Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(26-10-2022, 04:33 PM)Takulsajal Wrote:
S3E9

అంబులెన్స్ లోనుంచి వాటర్ బాటిల్ తీసి సుబ్బు మొహం మీద చల్లింది. దెబ్బకి సుబ్బు లేచి దిగాలుగా కూర్చున్నాడు.

రక్ష : పదా వెళదాం 
Nice update Takulsajal garu!!!.
clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
S3E10

మానస : సుబ్బు నాతోపాటు వస్తావా

సుబ్బు : వస్తాను..

మానస : బాడీలు కూడా మిగలలేదట కదా అని కళ్ళు తుడుచుకుంది.

సుబ్బు మౌనంగా ఉన్నాడు.

మానస : ఒకటి అడగనా

సుబ్బు : అడుగు

మానస : ఏమైంది ఎందుకలా ఉన్నావ్

సుబ్బు : ఏం లేదు

మానస : నాతో చెప్పకూడనిదా

సుబ్బు : అదేం లేదు ఎప్పటిలానే ఒకరిని ప్రేమించాను, చివరికి తనకి నేను ఎందులోనూ సరిపోనని తెలిసి..

మానస : (కళ్ళు తుడుచుకుని) అయితే ఏంటి, ఎప్పటిలానే ఇంకో అమ్మాయి..

సుబ్బు : లేదు మానస, ఎప్పుడు నేను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడిని కానీ ఈ సారి నిజంగానే ప్రేమించినట్టున్నా చాలా బాధగా ఉంది.

మానస : ఎవరు?

సుబ్బు : ఎవరోలే.. నాతోనే ఉండని.. మళ్ళీ నవ్వులపాలు కావడం ఎందుకు, కొంచెం సేపు డ్రైవ్ చేస్తావా నేను పడుకుంటాను.

మానస : అలాగే..

____________________________________________________

దేవి : దీనికోసమే నేను ఎదురు చూస్తుంది.

రక్ష : నేను కూడా

దేవి : లేచినందుకు సంతోషం, ఇంకోసారి చావడానికి రెడీగా ఉన్నావా

రక్ష : దా చూసుకుందాం.

శశి ముందుకు వస్తుంటే, చిరంజీవి కసితో ముందుకు దూకాడు.. మానస్ కోసం వాసుతో పాటు విక్రమ్ ఆదిత్య కూడా ముందుకు వెళ్లారు. రుద్ర మాత్రం వెనక్కి జరిగి ఒక చిటికె వెయ్యగానే ఒక బల్ల ప్రత్యక్షం అయ్యింది. వెళ్లి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.

లిఖిత : ఏంట్రా బిల్డప్పా

రుద్ర : నువ్వు మెలకుండా కూర్చోని చూడు. ఆ మంత్రగత్తెని చూసావా

లిఖిత : హ్మ్.. తన చుట్టు చూడు.. ఏదో వెలుగు.. మంచిది కానీ చెడ్డ చేతుల్లో ఉంది. మన చేతికి వస్తేనా.. నిజంగానే నిన్ను చూసి అటు రాక్షసులు ఇటు దేవతలు ఇద్దరు జడుసుకుంటారు ఏమంటావ్?

రుద్ర : నస పెట్టకు, ఇప్పటికే నా శరీరంలో నిన్ను మోస్తున్నాను అదే భారంగా ఉంది. ఇంకా శక్తులు అంటే నావల్ల కాదు.

లిఖిత : మ్యాచ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. మరి వాళ్ళు..

రుద్ర లేచి అందరినీ చూసి చిటికె వెయ్యగానే బెంచులు ప్రత్యక్షం అయ్యాయి, అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే రుద్ర కూర్చోమని చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ ఏం అర్ధం కావట్లేదు. కానీ అయోమయంగానే కూర్చున్నారు. బైట నుంచి ఎవరో చూస్తూ వీడియో తీసేసరికి రుద్ర కళ్ళు మూసుకుని చెయ్యి కారు వైపర్ ఊపినట్టు ఊపాడు ఒక పెద్ద షిల్డ్ తో విక్రమాదిత్య ఇల్లు కాళీ స్థలం మొత్తం కవర్ అయిపోయింది. బైట నుంచి వీడియో తీసే వాడికి అనుమానం వచ్చి లోపలికి వచ్చాడు కానీ ఏమి కనిపించలేదు, కానీ పెద్ద పాము కనిపించేసరికి అక్కడ నుంచి పారిపోయాడు.

అందరూ కూర్చుని చూస్తుంటే, లిఖిత రుద్ర శరీరంలోనుంచి బైటికి దూకింది. అది చూడగానే అందరూ భయంతో నిల్చున్నారు.

లిఖిత : భయపడకండి, నేనూ మనిషినే

రుద్ర : హహ.. ఇప్పుడు నిజం చెప్పవే

లిఖిత : నోరు ముయ్యి.. అని అందరినీ చూసి చిన్నగా నవ్వి కూర్చునేసరికి అక్షిత వాళ్లంతా మళ్ళీ కూర్చున్నారు. రుద్ర లిఖిత పిర్ర మీద గిల్లగానే లిఖిత నిల్చుంది అది చూసి మళ్ళీ అంతా నిలబడ్డారు, లిఖిత ఏం లేదు అంటూ కూర్చోగానే మళ్ళీ అందరూ కూర్చున్నారు.

ఇదంతా చుసిన దేవి, రుద్రని చూసింది.

దేవి : ఎవరు నువ్వు?

రుద్ర : నేనేదో టైంపాస్ కి వచ్చాను, నీ లాంటి బలహీనులని నేనసలు ముట్టుకోను, కంగారు పడకు.. జస్ట్ చూడ్డానికి వచ్చాను అంతే.

దేవి : హాహా.. రెండే నిమిషాలు నీకు నా పవరేంటో చూపిస్తా

రుద్ర : ఉండు పొప్కార్న్ తెచ్చుకుంటా అని చిటికె వెయ్యగానే చేతిలోకి పొప్కార్న్ వచ్చింది, లిఖిత భుజం మీద చెయ్యి వేసి తింటూ కూర్చున్నాడు.

లిఖిత : మీక్కూడా కావాలా అని నవ్వుతూ చిటికె వేసింది.. అందరి చేతిలోకి పాప్కార్న్ వచ్చేసింది.

రుద్ర : మొదలు పెడతారా లేక ముందు ముకేశ్ యాడ్స్ ఏమైనా ఉన్నాయా

లిఖిత : ఎందుకురా దాన్ని రెచ్చగొడుతున్నావ్

రుద్ర : సరదా, ఫర్ ఫన్..

లిఖిత : ఉమ్మ్మ్....

రుద్ర : తనకి ఎన్ని శక్తులు ఉన్నాయో, ఏమేమి చెయ్యగలదో తెలీకుండా ఎలానే తలపడేది.

లిఖిత : లేదే నాకెందుకో నువ్వు ఆ గొడ్డలి పట్టుకున్న అమ్మాయికి సైట్ కొడుతున్నట్టు అనిపిస్తుంది.. ఈ షో ఆఫ్ మొత్తం ఆ అమ్మాయిని ఇంప్రెస్స్ చెయ్యడానికేగా

రుద్ర : నీ బొంద.. అన్ని పిచ్చి అనుమానాలు నువ్వు..

లిఖిత : చూస్తున్నా చూస్తున్నా..

ఇంతలో రక్ష తన గొడ్డలిని ఒక రౌండు తిప్పి నేల మీద పెట్టింది.. తన గొడ్డలి వేగానికి రుద్ర చేతిలో ఉన్న పాప్కార్న్ కింద పడిపోయింది. రుద్ర కోపంగా చూస్తూ తన మీదకి అక్కడ కూర్చున్న అందరి బెంచుల మీద షిల్డ్ వేసాడు.

రుద్ర : బాబులు మీరు వెనక్కి వచ్చేయండి.. అనగానే నలుగురు వెనక్కి చూసారు.

రక్ష : అవును తను చెప్పింది నిజమే వెళ్లిపోండి... రేయి ఎటు చూస్తున్నారు.. ఒరేయి విక్రమ్ నీకు పెద్దమ్మని, ఆదిత్య నీకు అత్తని.. బాబు నువ్వెవరు సొల్లు కారుతుంది తుడుచుకో..

పద్మ : ఒరేయి బావ.. ఏం చేస్తున్నావ్

వాసు : వామ్మో.. పద్మా నాకేం తెలీదు వస్తున్నా... నాకు నువ్వు తప్ప ఎవ్వరు వద్దు బాబోయి.. అంటుండగానే పద్మ వాసు చెవి పిండుతూ వెనక్కి లాక్కేళ్ళింది.

రక్ష : అక్షిత.. అక్షితా...

అక్షిత : ఒరేయి దొంగ సచ్చినోడా, మా అమ్మ రా

చిన్నా : ఏయి ఎలా కనిపిస్తున్నానే నీకు, నేనేదో గొడ్డలి బాగుందని చూసాను అంతే..

అక్షిత : గొడ్డలి పైన ఉందారా నీ కన్ను.. కింద కాళ్ళని చూస్తున్నావ్.. నీ యబ్బ.

రక్ష నవ్వుకుని తన డ్రెస్సు సరిచేసుకుంది..

రక్ష : విక్రమ్, ఆదిత్య, నువ్వు చిరంజీవి.. తను వాసు.. ఇప్పటి వరకు మీరు చెయ్యాల్సిన దానికంటే ఎక్కువే చేసారు. మీ సాయం మరువలేనిది. కానీ ఇక్కడి నుంచి నేను చూసుకుంటాను.. మీరు వెళ్ళండి అనగానే నలుగురు వెనక్కి తగ్గారు.

దేవి కోపంగా రెండు వేళ్ళతో మెరుపు పుట్టించగానే రక్ష తన బంగారపు రంగులో ఉన్న గొడ్డలి ఎత్తి అడ్డుగా పెట్టింది. గొడ్డలిని కింద రెండు సార్లు కొట్టి చేతిలోకి తీసుకుని పరిగెడుతుంటే శశి మానస్ ఇద్దరు ఎదురు పరిగెత్తారు.

రక్ష మానస్ ని తన్ని అలానే వాడి మీదకి ఎక్కి పక్కనే ఉన్న శశి మెడ మీద గొడ్డలితో ఒక్క వేటు వేసింది.. శశి తల ఎగిరి పడింది.. మానస్ కళ్ళు పెద్దగా చేసుకుని చూస్తుండగానే గొడ్డలి భుజం మీద నుంచి తిప్పుతూ మానస్ మెడ కూడా నరికేసింది.

చూస్తున్న చిరంజీవి, ఆదిత్య, విక్రమ్, వాసు లేచి నిలబడ్డారు..

అక్షిత : ఏమైంది?

వాసు : వాడిని కింద పడేయ్యడానికే నాకు అరగంట పట్టింది, కాని ఈమె కనీసం వాడిని చూడను కూడా చూడలేదు..

చిన్నా : అక్కి..

అక్షిత : రక్ష అని ఊరకనే పెట్టాడనుకున్నావా వాళ్ళ నాన్న. కూర్చో.. అనగానే చిన్నాతో పాటు అందరూ కూర్చున్నారు.

అది చుసిన దేవి సైన్యానికి పిస్సు కారిపోయి బైటికి పరిగెత్తుదామని వెళితే షిల్డ్ ఆపేసింది.. రుద్ర కొంచెం ఎత్తగానే అందరూ పారిపోయారు.. ఇప్పుడు అక్కడ దేవి ఒక్కటే మిగిలింది.

దేవి అంతా చూసి రుద్రతో : నిన్ను వదిలి పెట్టను.

రుద్ర : ముందు నువ్వు ఎలా బతికుండాలో ఆలోచించు, తరవాత నా గురించి ఆలోచించొచ్చు.

దేవి : హహ.. నాకు చావు లేదు..  నన్ను ఎవ్వరు చంపలేరు.. నేను.. హహహ అని పిచ్చి పిచ్చిగా నవ్వుతుంటే రక్ష గొడ్డలి విసిరింది. అది తగిలి దేవి నవ్వడం ఆపి కోపంగా చూసింది.

దేవి ఒక్క క్షణంలోనే రక్ష మీదకి రాగానే, రక్ష గొడ్డలితో దేవి చెయ్యి నరికేసింది. ఆ వెంటనే దేవిని కిందకి అదిమి పట్టి తొడ నరికి ఇన్నేళ్ల నిరీక్షణ మొత్తం కసిగా మార్చి మెడ మీద ఒక్క వేటు వేసింది. అది చూసి అప్పుడే అయిపోయిందా అనుకున్నారు అంతా కానీ చూస్తుండగానే దేవి తల గాల్లోకి లేచింది నవ్వుతు.. అర నిమిషంలోనే దేవి శరీరం అతుక్కుని లేచి నిలబడి గట్టిగా నవ్వింది. అక్షిత లేచి రుద్ర దెగ్గరికి వెళ్లి కూర్చుంది.

లిఖిత : ఆ గొడ్డలి..

రుద్ర : నేను అదే అనుకుంటున్నాను.

అక్షిత : తను చనిపోలేదు 

లిఖిత : అమృతం తాగింది కదా, తనకి చావు లేదు.

అక్షిత : మరి తనని...

లిఖిత : అదే వెతుకుతున్నాం, మార్గం దొరికేంత వరకు తప్పదు.

ఇంతలో దేవి రక్ష కడుపులో ఒక్కటి గుద్దింది.. రక్ష కింద పడి తన చేతిలో ఉన్న గొడ్డలి రుద్ర కాళ్ళ దెగ్గర పడింది. రుద్ర లేచి ఆ గొడ్డలిని చేతిలోకి తీసుకున్నాడు. కుడి చేత్తో గొడ్డలిని అటు ఇటు తిప్పి ఒక్కసారి గాలిలో నరకగానే రుద్ర శక్తికి వేగానికి.. గొడ్డలితో గాలినే నరికేసాడేమో అన్నంతగా ధ్వని ప్రతిధ్వనించింది.

లిఖిత : ఇది...

రుద్ర : పరశురాముడి గొడ్డలి
Like Reply
Deeevuda.
[+] 2 users Like Manavaadu's post
Like Reply
Super bhayya yem twists yem narration pichi lestundi
[+] 2 users Like kakinada_kurrodu's post
Like Reply
Superb ji keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Picha picha ga undhe
[+] 1 user Likes Manoj1's post
Like Reply
super bro....nice update..
[+] 1 user Likes vg786's post
Like Reply
bro super update waitingyour for next update....,
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
అమృతం తాగినతమాత్రాన దేవికి చావు లేదు అనుకుంటే అది పొరపాటు నాకెందుకో దేవి కి రుద్ర వలన చావు అని అనిపిస్తుంది అప్డేట్ చాలా బాగుంది బ్రదర్
[+] 3 users Like rapaka80088's post
Like Reply
దయచేసి ఈ కథని ఈరోజుతో ముగింపు ఇవ్వండి లేకుంటే మాకు వచ్చిన హార్టటాక్ కి ప్రాణం పోయేలా ఉంది
[+] 2 users Like rapaka80088's post
Like Reply
Deenemma em rasaru bro vere level anthe
[+] 2 users Like Sudharsangandodi's post
Like Reply
అమ్మదీనెమ్మ బత్తాయో......ఏకంగా పరుశురాముడి గొడ్డలినే దించారా....కానీ అప్డేట్ మాత్రం సూపర్ బ్రో....చిన్నది అయినా చాలా నచ్చింది... అటు కామెడీ తో పాటు ఇటు ఏక్షన్ రెండు బాగా రాశారు బ్రో.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar Namaskar Namaskar
[+] 4 users Like Thorlove's post
Like Reply
చిటికెలు చిటికెలో..... horseride

[Image: chitikelu-lbsriram-.%20andam-maa-alludu-ve...987810.gif]
[+] 8 users Like kummun's post
Like Reply
I am waiting for your next update
[+] 1 user Likes Rajalucky's post
Like Reply
Super update
[+] 1 user Likes Rajalucky's post
Like Reply
super super super super keka
[+] 1 user Likes Gangstar's post
Like Reply
Super story bro
Waiting for new update
[+] 1 user Likes donakondamadhu's post
Like Reply
(27-10-2022, 11:31 AM)kummun Wrote: చిటికెలు చిటికెలో..... horseride

[Image: chitikelu-lbsriram-.%20andam-maa-alludu-ve...987810.gif]

అన్నా నువ్ సూపర్
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 2 users Like Premadeep's post
Like Reply
Super update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply




Users browsing this thread: 87 Guest(s)