Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సుబ్బిగాడు ≠ World Famous Lover
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super update bro❤
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
super update sie

prasanna
[+] 1 user Likes prasanna56's post
Like Reply
Good update
[+] 1 user Likes Veerab151's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes murali1978's post
Like Reply
Thankyou All
Thanks for the comments ❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
కళ్ళు మూసుకుని పడుకున్నాను, మళ్ళీ మెలుకువ వచ్చింది తెల్లారి ఐదు గంటలకే లేచి చూస్తే శరణ్య అప్పటికే లేచి చదువుతుంది, బ్రష్ చేసుకుంటూ బైటికి వెళ్లి పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ చేసి తన పక్కన పెట్టాను.

శరణ్య : థాంక్స్

సుబ్బు : పర్లేదు చదవుకొ, నేను పడుకుంటున్నా లేచాక ఇంటికి వెళదాం.. అనేసి మళ్ళీ ముసుగు తన్నాను, ఈ సారి ఫోన్ కాల్ లేపింది టైం చూస్తే పదిన్నర.. పక్కన చూస్తే శరణ్య పడుకుని ఉంది.. ఫోన్ ఎత్తాను... హలో ఎవరు?

నేను ప్రసాద్ అండి, మీ ఫ్రెండ్ అరవింద్ గారి దెగ్గర కొత్తగా జాయిన్ అయినా పిఏ ని....) అలాగా వీడికి మళ్ళీ అసిస్టెంట్లు కూడానా, ఇంతకీ విషయం ఏంటో?

ప్రసాద్ : మా సార్ ఒక్కసారి రమ్మన్నారు.

శరణ్య పక్కన ఉన్న బుక్స్ పక్కకి సర్దుతూ అలాగా, సరే వస్తున్నానని చెప్పు అని ఫోన్ పెట్టేసి శరణ్యకి దుప్పటి కప్పి అరవింద్ ఇంటికి బైలుదేరాను.. గేట్ ముందు సెక్యూరిటీ నన్ను చూడగానే, ఏంటి సార్ ఇటు రావడమే మానేశారు అంటూ గేట్ తెరిచాడు లోపలికి వెళ్ళాను బైటే స్విమ్మింగ్ పూల్ దెగ్గర టవల్ కట్టుకుని పక్కన ఉన్న వాడితో ముచ్చట్లు పెడుతున్నాడు వెధవ.

సుబ్బు : ఏంట్రా రమన్నావంట, చెయ్యి దురదా ఫోన్ చెయ్యడానికి కూడా అసిస్టెంట్ ని పెట్టుకున్నావట.

అరవింద్ : రారా.. తనే ప్రసాద్, ప్రసాద్ నా బెస్ట్ ఫ్రెండ్ సుభాష్.. ఈ మధ్య కంపెనీ బాధ్యతలు ఆస్తులు నా పేరున రాసి నాకు ఇష్టం లేకపోయినా నన్ను ఇందులోకి నెట్టేసారులే, మనకా ఈ కష్టాలు పడడం పైకి ఎదగడం మనవల్ల కాని పని అందుకే ఇదంతా... ఉన్నవి పోగొట్టుకోకుండా ఉంటే అదే చాలు.. సరే నా సంగతి వదిలేయి, ఇంకా ఏంట్రా విశేషాలు అస్సలు కలవట్లేదు బతుకు జట్కా బండి దారిలో పడినట్టుంది.

సుబ్బు : ఏదో అలా గడిచిపోతుంది.

అరవింద్ : కొత్త అమ్మాయిని ఎవరినైనా పట్టావా, ఇంకా వెతుకుతూనే ఉన్నావా?

సుబ్బు : ఎక్కడరా,  అమ్మాయిని చూసి చాలా రోజులవుతుంది.

అరవింద్ : నిజమేనా నేను విన్నది, కలలో ఉన్నానా

సుబ్బు : అదీ శరణ్య...

అరవింద్ : తనా, తనకీ నీకు అస్సలు పడదు కదరా

వెంటనే ఫోన్ తీసి శరణ్య ఫోటో చూపించాను, ఏంట్రా ఇది... ఒక్కసారి తన కళ్ళు చూడు.. ఆ చూసా... ఆగు అని పర్సు తీసి అందులో ఉన్న అమ్మ ఫోటో చూపించాను..

అరవింద్ : రేయి ఇద్దరి కళ్ళు ఒకేలా ఉన్నాయి.. నిజంగా

సుబ్బు : అవును అమ్మ పోలిక, ఇన్నాళ్లు తనని పట్టించుకోక అస్సలు నేను చూడలేదు.

అరవింద్ : ఇన్నేళ్ల నీ కృషికి నీ మనసుకి నచ్చిన అమ్మాయి దొరికిందన్నమాట.. చీపిరి సంకలో పెట్టుకుని ఇల్లంతా వెతికినట్టు.. ఇన్ని రోజులు మరదలిని ఇంట్లో పెట్టుకుని ఊరంతా వెతికావు.. ఇంతకీ తనకి చెప్పావా?

సుబ్బు : లేదు ips కోసం చాలా కష్టపడుతుంది అది అవ్వని అప్పుడు చెపుదాం.. సరే నేను వెళతాను అమ్మమ్మ దెగ్గరికి వెళుతున్నాం మళ్ళీ రాత్రి వరకు వచ్చేస్తా.

అరవింద్ : సరే బై.

సుబ్బుగాడు వెళ్ళిపోయాక ప్రసాద్ తన సందేహాన్ని వెలిబుచ్చాడు...) సార్ మీ బెస్ట్ ఫ్రెండ్, అన్ని కష్టాల్లో ఉన్నాడు ఈ జాబ్ ఏదో తనకే ఇవ్వకుండా నాకు ఎందుకు ఇచ్చినట్టు.

అరవింద్ : మరి నా ఫ్రెండ్ ని నా కింద పనోడిగా పెట్టుకోనా వాడితొ ఈ మాట అడిగితే చెప్పుతో కొడతాడు. అయినా వాడికన్ని కష్టాలు ఏం లేవు వాడికి నా కంపెనీలో జాబ్ చేసుకునేంత చదువు ఉంది.. కష్టపడి పైకి రాగల తెలివితేటలు ఉన్నాయి. ఒకసారి ఏమైందో తెలుసా మేము కాలేజీలో ఉన్నప్పుడు ప్రతీ ఆదివారం ఒకళ్ళు అందరినీ సినిమాకి తీసుకెళ్లాలని రూల్ పెట్టుకున్నాం ఆ తెల్లారి వాడి వంతు వస్తుందనంగా నా దెగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళాడు.. అస్సలే మెగాస్టార్ సినిమా దొరుకుతాయో లేదో అని భయపడుతుంటే వాడు ఎవ్వరికీ తెలీకుండా రిలీజ్ కి ముందే వెళ్లి నాలుగు టిక్కెట్లకి ఎనిమిది టిక్కెట్లు తీసుకుని తెల్లారి బ్లాక్ లో నాలుగు రెట్లు ఎక్కువ రేటుకి అమ్మాడు.. వాటితో మాకు స్నాక్స్ కొనిచ్చి వంద రూపాయిలు మిగిలితే అక్కడే ఉండి అడుక్కునే ముసలావిడకి దానం చేసాడు. వాడు మంచోడు తెలివికల్లోడు.

ప్రసాద్ : మరి ఎందుకు ఇలాగే ఉండిపోయాడు.


అరవింద్ : వాడికి డ్రైవింగ్ అంటే ఇష్టం.. వాడికి నచ్చింది చెయ్యని ఎక్కడైనా కింద పడ్డా వాడి చెయ్యి అందుకోడానికి నేనున్నాగా.. మనోడు ఒక్క అమ్మాయిల విషయంలోనే తొందర ఎక్కువ.. అని లేస్తూ ఇక పదా రెడీ అయ్యి ఆఫీస్ లో పడుకుందాం, లెట్స్ గొ టు ఏసీ కేబిన్.

±
±
±

ఇంటికి వచ్చేసరికి శరణ్య రెడీ అయ్యి కూర్చుని ఉంది, తన చేతికి టిఫిన్ కవర్ అందించాను.

సుబ్బు : అయిపోయిందా వెళదామా?

శరణ్య : ఆ కార్లో తింటాలే చలో..

సుబ్బు : తమరికి హిందీ కూడా వచ్చునేటి?

శరణ్య : కాబోయే ips ని, ఇవన్నీ నాకు చాలా మామూలు విషయాలు.. అని నవ్వుతూ కార్ డోర్ తీసి వెనక కూర్చుంది.

కారు రోడ్డు మీదకి ఎక్కగానే తినేసిన గంటకే పడుకుండిపోయింది తన నిద్ర చెడకుండా ఊరి వరకు తీసుకొచ్చాను కానీ ఊళ్ళోకి ఎంటర్ అయ్యేప్పుడు రోడ్డు బాగాలేక కుదుపులకి లేచింది.

శరణ్య : మంచి డ్రైవర్ వే.. బానే నడిపావ్.

సుబ్బు : అవతలి వాళ్ళని మెచ్చుకునే క్వాలిటీ కూడా తమరిలో ఏడ్చినందుకు సంతోషం..

శరణ్య :  అమ్మా ముందు దిష్టి తీయ్యవే.. ఇక్కడ అందరి కళ్ళు నా మీదే.. అని నడ్డి ఊపుతూ లోపలికి పోయింది. అమ్మమ్మ దిష్టి తీస్తుంటే మావయ్యని కలుద్దామని రైస్ మిల్లుకి వెళ్ళాను.

అమ్మమ్మ : ఏంటే వాటంగా తయారయ్యావ్ బాగా మేపుతున్నాడా నీ బావ

శరణ్య : అలా పిలవద్దని వంద సార్లు చెప్పాను నీకు... అలాగేలే అని లేచి వెళ్లిపోతుంటే... మా ఆగవే, ఇటు రా... హా ఏంటి... నా కళ్ళలో నీకేం కనిపిస్తుంది.. ఏముంది, ఏం లేదు.. సరే.. పో.

అమ్మమ్మ : ఏంటి నీ బావ నీ కళ్లు చూసాడా?

శరణ్య : నీకెలా తెలుసు?

అమ్మమ్మ : వాడు నీకు చెప్పలేదా?

శరణ్య లేచి అమ్మమ్మ వెనకాలే వెళుతూ ఏంటే అని అడిగింది. అమ్మమ్మ గోడకి తగిలించిన తన కూతురు ఫోటో చూసి ఆగిపోయింది. శరణ్య ఆ ఫోటో వంక చూసింది కానీ ఏమి అర్ధం కాలేదు.

అమ్మమ్మ : అర్ధం కాలేదా, నీ కళ్ళు అచ్చం నా కూతురి పోలిక.. ఇప్పుడు అర్థమైందా వాడు నీతో ఎందుకు గొడవ పడడో.. అదిగో మావా అల్లుళ్ళు వచ్చేసారు ముందు కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చోండి భోజనాలు చేద్దురు అంటూ లోపలికి వెళ్ళిపోయింది.

ఆ రోజంతా అక్కడ ఊళ్ళో గడిపేసి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకున్నాం, శరణ్య నాతో అంత ఎక్కువగా ఏం మాట్లాడలేదు పండుబోతుది పడుకునే ఉంది.. రూం వచ్చాక లేపితే లేచి మళ్ళీ లోపలికి వెళ్లి పడుకుంది.

అంతే ఇక రోజు ఇన్స్టిట్యూట్ దెగ్గర డ్రాప్పింగ్ పికప్, పొద్దున్నే లేపితే చదువుకునేది ఒక కాఫీ పెట్టి ఇచ్చేవాడిని, ఇద్దరి మధ్యా గొడవలు లేవు అలా అని నేను తనకి అంత దెగ్గరగా వెళ్లలేకపోయేవాడిని శరణ్య నాకు అంత చనువు ఇవ్వలేదు.

మానస : తరువాత ఏమైంది?

సుబ్బు : ఏముంది సివిల్స్ కొట్టింది ఆ రోజు మాత్రం అన్ని మర్చిపోయి వచ్చి వాటేసుకుంది, ఇద్దరం ఊరికి వెళ్ళిపోయి అందరికీ చెపితే మావయ్య ఊళ్ళో భోజనాలు పెట్టించాడు, ఆ తరువాత ఊళ్ళోనే ఉండిపోయింది వచ్చేటప్పుడు ఒక్కన్నే వచ్చాను కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాను తను కూడా నాకు పెద్దగా ఫోన్ చేసిందేం లేదు ఎప్పుడైనా నేను చేస్తే బాగా మాట్లాడేది.. ఇంటర్వ్యూ అని ట్రైనింగ్ అని వెళ్ళిపోయింది ఆ తరువాత మళ్ళీ నాకు తను కనిపించింది యూనిఫామ్ లోనే..


ఫోన్ చేసి రూంకి రమ్మంది, వెళితే బైటే సెక్యూరిటీ ఆఫీసర్ కార్ లో కూర్చుని ఉంది శరణ్య ips.. నన్ను పలకరించి తన కార్ లోనే ఇద్దరం ఊరికి వెళ్ళాము.. మావయ్య ఆనందానికి అయితే హద్దే లేదు.. చుట్టూలందరినీ పిలిచాడు అందరికీ భోజనాలు వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టి, శరణ్యతొ కేక్ కట్ చేయించి మరి అందరినీ సాగనంపాడు.. నేను అరవింద్ ఒక పక్కన కూర్చుని చూస్తున్నాం..

హారిక : బావా కంగ్రాట్స్

సుబ్బు : నాకెందుకే వెళ్లి మీ అక్కకి చెప్పు.

హారిక : రాత్రి అమ్మా నాన్నా మాట్లాడుకోగా విన్నాను, అక్కని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు.

సుబ్బు : మావయ్య అన్నాడా?

హారిక : హా.. అవును నాన్నే అన్నాడు, అమ్మ కొంచెం ముందు బెట్టు చేసినా ఒప్పుకుంది.. ఆమ్మో వినేసింది అక్కా

సుబ్బు : ఎక్కడా?

హారిక : నీ వెనక..

వెనక్కి తిరిగి చూసాను నాకు అరవింద్ కి కేక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది..

అరవింద్ : పోనీలేరా కష్టపడకుండానే నీ మరదలు నీకు సొంతం అయ్యింది.

సుబ్బు : ఇక నువ్వేరా మిగిలింది.. నీది కూడా అయిపోతే సూపర్..

అరవింద్ : నువ్వు పైకి మాములుగా ఉన్నట్టు నటించినా లోపల ఎగిరి గంతేస్తున్నావ్ కదరా..

సుబ్బు : హహ..

అరవింద్ : ఎందుకు రా అన్ని లోపలే దాచుకుంటావ్?

సుబ్బు : ఏమోరా అమ్మ నా దెగ్గర నుంచి వెళ్లిపోయాక నాకు నేను ఒక్కన్నే అయిపోయాను, ఫీలింగ్స్ అన్ని లోపలే తప్ప బైటకి చూపించేవాడిని కాదు, చూపించినా నా మొహంలో సంతోషాలు చూడ్డానికి ఎవరు లేరు.. అలా అలవాటు అయిపోయింది.. కానీ శరణ్యలో అటు భార్యని తన కళ్ళలో అమ్మని చూస్తూ బతికేయ్యొచ్చు.. నాది వదిలేయి అన్ని సెట్ అవుతాయి మరి నువ్వో..

అరవింద్ : నాకు ఎవ్వరు వద్దురా బాబు, నా ఆస్తిని నేనొక్కన్నే అనుభవిస్తా ఇంకొకళ్ళతో పంచుకునే ఉద్దేశాలు నాకు లేవు.

సుబ్బు : ఎప్పుడు మారతావో ఏంటో, డబ్బు ఒక్కటే కాదురా జీవితానికి.

అరవింద్ : నాకు తెలుసు, డబ్బే అన్నిటికి మూలం.. అయినా నేనేమి చేసుకోను అనట్లేదు నా దెగ్గరున్న డబ్బు కోసం కాకుండా నన్ను నన్నుగా ఇష్టపడే అమ్మాయి దొరికితే కచ్చితంగా చేసుకుంటాను.

సుబ్బు : ఇలా కూర్చుంటే దొరకరు, వెతకాలి వెతుకు.. వెతికితే దొరకనిదంటూ ఏది లేదు..

అరవింద్ : నీ అంత ఓపిక నాకు లేదురా ప్రకాష్ రాజ్.. అయినా ఏంటి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు అప్పుడే ఏదో జీవితాన్ని గెలిచేసినట్టు తెగ లెక్చర్లు ఇస్తున్నావ్..

సుబ్బు : సరే సరే.. పదా ఆకలేస్తుంది అందరూ అయిపోయారు అదే ఆఖరు బంతి వెళ్లి కూర్చుని తినేద్దాము.. పదా అని ఇద్దరం లేచాము.

జగన్ : రేయి సుబ్బు ఇలారా నీతో మాట్లాడాలి, బాబు అరవింద్ లోపలికి రండి ముఖ్యమైన విషయం మొదటి నుంచి వాడికి తోడుగా ఉన్నావ్ నువ్వు కూడా రా.. అని నవ్వుతూ పిలిచాడు.

అరవింద్ : రేయి మీ మామ ఆనందం ఎక్కువై పోయేలా ఉన్నాడు.

సుబ్బు : మెలకుండా రా బె.

లోపలికి వెళ్లి చూస్తే అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు.. అమ్మమ్మ నన్ను చూసి నవ్వుతూ లేచి వచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంది.

జగన్ : రేయి హారిక ఇలా రా, అక్కని పిలువు.. మాట్లాడాలి..

సుధా : అది కడుపు నిండా మెక్కి బాత్రూంకి పోయింది, నేను పిలుచుకొస్తా ఉండు అని లోపలికి వెళ్ళింది..

మావయ్య వచ్చి నా పక్కన నిల్చున్నాడు, నేను నిల్చున్నాను నా భుజం మీద చెయ్యి వేసి సంతోషంగా చూస్తున్నాడు శరణ్య కోసం ఏంటి  ఇంకా రావట్లేదన్నట్టు.

శరణ్య నవ్వుతూ వస్తూనే నన్ను చూసి నవ్వి మావయ్య మాట్లాడేలోపే సుబ్బు ముందుకు వెళ్లి కార్ కీస్ చేతికి ఇచ్చింది..

శరణ్య : సుబ్బు నా ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం తీసుకురావా

జగన్ : నీ డ్రైవర్ ఉన్నాడు కదరా

శరణ్య : నేను బైటికి వెళుతున్నా నాన్న ఒకసారి మన ఊరి mla గారి దెగ్గర నుండి ఫోన్ వచ్చింది కలిసి వస్తా, అయినా సుబ్బు కూడా డ్రైవరేగా...

వెనక్కి తిరిగి డ్రైవర్.. అని పిలిచింది.. మేడం అంటూ వచ్చాడు..

ఎక్కడికి వెళ్ళావ్ నీ పనేంటి నీ స్థాయి ఏంటి ఎంతలో ఉండాలో అంతలో ఉండటం నేర్చుకో.. డ్రైవర్ వి డ్రైవర్ లాగే ఉండు... ఎక్కడికి వెళ్ళావ్ ఇప్పటిదాకా.

"సారీ మేడం అదీ.."

శరణ్య : పదా వెళదాం, అవును నాన్నా ఇందాక పిలిచారట వచ్చాక మాట్లాడదాం.. అని విసవిసా వెళ్ళిపోయింది.

నా చేతిలోనుంచి కింద పడ్డ కార్ కీస్ తీసాను, పైకి లేచేటప్పుడు అందరి మొహాలు చూసాను అందరి మొహాల్లో నెత్తుటి చుక్క లేనట్టు అలానే నిలబడ్డారు.. మావయ్య అలానే సోఫాలో కూర్చుండిపోయాడు. చిన్నగా నవ్వొచ్చింది నాకు.

జగన్ : ఎక్కడికిరా

సుబ్బు : శరణ్య వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొస్తా

జగన్ : ఇంట్లో ఇంకా చానా మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్లు చూసుకుంటారు..

అదే మొదటిసారి ఆయన మొహంలో నేను కోపం చూడటం, నాకు ఇక ఉండబుద్ధికాలేదు..  వెంటనే ఫోను తీసాను..

సుబ్బు : హలో.. ఆ చెప్పన్నా.. వస్తున్నా.. లేదు ఇప్పుడు బైలుదేరతా అని ఫోన్ పెట్టేసి మావయ్యని చూసాను.. మావయ్య నేను వెళ్ళాలి పని అయిపోయాక మళ్ళీ వస్తాను కొంచెం అర్జెంటు..

ఆయనేం మాట్లాడలేదు ఇక వెనక్కి తిరిగాను, అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం నా కళ్ళు చూసేసాయి.. వేగంగా బైటికి నడిచాను..

సుబ్బు వెనుకే అరవింద్ కూడా మౌనంగా బైటికి నడిచాడు.. సుబ్బు వెళ్ళిపోయాక జగన్ కోపంగా తన భార్య సుధని చూసాడు.

జగన్ : దానికి ఇష్టం లేనప్పుడు రాత్రి అడిగినప్పుడే చెప్పాలి కదా ఇలా అందరి ముందు నా పరువు తీయాల్సిన పనేముంది.. ఇంకా వాడికి తెలియదు కాబట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు లేకపోయ్యుంటే...

అప్పుడే లోపలికి వచ్చిన హారిక మొత్తం విని చిన్నగా తన నాన్న దెగ్గరికి వెళ్ళింది.. "నాన్నా.. బావకి ఇందాక నేను సంతోషం ఆపుకోలేక చెప్పేసాను నువ్వు బావకి అక్క పెళ్లి నిర్ణయించావని".. జగన్ లేచి నిల్చున్నాడు.

జగన్ : అంటే వాడికి తెలుసా.. అని వేగంగా సుబ్బు కోసం బైటికొచ్చి బండి తీసాడు.

±
±
±

అరవింద్ పరిగెత్తి సుబ్బు చెయ్యి పట్టుకుని ఆపి గట్టిగా కౌగిలించుకున్నాడు..

సుబ్బు : ఏంట్రా ఇది సినిమాలో హీరోయిన్ లాగ, ఛస్ వదులెహే...

అరవింద్ : సారీరా..

సుబ్బు : ఇట్స్ ఓకే రా.. అయిపోయిందా.. ఇక పదా

అరవింద్ : ఏడుస్తున్నావా?

సుబ్బు : దేనికిరా నాదేమైనా కాల భైరవ లాగ నాలుగోందల ఏళ్ల ప్రేమా.. లవ్వులో తొలి అడుగులు కూడా పడలేదు, ఇంకా మొదలే పెట్టలేదు అప్పుడే ముగిసిందనుకోకు.. ఇంకో అమ్మాయి ఉండదా నాకోసం మళ్ళీ రాదా అవకాశం.. ప్రాస బాగుంది.. సరే పదా..

అరవింద్ : ఉండు కార్ తీసుకొస్తా

సుబ్బు : (రెండు చేతులు నడుము మీద పెట్టుకున్నాను) లేదురా నువ్వెళ్ళిపో.. నేను బస్సులో వస్తా

అరవింద్ : బంగారం లాగా కారు ఉంటే..

సుబ్బు : వదిలేయిరా.. ప్లీస్.. బస్సులో వస్తా నువ్వెళ్లు.. అని వాడికోసం చూడకుండా ముందుకు నడిచి ముందున్న బస్సు ఎక్కి కూర్చున్నాను.. బస్సు ముందుకు కదిలింది.. ఫోన్ వస్తే చూసాను మావయ్య..

జగన్ : రేయి బస్సు దిగు..

సుబ్బు : దేనికి?

జగన్ : దిగు ముందు మాట్లాడాలి..

సుబ్బు : నేను అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేసి కూర్చున్నాను.. సీట్ కింద ఒత్తుకుపోతుంటే బ్యాక్ పాకెట్ లో ఉన్న పర్సు తీసాను.. అమ్మ నవ్వుతున్న ఫోటో చూడగానే నవ్వేసాను కానీ నా ఎడమ కన్ను మాత్రం నన్ను మోసం చేసింది.. నా పర్మిషన్ లేకుండా ఒక చుక్క నీరు కార్చేసింది..


సడన్ బ్రేక్ వేసాను.. హలో మానస.. బెంగుళూరు వచ్చింది.. లెఫ్ట్ కి వెళ్లాలా రైట్ కి వెళ్ళాలా నీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చెయ్యి.. అని పక్కకి చూస్తే మానస ఏడుస్తూ కూర్చుంది.

సుబ్బు : ఓయి నువ్వెందుకు ఏడుస్తున్నావ్.. హహ.. నేను కామెడీగానే చెప్పానే.. సాడ్ పార్ట్  చాలా వరకు తీసేసి.. ఇదిగో కర్చిఫ్.. మరీ ఇంత సెన్సిటివా

మానస మొహం తుడుచుకుని మంచినీళ్లు తాగి ఫోన్ చెయ్యబోతే సుబ్బు లాక్కుని.. నేను చేస్తాలె.. ఉండు..

సుబ్బు : హలో బాస్.. బెంగుళూరు వచ్చాము, లొకేషన్ పంపిస్తే పావుగంటలో నీ ముందుంటా.

విక్రమ్ : పంపిస్తున్నా..

ఫోన్లొ లోకేషన్ చూసుకుని మళ్ళీ గేర్ మార్చాను..
Like Reply
The best of the best anna
[+] 3 users Like Radha na pinni's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Chala bagundhi Mitrama
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Lovely update...... Flow బాగుంది..... 

Liked it very much......  Heart thanks yourock clps
[+] 2 users Like kummun's post
Like Reply
నాకు అర్ధం కానీ విషయం ఏమిటి అంటే నిజంగానే సబ్బిగడిని శరణ్య అంత మాట అనిందా.....ఎంతైనా పాప కి పొగరు ఎక్కువగా....చూద్దాం ఎలా మారుతుందో....
అప్డేట్ మాత్రం బాగుంది బ్రో....సబ్బు గురించి చాలా విషయాలు తెలిశాయి......
ధన్యవాదాలు Namaskar
[+] 5 users Like Thorlove's post
Like Reply
Awesome update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
దీనెమ్మ శరణ్య కి మామూలుగా లేదుగా బలుపు  గోవర్ధన Angry
 
ఏంటిది బ్రో సుబ్బు గాడి మనస్సు లో ఇంత బాధ ఉందా Sick
కొంపదీసి సుబ్బు గాడి కి వేరే అమ్మాయిని సెట్ చేశారా Shy
[+] 5 users Like Sudharsangandodi's post
Like Reply
Superb updates
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Super update bro emotions ni challa chakka ga narrate chesavu
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Manasu pindeysaru
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply




Users browsing this thread: 79 Guest(s)