Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Lotpot Lotpot Lotpot

Subbu to Akshita: say, whoz ur daddy? Tongue

Akshita: ....... Sick
[+] 5 users Like kummun's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
super
[+] 1 user Likes Gangstar's post
Like Reply
Super
[+] 1 user Likes saleem8026's post
Like Reply
clps Super happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
 ఎంటి బ్రో ఇలా చేశారు మళ్ళీ సబ్బు ని కల్లుతిరిగి పడెలాగ చేశారు గా....హ్మ్మ్ .....
Waiting for an Epic War fight fight fight
అప్డేట్ కి ధన్యవాదాలు   Namaskar
[+] 3 users Like Thorlove's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
AWESOME UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Super nice next update please
[+] 1 user Likes Putta putta's post
Like Reply
S3E9

అంబులెన్స్ లోనుంచి వాటర్ బాటిల్ తీసి సుబ్బు మొహం మీద చల్లింది. దెబ్బకి సుబ్బు లేచి దిగాలుగా కూర్చున్నాడు.

రక్ష : పదా వెళదాం 

సుబ్బు : ఇంకే... లేచారుగా,  ఇక మీదారి మీది. నా దారి నాది. పైగా మీరే అందరిని భయపెట్టేలా ఉన్నారు మళ్ళీ నేనెందుకు అడ్డం.

రక్ష ఇటు తిరిగి నవ్వుకుంటూనే జడ వేసుకుంటూ "నాకు డ్రైవింగ్ రాదు" అంది.

సుబ్బు : మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చెయ్యాలి

రక్ష : అక్షిత దెగ్గరే 

సుబ్బు : అయితే పదండి అని అక్కడే ఉన్న ఒక కారు దెగ్గరికి వెళ్లి డోర్ లాగితే రాలేదు దాన్ని గట్టిగా తన్నాడు. రక్ష వచ్చి డోర్ తీస్తే ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. రక్ష గొడ్డలి వెనక సీట్లో పడేసి తిరిగి ముందుకు వచ్చి సుబ్బు పక్క సీట్లో కూర్చుంది. సుబ్బు ముందుకు పోనిచ్చాడు.

రక్ష : నీ పేరేంటి ?

సుబ్బు : సుబ్బు 

రక్ష : అక్షితకి నీకు ఎలా పరిచయం 

సుబ్బు ఏం మాట్లాడలేదు  

రక్ష : నిన్నే 

సుబ్బు : ఏమో నాకు తెలవదు 

రక్ష : అదేంటి 

సుబ్బు : సైలెంటుగా కూర్చో 

రక్ష : నీకు బాగా బలుపు ఎక్కువగా ఉన్నట్టుందే, అక్షిత నీగురించి ఏమైనా చెడ్డగా చెప్పాలి నీకుంటది.

సుబ్బు : నిన్ను దాని దెగ్గర వదిలిపెడతా, ఆ తరువాత నీ ఇష్టం వచ్చినట్టు చావు.

రక్ష ఇంకేం మాట్లాడలేదు, సుబ్బు కూడా మౌనంగా వేగంగా వెళ్లి విక్రమాదిత్య ఇంటికి వెళ్ళిపోయాడు. కారు సౌండు విని అందరూ బైటికి వచ్చారు. అక్షిత బైటికి వస్తూనే కారు దిగుతున్న రక్షని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంది. మిగతావాళ్ళు మాత్రం రక్ష హైట్ ఆ గొడ్డలి తన డ్రెస్ చూసి కొద్దిగా జంకారు.

అను : వాళ్ళెక్కడరా

సుబ్బు : బానే ఉన్నారు, వస్తారు...  నేను వెళుతున్నా 

సుబ్బు మాటలు వినగానే రక్ష, అక్షిత అందరూ సుబ్బు వైపు తిరిగారు.

అక్షిత : ఎక్కడికి 

సుబ్బు : హైదరాబాద్, వెళ్లి నా జాబ్ నేను చేసుకోవద్దా 

అక్షిత : జోకులు చెయ్యకు 

సుబ్బు : జోకులు చెయ్యడానికి నువ్వేమైనా నా లవరా 

అక్షిత : ఏమైంది రా, అలా మాట్లాడుతున్నావ్ 

సుబ్బు : నేను వెళుతున్నా, ఇదిగో నీ కార్డు, ఆ అంబులెన్స్ అక్కడే ఉంది. ఇదిగో నువ్విచ్చిన సిం.. ఇంక నన్ను పిలవకు అని కారు ఎక్కాడు.

అక్షిత కారుకి అటు సుబ్బు వైపు వెళ్లి : ఏమైందిరా.. ఎవరైనా ఏమైనా అన్నారా.. చెప్పు 

సుబ్బు : నన్ను ఏమంటారు, అయినా ఎవ్వరు లేనోడ్ని నాకంటూ కొంత వెనకేసుకోకపోతే రేపు నన్ను చూసేది ఎవరు.. మీరంతా డబ్బున్నోళ్ళు మీరు సంపాదించకపోయిన పరవాలేదు.. నేనలా కాదుగా 

అక్షిత : ఇప్పుడేంటి నీకు ఎంత డబ్బు కావాలి 

సుబ్బు : నేను సంపాదించుకోగలను, ఎవ్వరు ముష్టి వేయాల్సిన అవసరం లేదు.. నువ్వే బోలెడన్ని ప్రొబ్లెమ్స్ లో ఉన్నావ్. నీ గురించి చూసుకో.. నాగురించి వదిలేయి.. అని కారు ముందుకు పోనించాడు

ఇంతలో మానస కూడా వచ్చింది.

మానస : సుబ్బు నేను వస్తున్నా ఆగు.. అని లోపలికి వెళ్లి ఏదో కవర్తో వచ్చి కారు ఎక్కి కూర్చుంది.

అను : నేను కూడా వస్తాను ఉండు..

మానస : లేదు నేను ఒక్కదాన్నే వెళతాను, కావ్య అమ్మ కూడా వస్తానంది. నేనే వద్దన్నాను. సుబ్బు ఇంకేం మాట్లాడకుండా కారు ముందుకు పోనించాడు.

అను అక్షిత దెగ్గరికి వచ్చి : ఏంటి సుబ్బుతో ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నావ్ 

అక్షిత : ఏమైందో చాలా వింతగా ప్రవర్తించాడు, ఏదో జరిగింది.. ఎవరైనా ఏమైనా అని ఉండాలి లేదా ఏదో విషయంలో బాధ పడుతుండాలి.. సర్లే పదా.. అని రక్ష ని చూసింది. అందరూ లోపలికి వెళుతుంటే రక్ష అక్కడే మట్టి మీద కూర్చుంది.. అక్షిత కూడా వెళ్లి తన పక్కనే కూర్చుని వాటేసుకుంది.

రక్ష : ఎవడే వాడు నీతో అంత కటువుగా మాట్లాడుతున్నాడు, నువ్వేమో వాడిని బతిమిలాడుతూ తిరుగుతున్నావు

అక్షిత : సుబ్బు అని నా జూనియర్ లే.. మంచి కామెడీ క్యారెక్టర్.. చాలా మంచోడు.. ఏమైందో మరి అలా ఉన్నాడు. అవును నువ్వు ఎలా.. ఎలా లేచావ్..

రక్ష : అదా... అని తనలో తానే నవ్వుకుంది, సిగ్గుపడుతూ 

అక్షిత : ఏంటి మా 

రక్ష : ఏమి లేదులే నీకు మంచి షాక్ ఇస్తా, అప్పటివరకు సస్పెన్స్ తో ఉండు. ఇంకా...  నేను లేనప్పుడు ఏమేమి జరిగాయో మొత్తం చెప్పు అనగానే అక్షిత మొత్తం చెప్పుకొచ్చింది. అంతా విని మౌనంగా కొంత సేపు ఆలోచించింది.

రక్ష : అయితే ఆ చిరంజీవి ఎం చేస్తాడో, ఎవరో కూడా తెలీకుండానే ప్రేమించావు.. నేను నేర్పించినవి మొత్తం పక్కన పెట్టేసి అంత గుడ్డిగా ఎలా నమ్మావు  ?

అక్షిత : ఏమో నా మనుసుకి అనిపించింది.. నువ్వేగా ఎప్పుడు చెపుతుంటావ్ మనసుకి నచ్చిన పనే చెయ్యమని.. నీకు ఎప్పుడు అలా అనిపించలేదా.. అయినా ఎక్కడలే అయితే యుద్ధాలు లేకపోతే ట్రైనింగ్ నీ జీవితం మొత్తం ఇదే సరిపోయింది.. ఏదో నువ్వు నిద్రలోకి వెళ్లిపోయావ్ కాబట్టి కనీసం వాడైనా దొరికాడు.. లేకపోతే నేను కూడా నీలాగే నీ వెనక కుక్క లాగ తిరిగేదాన్ని, పెళ్లి పెటాకులు లేకుండా 

రక్ష : (నవ్వుతూ) అయితే తిరిగి నేను ఒక్కదాన్నే వెళుతున్నానన్నమాట 

అక్షిత : అమ్మా....! నువ్వేనా 

రక్ష : ఏమైంది 

అక్షిత : అప్పటినుంచి నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్.. ఎప్పుడు సీరియస్ గా ఉండే నువ్వేమో నవ్వుతున్నావ్ ఎప్పుడు నవ్వుతు ఉండే వాడేమో సీరియస్ గా వెళ్ళిపోయాడు.. కొంపదీసి రేయి సుబ్బు మా అమ్మ నీ బోడీలోకి పరకాయప్రవేశం చేసిందా ఏంటి..?

రక్ష : నేనే అక్షిత.. అయినా వాడి దెగ్గర ఏముంది. కొస్తే కిలో కండ కూడా రాదు.  వాడి శరీరంలోకి పరకాయప్రవేశం చేసి చేసేది ఏముంది.

అక్షిత : అయినా కూడా చాలా మంచివాడు, అని సుబ్బు గురించి చెప్పింది.

రక్ష : సుబ్బు గురించి అంతా విని.. తన గురించి ఇంత తెలిసినప్పుడు, తననే పెళ్లి చేసుకోవచ్చు కదా 

అక్షిత : ఛీ లేదు, వాడు పేరుకే నాకు ప్రపోజ్ చేసాడు కానీ ఎప్పుడు తప్పుగా చూడలేదు.. మంచి క్యారెక్టర్ ఉన్నవాడు నన్ను అక్కా అని ఒక్కసారి పిలిపించుకున్నందుకు మళ్ళీ నన్ను మాటలతో కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు.. ఇబ్బంది పెట్టడం అంటుంచు ఆ టాపిక్ కూడా ఎత్తలేదు.. కాకపోతే ఎక్కడ అమ్మాయి కనపడితే అక్కడే దానికి ఐ లవ్ యు చెప్తాడు.. వాడికి ఎవరు రాసి పెట్టుందో చూడాలి.. చాలా మంచి అమ్మాయి వాడి జీవితంలోకి రావాలని నేను చాలా సార్లు మొక్కుకున్నాను కూడా 

రక్ష అక్షిత మాటలు వింటూనే లేచి నడుచుకుంటూ ఇంటి వెనక్కి వెళ్లి తన తండ్రి విక్రమాదిత్య సమాధి దెగ్గర కూర్చుంది. సంధ్య వచ్చి రక్ష పక్కన కూర్చుంది.

సంధ్య : రక్షా 

రక్ష : ఎలా ఉన్నావ్, నీకు నాన్న ఎం చెప్పాడు నువ్వు ఎం చేస్తున్నావ్.. అలా ఏడవచ్చా.. ఇలా రా అని ఒళ్ళో పడుకోబెట్టుకుని కళ్ళు తుడిచింది.

సంధ్య : క్షమించు తల్లి, నేను భయపడిపోయాను

రక్ష : నాకు తెలుసు, ఇప్పుడు ఏమైంది కొన్ని సంవత్సరాలు అంతే కదా నాకు కూడా విశ్రాంతి దొరికింది.. అదీ ఒకందుకు మంచిదే.. ఇప్పుడు నా శరీరం నా అధీనంలో ఉంది. ఏది జరిగినా దాని వల్ల నాకు మంచి జరిగిందే తప్ప చెడు జరగలేదు.. నువ్వు అనవసరంగా బాధ పడుతున్నావు. పద ఇంట్లోకి వెళదాం.. అని లేచి ఇంట్లోకి తీసుకెళ్లింది.

రక్ష లోపలికి వెళ్లి గోడకున్న విక్రమాదిత్య అనురాధ మానస నవ్వుతూ ఉన్న ఫోటోకి దణ్ణం పెట్టుకుని ఆ ఫోటోని తీసింది, వెనకే ఉన్న శశి ఫోటో కూడా తీసుకుంది. కావ్య వచ్చి పక్కన నిల్చోగానే ఫోటోలు పక్కకి పెట్టి కావ్య భుజం మీద చెయ్యి వేసింది.

రక్ష : క్షమించు కావ్య.. మన నాన్న నాకు చాలా పెద్ద పని అప్పగించాడు అందుకే అమ్మ చెప్పినట్టు నేను నీ దెగ్గరికి రాలేకపోయాను. కానీ నీ గురించి ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నాయి. నీ చదువు నీ ప్రేమ నీ పెళ్లి నీ కొడుకు అన్ని నేను తెలుసుకుంటూనే ఉన్నాను. అని కౌగిలించుకుంది.

కావ్య ఏదో చెప్పబోతే.. సలీమా చెప్పబోయింది..

రక్ష : అవసరం లేదు నా చెల్లి ఎం చెప్తుందో నాకు అర్ధం అవుతుంది. కావ్యా.. భయపడకు నేనుండగా నిన్ను నీ కొడుకుని ఎవ్వరికి ఏమి కానివ్వను..

కావ్య : నాకు తెలుసు అని సైగ చేస్తూనే.. రక్ష చేతిని ముద్దు పెట్టుకుంది. కావ్య ఆదిత్య నాన్నని, అను అమ్మని చూపించింది. సరిత, రాజు ఇద్దరు లేచి నిల్చున్నారు. ఈ అమ్మాయి నీ కోడలు.. అనురాధ.

రక్ష : ఏంటి రాజు, సరిత.. నన్ను మొదటి సారి చూస్తున్నారు కదా, అంతా కన్ఫ్యూషన్ గా ఉందా.

రాజు : నాకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కావట్లేదు 

రక్ష : నీ మనసు ఏది చెపుతుందో అదే నమ్ము.. సరే ఒక్కటి చెప్పండి నా కూతురుకి అనురాధ అన్న పేరు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది.

సరిత : ఎందుకో తెలీదు మా చిన్నప్పటి నుంచి ఆదిత్య, అనురాధ అన్న పేర్లు మా మనస్సులో పడిపోయాయి అందుకే ఇంట్లో మొదట పిల్లడు పుట్టగానే ఆదిత్య అని ఆ తరువాత అమ్మాయి పుట్టాక అనురాధ అని పెట్టాము.

రక్ష : ఎందుకంటే ఆదిత్య మన నాన్నపేరు కాబట్టి, అనురాధ మన అమ్మ పేరు కాబట్టి.. మీ అక్కయ్య కావ్య దూరంగానే బతికింది కానీ మీరు మాత్రం మీకు తెలివి వచ్చేదాకా అమ్మ మీ ఇద్దరినీ తనతోనే ఉంచుకుంది. అమ్మ నాన్నని చిన్నా అని లేకపోతే ఆదిత్య అని పిలుచుకునేది, నాన్న కూడా అను అని పిలిచేవాడు ఆ పేర్లే మీ నోటికింద నాని మీ పిల్లలకి ఆ పేర్లు పెట్టుకునేలా చేసింది.

రాజు : మేము ఒంటరి వాళ్ళం కాదు, ఇది మాత్రం సంతోషంగా ఉంది.

రక్ష : నేను మీ దెగ్గరికి ఎప్పుడో రావాల్సింది.. మన అందరం కలిసే ఉండాలని నేను మీకు అండగా ఉండాలని నాన్న అనుకున్నారు. కానీ ఆయన వేరే పనులు కూడా నాకు అప్పగించారు అవి పూర్తి చెయ్యడానికి చాలా కలం పట్టింది ఆ తరువాత అనుకోని పరిస్థితుల వల్ల కోమాలోకి వెళ్లాను. భయపడకండి నేనున్నాను కదా ఇక నేను చూసుకుంటాను.. ఈ ఒక్క రోజు ఇక్కడే ఉండండి.. రేపటి నుంచి ఈ గొడవలు ఏమి ఉండవు. అని సర్ది చెప్పి అను వైపు తిరిగింది.

రక్ష : ఏంటి అలా చూస్తున్నావు.. ఇందాకటినుంచి.

అను : మీరు.. మిమ్మల్ని...

రక్ష : పెద్దమ్మ అని పిలువు 

అను : ముందు అదే అనుకున్నాను కానీ మీరు చాలా యంగ్ గా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు అనగానే కావ్య రక్ష భుజం మీద చెయ్యి వేసి అవును అని నవ్వింది. దానికి రక్ష కూడా నవ్వింది.

రక్ష : హహ 

అను : నిజంగా మనం ఇద్దరం పక్క పక్కనే నిలుచుంటే నేనే మీకు అక్కలా ఉన్నాను.

రక్ష :  ఇది మరీ కొంచెం..

అను : లేదు నేను నిజమే చెపుతున్నాను, నిజంగా చాలా అందంగా ఉన్నారు. కావాలంటే నీ అల్లుడు వచ్చాక ఆట పట్టిద్దాం నన్ను వదిలేసి నీ వెనకాల తిరగకపోతే అప్పుడు అడుగు.. రక్షతో పాటు అందరూ నవ్వారు.. కానీ పెద్దమ్మ ఇంత హైట్ ఉన్నవేంటి పెద్దమ్మా...

రక్ష : మా నాన్న హైటే కదా, నన్ను కన్నా అనురాధ అమ్మ మాములే కానీ నేను పుట్టడానికి కారణమైన మానస అమ్మ కూడా హైటే.. 

అను : పెద్దమ్మ మీ గొడ్డలి ఒకసారి నేను పట్టుకోవచ్చా

రక్ష : ఇదిగో అని తీసి చేతికి ఇచ్చింది. జాగ్రత్త చాలా బరువు ఉంటుంది.

అనురాధ మొయ్యలేక కింద పడేసింది.

రక్ష : అను జాగ్రత్త, చాలా పదును.. ఉండు నేను తీస్తాను.

అను : పెద్దమ్మ ఈ గుర్తు ఏంటి.. అని గొడ్డలి హేండిల్ మీద ఉన్న గుర్తు చూపించింది.

రక్ష : అదీ నేను పుట్టి పెరిగిన తెగ నాయకుడి గొడ్డలి. ఈ గొడ్డలి గుర్తు చూస్తే ఏ తెగకి సంబంధించిన రాజు దీన్ని ధరిస్తున్నాడో తెలుస్తుంది.

అను : ఎక్కడ నువ్వు పెరిగింది.

రక్ష : ఇక్కడ కాదు, ఆఫ్రికా అడవుల్లో

అను : అంటే అక్కడ నువ్వేనా రాణివి ?

రక్ష : లేదు ఈ గొడ్డలి మా నాన్నది. ఆయన గుర్తుగా నేను దీన్ని నా ఆయుధంగా చేసుకున్నాను.

అను : ఆయన అక్కడ రాజు అయ్యాడా... నీకంటే బలవంతుడా ?

రక్ష : అవును.. కానీ ఆయన ఆఖరి రోజుల్లో ఆయన శత్రువులని ఎవ్వరిని చంపలేకపోయాడు.

అను : ఎందుకు 

రక్ష : అంతక ముందు చేసిన యుద్ధాలు గొడవలు రక్తపాతం అన్ని తన వల్లే జరిగాయని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. అందుకే ఎవ్వరిని చంపలేక ఏమి చెయ్యలేకపోయాడు.. ఆయన మా అమ్మ మానస పోయినప్పుడే మారిపోయాడు కానీ నేను పెరిగిన ఆఫ్రికా తెగ కూడా ఇక్కడ ఉన్న మా నాన్న కుటుంబానికి సంబంధించినది.. వాళ్ళకి సాయం చెయ్యడానికి ఒప్పుకున్నాక తప్పక యుద్ధం చేసాడు ఆ తరువాత అను అమ్మ చనిపోతుందని తెలిసాక ఆయనకి ఉన్న వరం కోరుకున్నాడు.

అను : ఏ వరం

రక్ష : ఆయనకి ఆయనే స్వయంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రలోకి వెళ్లిపోయే వరం సంపాదించాడు. అది కోరుకుని శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు అని సంధ్యని చూసింది.

ఇంతలో బైట చప్పుడు అయితే లేచింది. బైట శశి.. మానస్.. దేవితో పాటు ఒక సైన్యంతో వచ్చేసారు. అదే టైంకి ఇటు ఆదిత్య, విక్రమ్, చిరంజీవి, వాసుతో పాటు రుద్ర కూడా వచ్చాడు. అందరూ భయపడుతుంటే రక్ష గొడ్డలి అందుకుని ఇంటి బైటికి వచ్చి ఇంటి తలుపు వేస్తూ దేవి వంక చూసింది.

దేవి : దీనికోసమే నేను ఎదురు చూస్తుంది..
Like Reply
Subbu papam
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Maham sangramam arambham
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Superb ji keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Super update
[+] 1 user Likes Putta putta's post
Like Reply
మేము కూడా దీనికోసమే ఎదురుచూస్తున్నాం...... fight
ఫ్యామిలీ reunion బాగుంది బ్రో....బిట్ ఎమోషనల్....ఇంతకీ మానస సబ్బు ఎక్కడికి వెళ్ళారు.....రక్ష సబ్బు కి పడిపోయినట్లు వుంది..... Big Grin
అప్డేట్స్ కి ధన్యవాదాలు  Namaskar Namaskar Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Next update tvraga ivandi
[+] 2 users Like Putta putta's post
Like Reply
Same to same memu kuda dheeni kosame eduruchusthunnam.
[+] 1 user Likes Manavaadu's post
Like Reply
మేము కూడా దానికోసమే చూస్తున్నాం. కథ క్లైమాక్స్ కు వచ్చింది అనుకుంటా.
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
super
[+] 1 user Likes Gangstar's post
Like Reply




Users browsing this thread: 105 Guest(s)