Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
మహీ మహీ ...... మన రాజ్యానికి వచ్చేసాము కళ్ళు తెరువవే ఇంకా నగ్నంగా ఉన్నావు అంటూ మంజరి తన రెక్కలతో నా దేవకన్య ముఖంపై నీటిని చిలకరించింది .
మ్మ్మ్ ...... అంటూ కళ్ళుతెరిచిచూస్తే నదీ ఒడ్డున వెదురుబొంగుల చాపపై పూల దుప్పటి కప్పుకున్న నా గుండెలపైన ఉంది - చీకట్లు నెమ్మదిగా వెలుతురు సంతరించుకుంటున్న సమయం - ఎదురుగా రాజమందిర ఉద్యానవనానికి చేరుకునే రహస్య ద్వారం - అంటే నదీ అమ్మ చేర్చారన్నమాట - అయ్యో ఇంకా ఇద్దరమూ నగ్నంగా ఉన్నాము అంటూ లేచిచూస్తే ప్రక్కనే చాపపై వస్త్రాలు ఉన్నాయి - అమ్మా ఉమ్మా అంటూ పెదాలపై చిరునవ్వుతో వస్త్రాలు వేసుకుని నా గుండెలపైకి చేరింది .
వీరా - ప్రభూ - దేవుడా ...... సూర్యోదయ సమయానికల్లా నన్ను రాజ్యానికి చేర్చాలి మరిచిపోయారా ? .
లేదు లేదు మహీ అంటూ కళ్ళుతెరిచి లెవబోయి చిరునవ్వులు చిందిస్తున్న నా దేవకన్యను చూసి ప్రేమతో హత్తుకుని లేచికూర్చున్నాను - చీకటి వెళ్లిపోతోంది మన్నించు మహీ ....... ఘాడమైన నిద్రపోయాను .......
మహి : దేవుడా దేవుడా ...... చూసుకోండి చూసుకోండి , మీవొంటిపై వస్త్రాలు లేవు అంటూ ఏమీ ఎరుగనట్లు కళ్ళు మూసుకుని నవ్వుకుంటోంది .
వెంటనే ప్రక్కనున్న పూలను అడ్డుగా ఉంచుకున్నాను - ప్రక్కనే వస్త్రాలు ఉండటం చూసి , మహీ ....... కళ్ళు తెరవకు అంటూ లేచి వేసుకున్నాను - ఇక కళ్ళు తెరవవచ్చు ....... గత మూడు రోజులుగా చూస్తున్నాను ఇదేవరుస , రాత్రికి వస్త్రాలతోనే ...... కాదు కాదు చీకటిపడగానే ఏదో అవుతోంది ఉదయం మాత్రం ఇలా నేనుమాత్రమే నగ్నంగా ........ ఏదో జరిగింది ఏమి జరిగిందబ్బా , ఏమాత్రం గుర్తుకరావడం లేదు ఎందుకు మహీ ........ , వద్దులే చెమట అంటూ ఏదో చెబుతావు , నేనే తెలుసుకుంటాను - రాత్రి నిన్ను ఎత్తుకుని నదీఅమ్మ జన్మస్థానానికి చేరుకుని దేవత పాదాలచెంత అమృతం లాంటి నీరు సేవించాము అంతే ఇక ఏమాత్రం గుర్తులేదు ....... , తరువాత ఆలోచిస్తాను ముందైతే నా దేవకన్యను తన రాజ్యానికి చేర్చాలి .
మహి : నా రాజ్యం కాదు మన రాజ్యం , నేటి సాయంత్రానికి రాజ్యానికి రాజు కాబోతున్నారు .
నా దేవకన్య చెప్పినట్లుగా జరగాలని అమ్మవారిని ప్రార్ధిస్తాను .
నాతోపాటు నా దేవకన్య ప్రార్థించింది .
కళ్ళుతెరిచిచూస్తే ఎదురుగా రహస్యద్వారం - మహీ ........
మహి : అవును దేవుడా ...... , రాత్రికిరాత్రి మన నదీ అమ్మ ఈ చాపలో మనల్ని ఇక్కడకు చేర్చారు , అదిగో మన మిత్రుడు అక్కడ ఉన్నాడు - మంజరి ...... ఇక్కడికి ఎవరూ రాకుండా ఆకాశంలో కాపు కాస్తోంది .
బందిపోట్ల స్థావరాన్ని దాటుకుని - పెద్ద చిన్న రెండు జలపాతాలు దూకి ...... మనల్ని జాగ్రత్తగా ఇక్కడకు చేర్చారన్నమాట , నాకైతే ఏదీ గుర్తులేదు మహీ ...... , సూర్యోదయానికి ఇంకా సమయం ఉందికాబట్టి నదీఅమ్మఒడిలోకి చేరి ఆలోచిస్తాను - అమ్మకూడా తనవంతు సహాయం చేస్తారు ........
అంతలో ఎటునుండి పడ్డదో నదీప్రవాహానికి అటువైపు పిడుగుపడి రెండు మూడు చెట్లు కాలిపోతున్నాయి .
దేవుడా అంటూ భయంతో నా గుండెలపైకి చేరింది .
మహిని రెండుచేతులతో కౌగిలించుకుని , మిత్రమా జాగ్రత్త - మంజరీ మంజరీ ..... ఎక్కడ ఉన్నావు అంటూ పైకిచూస్తూ కంగారుపడసాగాను .
ప్రభూ ప్రభూ అంటూ ఎగురుకుంటూ వచ్చి నా భుజంపైకి చేరింది .
మంజరీ ...... నీకేమీ కాలేదుకదా అంటూ వేలిపై అందుకుని పరిశీలనగా చూసి ముద్దుపెట్టి , మహికి అందించాను .
మంజరి : ఏమీకాలేదు ప్రభూ ....... , ఎటునుండి పడ్డతో చూసేలోపు ఇలా జరిగిపోయింది .
మహీ మహీ ....... అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ముద్దులతో శాంతిoపచేసాను.
మహి : నాకు నాదేవుడితో వందేళ్లు జీవించాలని ఉంది - మంజరీ మంజరీ అంటూ నా గుండెలపై ఒదిగిపోయింది .
సంతోషించి , ఏమీకాలేదుగా మహీ .......
మహి : ఆకాశంలో మబ్బులు లేవు - వర్షం పడటం లేదు , ఏదో కీడు సంకిస్తోంది దేవుడా .......
అలాంటిదేమీ జరగదులే మహీ .......
మహి : ఇలా జరగరాని విపరీతాలు ఏవైనా సంభవిస్తే మా సామంత రాజ్యంలో ఉన్న అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లేవారు అమ్మ - పూజ కూడా జరిపించేవారు , తొలిసారి నా దేవుడిని చూయించారే ఆ ఆలయంలో ........
నా దేవకన్య ప్రార్థించే దేవాలయం నాకు తెలియదా ..... , నా దేవకన్య సంతోషం కోసం అమ్మవారి చెంతకు తీసుకెళ్లనా ? .
మహి : స్వయంవరం కోసం సిద్ధం చెయ్యడానికని నా మందిరానికి ఈపాటికే బయలుదేరి ఉంటారు అమ్మ , కాబట్టి నాకు వీలుకాదు , నా తరుపున నా దేవుడు దర్శించుకుంటే .......
తప్పకుండా తప్పకుండా మహీ ....... , సూర్యవందనం ముగించుకుని నేరుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటాను , అలాగే నా దేవకన్య స్వయంవరానికి సులభమైన ప్రవేశం ఇప్పించమని కూడా ప్రార్ధిస్తాను .
మహి పెదాలపై సంతోషం .......
నా దేవకన్య ఎల్లప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి .
మంజరి : మహీ ...... నువ్వు దైర్యంగా ఉండు - మన ప్రభువు వెంట నేను వెళతానులే ........
మహి : వచ్చిందమ్మా ధైర్యవంతురాలు అంటూ నవ్వుకుంది , సరే అయితే నా దేవుడిని ....... నా స్వయంవరానికి క్షేమంగా తీసుకురా అంటూ ముద్దుపెట్టింది .
నవ్వుకుని , మహీ ...... సూర్యోదయం లోపు నిన్ను ఉద్యానవనానికి చేరుస్తాను అంటూ రహస్య ద్వారం వైపుకు నడిచాను .
మహి : ఎత్తుకోవచ్చు కదా ...... , అన్నీ చెప్పాలి దేవుడికి అంటూ గుండెలపై ప్రేమ దెబ్బలు కురుస్తున్నాయి .
స్స్స్ స్స్స్ ....... , నా దేవకన్య తియ్యనైనకోపం చల్లారేంతవరకూ పెదాలపై ముద్దులు కురిపించి , నవ్వగానే ఒక్క క్షణం అంటూ పొదల చాటున ఉన్న రహస్య ద్వారాన్ని తెరిచి అమాంతం ఎత్తుకున్నాను .
మహి : యే యే యే అంటూ సంతోషంతో నా మెడను చుట్టేసి బుగ్గలపై ముద్దులు కురిపిస్తోంది .
నవ్వుకుని , మిత్రమా ఇక్కడే ఉండు మన యువరాణీ గారిని వదిలేసి వస్తాను .
మహి : మిత్రమా ...... రాజమందిరంలో కలుద్దాము .
కృష్ణ సంతోషంతో చిందులువేశాడు .
మంజరి : ప్రభూ ...... మీరు వచ్చేన్తవరకూ కృష్ణకు తోడుగా ఉంటానులే .......
మహి : ఎంతమందికి తోడుగా ఉంటావే మంజరీ ...... అంటూ నవ్వుకుని ప్రాణంలా గుండెలపైకి చేరింది .
నా దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి , జాగ్రత్తగా ద్వారం లోపలికి ప్రవేశించాను .
మహి : అమ్మో ...... కాగడా కూడా లేదు చాలా చీకటిగా ఉంది దేవుడా ......
నేను ప్రక్కన ఉంటే భయమే లేదన్నావు ......
మహి : అవునవును ..... నా దేవుడు ఉండగా నాకేంటి భయం అంటూ ముద్దులుకురిపిస్తోంది .
చిమ్మచీకటిలోనే జాగ్రత్తగా ఉద్యానవనం ద్వారం దగ్గరికి చేరుకున్నాను .
మహి మాటలు - ముద్దుల చప్పుడు విన్నట్లు , మహీ మహీ ...... వచ్చేశావా అంటూ ద్వారాన్ని తెరిచారు చెలికత్తెలు ....... , మీరు సమయానికి వస్తారని తెలిసే ఇక్కడే వేచిచూస్తున్నాము .
మహి : చాలా సంతోషం లేవే ...... , దేవుడా ...... కాస్త నెమ్మదిగా రావచ్చుకదా అంటూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
నువ్వేకదా మహీ ...... , అమ్మ వస్తూ ఉంటుంది అన్నావు అందుకే తొందరగా తీసుకొచ్చాను , ఇక వెళ్లి రాకుమారుల కోసం సిద్ధమవ్వు మరి .......
మహి : నా బుగ్గపై కొరికేసింది - కేవలం కేవలం నా వీరాధివీరుడైన దేవుడి కోసం మాత్రమే అందంగా ముస్తాబవుతాను .
చెలికత్తెలందరూ నవ్వుకున్నారు - మహీ ...... రాజమాత వచ్చే సమయం అయ్యింది - పూజా మందిరంలో ఉన్నది నువ్వుకాదు మందాకిని అని తెలిస్తే మొదటికే మోసం వస్తుంది .
మహి : ప్చ్ ...... , నా దేవుడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనే చెలికత్తెలూ ........
చెలికత్తెలు : చూస్తుంటేనే తెలిసిపోతోంది మహీ .......
మహీ ...... నేనూ ఉండలేను కానీ తప్పదు , స్వయంవర సమయానికి నా దేవకన్య కళ్ళ ముందు ఉంటానుగా అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
చెలికత్తెలు చిలిపిదనంతో నవ్వుకున్నారు .
మహి : ప్రేమతో హత్తుకునే కిందకుదిగి నాకళ్ళల్లోకే ప్రాణంలా చూస్తోంది .
మహీ ...... అంటూ బుగ్గలను అందుకుని , మనల్ని విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు నువ్వు నా సొంతం అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
మ్మ్మ్ ...... అంటూ పులకించిపోయి తనివితీరా కౌగిలించుకుని వదిలింది . ఒసేయ్ చంద్రిక ...... నేను చెప్పినవి సిద్ధం చేశారా ? .
చెలికత్తె : అన్నీ మహీ అంటూ అందించారు .
మహి : దేవుడా ...... మీకోసమే .
చూస్తే క్షత్రియులు ధరించే వస్త్రాలు - బంగారు వజ్ర వైఢూర్య మణిహార ఆభరణాలు - వజ్రాలు పొదిగిన పాదరక్షలు ....... ఒక్కటేమిటి చాలానే ఉన్నాయి , మహీ ......
మహి : నా గుండెలపైకి చేరి , నాదేవుడు ..... ఇకనుండీ యువరాజు రేపటికి రాజు కదా ...... , వీటిని ధరిస్తే మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు .
మహీ ....... అంటూ ఆనందబాస్పాలతో ఉద్వేగానికి లోనయ్యాను .
మహి : ఇవి మిత్రుడి కోసం - యువరాజు మాత్రమే కాదు యువరాజు అశ్వం కూడా యువరాజుకు సమానంగా ఉండాలి .
చంద్రిక చంద్రిక ...... మహి వచ్చేసిందా హమ్మయ్యా ...... , రాజమాత మన మందిరానికి బయలుదేరారని సమాచారం .......
మహి : పరిగెత్తుకుంటూ వచ్చేసింది అంటూ ఆ చెలికత్తెకు మొట్టికాయవేసింది , నవ్వుతున్న నా కౌగిలిని - చేతిని వదల్లేక వదల్లేక వదిలి , పరుగునవెళ్లి ప్రహరీగోడపై ఉన్న కాగడాను తీసుకొచ్చి ఇచ్చింది జాగ్రత్త అంటూ .......
చేతులు ఖాళీగా లేవు దగ్గరకు రండి యువరాణీ .......
అంతే ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
నువ్విచ్చావని తెలిస్తే కృష్ణ చాలా ఆనందిస్తాడు , ఇక స్వయంవర వస్త్రాలు - ఆభరణాలలో ....... నా మహి ఇంకెంత అందంగా ఉంటుందో అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
మహి : క్షత్రియ వస్త్రాలలో నా దేవుడు ఇంకెలా ఉంటారో - నా వీరుడికోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటాను అంటూ హృదయంపై ప్రాణమైన ముద్దుపెట్టి వదిలి , చెలికత్తెల చెంతకు చేరింది .
చెలికత్తెలు : మీరు ఆశ్చర్యపోయేలా మీ దేవకన్యను అలంకరిస్తాము ప్రభూ ...... , మీరు సంతోషంగా వెళ్ళిరండి .
మహిని ప్రేమతో చూస్తూనే వెనక్కు నడుస్తూ రహస్య ద్వారం లోపలికివెళ్ళాను .
చెలికత్తెలతోపాటు మహికూడా వచ్చి పూర్తిగా ద్వారాన్ని మూసేంతవరకూ చూస్తూనే ఉంది .
పెదాలపై చిరునవ్వులతో నా దేవకన్యనే తలుచుకుంటూ బయటకువచ్చి , ద్వారాన్ని మూసి ఎవ్వరి కంట పడకుండా పొదలను కప్పేసాను .
ప్రభూ అంటూ ఎగురుకుంటూ వచ్చి భుజంపై వాలింది మంజరి .......
మంజరీ ...... నాకు - కృష్ణ కోసం మన దేవకన్య ఏవేవి ఇచ్చిందో ......
మంజరి : చకచకా చెప్పేస్తోంది .
ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది .
మంజరి : వీటిని చెలికత్తెలతోపాటు దగ్గరుండి సిద్ధం చేయించినదే నేను - తమరితోపాటు విహారానికి వెళ్లే ముందు మహి ఎలా ఉండాలో ఆజ్ఞవేసింది , మీకోసం విలువైన వస్త్రంతో వస్త్రాలు - స్వచ్ఛమైన బంగారం వజ్రాలు మణులతో ఆభరణాలు చేయించింది .
హృదయంపై చేతినివేసుకుని మురిసిపోయాను - విన్నావా మిత్రమా ....... , మహి ఏమన్నదో తెలుసా ...... నాతో సమానంగా నిన్నూ అలంకరించమని నీకోసం కూడా పంపింది , నాతోపాటు మిత్రుడూ ఆనందిస్తున్నాడు . మిత్రమా ....... సూర్యోదయం అవుతోంది సూర్యవందనం చేసుకుని మహి కోరుకున్నట్లుగా అమ్మవారిని దర్శించుకుందాము అంటూ ప్రవాహంలోకి దిగాను , అటువైపు చెట్లు పూర్తిగా దగ్ధమైనప్పటికీ అక్కడక్కడా నిప్పుకణికలు ఉండటం చూసి మంటలు ప్రక్కనున్న చెట్లకు వ్యాపించకుండా నీటితో చల్లార్చి సూర్యవందనం చేసుకుని స్నానమాచరించాను , పైకిలేచి చూస్తే చెరొకవైపున మిత్రుడు - మంజరి కూడా జలకాలాడుతున్నారు .
తడిచిపోయిన మంజరికి ముద్దుపెట్టి మిత్రుడిపై ఉంచాను - ఒడ్డుకు చేరుకుని సాధారణ వస్త్రాలను ధరించి సామంత రాజ్యానికి బయలుదేరాము .
The following 17 users Like Mahesh.thehero's post:17 users Like Mahesh.thehero's post
• 9652138080, arkumar69, dradha, Iron man 0206, Kacha, Kumarmb, maheshvijay, Manavaadu, Naga raj, RAANAA, Rajeev j, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
మిత్రమా ...... కొన్ని ఘడియల్లో స్వయంవరం - అమ్మవారిని దర్శించుకుని మళ్లీ రాజ్యానికి రావాలి .
అలా చెప్పడం ఆలస్యం ...... వేగాన్ని అందుకున్నాడు మిత్రుడు .
మంజరీ ...... సామాన్యుడినైన నేను స్వయంవరం కోసం రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో , ఒకవేళ ప్రవేశించినా ఏ రాజ్యానికి యువరాజుని అని చెప్పాలో ఉపాయమే బోధపడటం లేదు - అక్కడేమో దేవకన్యకు మాటిచ్చేసాను స్వయంవర సమయానికి తన ముందు ఉంటానని ......
మంజరి : అమ్మవారి చెంతకు వెళుతున్నాముకదా ప్రభూ ...... , మీఇద్దరి స్వచ్ఛమైన ప్రేమను ఒక్కటి చేసేందుకైనా అమ్మవారే ఒక దారిని చూయిస్తారు పదండి .......
మా మంజరి మాటలు నిజమవ్వాలి అంటూ ముద్దుపెట్టి , రెక్కలు ఆరేంతవరకూ గట్టిగా పట్టుకోమని చెప్పి మరింత వేగంతో పోనిచ్చాను - అమ్మవారి ఆలయం చేరుకున్నాము .
మంజరితోపాటు దేవాలయపు ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ప్రశాంతంగా అనిపించింది . ప్రాంగణంలోని పూలమొక్కల నుండి అప్పుడే పూచిన పూలు కోసుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము .
అమ్మా ...... తొలిసారి మీ దర్శనం చేసుకున్నాను - ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే యువరాణిని కలిశాను , యాదృచ్చికమో మీ అనుగ్రహమో ....... ఆ క్షణమే గురువుగారి కోరిక వైపు అడుగులుపడ్డాయి .
ముందుగా మీ భక్తురాలైన్ మహి ...... తన తరుపున మీ దర్శనం చేసుకోమని నన్ను పంపినది - మహి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రార్థించాను .
అమ్మా ...... మీకు తెలియనిది కాదు ఎలాగైనా ఈ గండం గట్టెంకించాలి అంటూ మొక్కుకున్నాను - ఏ ఆటంకం రానీకుండా ప్రభువుల సమక్షంలో యువరాణి చేతిని అందుకునేలా మీరే చెయ్యాలి ........
ఆశ్చర్యంగా మంజరి తడి రెక్కలతోనే అమ్మవారి విగ్రహం భుజంపైకి చేరింది - ఏదో విన్నట్లు ....... నాదగ్గరకువచ్చి ప్రభూ నాతోపాటు రండి అంటూ బయటకు ఎగురుకుంటూ వెళ్ళింది .
అమ్మవారికి మొక్కుకుని , బయటకువెళ్లి మిత్రమా అంటూ పరుగునవెళ్లి ఎక్కి వేగంగా వెనుకే చాలాదూరం వెళ్ళాను దక్షిణం వైపుగా .......
చిరులోయ దగ్గర ఆగి నా భుజంపైకి చేరింది - ప్రభూ ...... అల్లంతదూరంలో చూడండి , నిన్నరాత్రి పడిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడటంతో రాజ్యానికి వెళ్లే ఈ మార్గం మొత్తం ఆనవాలు లేకుండా కిందకు కొట్టుకుపోయింది , ఈ దారిన స్వయంవరం కోసం ఏకంగా చిన్నపాటి సైన్యంతో పాటు వస్తున్న ఒక యువరాజు ఎటువెళ్ళాలో తెలియక ఈ దట్టమైన అరణ్యంలో రాత్రంతా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు , వీరిని చాకచక్యంగా మరొక దారివైపు మరల్చామంటే వీరి రాజ్యం తరుపున మనం దర్జాగా వెళ్లిపోవచ్చు .......
మంజరీ ....... అలా చేయడం ......
మంజరి : తప్పే కాదు ప్రభూ ....... , నిజానికి ఈ ఉపాయం ఇచ్చినది అమ్మవారే , ఎలాగో యువరాణి ..... మీకు మాత్రమే సొంతమైనప్పుడు వీరు స్వయంవరానికి వస్తే ఎంత రాకపోతే ఎంత చెప్పండి .
అంతేనంటావా మంజరీ ......
అంతే అన్నట్లు మంజరితోపాటు మిత్రుడు కూడా ఊ కొట్టాడు .
సరే అయితే సమయం లేదు పదండి , వారి రాజ్యమేదో తెలుసుకుని రాజా ముద్రిక అయిన ఉంగరాన్ని సంపాదించాలి - మంజరీ ...... అక్కడ మాత్రం నువ్వు సాధారణ చిలుకలానే ప్రవర్తించాలి సరేనా .......
మంజరి : అర్థమైంది పభూ ....... , నా పలుకులను చూసి బంధించి తీసుకెళ్లిపోతారనే కదా , అయినా కాపాడటానికి నా ప్రభువు ఉన్నారుకదా ...... , సరే సరే ఆ చిన్నపాటి సైన్యాన్ని చిత్తు చిత్తు చేసి నన్ను కాపాడగలరు కానీ ఇప్పుడు అంత సమయం లేదు కదూ ...... , అలాగే ప్రభూ ...... మీరు ఎలచెబితే అలా అంటూ తెగ మాట్లాడేస్తోంది .
పెదాలపై చిరునవ్వుతో మంజరికి ముద్దుపెట్టి విరిగిపడిన కొండ చరియల మార్గంలోనే కష్టంగా అటువైపుకు చేరుకుని , ఏమీ తెలియనట్లు ఈ అడవి గురించి నాకు తెలియదా అంటూ పాటల రూపంలో పాడుకుంటూ వారి గుండా ముందుకుపోతున్నాను .
నలుగురు సైనికులు అడ్డుగా నిలబడి , రేయ్ ...... మా యువరాజుగారు పిలుస్తున్నారు పదా అన్నారు .
పదండి అంటూ కిందకుదిగి వెనుకే వెళ్ళాను .
యువరాజు ప్రక్కన సైన్యాధ్యక్షుడు అనుకుంటాను - రేయ్ చంద్ర రాజ్యానికి వెళ్ళడానికి వీ మార్గమేమైనా ఉందా ? .
ఎందుకులేదు యువరాజావారూ ....... ఇలానే నిన్నకూడా ఒక యువరాజు ఈ మార్గంలో తప్పిపోతే సరైనమార్గంలో పంపించాను .
సైన్యాధ్యక్షుడు : అయితే తొందరగా చెప్పరా ...... , స్వయంవరానికి ఇప్పటికే ఆలస్యం అయ్యింది .
చెబితే నాకేంటి ? .
అంతే చుట్టూ కత్తులను నావైపుకు ఎక్కుపెట్టారు .
నన్ను చంపేస్తే మీకు తోవ ఎవరు చెబుతారు యువరాజా ....... , ఇటువైపుగా ఒక్క మనిషీ రాడు .
యువరాజు : ఆ రాజ్యపు అతిలోకసుందరి కోసం తప్పదు - ఏమికావాలో కోరుకో అంటూ ముందుకువచ్చాడు .
ఏమీలేదు యువరాజా ....... , ఇంతకుముందు వెళ్లిన యువరాజులానే తమరుకూడా నాకు కౌగిలింత ఇవ్వాలి , ఇద్దరు యువరాజులను కౌగిలించుకున్నానని జీవితాంతం చెప్పుకుంటాను .
యువరాజు : నీలాంటివాడితో ఇలా మాట్లాడటమే గొప్ప - వీడని చిత్రహింసలు పెట్టి శిక్షించయినా మార్గం తెలుసుకోండి .
ప్రాణం తీసినా చెప్పను యువరాజా ....... , ఇక మీఇష్టం ఎలాగైనా శిక్షించుకోండి అంటూ దైర్యంగా చేతులను విశాలంగా చాపాను .
సైన్యాధ్యక్షుడు : యువరాజా ...... సమయం పరిగెడుతోంది - మీకోరిక తీరాలంటే ఇదొక్కటే మార్గంలా ఉంది .
అవునవును ఇదొక్కటే మార్గం చిన్న కౌగిలింత , నేనేమీ ఆభరణాలు అడగలేదు .
యువరాజు : సరే మనదు వాడిని తనిఖీ చెయ్యండి .
బాటసారిని చూసే ఇంత భయపడితే ఎలా యువరాజా ...... , రండి పూర్తిగా తనిఖీ చేసుకోండి , సమయం లేదు ......
సైనికులు వచ్చి వొళ్ళంతా తడిమి ఏమీలేదు యువరాజా ......
అయినాకూడా భయపడుతూనే నన్ను కౌగిలించుకున్నాడు .
చటుక్కున ఉంగరాన్ని కొట్టేసి చాలు యువరాజా చాలు ....... , యువరాజాఈ రాజ్యం పేరు చెప్పనేలేదు , అదిగో మళ్లీ ఆలస్యం చేస్తున్నారు .......
యువరాజు : దక్షణ భారతదేశంలోనే అత్యంత ధనిక సామ్రాజ్యం " హిడుంభి రాజ్యం " ....... అంటూ గర్వపడుతూ చెప్పాడు .
హిడుంభి హిడుంభి ....... అంటూ కేకలువేశారు సైనికులు ......
హిడుంబిల్లానే ఉన్నారు అంటూ మనసులో అనుకుని నవ్వుకున్నాను . యువరాజా ....... మీరు వెళ్లాల్సిన రాజ్యం ఉత్తరం వైపు ఉంది ఈదారిన మీరువెళ్లడం అసాధ్యం కాబట్టి , అరణ్యంలో ఇటువైపు అంటే పడమరవైపుగా కొద్దిదూరం వెళితే రహదారి కనిపిస్తుంది ఆ దారిలో తూర్పువైపుగా 10 క్రోసులు వెళితే చంద్ర రాజ్యం చేరిపోతారు .
యువరాజు : స్వయంవరం సమయానికి చేరుకోగలమా ? .
ఎంతమాట యువరాజా ...... రెండు గడియల్లో చేరిపోరూ ......
యువరాజు : సైన్యాధ్యక్షా ....... వీడిని బంధించండి , వీడే మనకు మార్గం చూయిస్తాడు .
అలాచేస్తే మీకే చేటు యువరాజా ...... , మళ్లీ మీరు ఈ మార్గం ద్వారా సురక్షితంగా వెళ్ళాలా లేదా ...... ? , ఇలా కొండచరియలు విరిగిపడ్డాయని దగ్గరలోని మా రాజ్యపు ప్రభవుకు విన్నవిస్తేనేకదా మార్గాన్ని పునరుద్ధరించేది , మీరు నన్ను బంధిస్తారన్నా కూడా మీకోక సహాయం చేస్తాను , ఈల వెయ్యగానే మంజరి వచ్చి నా చేతిపై వాలింది - చిలుకా ...... వీరిని చంద్ర రాజ్యానికి సురక్షితంగా చేర్చు జాగ్రత్త - యువరాజా చిలుక వెళ్లిపోతోంది తొందరగా వెళ్ళండి అంతటి విశ్వ సుందరిని పొందాలంటే ఈమాత్రం కష్టపడాల్సిందే ....... ( నేను చేస్తున్నది కూడా అదే అంటూ నవ్వుకున్నాను ) .
సైన్యాధ్యక్షుడు : యువరాజా ...... చిలుక వెళ్లిపోతోంది , వాడిని వదిలెయ్యండి మనం గమ్యం చేరడం ముఖ్యం అంటూ బయలుదేరారు .
మంజరీ జాగ్రత్త అంటూ మనసులో తలుచుకుని , మిత్రమా ...... రాజ్యపు గుర్తింపు - రాజ ముద్రిక దొరికింది , ఇక మనల్ని స్వయంవరానికి హాజరు కానివ్వకుండా ఎవ్వరూ ఆపలేరు , అతిలోకసుందరి నా మహీ ...... వచ్చేస్తున్నాను అంటూ సామంతరాజ్యం చేరుకున్నాను .
ముందుగా నదీఅమ్మ ప్రవాహంలో స్నానమాచరించి , మహి ఇచ్చినవాటితో మొదట మిత్రుడికి రాజసం ఉట్టిపడేలా అలంకరించి అద్భుతం అంటూ ముద్దుపెట్టాను .
యువరాజు వస్త్రాలను - కంకణ ఆభరణాలను - యువరాజు తలపాగాను - ఖడ్గాన్ని ....... ఇతరత్రా అన్నింటినీ ధరించి ప్రావాహంలో నా ప్రతిబింబాన్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను , నా ముద్దుల మహికి శతకోటి ముద్దులు అంటూ మురిసిపోయాను .
నదీఅమ్మా ...... క్షత్రియ దర్పం కనిపిస్తోందా ? .
అవునన్నట్లు ఒక అల నా ఎత్తువరకూ ఎగసింది .
మాఅమ్మకు నేనంటే చాలా ఇష్టం - అమ్మా ...... అమ్మవారిని కూడా దర్శించుకుని మీ ఇద్దరి ఆశీర్వాదం మరియు గురువుగారి ఆశీస్సులతో మీ బిడ్డను జయించడానికి వెళుతున్నాను అంటూ నా విల్లును కూడా అందుకుని దేవాలయంవైపుకు నడిచాను .
దారిపొడుగునా యువరాజు యువరాజు అంటూ దండాలుపెడుతుండటం చూసి మురిసిపోయాను .
దేవాలయంలోనికి వెళ్లి అమ్మా ...... మీ ఆశీస్సులతో హిడుంభి రాజ్యపు యువరాజులా స్వయంవరానికి వెళుతున్నాను - ఏ ఆటంకాలూ కలగకుండా దీవించు తల్లీ ........
దీవించినట్లు అమ్మ చేతిలోని పువ్వు అమ్మ పాదాల చెంతకు చేరింది .
ధన్యుణ్ణి తల్లీ ధన్యుణ్ణి ....... , మీ భక్తురాలికి అందిస్తాను అంటూ పువ్వుని మరియు అమ్మవారి కుంకుమను తీసుకుని , షాష్టాంగ నమస్కారం చేసి బయటకువచ్చాను .
మిత్రమా ...... అమ్మవారి ఆశీర్వాదం లభించింది బయలుదేరుదాము - ఈపాటికి మంజరి రావాల్సిందే ......
వచ్చేసాను ప్రభూ అంటూ భుజంపైకి చేరింది - నేనురాకుండా మీరు కదలరని నాకు తెలియదా చెప్పండి .
మంజరీ ...... ఆ హిడుంబులను ఎక్కడకు చేర్చావు ? .
మంజరి : దట్టమైన కీకారణ్యంవైపుకు సాగనంపాను ప్రభూ ....... , బయటపడటానికి ఒక రోజైనా పడుతుంది , వారు దారిన పడేసరికి చీకటిపడిపోతుంది - స్వయంవరం పూర్తయిపోయి ఉంటుందని తెలుసుకుని వెనుతిరిగివెళ్లిపోతారు - ఆ హిడంభి గాడికి మన అందాలరాశి కావాలట అంటూ నవ్వుకున్నాము , ప్రభూ ...... అక్కడ మన యువరాణి ఎదురుచూస్తూ ఉంటుంది .
అవునవును అంటూ ముద్దుపెట్టి , మిత్రుడిపైకి ఎక్కాను - మిత్రమా ...... అటువైపు కాదు ఇటువైపు అని చెబుతున్నా పట్టించుకోకుండా సామంతరాజ్యం సంతలోకి తీసుకెళ్లి ఒక దుకాణం దగ్గర ఆగాడు .
మీసాలు గడ్డాలు మారువేషాల దుకాణం దగ్గర ఎందుకు ఆగావు మిత్రమా ...... ఆ.....ల.....స్యం ...... అవుతూ ...... , సరే సరే ఇప్పటికి అర్థమయ్యింది , మన గురుకుల రాజ్యపు యువరాజులు కూడా వచ్చే ఉంటారుకదూ ...... మనం మారువేషాలలో వెళ్ళాలి లేకపోతే పసిగట్టేసి మనసంగతి అందరిముందూ బయటపెడతారు ...... , సరైన సమయానికి గుర్తుచేసావు అంటూ ముద్దుపెట్టి కిందకుదిగాను .
పెద్ద మీసాలు - గడ్డం తీసుకుని ఒక విలువైన ఆభరణం ఇచ్చాను .
మహాప్రసాదం ప్రభూ అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు .
వెంటనే అక్కడినుండి నా దేవకన్య రాజ్యానికి బయలుదేరాము - దారిలో చెట్లనుండి పళ్ళు కోసుకుని ముగ్గురమూ తింటూ చంద్ర రాజ్యం చేరుకున్నాము .
స్వయంవర ఏర్పాట్లతో రాజ్యం మొత్తం కోలాహలంగా ఉంది - యువరాజులకు ఘనమైన స్వాగత కార్యక్రమాలు వీధులలో జరుగుతున్నాయి - కోలాటం కచేరీలు లాంటివి .......
ఇక మారువేషంలో తిరగాల్సిన సమయం అంటూ పెట్టుడు మీసాలు - గడ్డాన్ని ఉంచుకుని , మిత్రమా - మంజరీ ...... గుర్తుపట్టగలరా ? అని అడిగాను .
మంజరి : ప్రభూ ...... పూర్తిగా మారిపోయారు - మహి తప్ప ఎవరూ గుర్తుపట్టనేలేరు .
మహి గుర్తుపడుతుంది అంటావా మంజరీ .......
మంజరి : మీరే తన సర్వస్వం ప్రభూ ....... , కావాలంటే నేనువెళ్లి మహికి మీరు రాలేకపోతున్నారని అపద్ధం చెబుతాను , నమ్మనే నమ్మదు నాకుకూడా తెలుసు , ఒకసారి ప్రయత్నించి చూద్దాము .
ఈపాటికే నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది మహి - నువ్వువెళ్లు మంజరీ ......
మంజరి : మహితోకంటే మీతో ఉండటమే సంతోషం ప్రభూ .......
చాలా సంతోషం మంజరీ ...... అంటూ సున్నితంగా అందుకుని ముద్దుపెట్టాను .
మంజరి : మీరు ఆజ్ఞ వేశారు కాబట్టి వెళతాను ప్రభూ ...... , గంభీరంగా - ఠీవిగా లోపలికి వచ్చెయ్యండి , మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము అంటూ ఎగురుకుంటూ వెళ్ళింది .
The following 21 users Like Mahesh.thehero's post:21 users Like Mahesh.thehero's post
• 9652138080, arkumar69, dradha, Fuckingroll69, Iron man 0206, Kacha, Kumarmb, maheshvijay, Manavaadu, Naga raj, Nani198, Nmrao1976, noohi, RAANAA, Rajeev j, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
మంజరి చెప్పినట్లుగా ఎవ్వరికీ అనుమానం కలగకుండా నిటారుగా కూర్చుని వీధులలోని ఏర్పాట్లను తిలకిస్తూ , సైనికుల పాహారాలో వెళుతున్న యువరాజుల వెనుకే రాజ్యపు మహాద్వారాన్ని చేరుకున్నాను .
అక్కడి పిలుపులను బట్టి బయట రాజ్య సైన్యాధ్యక్షుడు మరియు మంత్రిగారు - ద్వారంలోపల ఏకంగా ప్రభువుల వారే యువరాజులను రాచమర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు .
అందరూ అయిపోవడంతో చివరన కాస్త భింకంతోనే మహాద్వారం దగ్గరికి వెళ్ళాను.
సైన్యాధ్యక్షుడు : మంత్రిగారూ ...... , హిడుంభి రాజ్యపు యువరాజు రానే వచ్చారు - ఒంటరిగా వచ్చారు - వీరి దగ్గర రాజముద్ర కూడా ఉంది .
మంత్రిగారు : యువరాజా ...... మిమ్మల్ని ఆపినందుకు క్షమాపణలు - మా సామ్రాజ్యపటంలో మీ రాజ్యం ఎక్కడ ఉందో తెలియరాలేదు .
ఇలాకాదు నటనను ఎక్కుపెట్టాల్సిందే , స్వయంవరానికి ఆహ్వానించి ఇలా అవమానిస్తారా ? , దక్షిణ భారతదేశంలోనే అత్యంత ధనిక రాజ్య యువరాజునే ఆపుతారా ఎంత ఎంత ....... ధైర్యం ......
మంత్రిగారు : యువరాజా యువరాజా ...... శాంతించండి శాంతించండి , ఒంటరిగా వచ్చినందువలన అనుమానించాల్సి వచ్చింది .
అందరి యువరాజుల్లా సైనికుల రక్షణతో రావాల్సిన అవసరం నాకులేదు - నేనే వారికి రక్ష ........
మంత్రిగారు : యువరాజా ...... ప్రభువుల చెంతకు తీసుకునివెళతాను రండి .
ప్రభువు : మంత్రిగారూ ...... ఏమి జరిగింది ? .
మంత్రిగారు : ప్రభూ ...... హిడుంభి రాజ్యపు యువరాజు , రాజ ముద్రిక కూడా ఉంది ప్రభూ .......
ప్రభువు : రాజముద్రిక ఉంటే రాజ్యం ఉన్నట్లే ....... , స్వయంవర సమయం ఆసన్నమయ్యింది , యువరాజులను వేచి ఉండేలా చెయ్యడం భావ్యం కాదు , హిడుంభి యువరాజా ...... వీరుచేసిన అపరాధానికి నేను క్షమాపణలు చెబుతున్నాను , మీకు చంద్ర రాజ్యం తరుపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము రండి స్వయంవర పోటీలకు మేమే స్వయంగా పిలుచుకునివెళతాము .
మిత్రుడిని ...... సైనికులు తీసుకెళ్లారు .
మిత్రమా .......
ప్రభువు : యువరాజా ...... మీ అశ్వానికి ఏలోటూ లేకుండా చూసుకుంటారు .
సంతోషం మహాప్రభూ ....... , మీ రాజ్యం గొప్పతనం - మీ రాకుమారి అందచందాలు విని ఉత్సాహంతో వచ్చాము .
ప్రభువు : మహా సంతోషం యువరాజా ...... , ముందు మా ఆతిధ్యం స్వీకరించండి అంటూ ఘనంగా ఏర్పాటుచేసిన విందుకు తీసుకెళ్లారు , అప్పటికే యువరాజులంతా ఫలహారాలు స్వీకరిస్తున్నారు .
రాజ మందిరాలు అంటే ఇంత మహాద్భుతంగా ఉంటాయా ఎటుచూసినా అత్యద్భుతమైన అలంకరణలు అంటూ పెదాలపై చిరునవ్వుతో చుట్టూ చూస్తున్నాను - చినప్పటినుండీ ఈ ప్రదేశమంతా తిరుగుతూ ఆడుకుంటూ పెరిగి ఉంటుంది నా దేవకన్య అంటూ ఆనందిస్తున్నాను .
ఎదురుగా విందు స్వీకరిస్తున్న మా గురుకులానికి మూడువైపులా గల రాజ్యాల రాజకుమారులు - వెంటనే స్థంభం వెనుక దాక్కున్నాను , రేయ్ ...... ఇప్పుడు నువ్వు గురుకుల మహేష్ కాదు యువరాజు మహేష్ - మారువేషంలోనూ ఉన్నావుకదా ఇంకెందుకు భయం , ఒకసారి వాళ్ళ దగ్గరకే వెళ్లి ప్రయత్నిద్దాము అంటూ పండు అందుకుని తింటూ దగ్గరికివెళ్ళాను .
ప్రతీ యువరాజు ...... వాళ్ళ వాళ్ళ సైన్యాధ్యక్షులతో ఎలాగైనా స్వయంవరం గెలవాలి - అతిలోకసుందరిని చేబట్టాలి అంటూ పట్టపగలే కలలు కంటుండటం విని నవ్వు వస్తోంది , అందులో మా రాజకుమారులేమీ తీసిపోలేదు .
రాజకుమారులు : గురుకులంలో ఎలాగో మన ప్రభావాన్ని చూయించలేకపోయాము - ఎలాగైనా ఈ విశ్వసుందరిని మనలో ఎవరో ఒకరం గెలుచుకోవాలి , ఆ మహేష్ తప్ప మనతో సమానమైన వీరుడు ఎవ్వడూ ఉండడు - గురువుగారు కష్టపెట్టినా యుద్ధవిద్యల్లో నైపుణ్యాన్ని నేర్పించారు .
మా రాజకుమారులు నిద్రలోనూ నా గురించే ఆలోచిస్తారు అన్నమాట - గురువుగారూ ...... మీకు పాదాభివందనం .
అంతలో ప్రభువు మాటలు వినిపించాయి .......
రాజకుమారులారా ....... నా ఆహ్వానాన్ని మన్నించి ఇంతదూరం స్వయమవరానికి విచ్చేసినందుకు చంద్ర సామ్రాజ్యం తరుపున స్వాగతం సుస్వాగతం ....... , మా స్వాగతం - ఆతిధ్యం నచ్చిందనుకుంటాను .......
అందరూ సంతోషంతో కేకలువేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు .
ప్రభువు : కృతజ్ఞుణ్ణి , ఈ స్వయంవరం కేవలం యువరాణీ కోసం మాత్రమే కాదు యువరాణిని గెలుపొందినవారు నా తదుపరి ఈ రాజ్యాన్ని కూడా చేజిక్కించుకోబోతున్నారు .
సంతోషపు కేకలు ఎల్లలు దాటుతున్నాయి .
ప్రభువు : సంతోషం సంతోషం ...... , మీరు ఇక్కడ ఉన్నంతసేపూ మీ సేవలో తరిస్తాము , మీ సంతోషమే మా సంతోషం , స్వయంవరం అన్నది మన క్షత్రియ ఆచారాలలో ఒకటి కాబట్టి గెలుపోటములను ఆనందంతో స్వీకరించాలని కోరుచున్నాను , స్వయంవరం తరువాత కూడా మీరు మాకు ఆత్మీయులే ఎన్నిరోజులైనా మీసేవలో పునీతం అవుతాము .
చాలా బాగా చెప్పారు ప్రభూ ....... , మీ ఆతిధ్యం ఇప్పుడు మీ మాటలు ...... మమ్మల్ని చాలా సంతోషపెట్టాయి .
ప్రభువు : చాలా సంతోషం యువరాజా ...... , ప్రక్కనున్న క్రీడా మైదానంలో కాసేపట్లో స్వయంవర పోటీలు జరపబడుతాయి - పోటీలుకాదు ఒకేఒక పోటీ , అందరూ హాజరుకావాల్సినదిగా మనవి ........ , ఒకరు గొప్ప ఒకరు చిన్న అని మాకు తేడాలు లేవు - తమరు వచ్చిన సమయాన్ని బట్టి ఒక్కొక్కరినీ పోటీలో పాల్గొనే అవకాశం ఇస్తాము , చివరన వచ్చిన యువరాజుకు చివరగా అవకాశం .......
ఒకవైపు వరుసగా ద్వారాలు తెరుచుకున్నాయి - బయటకు వెళ్ళిచూస్తే చిన్న క్రీడా మైదానం చుట్టూ యువరాజులు తమ వంతు వచ్చేన్తవరకూ విలాసవంతంగా కూర్చువడానికి అన్నీ ఏర్పాట్లూ చేశారు , ఎదురుగా కాస్త ఎత్తులో ప్రభువు వచ్చి కూర్చుని అందరినీ ఆశీనులు కమ్మని ఆహ్వానించారు - ప్రక్కనే పరదా వెనుక నా దేవకన్య ఉన్నదని నా మనసుకు తెలిసిపోయి అటువైపే ప్రేమతో చూస్తున్నాను .
ఆశ్చర్యం ....... మారువేషంలో ఉన్న నన్ను కనిపెట్టేసినట్లు పరదా చాటునవచ్చి గాలిలో ముద్దు విసరడం చూసి తెగ ఆనందపడిపోతున్నాను .
పోటీ ప్రారంభం అన్నట్లు చుట్టూ శబ్దాలు వినిపిస్తున్నాయి - యువరాజులందరూ వెళ్లి విలాసవంతమైన సింహాసనాల్లో కూర్చుంటున్నారు .
నా అదృష్టం నా దేవకన్యకు ఎదురుగా ఉన్న సింహాసనం ఖాళీగా ఉండటంతో వెళ్లి కూర్చుని అటువైపే చూస్తున్నాను , అంతటి రాజ్యపు శబ్దాలు మరియు చుట్టూ కోలాహలం మధ్యన కూడా నా దేవకన్య నవ్వులు నా మనసుకు తెలిసి హృదయంపై చేతినివేసుకుని అనుభూతి చెందుతున్నాను - అదిచూసినట్లు నవ్వుల ఘాడత అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
అంతలో పది పదిహేను మంది దిట్టమైన సైనికులు చక్రాల బండిని అతికష్టంగా ఒకవైపు లాగుతూ మరొకవైపు తోసుకుంటూ వచ్చి , క్రీడా మైదానం మధ్యలో ఏర్పాటుచేసిన నీటి అలంకరణ ప్రక్కనే ఉంచి నీరసంగా వెళ్లిపోయారు .
ఏంటి ప్రభూ ....... ఇంత చిన్న బండిని ఇంతమంది సైనికులు లాక్కొచ్చారు అంటే మీ రాజ్యంలో సైనికులు ఇంత బలహీనమా అంటూ యువరాజులంతా నవ్వుకుంటున్నారు .
నాకైతే అలా అనిపించలేదు - ఉత్కంఠతో చూస్తున్నాను .
ప్రభువు : రాజకుమారులు అలా మాట్లాడటంలో తప్పులేదు , రాజకుమారులు ఎంతటి వీరులో ఈ పోటీతో తెలిసిపోతుంది అంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చి అందరి నోళ్ళూ మూయించారు . మహామంత్రీ .......
మహామంత్రీ : చిత్తం ప్రభూ అంటూ ప్రక్కనే కూర్చున్నవారు లేచి ముందువచ్చారు - రాజకుమారులారా ....... చూసేదంతా అపద్ధము కాదు , అక్కడ మీరు బండిని చూస్తున్నారు కానీ దానిపైనున్న ధనుస్సును చూడటం లేదు , రామాయణంలో సీతా స్వయంవరంలో ఆ రాముడు విరిచిన ధనస్సుతో ఈ ధనస్సు ఏమాత్రం తక్కువకాదు - ఇక ఆలోచించుకోండి , నిజం చెబుతున్నాను మా యువరాణీ మాత్రం సీతనే తనను పొందే రాముడు మీలోనే ఉన్నాడని భావిస్తున్నాము .
నా దేవకన్య సీతా సమానమైనదన్నమాట అంటూ నా దేవకన్యవైపు మరింత ప్రాణంలా చూస్తున్నాను - అందమైన నవ్వులు వినిపించి పులకించిపోతున్నాను .
మహామంత్రి : మా రాజ్యం తరతరాలుగా ఈ ధనుస్సు మాతోనే ఉండిపోయింది - ఎక్కడ నుండి ఎలావచ్చిందో ఎవ్వరికీ తెలియదు - చరిత్ర ప్రకారం మాత్రం దేవలోకం నుండి వర్షపు రూపంలో భువిపైకి చేరి మా నదీ ప్రవాహంలో మా రాజ్యాన్ని చేరిందని - అప్పట్లో బాహుబలుల్లాంటి పాతికమంది పైనే సైనికులు అప్పటి మా ప్రభువు గారితోపాటు దీక్ష చేబట్టి హోమాలు జరిపించి ఒడ్డు నుండి రాజ్యంలోకి చేర్చారు - సమస్య ఏమిటంటే ధనస్సు విల్లులు ఉన్నాయికానీ ఎక్కుపెట్టే తాడు ఎక్కడ ఉందో ఇప్పటివరకూ ఏ ప్రభువులూ తెలుసుకోలేకపోయారు - మీరూ వెళ్లి చూడవచ్చు .................
యువరాజులతోపాటు వెళ్లి చూసాను - ఆశ్చర్యం అద్భుతం .......
మహామంత్రి : మరి సీతలాంటి సుగుణాలరాశి అయిన మా యువరాణిని మరియు మా రాజ్యాన్ని పొందే వీరుడు ...... ఆ ధనస్సుని ఎత్తి విల్లు ఎక్కుపెట్టి పైన తిరుగుతున్న బంగారు చేపలను కొట్టగలగాలి - ఇదే స్వయంవర పోటీ .......
అదేంతపని మహామంత్రీ ....... వరుసప్రకారం పిలవండి , మా తరువాత యువరాజులకు కష్టం లేకుండా ఇంటికి సాగణంపై యువరాణిని - రాజ్యాన్ని మాసొంతం చేసుకుంటాము అంటూ ఉత్సాహం చూపుతున్నారు .
మహామంత్రి : రాకుమారులారా నెమ్మది నెమ్మది , పోటీకి ఈ ఉత్సాహమే కావాల్సినది , తమ తమ సింహాసనాల్లో ఆశీనులు కండి - మహారాజా .......
ప్రభువు : పోటీ మొదలెట్టండి .......
రాజ్యం నలువైపులా దండోరా మారుమ్రోగిపోతోంద .
The following 18 users Like Mahesh.thehero's post:18 users Like Mahesh.thehero's post
• 9652138080, dradha, Fuckingroll69, Iron man 0206, Kacha, Kumarmb, maheshvijay, Naga raj, Nani198, noohi, RAANAA, Rajeev j, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
స్వయంవరం కోసం నిన్ననే విచ్చేసిన మైసూర్ రాజ్యపు యువరాజుని పోటీకి ఆహ్వానిస్తున్నాము .
యువరాజు ఠీవిగా లేచి , రాకుమారులారా ...... ఈ పోటీ నాతోనే పూర్తవుతుంది , మీరంతా నిరాశతో మీ మీ రాజ్యాలకు వెళ్ళడానికి సిద్ధం కండి అంటూ ధనస్సు వైపుకు అడుగులువేస్తున్నాడు .
మిగతా యువరాజులు : ప్రభూ ప్రభూ ...... స్వయంవరం పోటీ అంటే కనీసం సగం మంది వరకూ అయినా పోటీ నిలబడాలి .......
ప్రభువు : శాంతించండి శాంతించండి రాకుమారులారా ....... , సగం మంది వరకూ కాదు మీ అందరికీ అవకాశం రాబోతోంది , శాంతించి తిలకించగలరు ........
యువరాజులంతా ఎవరి స్థానాల్లో వారు కూర్చుని మొదటి అవకాశం నాకు రావాల్సింది అంటూ చింతిస్తున్నారు .
మైసూర్ యువరాజు : ఈ ధనస్సుకు నా ఎడమచేతి వేలు చాలు అంటూ ఎత్తబోయి ఆ బరువును వేలి ఎముక విరిగినట్లు శబ్దం వినిపించడం - నొప్పితో కేకలువెయ్యడం చూసి కొంతమంది నవ్వుతున్నారు మిగిలినవారు ఆశ్చర్యపోతున్నారు .
అంటే మహామంత్రి చెప్పినదంతా నిజమే అన్నమాట అంటూ కంగారుపడుతూ ఒకసారి నా దేవకన్యవైపు చూసి , ధనస్సు వైపు చూస్తున్నాను .
యువరాజులు : మైసూర్ యువరాజా ...... దనుస్సునే కాదు ఇక ఆ విరిగిన వేలితో ఏమీ ఎత్తలేరు వచ్చి కూర్చో అంటూ నవ్వుకుంటున్నారు .
మైసూర్ రాజ్యపు సైనికులు వెళ్లి యువరాజా నొప్పివేస్తోందా అంటూ పిలుచుకునివెళ్లి కూర్చోబెట్టారు .
మహామంత్రి ఆజ్ఞ వెయ్యడంతో రాజ్యంలోని వైద్యులు వచ్చి చికిత్స చేస్తున్నారు .
మహామంత్రి : ఇక రెండవ యువరాజు శాతవాహన రాజ్యం నుండి .......
శాతవాహన యువరాజు : మైసూర్ యువరాజా ...... మా వీరత్వం ఏమిటో చూడు అంటూ ఎడమచేతితో ఎత్తబోయి వీలుకాక కిందపడ్డాడు .
మైదానం మొత్తం నవ్వులే నవ్వులు .......
శాతవాహన యువరాజు : ఏమిటీ అంటూ కుడిచేతితో - రెండుచేతులతో ప్రయత్నించినా వీలుకాక చుట్టూ నవ్వులకు పరువు పోయినట్లు , సైనికులారా రండి అంటూ కోపంతో బయటకు వెళ్ళిపోయాడు .
మహామంత్రి : శాతవాహన యువరాజా ...... మా ఆతిధ్యం పూర్తిగా స్వీకరించి వెళ్ళండి అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు .
యువరాజులంతా నవ్వుతున్నారు - నాకైతే నవ్వు రావడం లేదు ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాను .
మహామంత్రి : తరువాత పరంపర యువరాజు .......
పరంపర మహారాజు : బస్తీలు - వ్యాయామం చేస్తూ వెళ్లి కండలను చుట్టూ ప్రదర్శించి రెండుచేతులతో ఎత్తబోయి వీలుకాక వారి సైన్యం మొత్తాన్ని పిలిచాడు .
మహామంత్రి : యువరాజా .......
మహారాజు ఆపడంతో ఆగిపోయారు .
10 మంది కలిసి ఎత్తడానికి ప్రయత్నించినా వీలుకాక , వొళ్ళంతా చెమటతో వెళ్లి కూర్చుని దాహం దాహం అంటూ నీళ్లు గట గటా త్రాగడం చూసి నవ్వులు విరిసాయి .......
ప్రతీ ప్రయత్నానికి నాలో ఆసక్తి - కంగారు అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
తరువాత చోళ - పాండ్య - పల్లవ - నాయక ....... యువరాజులు ఒక్కొక్కరుగా వచ్చి తమవంతు ప్రయత్నం చేసి వీలుకానట్లు వెళ్లి కూర్చోవడమో లేక నవ్వులపాలై రాజ్యం నుండి వెళ్లిపోవడమో జరుగుతోంది .
మా యువరాజుల వంతు వచ్చింది , మొదట తూర్పు రాజ్యం యువరాజు వెళ్ళాడు - తెగప్రయత్నించి వీలుకాక తలదించుకుని వచ్చాడు .
ధనస్సు కంగారు మరిచిపోయినట్లు నవ్వు వచ్చేసింది - గురువుగారినే తప్పుపడతారా ? .
ఆ వెంటనే గురుకులానికి పడమరవైపు రాజ్యం యువరాజుని పిలిచారు .
రేయ్ నువ్వే నాకంటే ముందు వచ్చావు నువ్వే వెళ్లు నువ్వే వెళ్లు అంటూ వాదులాడుకుంటున్నారు .
మహామంత్రి : సమయం మించిపోతోంది ఒకరితరువాత మరొకరు పోటీలో పాల్గొనండి .
రేయ్ ...... మన ముగ్గురిలో వీరుడు వీడు - వీడివల్లే కాలేదు మనవళ్లు ఎలా వీలౌతుంది , అక్కడికివెళ్లి నవ్వులపాలు కావడం కంటే ఇక్కడే ఆగిపోవడం మంచిది అంటూ కూర్చుండిపోయారు , సోదరా ...... వెళ్లిపోదామా ?.
తూర్పు రాజ్యం యువరాజు : ధనస్సు సంగతి ఏమిటో చూసే వెళదాము కూర్చో ....... , ఒకవేళ ఎవరి వలనా కాకపోతే మహారాజుని కలిసి ఎలాగైనా ఒప్పించి రాకుమారిణి మనలో ఒకరం చేబట్టాలి లేకపోతే మన రాజ్యంలో తలెత్తుకోలేము ........
మహామంత్రి : అయితే తరువాతి యువరాజును అంటూ వరుసగా పిలవడం - వీలుకాక వెళ్లి కూర్చోవడం ......
అలా నాకంటే ముందు సింహద్వారంలో ప్రవేశించిన చివరి యువరాజువరకూ పోటీలో పాల్గొని వీలుకాకపోవడంతో .......
మహామంత్రి లేచి ఇక చివరగా మిగిలిన హిడుంభి రాజ్యం యువరాజు - ఇతడి వల్లనైనా వీలౌతుందో లేదో చూద్దాము అంటూ నవ్వుతున్నారు .
యువరాజులు : మావల్ల కాలేదు అంటే ఎవరి వలనా కాదు ....... , వెళ్లు హిడుంభి యువరాజా నవ్వులపాలై వచ్చి కూర్చో అంటూ ముందే నవ్వుతున్నారు .
లేచి తలపాగాను - ఖడ్గాన్ని - నా విల్లును ఆసనంపై ఉంచి , నా దేవకన్య వైపు - ధనుస్సు వైపు మార్చి మార్చి చూస్తూ వెళ్ళాను . ధనుస్సు చుట్టూ తిరుగుతూ పూర్తిగా పరిశీలించాను , ధనుస్సు పై దేవనాగరి లిపి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను అంటే మహామంత్రి గారు చెప్పినట్లు ఈ ధనుస్సు దేవలోకం నుండి భువిపైకి చేరి ప్రవాహం ద్వారా ఈ రాజ్యానికి చేరిందన్నది వాస్తవం ...... , కిందవైపుకు చూస్తే అమ్మవారి ప్రతిమ ....... అమ్మవారు అమ్మవారు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది అంటే దేవనాగరి లిపి ప్రకారం భువిపై రాక్షసులను చంపి భూతల్లిని సస్యశ్యామలం చెయ్యడానికి ఆ అమ్మే స్వయంగా భువిపై అడుగుపెట్టారన్నమాట , ఆ క్రమంలో మానవాళిని రక్షించిన అమ్మవారి ధనుస్సు ప్రవాహంలో ఇక్కడికి చేరిందన్నమాట ...... , అప్పుడే ఆ అమ్మ నదీ అమ్మ జన్మస్థానంలా స్థిరపడిపోయి ఉంటారు , ధనుస్సు ను ఎలా ఎక్కుపెట్టాలో పూర్తిగా అర్థమైనట్లు సంతోషంతో కేకలువేస్తూ అమ్మవారిని భక్తితో ప్రార్థించాను .
యువరాజులు : ధనుస్సు ఎత్తేటప్పుడు సంతోషపు కేకలు కాదు ఏడుపులు వస్తాయి ప్రయత్నించు ప్రయత్నించు అంటూ నవ్వుకుంటున్నారు .
అలాగే ప్రయత్నిస్తాను తోటి యువరాజుల్లారా ........ , చంద్ర రాజ్య మహారాజా ...... మీరు అనుమతిస్తే ఒక విన్నపం చేసుకోవచ్చా ? .
ప్రభువు : ఏమిటి రాకుమారా ? .
మహారాజా ...... ఈ ధనుస్సు ను ఎక్కుపెట్టడానికి యువరాణీ సహాయం కావాలి - ఇక్కడకు పంపించగలరా ...... ? .
సైన్యాధ్యక్షుడు : ఎంత ధైర్యం ఉంటే స్వయంవరం పోటీ గెలవకముందే యువరాణీ గారిని చూడాలని ఆశపడుతున్నావు ........
మన్నించండి మహారాజా ....... , ఈ ధనుస్సు పై లికించిన దేవలిపి ప్రకారం గొప్ప చరిత్ర కలిగి ఈ ధనుస్సును తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న చంద్ర వంశం యొక్క అమ్మవారి భక్తురాలి ద్వారానే ఎక్కుపెట్టగలము ...... , విన్నాను యువరాణీవారు అమ్మవారి భక్తురాలు అని , మీరు అవకాశం ఇస్తే నిరూపిస్తాను మహారాజా - ఎక్కుపెట్టకపోతే నన్ను రాజ్యం నుండి పంపించడం కాదు ఇక్కడే ఉరి తియ్యండి .......
సైన్యాధ్యక్షుడు : మహారాజా .......
ప్రభువు : సైన్యాధ్యక్ష ఆగండి , ఈ యువరాజు విన్నపం బహు ఆసక్తికరంగా ఉన్నది , అనుమతి ఇస్తున్నాము ....... , తల్లీ మహీ ......
ఆజ్ఞ తండ్రీ ...... అంటూ తియ్యనైన నా దేవకన్య స్వరం వినిపించగానే పెదాలపై చిరునవ్వుతో అటువైపు చూస్తున్నాను .
నా కోరికను మన్నించినందుకు ధన్యవాదాలు మహారాజా ...... , యువరాణీవారూ ........ ఒక్కసారి ఇక్కడకువస్తే మీరు ఆశ్చర్యపోయే వినోదం చూయిస్తాము .
మహి : వినోదమా ....... మేము సిద్ధం అంటూ ముఖంపై పరదాతో చెలికత్తెలతోపాటు నావైపే ప్రాణంలా చూస్తూ వస్తోంది .
మహారాజు - మహామంత్రి - యువరాజులు - చుట్టూ ఉన్న రాజ్యపు ప్రజలు ఆసక్తితో చూస్తున్నారు .
నవ్వుకుని , మహారాజా ....... మరొక చిన్న విన్నపం , నాకు ఒక చిన్న పాత్రలో నదీప్రవాహపు జలం కావాలి .
మహారాజు ఆజ్ఞ వెయ్యగానే , సైన్యాధ్యక్షుడు ...... వెంటనే ప్రవాహపు నీటిని తీసుకురండి అంటూ భటులను పంపించారు .
దేవకన్య కంటే ముందు దేవకన్య భుజాలపై ఉన్న మంజరి మరు క్షణంలో నా భుజం పైకి చేరింది .
దేవకన్య దగ్గరకు రాగానే ఆఅహ్హ్ ...... ఇప్పటికి శాంతించినది నా హృదయం - చూసి ఎన్ని ఘడియలు అయినదో తెలుసా ...... ? .
మహి : నా దేవుడు ఎదురుగా ఉన్నాకూడా కౌగిలి లేక ఎంత నియంత్రించుకుంటున్నానో తెలుసా ? , స్వయంవరం కానివ్వనివ్వండి నా దేవుడిని కొరికేస్తాను .
వెనకున్న చెలికత్తెలు నవ్వుకుంటున్నారు .
అంతకంటే అదృష్టమా యువరాణీ ....... , మంజరీ ...... చూడగానే గుర్తుపట్టేసింది మన యువరాణి .......
మంజరి : చెప్పాను కదా ప్రభూ ...... , మీ ఇద్దరి మనస్సు ఒక్కటే అని ......
తెలిసిందిలే మంజరీ ....... , మహీ ...... ధనుస్సు గురించి కంగారుపడ్డావా ? - నేనైతే కంగారుపడ్డాను .
మంజరి : మీ దేవకన్య ఏమాత్రం కంగారుపడలేదు ప్రభూ ....... , మీ వీరత్వం గురించి నమ్మకం ఉందని చెబుతూనే అమ్మవారిని ప్రార్థిస్తోంది .
చాలా చాలా సంతోషం మహీ ....... , ఇక కంగారుపడాల్సిన అవసరమే లేదు .
యువరాజా యువరాజా .......
మహి : దేవుడా ...... మిమ్మల్నే పిలుస్తున్నది .
అవునవును యువరాజునే యువరాజునే ........
మహి - మంజరి ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
భటులు : యువరాజా ...... మీరు కోరిన జలం .
భటుల నుండి నదీఅమ్మ జల పాత్రను అందుకున్నాను - మహారాజా ...... ప్రసిష్ఠమైన చంద్ర రాజ్య వారసురాలు యువరాణీ చేతులమీదుగా ధనుస్సును కొట్టుకునివచ్చిన నదీ జలంతో అభిషేకిస్తే , అమ్మవారు ఈ ధనుస్సును ఎక్కుపెట్టే అవకాశం కలిగిస్తారు .
అందరిలో ఆసక్తి మరింత పెరిగింది - మహారాజు ...... తమ సింహాసనం నుండి లేచి చివరకువచ్చి నిలబడ్డారు ......
మహామంత్రి - సైన్యాధ్యక్షుడు ఏకంగా మాదగ్గరికి వచ్చారు .
యువరాణీ ...... అంటూ పాత్రను అందించాను .
మహి : తండ్రి అనుమతితో ....... , జలాన్ని - ధనుస్సును మొక్కి జలపాత్రను అందుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ నావైపే ప్రాణంలా చూస్తూ ధనుస్సును ...... జలంతో అభిషేకించింది .
ఆశ్చర్యం - అద్భుతం ప్రభూ ........ , తాడు దర్శనమిస్తోంది .
మహి : రాకుమారా ...... ఇక కానివ్వండి .
ఆజ్ఞ రాకుమారీ అంటూ ధనస్సుకు మొక్కి , కుడిచేతితో బాణాన్ని మరొకచేతితో ధనుస్సును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టి రెప్పపాటులో పైన వ్రేలాడుతున్న బంగారు చేపను కొట్టాను .
అంతే రాజ్యం మొత్తం దద్దరిల్లిపోయేలా సంబరాలు అంబరాన్ని అంటాయి .
భళా రాకుమారా భళా ...... , ఇక ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు నా బంగారుతల్లి మరియు నా రాజ్యం నీకే సొంతం ....... అంటూ సంతోషంతో ప్రకటించేశారు మహారాజు .
మహి : తండ్రిగారూ .......
ప్రభువు : తల్లీ మహీ ...... ఇంతకంటే వీరాధివీరుడైన క్షత్రియుడు ఈ భువిపైననే లేడు , పూలహారంతో .......
మహారాజు మాటలు పూర్తికాకముందే చెలికత్తె అందించిన పూలహారాన్ని నా మెడలో వేసి నా గుండెలపైకి చేరి ఏకమయ్యేలా అల్లుకుపోయింది - దేవుడా ..... అనుకున్నది సాధించారు అంటూ నా హృదయంపై ముద్దులుపెడుతోంది .
మాపై పూలవర్షం కురుస్తోంది - రాజ్యం మొత్తం దండోరా మారుమ్రోగుతోంది .
రాకుమారీ ...... మరొక వినోదం తిలకిస్తారా ? .
అంతులేని ఆనందంతో అవునన్నట్లు కళ్ళతోనే సైగచేసింది నా దేవకన్య .......
నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి , చేతిలోని ధనుస్సును మహి చేతికి అందించి మరొకచేతితో బాణాన్ని అందుకుని మహితో మరొక చేపను కొట్టించాను .
భళా యువరాజా భళా ....... నీలాంటి వీరాధివీరుడిని ఇంతవరకూ చూడలేదు అంటూ ఇద్దరినీ కౌగిలించుకున్నారు .
The following 22 users Like Mahesh.thehero's post:22 users Like Mahesh.thehero's post
• 9652138080, arkumar69, dradha, Fuckingroll69, Iron man 0206, Kacha, Kumarmb, Mahe@5189, maheshvijay, Manavaadu, Naga raj, Nani198, Nmrao1976, noohi, RAANAA, Rajeev j, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
ఆ కౌగిలింతలో మీసం ఊడిరావడం చూసి వెంటనే సరిచేసి ప్రాణంలా హత్తుకుంది మహి ......
ఇదంతా మాయ మేము ఒప్పుకోము - మీకిష్టమైన యువరాజు గెలిచేలా పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా జరిపించారు - అందుకేనేమో ఇతడిని చివరన ఉండేలా చూసారు , ఎదురెదురుగా బరిలోకి దిగితేనేకదా ఎవరి వీరత్వం గొప్పదో తెలిసేది అంటూ గురుకుల యువరాజులు అసూయతో మాట్లాడుతున్నారు .
ప్రభువు : ఎంత కండ కావరం ...... , నేను నా రాజ్యంలో ఒకమాట ప్రకటిస్తే అదే శిలాశాసనం .......
యువరాజులు : ఇలా ప్రకటించేదానికి ఇక స్వయంవరం దేనికి మహారాజా - క్షత్రియ ఆచారం అంటూ బాగానే మాట్లాడారు - ఇంతదానికి ఇంతమంది యువరాజులను పిలిచి అవమాయనించడం తగునా తమరికి ....... , ఈ విషయం అన్ని రాజ్యాలకూ తెలిస్తే మీ పరువు ఏమౌతుందో ఊహించుకోండి .......
ప్రభువు : పరువు మాట వినగానేభయపడి , రాకుమారులారా ...... స్వయంవర పోటీ న్యాయం - ధర్మాంగానే జరిగింది కదా ......
యువరాజులు : మాకు అలా అనిపించడం లేదు - మాతో బరిలోకి దిగి గెలవమనండి మీ వీరాధివీరుడిని అప్పుడు మేమే మౌనంగా వెళ్లిపోతాము .
నా దేవకన్య కళ్ళల్లోకి చూసి , మహారాజా నేను పోటీకి సిద్ధం అన్నాను .
యువరాజులు : ఇప్పుడు ఎవరు వీరాధివీరులో తెలుస్తుంది .
పోటీ మీరే చెప్పండి రాకుమారులారా ...... , మహీ ...... మరొక వినోదాన్ని తండ్రి చెంత ఉంది వీక్షించండి అంటూ మహారాజు గుండెలపైకి చేర్చాను , పోటీని గెలిచి ఈహారాన్ని మీ మెడలోవేసి నాదానిని చూసుకుంటాను .
యువరాజులు : మాటలు కట్టిపెట్టి బరిలోకి దిగు రాకుమారా ...... , పోటీ ఏమిటంటే ....... నీ తలపై పండు ఉంచుకుంటే మేము ముగ్గురమూ ఒకేసారి గురిచూసి కొడతాము ఆ తరువాత నీవంతు ......
నేను సిద్ధం రాకుమారులారా అంటూ వాళ్ళు విసిరిన జామకాయను నా తలపై ఉంచుకుని వారు గీసిన చోట దైర్యంగా నిలబడ్డాను .
ప్రభువు : రాకుమారా .......
మహారాజా ...... జరిగే వినోదాన్ని ఆస్వాదించండి - రాకుమారీ ..... కంగారుపడకండి .
ముగ్గురూ కాస్తదూరంలో నిలబడి వాళ్ళ ధనుస్సులు ఎక్కుపెట్టారు - వాళ్ళు ఎక్కుపెట్టిన విధానం చూసే అర్థమైపోయింది గురువుగారు ఎన్నిసార్లు నేర్పించినా శ్రద్ధతో నేర్చుకోలేదని ......
పెదాలపై చిరునవ్వుతో వాళ్ళు వదిలిన బాణాలను ఒకటి నా ముఖం దగ్గర - మరొకటి నా మెడ దగ్గర - ఇంకొకదానిని నా ఛాతీదగ్గర చకచకా పట్టేసుకున్నాను .
మహారాజు మొదలుకుని సైన్యాధ్యక్షుడు వరకూ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు .
దేవుడా ...... అంటూ వచ్చి నన్ను స్పృశిస్తూ గుండెలపై దెబ్బలుకురిపిస్తూ ప్రాణంలా హత్తుకుంది - నీ ప్రేమ ఉండగా నాకేమి అవుతుంది మహీ ...... అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
అద్భుతం మహాద్భుతం రాకుమారా కాదు అల్లుడు గారూ కాదు కాదు చంద్ర సామ్రాజ్య కాబోయే రాజు ...... , ఇక మీవంతు రాకుమారులారా ......
నా విద్యను చూసి అప్పటికే భయంతో వణుకుతున్న యువరాజులు ...... తమ సైనికులను పిలిచి వాళ్ళ తలలపై జామకాయలు ఉంచారు .
ప్రభువు : మీలాంటి పిరికిపంద యువరాజులు ఇంతకంటే ఏమిచెయ్యగలరు అంటూ నవ్వుకున్నారు .
యువరాణీ ...... మరొక వినోదం తిలకిస్తారా లేదు లేదు మీతోనే చేయిస్తాను అంటూ మహితో అమ్మవారి ధనుస్సును ఎక్కుపెట్టించాను , మహీ ..... ఒకేసారి కొడతారా ఒక్కొక్కటి కొడతారా ? .
మహి : ఆ యువరాజులు ...... మీవైపే అనుమానంతో చూస్తున్నారు .
ఓహో ఆదా విషయం మూడింటినీ ఒకేసారి కొడితే నేనని తెలిసిపోతుంది - ఆ విద్యను నేర్పించేవారు గురువుగారొక్కరే నేర్చుకున్నది నేనొక్కడినే ...... , ప్రస్తుతానికి ఒక్కొక్కటి కొడదాము అంటూ క్షణ వ్యవధిలో జామకాయలు రెండురెండుగా చెరొకవైపుకు పడ్డాయి .
యువరాజులు .....వీడు మన బానిస కాదు ...... అని మాట్లాడుకోవడం వినిపించి , మహీ ....... నీవల్లనే అంటూ నా మెడలోని పూల హారాన్ని మహి మెడలోకి వేసి అమాంతం పైకెత్తి చుట్టూ తిప్పాను .
మహారాజు : ఆ ముగ్గురు యువరాజులను వాళ్ళ సైన్యంతో సహా ఉన్నఫలంగా పొలిమేరలు దాటించండి .
సైన్యాధ్యక్షుడు : తోసుకుంటూ వెళ్లారు .
గురువుగారిని అవమానించినందుకు ఈ శాస్తి జరగాల్సిందే అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా దేవకన్యను ప్రాణంలా హత్తుకున్నాను .
మాపైకి అందరూ పూలవర్షం కురిపించారు - చుట్టూ సంబరాలు చేసుకుంటున్నారు పండగ వాతావరణం నెలకొంది .
మంజరి ఆనందాలకు అవధులులేనట్లు మా చుట్టూ ఎగురుతూ సందడి చేస్తోంది , నా దేవకన్య చెలికత్తెలయితే నా దేవకన్య సంతోషాలను చూసి ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందిస్తున్నారు - పూలవర్షం కురిపిస్తున్నారు .
మహారాజు : తన రాజ్యానికి ఇంతవరకూ చూడని వీరాధివీరుడు - తెలివైనవాడు రాజు కాబోతుండటంతో పట్టరాని ఆనందానికి లోనౌతున్నారు , మహామంత్రీ ...... మీ కాబోవు మహారాజు ఎలా ఉన్నారో చెప్పనేలేదు ? .
మహామంత్రి : ప్రభూ ప్రభూ ....... నేనింకా వారి వీరత్వ ప్రతిభ దగ్గరే ఉండిపోయాను ప్రభూ ...... , నిజం చెప్పాలంటే మీకంటే వీరాధివీరుడు ప్రభూ - మన రాకుమారి గారికి చక్కనైన వరుడు - చూస్తున్నారుకదా రాకుమారి గారికి కూడా తెగ నచ్చేసినట్లు ఆ ఆనందం - ఇంతకంటే వీరాధివీరుడిని మన రాకుమారి గారికి తీసుకురాలేరు ప్రభూ .......
మహారాజు : చాలా చాలా సంతోషం మహామంత్రీ ...... , అయితే పండితులను పిలిపించండి వెంటనే వెంటనే పాణిగ్రహణం ఆ వెంటనే సతీసమేతంగా పట్టాభిషేఖం .......
మహామంత్రి : చిత్తం ప్రభూ ......
మహారాజు : యువరాజులారా ...... ఈ రెండు సంబరాలను చూసి మాతో ఆనందాలను పంచుకోండి .
సైన్యాధ్యక్షుడు : మన్నించండి ప్రభూ ....... , స్వయంవరానికి విచ్చేసిన యువరాజలందరూ సెలవు తీసుకున్నారు , కొంతమంది మన కాబోవు మహారాజు వీరత్వాన్ని చూసి ఆనందిస్తూ మరికొంతమంది ......
మహారాజు : అర్థమైంది అర్థమైంది ....... , రాజ్యం మొత్తం చాటింపు వేయించండి సంబరాలు అంబరాన్ని అంటాలి - మన కాబోవు మహారాజు వీరాధివీరుడు అంటూ మురిసిపోతున్నారు .
సైన్యాధ్యక్షుడు : ప్రభూ ...... మన కాబోవు మహారాజుగారి నామధేయం ? .
మహారాజు : అవునవును ఒక్క క్షణం అంటూ నావైపుకు అడుగులువేశారు .
నా దేవకన్యను కిందకుదించి తన అంతులేని ఆనందాలను చూసి అంతే ఆనందంతో ప్రేమతో బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను , మహీ ...... ఎలా ఉన్నావో చెప్పనేలేదు కదూ .......
మహి : అవును అంటూ బుంగమూతిపెట్టుకుంది .
బుంగమూతిలో ముద్దొచ్చేస్తున్నావు అంటూ తియ్యదనంతో నవ్వుకున్నాను , దివినుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు తెలుసా - నావైపు పడుతున్న ఒక్కొక్క అడుగుకు ఈ హృదయం పారవశ్యంతో ఉప్పొంగిపోయింది మహీ ......
మహి : ఇక్కడేనా అంటూ నా హృదయంపై పెదాలను తాకించింది .
మ్మ్మ్ ....... ఈ జీవితానికి ఈ ఆనందం చాలు అంటూ ప్రేమతో కౌగిలించుకున్నాను .
మహి : నా దేవుడి కోసమే ఇలా అందంగా అలంకరించుకున్నాను - మీకు నచ్చింది అంతకంటే ఆనందం మరొకటి లేదు అంటూ పులకించిపోతోంది .
అల్లుడుగారూ అల్లుడుగారూ .......
మహారాజా ...... మన్నించండి .
మహారాజు : పోటీతోపాటు నా బంగారుతల్లి మనసు కూడా గెలుచుకున్నావు , ఒక తండ్రికి ఇంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పు ....... , మీకు భంగం కలిగిస్తున్నందుకు నేనే .......
అలాంటిదేమీ లేదు మహారాజా ...... అంటూ మహితోపాటు నవ్వుకున్నాను .
మహారాజు : నా అల్లుడు - ఈ రాజ్యానికి కాబోవు మహారాజు గొప్పతనం వీరత్వం గురించి రాజ్యం అంతా చాటింపు వేయాలని ఆశపడుతున్నాము , తమరి నామధేయం ...... ? .
దివినుండి నాకోసం దిగివచ్చిన దేవకన్యా ...... చెప్పండి ? .
మహి : నాకు సిగ్గేస్తోంది ప్రభూ అంటూ నా గుండెల్లో తలదాచుకుంది .
మన తల్లి ఇంత సిగ్గుపడటం నేనెప్పుడూ చూడలేదు ప్రభూ ...... , అంతటి వీరాధివీరుడైన అల్లుడు దొరకడం మన అదృష్టం ......
మహి : అమ్మా ...... అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి , రాజమాత చెంతకు చేరింది .
రాజమాతకు వందనం ......
రాజమాత : వందనం రాకుమారా ...... , తమరి నామధేయం ? .
ఆ కైలాసనాథుడి నామధేయాలలో ఒకటైన మహేశ్వరుడు రాజమాత - మహారాజా .......
మహారాజు : తగ్గ పేరు అల్లుడుగారూ ....... , సైన్యాధ్యక్షా ..... విన్నారుకదా రాజ్యం మొత్తం మారుమ్రోగిపోవాలి .
సైన్యాధ్యక్షుడు : చిత్తం మహారాజా ....... అంటూ వెళ్లిపోయారు .
అంతలోనే మహామంత్రి గారు పండితులను పిలుచుకునివచ్చారు . యువరాజా ...... మన్నించండి మన్నించండి చంద్ర రాజ్యానికి కాబోవు మహారాజా ...... మీ హస్తాన్ని అందించగలరా ? .
చేతిని చాపాను ......
మహామంత్రి : రాకుమారీ ......
సిగ్గుపడుతూ నా చేతిపై ఉంచింది .
పండితులు ఇద్దరి చేతులలో జాతకాలను చూసి , అద్భుతం మహాద్భుతం ప్రభూ ........ ఒకరికోసం మరొకరు పుట్టిన జంట - రాబోవు కొన్ని సంవత్సరాలు ఏవో తెలియని ఒడిదుడుకులు కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో వీరు ఎక్కడ ఉన్నా ఆ రాజ్యం సుఖసంతోషాలతో విరాజిల్లుతుంది .
మహారాజు : సంతోషమైన విషయం చెప్పారు ......
పండితులు : ప్రభూ ప్రభూ .......
మహారాజు : విన్నవించండి పండితులారా .......
పండితులు : ప్రభూ ...... ఎన్ని పర్యాయాలు చూసినా , వీరి వివాహం ఈరోజే జరిగిపోవాలి అని గోచరిస్తుంది ఈరోజు జరగకపోతే 5 సంవత్సరాలవరకూ ఆగాల్సిందే .......
మహి : తండ్రిగారూ ....... అంటూ తన తల్లిని గట్టిగా హత్తుకుంది .
మహారాజు : పండితులారా మీరుకూడా ఒకసారి చూడండి .
వెనకున్న పండితులు వచ్చి చూసి అదేవిషయాన్ని వ్యక్తపరిచారు .
మహి కళ్ళల్లో చెమ్మతో రాజమాత గుండెలపైనుండే నా చేతిని అందుకుంది .
రాజమాత : ప్రభూ ......
మహారాజు : అర్థమైంది మహారాణీ ....... , ఇంతటి క్షత్రియ వీరాధివీరుడిని అల్లుడుగా వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేను . అల్లుడుగారూ ....... వీరు చెప్పినది చెప్పినట్లుగా జరిగాయి - మీకు సమ్మతమైతే ఈరోజే వివాహం జరిపిస్తాము .
మహివైపు చూసి లోలోపలే అంతులేని ఆనందం పొందాను - బయటకుమాత్రం అదికాదు మాహారాజా ....... మొన్న పడిన భారీ వర్షాలకు మా రాజ్యపు దారులు ప్రవాహాలు - కొండ చరియలతో పూర్తిగా ద్వoసం అయిపోయాయి , మావారంతా అక్కడే ఆగిపోయారు కానీ ఈ దేవకన్యను పొందడం అదృష్టం అందుకే అవరోధాలన్నీ సంతోషంగా దాటుకుని మీ రాజ్యం చేరాను .
నామాటలకు నావైపే ప్రేమతో చూస్తూ కొంటెదనంతో నవ్వుతోంది మహి ......
నాకు వస్తున్న నవ్వులను బలవంతంగా ఆపుకుంటున్నాను .
మహారాజా ...... బాధపడకండి , మీ ఇష్టప్రకారం ముందుకువెళ్లండి - పరిస్థితులు అనుకూలించాక మా రాజ్యంలో అందరి సమక్షంలో అంగరంగవైభవంగా మరొకసారి వివాహం జరుపుకుంటాము - రాకుమారి గారూ ...... మీకు సమ్మతమే కదా ? .
మరుక్షణంలో నా గుండెలపైకి చేరిపోయింది .
మహారాజుగారు సంతోషం పట్టలేనట్లు , కృతజ్ఞుణ్ణి కృతజ్ఞుణ్ణి అల్లుడుగారో ...... ఈరోజే వివాహం అంటే మామూలుగా జరిపిస్తాము అనుకున్నారేమో ...... మీరాజ్యంలో ఎలా అయితే జరుపుకోవాలని ఆశపడుతున్నారో అంతకుమించి సంబరంలా జరిపిస్తాము , మహామంత్రీ - సైన్యాధ్యక్షా .......
ఆజ్ఞ ప్రభూ .......
మహారాజు : పండితులారా ...... ముహూర్త సమయం ? .
పండితులు : ఇద్దరి జాతకాల ప్రకారం ....... సాయంత్రం 7 గంటలకు దిగ్విజయమైన ముహూర్తం ఉంది ప్రభూ ....... , వందేళ్లకు ఒకసారి వచ్చే ముహూర్తం చెప్పాము కదా ప్రభూ ...... ఇద్దరూ ఒకరికోసం మరొకరు పుట్టినవారు , మహేశ్వరుడు - మహేశ్వరి ....... పార్వతీపరమేశ్వరుల జంట ......
అంతే అందరి సంతోషాలతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి .
ఇద్దరమూ ఒకరికళ్లలోకి మరొకరం చూసుకుని సిగ్గులమొలకలవుతున్నాము .
The following 22 users Like Mahesh.thehero's post:22 users Like Mahesh.thehero's post
• 9652138080, arkumar69, dradha, Fuckingroll69, Iron man 0206, Kumarmb, Mahe@5189, maheshvijay, Manavaadu, Naga raj, Nani198, Nmrao1976, noohi, RAANAA, Rajeev j, Raju1987, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
మహారాజు : సంతోషకరమైన విషయం చెప్పారు పండితులారా ...... , అలాగే ఈ మహాద్భుతమైన వివాహాన్ని తమరిచేతులమీదనే జరిపించండి , మహామంత్రిగారూ ....... మన సామంతరాజ్యాలకు వివాహ ఆహ్వానం పంపండి - సాయంత్రంలోపు రాజ్యంలో ఉండాలని , ఎత్తిపరిస్థులలోనూ వివాహ సాంప్రదాయంలో ఏలోటూ ఉండకూడదు అన్నీ ఆచారాలప్రకారమే జరిపించాలి . , పండితులారా ..... అల్లుడుగారిని పెళ్ళికొడుకులా సిద్ధం చెయ్యడానికి ఎవరైతే బాగుంటుంది .
మహారాజా ....... నా సోదరీమణులైన రాకుమారి చెలికత్తెలు ఉండనే ఉన్నారుగా ........
పండితులు : కాబోయే మహారాజుగారే సెలవిచ్చారు .
మహారాజు : చామంతీ - మందాకినీ ...... సగం మంది రాకుమారిణి - సగం మంది రాకుమారుడిని వివాహానికి సిద్ధం చేసే బాధ్యత మీదే , మాకూ చాలా పనులున్నాయి . తల్లీ మహీ ...... నీ మనసు గెలిచిన వీరుడికి మన రాజమందిరం అంతా చూయించు , పెళ్ళిపనులు మొదలవ్వగానే ఎవరి మందిరంలో వారు చేరాలి , ముహూర్తానికి కేవలం కొన్ని ఘడియలు సమయం మాత్రమే ఉంది , మహామంత్రిగారూ ...... రాజ్యంలో ఉన్న కళాకారులు - చిత్రకారులు అందరినీ అందరినీ పిలిపించి పెళ్ళిమండపాన్ని న భూతొ న భవిష్యతి అని ఆశ్చర్యపోయేలా సిద్ధం చేయించండి , రాబోవు అతిథులకు ఏలోటూ లేకుండా అన్ని ఏర్పాట్లూ చెయ్యాలి పదండి , మహారాణీ వారూ ...... సమయం లేదు కదలండి .
మహారాణి : సంతోషంగా ప్రభూ ........
మహారాజా ...... మీ రాజ్య ధనుస్సు .
మహారాజు : మేము ఎత్తగలమో లేమో ...... , అది ఎప్పటికీ చంద్ర రాజ్య మహారాజుదే అంటే మీదే .......
ధన్యవాదాలు మహారాజా ....... , మీ అమ్మాయి ప్రేమను పొందాను కాబట్టి ధనుస్సును ఎత్తగాలిగాను కాబట్టి ఈ ధనుస్సు రాకుమారికే చెందుతుంది అంటూ అందించాను .
మహి : నా దేవుడి దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్లేకదా .......
మహారాజు : సంతోషంతో వెళ్లిపోయారు .
ప్రభూ ....... మమ్మల్ని సోదరీమణులు అన్నారు అంటూ ఆనందబాస్పాలతో దండం పెడుతున్నారు .
మేమిద్దరం ఇలా కలిసాము అంటే మీవల్లనే కదా ...... , మీచేతులమీదుగా పెళ్ళికొడుకు అవ్వడం నా అదృష్టం , గురువుగారి తరువాత నాకు అన్నీ మీరే అంటూ దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టాను ,
చెలికత్తెలు : చాలా చాలా సంతోషం వేస్తోంది ప్రభూ .......
మహి : నా వీరుడు నిజంగా దేవుడే అంటూ ఏకమయ్యేలా హత్తుకుంది , దేవుడా అందరూ వెళ్లిపోయారుకదా ఇకనైనా పెదాలపై ముద్దుపెట్టవచ్చుకదా ....... అంటూ ముచ్చికను కొరికేసింది .
స్స్స్ ...... అవునవును , నా దేవకన్య పెదాల మాధుర్యాన్ని పొంది చాలాసమయమే అయ్యింది అంటూ ఒకచేతితో నామీదకు లాక్కుని పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టాను .
మహి : మ్మ్మ్ మ్మ్మ్ ...... కాసేపు వదలకండి దేవుడా అంటూ తనివితీరా ముద్దులుకురిపిస్తోంది .
చెలికత్తెలందరూ సిగ్గుపడుతూ కళ్ళు మూసుకున్నారు .
మహి : ఇప్పుడు మనసు కుదుటపడింది అంటూ నా గుండెలపైకి చేరింది .
మహీ ....... మీ తండ్రిగారు చెప్పినట్లుగా .......
మహి : గుర్తుంది గుర్తుంది కాబోవు మహారాజా ...... , ప్రేమతో ముద్దులుకురిపిస్తూ రాజభవనం మొత్తం చూయిస్తాము రండి అంటూ నా చేతిని చుట్టేసింది .
మహీ ఒక్కక్షణం ఆగితే నా ధనుస్సు మరియు నా దేవకన్య అందించిన ఖడ్గం తీసుకొస్తాను .
మహి : నేను తీసుకొస్తాను కదా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , నేను కూర్చున్న చోటకువెళ్లి తీసుకొచ్చి చెలికత్తెలకు అందించి నా చేతిని చుట్టేసింది . అమ్మవారి ధనుస్సును మాత్రం మీదగ్గరే ఉంచుకోండి .
ఇది అమ్మవారు ...... వారి భక్తురాలికి ఇచ్చిన కానుక ......
మహి : సరే సరే మహారాజా .......
మహీ ....... ఇలా ఇప్పుడు నీ ముందు ఉన్నాను అంటే నీవల్లనే , నువ్వు ...... అమ్మవారిని దర్శించుకోమని చెప్పడం ద్వారానే .......
మహి : మంజరి అంతా చెప్పిందిలే ప్రభూ ....... , మంజరీ అంటూ చేతిని చూయించింది .
సంతోషంతో ఎగురుతున్న మంజరి నేరుగా వచ్చి నా భుజంపై వాలింది .
మహి : మంజరీ ...... నిన్నూ ....... , కొట్టడానికి కాదు లేవే అంటూ ఇష్టంగా ముద్దుపెట్టింది , దేవుడా ....... ముందు ఈవిషయాన్ని మన మిత్రుడికి చెప్పాలి రండి రండి అంటూ లాక్కునివెళ్లింది .
దూరం నుండి చూసి మిత్రమా ...... అంటూ పరుగులుతీసింది - ఎవరు నిన్ను ఈ గుఱ్ఱపుశాలలో ఉంచినది అంటూ స్వయంగా ముడి విప్పింది .
మన్నించండి యువరాణీ ...... స్వయంవరానికి విచ్చేసిన యువరాజులందరి అశ్వాలను ఇక్కడే ఉంచారు అని కాపరి బదులిచ్చారు .
మహి : కృష్ణ ...... నా ప్రాణమిత్రుడు , నాతోనే ఉంటాడు లేకపోతే నా ప్రత్యేకమైన ఉద్యానవనంలో ఉంటాడు .
చిత్తం యువరాణీ .......
మహి : మిత్రమా రా వెళదాము , ఎంత సంతోషం వేస్తోందో తెలుసా ? , ఎవ్వరికీ సాధ్యం కాని పోటీలో గెలుపొంది నన్ను కౌగిలిలోకి చేర్చుకున్నారు మన దేవుడు , స్వయంగా నాన్నగారే ...... మన దేవుడు వీరత్వాన్ని చూసి పొంగిపోయి నన్ను ..... దేవుడి గుండెలపైకి చేర్చారు అంటూ ప్రేమతో నిమురుతోంది .
మిత్రమా ....... పోటీ గొప్పతనం అంతా మహికే చెందుతుంది అంటూ వివరించాను.
సంతోషంతో చిందులువేశాడు కృష్ణ ......
మహి : అలా ఏమీ కాదులే కృష్ణా ...... అని చెబుతూనే నా గుండెలపైకి చేరింది . మిత్రమా ....... రాజభవనం మొత్తం నేనే స్వయంగా చూయిస్తాను , ముందుగా ..... అమ్మవారి దేవాలయం అంటూ ప్రధారమైన ఉద్యానవనానికి తీసుకెళ్లింది - అక్కడ వివాహ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి .
ఇంతటి పరమ భక్తురాలు కాబట్టే నా దేవకన్య సహాయంతో ధనుస్సును ఎక్కుపెట్టగలిగాను .
మహి : పొగిడింది చాలు ప్రభూ అంటూ తియ్యనైనకోపంతో కొడుతోంది .
కోపంలోనూ ముద్దొచ్చేస్తున్నావు మహీ ....... అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను ,అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము కాబట్టి కేవలం భక్తితో అంటూ పాదరక్షలను వదిలి పాదాలను నీటితో శుభ్రం చేసుకుని లోపలికివెళ్లాము .
అమ్మా ...... మీ ధనుస్సును ఎక్కుపెట్టి తప్పు చేసి ఉంటే మీ భక్తుడిని క్షమించండి ......... , మీ ప్రియమైన భక్తురాలి ప్రేమను పొందేలా అనుగ్రహించినందుకు ధన్యుణ్ణి అంటూ భక్తితో మొక్కుకున్నాను .
మహీ ....... నీకోసం అమ్మవారు అనుగ్రహించిన పువ్వు మరియు కుంకుమ అంటూ చూయించాను .
మహి : అమ్మా ...... నేను రాకపోయినా అనుగ్రహించారా అంటూ కళ్ళకు హత్తుకుంది - ప్రభూ ......
పెదాలపై చిరునవ్వుతో నా దేవకన్య నుదుటిపై కుంకుమ ఉంచాను .
మహి : అమ్మవారి సాక్షిగా ఒక్కటైపోయినట్లే అంటూ ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరింది .
అమ్మా ...... ఇంతవరకూ ఏ ఆటంకాలు లేకుండా ఒక్కటి చేసారు - ఇకముందుకూడా ఎదురుకాకుండా చూడు తల్లీ .......
మహి : అమ్మా ....... పండితులు చెప్పిన ఒడిదుడుకులు కూడా దరిచేరనివ్వకుండా చూడండి అంటూ ప్రాణంలా కౌగిలించుకుంది - ప్రభూ ...... అదిగో అమ్మవారి సమక్షంలో అంటే బయట ఉద్యానవనంలోనే మన వివాహం .
చూసానులే యువరాణీ అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
మహి : అందమైన నవ్వులతో ...... , ప్రభూ రండి మరి మూడురోజుల ముందు దొంగతనంగా మన మందిరంలోకి వచ్చారు - ఇప్పుడు మహారాజు అనుమతితో దొరలాగా రాజభవనం మొత్తం వీక్షించండి అంటూ చేతిని చుట్టేసి తీసుకెళ్లింది - మిత్రమా ..... రామరి , మంజరీ ...... దర్జాగా మిత్రుడిపై కూర్చున్నావన్నమాట అంటూ నవ్వుకుంది .
మహీ ...... ఇలా నవ్వుతూనే ఉండాలి అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
మహి : నా దేవుడు ప్రక్కన ఉంటే ఆనందం ఆగనే ఆగదు అంటూ సంతోషం పట్టలేక కొరికేసింది .
స్స్స్ .......
చామంతి : అప్పుడు అన్నమాట ఇప్పుడు తీర్చుకున్నారన్నమాట అంటూ నవ్వుకుంటున్నారు .
సోదరీ ....... గడిచిన మూడురోజులయితే గడియకోసారైనా కొరికేసింది .
మహి : అంత తియ్యగా ఉన్నారు మరి నా దేవుడు అంటూ మళ్లీ కొరికేసింది .
అందమైన ఉద్యానవనాలు - రాజ మందిరాలు - అద్భుతమైన శిల్ప సౌందర్యాలను చూయిస్తూ రాజ దర్బారులోని సింహాసనం దగ్గరికి తీసుకెళ్లింది . వివాహం తరువాత ఒక మంచిరోజున నా దేవుడికి పట్టాభిషేఖం చేసేది ఇక్కడే అంటూ కూర్చోబెట్టింది .
మహీ ........
మహి : తండ్రిగారు చూసినా సంతోషిస్తారు అంటూ నా ఓడిలోకిచేరి ప్రేమతో చుట్టేసి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
కాబోయే మహారాజుగారికి వందనాలు అంటూ పూలవర్షం కురిపించారు చెలికత్తెలు ........
అందరి సమక్షంలో నా దేవకన్యతోపాటు కూర్చుంటాను ఎందుకంటే నా దేవకన్య ఎందులోనూ తక్కువకాదు అంటూ గుండెలపై ఎత్తుకుని పైకిలేచాను .
మహి : నా దేవుడు బంగారం అంటూ ముద్దులుకురిపించింది , ప్రభూ ....... ఇలాగే ఎత్తుకుని మన మందిరానికి తీసుకెళ్లండి - ఈపాటికి మన మిత్రుడు మన ఉద్యానవనానికి చేరుకునిఉంటాడు .
యువరాణీవారి ఆజ్ఞ అంటూ ఎత్తుకునే చెలికత్తెలు చూయించిన మార్గంలో నడిచాను . మహీ ...... నీ ప్రేమను పొందడం వల్లనే ప్రధాన ద్వారం బయట ఉండాల్సినవాడిని రాజభవనంలో దర్జాగా తిరుగుతున్నాను .
మహి : రాజభవనంలో కాదు - నా దేవుడు ...... నా హృదయంలో ఉన్నాడు అంటూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
ప్రభూ ....... ఇదే మీ ప్రత్యేక మందిరం అంటూ ద్వారం తెరిచి ఉద్యానవనంలోకి వెళ్లిపోయారు .
మహి : ప్రభూ ...... అదిగో పాన్పు నన్ను దానిపై విసిరి నలిపెయ్యండి .
అనుకున్నాను ఇంకా అనలేదే అని అంటూ నుదుటిపై నుదుటిని తాకించాను .
మహి : స్స్స్ .......
మరికొద్ది ఘడియల్లో వివాహం ...... మూడురోజులు ఆగావు ఈ కొద్దిసేపు ఆగలేవా ? .
మహి : ఆగలేను అంటూ బుంగమూతిపెట్టుకుంది ( ఆగలేకనే కదా వీరా ...... మూడురాత్రులు మీతో స్వర్గసుఖాలు ఆస్వాదించినది ) .
బుంగమూతిపై ముద్దులవర్షం కురిపించడంతో అందమైన నవ్వులు వెల్లువిరిసాయి.
కాసేపు విశ్రాంతి తీసుకో మహీ అంటూ పాన్పుపైకి చేర్చాను .
మహి : అమ్మో ....... నా దేవుడిని చూడకుండా ఒక్కక్షణం కూడా ఉండలేను అంటూ లేచి నా చేతిని చుట్టేసింది .
The following 19 users Like Mahesh.thehero's post:19 users Like Mahesh.thehero's post
• 9652138080, arkumar69, dradha, Fuckingroll69, Iron man 0206, Kumarmb, maheshvijay, Naga raj, Nani198, Nmrao1976, RAANAA, Rajeev j, Rathnakar, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
మహీ - ప్రభూ ....... రాజమాత వేంచేస్తున్నారు అంటూ చామంతి వచ్చింది .
రాజమాత : తల్లీ మహీ ........
అమ్మా ...... అంటూ వెళ్లి గుండెలపైకి చేరింది .
రాజమాత : తల్లీ ...... అల్లుడుగారిని భోజన మందిరానికి తీసుకురా - మీ తండ్రిగారు వేచి చూస్తున్నారు , భోజనాల తరువాత పెళ్లికార్యక్రమాలు మొదలవుతాయి , మీ తండ్రిగారు మాటిచ్చినట్లుగా వివాహ సాంప్రదాయంలోని ప్రతీదీ జరిపించబోతున్నారు , నేను వెళుతున్నాను అల్లుడుగారిని తొందరగా తీసుకురా ........
మహి : అలాగే అమ్మా ...... మీరు వెళ్ళండి , పెళ్ళిపనులు మొదలవబోతున్నాయి అంటూ అందమైన సిగ్గుతో నా కౌగిలిలోకి చేరింది , మొదట మిత్రుడికి ఆహారం అందించి వెళదాము . ఉద్యానవనంలోకి వెళ్లి మిత్రుడికి ఇష్టమైన ఆహారాన్ని చేకూర్చి , మిత్రమా ...... ఏమైనా అవసరం అయితే మంజరి ద్వారా కబురు పంపు స్వయంగా నేనే వస్తాను అనిచెప్పి భోజన మందిరానికి తీసుకెళ్లింది .
లోపలికి అడుగుపెట్టగానే అలా చూస్తూ ఉండిపోయాను - మహీ .......
మహి : ఇకనుండీ నాదేవుడు భోజనం చేసేది ఇక్కడే అంటూ మహారాజు గారి ప్రక్కన తీసుకెళ్లి కూర్చోబెట్టింది .
మహారాజు : అల్లుడుగారూ ....... మీ భోజనమందిరానికి తగ్గదేనా ? , మన క్షత్రియులలో సహజమే కదా అంటూ ఎన్ని రకాల వంటలు ఉన్నాయో అన్నిరకాల వడ్డించారు - వడ్డించేవారిని ఆపి నా దేవకన్యే స్వయంగా వడ్డించింది .
మాహారాజు - రాజమాత మురిసిపోతున్నారు .
మహి : నా దేవుడికి నా చేతితో తినిపించాలని ఉంది .
వద్దు వద్దు మహీ ...... మొదటికే మోసం వస్తుంది .
మహి : అందుకే ఆగిపోయాను అంటూ అందమైన నవ్వులతో వడ్డిస్తూనే తిన్నది .
మహారాజా ....... వంటలు బహు రుచిగా ఉన్నాయి .
మహారాజు : కృతజ్ఞుణ్ణి యువరాజా ...... , ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తోంది , క్షత్రియులలో నీ అంతటి వీరుడిని చూడనేలేదు , వివాహం పూర్తయిన వెంటనే పట్టాభిషేకం చేయించి నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను మహారాణీ ........
మహారాణి : మీ ఇష్టం ప్రభూ ........
మహారాజు : క్షత్రియుల గొప్పదనం పెంచారు అల్లుడుగారూ .......
క్షత్రియుడు క్షత్రియుడు అని పదేపదే అంటుండటం విని మహివైపు తప్పుచేస్తున్నట్లుగా చూసాను .
మహి : పట్టాభిషేకం తరువాత క్షత్రియుడివి అయిపోతారు ప్రభూ ....... , నేనున్నానుకదా అంటూ చేతిపై ముద్దుపెట్టింది .
భోజనాలు పూర్తయ్యాక , అల్లుడుగారూ ...... పెళ్ళిపనులు మొదలుపెట్టాలి పెళ్లిపీఠలపై కూర్చునేంతవరకూ ఒకరినొకరు చూసుకోకూడదు అన్నది సాంప్రదాయం , ఇద్దరినీ వేరువేరు మందిరాలలో పెళ్ళికొడుకు - పెళ్లికూతురిలా ముస్తాబు చెయ్యాలి . అల్లుడుగారి కోరిక ప్రకారం చెలికత్తెలు సిద్ధం చేస్తారు మహి మందిరంలో - నా బంగారుతల్లిని స్వయంగా నేనే పెళ్లికూతురిని చేసి తరిస్తాను వెళదామా తల్లీ .......
మహి : అమ్మా మీరువెళ్లండి వెనుకే వస్తాను . రాజమాత వెళ్లిపోగానే గుండెలపైకి చేరింది - సాయంత్రం వరకూ మిమ్మల్ని చూడకుండా ఉండలేనే .......
నవ్వుకుని నా దేవకన్య బుగ్గలను ప్రేమతో అందుకున్నాను - అంతవరకూ గుర్తుండేలా అంటూ చేతులను బుగ్గలమీదనుండి నా దేవకన్య వయ్యారమైన నడుముపైకి చేర్చి నొక్కేస్తూ నామీదకు లాక్కుని తేనెలూరుతున్న పెదాలపై ఘాటైన ముద్దుపెట్టి ప్రేమను తెలియజేశాను .
ఆఅహ్హ్హ్ ....... మ్మ్మ్ ...... చాలు ప్రభూ చాలు అంటూ ఆ ముద్దుమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తనను తాను మైమరిచినట్లు రాజమాత వెనుక వెళ్లిపోతోంది .
తియ్యదనంతో నవ్వుకున్నాను .
ప్రభూ ప్రభూ ...... అన్నీ సిద్ధం చేసాము .
సోదరీమణులారా పదండి అంటూ వెనుకే మహి మందిరానికి చేరుకున్నాను .
రోటిని పూజించి రోటిలో పసుపు దంచడంతో పెళ్ళిపనులు మొదలయ్యాయని చంద్రిక సన్తహోశంతో8 పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది . పసుపు వినాయకుడిని తయారుచేసి వివాహ కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ ఎటువంటి విజ్ఞాలూ రాకూడదని పూజించారు మహారాజు - రాజమాత ...... , ఇక ప్రభువులను పెళ్ళికొడుకుగా చెయ్యవచ్చు అక్కడ మహిని కూడా పెళ్లికూతురిని చేసేస్తున్నారు .
సోదరీ ....... ఇంకా ప్రభువు ఏమిటి ఇక మీ సోదరుణ్ణి కదా , సోదరా అని ప్రేమతో పిలవచ్చు కదా .......
చెలికత్తెలందరూ ఉద్వేగానికి లోనయ్యారు . కృతజ్ఞులం ప్రభూ .......
అదిగో మళ్లీ .......
సంతోషం సోదరా అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా చేతులను అందుకుని ఉద్యానవనంలోని పెళ్ళిపందిరి కింద బుజ్జి తోడు పెళ్లికూతురుతోపాటు కూర్చోబెట్టి పసుపు నీళ్లతో మొదలెట్టి పెళ్ళికొడుకును చేశారు . ఎదురుగా పెళ్ళిపెద్దలుగా మిత్రుడు - మంజరి తెగ ఆనందిస్తున్నారు .
నాకోసం అప్పటికప్పుడు సిద్ధం చేయించిన వస్త్రాలను అందించడంతో లోపలికివెళ్లి వేసుకున్నాను - పెళ్ళికొడుకులా అందంగా ముస్తాబు చేశారు .
అక్కడ మహికి మంగళ స్నానం చేయించి పట్టువస్త్రాలతో పెళ్లికూతురిలా మార్చి , మహి చేతులమీదుగా గౌరీ పూజ చూయిస్తున్నారు .
నన్నే ప్రాణంలా తలుచుకుంటూ పూజ పూర్తి చేసింది .
అక్కడ - ఇక్కడ పండితులు సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలన్నీ పూర్తిచేసేటప్పటికి పెళ్లి సమయం ఆసన్నమయ్యింది .
పండితులు : రాకుమారా ...... ఇదిగో ఈ పెళ్లివస్త్రాలను ధరించి అలంకరించుకుని వస్తే మేళతాళాల మధ్యన పెళ్ళిమండపానికి తీసుకెళతాము .
ఇదేమాటను మహికి చెప్పగానే , నన్ను చూడబోతున్నానన్న ఆనందంలో రాజమాత బుగ్గపై సంతోషంతో ముద్దుపెట్టి , రాజమాత మందిరంలోకి వెళ్లి పెళ్ళిచీరను కట్టుకుంది .
తల్లీ ఇలా కూర్చో అంటూ అద్దం ముందు కూర్చోబెట్టి వజ్రవైఢూర్యాలు పొడగబడిన ఆభరణాలతో నిలువెల్లా అలంకరించి మురిసిపోతున్నారు .
ఇక్కడ సోదరీమణులు ....... నన్ను పెళ్ళికొడుకులా అలంకరించి తలపాగా ఉంచి , మహి చూడగానే మీ మీదకు చేరుతుందేమో సోదరా ......
సోదరీ ...... మహీ ఎలా ఉంటుందో ? .
అక్కడ అందంగా అలంకరించిన మహిని చూసుకుని ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు రాజమాత ........
మహి : చిరునవ్వులు చిందిస్తూ ....... అమ్మా తండ్రిగారిని పిలవండి అనిచెప్పి , ఇద్దరి పాదాలకు నమస్కరించింది .
సంతోషం తల్లీ ....... అంటూ లేపి గుండెలపైకి తీసుకుని మురిసిపోయారు .
ప్రభూ ...... ముహూర్త సమయం ఆసన్నమవుతోంది - మేళతాళాల మధ్యన సంబరంలా కాబోవు మహారాజుగారిని పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళుతున్నారు .
మహామంత్రిగారూ ...... కొద్దిపాటి సమయంలో అన్నీ అనుకున్నట్లు జరిపించిన మీ ప్రతిభకు ధన్యవాదాలు .......
మహామంత్రి : కృతజ్ఞుణ్ణి ప్రభూ .......
మహి : తండ్రిగారూ ...... తొందరగా తీసుకెళ్లండి .
మహారాజు : అంతటి వీరుడిని అల్లుడుగా చేసుకోవడం అంటే నాకూ ఆత్రంగానే ఉంది తల్లీ ...... అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు . నిన్ను బుట్టలో కూర్చోబెట్టుకుని ఎత్తుకునివెళ్లడానికి మీ మావయ్యలు సిద్ధంగా ఉన్నారులే .......
సంతోషం తండ్రిగారూ అంటూ సిగ్గుపడింది .
మేళతాళాల మధ్యన సోదరీమణులు ...... ప్రధాన ఉద్యానవనంలోని అమ్మవారి దేవాలయం ఎదురుగా సిద్ధం చేసిన పెళ్ళిమండపానికి తీసుకెళ్లారు , నాతోపాటు మిత్రుడు - మంజరి వచ్చారు .
కొద్ది గడియాల్లోనే అంతటి అద్భుతమైన కళ్యాణమండపాన్ని సిద్ధం చేసిన కళాకారులకు ధన్యవాదాలు తెలుపుకోవాల్సినదే ....... , విద్యుత్ దీపాలు - కాగడాల వెలుగులలో పూలతో అలంకరించిన పెళ్ళిమండపాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడంలేదు .......
మహారాజు వారు స్వయంగా వచ్చి , అప్పటికే విచ్చేసిన సామంతారాజులకు వీరాధివీరుడు నా అల్లుడుగారు అంటూ పరిచయం చేస్తూ వెళ్లి పెళ్ళిమండపంలో కూర్చోబెట్టారు .
రాజ్య ప్రజలంతా మహేశ్వరుడు మహేశ్వరుడు అంటూ జయజయనాదాలు చేస్తున్నారు .
అప్పుడే బుట్టలో కూర్చుని వస్తున్న మహి విని అంతులేని ఆనందంతో పరవశించిపోతోంది . నా ఎదురుగా పెళ్లిపీఠలపై కూర్చోబెట్టగానే మాఇద్దరి మధ్యన ఉన్న పరదా చాటున తొంగితొంగిచూస్తోంది .
పండితులు ...... మాఇద్దరితో పూజ జరిపించి , పరదాను తొలగించారు .
ఎదురుగా పట్టువస్త్రాలు - నిలువెల్లా ఆభరణాలతో పెళ్లికూతురిగా నా దేవకన్యను హృదయంపై చేతినివేసుకుని అలా కన్నార్పకుండా ప్రేమతో చూస్తుండిపోయాను .
నా చూపులకు మహి సిగ్గుపడటం చూసి హృదయం పులకించిపోతోంది .
నన్నుకూడా అందంగా ముస్తాబు చేసినందుకుగానూ ...... చామంతిని పిలిచి బుగ్గపై ముద్దుపెట్టడం చూసి ఆనందించాను - నా భుజంపైనే ఉన్న మంజరిని అందమైనకోపంతో ఒసేయ్ మంజరీ ...... మన దేవుడి దగ్గరే ఉండిపోయావు కదూ ..... ఒక్కసారైనా నాదగ్గరికి రానేలేదు .
నవ్వుకుని , మంజరీ ...... వెళ్లు .
మంజరి వెళ్లి మహి భుజంపై వాలి , మహి బుగ్గపై ముద్దుపెట్టింది , మహీ ...... నాకే అసూయ వేసేంత అందంగా ఉన్నావు తెలుసా ? , పాపం మన దేవుడు ఎంత నియంత్రించుకుంటున్నారో ......
మహి చిలిపిదనంతో నవ్వుతోంది .
పండితుల మంత్రాలు - మేళతాళాలు - పూలవర్షం అన్నింటినీ మరిచిపోయి నా దేవకన్య సౌందర్యం మైకంలో పడిపోయినట్లు ,పండితులు చెయ్యమన్నదల్లా తెలియకుండానే చేస్తూ పోతున్నాను , మహి అందం - ఆనందం - సిగ్గు ...... నన్ను ఎల్లలులేని సంతోషాలకు చేర్చింది .
మంత్రాలు పూర్తవడం - ముహూర్త సమయం దగ్గరపడటంతో భజంత్రీలు భజంత్రీలు అంటూ పండితులవారు నాచేతిని తాళిని అందివ్వడంతో నా దేవకన్య మైకం నుండి బయటపడ్డాను .
తాళి అందుకుని లేచి అతిథులందరికీ మరియు మిత్రుడికి చూయించి నా దేవకన్య నుదుటిపై మంజరికి ప్రేమతో ముద్దుపెట్టి మూడుముళ్లు వేసి మెడపై చిన్నగా గిల్లి కూర్చున్నాను .
మాపై కురుస్తున్న అక్షింతలు - పూలవర్షంలో నా దేవకన్య స్స్స్ ..... అంటూ కొంటె కోపంతో చూస్తుండటం చూసి భలే ముచ్చటేసింది .
తరువాత హోమం చుట్టూ ఏడడుగులు - పాలపాత్రలో ఉంగరపు సయ్యాట - బంతి ఆట - పెద్దల ఆశీర్వాదం - భోజనాలు ...... ఇలా సాంప్రదాయం ప్రకారం వివాహం అంగరంగవైభవంతో పూర్తయ్యింది , ప్రతీ ఆచారానికి మహి పెదాలపై అంతకంతకూ ఆనందం పెరుగుతూనే ఉంది - ఒక అమ్మాయికి తను కోరుకున్న వ్యక్తి వరుడుగా లభిస్తే కలిగే ఆనందాన్నే మహి అనుభూతి చెందుతోంది .
మహారాజు - రాజమాత మరియు పండితుల ఆశీర్వాదం తీసుకుని , మిత్రుడి దగ్గరకువెల్లి సంతోషాలను పంచుకున్నాము .
జంటగా చేతులను పెనవేసుకుని మంజరితోపాటు దేవాలయానికి వెళ్లి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము .
నాకళ్ళల్లో ఒక్కసారిగా చెమ్మ .......
మహి : ప్రభూ ....... గురువుగారి ఆశీర్వాదం తీసుకోలేదనే కదా అంటూ గుండెలపైకి చేరింది - ప్రభూ ....... తెల్లవారగానే గురువుగారి దగ్గరకు వెళ్లే ఏర్పాట్లుచేయిస్తాను - ఇద్దరమూ వెళ్లి ఆశీర్వాదం తీసుకుందాము .
సంతోషంతో మహి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
బయటకువచ్చిచూస్తే అతిథులందరూ ...... భోజనాలు పూర్తిచేసుకుని రాజభవనంలో ఏర్పాటుచేసిన విశ్రాంతి భవనాలకు చేరుకుంటున్నారు . చివరగా మహారాజు మహామంత్రి చెలికత్తెలతో కలిసి భోజనాలకు కూర్చున్నాను .
అందరి సమక్షంలో సంతోషాల మధ్యన ఒకరికొకరం ప్రేమతో తినిపించుకుని ఆనందించాము .
భోజనాల తరువాత మహారాజువారు ...... పండితులతో మాట్లాడటం చాటుగా విన్నట్లు చామంతి సిగ్గుపడుతూ వచ్చి , మహీ మహీ ...... మరికొద్దిసేపట్లో శోభనానికి మంచి ముహూర్తం ఉన్నట్లు ముచ్చటిస్తున్నారు .
మహి సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది .
అంతలో రాజమాత వచ్చి తల్లీ ....... తెలిసిపోయినట్లుంది ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు - అల్లుడుగారూ ...... ఒక ఘడియలో శోభనపు వస్త్రాలలో నీ శ్రీమతిని నీముందుంచుతాను .
మహి వదల్లేక వదల్లేక వదిలి వెనక్కు తిరిగితిరిగి చూసి సిగ్గుపడుతూనే వెళ్ళింది .
చామంతి : సోదరా ...... మీ మందిరంలో వస్త్రాలు ఉంచాము రండి అంటూ పిలుచుకునివెళ్లి , తలుపులువేసుకోండి మహి వచ్చేస్తుంది అంటూ లోపలికివదిలి తలుపులు వేసుకున్నారు .
మల్లెపూల సువాసన గుప్పుమనడంతో వెనక్కు తిరిగిచూస్తే ఎప్పుడు సిద్ధం చేశారో గదిమొత్తం పూలతో - క్రొవ్వొత్తులతో శోభనపు గదిలా అలంకరించబడింది , ఇక పాన్పు అయితే శృంగారభరితం ....... ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది .
మంజరి : అమ్మో ...... ఇక నేను ఇక్కడా ఉండనేకూడదు , ఉద్యానవనంలోని మన మిత్రుడి దగ్గరకువెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అనిచెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది .
నవ్వుకుని బల్లపై ఉన్న తెల్లని వస్త్రాలను అందుకుని స్నానపు గదిలోకివెళ్లి స్నానం చేసి వస్త్రాలు ధరించి పూలతో అలంకరించిన పాన్పుపై కూర్చుని నా దేవకన్యకోసం ఆశతో ఎదురుచూస్తున్నాను ...........
కొద్దిసేపటికే అంటే శోభన ముహూర్తానికి ముందే ........ , ద్వారాన్ని గట్టిగా బాదుతున్న చప్పుళ్ళు వినిపించాయి .
ఆ చప్పుళ్ళు వింటుంటేనే ఏదో జరగరానిది జరగబోతోందని మనసులో సంకోచంతో వెళ్లి ద్వారం తెరిచాను . ఎదురుగా మహారాజు .......
మహారాజా ........
మహారాజు : కళ్ళల్లో కోపాగ్నితో ...... , నువ్వు క్షత్రియుడివేనా ? అని ముక్కుసూటిగా అడిగారు .
ప్రభూ ......
మహారాజు : మహేశ్వరా ..... నిజం చెప్పు , నువ్వు క్షత్రియుడివా కాదా ? .
ప్రభూ .......
తడబడుతుంటే ఇంకా అడుగుతారేంటి మహారాజా అంటూ హిడుంభి యువరాజు నాముందుకువచ్చాడు .
నానుండి మాట రాలేదు ....... అలా చూస్తుండిపోయాను ..........
The following 18 users Like Mahesh.thehero's post:18 users Like Mahesh.thehero's post
• 9652138080, arkumar69, dradha, Iron man 0206, Kumarmb, maheshvijay, Manavaadu, Naga raj, Nani198, RAANAA, Rajeev j, Raju1987, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
మహారాజు : మహేశ్వరుడా ...... చివరిసారిగా అడుగుతున్నాను నువ్వు క్షత్రియుడివా కాదా ? .
కాదు అన్నట్లు తలదించుకున్నాను .
మహారాజు : అంటే ఈ హిడుంభి రాకుమారుడు చెప్పినది నిజమే అన్నమాట అంటూ ముందు హడలిపోయారు ఆ వెంటనే కోపంతో ఊగిపోతున్నారు .
ప్రభూ నన్ను మన్నించండి - రాకుమారి అంటే నాకు ప్రాణం - ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాము - తనకు ఏ లోటూ లేకుండా చూసుకుంటాను .
మహారాజు : ఇక ఆపు , ఇంతవరకూ మహారాజునైన నాతోపాటు రాజ్యంలో అందరినీ మోసం చేసింది చాలు - నువ్వు ఏ పరివారం లేకుండా ఒంటరిగా వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది .
ప్రభూ ...... తప్పు మాదే మన్నించండి అంటూ మహామంత్రి - సైన్యాధ్యక్షుడు తలలు దించుకున్నారు .
ప్రభూ ...... మోసం చెయ్యాలని కాదు - ప్రేమను గెలిపించుకోవడానికి వేరే మార్గం ఇలా చేసాను .
మహారాజు : ప్రేమకు నేను అడ్డుకాదు కానీ నీ స్థాయిని చూసి ప్రేమించాలి - నాకు పరువే ముఖ్యం - మా తరతరాలుగా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ వెళుతున్నాము - నా బిడ్డపై అంతులేని ప్రేమ నా బిడ్డ సంతోషం కంటే నాకు రాజ్యం పరువే ముఖ్యం - పెళ్లికోసం వచ్చిన సామంతరాజులకు ఈవిషయం తెలిస్తే మన పరువు మొత్తం పోవడమే కాకుండా మనపై ఉన్న భయం పోయి పన్నులు కూడా కట్టరు - వీటన్నింటి గురించి ఆలోచిస్తే నువ్వు చేసినది అక్షరాలా మోసం ..... భటులారా ఈ మోసగాడిని బంధించి జీవితకాలం కారాగారంలో పడేయ్యండి .
హిడుంభి యువరాజు : మహారాజా ...... చంద్ర వంశాన్నీ మరియు మమ్మల్ని మోసం చేసిన ఈ మోసగాడికి ఆ శిక్ష సరిపోదు వెంటనే ఉరిశిక్ష విధించండి - అప్పుడే క్షత్రియుల పరువుప్రతిష్టలు నిలబడతాయి మరియు ఇలాంటివాళ్లకు తమ స్థాయి ఏంటో తెలుస్తుంది .
మహారాజు : అవునవును వెంటనే ఉరిశిక్ష ఏర్పాట్లు చెయ్యండి - ఈ మోసగాడి గురించి ఎవ్వరికీ తెలియకూడదు అంటూ ఆజ్ఞ వేశారు
మోసగాడు అని నిరూపణ అయ్యాక ఇక వివరణ ఇచ్చుకోవడానికి మాటలు లేక మౌనంగా ఉండిపోయాను .
మంజరి తెగ కంగారుపడుతూ నా భుజం పైకి చేరింది . ప్రభూ ...... వెంటనే వెళ్లి మహికి చెబుతాను .
వద్దు మంజరీ ...... తను తట్టుకోలేదు - ఆ దుర్గమ్మ తల్లి ఎలా అనుగ్రహిస్తే అలా శిరసావహిస్తాను - నేనే ఏదో తప్పుచేసాను అమ్మ కోపాగ్నికి లోనయ్యాను .
మంత్రి గారు : ప్రభూ ...... ఉన్నఫలంగా ఉరిశిక్ష విధిస్తే , ఈ విషయం గురించి ప్రజలలో చర్చ జరుగుతుంది - సామంత రాజులకు తెలిసిపోతుంది ,
మహారాజు : చక్కగా చెప్పారు మహామంత్రీ ...... , ఈ విషయం ఈ నాలుగు గోడలు దాటి బయటకు వెళ్లకూడదు , ఇక్కడ ఉన్న ఏ ఒక్కరుకూడా పరిస్థితులు చక్కదిద్దేవరకూ రాజ్యమందిరం దాటి వెళ్లిపోకూడదు అంటూ ఆజ్ఞలు వేశారు .
సైన్యాధ్యక్షుడు : చిత్తం ప్రభూ ......
హిడుంభి యువరాజు : మహారాజా ...... మీ పరువుప్రతిష్టలకు ఏమాత్రం భంగం కాకూడదు అంటే యువరాణిని నాకిచ్చి వివాహం జరిపించండి - సంతోషంగా చేసుకుంటాను .
ప్రభూ ప్రభూ .......
మహారాజు : సైన్యాధ్యక్షా ...... ఈ మోసగాడు నాకళ్ల ముందు ఉండకూడదు లాక్కెళ్లి చెరశాలలో బంధించండి .
సైన్యాధ్యక్షుడు : భటులారా .......
భటులు వచ్చి పట్టుకున్నారు .
హిడుంభి యువరాజు : మహారాజా ...... ఈ విషయం గురించి మనిద్దరమే ఒంటరిగా మాట్లాడటం మంచిది - ముందైతే రాకుమారికి ఇలా చెప్పండి అంటూ గుసగుసలాడాడు .
మహారాజు : సరిగ్గా సెలవిచ్చావు రాకుమారా ...... , మహామంత్రీ ఇతడు మోసగాడు అని , రాకుమారి మందిరంలోని నగలను తీసుకుని పారిపోయాడని యువరాణికి తమరే స్వయంగా తెలపండి .
మహామంత్రి : చిత్తం ప్రభూ .......
మంజరి : ప్రాణాలుపోయినా మహి నమ్మదు - మహేష్ అంటే అంత నమ్మకం తనకు ........ , ఇప్పుడే వెళ్లి ఈ విషయం గురించి మహికి చెబుతాను .
మహారాజు : భటులారా ...... మొదట ఆ చిలుకను బంధించండి - ఈ మందిరం దాటి వెళ్లకూడదు .
మంజరీ ....... మహికి నామాటగా చెప్పు , ప్రాణం ఉంటే ఎలాగైనా తనను చేరుతానని ........
హిడుంభి యువరాజు : అలా జరగనే జరగదు - నువ్వు జీవితాంతం చీకటి చెరశాలలో లేదా ఉరిశిక్షకు సిధ్ధంగా ఉండు , ఇప్పటికిప్పుడు నీ ప్రాణాలు తియ్యగలను కానీ నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు మిగిలే ఉన్నాయి , భటులారా చెరశాలలో బంధించడం కాదు సంకెళ్లతో కట్టి ఉంచండి కొద్దిసేపట్లో వచ్చి కలుస్తాను.
ప్రభూ ప్రభూ ...... చిలుక తప్పించుకుని యువరాణీ వారి దగ్గరకు వెళుతోంది .
భటుల వెనుకే మహారాజు కూడా పరుగులుతీశారు .
హిడుంభి యువరాజు : భటులారా ..... వీడిని లాక్కెళ్లండి అనిచెప్పి , క్షత్రియులతో పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది ఇక నీ జన్మలో ఆ అందాలరాశిని చూడలేవు .......
నేను - తను కలిసి జీవించడం దైవేచ్చ ...... అది జరగకుండా ఎవ్వరూ ఆపలేరు .
హిడుంభి యువరాజు : నేను ఆపుతాను అంటూ కడుపులో ఒక దెబ్బవేసి రాక్షస నవ్వుతో మహారాజా మహారాజా అంటూ వెళ్ళాడు .
( మంజరి : మహీ మహీ ...... ఘోరం ఘోరం , మన దేవుడి గురించి మహారాజుకు తెలిసిపోయింది - చెరశాలలో బంధించమని ఆజ్ఞాపించారు .
మహి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది - కళ్ళల్లోనుండి కన్నీళ్లు ఆగడం లేదు .
మంజరి : మహీ మహీ ....... , ఎలాగైనా నిన్ను కలుస్తాను అని మాటిచ్చారు మన దేవుడు .......
అప్పటికిగానీ మహి ప్రాణం తిరిగిరాలేదు .
మహారాజు : దేవుడు ...... ? , వాడు దేవుడు కాదు మోసగాడు ...... , నిన్ను ప్రేమ అనే పేరుతో మోసం చేసి వలలో వేసుకున్నాడు .
మహి : తండ్రి గారూ ...... మహేష్ మంచివాడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు అంటూ గుండెలపైకి చేరింది .
మహారాజు : నువ్వే సర్వస్వం అనుకుని ఏ మహారాజు ఇవ్వని స్వేచ్ఛను ఇచ్చినందుకు ఈ తండ్రినే మోసం చేసావు తల్లీ ...... , భటులారా ..... ఆ చిలుకను బంధించండి .
భటులు వెళ్లి మంజరిని పట్టుకుని పంజరం లో బంధించారు .
తండ్రి గారూ ...... అంటూ కన్నీళ్ళతో మౌనంగా ఉండిపోయింది .
మహారాణి : ప్రభూ ....... ఆ విషయమే నాకు మరియు మీకు తెలియజెయ్యాలని అనుకునేంతలో ఇలా జరిగిపోయింది .
మహారాజు : ఇప్పుడు కాదు మహారాణీ ..... వివాహానికి ముందు చెప్పి ఉండాలి .
మహారాణి : ప్రభూ ...... మనకు మన తల్లి సంతోషం కంటే ఇంకేమి కావాలి చెప్పండి - మీరే అన్నారుకదా అల్లుడుగారిని మించిన వీరుడు ఈ భువిపైననే లేడని ........
హిడుంభి యువరాజు : ఇక నుండీ ఆ బాధ్యత నాది మహారాణీ వారూ ......
మహారాజు : అవును మహారాణీ ...... , వీరుడైతే మాత్రం సరిపోదు ఖచ్చితంగా క్షత్రియుడై ఉండాలి , తల్లీ మహీ ...... ఈ తండ్రి అంటే గౌరవం ఉంటే ఈ తండ్రి కోరిక తీరుస్తావా ? - నువ్వు ఈక్షణమే ఈ యువరాజుని వివాహం చేసుకోవాలి .........
మహి : తండ్రి గారూ ......
మహారాణీ : మహారాజా .......
మహి : తండ్రి గారూ ...... , అంతకంటే ప్రాణాలు వదిలెయ్యమని ఆజ్ఞాపించండి - సంతోషంగా వదిలేస్తాను అంటూ కన్నీళ్ళతో చెబుతోంది .
మహారాణీ : తల్లీ ...... అంటూ గుండెలపైకి తీసుకున్నారు .
మంజరి : మహీ ...... నువ్వు ప్రాణాలు వదిలేస్తే అక్కడ మన దేవుడి ప్రాణం నిలుస్తుందా ? .
మహి : లేదు లేదు లేదు అలా జరగడానికి వీలులేదు .
హిడుంభి యువరాజు : మహారాజా ...... మీరు అనుమతి ఇస్తే ఒక సలహా ...... , నన్ను వివాహం చేసుకుంటేనే ఆ మోసగాడిని కనీసం ప్రాణాలతోనైనా ఉంచుతాను అనిచెప్పండి .
మహారాజు : పరువుప్రతిష్ఠల మాయలోపడినట్లు ఏమాత్రం ఆలోచించకుండా హిడుంభి రాకుమారుడు చెప్పినట్లు చేస్తున్నారు - సైన్యాధ్యక్షా ...... ఆ మోసగాడిని వెంటనే ఉరితియ్యడానికి ఏర్పాట్లు చెయ్యండి , తల్లీ ...... సమయం లేదు తెల్లారేలోపు హిడుంభి రాకుమారుడు పథకం ప్రకారం అన్నీ జరిగిపోవాలి .
మహి : తండ్రి గారూ ...... అంటూ కన్నీటిపర్యంతం అవుతోంది , కాదనలేదు - ఔననలేదు .......
మంజరి అయితే పంజరంలో ఎగురుతూ కన్నీటిని కారుస్తోంది .
మహారాజు : మహామంత్రీ ...... ఇక రాకుమారి సమ్మతంతో సంబంధం లేదు , మరలా వివాహం చేసుకుంటేనే ఆ మోసగాడు కనీసం చెరశాలలోనైనా ప్రాణాలతో ఉంటాడు .
మహామంత్రి : ప్రభూ ...... మరలా వివాహం అంటే కూడా విషయం ఎలాగోలా తెలిసిపోతుంది .
హిడుంభి యువరాజు : అయితే దీనికి ఒకటే పరిష్కారం మహారాజా ....... , ఇక్కడ మా వివాహం జరిగిపోయిందని తీసుకెళ్లి మా రాజ్యంలో వివాహ ఏర్పాట్లు చేయిస్తాను , మీరు బంధు సమేతంగా వచ్చి తిలకించవచ్చు ......
మహారాజు : చక్కటి పరిష్కారం యువరాజా ....... , ఇక్కడి ప్రజలకు - సామంతరాజులకు ఎలాంటి అనుమానం కలుగదు , ఇద్దరూ ఒక్కటే అనుకుంటారు అంటూ సంతోషిస్తున్నారు .
హిడుంభి యువరాజు : మహారాజా ...... ఇలా అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అంటే రాత్రికిరాత్రి ప్రయాణమై వెళ్లిపోవాలి - మేము వెళ్లి మీకోసం ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయిస్తాము .
మహారాజు : నేను కోరుకునేది కూడా అదే ...... , మా రాజ్య పరువుప్రతిష్ఠలు నిలబడాలంటే నిర్ణయాలు త్వరత్వరగా తీర్చుకోవాల్సిందే ...... , మహామంత్రీ ఆ ఏర్పాట్లు చెయ్యండి .
మహి : తండ్రి గారూ .......
మహారాజు : నువ్వు చేసిన మోసానికి ...... , మన రాజ్యం కోసం నీకు ఇష్టమైన లేకపోయినా నా ఆజ్ఞను పాటించాల్సిందే లేకపోతే మీ అమ్మ - నేను ప్రాణాలతో ఉండము - మహామంత్రీ ...... విషాన్ని తెప్పించండి - తల్లీ ..... నీకు తెలుసు మన రాజ్యప్రతిష్ఠ కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటానని .......
మహి : తండ్రి గారూ ...... అంతమాట అనకండి అంటూ ఏడుస్తూ వెళ్లి దుర్గమ్మ సన్నిధికి చేరింది - అమ్మా ...... ఇంత జరుగుతున్నా చూస్తూ ఉంటారా ? , నా దేవుడు లేకుండా నేనుండలేను - నా దేవుడు ఉండాలంటే నాన్నగారి మాటను మన్నించాలి - నీపైనే భారం వేస్తున్నాను అంటూ కన్నీళ్ళతో స్పృహకోల్పోయింది .
మహారాణి : తల్లీ తల్లీ ....... , ప్రభూ ...... మరొక్కసారి ఆలోచించండి .
మహారాజు : ఆలోచించే సమయం లేదు మహారాణీ ....... , చంద్ర రాజ్య అధినేతగా నాకు ....... మన బిడ్డ - నీ సంతోషం కంటే రాజ్యప్రతిష్టలే ముఖ్యం , కొద్దిసేపట్లో తన ప్రయాణం .......
హిడుంభి యువరాజు : సంతోషం మహారాజా ...... , ప్రయాణానికి ముందు తీర్చుకోవలసినవి తీర్చుకునే వెళతాను - సైన్యాధ్యక్షా ...... చెరశాల ఎక్కడ ? ) .
The following 16 users Like Mahesh.thehero's post:16 users Like Mahesh.thehero's post
• 9652138080, arkumar69, dradha, Iron man 0206, Kumarmb, maheshvijay, Manavaadu, Naga raj, RAANAA, Rajeev j, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
ఇక్కడ రాజు ఆజ్ఞ ప్రకారం నన్ను ..... పాతాళం లాంటి ప్రదేశంలో ఉండే చెరశాలకు తీసుకెళ్లారు - ఆ ప్రదేశం చూడటానికే భయ కంపితం లా ఉంది .
భటులు : ఇది నరకంలాంటిది - అడవుల్లో ఉంటూ రాజ్యం పై దండెత్తడానికి వచ్చిన బందిపోట్లను ఇక్కడే బంధించి నరకం చూయిస్తాము - మహారాజు గారు నిన్ను ఇక్కడే ఎవ్వరికీ తెలియకుండా బంధించమన్నారు - ఇక ఆహిడుంభి యువరాజు అయితే సంకెళ్లతో కట్టెయ్యమన్నాడు ఎందుకో తెలియదు భయంకరంగా ఉండే ద్వారం తెరవగానే ........
రేయ్ రేయ్ ...... మనవాళ్ళు మరికొంతమంది దొరికినట్లున్నారు - ఈ రాజుగాడిని ఊరికే వదలకూడదు అంటూ చెరశాలల్లో కోపంతో ఊగిపోతున్నారు .
భటులు : మీ బందిపోట్లకు మళ్లీ దాడి చేసే ధైర్యం ఎక్కడుంది - ఈసారి దాడి చేసినవాళ్లను అక్కడికక్కడే పాతేస్తాము కానీ ఇప్పటికే సరిపోని ఈ నరకంలోకి ఎందుకు తీసుకొస్తాము .
బందిపోట్లు : ఒక్కసారి వదలండి మేమేంటో చూయిస్తాము .
భటులు : అలా చూయించే ఇక్కడ బిక్కుబిక్కుమంటూ నరకాన్ని చూస్తున్నారు - ఇంకనూ మీకు బుద్ధిరాలేదు , ఇతడెవరో తెలిస్తే మీరు మరింత కోపంతో రగిలిపోతారు , రాకుమారిణి బంధించాలని దాడి చేసి ఎవరితోనైతే చావుదెబ్బలు తిన్నారో అతడే ...... , రాజ్య ద్రోహానికి పాల్పడటం వలన ఈ నరకంలోకి అడుగుపెడుతున్నాడు .
బందిపోట్లు : వాడా వాడా ...... ఒక్కసారి ఒక్కసారి ఈ తాళాలను తెరవండి వాడిని ముక్కలుముక్కలుగా చేసి మాకోపం చల్లార్చుకుంటాము - ఏళ్ళు ఏళ్ల తరబడి పథకం ప్రకారం దాడి చేస్తే అలా వచ్చి రక్షించి మమ్మల్ని ఈ నరకంలో చేరేలా చేసాడు .
భటులు : చూశావా వీరా ...... నీపై ఎంత కోపంతో ఉన్నారో కాబట్టి బుద్ధిగా ఉండి వీళ్ళతోపాటు నీకు రాజుగారు ఉరిశిక్ష ఎప్పుడు విధిస్తారో అని వేచిచూస్తూ కూర్చో , ఎందుకంటే ఈనరకం కంటే ఉరిశిక్షనే హాయిగా ఉంటుంది .
బందిపోట్లు : అవును అవును మమ్మల్ని వదిలెయ్యండి లేదా చంపేయ్యండి అంటూ కేకలువేస్తున్నారు .
భటులు : నవ్వుకుని , ఖాళీగా ఉన్న ఒకేఒక నరకపు గదిలో కాళ్ళు చేతులనూ ఇరువైపులా గోడలకు సంకెళ్లతో బంధించి తాళాలువేసి వెళ్లిపోయారు .
మొత్తం చీకటిగా మారిపోయింది - మహీ ...... నన్ను మన్నించు నావలన నువ్వు ఇబ్బందులు పడబోతున్నావు - నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కలుస్తాను , దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో నిన్ను నాదానిని చేసుకున్నాను - ఆ అమ్మే మళ్లీ మన ఇద్దరినీ కలుపుతారు , కానీ పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమేనా ..... ? , అమ్మా దుర్గమ్మా ...... నాకు ఏమైనా పర్లేదు మీ చూపు ఎల్లవేళలా మీ బిడ్డ మహిపై ఉండేలా చూడండి అంటూ ప్రార్థించాను - గురువుగారూ ...... మీరు కోరిన ఏకైక కోరికను తీర్చలేని ఈ అసమర్థుడిని మన్నించండి అంటూ బాధపడుతున్నాను .
రేయ్ రాజ్యద్రోహీ ...... ఎవరైనా ఈ చెత్త రాజ్యానికి ద్రోహం చేస్తే వారు మాకు సన్నితులైపోతారు కానీ నువ్వుమాత్రం ఎప్పటికీ మాకు శత్రువే , అవకాశం లభిస్తే నిన్ను చంపకుండా వదలము , ఆరోజు మా పథకం ప్రకారం యువరాణిని బంధించి ఉంటే ఇప్పుడు మా పరిస్థితులు వేరేలా ఉండేవి ....... , తరతరాలుగా ఎంత వివక్షకు లోనౌతున్నామో మాకు మాత్రమే తెలుసు ...... , ఈ రాజ్యాన్ని ఎప్పటికైనా మా సొంతం చేసుకుంటాము .
( మీ పరిస్థులైతే చూసి నాతోపాటు యువరాణే చలించిపోయింది - ముఖ్యంగా మీ పిల్లలను చూసి , మీకు మంచి జీవితాన్ని అందించాలనే కోరుకుంది అంటూ మనసులో అనుకున్నాను )
అంతలో మళ్లీ నరకద్వారం తెరుచుకుంది . భటులతోపాటు హిడుంభి యువరాజు నేరుగా నాదగ్గరికివచ్చి తాళాలు తెరవమని ఆజ్ఞాపించాడు - ఒక రాజ్యానికి యువరాజునైన నన్నే తప్పుడు దారిలో పంపించి నా స్థానంలో ఈ రాజ్యానికి వచ్చి అనుకున్నది సాధిస్తావా ...... ఒక యువరాజుకు ఇలా చేస్తే ఊరికే వదులుతారు ఆనుకున్నావా అంటూ నా వెంట్రుకలను వెనక్కులాగి మోకాలిపై కొట్టాడు .
అమ్మా .......
హిడుంభి యువరాజు : ఇలానే ఇలానే నువ్వు నొప్పితో ఎంత గట్టిగా కేకలుపెడితే అంత సంతోషంగా ఉంటుంది నాకు ....... , భటులారా ఒక యువరాజుని మోసం చేస్తే ఎలా ఉంటుందో ఈ మోసగాడికి తెలియాలి వంద కొరడా దెబ్బలు కొట్టండి ........ మీరు మీరు కాదు మా భటులు - మా భటులు కొడితే నాకు మరింత ఆనందం ....... ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండలేను - వీడి కేకలు బయటవరకూ వినిపించాలి అంటూ మరొక దెబ్బవేసి రాక్షస నవ్వులతో బయటకువెళ్లాడు .
మా యువరాజుగారినే తప్పుడు తోవలో - కీకారణ్యంలోకి పంపిస్తావా ....... ఎన్ని ఇబ్బందులుపడ్డామో తెలుసా , దానికి నీ కేకలే సమాధానం అంటూ కొరడాతో కొట్టారు .
అమ్మా అమ్మా ...... అంటూ నా కేకలకు బయట ఉన్న యువరాజే కాకుండా చెరశాలలో ఉన్న బందిపోట్లు తెగ ఆనందిస్తున్నారు .
నా కేకలు ...... మంజరి చెవులకు చేరినట్లు పంజరంలో విలవిలలాడిపోతోంది .
మంజరిని చూసి చెలికత్తెలు నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక బాధపడుతున్నారు .
స్పృహ కోల్పోయేంతవరకూ కొట్టి యువరాజా యువరాజా అంటూ వెళ్లి పరిస్థితిని వివరించారు .
హిడుంభి యువరాజు : వాడు చనిపోకూడదు ఈ నరకంలోనే మరింత నరకాన్ని అనుభవించాలి , సంకెళ్లు తీసేసి మూలన పడేయ్యండి ....... , క్షత్రియులు అంటే ఏమిటో తెలిసిరావాలి - మన ప్రయాణానికి అన్నీ ఏర్పాట్లూ సిద్ధమేనా ? .
సిద్ధమే యువరాజా ...... , కానీ యువరాణీవారు స్పృహలో లేరు .
హిడుంభి యువరాజు : మా వాహనంలో జాగ్రత్తగా తీసుకెళతాము మహామంత్రీ ....... , ఆలస్యమయ్యేకొద్దీ ప్రమాదం మీకే ......
మహామంత్రి : మహారాజు గారి కోరిక కూడా ఇదే యువరాజా ....... , తెల్లవారిలోపు ఈ సమస్య నుండి భయటపడాలని ఆశిస్తున్నారు , యువరాజా ...... మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలని కాదు ఈ రాజ్యాల పటంలో మీ రాజ్యం ఎక్కడ ఉందో గుర్తిస్తే ..........
హిడుంభి యువరాజు : లోలోపలే కోపాగ్నికి లోనై బయటకుమాత్రం ఎంతమాట మహామంత్రీ ఇదిగో మీపటంలో లేని పడమరవైపున - మా రాజ్యం చుట్టూ 1000 మైళ్ళ వృత్తంలో తెలియని రాజ్యమంటూ లేదు - మీ ప్రయాణంలో వారే స్వయంగా మా రాజ్యానికి చేరుస్తారు ఎందుకంటే అక్కడ మాదే పెద్ద రాజ్యం ధనికవంతమైన రాజ్యం ........
మహామంత్రి : ఎంతమాట యువరాజా ...... ఊరికే తెలుసుకోవడానికి అడిగాను .
హిడుంభి యువరాజు : మా ప్రయాణానికి వారం రోజులు పడుతుంది - మీరు సామంతరాజులను పంపించి రేపే బయలుదేరారంటే మా తరువాతి రోజున మా రాజ్యం చేరుతారు - అంగరంగవైభవంతో వివాహం జరుగుతుంది .
సంతోషమైన మాట చెప్పారు యువరాజా రండి అన్నీ ఏర్పాట్లూ సిద్ధంగా ఉన్నాయి అంటూ సింహ ద్వారం దగ్గరికి పిలుచుకునివెళ్లారు .
వజ్ర వైఢూర్య బంగారు మణులతో నిండిన గుర్రపు వాహనంలో స్పృహలో లేని మహిని పడుకోబెట్టారు .
రాజమాత కడుపు తీపితో ఎంత వారించినా పట్టించుకోకుండా , మూడో కంటికి తెలియనియ్యకుండా పంపించేశారు - విషయం బయటకువెళ్లిందో మీ ప్రాణాలు పోతాయి అని చెలికత్తెల నోటికి తాళం వేసి యువరాణిని ఓదారుస్తూ లోపలికివెళ్లారు .
వొళ్ళంతా కొరడా దెబ్బలతో స్పృహలోకి రావడానికి రెండు రోజుల సమయం పట్టింది , అటుపై ఆ చీకటి చెరశాలలో పగలు ఎప్పుడో - రాత్రి ఎప్పుడో కూడా తెలియలేదు , భటులు వచ్చి కాసిన్ని మెతుకులు మావైపుకు విసిరేసి వెళ్లిపోయేవారు , బయట ఏమిజరుగుతోందో ఎవ్వరికీ తెలియదు .
అనుక్షణం మహి గురించే ఆలోచిస్తున్నాను - నా దేవకన్యతో గడిపిన మూడురోజుల మధురానుభూతులను తలుచుకుంటూనే జీవిస్తున్నాను - నా జీవితం ఇక్కడైతే ముగిసిపోదని నాకు తెలుసు - మహికి మాటిచ్చాను ఒక్కటిగా జీవిస్తాము ఒక్కటిగా ప్రాణాలను వదిలేస్తాము అని ...... , అమ్మా దుర్గమ్మా ...... మీ బిడ్డ ఈ రాజ్యంలో ఉన్నా - ఎక్కడ ఉన్నా కంటికి రెప్పలా చూసుకోండి - నదీఅమ్మా ....... చల్లగా చూసుకో తల్లీ .......
కొంత కాలం తరువాత ఒక రోజున చెరశాల ద్వారం తెరుచుకుంది .
బందిపోట్లు అంతా ఆశతో వెలుగువైపు చూస్తూ కేకలువేస్తున్నారు - అమ్మాయిలు వచ్చారురోయ్ పట్టుకోండి పట్టుకోండి .......
చామంతీ - మందాకినీ ...... ఇక్కడికి ఎందుకువచ్చారు , రేయ్ ఎవరైనా పట్టుకుంటే చంపేస్తాను .
బందిపోట్లు : వొళ్ళంతా రక్తపు ముద్ద అయ్యేలా కొరడాలతో కొట్టినా ఎంత దైర్యంగా మాట్లాడుతున్నావురా ...... ఏదీ చంపు చూద్దాము అంటూ గోల గోల చేస్తున్నారు .
చామంతీ - మందాకినీ ...... జాగ్రత్త , ఇక్కడ నుండి వెళ్లిపోండి .
చెలికత్తెలు : పర్లేదు ప్రభూ ...... మిమ్మల్ని కలిసే వెళతాము , రేయ్ ఒక్కరే మీ అందరినీ అడ్డుకుని మా యువరాణిని రక్షించి మిమ్మల్ని ఇక్కడకు చేర్చినది అప్పుడే మరిచిపోయారా ..... ? , వీరుడు ఎప్పటికీ వీరుడే మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను , తప్పుచేసారని ఒప్పుకుని ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు కానీ లేకపోతే వారి వీరత్వాన్ని ఆపే శక్తి ఈ రాజ్యం మొత్తం ఏకమైనా సరిపోదు - పట్టుకోవడం కాదు తాకే ధైర్యం చెయ్యండి చూద్దాము ......
అంతే బందిపోట్లు మారు మాట్లాడకుండా తలలుదించుకున్నారు .
చెలికత్తెలు : ఈమాత్రం భయం ఉండాలి అంటూ నాదగ్గరికివచ్చి తాళం తెరిచి లోపలికివచ్చారు .
వెనుకే పదిమందిదాకా భటులువచ్చి ఒకచేతికి గోడకున్న సంకెళ్ళువేసి చామంతీ ...... మీకున్న సమయం కొన్ని క్షణాలు మాత్రమే మహారాజుకు తెలిస్తే చాలా ప్రమాదం తెలుసుకదా అనిచెప్పి తాళం చెవితోపాటు వెళ్లిపోయారు .
చామంతీ - మందాకినీ ...... మహి మహి మంజరి ఎలా ఉంది అంటూ ఆతృతతో అడిగాను .
చెలికత్తెలు : ప్రభూ .......
ఇక ఎప్పటికీ ప్రభువును కాను కాలేను చామంతీ ......
చెలికత్తెలు : మీరు ఎప్పటికీ మా ప్రభువే అంటూ కన్నీళ్లు కారుస్తూ కొరడా దెబ్బలపై వెన్నను రాస్తున్నారు .
వద్దు వద్దు చామంతీ ...... , మహిని బాధపెట్టాను - ఈ నొప్పి ఎప్పటికీ ఇలానే ఉండాలి , మహి మహి ఎలా ఉందో చెప్పండి .
చెలికత్తెలు : ఎక్కడ ఉందో ఎలా ఉందో ...... మహారాజు - మహారాణికే తెలియదు ప్రభూ ...... , ఇక మంజరి అయితే ఆరోజు నుండీ పంజరంలోనే మీ ఇద్దరినే తలుచుకుంటూ బాధపడుతోంది .
చామంతీ - మందాకినీ ...... ఏమంటున్నారు ? .
చెలికత్తెలు : అవును ప్రభూ ...... , ఆ హిడుంభి యువరాజు చెప్పినట్లుగా పడమర దిక్కున అక్కడ అలాంటి రాజ్యమే లేదట ...... , వివాహానికని సర్వసైన్యంతో వెళ్లిన మహారాజుగారు నిరాశ బాధతో వెనక్కువచ్చి వారం రోజులయ్యింది .
చామంతీ ...... నాకంతా అయోమయంగా ఉంది .
చెలికత్తెలు : ఆ రాజ్యాన్ని - మహిని అన్వేషించడానికి పడమర దిక్కుకే కాదు నలుదిక్కులకూ సైన్యాలను తరలించారు , అయినా మహి జాడ తెలియనేలేదు ప్రభూ ....... , మాహారాజా - రాజమాత కృంగిపోతున్నారు .
మంజరి సహాయం తీసుకోవాల్సింది .
చెలికత్తెలు : ఆ ప్రయత్నం కూడా విఫలమైంది ప్రభూ ...... , మహి జాడను కనిపెట్టలేకపోయింది , ఆ మోసగాడు ...... మహిని చాలాదూరం తీసుకెళ్లిపోయినట్లున్నాడు - మీరే కనిపెట్టగలరని చెప్పినా నమ్మడం లేదు .
అంతలో మంజరి ఆ వెనుకే పట్టుకోండి పట్టుకోండి అంటూ భటులు లోపలికివచ్చారు .
చెలికత్తెలు : పర్లేదు ......
భటులు : చామంతీ ...... త్వరగా కానివ్వండి అనిచెప్పి వెళ్లిపోయారు .
మంజరీ మంజరీ .......
మంజరి : ప్రభూ ప్రభూ ...... మీదేవకన్యను కనిపెట్టలేకపోతున్నాను నన్ను మన్నించండి - చుట్టూ ఉన్న రాజ్యాలన్నింటినీ తిరిగినా లేదు అంటూ కన్నీళ్ళతో చెప్పి బాధపడుతోంది .
ఇంత జరిగాక ఇక ఇక్కడే ఉండలేను అంటూ సంకెళ్లను తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను .
మంజరి ముక్కుతో పొడుస్తోంది - చెలికత్తెలు కూడా సంకెళ్లను లాగుతున్నారు .
ఆ చప్పుళ్లకు పెద్ద మొత్తంలో భటులువచ్చి , చెలికత్తెలను బయటకు లాగేసి , అతికష్టం మీద మత్తుమందుపెట్టి నా మరొకచేతినికూడా కట్టేసి తాళం వేసుకుని వెళ్లిపోయారు .
మహీ మహీ ....... అంటూ కేకలువేస్తూనే స్పృహకోల్పోయాను .
The following 17 users Like Mahesh.thehero's post:17 users Like Mahesh.thehero's post
• 9652138080, arkumar69, dradha, Iron man 0206, Kacha, Kumarmb, Mahe@5189, maheshvijay, Naga raj, Rajeev j, Raju1987, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
ఎన్నిరోజులు స్పృహకోల్పోయానో నాకే తెలియదు , ప్రాణాలు పోతున్నట్లు కేకలు - భయంతో అరుపులు వినిపించడం అంతలో పెద్ద శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడిలేచాను .
ఆ పెద్ద శబ్దానికి కారణం చెరశాల ప్రధాన ద్వారం బద్దలై చెల్లాచెదురవడం ...... , అందులోనుండి వచ్చినవారు కాపాలాకాస్తున్న భటులపై ఏమాత్రం కనికరం చూయించకుండా కత్తులతో దాడిచేస్తున్నారు - రక్తం ఏరులై పారసాగింది .
చెరశాలల్లో ఉన్న బందిపోట్లు ..... హై హై నాయకా - మిత్రమా అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు . వాళ్ళతో చేతులుకలిపి మీరొచ్చి కాపాడతారని తెలిసే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాము .
మేము వచ్చేసాము మిత్రులారా ...... ఇక ఈ రాజ్యం మనదే , రండి మనల్ని అడవిపాలు చేసిన ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేసి ఆక్రమించేద్దాము - రాజుని మన కాళ్ళకింద చేర్చి వాడి కళ్ళముందే రాజ్యంలోని ప్రజల మానప్రాణాలను తీసి ఆనందిద్దాము అంటూ తాళాలను బద్దలుకొడుతున్నారు .
బందిపోట్లు బయటపడి కత్తులు చేతబట్టి కోపంతో ఊగిపోతున్నారు .
చెరశాల బందిపోట్లు : నాయకా - మిత్రులారా ....... ఆ తాళాన్ని తెరవకండి , మన యువరాణీ బంధ ప్రణాళికను అడ్డుకుని మేమంతా ఇక్కడ నరకంలోకి చేరేలా చేసినది వాడే ......
బందిపోట్లు : అయితే వీడిని ఇక్కడికిక్కడే ముక్కలుముక్కలు చేసేస్తాము అని కోపంతో రగిలిపోతున్నారు .
చెరశాల బందిపోట్లు : నాయకా ...... వీడిని అంత సులభంగా చంపరాదు , ఈ రాజ్యాన్ని చేజిక్కించుకున్న తరువాత వీడి సంగతి చూద్దాము , మనం ఎంత నరకాన్ని అనుభవించామో అంతకంతా వీడు అనుభవించాలి - అధిచూసి మేము రాక్షసానందం పొందాలి .
మీ ఆశలు ఆశలుగానే మిగిలిపోతాయి .
బందిపోట్లు : కాళ్ళూ చేతులూ కట్టివేయబడినా - మనం ఇంతమందిమి ఉన్నా ఎంత దైర్యంగా మాట్లాడుతున్నాడు చూసారా ...... ? , తాళాలు తెరవండి వీడి సంగతి ఇప్పుడే చూస్తాము .
చెరశాల బందిపోట్లు : వాడికి ఉన్నదే అది మిత్రులారా ...... , ఇతడి ఒక్కచేతిని కట్టివేయడానికి పాతికమంది భటులు కూడా ఇంత శ్రమించారో కళ్లారా చూసాము , చివరికి మత్తుమందు పెడితేకానీ .......
నావైపుకు వచ్చిన బందిపోట్లు వెనుకడుగు వెయ్యడం చూసి నవ్వుతున్నాను .
బందిపోట్లు : వీడి సంగతి రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న తరువాత చూద్దాము - అక్కడ మన వారికి మన సహాయం కావాలి రండి .
చేరశాలలోని బందిపోట్లు : నాయకా ...... ఒక నలుగురిని ఇక్కడ ఉంచడం ఎందుకైనా మంచిది అంటూ నలుగురిని కాపలా ఉంచి వెళ్లారు .
సంకెళ్లను ఎంత లాగినా ప్రయజనం లేకపోయింది .
అంతలో ప్రభూ ప్రభూ ....... అంటూ మంజరి కాపలా కాస్తున్న భటులను తప్పించుకుని లోపలికివచ్చింది .
బందిపోట్లు : రేయ్ రేయ్ మాట్లాడే చిలుక పట్టుకోండి పట్టుకోండి ...... , తాళం పగలగొట్టండి ...... - పెద్ద తాళం పగలడం లేదు ప్రత్యేకంగా ఇంతపెద్ద తాళం వేశారు అంటే వీడితో జాగ్రత్తగా ఉండాలి - రేయ్ అక్కడ చనిపోయిన భటులతో తాళాలు ఉంటాయి తీసుకురండి .
మంజరీ మంజరీ ...... మహి జాడ తెలిసిందా ? - మిత్రుడు ఎలా ఉన్నాడు ? .
మంజరి : మన్నించండి ప్రభూ ...... , దట్టమైన అరణ్యంలో మహి వెళ్లిన త్రోవ కనిపెట్టలేకపోతున్నాను - మిత్రుడిని ..... చెలికత్తెల సహాయంతో బయటకుచేర్చాను , సైన్యాధ్యక్షుడితోపాటు సగం మంది సైనికులు మహి అన్వేషణ కోసం వెళ్లారని - మహారాజు ...... మహి కనిపించలేదన్న దుఃఖం లో ఉన్నారని తెలుసుకుని గోతికాడ నక్కలా కాచుకున్న బందిపోట్లు భటుల - ప్రజల ప్రాణాలను తీస్తూ రాజభవనం వైపుకు వెళుతున్నారు .
మహి రాజ్యం ..... సంతోషంగా ఉండాలికానీ ఇలా కాకూడదు అంటూ సంకెళ్లను లాగుతున్నాను .
బందిపోట్లు : రేయ్ తొందరగా తెరవరా ...... , ఏ తాళమో తెలియడం లేదురా , రేయ్ ...... పెద్ద తాళం అంటూ తీసి లోపలికివచ్చి కత్తులు - బల్లెం లతో మంజరిని పొడవడానికి ప్రయత్నిస్తున్నారు .
మంజరి : ప్రభూ ప్రభూ ....... మీరు బయటపడితేనే మహిని కనిపెట్టగలం .
మంజరీ జాగ్రత్త ......
మంజరి : నాకేమైనా పర్లేదు మిమ్మల్ని తప్పించడానికే వచ్చాను తాళం వాళ్ళతోనే తెరిపించాను అంటూ నలుగురి నుండి తప్పించుకుంటూ అక్కడక్కడే ఎగురుతోంది .
బందిపోట్లు : ఎంత మోసం ...... రేయ్ నలుగురూ ఒకవైపునుండి దాడిచేస్తూ మూలకు చేర్చి చంపేద్దాము అంటూ నవ్వుకుంటున్నారు .
మంజరీ మంజరీ ...... బయటకువెళ్లిపో ......
మంజరి : నా ప్రభువుని ఇలాంటి పరిస్థితులలో వదిలి ప్రాణాలు దక్కించుకోలేను , జీవితమో - మరణమో ...... మీ ఇద్దరితోనే ......
మంజరీ వద్దు వెళ్లిపో .......
బందిపోట్లు : అదీ అదీ అలా మూలకు చేర్చి పొడిచేద్దాము - దగ్గరికి చేరుకున్నాము - మాతోనే ఆటలా ........
మంజరీ మంజరీ ....... , అమ్మ పరాశక్తీ సాంభవీ అంటూ బలమంతా కూడదీసుకుని సంకెళ్లను లాగాను - అమ్మ అనుగ్రహించినట్లు ఏనుగు పాదాలను కట్టివేయడానికి ఉపయోగించే ఎడమ చేతి సంకెళ్లు గోడను చీల్చుకుని వచ్చేసాయి .
నలుగురు బందిపోట్లు అప్రమత్తం అయ్యేంతలో ...... , ఎడమచేతి సంకెళ్లతో నెలకొరిగేలా చేసాను , ప్రాణాలతోనే వదిలేసాను . మంజరీ మంజరీ ...... నీకేమీ కాలేదు కదా అంటూ భుజం పై ఉంచుకుని కుడిచేతిని - పాదాలను కట్టివేయబడిన సంకెళ్లను అవలీలగా తెంచుకుని , బందిపోట్ల చేతుల్లోని తాళాలతో సంకెళ్ళ నుండి విముక్తుణ్ణి అయ్యాను .
బయటనుండి ప్రజల ఆహాకారాలు - ప్రాణ కేకలు వినిపిస్తున్నాయి . మంజరీ ...... రాజ్యంలోని ప్రజలతోపాటు బందిపోట్లు కూడా అమాయకులు , వారు ఎదుర్కొన్న పరిస్థితులు - కష్టాలు వారిని ఇలా రాక్షసులుగా మార్చాయి , ఇరువురిలో ఎవరు గెలిచినా - ఓడిపోయినా ...... ప్రాణ నష్టం అధికంగా జరుగుతుంది , మహికి అది ఏమాత్రం ఇష్టం లేదు , ఎలాగైనా ఆపాలి యుద్ధాన్ని యుద్ధంతోనే ఆపగలం అంటూ కత్తిని అందుకున్నాను .
అంతలో మిత్రుడు ఘీంకరిస్తూ వేగంగా మాదగ్గరికివచ్చాడు .
మిత్రమా మిత్రమా ....... నువ్వు సురక్షితమే కదా - ఎంత బాధపడ్డావో నీ కన్నీటి ధారల గుర్తులను చూస్తుంటేనే అర్థమైపోతోంది అంటూ ప్రాణంలా హత్తుకుని , మంజరీ ..... జాగ్రత్తగా పట్టుకో అంటూ పైకెక్కి , పద మిత్రమా అంటూ లంకించాను - మిత్రుడిపై ఉన్న విల్లు బాణాలను అందుకున్నాను .
బందిపోట్లు ...... ప్రజలను లాగిపడేస్తూ ఆస్తులను ద్వoసం చేస్తూ నగలు - నాణేలను దోచుకుంటున్నారు . భటుల - ప్రజల - పిల్లల ప్రాణాలను , స్త్రీల మానాలను తియ్యడానికి ప్రయత్నిస్తున్న బందిపోట్ల చేతులు కాళ్ళు కదలడానికి వీలులేకుండా బాణాలను సంధిస్తూ ముందుకు దూసుకుపోతున్నాను .
ప్రజలు దండాలుపెడుతున్నారు - భటులు వారి ఆయుధాలను అందుకుని కిందపడిన బంధిపోట్లను చంపబోతే బాణాలతో ఆపాను , వెంటనే తాళ్లతో కట్టిపడేస్తున్నారు - ఉన్న కొద్దిమంది భటులు నావెనుకే పరుగునవస్తున్నారు .
అలా బంధిపోట్లను నిలువరిస్తూ రాజభవనం సింహద్వారం దగ్గరికి చేరుకున్నాను .
అదేసమయానికి అప్పటికే పెద్దమొత్తంలో చేరిన బందిపోట్లు సింహద్వారాన్ని పెద్ద పెద్ద దుంగలతో బద్ధలుకొట్టి అడ్డువచ్చిన సైనికులను పొడిచేస్తూ లోపలికిదూసుకువెళుతున్నారు .
అడ్డుపడిన మహామంత్రిని కిందపడేసి కొడుతున్నారు - సింహ ద్వారంపై ఉన్న చంద్ర రాజ్య పతాకాన్ని కూల్చేసి బందిపోట్ల పతాకం రెపరేపలాడేలా చేసి భయంకరంగా కేకలువేస్తూ రాజమందిరం వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు .
రాజమందిరం పైనుండి వీక్షిస్తున్న మహారాజు మహారాణీ ఏమిచెయ్యాలో తెలియక భయపడుతున్నట్లు తెలుస్తోంది - లోపలికివెళ్లిపోయారు , సామంతరాజులు వచ్చి సహాయం చేసే సమయం కూడా లేదని వారికి తెలిసిపోయినట్లుంది .
బందిపోట్ల నాయకులు : రేయ్ మహారాజా ...... ఈసారి నువ్వు ఎక్కడ దాక్కున్నా వదలము - మీ రాజ్యం రహస్యమార్గాలన్నీ ఇప్పుడు మా ఆధీనంలో ఉన్నాయి - ఇక్కడ నుండి ఎక్కడికీ వెళ్లలేవు - మిత్రులారా ...... మీరు బయట ఉన్నవారిని వెంబడించి చంపేయ్యండి మేమువెళ్లి మహారాజు - మహారాణీ సంగతి చూస్తాము అంటూ నలుగురైదురు లోపలికివెళ్లారు .
నాతోపాటు వచ్చిన భటులు - ప్రజలు అధిచూసి , మహారాజు గారే ఓటమిని ఒప్పుకున్నారు - మన సింహద్వారం రక్షణ కవచం మరియు పతాకం కూలిపోయాలి - చంద్ర రాజ్యంలో తొలిసారి శత్రువుల జెండా ఎగురుతోంది ..... మరణం ..... మరణమే ఇది అంటూ గుసగుసలాడుకుంటున్నారు .
లోపల అయితే బందిపోట్లు ..... అడ్డువచ్చిన వారిని పొడిచేస్తూ - దొరికినవాటిని నాశనం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు .
ఇక ఇక్కడే ఉంటే భార్యా పిల్లలు అని ఒక్కరూ మిగలరు , పిల్లలను ..... బానిసలను చేస్తారు - ఆడవాళ్లను ...... గుర్తుచేసుకుంటేనే భయం వేస్తోంది . ప్రాణాలనైనా వదలాలి లేదా పారిపోవాలి ...... మరణం మరణం అంటూ పరుగులుతీస్తున్నారు .
చంద్ర సేనా ....... పారిపోతారా ....... ఎక్కడికని పారిపోతారు , సామంత రాజ్యాలకు - అడవిలోకి ...... ఇప్పుడు ఈ రాజ్యం రేపు సామంత రాజ్యాలు అటుపై అడవిని ఆక్రమించుకుంటారు , అప్పుడు ఎక్కడికి పరుగులుతీస్తారు , ప్రాణాలనైనా వదలాలి అనుకుంటున్నారుకదా ఆ ప్రాణాలు ఫనంగా పెట్టి పోరాడి మీ బార్యాబిడ్డలకు స్వేచ్ఛను కానుకగా ఇవ్వండి , స్వేచ్ఛను మించిన సంపద మరొకటి ఉండదు .
మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దది అనుకోవడం మరణం .......
రణరంగంలో చావుకైనా పిరికితనంతో పరుగులుతియ్యడం మరణం ......
మీ తల్లీ - భార్యా - బిడ్డల మానప్రాణాలను తీయాలని చూస్తున్న ఈ బందిపోట్లకు భయపడటం మరణం .........
మంజరి : ప్రభూ .......
నావైపుకు దూసుకువస్తున్న బాణాన్ని పట్టుకుని దానిని ఎక్కుపెట్టిన వాడి తొడలోకి దూసుకుపోనిచ్చాను - వాడువేసిన కేకలకు సగం ధైర్యం వచ్చినట్లు కిందపడిన ఆయుధాలను అందుకున్నారు సైనికులు ప్రజలు .......
" వాళ్ళు ఇవ్వాలనుకున్న మరణాన్ని జయించడానికి మీకు తోడుగా ఈ మహేశ్వరుడు ముందుకు అడుగేస్తున్నాడు .........
నా ప్రాణం కంటే ఎక్కువైన నా మహి .... మీ యువరాణి నడిచిన నేల ఏమాత్రం విద్వాంసం కాకుండా ఆపడానికి నేను వెళుతున్నాను - యువరాణి అంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు ...... అంటూ మావైపుకు వస్తున్న బంధిపోట్ల పాదాలలో గుచ్చుకునేలా ఒకేసారి బాహుబాణాలను సంధిస్తూ చెప్పాను .
యువరాణి నడయాడిన రాజ్యాన్ని రక్షించడానికి - తను ...... మీలో చూడాలనుకున్న సంతోషాలను తిరిగి తీసుకురావడానికి నేను ముందుకువెళుతున్నాను ....... నాతో వచ్చేదెవరు ? .
సైనికులు : మేము ...... , మహేశ్వరుడా ...... మీ వీరత్వం - పరాక్రమం ఎలాంటిదో స్వయంవరంలో చూసాము .
నాతో చచ్చేదేవరు .......
నేను నేను .......
ఆ మరణాన్ని దాటి నాతోవచ్చి గెలిచేదెవరు ........
ప్రజలు : మేము మేము అంటూ సింహద్వారం వైపుకు దైర్యంగా వెళ్లి అడ్డువచ్చినవారిని అడ్డుకుంటున్నారు .
మహీ ....... నీ పుట్టింటిని ఏమీ కానివ్వను - జై పరాశక్తి అంటూ ముందుకు దూసుకుపోతూ అడ్డువచ్చిన బంధిపోట్లను గాయపరుస్తూ , సైనికులు - ప్రజలకు మరింత ధైర్యామిచ్చేలా ఒక్క బాణంతో బందిపోట్ల పతాకం నేలకొరిగేలా సాధించాను .
అంతే ఒక్కసారిగా జై చంద్ర రాజ్యం జై చంద్ర రాజ్యం అంటూ మరింత ధైర్యంతో సింహద్వారం ఆక్రమించిన బంధిపోట్లను చెల్లాచెదురుచేస్తూ నాతోపాటు లోపలికి దూసుకువచ్చారు .
అధిచూసి ఒంటిలోకి కత్తులు దిగిన సైనికులు లేచి తమ శక్తికొలది పోరాడుతున్నారు .
బందిపోట్లు ఆక్రమించిన సమయంలో సగం సమయం లోపు మళ్లీ చంద్ర రాజ్యాన్ని దక్కించుకున్నట్లు సింహ ద్వారంపై చంద్ర రాజ్య పతాకం రేపరేపలాడటం చూసి అందరిలో ఆనందాలు వెల్లువిరిసాయి , ఎక్కడికక్కడ బంధిపోట్లను తాళ్లతో బంధించేస్తున్నారు .
కిందకుదిగి పోట్లతో కిందపడిన మంత్రిగారిని లేపి , వైద్యులను పిలిపించమని చెప్పాను .
మహామంత్రి : నాకేమీ కాలేదు మహావీరా ...... అంటూ కౌగిలించుకుని , మహేశ్వరుడు ..... చంద్ర రాజ్య కాబోయే మహారాజు అంటూ కత్తిని పైకెత్తగానే .....
మహేశ్వరుడు మహేశ్వరుడు ....... నినాదాలతో రాజ్యం దద్దరిల్లిపోసాగింది .
మహామంత్రి : ప్రభూ ....... , మీవల్లనే మహి జాడ తెలుస్తుందని చెలికత్తెలు చామంతి మందాకినీ మహారాజు గారిని ఒప్పించి నిన్ను విడుదల చేసేంతలో బందిపోట్లు దండయాత్ర చెయ్యడం జరిగింది .
మంజరి : అవును ప్రభూ ...... , అది చెప్పడానికి వచ్చేన్తలో ఇదంతా జరిగిపోయింది , మహారాజు పూర్తిగా మారిపోయారు , ఆయనకు ఇప్పుడు మహి తప్ప రాజ్యప్రతిష్ట పరువు ఏదీ ఎక్కువకాదు - చాలా కృంగిపోయారు ఇక మహారాణి పరిస్థితి వర్ణనాతీతం .......
మహామంత్రి : మహావీరా ...... , ఈ విషయం తెలియక లోపల ఆ బందిపోట్ల నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ....... , వారి ఏకైక లక్ష్యం మహారాజుని చంపడం ......
అంతే లోపలికి పరుగులుతీసాను - వెనుకే మంత్రిగారితోపాటు సైనికులు ప్రజలు పరుగుపెట్టారు .
The following 17 users Like Mahesh.thehero's post:17 users Like Mahesh.thehero's post
• 9652138080, arkumar69, dradha, Iron man 0206, Kumarmb, Mahe@5189, maheshvijay, Manavaadu, Naga raj, Nani198, Rajeev j, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
మా అడుగుల చప్పుడు విని , నాయకా నాయకా అంటూ మహారాజు మందిరపు ద్వారాన్ని తట్టి ..... మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకున్నట్లు మనవాళ్లంతా వచ్చేస్తున్నా........రు అంటూనే వాళ్ళవైపుకు దూసుకువస్తున్న నిన్నుచూసి అలా కదలకుండా ఉండిపోయారు నాతోపాటు చెరశాలలో ఉన్న బందిపోట్లు ....... , వీడిని చెరశాలలోనే ముక్కలు ముక్కలు చేయాల్సింది ...... మంత్రి - సైనికులు - ప్రజలు అందరినీ విడిపించేశాడు అంటూ నావైపుకు కత్తులతో వచ్చారు .
ఆగండాగండి ఒకసారి చావుదెబ్బతిన్నారు - మళ్లీ మిమ్మల్ని కొట్టడానికి నాకు చేతులుకూడా రావడం లేదు అంటూ ఒకడి చేతిని వెనక్కుతిప్పాను .
వాడి అరుపులు మిగతావాళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయారు .
సైనికులారా ...... ఒక్కదెబ్బకూడా కొట్టకండి - వాళ్ళు చెరశాలలో అనుభవించిన నరకం చాలు అనడంతో పట్టుకుని తాళ్లతో బంధించారు .
అంతలో మంత్రిగారు ..... మహారాజు మందిరం ద్వారం దగ్గరికివెళ్లి ప్రభూ ప్రభూ ....... అంటూ తలుపుతట్టారు .
( విన్నావా ....... మహారాజా ఇక మీ రాజ్యం అన్నది చరిత్ర ఇక భవిష్యత్తు అంతా మాదే అంటూ రాక్షసనవ్వులతో తలుపులుతెరిచారు బందిపోటు నాయకుడు ) .
మహామంత్రితోపాటు సైనికులు లోపలికివెళ్లి ఆశ్చర్యపోతున్న బందిపోట్ల నాయకులను బంధించారు - మహారాజు వొంట్లోకి దిగబోతున్న కత్తిని ఆపారు .
మహారాజా అంటూ మహారాణి వెళ్లి గుండెలపైకి చేరారు .
మహామంత్రి : మహావీరా ...... నీ వేగమే మహారాజు గారిని రక్షించింది - మరొక్క క్షణం ఆగి ఉంటే జరగాల్సిన అనర్థం జరిగిపోయి ఉండేది అంటూ లోపలికి పిలిచారు . ప్రభూ ...... మన రాజ్యాన్నీ - మిమ్మల్నీ రక్షించినది ఎవరో తెలుసా అంటూ మందిరం నుండి బయటకుతీసుకొచ్చారు .
మహారాజు - మహారాణి : మహేశ్వరుడు ....... అల్లుడుగారు - అల్లుడుగారు మమ్మల్ని క్షమించండి అంటూ వచ్చి ఏమాత్రం మోహమాటపడకుండా నాకు దండాలు పెడుతున్నారు .
మహారాజా ...... అంటూ ఆపాను - మీరు గొప్పవారు .
మహారాజు : అల్లుడుగారూ ...... నేను చేసిన పాపానికి చావు వరకూ తీసుకెళ్లాడు ఆ పైవాడు - నేను చేసినదానికి నా ప్రాణాలు పోవాల్సింది .
ప్రభూ ...... అంతా అమ్మవారి అనుగ్రహం , మీలో మార్పు వచ్చిందని తెలుసుకున్నాను చాలా సంతోషం .......
మహారాజు : తెలుసుకునేసరికి యువరాణిని దూరం చేసుకున్నాము - ఎక్కడ ఉందో ఎలా ఉందో అంటూ కుమిలిపోతున్నారు .
ప్రభూ ....... బాధపడకండి , మహి ఎక్కడ ఉన్నా అమ్మవారు తోడుగా ఉంటారని నా నమ్మకం .
మహామంత్రి : సైనికులారా ...... వీరందరినీ కారాగారంలో పడేయ్యండి .
మహారాజు : మన రాజ్యం పైనే దండెత్తి మన ప్రజలను - సైనికులనే చంపుతారా ....... , ఊరికే ఉంటే మళ్లీ మళ్లీ ఇలానే చేస్తారు అందరికీ ఒకేసారి ఉరిశిక్ష అమలుపరచండి .......
మహారాజా ...... మీకు ఎదురువెళ్లాలని కాదు తప్పుగా మాట్లాడితే మన్నించండి . మహారాజా ...... మన రాజ్యప్రజలే కాదు తరతరాలుగా బందిపోట్లు కూడా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు మీవలన - మహి చెప్పింది ఈ బందిపోట్లు ఒకప్పుడు ఈరాజ్య సామంతరాజ్యంలో ప్రజాలేనని ...... , కొంతమంది సామంతరాజ్య రాజులవలన వీరంతా రాజ్యద్రోహులయ్యారని , అప్పటినుండీ కొండాకోనల్లో సరైన ఆహారం - వస్త్రాలు లేక కష్టాలు అనుభవించీ అనుభవించీ ఈ రాజ్యంపై శత్రుత్వం పెంచుకున్నారు , మహారాజా ...... అరణ్యంలోని గుహలలో వీరి పిల్లల పరిస్థితులను చూసి ఉంటే మీరు ఇలా ఆజ్ఞాపించరు , యువరాణి చూసి చలించిపోయింది - దేవుడా ...... మీరు రాజైన వెంటనే వీరికి న్యాయం చెయ్యాలి అంటూ మాట తీసుకుంది .
మహారాజు : నా బంగారుతల్లి దేశ సంచారం చేసిందా ? .
చెలికత్తెలు : అవును ప్రభూ ..... అంటూ జరిగినదంతా వివరించారు .
మహారాజా ...... యువరాణిపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ..... , వీరికి స్వేచ్ఛను ప్రసాధించండి - ఒక ప్రదేశాన్ని ఇచ్చి గృహాలు గురుకులాలు నిర్మించి ఇవ్వండి - మీ సామంత రాజ్యాంగా ఒక హోదాను ఇవ్వండి - వ్యవసాయానికి భూమి ఇవ్వండి - హస్తకళా నైపుణ్యాలను నేర్పించండి , ఇప్పటికే కొన్ని తరాల వృధా అయిపోయాయి కొత్త తరానికి భవిష్యత్తును ఇవ్వండి ....... , ఇది నేను కోరుతున్నది కాదు మీ ప్రాణమైన యువరాణి మనసులో ఉన్నది ఇక మీ ఇష్టం సెలవు .......
మహారాజు సైగచెయ్యగానే అందరినీ విడుదల చెయ్యడంతో , మహావీరా అంటూ అందరూ నాముందు మొకరిల్లారు .
చెరశాల బందిపోట్లు : మేము ...... నీ ప్రాణాలు తియ్యాలనుకుంటే నువ్వు మాకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నావు - నీ అంతటి వీరుడిని ఇంతవరకూ చూడనేలేదు అంటూ జయజయనాదాలు చేస్తున్నారు .
మహారాజు : మంత్రిగారూ ...... వెంటనే మహేశ్వరుడు కాదు కాదు అల్లుడుగారు చెప్పినట్లుగా అమలుపరచండి , అడవుల్లో ఉన్న మిగతా బంధిపోట్లను కాదు కాదు చంద్ర రాజ్య సామంత రాజ్య ప్రజలను సాదరంగా తీసుకురండి అంటూ వెళ్లి నాయకులకు క్షమాపణలు చెప్పి కౌగిలించుకున్నారు .
నాయకులు : మహారాజా ...... మీరు క్షమాపణలు చెప్పడం ఏమిటి ఇకనుండీ మీ సామంతరాజ్యాంగా మీ సేవలో ఉంటాము .
మహారాజు : సేవలో కాదు కలిసిమెలిసి ఉందాము అంటూ సంతోషాలను పంచుకున్నారు .
మహారాజా ....... యువరాణి మందిరానికి వెళ్లేందుకు అనుమతిని ఇస్తారా ? .
మహారాజు : అల్లుడుగారో ...... ఇకనుండీ మీరే మహారాజు - ఈ రాజ్యమే మీది .....
మహి లేని రాజ్యం ...... అంటూ కన్నీళ్ళతో మంజరితోపాటు మా మందిరానికి వెళ్ళాను - వెనుకే చెలికత్తెలు వచ్చారు .
మహి వస్త్రాలను హృదయంపై హత్తుకుని నా దేవకన్య స్పర్శను ఆస్వాధిస్తున్నాను - మహీ ...... ఎక్కడ ఉన్నావు అంటూ కన్నీరు ఆగడం లేదు .
చామంతి : ప్రభూ ...... మిమ్మల్ని చూడాలని ఎంతగానో ఆరాటపడ్డారు - అమ్మవారి చెంతన చేరి మీరు సురక్షితంగా ఉండాలి అంటూ ప్రార్థిస్తూనే స్పృహకోల్పోయారు .
స్పృహకోల్పోయిన బిడ్డను ఎలాంటి వాడితో - ఎక్కడికి పంపించానో తెలియని మూర్ఖ మహారాజుని అంటూ బాధపడుతున్నారు మహారాజు .
మహారాజా ...... బాధపడి ప్రయోజనం లేదు - నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను - మహి ఎక్కడ ఉన్నా మీ చెంతకు చేర్చుతాను .
మహారాజు : మహికి ..... మమ్మల్ని చేరడం కంటే నిన్ను చేరడమే సంతోషం - మీసంతోషమే మా సంతోషం అల్లుడుగారూ - ఈ సత్యం అప్పుడే తెలుసుకుని ఉంటే ఇప్పుడు ఇంతమందిమి బాధపడే అవసరమే ఉండేదికాదు - ఈ తల్లి కడుపు కోతను ...... క్షమించండి మహారాణీ ......
రాజమాతా ....... మీకు మాటిస్తున్నాను , మళ్లీ మీకు కనిపించేది మీ బిడ్డతోనే ...... , ఆ అమ్మవారిపై భారం వేసి దైర్యంగా ఉండండి .
మహారాణి : అల్లుడుగారూ ...... మీ మాటలు విన్నాక ఆశ చిగురిస్తోంది .
మంత్రిగారూ ....... ఇంతకాలం ఎక్కేక్కెడకు వెళ్లారు - ఇప్పుడు మన సైన్యాధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు .
మహామంత్రి : భటులారా ...... రాజ్యాల పటాన్ని తీసుకురండి .
క్షణంలో మా ముందు ఉంచారు .
మహామంత్రి : మహారాజా ......
మంత్రిగారూ ...... మహేశ్వరుడు అని పిలవండి .
మహారాజు : మహామంత్రీ ........ మహారాజు అనే పిలవండి - మహి కోరుకున్నది అదేకదా ......
మహామంత్రి : మహారాజా ...... స్వయంవరం కోసం 500 మైళ్ళ పరిధిలోని మరియు దేశంలోని పెద్ద రాజ్యాలకు ఆహ్వానం పిలిచాము కాబట్టి ఆ రాజ్యాలన్నీ ........
మంత్రిగారూ ....... ఆ పరిధిలో ఉన్నట్లయితే ఆ హిడుంభి యువరాజు ఇలా చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కాబట్టి మనం మహికోసం వేతకాల్సినది ఈ 500 మైళ్ళ పరిధికి అటువైపు ఉన్న రాజ్యాలలో ...... , వాళ్ళును నేను కలిసినది తూర్పు - దక్షణం వైపునుండి వస్తున్నప్పుడు నేను అటువైపు వెళతాను .
మహామంత్రి : మీరు చెప్పినదే నిజం మహారాజా ...... , అందుకే ఇప్పటివరకూ యువరాణి జాడను కనిపెట్టలేకపోయాము .
మహారాజు : చెలికత్తెలు ఎప్పుడో చెప్పారు - ప్రభూ ...... మహారాజు వల్లనే సాధ్యం అని , అదే నిజమైంది ....... ఇప్పుడే నలువైపులా ఉన్న రాజ్యాలకు సైనికులను పంపించి నేనూ ఒకవైపుకు వెళతాను , మహామంత్రీ ..... మహారాజు ప్రయాణానికి పరివారాన్ని సిద్ధం చెయ్యండి .
అలా వెళితే మహిని ఎప్పటికీ చేరుకోలేము మహారాజా ...... , మన రాజ్యాల పటంలోని వారుకాబట్టి సహకరించారు , బయటి రాజ్యాలు అలా వుండరు కాబట్టి సామాన్యుడిలానే వెళ్ళాలి , నా గురించి ఆలోచించకండి నాకు తోడుగా మంజరి - మిత్రుడు ఉన్నాడు .
మంజరి : నన్ను వదిలేసి వెళతారని కోప్పడుతున్నాను .
నువ్వులేకుండా వెళితే మహి దగ్గరకు రానివ్వదు కదా మంజరీ ....... మార్గం చూయించాల్సినది కూడా నువ్వేకదా ......
మంజరి : ఆజ్ఞ ప్రభూ .......
నవ్వాలని ఉంది మంజరీ ...... కానీ మహి లేని నవ్వు అంటూ కన్నీటిని తుడుచుకున్నాను , చామంతీ - మందాకినీ ...... నా ప్రాణాలర్పించైనా మీ స్నేహితురాలిని కనిపెడతాను .
చెలికత్తెలు : కలిసి రావాలి మహారాజా అంటూ మహి ప్రియమైన వస్తువులను - మహి ..... నాకోసం సిద్ధం చేసిన వస్త్రాలను అందించారు .
మహారాజా ...... సెలవు అంటూ మంజరితోపాటు బయటకువచ్చాను .
మహేశ్వరుడు మహేశ్వరుడు మహారాజు మహారాజు ....... అంటూ నినాదాలతో రాజ్యం దద్దరిల్లిపోసాగింది , చంద్ర రాజ్య సైనికులు ప్రజలు మరియు కొత్త సామంతరాజ్య ప్రజలు ఒకరికొకరు కలిసిపోయారు .
నామాటను గౌరవించి మీరంతా కలిసిపోయినందుకు చాలా చాలా సంతోషం ......
మహారాజా మహారాజా ...... అంటూ నాతోపాటు చెరశాలలో ఉన్నవారు నాదగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నారు .
స్వయానా వాళ్ళ దగ్గరికివెళ్ళాను .
మహారాజా ...... యువరాణిగారికోసం సగం సైన్యం వెళ్లిందని దొంగతనంగా రాజ్యంపై దండెత్తి చాలా పెద్ద తప్పుచేసాము - ఈ తప్పును సరిచేసుకునేందుకు యువరాణిగారిని వెతకడం కోసం మేమంతా బయలుదేరుతున్నాము .
చాలా సంతోషం - అంతకంటే ముందు మీవాళ్ళందరినీ మీకు కేటాయించిన ప్రదేశానికి తీసుకొచ్చి స్థిరపడండి - అదే యువరాణికి మరింత సంతోషాన్ని కలిగిస్తుంది - యువరాణి వచ్చే సమయానికి మీరు ఎంత సంతోషంతో ఉంటే తను అంత ఆనందిస్తోంది .
మహారాజా ...... మీరు నిజంగా దేవుడు , మహారాజుకి జై మహారాజుకి జై అంటూ జయజయనాదాలు చేస్తూ దారిని వదిలారు .
మిత్రుడిపైకి ఎక్కి , మిత్రమా - మంజరీ ...... తూర్పు - దక్షిణాన ఉన్న రాజ్యాలన్నీ వెదికైనా మన మహిని కనిపెట్టాలి హుర్రే అనడంతో పరుగులుపెట్టింది .
The following 34 users Like Mahesh.thehero's post:34 users Like Mahesh.thehero's post
• ----DON, 950abed, 9652138080, arkumar69, Bangaru, donakondamadhu, dradha, Gokul krishna, Iron man 0206, jwala, Kacha, kingnani, Kumarmb, Kumar_guha, Mahe@5189, maheshvijay, Manavaadu, Manoj1, Naga raj, Nani198, Nmrao1976, prash426, Putta putta, RAANAA, Rajeev j, ramd420, Rathnakar, Ravi21, Rohan-Hyd, Saikarthik, sri7869, SS.REDDY, The_Villain, Thorlove
Posts: 165
Threads: 1
Likes Received: 148 in 101 posts
Likes Given: 10,228
Joined: Dec 2021
Reputation:
2
Welcome to the master of stories """maheshthehero""".
Posts: 20
Threads: 0
Likes Received: 32 in 14 posts
Likes Given: 8
Joined: Oct 2022
Reputation:
0
Posts: 1,665
Threads: 0
Likes Received: 1,200 in 1,023 posts
Likes Given: 7,946
Joined: Aug 2021
Reputation:
10
Welcome back the hero excellent update
Posts: 4,753
Threads: 0
Likes Received: 3,963 in 2,943 posts
Likes Given: 15,301
Joined: Apr 2022
Reputation:
65
Update adhripoyindhi bro. Welcome back bro
Posts: 283
Threads: 0
Likes Received: 237 in 170 posts
Likes Given: 506
Joined: Jan 2021
Reputation:
1
(06-11-2022, 08:11 AM)Mahesh.thehero Wrote: Extremely so so so so so so so so so so so so so so so so so soooooooooooooooooooooooooo soooooooooooooooooooooooooooo ooooooooooooooooo sorry friends .
మళ్లీ సమయం దొరికినందుకు I am so happy ........
కొద్దిగంటల్లో అప్డేట్ తో కలుద్దాము .
మనఃస్ఫూర్తిగా క్షమాపణలు .........
మీ మహేష్ .
Thank you bro so many days taruvatha reply echaru
We r waiting for your update bro
Posts: 2,482
Threads: 0
Likes Received: 1,817 in 1,391 posts
Likes Given: 6,923
Joined: Jun 2019
Reputation:
22
Excellent sooo good to see your update Mahesh garu
Posts: 271
Threads: 0
Likes Received: 234 in 180 posts
Likes Given: 13
Joined: Jul 2021
Reputation:
4
Masterpiece bro ... grandly welcome back .....konchem regular ga update isthu undu bro
Posts: 3,753
Threads: 0
Likes Received: 2,433 in 1,977 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
18
మహేష్ మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది.
Posts: 189
Threads: 0
Likes Received: 123 in 96 posts
Likes Given: 5
Joined: Sep 2019
Reputation:
0
Chala chala baga rasavu bro
Thank you so much bro update ichinaduku
Update matharam super ga undi bro
Super super super super ??????? bro
|