22-10-2022, 05:55 PM
super super super
Vc
|
22-10-2022, 06:03 PM
Good update..... bit emotional and funny
సుబ్బూని అంటీ లవర్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. సక్సెస్ అయితే అక్షితని డామినేట్ చేస్తాడేమో....
22-10-2022, 07:04 PM
ippude rayadam modhalu pettanu
inko gantalo maro update isthaanu...
22-10-2022, 07:05 PM
22-10-2022, 09:12 PM
అల్ అర్ వెయిటింగ్ ఫర్ సుబ్బు & రక్షా యాక్షన్ మూమెంట్
ఎక్సట్రార్థనరి ఎపిసోడ్
22-10-2022, 10:20 PM
22-10-2022, 10:42 PM
S3E5
ఇద్దరు తినేసి అంబులెన్స్ ఎక్కారు. సుబ్బు : ఇప్పుడు ఎక్కడికి భయ్యా చిన్నా : అక్షిత నాకు ఫోన్ చేసి మాట్లాడిన తరువాత నుంచి ఆఫ్ అయిపోయింది ఫోన్ ట్రేస్ అవ్వట్లేదు, ఫోన్ వస్తుంది అప్పటివరకు నడుపు. సుబ్బు : సీట్ బెల్ట్ చిన్నా : ఓకే నా ఇక పోనీ, అవును నీకు అక్షితకి ఎలా పరిచయం సుబ్బు : కాలేజీలో నా సీనియర్ చిన్నా : తన గురించి చెప్పు సుబ్బు : నిజాలా అబద్దాలా, మంచా చెడా చిన్నా : హహ నిజాలే చెప్పు, ముందు నెగటివ్స్ చెప్పు సుబ్బు : అబ్బో మొండిది, అల్లరిది ఏ ముహూర్తాన మొహం చూశానో తన కంట్లో పడ్డాను నరకం చూపించింది, మాములుగా రాగ్గింగ్ చెయ్యలేదు నాతో గౌను ఎపించి స్టేజి మీద అందరి ముందు డాన్స్ కూడా ఏపించింది. చిన్నా : నువ్వు ఎందుకు చేసావ్ సుబ్బు : అలా డాన్స్ చేస్తే నన్ను రాగ్గింగ్ చెయ్యనని మాటిచ్చింది. చిన్నా : ఇచ్చిన మాట నిలబెట్టుకుందా సుబ్బు : నువ్వే చెప్పు తరవాత ఏం జరిగి ఉంటుందో చిన్నా : మళ్ళి రాగ్గింగ్ చేసిందా సుబ్బు : మూడేళ్లు.. నాకు చుక్కలు చూపించింది. ఎంత గోలచేస్తుందో.. అంతే చెడు ఒట్టి అల్లరిది.. అంతే చిన్నా : మరి మంచి సుబ్బు : చాల మంచిది, ముఖ్యంగా తనలో నాకు నచ్చేది తను ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ అందులో మాత్రం గోల్డ్. తనకి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం, అందరితో మాములుగా మాట్లాడుతుంది కానీ తన కొంటె తనం తెలియాలంటే మాత్రం తనకి మనం చాలా దెగ్గర వాళ్ళం అయ్యుండాలి. ఎవరిని పడితే వాళ్ళని దెగ్గరికి రానివ్వదు. కొంచెం హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే. చిన్నా : నీకు అక్షితకి మధ్యలో చాలా కెమిస్ట్రీ ఉన్నట్టు ఉంది. సుబ్బు : అంటే భయ్యా నేను తనకి కాలేజీ కొత్తలో ప్రొపోజ్ చేసాను, నన్ను చాలా దారుణంగా రిజెక్ట్ చేసి వాడుకుంది మెంటల్ది.. సారీ.. మూడేళ్లు నన్ను ఫ్రెండ్ గా వాడుకుంది అప్పుడు దెగ్గరయ్యాను, ఇదంతా మీకు ఎందుకు చెపుతున్నాను అంటే రేపు మీ ముందు అక్షిత నాతో కొంచెం చనువుగా ఉంటె మీరు తప్పుగా అర్ధం చేసుకోకూడదని నా బాధ. మిమ్మల్ని చూస్తుంటే కొంచెం మీకు అనుమానం ఎక్కువలా ఉంది. అక్షిత నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు నన్ను స్టడీస్ విషయంలోనే కాకుండా లైఫ్ లో కూడా గైడ్ చేసిన వ్యక్తి. నా జీవితంలో నాకు చాలా తక్కువ పరిచయాలు ఉన్నాయి వాళ్లలో ఇష్టమైన వ్యక్తుల్లో అక్షిత కూడా ఉంది. అందుకే తను అడగ్గానే రిస్క్ అని తెలిసినా కూడా ఈ పనికి ఒప్పుకున్నాను. చిన్నా : నాకు తెలుసు, అక్షిత ఎలాంటిదో కూడా తెలుసు. మరి ఆ తరువాత ఎవ్వరిని లవ్ చెయ్యలేదా సుబ్బు : ఎందుకు చెయ్యలేదు అక్షిత రిజెక్ట్ చేసిన గంటకే తన ఫ్రెండుకి ప్రొపోజ్ చేసాను, అక్షిత చేతుల్లో కొట్టించుకున్నాను. ఆ తరువాత సుధా, రాధా, జానకి, మాలిని, దివ్య, భవ్య, సుధా, ఓ ఇలా తీసుకుంటూ పోతే ఒక రెండు మూడు వందలు దాటిపోద్ది కౌంటు.. ఒక పన్నెండు మందిని పడెయ్యడానికి నా బాధ చూడలేక స్వయంగా అక్షితనే హెల్ప్ చేసింది కానీ ఎవ్వరు సెట్ అవ్వలా. చిన్నా : ఇప్పుడు ? సుబ్బు : ఇప్పుడు కూడా కాళియే, అందరూ వాడుకుని వదిలేసే వాళ్ళే తప్పితే జెన్యూన్ గా లవ్ చేసే వాళ్ళు దొరకట్లేదు. లేటెస్ట్ గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. చిన్నా : ఎంత వరకు వచ్చింది సుబ్బు : చూడటం వరకు వచ్చింది. ఇంకా మాట్లాడలేదు చిన్నా : నాకు అక్షితకి ఇంకా పెళ్లి కాలేదు సుబ్బు : తెలుసు, తను ఒంటరిగా ఉన్నానని తెలిస్తే నేను మళ్ళి ప్రొపోజ్ చేస్తానేమో అని భయపడి అలా చెప్పింది. చిన్నా : బాగుంది మీ ఫ్రెండ్షిప్, తనకి కాలేజీలో ఎవరైనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్... సుబ్బు : లేదు, చెప్పాను కదా ఎవ్వరిని అంత దెగ్గరికి రానివ్వదు. తను కొంచెం నవ్వడానికి ఇష్టపడుతుంది. మనం ఎలాగో జోకర్లా ఉంటాం కాబట్టి నాతో ఫ్రెండ్షిప్ చేసింది. అంతే.. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, అంత కామెడీ పర్సన్ అనిపించట్లేదు. అక్షితకి మీరు ఎలా దెగ్గరయ్యారు చిన్నా : నన్ను కూడా బానిసలా వాడుకుంటుంది, కానీ మీ సీనియర్ నాకు రెండు గంటల్లో, పది నిమిషాలు మాట్లాడితే పని అయిపోయింది. సుబ్బు : కూస్తున్నారా లేదా నిజమేనా చిన్నా : నిజంగా, తరవాత చాలా విసికించాననుకో అది వేరే విషయం సుబ్బు : కొంచెం ఏమైనా టిప్స్ ఇచ్చి హెల్ప్ చెయ్యొచ్చు కదా భయ్యా చిన్నా : నీ కధలు నీ మాటలు వింటుంటే నీ గురించి నాకు కొంచెం కొంచెం అర్ధం అవుతుంది.. నువ్వు ఒక రకమైన ఫాంటసీలో ఉన్నావ్. సినిమాలు ఎక్కువగా చూస్తావా సుబ్బు : కొంచెం చిన్నా : చూడు సుబ్బు అమ్మాయిలు అందరూ ఒకేరకం.. హీరోయిన్ల వరకు బానే ఉంటారు రియల్ లైఫ్ వేరే.. వేసుకునే చెప్పులు బాగుంటాయి అరికాళ్ళు మాత్రం పగిలి ఉంటాయి, డ్రెస్సులు బాగుంటాయి కానీ లోపలే... ఇవ్వాళ రేపు అంతా పైన పటారం లోన లొటారం టైపు.. అమ్మాయి కళ్ళు చూడు తన మైండ్లో ఏముందో తెలుస్తుంది. అక్షితకి ముందు నేను చాలా మంది అమ్మాయిలని కలిసాను కానీ అక్షితని చుసిన తరువాత నాకు వేరే అమ్మాయి మీదకి మనుసు పోలేదు. అలా అని వేరే అమ్మాయిని చూడను అని చెప్పట్లేదు. రోజంతా ఎటు తిరిగినా చివరికి ఇంటికి చేరుకున్నట్టు ఎంత మంది అమ్మాయిలని చూసినా చివరికి ప్రేమించిన అమ్మాయి దెగ్గరే వాలిపోతాం. సుబ్బు : వీటిలో సగం అక్షిత డైలాగ్స్ కూడా ఉన్నాయి, మీ ఇద్దరు ఆలోచనలు కొంచెం ఒకేలా ఉన్నాయి అందుకే కలిసినట్టున్నారు. చిన్నా : నీకు కూడా దొరుకుతుంది సుబ్బు : దొరికేసిందనే అనుకుంటున్నాను, నువ్వు చెప్పిన సింటమ్స్ నాకు కనిపిస్తున్నాయి. అయినా అక్షితని దాటి నువ్వు ఇంకో అమ్మాయి వంక చూడవులే చిన్నా : ఎందుకలా సుబ్బు : నిజం చెప్పు నీకు అక్షిత అంటే భయం లేదు చిన్నా : లేదు సుబ్బు : అబద్ధం.. నిజం చెప్పు పర్లేదు.. ఒక వేళ నువ్వు చెప్పేది నిజం అయితే మాత్రం నీకు దండ వేసి దండం పెట్టొచ్చు.. ఆల్ఫా మేల్ అంటారు కదా ఆ కోవాకి చెందిన వాళ్ళు అయ్యుంటారు. చిన్నా నవ్వుతుంటే సుబ్బు కూడా నవ్వాడు, ఇంతలో ఫోన్ మోగింది. చిన్నా : చెప్పురా.. ఆ... ఆహా.. పంపించు.. అని ఫోన్ పెట్టేసి సుబ్బు వైపు చూసాడు. సుబ్బు అక్షిత సిగ్నల్ కొల్లం నుంచి ఆఫ్ అయ్యింది అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక దీవి ఉంది నార్మల్ గా హైడ్ చేసేసారు సాటిలైట్ నుంచి మాత్రమే కనిపిస్తుంది. అక్కడ మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. సుబ్బు : ముందు మనం తనని ఎక్కడైనా సేఫ్ గా దాచిపెట్టాలి అని రక్ష ని చూసాను. చిన్నా : నాకు ఒకరు తెలుసు, పోనీ అని సుబ్బుని ఒక గోడౌన్ దెగ్గరికి తీసుకెళ్లాడు. అంబులెన్స్ లోపల పార్క్ చేసి ఇద్దరు బైటికి వచ్చారు. సుబ్బు : సేఫ్ ఏనా చిన్నా : ఆయన మిలటరీ వాడు, నన్ను నమ్ము సుబ్బు : భయ్యా నువ్వు సోల్జర్ వా చిన్నా : కాదు సెక్యూరిటీ అధికారి.. IPS ఆఫీసర్ ని సుబ్బు : నీకు ఇంకో IPS ని తీయించగలిగే అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయా భయ్యా చిన్నా : లేదు ఎందుకు, ఎవ్వరిని తీయించాలి సుబ్బు : ఒకటి ఉందిలే శరణ్య అని.. సరే ఆ గొడవ ఎందుకు ఇప్పుడు మనకి ఒక కార్ కావాలి, ఎలా చిన్నా : అదిగో కార్, ఇదిగో కీస్ అని చూపించాడు. సుబ్బు : బాగా పాతదిలా ఉందే, సరే పద ఇదైనా దొరికింది. అని లోపల కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేసాడు. జూమ్ అని స్టార్ట్ అయ్యేసరికి, ఎమ్మటే దిగి ముందుకు వెళ్లి బానెట్ ఎత్తాడు. భయ్యా ఏంటిది భయ్యా బైటేమో అలా ఉంది లోపలేమో V9 ఇంజిన్ ఉంది. ఎవరు భయ్యా నువ్వు చిన్నా : ఇక వెళదామా అనగానే సుబ్బు కార్ ఎక్కి కూర్చున్నాడు సుబ్బు : ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అని యాక్సిలరేటర్ మీద కాలేసి గట్టిగా తొక్కాడు. కార్ బీచ్ దెగ్గరికి ఎంటర్ అవుతుండగానే వీళ్ళకి ఒక వాన్ కనిపించింది. కార్ అక్కడే ఆపేసి, చిన్నా వంగి ఇళ్ల మధ్యలో నుంచి బీచ్ లోకి ఎంటర్ అయ్యి చెట్టు వెనక దాక్కున్నాడు అక్కడ నుంచి వాళ్ళు చూడకముందే అక్కడే వరసగా ఉన్న బోట్స్ దెగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని దాక్కున్నాడు. సుబ్బు ఇళ్ల దెగ్గరే ఆగిపోయి చిన్నా ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. వాన్ చుట్టూ నలుగురు ఉన్నారు ఎవరినో కిందకి దించారు, మొహాన్ని నల్ల ముసుగుతో కప్పేశారు, చేతులు కట్టేసి ఉన్నాయి. అప్పుడే ఒక పెద్ద స్టీమర్ షిప్ అక్కడికి వచ్చి ఆగింది నలుగురు స్టీమర్ ఎక్కబోతుండగా చిన్నా లేచి ముగ్గురిని కాల్లో షూట్ చేసాడు, వాళ్ళు పడుకొనే వాళ్ళ దెగ్గర ఉన్న గన్స్ తో కాల్చబోతే చిన్నా తప్పక వాళ్ళని చంపేశాడు. మిగిలిన వాడు ఈ లోపే కట్టేసిన వాడిని స్టీమర్ ఎక్కించి వాడు కూడా ఎక్కాడు. స్టీమర్ స్టార్ట్ అయ్యింది. షిప్ లో ఒకడు కనిపిస్తే వాడిని కాల్చేశాడు. స్టీమర్ వేగం అందుకోకముందే పట్టుకోవాలని పరిగెడుతుంటే హార్న్ వినిపించి చూసాడు. సుబ్బు కారు వేగంగా వస్తుంది. సుబ్బు కారు టైర్లు కుడి వైపుకి తిరగ్గానే చిన్నా అటు చూసాడు చేపలని పట్టుకోడానికి చెక్కలతో కట్టారు అక్కడ. చిన్నా వేగంగా పరిగెడుతూ గన్ వెనకాల పెట్టుకుని స్పీడ్ గా పరిగెత్తి చెక్కలు ఎక్కి పక్కనే ఉన్న బొంగు ఎక్కి సుబ్బు కారు మీదకి దూకాడు. సుబ్బు : ఓకే నా చిన్నా : బొటన వేలు చూపించాడు సుబ్బు నవ్వుతూ గట్టిగా పట్టుకో అని కారు రయ్యిమని లాగాడు. అదే స్పీడ్ లో షిప్ వైపు పెట్టి కళ్లు మూసుకుని మొహం పక్కకి తిప్పుతూ కింద ఇంకా గట్టిగా తొక్కాడు. కార్ గాల్లోకి ఎగిరి షిప్ కి ఒక్క అడుగు పక్కన పడి మునిగిపోతుండగా కారు పైనే ఉన్న చిన్నా అదే టైంలో షిప్ లోకి దూకి వెంటనే ఇద్దరినీ షూట్ చేసి డ్రైవర్ కి గన్ పెట్టి అక్కడే ఉన్న వాడి కట్లు విప్పాడు. అతను కట్లు ఊడదీసుకుని మొహానికి ఉన్న ముసుగు తీసాడు. చిన్నా : వాసు నువ్వా వాసు : చిరంజీవి నువ్వెంటి ఇక్కడ సుబ్బు : ఒరేయి నాకు ఈత రాదు, మీ ముచ్చట్లు తరవాత ఎవరైనా నన్ను కాపాడండయ్యా చిన్నా : అవన్నీ తరవాత, ముందు వాడిని పైకి లాగు, పోయేలా ఉన్నాడు అనగానే వాసు షిప్ లోనుంచి కిందకి దూకి సుబ్బుని పట్టుకుని షిప్ ఎక్కించాడు. సుబ్బు : థాంక్స్ అన్నా వాసు : తల తుడుచుకుంటూ ఇందాక ఒరేయి అన్నట్టున్నావ్ సుబ్బు : అహ్హహ.. సారీ చిన్నా : నువ్వెంటి వీళ్ళతో వాసు : నాది వీళ్ళతో ఒక పాత పంచాయితీ ఉందిలే. మరి నువ్వు చిన్నా : అక్షితని ఎత్తుకెళ్లారు వాసు : నా భార్యని కూడా, మరి నువ్వు అని సుబ్బుని చూసాడు. సుబ్బు : అస్సలు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కావట్లేదు. చిన్నా : ఇదో లైవ్ రియాలిటీ షో, మన బిగ్ బాస్ లాగా, ఎవరు ఎక్కువగా నటిస్తే వాళ్ళకే ప్రెస్ మనీ.. అనగానే వాసు నవ్వాడు. సుబ్బు : నేను మరీ అంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా, ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా.. ఎంత పెద్ద జోక్ అన్నయ్య.. అక్షిత నీకు ఎలా పడిందో నాకు ఇంకా అర్ధం కావట్లేదు.. అని చిన్నాని ఉడికించాడు. వాసు : ఇప్పుడు ఎక్కడికి చిన్నా : వీడు చెపుతాడు.. అని గన్ డ్రైవర్ తలకి పెట్టి.. చల్ అన్నాడు. వాడు భయంగా స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తుంటే వాసు, చిన్నా మాట్లాడుకుంటుంటే సుబ్బు షిప్ ఎలా నడుపుతున్నాడో గమనిస్తున్నాడు.
22-10-2022, 10:43 PM
అక్షిత లేచి కూర్చుంది, అందరూ తనని చూసారు.
సంధ్య : అక్షితా అక్షిత : ఆ.. చెప్పు సంధ్య : ఎందుకే నేనంటే అంత కోపం నీకు అక్షిత : నువ్వు మాట్లాడకా.. నీ వల్లే మనందరికీ ఈ గతి పట్టింది. విక్రమ్ : ఏమైంది, అమ్మా నువ్వేం అడిగినా ఏది సరిగ్గా చెప్పవేంటి అక్షిత : ఏమో మరి ఏది సరిగ్గా చెప్పిసావదు, నువ్వు ఏం చెప్పకు. మీకేం కావాలో నన్ను అడగండి నేను చెపుతాను, తనని అడిగితే కళ్లలోనుంచి నీళ్లు తప్పితే నోటి నుంచి మాట రాదు. సంధ్య : రక్ష ఎలా ఉంది, ఎక్కడుంది అక్షిత : అలానే ఉంది, ప్రస్తుతానికి సురక్షితంగానే ఉంది. మానస : ఇందాక మీ నోటి నుంచి సుబ్బు సుభాష్ డ్రైవర్ అని విన్నాము, ఆ పేరుతో మాకు ఒకరు తెలుసు. అక్షిత : సుబ్బు నావాడే, ఇంతకీ ఈ అమ్మాయిల పిచోడు ఎక్కడ చచ్చాడో ఏమో మానస : ఏమన్నారు అక్షిత : అమ్మాయిల పిచ్చోడు మానస : అయితే మీకు తెలిసినవాడు, మాకు తెలిసినవాడు ఇద్దరు ఒక్కడే అక్షిత : నవ్వుతూ వాడు నీకెలా తెలుసు, నీకు ప్రొపోజ్ చేశాడా మానస : లేదు కానీ చెయ్యబోయేలోపే నా గురించి తెలిసింది. ఆగిపోయాడు. మరి మీకు ? అక్షిత : వాడి కౌంటు మొదలయ్యింది నా తోనే, నేనే వాడి ఫస్ట్ లవ్ సుబ్బు గాడి గురించి తెలిసిన వాళ్ళందరూ నవ్వారు. మానస : నా లవ్ కి హెల్ప్ చేసింది తనే.. ఆ ప్రాసెస్ లోనే ఈ విక్రమాదిత్య కథలోకి వచ్చి పడ్డాము. మా కోసం చాలా రిస్క్ తీసుకున్నాడు. అక్షిత : వాడంతే.. వాడు నమ్మినా వాడికి నచ్చినా ప్రాణాలు ఇచ్చేస్తాడు. ఆపదలో ఉన్న అమ్మాయి చెయ్యి చాపితే చాలు. చావు వరకైనా తోడు వస్తాడు. ఈ అమ్మాయిలని లవ్ చెయ్యడం ఉట్టి టైం పాస్ ఫన్ కోసం చేస్తుంటాడు. మానస : మీకు తన గురించి చాలా తెలుసు అక్షిత : నా కాలేజీ లైఫ్ వాడితోనే గడిచింది. మూడేళ్లు నా కిందే ఉన్నాడు . మానస : సుబ్బు మూడేళ్లు ఒకే అమ్మాయితో ఉన్నాడా, నేను నమ్మను అక్షిత : అలా ఏం లేదు, అమ్మాయిలు అమ్మాయిలే ఆ ట్రాక్ వేరు. నేను ఫ్రెండ్ అంతే. విక్రమ్ : విక్రమాదిత్య దెగ్గరికి వద్దాం. తన గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. అక్షిత : విక్రమాదిత్య + అనురాధ = శశి (బెంగుళూర్ అడవిలో ఒకడు, మానస్ సిటీలో ఒకడు) విక్రమాదిత్య + (మానస) అనురాధ = రక్ష విక్రమాదిత్య + శశి = కావ్య(విక్రమ్ అమ్మ) , రాజు(ఆదిత్య నాన్న) , సరిత(అను అమ్మ) ఇక శశి.. వీడు అడవిలోనే ఉంటాడు స్మగ్లింగ్, అడవిలో చెక్కలు అమ్మటం. వీళ్ళ నాన్న ఏ తెగ కైతే అప్పగించాడో, ఆ అడవి కింద మైనింగ్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని వీడి అన్న మానస్ ఇచ్చిన సలహాతో ఆ తెగని నాశనం చేసి మైనింగ్ మొదలు పెట్టాడు.. వీడు బలవంతుడు అయితే మానస్ తెలివికలవాడు వాడు సిటీలో ఉంటూ సంధ్య ఫౌండషన్స్ వెనుక అమ్మాయిలు, గంజాయి, డ్రగ్స్, వెపన్స్ వీడు చెయ్యని ఇల్లీగల్ పని లేదు. వీడికి ఎదురు వచ్చిన వాళ్ళు ఎవ్వరు బతికి లేరు మనం తప్ప. ఇక వీళ్ళ ముగ్గురి జీవితాల గురించి మీకు తెలిసిందే మీకు తెలియాల్సింది రక్ష గురించి. రక్ష ని వాళ్ళ నాన్న ఆఫ్రికా అడవుల్లో ఉన్న తెగకి అప్పగించి తన సమస్య చెప్పి ట్రైనింగ్ ఇవ్వమన్నాడు. ఆఫ్రికాలోనే ఎందుకంటే ఈ సంధ్యకి తెలుసు కానీ మనకి చెప్పదు. నేను రక్ష అమ్మ దెగ్గర చేరిన మొదటి శిష్యురాలిని, నాకు అక్కడి శక్తులు, విద్యలు అబ్బలేదు.. నాకు ఫైటింగ్ నేర్పించి రక్ష అమ్మ నన్ను కూతురుగా దత్తత తీసుకుంది. రక్ష అమ్మ యుద్ధానికి సిద్ధం అయ్యాక తన తండ్రి రాసిన లెటర్ చదివి నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చింది. అప్పటికే విక్రమాదిత్య చనిపోవడంతో... విక్రమ్ : ఆగండి ఆయన ఎలా చనిపోయారు అక్షిత : శశి మానస్ ఇద్దరు కలిసి విషం పెట్టి చంపేశారు అందరూ సంధ్య వైపు చూసారు.. సంధ్య ఏడుస్తూ.. ఒక రోజు ఇద్దరు వచ్చి ఇంట్లో భోజనం చేసి నా కొడుకు చూడకుండా విషం పెట్టిన పాయసం నా కోడలికి తినిపించారు. పిచ్చిది వాళ్ళ ప్రేమలో పడి మోసపోయింది నా అనురాధ.. విక్రమాదిత్యకి కూడా తినిపించబోతే వాడు వేలితో ముట్టుకుని పసిగట్టేసాడు కానీ అప్పటికే అనురాధ ఆ పాయసం తినింది అని తెలుసుకుని వాడు కూడా కావాలని ఆ పాయసం తాగేశాడు. విక్రమ్ : ఎందుకు సంధ్య : అప్పటికే నా కొడుకు మానస లేకపోవడం, జరిగిన రక్తపాతం వల్ల తనలోని శాంతిని కోల్పోయాడు. వాళ్ళు కలిపింది ఏదో ఒంటి కొమ్ము విషం అది నా కొడుకుని అంతకముందే ఒకసారి చంపింది కానీ అప్పుడు ఆ తెగ నాయకుడు ఇచ్చిన మందు వల్ల రెండు సార్లు చనిపోయే అవకాశం ఉన్నందు వల్ల బతికాడు. అందుకే ఎలాగో అనురాధ చనిపోతుందని తెలుసు, అను లేకుండా వాడు ఉండలేడు అందుకే..... అందరూ ఏదో ఆలోచిస్తుంటే మానస విక్రమ్ వైపు చూసింది.. విక్రమ్ ఇంకేదో ఆలోచిస్తున్నాడు.. అక్షిత : మేము వచ్చేటప్పటికి విక్రమాదిత్య చనిపోవడంతో అమ్మ (రక్ష) యుద్ధానికి వెళ్ళింది. శశిని మానసని కుక్కని కొట్టినట్టు కొట్టింది. కానీ అప్పుడే తెలిసింది ఆ రాక్షసి ఇంకా బతికే ఉందని.. ఆదిత్య : ఎవరు ? సంధ్య : దేవి అను : తను ఎలా బతికింది, విక్రమాదిత్య చంపేశాడు కదా.. దీవి మొత్తం బాంబులతో నాశనం అయ్యింది కదా అక్షిత : మీరు ఇప్పుడు ఉన్నదీ ఆ దీవి మీదే మానస : నమ్మ బుద్ధి కావట్లేదు అక్షిత : విక్రమాదిత్య బాంబులతో పేల్చక ముందే అందరిని నాశనం చేసి సంపాదించిన ఐదు రింగులతో అమృతం తెరిచి తాగేసింది. ఇక్కడ అస్సలు సంగతి ఏంటంటే అమృతం తాగేటప్పుడు ఆ ఐదు రింగులు తనలో ఐక్యం అయిపోయి శక్తివంతురాలిగా మారిపోయింది. రక్ష అమ్మ బలం చాలలేదు.. ఫలితం రక్ష అమ్మ నిద్రలోకి వెళ్ళిపోయింది. విక్రమాదిత్యకి మరదలు మానసకి ఇది తెలిసే ఎందుకైనా మంచిది అని తన వీర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆ దేవిని చంపగలిగే వాళ్ళు ఈ తెగకి సంబంధించిన రక్తం అయ్యుండాలి.. అందుకు బైట వాళ్ళైన అనురాధ కొడుకులు శశి కానీ మానస్ కానీ, ఇక తొడ సంబంధం(పిన్ని వరస) వల్ల పుట్టిన ఈ ముగ్గురు కూడా తనని చంపలేరు. మానస విక్రమాదిత్య ఇద్దరు శక్తివంతులు బావ మరదలు వరస, ఇద్దరు ఒకే తెగకి సంబంధించిన వాళ్ళు. వారిద్దరి నుంచి పుట్టిన రక్ష అత్యంత శక్తివంతురాలు, దేవిని చంపే అర్హత ఉన్నది తనే అవుతుంది. అని ముగించింది. అందరూ మాట్లాడుకుంటుంటే విక్రమ్ లేచి గోడకి అనుకుని నిలబడ్డాడు. అది చూసి ఆదిత్యతో పాటు మానస, అనురాధ కూడా వెళ్లారు. నలుగురు అందరికి దూరంగా నిలబడ్డారు. మానస : అప్పటి నుంచి చూస్తున్నాను, ఏమైంది ? విక్రమ్ : లేదు సంధ్య గారు చెప్పింది విన్నావా, విక్రమాదిత్య విషం తిని చనిపోయాడు అని చెప్పింది. కానీ ఆయనని ప్రపంచంలో ఉన్న ఏ విషం దరి చేరకుండా.. ఆ తెగ నాయకుడికి ఇచ్చేది మాత్రమే కాకుండా ఇంకో ద్రవం కూడా ఇచ్చారు అని సంధ్య గారే చెప్పారు. ఆదిత్య : నాకు గుర్తు లేదు విక్రమ్ : నాకు గుర్తుంది. ప్రతీ అక్షరం గుర్తుంది. మానస : అలా అయితే ఆయన చనిపోకూడదు కదా విక్రమ్ : అదే అర్ధం కావట్లేదు, ఇక అక్షిత చెప్పింది.. ఆ రాక్షసిని చంపాలంటే పర్ఫెక్ట్ గా పుట్టాలి అని చెప్పింది. కానీ విక్రమాదిత్య తండ్రి ఒక తాగుబోతు.. ఈ కధకి సంబంధం లేని వాడు.. అప్పుడు విక్రమాదిత్య కూడా పర్ఫెక్ట్ కాదు.. కానీ ఆయన నుండి పుట్టిన రక్ష ఎలా పర్ఫెక్ట్ అవుతుంది. సరే ఇవన్నీ పక్కకి పెట్టేస్తే రక్ష ఎందుకు ఆ రాక్షసిని చంపలేక పోయింది. ఈ సంధ్య గారు మన నుంచి ఏదో దాస్తున్నారు అది ఇక్కడున్న ఎవ్వరికి తెలీదు. తనే నోరు విప్పాల్సింది కానీ ఆవిడ ఏమి చెప్పట్లేదు అన్నిటికి భయపడుతుంది. ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడుతుంది. ఆదిత్య : విక్రమ్ ఆ సౌండ్ విన్నావా విక్రమ్ : ఏ సౌండ్ ఆదిత్య : క్లియర్ గా విను.. అనేసరికి అందరూ మౌనంగా ఉన్నారు చిన్నగా ఆ శబ్దం పెరుగుతూ వస్తుంది.. జూఊఊఊమ్ అంటూ ఉండే కొద్ది పెద్దగా అయ్యే శబ్దం ఏంటో తెలుసుకోడానికి వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. మానస : నవ్వుతూ అది కార్ సౌండ్. అను : ఆ సౌండ్ చూడు ఎంత పెద్దగా వస్తుందో.. ఎంత స్పీడ్ గా నడిపితే అంత సౌండ్ వస్తుంది. విక్రమ్, ఆదిత్య ఏదో హోప్ దొరికినట్టు అలెర్ట్ అయ్యారు. ఆదిత్య : ఇలాంటి ఒక ప్లేస్ లో అంత స్పీడ్ గా నడిపేవాడు ఒక్కడే ఉన్నాడు. విక్రమ్ : సుబ్బు.....? కారు మోత ఎక్కువైంది... రీసౌండ్ కి అందరూ చెవులు మూసుకున్నారు.
22-10-2022, 11:02 PM
Kekaaa broo mothaniki andaruu okkadaggariki cheraru... waiting for action episode bro
22-10-2022, 11:05 PM
Wah mana heroes entry na
Inka war ki andaru siddam anamata Anukunnatlugane devi bratike undi Manasa kuda bratike unte inka bguntundi Vikramaditya bratike unada? Deenemma enni twist lu bro
22-10-2022, 11:13 PM
వామ్మో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి....విక్రమ్ చాలా బాగా ఆలోచించాడు....ఈ లెక్కలో చూస్తే విక్రమాదిత్య కూడా బ్రతికి వుండే ఛాన్స్ వుంది....సంధ్య ఎదో దాస్తుంది....కానీ ఎందుకు......కొన్ని reveal చేస్తున్నారు అలాగే ఇంకొన్ని చిక్కు ముడులు వేస్తున్నారు బ్రో మీరు....స్టోరీ ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు....హ్యాట్సాఫ్ బ్రో....
చెప్పినట్టే అప్డేట్ కూడా ఇచ్చారు.... మీ అప్డేట్ కోసమే వేచిచూస్తన్న.... అప్డేట్ కి ధన్యవాదాలు
22-10-2022, 11:20 PM
Excellent సార్ చాల చాల అద్భుతంగా వ్రాశారు సార్ సూపర్ అప్డేట్ ఇచ్చారు సార్ సూపర్
|
« Next Oldest | Next Newest »
|