చేసి ప్లేట్ తీసుకుని నా రూం లోకి వెళ్ళా. 
బిందు : ఏంటి ? సిద్దంగా ఉన్నావా 
భరత్ : దీని కోసమే గా ఇన్నాళ్లూ ఎదురు చూసింది.
బిందు : మీ మామ కాల్ చేశాడా ?
భరత్ : చేశాడు ఇప్పుడే. అమ్మ మాట్లాడుతుంది. 
బిందు : అవునా 
భరత్ : ఎలా ఉంది తను ?
బిందు : అబ్బా ఇన్నాళ్లకు బాగానే అడిగావే ?
రేపు వస్తుంది గా నువ్వే చూసుకో..
భరత్ : కాస్త భయంగా ఉంది.
బిందు : ఎందుకు ? నిన్నెం కొరకదు లే. భయపడకు
భరత్ : అది కాదు. ఎన్నాళ్ళు అయ్యింది అస్సలు ? బాగా అంటే ఎప్పుడో ఎగ్జామ్స్ అప్పుడు మాట్లాడాం.  ఇన్నాళ్ళు అయ్యింది అస్సలు ఒక్క సారి కూడా మళ్ళీ అలా ప్రేమగా మాట్లాడుకోలేదు. 
బిందు : మాట్లాడుదువులే రేపు వస్తుంది గా 
భరత్ : ఏమో ? కాస్త ఎలాగో ఉంది నాకు.
బిందు : ఇక్కడ తను కూడా నాకు అలాగే చెప్పింది.
భరత్ : (తన మాట రాగానే ఎక్సైట్ అవుతూ) ఏమంది? ఎం చెప్పింది అన్నా.
బిందు : ఆహా, చెప్పేస్తారు.. నువ్వే చూసుకో రేపు ఎం అవుద్దో అంటూ ఉండగా మా అమ్మ లోపలికి వచ్చింది. నేను ఫోన్ పక్కన పెట్టేస్తూ అమ్మ వైపు చూసా.

అమ్మ ఫోన్ ఇచ్చింది మాట్లాడమని. నేను ఫోన్ తీసుకున్నా. మామ మాట్లాడుతూ చాలా సేపు సాగదీసి చివరికి చెప్పాడు. మీ అత్త రేపు ఇంటికి వస్తుంది కాస్త చూసుకో. బిందు చెప్పింది తను కాస్త మెంటల్ గా స్ట్రాంగ్ గా లేదు, కాస్త నేచర్ తో ఉంటే బాగుంటుంది అని. అప్పుడే ఐడియా వచ్చింది పల్లెటూరి కంటే గొప్పగా ఎక్కడుంటుంది ? అని అందుకే వెంటనే అనుకున్నాం. నువ్వు కూడా తనని మన పొలాల వెంట మామిడి తోటల వెంట తిప్పు. అంటూ చెప్తుంటే నేను చూసుకుంటా కద మామ ఇంత చెప్పాలా అని అన్నా. మా అమ్మ ఫోన్ తీసుకుని మాట్లాడుతూ మేము ఊరు వెళ్ళినా కూడా వీడు ఇక్కడే ఉండి తనకు తోడుగా ఉంటాడు లే అన్నయ్యా నువ్వేం కంగారు పడకు అని అంటూ బయటకు వెళ్ళింది. 
నాకు అప్పుడే గుర్తు వచ్చింది. అవును కదా ఇంట్లో ఎవ్వరూ ఉండరు మేడం వచ్చిన తరువాత అని. అంతే నా మనసు ఇంకా ఎక్కువ సంబర పడిపోయింది. ప్లాన్ ప్రకారం అంతా నడుస్తూ మేడం మళ్ళీ మామూలు అవ్వడం తో హ్యాపీ గా అనిపించింది. మరుసటి రోజు మేడం రాబోతుంది అనే ఆలోచనకే నాకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎన్నాళ్ళు అయ్యింది అస్సలు సరిగ్గా మాట్లాడుకుని ? తను వస్తె ముందు ఎం మాట్లాడాలి ? ఎలా మాట్లాడాలి ? ముందు అసలు నేను మాట్లాడాలా? తానే మాట్లాడుతుందా ? మాట్లాడితే ఎం మాట్లాడుతుంది ? కోపం ఏమైనా చూపిస్తుందా ఇన్నాళ్లు మాట్లాడనందుకు ? ఇలా ఏవేవో ఆలోచనల మధ్య నిద్ర ఎప్పుడో తెల్లారే టప్పుడు వచ్చింది. 

పొద్దున అమ్మ లేపుతుంటే మెలుకువ వచ్చింది. రేయ్ మొద్దు, లెయ్ రా మీ అత్త ను తీసుకురావాలి అని అంటుంటే నిద్ర మత్తులో ఉన్న నేను వెంటనే ఆక్టివ్ అయిపోయా. లేచి అమ్మ ముందు మామూలుగా నటిస్తూ పో మా ఆమెకు తెలీదా ఏంటి మన ఇల్లు వస్తుందిలే అని అన్నా. అమ్మ కోపంగా చూసి ఎంటి అలాగేనా అతిథులను గౌరవించింది ? అంటూ ఇంకేదో అనబోతు ఉంటే నేను ఆపేయి, వెళ్తాలే ఇక ఆపు అన్నా. అంతలో వంటింట్లో కుక్కర్ సౌండ్ వస్తే వెళ్తూ, ఇంకో అరగంట లో బస్ వచ్చేస్తుంది, మీ అత్త ఒక్కతే వస్తుంది అంట, నువ్వే దగ్గరుండి ఆ వూరు నుండి తీసుకు రావాల్సిన వాడివి తప్పించుకున్నావ్, కనీసం ఇక్కడ వరకు వచ్చిన తనని అయినా వెళ్లి తీసుకు రా, త్వరగా రెడీ అయ్యి బస్ స్టాండ్ లో వెయిట్ చేయి అంటూ వెళ్ళిపోయింది. నేను టైం చూసా. ఈ లోపల పక్కురు దగ్గరికి వచ్చే ఉంటుంది మేడం అని అనుకుంటూ ఫాస్ట్ గా రెడీ అవ్వడం మొదలు పెట్టా.  బైక్ తీసుకుని మేడం ను పిక్ చేసుకోవడానికి వెళ్తుంటే అమ్మ వచ్చి లగేజ్ ముందర పెట్టుకో, వెనుక తను కూర్చుని పట్టుకోలేదు అని అంటుంటే తెలుసు లే తల్లీ అన్నట్లుగా చూసి అక్కడి నుండి కదిలా..

చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న క్షణం కాసేపట్లో రాబోతుంది అని అనుకుంటూ బస్ స్టాండ్ కు వెళ్ళా.
బస్ స్టాండ్ కు ఎదురుగా బైక్ నిలబెట్టి దాని పైనే కూర్చుని  ఎదురు చూస్తూ ఉండగా కాసేపటికి రానే వచ్చింది. నేను ఎదురు చూస్తున్న బస్. బస్ రాగానే ఎదో ఉత్సాహం. ఉత్సాహం తో పాటు గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలు అయ్యింది. అంతలో బస్ వచ్చి ఆగింది. నేను ఉన్న వైపు కాకుండా బస్ కు అటు వైపు ఉంది బస్ డోర్. జనాలు దిగుతున్నట్లు ఉన్నారు. మేడం దిగిందో లేదో అనుకుంటూ ఉండగా బస్ కదిలింది. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. బస్ ఇంకో అర క్షణం లో పూర్తిగా వెళ్ళిపోతుంది. బస్ అవతల నిల్చున్న వాళ్ళని చూడడానికి ఇంకో అర క్షణం మాత్రమే ఉంది. మేడం ఉందో లేదో ? ఉంటే నన్ను చూసి ఎం అంటుంది ? ఎలా చూస్తుంది ? అసలు చూస్తుందా ? లేదా ? అసలు వచ్చింటుందా? ఇలా ఆ క్షణం లోనే అన్ని ప్రశ్న లు నా మదిలో మెదులుతూ ఉండగా అప్పుడే బస్ వెళ్ళిపోయి నా కంటికి అవతల ఉన్న వాళ్ళు కనిపించారు.
ఎదురుగా మేడం..
మనసులో ఎదో పులకరింత..
మనసులో ఇంతసేపు ఉన్న టెన్షన్ లేదు. ఎదో లోపల తెలీక అయినట్లు అనిపించింది. తనని ఇలా చూడక చాలా రోజులు అయ్యింది. ఎదో ఫోన్ లో మాట్లాడుతూ అటు వైపు చూస్తున్న మేడం నే చూస్తూ ఉండిపోయా. మేడం నా వైపు కాకుండా బస్ వెళ్లిపోయిన వైపు చూస్తూ ఉంది. ఎందుకు అంటే ఆ సైడ్ నుండే నేను కూడా రావాల్సింది. నా కోసమే చూస్తుంది అనే ఆలోచన రాగానే నాకు ఒక్కసారిగా పట్టరాని సంతోషం వేసింది. చివరి సారి చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది తనలో. తను అప్పట్లో ఎలా ఉండేదో అలా కనిపిస్తుంది ఇప్పుడు. తను చాలా వరకే కోలుకుంది అని బిందు చెప్పింది గుర్తు వచ్చింది. నాకు తనని చూస్తుంటే ఎందుకో పూర్తిగా మళ్ళీ మామూలు అయినట్లు అనిపించింది. మేడం నాకోసమే అటు ఇటు చూస్తూ ఉంది. నా పక్కన ఆటో లు నిలబడి ఉండడం వల్ల నన్ను పెద్దగా గమనించ లేదు. నేను కూడా కావాలనే కాస్త కనిపించనట్లు గా అడ్జస్ట్ చేసుకుని ఉన్నా. తను అమాయకమైన ముఖం తో ఫోన్ లో ఎదో గెలుకుతూ మళ్ళీ అంతలోనే తలెత్తి నేను రావాల్సిన రోడ్ వైపు చూస్తూ ఉంది.  నేను ఇంకాసేపు అలాగే తనివి తీరా చూసుకుందాం లే అని అలాగే ఉండిపోయా. మేడం అక్కడ ఫోన్ ను విసుగ్గా లోపల పెట్టుకుంటు నేను ఇంకా రాలేదెం అని నేను రావాల్సిన వైపు చూస్తూ ఉంది. నేను ఇంకా రాలేదు అన్న ఫ్రస్ట్రేషన్ తన ముఖం లో కనిపిస్తూ ఉంది. నేను చిన్నగా నవ్వుకుంటూ అలాగే చూస్తూ ఉన్నా. ఇంకో ఐదు నిమిషాలు గడిచింది. మేడం అక్కడక్కడే తచ్చాడుతూ ఎంట్రెన్స్ రోడ్ వైపు చూస్తూ ఉంది నా కోసం. తన ముఖం లో కాస్త అలకతో కూడిన కోపం కనిపించింది. నేను వీడి కోసం ఇంత దూరం వచ్చినా వీడు మాత్రం చుడు ఇదే ఊరిలో ఉండి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది ఏమో అని అనిపించింది నాకు. అలా అలకతో మేడం కొప్పడడం చూసి చాలా రోజులు అయ్యింది. మేడం అలా ముద్దుగా అలిగి ఫోన్ తీసుకుంది. తీసుకుని ఎదో నంబర్ టైప్ చేసి ఫోన్ చేయబోయింది. చెవి దగ్గర పెట్టుకున్న వెంటనే మళ్ళీ కట్ చేసి రోడ్ వైపు చూసింది. ఫోన్ చేస్తుంది నాకే అని అర్దం అయ్యింది నాకు. మేడం మళ్ళీ ఫోన్ వైపు చూసి మళ్ళీ కాల్ చేసింది. అంతలోనే ఎం అనుకుందో ఏమో నోట్లో ఎదో గొణుక్కుంటూ ఫోన్ పెట్టేసింది. మేడం అలా ముద్దుగా నన్ను తిడుతూ గొణుక్కుంటూ ఉంటే నేను నవ్వుకున్నా. అలా నవ్వుకుంటూ ఉండగా మేడం  అలకతో అటు ఇటు చూస్తూ ఈ సారి ఇక డైరెక్ట్ గా ఫోన్ చేసింది. వెంటనే నా ఫోన్ మోగింది. నేను ఫోన్ కట్ చేశా.  మేడం షాక్ అయ్యి ఫోన్ వైపు చూసుకొంది. ఎంటి వీడు ఇలా చేస్తున్నాడు అని. అలా ఫోన్ ను మళ్ళీ చేయబోతూ ఒకసారి ఎందుకో రోడ్ వైపు చూసింది ఏమైనా వచ్చాడేమో అని. మళ్ళీ ఫోన్ వైపు చూసి నోట్లో ఎదో గొణుక్కుంటూ అటు ఇటూ చూసింది. అలా చూడడం చూడడం నా వైపు కూడా చూసేసింది. అంతే నా గుండె ఒక్కసారిగా మళ్ళీ వేగంగా కొట్టుకుంది. మేడం అలా నన్ను నోట్లో ఎదో తిట్టుకుంటూ చూడగానే స్టన్  అయిపోయి ఆగిపోయింది. నేను మేడం ఇద్దరం అలాగే కొన్ని క్షణాలు చూసుకున్నాం. రెప్ప వేయకుండా..

 మేడం ను ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూడక చాలా రోజులు అయ్యింది. మేడం కు కూడా నన్ను చూడక చాలా రోజులే అయ్యింది. తనలో ఎదో భాగొద్వేగం కొట్టుకొస్తూ ఉన్నా కావాలనే దాన్ని గట్టిగా అదుముకుంటూ నా వంక తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది. మేడం ముఖం లో  ఎదో తెలియని ఆనందం. ఆనందం తో పాటు ఎదో బాధ ఇన్నాళ్లు ఎందుకు దూరం ఉన్నావ్ అని. తన ముఖం లో అప్పటికప్పుడే ఎన్నో మార్పులు. ఆనందం, బాధ, అలక, కోపం,  ఇలా ఎన్నో మార్పులు. తన కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని అర్దం అయ్యింది. అంతలోనే ఒక బైక్ అటు వైపు వెళ్తూ మా ఇద్దరి మధ్య ఉన్న రోడ్ పై వెళ్లి మా ఏకాగ్రత ను పాడు చేసింది. ఆ క్షణం గాప్ రాగానే మేడం అటు వైపు తిరిగింది. తన కంట్లో నీళ్ళు తెలియ కూడదు అని. నేను వెంటనే బైక్ స్టార్ట్ చేసి మేడం దగ్గరకు వెళ్ళా. మేడం నేను రావడం గమనించి వెంటనే కళ్ళు పైట తో తుడిచేసుకుని నా వంక చూడకుండా తల వంచుకుంది. నేను మేడం ముందు వెళ్లి బండి ఆపాను. మేడం లో నాలో ఇద్దరిలో ఒకటే నడుస్తుంది ఎలా మాట్లాడాలి ? ఎం మాట్లాడాలి ? అని.  
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Welcome back డోమ్ బ్రో very very happy
[+] 1 user Likes Eswar P's post
Like Reply
Thanks for update.
[+] 1 user Likes rd8022d's post
Like Reply
clps Welcome back nice emotional update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
అబ్బా.....చాలా రోజుల తరువాత ఒక మంచి అప్డేట్ ఇచ్చారు.....అదిరింది డోమ్ గారు....దీని కోసమే గా మేము ఇన్ని రోజుల నుంచి ఎదురుచూస్తుంది......
మీరు ఎప్పటికైనా అప్డేట్ ఇస్తారని ఈ స్టోరీ ని కంటిన్యూ చేస్తారు అని ఆశిస్తున్నాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar Namaskar Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Thank you dom bro.
andaru lopala lopala matladukuntaru kani miru next level bhayya avi rayadam lo.
kalipesav bhayya madam ni and bharat ni. so nice.
vilu chuskoni update ivvandi bro
[+] 1 user Likes shekhadu's post
Like Reply
Thank you so so much Dom గారు...... బాగా నచ్చింది. Heart  
మొత్తానికి ఎదురుపడ్డారు. ఏం మాట్లాడుకుంటారో? ఎలా మొదలు పెడతారో వెయిటింగ్...... Namaskar thanks
[+] 2 users Like kummun's post
Like Reply
మా మేడం ని మళ్ళీ మాకు పరిచయం చేసినందుకు చాలా చాలా థాంక్స్
King of love
[+] 1 user Likes Dsprasad's post
Like Reply
Wow baagane respond అవుతున్నారు ఇంకా 
Tq TQ 
ఇన్నాళ్లు అయినా కూడా గుర్తు పెట్టుకుని చదివినందుకు గిఫ్ట్ గా
Mi kosam ivvala inko update istha
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 4 users Like dom nic torrento's post
Like Reply
Mee story eepati guthuntundhi dom gaaru
Ela marchipotha dom gaaru
[+] 1 user Likes Varama's post
Like Reply
ఎన్నాళ్ళో వేచిన కథ. ఈ రోజే మా ముందుకు వచ్చింది. థాంక్యూ డోమ్ బాయ్.
[+] 1 user Likes rajinisaradhi7999's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
E 70

నిన్నటి నుండి తను వస్తె ఎదో మాట్లాడాలి అన్న నాకే ఇప్పుడు ఎం మాట్లాడాలో తెలీక ఊరుకుండిపొయాను. మేడం పక్కనే నిలబడి ఉంది. తనలో కూడా నాలో జరుగుతున్న సంగర్షణే జరుగుతుంది అని బాగా తెలుసు. తన మనసులో కూడా ఎదో ఒకటి మాట్లాడు రా అని నన్ను తిట్టుకుంటూ ఉంటుంది అని తెలుసు. కానీ ఎదో అడ్డు వస్తుంది మాట్లాడదాం అంటే. కొద్ది క్షణాలు గడవగానే ఇక తను మాట్లాడదు అని అర్దం అయ్యి నేను కూడా మాట్లాడలేను అని అర్దం చేసుకుని ముందు ఇంటికి వెళ్ళాక చూసుకుందాం లే అని నేల మీద ఉన్న తన బాగ్ తీసుకున్నా. తీసుకుని ముందు పెట్టుకుని తన ముఖం చూసా. మేడం సైలెంట్ గా నా బండి ఎక్కింది. ఎక్కాక మిర్రర్ లో నుండి చూసా తన ముఖం. నేను మాట్లాడ నందుకు చిరు కోపం తో ఉన్నట్లు అనిపించింది. నాకు తెలుసు తన మనసులో ఏమనుకుంటుందో. ఇన్నాళ్లు అయ్యింది, ఇంత దూరం వచ్చాను కనీసం నోరు తెరిచి మాట్లాడి కావొచ్చు కదా వీడు అని అనుకుంటూ ఉంది అని తెలుసు. కానీ నేనే చూద్దాం ఇంకెంత సేపు అలా ఉంటుందో అని ఆగిపోయాను. మధ్య మధ్యలో మేడం ముఖం మిర్రర్ లో చూస్తూ ఇంటికి వచ్చేసా. ఇంటికి రాగానే మేడం సైలెంట్ గా దిగేసి నా వంక చూసింది. నేను చూడకుండానే తన బాగ్ ను కింద పెట్టేసా. మేడం పంది అని తిట్టినట్లు అన్నట్లు అనిపించింది. తన ముఖం చూసా ముఖం లో ఆ భావమే కనిపించింది. నేను తల తిప్పేసుకున్నా. 

అంతలోనే మా అమ్మ వచ్చి ఏమే సంద్యా ఎలా ఉన్నావ్ అని అంటూ తనని వచ్చి పలరిస్తూ కాస్త చిక్కి పోయావే అంటూ తనని లోపలికి తీసుకు వెళ్ళింది. నేను తన బాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంటే బాగ్ లో ఎదో బుక్ లాగా కనిపించింది. ఇక్కడికి కూడా ఈ టీచరమ్మ పాఠాలు చెప్పడానికి వచ్చిందా ఎంటి ? అని అనుకుంటూ లోపలికి వెళ్ళా. వాళ్ళు ఎదో మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను బాగ్ పెట్టేసి హాల్ లోకి వెళ్ళా. మా అమ్మ మేడం కు మాటలు చెప్తూనే ఉంది. కాసేపటికి నాన్న వచ్చాడు. అత్త ను పలరించి ఎలా ఉన్నావ్ అని అంటూ ఉండగా అత్త మిగితా వాళ్ళు ఏరి అన్నయ్యా అంది. 
నాన్న : వాళ్ళు అంతా పెళ్లి కి వెళ్ళారు చెల్లెమ్మ. మేము కూడా వెళ్ళాలి కానీ నిన్ను చూడడం కంటే పెద్ద విశయం మాకు ఎం ఉంటుంది అందుకే ఆగాము అన్నాడు.
అత్త : బాగానే వేస్తావ్ అన్నయ్యా బిస్కెట్స్ 
అమ్మ : ఆయన మాటలతో ఎం కానీ నువ్వు చెప్పు, వాడితో ఉండగలవా ? లేక నేను కూడా ఇక్కడే ఉండిపోనా ? 
మేడం నా వంక ఒక చూపు చూసి, వాడేం నాకు కొత్త నా వొదినా ? మీరు అనుకున్నట్లు గానే ఇద్దరూ రేపు పెళ్లికి వెళ్ళండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి. ఇక్కడ నాకెలాంటి ఇబ్బంది లేదు ఏమైనా ఉంటే చూసుకోవడానికి వాడు ఉన్నాడు గా అంది. 
నాన్న : అంతేలే అల్లుడు అత్త ఇద్దరూ ఎంతైనా ఒకే పార్టీ కదా 
అమ్మ : ముందు టిఫిన్ చేద్దాం రండి అంటూ పిలవడం తో అందరం తినడానికి కూర్చున్నాం. 
అత్త : ఎక్కడ వొదినా పెళ్లి ?
అమ్మ : శ్రీకాకుళం
అత్త : అంత దూరమా ?
అమ్మ : అవును అందుకే రేపు పొద్దున్నే బయలు దేరుతున్నాం. వెళ్ళడానికే రోజు పడుతుంది.
అత్త : అవును నిజమే అందుకేనా వారం అన్నారు ఇందాక
అమ్మ : అలా ఎం కాదు కనీసం అంత దూరం వెళ్ళాక ఒక నాలుగు రోజులు అన్నా అక్కడ ఉండక పోతే వాళ్ళు బాధ పడతారు అందుకే
అత్త : నిజమే వొదినా
అలా మాట్లాడుకుంటూ టిఫిన్ ముగించేసాం.

మధ్యాహ్నం వరకు పెద్దగా ఎం జరగలేదు. 
నేను కూడా బయట పని ఉండడం తో వెళ్ళాను. తినడానికి ఇంటికి వచ్చాక. ఇంట్లో మా అమ్మ పడుకుని ఉంది. నేను కాళ్ళు కడుక్కుని మా అమ్మను అన్నం పెట్టమని లేపబోతూ ఉంటే అంత వరకు నన్నే దూరంగా నిలబడి అబ్జర్వ్ చేస్తున్న మేడం ఇక వీడు మాట్లాడే లాగా లేడు అని అనుకుని మధ్యలో కలుగ చేసుకుంటూ లేపకు నేను పెడతా అంది మెల్లగా. నేను తన వంక చూసా. బాగానే మాట్లాడుతుందే అని అనుకున్నా. మేడం రా అన్నట్లు చూసింది. నేను ఎం వద్దులే అన్నట్లుగా చూస్తూ మళ్ళీ మా అమ్మను లేపబోయా మేడం కాస్త నొక్కి చెప్తూ నీకు కాదా చెప్తుంది అంది. నేను తనని ఇంకా కాస్త రెచ్చగొడదాం అని తనని పట్టించు కొనట్లుగా కావాలనే వెళ్లి మా అమ్మను లేపా, మా అన్నం పెడుదువు రా అన్నా. మా అమ్మ నిద్ర మబ్బులో లేచి ఏందిరా? మీ అత్త ఉందిగా అంటూ అత్త వైపు చూసి సంద్యా వీడికి కాస్త పెట్టు అంది. అది విన్న మేడం నన్ను చూసింది. నన్ను ఎదో గెలిచినట్లు గా చూస్తూ నేను చెప్పా వొదినా కానీ నీ కొడుకే వినలేదు అంది. మా అమ్మ నన్ను పో మరి అన్నట్లు గా చూసి మళ్ళీ పడుకుంది. నేను మేడం ముఖం చూడకుండా కాళ్ళు టప టపా నేలకి కొడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళా. మేడం వచ్చింది. పక్కన నిలబడి ప్లేట్ పెట్టి వొడ్డించింది. తన శరీరం నుండి ఎదో కమ్మటి వాసన వస్తూ ఉంది. మనసులో కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ తన వంక చూడకుండా తినడం మొదలు పెట్టా. మేడం పక్కనే కూర్చుని నన్నే చూస్తూ ఉంది. నేను తల తిప్పి చూసా. ఎంటి అన్నట్లు. మేడం ఎం లేదు అన్నట్లు చూసింది. నేను తల దించుకుని తింటూ ఉంటే తను నవ్వినట్లు అనిపించింది ఇందాక జరిగిన దానికి. వెంటనే తలెత్తి చూసా. మేడం మామూలుగానే ఉంది. గబ గబా తినేసి వెళ్ళిపోదాం అని అనుకుంటూ తింటుంటే టేబుల్ కింద సడెన్ గా మేడం కాళ్ళు నా కాళ్ళకు తగిలాయి. వెంటనే నాకు పొర పోయింది. మేడం గబాలున లేస్తూ నా నెత్తి పై తడుతూ నీళ్ళు అందించింది. నేను తన ముఖం వైపు చూసా. తను కూడా చూసి తాగు అన్నట్లు నీళ్ళు ఇచ్చింది. నేను వెంటనే పక్కన ఉన్న ఇంకో గ్లాస్ లో నీళ్ళు పోసుకుని తాగా. మేడం అబ్బో అన్నట్లుగా చూస్తూ పక్కనే కూర్చుంది. నేను గబగబ తినేసి చేయి కడుక్కోబోయా. మేడం ఆగు నేను కూడా తినాలి అంటూ ప్లేట్ తీసుకుంది. నేను తన వంక ఇది మరీ ఓవర్ గా లేదు ? అన్నట్లుగా చూసా. తనేం పట్టించు కోకుండా అన్నం పెట్టేసుకుని తినడం మొదలు పెట్టింది. నేను తనని పట్టించు కుంటే ఇంకా ఎక్కువ చేసుద్ది అని సింక్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కున్నా. 

తిరిగి రూం లో కూర్చుని ఆలోచిస్తూ బాగానే మాట్లాడింది ముందుగా అని మనసులో నవ్వుకున్నా. ఇక నెక్స్ట్ ఎంటి ? అని ఆలోచించడం మొదలు పెట్టా. ఎందుకో మేడం ను ఇలాగే కాస్త ఆడుకుందాం అనిపించింది. 
అప్పుడే గా మేడం మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ అయ్యిందో తెలుస్తుంది అని అనుకున్నా. 
సాయంత్రం మా అమ్మ లగేజ్ సర్దుకుంటూ ఉంటే మేడం కూడా హెల్ప్ చేస్తూ ఉంది. నాన్న హాల్ లో టివి చూస్తూ ఉన్నాడు. మా అమ్మ కాస్త పైన ఉన్న లగేజ్ బాగ్ అందించ మని పిలవగానే నేను వాళ్ళు ఉన్న రూం లోకి వెళ్ళా. మేడం నన్ను ఓరగా చూసింది. అమ్మ పైన ఉన్న లగేజ్ బాగ్ ను అందుకో మనింది. నేను తీసి ఇచ్చా. మేడం సైలెంట్ గా ఉంది నన్నేం పట్టించు కొకుండా. నేను అది చూసి కావాలనే తనని రెచ్చగొడదాం అని మా అమ్మ తో అమ్మా కచ్చితంగా నువ్వే వెళ్లాలా ? నేను వెళ్తా లే నాన్న తో నువ్వు ఆంటీ ని చూసుకో ఇక్కడే ఉండి అన్నా. మా అమ్మ ఆంటీ నా ? అంది. నేను సారి సారి అత్త కదా మరిచిపోయా, అంటూ నేను చెప్పింది విని చిరు కోపంగా నా వైపు చూస్తున్న మేడం ను చూసా. 
అమ్మ నాతో నువ్వు అక్కడికి వచ్చి చేసే ఘనకార్యాలు ఎం లేవులే కానీ మూసుకుని అత్త ను చూసుకో ఇక్కడే అని అంది. నేను కానీ అని అంటూ అత్త వంక చూసా. మేడం అది చూసి వెంటనే అమ్మ తో పోనీలే వొదినా వెళ్లనీ నేను కావాలంటే ఒంటరిగా అయినా ఉంటాలే అంది. అమ్మ వెంటనే అయ్యో అలాంటిదేం లేదు లేవే వాడు ఎదో పిచ్చి వాగుడు వాగుతుంటూ ఉంటాడు వాడిని పట్టించు కోకు అంది కళ్లతోనే ఏంట్రా తన ముందు అన్నట్లుగా చూసి. అంతలో నాన్న బయట నుండి పిలిచాడు. వెంటనే వస్తున్నా అంటూ నన్ను మేడం కు బట్టలు సర్దడం లో హెల్ప్ చేయమని చెప్పి వెళ్ళింది అమ్మ
ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం రూం లో. తను సైలెంట్ గా బట్టలు మడత పెడుతూ ఉంది. నేను కూడా సైలెంట్ గా చూస్తూ ఉన్నా. నెమ్మదిగా దగ్గరకు వెళ్ళా. మేడం తలెత్తి చూసింది. నేను మామూలుగానే చూసా. మేడం బెడ్ మీద కూర్చుని నా ముఖం లోకి తదేకంగా చూస్తూ ఉంది. నేను కాస్త ఇబ్బందిగా జరిగా. మేడం మళ్ళీ తల కిందికి వంచి బట్టలు మడత పెడుతూ ఉంది. తను మడత పెట్టిన బట్టలను తీసి బాగ్ లో సర్దుతూ ఉన్నా. అలా సైలెంట్ గా జరుగుతూ ఉండగా అప్పుడే పొరపాటున తన చేతి వేలు నా చేతికి తాకింది. అంతే వెంటనే కాస్త పక్కకు జరిగా. మేడం ఇదేంటి అన్నట్లుగా చూసింది. తను చూడగానే నేను లేచి అక్కడ నుండి వచ్చేసా. మేడం లోపలే ఉండిపోయింది. 

రాత్రి డిన్నర్ చేస్తుండగా మేడం నా ఎదురుగానే కూర్చుని మధ్య మధ్య లో నన్నే చూస్తూ తింటుంది. పక్కనే ఉన్న మా అమ్మ ఏమైంది మీ ఇద్దరికీ ? అంది. నేను ఎం అయ్యింది అని చూసా. మా అమ్మ నాన్న వంక చూసి గమనించావా ? అస్సలు వీళ్ళు వచ్చినప్పటి నుండి సరిగా మాట్లాడుకోనే లేదు అంది. అది విని మా నాన్న కూడా కదా అంటూ నా వంక మేడం వంక చూసి ఏమైంది మీకు? అన్నాడు. అలా అంటూ వాడేమో (మేడం భర్త) ఇద్దరూ కలిస్తే అసలు లోకమే మరిచిపోయి కబుర్లు చెప్పుకుంటారు అని అన్నాడు. కనీసం మాట్లాడుకోవడం కూడా లేదు మీరు అన్నాడు. నేను ఎం పలకలేదు. వెంటనే మేడం కల్పించుకుని అదేం లేదు అన్నయ్యా ఇన్నాళ్లు నేను బిజీ గా ఉండి వాడు నాకు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు అని కోపం అంతే అన్నాడు. దానికి మా అమ్మ అవునా అంది నన్ను చూసి. నేను తల ఎత్తకుండా ఏమో అన్నా ముభావంగా. దాంతో మా ఇద్దరి మధ్యలో ఇంకేదో జరిగింది అని అన్న సందేహం వాళ్ళలో మొదలు కాబోయెంత లోనే కావాలని మేడం టాపిక్ మార్చింది. మా సిద్దు కూడా అంతే రెండు రోజులు పనిలో పడి మాట్లాడక పోతే చాలు ఇలాగే అలిగేవాడు అంది. అలా అనగానే మా నాన్న అంతేలే బెస్ట్ ఫ్రెండ్ కదా అవే అలవాట్లు వచ్చింటాయి అన్నాడు. 

పొద్దున త్వరగా వెళ్ళాలి అని మా అమ్మా నాన్న త్వరగా తినేసి పడుకున్నారు. నేను చల్ల గాలి కోసం టెర్రర్స్ మీదికి వెళ్ళాను. చల్లగా గాలి పీల్చుకుంటూ మేడం గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అంతలో వెనుక ఎదో శబ్దం. చూస్తే మేడం నన్నే చూస్తూ ఉంది. చంద్రుడి వెలుగులో మెరుస్తూ కనిపించింది. నన్నే కోపంగా చూస్తూ నీ కాళ్ళు ఏమైనా పట్టుకోవాలా నువ్వు క్షమించడానికి ? అంది కోపంగా. నేను ఎం పలకకుండా కిందికి వెళ్ళడానికి మెట్ల దగ్గరికి వచ్చా. మెట్లు దిగబోతూ ఉంటే నా చేతిని మేడం పట్టుకుంది. నేను తిరిగి చూసా. మేడం కోపంగా చూస్తుంది. మనసులో ఎన్నాళ్ళయింది ఇలా తనని చూసి అని ఆనందపడ్డా. మేడం కోపంగా ఇక ఓవర్ యాక్షన్ ఆపుతావా ? అంది. నేను కోపంగా తన వంక చూసా. మేడం నేను ఏమైనా అంటానేమో అని చూసింది. నేను తన చేతిని విడిపించుకుని మేడం ను చూస్తూ ఇదేం నీ ఇల్లు కాదు నువ్వు ఆడించినట్లు ఆడడానికి అన్నా. మేడం సైలెంట్ అయిపోయింది. నేను కోపంగా నడుచుకుంటూ కిందికి వెళ్ళా. వెళ్తుంటే నా పిర్ర పై ఎదో గట్టిగా వచ్చి తగిలింది. చూస్తే మేడం తన చెప్పు ను తీసి నా పిర్ర పైకి విసిరింది అని అర్దం అయ్యింది. కోపంగా మేడం వంక చూసా. మేడం నాకు వినిపించనంత చిన్నగా ఎదో గొణుక్కుంటూ నా వంకే కోపంగా చూస్తుంది. నేను తిరిగి కిందికి వచ్చేసా. 

మనసులో నవ్వుకుంటూ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇలా అని పోయి పడుకున్నా. చాలా సేపు అయ్యింది నిద్ర పట్టడం లేదు. లేచి హాల్ లోకి వెళ్తుంటే మేడం ఎం చేస్తుందో చూద్దాం అని అనిపించింది. వెంటనే తన రూం దగ్గరకు వెళ్ళా. చూస్తే అప్పుడే ఎదో రాసి బుక్ ను బాగ్ లో పెట్టుకుంటు కనిపించింది. అప్పుడు అర్దం అయ్యింది అది డైరీ అని. అబ్బో ఇలాంటివి కూడా ఉన్నాయా అని అనుకుంటూ తను పడుకున్నాక ఏముందో చదువుదాం అని హాల్ లోకి వెళ్లి కూర్చున్నా. 

చాలా సేపటి తరువాత తన రూం లోకి వెళ్ళా. మేడం బెడ్ మీద పడుకుని ఉంది. నిద్ర లో తన ముఖం చాలా బాగుంది. అలాగే చూస్తూ కాసేపు వరకు వచ్చిన పనెంటో కూడా మరిచిపోయా. తరువాత మేడం కాస్త కదలడం తో వెంటనే నేనోచ్చిన పని గుర్తొచ్చి అక్కడ ఉన్న డైరీ నీ తీసుకుని నా రూం లోకి వెళ్ళా. వెళ్లి డైరీ ఓపెన్ చేయగానే మేడం ఇవ్వాళ రాసిన పేజీ ఓపెన్ అయ్యింది.

గాడిద..
పంది..
కుక్క.. పోరం బోకు, చెత్త వెధవ, పోకిరి..
నిన్ను తిట్టడానికి నా దగ్గర భూతులు కూడా లేదు చెత్త వెధవ. మా ఇంటికి రాకపోవా ? అప్పుడు చెప్తా కాళ్ళూ చేతులు కట్టేసి నిన్నూ నీ కొవ్వునూ అనిచేస్తా..
వెధవ..
పొద్దున నుండి చూస్తున్నా, ఇది ఇంత దూరం వచ్చింది. పాపం మన కోసమే కదా అని అనుకోవచ్చు గా 
ఎంత కొవ్వు ఎంత కొవ్వు..
మామూలుగా లేదు నీకు..
ఉంటావు గా వారం నాతోనే. నీకు చూపిస్తా నేను ఏంటో
చత్త వెధవ
నా వేలు తగిలితేనే అంత ఏడ్చావ్ సాయంత్రం, మరి అప్పుట్లో నాకు ఏదేదో ఎక్కడెక్కడో తగిలించావు నేను ఎవడికి చెప్పుకోవాలి ? చెత్త వెధవ..
పంది..
సన్నాసి..
రోగ్...
నేనే వచ్చా గా అందుకే చులకన అయ్యా నీకు 
అని రాసింది చదువుతూ నవ్వుకుంటూ ఉండగా అప్పుడే నా చేతిలో డైరీ ఎవరో లాక్కున్నారు. 
చూస్తే మేడం..
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
అద్భుతం డోమ్ బ్రో అందుకే మీ కథ అంటే పిచ్చ ఇష్టం మాకు.
[+] 3 users Like Eswar P's post
Like Reply
Mi Katha kosam enthaga vechi chusamo antha manchi update icharu
[+] 1 user Likes Venky248's post
Like Reply
Edhi kadha maaku kaavalaindi entha kaalam iendi
[+] 2 users Like Venky248's post
Like Reply
బేసిక్ గా అమ్మాయిలు ఇలా అబ్బాయిలని ఏడిపిస్తూ వుంటారు....కానీ ఇక్కడ భారత్ మేడం ని ఇలా ఆటపట్టిస్తుంటే భలే వుంది ...మంచి సీన్ దగ్గర స్టోరీ ఆపారు...ఇది చాలా అన్యాయం అండి....మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.......
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 4 users Like Thorlove's post
Like Reply
Malli story continue chesinaduku Santosham. Me update chala bagundi. Meru starting lo story elanti feeling carry chesaro same alage malli ippudu anipinchindi. Meru malli story continue chestaru ani asistunna
[+] 2 users Like Gurughost's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
wow malli gilli kajjalu start between madam n bharath.
superb dom bro
[+] 2 users Like shekhadu's post
Like Reply




Users browsing this thread: 9 Guest(s)