Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Bro i think from here it will connect to the priyasathruvu
[+] 3 users Like Ghost Stories's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
bro waiting forto subbu turn. super update ...., waiting for next update ..., love❤❤❤❤
[+] 2 users Like Praveenraju's post
Like Reply
Yem action guru ......super
[+] 2 users Like Zixer's post
Like Reply
S3E7

హెలికాప్టర్ నుంచి కిందకి దిగిన సుబ్బు నేరుగా ఎవ్వరి కంటా పడకుండా ఇందాక దాక్కున్న గోడ ఎక్కి దాక్కుని చూస్తున్నాడు. అప్పుడే ఎవరో ఒక ముసలావిడ నవ్వుతూ లోపలికి వస్తుంటే చూసి ఆపుదామనుకున్నాడు కానీ తన వెనకాల ఉన్న మనుషులని చూసి భయపడి మెలకుండా కూర్చున్నాడు.

తన వెనకాలే వచ్చిన వాళ్ళు కోట లోపలికి వెళ్లే ద్వారం దెగ్గర తన సింహాసహనం వెయ్యగానే కూర్చుని నవ్వుతూ చూస్తుంది. వాసు మానస్ ని కొట్టి ఆ ముసలావిడ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాడు.. ఆమె మెచ్చుకోలుగా నవ్వింది అంతే.. ఇటు మానస్ వైపు అటు శశి వైపు రెండు వేళ్ళు గురి పెట్టింది.

శశి, మానస్ వంట్లోకి ఏదో తెలియని శక్తి వచ్చింది, ఇద్దరి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఆ ముసలావిడ చుట్టూ ఉన్న సేవకులు అందరిని చుట్టుముట్టారు. మానస్ ని కొట్టడానికి వచ్చిన ఆదిత్యని కాలితో ఒక్క తన్నాడు అంతే ఆదిత్య ఒక కాలు ముడుచుకుపోయి కింద పడ్డాడు మళ్ళి లేవలేదు. ఆదిత్యకి తెలుస్తుంది తన కాలు విరిగిపోయిందని. మానస్ చెయ్యి చాపగానే ఎవరో కత్తి అందించారు... అందుకున్న చేతితో కత్తిని అలానే ఆదిత్య మీదకి విసిరాడు మొత్తం కడుపులోకి దిగింది. అది విక్రమ్ చూసి ఆదిత్య దెగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అప్పుడే చిరంజీవి దెబ్బ వల్ల కిందపడి లేచిన శశి కంట విక్రమ్ పడ్డాడు. లేచిన వెంటనే విక్రమ్ మెడ అందుకుని పైకి లేపి పట్టుకుని మెడ విరిచేసి చిన్నా మీదకి విసిరేసాడు. 

చిరంజీవి తన మీద పడ్డ విక్రమ్ ని చూసాడు ప్రాణాలతో ఉన్నట్టు అనిపించలేదు, ఆదిత్య కూడా అలానే పడిపోయి ఉన్నాడు. ఇద్దరు ఒకరు చదువు పూర్తి చేసుకున్న కుర్రాడిలా ఉంటె ఇంకొకడు చదువుకునే పిల్లాడిలా అనిపించారు. ఈ వయసులోనే ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డా ఇదంతా ఆ ముసలిదాని వల్లే అనిపించింది. అప్పటి వరకు తన్నులు తింటున్న వాడు ఇంత బలంగా లేవడం అసాధ్యం అని చిరంజీవికి తెలుసు.

ఇటు మానస్ వాసుని మెడ పట్టుకుని నెల కేసి కొట్టి వీపు మీద ఎక్కి నిలుచుని ఎగిరి దూకాడు, చెయ్యి చాపగానే మానస్ చేతిలోకి ఇంకో కత్తి వచ్చి పడింది. వాసు ఎదురు కొట్టకుండా చెయ్యి పట్టుకుని నరాలు కోసేశాడు. వాసుకి ఎం అర్ధంకాక అలానే నిలబడ్డాడు చలనం లేకుండా అటు ఇటు చూస్తుండగానే కత్తిని వాసు పొట్టలో దించి బైటికి చీల్చాడు.

అదే టైంలో చిరంజీవి ఎగిరి మానస్ ని గుద్దుకున్నాడు. ఇద్దరు లేచి చూసేసరికి శశి అప్పటికే చిన్నా మీదకి వచ్చేశాడు. కాలితో శశి సెంటర్ లో తన్నాడు. దొరికిన కొంత టైములో లేచి సర్దుకుని పడిపోయి ఉన్న  అందరిని చూసాడు. 

మానస్ : ఇంకా అయిపోలేదా 

శశి : నరం సాగినట్టు సాగుతున్నాడు.

మానస్ : పక్కకి తప్పుకో వీడిని కూడా నేనే చూసుకుంటానని ముందుకు దూకాడు. మానస్ ఎదురు వస్తుండగానే పక్కనే ఉన్న ఇటుక రాయి ఒకటి తీసుకుని మానస్ మొహం మీద చెళ్ళున చరిచాడు. మానస్ కింద పడి లేచే అంతలో శశి కూడా ముందుకి దూకాడు.

ఒక వైపు శశి ఇంకో వైపు మానస్ మధ్యలో చిరంజీవి ఇద్దరి వైపు చూస్తూనే ముందు ఎవరు ఎటాక్ చేస్తారా అని రెడీగా ఉన్నాడు, అప్పటికే బట్టలు కొంచెం చినిగి దెబ్బలు తగిలి ఒళ్ళు హూనమైపోయింది. ఒకరికి ఇద్దరు మీద పడటంతో అటు ఇటు చూసాడు కింద ఆయుధాలు ఏమి కనిపించలేదు.

శశి కొడుతుంటే శశి చెయ్యిని రెండు చేతులతో పట్టుకుని ఎగిరి మానస్ ని తన్ని, శశి ని అలానే లాగి మానస్ మీదకి నెట్టాడు. అదే స్పీడ్ లో రెండు అంగల్లో దూకి ఒక రాడ్ కనపడితే అది తీసుకుని వెనక్కి తిరిగాడు. శశి మానస్ కూడా ఇద్దరు అలిసిపోవడం గమనించాడు. మానస్ పిడికిలి బిగించి గుద్దుతుంటే ఆ పిడికిలి మీద రాడ్ తో గట్టిగా కొట్టి శశి వైపు తిరగగానే ఒక్కటి పీకాడు. దెబ్బకి చిన్నా దొల్లుకుంటూ కింద పడ్డాడు. వెనకాలే కూర్చున్న ముసలిది ఇంట్రెస్టింగ్ గా గడ్డం కింద చెయ్యి పెట్టుకుని చిరంజీవిని చూస్తుంది. తన పెంపుడు కుక్కల్ని ఇంత దాక కొట్టుకుంటూ కొట్టించుకుంటూ తీసుకొచ్చాడంటే ఆ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కదా...!

ఒక పక్క తన్నులు తింటూనే ఒక సారి శశి ని కొట్టి మానస్ చేతిలో కింద పడటం, ఇంకోసారి మానస్ ని కొట్టి శశి చేతిలో కింద పడటం.. ఇదే కంటిన్యూగా జరుగుతుంది తప్పించి చిరంజీవి మాత్రం పడ్డోడు పడినట్టే లేచి మళ్ళి నిల్చుంటున్నాడు. ఇక ఓపిక నశించి ముసలిది లేచింది.

శశి, మానస్ ఇద్దరి కళ్ళు ఎర్రబడటం చూసి ఇది ఆ మంత్రగత్తె పనే అని ఇద్దరు తేరుకోకముందే, పరిగెత్తుకుంటూ వెళ్లి శశి, మానస్ భుజాల మీద ఎగిరి ముసలిదాని మొహం మీద గట్టిగా పిడి గుద్దు గుద్దాడు. ముసలిది అప్పటి వరకు కూర్చున్న సింహాసనం పైన పడిపోయింది. శశి మానస్ కోపంగా రాబోతే నవ్వుతూ చెయ్యి ఎత్తి ఆపింది. దానికి శశి మానస్ ఇద్దరు ఆగిపోయారు. చుట్టు పక్కన ఉన్న మంత్రగత్తె సైన్యంవాళ్ళు ఎం జరుగుతుందా అని భయంతో చూస్తున్నారు.

నవ్వుతూ చెంప మీద రుద్దుకుని "నేను నిన్ను ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ నీ స్టామినా నాకు నచ్చింది. నా చేతుల్లో చస్తున్నందుకు నీ జన్మ ధన్యం అనుకో"

చిన్నా : తమరి పేరేంటో ?

"దేవి"

చిన్నా : నీ వాళ్ళతో ఫుట్ బాల్ ఆడుకున్నాను, నన్ను కూడా హిప్నటైజ్ చేసి నీ సైన్యంగా చేర్చుకోవాలన్న ఆలోచన రాలేదా 

దేవి : వచ్చింది, కాని నీలాంటి తెలివికలవాడు నాకు అనవసరం లేదు, అని తన వెళ్లలోనుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని చిన్నా గుండె మీదకి మళ్లించింది. చిరంజీవి ఎగ్గిరి పడ్డాడు, చిన్నా కళ్ళకి తలకిందులుగా గోడ మీద నుంచి భయం భయంగా తొంగి చూస్తున్న సుబ్బు కనిపించాడు. నవ్వుతూ సారీ అక్షిత అని కళ్ళు మూసాడు.

దేవి : వీళ్ళ తలలు వేరు చెయ్యండి అని వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే 

సుబ్బు : ఆగు 

అందరూ సుబ్బు వైపు చూసారు, శశి కోపంగా మీదకి వెళుతుంటే

దేవి : శశి ఆగు అని వెనక్కి తిరగకుండానే ఆపి.. చెప్పు అని నవ్వింది.

సుబ్బు : వాళ్ళని వదిలెయ్యి 

దేవి : వదిలేస్తా,  నాకేమి లాభం 

సుబ్బు : ఈ నలుగురిని వదిలెయ్యి నీకు రక్ష ఎక్కడుందో చెపుతాను  అనగానే దేవి వెనక్కి తిరిగింది.

దేవి : ఏమన్నావ్ 

సుబ్బు : రక్షని అప్పచెబుతాను, వీళ్ళని వదిలెయ్యండి. అన్నాడు ఏడుస్తూ 

దేవి : సరే చెప్పు వదిలేస్తాను 

సుబ్బు : నమ్మకం ఏంటి ?

దేవి : మాటంటే మాటే, నేను ఇచ్చిన మాట తప్పను.

సుబ్బు రక్ష వివరాలు చెప్పగానే, దేవి ఇద్దరినీ చూసింది. శశి మానస్ ఇద్దరు అక్కడనుంచి వెళ్లిపోయారు. దేవి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బు ఏడుస్తూనే అక్కడ ఉన్న కారులో నలుగురిని ఎక్కించి షిప్ దెగ్గరికి తీసుకెళ్లి. ఒక్కొక్కరిని మోసి షిప్ ఎక్కించి ఇవతలి వైపుకి తీసుకెళ్లాడు. వాసు ఆదిత్య శరీరాల్లోనుంచి రక్తం కారుతూనే ఉంది. ఇందాక చిరంజీవి సుబ్బు వచ్చిన కారుని ఇసుకలోకి తీసుకొచ్చి ఒక్కొక్కరిని మోసుకుంటూ కారులోకి ఎక్కించాడు. అందరిని ఎక్కించి వాసుని చూడగానే కళ్ళు తిరిగినట్టు అయింది. వాసు పేగులు బైటకి వస్తున్నాయి. అలానే ఎత్తి కారులో ఒకళ్ళ మీద ఒకళ్ళని పడుకోబెట్టి. లైట్లు వేసి చీకటిలోనే హైవె మీదకి ఎక్కించి మొదటి ఊరు రాగానే హైవే నుంచి దిగి ఊర్లోకి పోనించాడు. 

జోరుగా వర్షం మొదలు అయ్యింది, వర్షం తాకిడికి ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు అసాలు దారే కనిపించడంలేదు, కొంచెం దూరం వెళ్ళగానే  కారు ఆగిపోయింది మళ్ళి మళ్ళి స్టార్ట్ చేసాడు కానీ అవ్వలేదు, కిందకి దిగి అటు ఇటు చూసాడు ఎవ్వరు లేరు చేతిలో ఫోన్ లేదు ఇల్లులు కూడా అంత అంత మాత్రంగానే ఉన్నాయి. వర్షంలో దిగి కారు ముందుకు నెట్టాడు ఒక  నాలుగు వందల మీటర్లు నెట్టగానే రోడ్డు స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి కారు ముందుకు నెట్టడం సుబ్బు వల్ల కాక పక్కకి చూస్తే అక్కడ తోపుడు బండి కనిపించింది. అది తీసుకొచ్చి అందరిని అందులోకి మార్చి ముందుకు పరిగెత్తుతూ అక్కడ ఒక గుళ్లో ఏదో మంట కనిపించేసరికి ఎవరైనా ఉంటారేమో అని లోపలికి వెళ్ళాడు. చుట్టు చూసాడు ఎవ్వరు లేరు. చివరిగా ఒక స్వామిజి కనిపించాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు పాపం తెలియక ఆయన భుజం పట్టుకుని కదిపి...

సుబ్బు : స్వామీ ఇక్కడ హాస్పిటల్ అనగానే ఆయన కోపంగా లేచాడు.. ఆయన కోపం చూసి మోకాళ్ళ మీద పడి ఏడ్చేసరికి ఆయన తోపుడు బండిలో ఉన్న వాళ్ళని చూసి దెగ్గరికి వెళ్లి అందరిలో ప్రత్యేకంగా చిరంజీవి చెయ్యి పట్టుకుని ఇంకో చెయ్యి నుదిటి మీద పెట్టి కళ్ళుమూసుకున్నాడు. ఆయనకి షాక్ కొట్టినట్టు కదిలి రెండు నిమిషాలకి కళ్ళు తెరిచి సుబ్బు చెవిలో ఏదో చెప్పి లోపలికి వెళ్లి ఒక పట్ట తెచ్చి ఇవ్వగానే అది నలుగురి మీద కప్పి వర్షంలో తుడుచుకుంటూ బండి నెడుతూ బైటికి పరిగెత్తాడు.

అర్ధ రాత్రి పదకొండు అవుతుంది, జోరుగా వర్షం కురుస్తుంది. రాధా శివలిద్దరు టీవి చూస్తూ కూర్చున్నారు.. కడుపుతో ఉన్న రాజీ ఇద్దరికి చెరొక కప్పు కాఫీ ఇచ్చి రాధ కాళ్ళ దెగ్గర కూర్చుని టీవీ చూస్తుంది.. రాధ రాజీ తల మీద ప్రేమగా చెయ్యి వేసి నిమిరింది. లిఖిత పిల్లలని నిద్రబుచ్చుతుంది.. పక్క రూంలో కంధర రుద్రతొ తన అక్క అయిన రాక్షస కంధర గురించి చెపుతుంటే వింటున్నాడు.

ఇంతలో తలుపు కొట్టిన శబ్దం. ఆపకుండా కొడుతూనే ఉన్నారు. పిల్లలకి మెలుకువ వచ్చింది.. రాజీ రాధ శివలు కూడా తలుపు వైపు చూసారు.. రుద్ర లేవబోగా లిఖిత కోపంగా తలుపు దెగ్గరికి వెళ్లి తలుపు తెరిచింది.

ఎదురుగా ఒక కుర్రవాడు ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో వర్షంలో తడుస్తూ ఉన్నాడు.. వాడి కళ్ళ కింద చారలు, ఏడ్చిన గుర్తులు అవి.. వాడి చేతిలో ఒక పెద్ద తోపుడు బండి దాంట్లో నలుగురు చలనం లేకుండా రక్తపు ముద్దల్లా పడిపోయి ఉన్నారు.. ఇదంతా చూసిన లిఖిత వాడిని చూసి లోపలికి రమ్మని చెపుతూ డోర్ తెరిచి రుద్రని కేక వేసింది.

రుద్ర వచ్చి ఆ ముగ్గురిని లోపలకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు.. ఆ కుర్రాడిని చూసి "ఏం జరిగింది?" అని అడిగాడు.. వాడు ఏడుస్తూనే ఉన్నాడు..

రుద్ర : మొదటి వాడిని చూసాడు.. కాళ్ళు విరిగిపోయి పొట్టలో కత్తులు దిగి ఉన్నాయి.. రెండో వాడు అచ్చం మొదటి వాడిలానే ఉన్నాడు కానీ చేతులు మెడ విరిగిపోయి ఉన్నాయి కానీ ఏ ఆయుధం ఒంట్లో దిగలేదు.. ఇక మూడో వాడు మిగిలిన ఇద్దరి కంటే చాలా బలంగా ఉన్నాడు.. వాడి చేతి నరాలు తెగిపడి ఉన్నాయి.. పొట్టలోనుంచి పేగులు బైటకి వచ్చాయి.. ఇక నాలుగోవాడు ప్రాణాలతో ఉన్నాడా లేడా అన్నట్టుగా షాక్ కొట్టినట్టు పడి ఉన్నాడు... ఇంత ఘోరంగా వీళ్ళని ఈ స్థితికి ఎవరు తెచ్చి ఉంటారు.. అని ఆలోచిస్తూనే..

రుద్ర : కంధర.. వీళ్ళని నయం చెయ్యి.. అన్నాడు..

కంధర ముగ్గురిని ఐదు నిమిషాలలో నయం చేసి వాళ్ళకి స్పృహ వచ్చేలా చేసింది.. ముగ్గురు లేచి కూర్చున్నారు.. ఆ కుర్రాడు లేచిన వాళ్ళని చూసి ఆశ్చర్యంలో ఏడ్చేశాడు. గబుక్కున రుద్రని వాటేసుకున్నాడు.. లేచిన నలుగురు సుబ్బు నుంచి జరిగింది తెలుసుకుని రుద్రకి నమస్కారం పెట్టారు.. నలుగురి కళ్ళలో కోపం.. అది రుద్ర లిఖిత ఇద్దరూ గమనించారు..

కుర్రాడు : నిజంగా ఆ స్వామి చెప్పినట్టు ఇట్టే నయం చేసారే..

రుద్ర : ఏ స్వామి..?

కుర్రాడు : ఆ గుళ్లో ఉన్న స్వామి.. మీ దెగ్గరికి వెళ్ళమని పంపించింది ఆయనే..

రుద్ర : అలాగా..  ఇంతకీ ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తావా?

"ఓహ్.. నా పేరు సుబ్బు.. ఇదిగొ ఈ అన్న పేరు విక్రమ్.. ఈ అన్న పేరు ఆదిత్య.. ఈ అన్న పేరు వాసు.. ఈ అన్న పేరు చిరంజీవి నలుగురిని ఒక ముసలిది కుక్కని కొట్టినట్టు కొట్టించింది"

లిఖిత  పుసుక్కున నవ్వింది.. రుద్రకి కూడా నవ్వొచ్చింది కానీ ఆపుకున్నాడు. నలుగురు తల దించుకోవడం చూసి రుద్ర రాజికి వేడి వేడిగా సూప్ పెట్టమని చెప్పాడు.. రాజీ లోపలికి వెళ్ళింది.. కంధర కూడా పిల్లల దెగ్గరికి వెళ్ళింది.

రుద్ర : మీరు చెప్పండి..

సుబ్బు  : చెప్పడానికి ఏం లేదు అన్నయ్యా.. ముగ్గురిని కుక్కని కొట్టినట్టు కొట్టింది.. శివమని డ్రమ్స్ వాయించినట్టు, జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు.. పిచ్చి పిచ్చిగా రొచ్చు రొచ్చుగా కొట్టించింది.

లిఖితకి నవ్వాగలేదు గట్టిగా నవ్వేసింది.. వాసు సుబ్బుగాడిని కోపంగా చూసాడు.. రుద్ర లిఖితని చూసాడు.. లిఖిత నవ్వడం ఆపింది.

సుబ్బు : ఏంటన్న అలా చూస్తావ్.. డాక్టర్ల దెగ్గర ఏం దాచకూడదు.. మిమ్మల్ని బంతి ఆట ఆడింది ఆ ముసలిది.. కానీ అన్న అని రుద్రని చూస్తూ "అది మాములు ముసలిది కాదు.. మంత్రగత్తే.."

ఈలోగా రాజీ అందరికీ సూప్ అందించింది..

రుద్ర : మంత్రగత్తే... ?     అంటూనే లిఖిత వైపు చూసాడు.. మళ్ళీ అందరినీ చూసి అస్సలు ఏం జరిగిందో మొత్తం మొదటి నుంచి చెప్పండి..

సుబ్బిగాడు : అయితే మీకు విక్రమాదిత్య గురించి చెప్పాలి.. అని సుబ్బు పురాణం మొదలు పెట్టగానే విక్రమ్ లేచాడు.

విక్రమ్ : నేను చెపుతాను రండి అని అటు వైపు నడవగానే రుద్ర లిఖిత అటు వైపు వెళ్లారు. మిగతా వాళ్ళు తల వాల్చారు. 

సుబ్బుకి వెంటనే రక్ష గుర్తు వచ్చింది, ఇప్పటివరకు వీళ్ళు లేవగానే ఆనందంలో మర్చిపోయిన సుబ్బుకి రక్ష గుర్తుకు రాగానే కాళ్ళు వణికిపోయాయి. వెంటనే ఏడుస్తూ ఎం ఆలోచించకుండా బైటికి పరిగెత్తాడు. పక్కనే బండి కనిపించింది చూస్తే హేండిల్ లాక్ వేసి ఉంది అటు ఇటు చూసి బండి మీద కూర్చుని హేండిల్ని కాలితో తన్నగానే సైడ్ లాక్ వచ్చేసింది కింద వైర్లు కలిపి స్టార్ట్ చేసి గోడౌన్ దెగ్గరికి పోనించాడు.

అరగంట ప్రయాణానికి గౌడౌన్ వెళ్లి చూస్తే అంబులెన్సు అక్కడే ఉంది, అందరూ దాన్ని తెరవడానికి ప్రయత్నం చెస్తున్నారు. అంబులెన్సు చుట్టు మనుషులు ఉన్నారు చీకటిలో పాక్కుంటూ అంబులెన్సు దెగ్గరికి వెళ్లి ఒక్కసారి లాక్ పిన్ కొట్టి ఓపెన్ చేసి వెంటనే లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసాడు దెబ్బకి అందరూ అంబులెన్సు డోర్ కొట్టడం మొదలు పెట్టారు. కొంత మంది పైకి ఎక్కి బాదుతున్నారు. ఎవడో మెషిన్ బ్లేడ్ తో కోస్తున్నాడు. 

సుబ్బు : నాకు అర్ధం అయిపోయింది ఇవ్వాళే నా చివరి రోజు, ఇంత మందిని ప్రేమించి చివరికి స్పృహ లేనిదాని కోసం చస్తున్నా.. కానీ ఇంతకముందు ఏ అమ్మాయిని ప్రేమించినా వాళ్ళ నుంచి ఏదో ఒకటి కోరుకునేవాడిని కానీ రక్షని చూసాక అలా అనిపించలేదు. తన గొంతు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఎవడో మెషిన్ బ్లేడ్ పెట్టి కోస్తున్నాడు నిప్పు రవ్వలు మీద పడుతున్నాయి. తనని చూసాను.

సుబ్బు : సారీ.. నా వల్లే.. నా వాళ్ళని కాపాడుకోడానికి నిన్ను ప్రమాదంలోకి నెట్టేసాను కానీ నేను కూడా నీతో పాటే ఉంటాను.    ఆఖరిమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ మాట నేను కొన్ని వందల మందికి చెప్పి ఉంటాను కానీ ఇదే ఆఖరి, మొదటిసారి మనస్ఫూర్తిగా చెపుతున్నాను...

నిజంగా సారీ అని కళ్ళు తుడుచుకుని, ఇంకోటి నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా... మా అమ్మని తప్ప నేను ఇంతవరకు ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకోలేదు. నేను నీకు చెప్పినన్ని నిజాలే.  నేను నీతో మాట్లాడినన్ని మాటలు ఎవ్వరితో మాట్లాడలేదు. నా మనసులోనివి నా ఇష్టాలు నా జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన నీతో పంచుకున్నాను. నీ పర్మిషన్ లేకుండా నిన్ను తాకినందుకు నిన్ను ముద్దు పెట్టుకున్నందుకు నన్ను క్షమించు అని తన బెడ్ మీద చెయ్యి వేసి రక్ష పెదాలని ముద్దు పెట్టుకున్నాను.. నా చేతికి ఏదో తగిలింది.. రక్ష వెనకాల ఏదో ఉంది చిన్నగా తనని పక్కకి జరిపి కింద చూసాను. బంగారపు రంగులో ఉంది. బైటికి లాగాను రాలేదు రెండు చేతులతో గట్టిగా లాగితే వచ్చింది. అదొక గొడ్డలి..

పరుశురాముడి గొడ్డలిలా రెండు వైపులా పదునుతో బంగారపు రంగులో మెరిసిపోతుంది. ఎత్తడానికి నా ఒక్క చెయ్యి సరిపోలేదు. కనీసం ముప్పై కిలోలు ఉంటుంది.. చిన్నగా కిందకి దించి నిల్చోబెడితే నా నడుము పై వరకు ఉంది.

"మర్యాదగా బైటికి వస్తే బాగుంటుంది, లేకపోతే బాంబు పెట్టేస్తా, పది.. తొమ్మిది.." అన్న కౌంట్ డౌన్ మొదలు అవ్వగానే రక్ష చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టి.. ధైర్యం తెచ్చుకుని డోర్ తెరిచాను, ఏదైతే అది అవుతుందని. ఆ నలుగురే గుర్తు వచ్చారు.. విక్రమ్ తనని నమ్ముకున్న మానస కోసం ఎంత వరకైనా నిలబడతాడు. ఆదిత్య ఎంత కోపం ఉన్నా తన మరదలు కోసం ఎంతో మంది ముందు తగ్గాడు. ఇక వాసు ఆయన ఎవరో కూడా తెలీదు కానీ ప్రాణాలు అడ్డు పెట్టాడు. ఇక చిరంజీవి అక్షిత హెలికాప్టర్ లో వెళ్ళిపోయింది వచ్చిన పని కూడా అయిపోయింది. కానీ ఒక్కడే ఎన్ని దెబ్బలు తగిలినా తన వైపు వాళ్ళు ఎంత మంది కింద పడిపోయినా ఆయన కళ్ళలో భయం లేదు, కింద పడి లేచినప్పుడల్లా ఆయన కళ్ళలో ఏదో మెరుపు. చివరి వరకు నిలబడ్డాడు. రక్ష వైపు చూసి రెండు చేతులతో గొడ్డలి పట్టుకుని కిందకి దిగాను.

అందరూ సుబ్బుని చుట్టు ముట్టారు.. అక్కడక్కడా టార్చ్ లైట్ వెలుగు పడుతుంది. సుబ్బు చేతిలో ఉన్న గొడ్డలి మీద వెలుగు పడగానే గొడ్డలి మెరిసింది.. అక్కడున్న అందరికి ఆ గొడ్డలి చూడగానే ఉచ్చ పడిపోయింది.. అందరూ భయంగా రెండు అడుగులు వెనక్కి వేశారు.. అది చూడగానే సుబ్బు గొడ్డలిని రెండు చేతులతో ఎత్తి భుజం మీద వేసుకుని చుట్టు ఒక రౌండు తిరిగాడు.. 

"రేయి అది ఉట్టి గొడ్డలి మాత్రమే వెళ్ళండి"

" ఆ గొడ్డలి ఎం చేసిందో, ఎంత మందిని బలి తీసుకుందో నువ్వు చూడలేదా"

"తను ఇంకా లేవలేదు, వాడికి ఆ గొడ్డలి లేవట్లేదు"

"ఆ గొడ్డలి ఎవ్వరికి లేవదు, మన శశి సర్ వల్లే కాలేదు"

"భయంగా ఉంది"

"వెళ్లకపోయినా చచ్చిపోతాం"

ఐదుగురు సుబ్బు ముందుకు వచ్చారు, సుబ్బుకి ఎం చెయ్యాలో అర్ధం కాలేదు గొడ్డలి తిప్పుదాం అన్నా భుజం మీద నుంచి లేవటంలేదు.. గట్టిగా గొడ్డలి తిప్పాడు.. కానీ కింద పడిపోయింది సుబ్బు చేతులు పట్టేసాయి. ఒకడు కాలితో తన్నాడు.. కింద పడి మళ్ళీ గొడ్డలి చివర పట్టుకుని చిన్నగా లేచాడు. ఒకడు మొహం మీద తన్నాడు.. మోకాళ్ళ మీద కూర్చున్నాడు.. నోటి నుంచి రక్తం కారుతుంది.. ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు నవ్వారు. సుబ్బు నిలుచొని నోరు తుడుచుకుని రక్తం చూస్సుకుని గొడ్డలి ఎత్తి తిప్పుదామని లేపుతుంటే సగం లేచింది భుజానికి ఎత్తుకునే లోపే సుబ్బు చేతి మీద ఒక చెయ్యి పడి ఆ గొడ్డలిని తీసుకుని గాల్లో రెండు రౌండ్లు ఏదో చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నట్టు అలవోకగా తిప్పుతూ సుబ్బు ముందు నిలుచుంది ఎవరో కాదు రక్ష...
Like Reply
super
[+] 1 user Likes Gangstar's post
Like Reply
Super update bro keka
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Back to Back అప్డేట్స్ తో అధరకొడుతున్నారు బ్రో.....సబ్బు లోని అసలు హీరో బయటకి వచ్చాడు.....సబ్బు కి ఎవర్ని సెట్ చేస్తారా అనుకుంటుంటే మొత్తానికి రక్ష ని సెట్ చేసెలాగ వున్నారు గా.....
చూస్తుంటే ఆ దేవి కి కందర రాక్షస అక్క కి ఎమన్నా లింక్ వుందేమో అని డౌట్ కొడుతుంది.....
స్వామీజీ కి చిన్నా తల మీద చెయ్యి వెయ్యగానే ఎందుకు షాక్ కొట్టింది....హ్మ్మ్....చూడాలి....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar Namaskar Namaskar
[+] 3 users Like Thorlove's post
Like Reply
Raksha is back with bang
Super elevations bro mothaniki andaru mamuluga ayyaru 
Inka chudali em chestaro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
bro update and super twist waiting for next update

...., wow rudra story ni kuda kaliparu aslu super narration bro...., me thinking ki hatsaff bro.., waiting for next update ...,❤❤
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Mind blowing update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Pichi leparu bhayya mamulu ga ledu nijam ga keko keka
Mee writing skills chala ante chala super thriller movies ki ye maatram teesi povu
[+] 1 user Likes kakinada_kurrodu's post
Like Reply
Chala bagundhi bro
[+] 1 user Likes vrao8405's post
Like Reply
Super update
[+] 1 user Likes anjali's post
Like Reply
Excellent updates bro

Thanks for your story
[+] 1 user Likes Saaru123's post
Like Reply
Bro we need more updates as early as possible please.
[+] 2 users Like Manavaadu's post
Like Reply
Em rasthunnav bhayya asalu story ni.. Na daggare dabbulu unte netho definite ga ee story ni petti adbhuthamaina web series or multiverse movie teesevadini.. Beebatsamaina hit iyyedhi..
[+] 6 users Like Ironman5's post
Like Reply
clps Nice fantastic action episode happy
[+] 2 users Like saleem8026's post
Like Reply
Nice excellent
[+] 2 users Like Putta putta's post
Like Reply
Eka yuddham arambham
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Super bayyah keka pettistunnaru.
[+] 1 user Likes sri2225's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)