14-10-2022, 04:51 AM
Nice update
సాక్ష్యం
|
14-10-2022, 05:58 AM
(13-10-2022, 07:30 PM)Takulsajal Wrote: ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి పడుకున్నాను తెల్లారే పెళ్లి రాత్రే అమ్మకి చెప్పాను మధ్యానానికి ఆఫ్గనిస్తాన్ వెళుతున్నానని. తెల్లారే పొద్దున్నే అమ్మ అందరిని లేపి హడావిడి చేసి అందరిని తిడుతూ అరుస్తూ పన్నెండు గంటల్లోగా పెళ్లి జరిపించింది.Nice concept Takulsajal garu...Curious to know how the honeymoon and mission go hand in hand!!!
14-10-2022, 10:25 AM
ఏ శరణ్య బుద్ధి మారలేదా ఈ కథలో కూడా దొంగ బుద్ధి దానిది.
15-10-2022, 11:49 AM
excellent update icharu
kotta kotta characters gurthu pettukovadam kastam ga undi rasi pettukuntunna nenu aite sujita
18-10-2022, 12:22 PM
18-10-2022, 12:24 PM
18-10-2022, 12:26 PM
18-10-2022, 12:28 PM
(This post was last modified: 19-10-2022, 05:25 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
చిన్నా ఆఫ్గనిస్తాన్ వెళ్లిన అదే రోజు సుమారు రాత్రి ఒంటిగంట కావొస్తుంది. చిన్నా చెప్పినట్టుగానే వాసు అక్షితకి కాపలాగా పక్క ఇంట్లోనే డాబా మీద కూర్చుని ఫోన్లో శృతితో సరసాలు ఆడుతూ మాట్లాడుతున్నాడు. అప్పుడే చీకటిలో ఒక నలుగురు ఎవడినో ఎత్తుకుని అక్షిత ఇంట్లోకి వెళ్లడం గమనించి ఫోన్ కట్టేసి వెంటనే అక్షిత దెగ్గరికి పరిగెత్తాడు.
అక్షిత : రేయి తీసుకురమ్మంటే ఎత్తుకొచ్చారేంట్రా వాడికి అస్సలే ఇగో ఎక్కువ, అలిగి వెళ్ళిపోయినా పోతాడు ముందు వాడిని లేపండి. అని గేట్ చప్పుడు విని పక్కకి చూసింది... అన్నయ నువ్వెంటి ఇక్కడ ఈ టైంలో వాసు : మీ ఆయన వేసిన డ్యూటీ.. అదే చిరంజీవి అక్షిత : ఆయన నిన్నెందుకు కలిసాడు, అస్సలు తనకి నువ్వెలా తెలుసు? వాసు : అవన్నీ అడిగితే చెప్పనన్నాడు.. నా సంగతి సరే నువ్వెంటి ఈ మనుషులు ఎవ్వరు.. ఏంటిదంతా అక్షిత : చెపుతాను, నేను ఇక్కడనుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి కొంచెం హెల్ప్ చెయ్యి. వాసు : ఎక్కడికి అక్షిత : ప్రశ్నలు తరువాత, వాళ్ళు వచ్చేస్తున్నారు, అదిగో అంబులెన్సు కూడా వచ్చేసింది. అన్నయ్య లోపల ఒకావిడ ఉంది కొంచెం అంబులెన్స్ లోకి ఎక్కించు. వాసు ఎం అర్ధం కాకపోయినా లోపలికి వెళ్లి ఇంకొకడి సాయంతో రూంలో పడుకుని ఉన్న ఒక అమ్మాయిని అంబులెన్స్ లోకి ఎక్కించాడు. వాసు : ఎవరు తను అక్షిత : మా అమ్మ వాసు : అమ్మా...! అలా లేదే అక్షిత : కోమాలోకి వెళ్ళింది, తనకి కొన్ని పవర్స్ ఉన్నాయిలే అంత తొందరగా ముసలిది అవ్వదు.. అని మాట్లాడుతూనే సుబ్బు మొహం మీద నీళ్లు కొట్టింది. సుబ్బు : కళ్ళు తెరిచి అటు ఇటు చూసి.. రేయి ఎవడ్రా నన్ను ఎత్తుకొచ్చింది, కార్ ఎక్కి తొక్కించేస్తా నన్ను వదలకపోతే. అక్షిత : రేయి రేయి.. అరవకు నేనే.. సుబ్బు : అక్షిత నువ్వా... అక్షిత : ఏంట్రా సుబ్బు : మేడం.. సారీ మేడం.. మీరు అయినా కాలేజీ అయిపోయాక కూడా మీరు ఇలా మేడం అని పిలిపించుకోవడం ఎం బాలేదు.. ఇంతకీ నన్ను ఎత్తుకొచ్చింది ఎవ్వరు ఇక్కడ మీరేం చేస్తున్నారు.. ఈ కండలు తిరిగిన సూపర్ మాన్ ఎవరు అని వాసుని చూసాడు. అక్షిత : నువ్వేం మారలేదురా, నాకు నీ హెల్ప్ కావాలి సుబ్బు : హెల్ప్ కావాలంటే అడగాలండి ఇలా ఎత్తుకురాకూడదు అక్షిత : అంత టైం లేదు.. ఎం జాబ్ చేస్తున్నావ్ నువ్వు ఇప్పుడు సుబ్బు : డ్రైవర్ అక్షిత : అనుకున్నా, ఇదిగో ఈ అంబులెన్స్ నడపాలి.. ఇదే పని సుబ్బు : ఎక్కడికి అక్షిత : ఎక్కడికి లేదు తిరుగుతూనే ఉండాలి, దొరికితే తనతోపాటు నిన్ను కూడా చంపేస్తారు.. జోక్ కాదు నిజంగానే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు.. నాకు తెలిసిన బెస్ట్ డ్రైవర్ వి నువ్వే అందుకే నిన్ను తీసుకురమ్మంటే మా వాళ్ళు అలవాటులో ఎత్తుకొచ్చేసారు. సుబ్బు : అప్పుడెప్పుడో నా ఖర్మ కాలి కాలేజీలో నీకు ప్రపోజ్ చేసాను ఉన్నన్ని రోజులు నన్ను బానిస లాగ వాడుకున్నావ్.. నీ పీడా పోయిందిలే అనుకున్నాను.. ఇలా తగులుకుంటావ్ అనుకోలేదు. అక్షిత : రేయి సీనియర్ తో అలానేనా మాట్లాడేది, రెస్పెక్ట్. సుబ్బు : అలాగే మేడం అక్షిత : నిజంగా ఎమర్జెన్సీరా, నువ్వు మాత్రమే చెయ్యగలిగే పని ప్లీజ్ ఎంత అందంగా ఉందొ చూడు, కాపాడు. సుబ్బు : సర్లే జీతం ఎంతా అక్షిత : ఇదిగో డబ్బులు, నీ పాత సిం తీసేసి ఈ కొత్త సిం వేసుకో.. ఈ ఫోన్ పారేయి రేపు కొత్తది కొనుక్కో.. దానికి నేనే కాల్ చేస్తాను.. నువ్వు ఎవ్వరిని కాంటాక్ట్ అయినా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఎవ్వరికి ఫోన్ చెయ్యకు.. ఇది మా ఆయన కార్డు నీకు ఎంత కావాలంటే అంత గీక్కో సరేనా.. ఇక బైలుదేరు.. ఇంకోటి బండి ఎక్కడ ఆపినా మూడు గంటలకి మించి ఆపకూడదు.. నీకొక డివైస్ ఇస్తాను అందులో కో ఆర్డినెట్స్ వస్తుంటాయి అది మొగినప్పుడల్లా అక్కడికి వేళ్ళు సరేనా సుబ్బు : నువ్వు ఎం మారలేదు, లొడలోడా వాగుతూనే ఉన్నావ్.. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా రికార్డు చేసుకున్నలే.. తరవాత వింటా.. మేడంమ్మ. అక్షిత : అంతొద్దు నాన్న, మేడం అని పిలిస్తే చాలు. అక్షిత ఎవరికో కాల్ చేసింది కానీ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు అంటే మనోడు దొరికిపోయాడేమో అని, సుబ్బుని బైలుదేరమని చెప్పింది. సుబ్బు అయోమయంగానే అంబులెన్స్ ఎక్కి నిద్ర మత్తులోనే స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు. అక్షిత : అన్నయ్య నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడనుంచి వెళ్లిపోతున్నా వాసు : కానీ.. అక్షిత : ఇదిగో నన్ను కాపాడ్డానికి ఎంత మంది ఉన్నారో చూసావుగా, నాకేం పరవాలేదు. ఇంతలో వాసుకి ఫోన్ వచ్చింది. వాసు : హలో.. "హాయి వాసు" వాసు : ఎవరు? "అదేంటి జైలు నుంచి తప్పించుకుని నా బిజినెస్ తోపాటు నా మనుషులని కూడా చంపావు, అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నవన్నమాట.. గుడ్ గుడ్.." వాసు : ఏం కావాలి "నువ్వే కావాలి, నీ ఫ్రెండ్ రాంబాబు దొరికిపోయాడు నువ్వు కూడా వచ్చేస్తే హ్యాపీ.. నువ్వే వస్తావా మనుషులని పంపించనా.. ఆ ఇంకోటి మర్చిపోయాను గుర్తొస్తే ఫోన్ చేస్తా.. బాయి.." వాసు వెంటనే ఫోన్ కట్టేసి తన అన్నయకి ఫోన్ చేసాడు. వాసు : అన్నయ్య ఎక్కడున్నావ్ అర్జున్ : డ్రైవింగ్ లో ఉన్నానురా, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం అమ్మ తిరుపతి వెళదాం అంటే దర్శనం చేసుకుని ఇంటికి వెళుతున్నాం ఇంకో రెండు గంటల్లో ఇంటికి వెళ్ళిపోతాం. వాసు : అలాగా అర్జున్ : ఇదిగో అమ్మ కిస్తున్నా మాట్లాడు జానకి : ఎక్కడున్నావ్ రా, తిన్నావా వాసు : ఆ.. తిన్నాను ఇంటికే బైలుదేరుతున్నా కానీ మధ్యలో పని పడింది.. బైటికి వెళ్ళాలి కొన్ని రోజులు.. ఒకసారి పద్మకివ్వు మాట్లాడతాను. జానకి : పద్మ మాతో రాలేదురా, దానికి పీరియడ్స్ ఇంట్లోనే ఉంది. వాసు : ఒక్కటే ఉందా జానకి : తోడుగా రమ అత్త ఉందిలే వాసు : సరే.. నేను మళ్ళీ చేస్తా.. అని పెట్టేసి వెంటనే ఇంటికి ఫోన్ చేసాడు ఎంగేజ్ వచ్చేసరికి.. వెంటనే బాలుకి ఫోన్ చేసాడు. బాలు : వాసు చెప్పరా వాసు : అర్జెంటుగా ఇంటికి వెళ్లి పద్మ ఉందేమో చూడు. బాలు : ఏమైందిరా వాసు : చెప్పింది చెయి.. అని అరిచాడు.. ఇంతలో వేరే ఫోన్ వస్తే ఎత్తాడు. "ఆ గుర్తొచ్చింది ఇందాక మీ ఇంట్లో వాళ్ళని లేపడానికి వెళితే అక్కడ నీ భార్య మాత్రమే కనిపించింది, మా వాళ్ళు తీసుకొచ్చేసారు నువ్వు ఎంత త్వరగా వచ్చేస్తే నీ భార్య అన్ని ఎక్కువ నిమిషాలు బతికి ఉంటుంది. పావుగంటలో చార్మినార్ దెగ్గర ఉన్న మా వాళ్ళ బండి ఎక్కు.. టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్ పావుగంటలో బండి బైలుదేరుతుంది ఆ తరువాత నీ భార్య బతికుండడం అటుంచు కనీసం బాడీ కూడా దొరకదు.. టైమర్ ఆన్ అండ్ ద గేమ్ ఇస్ ఆన్...." వాసు పరిగెత్తుకుంటూ వెళ్లి బండి తీసాడు, అక్షిత అలానే చూస్తూ ఉండిపోయింది.. స్పీడ్ గా నడుపుతూనే అర్జున్ కి ఫోన్ కలిపాడు. జానకి : చెప్పరా, మాట్లాడావా దానితో.. వాసు : ఆ మాట్లాడాను, ఫోన్ ఒకసారి అన్నయ్యకి ఇవ్వు. అర్జున్ : వాసు చెప్పు. వాసు : బండి ఆపి బైటికిరా అర్జున్ : ఏమైంది వాసు : ఆపావా అర్జున్ : ఒక్క నిమిషం..(జానకి : ఏమయిందిరా.. వాసు : ఏంలేదు.. ఒక్క రెండు నిమిషాలు).......... వాసు చెప్పు వాసు : పద్మని ఎత్తుకెళ్లారు అర్జున్ : ఎవరు వాసు : అప్పుడు చంపాంకదా వాళ్ళే.. నా ఫ్రెండ్ రాంబాబు కూడా దొరికిపోయాడు.. మీరు ఇంటికి వెళ్లొద్దు.. ఏదో ఒకటి చెప్పి టూరో ఇంకోటో చెప్పి గుళ్ళు గోపురాలు తిప్పుతూ ఉండు.. నేను వెళుతున్నా అర్జున్ : నేను వస్తాను వాసు : మరి అమ్మ వాళ్ళ సంగతి, నువ్వు అక్కడ చూసుకో ఇక్కడి సంగతి నేను చూసుకుంటాను. అర్జున్ : అలాగే, జాగ్రత్త వాసు : డబ్బులు ఏమైనా కావాలంటే బాలు వాళ్ళకి ఫోన్ చెయ్యి మన ఊరి దరిదాపుల్లోకి కూడా రావొద్దు మళ్ళి నేనే చేస్తాను. అర్జున్ : అలాగే.. అని ఫోన్ పెట్టేసి బండి ఎక్కి రివర్స్ తిప్పాడు. జానకి : ఏమైంది నాన్నా అర్జున్ : వాసు చిన్న పని చెప్పాడు మా, అందుకే.. ఈ రాత్రికి ఇక్కడే రూం తీసుకుందాం. వాసుకి బాలు ఫోన్ చెయ్యగానే ఎత్తి చెవిలో పెట్టుకున్నాడు. బాలు : వాసు.. పద్మ లేదు రా.. రమ అత్త గొంతు కోసి చంపేశారు అనగానే వాసు కళ్ళు మూసుకుని బండి హేండిల్ ని గట్టిగా గుద్దాడు. వాసు : మళ్ళీ స్పీడ్ గా పోనిస్తూ.. బాలు.. బాలు.. చెప్పేది విను.. కాబోయే అల్లుడివే కాబట్టి ఆ కార్యక్రమాలు దెగ్గరుండీ నువ్వే పూర్తి చెయ్యి. ప్రణీతకి ఇంట్లో వాళ్ళకి నేను చెప్పలేదు, నువ్వు సైలెంట్ గానే ఉండు.. నేను వచ్చాక చూసుకుందాం.. అన్నయకి డబ్బులు పంపించు.. నేను వచ్చేవరకు ఇంటి వైపు ఎవ్వరు వెళ్ళకండి.. నేను మళ్ళి చేస్తాను.. అని పెట్టేసి వెంటనే శృతికి కాల్ చేసాడు. శృతి : వాసు.. వాసు : శృతి పద్మని ఎత్తుకుపోయ్యారు.. నువ్వు జాగ్రత్త.. సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్లొద్దు.. అక్క దెగ్గరికి వెళ్ళిపో.. వాళ్ళు మళ్ళీ వచ్చారు.. నువ్వేం చెయ్యొద్దు.. నేను చూసుకుంటాను. శృతి : అలాగే వాసు : నేను మళ్ళి చేస్తా బై.. అని చార్మినార్ ముందుకి వెళుతూనే అక్కడున్న మినీ వాన్ చూసి బండి దిగి అక్కడికి వెళ్ళాడు. వాసుని పట్టుకుని కింద నుంచి పై దాకా చెక్ చేసి డబ్బులు వాచి మెడలో గొలుసు అన్ని తీసుకుని కళ్ళకి గంతలు కట్టి చేతులు కట్టేసి లోపల కూర్చోబెట్టగానే బండి బైలుదేరింది. ఇటు అక్షిత అంతా రెడీ చేసుకుని బైటికి రాగానే బైట ఒక రోల్స్ రాయిస్ కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి కుర్రాడిలా కనిపించే నలభై ఐదేళ్ల వాడు దిగాడు. అక్షిత : ఎందుకొచ్చావ్ శశి : అన్ని తెలిసే అడుగుతున్నావా కోడలా, మర్చిపోయా నీ ఇన్ఫార్మెర్ ని ఇప్పుడే చంపేశా. అక్షిత : అలా పిలవకు అసహ్యంగా ఉంది. శశి : సరే సరే నా చెల్లెలు ఎక్కడా అక్షిత : నువ్వు ఎంత ప్రయత్నించినా దొరకదు, అమ్మ కోమా లోనుంచి లేచిన రోజే మీరు చచ్చిపోవడం ఖాయం. శశి : అదీ మేము చూసుకుంటాంలే, లేచినా మా కోసమో నీకోసమో వస్తుంది కదా.. రా వెళదాం అనగానే అక్కడున్న అక్షిత తమ్ముళ్లు తిరగపడ్డారు.. తలా ఒక గుద్దుకీ అందరూ చచ్చిపోయారు. అక్షిత : ఇలా ఇంకెంత మందిని పొట్టనబెట్టుకుంటావు.. అని కళ్లేమ్మటి నీళ్లు పెట్టుకుంది. శశి : వస్తావా బలవంతంగా ఈడ్చుకెళ్లనా అక్షిత : చావనైనా చస్తాను కానీ నీతో రాను. శశి : ఇంకా చాలా పనులున్నాయి బంగారం.. శత్రువులందరిని ఇవ్వాళే లేపెయ్యాలని నీ మావయ్య అక్కడ రెడీగా కూర్చున్నాడు.. కొంచెం సహకరించు.. అయినా నా చేతుల్లో పెరిగిన నిన్ను చంపుకుంటానా చెప్పు.. అక్షిత పరిగెత్తుకుంటూ వెళ్లి శశి చేతికి దొరకకుండా మోకాలి మీద గట్టిగా తన్నింది. శశి : నిజంగా, నన్ను కొట్టి పారిపోదామనే.. ఆ ఆలోచన వచ్చిందంటే నవ్వాలో ఏడవాలో అర్ధంకావట్లేదు.. అయినా టెక్నిక్స్ ఉంటె సరిపోద్దా ప్రాక్టీస్ కూడా కావాలి.. నేను నేర్పిన విద్యలు నాకే అప్పచెపుతున్నావా... అని అక్షిత దెగ్గరికి వెళ్లి మెడ మీద ఒక్కటి పీకాడు. అక్షిత స్పృహ తప్పి పడిపోయింది.. కాలేజీ బాగ్ ని ఎత్తినట్టు ఎత్తి కార్లో పడేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
18-10-2022, 12:45 PM
(This post was last modified: 18-10-2022, 01:21 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
Enti idi bro Rama atha Ni kuda champara,
Akshita Ni ipudu evaru kapadutaro , Andaru okate chota kalisela unaru anamata |
« Next Oldest | Next Newest »
|