Thread Rating:
  • 5 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సాక్ష్యం
#41
(16-09-2022, 05:11 PM)Vvrao19761976 Wrote: Nice story

Thankyou
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(16-09-2022, 09:04 PM)sujitapolam Wrote: congrats on the new story sir

inni kathalu ni link chstu story rayadam ante matalu kadu

chiranjeevi and akki characters ni malli techinanduku thanks


mee sujita

ధన్యవాదాలు sujitha గారు ❤️
Like Reply
#43
ఆటో దిగి ఇంటి ముందు నిల్చున్నాను, గేట్ ముందు టెంట్ దాని కింద డెకొరేషన్లు ఇంకో పక్క భోజనాలు తయారు అవుతున్నాయి, లోపలికి వెళ్ళగానే ఎవరో పక్క నుంచి చెవి పట్టుకున్నారు.

పార్వతి : ఎప్పుడు రమ్మన్నాను ఎప్పుడు వచ్చావ్... ఆ..

చిన్నా : ఆ.. అ...

పార్వతి : ఆ.. అ. అ. ఏంటి

చిన్నా : వచ్చాను కదే, ఇంతకీ ఎక్కడ వాడు.

పార్వతి : నువ్వొస్తే గాని రింగ్ తొడగనని కూర్చున్నాడు, త్వరగా రా అని లోపలికి లేక్కేళ్ళింది. అన్నయ్య పక్కన నాకు కాబోయే వదినని చూడగానే ఏదో తేడా కొట్టింది. తనని నేను ఇప్పుడే మొదటిసారి చూడటం.

సతీష్ : రేయి వచ్చావా, లావణ్య వాడే నా తమ్ముడు చిన్నా... రేయి రా త్వరగా

చిన్నా : వచ్చాను రా బాబు ఇక కానీ.. హాయ్ వదినా

లావణ్య చిన్నగా నవ్వింది..అన్నయ్య రింగ్ తోడుగుతుంటే చెప్పట్లు కొట్టి మూలకి నిల్చొని వదినని చూస్తున్నా. నటిస్తుందా ఇదే ఒరిజినల్ క్యారెక్టరా ఇంకా అర్ధంకాలేదు ఇంతలో అమ్మ పిలిస్తే వెళ్లాను.

నిత్య : నీ మరిది ఇప్పటి వరకు నిన్నే చూసి వెళ్ళాడు.

లావణ్య : చూసాను, పన్నెండు నిమిషాలు నేను ఎటు చూస్తున్నా, గ్లాస్ పక్కన పెట్టేటప్పుడు, నేను నవ్వుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు.

నిత్య : ఏం చేస్తుంటాడు?

లావణ్య : డిగ్రీ చేసి కాళిగా ఉన్నాడట, మన సోర్స్ ప్రకారం అయితే గాలి తిరుగుళ్ళు తిరుగుతాడు, సిగరేట్ మందు డ్రగ్స్ అన్ని అలవాట్లు ఉన్నాయి బాడీ చూసావా స్టిఫ్ గా ఉంది.. డ్రగ్స్ బాగా తీసుకుంటాడేమో.. వీటితో పాటు బెట్టింగులు, పేకాట అన్ని వ్యసనాలు ఉన్నాయని తెలిసింది.

నిత్య : గెలికి రానా

లావణ్య : వద్దు ప్రస్తుతానికి వదిలేయి, ఎలాగో నేను కాపురానికి రావాలి కదా కొంత మచ్చిక చేసుకుంటే డ్రగ్స్ కేసులో ఏమైనా ఉపయోగ పడతాడు.

నిత్య : అవసరమా ఈ సంబంధం.. మళ్ళీ ఆలోచించుకో వద్దు అని ఒక్క మాట చెప్పు వెళ్ళిపోదాం.

లావణ్య : లేదే సతీష్ మంచివాడు తనకీ ఏ అలవాట్లు లేవు అది కాకా జాబ్ కోసం అమెరికా వెళ్తున్నాడు పెళ్లి చేసుకుని భార్యతొ వెళ్లాలని ప్లాన్.. ఏదో ఒకటి చేసి తనని ఒక్కణ్ణి పంపిస్తే మనకి ఒక రెండు మూడేళ్లు ఇక్కడ కొంచెం ప్రైవసీ దొరుకుద్ది ఎలాగో మిషన్స్ మీద తిరుగుతూనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కలుస్తాను. వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచివారు వీడొక్కడే కలుపు మొక్క.

నిత్య : నీ ఇష్టం.

లావణ్య : అయినా ఎన్ని రోజులు వంటరిగా ఉండాలే నేను.

నిత్య : నీ కలుపు మొక్క వస్తున్నాడు.

చిన్నా : వదినా అమ్మ పిలుస్తుంది.. అండ్ మీరు?

లావణ్య : నా ఫ్రెండ్ నిత్య వస్తున్నా అని తన ఫ్రెండ్ తొ పాటు వెళ్ళిపోయింది.

లావణ్య వెళ్ళగానే ఇందాక అన్నయ్యని కలవడానికి దెగ్గరికి వచ్చినప్పుడు విసిరేసిన మైక్ తీసి జేబులో పెట్టుకున్నాను.. అబ్బో మన గురించి ఇన్ఫర్మేషన్ బానే లాగారు.. వెంటనే ఫోన్ తీసాను.

చిన్నా : రేయి జగ్గు ఎక్కడా

జగదీష్ : చిరు చెప్పరా ఇంకెక్కడా ఆఫీస్ లో మన టీం రష్యా వెళ్లారు, చిప్స్ తింటూ చూస్తున్నా

చిన్నా : కష్టం లేని బతుకురా నీది.. సర్లె నీకు రెండు ఫోటోలు పంపిస్తున్నా వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉన్నారు మొత్తం డీటెయిల్స్ బైటికి లాగు.. అలాగే ఎవడో నా ఫేక్ ప్రొఫైల్ తెలుసుకున్నాడు వాడెవడో కనుక్కో.

పార్వతి : రేయి నిన్ను నాన్న పిలుస్తున్నాడు.

చిన్నా : ఎందుకే..?

పార్వతి : ఏమో నాకేం తెలుసు

చిన్నా : అదేంటి నాతో మాట్లాడడు కదా, నేనంటే ఇష్టం లేకనే కదా నన్ను ఇంట్లోనుంచి బైటికి వెళ్లగొట్టింది.. పొద్దున్ననుంచి నాకు కనిపించకుండా తిరిగి ఇప్పుడేమో...

పార్వతి : రేయి.. ఆపరా.. ముందు పొయ్యి ఆయన్ని కలువు.. హా.. ఇంకోటి నిన్ను ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంది నువ్వంటే ఇష్టం లేక కాదు నువ్వు ఎందుకు పనికిరాకుండా పోయావని కోపం.

చిన్నా : అంతలేదులె మీకు మీ పెద్ద కొడుకు అంటేనే ఇష్టం, పైకి మాత్రం కోతలు.. వాడేం చేసినా రైట్ అంటారు నేనేం చేసినా రాంగ్ అంటారు.. రేపు వాడు అమెరికా వెళ్ళిపోతే మిమ్మల్ని దెగ్గరుండి చూసుకోవాల్సింది నేనే అని మర్చిపోకండి. అయినా వాడికి పిల్లని చూసావు సరే నాకు వయసోస్తుంది నా గురించి అస్సలు ఏమైనా ఆలోచన ఉంటే కదా తమరికి.

పార్వతి : ఏముందని ఇస్తారు నాన్నా మనకి పిల్లని, చదువు లేదు చేతిపని రాదు తెలివితేటలతొ పైకి వచ్చేవాడివా అంటే అది కూడా లేదు, నీ కోసం ఇంట్లో గోల చేసి పది లక్షలు ఇప్పించాను షాప్ పెట్టుకోమని రెండు నెలల్లో మూతపడిందది.. నువ్వు తీసుకున్న పది లక్షలు వెనక్కి రాలేదు.

చిన్నా : నీ డబ్బులు ఎవడికి కావాలె..

పార్వతి : ఇచ్చేయి మరి ఎందుకు నీ దెగ్గర

చిన్నా : సంపాదించక ఇస్తానులె.. ఓ ఏడవకు నీ డబ్బులు నాకెందుకు.

పార్వతి : నేను మోత్తుకునేది అదే కదరా.. ఏదైనా చేసి ఏడువు.. నా ఫ్రెండ్స్ కూతుర్లు కొడుకులు అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి నువ్వు మాత్రం తిరుగుతూనే ఉండు..

సతీష్ : రేయి ఏంట్రా ఈ రోజు ఇంకా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నా ఇద్దరు ఈ మూలకి వచ్చి మొదలుపెట్టారా

పార్వతి : వాడికి చెప్పు, మొదలు పెట్టింది వాడే.

సతీష్ : రేయి ముందు వెళ్ళు.. నాన్న పిలుస్తున్నాడు..

నా పిచ్చి గడ్డం గీక్కుంటూ వెళ్లాను, నా వెనుకే అన్నయ్య, అమ్మ ఇద్దరు వచ్చారు.. వెళ్లి ఆయన ముందు నిలబడ్డాను అప్పుడే వదిన తన ఫ్రెండు కూడా తినేసి వచ్చారు.

లావణ్య ఏమైంది అని సతీష్ కి సైగ చేసింది.. సతీష్ మూతి మీద వేలు పెట్టి జరిగేది చూడమని సైగ చేసాడు. లావణ్య ఇంకేం మాట్లాడకుండా నిల్చుండిపోయింది. వచ్చిన చుట్టాలు అందరూ వెళ్లిపోయారు కొంత మంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నా పెళ్లి కొడుకు రూం అయ్యేసరికి అక్కడ ఎవ్వరు లేరు. అప్పటివరకు చిన్న కొడుకు వస్తే ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్న రాజేంద్ర చిన్నా వచ్చేసరికి తన మొహం చూడగానే కొంచెం సీరియస్ అయ్యాడు.

చిన్నా : పిలిచారట

రాజేంద్ర : నీ గురించి మాట్లాడదామనే

చిన్నా : అన్నయ్య ఎంగేజ్మెంట్ నాన్నా ఇప్పుడెందుకు

రాజేంద్ర : నీతో డిస్కషన్ కి పిలవలేదు.. చెప్పేది మాత్రమే విను..

చిన్నా : చెప్పండి.

రాజేంద్ర : ఏం చేస్తున్నావ్?

చిన్నా : ఏంటి?

రాజేంద్ర : ఇంట్లో నుంచి నిన్ను గేంటేసి ఇప్పటికి రెండేళ్లు, ఈ రెండేళ్లలో తమరు ఏం చేసారు ఎంత సంపాదించారు లేదా ఏమి వెలగపెట్టారో చెపితే తరిస్తాం.

చిన్నా  : గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా

రాజేంద్ర : వాహ్.. ఏం ఆన్సర్ ఇచ్చావ్ రా ఒక్క ముక్కలో ఇంకేం అడక్కుండా.. ఎలా వస్తాయిరా ఇలాంటి సమాధానాలు ముందే రాసి పెట్టుకుంటావా లేదా ఫ్లోలో వస్తాయా.

చిన్నా : చిన్నగా నవ్వాను.

రాజేంద్ర : కోపంగా చూసి.. నీకింకా ఏజ్ ఉందా

చిన్నా : ఈ సారి ఎక్స్టెండ్ చేసారు ఆఖరిసారి ట్రై చేస్తాను.. పోయిన సారి మొదటిది, ఫిసికల్ క్లియర్ చేసాను ఆఖరి ఎగ్జామ్ లో పోయింది.. ఈ సారి కత్చితంగా వస్తుంది.

రాజేంద్ర : నిజమేనా నువ్వు చెప్పింది.

చిన్నా : నిజమే నాన్నా, నువ్వు బైటికి వెళ్లగొట్టాక డబ్బులు లేక పనికెళ్లా అక్కడ కష్టపడ్డాక బుద్ది వచ్చింది నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావో నేను తెలుసుకున్నాను, ఇప్పుడు పార్ట్ టైం చేస్తూ చదువుతున్నా ఈ సారి క్లియర్ చేసి జాబ్ కొడతాను.

రాజేంద్ర : ఏంటో ఎంటెంటో చెప్తావ్ అది అప్పటికప్పుడు అల్లుతావో లేక నిజాలో ఎవడికి అర్ధంకాదు, ఇంతకీ ఆ పార్ట్ టైం జాబ్ ఎక్కడా?

చిన్నా : గుడ్ నైట్ అని బార్ లో వెయిటర్.

రాజేంద్ర : అంటే జనాలు తాగిన తరవాత మందు గ్లాసులు, వాళ్లు నమిలేసి ఊసిన ఎముకలు ఎత్తే పని.. ఛీ.. ఇంతకంటే చండాలం ఉంటుందా.

చిన్నా : అది కూడా పనే..

రాజేంద్ర : మీ వదినని చూసైనా బుద్ది తెచ్చుకోరా, అమ్మా నాన్న లేరు కాన్వెంట్ లో ఉండి కష్టపడి చదువుకుంది.. స్టేట్ బ్యాంకులో అకౌంటెంట్ అయ్యింది అది రా కసంటే అలా ఉండాలి రా పట్టుదల అంటే.. లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో నీకు చెప్పడానికి ఇంతమంది ఎక్సంపుల్స్ కానీ...

చిన్నా : సరే.. సరే.. ఇప్పుడు ఏం చెయ్యమంటావో చెప్పు.

రాజేంద్ర : లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను ఇంట్లో ఉండి చదువుకో జాబ్ కొట్టావా సరేసరి లేదంటే వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవుతున్నాను..

చిన్నా : ఆ డబ్బులు నాకివ్వు బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేస్తా డబల్ అవుద్ది.

రాజేంద్ర : చెప్పేది వినరా సోది నా కొడకా.. జాబ్ వచ్చిందా సరే లేదంటే షాప్ పెడుతున్నా అందులో ఫస్ట్ ఎంప్లాయి నువ్వే.

చిన్నా : సరే సరే

రాజేంద్ర : ఇక పోయ్యి మెక్కు బైట ఏం గడ్డి తింటున్నావో ఏంటో.

చిన్నా : కానీ నేను ఇంట్లో ఉండను, జాబ్ కొట్టాకే ఇంటికి వస్తాను

రాజేంద్ర : అన్ని యాక్షన్లు చెయ్యకు నీ పేరు మాత్రమె చిరంజీవి, స్వయంకృషిలో చిరంజీవిలా ఫీల్ అవ్వకు.. నీకు సెట్ అవ్వదు కూడా.. పెళ్ళైయ్యేదాకా ఇక్కడే ఏడు.. తరువాత నీ ఇష్టం.

త్వరగానే అయిపోయినందుకు ఊపిరి పీల్చుకుని బైటికి వచ్చాను.. నా వెనకే అందరూ వచ్చారు.. లావణ్య తన ఫ్రెండ్ నిత్య ఇద్దరు ఒకసారి చూసుకుని నవ్వుకున్నారు..

పార్వతి : ఏంటండీ కోడలు ముందు పట్టుకొని ఆ మాటలు

రాజేంద్ర : ఎలా కన్నావే వీడిని, ఆ మొహం వాడి ఎక్సప్రెషన్స్ చూస్తే కోపం పొయ్యి నవ్వొస్తుంది నాకు, యాక్టింగ్ చెయ్యలేక చచ్చిపోయాననుకో.. మాయగాడే ఆడు.. దొంగ నా కొడుకు

పార్వతి : ఆ అన్ని మీ పోలికలే ఈ దిక్కుమాలిన యాక్టింగ్ తోటేగా నన్ను పడేసింది..

రాజేంద్ర : వీడు బాగుపడితే చూడాలని ఉందే.. అస్సలు అది వీడికి సెట్ అవ్వదేమో.. కామెడీ పీస్ క్యారెక్టర్ కానీ దుర్మార్గుడు అస్సలు మాట వినడు.

పార్వతి : సర్లే నేను పిల్లలతో ఇంటికి వెళుతున్నా, సందు దొరికింది కదా అని తెగ తాగేయకుండా ఇంటికి వచ్చేయండి.. అని బైటికి వచ్చి చిన్నా తన అన్నయ్య వదినలతొ ఉండడం చూసి అటు వెళ్ళింది..

పార్వతి : ఏరా బాగైందా.. దూల తీరిందా..

సతీష్ : బాగా..

చిన్నా : అన్నయ్య పెళ్ళైయ్యాక మనింట్లోనే ఉంటావా వేరు కాపురం పెడతావా?

సతీష్ : పోరా ఎదవా.. అమ్మా మనం వెళదాం రా..

పార్వతి : కొంత సామాను ఉంది నేను వస్తా మీరు వెళ్తూ ఉండండి.. రేయి రా.. సామాను పట్టుకుందు..

చిన్నా : ఓహో.. మీకు పనోళ్లు కరువైయ్యారా.. డబ్బులు మిగుల్చుకోడానికి నన్ను ట్రాప్ చేశారన్నమాట.. పదా, ఒప్పుకున్నాక తప్పుతుందా..

లావణ్య  సతీష్ ముందు నడుస్తుంటే వెనకాలే నిత్య నడుస్తుంది..

లావణ్య : ఏంటి మీ తమ్ముడు అలా మాట్లాడతాడు అస్సలు మానర్స్ లేకుండా

సతీష్ : నీకు ముందే చెపుతున్నా నువ్వు వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. అంటే దూరంగా కాదు వాడితో గొడవలు పెట్టుకోకు అని చెపుతున్నా..

లావణ్య : ఏం చేస్తాడేంటి?

సతీష్ : వాడో రివర్స్ గాడు, అంతా రివర్స్ లో ఉంటుంది పద్ధతి మన మీద ప్రేమ ఉంటే చూపించడు, కోపం ఉంటే చుక్కలు చూపిస్తాడు.. అందరూ పొద్దున పూట చదివితే వీడు రాత్రి ఒంటిగంటకి లేచి చదివేవాడు  వాడి పనులన్నీ రివర్స్ లో ఉంటాయి.. వాడు ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియనివ్వడు అన్ని గుప్తంగా ఉంచుతాడు.

లావణ్య : ఎందుకలాగ

సతీష్ : అది అంతే.. చెప్పా కదా రివర్స్ గాడని.. ఏదైనా సినిమా చూసాడనుకో ఆ హీరోలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు మళ్ళీ ఇంకో కొత్త సినిమా చూసేదాకా ఆ క్యారెక్టర్ మార్చుకోడు. వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మన బుర్ర పాడవుతుంది..

లావణ్య వెనకాల ఉన్న నిత్యని చూసి నవ్వింది.. దానికి నిత్య కూడా నవ్వింది..







పార్వతి వెనుకే రెండు చేతుల నిండా సామాను పట్టుకుని నడుస్తున్న చిన్నా మొబైల్ ఇందాకటి నుంచి మొగుతుంది..

పార్వతి : ముందా ఆ మొబైల్ చూడు..

చిన్నా : చేతులు కాళిగా లేవు.. కొంచెం హెల్ప్ చెయ్యి

పార్వతి  చిన్నా జేబులో నుంచి ఫోన్ తీసి స్క్రీన్ చూస్తే దాని మీద "యముడు" అని ఉంది..

పార్వతి : ఎవడు రా.. యముడు అని సేవ్ చేసుకున్నావ్.

చిన్నా : ఉన్నాడులె నా మొగుడు.. నా మెడ కింద పెట్టు..

పార్వతి ఫోన్ ఎత్తి ఎవరో మగ గొంతు విని చిన్నా మెడ దెగ్గర ఫోన్ పెట్టి చూస్తుంది..

చిన్నా : పదా వస్తున్నా.. అంత బాగున్నానా..

పార్వతి : హే.. ఛీ.. పోరా.. అని వెళ్ళిపోయింది..

చిన్నా : ఆ.. బాబాయ్ చెప్పు..

ధీరజ్ : ఎక్కడ చచ్చావ్ రా.. మిషన్ అయిపోయాక ఆఫీస్ కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్లాలన్న బేసిక్ రూల్ కూడా పాటించట్లేదు .. నా అండ చూసుకుని బాగా బలిసింది నీకు..

చిన్నా : ఫైల్ ఆల్రెడీ పంపించేసాను.. ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు.. ముందు పాయింట్ కి రా.

ధీరజ్ : అసైన్మెంట్ వచ్చింది.. ఆఫ్గనిస్తాన్ వెళ్ళాలి బైలదేరు..

చిన్నా : బాబు యామరాజా నిన్నే నేను వచ్చింది.. ఇక్కడ ఇంట్లో పెళ్లి జరుగుతుంది.. నన్ను మాములుగా ఎక్కట్లేదు నా బాబు.. నీ వల్ల నాకస్సలు ఇంట్లో రెస్పెక్ట్ లేకుండా పోయింది.. ఎప్పుడు నీ మిషన్లు నీ గోలే.. నా గురించి అస్సలు పట్టించుకోకు.. యాభై ఏళ్ళు దాటినియి.. మంచం ఏసుకుని పడుకోవచ్చుగా..

ధీరజ్ : ఏదో నా కోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వకు.. దేశం కోసంరా.. జాయిన్ అయ్యినప్పుడే ప్రమాణం చేసావుగా..

చిన్నా : సర్ సర్లే.. ఈ సారికి నేను లేకుండా కానిచెయ్యండి.

ధీరజ్ : మెయిన్ ప్లేయర్ లేకుండా ఆట బాగోదురా

చిన్నా : ఎప్పుడు నేనేనా.. టీంలో ఇంకా ఉన్నారుగా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వు..

ధీరజ్ : అయితే రానంటావ్

చిన్నా : బాబోయ్.. బాబాయ్.. ఈ పదకొండు రోజులు నన్ను గెలక్కు ఆ తరువాత నీ ఇష్టం.. ఈ సారికి వదిలేయి.

ధీరజ్ కోపంగా ఫోన్ కట్టేసాడు..

చిన్నా : అబ్బో.. మళ్ళీ కోపం ముసలోడికి..

పార్వతి : రేయి వస్తున్నావా

చిన్నా : హా.. వస్తున్నా బంగారం..

పార్వతి : నోరు మూసుకుని రా..
Like Reply
#44
ఏంటి సోదరా ఈ అరాచకం.... అసలు మన మెగాస్టార్ character డిజైన్ మామూలుగా లేదుగా. మొత్తానికి చిరంజీవిని టాప్ క్లాస్ ఏజెంట్ ని చేశావ్... vikram,aditya,chiru సంగమం మంచి రసవత్తరంగా ఉండబోతుంది అయితే
[+] 5 users Like sunny_s's post
Like Reply
#45
Superb update, keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#46
ఆహా చిన్న,అక్షిత,లావణ్య.....ఈ పేర్లు వింటేనే ఎదో తెలియని ఊపు.....
అప్డేట్ మంచి ఫన్నీ గా అదిరింది....చిన్న గురించి నిజం తెలిస్తే లావణ్య మైండ్ బ్లాక్ అవ్వుది ఏమో.....చూస్తుంటే చిన్న మన సబ్బిగాడికి పోటీ వచ్చే లాగా వున్నాడు గా....కామెడీ లో..... Big Grin 
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 8 users Like Thorlove's post
Like Reply
#47
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#48
Nice update
[+] 1 user Likes Babu424342's post
Like Reply
#49
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#50
రిటైర్మెంట్ డబ్బులిస్తే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసి డబుల్ చేస్తాడా? సూపరెహే..... ROFL Lotpot

కామెడీ టైమింగ్ చాలా బాగుంది. clps Heart yourock thanks
[+] 9 users Like kummun's post
Like Reply
#51
Super update❤ bro
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
#52
ఇన్ని రోజులు కామెంట్ చెయ్యకుండా చదివి లైక్ రేట్ ఇచ్చేసి వెళ్లిపోయేవాడిని.. కానీ ఈ ఎపిసోడ్ చదివి కామెంట్ చెయ్యకుండా ఉండలేక పోయాను.. నిజంగా wow అనిపించింది.

సుబ్బిగాడి కధలో 2, 3 ఎపిసోడ్స్ కామెడీ పందించడానికి కొంచెం కష్ట పడ్డారేమో అనిపించింది.. కానీ ఆ తరువాత ఆ కద కామెడీ చాలా బాగా కుదిరింది.. ఈ ఎపిసోడ్ లో ఉన్న కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్..

చివరిగా అన్ని జోనర్స్ ని టచ్ చేసి అందులో కూడా ఏదో రాసాంలె అన్నట్టు కాకుండా బాగా రాసి మంచి మంచి కామెంట్స్ ని పొందుతున్నారు.. అలాగే మీరు రాయలేక వదిలేస్తున్నా అని చెప్పిన అమ్మేత కద కూడా పూర్తి చేస్తే మీకు అస్సలు పెండింగ్ కధలు ఉండవు..

ధన్యవాదాలు
[+] 6 users Like Chutki's post
Like Reply
#53
Nice update bro
[+] 1 user Likes raja9090's post
Like Reply
#54
Nice update bro challa bagundhi
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#55
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#56
super bro... keep rocking...
[+] 1 user Likes vg786's post
Like Reply
#57
Nice update super kekaaa
[+] 1 user Likes mahi's post
Like Reply
#58
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#59
సూపర్ అప్డేట్
[+] 1 user Likes ramd420's post
Like Reply
#60
Nice update
[+] 1 user Likes Pradeep's post
Like Reply




Users browsing this thread: 17 Guest(s)